షావోమి తన పాపులర్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి నోట్ 5 ప్రొ, 55 అంగుళాల ఎంఐ ఎల్‌ఈడీ టీవీ 4 ధరలను పెంచేసింది. ఈ రెండింటిపై 5000 రూపాయల వరకు ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. రెడ్‌మి నోట్ 5 ప్రొ ధరను వెయ్యి రూపాయలు, 55 అంగుళాల ఎంఐ ఎల్‌ఈడీ టీవీ 4ను రూ.5000 ధరలు పెంచినట్టు షావోమి తెలిపింది. పెంచిన ధరలు వెనువెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొంది. రెడ్‌మి నోట్ 5 ప్రొకు, ఎంఐ టీవీ 4కు దేశీయ మార్కెట్‌లో భారీ ఎత్తున్న డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండింటికి వస్తున్న డిమాండ్‌ను షావోమి చేరుకోలేకపోతోంది. దీంతో కంపెనీ ఇక్కడే వీటిని రూపొందించాలని కూడా నిర్ణయించింది.
పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా, రెడ్‌మి నోట్ 5 ప్రొ విషయంలో పీసీబీఏలను భారీగా దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. తాజాగా ఈ దిగుమతి చేసుకుంటున్న పీసీబీఏలపై పన్ను మార్పులు, రూపాయి విలువ పడిపోవడం వంటికి తమ ఖర్చులను పెంచుతున్నాయని కంపెనీ తెలిపింది. దీంతో ఎంఐ ఎల్‌ఈడీ టీవీ ధరను రూ.5000 మేర పెంచి, రూ.44,999గా నిర్ణయించింది. 2018 మే 1 నుంచి అన్ని ఎంఐ హోమ్ స్టోర్లు, ఎంఐ.కామ్‌లలో ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. రూ.13,999గా ఉన్న రెడ్‌మి నోట్ 5 ప్రొ ధర కూడా రూ. 14,999కు పెరిగింది. కంపెనీ ఇటీవల చేపట్టిన రెడ్‌మి నోట్ 5 ప్రొ ఫోన్‌కు చేపట్టిన ప్రీ-ఆర్డర్లకు భారీ ఎత్తున్న డిమాండ్ వచ్చిన సంగతి తెలిసిందే. కంపెనీ ఇటీవలే భారత్‌లో మూడు స్మార్ట్‌ఫోన్ తయారీ యూనిట్లను ప్రారంభించినట్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment