Redmi Note 5 Pro
-
రెడ్మి నోట్ 5 ప్రొ.. భారీ ఆఫర్
రెడ్మి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు షావోమి ఆశ్చర్యకర ఆఫర్ ప్రకటించింది. పాపులర్ స్మార్ట్‌ఫోన్ రెడ్మి నోట్ 5 ప్రొ ధరపై 3 వేల రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. కొత్తగా ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వారికి ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. 2018 సంవత్సరానికి సీఎన్ఎన్ న్యూస్ 18 ప్రకటించిన టెక్, ఆటో అవార్డుల్లో రెడ్మి నోట్ 5 ప్రొ ‘బెస్ట్ బడ్జెట్ ఫోన్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైంది. అవార్డు వచ్చిన సందర్భంగా సర్ప్రైజ్ ఆఫర్ ప్రకటిస్తున్నట్టు షావోమి ఇండియా వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ మానుకుమార్ జైన్ తెలిపారు. ఎంఐ, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వెబ్సైట్లలో ఈ ఆఫర్ వినియోగించుకోవచ్చని చెప్పారు. అయితే ఈ ఆఫర్ ఎప్పటివరకు ఉంటుందనేది ఆయన వెల్లడించలేదు. రెడ్మి నోట్ 5 ప్రొ ఫీచర్లు... 5.99 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్ 4/6 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
రెడ్మి నోట్ 6 ప్రొ ధర లీక్
షావోమి స్టార్ పర్ఫార్మర్ రెడ్మి నోట్ 5 ప్రొకు సక్సెసర్ త్వరలోనే మార్కెట్లోకి రాబోతుంది. రెడ్మి నోట్ 6 ప్రొ పేరుతో దీన్ని షావోమి రూపొందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి గత కొన్ని వారాలుగా ఆన్లైన్లో రిపోర్టులు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇన్ని లీకేజీలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నా దాని అధికారిక లాంచ్ తేదీని మాత్రం ఇంకా రివీల్ కాలేదు. తాజాగా ఓ అంతర్జాతీయ రిటైల్ వెబ్సైట్లో రెడ్మి నోట్ 6 ప్రొ మరోసారి స్పాట్ అయింది. పాపులర్ ఇండియన్ టెక్ యూట్యూబర్ కూడా ఈ హ్యాండ్సెట్ వీడియోను అప్లోడ్ చేశాడు. తాజా రిపోర్టుల్లో రెడ్మి నోట్ 6 ప్రొ ధర లీకైంది. అంతర్జాతీయ ప్రముఖ వెబ్సైట్ పేర్కొన్న వివరాల ప్రకారం 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో వస్తున్న బేస్ వేరియంట్ ధర సుమారు రూ.25వేలుగా ఉండబోతుందని తెలిసింది. అంటే ప్రస్తుతమున్న రెడ్మి నోట్ 5 ప్రొ కంటే ఎక్కువే. ఈ లిస్టింగ్‌లోనే రెడ్మి నోట్ 6 ప్రొ అంతర్గత స్పెషిఫికేషన్లను కూడా పొందుపరిచింది. రెడ్మి నోట్ 6 ప్రొ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు... 1.8 గిగాహెడ్జ్ అక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 636 ఎస్ఓసీ, వెనుక వైపు డ్యూయల్ కెమెరా(12 మెగాపిక్సెల్+5 మెగాపిక్సెల్), ముందు వైపు డ్యూయల్ కెమెరా(20 మెగాపిక్సెల్+5 మెగాపిక్సెల్, 6.26 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో సాఫ్ట్వేర్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 256జీబీ వరకు మైక్రోఎస్డీ కార్డు సపోర్టు ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు టెక్నికల్ గురుజి ఛానల్ నడుపుతున్న, భారత్ అతిపెద్ద యూట్యూబర్లలో ఒకరైన గౌరవ్ చౌదరి కూడా ఈ స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ వెర్షన్‌ను లీక్ చేశాడు. అధికారిక లాంచింగ్ కంటే ముందే ఈ స్మార్ట్‌ఫోన్ దుబాయ్‌లో విక్రయానికి వచ్చిందని పేర్కొన్నాడు. వెనుక, ముందు డ్యూయల్ కెమెరాలు, 6.26 అంగుళాల డిస్ప్లే, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ స్మార్ట్‌ఫోన్‌కు ఉన్నాయని వీడియో రివీల్ చేస్తుంది. అదేవిధంగా దుబాయ్‌లో విక్రయానికి వచ్చిన ఫోన్ ధర మన దేశ కరెన్సీ ప్రకారం రూ.14,800గా ఉందని యూట్యూబర్ చెప్పాడు. -
రెడ్ కలర్లో రెడ్మి నోట్ 5 ప్రొ
రెడ్మి నోట్ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్ ఇన్ని రోజులు లేక్ బ్లూ, బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్ రంగుల్లోనే అందుబాటులో ఉండేది. తాజాగా మరో కలర్ వేరియంట్ కూడా కస్టమర్ల ముందుకు వచ్చింది. రెడ్మి నోట్ 5 ప్రొ రెడ్ కలర్ వేరియంట్‌ను షావోమి లాంచ్ చేసింది. దీంతో మొత్తంగా ఐదు రంగుల్లో రెడ్మి నోట్ 5 ప్రొ లభ్యమవుతుంది. ఈ డివైజ్ ప్రస్తుతం షావోమి అధికారిక సైట్లో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఈ ఫోన్ త్వరలోనే లభ్యం కానుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రెడ్మి నోట్ 5 ప్రొ లాంచ్ అయింది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 636 చిప్సెట్ ఫీచర్‌తో వచ్చిన తొలి డివైజ్ ఇదే. షావోమి లాంచ్ చేసిన రెడ్మి నోట్ 5 ప్రొ.. 6జీబీ ర్యామ్‌ను కలిగి ఉంది. 6జీబీ ర్యామ్‌తో వచ్చిన తొలి నోట్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. 4జీబీ ర్యామ్+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 6జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్ వేరియంట్లలో దీన్ని లాంచ్ చేసింది షావోమి. వీటి ధరలు రూ.14,999గా, రూ.16,999గా ఉన్నాయి. ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌తో షావోమి తన యూజర్లకు ప్రవేశపెట్టింది. 20 మెగాపిక్సెల్‌తో సెల్ఫీ షూటర్ కలిగి ఉండగా.. వెనుకవైపు 12 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ సెన్సార్లతో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. -
ఓపెన్ సేల్‌లో రెడ్మి నోట్ 5 ప్రొ
షావోమి పాపులర్ స్మార్ట్‌ఫోన్ రెడ్మి నోట్ 5 ప్రొ ఎట్టకేలకు ఓపెన్ సేల్కు వచ్చింది. 24 గంటల పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులో ఉంచనున్నట్టు కంపెనీ వెల్లడించింది. దీంతో ఆరు నెలల పాటు కొనసాగిన రెడ్మి నోట్ 5 ప్రొ ఫ్లాష్ సేల్స్‌కు తెరపడింది. ప్రతి వారం నిర్వహించే ఫ్లాష్‌సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలుకు ఇబ్బందులు పడే కస్టమర్లు... ఇకపై ఎప్పుడైనా ఈ స్మార్ట్‌ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు. ఫ్లాష్ సేల్ కి రాగానే నిమిషాల వ్యవధిలో ఈ ఫోన్ సేల్ అయిపోయి అవుట్ ఆఫ్ స్టాక్ అనే బోర్డులు దర్శనమిస్తుండటంతో కంపెనీ ఈ రకమైన నిర్ణయం తీసుకుంది. షావోమి అధికారిక వెబ్సైట్ ఎంఐ.కామ్, ఫ్లిప్‌కార్ట్‌ల ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉండనుంది. బ్లాక్, బ్లూ, గోల్డ్, రోజ్ గోల్డ్ రంగుల్లో రెడ్మి నోట్ 5 ప్రొ మార్కెట్లోకి వచ్చింది. రెడ్మి నోట్ 5 ప్రొ బేస్ వేరియంట్ ధర రూ.14,999కాగ, హై-ఎండ్ వెర్షన్ ధర రూ16,999గా ఉంది. రెడ్మి నోట్ 5 ప్రొ లాంచ్ ఆఫర్లుగా 2,200 రూపాయల క్యాష్‌బ్యాక్, 4.5టీబీ అదనపు డేటాను జియో ఆఫర్ చేస్తోంది. 3 నెలల హంగామా మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా లభించనుంది. యాక్సిస్ బ్యాంక్ బుజ్ క్రెడిట్ కార్డుల కొనుగోళ్లపై 5 శాతం డిస్కౌంట్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. రెడ్మి నోట్ 5 ప్రొ ఫీచర్లు... 5.99 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్ 4/6 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
రూ.649కే రెడ్మి నోట్ 5 ప్రొ!!
బెంగళూరు : దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, బిగ్ షాపింగ్ డేస్ ప్రమోషనల్ సేల్ ఈవెంట్‌కు తెరలేపిన సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి ఈ బిగ్ షాపింగ్ డేస్ నిర్వహిస్తోంది. అమెజాన్ ప్రైమ్ డేకు పోటీగా నిర్వహిస్తున్న ఈ సేల్, జూలై 19తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో షావోమి రెడ్మి నోట్ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ అత్యంత తక్కువగా రూ.649కే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేద్దామని ఎప్పడి నుంచో ఆశగా ఎదురుచూస్తున్న షావోమి ఫ్యాన్స్‌కు ఇది నిజంగా గుడ్‌న్యూస్. అంతేకాక తగినంత స్టాక్‌ను కూడా అందుబాటులో ఉంచింది. అసలు రెడ్మి నోట్ 5 ప్రొ బేస్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర రూ.14,999 కాగ, టాప్ ఎండ్ వెర్షన్ 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర 16,999 రూపాయలు. ఈ రెండు వెర్షన్లు ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. బిగ్‌షాపింగ్ డేస్ ప్రమోషనల్ సేల్ ఈవెంట్ సందర్భంగా బేస్ వెర్షన్‌ను రూ.649కు, టాప్-ఎండ్ వెర్షన్‌ను రూ.2,649కు ఫ్లిప్‌కార్ట్ అందుబాటులోకి తెచ్చింది. ఈ భారీ డిస్కౌంట్‌ను పొందడానికి కస్టమర్లు రెండు రకాల ప్రక్రియలను అనుసరించాల్సి ఉంటుంది. ఒకటి మరో స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్లో దీన్ని కొనుగోలు చేయడం, మరొకటి ఎస్బీఐ క్రెడిట్ కార్డు కలిగి ఉండటం. ఎక్స్చేంజ్పై 12,850 రూపాయల వరకు తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తుండగా.. ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై 10 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్‌ను ఇస్తోంది. ఈ గరిష్ట డిస్కౌంట్‌ను పొందడానికి కొనుగోలుదారులు ఈ రెండు ప్రమాణాలను కలిగి ఉండాలి. మీరు ఎక్స్చేంజ్ చేసే స్మార్ట్‌ఫోన్ రూ.12,850 డిస్కౌంట్‌కు అర్హత కలిగి ఉండి, ఎస్బీఐ క్రెడిట్ కార్డు కలిగి ఉంటే చాలు రూ.649కు రెడ్మి నోట్ 5 ప్రొ మీకు లభ్యమైనట్టే. అయితే ఐఫోన్ 6ఎస్‌ను, లేటెస్ట్ గూగుల్ పిక్సెల్ 2ను, షావోమి ఎంఐ 5ను ఎక్స్చేంజ్ చేయడానికి వీలులేదు. కేవలం వన్‌ప్లస్ 5టీ ఎక్స్చేంజీని చేసుకోవచ్చు. దీని ఎక్స్చేంజ్తో రూ.12,850 డిస్కౌంట్ లభిస్తోంది. ఒకవేళ రెడ్మి నోట్ 4 ఎక్స్చేంజ్లో దీన్ని కొంటే రూ.3600 తగ్గింపు వస్తోంది. దాంతో పాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డును కలిగి ఉంటే, అదనంగా మరో రూ.1500 తగ్గుతోంది. దీంతో రెడ్మి నోట్ 5 ప్రొ ధర రూ.14,999 నుంచి రూ.9,899కు తగ్గిపోతుంది. -
4 రూపాయలకే ఎంఐ టీవీ, రెడ్మి స్మార్ట్ఫోన్లు
న్యూఢిల్లీ : భారత ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల మార్కెట్లో సంచలనాత్మక బ్రాండ్‌గా షావోమికి పేరొంది. ఈ కంపెనీ బడ్జెట్ ధరల్లో స్మార్ట్ఫోన్లు, టెలివిజన్లను లాంచ్ చేస్తూ భారతీయ వినియోగదారులను తెగ ఆకట్టుకుంటోంది. దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు సైతం చెక్ పెడుతోంది. ఈ కంపెనీ మన మార్కెట్లోకి ప్రవేశించి రేపటికి నాలుగేళ్లు పూర్తవుతుంది. జూలై 10న మంగళవారం ఈ కంపెనీ గ్రాండ్‌గా తన నాలుగో వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ సందర్భంగా ఎంఐ అభిమానుల కోసం షావోమి ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఎంఐ.కామ్‌లో జులై 10న ప్రారంభమయ్యే ఈ వార్షికోత్సవ సేల్ 12 వరకూ కొనసాగనుంది. ఎంఐ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లో 55 అంగుళాల ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ టీవీని, రెడ్మి వై2 (3జీబీ+32జీబీ)ను, రెడ్మి నోట్ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం నాలుగు రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చు. 10, 11, 12వ తేదీల్లో సాయంత్రం 4 గంటలకు లక్కీ కస్టమర్లకు కేవలం నాలుగు రూపాయలకే ఈ ఉత్పత్తులు లభిస్తాయి. ఒకవేళ సాయంత్రం నాలుగు గంటలకు ఫ్లాష్ సేల్స్ అవకాశం చేజారిపోతే, కోంబోలో సాయంత్రం ఆరు గంటలకు రెడ్మి నోట్ 5ను, ఎంఐ వీఆర్ ప్లే 2ను కేవలం రూ.9,999కే అందించనున్నట్టు షావోమి తెలిపింది. వీటి అసలు ధర రూ.11,298గా ఉంది. రెడ్మి వై1, ఎంఐ బ్లూటూత్ హెడ్సెట్లను కూడా 8,999 రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చని, ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ను 8,999 రూపాయలకే అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు ఎంఐ ఆఫర్స్... మధ్యాహ్నం 12 గంటలకు బ్లాక్‌బస్టర్ ఆఫర్ కింద ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్‌టీవీని రూ.13,999కు, రెడ్మి నోట్ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను రూ.14,999కు విక్రయించనున్నట్టు షావోమి తెలిపింది. ఇక ఎంఐ మిక్స్2, ఎం మ్యాక్స్2లపై కూడా రాయితీని అందిస్తోంది. ఎస్బీఐ, పేటీఎం, మొబిక్విక్‌ల ద్వారా చెల్లింపులు చేసేవారు అదనంగా ఇంకొంత రాయితీని పొందవచ్చు. ఎస్బీఐ కార్డు ద్వారా కనీసం రూ.7,500 లావీదేవీపై రూ.500 రాయితీ అందించనుండగా, రూ.8,999 కొనుగోలుపై పేటీఎం ద్వారా చెల్లింపు చేసిన వారికి రూ.500 క్యాష్‌బ్యాక్, విమాన టికెట్ల బుకింగ్‌పై రూ.1,000, సినిమా టికెట్లపై రూ.200 రాయితీని షావోమి అందిస్తుంది. ఇక మొబిక్విక్ ద్వారా చెల్లింపు చేసేవారు 25శాతం వరకూ(రూ.2,500 సూపర్ క్యాష్) డిస్కౌంట్ లభిస్తుంది. ఎంఐ మిక్స్2 రూ.27,999(అసలు ధర రూ.29,999), ఎంఐ మ్యాక్స్2 రూ.14,999(అసలు ధర రూ.15,999) ట్రావెల్ బ్యాక్‌ప్యాక్ రూ.1,899(ఎంఆర్పీ రూ.1,999), ఎంఐ ఇయర్‌ఫోన్స్ రూ.649(అసలు ధర రూ.699) ఎంఐ బ్యాండ్ 2 రూ.1,599(ఎంఆర్పీ రూ.1,799) అందిస్తోంది. ఎంఐ ట్రావెల్ బ్యాక్‌ప్యాక్(రూ.1,999)కు, ఎంఐ బ్యాండ్ హెచ్ఆర్ఎక్స్ ఎడిషన్(రూ.1,299) ఎంఐ బ్యాండ్ స్ట్రిప్ బ్లూ(రూ.199) రెండింటినీ రూ.1,398 అందించనున్నట్టు షావోమి తెలిపింది. వీటితో పాటు ఇతర గ్యాడ్జెట్స్‌పై కూడా రాయితీని, కూపన్లను ఆఫర్ చేస్తుంది. -
రెడ్మి నోట్ 5 ప్రొ, ఎంఐ టీవీ 4 ధరలు పెరిగాయ్!
షావోమి తన పాపులర్ స్మార్ట్‌ఫోన్ రెడ్మి నోట్ 5 ప్రొ, 55 అంగుళాల ఎంఐ ఎల్ఈడీ టీవీ 4 ధరలను పెంచేసింది. ఈ రెండింటిపై 5000 రూపాయల వరకు ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. రెడ్మి నోట్ 5 ప్రొ ధరను వెయ్యి రూపాయలు, 55 అంగుళాల ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ను రూ.5000 ధరలు పెంచినట్టు షావోమి తెలిపింది. పెంచిన ధరలు వెనువెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొంది. రెడ్మి నోట్ 5 ప్రొకు, ఎంఐ టీవీ 4కు దేశీయ మార్కెట్లో భారీ ఎత్తున్న డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండింటికి వస్తున్న డిమాండ్‌ను షావోమి చేరుకోలేకపోతోంది. దీంతో కంపెనీ ఇక్కడే వీటిని రూపొందించాలని కూడా నిర్ణయించింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా, రెడ్మి నోట్ 5 ప్రొ విషయంలో పీసీబీఏలను భారీగా దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. తాజాగా ఈ దిగుమతి చేసుకుంటున్న పీసీబీఏలపై పన్ను మార్పులు, రూపాయి విలువ పడిపోవడం వంటికి తమ ఖర్చులను పెంచుతున్నాయని కంపెనీ తెలిపింది. దీంతో ఎంఐ ఎల్ఈడీ టీవీ ధరను రూ.5000 మేర పెంచి, రూ.44,999గా నిర్ణయించింది. 2018 మే 1 నుంచి అన్ని ఎంఐ హోమ్ స్టోర్లు, ఎంఐ.కామ్‌లలో ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. రూ.13,999గా ఉన్న రెడ్మి నోట్ 5 ప్రొ ధర కూడా రూ. 14,999కు పెరిగింది. కంపెనీ ఇటీవల చేపట్టిన రెడ్మి నోట్ 5 ప్రొ ఫోన్‌కు చేపట్టిన ప్రీ-ఆర్డర్లకు భారీ ఎత్తున్న డిమాండ్ వచ్చిన సంగతి తెలిసిందే. కంపెనీ ఇటీవలే భారత్‌లో మూడు స్మార్ట్‌ఫోన్ తయారీ యూనిట్లను ప్రారంభించినట్టు పేర్కొంది. -
ప్రీ-ఆర్డర్‌కు వచ్చిన రెడ్మి నోట్ 5 ప్రొ
షావోమి రెడ్మి నోట్ 5 సిరీస్‌లో హై-ఎండ్ వేరియంట్ రెడ్మి నోట్ 5 ప్రొ నేడు ప్రీ-ఆర్డర్స్‌కు వచ్చేసింది. షావోమి ఈ-కామర్స్ వెబ్సైట్ ఎంఐ.కామ్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ప్రీ-ఆర్డర్లకు ఉంచింది. దీంతో ఇక నుంచి రెడ్మి నోట్ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్‌సేల్ కోసం వేచిచూడాల్సినవసరం లేదు. ఈ ఫోన్ ఫ్లాష్ సేల్కు వచ్చిన ప్రతీసారి‘సోల్డ్ అవుట్’ అని దర్శనమిస్తుండటంతో వినియోగదారులు తీవ్ర నిరాశకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంపెనీ రెడ్మి నోట్ 5 ప్రొ ప్రీ-ఆర్డర్లను స్వీకరిస్తున్నట్టు ప్రకటించింది. నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎంఐ వెబ్సైట్ ద్వారా ఈ ఫోన్‌ను ఆర్డర్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఈ ఫోన్‌ను క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్లో ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంచింది. ఆర్డర్ చేసిన తర్వాత రెండు లేదా నాలుగు వారాల్లో ఈ ఫోన్‌ను వినియోగదారుడికి డెలివరీ అవుతుంది. ఒక వ్యక్తి ఒకటి, లేదా రెండు మాత్రమే ఫోన్లను ఆర్డర్ చేసే సౌకర్యం కల్పించింది. ఒకవేళ ముందస్తు ఆర్డర్‌ను రద్దు చేసుకోవాలనుకుంటే ఫోన్ షిప్పింగ్ కన్నా ముందే రద్దు చేసుకోవాలి. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా రెడ్మి నోట్ 5 ప్రొ అందుబాటులో ఉంటుంది. కానీ వీక్లీ ఫ్లాష్ సేల్స్ ద్వారానే ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌ను విక్రయించనుంది. 4జీబీ ర్యామ్ 64జీబీ మెమరీ సామర్థ్యం ఉన్న రెడ్మి నోట్ 5 ప్రొ ధర రూ.13,999 కాగా, 6జీబీ ర్యామ్, 64జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.16,999. షావోమి ఇప్పటి వరకు దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టిన ఫోన్లన్నంటిలో ఇదే ఖరీదైనది. ఇది నలుపు, గోల్డ్, లేక్ బ్లూ, రోజ్ గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఫోన్ ఆర్డర్ చేసుకున్న వారికి జియో ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది. రూ.2,200 విలువ కలిగిన 44 వోచర్లను ‘మై జియో’ యాప్‌లో యాడ్ చేస్తుంది. అంతేకాకుండా రూ.198, రూ.299 రీఛార్జ్‌తో 4.5టీబీ వరకూ డేటాను పొందవచ్చు. రెడ్మి నోట్ 5 ప్రొ ఫీచర్స్ 5.99 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ డిస్ప్లే క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ వెనుక 12 మెగా పిక్సెల్, 5మెగాపిక్సెల్స్‌తో డ్యుయల్ కెమెరా ముందు వైపు 20 మెగాపిక్సెల్ కెమెరా 4000 ఎంఎహెచ్ బ్యాటరీ