భారత్‌లో స్మార్ట్ టీవీ అమ్మకాలు జోరందుకుంది. ఓటీటీ పుణ్యమా అని ఈ విభాగం టీవీలను మాత్రం వినియోగదారులు ఎగబడి మరీ కొంటున్నారు. దీంతో ఈ ఏడాడి ఏకంగా రెండంకెల వృద్ధి సాధించింది. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం..ఈ సెప్టెంబర్ త్రైమాసికంలో స్మార్ట్ టీవీ అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే 38% పెరిగినట్లు వెల్లడించింది.
ఇంట్లో కూర్చుని పెద్ద స్క్రీన్‌లలో ఓటీటీ (OTT) యాప్‌ల ద్వారా ప్రసారం అవుతున్న కంటెంట్‌ను చూసేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. OTT యాప్స్ స్మార్ట్ టీవీల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయనే విషయం తెలిసిందే. దీంతో స్మార్ట్ టీవీలకు సేల్స్ పెరుగుతోంది. ఈ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో మొత్తం టీవీ విభాగంలో 93 శాతం వాటా స్మార్ట్ టీవీలదే కావడం వీటి డిమాండ్ ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. ఇంకా చాలా మంది CRT (కాథోడ్-రే ట్యూబ్) టీవీలను ఉపయోగిస్తున్నారు. వీటితో పోలిస్తే ప్రయోజనాల ఎక్కువగా స్మార్ట్ టీవీలో ఉండడంతో ఇటీవల ప్రజలు వాటికి అప్‌గ్రేడ్ అవుతున్నట్లు నివేదిక పేర్కొంది.
ప్రస్తుతం స్మార్ట్ టీవీలు బడ్జెట్ ధరలో వినియోగదారులకు అందుబాటులో ఉంటున్నాయి. దాదాపు రూ.20 వేల లోపు ఫీచర్లుతో కూడిని స్మార్ట్ టీవీలు మార్కెట్లోకి వస్తున్నాయి. ఎప్పుడూ ప్రీమియం రేంజ్‌లో ఉండే గూగుల్ టీవీ ఇప్పుడిప్పుడే రూ.25,000 లోపు ధర విభాగంలోకి ప్రవేశించిందని, వచ్చే ఏడాది ఇంకా అది రూ.20 వేల లోపు సెగ్మెంట్‌లోకి కూడా ప్రవేశించే అవకాశముందని అని కౌంటర్‌పాయింట్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ అన్షికా జైన్ వెల్లడించారు.
చదవండి కాల్చి చంపేస్తారేమో..కచ్చితంగా ప్రమాదం ఉంది: ఎలాన్ మస్క్
Comments
Please login to add a commentAdd a comment