Oppo Launch K9x Smart Tv With 50inch 4k Display Low Price - Sakshi
Sakshi News home page

Oppo Launch K9x Smart Tv:ఒప్పో 50 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీ వచ్చేసింది.. రూ.15వేలకే మైండ్‌ బ్లోయింగ్‌ ఫీచర్లు!

Published Thu, Aug 11 2022 4:32 PM | Last Updated on Fri, Aug 12 2022 8:27 AM

Oppo Launch K9x Smart Tv With 50inch 4k Display Low Price - Sakshi

దేశంలో పండుగల సీజన్‌ మొదలైంది. దీంతో వినియోగదారుల సెంటిమెంట్‌ను క్యాష్‌ చేసుకునేందుకు దిగ్గజ సంస్థలు పోటీ పడుతుంటాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో హెవీ మార్కెట్‌ కాంపిటీషన్‌ను తట్టుకొని నిలబడేందుకు ఎలక్ట్రానిక్‌ కంపెనీలు ప్రొడక్ట్‌లపై భారీ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో 17శాతం షేర్‌తో ఇండియన్‌ స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌ను శాసిస్తున్న ఒప్పో అదిరిపోయే టీవీ మార్కెట్‌లో విడుదల చేసింది.

తక్కువ ధరకే బిగ్‌ స్క్రీన్‌ టీవీ కొనాలనుకునేవారికి 'ఒప్పో' 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ బాగా ఉపయోగపడుతుందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక ఆ టీవీలో ఉన్న ఫీచర్స్‌, వాటి పనితీరు ఎలా ఉందో చూద్దాం.  

ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ
ఒప్పో గతంలో 65 అంగుళాల స్మార్ట్ టీవీని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సారి తాజాగా 50 ఇంచెస్ స్మార్ట్ టీవీని కొనుగోలు దారులకు పరిచయం చేసింది. OPPO K9x పేరుతో ఉన్న ఈ స్మార్ట్ టీవీని చైనాలో విడుదల చేసింది. దీని ధర 1399 యువాన్ (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.16,500)గా ఉంది. లాంచ్ ఆఫర్ కింద 1299 యువాన్లకు (భారత కరెన్సీలో సుమారు రూ. 15,350) అందుబాటులోకి ఉంచింది. త్వరలో భారత్‌ మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. దేశీయ మార్కెట్‌లో దాని ధర ఎంత ఉంటుందనేది ఆ సంస్థ వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ టీవిని కొనాలంటే తమ అధికారిక వెబ్‌ సైట్‌ను విజిట్‌ చేయాల్సి ఉంటుందని  ఒప్పో ప్రతినిధులు వెల్లడించారు. 

 

అదిరే ఫీచర్లు

► కొత్త ఒప్పో K9x 50 ఇంచెస్‌ స్మార్ట్ టీవీ మనల్ని ఆకట్టుకునే ఫీచర్లతో వస్తుంది.

►కంపెనీ సొంతంగా అభివృద్ధి చేసిన AI PQ అల్గారిథమ్‌ 

►ఈ స్మార్ట్ టీవీ గరిష్ట బ్రైట్ నెస్ 280 నిట్‌లు

►ఇందులో 2GB RAM, 16GB ROM

►క్వాడ్-కోర్ MediaTek చిప్‌సెట్, 20W పవర్ రేటింగ్‌తో రెండు ఇంటిగ్రేటెడ్ స్పీకర్‌లు

► మూడు HDMI పోర్ట్‌లు, ఒక ఈథర్నెట్ పోర్ట్ 



►​​​​​​​వైర్‌లెస్ కనెక్షన్ కోసం డ్యూయల్-బ్యాండ్ Wi-Fiకి మద్దతు 

►​​​​​​​ ఎల్‌ఈడీ-బ్యాక్‌లిట్ ప్యానెల్‌తో 50 అంగుళాల స్క్రీన్‌, పూర్తి 4K రిజల్యూషన్‌తో అదిరిపోయే లుక్‌. కళ్ళపై ఒత్తిడిని తగ్గించడానికి 10.7 బిలియన్ రంగులుతో పాటు బ్లూ-లైట్ తగ్గించే టెక్నాలజీ, ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ టీవీ తరహాలో బాల్‌పార్క్‌లో డిస్‌ప్లే-స్థాయి రంగు ఖచ్చితత్వాన్ని కలిగి ఉంది. ఇది ఇమేజ్ నాణ్యతను ఫ్రేమ్-బై-ఫ్రేమ్ మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.

చదవండి: Mahendra Singh Dhoni: కొత్త అవతారమెత్తిన ధోని.. షాక్‌లో నెటిజన్స్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement