tv
-
టీవీల్లో 'గేమ్ ఛేంజర్' ప్రత్యక్షం.. మండిపడ్డ టాలీవుడ్ నిర్మాత
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన చిత్రం గేమ్ ఛేంజర్(Gam Changer Movie). శంకర్(sankar) డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం తొలి రోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద రూ.186 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.వెంటాడుతున్న పైరసీ..అయితే సినీ ఇండస్ట్రీని ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్నా వైరస్ పైరసీ. తాజాగా గేమ్ ఛేంజర్‌లో విషయంలోనూ పైరసీ ఇండస్ట్రీని షాకింగ్‌కు గురి చేస్తోంది. ఏకంగా లోకల్ ఛానెల్లో గేమ్ ఛేంజర్‌ను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేయడంతో పైరసీ అంశం మరోసారి టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో దీనిపై టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్( శ్రీనివాస కుమార్) రియాక్ట్ అయ్యారు. వేలమంది శ్రమ దాగి ఉన్న సినిమాను వారం రోజులు కాకముందే ప్రసారం చేయడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎస్కేఎన్ తన ట్విట్లో రాస్తూ.. 'ఇది ఏమాత్రం సహించదగినది కాదు. సినిమా విడుదలై కేవలం 4-5 రోజులు మాత్రమే అయింది. వారం రోజులు కాకముందే సినిమాను స్థానిక కేబుల్ ఛానల్స్, బస్సులలో ప్రసారం చేయడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. సినిమా అనేది కేవలం హీరో, దర్శకుడు, నిర్మాతల గురించి మాత్రమే కాదు. ఎంతోమంది మూడు, నాలుగు సంవత్సరాల కృషి, వారి అంకితభావం, వేలాది మంది శ్రమ దాగి ఉంది. ఈ సినిమా విజయంపై ఆధారపడిన డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ ఈ ప్రభావం ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి చర్యలు వారి కష్టాన్ని దెబ్బతీయడమే కాదు.. చిత్ర పరిశ్రమ భవిష్యత్తుకు ప్రమాదకరం కూడా. ఇలాంటి వాటిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమాను రక్షించడానికి.. సినీ ఇండస్ట్రీ మెరుగైన భవిష్యత్తు కోసం మనందరం ఐక్యంగా నిలబడి పోరాడుదాం.' అని పోస్ట్ చేశారు. అంతే కాకుండా 'సేవ్‌ది సినిమా' అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేశారు.లీక్ చేస్తామంటూ బెదిరింపులు..తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే గేమ్ ఛేంజర్ సినిమాని లీక్ చేస్తామంటూ కొందరు బెదిరించారు. వారిపై చిత్రబృందం సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది. విడుదలకు రెండు రోజుల ముందు కీలక సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేశారని.. సినిమా విడుదల కాగానే ఆన్లైన్లో లీక్ చేశారని మూవీ టీమ్ ఫిర్యాదులో పేర్కొంది.దీనిపై ఆధారాలు సేకరించిన చిత్ర బృందం.. 45 మందితో కూడిన ముఠాపై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్‌పై నెగెటివ్ ప్రచారం చేస్తున్న కొన్ని ఖాతాల పైనా కూడా చిత్రబృందం ఫిర్యాదు చేసింది. This is unacceptable. A film that was released just 4-5 days ago being telecasted on local cable channels & Buses raises serious concerns. Cinema is not just about the Hero, director or producers – it’s the result of 3-4 years of hard work, dedication and the dreams of thousands… https://t.co/ukPHIpi6ko— SKN (Sreenivasa Kumar) (@SKNonline) January 15, 2025 -
ఒకే కంపెనీ ఏడాదిలో 10 లక్షల టీవీ యూనిట్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్రైవేటు లిమిటెడ్ 2025లో పది లక్షల యూనిట్ల టీవీ విక్రయాలను లక్ష్యంగా పెట్టుకుంది. పలు అంతర్జాతీయ బ్రాండ్ల భారత మార్కెట్ లైసెన్స్ కలిగిన ఈ సంస్థ టీవీ(TV)లతోపాటు గృహోపకరణాలను విక్రయిస్తుంటుంది. ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో, సామర్థ్య విస్తరణ, ఆఫ్‌లైన్ ఛానళ్ల అమ్మకాలు పెంచుకునే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు కంపెనీ సీఈవో అవనీత్ సింగ్ మార్వా తెలిపారు. థామ్సన్, కొడాక్(Kodak), బ్లాపంక్ట్, వైట్–వెస్టింగ్ హౌస్ (ఎలక్ట్రోలక్స్) బ్రాండ్ లైసెన్స్ హక్కులు ఈ సంస్థకు ఉన్నాయి.మరో రెండు అంతర్జాతీయ బ్రాండ్లకు సంబంధించి భారత మార్కెట్ హక్కులను సొంతం చేసుకునే యోచనలో ఉన్నట్టు అవనీత్ సింగ్ తెలిపారు. ఇందుకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయని, జనవరి చివరికి వీటిని ప్రవేశపెడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఈ ఏడాది 6,00,000 యూనిట్ల టీవీ అమ్మకాలను సాధించనున్నాం. వచ్చే ఏడాది 10,00,000 లక్షల అమ్మకాలు మా లక్ష్యం’అని చెప్పారు. అందుబాటు ధరల శ్రేణిలో వివిధ బ్రాండ్లపై స్మార్ట్ టీవీ(Smart TV)లను విక్రయిస్తున్న ఈ సంస్థ టర్నోవర్ రూ.700 కోట్లుగా ఉంది. ఆదాయంలో అధిక భాగం టీవీల విక్రయాల ద్వారానే వస్తోంది.కరోనా తర్వాత అమ్మకాల జోరుకరోనా అనంతరం ఎక్కువ మంది ఇళ్లకే పరిమితం కావడంతో టీవీల అమ్మకాలు ఆ సమయంలో జోరుగా సాగాయి. అనంతరం ఈ మార్కెట్లో వృద్ధి బలహీనపడింది. అయినప్పటికీ సూపర్ ప్లాస్ట్రానిక్స్ టీవీ అమ్మకాల్లో వృద్ధి నమోదు చేస్తుండడం గమనార్హం. ఈ విభాగంలో థామ్సన్ బ్రాండ్ విక్రయాలపై ఈ కంపెనీకి అధిక ఆదాయం లభిస్తోంది. ఆ తర్వాత కొడాక్ బ్రాండ్ అమ్మకాలు ఎక్కువగా సాగుతున్నాయి.ఇదీ చదవండి: మళ్లీ మొబైల్ టారిఫ్‌లు పెంపు..?వాషింగ్ మెషిన్లపై దృష్టి..సూపర్ ప్లాస్ట్రానిక్స్ టీవీల తర్వాత వాషింగ్ మెషిన్ల విభాగంలో అధిక అమ్మకాలు సాధిస్తోంది. ఆన్లైన్ మార్కెట్లో వాషింగ్ మెషిన్ల విక్రయాల్లో ఈ సంస్థ వాటా రెండంకెల స్థాయిలో ఉంటోంది. ఆఫ్‌లైన్ ఛానళ్లనూ ఈ ఏడాది విస్తరించుకున్నామని, 2025లో రెండు లక్షల వాషింగ్ మెషిన్ యూనిట్ల అమ్మకాలు నమోదు చేయనున్నట్టు అవనీత్ సింగ్ తెలిపారు. ప్రధానంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్(Amazon) ఈ–కామర్స్ పోర్టళ్లలో ఈ సంస్థ ఎక్కువగా అమ్మకాలు నమోదు చేస్తుంటుంది. ఇప్పుడు ఆఫ్‌లైన్ మార్కెట్లోనూ విస్తరణ దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం తమ అమ్మకాల్లో 80 శాతం ఆన్లైన్ నుంచి, 20 శాతం ఆఫ్‌లైన్ నుంచి వస్తున్నాయని అవనీత్ సింగ్ తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆఫ్‌లైన్‌లో విక్రయాల వాటాను 40 శాతానికి పెంచుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. టైర్–1 నగరాల నుంచి 35 అమ్మకాలు వస్తుండగా, టైర్–2 నుంచి 25 శాతం, టైర్–3 నుంచి 15 శాతం ఉంటున్నట్టు వెల్లడించారు. మిగిలిన 25 శాతం అమ్మకాలు గ్రామీణ ప్రాంతాల నుంచి ఉంటున్నాయని తెలిపారు. గత రెండేళ్లలో తాము చేసిన పెట్టుబడులు ఇప్పుడు ఫలితాలనిస్తున్నట్టు పేర్కొన్నారు. -
తెలుగు సీరియల్ నటి ఫిర్యాదు.. యువకుడి అరెస్ట్
టీవీ సీరియల్ నటిని ప్రేమ, పెళ్లి పేరుతో వేధించిన యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ టెలివిజన్ ఛానల్లో టెలీకాస్ట్ అవుతున్న 'శ్రావణ సంధ్య' అనే సీరియల్లో నటిస్తున్న మహిళను అదే యూనిట్లో పనిచేస్తున్న బత్తుల ఫణితేజ కొంతకాలంగా మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడు. ప్రేమించానని, పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు. సీరియల్ యూనిట్ సభ్యుల వద్దే కాకుండా సోషల్‌మీడియాలో ఆమె క్యారెక్టర్‌ను దిగజార్చేవిధంగా తప్పుడు ప్రచారం చేయడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
హెల్మెట్ ధరించి వచ్చేవారికి టీవీ బహుమతి
వేలూరు: వేలూరు జిల్లాలో ప్రమాదాల నివారించేందుకు గాను డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రావాలని అధికారులు ప్రకటించారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ముఖ్యమైన ప్రాంతాల్లో వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించి రావాలని బ్యానర్లు, పోస్టర్లను కరిపించారు. వీటితో పాటు జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు పలు అవగాహన కార్యక్రమాలు చేయడంతో పాటు హెల్మెట్ ధరించి వచ్చే వారిని ప్రొత్సహించే విధంగా పుష్పాలు, చాక్లెట్లు, బొమ్మలను అందజేసి స్వాగతం పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో వేలూరు డీఎస్పీ పృథ్వీరాజ్ సౌకాన్ అధ్యక్షతన ట్రాఫిక్ పోలీసులు వేలూరు గ్రీన్ సర్కిల్లో ప్రతిఒక్కరూ హెల్మెట్ ధరించి రావాలని రావాలని బొమ్మలను ఉంచి అవగాహన చేపట్టారు. హెల్మెట్ ధరించి వచ్చే వారికి బొమ్మలు, పెన్‌లను అందజేశారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపి వచ్చిన వారికి కరపత్రాలు అందజేసి అవగాహన కల్పించారు. ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ రజనీ మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీ నుంచి తరచూ హెల్మెట్ ధరించి వచ్చే వారిని గుర్తించి వారి వాహన నెంబర్లను నమోదు చేసి వారిని లాటరీ ద్వారా ఎంపిక చేస్తామన్నారు. గెలుపొందిన వారికి పెద్ద ఎల్ఈడీ టీవీని బహుమతిగా అందజే స్తామని తెలిపారు. -
మస్క్ 'ఎక్స్ టీవీ'.. యూట్యూబ్‌కు గట్టి పోటీ!
ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్' (Elon Musk) ఏది చేసిన ఓ సంచలనమే. ట్విటర్ కొనుగోలు చేసి అందులో ఊహకందని మార్పులు చేశారు. ఆఖరికి పేరు, లోగో అన్నీ మార్చేసి 'ఎక్స్' అని నామకరణం చేశారు. ఇప్పుడు 'ఎక్స్ టీవీ'గా కూడా పరిచయం చేశారు.ఎక్స్ టీవీ అనేది ఒక యాప్. చాలాకాలంగా మస్క్ కలలు కంటున్న ఈ ఎక్స్ స్మార్ట్ టీవీ యాప్ మొత్తానికి వచ్చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ యాప్‌లో సినిమాలు, లైవ్ వంటి వాటిని కూడా చూడవచ్చు. ఇది గూగుల్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్‌కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.ప్రస్తుతం ఈ ఎక్స్ టీవీ యాప్ అనేది కేవలం ఆండ్రాయిడ్ టీవీలైన ఎల్జీ, అమెజాన్ ఫైర్ టీవీ, గూగుల్ టీవీ వంటి వాటిలో మాత్రమే అందుబాటులో ఉంది. దీనిని గూగుల్ ప్లే స్టార్, ఎల్జీ స్టోర్ లేదా అమెజాన్ స్టోర్స్ నుంచో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఎలా పని చేస్తుంది? దీనిని యూజర్లు ఇష్టపడతారా? లేదా అనే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తదుపరి పరిణామాలు జరుగుతాయి.ఇప్పటికే ఎక్స్ టీవీ యాప్‌లో పలువురు వినియోగిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం దీనిని కొంతమంది వినియోగదారులకు మాత్రమే డౌన్లోడ్ చేసుకోగలరు. రాబోయే రోజుల్లో ఇది ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉండనుంది.ఎక్స్ టీవీ యాప్‌లో లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ట్రెండింగ్ వీడియో అల్గారిథమ్, వీడియో సెర్చింగ్ వంటి వాటితో పాటు.. రీప్లే టీవీ (72 గంటల వరకు షోను స్టార్ చేసుకోవచ్చు), స్టార్ట్ఓవర్ టీవీ (లైవ్ షో స్టార్టింగ్ నుంచి ప్రారంభించడానికి అనుమతిస్తుంది), ఫ్రీ క్లౌడ్ డీవీఆర్ (100 గంటలు కంటెంట్‌ను రికార్డ్ చేయవచ్చు) వంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.Beta version of 𝕏 TV is out https://t.co/taODqsMECS— Elon Musk (@elonmusk) September 3, 2024 -
బుల్లితెరలోనూ లైంగిక వేధింపులు: నటి పద్మిని
మలయాళ చిత్ర పరిశ్రమలో నటీమణులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన హేమా కమిషన్ నివేదిక అక్కడ ప్రకంపనలు పుట్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ ప్రభావం అన్ని చిత్ర పరిశ్రమలను తాకుతోంది. ముఖ్యంగా తమిళ సినీ పరిశ్రమను కుదిపేస్తోంది. సీనియర్ల నుంచి జూనియర్ నటీమణులు పలువురు తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను బహిర్గతం చేస్తూ మంచి పరిష్కారం ఆశిస్తున్నారు. కాగా లైంగిక వేధింపులకు బుల్లితెర నటీమణులు అతీతం కాదని నటి కుట్టి పద్మిని పేర్కొన్నారు. బాల నటిగా పరిచయం అయిన ఈమె పలు చిత్రాల్లో నటించినా, ఆ తరువాత బుల్లితెరలో నటిగా, నిర్మాతగా రాణిస్తున్నారు. ఆమె నటీమణుల లైంగిక వేధింపుల గురించి స్పందిస్తూ డాక్టర్, ఇంజినీర్, సాఫ్ట్‌వేర్‌లో మాదిరిగానే సినిమా వృత్తి కూడా అన్నారు. అయితే ఇక్కడ లైంగిక వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వెండితెరలోనే కాకుండా బుల్లితెరలోనూ నటీమణులు లైంగిక వేధింపులకు గురవుతున్నారన్నారు. కొందరు ఆ సంఘటనలపై ఫిర్యాదులను నిరూపించుకోవడం సాధ్యం కాకపోవడం, బయటకు చెబితే అవకాశాలు రావేమోనని భయపడుతున్నారన్నారు. మరి కొందరు బాగా సంపాదించుకోవడంతో సర్దుకు పోతున్నారన్నారు. నటి శ్రీరెడ్డి లాంటి వాళ్లకు నడిగర్ సంఘం మెంబర్ షిప్ కార్డు ఇవ్వడం లేదన్నారు. దీంతో వారు సీరియళ్లలోనూ నటించలేకపోతున్నారని అన్నారు. మలయాళ నటుడు సురేష్‌గోపి లైంగిక వేధింపులకు ఆధారాలు ఉన్నాయా అని అడుగుతున్నారని, ఆధారాలు ఎక్కడ నుంచి వస్తాయని, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలన్నారు. తాను బాల తారగా నటిస్తున్నప్పుడు ఇలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నానని, ఈ విషయం తన తల్లి ఫిర్యాదు చేయడంతో తనను ఆ చిత్రం నుంచి తొలగించారని నటి కుట్టి పద్మిని ఈసందర్భంగా పేర్కొన్నారు. -
నామినేషన్‌కు ‘శ్రీరాముడు’.. వెంట వచ్చిన జనం!
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అరుణ్ గోవిల్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయన వెంటవచ్చారు. టీవీ రామాయణంలో శ్రీరాముని పాత్ర పోషించిన అరుణ్ గోవిల్‌ను చూసేందుకు జనం రోడ్లపైకి చేరారు. అరుణ్ గోవిల్ తన నామినేషన్‌కు ముందు రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణ్ గోవిల్ ఒక ట్వీట్లో ‘ఈ రోజు నా జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు. మీరట్‌కు సేవ చేసే అవకాశాన్ని ఆ శ్రీరాముడు నాకు కల్పించాడు. లోక్‌సభ నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నాను..జై శ్రీరామ్’ అని రాశారు. దీనికి ముందు అరుణ్ గోవిల్ స్థానిక ఔఘద్‌నాథ్ ధామ్ ఆలయాన్ని సందర్శించారు. నామినేషన్ అనంతరం అరుణ్ గోవిల్ మీడియాతో మాట్లాడుతూ ‘ఇది నాకు కొత్త ఇన్నింగ్స్‌కు నాంది. నా స్వస్థలం నుంచి నన్ను అభ్యర్థిగా నిలబెట్టారు. ఇప్పుడు నేను నా ప్రజల కోసం పని చేయగలుగుతాను. రాముని ప్రతి రూపంలో నాకు ప్రజల నుంచి లభించిన ప్రేమ కంటే ఒక నేతగా మరింత ఆదరణ దొరుకుతుందని భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు. -
టీవీల ధరలు మరింత పెరుగుతాయా.. ఎందుకు?
ఇకపై టీవీలు కొనడం మరింత భారం కావచ్చు. తయారీదారులు ఉత్పత్తిని తగ్గించడంతో కీలకమైన ఓపెన్ సెల్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయని, దీనివల్ల టీవీలు ధరలు కూడా మరింత పెరుగుతాయని ఓ నివేదిక ద్వారా తెలుస్తోంది. కోవిడ్ సమయం నుంచే పరిశ్రమ ఈ సమస్యను ఎదుర్కొంటోంది. గత డిసెంబర్ నుంచి ఓపెన్-సెల్ ధరలు ఏకంగా 20 శాతం పెరిగాయి. ఇప్పుడు చైనీస్ న్యూ ఇయర్ తర్వాత ఫిబ్రవరి చివరి నాటికి మరో 15 శాతం పెంచే యోచనలో టెలివిజన్-ప్యానెల్ తయారీదారులు ఉన్నారు. ఏమిటీ ఓపెన్ సెల్? టెలివిజన్ సెట్ల తయారీలో ఓపెన్ సెల్ ప్రధాన భాగాలలో ఒకటి. టీవీల ఉత్పత్తిలో 60-65 శాతం ఓపెన్ సెల్లకే ఖర్చవుతుంది. వీటిని చైనాలోని నాలుగైదు కంపెనీలే తయారు చేస్తున్నాయి. దీని కారణంగా ధరల అధికారం వారి చేతుల్లోనే ఉంటోంది. -
టీవీ స్టూడియోలో దుండగుల దాడి.. లైవ్‌లో వీక్షించిన ప్రేక్షకులు!
ఈక్వెడార్ అధ్యక్షుడు డేనియల్ నోబోవా తాజాగా క్రిమినల్ గ్రూప్ ‘ఈక్వెడార్ గ్యాంగ్స్టర్స్ స్టార్మ్ స్టూడియో’పై సైనిక చర్యకు ఆదేశించారు. హుడ్ ధరించిన ఈ గ్రూప్‌నకు చెందిన ముష్కరులు టెలివిజన్ స్టూడియోపై దాడి చేయడంతో పాటు భద్రతా బలగాలను, పౌరులను చంపుతామని బెదిరించడంతో అధ్యక్షుడు ఇటువంటి ఆదేశాలు జారీచేశారు. ఈక్వెడార్‌లో పేరుమోసిన నేరస్తుడు జోస్ అడాల్ఫో ఇటీవల మాసియాస్ జైలు నుండి తప్పించుకోవడంతో దేశంలో భద్రతా సంక్షోభం తలెత్తింది. దేశంపై గ్యాంగ్స్టర్లు యుద్ధం ప్రకటించారు. దీంతో దేశం అంతర్గత సాయుధ సంఘర్షణలో ఉందని అధ్యక్షుడు నోబోవా ప్రకటించారు. శాంతియుత స్వర్గధామంగా ఉన్న ఈక్వెడార్‌పై పట్టుసాధించేందుకు ఇటీవలి కాలంలో మెక్సికన్,కొలంబియన్ కార్టెల్స్‌తో సంబంధం కలిగిన ప్రత్యర్థి ముఠాలు పోటీ పడుతున్నాయి. తాజాగా ఈ క్రిమినల్ గ్రూపులను మట్టుబెట్టేందుకు సైనిక చర్య చేపట్టాలని దేశ సాయుధ బలగాలను అధ్యక్షుడు నోబోవా ఆదేశించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. పోర్ట్సిటీలోని టీసీ టెలివిజన్ స్టూడియోలో తుపాకులు, గ్రెనేడ్లతో దుండగులు దాడికి పాల్పడిన దరమిలా అధ్యక్షుడు ఈ ప్రకటన చేశారు. కాగా స్టూడియోలో తుపాకీ కాల్పుల మధ్య ఒక మహిళ.. ‘షూట్ చేయవద్దు, దయచేసి కాల్చకండి’ అని వేడుకుంది. అయితే ముష్కరులు వార్తలు చదువుతున్న వ్యక్తితో పాటు అక్కడున్న ఇతర ఉద్యోగులను నేలపై కూర్చోమని ఆదేశించి, తలపై తుపాకీ ఎక్కుపెట్టారు. తమ వద్ద బాంబులు ఉన్నాయని బెదిరించారు. ఈ ఉదంతమంతా టీవీ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారమైంది. లైవ్‌లో తుపాకీ శబ్దాలూ వినిపించాయి. దీనిని ప్రేక్షకులు ఆసక్తిగా వీక్షించారు. సుమారు 30 నిమిషాల గందరగోళం తర్వాత అధికారులు స్టూడియోలోకి ప్రవేశించడం కనిపించింది. దీనికి ముందు గ్యాంగ్స్టర్లు పోలీసు అధికారులను కిడ్నాప్ చేశారు. అధ్యక్షుడు నోబోవా ప్రకటించిన 60 రోజుల అత్యవసర పరిస్థితి, రాత్రిపూట కర్ఫ్యూకి నిరసనగా గ్యాంగ్స్టర్లు దేశంలోని పలు నగరాల్లో పేలుడు పదార్థాలతో విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నించారు. కాగా 36 ఏళ్ల నోబోవా దేశంలో మాదకద్రవ్యాల సంబంధిత నేరాలు, హింసకు వ్యతిరేకంగా పోరాడతానని డేనియల్ నోబోవా ప్రతిజ్ఞ చేసిన దరిమిలా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. -
శాంసంగ్ టీవీల్లో కొత్త మోడ్.. ఆ రంగులు చూడలేని వారి కోసం..
దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ దిగ్గజం శాంసంగ్ (Samsung).. తన 2023 టీవీ, మానిటర్ లైనప్‌లో సీ కలర్స్ (SeeColors) అనే కొత్త మోడ్‌ను జోడించినట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ వర్ణ అంధత్వం ఉన్నవారికి వివిధ సెట్టింగుల ద్వారా మెరుగైన వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. సీ కలర్స్ మోడ్ తొమ్మిది పిక్చర్ ప్రీసెట్లను అందిస్తుంది. వీటిలో వినియోగదారులు తమకు అనువైనదాన్ని ఎంచుకోవచ్చు. వీక్షకులు తమ వర్ణ దృష్టి లోపానికి అనుగుణంగా స్క్రీన్‌పై అన్ని రంగులను సులభంగా గుర్తించగలిగేలా ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల స్థాయిలను ఈ ఫీచర్ సర్దుబాటు చేస్తుంది. అందుబాటులో సాఫ్ట్వేర్ అప్డేట్ వాస్తవానికి 2017లోనే ఈ ఫీచర్ ఒక అప్లికేషన్‌గా విడుదలైంది. సీ కలర్స్ మోడ్ వర్ణాంధత్వ బాధితులు తాము చూడలేని రంగులను సైతం స్క్రీన్‌పై ఆస్వాదించేలా దీన్ని రూపొందించారు. రానున్న టీవీ, మానిటర్ యాక్సెసిబిలిటీ మెనూలలో ఈ మోడ్‌ను ఏకీకృతం చేస్తోంది శాంసంగ్ కంపెనీ. ఇప్పటికే 2023 మోడల్ శాంసంగ్ టీవీలు, మానిటర్లు కొనుగోలు చేసిన వారు తమ ఉత్పత్తుల యాక్సెసిబిలిటీ మెనూకి సీ కలర్స్ ఫీచర్‌ను జోడించడానికి సాఫ్ట్వేర్ అప్డేట్ అందుబాటులో ఉంటుంది. సీ కలర్స్ మోడ్‌కు సంబంధించి 'కలర్ విజన్ యాక్సెసిబిలిటీ' సర్టిఫికేషన్‌ను కూడా శాంసంగ్ పొందింది. ఇదీ చదవండి: Smallest Smartphone: ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు మాత్రం అదుర్స్! -
‘టీవీ రాముడి’ పాదాల చెంత అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లాడిని ఉంచగానే..
‘ఆది పురుష్’ సినిమాపై జరుగుతున్న హంగామా ఇప్పట్లో చల్లారేలా లేదు. రామాయణం ఆధారంగా రూపొందించిన ఈ సినిమాను చూసినవారంతా దర్శకనిర్మాత రామానంద్‌సాగర్ రూపొందించిన టీవీ రామాయణాన్ని గుర్తు చేసుకుంటున్నారు. టీవీ రామాయణంలో రాముని పాత్ర పోషించిన నటుడు అరుణ్ గోవిల్ కూడా ‘ఆది పురుష్’ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రామాయణం రూపొందించినప్పుడు దానిని ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దామని, అందుకే ఇప్పటికీ నాటి రామాయణం సీరియల్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయిందన్నారు. సోషల్ మీడియాలో ‘ఆది పురుష్’సినిమాపై స్పందించిన ఆయన గతంలో తనకు ఎదురైన ఒక అనుభవాన్ని వివరించారు. గతంలో ఒకసారి తనను సాక్షాత్తూ శ్రీరామునిగా భావించిన ఒక మహిళ తన పాదాల చెంత అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడిని ఉంచిందన్నారు. అప్పుడు తాను అనారోగ్యంతో బాధపడుతున్న ఆ పిల్లివాడిని ఆసుపత్రికి తీసుకువెళ్లాలలని చెబుతూ, పిల్లాడి ఆరోగ్యం కోసం ప్రార్థించానన్నారు. తరువాత ఆమె తన చేతిని ఆ కుర్రాడి తలపై ఉంచాలని కోరిందన్నారు. తరువాత ఆమె ఆ పిల్లాడిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయిందన్నారు. మూడు రోజుల తరువాత ఆ మహిళ తన పిల్లాడిని తీసుకుని తిరిగి సెట్‌కు వచ్చిందని, అప్పుడు అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారన్నారు. ఆ పిల్లాడు అనారోగ్యం నుంచి కోలుకుని ఆడుకుంటున్నాడని అరుణ్ గోవిల్ తెలిపారు. దేశంలో శ్రీరామునిపై ప్రజలకు భక్తిశ్రద్ధలు ఆ స్థాయిలో ఉంటాయని అరుణ్ గోవిల్ దీనిని ఉదహరించారు. ఏ మతానికి సంబంధించిన సినిమా రూపొందించినా, అది విలువలతో కూడి ఉండాలని ఆయన సూచించారు. దేశంలోని ప్రజలు శ్రీరాముని పాత్రను ఎంతో గొప్పగా చూస్తారని, అందుకే ఓం రౌత్ రూపొందించిన రామాయణంలో విలువలు లేవని విమర్శిస్తున్నారన్నారు. రామాయణం రూపకల్పన విషయంలో తగిన విధంగా ఆలోచించి ఉంటే, ఇన్ని విమర్శలు వచ్చేవికావని, పైగా ప్రేక్షకులు మెచ్చుకునేవారన్నారు. ఇది కూడా చదవండి: ‘ఆదిపురుష్’ హనుమంతుని కండల రహస్యం ఇదేనట! -
టాప్ 30 హెడ్ లైన్స్..!
-
మోటరోలా ఎన్విజన్ఎక్స్ 4కే టీవీ
బెంగళూరు: ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ మోటరోలా ‘ఎన్విజన్ ఎక్స్’ పేరుతో 4కే క్యూఎల్ఈడీ గూగుల్ టీవీని విడుదల చేసింది. ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌పై దీన్ని ఆవిష్కరించింది. ఫ్యూచరిస్టిక్ డిజైన్, మెరుగైన ఆడియో, వీడియో, గేమింగ్ సామర్థ్యాలతో అందుబాటు ధరలకే దీన్ని తీసుకొచ్చినట్టు మోటరోలా తెలిపింది. ఎన్విజన్ ఎక్స్ కింద 55 అంగుళాలు, 65 అంగుళాల స్క్రీన్ సైజులతో రెండు మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 55 అంగుళాల ధర రూ. 30,999 కాగా, 65 అంగుళాల ధర రూ. 39,999. ఆరంభ ఆఫర్ కింద 55 అంగుళాల టీవీపై రూ.5,000, 65 అంగుళాల టీవీపై రూ. 10,000 వరకు తగ్గింపు ఇస్తున్నట్టు మోటరోలా ప్రకటించింది. క్యూఎల్ఈడీ డిస్ప్లే క్వాంటమ్ గ్లో టెక్నాలజీతో ఉంటుందని, రంగులను అద్భుతంగా చూపిస్తుందని, దృశ్యాలు సహజంగా అనిపిస్తాయని తెలిపింది. 3డీ సరౌండ్ సౌండ్, డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో వస్తుందని పేర్కొంది. -
స్మార్ట్ టీవీ కొనుగోలు దారులకు గూగుల్ హెచ్చరిక.. అలాంటి టీవీలతో
స్మార్ట్‌టీవీ కొనుగోలు దారులకు ప్రముఖ టెక్ దిగ్గజం కీలక సమాచారం అందించింది. మార్కెట్లో కొనుగోలు చేస్తున్న ప్రతిటీవీ ఆండ్రాయిండ్ టీవీగా ప్రచారం జరుగుతుందని, అయితే, అందులో వాస్తవం లేదని తేల్చి చెప్పింది. ఇటీవల కమ్యూనిటీ పోస్ట్‌లో ఆండ్రాయిడ్ ఓఎస్ పేరుతో టీవీలను విక్రయించినట్లు గూగుల్ గుర్తించింది. వాస్తవానికి అవి ఆండ్రాయిడ్ ఓపెన్ స్టోర్స్ ప్రాజెక్ట్‌ను (aosp)ని ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. ఆండ్రాయిడ్ టీవీ వర్సెస్ ఏఓఎస్‌పీ గూగుల్ సమాచారం మేరకు..ఆండ్రాయిడ్ టీవీల్లో గూగుల్ యాప్స్ లైసెన్స్ లేకుండానే ప్లే అవుతాయి. ఆండ్రాయిడ్ టీవీ కొన్న ప్రతి ఒక్కరూ వాటిని వినియోగించుకోవచ్చు. కానీ ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్‌తో రూపొందించబడిన టీవీల్లో గూగుల్ యాప్స్‌ను ప్లే చేయలేం. అందుకే ఆయా సంస్థలు ప్లే ప్రొటక్ట్ సర్టిఫికెట్ విషయంలో జాగ్రత్త వహిస్తాయి. టీవీ కొనేముందు తీసుకోవాల్సిన చూడాల్సిందిదే కస్టమర్లు తాము కొనుగోలు చేస్తున్న టెలివిజన్ సురక్షితమా? కాదా? అని నిర్ధారించేందుకు ఆండ్రాయిటీవీ వెబ్‌సైట్‌ను విజిట్ చేయాలని గూగుల్ సిఫార్స్ చేస్తోంది. ఆ వెబ్సైట్లో కొనుగోలుదారులు అధికారిక Android TV, Google TV, Android TV ఉత్పత్తులను చూడొచ్చు. ప్లేస్టోర్‌లోకి వెళ్లి గూగుల్ లైసెన్స్ పొందిందో లేదో తనిఖీ చేసుకోవచ్చు. టీవీకి ప్లే ప్రొటెక్ట్ సర్టిఫికేట్ లేకపోతే అది గూగుల్ ధృవీకరించలేదని అర్థం. చదవండి👉 నీళ్లను తెగ తాగేస్తున్న చాట్ జీపీటీ! -
Redmi : వావ్.. 32 అంగుళాల టీవీ కేవలం రూ.12 వేలు మాత్రమే!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రెడ్మీ కొత్త టీవీని విడుదల చేసింది. రెడ్మీ స్మార్ట్ఫైర్ టీవీ 32 (Redmi Smart Fire TV 32) పేరుతో భారత్‌లో లాంచ్ చేసింది. కేవలం రూ.11,999కే 32 అంగుళాల వేరియంట్ టీవీలో అమెజాన్ ఫైర్ ఓఎస్‌ని అందిస్తుంది. గతంలో రెడ్మీ పలు టీవీలను విడుదల చేసినప్పటికీ.. అవి ఆండ్రాయిత్ టీవీ ఓఎస్‌తో వచ్చేవి. భారత్‌లో రెడ్మీ స్మార్ట్ఫైర్ టీవీ 32 ధర రెడ్మీ స్మార్ట్ఫైర్ టీవీ 32 ధర రూ.13,999 గా ఉంది. ప్రారంభ ఆఫర్, కార్డు ఆఫర్లు పోగా..రూ.11,999కే లభిస్తుంది. ఈ కొత్త స్మార్ట్ టీవీని మార్చి 21నుంచి రెడ్మీ అమ్మకాలు ప్రారంభించనుంది. ఇక ఈ టీవీ అమెజాన్, ఎంఐ స్టోర్ల నుంచి కొనుగోలు చేయొచ్చు. రెడ్మీ స్మార్ట్ ఫైర్ టీవీ 32 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు పైన పేర్కొన్నట్లుగా రెడ్మీ స్మార్ట్ఫైర్ టీవీ 32 ప్రస్తుతానికి 32 అంగుళాలు,హెచ్డీ (1366x768-పిక్సెల్) రిజల్యూషన్‌తో టెలివిజన్ ఫైర్ ఓఎస్ 7 ఆధారితమైనది. ఇందులో ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్ వంటి అమెజాన్ సొంత యాప్‌ల సపోర్ట్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, యాపిల్ టీవీ, స్మార్ట్ టీవీ యాప్‌లు, స్ట్రీమింగ్ సేవలకు ఫైర్ ఓఎస్ సపోర్ట్ చేస్తుంది. సౌండ్ కోసం డాల్బీ ఆడియోకు సపోర్ట్‌గా 20డబ్ల్యూ స్పీకర్ సిస్టమ్‌ను అందిస్తుంది. కనెక్టివిటీ పరంగా, Redmi Smart Fire TV 32లో బ్లూటూత్ 5, డ్యూయల్ బ్యాండ్ వైఫై, ఎయిర్ ప్లే, మిరా క్యాస్ట్(Miracast)లకు సపోర్ట్ ఇస్తుంది. రెండు హెచ్డీఎంఐ పోర్ట్‌లు, రెండు యూఎస్బీ పోర్ట్‌లు, ఏవీ ఇన్పుట్ సాకెట్లు, వైర్డు హెడ్‌ఫోన్ లేదా స్పీకర్ కనెక్టివిటీ కోసం 3.5ఎంఎం సాకెట్, వైర్డు ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఈథర్నెట్ పోర్ట్, యాంటెన్నా సాకెట్ ఉన్నాయి. 1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యం ఉంది. ఇది కాకుండా రెడ్మీఫైర్ టీవీలో అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌ని వినియోగించేందుకు వీలుగా టీవీ రిమోట్లో అలెక్సా బటన్ ఉంది. తద్వారా అమెజాన్ అకౌంట్‌తో కనెక్ట్ చేసిన ఐఓటీ, స్మార్ట్ హోమ్ పరికరాలను ఆపరేట్ చేసేందుకు ఉపయోగించవచ్చు. రిమోట్లో ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్, నెట్‌ఫ్లిక్స్ కోసం హాట్‌కీలు కాకుండా ప్లేబ్యాక్కోసం ప్రత్యేక బటన్లు, మ్యూట్ బటన్లు ఉన్నాయి. -
ఇకపై స్మార్ట్ ఫోన్లో టీవీ చూడొచ్చు..! ఎలా అంటే..?
కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్ఎం రేడియో స్టేషన్ల వేలంతో పాటు ఓటీటీ ఫ్లాట్‌ఫారమ్‌లను ప్రారంభించడం, మొబైల్స్‌లోనే టీవీ కార్యక్రమాలను వీక్షించేలా ట్రయల్స్ నిర్వహించనుంది. ఇదే విషయాన్ని సమాచార, ప్రసార కార్యదర్శి అపూర్వ చంద్ర అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది రేడియో స్టేషన్లను వేలం వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాం. ఎఫ్ఎం రేడియోను టైర్ 2, టైర్ 3 నగరాలకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నట్లు బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ సొసైటీ ఎక్స్‌పోలో ప్రసంగించారు. పెద్ద సంఖ్యలో ఎఫ్ఎం రేడియో స్టేషన్లు ఉన్నప్పటికీ దేశంలో 60 శాతం మాత్రమే ఈ సేవలు అందిస్తున్నాయని ఆయన అన్నారు. సరిహద్దు, వ్యూహాత్మక ప్రాంతాలతో సహా ప్రసార భారతి పరిధిని విస్తృతం చేయడానికి ప్రసార మౌలిక సదుపాయాలు, నెట్వర్క్ డెవలప్మెంట్ (బైండ్) స్కీమ్ కోసం ప్రభుత్వం నాలుగు సంవత్సరాల కాలంలో రూ. 2,500 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. ఈ పథకం దేశంలో ప్రభుత్వ రంగ ప్రసారాలను పెంచడం, ఆల్ ఇండియా రేడియో (air), దూరదర్శన్ (dd)తో సహా ప్రసార భారతి మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఐఐటీ-కాన్పూర్, సాంఖ్య ల్యాబ్‌లు టెలివిజన్ సిగ్నల్‌లను నేరుగా మొబైల్ ఫోన్లకు ప్రసారం చేసేలా పరిసర ప్రాంతాలలో ట్రాన్స్మిటర్లను ఇన్స్టాల్ చేసినట్లు చంద్ర చెప్పారు. అత్యాధికమైన టెక్నాలజీ సాయంతో నేరుగా మొబైల్స్‌లోకి టీవీ సిగ్నల్స్‌ను సేకరించవచ్చు. ఇందుకోసం మొబైల్ ఫోన్ వినియోగదారులు తమ మొబైల్ పరికరాలకు ప్రత్యేక డాంగిల్‌ను జత చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఫోన్లలో ప్రత్యేక చిప్‌ను ఇన్స్టాల్ చేసుకునేలా మొబైల్ తయారీదారులను ప్రోత్సహించాల్సి ఉంటుందని, తద్వారా డాంగిల్ లేకుండానే టెలివిజన్ సిగ్నల్స్ అందుతాయని అన్నారు. -
కొత్త సంవత్సరంలో టీవీ చూసేవారికి ఊహించని షాక్!
దేశంలో ద్రవ్యోల్బణం కారణంగా సామాన్యు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఇదిలా ఉండగా టీవీ లవర్స్‌కి సైతం కొత్త ఏడాదిలో పెద్ద షాక్ తగలనుంది. ప్రముఖ టీవీ బ్రాడ్కాస్టర్లు ఛానళ్లకు సంబంధించి అలకార్టే, బౌక్వెట్ రేట్లను పెంచేశాయి. ఈ ధరల పెంపు నిర్ణయం వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి అమలులోకి రానుంది. దీని కారణంగా, టీవీ రీఛార్జ్ కోసం నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్యాక్ ఖరీదుగా మారనుంది. 3 సంవత్సరాల తర్వాత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం.. సోనీ పిక్చర్స్, స్టార్ ఇండియా, జీ ఎంటర్టైన్మెంట్తో సహా 42 ప్రసారకర్తలు 332 కంటే ఎక్కువ ఛానెల్‌లు ఉన్నాయి. ప్రసారకర్తలు ఈ ఛానెల్‌లను చూడటానికి నెలవారీ రుసుములను నిర్ణయించారు. దీని ధర 10 పైసల నుంచి 19 రూపాయల వరకు ఉంటుంది. టీవీ బ్రాడ్కాస్టర్లు 3 సంవత్సరాల తర్వాత ఛానెల్‌ల ధరలను సవరించారు. నవంబర్ 22న ప్రసార సేవల నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌ను ట్రాయ్ (TRAI) సవరించినందున ఈ ధరల పెంపు జరిగింది. ఆ తర్వాత జీ (ZEE), కల్వర్ మాక్స్ ఎంటర్టైన్మెంట్ సోనీ, సన్ టీవీనెట్వర్క్ తమ రిఫరెన్స్ ఇంటర్‌కనెక్ట్ ఆఫర్లను (RIO) ఫైల్ చేశాయి. ఆర్ఓఐ అనగా సర్వీస్ ప్రొవైడర్ జారీ చేసిన నియమ నిబంధనల పత్రం. ఒక సర్వీస్ ప్రొవైడర్ మరో నెట్‌వర్క్‌తో ఇంటర్కనెక్షన్ కోరుకునే నిబంధనలు, షరతులు అందులో ఉంటాయి. మరో వైపు డిస్నీ స్టార్ ఇండియా, వయాకామ్ 18 వంటి సంస్థలు కూడా త్వరలోనే ఆర్‌ఐఓలను దాఖలు చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి నుంచి కొత్త ధరలు నివేదిక ప్రకారం.. టీవీ వీక్షకుల నెలవారీ టీవీ చందా బిల్లు పెరగబోతోంది. ఎందుకంటే, ప్రధాన టెలివిజన్ ప్రసారకర్తలు ఛానెల్‌ల బౌక్వెట్ రేట్లను పెంచాయి. ఛానెల్‌లను వీక్షించడానికి పెరిగిన కొత్త ధరలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2023 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో టీవీ ఛానెల్‌లను చూడటానికి వీక్షకులు ఎక్కువ డబ్బు చెల్లించవలసి ఉంటుంది. ఇప్పటికే కొన్ని బౌక్వెట్స్ ధరలు 10-15% రేట్లు పెంచినట్లు సమాచారం. సోనీ తన రూ. 31 ధర గల బౌక్వెట్ని నిలిపివేసి, దాని స్థానంలో రూ. 43 కొత్తదాన్ని తీసుకొచ్చిందని ఓ కేబుల్ టీవీ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వార్తా సంస్థకు తెలిపారు. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
ఆ టీవీలను ఎగబడి కొంటున్న జనం.. సేల్స్‌లో దుమ్మురేపుతోంది!
భారత్‌లో స్మార్ట్ టీవీ అమ్మకాలు జోరందుకుంది. ఓటీటీ పుణ్యమా అని ఈ విభాగం టీవీలను మాత్రం వినియోగదారులు ఎగబడి మరీ కొంటున్నారు. దీంతో ఈ ఏడాడి ఏకంగా రెండంకెల వృద్ధి సాధించింది. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం..ఈ సెప్టెంబర్ త్రైమాసికంలో స్మార్ట్ టీవీ అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే 38% పెరిగినట్లు వెల్లడించింది. ఇంట్లో కూర్చుని పెద్ద స్క్రీన్లలో ఓటీటీ (OTT) యాప్‌ల ద్వారా ప్రసారం అవుతున్న కంటెంట్‌ను చూసేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. OTT యాప్స్ స్మార్ట్ టీవీల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయనే విషయం తెలిసిందే. దీంతో స్మార్ట్ టీవీలకు సేల్స్ పెరుగుతోంది. ఈ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో మొత్తం టీవీ విభాగంలో 93 శాతం వాటా స్మార్ట్ టీవీలదే కావడం వీటి డిమాండ్ ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. ఇంకా చాలా మంది CRT (కాథోడ్-రే ట్యూబ్) టీవీలను ఉపయోగిస్తున్నారు. వీటితో పోలిస్తే ప్రయోజనాల ఎక్కువగా స్మార్ట్ టీవీలో ఉండడంతో ఇటీవల ప్రజలు వాటికి అప్‌గ్రేడ్ అవుతున్నట్లు నివేదిక పేర్కొంది. ప్రస్తుతం స్మార్ట్ టీవీలు బడ్జెట్ ధరలో వినియోగదారులకు అందుబాటులో ఉంటున్నాయి. దాదాపు రూ.20 వేల లోపు ఫీచర్లుతో కూడిని స్మార్ట్ టీవీలు మార్కెట్లోకి వస్తున్నాయి. ఎప్పుడూ ప్రీమియం రేంజ్లో ఉండే గూగుల్ టీవీ ఇప్పుడిప్పుడే రూ.25,000 లోపు ధర విభాగంలోకి ప్రవేశించిందని, వచ్చే ఏడాది ఇంకా అది రూ.20 వేల లోపు సెగ్మెంట్లోకి కూడా ప్రవేశించే అవకాశముందని అని కౌంటర్‌పాయింట్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ అన్షికా జైన్ వెల్లడించారు. చదవండి కాల్చి చంపేస్తారేమో..కచ్చితంగా ప్రమాదం ఉంది: ఎలాన్ మస్క్ -
అస్తమానం టీవీ చూస్తున్న పిల్లాడు.. తల్లిదండ్రులు ఏం చేశారంటే..?
బీజింగ్: 8 ఏళ్ల కుమారుడు అస్తమానం టీవీ చూస్తున్నాడని కఠిన శిక్ష విధించారు చైనాకు చెందిన తల్లిదండ్రులు. అయితే వీరి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చిన్న పిల్లలతో ఇలాగేనా ప్రవర్తించేది అని పలువురు మండిపడ్డారు. సెంట్రల్ చైనా హునాన్ ప్రావిన్స్‌లో నివసించే ఈ జంట పని మీద బయటకు వెళ్తూ హోం వర్క్ పూర్తి చేసి ఆ తర్వాత పడుకోమని తమ కుమారుడికి చెప్పింది. అయితే వాళ్లు బయటకు వెళ్లి తిరిగి వచ్చే సరికి ఆ బాలుడు టీవీ చూస్తున్నాడు. అంతేకాకుండా హోం వర్క్ కూడా పూర్తి చేయలేదు. దీంతో తల్లిదండ్రులకు కోపం వచ్చింది. ఫలితంగా రాత్రంతా టీవీ చూస్తూనే ఉండాలని కుమారుడికి శిక్ష విధించారు. అతడు పడుకోకుండా ఇద్దరూ తరచూ అతడ్ని గమనించారు. అయితే మొదట స్నాక్స్ తింటూ హాయిగా టీవీ చూసిన పిల్లాడికి కాసేపయ్యాక అలసట వచ్చింది. ఫలితంగా తనవల్ల కాదని ఏడ్చాడు. కానీ తల్లిదండ్రులు మాత్రం ఉదయం 5 గంటల వరకు నిద్రపోనివ్వకుండా అతడ్ని టీవీ ముందే కూర్చోబెట్టారు. ఈ తల్లిదండ్రుల పేరెంటింగ్‌పై చైనాలో పెద్ద చర్చే మొదలైంది. ఈ శిక్ష చాలా కఠినంగా ఉందని, పిల్లాడికి ఒకవేళ ఇదే అలవాటై రోజు ఆలస్యంగా పడుకుని, ఉదయం కూడా ఆలస్యంగా నిద్ర లేస్తే ఏం చేస్తారని కొందరు ప్రశ్నించారు. చైనాలో పేరెంటింగ్ సమస్యలు పెరిగి ప్రభుత్వం కొత్త చట్టాన్నే తీసుకువచ్చింది. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలి, ప్రవర్తన ఎలా ఉండాలి అనే విషయాలపై అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టింది. పిల్లలు నేరాలు చేసినా, తప్పుగా ప్రవర్తించినా వాళ్లను హింసించకుండా మార్పు తీసుకురావాలని నిబంధనలు ఉన్నాయి. చదవండి: ఎలాన్ మస్క్ తీరుతో అసంతృప్తి.. ట్విట్టర్‌కు అధికార పార్టీ గుడ్‌బై.. -
కళ్ళు చెదిరే ధరలో.. 43 ఇంచెస్ LED TV..
-
ఓటమితో మైండ్ బ్లాంక్.. టీవీ పగలగొట్టిన అభిమాని..అయితే ఆ వీడియో ఇప్పటిది కాదు! ట్విస్ట్
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ అధ్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా ఈ మ్యాచ్ యావత్ క్రికెట్ అభిమానులను అలరించింది. మ్యాచ్ విజయంతో భారత అభిమానులు ఒకరోజు ముందే దీపావళి చేసుకున్నారు. అయితే పాకిస్తాన్ అభిమానులు మాత్రం భారత్ చేతిలో తమ జట్టు ఓటమికి జీర్ణుంచుకోలేక ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. మ్యాచ్ అయిపోగానే కొందరు టీవీలు పగలగొట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ వీడియో ఇప్పటిది కాదు ఇందుకు సంబంధించిన ఓ వీడియోను భారత క్రికెట్ దిగ్గజం వీరేందర్ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. మ్యాచ్ అయిపోగానే ఓ పాక్ అభిమాని తన టీవీని పగలగొట్టినట్లుగా ఇందులో కనిపించిది. దానిపైకి వస్తువును విసరడమే గాక.. కాలుతో తన్ని దాన్ని ముక్కలు ముక్కలు చేసినట్లు ఆ దృశ్యాల్లో ఉంది. అతడి ఆగ్రహాన్ని చూసి సెహ్వాగ్ సైటెర్లు వేశాడు. ఇది కేవలం మ్యాచ్ మాత్రమే.. రిలాక్స్ అవ్వండి. మేము ఇక్కడి దీపావళి టపాసులు పేల్చుతుంటే.. మీరేమో టీవీలు పగలగొడుతున్నారు. పాపం టీవీలు ఏం చేశాయి? అని రాసుకొచ్చాడు. నవ్వే ఓ ఎమోజీ కూడా పెట్టాడు. దీన్ని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. అయితే, నిజానికి ఇది టీ20 వరల్డ్‌కప్-2022లో భారత్- పాక్ నాటి మ్యాచ్‌కు సంబంధించింది కాదు. 2016లో ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా ఓ వ్యక్తి ఈ చర్యకు పాల్పడగా.. దీనిని భారత్- పాక్ మ్యాచ్‌కు లింక్ చేసి వైరల్ చేయడం గమనార్హం. Relax Padosi , it’s only a game. Hamaare yahan Deepawali hai toh pataakhe phod rahe hain aur aap bevajah TV 📺 phod rahe hain 🤣. Nahin yaar, TV ka kya kasoor. pic.twitter.com/AvVL4fOmny — Virender Sehwag (@virendersehwag) October 23, 2022 చదవండి: Ind Vs Pak: భారత్-పాక్ మ్యాచ్.. చివరి ఓవర్లో 'నో బాల్'పై తీవ్ర దుమారం -
గజియాబాద్ పేలుడు ఘటన.. టీవీలు పేలడానికి ప్రధాన కారణాలు ఏవో తెలుసా!
ఇటీవల ఎలక్ట్రిక్ బైకులు, స్మార్ట్ఫోన్లు పేలిన ఘటనలను చూస్తూనే ఉన్నాం. కొన్ని సందర్భాల్లో ఈ ప్రమాదాల కారణంగా కొందరు తీవ్రంగా గాయపడగా, ఇంకొందరి ప్రాణాలు కూడా పోయాయి. తాజాగా గజియాబాద్‌లో టీవీ పేలి ఓ టీనేజర్ మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఎలక్ట్రిక్ పరికరాల వాడడంపై కాకుండా సురక్షితం ఎలా వాడాలో తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా టీవీలు పేలడం అరుదుగా జరిగే ఘటనలే అయినప్పటికీ ప్రమాద తీవ్రత భారీ స్థాయిలో ఉంటుందని గజియాబాద్ సంఘటన చెప్తోంది. ఈ నేపథ్యంలో వీటి పేలుడుకి ప్రధాన కారణాలను పరిశీలిస్తే.. గజియాబాద్ ఘటనలో టీవి పేలుడు ధాటికి దెబ్బతిన్న ఇంటి గోడ ఎల్ఈడీ టీవీలు పేలడానికి గల కారణాలు ఇవే! ఎల్ఈడీ టీవీలు పేలడానికి రకరకాల కారణాలున్నాయి. టీవీలో ఉండే కెపాసిటర్లు వల్ల పేలుడు సంభవించే అవకాశం ఉంది. ఎందుకంటే కెపాసిటర్ అంటే విద్యుత్ శక్తిని నిల్వ చేసుకుని.. బ్యాటరీలా పని చేస్తుంది. టీవీ ఆపరేట్ చేయడానికి, అవసరమైన సమయంలో స్టాండ్‌బై మోడ్‌లో ఉండటానికి అవసరమైన కొద్దిపాటి శక్తిని నిల్వ చేస్తుంది. అయితే క్వాలిటీ కెపాసిటర్ వాడడం వల్ల, లేదా టీవీలోని కెపాసిటర్లు పాతవి కావడం వల్లే పేలుళ్లు సంభవిస్తాయి. అయితే గజియాబాద్ పేలుడు ఇంత తీవ్రస్థాయిలో ఉండడానికి గది వాతావరణం కూడా కారణమై ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఓవర్ హీటింగ్ ఎలక్ట్రికల్ డివైజ్‌లు చాలా వరకు అధిక ఉష్ణోగ్రతల కారణంగా మంటలు లేదా పేలుడుకు గురవుతాయి. టీవీలను ఎక్కువసేపు ఉపయోగించినప్పుడు లేదా చాలా పరికరాలను టీవీలకు కనెక్ట్ చేసి వాడుతున్న సమయంలో అవి సులభంగా వేడెక్కుతుంది. ఈ క్రమంలో వేడెక్కిన పరికారాలు వాటి పరిమితి దాటిన వెంటనే పేలుడికి దారితీస్తాయి. అకస్మాత్తుగా వోల్టేజ్లో మార్పు.. భారత్ వంటి దేశాలలో టీవీ పేలుడు సంభవించడానికి ప్రధాన కారణాలలో ఒకటి విద్యుత్ లేదా వోల్టేజ్లో ఆకస్మిక పెరుగుదల కూడా ఒకటి. దీనినే మరో రకంగా పవర్ సర్జ్ అని కూడా అంటాం. తప్పుడు వైరింగ్ ఉన్న ప్రాంతాల్లో ఇది జరిగే అవకాశం ఉంది. అయితే ఈ ఆకస్మిక విద్యుత్ పెరుగుదల నుంచి డివైజ్ డ్యామేజ్ కాకుండా సురక్షితంగా ఉంచేందుకు కంపెనీలు టీవీలో అనేక పరికారలను ఏర్పాటు చేస్తాయి. తద్వారా ఆది ఆకస్మిక వోల్టేజ్ పెరుగుదలను తట్టుకోగలదు, అయినప్పటికీ, అవి కూడా కొన్నిసార్లు విఫలమయ్యే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. అందుకే ఉరుములు ,మెరుపులతో కూడిన వర్షాల సమయంలో టీవీలను ఆఫ్ చేయమని చెబుతుంటారు. చదవండి: బ్యాంక్ కస్టమర్లకు వార్నింగ్.. ఆ యాప్‌లు ఉంటే మీ ఖాతా ఖాళీ,డిలీట్ చేసేయండి! -
దేశంలోనే తొలిసారి.. హైదరాబాద్‌లో 86 అంగుళాల టీవీల అసెంబ్లింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో తొలిసారిగా 86 అంగుళాల టీవీల అసెంబ్లింగ్‌ను హైదరాబాద్‌కు చెందిన రేడియంట్ అప్లయాన్సెస్, ఎలక్ట్రానిక్స్ ప్రారంభించింది. ఇందుకో సం నూతన అసెంబ్లింగ్ లైన్‌ను ఇక్కడి ఫ్యాబ్ సిటీలో కంపెనీకి చెందిన ప్లాంటులో ఏర్పాటు చేసింది. లాయిడ్ బ్రాండ్ కోసం 75 అంగుళాల గూగుల్ టీవీ తయారీని ప్రారంభించినట్టు రేడియంట్ అప్లయాన్సెస్ ఎండీ రమీందర్ సింగ్ సోయిన్ ఈ సందర్భంగా తెలిపారు. రిసోల్యూ ట్ గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీకి ఎలక్ట్రానిక్స్ తయారీలో 25 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. అంతర్జాతీయ బ్రాండ్లకు ఎలక్ట్రానిక్ ఉపకరణాలను తయారు చేసి సరఫరా చేస్తోంది. -
ట్రెండ్ మారింది.. ఆ సెగ్మెంట్ టీవీల సేల్స్ మూడింతలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వేగవంతమైన ఇంటర్నెట్, వినోదానికి కావాల్సినంత కంటెంట్, భారీగా తగ్గిన ధరలు, వీక్షణం విషయంలో మారుతున్న ధోరణులు, పైగా కస్టమర్ల ఆదాయాల్లో వృద్ధి.. ఇంకేముంది పెద్ద సైజు టీవీల వైపు మార్కెట్ క్రమంగా మళ్లుతోంది. 40, ఆపైన అంగుళాల సైజున్న టీవీల విపణి అయిదేళ్లలో మూడు రెట్లు పెరిగింది. ప్రస్తుతం వీటి వాటా 40 శాతం ఉంది. 2027 నాటికి ఇది 50 శాతానికి చేరుతుందని రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ రిసర్చ్ వెల్లడించింది. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల సంఖ్య అధికం అవడం కూడా పరిశ్రమకు కలిసి వచ్చే అంశం. గతంలో కొన్ని కంపెనీలు మాత్రమే ఈ విభాగంలో మోడళ్లను విక్రయించాయి. కొన్ని సంస్థలు భారత్‌లో రీ–ఎంట్రీ ఇచ్చాయి. భారీగా తగ్గిన ధరలు.. పెద్ద సైజు టీవీల ధరలు ఎవరూ ఊహించనంతగా గడిచిన అయిదేళ్లలో భారీగా తగ్గాయి. 2017లో 55 అంగుళాల టీవీ ధర సుమారు రూ.1,00,000 ఉండేది. ఇప్పుడు రూ.30 వేల లోపు నుంచే లభిస్తున్నాయి. పాత బ్రాండ్లకుతోడు కొత్త బ్రాండ్ల రాకతో పోటీ తీవ్రమైంది. ధర, ఫీచర్లతో ఇవి తమ వాటాను క్రమంగా పెంచుకుంటున్నాయి. శామ్సంగ్, ఎల్జీ, సోనీ, ప్యానాసోనిక్‌తోపాటు షావొమీ, వ్యూ టెక్నాలజీస్, క్రోమా, వన్ ప్లస్, థామ్సన్, తోషిబా, కొడాక్, థామ్సన్, ఏసర్, టీసీఎల్, లాయిడ్, సాన్సూయి, అమెజాన్ బేసిక్స్, హ్యుండై, హైసెన్స్, కాంప్యాక్, అకాయ్, ఒనిడా వంటి బ్రాండ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. రెండింతలైన బ్రాండ్స్.. గత 5–7 ఏళ్లలో 40, ఆపైన అంగుళాల టీవీల విభాగంలో బ్రాండ్ల సంఖ్య రెండింతలైంది. ప్రస్తుతం 70 దాకా బ్రాండ్లు మార్కెట్లో ఉన్నాయని క్రిసిల్ రిసర్చ్ డైరెక్టర్ పూషన్ శర్మ తెలిపారు. ‘43 అంగుళాల సైజులో అధిక ఉత్పత్తి సామర్థ్యం ఉంది. పశ్చిమ దేశాలు 2018 సంవత్సరానికి ముందే పెద్ద సైజుకు మళ్లాయి. తలసరి ఆదాయం 2018లో 10.9 శాతం, 2019లో 9.3 శాతం అధికం అయింది. తలసరి ఆదాయం పెరగడం వల్ల ఆర్థిక స్థోమత కూడా మెరుగుపడింది. మరోవైపు టీవీల ధరలు తగ్గాయి. ఈ ట్రెండ్ దీర్ఘకాలికంగా కొనసాగుతుందని అంచనా. ఇంటర్నెట్ వ్యాప్తి జోరు మీద ఉంది. ఇది ఓటీటీ వినోద వినియోగం పెరుగుదలకు దారి తీస్తోంది. వీక్షకులు పెద్ద టీవీ స్క్రీన్లలో ఓటీటీని ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతున్నారు’ అని వివరించారు. చదవండి: భారత్ ఆ ట్రెండ్‌ని మార్చింది.. ఆగస్ట్‌లో రూ. 8,000 కోట్ల పెట్టుబడులు! -
టీవీలో సందడి చేసేందుకు రెడీ అయిన ‘ఆర్ఆర్ఆర్’, ఎప్పుడంటే!
జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ మల్టీస్టారర్‌గా జక్కన్న రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ ఏడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, యాక్టింగ్.. ఇలా అన్ని కోణాల్లో తిరుగులేదు అనిపించింది ఈ మూవీ. థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది. చదవండి: ‘మై సూపర్ ఫ్యాన్స్..’ అంటూ మహేశ్ ఎమోషనల్ పోస్ట్ ఈ సినిమా రిలీజ్ అయిన నాలుగు నెలల గడుస్తున్నా ఇప్పటికీ ఓటీటీలో సత్తా చాటుతోంది. అంతేకాదు ఈ మూవీ మళ్లీ జపాన్‌లో సైతం రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ టీవీలో సందడి చేయబోతోంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 14న ఈ మూవీ టీవీలో ప్రసారం కానుంది. ఈ రాబోయే ఆదివారం ప్రముఖ తెలుగు చానల్ స్టార్ మాలోకి ప్రసారం కానుంది. ఇక అదే రోజు రాత్రి 8 గంటలకు హిందీ వర్షన్ జీ సినిమాలోకి రానుంది. RRR...COMING SOON... #RRROnStarMaa @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @mmkeeravaani@ajaydevgn @aliaa08 @OliviaMorris891 @RRRMovie pic.twitter.com/u4vEOmQCRE — starmaa (@StarMaa) August 3, 2022 Naacho-Naacho ke dhun par ab jhum uthega poora Hindustan! Manaiye Azaadi ke 75 Saal, Apne Poore Parivar ke Saath aur dekhiye #RRR, Sunday, 14th August at 8 PM, on #ZeeCinema.#RRROnZeeCinema #RRROnZeeCinemaOn14thAugust #TVParPehliBaar @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan pic.twitter.com/tCIY5fA900 — ZeeCinema (@zeecinema) August 9, 2022 -
టీవీలు,గృహోపకరణాలపై శాంసంగ్ మరో కీలక నిర్ణయం!
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే ఫీచర్ ఫోన్లు, గెలాక్సీ ఎఫ్ఈ స్మార్ట్ ఫోన్ల తయారీ నిలిపివేసింది. అయితే తాజాగా టీవీలు, హోం అప్లయన్సెస్‌ల తయారీని తగ్గిస్తున్నట్లు తేలింది. వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ఆధారంగా..జాతీయ అంతర్జాతీయ పరిణామాలు, తగ్గుతున్న కన్జ్యూమర్ డిమాండ్లతో పాటు ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కారణంగా ఆయా ప్రొడక్ట్‌ల అమ్మకాలు తగ్గినట్లు తెలుస్తోంది. అందుకే ప్రొడక్షన్ తగ్గించి, ఉన్న వాటిని అమ్మేందుకు సిద్ధమైంది. After phones, #SouthKorean tech giant #Samsung (@Samsung ) is now reportedly reducing the production of its #TVs and home appliances. pic.twitter.com/xAgpIDiRgx — IANS (@ians_india) June 26, 2022 సాధారణంగా ఏదైనా సంస్థ మార్కెట్లో అమ్మే వస్తువు వారం లేదా రెండు వారాల్లో అమ్ముడు పోతుంది. కానీ ఈ ఏడాది క్యూ2లో నెలలు గడుస్తున్నా శాంసంగ్‌కు చెందిన వస్తువులు అమ్ముడు పోవడం లేదని, గతేడాది ఇదే క్యూ2లో ఏ వస్తువైనా అలా అమ్మకానికి పెట్టిన రెండు వారాల్లో అమ్ముడు పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రొడక్ట్‌ల ధరలు ఎక్కువగా ఉండడం, ఆర్ధిక మాధ్యం, ఇతర కారణాల వల్ల కొనుగోలు దారులు ప్రొడక్ట్‌లపై ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసేందుకు ఇష్టపడడం లేదు. దీంతో తయారు చేసిన ప్రొడక్ట్‌లు అమ్ముడు పోక మిగిలిపోతున్నాయి. వాటిని సేల్ చేసేందుకు తయారీలో శాంసంగ్ పరిమితి విధిస్తూ నిర్ణయించుకున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. -
ఇండియన్ మీడియా ఎంటర్టైన్మెంట్కి ఇంతటి సత్తా ఉందా?
రాబోయే నాలుగేళ్లలో ఇండియన్ మీడియా, ఎంటర్టైన్మెంట్ పరిశ్రమ గణనీయమైన పురోగతి సాధించబోతుందంటూ ఇంటర్నేషనల్ కన్సల్టింగ్ ఫర్మ్ పీడబ్ల్యూసీ సంస్థ తెలిపింది. రాబోయే నాలుగేళ్లలో ఇండియన్ మీడియా, ఎంటర్టైన్ విభాగం 8.8 శాతం సమ్మిళిత అభివృద్ధి (సీఏజీఆర్) సాధిస్తుందని అంచనా వేసింది. దీంతో మీడియా, ఎంటర్టైన్ పరిశ్రమర విలువ ఏకంగా రూ. 4.30 లక్షల కోట్లకు చేరుకుంటుందని పీడబ్ల్యూసీ తన నివేదికలో పేర్కొంది. పీడబ్ల్యూసీ నివేదికలో ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి. - దేశీయంగా టీవీ, ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో రెవెన్యూ ప్రస్తుత విలువ రూ.3.14 లక్షల కోట్లుగా ఉంది. - 2026 నాటికి టీవీ అడ్వెర్టైజింగ్ విభాగం విలువ రూ.43,000 కోట్లకు చేరుకోవచ్చని అంచనా. దీంతో టీవీ అడ్వెర్టైజ్మెంట్లో ప్రపంచంలో ఐదో స్థానానికి ఇండియా చేరుకుంటుంది. ఇండియా కంటే ముందు వరుసలో అమెరికా, జపాన్, చైనా, యూకేలు ఉండనున్నాయి. - రాబోయే నాలుగేళ్లలో ఓటీటీ వీడియో స్ట్రీమింగ్ మార్కెట్ విలువ రూ.21,031 కోట్లుగా ఉండబోతుంది. ఇందులో చందాల ద్వారా రూ.19,973 కోట్ల రెవెన్యూ రానుండగా వీడియో ఆన్ డిమాండ్ ద్వారా రూ.1058 కోట్లు రానుంది. - రాబోయే రోజుల్లో కూడా ఓటీటీలకు ప్రధాన ఆదాయం చందాల ద్వారానే తప్పితే వీడియో ఆన్ డిమాండ్ ద్వారా అంతగా పెరగకపోవచ్చని పీడబ్ల్యూసీ అంచనా వేస్తోంది. 5జీ సర్వీసులు అందుబాటులోకి వస్తే ఓటీటీ సేవలు మరింత వేగంగా విస్తరించవచ్చు. - ప్రస్తుతం రూ.35,270 కోట్లు ఉన్న టీవీ అడ్వెర్‌టైజ్ విభాగం మార్కెట్ విలువ 2026 నాటికి రూ.43,568 కోట్లు కానుంది. - ఇంటర్నెట్ యాడ్ మార్కెట్ 12 శాతం వృద్ధితో 2026 నాటికి రూ.28,234 కోట్లకు చేరుకునే అవకాశం. ఇంటర్నెట్ అడ్వెర్టైజింగ్ మార్కెట్లో 69 శాతం మొబైల్ ఫోన్ల ద్వారానే జరగనుంది. ప్రస్తుతం మొబైల్ ఫోన్ల వాటా 60 శాతంగా ఉంది. - మ్యూజిక్, రేడియో, పోడ్కాస్ట్ విభాగం మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.7,216 కోట్లు ఉండగా నాలుగేళ్ల తర్వాత ఇది రూ.11,356 కోట్లకు చేరుకోవచ్చు. - వీడియో గేమ్ మార్కెట్ త్వరలో పైకి దూసుకుపోనుందని సీడబ్ల్యూసీ నివేదిక స్పష్టం చేస్తోంది. రాబోయే నాలుగేళ్లలో ఈ విభాగంలో రూ. 37,535 కోట్లుగా ఉండవచ్చని అంచనా. టర్కీ, పాకిస్తాన్ తర్వాత వీడియోగేమ్ మార్కెట్ ఇండియాలో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. - ఇక ఇండియన్ సినిమా మార్కెట్ ప్రస్తుత రెవెన్యూ 2026 నాటికి రూ. 16,198 కోట్లు కానుంది. ఇందులో బాక్సాఫీసు ద్వారా రూ. 15,849 కోట్ల రాబడి ఉండగా మిగిలిన రూ.349 కోట్లు యాడ్స్ ద్వారా రానుంది. - న్యూస్‌పేపర్ రెవెన్యూ రాబోయే నాలుగేళ్లలో 2.7 శాతం వృద్ధితో రూ.26,278 కోట్ల నుంచి రూ.29,945 కోట్లను టచ్ చేయనుంది. న్యూస్‌పేపర్ రెవెన్యూలో ఇండియా వరల్డ్‌లో ఐదో ర్యాంకులో ఉంది. చదవండి: ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో మజాక్ చేస్తే ఇట్లనే ఉంటది -
దేశీయ మార్కెట్లో టీవీ విడుదల, ధర రూ.75లక్షలా!
సౌత్ కొరియా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అత్యంత ఖరీదైన టీవీని ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. త్వరలో దేశ వ్యాప్తంగా ఉన్న ఎల్జీ ఔట్లెట్లలో ఈ టీవీని అందుబాటులోకి ఉంచనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ముంబై క్రోమా స్టోర్‌లో ఎల్జీ సంస్థ ఎల్ఈడీ టీవీ పేరుతో టీవీని విడుదల చేసింది. ఈ టీవీ ధర ఎంతో తెలుసా అక్షరాల రూ.75లక్షలు. ఈ సందర్భంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా డైరెక్టర్ హ్యాక్ హ్యయిన్ కిమ్ మాట్లాడుతూ.. వీక్షకులకు సరికొత్త యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు ఈ సరికొత్త టీవీని మార్కెట్లోకి విడుదల చేసినట్లు వెల్లడించారు. టీవీ స్పెసిఫికేషన్లు టీవీ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే 65అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ డిస్ప్లే, సెల్ఫ్ లైట్నింగ్ ఫిక్సెల్ టెక్నాలజీ, ఎల్జీ ఏ9 జనరేషన్ ఏఐ ప్రాసెసర్, డొల్బే అట్మాస్ స్పాటల్ సౌండ్ తో పాటు ఆకట్టుకునేలా గేమింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. -
అదిరిపోయే ఆఫర్లతో రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డేస్!
Reliance Digital Discount Days Sale, ముంబై: రిలయన్స్ డిజిటల్ ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు ‘‘డిజిటల్ డిస్కౌంట్ డేస్ సేల్’’ పేరుతో ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కొనుగోళ్లపై బెస్ట్ డీల్స్‌తో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులపై 7.5% వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. అదనంగా రూ.రెండు వేల విలువైన కూపన్స్ ఇస్తారు. రూ.80 వేల కంటే ఎక్కువ కొంటే రూ.10 వేల వరకు అదనపు డిస్కౌంట్ ఇస్తారు. టీవీలు, స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌ట్యాప్స్, టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, స్మార్ట్ వాచీలు, కిచెన్ పరికరాలపై ఆకర్షణీయమైన డీల్స్ ఉన్నాయి. ఈఎంఐ పద్ధతిలోనూ ఉత్పత్తులను సొంతం చేసుకోవచ్చు. సరికొత్త శామ్సంగ్గెలాక్సీ ఎస్22+ గ్రీన్ కలర్ వేరియంట్ ప్రత్యేకంగా రిలయన్స్ డిజిటల్లో మాత్రమే లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 84,999గా ఉంది. ఈ ఆఫర్ కింద ఐఫోన్ 13 సరసమైన ధర(ప్రారంభ ధర రూ.61,900)కే సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్‌లు, డిస్కౌంట్లు రిలయన్స్ డిజిటల్, జియో సోర్ట్స్లతో పాటు www. reliancedigital. in లేదా www. jiomart. com వెబ్సైట్లలో అందుబాటులో ఉంటాయి. -
తల పట్టుకున్న పుతిన్.. రష్యాలో ఇలా జరిగిందేంటి.. వీడియో వైరల్
మాస్కో: ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న సమయంలో పుతిన్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వార్ కారణంగా పుతిన్‌కు స్వదేశంలో మరోసారి నిరసన తగిలింది. రష్యాకు చెందిన TV Rain టీవీ చానల్ సిబ్బంది లైవ్‌లో మూకుమ్మడి రాజీనామాలు చేసి ఆశ్చర్యానికి గురి చేశారు. వివరాల ప్రకారం.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను వ్యతిరేకిస్తూ ఆ దేశానికి చెందిన టీవీ రెయిన్ చానల్ సిబ్బంది రాజీనామా చేశారు. ఓ వైపు లైవ్‌లో న్యూస్ రన్ అవుతుండగానే వారంతా రాజీనామా చేయడం సంచలనంగా మారింది. చానల్ సిబ్బంది చివరగా యుద్ధం వద్దు అనే ప్రకటనతో టీవీ ప్రసారాలు చేసి రాజీనామాలు అందించారు. వారి నిర్ణయాన్ని సంస్థ యాజమాన్యం సైతం మద్దతు ఇవ్వడం విశేషం. ఇదిలా ఉండగా అంతకు ముందు ‘టీవీ రెయిన్’ చానల్ ఉక్రెయిన్ యుద్ధాన్ని కవర్ చేసింది. దీంతో రష్యా ప్రభుత్వం యుద్ధాన్ని ప్రసారం చేసేందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలో ఆ చానల్ ప్రసారాలను రష్యా ప్రభుత్వం నిలిపివేసింది. మరోవైపు.. ఛానెల్ ఫౌండర్స్‌లో ఒకరైన నటాలియా సిందెయెవా మాట్లాడుతూ.. యుద్ధం వద్దు అనే ప్రోగ్రాం తర్వాత ఉద్యోగులు రాజీనామాలు ఇచ్చి స్టూడియో నుంచి వెళ్లిపోయారని అన్నారు. అనంతరం తమ చానల్ ప్రసారాలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నారు. Meanwhile TVRain, the last independent media outlet operating in Russia, has shut down — here's the last few minutes of its broadcast, poorly Google Translated. It then cut to Swan Lake, which has particular relevance: https://t.co/XXtUHroZkt pic.twitter.com/Iq7HSal7FW — Timothy Burke (@bubbaprog) March 3, 2022 -
గమ్మత్తైన టీవి.. చూస్తే నోరూరుతుంది.. నాకితే రుచి తెలుస్తుంది.. ఎక్కడో తెలుసా!
కొంతమందికి కొన్ని ఆహార పదార్థాలను తలచుకోగానే నోరు ఊరుతుంది. కళ్లముందు కనపడితే.. అసలు ఆగలేరు. ఇలాంటి వారినే ఊరిస్తూ ఉంటాయి.. టీవీలో కనిపించే కొన్ని ఆహారపదార్థాలకు సంబంధించిన ప్రకటనలు, ఫుడ్ షోలు. ఆ ఆహార పదార్థాలను ఎంచక్కా రుచి చూడొచ్చు కాణి ఖర్చు లేకుండా. నిజం.. జపాన్‌లో టీటీటీవీ అంటే ‘టేస్ట్ ద టీవీ’ పేరుతో ఒక డివైజ్‌ను రూపొందించారు. ఇందులోని ప్రొటోటైప్ తెరకు ప్రత్యేకమైన సెటప్ ద్వారా కొన్ని టేస్టీ ట్యూబ్‌లను అమర్చారు. దీంతో తెరపై కనిపించే ఆహార పదార్థాలను నాకి, రుచి చూడొచ్చు. అంతేకాదు మీకు నచ్చిన ఫ్లేవర్స్నూ కోరి మరీ టేస్ట్ చేయొచ్చు. ఉదాహరణకు చాక్లెట్ ఫ్లేవర్ అని చెబితే.. వెంటనే, తెర మీద ఉన్న ఫ్లాస్టిక్ షీట్‌పై ఆ ఫ్లేవర్ బొమ్మ వచ్చి పడుతుంది. చక్కగా ఆ చాక్లెట్‌ను చప్పరించొచ్చు. ప్రస్తుతం జపాన్‌కు చెందిన ప్రసిద్ధమైన పది వంటకాల రుచులను మాత్రమే తెలియజేస్తుందీ టీవీ. త్వరలోనే మరింత అ‹ప్డేట్ అయ్యి అన్ని రుచులనూ ఆస్వాదించేలా ఆ టీవీని రూపొందిస్తామని చెప్తోంది సదరు టీవీ కంపెనీ యాజమాన్యం. -
మోదీతో టీవీలో చర్చలు జరపడం ఇష్టం: ఇమ్రాన్ ఖాన్
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో టీవీలో డిబేట్ చేయడానికి ఇష్టపడతాననని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాస్కో పర్యటన సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. చర్చల ద్వారా విభేదాలను పరిష్కరించగలిగితే అది భారత ఉపఖండంలోని బిలియన్లకుపైగా ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. అంతేకాదు ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీతో టెలివిజన్‌లో చర్చలు జరపాలనుకుంటున్నట్లు ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. పైగా భారతదేశంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వాణిజ్యం తగ్గిపోయిందని తెలిపారు. అన్ని దేశాలతో వాణిజ్య సంబంధాలను కలిగి ఉండటమే తన ప్రభుత్వ విధానం స్పష్టం చేశారు. అయితే ఈ విషయమై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నోరు మెదపలేదన్నారు. పలు కారణాలతో పాకిస్తాన్ ప్రాంతీయ వాణిజ్య ఎంపికలు ఇప్పటికే పరిమితంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్‌లో ప్రస్తుత సంక్షోభానికి ముందు ఆర్థిక సహకారంపై చర్చల కోసం ఇమ్రాన్‌ఖాన్.. రెండు రోజుల మాస్కో పర్యటన చేయనున్నారు. ఈ మేరకు ఉక్రెయిన్ సంక్షోభం గురించి ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. ‘ఇది మా పరిధిలోని విషయం కాదు. మాకు రష్యాతో ద్వైపాక్షిక సంబంధం ఉంది. మేము దానిని బలోపేతం చేయాలని భావిస్తున్నాం’ అని అన్నారు. మరోవైపు భారత్ మాత్రం ఉగ్రవాద రహిత వాతావరణంలో మాత్రమే పాక్‌తో చర్చలు జరుగుతాయని స్పష్టం చేసింది. చర్చలు జరిగే ముందు ఉగ్రవాదంపై అణిచివేతకు సంబంధించిన ఆధారాలు చూపించాలని కూడా పాక్‌ను ఇండియా కోరింది. అంతేకాదు భారతదేశం పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని కూడా అంతం చేయాలని డిమాండ్ చేస్తోంది. (చదవండి: ఇది కుట్రలో భాగమేనా?.. అనుమానాస్పదంగా చైనా చర్యలు) -
ఏంటీ! రూ.75వేల టీవీని రూ.25వేలకే సొంతం చేసుకోవచ్చా!!
Flipkart Big Bachat Dhamaal Sale: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.75వేల విలువైన టీవీని రూ.25లకే అందిస్తున్నట్లు ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ ఫ్రిబ్రవరి 3నుంచి ఫిబ్రవరి 5వరకు బిగ్ బచత్ ధమాల్ పేరుతో సేల్ నిర్వహిస్తుంది. ఈ సేల్‌లో పలు టీవీలపై అదిరిపోయే ఆఫర్లకే టీవీలను అందిస్తున్నట్లు అధికారికంగా తెలిపింది. ఈ సేల్ లో 'వీయూ' కంపెనీకి చెందిన 55 అంగుళాల స్మార్ టీవీ ఇప్పుడు రూ.25 వేలకే అందుబాటులోకి తెచ్చింది. 55 అంగుళాల స్మార్ట్ టీవీ అల్ట్రా హెచ్డీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ రూ.75 వేలు ఉండగా.. ఈ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో 49శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధులు తెలిపారు. దీంతో ఈ టీవీ ధర రూ.37,999 ఉండగా.. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో అదనంగా 5 శాతం క్యాష్ బ్యాక్‌తో మరో రూ.1,900 తగ్గుతుంది. ఫలితంగా ఈ స్మార్ట్ టీవీ ధర రూ.36,099గా ఉంటుంది. అంతేకాదు ఈ హెచ్డీ ఎల్ఈడీ టీవీని ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.11,000 వరకు ఆదా చేసుకోవచ్చు. తద్వారా కొనుగోలు దారులు ఈ స్మార్ట్ టీవీ రూ.36,099 నుంచి రూ.25,099కే సొంతం చేసుకోవచ్చు. వీయూ స్మార్ట్ టీవీ ఫీచర్లు డిస్ ప్లే - ఆల్ట్రా హెచ్ డీ, ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ రిజల్యూషన్ - 3,840 x 2,160 పిక్సెల్స్ అప్ గ్రేడ్ రేట్ - 60 హెచ్‌జెడ్ సౌండ్ స్పీకర్స్ - 30 డబ్ల్యూ సౌండ్ అవుట్‌పుట్‌తో రెండు స్పీకర్లు. వీటితో పాటు ఈ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీలో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్, డిస్నీ + హాట్ స్టార్ ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి. -
వెరైటీ టీవీ.. చూడడమే కాదు ఏకంగా నాకేయొచ్చు
Japan Licking TV Screen With Food Flavours: ‘జపానోడు అక్కడ ఏదేదో కనిపెడుతుంటే’.. అంటూ ఓ అరవ డబ్బింగ్ సినిమాలో ఫన్నీ డైలాగ్ ఉంటుంది. అయితే అడ్వాన్స్ టెక్నాలజీని పుణికిపుచ్చుకున్న దేశంగా జపాన్.. క్వాలిటీ ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా ఉంటోంది. ఈ తరుణంలో జపాన్ నుంచి వచ్చిన ఓ తాజా ఆవిష్కరణపై సరదా చర్చ మొదలైంది. ‘టేస్ట్ ద టీవీ’ TTTV పేరుతో ఒక డివైజ్‌ను రూపొందించాడు ఓ జపాన్ ప్రొఫెసర్. ప్రొటోటైప్ టీవీ తెరను డెవలప్ చేసి దీనిని తయారు చేశాడు. ఇందులో తెర మీద రకరకాల రుచులను చూసే వీలు ఉంటుంది. ప్రత్యేకమైన సెటప్ ద్వారా టేస్టీ ట్యూబ్‌లను అమర్చి ఉంటుంది. చూడడానికి ఇది పది ఫ్లేవర్ల రంగులరాట్నం మాదిరి ఉంటుంది. మల్టీపుల్ సెన్సార్‌తో పని చేసేలా రూపొందించాడు ఆ ప్రొఫెసర్. వాయిస్ కమాండ్ తీసుకోగానే(ఏ ఫ్లేవర్ కావాలో.. ఉదాహరణకు చాక్లెట్ ఫ్లేవర్ అని చెప్పాలి).. అప్పుడు తెర మీద ఉన్న ప్లాస్టిక్ షీట్‌పై ఆ ఫ్లేవర్ వచ్చి పడుతుంది. అప్పుడు ఎంచక్కా నాకి రుచిచూసేయొచ్చు. ప్రొఫెసర్ హోమెయి మియాషిటా.. మెయిజి యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఇది తయారు చేయడానికి మియాషిటా ఆధ్వర్యంలోని 30 మంది విద్యార్థుల బృందం కష్టపడింది. ‘‘కరోనా టైంలో జనాలు బయటకు వెళ్లలేని పరిస్థితి కదా. అందుకే రెస్టారెంట్, వాళ్లకు నచ్చిన రుచి అనుభవం ఇంట్లోనే అందించేందుకు ఇలా ఫుడ్ ఫ్లేవర్లను అందించే డివైజ్‌ను రూపొందించాం’’ అని ప్రొఫెసర్ హోమెయి మియాషిటా చెప్తున్నారు. Taste the TV కమర్షియల్ వెర్షన్‌ను 875 డాలర్లకు అందించబోతున్నారు. వీటితో పాటు టేస్టింగ్ గేమ్స్, క్విజ్‌లను కూడా రూపొందించబోతున్నారు. పిజ్జా, చాక్లెట్ రుచిని అందించే స్ప్రేను సైతం తయారు చేయనుంది ఈ టీం. ఎక్స్‌క్యూజ్‌మీ.. కొంచెం మీ ముఖాన్ని అద్దెకిస్తారా? -
ఎల్జీ సరికొత్త ఆవిష్కరణ.. ఇక కరెంట్ లేకున్నా 3 గంటలు టీవీ చూడొచ్చు..!
అరె.. టీవీ అక్కడెక్కడో మూలన కాకుండా నా సోఫా పక్కనే ఉంటే బాగుండేది. ఎంచక్కా పడుకొని సినిమా చూసేవాడిని. అయ్యయ్యో.. వంట పూర్తయ్యేసరికి సీరియల్ కూడా అయిపోయేలా ఉందే. కిచెన్లోకే టీవీని లాక్కొచ్చుకుంటే బావుండు. అటు సీరియల్ చూస్తూ ఇటు వంట చేసుకునేదాన్ని.. అని ఇక అనుకోనక్కర్లేదు. ఎందుకంటే అచ్చం ఇలాంటి ఫీచర్లతోనే అద్భుతమైన టీవీని ఎల్జీ కంపెనీ తీసుకొస్తోంది. వచ్చే జనవరిలోనే లాంచ్ చేయబోతోంది. పేరు ‘స్టాన్ బై మీ’. టీవీ పరిమాణం 27 అంగుళాలు. రిమోట్, టచ్‌తో పాటు మన సంజ్ఞలతో కూడా ఆపరేట్ చేయొచ్చు. బ్యాటరీతో నడిచే టీవీ ఇది. అయితే ఓ సినిమా చూశాక మళ్లీ చార్జ్ చేయాల్సి ఉంటుంది. మున్ముందు బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుతారేమో చూడాలి. టీవీలానే కాకుండా మన మానసిక స్థితి(మూడ్)ని మార్చే వాల్పేపర్లు, ఫొటోలు, రంగులను కూడా టీవీలో సెట్ చేసుకోవచ్చు. టీవీకి పెద్దగా వైర్లు అవసరం ఉండదు. ఇంతకీ టీవీ ధరెంతో చెప్పలేదు కదా. ఎల్జీ వాళ్లు కూడా ఇంకా ప్రకటించ లేదు. లాక్కెళ్లొచ్చు.. తిప్పుకోవచ్చు టీవీలకు ఎల్జీ పెట్టింది పేరు. మనం ఇంతవరకు చూడని రకరకాల ఫీచర్లతో, అనేక రకాల మోడళ్లతో మనల్ని ఆశ్చర్యపరిచింది. గ్లాస్‌లా పారదర్శకంగా ఉండే టీవీల దగ్గర్నుంచి 325 అంగుళాల అతి పెద్ద టీవీ వరకు చిత్ర విచిత్రమైనవి అందుబాటులోకి తెచ్చి ‘వారెవ్వా’ అనిపించుకుంది. ‘అప్పుడే అయిపోలేదు’.. అంటూ ఇప్పుడు ‘స్టాన్బై మీ’ టీవీని తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. పేరుకు తగ్గట్టే ఇంట్లో మనం ఎక్కడుంటే అక్కడికి టీవీని తీసుకెళ్లొచ్చు. టీవీతో పాటు వచ్చే స్టాండ్ కింద ఇందుకోసం చక్రాలుంటాయి. డ్రైవర్ స్టీరింగ్‌ను తిప్పినట్టు ఎలా కావాలంటే అలా టీవీని తిప్పుకోవచ్చు. మనకు నచ్చిన ఎత్తులో, నచ్చిన యాంగిల్లో సినిమాలు, సీరియళ్లు, ప్రోగ్రామ్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లు రకరకరాల పనులు చేసుకోవచ్చు. (చదవండి: గుడ్‌న్యూస్! హైదరాబాద్‌కి పెట్ కేర్.. వరంగల్‌కి ఐటీ కంపెనీ..) -
యూట్యూబ్‌ను దున్నేస్తున్నారు, రోజూ 1,500 కోట్ల షార్ట్ వీడియోస్
న్యూఢిల్లీ: టీవీల్లోనూ యూట్యూబ్ వీక్షణం పెరుగుతోంది. మే నెలలో 20 కోట్లకు పైగా కుటుంబాలు టీవీ తెరపై యూట్యూబ్‌ను వీక్షించాయని కంపెనీ తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇది 45 శాతం పెరుగుదల అని వివరించింది. ‘హిందీ, తెలుగు, తమిళం వంటి దేశీయ భాషల కంటెంట్‌ను ఆస్వాదించే వారి సంఖ్య అధికం అవుతోంది. యూట్యూబ్ వీక్షకుల్లో వీరి వాటా 93 శాతం. యూట్యూబ్‌ను చూసేందుకు మొబైల్ ఫోన్ నుంచి టీవీల వైపు మళ్లుతున్నారు. క్రితంతో పోలిస్తే కోవిడ్–19 సమయంలో యూట్యూబ్‌ను అధికంగా ఆస్వాదిస్తున్నట్టు 85 శాతం మంది వీక్షకులు తెలిపారు. వీడియోల ద్వారా తాము ఆసక్తి ఉన్న విభాగాల్లో నైపుణ్యం పెంచుకున్నట్టు 85 శాతం మంది చెప్పారు. మే నెలలో కెరీర్ సంబంధ వీడియోల వీక్షణ సమయం 60 శాతం పెరిగింది. వ్యవసాయం, ఆర్థిక, ఆహారం, ఇంజనీరింగ్ వంటి విభాగాలు కొత్తగా వృద్ధి చెందుతున్నాయి. సాంకేతికత, సౌందర్యం, హాస్యం వంటి విభాగాల్లో స్థానిక భాషల కంటెంట్ అధికం అవుతోంది. 140 చానెళ్లకు ఒక కోటికిపైగా, 4,000లకుపైగా చానెళ్లకు 10 లక్షలకుపైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. షార్ట్స్ ప్లేయర్లో ప్రపంచవ్యాప్తంగా రోజూ 1,500 కోట్ల షార్ట్ వీడియోస్ వ్యూస్ నమోదవుతున్నాయి’ అని యూట్యూబ్ తెలిపింది. చదవండి : యూట్యూబ్‌తో లక్షలు సంపాదిస్తున్న కేంద్రమంత్రి! -
టీవీ మీద పడి చిన్నారి మృతి.. బర్త్‌డేకు తెచ్చిన గౌను వేసి..
సాక్షి, కృష్ణా(నందిగామ): మరో వారంలో మొదటి పుట్టిన రోజు జరుపుకోవాల్సిన చిన్నారిని ఇంట్లోని టీవీయే యమపాశమై కబళించింది. మండల పరిధిలోని కంచల గ్రామంలో శనివారం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, సౌందర్య దంపతులకు ఇద్దరు కూతుర్లు. వీరిలో చిన్న కుమార్తె చలమల కీర్తి (11 నెలలు) ఇంట్లో ఆడుకుంటూ టీవీ స్టాండ్‌ను తాకడంతో టీవీ చిన్నారిపై పడింది. దీంతో పాప తీవ్రంగా గాయపడింది. ఆ సమయంలో బయట ఇంటి పనులు చేసుకుంటున్న తల్లి సౌందర్య లోపలికి వచ్చి బంధువుల సాయంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసింది. అయితే ఇంతలోనే చిన్నారి తుది శ్వాస విడిచింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కీర్తి మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పుట్టిన రోజు వేడుక కోసమని ఆన్లైన్లో కొనుగోలు చేసిన గౌనునే.. ఆ చిన్నారికి ధరింపజేసి అంతిమ సంస్కారాన్ని నిర్వహించడం అందరినీ కంటతడి పెట్టించింది. చదవండి: బెజవాడలో గోల్డ్ మాఫియా! -
అదిరిపోయే టీవీ, ఇంట్లో ఉన్న అన్నీ డివైజ్‌లకు కనెక్ట్ చేయొచ్చు
న్యూఢిల్లీ: గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ దిగ్గజం హయర్ తాజాగా ఎస్8 ఆండ్రాయిడ్ టీవీల శ్రేణిలో కొత్తగా మరో రెండు టీవీలను ఆవిష్కరించింది. వీటిలో 55 అంగుళాల టీవీ రేటు రూ. 1,10,990గాను, 65 అంగుళాల టీవీ ధర రూ. 1,39,990గాను ఉంటుంది. 4కే హెచ్డీఆర్ పిక్చర్ నాణ్యత, ఆల్–స్క్రీన్ డిస్ప్లే, ఫ్రంట్ స్పీకర్ డిజైన్ తదితర ఫీచర్లు వీటిలో ఉంటాయి. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 9.0 వెర్షన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలైన ప్రత్యేకతలతో ఇది ఇంట్లోని అన్ని స్మార్ట్ డివైజ్‌లకు ఐవోటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) హబ్‌గా కూడా ఉపయోగపడుతుందని హయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా తెలిపారు. -
జనాలు ఈ 'టీవీ' బ్రాండ్‌నే ఎక్కువ ఇష్టపడుతున్నారు
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ఇష్టపడే టీవీ బ్రాండ్‌గా 2021 సంవత్సరానికిగాను ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఎల్జీ నిలిచింది. ట్రస్ట్ రీసెర్చ్ అడ్వైజరీ ఈ మేరకు జాబితా విడుదల చేసింది. 2019తోపాటు 2020 సంవత్సరంలో అత్యంత నమ్మకమైన టీవీ బ్రాండ్‌గా కంపెనీ అవార్డు దక్కించుకుంది. వరుసగా మూడు సంవత్సరాలపాటు ఉన్నత గౌరవాన్ని పొందడం భారతీయ మార్కెట్ పట్ల సంస్థకు ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా హోం ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ హక్ హ్యున్ కిమ్ తెలిపారు. -
ఫ్రిజ్, టీవీ, ఐపాడ్, మాస్క్: ఆటోనా.. హైటెక్ హోటలా?
చెన్నై: మనలో అందరికి చాలా ఆశలు, కోరికలుంటాయి. కానీ కొందరు మాత్రమే తన వాటిని తమ కలలను సాకారం చేసుకుంటారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. సరే వాటిని అధిగమించి.. తాము అనుకున్నది సాధిస్తారు. సాధించాలనే సంకల్పం, గట్టి పట్టుడదల ఉంటే చాలు.. మిగతా సమస్యలన్ని దూది పింజల్లా తేలిపోతాయి. ఈ మాటలకు ఆకారం వస్తే.. అతడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆటోవాలా అన్నా దురైలా ఉంటాడు. పారిశ్రామికవేత్త కావాలనేది అన్నాదురై చిన్ననాటి కోరిక. కానీ దానికి తగ్గ డబ్బు, చదువు అతడి వద్ద లేదు. అయితే ఇవేవి అతడిని అడ్డుకోలేకపోయాయి. తన దగ్గరున్న ఆటోనే ఓ పరిశ్రమలా భావించాడు. దానిలో ఎక్కే కస్టమర్లను ఆకర్షించడం కోసం అతడు ఎంచుకున్న మార్గం.. ఇప్పుడతన్ని ప్రత్యేకంగా, వార్తల్లో నిలిచే వ్యక్తిగా మార్చింది. అన్నాదురైకి సంబంధించిన కథనాన్ని హ్యూమన్స్ ఆఫ్ బాంబే తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. తమిళనాడు, చెన్నైకి చెందిన అన్నాదురై ఆర్థిక ఇబ్బందులు వల్ల పెద్దగా చదువుకోలేదు. కానీ పారిశ్రామికవేత్త కావాలనేది అతడి కోరిక. అయితే కుటుంబ పరిస్థితులు దృష్ట్యా ఆటో నడపాల్సిన పరిస్థితులు తలెత్తాయి. కానీ పారిశ్రామికవేత్త కావాలనే అతడి కోరిక మాత్రం తనని నిద్రపోనివ్వలేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా అతడికి తట్టిన ఓ వినూత్న ఐడియా అన్నాదురై జీవితాన్ని మార్చేసింది. తాను నడుపుతున్న ఆటోనే ఓ పరిశ్రమలా భావించాడు అన్నాదురై. ఇక తన ఆటోలోకి ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించాలంటే ఏం చేయాలా అని బాగా ఆలోచించాడు. ప్రస్తుతం కోవిడ్ విజృంభిస్తుంది. కనుక జనాలు ఆటోల్లో తిరగాలంటే భద్రత ముఖ్యం.. ఆ తర్వాత ప్రయాణికులు తమ గమ్యస్థానం చేరేవరకు వారికి ఎంటర్టైన్మెంట్ కల్పించడం ముఖ్యం అనుకున్నాడు. ఈ మేరకు ఓ ప్రణాళిక రచించాడు అన్నాదురై. దాని ప్రకారం తన ఆటోలో మాస్క్, శానిటైజర్ ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ఓ ఐపాడ్, టీవీ, చిన్న ఫ్రిజ్ ఏర్పాటు చేశాడు. ఆటో ఎక్కిన వారికి అందులో ఉన్న సౌకర్యాలు చూస్తే నిజంగానే మతి పోతుంది. తాము ఆటో ఎక్కామా లేక.. ఏదైనా స్టార్ హోటల్లో ఉన్నామా అనే అనుమానం కలగక మానదు. ఈ వినూత్న ఆలోచనే అతడి జీవితాన్ని మార్చేసింది. ఇక అన్నాదురై 9 భాషల్లో తన కస్టమర్లను పలకరిస్తాడు. వారితో ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తాడు. ఇన్ని హైటెక్ హంగులతోపాటు.. కస్టమర్లను దైవంగా భావిస్తున్న అన్నాదురై ఆటో అంటే ఆ ప్రాంతంలో స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. ఒక్కసారి అతడి ఆటో ఎక్కిన వారు.. మళ్లీ మళ్లీ దానిలోనే ప్రయాణం చేయాలని కోరుకుంటారు. హ్యూమన్స్ ఆఫ్ బాంబేలో జూల్ 15న పోస్ట్ చేసిన అన్నాదురై స్టోరీ ఎందరినో ఆకట్టుకుంటుంది. ఇప్పటికే 1.3 మిలియన్ల కన్నా ఎక్కువ మంది దీన్ని వీక్షించారు. అన్నాదురై వినూత్న ఆలోచనపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
టీవీ కోసం అక్కతో గొడవ.. క్షణికావేశంలో దారుణం
తిరువనంతపురం: టీవీ చూడడం కోసం అక్కతో గొడవపడిన చెల్లి క్షణికావేశంలో ఇంట్లోని కిటీకీ గ్రిల్స్‌కు ఉరి వేసుకొని చనిపోయింది. ఈ ఘటన కేరళలోని ఇడుక్కి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఇడుక్కికి చెందిన 11 ఏళ్ల మైనర్ బాలిక తన అక్క, కజిన్‌తో కలిసి టీవీ చూస్తుంది. తనకు నచ్చిన చానెల్ పెట్టుకుంటానంటూ అక్క దగ్గర్నుంచి రిమోట్ లాక్కొని చానెల్ మార్చింది. దీంతో బాలిక అక్క ఆమె దగ్గర్నుంచి రిమోట్ లాక్కుని మేము పెట్టిందే చూడాలంటూ పేర్కొంది. దీంతో అక్కతో గొడవపడిన చెల్లి బెడ్రూంకి వెళ్లి డోర్ లాక్ చేసుకొని కిటికీ గ్రిల్స్‌కు తాడు కట్టి ఉరి వేసుకుంది. గదిలోకి వెళ్లిన బాలిక ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో అనుమానమొచ్చిన ఆమె నానమ్మ బయటికి వెళ్లి చూసింది. అప్పటికే ఆమె కిటికీ గ్రిల్స్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే గది తలుపులు బద్దలు కొట్టి సదరు బాలికను కిందకు దింపి పరిశీలించగా.. అప్పటికే చనిపోయి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. -
భారీగా పెరిగిన వన్‌ప్లస్ టీవీ ధరలు...!
ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీదారు వన్‌ప్లస్ తన యూజర్లకు భారీ షాక్‌నిచ్చింది. భారత మార్కెట్లో టీవీలకు ఉన్న గిరాకీని కంపెనీ క్యాష్ చేసుకోవడం కోసం టీవీల మార్కెట్లోకి దిగిన విషయం తెలిసిందే. తాజాగా వన్‌ప్లస్ తీసుకున్న నిర్ణయంతో కొనుగోలుదారుల జేబులకు చిల్లుపడనుంది. వన్‌ప్లస్ తన టీవీ ధరలను గణనీయంగా పెంచింది. సుమారు వన్‌ప్లస్ టీవీ శ్రేణిల్లో ఆరు మోడళ్ల కొత్త ధరలను ప్రకటించింది. ఈ పెరిగిన ధరలు ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్లలో అందుబాటులో ఉండనున్నాయి. వన్ ప్లస్ టీవీ 32ఇంచ్వై1మోడల్‌ను 2 వేలు పెంచి రూ.18,999లుగా, టీవీ40వై1మోడల్‌ను రూ.2,500 పెంచి రూ.26,499లుగా, టీవీ43వై1 మోడల్‌ను రూ.2500 పెంచి కొత్త ధరను రూ.29,499లుగా, టీవీ 50యూ1ఎస్ మోడల్‌ను ఏకంగా రూ. 7000 పెంచి కొత్త ధర 46,999గా. టీవీ 55యూ1ఎస్ మోడల్‌ను రూ. 5000 పెంచి కొత్త ధరను రూ.52,999లుగా, టీవీ 65యూ1ఎస్ మోడల్‌ను రూ.6000 పెంచిన కొత్త ధరను రూ.68,999లుగా నిర్ణయించింది. -
సోనూసూద్‌పై ప్రేమతో టీవీ పగలగొట్టిన బుడ్డోడు.. నటుడి స్పందన
-
సోనూసూద్‌పై ప్రేమతో టీవీ పగలగొట్టిన బుడ్డోడు.. నటుడి స్పందన
సాక్షి, న్యాల్కల్(జహీరాబాద్): తన అభిమాన హీరో సోనూసూద్‌ను సినిమాలో కొట్టడాన్ని జీర్ణించుకోలేని ఓ బుడతడు టీవీని పగుల గొట్టిన సంఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. న్యాల్కల్లోని ఎస్సీ కాలనీకి చెందిన పుష్పలతకు సూర్యపేట జిల్లా హుజూర్నగర్ మండలం వేపల సింగారం గ్రామానికి చెందిన సీహెచ్ ప్రణయ్‌కుమార్‌తో ఎనమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారి కుమారుడు విరాట్ హుజూర్‌నగర్‌లోని శ్రీచైత్య స్కూల్లో 3వ తరగతి చదువుతున్నాడు. కరోనా కారణంగా పాఠశాలలు మూత పడడంతో ఇటీవల న్యాల్కల్కు వచ్చాడు. సోమవారం రాత్రి ఇంట్లో మరదలు అద్విన్‌తో కలిసి టీవీలో దూకుడు సినిమా చూస్తున్నాడు. ఈ క్రమంలో హీరో మహేశ్‌బాబుకు విలన్ సోనూసూద్ మధ్య ఫైటింగ్ సీన్ జరుగుతుంది. సోనూసూద్‌ను కొట్టడాన్ని చూసిన బుడతడు విరాట్‌కు కోపం వచ్చింది. కరోనా టైంలో ఎంతో మందిని ఆదుకున్న సోనూసూద్ అంకుల్ని కొడతావా అంటూ బయటకు వెళ్లి ఓ రాయిని తెచ్చి టీవీపై కోపంతో కొట్టాడు. దీంతో టీవీ పగిలిపోయింది. పక్కనే సినిమా చూస్తున్న మరదలు అద్విన్ టీవీని పగుల గొడతావా? ఇంకో టీవీ తీసుకరా అంటూ ఏడవ సాగింది. గమనించిన కుటుంబ సభ్యులు టీవీని ఎందుకు పగుల గొట్టావురా అంటూ విరాట్‌ను నిలదీశారు. అందరికీ సాయం చేస్తున్న సోనూసూద్ అంకుల్‌ను వేరే వాళ్లు కొడుతుంటే కోపం వచ్చి రాయితో కొట్టాను అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. ఈ విషయం కాస్తా అందరికి తెలియడంతో వైరల్‌గా మారింది. విరాట్ టీవీ పగలగొట్టిన ఘటన చివరికి సోనూసూద్‌ను చేరడంతో ట్విటర్లో స్పందించాడు. ‘అరేయ్.. మీ టీవీ పగలగొట్టకు.. మళ్లీ మీ నాన్న నన్ను కొత్త టీవీ కొనాలని అడుగుతాడు’ అంటూ ట్వీట్ చేశాడు. -
లీకైన రియల్ మీ 4కే స్మార్ట్ టీవీ ధరలు
రియల్ మీ స్మార్ట్ టీవీ 4కే స్పెసిఫికేషన్లు, ధర మే 31 విడుదలకు ముందే లీక్ అయ్యాయి. కంపెనీ మే 31న రెండు మోడళ్లను 43-అంగుళాల, 50-అంగుళాల స్మార్ట్ టీవీ లాంచ్ చేయనున్నట్లు కొద్దీ రోజుల క్రితం ప్రకటించింది. లీకైన స్పెసిఫికేషన్ల ప్రకారం, రియల్ మీ స్మార్ట్ టీవీ 4కే మోడల్స్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్ చేత, ఆండ్రాయిడ్ 10 సహాయంతో పనిచేయనున్నాయి. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ వి 5, డ్యూయల్-బ్యాండ్ వై-ఫైలను కలిగి ఉంటాయి. రెండు మోడళ్లు 178-డిగ్రీల కోణాల్లో 4కే రిజల్యూషన్‌ను చూడవచ్చు అని సమాచారం. టిప్‌స్టర్ డెబాయన్ రాయ్ పంచుకున్న వివరాల ప్రకారం.. 43 అంగుళాల మోడల్ ధర రూ.28,000 - 30,000 ఉంటే, 50 అంగుళాల మోడల్ ధర రూ.33,000 నుంచి రూ.35,000 ఉండే అవకాశం ఉంది. దీనిలో క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్ చేత, ఆండ్రాయిడ్ టీవీ 10 సహాయంతో నడవనుంది. ఇందులో డాల్బీ విజన్ టెక్నాలజీ సపోర్ట్ కూడా ఉంది. డాల్బీ అట్మోస్, డీటీఎస్ హెచ్డీ సపోర్ట్ తో 24వాట్ క్వాడ్ స్టీరియో స్పీకర్ సిస్టమ్ ద్వారా ఆడియోను వినవచ్చు. కనెక్టివిటీ కోసం, ఈ టీవీలో మూడు హెచ్డిఎంఐ పోర్ట్‌లు, రెండు యుఎస్బి పోర్ట్‌లు, ఎవి అవుట్ పోర్ట్, ఈథర్నెట్ పోర్ట్, ట్యూనర్ పోర్ట్‌తో రావచ్చు. ఇందులో డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ వి 5 కూడా ఉంటాయి. చదవండి: నెలకు రూ.890 కడితే శామ్సంగ్ ఫ్రిజ్ మీ సొంతం! -
టౌటే ఎఫెక్ట్; మూగబోయిన టీవీలు.. నిలిచిపోయిన ఇంటర్నెట్
ముంబై (మహారాష్ట్ర): టౌటే తుఫాన్ ప్రభావంతో సోమవారం అనేక చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో ముంబైలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాటిని విద్యుత్ అధికారులు మరమ్మతులు చేసి పునరుద్ధరిస్తున్నప్పటికీ, ఆ స్తంభాలు, చెట్ల మీదుగా వెళ్లే కేబుల్ టీవీ, ఇంటర్నెట్ కేబుల్ వైర్లు తెగిపోవడంతో మంగళవారం ఉదయం నుంచి అనేక ఇళ్లల్లో టీవీలు, ఇంటర్నెట్ కనెక్షన్లు పనిచేయడం లేదు. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఇంటి నుంచి పనిచేసే (వర్క్ ఫ్రం హోమ్) ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నీటి పైపులు, విద్యుత్ కేబుళ్లు, డ్రైనేజీ లైన్లు భూగర్భంలో నుంచే ఉన్నాయి. అయితే, వాణిజ్య, వ్యాపార సంస్థలకు, కార్యాలయాలకు, నివాస భవనాలకు, చాల్స్, మురికివాడలకు కొన్ని ప్రైవేటు సంస్థలు ఇంటర్నెట్ సేవలు, టీవీ కేబుల్ కనెక్షన్లు ఇస్తున్నాయి. వీటికి సంబంధించిన కేబుల్ వైర్లు భూగర్భంలో నుంచి లేవు. చెట్ల కొమ్మల మీదుగా లేదా విద్యుత్ స్తంభాల మీదుగా, ఎత్తయిన భవనాల టెరెస్ల పైనుంచి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వైర్లు వేసి, ఇంటింటికి కేబుల్ టీవీ, ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి టౌటే తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షం, గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులతో అనేక చోట్ల చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. దీంతో చెట్లు, విద్యుత్ స్తంభాల మీదుగా వెళ్లిన టీవీ కేబుల్ వైర్లు, ఇంటర్నెట్ కేబుళ్లు తెగిపోయాయి. అక్కడక్కడా అమర్చిన రిలే బాక్స్‌లలోకి వర్షపు నీరు వెళ్లడంతో షార్ట్ సర్క్యుట్ అయ్యి కాలిపోయాయి. ఫలితంగా మంగళవారం ఉదయం నుంచి అనేక ఇళ్లలో టీవీలు మూగబోయాయి. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో ఉద్యోగులు, వ్యాపారులు ఖాళీగానే కూర్చున్నారు. ఇదిలావుండగా కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం విధించిన ఆంక్షలతో గత నెల రోజులుగా అనేక మంది ఇళ్లకే పరిమితమయ్యారు. టీవీ చూడటం లేదా మొబైల్ ఫోన్లతో కాలక్షేపం చేయడం తప్ప వారికి మరో ప్రత్యామ్నాయం లేదు. సోమవారం రాత్రి నుంచి కేబుల్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో ఏం చేయాలో తెలియక వారు గందరగోళంలో పడిపోయారు. లాక్డౌన్ కాబట్టి బయటకు వెళితేనేమో పోలీసుల లాఠీ దెబ్బలు, చివాట్లు తప్పవు. కేబుల్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో చిన్న పిల్లలు, విద్యార్థులు, యువతీ యువకులు, గృహిణులు రోజంతా ఇంట్లో కాలక్షేపం ఎలా చేయాలని ప్రశ్నించుకుంటున్నారు. గత్యంతరం లేక కేబుల్ ఆపరేటర్లకు ఫోన్లు చేస్తున్నారు. ఇలా తరచూ వందల ఫోన్లు వస్తుండటంతో కేబుల్ ఆపరేటర్లు విసుగెత్తిపోతున్నారు. మరోపక్క లాక్డౌన్ ఆంక్షలతో విద్యుత్ సామగ్రి విక్రయించే షాపులన్నీ మూసి ఉంటున్నాయి. దీంతో కేబుల్ వైర్లు, విద్యుత్ పరికరాలు, రిలే బాక్స్‌లు దొరకడం లేదు. పైగా, టీవీ కేబుల్ సేవలు ప్రారంభించాలని కస్టమర్ల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. దీంతో కేబుల్ ఆపరేటర్లు తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసి పెడుతున్నారు. కేబుల్, ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావాలంటే ఎంత సమయం పడుతుందనేది ఇప్పుడే చెప్పలే మని ఆపరేటర్లు వాపోతున్నారు. -
ఇండియాలో ఎన్ని ఇళ్లలో టీవీలు ఉన్నాయో తెలుసా?
ముంబై: ఇండియాలో టీవీ వీక్షకుల సంఖ్య ప్రతిఏటా గణనీయంగా పెరుగుతోంది. 2020 ఆఖరు నాటికి టీవీ ఉన్న ఇళ్ల సంఖ్య 6 శాతం పెరిగిందని బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రేటింగ్ కౌన్సిల్(బార్క్) గురువారం వెల్లడించింది. దేశంలో 21 కోట్ల ఇళ్లల్లో టీవీలు ఉన్నాయని పేర్కొంది. 2018 సంవత్సరాంతానికి 19.7 కోట్ల గృహాల్లో టీవీలు ఉండేవి. టీవీ సెట్ కలిగి ఉన్న మహిళల సంఖ్య 7 శాతం పెరిగింది, పురుషులు 6 శాతం పెరిగారు. 2018లో దేశంలో టీవీ చూసే వారి సంఖ్య 83.6 కోట్లు కాగా, 2020 నాటికి 89.2 కోట్లకు ఎగబాకింది. ఇండియా జనాభా దాదాపు 130 కోట్లు కాగా, దేశంలో 30 కోట్ల గృహాలు ఉన్నాయని బార్క్ ప్రకటించింది. గత ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో జనం ఇళ్లల్లోనే ఉండిపోవాల్సి వచ్చిందని, అందుకే టీవీ వీక్షణం పెరిగిందని తెలియజేసింది. దేశంలో ఇంకా 9 కోట్ల గృహాల్లో టీవీలు లేవని వెల్లడించింది. దేశంలో జనాభా పెరుగుతుండడంతో ప్రసార, వినోద రంగంలో వృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయని బార్క్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ లుల్లా చెప్పారు. నగర, పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే టీవీ వీక్షకులు పెరుగుతుండడం గమనార్హం. ఇక్కడ చదవండి: ఇది విన్నారా.. శారీరక శ్రమ లేని వారిపై కరోనా ప్రభావం ఎక్కువ అతిపొడవైన వెంట్రుకలను కత్తిరించుకున్న టీనేజర్.. ఎందుకంటే? -
షూటింగ్స్ బంద్
ఇప్పటికే కరోనా కోరల్లో చిక్కుకుని పలువురు హిందీ స్టార్స్ క్వారంటైన్ లో టైమ్ గడుపుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇటీవలే థియేటర్స్‌లో సినిమాల ప్రదర్శన నిలిచిపోయింది. దీంతో రిలీజ్‌కు దగ్గరైన సినిమాలు వాయిదా పడ్డాయి. తాజాగా సినిమా, టీవీ షూటింగ్స్‌ను కూడా నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ‘బ్రేక్ ది చైన్ ’ పేరుతో ఏప్రిల్ 14 సాయంత్రం నుంచి మే 1 ఉదయం వరకు లాక్డౌన్ విధించించి, కొత్త మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం వెల్లడించింది. దీంతో కోవిడ్ జాగ్రత్తల నడుమ జరుగుతున్న కొద్ది సినిమాల షూటింగ్స్ కూడా నిలిచిపోనున్నాయి. షారుక్ ఖాన్ ‘పఠాన్ ’, సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’, అమితాబ్‌బచ్చన్ – రష్మికల ‘గుడ్ బై’ , కార్తీక్ ఆర్యన్ ‘భూల్ భులయ్యా 2’ చిత్రాలతో పాటు ముంబయ్‌లో జరుగుతున్న ఇతర సినిమాల షూటింగ్స్‌కి కూడా బ్రేక్ పడింది. ‘‘మేం అన్ని రూల్స్ పాటిస్తున్నాం. అయినా షూటింగ్స్ కారణంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుందని అనుకోవడం లేదు. త్వరలో ప్రభుత్వాన్ని కలిసి షూటింగ్స్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా విన్నవించుకుంటాం’’ అని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ అధ్యక్షుడు బీఎన్ తివారీ పేర్కొన్నారు. -
టీవీలన్నింటిల్లో ఇది స్పెషల్ టీవీ.. కింద నుంచి పైకి
ఇప్పటివరకూ చాలా టీవీలను చూసుంటారు.. మరి ఇలాంటిది.. అబ్బే చాన్సే లేదు.. ఫొటోలు చూస్తున్నారుగా.. అలా బటన్ నొక్కగానే.. అండర్‌గ్రౌండ్‌లో నుంచి స్తంభంలాంటిది పైకి వస్తుంది.. నెమ్మదిగా అది ఐదు 4కే మైక్రో ఎల్ఈడీ ప్యానళ్లుగా విడిపోతుంది. చివరికి 165 అంగుళాల భారీ టీవీ మీ హాల్లో ఠీవిగా ప్రత్యక్షమవుతుంది. ఆస్ట్రియాకు చెందిన సీ సీడ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ తయారుచేసిన ఈ టీవీ పేరు ఎం1. ఇది ప్రపంచంలోనే తొలి 165 అంగుళాల ఫోల్డబుల్ టీవీ. హాల్లో అలా ఫ్లోర్‌లోంచి టీవీ పైకి రావడం వంటివి చూసి.. మీ ఇంటికి వచ్చినోళ్లు నోరెళ్లబెట్టడం ఖాయమని ‘సీ సీడ్’ కంపెనీ చెబుతోంది. పైగా.. ప్రస్తుత ఓఎల్‌ఈడీలతో పోలిస్తే.. ఈ మైక్రో ఎల్ఈడీల్లో క్లారిటీ అదిరిపోవడం ఖాయమంటోంది. ఇంతకీ రేటెంతో చెప్పలేదు.. రూ.2.91 కోట్లే!!.. టీవీ కొనకముందే.. నోరెళ్లబెట్టేశారా.. ఇది జస్ట్ టీవీ రేటే.. ఆ అండర్‌గ్రౌండ్ సెట్టింగ్.. వాటన్నిటికీ అయ్యే ఇన్స్టలేషన్ చార్జీలు అదనంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది చివర్లో డెలివరీలు మొదలుపెడతామని కంపెనీ చెబుతోంది.. ఓసారి ట్రై చేస్తారా ఏమిటి?? -
మెగా బూస్ట్: చెన్నైలో అమెజాన్
సాక్షి, న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా ఫైర్ టీవీ స్టిక్స్ సహా తమ డివైజ్‌లను చెన్నైలో తయారు చేయనుంది. ఇందుకోసం ఫాక్స్‌కాన్ అనుబంధ సంస్థ క్లౌడ్ నెట్వర్క్ టెక్నాలజీతో జట్టు కట్టనుంది. మేకిన్ ఇండియాకు మెగా బూస్టింగ్‌గా భారతదేశంలో టెలివిజన్ స్ట్రీమింగ్ పరికరాల తయారీని ప్రారంభిస్తోంది. ఆత్మనిర్భర్ పథకంలో భాగంగా అమెజాన్ త్వరలో భారతదేశంలో ఫైర్‌టివి స్టిక్ వంటి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీని ప్రారంభిస్తుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం వెల్లడించారు. ‘భారత్‌లో ఇది తొలి తయారీ కేంద్రం అవుతుంది. స్వావలంబన దిశగా భారత ప్రభుత్వ మేకిన్ ఇండియా నినాదానికి మేం కట్టుబడి ఉన్నామనడానికి ఇది నిదర్శనం. భారత్‌లోని కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా డివైజ్ తయారీ ప్రోగ్రాం కింద ఏటా పెద్ద ఎత్తున ఫైర్ టీవీ స్టిక్ డివైజ్‌లు (వీడియో స్ట్రీమింగ్కి ఉపయోగపడేవి) తయారు చేస్తాం‘ అని అమెజాన్ ఒక బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించింది. మేకిన్ ఇండియా పట్ల తమ నిబద్ధతను ఇది సూచిస్తుందని, ఉద్యోగాల కల్పనకు, నూతన ఆవిష్కరణలను పెంచుతుందని అమెజాన్ ఇండియా కంట్రీ హెడ్ అమిత్ అగర్వాల్ తెలిపారు. అయితే, ప్లాంటు తయారీ సామర్థ్యం, ప్రాజెక్టుపై ఎంత ఇన్వెస్ట్ చేయనున్నదీ మాత్రం వెల్లడించలేదు. Held a very good conversation with @AmitAgarwal and @Chetankrishna of @amazonIN today. Delighted to share that soon Amazon will commence manufacturing of electronics products like FireTV stick in India. pic.twitter.com/BRpnUG6fA5 — Ravi Shankar Prasad (@rsprasad) February 16, 2021 -
టీవీ, ఫ్రిజ్ ఉంటే రేషన్‌కార్డు కట్!
సాక్షి, బెంగళూరు : రేషన్ కార్డుల పంపిణిపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సొంతగా టీవీ, ఫ్రిజ్, ద్విచక్ర వాహనం ఉంటే రేషన్ కార్డును నిరాకరించాలని నిర్ణయించింది. బీపీఎల్ కార్డుల మంజూరు విషయంలో ఇకపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించదని ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖమంత్రి ఉమేష్ కత్తి స్పష్టం చేశారు. సోమవారం బెళగావిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఉన్నత వర్గాలకు చెందిన వారు కూడా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే రేషన్ సరుకులను ఉపయోగించుకున్నారని, దీని ద్వారా వెనుకబడిన వారికి సరుకులు చేరడంలేదని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకునే ఉద్ధేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ సరఫరా చేస్తోందని, ఇకపై సరైన అర్హుల జాబితాను రూపొందిస్తామని స్పష్టం చేశారు. 1.20 లక్షల వార్షిక ఆదాయం కంటే ఎక్కువ ఉన్నవారు ఉచిత రేషన్‌కు అనర్హులన్నారు. అలాగే టీవీ, ఫ్రిజ్, ద్విచక్ర వాహనం ఉంటే రేషన్ కార్డును వెంటనే వదులుకోవాలన్నారు. మార్చి 31 వరకు కార్డును వెనక్కి ఇచ్చేయాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉమేష్ కత్తి హెచ్చరించారు. ప్రభుత్వ ప్రతిపాదనపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టీవీ, ఫ్రిజ్ అనేవి నేడు నిత్యవసర వస్తుల జాబితాలో చేరిపోయాయని, వాటి కారణం చేత కార్డులను తొలగించడం సరైనది కాదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. చదవండి: మాంగల్య బలం గట్టిదే.. హుండీలోకి చేరబోయేది! అందుకే అర్ధగంట ట్రాఫిక్ ఆపేశారు! -
టీవీ ఆఫ్ చేయనన్నాడని తండ్రిని..
లక్నో : టీవీ ఆఫ్ చేయమంటే ఆఫ్ చేయలేదన్న కోపంతో తండ్రిని కాల్చి చంపాడో మాజీ ఆర్మీ ఉద్యోగి. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మాజీ ఆర్మీ ఉద్యోగి అశోక్ కథిహార్ కుటుంబంతో కలిసి నసీర్‌పుర్‌లో నివాసం ఉంటున్నాడు. గురువారం రాత్రి అతడి తండ్రి లాలా రామ్ టీవీ చూస్తున్నాడు. అర్థరాత్రి దాటినా టీవీ చూస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో టీవీ ఆఫ్ చేయాల్సిందిగా అశోక్ తండ్రిని అడిగాడు. తండ్రి అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్యా గొడవ మొదలైంది. ( గుప్త నిధుల కోసం తండ్రి ఘాతుకం ) తీవ్ర ఆగ్రహానికి గురైన అశోక్ లైసెన్స్ కలిగిన డబుల్ బ్యారెల్ గన్‌తో తండ్రిని కాల్చి చంపాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న అశోక్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. కాగా, అశోక్ బాగా తాగేవాడని, చీటికీ మాటికి ఇంట్లో వారితో గొడవ పడే వాడని కుటుంబసభ్యులు తెలిపారు. ( నంద్యాల కుటుంబం ఆత్మహత్య కేసులో ట్విస్ట్ ) -
సరిగ్గా వందేళ్ల క్రితం నవంబర్ 2న రాత్రి..
‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల అభ్యర్థి వారెన్ హార్డింగ్, డెమోక్రాట్ల అభ్యర్థి జేమ్స్ కోక్స్పై అఖండ విజయం సాధించారు’ అనే వార్త అమెరికా రేడియోలో మారు మ్రోగిపోయింది. అధ్యక్ష అభ్యర్థుల పేర్లు మారిపోయాయంటూ ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. సరిగ్గా వందేళ్ల క్రితం 1920, నవంబర్ 2వ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు అమెరికాలోని తొలి వాణిజ్య బ్రాడ్ క్యాస్టింగ్ రేడియో స్టేషన్ ‘పిట్స్బర్గ్స్ కేడీకేఏ’ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రకటించింది. ఆ ఫలితాలతోనే తొట్ట తొలి రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. (చదవండి : అమెరికా అధ్యక్ష ఫలితాలపై ఎందుకు ఆసక్తి?) హైస్కూల్ చదువు కూడా పూర్తి చేయని ‘ఫ్రాంక్ కొనార్డ్’ అనే వ్యక్తి రేడియో సాంకేతిక పరిజ్ఞానంలో అనేక పేటెంట్లు సాధించారు. ఆయనే ఆ రోజున తన గ్యారేజీలో ఏర్పాటు చేసిన రేడియో స్టేషన్ ప్రసారాలను బటన్ తిప్పడం ద్వారా ప్రారంభించారు. ‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒహాయో నుంచి వెలువడుతున్న మారియన్ స్టార్ ఎడిటర్, పబ్లిషర్ వారెన్ హార్డింగ్ అఖండ విజయం సాధించారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అనుసరించిన విధానాల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడిపోయింది. ఆ పర్యవసానంగానే డెమోక్రాట్ల అభ్యర్థి ఓడిపోవాల్సి వచ్చింది’ అంటూ ఫ్రాంక్ కొనార్డే వార్తను విశ్లేషించారు. ఆయన టెలిఫోన్ అమెరికా ఎన్నికల ఫలితాలను ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు తెప్పించుకున్నారు. (చదవండి : ‘ముందస్తు ఓటింగ్’తో నష్టమా, లాభమా?!) నాటి ఫలితాలను నవంబర్ రెండో తేదీ రాత్రి కొంత మంది శ్రోతలే తెలుసుకోగలిగారు. మిగతా అమెరికన్లు మరుసటి రోజు ఉదయం పత్రికలు వచ్చే వరకు ఫలితాల కోసం నిరీక్షించాల్సి వచ్చింది. ప్రముఖ వ్యాపార వేత్త జార్జి వెస్టింగౌజ్ పెట్టుబడులతో ఫ్రాంక్ కొనార్డ్ సాంకేతిక పరిజ్ఞానంతో అమెరికా తొలి లైసెన్స్ వాణిజ్య రేడియో కల నెరవేరింది. వాస్తవానికి 1890 దశకం నుంచి రేడియో సిగ్నల్స్‌పై ప్రయోగాలు మొదలయ్యాయి. దూర ప్రాంతానికి రేడియో సిగ్నల్స్ ప్రసారం చేసిన ఇంజనీర్ జీ. మార్కోనికి నోబెల్ బహుమతి లభించింది. 1910 కొంత మంది ఔత్యాహిక రేడియో ఆపరేటర్లు పరిమిత దూరం వరకు తమ గొంతును, సంగీతాన్ని ప్రసారం చేయగలిగారు. తొలితరంలో రాజకీయ నాయకులు ఎంతో ఉపయోగపడిన రేడియో మాధ్యమం, టీవీల రూపంలో, సోషల్ మీడియా రూపంలో మరెంతగానో అభివృద్ధి చెందింది. -
మీ ఇంట్లో పాత టీవీలు, రేడియోలు ఉన్నాయా?
సాక్షి, హైదరాబాద్: గుప్తనిధులు, లంకెబిందెలు, రైస్‌పుల్లింగ్.. రెండు తలల పాము అంటూ ప్రజలను మోసగించే ముఠాలు కొత్త దారుల్లో జనాన్ని పక్కదారి పట్టిస్తున్నాయి. తాజాగా పాత టీవీలు, రేడియోల్లోని వాల్వ్‌ల వెతుకులాటకు పరుగులు పెట్టేలా కొందరు సోషల్ మీడియాలో పోస్టులను వైరల్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ‘మీ ఇంట్లో పాత టీవీ, రేడియో ఉన్నాయా? అందులోని ఈ ఎర్రని వాల్వ్ తీసుకొస్తే మీకు రూ.కోటి ఇస్తాం..’అంటూ వాట్సాప్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. 25–30 ఏళ్లనాటి టీవీలు, రేడియోల్లోనే ఇది ఉంటుందని, ఆ వాల్వ్ తెచ్చిన వారికి రూ.లక్షలు, కోట్లలో నజరానా ఇస్తామంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, వరంగల్, సిద్దిపేట జిల్లాల్లో దీని గురించి సామాన్యులు బాగా చర్చించుకుంటున్నారు. ఈ ప్రచారం మొదలైనప్పటి నుంచి టీవీ మెకానిక్ షాపుల వారికి వీటికోసం వెతికే వారి తాకిడి పెరిగింది. పాత టీవీలు ఉన్నా యా? ఎంత రేటైనా సరే.. పెట్టి కొంటామం టూ చాలామంది వస్తున్నారు. దీంతో కొందరు టీవీ మెకానిక్‌లు సైతం వీటి ఆన్వేషణలో పడ్డారు. చాలా మంది అటకెక్కించిన టీవీలను కిందికి దించి చూస్తున్నారు. నిధులను గుర్తిస్తుందంటూ.. టీవీ, రేడియోల్లోని బోర్డుల్లో ఒకప్పుడు ఉపయోగించే ఎర్రటి వాల్వ్‌కు లోహాలను గుర్తించే సామర్థ్యం ఉందని చెబుతున్నారు. సరిగ్గా ఈ అంశాన్నే మోసగాళ్ల ముఠా సొమ్ము చేసుకోవాలని చూస్తోంది. ఈ వాల్వ్ భూమిలో పూర్వీకులు దాచిన గుప్తనిధులు, బంగారాన్ని గుర్తిస్తుందని, ఇది ఉంటే శ్రీమంతులు కావొచ్చని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని నమ్మిన పలువురు ఒకరితో మరొకరు గొలుసుకట్టులా వాల్వ్‌లు సేకరించే పనిలో పడ్డారే తప్ప.. ఎవరు డబ్బులు ఇస్తారు? ఎంత ఇస్తారు? ఎలా ఇస్తారు? అన్న విషయంలో ఎవరికీ స్పష్టత లేదు. కొందరు అప్పులు చేసి మరీ అడిగినకాడికి చెల్లించి ఇలాంటి వాల్వ్‌లను సొంతం చేసుకుంటున్నా రు. తర్వాత వాటిని ఎలా విక్రయించాలి.. ఎవరికి విక్రయించాలి అన్న విషయం తెలియక తలలు పట్టుకుంటున్నారు. ప్రచారాలు నమ్మవద్దు.. ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దని, దీని వెనక భారీ మోసం దాగి ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా రైస్‌పుల్లింగ్ తరహా మోసమని స్పష్టం చేస్తున్నారు. వీటిని చూపి ఎవరు గుప్త నిధులు తవ్విస్తామని చెప్పినా నమ్మవద్దని సూచిస్తున్నారు. ఇలాంటివి ప్రచారం చేసే ముఠాలు నిధుల తవ్వకం పేరిట డబ్బులు దోచుకుంటాయని హెచ్చరిస్తున్నారు. -
ఎక్స్‌స్ట్రీమ్ బండిల్‌ను ప్రారంభించిన ఎయిర్టెల్
సాక్షి, హైదరాబాద్: వినోదాన్ని శాశ్వతంగా మార్చడానికి, ఎయిర్టెల్ తన కొత్త ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బండిల్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బండిల్ ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ శక్తిని 1 జిబిపిఎస్, అన్లిమిటెడ్ డేటా వరకు మిళితం చేస్తుంది, ఇది మొదటి రకమైన ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఆండ్రాయిడ్ 4కె టీవీ బాక్స్, అన్ని ఓటీటీ కంటెంట్లకు ప్రాప్యత. భారతదేశంలో వినోదం ఇకపై ఇంతకు ముందులా ఉండదు. అపరిమిత వినోదం అన్ని ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్లలో ఇప్పుడు రూ.3999 విలువైన ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ కలిగి ఉంది, అది అన్నిరకాల టీవీలని స్మార్ట్ టీవీగా చేస్తుంది. వినియోగదారులు అన్ని లైవ్ టీవీ ఛానెల్‌లకు చూడగలుగుతారు. ఉత్తమమైన వీడియో స్ట్రీమింగ్ అనువర్తనాలు ఇంట్లో బహుళ వినోద పరికరాల అవసరాన్ని సమర్థవంతంగా తొలగిస్తాయి. ఈ ఆండ్రాయిడ్ 9.0 శక్తితో కూడిన స్మార్ట్ బాక్స్ గూగుల్ అసిస్టెంట్ వాయిస్ సెర్చ్, ప్లేస్టోర్‌లోని వేలాది అనువర్తనాలకు ప్రాప్యత, ఆన్లైన్ గేమింగ్‌ను అందించే ఇంటెలిజెంట్ రిమోట్‌తో వస్తుంది. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఆండ్రాయిడ్ 4 కె టీవీ బాక్స్ ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ అనువర్తనం నుండి 550 టీవీ ఛానెల్స్, ఓటీటీ కంటెంట్‌ను అందిస్తుంది, ఇందులో 10,000కి పైగా చలనచిత్రాలు, ప్రదర్శనలు 7 ఓటీటీ అప్లికేషన్స్, 5 స్టూడియోలలో మొత్తం బ్రేక్ లేని అనుభవాణ్ని ఇస్తుంది. ఇంకా ఏమిటంటే, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ కట్ట డిస్నీ+హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 వంటి ప్రీమియర్ వీడియో స్ట్రీమింగ్ ఆప్‌లను కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను అందిస్తుంది, ఇవన్నీ ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ద్వారా అందుబాటులో ఉంటాయి. అమితమైన అపరిమిత డేటా అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అన్ని ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్లు ఇప్పుడు అన్లిమిటెడ్ డేటా అలవెన్సులతో వస్తాయి. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌పై అధిక-నాణ్యత గల డిజిటల్ కంటెంట్‌పై ఎక్కువ శ్రద్ధ వహిస్తూ, వినియోగదారులు ఇకపై తమ డేటా అలవెన్సుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భారతదేశంలో హోమ్ బ్రాడ్‌బ్యాండ్‌లోకి చొచ్చుకుపోవడానికి ఎయిర్టెల్ నేడు బ్రాడ్‌బ్యాండ్‌ను మరింత సరసమైనదిగా చేస్తోంది. ఎక్స్ స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్స్ ఇప్పుడు కేవలం రూ. 499లతో ప్రారంభమవుతాయి. ఎయిర్టెల్ నుండి నిరూపితమైన నెట్వర్క్ విశ్వసనీయత, నమ్మకం ఉన్నతమైన కస్టమర్ మద్దతుతో వస్తాయి. న్యూ ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బండిల్ భారతి ఎయిర్టెల్ హోమ్స్ డైరెక్టర్ సునీల్ తల్దార్ మాట్లాడుతూ..‘విద్య, పని లేదా వినోదం వంటి వినియోగదారులు ఆన్లైన్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. వినోదం అనేది ఒక ఉత్తేజకరమైన అవకాశాన్ని మనం చూసే స్థలం. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ భారతదేశం ప్రధాన వినోద వేదిక, ఇది అపరిమిత హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీతో పాటు ఉత్తమ వినోదాన్ని ఒకే పరిష్కారంగా తీసుకువస్తుంది. ఈ ఉత్తేజకరమైన ఆవిష్కరణ చొచ్చుకుపోవడానికి మేము ఈ రోజు మా ప్రణాళికలను వినియోగదారులకు మరింత అందుబాటులోకి తెస్తున్నాము’ అన్నారు. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బండిల్ 2020 సెప్టెంబర్ 7 నుండి వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఎయిర్టెల్ 2.5 మిలియన్ల కస్టమర్లతో భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్-రంగ బ్రాడ్‌బ్యాండ్ ప్లేయర్‌గా ఉన్న విషయం తెలిసిందే. -
డాక్టర్ సలహా నచ్చక బాలిక ఆత్మహత్య
సూరత్ : కరోనా వైరస్ పుణ్యమా అని ఇంటిలో చేసేదేం లేక చూస్తే టీవీ లేకుంటే.. స్మార్ట్ ఫోన్ వినియోగం అన్న చందంగా మారిపోయింది. ప్రధానంగా ఆన్లైన్ గేమ్స్ ఆడడం పిల్లలకు అలవాటుగా మారింది. స్మార్ట్ ఫోన్, టీవీని వదిలిపెట్టడం లేదు. వాడొద్దని పెద్దలు హెచ్చరిస్తే ఆత్మహత్యలకు సైతం తెగిస్తున్నారు. తాజాగా టీవీ, ఫోన్‌ను వాడొద్దని ఓ డాక్టర్ ఇచ్చిన సలహాతో మనస్తాపం చెంది 16 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో చోటు చేసుకుంది. (చదవండి : మహిళ దురాగతం : పిండిలో విషం కలిపి..) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కతర్గం ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక జాహ్నవి గత కొన్ని వారాలుగా తల నొప్పి, చాతీ నొప్పితో బాధపడుతోంది. ఇటీవల ఆమె తల్లిదండ్రులు జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్.. టీవీ, స్మార్ట్ ఫోన్‌ను ఎక్కువగా చూడడం వల్లే తలనొప్పి వస్తుందని, కొద్ది రోజులు వాటికి దూరంగా ఉండాలని సలహా ఇచ్చారు. దీంతో బాలిక తల్లిదండ్రులు ఆమెను టీవీ, ఫోన్‌కు దూరంగా పెట్టారు. డాక్టర్ సలహాతో మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. గత మంగళవారం సాయంత్రం దుస్తులు మార్చుకుంటానని నాన్నమ్మకి చెప్పి గదిలోకి వెళ్లిన జాహ్నవి.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయింది. సాయంత్రం మార్కెట్ నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు తలుపులు తెరచి చూడగా.. బాలిక ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. డాక్టర్ సలహా నచ్చకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. -
టీవీలో ప్రకటనలు చూస్తే నెలనెలా జీతం..!
సాక్షి, సిటీబ్యూరో: గుజరాత్‌లోని సూరత్ కేంద్రంగా పని చేసే ఓ సంస్థ కొత్త తరహా మోసానికి తెరలేపింది. తమ వద్ద డబ్బు చెల్లించి ఎల్ఈడీ టీవీ పొందాలని, అందులో వచ్చే యాడ్స్ చూస్తూ ఉంటే నెలనెలా తామే కనీస మొత్తం చెల్లిస్తూ ఉంటామని ఆన్లైన్లో ప్రచారం చేసుకుంది. దీన్ని చూసిన ముగ్గురు నగరవాసులు రూ.2.49 లక్షలు చెల్లించి మోసపోయారు. వీరి ఫిర్యాదు మేరకు శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సూరత్‌కు చెందిన డోర్ టైజర్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఆన్లైన్లో యాడ్స్ ఇచ్చింది. అందులో తమ వద్ద రూ.83 చెల్లిస్తే అత్యాధునికమైన ఎల్ఈడీ టీవీ పంపిస్తామని నమ్మబలికింది. అంతటితో ఆగకుండా తమ వద్ద సభ్యత్వం తీసుకున్న వారికి ప్రత్యేక యాప్ ద్వారా ఆ టీవీలో కొన్ని ప్రకటనలు చూపిస్తామంటూ చెప్పింది. వీటిని క్రమం తప్పకుండా చూస్తే ప్రతి నెలా కనిష్టంగా రూ.11,500 చొప్పున చెల్లిస్తామంటూ ఎర వేసింది. ఈ ప్రకటన చూసి ఆకర్షితులైన ముగ్గురు నగరవాసులు అందులోని నెంబర్లకు సంప్రదించారు. ఒక్కోక్కరు రూ.83 వేల చొప్పున రూ.2.49 లక్షలు చెల్లించారు. ఆ తర్వాత ఆ సంస్థ నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మరోపక్క ఈ యాడ్స్ యాడ్స్ ఓఎల్ఎక్స్లో, ఫేస్‌బుక్‌లోని మార్కెట్ ప్లేస్‌లో సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాల విక్రయం పేరుతో ఉన్న ప్రకటనలకు ఇద్దరు నగరవాసులు స్పందించారు. అందులో ఉన్న నెంబర్లకు సంబంధించిన వీరు బేరసారాలు పూర్తి చేశారు. ఆపై అడ్వాన్సుల పేరుతో రూ.40 వేలు, రూ.74 వేలు చెల్లించి మోసపోయారు. ఇంకో ఉదంతంలో నగరానికి చెందిన ఓ బ్యాంకు డిప్యూటీ మేనేజర్‌కు సైబర్ నేరగాళ్ళు ఫొన్ చేశారు. తాము ఓ ఫైనాన్స్ సంస్థ నుంచి మాట్లాడుతున్నామంటూ పరిచయం చేసుకున్నారు. తక్కువ వడ్డీకి భారీ మొత్తం రుణం అంటూ ఎర వేశారు. బాధితుడు అంగీకరించడంతో ఇతడి నుంచి కొన్ని పత్రాలు సైతం వాట్సాప్ చేయించుకున్నారు. చివరకు ప్రాసెసింగ్ ఫీజు సహా ఇతర పేర్లు చెప్పి రూ.40 వేలు కాజేశారు. -
అంతగా స్క్రీన్లకు అతుక్కుపోకండి!
సాక్షి, న్యూఢిల్లీ: లాక్డౌన్ సందర్భంగా దేశంలో ఎక్కువ మంది ప్రజలు టీవీలు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. లాక్డౌన్ సందర్భంగానే కాకుండా అంతకుముందు కూడా స్క్రీన్లకు అతుక్కుపోయే అలవాటు పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ఉంది. అధిక సమయం స్క్రీన్లకు అతుక్కుపోవడం వల్ల కళ్లు లాగడం, తలనొప్పి లేవడం, ఒళ్లు లావెక్కడం, నిద్రరాక పోవడం, హింసాత్మక దోరణులు ప్రబలడం, పలు రకాల మానసిక రుగ్మతలకు గురవడం జరుగుతుందని మొదటి నుంచి వైద్యులు హెచ్చరిస్తూనే ఉన్నారు. మూడు నెలల వయస్సు నుంచి ప్రపంచంలో 40 శాతం పిల్లలు టెలివిజన్, డీవీడీలు, ఇతర వీడియోలు తరచుగా చూస్తున్నారని, అమెరికాలో వీరి సంఖ్య 90 శాతానికి చేరుకుందని సర్వేలు తెలియజేస్తున్నాయి. అమెరికాలో ఎనిమిదేళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులైన పిల్లలు ప్రతి రోజు సరాసరి ఏడు గంటల 11 నిమిషాల సేపు పలు రకాల వినోద స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. బ్రిటన్‌లో పెద్ద వాళ్లు ప్రతి 12 నిమిషాలకోసారి తమ ఫోన్లను చెక్ చేస్తున్నారట. ముఖ్యంగా లాక్డౌన్ సందర్భంగా స్క్రీన్లకు దూరంగా ఉండేందుకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వారానికోరోజు: టీవీ, లాప్టాప్, ట్యాబ్లెట్లు ఆఫ్ చేయండి. స్మార్ట్ ఫోన్లను పక్కకు పెట్టండి. ఇంట్లో గార్డెనింగ్ పనులు చేయండి లేదా కుటుంబ సభ్యుల కోసం వంట చేసి పెట్టండి. వాకింగ్, జాగింగ్ లేదా ప్రావీణ్యం ఇతర క్రీడల్లో పాల్గొనండి, క్యారమ్స్, ఇతర హాబీలతో బిజీగా ఉండండి. ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా స్మార్ట్ ఫోన్‌ను జేబులో పెట్టుకోరాదు. అలా పెట్టుకున్నట్లయితే డైనింగ్ టేబుల్‌పైనా, టాయ్లెట్లో, పడకమీద పోస్టింగ్‌ల కోసం తరచూ స్క్రీన్‌ను చూస్తుంటాం. స్క్రీన్లకు ఎక్కువసేపు చూడడం వల్ల మెదడులో డొపమైన్ అనే హార్మోన్ ఎక్కువ విడుదలవుతుంది. అది అలవాటును బానిసగా మారుస్తుంది. డొపమైన్ ఎక్కువ విడదలయితే నిద్రరాదు. స్క్రీన్లకు దూరంగా ఉండడం వల్ల బోర్ కొడుతుంది. అది చాలా మంచిది బోర్ కొట్టినప్పుడు మనం సాధించాల్సిన లక్ష్యాల గురించి, వాటì కి అనుసరించాల్సిన మార్గాల గురించి ఆలోచిస్తాం. ఆ దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. (కరోనా వేళ : సినిమా చూసొద్దాం మామా..) వారానికి కొన్ని రోజుల్లో కొంత సమయాన్ని కుటుంబ సభ్యుల కోసమే కేటాయించండి. ఆ సమయాల్లో స్క్రీన్లకు దూరంగా వారితోనే గడపండి. మొదట ఇబ్బందిగానే ఉంటుంది. ఆ తర్వాత అలవాటు అవుతుంది. ఆ తర్వాత అందులోనుంచి వచ్చే అనుభూతి ఆనందాన్ని ఇస్తుంది. ప్రొఫెషన్లో భాగంగా ఇంటి వద్ద స్క్రీన్ మీద పని చేయాల్సి వచ్చినప్పుడు గంటకోసారి లేవండి. పది నిమిషాలు అలా ఇల్లు చుట్టి రండి. టీ చేసుకొని తాగండి, ఇంటి ప్రహారాలోపల ఖాళీ స్థలంలో ఉంటే లేదంటే మేడ మీద అడ్డదిడ్డంగా వేగంగా పరుగెత్తండి. తెలిసిన వ్యాయామాలు చేయండి. వొళ్లు విరుచుకోండి. స్క్రీన్‌పై చేయాల్సిన పని పూర్తయ్యాక కాసేపు అటు, ఇటు నడిచి వేళకు భోజనం చేసి, నిద్రవేళకు పడక ఎక్కండి. వినోదం కోసం రోజుకు రెండు గంటలకు మించి స్క్రీన్లకు అతుక్కుపోతే అది మెదడు మీద ప్రభావాన్ని చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకని ప్రతి ఒక్కరిని స్క్రీన్లకు అతుక్కుపోయే సమయాన్ని తగ్గించాలని వారు కోరుతున్నారు. -
వారికి స్మార్ట్‌ఫోన్, టీవీలు ఇస్తాను: రాహుల్ గాంధీ
తిరువనంతపురం: కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు పాఠశాలలను మూసి వేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం కేరళలో ఆన్లైన్ క్లాసులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఓ 14 ఏళ్ల పేద విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడేలా చేసింది. కుటుంబంలో టీవీ, స్మార్ట్‌ఫోన్ లేకపోవడంతో ఆన్లైన్ తరగతులకు హాజరు కాలేకపోతున్నాననే బాధతో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన బాలిక.. ఈ రోజు వాలంచెరిలోని ఆమె ఇంటి సమీపంలో మృతదేహంగా కనిపించింది. ఆ పక్కనే ఖాళీగా ఉన్న కిరోసిన్ బాటిల్ కూడా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. బాలిక మృతదేహం దొరికిన ప్రదేశంలో సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంజేరి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి పంపారు.(ఆ బాలికపై దాడి అమానుషం : రాహుల్) మృతి చెందిన బాలిక 9 వ తరగతి చదువుతుందని.. క్లాస్‌లో ఎప్పుడు ఫస్ట్ వస్తుందని పాఠశాల అధికారులు తెలిపారు. బాలిక తల్లిదండ్రులు తమ వద్ద ఒక చిన్న టీవీ ఉందని.. కానీ మూడు నెలలుగా అది రిపేర్‌లో ఉందని తెలిపారు. లాక్డౌన్ కారణంగా గత మూడు నెలలుగా తమకు పని లేదని.. అందువల్లే టీవీని బాగు చేయించలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ, రాహుల్ గాంధీ ఈ ఘటనపై స్పందించారు. బాలిక మరణం తనను కలచి వేసిందని పేర్కొన్నారు. అంతేకాక నియోజకవర్గంలో టీవీ, స్మార్ట్ఫోన్లు అందుబాటులో లేని కుటుంబాలకు తాను సాయం చేస్తానని తెలిపారు. వారి జాబితాను ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్‌కు రాసిన లేఖలో రాహుల్ కోరారు. -
ఆన్లైన్లో మళ్లీ టీవీలు, ఫ్రిజ్‌లు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను క్రమంగా ఎత్తివేసే ప్రక్రియలో భాగంగా ఈ–కామర్స్‌లో విక్రయాలకు కేంద్రం అనుమతించింది. దీంతో ఏప్రిల్ 20 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి ఈ–కామర్స్ పోర్టల్స్‌లో మళ్లీ మొబైల్ ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటి ఉత్పత్తుల అమ్మకం ప్రారంభం కానుంది. మే 3 దాకా పొడిగించిన లాక్డౌన్ మార్గదర్శకాలకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు ఈ మేరకు వివరణనిచ్చారు. టీవీలు, మొబైల్ ఫోన్స్ కూడా ఆన్లైన్ పోర్టల్స్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. అయితే, ఈ–కామర్స్ కంపెనీల డెలివరీ వ్యాన్లు.. రోడ్ల మీదికి రావాలంటే ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాలన్నారు. మార్చి 25న తొలిసారిగా లాక్డౌన్ ప్రకటించినప్పుడు ఈ–కామర్స్ సంస్థలు కేవలం ఔషధాలు, ఆహారపదార్థాలు వంటి నిత్యావసరాలే విక్రయించడానికి అనుమతినిచ్చారు. సరుకు రవాణా, డెలివరీ మొదలైన సర్వీసుల ద్వారా చాలా మంది ఉపాధి పొందుతుండటంతో వారి ప్రయోజనాలు కాపాడేందుకు కేంద్రం ఈ నిర్ణ యం తీసుకుంది. దీనికి సంబంధించి బుధవారం ప్రకటించిన మార్గదర్శకాలపై నెలకొన్న సందేహాలను ఇప్పుడు నివృత్తి చేసింది. -
వెరైటీ ఫీచర్లతో.. వీయు ప్రీమియం 4కె టీవీ..
సాక్షి, సిటీబ్యూరో:టీవీల ఉత్పత్తికి పేరొందిన వీయు టెలివిజన్ ఆధునిక టెక్నాలజీతో వీయు ప్రీమియం 4కె టీవీని రూపొందించింది. దీన్ని మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భంగా వియు టెలివిజన్ సీఈఓ దేవిత సరఫ్ మాట్లడుతూ.. ఈ ప్రీమియం 4కె టీవీలో అత్యున్నత శ్రేణి ఫీచర్స్‌ను జోడించి, నూతన హంగులతో డిజైన్ చేశారు. దీన్ని 3 విభిన్న పరిమాణాల్లో (43, 50, 55 అంగుళాలు) çతయారు చేశామని, ఆండ్రాయిడ్ 9.0 సాంకేతికతతో, ప్రత్యేకమైన డాల్బీ సౌండ్ సిస్టమ్‌తో రూపొందించామని తెలిపారు. డిజిటల్ మార్కెటింగ్‌పై ఫ్రీడెమో కెల్లీ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో ఈ నెల 14న అమీర్‌పేట్‌లో డిజిటల్ మార్కెటింగ్‌పై ఉచిత డెమోను ఇవ్వనున్నారు. ఇందులో డిజిటల్ మార్కెటింగ్‌లో భాగమైన ఎస్ఈఓ, ఎస్ఎమ్ఏ, ఎస్ఈఎమ్ తదితర అంశాలపైన అనుభవజ్ఞులతో శిక్షణ ఉంటుంది. కొత్తగా ఈ రంగంలో ఉద్యోగం ఆశిస్తున్నవారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. స్వాద్ అప్నేపన్ కా... సాక్షి, సిటీబ్యూరో: ట్రాన్స్ జెండర్ల సమస్యలపై మానవతా దృక్పథంతో ఆలోచించాలనే సందేశంతో రూపొందించిన స్వాద్ అప్నేపన్ కా క్యాంపెయిన్‌ను ప్రారంభించినట్లు బ్రూక్ బాండ్ రెడ్ లేబుల్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రతి ఒక్కరినీ ఆదరించాలనే ఆలోచనను కలిగించాలనే ఈ ప్రచార చిత్రం రూపకల్పన చేశామని, మనసున్న ప్రతి ఒక్కరికీ ఇది స్పందనలు కలిగిస్తుందని సంస్థ ప్రతినిధులు అంటున్నారు. -
షార్ట్ సర్క్యూట్‌తో పేలిన టీవీ
ప్రొద్దుటూరు క్రైం : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా టీవీ పేలిన సంఘటనలో ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి. ఇంట్లో నుంచి దట్టమైన పొగలు రావడంతో వీధిలోని ప్రజలు సాయం చేసేందుకు గుమిగూడారు. అదే సమయంలో పెద్ద శబ్ధంతో టీవీ పేలడంతో శకలాలు బయటికి దూసుకొని వచ్చి మీద పడ్డాయి. నిప్పు కనికల్లా ఉన్న శకలాలు మీద పడటంతో శరీరం కాలి ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ సంఘటన ప్రొద్దుటూరులోని వసంతపేటలో గురువారం జరి గింది. వీఆర్ఏ జయరాజ్ వసంతపేటలో నివాసం ఉంటున్నారు. ఆయన భార్య మరియమ్మ రెండు రోజుల క్రితం అనంతపురం వెళ్లి గురువారం మధ్యాహ్నం ఇంటికి వచ్చారు. జయరాజ్ విధులకు వెళ్లడంతో ఆమె ఒక్కరే ఇంట్లో ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత విద్యుత్ వైర్లలో నుంచి పొగలు వ్యాపించడంతో ఇళ్లంతా పొగ కమ్ముకుంది. పొగ నిండుకొని ఊపిరాడకపోవడంతో ఆమె సొమ్మ సిల్లి పడిపోయింది. ఇంటి నుంచి పొగ రావడంతో వీధిలోని యువకులు ఇంట్లోకి వెళ్లిఆమెను బయటికి ఎత్తుకొని రాగా, ఇంకొందరు గ్యాస్ సిలిండర్‌ను తీసుకొని వచ్చారు. అప్పటికే పొగ ఎక్కువ కావడంతో లోపలికి వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. పెద్ద శబ్ధంతో పేలిన టీవీ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగిందని తెలుసుకున్న స్థానికులు ద్ద ఎత్తున జయరాజ్ ఇంటి వద్దకు వచ్చారు. మహిళలు, చిన్న పిల్లలతో ఇంటి పరిసరాలు నిండిపోయాయి. కొద్ది సేపటి తర్వాత టీవీ పెద్ద శబ్ధంతో పేలిపోయింది. పేలిన టీవీ భాగాలు బయటికి వచ్చి పడటంతో స్మైలీ (7), షాహిరా (6), ముబారక్ (10) అనే చిన్నారులతో పాటు పవన్‌కుమార్, రాధిక, మహబూబ్‌చాన్, గాంధీ, సందీప్‌లు గాయపడ్డారు. గాయడిన వారిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి, పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. పవన్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతనికి జిల్లా ఆస్పత్రిలోని బర్నింగ్ వార్డులో చికిత్సను అందిస్తున్నారు. ఊటుకూరు వీరయ్య బాలుర పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పవన్‌కుమార్ భోజనానికి ఇంటికి వస్తున్న సమమంలో ఈ ప్రమాదం జరిగింది. పాఠశాల నుంచి ఇంటికి వెళ్తుండగా..తల్లీ ఇద్దరు కుమార్తెలకు గాయాలు వసంతపేటలో నివస్తున్న మహబూబ్‌చాన్ కుమార్తెలు ముబారక్, షాహిరాలు సమీపంలోని మున్సిపల్ పాఠశాలలో 1, 5వ తరగతి చదువుతున్నారు. భోజన విరామ సమయంలో ఆమె కుమార్తెలను ఇద్దరిని ఇంటికి పిలుచుకొని వస్తూ దారిలో అగ్నిప్రమాదం జరిగిన జయరాజ్ ఇంటి వద్ద ఆగారు. అదే సమయంలో టీవీ పేలిన సంఘటనలో ఆమెతో పాటు పిల్లలిద్దరికి గాయాలు అయ్యాయి. తల్లీ, కుమార్తెలు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జయరాజ్ ఉన్న ఇంటిపై రాధిక కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో నుంచి పొగ రావడంతో మొదటి అంతస్తులో ఉన్న రాధిక, కుమార్తె స్మైలీని తీసుకొని కిందికి వెళ్లారు. ఆమె కిందికి వెళ్లిన కొన్ని క్షణాల్లోనే ఈ సంఘటన జరిగింది. తల్లీ కూతుళ్లకు గాయాలు కావడంతో హోమస్‌పేటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్సను అందిస్తున్నారు. శరీరం కాలడంతో చిన్నారి స్మైలీ విలపించసాగింది. బుగ్గిపాలైన సామగ్రి: అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఇంట్లోసామగ్రి పూర్తిగా కాలిపోయింది. టీవీతో పాటు ఫ్రిజ్, స్టీల్ సామగ్రి, బట్టలు, బీరువాలో ఉన్న రూ. 30 వేలు నగదు కాలి బూడిదయ్యాయి. ఏ ఒక్క వస్తువు మిగల్లేదు. కుటుంబ సభ్యులంతా కట్టుబట్టలతో మిగిలారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ ఈశ్వరరెడ్డి తెలిపారు. -
టీవీలు, ఏసీలు ఆన్‘లైనే’...
న్యూఢిల్లీ: టీవీలు, ఏసీలు వంటి వినియోగ ఉత్పత్తుల గురించి ఆన్లైన్లో అధ్యయనం చేసి, వీడియోలు చూసిన తర్వాతే కొనుక్కునే ధోరణి పెరుగుతోంది. ఇలా డిజిటల్ మాధ్యమం ప్రభావంతో జరిగే కన్జూమర్ డ్యూరబుల్స్ అమ్మకాల పరిమాణం 2023 నాటికి 23 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. టెక్ దిగ్గజం గూగుల్ ఇండియా, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కొనుగోలు ప్రక్రియలో ఏ దశలోనైనా కొనుగోలుదారు ఇంటర్నెట్‌ని వినియోగించిన పక్షంలో సదరు లావాదేవీని డిజిటల్ మాధ్యమం ప్రభావిత లావాదేవీగా పరిగణించి ఈ నివేదికను రూపొందించారు. ‘ప్రస్తుతం కన్జూమర్ డ్యూరబుల్స్ అమ్మకాల్లో దాదాపు 28% విక్రయాలు డిజిటల్ మాధ్యమంతో ప్రభావితమైనవే ఉంటున్నాయి. 2023 నాటికి ఇది 63%కి పెరగవచ్చు. విలువపరంగా చూస్తే 23 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చు. ఇందులో సుమారు 10 బిలియన్ డాలర్ల మేర అమ్మకాలు ఆన్లైన్ విక్రయాలే ఉంటాయని అంచనా‘ అని నివేదిక వివరించింది. టీవీలు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లు, చిన్న గృహోపకరణాలు, వాటర్ ప్యూరిఫయర్లు, మైక్రోవేవ్ ఒవెన్లు మొదలైన ఉత్పత్తుల ధరలపై 33% డిజిటల్ ప్రభావం ఉంటోంది. కొనుగోలు నిర్ణయాలపై డిజిటల్ ప్రభావం.. నివేదిక ప్రకారం.. కొనుగోలు నిర్ణయాలపై డిజిటల్ మాధ్యమం ప్రభావం గణనీయంగా పెరుగుతోంది. ఇలా ప్రభావితమైన వారి సంఖ్య గడిచిన నాలుగేళ్లలో రెట్టింపయ్యింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో వీరి సంఖ్య 5 రెట్లు పెరగ్గా, మహిళా కొనుగోలుదారుల సంఖ్య 10 రెట్లు పెరిగింది. కొనుగోలుకు ముందు దాదాపు 80% మంది డిజిటల్ ప్రభావిత కొనుగోలుదారుల్లో ఏ బ్రాండు కొనాలి వంటి అంశాలపై సందిగ్ధత ఉంటోంది. దీంతో వారు సగటున దాదాపు 2–3 వారాలు ఆన్లైన్లో అధ్యయనం చేశాకే కొంటున్నారు. సెర్చి, సోషల్ మీడియా, బ్లాగ్లు, ఆన్లైన్ వీడియోలు మొదలైనవి ఆన్లైన్ రీసెర్చ్‌లో ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపార సంస్థలు కూడా కొనుగోలుదారులకు చేరువయ్యేలా డిజిటల్ వ్యూహాలు అమలు చేస్తున్నాయని గూగుల్ ఇండియా కంట్రీ డైరెక్టర్ (సేల్స్) వికాస్ అగ్నిహోత్రి చెప్పారు. -
థాంప్సన్ నుంచి ఆండ్రాయిడ్ టీవీలు
న్యూఢిల్లీ నుంచి సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధి: ఫ్రెంచ్ కన్సూ్యమర్ దిగ్గజం థాంప్సన్... దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఆండ్రాయిడ్ టీవీలను విడుదల చేసింది. మేక్ ఇన్ ఇండియాకు అనుగుణంగా ఈ టీవీలను భారత్‌లోనే ఉత్పత్తి చేశామని కంపెనీ ఇండియా పేటెంట్ హక్కుదారు ఎస్పీపీఎల్ సీఈఓ అవనీత్ సింగ్ మార్వా చెప్పారు. దీంతో అన్ని రకాల ఆండ్రాయిడ్ టీవీలను స్థానికంగా ఉత్పత్తి చేస్తున్న తొలి బ్రాండ్‌గా నిలిచామన్నారు. 43, 49, 55, 65 అంగుళాల వేరియంట్లలో ఈ టీవీలున్నాయని, వీటి ధర రూ. 29,999 నుంచి రూ. 59,999 వరకు ఉంటుందని చెప్పారు. ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌పై వీటిని విక్రయిస్తామన్నారు. ప్రత్యేకతలు: ఇన్‌బిల్ట్ క్రోమ్‌క్యాస్ట్, డాల్బీ సౌండ్, 2.5 ర్యామ్, 16 జీబీ మెమరీ, 5000కు పైగా వివిధ ప్రీఇన్స్టాల్డ్ యాప్స్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్‌ప్లే కోసం హాట్‌కీస్, 4కే 10హెచ్డీఆర్ డిస్ప్లే తదితరాలు. -
వినోదంలో యాప్‌లే ‘టాప్’
న్యూఢిల్లీ: బ్యాండ్‌విడ్త్ కోసం బెగ్గింగ్ చేసే రోజులు పోయాయిప్పుడు. ఒక వీడియోను డౌన్లోడ్ చేసుకుంటే డేటా ఖర్చయిపోతుందేమోననే భయాలు కూడా లేవిప్పుడు. అందుకే... పెన్‌డ్రైవ్‌లోకి డౌన్లోడ్ చేసుకుని దాన్నే అలా చేతులు మార్చుకునే రోజులిప్పుడు లేవు. డౌన్లోడ్ చేసుకుంటే స్పేస్ వృథా అవుతుందన్న కారణంతో అంతా తమ సొంత టీవీల్లోనో, మొబైల్లోనో వీడియోలను లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇదిగో... ఈ ధోరణి ఎంటర్టైన్మెంట్ రంగ రూపురేఖల్ని మార్చేస్తోంది. డిజిటల్ ఓవర్ ది టాప్ (ఓటీటీ) ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల టీవీ చానళ్లకు సంబంధించి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నిబంధనలు అమల్లోకి వచ్చాక ఓటీటీ వేగం మరింత పెరిగింది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ– ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) సర్వే ప్రకారం మీడియా– వినోద రంగానికి సంబంధించి 2019లో తొలిసారిగా సినిమాను డిజిటల్ విభాగం అధిగమించనుంది. 2021 నాటికి ప్రింట్‌ను కూడా దాటేసి రూ.35,400 కోట్ల స్థాయికి చేరనుంది. ఈ విభాగంలో ఇంత భారీ స్థాయిలో అవకాశాలుండటంతో ఓటీటీ సంస్థలు కొత్త వ్యూహాలతో ముందుకొస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా 30 పైచిలుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇవి సినిమాలు, చానల్స్ ప్రసారంతో పాటు సొంతంగా సీరియళ్లు, సినిమాల్లాంటి కంటెంట్‌ను కూడా రూపొందిస్తూ వీక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. గతేడాది ఏకంగా 1,200 గంటల నిడివి ఉండే తాజా కంటెంట్‌ను ఓటీటీ సంస్థలు నిర్మించాయి. హాట్‌స్టార్, ఈరోస్ నౌ, సోనీ లైవ్, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హంగామా, వూట్, ఆల్ట్‌బాలాజీ, జీ5, సన్‌నెక్ట్స్ తదితర సంస్థలు ఓటీటీ విభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. దేశీ సంస్థలు అంతర్జాతీయంగానూ విస్తరిస్తున్నాయి. ఈరోస్ డిజిటల్ తాజాగా చైనా సంస్థతో జట్టు కట్టి భారత్, చైనాలో ఒక ప్రోగ్రామ్‌ను చిత్రీకరిస్తోంది. బ్రిటన్ లాంటి దేశాల్లో కూడా కో–మార్కెటింగ్ డీల్స్ కుదుర్చుకుంది. చౌకగా చార్జీలు.. ఓటీటీ సంస్థలు వీలైనంత చౌకగా కంటెంట్‌ను ఆఫర్ చేసేందుకు పోటీపడుతున్నాయి. ఉదాహరణకు హాట్‌స్టార్ అన్ని స్పోర్ట్స్, అమెరికన్ షోస్, సినిమాలకు వార్షికంగా రూ.999 చార్జీలు వసూలు చేస్తోంది. రూ.299కి నెలవారీ ప్యాకేజీ కూడా అందిస్తోంది. టీవీల్లో ప్రసారం కాకముందే స్పెషల్స్, సీరియల్స్ మొదలైనవి చూడాలనుకునేవారి కోసం హాట్‌స్టార్ వీఐపీ పేరుతో వార్షికంగా రూ.365 చార్జీలకు అందిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ చార్జీలు నెలకు రూ.500–800 స్థాయిలో ఉంటున్నాయి. అటు అమెజాన్ ప్రైమ్ వీడియో చార్జీలు నెలకు రూ.129, ఏడాదికి రూ.999 స్థాయిలో ఉన్నాయి. నెలవారీగానే కాక వారం వ్యవధికి పనిచేసే చిన్న ప్యాక్లనూ ఓటీటీ సంస్థలు అందుబాటులోకి తెచ్చాయి. సోనీలైవ్ 7 రోజులకు రూ.29 ప్యాక్‌ను ప్రవేశపెట్టింది. ఐపీఎల్ క్రికెట్ సీజన్ నేపథ్యంలో హాట్‌స్టార్ కూడా కేవలం రూ.25 నెలవారీ చార్జీలతో స్పోర్ట్స్ ప్యాకేజీని అందిస్తోంది. జీ5 సైతం ఇదే కోవలో చౌక ప్యాకేజీలను ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉంది. సాధారణంగా బడ్జెట్ ప్యాక్‌లకు వ్యతిరేకంగా ఉండే నెట్‌ఫ్లిక్స్ కూడా భారత యూజర్లకు చౌక ప్యాక్‌లపై దృష్టి పెడుతోంది. వారానికి రూ.65కే సర్వీసులు అందించే ప్యాక్‌ను పరిశీలిస్తోంది. భారీ పెట్టుబడులు.. ఓటీటీ సంస్థలు భారీ స్థాయిలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఈరోస్ నౌ సంస్థ దగ్గర ఇప్పటికే 12,000 పైచిలుకు సినిమాలున్నాయి. కొత్తగా మరింత కంటెంట్ కొనుగోలు, నిర్మాణం కోసం వచ్చే ఏడాదిన్నర వ్యవధిలో 50–70 మిలియన్ డాలర్లు వెచ్చించబోతోంది. స్టార్ యూఎస్ హోల్డింగ్స్‌తో కలిసి స్టార్ ఇండియా తమ ఓటీటీ విభాగం హాట్‌స్టార్‌లో దాదాపు రూ.1,066 కోట్ల (153 మిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేస్తోంది. గతేడాది పెట్టిన రూ.516 కోట్ల పెట్టుబడులకు ఇది అదనం. ఇతర సంస్థలూ ఇదే స్థాయిలో పెట్టుబడులకు సిద్ధమవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా ఎనిమిది కొత్త సినిమాలు, 12 వెబ్ సిరీస్‌లు నిర్మిస్తున్నట్లు వెల్లడించింది. సేక్రెడ్ గేమ్స్ లాంటి బ్లాక్‌బస్టర్ సిరీస్ తరహాలోనే ఇవి కూడా హిట్ అవుతాయని ఆశిస్తోంది. దేశీ సంస్థ ఆల్ట్‌బాలాజీ కూడా 2019లో 30–40 షోలు నిర్మిస్తున్నట్లు తెలిపింది. ‘ప్రాంతీయ’ కంటెంట్‌పై దృష్టి.. సాధారణంగా యువ జనాభాలో ఎక్కువ శాతం వీక్షకులు బస్సులు, రైళ్లు, ట్యాక్సీల్లో ప్రయాణించేటప్పుడో లేదా లంచ్ బ్రేక్‌లోనూ చూసేందుకు అనువైన 10–15 నిమిషాల తక్కువ నిడివి ఉండే కంటెంట్‌ను ఇష్టపడుతున్నారని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోస్ నౌ లాంటి సంస్థలు ఇలాంటి కంటెంట్‌పై దృష్టిపెడుతున్నాయి. ఇక చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల నుంచీ వీక్షకుల సంఖ్య భారీగా పెరుగుతోందని ఓటీటీ సంస్థలు గుర్తించాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వీక్షకులకు మరింత చేరువయ్యే మార్గాలపై దృష్టి పెడుతున్నాయి. ఇందులో భాగంగా ప్రాంతీయ భాషల్లోనూ కంటెంట్‌ను అందిస్తున్నాయి. వయాకామ్18కి చెందిన వూట్ సంస్థ తమిళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ తదితర భాషల్లో కంటెంట్ రూపొందిస్తోంది. అమెజాన్ ప్రైమ్ కూడా తెలుగు సహా తమిళం, హిందీ, మరాఠీ, బెంగాలీ, కన్నడ వంటి భాషల్లో ప్రోగ్రామ్స్ చేస్తోంది. ఓటీటీ జోరు ఇదీ...! ► 2018లో 32.5 కోట్ల మంది ఆన్లైన్ వీడియోలు వీక్షించారు. ఇది అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే 25 శాతం అధికం. ► వచ్చే మూడేళ్లలో డిజిటల్ వీడియో వినియోగదారుల సంఖ్య 50–60 కోట్లకు చేరగలదన్న అంచనాలు నెలకొన్నాయి. ► 2017లో 70 లక్షలుగా ఉన్న సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 2018 నాటికి 1.2–1.5 కోట్లకు పెరిగారు. ► దేశీయంగా 34 కోట్లకు పైగా స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఉండగా, డేటా వినియోగం గతేడాది రెట్టింపయ్యింది. -
టీవీ18 బ్రాడ్కాస్ట్ ఆదాయం రూ.1,197 కోట్లు
న్యూఢిల్లీ: మీడియా కంపెనీ, టీవీ–18 బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో రూ.30 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.5 కోట్ల నికర లాభం వచ్చిందని టీవీ18 బ్రాడ్కాస్ట్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.765 కోట్ల నుంచి రూ.1,197 కోట్లకు పెరిగింది. వయాకామ్ 18 మీడియా, ఇండియాకాస్ట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లు గత ఏడాది మార్చి 1 నుంచి తమకు పూర్తి అనుబంధ సంస్థలుగా మారాయని కంపెనీ తెలియజేసింది. అందుకే ఈ క్యూ4 ఫలితాలను, గతేడాది ఫలితాలతో పోల్చడం సరికాదని పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభం 30 శాతం వృద్ధితో రూ.314 కోట్లకు పెరిగింది. నికర లాభం రూ.167 కోట్లుగా, నిర్వహణ ఆదాయం రూ.4,993 కోట్లుగా నమోదయింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో టీవీ18 బ్రాడ్కాస్ట్ షేరు 5 శాతం నష్టంతో రూ.36.70 వద్ద ముగిసింది. -
నమో టీవీ’పై వివరణ ఇవ్వండి
న్యూఢిల్లీ: ఇటీవల ప్రారంభించిన నమో టీవీపై నివేదిక సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం సమాచార, ప్రసార మంత్రిత్వ(ఐబీ) శాఖను ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో ఆ చానెల్ ప్రసారాలను నిలిపేసేలా ఆదేశాలివ్వాలని కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు ఈసీని కోరాయి. చానెల్ ప్రారంభం, ప్రసారాల వివరాల్ని శుక్రవారం సాయంత్రం లోగా అందించాలని ఐబీ మంత్రిత్వ శాఖను ఈసీ కోరినట్లు తెలుస్తోంది. ఐబీ శాఖ సమర్పించే పత్రాల ఆధారంగా ఆ చానెల్ కోడ్‌ను ఉల్లంఘిస్తుందో లేదో ఈసీ నిర్ధారించనుంది. మోదీ చిత్రాన్ని చిహ్నంగా కలిగి ఉండి ప్రసారాలు నిర్వహిస్తున్న నమో టీవీని మార్చి 31న ప్రారంభించిన సంగతి తెలిసిందే. మోదీ ర్యాలీలు, ప్రసంగాలు, బీజేపీ నాయకుల ఇంటర్వ్యూలను ఈ చానెల్ డీటీహెచ్, కేబుల్ టీవీ ప్లాట్‌ఫాంలపై ప్రసారం చేస్తోంది. కేంద్ర వర్సిటీల్లో నియామకాలకు అనుమతివ్వండి దేశంలో సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో కేంద్ర విశ్వవిద్యాలయాల్లో చేపట్టే నియామకాలకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భారత ఎన్నికల కమిషన్ (ఈసీ)ని కోరింది. దీనికి సంబంధించి కేంద్ర మానవ వనరుల శాఖ (హెచ్చార్డీ) ఈసీకి లేఖ రాసింది. 40 కేంద్ర వర్సిటీల్లో 2018 నవంబర్ 1 నాటికి 17,425 పోస్టులకు 6,141 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మానవ వనరుల శాఖ పేర్కొంది. -
శ్రమే నా సుకృతం
ఎలాంటి బాధ్యతలు లేకుండా కాలేజీకి వెళ్లే ఒక బెంగాలీ అమ్మాయికి తల్లి ఒక్కత్తే ఆలంబన. అలాంటిది తల్లి చనిపోవడంతో ఒంటరిదవుతుంది. అనుకోకుండా బెంగాల్ నుంచి తెలుగు నేలకు చేరిన ఆ అమ్మాయి జీవితంలో చోటుచేసుకునే పరిణామాలే ‘కనులు మూసినా నీవాయే’ సీరియల్ కథ చెబుతుంది. స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ఈ సీరియల్లో ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి. ఇండిపెండెంట్, ఎమోషనల్ గర్ల్‌గా ప్రధాన పాత్రలో సుకృత నటిస్తోంది. వెండితెర మీద వెలిగి బుల్లితెర ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన సుకృత పరిచయం ఆమె మాటల్లోనే.. యాంకర్ నుంచి సినిమా ‘పుట్టి పెరిగింది అంతా బెంగుళూరులోనే. కాలేజీ చదువు అయిపోవడంతోనే కన్నడ టీవీ ఛానెల్లో యాంకర్‌గా చేరాను. అక్కడి నుంచి డైరెక్ట్‌గా ప్రితియా రాయబారి అనే కన్నడ సినిమాలో అవకాశం వచ్చింది. అమ్మనాన్న బాగా చదువుకున్నవారు. లోకం గురించి వారికి బాగా తెలుసు. ఆడపిల్లను అని ఎక్కడా నాకు అడ్డంకులు చెప్పకుండా ప్రోత్సహించారు. అలా కన్నడ సినిమాలకు పరిచయం అయ్యాను. అటు తర్వాత కన్నడలోనే నాలుగైదు సీరియల్స్ చేశాను. కన్నడ సీరియల్లో ‘రాజకుమారి’ పాత్ర నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అట్నుంచి తెలుగులో ‘నేను–నా ఫ్రెండ్స్’ అనే సినిమాలో నటించాను. ఆ తర్వాత తెలుగు స్టార్ మా ‘కనులు మూసినా నీవాయే’ సీరియల్లో నటించడానికి అవకాశం వచ్చింది. అలా ఈ ఇండస్ట్రీకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఉండే భయాలు ఇప్పుడు లేవు. ప్రతిరోజు నేర్చుకోవడానికి ఇక్కడ మంచి స్కోప్ ఉంటుంది. సినిమా నుంచి సీరియల్ ఇది చిన్న పని, అది పెద్ద పని అని లెక్కలు వేసుకోను. నాకు పని ఉండాలి. పని చేస్తూ ఉంటే మంచి ఫలితాలు అవే వస్తాయి అని గట్టిగా నమ్ముతాను. అదీ కాకుండా ఈ రోజుల్లో సీరియల్ అమ్మాయి, సినిమా అమ్మాయి అనే తేడా లేదు. క్రియేటివిటీ, చార్మ్‌ను అందరూ గుర్తిస్తున్నారు. అలా చాలా మంది తమ వర్క్‌లో చాలా ఎఫర్ట్ పెడుతున్నారు. ఒకటే తేడా ఏంటంటే.. సినిమాలో అయితే రోజులో ఒకట్రెండు సీన్స్ వుంటాయి. అదే సీరియల్ అయితే రోజులో ఎనిమిది సీన్లు కూడా ఉంటాయి. ఆ విధంగా ఉదయం నుంచి రాత్రి వరకు పనితోనే సరిపోతుంది. సినిమా వర్క్ చాలా ప్రొఫెషనల్‌గా ఉంటే, సీరియల్ వర్కింగ్ చాలా హోమ్లీగా ఉంటుంది. సినిమాలో హీరో హీరోయిన్స్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. కానీ, కుటుంబానికి సంబంధించిన సీన్లన్నీ సీరియల్స్‌లోనే ఎక్కువ. సీరియల్ నుంచి రియల్ వర్క్ సీరియల్స్ తర్వాత నా వర్క్ బ్యుటిషియన్ చుట్టూతానే తిరుగుతుంటుంది. ఈ ఫీల్డ్కి రాకముందు బ్యుటిషియన్ కోర్సు చేశాను. నాకు ఆ వర్క్ అంటే చాలా ఇష్టం. ఏ కాస్త ఖాళీ సమయం దొరికినా బ్యూటిషియన్‌కు సంబంధించిన కొత్తవివరాలు సేకరిస్తూ ఉంటాను. అంతేకాదు, సినిమా హీరోయిన్స్‌కి కూడా బ్యూటీ వర్క్ చేస్తాను. వంట చేయడం అంటే కూడా నాకు చాలా ఇష్టం. అన్ని డిష్‌లను కొత్తగా వండి వార్చడం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను. స్విమ్మింగ్ మాత్రం పిచ్చి. అవకాశాలు వస్తే సీరియల్స్, సినిమాలూ రెండూ చేస్తాను. సీరియల్, సినిమా ఏదైనా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేయాలనేది నా యాంబిషన్. పేరులో మార్పు నా పేరులో అంజనా దేశ్‌పాండే అని ముందు ఉండేది. అంజనా సుకృత అని నా పూర్తి పేరు. ఇప్పుడు సుకృత అని మాత్రమే మార్చుకున్నాను. పేరులో ప్రత్యేకత ఉంటుందని అలా మార్చుకున్నాను. మా నాన్న బ్యాంక్ మేనేజర్, అమ్మ హౌజ్‌వైఫ్. ఈ ఫీల్డ్ గురించి వాళ్లెప్పుడూ భయపడలేదు. నా గురించి వాళ్లకు బాగా తెలుసు. నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు. – ఎన్.ఆర్ -
టీవీ చర్చలలో మహిళల స్థానం ఎక్కడ?
ట్రిపుల్ తలాక్ వంటి విషయాల మీద చర్చలు జరుగుతుంటే, అందులో మహిళల కంటే పురుషులే అధికంగా ఉంటున్నారు. మతాలు, నేరాలకు సంబంధించిన వాటిలో 30 శాతం మంది పాల్గొంటుంటే, ఒక్క మహిళను కూడా ఆహ్వానించటం లేదని ఈ సర్వే చెబుతోంది. క్రీడల విభాగం, వ్యవసాయానికి సంబంధించిన అంశాలలో కూడా స్త్రీలకు స్థానం కల్పించట్లేదు. పోలీసు విభాగం నుంచి ఒక్కరిని కూడా ఆహ్వానించట్లేదని, చర్చా కార్యక్రమాలలో మహిళలు చాలా తక్కువగా ఉంటున్నారని ఈ సర్వే చెబుతోంది. పస్తుతం టీవీ యుగం నడుస్తోంది. వార్తా చానెల్స్‌లో నిత్యం ఏదో ఒక అంశం మీద చర్చాకార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఇందులో ఎంతోమంది పాల్గొంటూనే ఉంటారు. కానీ, వారిలో మహిళలు మాత్రం చాలా తక్కువగా ఉంటున్నారు. ఈ విషయం మీద ఎన్‌డబ్ల్యూఎంఐ (నెట్వర్క్ ఆఫ్ ఉమెన్ ఇన్ మీడియా ఇన్ ఇండియా) ఒక సర్వే నిర్వహించింది.12 భాషలకు చెందిన 28 చానెల్స్‌లో ఈ సర్వే చేశారు. ఇంగ్లీషు – 6, హిందీ – 4, గుజరాతీ, పంజాబీ, ఉర్దు, తమిళం, తెలుగు, మలయాళం, బంగ్లా, ఒడియా, అస్సామీస్, మరాఠీ భాషలన్నీ కలిపి 18 చానెల్స్లోను ఈ సర్వే నిర్వహించారు. ప్రతి చానెల్ నుంచి ఒక ప్రైమ్‌టైమ్ న్యూస్ షో, ఒక టాప్ వీక్లీ టాక్ షోల ఆధారంగా రివ్యూ చేశారు. ఇందులో అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, ఢిల్లీ, అస్సాం, కోల్‌కతా, ముంబై, పుణేలకు చెందిన 11 మంది ఎన్‌డబ్ల్యూ ఎంఐ సభ్యులు పాల్గొన్నారు. ఈ సర్వేలో, మూడు వంతులమంది మేల్ యాంకర్లే ఉన్నారని తేలింది. ఈ వివక్ష హిందీ చానెల్స్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. భారతీయ టీవీ న్యూస్ చానల్స్‌లో... ప్రముఖ వ్యాఖ్యాతలుగా మహిళలు 13.6 శాతం, పురుషులు 86 శాతం ఉన్నట్లు ఈ సర్వే చెబుతోంది. సాధారణంగా చర్చాకార్యక్రమాలలో చర్చలో కేవలం ఒక్క మహిళను మాత్రమే ప్రతినిధిగా పిలుస్తున్నాయి చానల్స్. గుజరాతీలో 21 శాతం, తమిళం, పంజాబీలలో 5 శాతం మాత్రమే. బంగ్లా, తెలుగులలో 11 శాతం, మలయాళంలో 10 శాతం ఉన్నారు. మహిళా సమస్యల మీద చర్చించే వారిలో మహిళలు తక్కువగా ఉండటం చాలా ఆశ్చర్యం. రాజకీయాలకు సంబంధించిన చర్చలలో కేవలం 8 శాతం మాత్రమే ఉంటున్నారు. వివక్ష తగ్గాలి... చానెల్స్‌లో ఈ వివక్ష తగ్గేలా చూడాలని, మహిళలను అన్ని అంశాలకు చెందిన చర్చలలోకి ఆహ్వానించాలని, చర్చలో మహిళల గొంతు ఎక్కువగా వినిపించాలని ఈ సర్వే చేసిన మహిళలు ఆశిస్తున్నారు. సీనియర్ మేల్ యాంకర్లతో ప్రోగ్రాములు చేయిస్తుంటారు కాని, సీనియర్ మహిళలను మాత్రం విధుల నుంచి తొలగిస్తుంటారని, ఇది ఎంతవరకు న్యాయమని వీరు ప్రశ్నిస్తున్నారు. 13.6 శాతం మహిళలు, 86 శాతం పురుషులు ఈ చర్చలలో పాల్గొంటున్నారు. దీనిని బట్టి మహిళలు గొంతు విప్పి తమ సమస్యలను చెప్పుకోలేకపోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. కేవలం సున్నితమైన అంశాలకు మాత్రమే కాకుండా, అన్ని అంశాల మీద చర్చకు మహిళలను ఆహ్వానించాలని చెబుతున్నారు ఈ సర్వే ద్వారా. డా. వైజయంతి (ఢిల్లీలో ఇటీవల జరిగిన 14వ జాతీయ మహిళా జర్నలిస్టుల సదస్సు నుంచి) -
తాత టీవీ ఇచ్చారు.. నాన్న సెటాప్ బాక్స్ ఇస్తారు
తమిళనాడు, పెరంబూరు: ఇంతకు ముందు తాత కరుణానిధి ఉచితంగా టీవీలు ఇచ్చారని, ఈ సారి నాన్న స్టాలిన్ ఎన్నికల్లో గెలిస్తే సెటాప్ బాక్స్‌లు ప్రజలకు ఉచితంగా అందిస్తారని నటుడు, డీఎంకే నేత స్టాలిన్ కొడుకు ఉదయనిధిస్టాలిన్ వాగ్దానం చేశారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ నాయకులు ప్రజల్లోకి వెళ్లడం మొదలెట్టారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, కనిమొళి, ఉదయనిధిస్టాలిన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ గ్రామసభలను నిర్వహిస్తున్నారు. అలా ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. మరి కొందరి ప్రశ్నలను ఎదుర్కొంటున్నారు కూడా. కాగా మంగళవారం నటుడు ఉదయనిధిస్టాలిన్ తూత్తుక్కుడి జిల్లాలో పర్యటించారు. అక్కడు ఒక యువతి ఇం తకు ముందు కరుణానిధి ఉచితంగా టీవీలు పంచి పెట్టారని, అప్పట్లో కేబుల్ ప్రసారాలు ప్రైవేట్ సంస్థల చేతుల్లో ఉన్నా తక్కువ ధరకే చానళ్లలో కార్యక్రమాలు చూసే వారమని, ఇప్పుడు కేబుల్ ప్రసారాలను ప్రభుత్వం చేతుల్లోకి తీసుకోవడంతో ఎక్కువ చానళ్లు రావడం లేదని చెప్పిం ది. అందుకు సెటాప్ బాక్స్ తీసుకోవాలని, అందుకు అధిక డబ్బును వసూలు చేస్తున్నారని చెప్పింది. దీంతో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ అప్పుట్లో తాత టీవీలను ఉచితంగా ఇచ్చారని, నాన్న స్టాలిన్ అధికారంలోకి వస్తే ఉచితంగా సెటాప్ బాక్స్‌లను పంచుతారని హామీ ఇచ్చారు. -
మడతపెట్టే టీవీ ఇదిగో...
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్జీ చుట్టేసే టీవీని లాంచ్ చేసింది. మడతపెట్టగలిగే 65 అంగుళాల 4కే సిగ్నేచర్ ఓఎల్ఈడీ టీవీని లాంచ్ చేసింది. 2019, జనవరి 8నుంచి 11వరకు లాస్ వెగాస్‌లో జరుగుతున్న కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)లో భాగంగా ఈ టీవీని ఎల్జీ పరిచయం చేసింది. ఈ ఏడాదిలోనే ఈటీవీ కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. రోల్-అప్ మోడల్ కొత్త ఓఎల్ఈడీ 65 అంగుళాల (165 సెంటీమీటర్) టీవీ ఆర్ ని ఆవిష్కరించింది. ఈ టీవీని ఈజీగా ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లడంతోపాటు అవసరం లేనపుడు చుట్టుకునే విధంగా 65 అంగుళాల తెరను ఎల్జీ రూపొందించింది. గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వర్చువల్ అసిస్టెంట్, యాపిల్ ఎయిర్ ప్లే సపోర్టు తోపాటు 100 వాల్ట్స్ డాల్బీ అట్మాస్ స్పీకర్ డా దీని ప్రత్యేకతగా ఉందని సీనియర్ డైరెక్టర్ డైరెక్టరి టిమ్ అలెస్సీ చెప్పారు. అలాగే తన మొట్టమొదటి సూపర్-హై-డెఫినేషన్ 88 అంగుళాల 8కె ఓఎల్ఈడీ టీవీని కూడా ఈ సందర్భంగా తీసుకురావడం విశేషం. దశాబ్దాల క్రితంనుంచి ఎదురుచూస్తున్న ఈ టెక్నాలజీ ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిందని మార్కెటింగ్ ఎల్జీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ వండర్ వాల్ ఓఎల్ఈడీ ఆర్ టీవీ పరిచయం సందర్బంగా చెప్పారు. అయితే దీని ధరను ఇంకా రివీల్ చేయలేదు. -
అశ్లీలతే అనర్థాలకు కారణం
టీవీ, స్మార్ట్ఫోన్లు బాల్యంపై వికృత రాత రాస్తున్నాయి. గాడి తప్పేలా చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ పుణ్యమాని అశ్లీలం అరచేతిలో నాట్యం చేస్తుండటంతో కొందరు బాలలు రొచ్చులో చిక్కుకుంటున్నారు. తప్పటడుగు వేస్తున్నారు. కొందరు బాల్యంలోనే లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. సాక్షి, అమరావతి బ్యూరో: నూజివీడు మండలం యనమదల గ్రామంలోని ఓ ఆరేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలుడు లైంగిక దాడి చేశాడు. దీంతో ఇరు కుటుంబాల తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. కేసును విచారించిన పోలీసులకు దిగ్భాంతికరమైన విషయాలు బయటపడ్డాయి. బాలుడికి ఆలోచన ఎలా వచ్చిందా అని ఆరా తీశారు. టీవీల్లో, సెల్ఫోన్లో అశ్లీల దృశ్యాలు చూడడం, స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండటం, పెద్దల పర్యవేక్షణ లేకపోవడంతో అశ్లీల చిత్రాలు చూడటానికి అలవాటు పడ్డాడు. ప్రస్తుతం విజయవాడలోని జువైనల్ హోంలో ఉంటున్నాడు. ఈవ్ టీజర్లగా మారే అవకాశం.. చిన్న వయసులోనే స్మార్ట్ఫోన్లు వాడటంతో ఫేస్బుక్, యూట్యూబ్‌లలో కనిపించే కొన్ని అశ్లీల దృశ్యాలు, చిత్రాలు విద్యార్థుల భావోద్వేగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సమయం దొరికితే స్మార్ట్‌ఫోన్ లోకంలో ఉంటున్నారు. ఇటీవల మానసిక నిపుణుల బృందాలు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న పలువురు విద్యార్థులను వ్యక్తిగతంగా, బృందాలుగా విచారించారు. పదే పదే అశ్లీల దృశ్యాలు చూడటంతో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడాలని అనిపిస్తోందని సర్వేలో వెల్లడించారు. మరో వైపు వారు చూస్తున్న వీడియోల విషయం బయటపడుతుందేమోనన్న భయంతో తల్లిదండ్రులకు దూరంగా గడపుతూ సఖ్యత తగ్గిపోతోందని తేల్చారు. నిరంతర పర్యవేక్షణ అవసరం... ఉద్యోగాల బిజీలో తల్లిదండ్రులు ఉదయం ఏడు నుంచి రాత్రి 8 గంటల వరకు ఇంటి ముఖం చూసే అవకాశం ఉండడం లేదు. కొందరు పిల్లలను హాస్టళ్లలో చేర్పిస్తున్నారు. ఇది పిల్లలపై మానసికంగా ప్రభావం చూపుతోంది. ఎలా చదువుతున్నారు..? ఏమి చేస్తున్నారు...? ఎవరితో స్నేహం చేస్తున్నారో గమనించకుండా వదిలేస్తున్నారు. స్నేహితులతో కలసి చదువుకుంటున్నామంటూ గది తలుపులు వేసుకొని లోపల ఉంటున్న పిల్లల వద్దకు అప్పుడప్పుడు తల్లిదండ్రులు వెళ్లి వారేం చేస్తున్నారో తప్పనిసరిగా పేదలు గమనించాలి. పుస్తకాలని, ప్రాజెక్ట్ వర్క్‌లని చెప్పి పేరెంట్స్‌తో డబ్బులు తీసుకుని వెళ్లే వారిపై శ్రద్ధ పెట్టాలి. లేకుంటే చెడుమార్గం వెళ్లే అవకాశం ఉంది. క్రీడలు ఆడించాలి.... విద్యార్థులు, యువకులను క్రీడల్లో నిమగ్నం చేయాలి. తొంబై శాతం మంది మానసికోల్లాసం లేకపోవడంతోనే చెడు వ్యసనాలకు అలవాటు పడుతాన్నారు. ఇలాంటి వ్యసనాలను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గుర్తించి వారిని సకాలంలో స్పందించాలి. వారికిష్టమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో, క్రీడల్లో పాల్గనేలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఏకాగ్రత దెబ్బతింటుంది పిల్లలకు చిన్నవయసులో అశ్లీల చిత్రాలు చూడటం వల్ల వారి ఏకాగ్రత దెబ్బతింటుంది. చదువుపై శ్రద్ధ ఉండదు. పిల్లలకు వీలున్నంత వరకు సెల్‌ఫోన్ ఇవ్వకపోవడం మంచిది. ఒకవేళ ఇవ్వాల్సివస్తే అనవసర సైట్లు బ్లాక్ చేసి ఇవ్వాలి. తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణం అవసరం. రాత్రి పూట పిల్లల వద్ద మొబైల్ ఫోన్లు ఉంచరాదు. తెలిసి తెలియని వయసులో సెక్స్ నాలెడ్జ్ లేకపోవడంతో వారు చూసిందే నిజం అని నమ్మి మోసపోయే ప్రమాదం ఉంది. చిన్న వయసులోనే సెక్స్ కోరికలు కలగడంతో అకృత్యాలకు పాల్పడుతున్నారు. కొంత మంది కేసుల పాలై శిక్షలు అనుభవిస్తున్నారు. ఈ మధ్య చోటుచేసుకుంటున్న నేరాలకు ముఖ్య కారణం అశ్లీల చిత్రాలే.–డాక్టర్ ఇండ్ల విశాల్‌రెడ్డి, ప్రముఖమానసిక వైద్య నిపుణుడు, విజయవాడ -
ఫేక్ న్యూస్ వార్ : వాట్సాప్ కొత్త ప్రచారం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ్ మెసేజింగ్ ఆప్ వాట్సాప్ మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఫేక్‌న్యూస్ సవాలును ఎదుర్కొంనేందుకు మొట్టమొదటిసారిగా టీవీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. తన ప్లాట్‌ఫాంపై నకిలీ వార్తలను అరికట్టేందుకు ఇప్పటికే పలుమార్గాల్లోక్యాంపెయిన్ మొదలు పెట్టిన వాట్సాప్ తాజాగా టీవీ ప్రకటనలను విడుదల చేసింది. అసత్య వార్తలు, నకిలీ వార్తలు, హానికరమైన పుకార్ల దుమారం నేపథ్యంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా టీవీ ప్రచారం ప్రారంభించింది. ముఖ్యంగా తప్పుడు సమాచారం ఎలాంటి దారుణాలకు దారితీస్తాయో వివరిస్తూ 60 సెకన్ల మూడు యాడ్స్ రూపొందించి టీవీలో ప్రసారం చేస్తోంది. చిత్రనిర్మాత షిర్షా గుహా థాకుర్తా నిర్వహణలో 60 సెకన్ల నిడివిగల మూడు ప్రకటనలను రూపొందించామని వాట్సాప్ ప్రతినిధి వెల్లడించారు. రాజస్థాన్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందే వీటిని రూపొందించింది. టీవీ, ఫేస్బుక్, యూట్యూబ్‌లలో తెలుగుతోపాటు ఇంగ్లీషు, హిందీ, బెంగాలీ, అసోం, గుజరాతీ, మరాఠీ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని యాజమాన్యం తెలిపింది. దీంతోపాటు 2019 లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధ మవుతున్న తరుణంలో వీటిని రూపొందించినట్టు పేర్కొంది. కాగా ఫేక్ న్యూస్ వాట్సప్‌లో ఎక్కువగా వ్యాప్తి చెందుతుండటంలో వాట్సాప్‌పై ఒత్తిడి పెరిగింది. ఇటీవల కేంద్రం నోటీసులు కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫేక్‌న్యూస్ నిరోధంపై కసరత్తు చేస్తున్న వాట్సాప్ తాజా చర్యకు దిగింది. మొదటి దశలో భాగంగా ఆగస్ట్ 29 నుంచి బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్తాన్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఆల్ ఇండియా రేడియోకు చెందిన 46 రేడియో స్టేషన్ల ద్వారా యాడ్స్ ప్రసారం మొదలుపెట్టింది. ఆ తర్వాత సెప్టెంబర్ 5న భాగంగా అసోం, త్రిపుర, పశ్చిమబెంగాల్, గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, తమిళనాడులోని 83 రేడియో స్టేషన్ల నుంచి రెండో దశ ప్రచారం ప్రారంభమైంది. -
ఏసీలు, ఫ్రిజ్‌లూ మేకిన్ ఇండియా!
ముంబై: మోదీ సర్కారు మేకిన్ ఇండియా నినాదం స్మార్ట్ఫోన్లు... టీవీల తయారీ రంగంలో బాగానే పనిచేస్తోంది. ఈ ఉత్పత్తులను దేశీయంగా తయారు చేసేందుకు విదేశీ కంపెనీలన్నీ పెట్టుబడులకు ముం దుకొచ్చాయి. మరి ఇప్పుడు రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్లు వంటి వైట్ గూడ్స్ ఉత్పత్తి కంపెనీలు కూడా మేకిన్ ఇండియాను తలకెత్తుకోవడానికి సిద్ధమయ్యాయి. ఒకపక్క, ఆయా ఉత్పత్తులు, సంబంధిత విడిభాగాల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీగా దిగుమతి సుంకాలను వడ్డించడంతో పాటు ఇటీవల కాలంలో డాలరుతో రూపాయి మారకం విలువ అంతకంతకూ క్షీణించ డం కూడా విదేశీ వైట్ గూడ్స్ కంపెనీల మేకిన్ ఇండి యా రాగానికి బాటలు వేసింది. వచ్చే రెండేళ్లలో ఈ కంపెనీలు ఏకంగా రూ.6,500 కోట్ల పెట్టుబడులను దేశీయంగా కుమ్మరించనుండటం దీనికి నిదర్శనం. సుంకాల మోత... మేకిన్ ఇండియాలో భాగంగా భారత్‌లో తయారీని ప్రోత్సహించి... తద్వారా ఇక్కడ మరింతగా ఉద్యోగాలను సృష్టించాలనేది ప్రభుత్వ సంకల్పం. అయితే, ఇప్పటివరకూ ఈ జాబితాలో స్మార్ట్ఫోన్లు, టీవీలు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గతేడాది డిసెంబర్లో ప్రభుత్వం టీవీలు, స్మార్ట్‌ఫోన్ దిగుమతులపై దిగుమతి సుంకాలను 20 శాతానికి పెంచింది. వీటికి సంబంధించిన విడిభాగాలపై కూడా ఈ ఏడాది సుంకాన్ని పెంచడంతో తప్పనిసరిగా ఆయా కంపెనీలు మేకిన్ ఇండియాకు ఓకే చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఇదే పరిస్థితి వైట్ గూడ్స్ రంగంలోనూ పునరావృతం అవుతోంది. రూపాయి ఘోరంగా పతనం కావడంతో కొన్ని అత్యవసరం కాని ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను కేంద్రం పెంచడం తెలిసిందే. ఇందులో వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్‌లపై సుంకాలను ఈ ఏడాది సెప్టెంబర్‌లో రెట్టింపు చేసి 20 శాతానికి చేర్చారు. అదేవిధంగా ఏసీలు, ఫ్రిజ్‌ల కంప్రెషర్లపైనా దిగుమతి సుంకాన్ని 7.5 శాతం నుంచి 10 శాతానికి పెంచారు. దీంతో దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల ధరలు 10% ఎగబాకాయి. దేశీయంగా వైట్‌గూడ్స్ పరిశ్రమ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.30,000 కోట్లుగా అంచనా. ఇది ఏటా 7–8% వృద్ధి చెందుతున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. విదేశీ దిగ్గజాల క్యూ.. వైట్ గూడ్స్‌కు సంబంధించి జర్మనీకి చెందిన బాష్, సీమెన్స్, టర్కీ కంపెనీ ఆర్సెలిక్, చైనా సంస్థ మైడియా, హేయర్, టీసీఎల్, జపాన్ కంపెనీ పానాసోనిక్ వంటివి భారత్‌లో కొత్తగా తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు, ఉన్నవాటిని విస్తరించేందుకు సిద్ధమయ్యాయి. వీటికి తోడు దేశీయ సంస్థలైన గోద్రెజ్, బీపీఎల్ కూడా పెట్టుబడి ప్రణాళికలను రూపొందిస్తున్నాయి. షాంగై హిటాచీ ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ కంపెనీ... గుజరాత్లో కంప్రెషర్ యూనిట్‌ను విస్తరిస్తోంది. జపాన్ సంస్థ హిటాచీ, చైనా కంపెనీ షాంగై హైలీ గ్రూప్‌ల జాయింట్ వెంచర్ కంపెనీ ఇది. చైనాకు చెందిన గ్వాంగ్డాంగ్ మీజి కంప్రెషర్ కంపెనీ కూడా కొత్త ప్లాంట్‌ను నెలకొల్పుతోంది. కూలింగ్ యూనిట్లలో ఉపయోగించే పరికరాలను ఇది తయారు చేయనుంది. కాగా, కంపెనీలు ప్రారంభ, మధ్య స్థాయి వైట్ గూడ్స్ ఉత్పత్తులను మాత్రమే దేశీయంగా తయారు చేస్తున్నాయి. ప్రీమియం మోడళ్లతోపాటు సంక్లిష్లమైన విడిభాగాల(హీట్ ఎక్సే్ఛంజ్ కాయిల్స్, కంప్రెషర్స్ వంటివి) విషయంలో మాత్రం దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి. ఎయిర్ కండిషర్లలో అయితే, ఏకంగా 50% విడిభాగాలు దిగుమతి చేసుకున్నవే ఉంటున్నాయి. కాగా, రానున్న కాలంలో మరింతగా దిగుమతి సుంకాలు పెరగవచ్చని.. దీంతో ఇక్కడే ప్లాంట్లను ఏర్పాటు చేయడం ఉత్తమం అని కంపెనీలు భావిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నారు. ‘అంతేకాకుండా భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉన్న దేశాల నుంచి దిగుమతి చేసుకున్నదాని కంటే స్థానికంగా తయారు చేస్తేనే ఉత్పాదక వ్యయం తగ్గుతుందని చాలా కంపెనీలు నిర్ణయానికి వచ్చాయి. ఎందుకంటే ఇక్కడ తక్కువ వేతనాలకే కార్మికులు లభిస్తారు. దిగుమతులకు భారీగా రవాణా చార్జీలు చెల్లించక్కర్లేదు కూడా. డాలరుతో రూపాయి విలువ పతనం కూడా దిగుమతులకు భారంగా పరిణమిస్తోంది’ అని గోద్రెజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది వ్యాఖ్యానించారు. కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ తయారీదారుల సంఘం (సీమా) ప్రెసిడెంట్ కూడా ఆయన. జోరుగా పెట్టుబడులు... ‘తాజాగా కేంద్రం సుంకాలను పెంచడంతో మేం స్థానికంగా తయారీపై పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. లేదంటే కష్టమే’ అని బీఎస్‌హెచ్ హౌస్‌హోల్డ్ అప్లయెన్సెస్ ఎండీ గుంజన్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఈ సంస్థ భారత్‌లో బాష్, సీమెన్స్ ఉత్పత్తులను విక్రయిస్తోంది. చెన్నైకి సమీపంలోని ఫ్యాక్టరీలో బీఎస్‌హెచ్ ఇటీవలే వాషింగ్ మెషీన్ల తయారీని ప్రారంభించింది. ఇక్కడే రూ.800 కోట్ల పెట్టుబడితో ఫ్రిజ్‌ల ఉత్పత్తి ప్లాంట్‌ను నెలకొల్పే ప్రణాళికల్లో ఉంది. ∙చైనాకు చెందిన మైడియా గ్రూప్ ఇటీవలే రూ.1,350 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇందులో సగం కంప్రెషర్ల తయారీ కోసం వెచ్చించనుంది. చైనా వెలుపల తమకు ఇదే అతిపెద్ద పెట్టుబడి అని కంపెనీ ఇండియా ఎండీ క్రిషన్ సచ్దేవ్ తెలిపారు. ∙చైనాలో అతిపెద్ద అప్లయెన్సెస్ తయారీ సంస్థ హేయర్ కూడా నోయిడాలో కొత్త ప్లాంట్ ఏర్పాటుకు రూ.3,000 కోట్ల పెట్టుబడులను ఖరారు చేసింది. పుణేలో ఈ సంస్థ యూనిట్‌తో పోలిస్తే ఈ పెట్టుబడి మూడింతలు ఎక్కువ కావడం విశేషం. నోయిడా ప్లాంట్‌లో విడిభాగాలతో పాటు ప్రీమియం మోడళ్లను ఉత్ప త్తి చేస్తామని హేయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా పేర్కొన్నారు. ∙తాము స్థానికంగా ఏసీ కంప్రెషర్లు ఇతరత్రా విడిభాగాల తయారీ కోసం సప్లయర్లతో చర్చలు జరుపుతున్నట్లు జపాన్ దిగ్గజం పానాసోనిక్ ఇండియా సీఈఓ మనీష్ శర్మ వెల్లడించారు. ∙ఇక మరో చైనా ఎలక్ట్రానిక్స్ అగ్రగామి టీసీఎల్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి వద్ద నెలకొల్పుతున్న రూ.2,000 కోట్ల ప్లాంట్‌లో వైట్ గూడ్స్, విడిభాగాల తయారీని వచ్చే ఏడాదిలో ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇక్కడ టీవీలను కూడా తయారు చేస్తామని కంపెనీ ఇండియా హెడ్ మైక్ చెన్ చెప్పారు. ∙టర్కీ కంపెనీ ఆర్సెలిక్ టాటా కంపెనీ వోల్టాస్‌తో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. గుజరాత్లో తయారీ ప్లాంట్ కోసం రూ.250 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. -
టీవీ, గృహోపకరణాల ధరలకు రెక్కలు
న్యూఢిల్లీ: టీవీలు, ఇతర గృహోపకరణాల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తయారీ వ్యయాలు పెరిగినప్పటికీ ఇటీవల పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు రేట్ల పెంపును కాస్తంత వాయిదా వేసుకున్నాయి. దీంతో వాటి మార్జిన్లపై ప్రభావం ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ పెరగడం కంపెనీలపై భారం పెరిగేలా చేసింది. ఈ పరిస్థితులను అధిగమించి, తమ మార్జిన్లను బలోపేతం చేసుకునేందుకు కంపెనీలు ధరల పెంపును చేపట్టాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికే పెంచగా, ప్యానాసోనిక్ ఇండియా 7 శాతం మేర తన ఉత్పత్తుల ధరలను పెంచనుంది. ‘‘గత కొన్ని నెలలుగా రూపాయి క్షీణిస్తూ రావడం వల్ల మా తయారీ వ్యయాలపై ప్రభావం పడింది. అయితే, చాలా వరకు మేం సర్దుబాటు చేసుకున్నాం. కానీ మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే నెల నుంచి 5–7 శాతం స్థాయిలో పెంచక తప్పడం లేదు’’ అని ప్యానాసోనిక్ ఇండియా ప్రెసిడెంట్ మనీష్ శర్మ తెలిపారు. పండుగల తర్వాత నుంచి తాము రేట్ల పెంపును చేపట్టినట్టు హయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ సైతం తెలిపారు. కంపెనీల వార్షిక విక్రయాల్లో మూడింట ఒకవంతు దసరా, దీపావళి సమయంలోనే జరుగుతుంటాయి. సెప్టెం బర్లో 3–4% ధరలు పెంచినప్పటికీ అవి ఇంకా ఆచరణ రూపం దాల్చలేదని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంఘం (సీఈఏఎంఏ) సైతం తెలిపింది. ఎంఆర్పీ పెంచినప్పటికీ డిమాండ్ తగ్గడం, మార్కెట్ వాటా కోసం బ్రాండ్ల మధ్య పోటీతో అమల్లోకి రాలేదని వివరించింది. తమ టెలివిజన్ల ధరలను పెంచే ఆలోచనేదీ లేదని సోనీ స్పష్టం చేసింది. -
షావోమి వేగం : మరో బిగ్ టీవీ లాంచ్
సాక్షి,ముంబై: మొబైల్స్ తయారీదారు షావోమీ టీవీ సెగ్మెంట్లో శరవేగంగా దూసుకుపోతోంది. ఇటీవీల టీవీ మార్కెట్‌పై దృష్టి పెట్టిన షావోమి వరుసగా లాంచ్‌లతో వినియోగదారులకు ఆకట్టుకుంటోంది. తాజాగా 75 ఇంచులఎంఐ టీవీ 4ఎస్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది, ఈ రోజు నుంచే సేల్స్‌ను ప్రారంభించింది. దీని ధరను రూ.82,100గా నిర్ణయించింది. ఇక ఈ టీవీ ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, డీటీఎస్ హెచ్డీ డాల్బీ ఆడియో, బ్లూటూత్, వైఫై తదితరాలు లభిస్తున్నాయి. -
భారత మార్కెట్లోకి బ్లౌపంక్ట్ టీవీలు
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ బ్లౌపంక్ట్ భారత మార్కెట్లోకి ఎనిమిది టీవీ మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది. మూడు సిరీస్‌ల్లో ఈ టీవీలు లభిస్తాయని వీటి ధరలు రూ.12,999 నుంచి రూ.47,999 రేంజ్లో ఉంటాయని బ్లౌపంక్ట్ టెలివిజన్ ఇండియా ఎమ్డీ, సీఈఓ కరణ్ బేడి తెలిపారు. ఈ టీవీల విక్రయం కోసం ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని బ్లౌపంక్ట్ భారత భాగస్వామి, ట్రిగుర్ ఎలక్ట్రానిక్స్‌కు ఎమ్‌డీగా కూడా వ్యహరిస్తున్న బేడి పేర్కొన్నారు. ఫ్లిప్‌కార్ట్ ద్వారానే ఈ టీవీల విక్రయం జరుగుతుందని పేర్కొన్నారు. ఏడాది కాలంలో రూ.500 కోట్ల టర్నోవర్ సాధించడం లక్ష్యమని తెలిపారు. కాగా మూడు నుంచి ఐదేళ్ల కాలంలో ట్రిగుర్ ఎలక్ట్రానిక్స్‌తో కలిసి రూ.2,158 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని బ్లౌపంక్ట్ ఎమ్డీ అండ్రెజ్ సెబర్ట్ తెలిపారు. -
టీవీలకు అతుక్కుపోతున్నారు!
ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, హాట్‌స్టార్ వంటి సామాజిక మాధ్యమాలు ఎన్ని వచ్చినా టీవీ చూసే వారి సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉందని, ఈ విషయంలో దక్షిణ భారతీయులు ముందున్నారని తాజా సర్వేలో తేలింది. ఉత్తర భారతంతో పోలిస్తే దక్షిణ భారతంలోనే ఎక్కువ టీవీలు ఉన్నాయని బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. దక్షిణ భారత్‌లో 99.9% ఇళ్లకు విద్యుత్ సదుపాయం ఉండటం, దక్షిణ భారతీయులు మొదట కొనే గృహోపకరణం టీవీయే కావడం దీనికి కారణమని బార్క్ సీఈవో దాస్‌గుప్తా తెలిపారు. 4,300 పట్టణాల్లో 3 లక్షల మందిని సర్వే చేసి బార్క్ ‘బ్రాడ్కాస్ట్ ఇండియా సర్వే పేరుతో నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం 5 దక్షిణ రాష్ట్రాల్లో 95 శాతం ఇళ్లలో టీవీలు ఉన్నాయి. తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మొత్తం 25.9 కోట్ల టీవీలు ఉన్నాయి. 2016తో పోలిస్తే ఇది 8 శాతం ఎక్కువ. ఉత్తర భారతంలో 20.9 కోట్లు, పశ్చిమ భారతంలో 22.1 కోట్లు, తూర్పు భారతంలో 14.6 కోట్ల టీవీలు ఉన్నాయి. దేశం మొత్తం మీద టీవీ ప్రేక్షకుల సంఖ్య 66 శాతం ఉండగా, దక్షిణ భారత దేశంలో అది 95 శాతంగా ఉంది. దేశంలో టీవీ ఉన్న ఇళ్ల సంఖ్య 2018లో 19.7 కోట్లకు చేరింది. 2016తో పోలిస్తే ఇది 7.5% ఎక్కువ. అలాగే టీవీ ప్రేక్షకుల సంఖ్య కూడా 83.6 కోట్లకు (7.2% ఎక్కువ) చేరింది. పట్టణ ప్రాంతాల్లో ప్రతి 10 మందిలో 87 మంది రోజులో 4 గంటల 10 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 3 గంటల 27 నిమిషాలు టీవీ చూస్తున్నారు. దక్షిణ భారతంలో టీవీ చూసే సమయం ఏటా పెరుగుతోంది. 2016 నుంచి టీవీ ప్రేక్షకుల సంఖ్య 12 శాతం పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో టీవీ ఉన్న ఇళ్ల సంఖ్య 2018లో 10 శాతం పెరగ్గా, పట్టణ ప్రాంతాల్లో 4% పెరిగింది. -
టీవీ పడి చిన్నారి మృతి
కర్నూలు, పాములపాడు: టీవీ మీద పడడంతోఓ చిన్నారి మృతిచెందింది. ఈవిషాదకర ఘటన మంగళవారం పాములపాడులో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. పాములపాడుకు చెందిన టైలర్ లింగారెడ్డి, అంజలి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. చిన్నమ్మాయి వెంకటసింధుకు ఏడాదిన్నర వయసు. మంగళవారం ఇంట్లో ఆడుకుంటూ టీవీ తీగలు పట్టుకొని లాగింది. స్టాండ్‌కు ఉన్న చక్రాలు ముందుకు కదలడంతోచిన్నారి తలపై టీవీ పడింది. ఆ శబ్దం విన్న తల్లి అంజలి పరుగున వచ్చి టీవీ పక్కకు తీసేసి.. పాపను చేతుల్లోకి తీసుకుంది. ఎలాంటి రక్తస్రావం కాలేదు. అయితే.. తలకు వెనుక భాగంలో వాపు వచ్చింది. స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చూపించగా.. పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ ఆత్మకూరుకు పంపించారు. అక్కడికి తీసుకెళ్లగా అప్పటికే చిన్నారి మృతిచెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. నిత్యం కళ్లముందు వచ్చీరాని మాటలు, బుడిబుడి నడకలతో తిరిగే పాప ఇక లేదన్న వార్త వారిని కలిచివేసింది. -
పెరగనున్న పెద్ద టీవీల ధరలు
న్యూఢిల్లీ: పెద్ద స్క్రీన్ టీవీల ధరలు వచ్చే నెల నుంచి పెరగనున్నాయి. 32 అంగుళాలు, అంతకంటే ఎక్కువ స్క్రీన్ సైజు ఉన్న వాటి ధరల్ని పెంచాలని టీవీల కంపెనీలు యోచిస్తున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడంతో కంపెనీలపై ప్రకటనల ఖర్చు పెరిగింది. అలాగే ప్యానళ్ల ధరలు కూడా పెరిగాయి. ఈ భారం తగ్గించుకునేందుకు కంపెనీలు విక్రయ ధరల్ని పెంచాలనుకుంటున్నాయి. హైయర్ కంపెనీ 5% వరకు పెంచనుంది. ఆగస్ట్ మూడో వారం నుంచి పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ‘‘ధరల్ని 4–5 శాతం స్థాయిలో పెంచనున్నాం. ఇది దాదాపు ఆగస్ట్ మూడో వారం నుంచి ఉండొచ్చు’’ అని హైయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ తెలిపారు. డాలర్ బలపడడం, టీవీ ప్యానళ్ల ధరలు అంతర్జాతీయంగా పెరగడంతో ధరల్ని పెంచక తప్పడం లేదన్నారు. ‘‘టీవీ ప్యానళ్ల ధరలు పెరగడం, మారకం రేటు ప్రభావం నేపథ్యంలో 32 అంగుళాలు ఆపై సైజున్న టీవీలీ ధరల పెంపు ఉంటుంది. ఇందుకోసం మార్కెట్ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం’’అని ప్యానాసోనిక్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో మనీష్ శర్మ తెలిపారు. -
ప్రముఖ టీవీ షో ప్రొడ్యూసర్‌కు ఏడేళ్ల జైలు
సాక్షి, ముంబై: జూనియర్ ఆర్టిస్టుపై అత్యాచారానికి పాల్పడిన ఓ టీవీ ప్రొడ్యూసర్‌కు కోర్టు జైలు శిక్ష విధించింది. 31ఏళ్ల జూనియర్ నటిపై అత్యాచారం చేసిన ఆరోపణలను ధృవీకరించిన కోర్టు అతగాడికి ఏడేళ్ల కారాగార శిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది. ముంబై ప్రత్యేక మహిళా కోర్టు ఈ తీర్పును వెలువరించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశ్విన్ రాయకర్ అందించిన సమాచారాన్ని ఉటంకిస్తూ ఫ్రీ ప్రెస్ జనరల్ ఈ విషయాన్నిరిపోర్ట్ చేసింది. ప్రముఖ హిందీ టెలివిజన్ షో (ఏక్ వీర్ కి అరదాస్ వీర) ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ముకేష్ మిశ్రా (33) జూనియర్ ఆర్టిస్టుపై లైంగికి దాడికి పాల్పడ్డాడు. పథక ప్రకారం బాధితురాలికి ఫోన్ చేసి ఉదయమే షూటింగ్ రావాలంటూ ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. ఆమె బస్‌స్టాప్‌కు చేరుకునే లోపే అక్కడకు చేరుకున్న ముకేష్, బస్సు రావడం లేటవుతుందని చెప్పి, షూటింగ్ లొకేషన్లో తాను డ్రాప్ చేస్తానంటూ ద్విచక్ర వాహనంపై లిఫ్ట్ ఇచ్చాడు. అనంతరం మేకప్ రూమ్‌లో అత్యాచారానికి పాడ్పడ్డాడు. 2012, డిసెంబరులో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన గురించి ఎవరికైనా చెబితే భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, బాధితురాలిని లైంగికంగా తనకు సహకరించాలంటూ బెదిరించడంతో పాటు, కూతుర్ని చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో భర్త సహాయంతో 2013 జనవరిలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు ముకేష్‌ను దోషిగా తేల్చింది. నేరస్తుడికి ఏడు సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేసింది. దీంతోపాటు 5వేల రూపాయల జరిమానా చెల్లించాలని కూడా ఆదేశించింది. మరోవైపు అత్యాచార ఆరోపణల నేపథ్యంలో టీవీ షో యాజమాన్యం ముకేష్‌ను ప్రొడ్యూసర్‌గా ఇప్పటికే తొలగించింది. -
4 రూపాయలకే ఎంఐ టీవీ, రెడ్మి స్మార్ట్ఫోన్లు
న్యూఢిల్లీ : భారత ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల మార్కెట్లో సంచలనాత్మక బ్రాండ్‌గా షావోమికి పేరొంది. ఈ కంపెనీ బడ్జెట్ ధరల్లో స్మార్ట్ఫోన్లు, టెలివిజన్లను లాంచ్ చేస్తూ భారతీయ వినియోగదారులను తెగ ఆకట్టుకుంటోంది. దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు సైతం చెక్ పెడుతోంది. ఈ కంపెనీ మన మార్కెట్లోకి ప్రవేశించి రేపటికి నాలుగేళ్లు పూర్తవుతుంది. జూలై 10న మంగళవారం ఈ కంపెనీ గ్రాండ్‌గా తన నాలుగో వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ సందర్భంగా ఎంఐ అభిమానుల కోసం షావోమి ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఎంఐ.కామ్‌లో జులై 10న ప్రారంభమయ్యే ఈ వార్షికోత్సవ సేల్ 12 వరకూ కొనసాగనుంది. ఎంఐ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లో 55 అంగుళాల ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ టీవీని, రెడ్మి వై2 (3జీబీ+32జీబీ)ను, రెడ్మి నోట్ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం నాలుగు రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చు. 10, 11, 12వ తేదీల్లో సాయంత్రం 4 గంటలకు లక్కీ కస్టమర్లకు కేవలం నాలుగు రూపాయలకే ఈ ఉత్పత్తులు లభిస్తాయి. ఒకవేళ సాయంత్రం నాలుగు గంటలకు ఫ్లాష్ సేల్స్ అవకాశం చేజారిపోతే, కోంబోలో సాయంత్రం ఆరు గంటలకు రెడ్మి నోట్ 5ను, ఎంఐ వీఆర్ ప్లే 2ను కేవలం రూ.9,999కే అందించనున్నట్టు షావోమి తెలిపింది. వీటి అసలు ధర రూ.11,298గా ఉంది. రెడ్మి వై1, ఎంఐ బ్లూటూత్ హెడ్సెట్లను కూడా 8,999 రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చని, ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ను 8,999 రూపాయలకే అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు ఎంఐ ఆఫర్స్... మధ్యాహ్నం 12 గంటలకు బ్లాక్‌బస్టర్ ఆఫర్ కింద ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్‌టీవీని రూ.13,999కు, రెడ్మి నోట్ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను రూ.14,999కు విక్రయించనున్నట్టు షావోమి తెలిపింది. ఇక ఎంఐ మిక్స్2, ఎం మ్యాక్స్2లపై కూడా రాయితీని అందిస్తోంది. ఎస్బీఐ, పేటీఎం, మొబిక్విక్‌ల ద్వారా చెల్లింపులు చేసేవారు అదనంగా ఇంకొంత రాయితీని పొందవచ్చు. ఎస్బీఐ కార్డు ద్వారా కనీసం రూ.7,500 లావీదేవీపై రూ.500 రాయితీ అందించనుండగా, రూ.8,999 కొనుగోలుపై పేటీఎం ద్వారా చెల్లింపు చేసిన వారికి రూ.500 క్యాష్‌బ్యాక్, విమాన టికెట్ల బుకింగ్‌పై రూ.1,000, సినిమా టికెట్లపై రూ.200 రాయితీని షావోమి అందిస్తుంది. ఇక మొబిక్విక్ ద్వారా చెల్లింపు చేసేవారు 25శాతం వరకూ(రూ.2,500 సూపర్ క్యాష్) డిస్కౌంట్ లభిస్తుంది. ఎంఐ మిక్స్2 రూ.27,999(అసలు ధర రూ.29,999), ఎంఐ మ్యాక్స్2 రూ.14,999(అసలు ధర రూ.15,999) ట్రావెల్ బ్యాక్‌ప్యాక్ రూ.1,899(ఎంఆర్పీ రూ.1,999), ఎంఐ ఇయర్‌ఫోన్స్ రూ.649(అసలు ధర రూ.699) ఎంఐ బ్యాండ్ 2 రూ.1,599(ఎంఆర్పీ రూ.1,799) అందిస్తోంది. ఎంఐ ట్రావెల్ బ్యాక్‌ప్యాక్(రూ.1,999)కు, ఎంఐ బ్యాండ్ హెచ్ఆర్ఎక్స్ ఎడిషన్(రూ.1,299) ఎంఐ బ్యాండ్ స్ట్రిప్ బ్లూ(రూ.199) రెండింటినీ రూ.1,398 అందించనున్నట్టు షావోమి తెలిపింది. వీటితో పాటు ఇతర గ్యాడ్జెట్స్‌పై కూడా రాయితీని, కూపన్లను ఆఫర్ చేస్తుంది. -
టీవీ బాంబు కలకలం
మల్కన్‌గిరి: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి ఉదిరిబెడ గ్రామం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మావోయిస్టులు టీవీలో పెట్టిన బాంబును బీఎస్ఎఫ్ జవాన్లు పేల్చివేశారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలావున్నాయి. మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి ఉదిరిబెడ గ్రామం సమీపంలో ఓ చెట్టు వద్ద మావోయిస్టులు టీవీలో బాంబు పెట్టి ఉంచారు. మల్కన్‌గిరి–జయపురం రోడ్డు పక్కన దీనిని పెట్టారు. ఈ ప్రాంతం బీఎస్ఎఫ్ క్యాంప్‌నకు సుమారు 200 మీటర్ల దూరం ఉంటుంది. అయితే చెట్టు వద్ద టీవీ ఉండడం గమనించిన స్థానికులు బీఎస్ఎఫ్ జవాన్లకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. టీవీలో బాంబు ఉన్నట్టు గుర్తించారు. వెంటనే బాంబు స్క్వాడ్ తీసుకొచ్చి మరో బాంబుతో టీవీలో ఉన్న బాంబును పేల్చివేశారు. ఈ సంఘటన నేపథ్యంలో మల్కన్‌గిరి–జయపురం రహదారిలో సుమారు మూడు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిపివేశారు. దీంతో సుమారు కిలోమీటరు మేర వాహనాలు బారులు తీరాయి. ప్రయాణికులు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ ఘటనపై మల్కన్‌గిరి ఎస్పీ జోగ్‌మోహన్ మిన్నా మాట్లాడుతూ బీఎస్ఎఫ్ క్యాంప్‌నకు సుమారు 200 మీటర్ల దూరం టీవీ ఉండడంతో అందులో బాంబు ఉందేమోనని అనుమానం వచ్చిందన్నారు. దీంతో బాంబు స్క్వాడ్ తీసుకొచ్చి టీవీని పరిశీలించి అందులో బాంబును పేల్చివేశామన్నారు. -
జంక్ ఫుడ్ ప్రకటనల నిషేధ యోచన లేదు
న్యూఢిల్లీ: టీవీల్లో జంక్ ఫుడ్‌కు సంబంధించి వ్యాపార ప్రకటనలు నిషేధించే ఆలోచన ప్రస్తుతానికి లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పిల్లలకు సంబంధించిన ప్రకటనలను కట్టడి చేయాలని ఫుడ్ అండ్ బేవరేజెస్ అలయన్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌బీఐఏ) స్వతంత్రంగా నిర్ణయం తీసుకుందని గురువారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్వర్ధన్ సింగ్ తెలిపారు. పిల్లల ఆరోగ్యంపై జంక్ ఫుడ్ ప్రభావం చూపుతోందని అనుబంధ ప్రశ్నల్లో ఎంపీలు ప్రశ్నించగా ఆ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ సమాధానమిస్తూ.. ‘సమస్య పరిష్కారానికి నిపుణుల బృందాన్ని ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నియమించింది. కొవ్వులు, చక్కెర, ఉప్పు గల ఆహార పదార్థాలను పిల్లల ఛానళ్లల్లో ప్రసారం చేయకుండా నిషేధించాలని ఆ బృందం నివేదికలో సూచించింది. -
టీవీ రీచార్జ్ చేయించలేదని మహిళ ఆత్మహత్య
కర్నూలు, ఉయ్యాలవాడ: టీవీకి రీచార్జ్ చేయించలేదని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ నిరంజన్‌రెడ్డి వివరాల మేరకు.. ఇంజేడు గ్రామానికి చెందిన పచ్చర్ల వెంకటలక్ష్మమ్మ(45) టీవీ రీచార్జ్ చేయించాలని తన కుమారుడికి రూ. 300 అందజేసింది. అయితే అతడు రీచార్జ్ చేయించకుండా ఆ డబ్బుతో మద్యం సేవించి ఇంటికి చేరుకున్నాడు. తీవ్ర మనోవేదనకు గురైన తల్లి క్రిమి సంహారక మందు సేవించి అపస్మారక స్థితికి చేరుకుంది. తెలుసుకున్న భర్త, బంధువులు ఆళ్లగడ్డ వైద్యశాలకు తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మృతురాలి భర్త అంకాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆర్టీసీలో కానరాని "ఠీవీ"
బహుదూరం వెళ్లే ప్రయాణికులకు వినోదం కరువైంది. ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం లగ్జరీ సేవల్లో భాగంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారికోసం సూపర్ లగ్జరీ బస్సుల్లో ఏర్పాటు చేసిన టీవీల ప్రక్రియ ఇక్కడ అటకెక్కింది. వినోదం కోసమంటూ టికెట్ రూపంలో ప్రయాణికుల నుంచి చార్జీ వసూలు చేస్తూ టీవీ మాత్రం ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు చిర్రెత్తుత్తున్నారు. ఇటీవలే కర్నూలు నుంచి హైటెక్ బస్సులో తిరుపతికి వెళ్లే ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దూర ప్రాంత సర్వీసులో వినోదం లేకపోతే ఎలా ప్రయాణించాలంటూ అధికారులను నిలదీశారు. కర్నూలు కొత్త బస్టాండ్‌లో జరిగిన ఈ ఘటనతో కళ్లు తెరచిన అధికారులు ఆగమేఘాల మీద టీవీ సౌకర్యం ఉన్న వేరే సర్వీసును ఏర్పాటు చేసి పంపారు. కర్నూలు(రాజ్‌విహార్): రోడ్డు రవాణా సంస్థ కర్నూలు రీజియన్ బస్సుల్లో టీవీ (టెలివిజన్)ల నిర్వాహణ అటకెక్కింది. అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులకు వినోదం కరువైంది. టెండర్ల ద్వారా ప్రైవేటు కాంట్రాక్టరు చేతిలో పెట్టిన ఆర్టీసీ వాటిపై పర్యవేక్షణ మరిచింది. ఒక్కో బస్సుకు నెలనెలా రూ.2,500 చెల్లిస్తున్నా సరైన సేవలు అందడం లేదు. ఫలితంగా దూర ప్రాంత ప్రయాణికులు వినోదాన్ని పొందలేకపోతున్నారు. సూపర్ లగ్జరీ (హైటెక్), కొన్ని అల్ట్రా డీలక్స్ బస్సుల్లో టీవీల నిర్వాహణ జిల్లా వ్యాప్తంగా అస్తవ్యస్తంగా మారింది. ప్రారంభంలో సంస్థే నేరుగా టీవీలను ఏర్పాటు చేసి సీడీ, డీవీడీ ప్లేయర్ల ద్వారా సినిమా ప్రదర్శన చేసేవారు. ఒకప్పుడు వీటి కోసం ప్రత్యేకంగా నెలవారిగా వేతనం ఇచ్చి బాయ్‌ను కూడా నియమించారు. అయితే అది భారంగా మారడంతో బాయ్‌లను తొలగించి టీవీల నిర్వాహణ బాధ్యతలను డ్రైవర్లపైన పెట్టారు. బస్సు డ్రైవింగ్ చేయడం, టికెట్లు జారీ చేయడం, టీవీల సినిమా ప్రదర్శన బాధ్యతలు నిర్వహించడం ఇబ్బంది కావడంతో చేతులెత్తేశారు. టెండర్ల ద్వారా కాంట్రాక్టర్ల చేతికి టీవీల ఏర్పాటు, నిర్వాహణకు యాజమాన్యం 2015లో ఈ విధానాన్ని తెరపైకి తెచ్చింది. కాంట్రాక్టర్ల ద్వారా ఈ పని చేయించాలని టెండర్లు పిలిచింది. బస్సుల్లో టీవీలు ఏర్పాటు చేసి, సినిమా ప్రదర్శన, యూఎస్బీ, పెన్ డ్రైవ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటి కోసం ఒక్కొక్క బస్సుకి నెలకు రూ.2500 కాంట్రాక్టురుకు చెల్లిస్తారు. 162 బస్సులకు టెండర్లు జిల్లా వ్యాప్తంగా 11 డిపోల్లోని 162 బస్సుల్లో టీవీల ఏర్పాటుకు గతంలో చర్యలు చేపట్టారు. అందులో ఆదోని డిపోలో 15, డోన్ –4, కర్నూలు–1డిపో 30, 2డిపో 31, ఎమ్మిగనూరు 15, ఆళ్లగడ్డ 12, ఆత్మకూరు 11, బనగానపల్లె 8, కోవెలకుంట్ల 2, నందికొట్కూరు 6, నంద్యాల 28 బస్సులకు టెండర్లు పిలిచారు. అయితే, ఆదోని, బనగానపల్లె డిపోలకు ఎలాంటి స్పందనా రాలేదు. విడతల వారీగా టీవీలను ఏర్పాటు చేశారు. అటకెక్కిన నిర్వాహణ: జిల్లాలోని బస్సుల్లో టీవీల నిర్వాహణ అటకెక్కింది. పాత టీవీలు కావడంతో పదేపదే రిపేరు రావడం, యూఎస్బీ, పెన్‌డ్రైవ్‌లు పాడవడంతో టీవీలు ఉన్నా అలంకారప్రాయంగా మారాయి. కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదని సిబ్బంది వాపోతున్నారు. టీవీల నిర్వాహణ సమస్యను పరిష్కరిస్తాం దూర ప్రాంత బస్సుల్లో టీవీ ఏర్పాటు చేశాం. వాటి ఏర్పాటు, నిర్వాహణ బాధ్యతలు టెండర్ల ద్వారా ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించాం. అయితే వాటిలో రిపేరు సమస్య రావచ్చు. వీటిని మరోసారి పరిశీలించి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. – రమేష్ బాబు, డీసీఎంఈ, కర్నూలు. -
మీ పిల్లల గదిలో టీవీ ఉందా?
అయితే ఊబకాయం ముప్పు తప్పదట! లండన్: మీ పిల్లల గదిలో టీవీ ఉందా? అయితే అర్జెంటుగా దానిని తీసేయండి. ఎందుకంటే... భవిష్యత్తులో మీ పిల్లలు ఊబకాయంబారిన పడడానికి అదే కారణం కావొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గదిలో టీవీ ఉండడం వల్ల ఎక్కువసేపు టీవీకి అతుక్కుపోయే అవకాశముందని, దీనివల్ల మధుమేహం, ఊబకాయం వంటి సమస్యల ముప్పు మరింతగా పెరిగే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. లండన్‌లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్(యూఎల్సీ) చేసిన పరిశోధనలో ఈ విషయం రుజువైంది. ఏడేళ్ల నుంచే పిల్లల గదిలో టీవీ ఏర్పాటు చేయడం ద్వారా.. వారు ఊబకాయంబారిన పడే ముప్పు 30 శాతం పెరుగుతుందని, 11 ఏళ్లప్పుడు ఏర్పాటు చేస్తే ఒబేసిటీ ముప్పు 20 శాతం పెరుగుతుందని తమ పరిశోధనలో తేలినట్లు యూఎల్సీ శాస్త్రవేత్తలు తెలిపారు. ‘గదిలో పిల్లల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటుచేస్తే... టీవీ చూసే స్వేచ్ఛ పెరుగుతుంది. కదలకుండా కూర్చోవడం, గంటల తరబడి టీవీ కార్యక్రమాలను వీక్షించడంవల్ల శారీరక శ్రమ తగ్గి, బరువు పెరుగుతారు. ఇది క్రమేపీ ఊబకాయానికి, మధుమేహానికి దారితీయవచ్చు. దాదాపు 12,556 మంది పిల్లలపై పరిశోధన చేసి, ఈ విషయాన్ని నిర్ధారించుకున్నామ’ని యూఎల్సీ ప్రొఫెసర్ యాంజా హీల్మన్ తెలిపారు. -
చిన్నారి ప్రాణం తీసిన టీవీ
విడపనకల్లు (ఉరవకొండ): ప్రమాదవశాత్తు టీవీ (టెలివిజన్) మీద పడి ఓ చిన్నారి మృతి చెందిన ఘటన మండలంలోని కరకముక్కల గ్రామంలో సోమవారం చోటు చేçసుకుంది. గ్రామానికి చెందిన తిమ్మప్ప, లక్ష్మీదేవిల కూతురు తనూజ(4) ఇంట్లో ఆడుకుంటూ, టీవీకి ఉన్న స్టాండ్‌ను పట్టుకుని ఊపడంతో.. టీవీ మీద పడింది. దీంతో చిన్నారి తలకు గాయమై స్పహ కోల్పోయింది. తల్లిదండ్రులు వెంటనే ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
జిల్లాలో సినీ, టీవీ స్టూడియో నిర్మిస్తా
–హాస్య నటుడు గౌతంరాజు రాయవరం(మండపేట): ‘గోదావరి జిల్లాలో పుట్టినందుకు ఎంతో సంతోషిస్తున్నా. జిల్లావాసిగా కళామతల్లి రుణం తీర్చుకునేందుకు తగిన కృషి చేస్తున్నా’నన్నారు ప్రముఖ హాస్యనటుడు గౌతంరాజు. ఆత్మీయత, అనుబంధానికి జిల్లా పెట్టింది పేరని, మరో జన్మంటూ ఉంటే ఈ జిల్లాలోనే పుట్టాలని ఉందని చెప్పారు. రాయవరం సాయితేజా 20వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. పాఠశాల దశ నుంచే నాటకాలు రాజోలులో పుట్టిన నేను కాకినాడ కాకినాడ పీఆర్ కళాశాలలో బీఎస్సీ చదివాను. విద్యాభ్యాసం అనంతరం హైదరాబాద్‌లోని ఇంటర్మీడియేట్ బోర్డులో ఉద్యోగం చేశాను. సినిమారంగంపై ఉన్న ఆసక్తితో దీర్ఘకాలిక సెలవులో వెళ్లి, 1991లో ఉద్యోగానికి రాజీనామా చేశాను. పాఠశాల దశ నుంచి నాటకాలు వేశాను. కాకినాడలో చదువుతుండగా 42 ప్రదర్శనలు ఇచ్చాను. ‘పశ్చాత్తాపం, లాభం, ఏక్ దిన్ కా సుల్తాన్, ఆగండి ఆలోచించండి’ తదితర నాటకాల్లో నటించాను. అలా వచ్చింది అవకాశం.. సింగీతం శ్రీనివాసరావుగారి దర్శకత్వంలో వచ్చిన ‘వసంతగీతం’ సినిమాలో తొలిసారిగా నటించాను. ఇప్పటి వరకు 200కు పైగా సినిమాల్లో నటించాను. ‘ఘరానామొగుడు, కూలీ నెం1, ప్రేమకు వేళాయెరా, ఉగాది’ తదితర సినిమాలు గుర్తింపునిచ్చాయి. ‘జై శ్రీరామ్’ సినిమాలో తొలిసారి విలన్ వేషం వేశాను. ‘వెయ్యి అబద్ధాలు’ సినిమాలో తేజ మరోసారి విలన్ వేషం ఇచ్చారు.ఎందరో మహానటులు నాటక రంగం నుంచి వచ్చిన వారే. జిల్లాలో త్వరలో బీజీఆర్ ఫిల్మ్ అండ్ టీవీ స్టూడియో నిర్మాణం చేపడుతున్నాను. ఎక్కడ నిర్మించేది త్వరలోనే వెల్లడిస్తాను. తమిళ డైరెక్టర్ సాగా దర్శకత్వంలో త్వరలో సినిమా రూపొందిస్తున్నాం. ఆ సినిమాలో జిల్లాలో ఉన్న నటీనటులకు ప్రాధాన్యం ఇస్తాను. మే నెలాఖరుకు షూటింగ్ ప్రారంభిస్తాను. నా కొడుకు కృష్ణకు గుర్తింపు వచ్చింది... నా కుమారుడు కృష్ణంరాజును కృష్ణ పేరుతో సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం చేశాను. ‘లక్ష్మీదేవి సమర్పించు..నేడే చూడండి’ ఈ నెల ఏడున విడుదలై మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది. ఈ సినిమాతో కృష్ణకు నటుడిగా మంచి మార్కులు వచ్చాయి. కృష్ణ మంచి డ్యాన్సర్ కావడంతో హీరో అవకాశం వచ్చింది. -
చైనా రియాలిటీ షోలో బుడ్డోడి సాహసం
-
ఫేస్బుక్ వీడియోలు ఇక టీవీలో
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఇపుడు టీవీరంగాన్ని కూడా టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఇక ఫేస్బుక్ వీడియోలను బుల్లితెరపై చూసేందుకు వీలుగా కొత్తయాప్‌ను సిద్ధం చేస్తున్నట్టు మంగళవారం కన్ఫాం చేసింది. ఫేస్బుక్ వీడియోలను టీవీ తెరపై స్ట్రీమ్ చేసుకునేందుకు వీలుగా వీడియో-సెంట్రిక్ అప్లికేషన్‌ను ప్రారంభిస్తున్నట్టు ధ్రువీకరించింది. న్యూస్ ఫీడ్ వీడియోలను ఆటో ప్లేయింగ్ ఆడియో వంటి మార్పులతో అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా డిఫాల్ట్‌గా న్యూస్ ఫీడ్ ను డైరెక్ట్ గా టీవీ తెరపై వీక్షించేందుకు అవకాశాన్ని కల్పిస్తోంది. అలాగే యూజర్ మొబైల్ లో సేవ్ చేసుకున్నవీడియోలను కూడా కావాలనుకున్నపుడు చూడొచ్చు. అంతేకాదు మీ స్మార్ట్ ఫోన్ మ్యూట్ లో ఉంటే..మ్యూట్ లో, సౌండ్ ఆప్షన్లో ఉండే సౌండ్ లోను ప్లే చేస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది. స్నాప్ చాట్ మాదిరిగానే, టీవీ పూర్తి స్క్రీన్ పై యూజర్లకిష్టమైన వీడియోలను చూడొచ్చని వెల్లడించింది. అన్ని పరీక్షలు పూర్తయ్యాయనీ...త్వరలో యాపిల్ టీవీ, అమెజాన్ ఫైర్ టీవీ, సాంసంగ్ స్మార్ట్ టీవీల ద్వారా ఈ యాప్ అందుబాటులోకి రానుందని తెలిపింది. అనంతరం మిగతా అన్ని డివైస్‌లకు ఈ అవకాశం కల్పించనున్నట్టు పేర్కొంది. దీంతోపాటు యూజర్ల ఆసక్తిని ఎనలైజ్ చేసి మరి మరిన్ని వీడియోలను యూజర్లకు సజెస్ట్ చేస్తుందట. అయితే యాప్ ప్రారంభంపై కచ్చితమైన సమయాన్ని నిర్దిష్టంగా పేర్కొనకపోయినప్పటికీ.. త్వరలోనే అని ప్రకటించింది. -
త్వరలో అదృశ్య టీవీలు...
ఇప్పటివరకు మీరు చాలా టీవీలు చూసే ఉంటారు. పోర్టబుల్ నుంచి ప్లాస్మా టీవీల వరకు అన్నింటినీ చూసే ఉంటారు కానీ మాయమయ్యే టీవీలను మాత్రం కచ్చితంగా చూసి ఉండరు. త్వరలో మాయమయ్యే టీవీ (ఇన్విజిబుల్)లు దర్శనమివ్వనున్నాయి. అంటే కేవలం గాజు గ్లాసుతో తయారు చేసిన స్క్రీన్ మాత్రమే టీవీగా మారబోతుంది. మీరు టీవీని ఉపయోగించని సమయంలో అది కాస్తా పారదర్శకంగా గాజు గ్లాసులాగా మారిపోయి దాని వెనుకవైపు ఉన్న వస్తువులు స్పష్టంగా కనపడుతాయి. ఈ అదృశ్య టీవీని పానాసోనిక్ సంస్థ రూపొందించింది. సాధారణంగా అన్ని టీవీల స్క్రీన్స్ ఎల్సీడీ, ఎల్ఈడీలతో రూపొందిస్తే ఈ అదృశ్య టీవీలో మాత్రం ఓఎల్ఈడీ స్క్రీన్స్‌ను వినియోగించారు. దీనివల్ల ప్రతిబింబం నాణ్యత మరింత పెరుగుతుంది. ఈ టీవీని గత జనవరిలో లాస్వేగాస్లో జరిగిన వినియోగదారుల ఎలక్ట్రానిక్ వస్తు ప్రదర్శనలో ఆవిష్కరించారు. ఎల్ఈడీ టీవీల్లో దృశ్యం కనపడాలంటే సాధారణంగా పిక్చర్ ట్యూట్లో వెనుక ఒక లైట్ ఉంటుంది. కానీ ఓఎల్ఈడీ స్క్రీన్స్‌లో ఈ లైట్ అవసరమే లేదు. జనవరిలో ఆవిష్కరించిన ఈ అదృశ్య టీవీని ప్రస్తుతం పూర్తిగా అప్డేట్ చేసి అందిస్తున్నారు. టీవీని ఆఫ్ చేసినపుడో లేక వాడనప్పుడో ఇది కాస్తా అదృశ్యమై సాధారణ గ్లాస్‌గా మారిపోతుంది. ఒక సెల్ఫ్‌కు ఏర్పాటు చేసిన ఈ గ్లాస్... స్లైడింగ్ డోర్గానూ, టీవీ స్క్రీన్‌గానూ రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. -
టీవీ మీదపడి బాలుడికి తీవ్రగాయాలు
(చొల్లేడు)మునుగోడు: టీవీప మీద పడి బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని చొల్లేడుతో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని చొల్లేడు గ్రామానికి చెందిన కనకాల మహేష్, మమతల దంపతులకు 15 నెలల క్రితం క్రాంతికుమార్ జన్మించాడు. అయితే ఆ బాలుడు ఇంట్లో ఆడుకుంటూ టీవీ స్టాండ్ వద్దకు వెళ్లి దానిని గట్టిగా కదిలించాడు. దీంతో ఆ స్టాండ్ మీద ఉన్న టీవీ ఆ బాలుడిపై పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని తల్లితండ్రులు చెబుతున్నారు. -
డిజిటల్ స్క్రీన్ల వల్ల ఎంతో డేంజర్
న్యూయార్క్: ‘అరే! అదే పనిగా టీవీ ముందు కూర్చొని చూస్తున్నావు. కళ్లు పోతాయ్!’ అంటూ పిల్లలను పెద్దవాళ్లు హెచ్చరించడం మనకు సర్వసాధారణంగా అనుభవమే. ఒకప్పుడు అది టీవీకి మాత్రమే వర్తించేది. ఇప్పుడు అది కంప్యూటర్లకు, లాప్‌ట్యాప్‌లకు, ట్యాబ్లెట్లకు, సెల్ఫోన్లకు అన్నింటికి వర్తిస్తుంది. వీటి వల్ల కళ్లు పూర్తిగా పోకపోయిన అనేక కంటి సమస్యలతోపాటు శారీరక సమస్యలు కూడా వస్తాయి. ఇప్పుడు వాటినే ‘డిజిటల్ హై స్ట్రెయిన్’ అని పిలుస్తున్నారు. చూపు మందగించడం, మసగ్గా కనిపించడం, చూపు బ్లర్ అవడం, కళ్లు మంటపెట్టడం, గుంజడం లాంటి సమస్యలు తలెత్తడమే కాకుండా కొన్ని సార్లు రెటీనా దెబ్బదిని చూపు పూర్తిగా పోయే ప్రమాదం కూడా ఉంది. అంతేకాకుండా కాకుండా భుజాలు, మెడ, నడుము నొప్పులతోపాటు తలనొప్పి లాంటి సమస్యలు కూడా వస్తాయి. ఈ డిజిటల్ స్క్రీన్లను మనం ఎంతసేపు చూస్తామనేదాన్నిబట్టి సమస్యల తీవ్రత ఆధారపడి ఉంటుంది. రేటింగ్ ఏజెన్సీ ‘నీల్సన్’ నిర్వహించిన సర్వే ప్రకారం అమెరికాలో 18 ఏళ్ల ప్రాయం యువత రోజుకు 11 గంటలపాటు ఈ డిజిటల్ స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. అందుకనే అక్కడి పిల్లలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. మెడ, భుజాలు, వెన్ను నొప్పి వచ్చిందన్న వారు 36 శాతం మంది, కంటీ సమస్యలు వచ్చిందన్నవారు 35 శాతం, తలనొప్పి వచ్చిందన్న వారు 25 శాతం మంది, 30 ఏళ్ల లోపువారిని పరిగణలోకి తీసుకుంటే వారిలో 73 శాతం మంది ఈ సమస్యలతో బాధ పడుతున్నారు. అంటే కొత్త జనరేషనే ఈ డిజిటల్ హై స్ట్రెయిన్‌తో ఎక్కువగా బాధ పడుతోందన్న మాట. ఆఫీసు వ్యవహారాలతోపాటు వ్యక్తిగత డాక్యుమెంట్లు, ఈమెయిళ్లు, ఫేస్బుక్ అప్డేట్స్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ చూడడం ఈ తరం ప్రజల్లో ఎక్కువైన విషయం తెల్సిందే. ఇప్పుడు మనం అఫీసుల్లో ఒకటి, రెండూ కంప్యూటింగ్ డివైస్‌లను ఉపయోగిస్తుంటేనే ఇన్ని సమస్యలు వస్తున్నాయి. 2020 నాటికి ప్రతి ఉద్యోగి సగటున ఆరు కంప్యూటింగ్ డివైస్‌లను ఉపయోగించాల్సి వస్తుందని ‘సిట్రిక్స్’ సంస్థ వెల్లడించింది. మరి అప్పుడు పరిస్థితి మరెంత తీవ్రంగా ఉంటుందో. అన్నింటికన్నా కంటి సమస్యలను తీసుకొచ్చేది ఈ డిజిటల్ స్క్రీన్ల నుంచి వచ్చే కాంతి కిరణాలే. వాటిలో నీలి కాంతి కిరణాలు మరీ ప్రమాదకరం. కంటిలోని రెటీనాకూ నీలికాంతిని ఫిల్టర్ చేసే సామర్థ్యం లేకపోవడమే అందుకు కారణం. ఊదారంగు కాంతికన్నా కూడా ఈ కాంతి ప్రమాదకరమని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. డిజిటల్ విప్లవం నుంచి మళ్లీ మనం ఎలాగూ వెనక్కి వెళ్లలేము గనుక తగిన జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమమని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. డిజిటల్ స్క్రీన్ల నుంచి వెలువడే కాంతిని వీలైనంత మేరకు తగ్గించుకోవాలని, వాటిని వీలైనంత దూరంగా పెట్టి పనిచేసుకోవాలని, నీలిరంగు కాంతిని ఫిల్లర్ చేసే కళ్ల జోళ్లు వాడాలని వారు సూచిస్తున్నారు. కొన్ని టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు నీలిరంగు కాంతి కిరణాలను ఫిల్టర్‌చేసే కళ్ల జోళ్లను ఇప్పటికే సరఫరా చేస్తున్నాయి. ఐ ఫోన్లలో రాత్రిపూట కాంతిని నియంత్రించే సౌకర్యం ఉంది. ఈ సౌకర్యం అన్ని ఫోన్లకు అందుబాటులోకి తెచ్చేందుకు యాప్స్ కూడా వస్తున్నాయి. ఈ దుష్ప్రభావం నుంచి తప్పించుకునేందుకు కంటి నిపుణులు ‘20–20–20’ ఫార్ములాను పాటించాలని సూచిస్తున్నారు. అంటే డిజిటల్ స్క్రీన్ చూస్తున్నప్పుడు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 సెకండ్ల పాటు 20 మీటర్ల దూరాన్ని చూడాలంటున్నారు. -
ఐపీఎల్ హక్కులకు ఓపెన్ టెండర్లు
న్యూఢిల్లీ: క్రికెట్ ప్రపంచంలో సూపర్ హిట్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసార హక్కుల కోసం మళ్లీ పోటీ మొదలైంది. 2018 ఐపీఎల్ నుంచి వర్తించే విధంగా కొత్త ఒప్పందం కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బహిరంగ టెండర్ ప్రక్రియ ద్వారా ఆసక్తి గల సంస్థల నుంచి దరఖాస్తులు కోరింది. ‘ఐపీఎల్ టోర్నీ గ్లోబల్ మీడియా హక్కుల (టీవీ, డిజిటల్) కోసం టెండర్లను ఆహ్వానిస్తున్నాము’ అని బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి 2017 వరకు పదేళ్ల కాలానికి టీవీ హక్కులు సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా (ఎస్పీఎన్ఐ) వద్ద ఉన్నాయి. వచ్చే ఏడాది ఈ ఒప్పందం ముగియనుండటంతో బీసీసీఐ కొత్త ఆఫర్‌కు సిద్ధమైంది. తాజా ప్రకటనలో ఎన్నేళ్ల కాలానికి హక్కులు కేటారుుస్తారనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. రాజీ కుదరలేదు... లోధా కమిటీ సిఫారసుల అమలులో భాగంగా మరింత పారదర్శకత కోసం ఓపెన్ టెండర్లను కోరుతున్నట్లు బీసీసీఐ అధికారులు ప్రకటించారు. అయితే ప్రస్తుతం హక్కులు ఉన్న సోనీ సంస్థ దీనిపై అసంతృప్తితో ఉంది. 2008లో చేసుకున్న ఒప్పందం ప్రకారం కొత్తగా మళ్లీ హక్కులు ఇచ్చే సమయంలో ముందుగా తమతో చర్చించాలని, తాము ఒక వేళ తిరస్కరిస్తే అప్పుడే మరొకరికి అవకాశం ఇవ్వాలని చెబుతోంది. ఐపీఎల్-2016 ఫైనల్ ముగిసిన తర్వాత రెండు నెలల కాలంలో సోనీ, బీసీసీఐ మధ్య అనేక సార్లు చర్చలు జరిగినట్లు సమాచారం. అరుుతే ఎంత మొత్తానికి హక్కులు ఇవ్వాలనే అంశంపై రాజీ కుదరలేదని తెలిసింది. సోనీ ఆఫర్ చేసిన మొత్తం ఆమోదయోగ్యం కాకపోగా... ఓపెన్ టెండర్లోనే పాల్గొనాలంటూ వారికి బోర్డు సూచన ఇచ్చిందని సీనియర్ సభ్యుడొకరు వెల్లడించారు. అయితే ఐపీఎల్‌పై ఎవరూ ఆసక్తి చూపించని సమయంలో తాము ముందుకొచ్చామని, ఇప్పుడు లీగ్‌కు ఉన్న స్థాయికి చేర్చేందుకు తాము ఎన్నో రకాలుగా శ్రమించామని సోనీ వాదిస్తోంది. అవసరమైతే ఓపెన్ ప్రక్రియను కోర్టులో సవాల్ చేయాలని కూడా సంస్థ భావిస్తోంది. -
వారెవ్వా.. వాల్స్!
గోడల్లోనే వస్తువుల అమరిక సాక్షి, హైదరాబాద్ : ‘ఇల్లు కట్టి చూడు’ అనేది పాత నానుడి. ‘ఉన్న స్థలంలోనే వస్తువులను అమర్చి చూడు’ అన్నది లేటెస్ట్ సామెత. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో విశాలమైన ఇల్లు కావాలంటే బోలెడంత డబ్బు కావాలి. ఇది అందరికీ కుదరదు. అందుకే ఉన్న కొంచెం స్థలంలోనే ఇంట్లోని ఫర్నీచర్‌ను అమర్చుకోవాలి. దీనికి కావాల్సిందల్లా కొద్దిపాటి సృజనాత్మకతే. సౌకర్యాల ఆలోచనలు.. ఈ రోజుల్లో 600 చ.అ.- 700 చ.అ. విస్తీర్ణంలోనే ఒక హాలు, వంట గది, పడక గది, పూజ గది, వీటిని ఆనుకునే మరుగుదొడ్డినీ నిర్మిస్తున్నారు బిల్డర్లు. హాల్లోనే సోఫాసెట్, టీవీ, డైనింగ్ టేబుల్, దివాన్‌కాట్ అమర్చాలి. వంట గదిలోనే ఉడెన్ కప్ బోర్డు, స్టీల్ బాస్కెట్స్, చిమ్నీ, స్టోరేజీ క్యాబిన్‌తో నిత్యావసర సరుకులతో పాటు బియ్యం వంటి వంట సామాగ్రి ఉండేలా చూసుకోవాలి. పడకగదిలో రెండు మంచాలతో పాటు గోడలకే అమర్చే కప్ బోర్డ్‌లోనే దుస్తులు, నగదు, బంగారం తదితర విలువైన వస్తువులు పెట్టే ఏర్పాటు చేసుకోవాలి. అన్ని గోడల్లోనే.. టీవీ మొదలుకొని బీరువా, మైక్రోఓవెన్‌ను అంతర్గత అలంకరణలో భాగంగా గోడల్లోనే అమర్చుకునేలా ప్రణాళికలున్నాయి. మరోవైపు సోపానే మంచంగా మలుచుకునేలా రెడిమేడ్‌గా తయారైనవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. డ్రెస్సింగ్ టేబుల్ కూడా హాలులో కానీ, పడక గదిలోనే ఒక గూటికి అమర్చుకునేలా నిపుణులు తయారుచే స్తున్నారు. ఇవన్నీ మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయి. ప్రత్యేకించి అపార్ట్మెంట్లు, కాలనీల్లో ఇల్లు నిర్మించుకునే వారికి అనుగుణంగా వీటిని రూపొందిస్తున్నారు. -
తప్పక చూడండి
బోల్ట్ పరిగెడుతుంటే... టీవీల ముందు కూర్చున్న మనం ఊపిరి బిగబడతాం..! ఫెల్ప్స్ ఈత కొలనులో చేపలా దూసుకుపోతుంటే సంబరపడతాం..! లిన్ డాన్ స్మాష్‌లు, సెరెనా ఏస్‌లకు మంత్ర ముగ్ధులమై పోతుంటాం..! ఒలింపిక్స్ అంటే ఇలాంటి ఎన్నో గొప్ప విన్యాసాల కలయిక. ప్రతి ఒలింపిక్స్‌లోనూ కచ్చితంగా కొంతమంది ఈవెంట్స్‌ని చూసి తీరాలి. లేకపోతే క్రీడాభిమానికి ఆ వెలితి నాలుగేళ్ల పాటు ఉంటుంది. ఈసారి రియోలో తమ ప్రదర్శనలతో సంచలనాలు సృష్టిస్తారని భావిస్తున్న దిగ్గజాలు చాలామందే ఉన్నారు. కచ్చితంగా వీరి ఆటను మాత్రం చూసి తీరాల్సిందే. ఉసేన్ బోల్ట్ (అథ్లెటిక్స్) పురుషుల 100 మీటర్లు (ఆగస్టు 15న ఫైనల్- ఉ. గం. 6.55 ని.కు), 200 మీటర్లు (19న ఫైనల్-ఉ.గం. 7.00కు), 4్ఠ100 మీటర్ల రిలే (20న -ఫైనల్ ఉ.గం. 7.05 ని.కు). అంతా అనుకున్నట్లు జరిగితే ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ రియో ఒలింపిక్స్‌లో కొత్త చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటివరకు ఒలింపిక్స్ చరిత్రలో ఏ అథ్లెట్ కూడా పురుషుల 100 మీటర్ల విభాగంలో వరుసగా మూడు లేదా ఓవరాల్‌గా మూడు స్వర్ణాలు నెగ్గిన దాఖలాలు లేవు. ప్రస్తుత ఫామ్, గత రికార్డులను పరిశీలిస్తే... 6 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 94 కేజీల బరువున్న బోల్ట్ స్వీయ తప్పిదం చేస్తే తప్ప అతణ్ని ఓడించే వారు రియోలో కనిపించడంలేదు. జస్టిన్ గాట్లిన్ (అమెరికా), యోహాన్ బ్లేక్ (జమైకా) నుంచి బోల్ట్‌కు పోటీ లభించే అవకాశమున్నా... ఇప్పటివరకైతే మెగా ఈవెంట్స్‌లో ఈ జమైకా స్టార్ తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రికార్డు ఉంది. బీజింగ్, లండన్ ఒలింపిక్స్‌లలో మాదిరిగా రియోలో 100 మీటర్లతోపాటు 200 మీటర్లు, 4ఁ100 మీటర్ల రిలేలోనూ బోల్ట్ స్వర్ణాలు నెగ్గే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇలా జరిగితే వరుసగా మూడు ఒలింపిక్స్‌లలో ‘ట్రిపుల్ గోల్డ్’ సాధించిన ఏకైక అథ్లెట్‌గా బోల్ట్ నిలుస్తాడు. యాష్టన్ ఈటన్ (అథ్లెటిక్స్) పురుషుల డెకాథ్లాన్ (ఆగస్టు 17 నుంచి 19 వరకు) ఒకట్రెండు ఈవెంట్స్‌లో పోటీపడాలంటేనే ఎంతో శ్రమించాలి. అలాంటిది పది అంశాల సమాహారమైన డెకాథ్లాన్‌లో (100 మీటర్లు, లాంగ్‌జంప్, షాట్‌పుట్, హైజంప్, 400 మీటర్లు, 110 మీటర్ల హర్డిల్స్, డిస్కస్ త్రో, పోల్‌వాల్ట్, జావెలిన్ త్రో, 1500 మీటర్లు) నిలకడగా రాణించి స్వర్ణం సాధించడమంటే మాటలు కాదు. అమెరికాకు చెందిన 28 ఏళ్ల యాష్టన్ ఈటన్ వరుసగా రెండో ఒలింపిక్ స్వర్ణమే లక్ష్యంగా రియోలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. 1912 నుంచి ఇప్పటివరకు ఒలింపిక్స్ చరిత్రలో బాబ్ మథియాస్ (అమెరికా-1948, 1952), డేలీ థాంప్సన్ (బ్రిటన్-1980, 1984) మాత్రమే డెకాథ్లాన్‌లో రెండుసార్లు స్వర్ణాలు సాధించారు. 2013, 2015 ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో, 2012 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణాలు నెగ్గిన ఈటన్... ఓవరాల్‌గా 9000 పాయింట్లకుపైగా స్కోరు చేసిన రెండో డెకాథ్లెట్‌గా గుర్తింపు పొందాడు. గతేడాది 9045 పాయింట్లు స్కోరు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఈటన్ రియోలోనూ తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. కింబర్లీ రోడ్ (షూటింగ్) మహిళల స్కీట్ (ఆగస్టు 12న-క్వాలిఫికేషన్స్, సెమీఫైనల్స్ సా.గం. 5.30 నుంచి రా.గం. 11.30 వరకు), 13న ఫైనల్స్ (రాత్రి గం. 12.00 నుంచి 12.30 వరకు). ఒక్కసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటేనే తమ కెరీర్‌కు సార్థకత లభించిందని భావించే క్రీడాకారులు ఎంతో మంది ఉన్నారు. కింబర్లీ రోడ్ మాత్రం వరుసగా ఆరో ఒలింపిక్స్‌లో పోటీపడేందుకు రంగం సిద్ధం చేసుకుంది. 37 ఏళ్ల ఈ అమెరికా మహిళా షూటర్ ఈసారీ పతకం సాధిస్తే వరుసగా ఆరు ఒలింపిక్స్‌లలో పతకం నెగ్గిన తొలి మహిళా క్రీడాకారిణిగా కొత్త చరిత్ర సృష్టిస్తుంది. పురుషుల విభాగంలో మాత్రం ఇటలీకి చెందిన అర్మీన్ జోగ్జెలెర్ (వింటర్ ఒలింపిక్స్; ల్యూజ్ ఈవెంట్) మాత్రమే ఈ ఘనత సాధించాడు. 5 అడుగుల 4 అంగుళాల ఎత్తు, 83 కేజీల బరువున్న కింబర్లీ రోడ్ 17 ఏళ్ల ప్రాయంలో తొలిసారి 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో ‘డబుల్ ట్రాప్’ ఈవెంట్లో పోటీ పడి స్వర్ణం సాధించింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో ‘డబుల్ ట్రాప్’లో కాంస్యం, 2004 ఏథెన్స్లో ‘డబుల్ ట్రాప్’లో స్వర్ణం, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ‘స్కీట్’ ఈవెంట్లో రజతం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో ‘స్కీట్’ ఈవెంట్లో స్వర్ణం సొంతం చేసుకుంది. మరి రియో ఒలింపిక్స్‌లో రోడ్ ‘గన్’ గురికి పతకం రాలుతుందో లేదా వేచి చూడాలి. లిన్ డాన్ (బ్యాడ్మింటన్) పురుషుల సింగిల్స్ (ఆగస్టు 11 నుంచి 20 వరకు) బ్యాడ్మింటన్ క్రీడలో ‘ఆల్‌టైమ్ గ్రేట్’గా పేరొందిన చైనా సూపర్ స్టార్ లిన్ డాన్ ‘హ్యాట్రిక్’ లక్ష్యంతో రియోలో అడుగుపెట్టాడు. 32 ఏళ్ల ఈ చైనా ప్లేయర్ 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో స్వర్ణాలు సాధించాడు. బ్యాడ్మింటన్‌లో ‘సూపర్ గ్రాండ్‌స్లామ్’ (తొమ్మిది ప్రముఖ టైటిల్స్ సాధించడం: ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్, థామస్ కప్, సుదిర్మన్ కప్, వరల్డ్ కప్, సూపర్ సిరీస్ మాస్టర్ ఫైనల్స్, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్, ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్) ఘనత సాధించిన ఏకైక ప్లేయర్‌గా గుర్తింపు పొందిన లిన్ డాన్‌కు మలేసియా స్టార్ లీ చోంగ్ వీ, తన దేశానికే చెందిన చెన్ లాంగ్ నుంచి గట్టిపోటీ లభించే అవకాశముంది. 5 అడుగుల 10 అంగుళాల ఎత్తు, 70 కేజీల బరువున్న లిన్ డాన్‌కు మెగా ఈవెంట్స్‌లో అద్వితీయ ఆటతీరుతో అదరగొట్టే అలవాటుంది. రియోలోనూ అదే దూకుడు కొనసాగించి అరుదైన ‘హ్యాట్రిక్’ సాధించి లిన్ డాన్ మరో మైలురాయి చేరుకుంటాడో లేదో చూడాలి. సవోరి యోషిదా (రెజ్లింగ్) మహిళల ఫ్రీస్టయిల్ 53 కేజీల విభాగం (క్వాలిఫయింగ్, ఫైనల్స్ ఆగస్టు 18న సాయంత్రం గం. 6.30 నుంచి రాత్రి 1.30 వరకు) కవోరి ఇచో (రెజ్లింగ్) మహిళల ఫ్రీస్టయిల్ 58 కేజీల విభాగం (క్వాలిఫయింగ్, ఫైనల్స్ ఆగస్టు 17న సాయంత్రం గం. 6.30 నుంచి రాత్రి 2.20 వరకు) గతంలో ఏ మహిళా క్రీడాకారిణికి సాధ్యంకాని రికార్డును సాధించేందుకు జపాన్ రెజ్లర్లు సవోరి యోషిదా, కవోరి ఇచో ‘రియో’ రంగంలోకి దిగనున్నారు. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో మహిళల రెజ్లింగ్ తొలిసారి ప్రవేశపెట్టినప్పటి నుంచి యోషిదా (55 కేజీలు)... కవోరి ఇచో (63 కేజీలు) వరుసగా మూడు ఒలింపిక్స్‌లలో స్వర్ణాలు సాధించారు. 2013లో ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య ఒలింపిక్ వెయిట్ కేటగిరిలో మార్పులు చేయడంతో ఈసారి రియోలో యోషిదా 53 కేజీల విభాగంలో, కవోరి ఇచో 58 కేజీల విభాగంలో పోటీపడనున్నారు. 33 ఏళ్ల యోషిదా తన కెరీర్లో కేవలం రెండు బౌట్లలో మాత్రమే ఓడిపోయింది. వరుసగా 13 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో (2002 నుంచి 2015 వరకు) స్వర్ణాలు నెగ్గి రెజ్లింగ్ చరిత్రలోనే ఎవరీకి సాధ్యంకాని రికార్డును సొంతం చేసుకున్న యోషిదా వరుసగా నాలుగు ఆసియా క్రీడల్లోనూ (2002 నుంచి 2014 వరకు) పసిడి పతకాలు సాధించడం విశేషం. మరోవైపు 32 ఏళ్ల కవోరి ఇచో 10 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో స్వర్ణాలు సాధించింది. ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో వ్యక్తిగత క్రీడాంశంలో ఇద్దరు మాత్రమే (అల్ ఒయెర్టర్ (డిస్కస్ త్రో) అమెరికా; 1956, 1960, 1964, 1968... కార్ల్ లూయిస్ (లాంగ్‌జంప్) అమెరికా; 1984, 1988, 1992, 1996) వరుసగా నాలుగు ఒలింపిక్స్‌లలో స్వర్ణాలు సాధించారు. ఈసారీ యోషిదా, కవోరి ఇచో స్వర్ణాలు నెగ్గితే కొత్త చరిత్ర సృష్టిస్తారు. ఒక్సానా చుసోవితినా (జిమ్నాస్టిక్స్) మహిళల వ్యక్తిగత ఆల్‌రౌండ్, వాల్ట్, ఫ్లోర్, బ్యాలెన్సింగ్ బీమ్, అన్ఈవెన్ బార్స్ (ఆగస్టు 7న క్వాలిఫయింగ్, 14న వాల్ట్ ఫైనల్) కెరీర్‌కు వీడ్కోలు పలికి కోచ్‌గా లేదా కుటుంబ బాధ్యతల్లో స్థిరపడే వయస్సులోనూ పతకం కోసం బరిలోకి దిగుతున్న జిమ్నాస్ట్ ఒక్సానా చుసోవితినా. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన 41 ఏళ్ల ఒక్సానా గత ఏడేళ్లుగా జర్మనీ తరఫున అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటోంది. రియో ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న క్రీడాకారుల్లో పెద్ద వయస్కురాలు ఒక్సానాయే కావడం విశేషం. ఒక్సానాకిది వరుసగా ఏడో ఒలింపిక్స్. ఇప్పటి వరకు ఏ జిమ్నాస్ట్ కూడా ఏడు ఒలింపిక్స్‌లలో పాల్గొనలేదు. 1991కు ముందు సోవియెట్ యూనియన్ తరఫున పాల్గొన్న ఒక్సానా 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో యూనిఫైడ్ (విచ్ఛిన సోవియట్ యూనియన్ దేశాలతో కూడిన జట్టు) టీమ్ తరఫున ఆడి టీమ్ ఈవెంట్లో స్వర్ణం సాధించింది. తన మూడేళ్ల కుమారుడు అలీషెర్కు బ్లడ్ క్యాన్సర్ రావడంతో ఒక్సానా కుటుంబం చికిత్స కోసం జర్మనీకి మకాం మార్చి అక్కడే స్థిరపడింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో జర్మనీ తరఫున ఒక్సానా వాల్ట్ ఈవెంట్లో రజతం సాధించింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఐదో స్థానంలో నిలిచింది. రియో ఒలింపిక్స్‌లో ఐదు వ్యక్తిగత ఈవెంట్స్‌లో పాల్గొంటున్నా... ఆమె తన ఫేవరెట్ ఈవెంట్ వాల్ట్‌లోనే పతకంపై గురి పెట్టింది. ఈ ఏడాది వాల్ట్ స్కోరింగ్‌లో ఒక్సానా మూడో స్థానంలో (15.325 పాయింట్లు) ఉండటం విశేషం. మైకేల్ ఫెల్ప్స్ (స్విమ్మింగ్) పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ (ఆగస్టు 10న ఫైనల్-ఉ.గం. 6.48 ని.కు), 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లే (ఆగస్టు 12న ఫైనల్-ఉ.గం. 7.31 ని.కు), 100 మీటర్ల బటర్‌ఫ్లయ్ (ఆగస్టు 13న ఫైనల్-ఉ.గం. 6.42 ని.కు). ‘ఈత కొలనులో బంగారు చేప’ మైకేల్ ఫెల్ప్స్ తన రిటైర్మెంట్ను ఉపసంహరించుకొని మరీ ‘రియో’లో అడుగుపెట్టాడు. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో 15 ఏళ్ల ప్రాయంలోనే బరిలోకి దిగిన ఫెల్ప్స్ 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఈవెంట్లో పోటీపడి ఫైనల్‌కు చేరుకొని ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. సిడ్నీ నుంచి రిక్తహస్తాలతో తిరిగొచ్చిన తర్వాత 31 ఏళ్ల ఈ అమెరికా స్టార్ స్విమ్మర్ ఒలింపిక్స్ క్రీడల చరిత్రలోనే అత్యధికంగా 22 పతకాలు (18 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు) సాధించిన క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. 6 అడుగుల 4 అంగుళాల ఎత్తు, 88 కేజీల బరువున్న ఫెల్ప్స్ 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో 6 స్వర్ణాలు, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో 8 స్వర్ణాలు, 2012 లండన్ ఒలింపిక్స్‌లో 4 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు సాధించాడు. రియోలో మాత్రం ఫెల్ప్స్ మూడు ఈవెంట్స్‌లోనే బరిలోకి దిగుతున్నాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఫెల్ప్స్ రియోలోనూ పసిడి పతకాలపై గురి పెట్టాడు. షూటింగ్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫయింగ్: అయోనికా పాల్, అపూర్వీ చండీలా (సాయంత్రం గం. 5.00 నుంచి) ఫైనల్: రాత్రి గం. 7.00 నుంచి పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫయింగ్: జీతూ రాయ్, గుర్ప్రీత్ సింగ్ (రాత్రి గం. 9.30 నుంచి) ఫైనల్: రాత్రి గం. 12.00 నుంచి ఇటీవల కాలంలో జీతూ రాయ్ నిలకడైన ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే అతను పతకం తెస్తాడని ఆశించవచ్చు. మహిళా షూటర్లు అపూర్వీ, అయోనికా పాల్ ఫైనల్‌కు చేరితే మాత్రం ఒకరి నుంచి పతకం వచ్చే అవకాశముంది. రోయింగ్ పురుషుల సింగిల్ స్కల్స్ (హీట్-1) దత్తూ బబన్ భోకనాల్ (సాయంత్రం. గం. 5.00కు) ఏడు నిమిషాల్లోపు రేసును పూర్తి చేస్తే ఈ భారత రోయర్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకునే అవకాశముంది. మొత్తం ఆరు హీట్స్ నుంచి 18 మంది క్వార్టర్ ఫైనల్ చేరుకుంటారు. పురుషుల హాకీ భారత్ ఁ ఐర్లాండ్ (గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్) రాత్రి గం. 7.30 నుంచి తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడుతోన్న ఐర్లాండ్‌ను తక్కువ అంచనా వేయకుండా భారత్ ఆడాలి. మ్యాచ్‌పై దృష్టి సారించేందుకు భారత హాకీ జట్టు ప్రారంభోత్సవానికి దూరంగా ఉంది. పురుషుల టెన్నిస్ డబుల్స్ తొలి రౌండ్ లియాండర్ పేస్-రోహన్ బోపన్న ఁ లుకాస్ కుబోట్-మట్కోవ్‌స్కీ (పోలాండ్) రాత్రి గం. 7.30 నుంచి డబుల్స్‌లో అపార అనుభవజ్ఞులైన పేస్-బోపన్న తమ స్థాయికి తగ్గట్టు పూర్తి సమన్వయంతో ఆడితేనే విజయాన్ని దక్కించుకుంటారు. ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో కుబోట్ 25వ, మట్కోవ్‌స్కీ 27వ ర్యాంక్‌లో ఉన్నారు. వీరిని తక్కువ అంచనా వేస్తే తొలి రౌండ్లోనే షాక్ తగలొచ్చు. అన్ని సమయాలు భారత కాలమానం ప్రకారం -
తెలుగు రాష్ట్రాల్లో సెల్కాన్ హవా
♦ రూ.4 వేల లోపు విభాగంలో టాప్ ♦ 41.5 శాతం వాటా దీనిదే: జేఎఫ్‌కే ♦ జూలైలో మార్కెట్లోకి టీవీలు! హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల మార్కెట్లో సుస్థిర వాటా దిశగా సెల్కాన్ అడుగులేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ.4 వేల లోపు మొబైల్ఫోన్ల విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. మార్కెట్ పరిశోధన సంస్థ జీఎఫ్కే గణాంకాల ప్రకారం జనవరి-మార్చి కాలంలో సెల్కాన్ 41.5 శాతం వాటాతో టాప్-1 స్థానం సంపాదించింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.4 వేలలోపు విభాగంలో తొలి త్రైమాసికంలో 7 లక్షలకుపైగా స్మార్ట్ఫోన్లు, బేసిక్ ఫోన్లను విక్రయించామని సంస్థ సీఎండీ వై.గురు సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. నాణ్యమైన ఫోన్లను ఆధునిక ఫీచర్లతో అందుబాటు ధరలో తీసుకురావడం కస్టమర్ల ఆదరణకు కారణమని చెప్పారు. ఫింగర్ ప్రింట్ ఫీచర్‌తో.. కంపెనీ కొద్ది రోజుల్లో ఫింగర్ ప్రింట్ ఫీచర్‌తో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తోంది. మెటాలిక్ బాడీతో రానున్న ఈ మోడల్ ధర రూ.7 వేల శ్రేణిలో ఉండనుంది. ఇక 5 అంగుళాల స్క్రీన్‌తో తయారైన డైమండ్ 4జీ ప్లస్ మోడల్‌ను తాజాగా 2.5డీ కర్వ్డ్ ఎడ్జ్ గ్లాస్ డిజైన్‌తో ప్రవేశపెట్టారు. ధర రూ.6,333 ఉంది. కస్టమర్లు వినూత్న అనుభూతికి లోనయ్యేలా సెల్కాన్ సొంతంగా అభివృద్ధి చేసిన ఫ్లో సాఫ్ట్‌వేర్‌ను దీనికి జోడించారు. ఇంగ్లీషు వాక్యాలు 22 భాషల్లోకి ఇట్టే తర్జుమా చేసుకోవచ్చు. 4.5 అంగుళాల స్క్రీన్‌తో రూ.5 వేలకే మరో వేరియంట్‌ను తీసుకొస్తోంది. వాయిస్ ఓవర్ ఎల్టీఈ టెక్నాలజీతో 4జీ స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తోంది. విద్యార్థులకు రూ.1,000 డిస్కౌంట్.. సెల్కాన్ 8 అంగుళాల 4జీ హెచ్డీ ట్యాబ్లెట్ పీసీని విద్యార్థులకు రూ.1,000 డిస్కౌంట్‌తో రూ.7,333లకు విక్రయిస్తోంది. కొద్ది రోజుల్లో 7 అంగుళాల ట్యాబ్లెట్పైన రూ.500 డిస్కౌంట్‌ను కంపెనీ ప్రకటించనుంది. సెల్కాన్ టీవీలు జూలైలో అందుబాటులోకి వస్తాయని గురు వెల్లడించారు. 24 నుంచి 50 అంగుళాల శ్రేణిలో వీటిని తీసుకొస్తున్నట్టు చెప్పారు. మేడ్చల్ వద్ద ఉన్న ప్లాంటులో కంపెనీ వీటిని రూపొందిస్తోంది. డీవీడీలు, సెట్ టాప్ బాక్స్‌ల తయారీని రానున్న రోజుల్లో చేపట్టనుంది. ఇందుకు అనుగుణంగా హైదరాబాద్, తిరుపతి ప్లాంట్లను తీర్చిదిద్దుతామని ఆయన వివరించారు. -
పవన్ కల్యాణ్ టీవీ ఛానల్ పెడుతున్నారా?
హైదరాబాద్: ఇంట్లో పని వాళ్లకు జీతాలు ఇచ్చేందుకు, పార్టీ నడిపేందుకు డబ్బుల్లేవని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత మీడియాను ఏర్పాటు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారా? టీవీ చానల్,లేదా పేపర్ పెట్టబోతున్నారా? 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నట్టు ఇటీవల తేల్చిచెప్పిన పవర్ స్టార్ తన ప్రచారం కోసం తన సొంత టీవీ, పత్రికా మాద్యమాన్ని ఉపయోగించుకోబోతున్నారా? అంటే అవుననే ఊహాగానాలు టాలీవుడ్ లో జోరుగా సాగుతున్నాయి. సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టి 2019 ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జనసేన పోటీ చేయనున్నామని ఇటీవల జనసేన అధినేత మీడియాకు స్పష్టం చేశారు. తద్వారా పూర్తి సమయం రాజకీయాలకు అంకితం కానున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన టీవీ ఛానల్, లేదా పేపర్ పెట్టనున్నారనే వార్తలకు బరింత బలం చేకూరింది. మరోవైపు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగే క్రమంలో, తనపై , పార్టీపై చెలరేగే విమర్శల్ని సమర్ధవంతంగా తిప్పికొట్టాలనే ఆలోచనతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే సొంత మీడియా ఉంటే మేలనే ఆలోచనతో కొత్త టీవీ ఛానల్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రయత్నాల్లో భాగంగా ముందు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించనున్నారని అంటున్నారు. ఆ తర్వాత ఓ ఛానల్ కూడా కొంటారని తెలుస్తోంది. దీనిద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలనే ప్రణాళికతో ముందుకు వెడుతున్నట్టుసమాచారం. ఇప్పటికే పార్టీ నడిపేందుకు డబ్బులు లేవని చెప్పిన పవన్ కల్యాణ్ రాబోయే ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారనే ప్రశ్నలు గతంలోనే చాలా వినిపించాయి. మరి నెలగడవడం కష్టంగా ఉంది. ..చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని మీడియా ముందు ప్రకటించిన పవన్ ఓ టీవీ ఛానల్ పెట్టడం, ఓ న్యూస్ పేపర్ పెట్టడం లేదా టీవీ ఛానల్ కొనడం సాధ్యమయ్యే పనేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే.. మరింతకాలం వేచి చూడాల్సిందే.. -
మీ టీవీ ని ఎలా శుభ్రం చేస్తున్నారు?
ముందు మానిటర్ని ఆఫ్ చేయండి. దీంతో మురికి ఎక్కడ ఉందో కనిపిస్తుంది. ♦ పొడిగా ఉండే మెత్తటి క్లాత్‌ను (కళ్లద్దాలను తుడిచేలాంటి క్లాత్) తీసుకొని, ముందు దుమ్ము పోయేలా తుడవండి. ఎక్కువ ఒత్తిడి లేకుండా పై నుంచి కిందకు తుడవాలి. ♦ వెనిగర్, నీళ్లు సమభాగాలు తీసుకొని దీంట్లో మెత్తటి క్లాత్ ముంచి, పిండి దాంతో స్క్రీన్‌ను తుడవాలి. ఆ తర్వాత పొడి క్లాత్‌తో తుడవాలి. ♦ పేపర్ టవల్స్, టాయిలెట్ పేపర్స్, షర్ట్ క్లాత్స్‌ను స్క్రీన్ తుడవడానికి ఉపయోగించకూడదు. ♦ అమ్మోనియా, ఇథైల్ ఆల్కహాల్, ఎసిటోన్ వంటి రసాయనాలతో స్క్రీన్ తుడిస్తే త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. ♦ లిక్విడ్స్ ఏ మాత్రం డెరైక్ట్‌గా స్క్రీన్ మీద స్ప్రే చేయకూడదు. స్ప్రే మానిటర్ లోపలికి వెళ్లే అవకాశాలు ఉంటాయి. దీంతో త్వరగా స్క్రీన్ పాడవ్వచ్చు. -
ఎల్బీనగర్లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్లో ఆదివారం క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. క్రికెట్ బెట్టింగ్ ముఠాలో రాజ్‌కుమార్ అనే వ్యక్తి సహా మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ముఠా నుంచి రూ. లక్షా 41 వేలు, ల్యాప్‌ట్యాప్, టీవీ, వాహనంలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
టీవీ కొంచెం... రిమోట్ ఘనం
తిక్క లెక్క టీవీ సైజు ఎంత ఉంటుంది..? ఇళ్లలో సాధారణంగా వాడే ఎంత భారీ టీవీ అయినా మహా అయితే నలభై అంగుళాలు ఉంటుందేమో! రిమోట్ సంగతేముందిలే.. అరచేతిలో ఇమిడిపోయేదేగా.. అనుకుంటున్నారా..? ఫొటోలో కనిపిస్తున్న ఈ రిమోట్‌ను చూడండి.. దీని పొడవు ఏకంగా 14 అడుగుల 9.1 అంగుళాలు. ఉత్తుత్తి రిమోట్ నమూనా ఏమీ కాదు, నిజంగానే పనిచేస్తుంది. ఎదురుగా మామూలు సైజులో ఉన్న టీవీని పెట్టుకుని, ఈ రిమోట్‌ను నొక్కుతూ చానళ్లను మార్చుకోవచ్చు, సౌండ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయితే, దీనిని ఎత్తాలంటే ఒక మనిషికి సాధ్యం కాదు. కనీసం ముగ్గురైనా ఉండాల్సిందే. ఒడిశాలోని సంబల్పూర్ నగరానికి చెందిన సోదరులు సూరజ్‌కుమార్ మెహర్, రాజేశ్‌కుమార్ మెహర్ దీనిని రూపొందించి గిన్నెస్ రికార్డు సాధించారు. -
ఇక ఇన్ఫోకస్ ఎల్ఈడీ టీవీలు..
♦ ధరల శ్రేణి రూ.10-70 వేలు ♦ కస్టమర్ల ఇంటివద్ద ఉచిత డెమో హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల విక్రయంలో ఉన్న అమెరికన్ కంపెనీ ఇన్ఫోకస్... ఎల్ఈడీ టీవీల విభాగంలోకి ప్రవేశించింది. 24, 32 అంగుళాల సైజులో హెచ్డీ ఎల్ఈడీ టీవీలను విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రూ.9,999, రూ.15,999 ఉన్నాయి. అలాగే ఫుల్ హెచ్డీ ఎల్ఈడీల శ్రేణిలో 50, 60 అంగుళాల సైజులో టీవీలను తీసుకొచ్చింది. ఈ మోడళ్ల ధర వరుసగా రూ.34,999, రూ.69,999గా నిర్ణయించింది. మొబైల్ ఫోన్ల విక్రయం ద్వారా భారత్‌లో 10 లక్షల మందికి చేరువయ్యామని ఈ సందర్భంగా ఇన్ఫోకస్ ఇండియా హెడ్ సచిన్ థాపర్ చెప్పారు. ఇదే ఊపుతో ఇప్పుడు టీవీలను తీసుకొచ్చామన్నారు. ‘టీవీలకు అత్యుత్తమ డిస్ప్లే ప్యానళ్లను వినియోగించాం.జపాన్‌లో తయారైన షార్ప్ ప్యానెల్‌తో 60 అంగుళాల టీవీని రూపొందించాం. పరిశ్రమలో తొలిసారిగా ఫ్రీ డెమోను ప్రారంభించాం’ అని వివరించారు. ఇంటివద్ద ఉచిత డెమో..:ఇన్ఫోకస్ మొబైళ్లతోపాటు టీవీలను ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్ రూపొందిస్తోంది. ఈ-కామర్స్ కంపెనీ స్నాప్‌డీల్‌లో మాత్రమే ఫిబ్రవరి 29 నుంచి టీవీలు అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్ షాపింగ్ అనుభూతిని తిరగరాస్తూ ఇన్ఫోకస్ తొలిసారిగా ‘ఫ్రీ డెమో ఎట్ హోం’ను ప్రకటించింది. కస్టమర్ల ఇంటి వద్ద 50 అంగుళాల ఫుల్ హెచ్డీ టీవీ పనితీరును డెమో ద్వారా వివరిస్తారు. 18 ప్రధాన నగరాల్లో ఈ సౌకర్యం ఉందని స్నాప్‌డీల్ పార్ట్నర్షిప్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టోనీ నవీన్ తెలిపారు. కాగా, స్మార్ట్ యూవీ2ఏ టెక్నాలజీని టీవీల్లో వాడారు. వీక్షకుల కళ్లపై తక్కువ కాంతి పడుతుందని కంపెనీ తెలిపింది. -
చీకట్లు
పసిమొగ్గల్లో అంధత్వం! ♦ చిన్నారుల్లో ఏ విటమిన్ లోపం ♦ {పతి వంద మందిలో ఏడుగురికి సమస్య ♦ రోజురోజుకు పెరుగుతున్న బాధితులు ♦ పౌష్టికాహారలోపం, చీకటి గదుల్లో విద్యాబోధనే కారణం ♦ కళ్లజోళ్లు తప్పనిసరి అవుతున్న దుస్థితి జోగిపేట: గతంలో కంటి చూపు తగ్గుతుందంటే వృద్ధాప్యం దగ్గర పడుతుందని భావించే వారు. కానీ నేడు వయసుతో సంబం ధం లేకుండా కంటిచూపు మందగిస్తోంది. చీకటి గదుల్లో విద్యా బోధన, టీ వీ చూడటం, కంప్యూటర్, వీడియో గేమ్స్, సెల్లో చిత్రాలు వీక్షించడం తదితర కారణాలతో పిల్లల్లో కంటి చూపు తగ్గుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. బాధాకరమైన విషయం ఏమిటంటే పట్టుమని పదేళ్లు కూడా నిండని చిన్నారుల్లో దృష్టిలోపం ఏర్పడడం ఆందోళన కల్గించే అంశం. తల్లిదండ్రులు, వైద్య ఆరోగ్యశాఖ, విద్యాసంస్థలు జాగ్రత్తలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో పిల్లలందరూ కళ్లజోళ్లతో పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రతి 100 మంది చిన్నారుల్లో ఏడుగురికి దృష్టిలోపం ఉన్నట్లు సమాచారం. జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఈ విద్యా సంవత్సరంలో 50 వేల మందికి పైగా విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో తప్పనిసరిగా 2,609 మంది విద్యార్థుల కు కంటి అద్దాలు అవసరమని గుర్తించారు. ఈ మాసంలో అద్దాలను పంపిణీ చేయనున్నారు. వేలాది మంది విద్యార్థులకు కంటిలో వేసుకునేందుకు ఐ డ్రాప్స్‌ను పంపిణీ చేశారు. వీరిలో 10 ఏళ్లలోపు వారే ఎక్కువ ఉన్నట్లు సమాచారం. జిల్లాలో కంటి చూపు తగ్గుతున్న పిల్లల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. పదేళ్లలోపు చిన్నారుల్లో ఈ సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. పదేళ్లలోపు ఉన్న 100 మంది చిన్నారులను పరిశీలిస్తే అందులో ఏడుగురు దృష్టిలోపంతో బాధపడుతున్నారు. కంటి చూపు తగ్గకుండా వైద్య ఆరోగ్యశాఖ ప్రతి ఆరు నెలలకోసారి కంటి పరీక్షలు నిర్వహించి విటమిన్ ఏ అందిస్తున్నా ఆశించిన ఫలితం ఉండటం లేదు. కాగా.. పిల్లల చూపు తగ్గకుండా ఉండేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. చూపు తగ్గడానికి కారణాలు ♦ పిల్లలకు పాలు, గుడ్డు అకుకూరలు, కాయగూరలు, పప్పు దినుసులు అవసరమైనంత మేరకు తీసుకోకపోవడంతో విటమిన్ ఏ కాల్షియం స్థాయి తగ్గిపోయి కంటి చూపు మందగిస్తుంది. ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. ♦ వెలుతురు, గాలి లేని తరగతి గదుల్లో విద్యాభ్యాసం చేయడం. ♦ తరగతి గదుల్లో బ్లాక్ బోర్డులనే వాడాలి. బ్లాక్ బోర్డుపై చాక్‌పీస్‌తో రాసిన అక్షరాలు దూరం నుంచి కూడా కళ్లపై ఒత్తిడి లేకుండా కనిపిస్తాయి. ♦ తెల్లబోర్డులు, మార్కర్లు వాడడంతో కళ్లపై ఒత్తిడి పడి నరాలపై ప్రభావం చూపి కంటి చూపు తగ్గుతుంది. ♦ {పస్తుతం పుస్తకాలలో అక్షరాలు కూడా మరీ చిన్నగా ముద్రిస్తున్నారు. ఇది కూడా కొంతవరకు ప్రభావం చూపుతుంది. ♦ టీవీ, కంప్యూటర్, వీడియో, సెల్లో గేమ్స్ ఆడే పిల్లల్లో కంటి చూపు సమస్య ఉత్పన్నమవుతుంది. 50 వేల మంది చిన్నారులకు కంటి పరీక్షలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం తరపున కంటి పరీక్షలు నిర్వహించాం. ఇందులో 2.069 మంది విద్యార్థిని, విద్యార్థులకు తప్పనిసరిగా కంటి అద్దాలు అవసరమని గుర్తించాం. వారికి ఈనెలలో కంటి అద్దాలను ఉచితంగా అందజేస్తున్నాం. అవసరమైన వారికి ఐ డ్రాప్స్ మందులను పంపిణీ చేశాం. చిన్నారులకు కంటిని కాపాడుకోవడానికి అవసరమైన జాగ్రత్తలను ప్రతి పాఠశాలలో వివరించాం. ప్రతి సంవత్సరం కంటి పరీక్షలను పాఠశాలల్లో నిర్వహిస్తున్నాం. దృష్టిలోపంతో బాధపడుతున్న వారందరినీ గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం - డాక్టర్ అమర్‌సింగ్, డీఎంహెచ్ఓ, సంగారెడ్డి జాగ్రత్తలు తప్పనిసరి ఆహారంలో విటమిన్ ఏ, కెరోటినాయిడ్లు, ట్యూటిన్ అధికంగా ఉండే ఆకుకూరలు క్యారెట్, ద్రాక్ష, బొప్పా యి, చిలుగడదుంపలు తీసుకోవడం తో కంటి సమస్యల నుంచి రక్షణ పొం దవచ్చు. ఏ పనిచేస్తున్నా గంటకోసారి దూరంగా ఉన్న వస్తువును చూడాలి. ఇలా అయిదారు సార్లు చేయడంతో కళ్లపై వత్తిడి తగ్గుతుంది. పనిలో పడిపోయి కళ్లను మూ స్తూ.. తెరుస్తూ ఉండటం మరచిపోవద్దు. పిల్లలు, పెద్ద లు ఎలాంటి సమస్య లేకపోయినా క్రమం తప్పకుండా కళ్లను పరీక్ష చేయించుకోవాలి. కంటి సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి. పిల్లలకు దృష్టిలోపం రాకుండా ఉండేదుకు పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలి. - డాక్టర్ ఎస్.రవీందర్‌గౌడ్, కంటి వైద్య నిపుణులు -
సీరియల్ శ్రీమతి...
సతి బాధ బిచ్చం వేయాల్సి వస్తుందని మా అపార్ట్మెంట్ వాళ్లు అసలు పిల్లులే లేకుండా చేశారు. కొంచెం పిసినారులు. కాని ఎందుకనో చాలాసేపుగా పిల్లి ఏడుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. పిల్లి ఏడవడం గతంలో విన్నావా అని అడగొద్దు. వినలేదు. కాని అది మాత్రం పిల్లి ఏడుపే అనిపించింది. నిద్ర లేచాను. పూర్వం అంటే అందరూ దిండు పక్కన హనుమాన్ చాలీసానో పోతన భాగవతమో లేదంటే యద్దనపూడి సులోచనారాణి నవల- జీవన తరంగాలలో పెట్టుకుని నిద్రపోయేవారు. ఇప్పుడవన్నీ లేవుగా. సెల్‌ఫోన్ ఉంటుంది. పట్టుకొని నొక్కి చూశాను. రెండున్నర! దేవుడా... ఇంత రాత్రి వేళ ఈ భయంకరమైన పిల్లి ఏడుపు ఏమిటి? అసలే ఆ పూట టీవీలో ‘రాజుగారి పాత వరండా’ వేశారు. భయంతో చచ్చాను. ఇప్పుడీ ఏడుపుకు మళ్లీ చస్తున్నాను. వింజమూరి రవీంద్రనాథ్ సీరియల్ ‘లవంగదళం’ ప్రకారం అసంతృప్త ఆత్మలు పిల్లి రూపం దాలుస్తాయి. ఇప్పుడు కూడా... వ..వ..వణుకుతూ పక్కన చూశాను. మా మణిమకుటం నిండా రగ్గు కప్పుకుని ఈ లోకం ఎటైనా తగలడనీ అనే తాత్త్విక చింతనతో నిద్రపోతూ ఉంది. ఇప్పుడు నా గతి ఏమిటి? అద్దం వైపు చూశాను. ఎవరో అద్దం ముందు కూచుని తీరిగ్గా తల దువ్వుకుంటూ పిల్లిలా ఏడుస్తున్నారు. అద్దిరి పడి లేచి మంచం మీద నుంచి ఒక్క దూకు దూకి లైట్ వేశాను. మా ఆవిడ!మంచం మీద చూశాను. ఖాళీ రగ్గు.‘ఎ..ఎ.. ఏమిటి... ఏమిటిది?’ ఆశ్చర్యపోయింది. ‘ఏమైంది మీకు ఎందుకంత కంగారు పడుతున్నారు’...‘ఇంత రాత్రి పూట ఎందుకలా ఏడుస్తున్నావ్?’ ‘ఏడుస్తున్నానా? పాడుకుంటూ బాధ పడుతున్నాను’.‘పాడుకుంటున్నావా?’ ‘అవును. ‘మూగరాగం’ సీరియల్లో హీరోయిన్ని తలుచుకుని బాధ పడుతున్నాను. తను ఇవాళ చచ్చిపోయింది.’ ‘చచ్చిపోయిందా?’ ‘సీరియల్లో చచ్చిపోయింది. అందుకని తను సీరియల్లో డైలీ పాడే ‘ఆడజన్మ అతి సుందరలాల బహుగుణం... మమతం.. జయలలితం... చంద్రికా కుమారతుంగం’... అని పాడుకుంటూ ఉన్నాను’... ‘దానికి ఈ టైమే దొరికిందా’... ‘ఎనిమిదిన్నరకు చచ్చిపోయింది. ఈ విషాదం సింక్ కావడానికి టైమ్ పట్టింది. లేచి గుర్తు చేసుకుంటూ కూచున్నాను’ ‘మరి తల దువ్వుకోవడం ఏమిటి?’ ‘వస్తూ వస్తూ మెడికేర్ షాంపూ తెమ్మంటే తెచ్చారా? పేలతో చస్తున్నాను. ఎలాగూ టైమ్ దొరికింది కదా అని...’ ఆ రాత్రి నా నిద్ర సీరియల్ తన్నుకుపోయింది. ఒకటో తారీఖు వచ్చింది. సరుకుల పట్టి తెచ్చి ఇచ్చింది. చదివి ఉలిక్కి పడ్డాను.‘ఏమిటిది?’‘ఏమిటి ఏమిటిది?’ ‘ఇదేమిటి?’... వేలు పెట్టి చూపించాను.‘విషం’...‘అదే విషం ఏమిటి?’ ‘నా తల కొట్టేసినట్టుగా ఉంటోంది’ ‘అంటే’ ‘మీరు చూళ్లేదా? ప్రతి సీరియల్లోనూ కిచెన్ కప్‌బోర్డులో విషం అని రాసిన సీసా ఉంటుంది. ఇంత పెద్ద కిచెన్ చేయించారు. కాని ఒక్క విషం సీసా కూడా లేదు. ఇంకా కొనుక్కోలేదా అని ఇవాళ జరిగిన కిట్టీ పార్టీలో ఆ త్రీనాట్ టూ, ఫోర్ నాట్ సెవన్ చుప్పనాతులు నన్ను ఎగతాళి చేశారు. వాళ్లంతా ఎప్పుడో కొనేసుకున్నారట. అసలు విషం సీసా లేని కిచెనూ ఒక కిచనేనా అని తెగ నవ్వుతున్నారు’‘విషం అని రాసిన సీసా ఎవరు అమ్ముతారు?’‘ఏమో నాకేం తెలుసు’ ‘ఒక పని చెయ్. మొన్న వద్దు వద్దంటున్నా వినకుండా గులాబ్‌జాములు చేశావుగా. ఆ జీరా తీసి సీసాలో వేసి పెట్టుకో. సరిపోతుంది’ ‘దానిని మీ అమ్మ కోసం దాచాను’ ‘హర్ని... అమ్మ నా కోడలు పిల్ల కమలాక్షి’ ‘కోడలు పిల్ల కమలాక్షి కాదు... పంకజం. ఆ రోల్ తమిళ నటి పొన్నరుసు వేస్తోంది’ ‘ఇప్పుడేమంటావ్? ‘నా హోదాకు తగ్గట్టుగా కిచెన్‌లో విషం సీసా ఉండాల్సిందే’. మొన్న ఆఫీసు నుంచి వచ్చేసరికి అలిగి కూచుని ఉంది. మూడు గంటల ఏడు నిమిషాల సేపు బతిమిలాడినా మాట్లాడలేదు. తర్వాత అసలు కారణం చెప్పింది. మా బంధువుల అమ్మాయికి ఫోన్ చేసిందట. తనకు రెండు వారాల క్రితం పాప పుట్టింది. ఆ పాపకు ఎలాగైనా సరే ‘ద్విక్తా కపూర్’ అనే పేరు పెట్టాలని పట్టుపట్టిందట. ఆ అమ్మాయి అంత కంటే మొండి పట్టుదలతో నేనెందుకు పెడతాను... బిందు నాయుడో మంజులా నాయుడో అని పెడతాను అని అడ్డం తిరుక్కుందట. ‘మీరే చెప్పండి. నేను ఏక్తా కపూర్ అని పెట్టమంటే కాదనడంలో అర్థముంది. అంతకంటే ఒక ఆకు ఎక్కువ చదవాలని ద్విక్తా అని చెప్పాను. బిందు, మంజులా లోకల్ కదండీ. ముంబై లెవల్లోకి వెళ్లొద్దా. ‘కాదంటే కూర చేయాల్సింది కమలత్తే’ అని కే సెంటిమెంట్‌తో ఒక సీరియల్ కొడితే ఎలా గ్రాండ్‌గా ఉంటుందంటారు’... నేను బాత్రూమ్లో దాక్కున్నాను. మా ఆవిడ బంగారం. నేనంటే భలే ఇష్టం. పిల్లలంటే ప్రాణం. ఇక మా అమ్మన్నా... చెల్లెలన్నా... చెప్పుకోవడం ఎందుకు... ఒక్క క్షణం కూడా వాళ్ల నోటి నుండి మాట పెగలనివ్వదు. అన్ని సద్గుణాలు ఉన్నా ఇదో దుర్గణం ఉంది. సీరియల్స్ చూడటం. ఎక్కువ చూస్తుందని చెప్పను కాని మధ్యాహ్నం ఒన్ టు సిక్స్ మళ్లీ సాయంత్రం సిక్స్ టు టెన్ చూస్తుంది. వద్దంటే నా సంగతి చూస్తుంది. మొన్నొక రోజు ఆఫీస్ నుంచి వస్తూనే అడిగింది. ‘ఏమండీ... మీకెవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఆమెకేదైనా ఫ్యాక్టరీ ఉందా?’‘లేదు. ఏం?’ ‘ఛ’ డిప్రెస్ అయి కూచుంది. ‘ఏమైందో చెప్పరాదా?’ ‘మీకు గర్ల్‌ఫ్రెండ్ ఉంటే ఆ గర్ల్‌ఫ్రెండ్‌కు ఫ్యాక్టరీ ఉంటే నాకు ఆ సంగతి తెలిసి నేను కూడా ఫ్యాక్టరీ పెట్టి ఆమె ఫ్యాక్టరీని దివాలా తీయించడానికి అందులో నా మనిషిగా మీ దూరపు బంధువు బాజీరావు మస్తానీని పెట్టి తను పాపర్ పట్టి పోయి బ్లాక్ శారీ కట్టుకుని జుట్టు విరబోసుకొని బంజారా హిల్స్ రోడ్డు నంబర్ 11లో రెండు కాళ్ల మీద నడుచుకుంటూ పోతుంటే నేను కారు దిగి హాహాహా అని పెద్దగా నవ్వి- చూశావా శర్మిష్టా... నా వాణ్ణి నీవాడుగా చేసుకోవాలనుకున్నావ్. కాని నావాడు నావాడే నీవాడు కాడు నీ వాడు కావాలనుకుంటే నావాడు కాక మునుపే చూసుకోవాల్సింది ఇప్పుడు నావాడు అయిపోయాక కాదు నా వాడు నా వాడు కావాల్సిందే అని పట్టుపడితే నాలోని సతి బయటకు వచ్చి శతమానం భవతికి భాష్యం చెప్పదా. నాతిచరామికి నవీన రూపం ఇవ్వదా. పాణి గ్రహణం అనే మాటకు పెద్ద ఎక్స్పోజర్ కల్పించి’...అయ్యా. అదీ సంగతి. - భా.బా (భార్యా బాధితుడు) గమనిక: నేను సన్మానాలకు దూరం. రాజమండ్రికి రండి... ఉండ్రాజవరం రండి అని ఫోన్లు చేస్తున్నారు. సారీ. ఇందులో నా గొప్పదనం లేదు. ఉంటే గింటే నా శ్రీమతిదే అని ఆమెకు తెలిసేలా భయభక్తులతో విన్నవించుకుంటున్నాను. -
రూ.3 లక్షల నగలు, ఎల్ఈడీ టీవీ చోరీ
ఏలూరు(పశ్చిమగోదావరి జిల్లా): తంగెళ్లపల్లి గ్రామంలోని బాపూజీనగర్‌లో శనివారం మధ్యాహ్నం చోరీ జరిగింది. ఇంట్లోనివారు బయటికి వెళ్లినపుడు గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి రూ.3 లక్షల విలువైన బంగారు, వెండి నగలు, ఒక ఎల్ఈడీ టీవీ చోరీ చేశారని ఇంటి యజమాని దుర్గారావు శనివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
చూడకూడనివి చూస్తున్నాడు... ఆపేదెలా?!
కిడ్స్ మైండ్స్ * మా బాబు వయసు ఏడేళ్లు. విపరీతమైన అల్లరి చేస్తున్నాడు. అల్లరంటే అరవడం, పరుగులు తీయడం కాదు. అన్నీ పగులగొట్టేస్తూ ఉంటాడు. ఆట బొమ్మలు, ఇంట్లోని ఇతరత్రా వస్తువులు నేలకేసి కొట్టడం వాడికి చాలా ఇష్టం. అంతవరకూ బానే ఉంటాడు. ఉన్నట్టుండి చేతిలో ఉన్నదాన్ని విసిరి కొడతాడు. తిట్టినా, కొట్టినా వినడం లేదు. ఈ అలవాటు ఎలా పోగొట్టాలి? - వాణి, పాలకొల్లు హైపర్ యాక్టివ్‌గా ఉన్న పిల్లలు విపరీతంగా అల్లరి చేస్తుంటారు. ఒక్క దగ్గర కూర్చోరు. పరుగులు తీస్తూనే ఉంటారు. అలాంటి పిల్లలు ఇలా చేసే అవకాశాలు ఎక్కువ. కాకపోతే బాబు మరే విధమైన అల్లరీ చేయకుండా కేవలం విసిరి కొట్టడం మాత్రమే చేస్తున్నాడు. బహుశా ఇలా చేయడాన్ని తను ఎక్కడైనా చూసి ఉండవచ్చు. లేదంటే తను అలా ఒకట్రెండుసార్లు చేసినప్పుడు అటెన్షన్ దొరకడం వల్ల అది తనకు అలవాటైపోయి ఉండవచ్చు. దీన్ని మాన్పించాలంటే మీరొక పని చేయండి. దేనినైనా పగులగొడితే ‘టైమ్ అవుట్’ ఇస్తానని క్లియర్‌గా చెప్పండి. ‘టైమ్ అవుట్’ అంటే... తప్పు చేసినప్పుడు తనని తీసుకెళ్లి ఓ మూలన కూర్చోబెట్టి, అక్కడి నుంచి లేస్తే ఆ రోజు టీవీ చూడనివ్వననో ఆడుకోనివ్వననో చెప్పడం. వినడానికి ఇది చాలా సింపుల్‌గా అనిపిస్తుంది కానీ చాలా మంచి ఫలితాలనిస్తుంది. మొదట్లో బాబు లైట్‌గా తీసుకున్నా, నాలుగైదుసార్లు అలా చేసేసరికి తాను ఏం మిస్ అవుతున్నాడో అర్థమవుతుంది. అలాగే మీరు ఇలా చేయడం ఎంత ముఖ్యమో... బాబు బుద్ధిగా ఉన్నప్పుడు మెచ్చుకోవడమూ అంతే ముఖ్యం. దానివల్ల మంచిగా ఉంటే మెప్పుకోలు వస్తుందన్న విషయం కూడా అర్థమై తనలో మార్పు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. * మా పాపకు ఎనిమిదేళ్లు. పెద్దగా అల్లరి చేయదు. బాగా చదువుతుంది కూడా. అయితే ఎందుకో ఈ మధ్య అబద్ధాలు ఆడుతోంది. హోమ్‌వర్క్ చేయకపోయినా చేశానంటుంది. టీచర్ ఏదైనా అన్నా, స్నేహితులతో గొడవ పడినా మాకు చెప్పడం లేదు. విషయం తెలిసి మేము నిలదీసినా ఏదేదో చెప్తోంది తప్ప నిజం చెప్పట్లేదు. పోనీ మేం తిడతామని భయపడుతోందా అంటే... నేను అస్సలు కోప్పడను. మావారు నాకంటే కూల్. అయినా ఎందుకిలా చేస్తోందంటారు? - మంజూష, చెన్నై మీది కోప్పడే తత్వం కాకపోయినా ఒక్కో సారి పిల్లలు నిజం చెప్పడానికి భయపడ వచ్చు. కాబట్టి తనను కూర్చోబెట్టి కూల్‌గా మాట్లాడండి. అబద్ధం చెప్పడం తప్పు, నిజమే చెప్పాలి అని చెప్పండి. మేమేమీ అనం, నువ్వు నిజాలే చెప్పు, అలా చెబితే మేం సంతోషపడతాము అంటూ వివరించండి. తను నిజం చెప్పినప్పుడు బాగా మెచ్చుకోండి. వీలైతే ఓ చిన్న గిఫ్ట్ ఇవ్వండి. అలాగే అబద్ధం చెప్పినప్పుడు చిన్న చిన్న పనిష్మెంట్స్ ఇవ్వండి. అలా చేయడం వల్ల తనకు మంచికుండే విలువ, చెడు వల్ల కలిగే ఫలితం అన్నీ స్పష్టంగా అర్థమవుతాయి. మీరు ఎన్ని చేసినా కూడా పాప మారకపోతే మాత్రం వెంటనే కౌన్సెలర్ దగ్గరకు తీసుకెళ్లండి. వాళ్లు తమదైన పద్ధతిలో పాప అలవాటును తప్పకుండా మార్చగలుగుతారు. * మా బాబు ఆరో తరగతి చదువుతున్నాడు. టీవీ విపరీతంగా చూస్తాడు. అయితే చదువులో, ఆటల్లో అన్నిట్లో ఫస్ట్ వస్తాడు. అందుకే ఎప్పుడూ ఏమీ అనం. కాకపోతే వాడు చిన్నపిల్లలు చూసేవేమీ చూడడు. డిస్కవరీ, కార్టూన్ చానెల్స్ పెట్టడు. క్రైమ్‌స్టోరీలు, హారర్ స్టోరీలు చూస్తుంటాడు. సినిమాలు చూసినా ఇంగ్లిష్ యాక్షన్ మూవీసే చూస్తాడు. ఇది వాడి మనసు మీద చెడు ప్రభావం చూపిస్తుందేమో నని భయమేస్తోంది. అయినా కానీ ఆ అలవాటు మాన్పించలేకపోతున్నాం. ఏదైనా సలహా చెప్పండి. - శ్రీనివాసరావు, నంద్యాల బాబు బాగా చదవడం సంతోష కరమైన విషయం. కానీ ఎంత బాగా చదివినా టీవీ ఎక్కువసేపు చూడడం మాత్రం మంచిది కాదు. దానివల్ల చాలా నష్టాలున్నాయి. ఫిజికల్ యాక్టివిటీ తగ్గి బరువు పెరుగుతారు. ఇతర పిల్లలతో ఆడడం తగ్గిపోయి, వయసుకు తగిన సోషల్ బిహేవియర్ నేర్చుకోలేరు. ఇంకా పెద్ద క్లాసులకు వెళ్లినప్పుడు చదువుపై కూడా ప్రభావం పడుతుంది. ఎంత మంచి ప్రోగ్రాములైనా సరే, ఒక గంటకు మించి స్క్రీన్ టైమ్ ఇవ్వకండి. అంటే.... టీవీ, ఐప్యాడ్, స్మార్ట్ ఫోన్, వీడియో గేమ్స్ వంటివి ఏవైనా కూడా గంటను మించి చూడనివ్వకండి. అలాగే మీ బాబు పెద్దవాళ్ల ప్రోగ్రాములు చూడటం కూడా మంచిది కాదు. కాబట్టి తను చూడకూడని చానెల్స్ని లాక్ చేసేయండి. ఆ సౌకర్యం టీవీల్లో ఉంటోంది. అన్నిటికంటే ముందు మీరు తను టీవీ చూసే టైమును స్ట్రిక్ట్‌గా తగ్గించేయండి. ఏడ్చినా, అరిచినా, ఎంత గోల చేసినా అందులో మార్పు చేయకండి. తర్వాత సమస్య దానికదే పరిష్కారమవుతుంది. - డా॥పద్మ పాల్వాయ్ చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్బో హాస్పిటల్, హైదరాబాద్ -
వెండితెరపై చూసేది తక్కువే..!
బంపర్‌హిట్ అయినా చూసేది 2శాతమే టీవీల్లో వస్తే మాత్రం ఆ సంఖ్య రెట్టింపు 50% మందికి స్క్రీన్లు అందుబాటులో లేవు చిన్న పట్టణాల్లో థియేటర్లు పెరగాలి మల్టీఫ్లెక్స్ సీఈఓల మాట కొచ్చి: ఒకప్పుడు... సినిమా ఎన్ని రోజులు ఆడితే అంత పెద్ద హిట్ అయినట్లు. మరిప్పుడు...! ఎన్ని రోజులు ఆడిందని కాదు... ఎన్ని సెంటర్లలో ఆడింది... ఎంత వసూలు చేసిందన్నదే కమర్షియల్ హిట్‌కు కొలమానం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే... తొలి వీకెండ్ షేర్‌ను ఏ సినిమా అయితే అధికంగా రాబడుతుందో అది ఇండస్ట్రీ హిట్ల జాబితాలో చేరిపోతోంది. అయితే ఇక్కడొక బేసిక్ విషయాన్ని మరచిపోకూడదు. పెట్టిన పెట్టుబడిని వెనక్కు తీసుకొచ్చి, లాభాలను ఇచ్చే సినిమానే హిట్ సినిమాగా పరిగణిస్తారు. అదీ కథ. నిజానికి సినిమా ఫలితాన్ని నిర్ణయించే అంశాలు క్రమంగా మారుతున్నాయి. ప్రస్తుతం కలెక్షన్లే ఫలితాన్ని శాసిస్తున్నాయి. కాకపోతే ఆ కలెక్షన్లను అందించే ప్రేక్షకులు సినిమా హాళ్లకు వెళ్లి చూస్తున్నది తక్కువేనని, టీవీల్లోనే బాగా చూస్తున్నారనేదే తాజా వార్త. దీనికి ప్రధాన కారణం వారికి అందుబాటులో థియేటర్లు లేకపోవటమేనన్నది మల్టీప్లెక్స్ చైన్ల సీఈఓల మాట. అందుబాటులో ఉంటే వారు కూడా హాళ్లలోనే చూస్తారంటున్నారు కూడా. టీవీల్లో ప్రీమియర్ షోకు రెట్టింపు... ఇటీవల కాలంలో ‘భజరంగీ భాయీజాన్’ సినిమా మంచి హిట్‌ను సొంతం చేసుకుంది. భారత్‌లో రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కానీ ఆ సినిమాను థియేటర్లలో చూసిన ప్రేక్షకుల సంఖ్య మన దేశ జనాభాలో కేవలం 2 శాతమేనని (3.21 కోట్ల మంది) థియేటర్ చైన్ కార్నివాల్ సీఈఓ పి.వి.సునీల్ చెప్పారు. ఇదే సినిమా టీవీలలో గత నెలలో ప్రీమియర్ షోగా వస్తే 7.45 కోట్ల మంది వీక్షించారు. థియేటర్లలో 2 శాతం మంది చూస్తేనే రూ.300 కోట్లు వచ్చిందని, ఈ సంఖ్యను 5 శాతానికి పెంచగలిగితే భారతీయ సినీ పరిశ్రమ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని కార్నివాల్ సినిమాస్‌కు డెరైక్టరుగా కూడా ఉన్న సునీల్ అభిప్రాయపడ్డారు. మార్కెట్ ఉన్నా.. రాబడి అంతంతే.. సినిమాల పంపిణీకి భారత్‌లో భారీ మార్కెట్టే ఉందని కూడా సునీల్ అభిప్రాయపడ్డారు. ‘‘మార్కెట్టే కాదు. ఇక్కడ నిర్మిస్తున్న సినిమాల సంఖ్య కూడా ఎక్కువే. కానీ అధిక వసూళ్లను రాబట్టడంలో మాత్రం మనం విఫలమౌతున్నాం. దీనిక్కారణం ప్రస్తుతం దేశంలో 50 శాతం మంది ప్రజలకు సినిమాలు చూసే సదుపాయాలు అందుబాటులో లేకపోవడమే’’ అని సునీల్ వివరించారు. ‘దేశంలోని మొత్తం థియేటర్లలో మల్టీప్లెక్స్‌ల వాటా కేవలం 15 శాతం. మిగిలినవన్నీ సింగిల్ థియేటర్లే. అమెరికాలో 10 లక్షల మంది జనాభాకు 100 స్కీన్లు అందుబాటులో ఉంటే.. అదే మన దేశంలో 7 స్కీన్లు అందుబాటులో ఉన్నాయి’ అని చెప్పారాయన. చిన్న పట్టణాలే టార్గెట్.. టైర్-2, టైర్-3, టైర్-4 పట్టణాలను లక్ష్యంగా చేసుకుంటే.. ఎక్కువ మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించవచ్చని సినీపోలిస్ ఇండియా బిజినెస్ హెడ్ దేవాంగ్ సంపత్ అభిప్రాయపడ్డారు. దీంతో సినీ పరిశ్రమ ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. తాము ఇటీవల పాట్నాలో 4 తెరల మల్టీప్లెక్స్‌ను ప్రారంభించామని, ప్రేక్షకుల ఆదరణ బాగుందని తెలియజేశారు. ‘‘చిన్న పట్ట ణాల్లోని ప్రజలు కూడా సినిమా చూడటం కోసం బాగానే వెచ్చిస్తున్నారు. అయితే మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల్లో ప్రజలు సినిమా చూడాలంటే 50 కిలోమీటర్లమేర ప్రయాణించాల్సి వస్తోంది. వారి దగ్గరికే సినిమా థియేటర్‌ను తీసుకెళ్తే పరిస్థితిలో మార్పు వస్తుంది. ఎందుకంటే భారతీయులు సినిమా చూసేది కేవలం వినోదం కోసమే కాదు. అది వారి సంస్కృతిలో భాగం’’ అన్నారాయన. ప్రేక్షకులను ఆకర్షిస్తున్న టెక్నాలజీ ప్రజలను థియేటర్లకు రప్పించడంలో టెక్నాలజీ కూడా కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు ఏరీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈవో, ఏరీస్‌ప్లెక్స్ ఎస్ఎల్ సినిమాస్ చీఫ్ ప్రమోటర్ సోహన్ రాయ్. ‘‘ఈ విషయాన్ని ఇటీవల విడుదలైన బాహుబలి సినిమా నిజం చేసింది. ఈ సినిమా మా 4కే ప్రొజెక్షన్ థియేటర్లలో వరుసగా 15 వారాలు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నడిచింది. ప్రేక్షకులు సినిమా చూడటంలో థియేటర్ కూడా తన వంతు పాత్రను పోషిస్తుంది’’ అని వివరించారాయన. -
అతుక్కుపోయారో.. ఇక అంతే సంగతి!
న్యూయార్క్: ఏదో కాసేపు సరదాకో, లేదా విశ్రాంతిగా ఫీలయ్యేందుకో అలా టీవీ చూస్తే పెద్దగా నష్టం లేదుగానీ, ప్రతి రోజు అదే పనిగా టీవీ చూసేవాళ్లు మాత్రం తమంతట తాము వారి మృత్యురాత రాసుకున్నట్లేనని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు నిద్రాణంగా ఉన్న ఎన్నో రోగాలను కారకమయ్యే కణాలను కూడా నిద్ర లేపినట్లవుతుందని అవి ఒక్కసారి మేలుకున్నాక క్యాన్సర్ తోపాటు గుండె సంబంధమైన ప్రమాదకరమైన వ్యాధులు కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని మేరీలాండ్ లోగల నేషనల్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన సరాహ్ కేడల్ అనే పరిశోధనకారుడు ఆయన చేసిన అధ్యయనం వివరాలు వెల్లడించాడు. దీని ప్రకారం రోజూ మూడు నుంచి నాలుగు గంటలు చూసే వారి ఆయుష్షు తరిగిపోతుంది. ఆ అలవాటు నయంకాని ప్రమాదకరమై వ్యాధులను కలిగిస్తుంది. అంతేకాదు, మానసిక స్థితిపైనే తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా శారీరక దారుఢ్యంలో కూడా అమాంతం మార్పుల తీసుకొస్తుంది. ఆసక్తి, ఏకాగ్రత కూడా దెబ్బతిని పూర్తి శరీరం పనిచేసే వ్యవస్థ స్తంభించిపోయే ప్రమాదం ఉందని కూడా వారు హెచ్చరిస్తున్నారు. -
టీవీ చూసేవారికి నో హ్యాపీ...
పరిపరి శోధన విజ్ఞానం కంటే వినోదం కోసమే చాలామంది టీవీ చూస్తుంటారు. కాలక్షేపం కోసం, సమస్యలను తాత్కాలికంగానైనా మరచిపోవడం కోసం గంటల తరబడి టీవీకి అతుక్కుపోతుంటారు. ఇలాంటి శాల్తీలకు జీవితంలో ఏమాత్రం సంతోషం ఉండదట. మరోలా చెప్పాలంటే, నిజానికి జీవితంలో సంతోషం కోల్పోయిన వారే రోజూ గంటల తరబడి టీవీ చూస్తూ గడిపేస్తారని స్టీవెన్ మార్టిన్ అనే అమెరికన్ పరిశోధకుడు బల్లగుద్ది చెబుతున్నాడు. గడచిన మూడు దశాబ్దాలుగా టీవీ ప్రేక్షకుల తీరుతెన్నులపై విస్తృతంగా అధ్యయనం చేసిన తర్వాతే ఈ నిర్ధారణకు వచ్చానని అతడు అంటున్నాడు. సమస్యల వలయంలో చిక్కుకున్న వారు వాటికి పరిష్కారం గురించి ఆలోచించకుండా టీవీ చూడటానికి అలవాటు పడితే, త్వరలోనే దానికి బానిసలుగా మారుతారని హెచ్చరిస్తున్నాడు. -
టీవీలో కనిపించిన తొలి అధ్యక్షుడు
ఇప్పుడంటే బుల్లితెర మీద గల్లీ లీడర్లు కూడా గంట గంటకూ కనిపిస్తున్నారు గానీ, గత శతాబ్ది పూర్వార్ధంలో టీవీలో కనిపించడం చాలా అపురూపంగా ఉండేది. అమెరికాలో టీవీ వచ్చిన కొత్తలో అయితే, దేశాధ్యక్షుడు టీవీలో కనిపించడం సైతం అరుదైన దృశ్యంగానే ఉండేది. అలాంటి రోజుల్లో 1947 అక్టోబర్ 5న అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ తొలిసారిగా బుల్లితెరపై దర్శనమిచ్చాడు. రెండో ప్రపంచయుద్ధం నుంచి యూరోపియన్ రైతులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారని, అందువల్ల అమెరికన్ పౌరులందరూ ఆహార వినియోగాన్ని తగ్గించుకోవాలని కోరుతూ హితబోధాత్మక ప్రసంగం చేశాడు. ఈ ప్రసంగం అమెరికా అంతటా ప్రసారమైంది. అంతకు ముందు అధ్యక్షుడిగా పనిచేసిన ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ బుల్లితెరపై కనిపించేందుకు ముచ్చటపడ్డాడు. ఆయన హయాంలో వాషింగ్టన్లో ఒక అంతర్జాతీయ ప్రదర్శన ఏర్పాటైనప్పుడు జనాలను ఉద్దేశించి ప్రసంగించాడు. ఆ ప్రసంగాన్ని అందరూ తిలకించేందుకు వీలుగా ప్రదర్శన ఏర్పాటు చేసిన మైదానంలో బుల్లితెరలు పెట్టించాడు. అయితే, ఆ ప్రసారం అక్కడి వరకే పరిమితమైంది. తొలిసారిగా జాతీయస్థాయిలో బుల్లితెరపై కనిపించిన ఘనత మాత్రం హ్యారీ ట్రూమన్కే దక్కింది. -
రాములమ్మ ఫ్రమ్ సిరిసిల్ల
బుల్లితార రాములమ్మ సీరియల్‌తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన దామెర శిరీషకు టీవీలో నటించే అవకాశం అప్రయత్నంగానే వచ్చింది. అక్క రజిత టీవీనటి. మరో అక్క సౌజన్య కూడా బుల్లితెర నటి. అయితే ‘ఎంబీఏ చేసి ఉద్యోగంలో స్థిరపడాలనుకున్నాను తప్ప నటిని కావాలనుకోలేదు. యాదృచ్ఛికంగా జరిగిపోయింది’ అంటారు శిరీష. ‘మాది కరీంనగర్ జిల్లా సిరిసిల్ల. నైన్త్ క్లాస్ వరకు అక్కడే చదువుకున్నాను. టెన్త్ నుంచి హైదరాబాద్‌లోనే. బీకామ్ సెకండియర్‌లో ఉండగా ‘అడగక ఇచ్చిన మనసు’ ఆడిషన్స్కెళ్లాను. అక్కయ్యలిద్దరూ ఈ రంగంలో ఉండడంతో ఆ స్క్రీన్ టెస్టు అదీ ఎలాగుంటుందో చూడాలనే సరదాతోనే వెళ్లాను. అయితే సెలెక్ట్ అయిన తర్వాత సీరియస్‌గా కెరీర్ మీదనే దృష్టి పెట్టాను. రజితక్క... నటనలో మెలకువలు చెప్పింది’ అందామె. అమ్మానాన్నా అనుకోలేదు ‘అమ్మ దేవి గృహిణి. నాన్న పాపయ్య రిటైర్డ్ టీచర్. మమ్మల్ని నటులను చేయాలని మా పేరెంట్స్ ఎప్పుడూ అనుకోలేదు. కాని అక్కకు మాత్రం నటి కావాలనే కోరిక గట్టిగాఉండటంతో మేమంతా ఆ ఫీల్డ్‌లోకి వచ్చాం. అన్నయ్య మా సొంతూర్లోనే స్థిరపడ్డారు. ఇంట్లో చిన్నదాన్ని కావడంతో అమ్మకు ఇప్పటికీ నా మీద బెంగే. ఏదైనా షూటింగ్ లేటయ్యి టైమ్‌కి రాలేకపోతే ఫోన్ చేస్తూనే ఉంటుంది’. స్కూల్ నుంచి స్టుడియో వరకు ‘నాకు స్టేజ్ ఫియర్ అస్సలు లేదు. చిన్నప్పుడు స్కూల్లో ప్రతి ప్రోగ్రామ్‌లో డాన్స్ చేసేదాన్ని. టీచర్లు నా పేరు రాసేసుకుని తర్వాత చెప్పేవాళ్లు. అయితే అక్కడ డాన్సు చేయడానికి, ఇప్పుడు కెమెరా ముందు నటించడానికి చాలా తేడా ఉంటుంది. వేదిక మీద పెర్ఫామ్ చేసేటప్పుడు డాన్సుని ఎంజాయ్ చేస్తాం. కెమెరా ముందు సీన్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి’. సౌందర్య ప్రభావం ఎక్కువ! ‘నాకు ప్రభాస్, సౌందర్యల నటన బాగా ఇష్టం. సౌందర్య నటనను అధ్యయనం చేసినట్లు చూస్తాను. ఆ ప్రభావం నా మీద తప్పకుండా ఉంటుందనిపిస్తోంది. ఈ మూడేళ్లలో ఆరు సీరియల్స్‌లో నటించాను. ఇప్పుడు ‘రాములమ్మ’ సీరియల్ చేస్తున్నాను. లీడ్ రోల్స్ చేశాను. అవకాశం వస్తే పోలీస్, సీఐడీ పాత్రల్లో నటించాలని ఉంది’. టీవీ రంగం ఫ్యామిలీలాంటిది! ‘మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో’ సినిమాలో నటించాను. నాకెందుకో టీవీ రంగమే బాగుందనిపించింది. సినిమా ఇండస్ట్రీలాగ గ్లామరస్ పోకడలు ఉండవు. స్కిన్ షో చేయాల్సిన అవసరం ఉండదు. టీవీ రంగంలోకి వచ్చే వారికి ఒక్కమాట మాత్రం కచ్చితంగా చెప్పగలను... మనం కచ్చితంగా ఉంటే మనల్ని పక్కకు తోసేసేవాళ్లుండరు. నటించాలనే కోరిక ఉన్న చాలామంది పరిశ్రమ ఎలా ఉంటుందోననే భయంతో వెనుకడుగు వేస్తుంటారు. కానీ మన పాత్ర వరకు చూసుకుని ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకపోతే ఏ సమస్యా ఉండదు. అందుకు నేనే ఉదాహరణ’. జీవిత భాగస్వామి! ‘నన్ను పెళ్లి చేసుకునే అబ్బాయి నా కుటుంబానికి గౌరవం ఇచ్చి నన్ను బాగా చూసుకునే వాడై ఉండాలని కోరిక. ఇండస్ట్రీలో వ్యక్తిని చేసుకోవాలనుకోవడం లేదు. ఉద్యోగం, వ్యాపారం చేసుకునే అబ్బాయి అయితే బావుణ్ణనుకుంటున్నాను. ఏదైనా మరో రెండేళ్ల తర్వాతే’. -
'ఎంత పనైపోయింది అత్తయ్యా..'
అత్తాలేని కోడలుత్తమూరాలూ ఓయమ్మా... కోడలు లేని అత్త గుణవంతురాలూ... ఆహుమ్.. ఆహుమ్... అసలు అత్తాకోడళ్లు లేకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొట్టికాయలు వేసేవాళ్లే ఉండేవాళ్లు కాదు. అత్త రుసరుసలు, కోడళ్ల విసవిసలు సిల్వర్ స్క్రీన్ నుంచి ఇప్పుడు ఇంట్లో టీవీల్లోకి వచ్చేశాయి. సీరియళ్లు సీరియళ్లుగా నడుస్తూ మ్యారథాన్ పరుగులు తీస్తున్నాయి. ఇది సరిపోక ఇప్పుడు యూట్యూబ్‌ని కూడా ఆక్రమించాయి. ‘చిన్నారి అత్తాకోడళు’్లగా యూ ట్యూబ్‌లో ఈ జంట పెద్ద హిట్. డిఫరెన్స్ ఏంటంటే... సినిమాల్లో అత్తాకోడళ్లు కొట్టుకునేవాళ్లు. టీవీల్లో కీచులాడుకుంటున్నారు. యూట్యూబ్‌లో కిసుక్కులాడుకుంటున్నారు. కోడలిగా ఐదేళ్ల యోధ, అత్తగా పదేళ్ల రమ్యశ్రీల యుద్ధాలు కడుపుబ్బా నవ్విస్తున్నాయి. నుదుటికి చేతులు ఆన్చుకుని అత్తగారు ఏడుస్తున్నారు. ఆమెను చూసి కోడలూ ఏడుపందుకుంది ‘అయ్యో... ఏమయింది అత్తయ్యా!’ అంటూ! ‘ఏం చెప్పనే తల్లీ.. మనిద్దరికీ పడదని, మనిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని ఊరువాడా కోడై కూస్తోందే!’ అంటూ ఏడుపు రాగం పెంచింది అత్తగారు! ‘ఎంత పనైపోయింది అత్తయ్యా..’ అంటూ బుగ్గలు నొక్కుకుంటూ కోడలూ శ్రుతి పెంచింది. ఓ క్షణం ఇద్దరూ ఎవరి ఆలోచనల్లో వాళ్లుండిపోయి మొహమొహాలు చూసుకుని ఒక్కసారే ‘వా....’ అంటూ మళ్లీ ఏడుపు లంకించుకున్నారు. శోకరాగాలు పెట్టీపెట్టీ చివరకు అత్తగారు ఓ కన్క్లూజన్కొచ్చారు. ‘ఒసే శిరీషా... ఇక నుంచి మనిద్దరం పోట్లాడుకోకూడదు. నేను చెప్పింది నువ్వు వినాలి. నువ్వు చెప్పింది నేను వింటాను సరేనా?’ అంది. ‘అలాగే అత్తయ్య.. నేను చెప్పింది మీరు వినండి.. మీరు చెప్పింది నేను వింటాను’ అంది కోడలు కళ్లు తుడుచుకుంటూ! ‘నేననేదీ అదేనే పిచ్చిమొద్దూ.. నేను చెప్పింది నువ్వు వినాలి.. నువ్వు చెప్పింది నేను వింటాను’ అంది అత్త గద్దిస్తూ! ‘నేననేదీ అదే అత్తయ్యా.... నేను చెప్పింది మీరు వినాలి.. మీరు చెప్పింది నేను వింటాను’ అంది కోడలూ అదే స్వరంతో! ‘కాదు నేను చెప్పింది వినాలి’ అని అత్త అంటే ‘కాదు నేను చెప్పింది’ అని కోడలు. అలా నేనంటే నేను అని పోట్లాటకు దిగారు ఇద్దరూ! ఇదేదో సూర్యకాంతం, సావిత్రి నటించిన సినిమా కాదు. కానీ వాళ్లను సైతం మరిపించిన బుల్లి ఆర్టిస్టుల స్కిట్! అత్తగా పదేళ్ల రమ్యశ్రీ, కోడలిగా అయిదేళ్ల యోధ.. అదరగొట్టారు! డిఫరెంట్ ఇష్యూస్ మీద అత్తాకోడళ్ల స్కిట్స్‌తో ఈ సమ్మర్‌ని కూల్ చేశారు. అత్తగారిలా మెటికలు విరవడం, బుగ్గలు నొక్కుకోవడం... ముక్కున వేలేసుకొని విస్తుపోవడం.. లాంటి మ్యానరిజమ్స్ ఎలా తెలిశాయి? అని బుజ్జి అత్త రమ్యశ్రీని అడిగితే.. ‘సూర్యకాంతంగారి వల్ల’ అంటూ ఠక్కున జవాబు చెప్తుంది. ‘ఆవిడ ఎవరో నీకు తెలుసా?’ అని మనం ఆశ్చర్యపోయేలోపే ‘గుండమ్మ కథ’ సినిమాలో గుండమ్మగా యాక్ట్ చేసిన ఆవిడ! నాకు ఆ సినిమా అంటే చాలా ఇష్టం. అందులో సూర్యకాంతం గారంటే మరీ ఇష్టం. నన్ను అత్తగారిలా చేయమని చందూ అన్నయ్య (ఈ అత్తాకోడళ్ల స్కిట్స్ డెరైక్టర్, యోధ తండ్రి కె. చంద్రశేఖర్) చెప్పగానే నాకు గుండమ్మ కథ సినిమా, అందులో సూర్యకాంతం గారే గుర్తొచ్చారు. అంతే... ఆమెనే ఇమిటేట్ చేశా!’ అని వివరించేసింది రమ్యశ్రీ. సొగసరి కోడలు సూర్యకాంతం లాంటి గడసరి అత్త పెద్దరికానికి సమయస్ఫూర్తితో చెక్‌పెట్టే సావిత్రి లాంటి సొగసరి కోడలుగా హండ్రెడ్ మార్క్స్ కొట్టేసింది యోధ. ‘కోడలు అంటే అలా మూతి ముడవాలని, ముక్కు తిప్పాలని ఎవరు చెప్పారు?’ అని అడిగితే ‘ఎన్ని సీరియల్స్ చూడట్లేదూ?’ అంటూ దీర్ఘం తీసింది. ‘కోడలు శిరీషగా చేస్తున్నప్పుడు టీవీలో వచ్చే ‘అమ్మ నా కోడలా’లో కోడలినే గుర్తు తెచ్చుకున్నావా?’ అని అడిగితే ‘ఉహూ.. సావిత్రిగారిని!’ అని యోధ ఆన్సర్. ‘అబ్బో సావిత్రిగారు కూడా తెలుసా నీకు?’ అంటూ అబ్బురపడుతుంటే ‘మా అత్తగారికి సూర్యకాంతం తెలిసినప్పుడు నాకు సావిత్రిగారు తెలియరేంటి?’ అంది గడుసుగా. ‘అయితే నువ్వూ గుండమ్మ కథ చూశావా?’ అన్నప్పుడు... ‘చూశాను’ అంది. ‘కానీ గుండమ్మ కథలో సావిత్రిగారేం నీలాంటి మాటకారి కోడలు కాదే?’ అని అడిగితే... ‘మాటకారి తనాన్ని నేను యాడ్ చేసుకున్నా’ అంటుంది ఆరిందలా చేతులు తిప్పుతూ! ‘సరే.. అత్తాకోడళ్లుగా చేశారు కదా... ఏమనిపించింది?’ అని అడిగితే... ‘యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. గోవిందుడు అందరివాడేలే, ఒక లైలా కోసం, సూర్య వర్సెస్ సూర్య, ప్యార్ మే పడిపోయానే అలా ఇప్పటిదాకా 39 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా యాక్ట్ చేశా. కాబట్టి నాకు మా నాన్న ఇచ్చిన కోడలి వేషం చాలా ఇంట్రెస్టింగ్‌గానే అనిపించింది మరి. ఈజీ చేసేశా’ అంటూ అంతే ఈజీగా చెప్పేసింది యోధ. ‘అత్తగారి వేషం వేయడానికి నాకూ పెద్ద కష్టమనిపించలేదు. ఎందుకంటే నేను కూచిపూడి డాన్సర్‌ని కాబట్టి. ఇందాకే చెప్పాను కదా.. సూర్యకాంతంగారిని గుర్తుతెచ్చుకున్నానని. ఈ రెండూ రీజన్స్ వల్ల ఈజీగా యాక్ట్ చేశాను’ తన విజయ రహస్యం చెప్పింది రమ్యశ్రీ అత్త ఉత్తమురాలు... కోడలు గుణవంతురాలు ఈ స్కిట్స్‌లో అత్తాకోడలుగా మీరిద్దరూ కౌంటర్స్ వేసుకుంటుంటారు కదా.. రియల్ లైఫ్‌లో అత్తాకోడళ్లు ఎలా ఉండాలనుకుంటున్నారు? అని అడిగితే... ‘కోడలు ఇలా మాత్రం ఉండొద్దమ్మా..!’ అంటూ రమ్యశ్రీ ముక్కు తిప్పితే.. ‘అత్తగారూ ఇలా ఉండొద్దు లెండీ!’ అంటూ యోధా మూతి ముడిచింది. అంతలోకే నవ్వుకుంటూ ఇద్దరూ ఒకరి భుజం మీద ఒకరు చేతులేసుకొని ‘అత్తా, కోడలు ఇద్దరూ ప్రేమగా ఉండాలి.. కలిసికట్టుగా ఒక జట్టుగా ఉండాలి’ అని చెప్పారు. - సరస్వతి రమ, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ రిలీఫ్ కోసం తీస్తే హిట్ అయింది చదువు విషయంలో పిల్లలకు ఎలాగూ చాయిస్ లేదు. మనిష్టాన్నే రుద్దుతున్నాం. కనీసం సెలవుల్లోనైనా వాళ్ల ఇష్టాయిష్టాలను గమనించి వాటినే నేర్పిస్తే బాగుంటుంది కదా అనిపించింది. ఆ ఆలోచనతో ఉన్న నాకు మా పిల్లలు గురుగులు పెట్టి ఆడుకోవడం.. అచ్చు గృహిణుల్లా మాట్లాడుకోవడం చూసి అప్పటికప్పుడు వచ్చిన ఐడియాతో ఈ అత్తాకోడళ్ల స్కిట్ తయారు చేశా. ఒకటి చేయించి ఆ వీడియోను ఎఫ్బీ, యూ ట్యూబ్‌లో అప్లోడ్ చేశాక వచ్చిన రెస్పాన్స్ చూసి.. దీన్ని కేవలం ఎంటర్టైన్మెంట్గానే కాక అత్తాకోడళ్ల మధ్య ఎలాంటి రిలేషన్ ఉంటే బాగుంటుంది, అలాగే ఆడపిల్లలు ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి అనే చిన్న మెసేజీ ఇచ్చేలా మలిస్తే బాగుంటుంది అనిపించింది. అంతే.. డిఫరెంట్ థీమ్స్‌తో ఈ కాన్సెప్ట్‌ని ఇలా డెవలప్ చేశాను. ఈ రోజు విదేశాలనుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. యూసఫ్‌గూడ (హైదరాబాద్)లో మా పిల్లలు చదివే ఎస్జీబీ స్కూల్ ప్రిన్సిపల్ సునీతారాణిగారు పిల్లలకు ఫ్రీఎడ్యుకేషన్ ఇస్తానని చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది. వాళ్లను దీవిస్తున్న అందరికీ థాంక్స్!’ - కె. చంద్రశేఖర్ (యోధ తండ్రి, స్కిట్స్ డెరైక్టర్) టెన్ థీమ్స్: శిరిషా కాఫీ, జనాభా లెక్కలు, అత్తగారి నెక్లెస్, పనిమనిషి, గంగిరెద్దు, అలనాటి జ్ఞాపకం, మెసేజ్, న్యూస్ పేపర్, పాపులర్ అత్తాకోడళ్లు, యాంకరింగ్.. ఇలా ఈ అత్తా కోడళ్లు వేసిన ఈ పది థీమ్స్‌కి యూట్యూబ్‌లో వ్యూస్ వేల సంఖ్యలో ఉన్నాయి. -
టీవీ వంటల ప్రోగ్రామ్‌తో కనువిందే చేసుకోండి
మీకు టీవీల్లో వంటల కార్యక్రమాలు చూసే అలవాటుందా? అవి చూశాక వాటిని ఇంట్లో తయారు చేసుకునే అలవాటు కూడా ఉందా? అలా అయితే కాస్త జాగ్రత్త అని చెబుతున్నారు పరిశోధకులు. వీళ్ల అధ్యయన వివరాలన్నీ ‘ఎపిటైట్’ అనే హెల్త్ జర్నల్‌లో ఇటీవలే ప్రచురితమయ్యాయి. ఆ వివరాల ప్రకారం... 20 నుంచి 35 ఏళ్ల మధ్యనున్న దాదాపు 500 మంది మహిళలను ఎంపిక చేశారు ఈ అధ్యయనవేత్తలు. వీళ్లను రెండు వర్గాలుగా విభజించారు. వారే... వ్యూవర్స్ అండ్ డూవర్స్. అంటే కేవలం వంటల కార్యక్రమాన్ని చూసేవారూ, చూసినవి చేసేవారు అని వర్గీకరించారు. చూసి ఆనందించేవారితో పోల్చినప్పుడు, వాటిని ఇంట్లోనూ వండి తినే వారు చాలా కొద్ది సమయంలోనే సగటున దాదాపు 5 కిలోల (పదకొండు పౌండ్లు) బరువు పెరిగినట్లు గమనించారు. ఈ బరువు చాలా ఎక్కువనీ, ఆరోగ్యానికి చెరుపు చేస్తుందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. పైగా చూసినవి, చేసుకుని తినేవారిలో చాలామందికి పొట్టపెరగడం (సెంట్రల్ ఒబేసిటీ) పెరిగిందట. ఇది గుండెజబ్బులు మొదలుకొని ఆరోగ్యానికి అనేక అనర్థాలు తెచ్చిపెడుతుందని ‘ఎపిటైట్’ జర్నల్‌లో హెచ్చరించారు సదరు పరిశోధకులు. -
అమ్మో! హైపర్ పిల్లలు!!
అల్లరి, దుడుకుతనం... ఇలాంటి గుణాలు పిల్లల్లో ఏదో ఒక సమయంలో కనిపిస్తాయి. తల్లిదండ్రుల సహనానికి పరీక్ష పెడతాయి. కొన్ని సార్లు అది మితిమీరుతుంది. హోమ్‌వర్క్ నుంచే కాదు అటు ఆటలనుంచి ఇటు టీవీ నుంచీ క్షణ క్షణానికీ దృష్టిమళ్లిపోతుంది. పిల్లల్లో చురుకుదనం చాలా సాధారణం. అవసరం కూడా. దాన్ని సహజమైన గుణంగానే పరిగణించాలి. అయితే ఒకస్థాయికి మించిపోయి పిల్లలకూ, వారితోపాటు పెద్దలకూ ఇబ్బంది కలిగించేంతగా ఉన్నప్పుడే పిల్లల చురుకుదనాన్ని, అతిచురుకుదనంగా (హైపర్ యాక్టివిటీ)గానూ, ఒక సమస్యను పరిగణించాలి. పిల్లల్లో మితిమీరిన చురుకుదనం కొన్నిసార్లు తీవ్రస్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ), ప్రవర్తనాపరమైన లోపాలు (కాండక్ట్ డిజార్డర్స్), ఆటిజం, బైపోలార్ డిజార్డర్, యాంగ్జైటీ డిజార్డర్స్ వంటి ఉన్నప్పుడు పిల్లల్లో అతి చురుకుదనాన్ని చూడవచ్చు. అయితే ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలను గమనించాలి. తల్లిదండ్రులు గమనించాల్సిన అంశాలు తల్లిదండ్రుల దృష్టిని ఆకర్షించాలని పిల్లలు ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. ఆ సమయంలో వారు కోరుకునే అటెన్షన్గానీ / సమయంగానీ తల్లిదండ్రుల నుంచి లభించనప్పుడు వారు అల్లరి చేసి తమ తల్లిదండ్రుల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంటారు. తల్లిదండ్రులు చాలా బిజీగా ఉన్న ఈ ఆధునిక కాలంలో పిల్లలకు వారు తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగానికి వెళ్తారు. అలసిపోయి వస్తారు. వారి అలసట, విసుగు పిల్లలపై చూపిస్తారు. పిల్లలు సహజంగానే చేసే కొద్దిపాటి అల్లరిని కూడా భరించగలిగేంత సహనం, ఓపిక వీళ్లకు ఉండదు. కానీ నిజానికి పిల్లల ఆరోగ్యం, సహజ వికాసం కోసం తల్లిదండ్రుల అటెన్షన్ చాలా ముఖ్యం. ఆ సమయాన్ని కేటాయించడం తల్లిదండ్రుల బాధ్యత. ఇప్పుడు తల్లిదండ్రులు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పిల్లలను ఆగకుండా చదివించడం కొన్ని కుటుంబాల్లో ఒక తప్పనిసరి పరిస్థితిగా మారింది. ఈ సమయంలో తల్లిదండ్రులు తమ బాల్యాన్ని ఒకసారి గుర్తుచేసుకోవాలి. అప్పుడు పిల్లల పరిస్థితి అర్థమవుతుంది. ఎలాంటి శారీరకమైన కదలికలు లేకుండా కూర్చుంటే పిల్లల్లో అసహనం (రెస్ట్లెస్నెస్) కలుగుతాయి. దాంతో పిల్లలు హైపర్యాక్టివిటీకి పాల్పడతారు. కాబట్టి పిల్లలకు శరీరం అలసిపోయేలా ఆటలాడేందుకు (ఫిజికల్ యాక్టివిటీకి) తగినంత సమయం ఉండాలి. ఇక ఈ ఆధునిక యుగంలో మరో సమస్య టీవీ, ఇంటర్నెట్, సెల్‌ఫోన్స్ ద్వారా వస్తోంది. దీన్ని ఒకరకమైన జాడ్యం (అడిక్షన్లాగా) పిల్లల్లో వ్యాపిస్తోంది. పిల్లలు ఈ టీవీ, ఇంటర్నెట్, సెల్‌ఫోన్‌లోని హింస ఎక్కువగా ఉండే గేమ్స్‌కు/హారర్ చిత్రాలకూ బానిసలైపోవడం వల్ల గంటల తరబడి వీటికి అతుక్కుపోతున్నారు. దాంతో శరీరానికి అవసరమైన కదలికలు లేకపోవడం వల్ల ఎదుగుదల కూడా దెబ్బతింటోంది. కండరాలు బలహీనంగా మారిపోతున్నాయి. పిల్లల్లో హైపర్యాక్టివిటీకి కారణాలు పిల్లల ఎదిగే వయసులో వారికి చదువుతో పాటు శారీరక కదలికలు (యాక్టివిటీ) చాలా ముఖ్యం. మానసికమైన వికాసానికి ఇది కూడా తోడ్పడుతుంది. మన మెదడులో 10 టు ద పవర్ ఆఫ్ 12 కణాలు ఉంటాయి. ఒక్కో కణం నుంచి మరో కణానికి 10 టు ద పవర్ ఆఫ్ 4 వైర్లు (నిజానికి అవి నర్వ్ ఫైబర్లు) కలుపుతూ ఉంటాయి. అంటే మన మెదడు 10 టు ద పవర్ ఆఫ్ 16 వైర్లు కలిగిన ఒక సూపర్ కంప్యూటర్ అన్నమాట. మెదడు నిర్మాణం, దానికి అవసరమైన మార్పులు చిన్న వయసులోనే జరుగుతాయి. ఈ మార్పులు జరుగుతున్న సమయంలో మెదడును ఒక మైనపుముద్దతో పోల్చవచ్చు. మనం దాన్ని ఎలా మలిస్తే అలా మారుతుంది. కాబట్టి మొదటి 16 ఏళ్ల సమయంలో పిల్లలకు ఎలాంటి వాతావరణాన్ని కల్పిస్తే అది జీవితాంతం వారిలో ప్రతిబింబిస్తుంది. ఈ నేపథ్యంలో పిల్లల్లో అతిచురుకుదనానికి (హైపర్ యాక్టివిటీకి) కారణాలు పరిశీలిద్దాం... తగినంత నిద్ర లేనప్పుడు వారు అతిచురుగ్గా మారిపోతారు. చిరాకు కనబరుస్తారు. పోషకాహార లోపం వల్ల కూడా అతిచురుకుదనం కలిగే అవకాశం ఉంది. వాతావరణ కాలుష్యం కూడా ఎదిగే మెదడుపై తీవ్రప్రభావం కనబరుస్తుంది. ఇందులోని లెడ్ వంటి కాలుష్యాలు/వ్యర్థపదార్థాలు, వారు తీసుకునే ఆహారంలో ఉండే పెస్టిసైడ్స్ వంటివి పిల్లల ప్రవర్తనపైనా ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకు పిల్లల రక్తంలో ఉండే లెడ్ వంటి విషాలు ఎంత కొద్దిమోతాదుల్లో ఉన్నా అది పిల్లల తెలివితేటలపై ప్రభావం చూపుతుంది. దీనిప్రభావం వల్ల పిల్లలను ప్రవర్తనాలోపాల (కాండక్ట్ డిజార్డర్స్) వైపునకు నెడుతుందనేది డబ్ల్యూహెచ్ఓ పరిశీలన. అతిచురుకుదనాన్ని సమస్యగా ఎప్పుడు పరిగణించాలి పిల్లలకు కనీసం నాలుగేళ్లు దాటితేగానీ వారి హైపర్యాక్టివిటీని ఒక సమస్యగా గుర్తించలేం. ఎందుకంటే అతిచురుగ్గా ఉండటం ఈ వయసులోపు వారికి ఒక సహజగుణం. దీన్ని వ్యాధి/సమస్యగా పరిగణించకూడదు. నాలుగేళ్ల నుంచి ఏడేళ్ల పిల్లల్లో కూడా కొంత దుందుడుకుదనం, చురుకుదనం సహజమే. చుట్టూ పరుగెత్తడం, ఒకే విషయాన్ని తరచి తరచి అడగడం వంటివి వీరు చేస్తారు. అయితే ఇది స్థాయికి మించినా, ఈ దుడుకుదనం వల్ల ఇతరులకు సమస్యగా పరిణమిస్తున్నా, పిల్లలు తినడానికి కూడా ఒక చోట కూర్చోకుండా... వారికి ఇష్టమైన కథలు చెబుతున్నా వినిపించుకోకుండా, నిలకడగా లేకుండా ఉంటున్నా దాన్ని సమస్యాత్మకమైన పరిస్థితిగా పరిగణించవచ్చు. ఏడు నుంచి పన్నెండేళ్ల పిల్లలు కనీసం ఆటలు ఆడేటప్పుడైనా కొంత నిలకడ చూపగలగాలి. ఆట పూర్తయ్యేవరకూ నికలడగా ఉండాలి. వీళ్లలో ఈ నిలకడ గుణం లోపించినప్పుడు, ఇతర పిల్లలను సైతం ఆటలాడకుండా విసిగిస్తున్నప్పుడు, తమ అవకాశం రాకుండానే తొందరపడుతున్నప్పుడు... దాన్ని సమస్యాత్మకమైన అతిచురుకుదనంగా పరిగణించవచ్చు. టీవీని కూడా వీరు నిలకడగా చూడలేరు. ఒక కథను ఫాలో అవుతూ అది పూర్తయ్యేవరకూ ఆ ఛానెల్నే చూస్తూ ఉండలేరు. చేసేపనుల్లో తప్పులు ఎక్కువగా కనిపిస్తాయి. పని మొదలుపెట్టినా మధ్యలోనే వదిలేస్తారు. ఈ నేపథ్యంలో వారి చర్యలు ఇతరులకూ/తమకూ ఇబ్బందిగా పరిణమించినప్పుడు దాన్ని సమస్యగా గుర్తించాలి. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... పిల్లలకు తగినంత సమయం కేటాయించండి. స్కూల్లోనూ, ఇంటిదగ్గరా చదువుతో పాటు, ఆటపాటలకూ తగినంత సమయం ఇవ్వండి. వారు తగినంత విశ్రాంతి తీసుకోడానికీ అవకాశం ఇవ్వండి. పిల్లలు హైపర్యాక్టివిటీని ప్రదర్శిస్తున్నారని తల్లిదండ్రులు గుర్తించినప్పుడు వారిని కచ్చితంగా కొంత సమయంపాటు విశాలమైన మైదానాలలో ఆటలకు వదలాలని తల్లిదండ్రులు గుర్తుంచుకోండి. వారు తగినంతగా ఆటలాడి శారీరకంగా అలసట పొందితే ఈ హైపర్ యాక్టివిటీ సహజంగానే తగ్గుతుంది. పిల్లలు కుదురుగా కూర్చొని ఒక పనిని పూర్తిచేసినప్పుడు వారిని ప్రశంసించండి. ఇదెంతో కీలకం. పిల్లల్లో ఒక వ్యాపకం, కళను పెంపొందించేందుకు తల్లిదండ్రుల ప్రశంస ఎంతగానో తోడ్పడుతుంది. పిల్లలు సాధించగల గమ్యాలను నిర్దేశించండి. అవి సాధించగానే ప్రశంసించండి. పిల్లలకు కొన్ని చిన్నచిన్న ఆటల వంటి యాక్టివిటీస్‌ను కల్పించాలి. ఉదాహరణకు దారంలో పూసలు ఎక్కించడం, ఏ రంగు పూసలను, ఆ రంగు పూసలుగా విడదీయడం వంటివి. ప్రమాదకరమైన వస్తువులను పిల్లలకు దూరంగా ఉంచాలి. పిల్లలు అతిచురుకుదనాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు వారిని దూషించడం, తక్కువచేసి మాట్లాడటం అస్సలు చేయకూడదు. పిల్లలు టైమ్-టేబుల్ ఫాలో అయ్యేలా అలవాటు చేయాలి. ఇది క్రమంగా జరగాల్సిన పని. అంతేగానీ ఒకేసారి జరగాలని కోరుకోకండి. పిల్లలు తప్పనిసరిగా పోషకాహారం తీసుకునేలా చూడండి. శారీరక, మానసిక వికాసానికి ఇదెంతో కీలకం. - డాక్టర్ శ్రీనివాస్ ఎస్.ఆర్.ఆర్.వై. కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, ప్రభుత్వ మానసిక చికిత్సాలయం, ఎర్రగడ్డ, హైదరాబాద్ -
ఎటో వెళ్ళిపోయింది శాటిలైట్
వెండితెర సినిమా బుల్లితెరకు రావాలంటే చాలా ఠీవి కావాలి. పెద్ద హీరోల ఠీవి ఉండాలి. పెద్ద హిట్ కొట్టిన ఠీవి సంపాదించాలి. హీరో ఉండి హిట్టు లేకపోయినా హిట్టు కొట్టి హీరో లేకపోయినా మన టీవీకి మాత్రం ఈ సినిమాల ఠీవి డౌటే! అంతా... శాటిలైట్ మాయ! స్టార్ల మధ్యలో తిరిగే శాటిలైట్ కాదు... శాటిలైట్ చుట్టూ తిరిగే స్టార్ల బిజినెస్ ఇది! ‘మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు’... ఉద్యోగంలో మునిగిపోయిన భర్త... మానసికంగా దగ్గరైన మరో యువకుడు... వారి మధ్య చిక్కిన ఒక యంగ్ మ్యారీడ్ ఉమన్... ఈ ముగ్గురి నడుమ సాగే ఈ సినిమా బాగుందని రివ్యూలు వచ్చినా, జనం వచ్చే లోపలే హాలులో నుంచి మాయమై పోయింది. టీవీలో వేసినప్పుడన్నా చూద్దామంటే శాటిలైట్ రైట్స్ ఇప్పటికీ అమ్ముడే కాలేదు. కాబట్టి టీవీలోనూ ఆ బొమ్మ కనపడదు. గడప దాటని సినిమాలెన్నో! ఈ పరిస్థితి ఒక్క ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’కే పరిమితం కాదు. సినిమా బాగుందని పేరొచ్చినా, స్టార్స్ లేకపోవడంతో - ఇలా టీవీ ప్రసారానికి కూడా నోచుకోని సినిమాలు బోలెడు. పెద్ద వయసువాళ్ళ భావోద్వేగాలు చూపుతూ డాక్టర్ కిరణ్ తీసిన ‘చిన్ని చిన్ని ఆశ’ లాంటివి అందుకు ఉదాహరణ. సింగీతం శ్రీనివాసరావు లాంటివారు నటించినా... ప్చ్! మీకో సంగతి తెలుసా? ఫ్లాపైన స్టార్ హీరోల సినిమాల గతీ అంతే. మొన్నటి బాలకృష్ణ ‘పరమవీర చక్ర’ మొదలు ఇటీవలి రజనీకాంత్ ‘లింగ’, విక్రమ్ ‘ఐ’, సూర్య ‘సికిందర్’.... వేటికీ శాటిలైట్ బిజినెస్ ఇప్పటికీ కాలేదు. కనక ఇప్పట్లో ఇవి టీవీలో వచ్చే ఛాన్సూ లేదు. నాని, సమంత నటించిన గౌతమ్ మీనన్ సినిమా ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ పరిస్థితీ అంతే. ఆ మాటకొస్తే బడా హీరోల భారీ చిత్రాలను మినహాయిస్తే - నూటికి పది, పదిహేను చిత్రాలకే శాటిలైట్ బిజినెస్ అవుతోంది. శాటిలైట్ రైట్స్ అమ్ముడై, ఆ మాత్రం డబ్బయినా చేతికొస్తే కానీ నిర్మాత సినిమా రిలీజ్ చేయలేడు. రైట్స్ కొనాల్సిన టీవీ చానల్సేమో - సినిమా రిలీజై, ఆడియన్స్ రియాక్షన్ బాగుండి, పేరున్న ఆర్టిస్టులుంటే అప్పుడు కొంటామంటున్నాయి. ‘‘ఒక్క మాటలో చెప్పాలంటే పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కుదరదు. పెళ్ళి కుదిరితే కానీ పిచ్చి కుదరదు. సినిమాల శాటిలైట్ వ్యాపారం అలా ఉంది’’ అని తెలుగు సినీ నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శి టి. ప్రసన్నకుమార్ వ్యాఖ్యానించారు. ఇవాళ ఒక సగటు తెలుగు సినిమా శాటిలైట్ బిజినెస్ అయిందంటే... ఆ నిర్మాత నక్క తోక తొక్కినట్లే! సినిమా మీద పెట్టిన పెట్టుబడిలో పావువంతయినా వెనక్కి వచ్చిందని సంబరపడాల్సిందే! శాటిలైట్ అంత కీలకమా? ఒకప్పుడు సినిమా అంటే హాలులో రిలీజ్.... జనం అక్కడ చూడడమే! టీవీ వచ్చాక సీన్ మారింది. దూరదర్శన్ ఒక్కటే ఉన్నప్పుడు, నిర్ణీత మొత్తం నిర్మాతకు చెల్లించి, సినిమా ప్రసారం చేసేవారు. అప్పట్లో డి.డి. నేషనల్ చానల్లో మన సినిమా మూడు నెలలకొకటి ప్రసారమైతే గొప్ప. అలా ప్రసారం కావడానికి పెద్ద పోటీ. జెమినీ, ‘ఈ’, ‘మా’, ‘జీ తెలుగు’ లాంటి శాటిలైట్ టీవీ చానల్స్ వచ్చాక పరిస్థితి మారింది. టి.ఆర్.పీలద్వారా యాడ్స్‌తో ఆదాయం తెచ్చుకోవాలంటే చానల్స్‌కు సినిమాలు రెడీమేడ్ సాఫ్ట్వేర్! దాంతో కనపడిన ప్రతి సినిమానూ టీవీ చానల్స్ పప్పుబెల్లాలు కొన్నట్లు కొనేశాయి. నిర్మాతలూ తమ సినిమాల టీవీ ప్రసార హక్కులు అడిగినవాడికి అడిగినట్లుగా - పదికీ, పరకకూ ఇచ్చేశారు. కొన్ని చానల్స్ దొరికిందే సందని... అతి తెలివితో, శాశ్వత హక్కులూ రాయించేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్తగా తీస్తున్న సినిమాల నిర్మాతలకు ఈ శాటిలైట్ రైట్స్ నయా ఆమ్దానీ అయింది. సినిమా వ్యాపారంలో కొత్త ఐటమ్ వచ్చి చేరింది. బాతును మింగిన గుడ్డు కొన్నేళ్ళలోనే ఈ రైట్స్ రేట్లు బాగా పెరిగాయి. ఒక అగ్ర హీరో సంగతే తీసుకుంటే ఆయన సినిమా శాటిలైట్ రైట్స్ ఒకప్పుడు 30 లక్షల లోపు పలికింది. తరువాత అది కోటికీ, అటుపైన 4.5 కోట్లకీ ఎగబాకింది. ఇదంతా జస్ట్... ఫోర్... ఫైవ్ ఇయర్స్‌లో వచ్చిన ఛేంజ్! కానీ, రోజుకో గుడ్డు పెట్టే బంగారు బాతును పొట్ట కోసి చూస్తే? అదే జరిగింది! జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే శాటిలైట్ ఆదాయంతో సినిమా బడ్జెట్ తిరిగి వచ్చేస్తుందని నయా ప్రొడ్యూసర్స్‌ను ముగ్గులోకి లాగి ప్రాజెక్ట్ సెట్ చేసేవాళ్ళు వచ్చారు. చానల్స్‌కూ, ప్రొడ్యూసర్స్కూ మధ్యన వ్యవహారం నడిపే మీడియేటర్లు వచ్చారు. శాటిలైట్ రైట్స్ ఆదాయం కోసమే ఏదో ఒక సినిమా చుట్టేసేవాళ్ళు వచ్చారు. అది కొంతకాలం నడిచింది. ఇంతలో పేరుకుంటున్న నష్టాలు, మార్కెట్ పరిస్థితిని గమనించిన టీవీ చానల్స్ శాటిలైట్ రైట్స్ కోసం ఎగబడడం మానేశాయి. ఖర్చు ఎక్కువ... రికవరీ తక్కువ! పెట్టిన కోట్ల పెట్టుబడికి తగినంత ఆదాయం రావడం లేదనేది చానల్స్ వాదన. సినిమాల మధ్యలో వేసే వాణిజ్య ప్రకటనల నిడివి తగ్గిస్తూ, ‘టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ’ (ట్రాయ్) విధించిన షరతులూ తోడయ్యాయి. ‘‘సినిమాల రైట్స్ కోసం చానల్స్ చాలా పెద్ద మొత్తం వెచ్చించాల్సి వస్తోంది. తొలి మూడు టెలికాస్ట్‌ల తర్వాతా మాకు వెనక్కి వస్తున్నది - 30 నుంచి 40 శాతమే. గతంలో ‘ట్రాయ్’ నిబంధనలు లేనప్పుడు ఎక్కువ యాడ్స్ ద్వారా ఖర్చు రాబట్టుకొనేవాళ్ళం. ఇప్పుడా పరిస్థితి లేదు’’ అని ఒక ప్రముఖ తెలుగు టీవీ ఉన్నతోద్యోగి వివరించారు. కాకపోతే, ఖర్చయినా స్టార్స్ సినిమాలైతే, జనాన్ని ఆకట్టుకోవచ్చని ఆ సినిమాల వరకు మాత్రం కొంటున్నాయి. మరోపక్క చానల్స్‌కు ఎలాగోలా అమ్మకపోతామా అని మీడియేటర్లు కొనుక్కున్న సినిమాలూ దాదాపు 50 - 60 దాకా మిగిలిపోయాయి. అలా వాళ్ళ డబ్బూ కోట్లల్లో ఇరుక్కుపోయింది. మరి, ఈ పరిస్థితి మారాలంటే? మళ్ళీ శాటిలైట్ బిజినెస్ కావాలంటే? ‘‘గతంలో పెరిగిన శాటిలైట్ రేట్లను బట్టి, రెమ్యూనరేషన్లు, సినిమా బడ్జెట్ పెంచేసు కుంటూ పోయారు. తీరా ఇప్పుడు శాటిలైట్ బిజినెస్ పడిపోయింది. అందుకే, ఆ మేరకు ఖర్చులు తగ్గించుకొని, కేవలం థియేటర్లలో వచ్చే వసూళ్ళను బట్టే సినిమా బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోవాలి’’ అని ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ల సూచించారు. ఆ పని చేస్తే శాటిలైట్ రైట్స్ కచ్చితంగా నిర్మాతకు అదనపు ఆదాయమే అవుతుంది. హాలులో కాకపోయినా కనీసం టీవీలో అయినా ‘బొమ్మ’ చూసే భాగ్యం ప్రేక్షకులకు కలుగుతుంది. - రెంటాల జయదేవ శాటిలైట్ రైట్స్... సోల్డ్ అవుట్ అల్లు అర్జున్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ - రూ. 8.5 కోట్లు (‘మా’ టి.వి) రవితేజ ‘కిక్ 2’ - రూ. 7.5 కోట్లు (‘జెమినీ’) - రిలీజ్‌కు ముందే రామ్ ‘పండగ చేస్కో’ - రూ. 6.5 కోట్లు (‘జీ తెలుగు’) - రిలీజ్‌కు ముందే బాలకృష్ణ ‘లయన్’ - రూ. 5.5 కోట్లు (‘జెమినీ’) - రిలీజ్‌కు ముందే ‘అనుక్షణం’ ప్లస్ ‘కరెంట్ తీగ’ - రూ. 4.5 కోట్లు (‘జెమినీ’) నితిన్ ‘చిన్నదాన నీ కోసం’ - రూ. 4.5 కోట్లు (‘జెమినీ’) గోపీచంద్ ‘జిల్’ - రూ. 4 కోట్లు (‘జెమినీ’) నాని ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ - రూ. 3.9 కోట్లు (‘జెమినీ’) కల్యాణ్‌రామ్ ‘పటాస్’ - రూ. 3.75 (‘జెమినీ’) శర్వానంద్ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ - రూ. 1.2 కోట్లు (‘మా’ టి.వి) స్టిల్ ఫర్ సేల్! బాలకృష్ణ ‘పరమవీర చక్ర’ రజనీకాంత్ ‘లింగ’ విక్రమ్ - శంకర్ల ‘ఐ’ సూర్య ‘సికిందర్’ కార్తీ ‘బిర్యానీ’, ‘బ్యాడ్‌బాయ్’ నాని ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ అల్లరి నరేశ్ ‘బందిపోటు’ సుధీర్‌బాబు ‘ఆడు మగాడ్రా బుజ్జీ‘ సందీప్ కిషన్ ‘రారా కృష్ణయ్య‘ నాని ‘జెండాపై కపిరాజు’ ఆ డబ్బు లేదనుకొని సినిమా తీయాలి! ‘‘శాటిలైట్ బిజినెస్ 22 నెలలుగా తగ్గి, మిడ్వే ఫిల్మ్స్, చిన్నచిత్రాలు ఇబ్బంది పడుతున్నాయి. మా ‘అంతకు ముందు ఆ తరువాత’ రిలీజయ్యాక 5 నెలలకి అమ్ముడై, వడ్డీలకే పోయింది. ఇప్పటి దాకా శాటిలైట్ కలుపుకొని, బడ్జెట్వేసేవాళ్ళం. ఇప్పుడిక అది లెక్కలో నుంచి తీసేసి, ఖర్చు తగ్గించుకొని సినిమా తీయాలి.’’ - కె.ఎల్. దామోదర ప్రసాద్, ‘అలా మొదలైంది’ తదితర చిత్రాల నిర్మాత సెన్సిబుల్ సినిమాను చంపేస్తున్నారు! ‘‘మా ‘మల్లెలతీరంలో...’కొచ్చిన ప్రశంసలు, రివ్యూలు ఫైల్ చేసి పంపినా, చానల్స్ నుంచి స్పందన లేదు. స్టార్స్, ప్యాడింగ్, కామెడీ ట్రాక్ ఉండాలి లాంటి షరతులు చానల్స్ కూడా పాటించడం అన్యాయం. అటు రిలీజుకు హాళ్ళూ ఇవ్వక, ఇటు శాటిలైట్ రైట్స్ కొనుక్కోకుండా సెన్సిబుల్ సినిమాను చంపేస్తున్నారు.’’ - రామరాజు, ‘మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు’ చిత్ర దర్శకుడు -
అప్పు చెల్లించాలంటూ టీవీ ఎత్తుకెళ్లారు
జడ్చర్ల్లలో సహకార సంఘం అధికారుల నిర్వాకం జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల కావేరమ్మపేటలో జంగయ్య అనే రైతు బాకీ చెల్లించలేదని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధికారులు మంగళవారం ఆయన ఇంట్లో నుంచి టీవీని ఎత్తుకెళ్లారు. 1994లో జంగయ్య తండ్రి చిన్న లక్ష్మయ్య బాదేపల్లి సహకార సంఘంలో రూ.36 వేలు అప్పు తీసుకున్నాడు. తండ్రి చేసిన అప్పులో సుమారు రూ. 35 వేలను జంగయ్య చెల్లించాడు. అనంతరం అప్ప ట్లో వైఎస్ ప్రభుత్వం రైతురుణాలు మాఫీ చేయడంతో తన అప్పు కూడా మాఫీ అయిందని భావించాడు. అయితే, తనకు 5 ఎకరాలకుపైగా భూమి ఉండడంతో బకాయి మాఫీ కాలేదంటూ సహకార సంఘం అధికారులు అప్పును రూ. లక్షకు పైగా చేశారు. కొంత గడువు కావాలని అడిగినా వినకుండా ఇంట్లో ఉన్న టీవీ ఎత్తుకెళ్లారు. అప్పు చెల్లించాలని నోటీసులిచ్చినా పట్టించుకోకపోవడంతో చట్ట ప్రకారం గా చర్యలు తీసుకుంటున్నామని బాదేపల్లి శాఖ సూపర్వైజర్ యాదగిరి చెప్పారు. -
పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచడం ఎలా?
మాక్సిమైజింగ్ ద మెమరీ మా పిల్లలు ఈ సమ్మర్లో టీవీ చూడటం, వీడియోగేమ్స్ ఆడటం మినహా ఏం చేయడం లేదు. వారికి జ్ఞాపకశక్తి పెరిగేలా ఏవైనా చిట్కాలు ఉంటే చెప్పగలరు. - మోహన్‌రావు, హైదరాబాద్ పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి ఎన్నో మేధోపరమైన వ్యాయామాలు ఉన్నాయి. ఉదాహరణకు జ్ఞాపకశక్తి పెంచే పజిల్స్‌ను సాల్వ్ చేయడం, గళ్లనుడికట్టు పజిల్స్ నింపడం, సుడోకు వంటి నెంబర్ల ప్రమేయంతో ఉండే ఆటలు ఆడటం ఒక మార్గం. వాటితో పాటు అనేక ఇతర అంశాలను ప్రాక్టీస్ చేయడం కూడా జ్ఞాపకశక్తిని పెంచడానికి దోహదపడతాయి. వాళ్లలో సమస్యను పరిష్కరించడం, సృజనాత్మక శక్తిని పెంచడం కోసం కొన్ని సామాజిక సమస్యలను వాళ్ల ముందు పెట్టి, సమాధానాలు కోరాలి. హాస్యరసభరితమైన సినిమాలు చూడటం: హాస్యపూరితమైన సినిమాలు చూసేప్పుడు పిల్లలు గట్టిగా నవ్వుతుంటారు. ఈ ప్రక్రియలో మెదడు కణాలకు ఎక్కువ ఆక్సిజన్ అందుతుంటుంది. దాంతో మెదడు కణాలు మరింత జీవశక్తిని పుంజుకుంటాయి.మంచి ఆహారం తీసుకోవడం: మంచి ఆహారం కూడా జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఉదాహరణకు చేపలు, వాల్నట్స్, గుమ్మడిగింజలు, సోయాబీన్స్ వంటి ఆహారాల్లో ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వాటితో పాటు నిత్యం ముదురాకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు తినడం, ఆయా సీజన్లలో లభ్యమయ్యే పండ్లను తీసుకోవడం కూడా జ్ఞాపకశక్తిని పెంచుకునేందుకు దోహదపడే అంశాలే. మంచి నిద్ర: పిల్లలు గాఢంగా నిద్రపోవడం అవసరం. దీంతో వాళ్లలో సమస్యను ఛేదించే శక్తి (ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీస్) పెరుగుతాయి. పైగా నిద్ర సమయంలోనే మనం జ్ఞాపకముంచుకోవాల్సిన విషయాలను మెదడు తన జ్ఞాపక కేంద్రాలలో సుస్థిరం చేసుకుంటుంది. ఆటలు : పిల్లలు తమ మెదడుకు రక్తసరఫరా బాగా జరిగేలా ఏరోబిక్స్ చేయడం, శరీరానికి శ్రమ కలిగించే ఆటలు ఆడటం వల్ల కూడా వారిలో జ్ఞాపకశక్తి మరింతగా పెంపొందుతుంది. ధ్యానం: నిత్యం పది నుంచి పదిహేను నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల ఏకగ్రతా, దృష్టికేంద్రీకరణశక్తితో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. చెస్ (చదరంగం) ఆడటం కూడా దాదాపు ధ్యానంతో సమానం. డాక్టర్ బి. చంద్రశేఖర్‌రెడ్డి, సీనియర్ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, మెడిసిటీ హాస్పిటల్స్, హైదరాబాద్ మాక్సిమైజింగ్ ద మెమరీ -
ఆ రోజు మోదీ టీవీ చూడలేదు
‘ద మోదీ ఎఫెక్ట్’ పుస్తకంలో విశేషాలు న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడ్డ 2014 మే 16న నరేంద్రమోదీ ఏం చేశారు? తన గదిలో ఒంటరిగా ధ్యానం చేసుకుంటూ గడిపారు. టీవీ కూడా చూడలేదు. మధ్యాహ్నం 12 గంటల తర్వాతే టెలిఫోన్ కాల్స్‌ను స్వీకరించారు. అదీ తొలి ఫోన్ కాల్ అప్పటి బీజేపీ చీఫ్ రాజ్‌నాథ్‌సింగ్ చేసినది. ఎన్నికల్లో పార్టీ విజయ ఢంకా ఖాయమైపోయిందనేది రాజ్‌నాథ్ ఫోన్ సారాంశం. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీ వెల్లడించారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ మాజీ మీడియా సలహాదారు లాన్స్ ప్రైస్ రచించిన ‘ద మోదీ ఎఫెక్ట్: ఇన్సైడ్ నరేంద్ర మోదీస్ క్యాంపెయిన్ టు ట్రాన్స్ఫామ్ ఇండియా’ పుస్తకంలో మోదీ గురించి, ఆయన జీవితం గురించి ఇలాంటి ఆసక్తికర అంశాలున్నాయి. ఈ పుస్తకాన్ని భారత్‌లో హాచెట్ సంస్థ ప్రచురించింది. ప్రధానితో పాటు.. పియూష్గోయల్ తదితర ఆయన కేబనెట్ సహచరులు, సలహాదారులు, విశ్లేషకుల బృందంతో ఇంటర్వ్యూల దీన్ని రచించారు. ఈ పుస్తకం ప్రకారం.. 2012 గుజరాత్ ఎన్నికల్లో తన గెలుపు నాటి నుంచే.. పార్టీ ప్రధాని అభ్యర్థుల్లో తనను ఒకరిగా పరిగణిస్తారన్న విషయంపై తనకు స్పష్టత ఉందని మోదీ పేర్కొన్నారు. ‘కానీ నెను ఎన్నడూ వాస్తవంగా దాని గురించి ఆలోచించలేదు. నన్ను ప్రధాని అభ్యర్థిగా నామినేట్ చేసేలా పార్టీలో లాబీ చేయటానికీ ప్రయత్నించలేదు. అసలు నన్ను కానీ, మరొకరిని కానీ నామినేట్ చేస్తారా అన్న అంశంపైనా నాకు ఆసక్తి లేదు.. ఎన్నికలకు ముందు మీడియాకు అందుబాటులో ఉండరాదనుకున్నాను. మీ(మీడియా) ఆసక్తిని పొందాలనుకున్నాను’ అని చెప్పారు. బడా కార్పొరేట్ దాతలతో బీజేపీ అనుబంధంపై స్పందిస్తూ.. ‘కార్పొరేట్ సంస్థలకు చెందిన ప్రైవేట్ విమానాన్ని మేం వినియోగిస్తున్నామని చాలా రాస్తున్నారు. ప్రచారాన్ని నడిపించడానికి అవసరమైతే నేను సైకిళ్లు కూడా అద్దెకు తీసుకుంటాను’ అని మోదీ అన్నట్లు పుస్తకంలో ఉంది. -
'నాకు బ్రెడ్ అండ్ బటర్ బుల్లితెరే...'
తూర్పుగానుగూడెం : (రాజానగరం) : సినిమాల్లో అవకాశాలు ఎన్ని వచ్చినా టీవీ రంగాన్ని వదిలేది మాత్రం లేదని టీవీ, సినీ కళాకారుడు ప్రదీప్ అన్నారు. ‘భమ్ బోలేనాథ్’ సినిమా ప్రమోషన్లో భాగంగా తూర్పుగానుగూడెంలోని ఐఎస్టీఎస్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం రాత్రి జరిగిన ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్లో ఆయన పాల్గొన్నారు. దర్శకుడు కార్తీక్‌వర్మ చెప్పిన కథ కొత్తగా ఉందని, సరదాగా ఉందని, అందుకే ఈ సినిమాలో నటించానని చెప్పారు. తనకు బ్రెడ్ అండ్ బటర్... టీవీ రంగమేనన్నారు. ఇంతవరకూ చాల తక్కువ సినిమాలు చేశానన్నారు. 2015 తనకు స్పెషల్‌గా ఉందని, ఈ సంవత్సరంలోనే సొంత ప్రొడక్షన్‌పై ‘కొంచెం టచ్‌లో ఉంటే చెపుతాను’ టీవీ షో చేస్తున్నానని అన్నారు. స్టార్ హీరోలను కూడా ప్రొడక్షన్‌కు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నానన్నారు. ఇంతవరకూ సమంత, తమన్నా వచ్చారని, బన్నీ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాడని అన్నారు. వారు తమ పర్సనల్ లైఫ్ గురించి ఎక్కడా మాట్లాడరని, ఆ అవకాశం ఇందులో ఉంటుంది కాబట్టి వారు కూడా ఇష్టపడుతున్నారని అన్నారు. ఈ షోను ప్రేక్షకులు ఆదరిస్తున్నారన్నారు. గతంలో కొన్ని సినిమాల్లో చిన్నపాటి పాత్రలు చేసినా అవి టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవడం కోసమేన న్నారు. కాగా జనాన్ని ఆహ్లాదపరచడం కోసం ఎటువంటి పాత్రనైనా చేస్తానన్నారు. రాజమండ్రి రావడం ఇష్టంగా ఉందని, అమ్మ నాన్న ఇక్కడ నుంచి వచ్చారని అన్నారు. హైదరాబాద్‌లో సెటిలయ్యామని, వివాహం చేసుకోవాల్సిందిగా తనను తన తల్లి ఒత్తిడి చేస్తున్నారన్నారు. -
టీవీ చూడొద్దని మందలిస్తే...
పోలాకి: పరీక్షలు దగ్గర పడుతున్నాయి. టీవీ చూడ్డం మానేసి బాగా చదువుకోమ్మా అని తల్లిదండ్రులు మందలించడాన్ని సహించలేని ఓ విద్యార్థిని మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రం పోలాకి గ్రామంలోని లుకలాపు వీధికి చెందిన తోనంగి సీత(16) పోలాకి బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆదివారం సాయంత్రం ఆమె టీవీ చూస్తుండడంతో తల్లి దండ్రులు దుర్గారావు, నీలవేణి ఆమెను మందలించారు. పరీక్షలు దగ్గరపడుతున్నాయి.. టీవీ చూడవద్దు అనడంతో సీత అలకబూనింది. అనంతరం డాబా పైకి వెళ్లి కిరోసిన్ పోసుకుని ఒంటికి నిప్పంటించుకుంది. కుటుంబ సభ్యులు వెంటనే విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. 80శాతం కాలిన గాయాలతో చికిత్సపొందుతూ సోమవారం ఉదయం 8 గంటల సమయంలో సీత మృతి చెందినట్లు ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
వాహన ధరలకు రెక్కలు..
4 శాతం వరకూ పెరిగే అవకాశం.. టీవీలు, ఫ్రిజ్‌లు ఇతరత్రా ఉత్పత్తుల రేట్లు కూడా పైపైకి...! ఎక్సైజ్ సుంకం రాయితీల పొడిగింపు లేదని తేల్చిచెప్పిన కేంద్రం... న్యూఢిల్లీ: కొత్త ఏడాది వస్తూనే వినియోగదారుల జేబులు కొల్లగొడుతోంది!! వాహనాలు, టీవీ, ఫ్రిజ్ వంటి వినియోగ వస్తువుల ధరలు రేపటి(జనవరి 1) నుంచి పెరగనున్నాయి. కార్లు, టూ వీలర్లు, కన్సూమర్ డ్యూరబుల్స్‌పై ఇప్పటివరకూ ఇస్తున్న ఎక్సైజ్ సుంకం రాయితీలను పొడిగించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వాహనాల ధరలు 4 శాతం వరకూ పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్నాయంటూ పలు వాహన కంపెనీలు తమ కార్ల ధరలను ఇప్పటికే 2 శాతం వరకూ పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ పెరుగుదల కూడా రేపటి నుంచే అమల్లోకి రానున్నది. ఏతావాతా కొత్త ఏడాది వస్తూనే వినియోగదారులపై ధరల దెబ్బ తీయనున్నది. ఖజానాకు రూ. 1,000 కోట్ల అదనపు రాబడి... గత రెండు సంవత్సరాలుగా తగినంతగా అమ్మకాల్లేక అతలాకుతలమైన వాహన రంగాన్ని ఆదుకోవడానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం రాయితీలను ప్రకటించింది. మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదించిన ఈ రాయితీలు జూన్30 వరకూ అమల్లో ఉన్నాయి. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ఎక్సైజ్ రాయితీలను ఈ నెల 31 వరకూ పొడిగించింది. ఎక్సైజ్ సుంకం రాయితీలను మరికొంత కాలం కొనసాగించాలని వాహన కంపెనీలు కోరుతూ వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే అమ్మకాలు పుంజుకుంటున్నాయని, ఎక్సైజ్ సుంకం రాయితీలను పొడిగిస్తే వాహన రంగానికి ప్రయోజనం కలుగుతుందనేది ఆటోమొబైల్ కంపెనీల వాదన. ఎక్సైజ్ సుంకం రాయితీల పొడిగింపుపై ఈ నెల 31 వరకూ వేచి చూడండి అని కూడా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఊరించారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా ప్రభుత్వం ఈ రాయితీలను పొడిగించలేదు. ఎక్సైజ్ సుంకం రాయితీలను కొనసాగించడం లేదని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ నిర్ణయం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన మూడు నెలల్లో ప్రభుత్వానికి రూ.1,000 కోట్ల అదనపు రాబడి సమకూరుతుందని. దీంతో ద్రవ్యలోటును జీడీపీలో 4.1%కి పరిమితం చేయాలన్న లక్ష్యం నెరవేరుతుందని అంచనాలున్నాయి. తిరోగమన చర్య: ఇది తిరోగమన చర్య అని జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి. బాలేంద్రన్ వ్యాఖ్యానించారు. అధిక వడ్డీరేట్లు, బలహీనంగా ఉన్న వినియోగదారుల సెంటిమెంట్ అంశాలకు ఎక్సైజ్ సుంకం పెంపు కూడా తోడైతే రానున్న ఏడాది కూడా వాహన పరిశ్రమకు గడ్డుకాలమేనని పేర్కొన్నారు. ఎక్సైజ్ సుంకం పెంపును వినియోగదారులకు బదలాయించక తప్పదని మారుతి సుజుకీ చైర్మన్ ఆర్. సి. భార్గవ చెప్పారు. ధరలు పెరుగుతాయని, దీంతో అమ్మకాలు తగ్గుతాయని పేర్కొన్నారు. ధరలు పెరుగుతాయని, డిమాండ్‌పై ప్రభావం ఉంటుందని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్-ప్రెసిడెంట్(మార్కెటింగ్ అండ్ సేల్స్)జ్ఞానేశ్వర్ సేన్ వ్యాఖ్యానించారు. కొత్త ఏడాది మొదటి మూడు నెలల్లో మంచి అమ్మకాలు సాధిస్తామని ఆశగా ఉన్నామని, కానీ ఈ నిర్ణయం ఆ ఆశలపై నీళ్లు చల్లిందని హేయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ పేర్కొన్నారు. ఇప్పటికే అధికంగా ఉన్న వడ్డీరేట్లు, మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ కారణంగా అమ్మకాలు తగ్గాయని, ఎక్సైజ్ సుంకం రాయితీ కారణంగా ఇప్పుడిప్పుడే అమ్మకాలు పుంజుకుంటున్నాయని టాటా మోటార్స్ ప్రతినిధి పేర్కొన్నారు. ఎంత పెరుగుతాయ్... రూ. 1.97 లక్షల నుంచి రూ.4.03 లక్షల రేంజ్లో ఉన్న టాటా నానో, మారుతీ ఆల్టో800, హ్యుందాయ్ ఈఆన్ వంటి ఎంట్రీ లెవల్ కార్ల ధరలు రూ.7,900 నుంచి రూ.16,000 వరకూ పెరగవచ్చు. అలాగే రూ.4.42 లక్షల నుంచి రూ.7.66 లక్షల రేంజ్లో ఉండే మారుతి స్విఫ్ట్, హ్యుందాయ్ ఇలీట్ ఐ20 వంటి ప్రీమియం హ్యాచ్‌బాక్ కార్ల ధరలు రూ.17,700 నుంచి రూ.30,600 వరకూ పెరగవచ్చు. -
'నవ్విస్తున్న మమ్మల్ని కొట్టడం అమానుషం'.
-
'నవ్విస్తున్న మమ్మల్ని కొట్టడం అమానుషం'
-
'నవ్విస్తున్న మమ్మల్ని కొట్టడం అమానుషం'
హైదరాబాద్ : కమెడియన్ వేణుపై దాడిని నిరసిస్తూ జబర్దస్త్ టీమ్‌తో పాటు టీవీ, సినీ ఆర్టిస్టులు సోమవారం నిరసన తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వరకూ ర్యాలీ చేపట్టారు. తమపై జరిగిన దాడిని నిరసిస్తూ జబర్దస్త్ టీమ్‌తో పాటు టీవీ, సినీ ఆర్టిస్ట్‌లు...ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం ఈ ఘటనపై ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నటుడు నాగబాబు మాట్లాడుతూ రెండేళ్లుగా నవ్వులు పండిస్తున్న నటులను కొట్టడం అమానుషమన్నారు. ఏ విపత్తు వచ్చినా కమెడియన్స్‌గా తమ వంతు సాయంగా ముందుంటున్నామని, అలాంటిది తమపై దాడి చేయటం దారుణమని ధన్‌రాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా ఈటీవీలో ప్రసారమౌతున్న 'జబర్దస్త్' షో ఫేం వేణుపై గౌడ కులస్తులు నిన్న ఉదయం దాడి చేసిన విషయం తెలిసిందే. ఈనెల 18న ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమంలో కల్లువృత్తిని, గౌడ మహిళలను అవమానించే విధంగా స్క్రిఫ్ట్‌ను ప్రదర్శించారని ఆరోపిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన గౌడ విద్యార్థి సంఘం నాయకులు ఫిలింనగర్‌లోని అయ్యప్ప ఆలయానికి వచ్చిన వేణును చుట్టుముట్టి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం కామెడీ కోసమే ఆ స్క్రిప్ట్ తయారు చేశానని, ఒక కులాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని అతను చెప్తుండగానే వారు దాడి చేశారు. జబర్దస్త్ టీమ్, ఈటీవీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీంతో రెండు గంటలపాటు ఫిలించాంబర్ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. వేణును ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో కూడా గౌడ విద్యార్థులు అడ్డుపడి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వేణు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గౌడ విద్యార్థి సంఘం నేతలపై ఐపీసీ 341, 323 కింద కేసులు నమోదు చే శారు. వేణు కూడా తమపై దాడి చేశాడంటూ గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామారావుగౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వేణుపై ఐపీసీ 323, 509కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మంచి వార్తలు రాయండి
కోలారు : పత్రికలు, టీవీల్లో నేర వార్తలను విశేషంగా రాయడం తగదని, దీని వల్ల యువత పక్కదోవ పట్టే ప్రమాదం ఉందని జిల్లా సెషన్స్ న్యాయమూర్తి రేణుకా ప్రసాద్ అన్నారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన కానూను అరివు - నెరవు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న మంచి విషయాలను తక్కువ చూపించి నేరాలు, తదితరాలను పెద్దగా చూపుతున్నారని తెలిపారు. అవి యువతపై తీవ్రమైన పరిణామాలు చూపిస్తున్నాయని పేర్కొన్నారు. నేరాలను ఎక్కువగా చూపించే బదులు.. వాటికి పాల్పడితే ఎలాంటి శిక్ష పడుతుందో వివరించాలని సూచించారు. నేరాలను అదుపు చేయడంలో పోలీసులతో పాటు ప్రజల పాత్ర కూడా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాల గురించి తెలుసుకోవాల్సి ఉందన్నారు. అప్పుడే నేరాల సంఖ్య తగ్గుతుందని వివరించారు. అసంఘటిత కార్మికులకు జాతీయ పింఛను పథకం వరంలా మారిందని, తాము కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని పొదుపు చేస్తే భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా జాతీయ పింఛను పథకాన్ని పాత్రికేయులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి మల్లికార్జున కిణికేరి, జాగృతి సేవా సంస్థ అధ్యక్షుడు ధన్‌రాజ్, పాత్రికేయుల సంఘం జిల్లాధ్యక్షుడు కేఎస్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఉచితంగా టీవీ, బియ్యం’
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఐదు దశల పోలింగ్ ప్రక్రియ ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను బుధవారం విడుదల చేసింది. అధికారంలోకి వస్తే.. ఆదాయపన్ను(ఐటీ) పరిధిలోకిరాని ప్రజలకు ప్రతి నెలా 35 కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తామని, బీపీఎల్ కుటుంబాలకు ఉచితంగా టీవీసెట్లు ఇస్తామని వాగ్దానం చేసింది. కాంగ్రెస్ మేనిఫెస్టోను కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుబోధ్ కాంత్ సహాయ్ విడుదల చేశారు. రాష్ట్రంలో రాజకీయ సుస్థిరతను తీసుకురావడం లక్ష్యంగా.. జార్ఖండ్ అసెంబ్లీలో సభ్యుల సంఖ్యను ప్రస్తుతమున్న 81 నుంచి 140 సీట్లకు పెంచేందుకు చర్యలు చేపడతామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీఇచ్చింది. మేధావులకు స్థానం కల్పించడానికి వీలుగా శాసన మండలిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. -
యాంకరమ్మకు కోటి రూపాయలు?
న్యూస్ రీడర్ నుంచి యాంకర్‌గా మారిన అనసూయకు ....తమ చిత్రంలో నటింపచేసేందుకు ఓ నిర్మాత కోటి రూపాయలు పారితోషికం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. జబర్దస్ కామెడీ షో ద్వారా బోల్డంత గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు.... టాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చాయి. ఏడాది క్రితం పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం అనసూయను సంప్రదించారని, అయితే ఐటం సాంగ్స్ చేయనని ఆమె ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇద్దరు పిల్లలు తల్లి అయినా అనసూయకు మాంచీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా అనసూయకు హీరోయిన్ ఆఫర్ వచ్చినట్లు ఫిల్మ్‌నగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందు కోసం సదరు నిర్మాత ఆమెకు కోటి రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సిద్దం అయినట్లు... అయితే అందుకు ఆ నిర్మాత అనసూయని మూడు నెలల డేట్స్ అడిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆఫర్‌పై అనసూయ మాత్రం పెదవి విప్పటం లేదు. ఇక హీరోయిన్ స్వాతి కూడా ఒకప్పుడు బుల్లితెర యాంకరే. మా టీవీలో కలర్స్' ప్రోగ్రామ్‌తో ఆమె పాపులర్ అయిన విషయం తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో స్వాతి నటిస్తోంది. మరో యాంకర్ ఉదయభాను కూడా పలు చిత్రాలు నటించింది కూడా. అయితే అవేమీ ఆమెకు అంత గుర్తింపు తెచ్చివ్వలేకపోయాయి. రానా హీరోగా నటించిన 'లీడర్'లో రాజశేఖరా నీ పై....అంటూ ఓ సాంగ్‌లో నర్తించిన విషయం తెలిసిందే. మరి బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పించిన అనసూయ వెండితెరపై రాణిస్తుందా అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. -
షార్ట్ సర్క్యూట్ కారణంగా పేలిన టివి
-
కవ్వింత
చిత్రం పనివాడు: అయ్యా, ఈరోజు టీవీలో వచ్చే ‘కడపటి యుద్ధం’ సినిమా చూడొచ్చా? యజమాని: ఇదేం విచిత్రమైన కోరికరా? పనివాడు: అది నేను నిర్మించిన తొలి-చివరి సినిమా అయ్యగారు!!! లవ్లీ షాక్ రజని: గౌతమ్, మా ఇంట్లో నాకు పెళ్లి చూపులు చూస్తున్నారు. గౌతమ్: నా గురించి నువ్వేం భయపడకు రజని. మా అక్క కూతురు కిరణ్మయి కూడా నన్ను ప్రేమిస్తోంది. ఫ్యామిలీ ప్యాక్ ఎలక్ట్రిసిటీ పాఠం అయ్యాక టీచరు ప్రశ్నలు అడుగుతోంది. నిద్రపోతున్న వెంకట్‌ని లేపి నువ్వు ఏ పాఠం వింటున్నావో చెప్పు అని అడిగింది. పైకి లేచి ‘ఎలక్ట్రికిటీ’ మేడమ్ అన్నాడు. అదేంటి అలా పలుకుతున్నావు రేపు మీ పేరెంట్స్‌ని పిలుచుకురా. టీచర్: మీ అబ్బాయి ‘ఎలక్ట్రికిటీ’ అని పలుకుతున్నాడేంటి? తండ్రి: వాడి కెపాక్రిటీ అంతే మేడమ్ టీచరు: మీ ఆయన కూడా అలా మాట్లాడతాడేంటమ్మా? తల్లి: దీనికి ఇంత ‘పబ్లికిటీ’ అవసరమా? మేడమ్! కారణం తెలిసింది! రామ్: ఆ నవల చదివితే కేశాలు నిక్కబొడుచుకుంటాయన్నావు, అదేం లేదే! శ్యామ్: అది జుట్టున్న వారికి రా, నీకు కాదు. మగ జ్యోతిష్కుడు! శ్రీలత: నా భర్త క్షేమంగా ఉండాలంటే నేను ఏ నోము చేయాలో చెబుతారా? జ్యోతిష్కుడు: మూగనోము -
మూడు దేశాల ముద్దుబిడ్డ
బాల్యంలో తల్లి చెప్పే రామాయణ భారత గాథలు విన్నారు ఆనందాదేవి.. పెద్దయ్యాక కూడా వాటిని మర్చిపోలేదు...వాటినుంచి ఎంతో జ్ఞానం సంపాదించుకున్నారు...ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేసి, తన జ్ఞానపరిధిని పెంచుకున్నారు... మనిషికి మనసుకు మధ్య జరిగే సంఘర్షణలను తన కథలకు ప్రధానాంశంగా చేసుకున్నారు... రచనలలో భిన్న సంస్కృతులను చూపారు... భావవ్యక్తీకరణలో కొత్తకోణం ఆవిష్కరించారు...విమర్శకుల ప్రశంసలనందుకుంటూనే అనేక అవార్డులను గెలుచుకున్న ఆనందాదేవిమారిషస్లో పుట్టి, ఫ్రెంచ్‌లో రచనలు చేసిన అచ్చ తెలుగింటి అమ్మాయి అంటే ఆశ్చర్యమే! మారిషస్‌లోని ఆనందాదేవి ఇల్లు, చెరుకుతోట మధ్యలో ప్రశాంత వాతావరణంలో ఉంది. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆమె ఇంకా ఆహ్లాదకరమైన పుస్తకాలెన్నో చదివారు. ఆడుకోవడానికి చెల్లి తప్ప ఆ రోజుల్లో రేడియో, టీవీ వంటి ప్రచార సాధనాలు లేవు. అయితే ఆ ఇంటి లైబ్రరీలో ఆర్థర్ కోనన్డోయ్లే, అగాథా క్రిస్టీ వంటి రచయితల రచనలు, 1001 నైట్స్ అండ్ బౌడేలైర్... వంటి ఎన్నో మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. ఎందుకంటే ఆమె తల్లితండ్రులకు పుస్తకాలే ప్రాణం! బహుశ పుస్తకాలు చదివే అలవాటు వారి దగ్గర నుంచే అబ్బి ఉంటుంది. మనసుతోనే ప్రయాణం... భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో పెరిగిన ఆనందాదేవి, తన ఏడవ ఏటనే కవిత్వం రాయడం ప్రారంభించారు. 15 వ ఏట రచించిన చిన్న కథకు, ‘రేడియో ఫ్రాన్స్ ఇంటర్నేషనల్ అవార్డు’ అందుకున్నారు. ‘‘ప్రపంచంలో ఏయే ప్రాంతాలకు ఎలా వెళ్లాలో తెలుసుకోవడానికి టైమ్ అట్లాస్ చూసేదానిని. నేను రాసే కథలలో అట్లాస్ చూస్తూ ఆయా ప్రాంతాలకు నా మనసుతో ప్రయాణిస్తుంటాను. నేను ఫ్రెంచ్‌లో రాస్తున్నప్పటికీ నాలో, నా రచనలలో భారతీయత ఉంటుంది. ఇప్పటికే నా రచనలు అనేక ఇతర భాషలలోకి అనువాదమయ్యాయి... ’’ అంటారు. భాషల మాటకారి... దేవి రచనలు ఫ్రెంచిభాషలో ఉంటాయి కాని, ఆమె పలు భాషలు మాట్లాడగలరు. ‘‘నాకు తెలుగు, క్రియోల్, ఫ్రెంచ్, భోజ్‌పురి, హిందీ భాషలు వచ్చు. ఎవరైనా నన్ను ‘మీరు ఏ భాషలో ఆలోచిస్తారు?’ అని ప్రశ్నిస్తే, ‘‘ఏ భాషలో మాట్లాడితే ఆ భాషలో ఆలోచిస్తాను. ’’ అంటారు ఆమె. రచనలు... ఆనందాదేవి రచనలలో అనేక సామాజిక అంశాలు ప్రతిబింబిస్తాయి. స్త్రీల గురించి, అనేక సామాజిక రుగ్మతల గురించి, అంగవైకల్యం, వ్యభిచారం, వృద్ధాప్యం, స్వలింగ సంపర్కం... వంటి ఎన్నో అంశాల మీద అనేక వ్యాసాలు రచించారు. ఇంకా... చిన్నకథలు, నవలలు రాస్తూ, అనువాదాలు చేస్తూ, పుస్తకాలు ప్రచురిస్తున్నారు. సాహిత్యం అనేది భాషాభేదం లేకుండా, తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి అనువైనదనే విషయాన్ని ప్రచారం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కలకత్తాలో... కలకత్తాలో ఉన్నప్పుడు కొన్నిరోజులపాటు కొందరు వేశ్యలను దగ్గరగా గమనించారు ఆనంద. ఈ విషయం చెబుతూ, ‘‘వారు ఎటువంటి దుస్తులు ధరించాలి? ఏ విధంగా ప్రవర్తించాలి? వంటి అంశాల మీద వారికి స్వేచ్ఛ ఉండదనిపించింది. ఈ విషయంలో ఆడపిల్లల కంటె మగపిల్లలను బాగా ఎడ్యుకేట్ చేయాలనిపించింది. వారికి స్త్రీలను గౌరవించడం నేర్పాలని నేను చెప్పినప్పుడు, చాలామంది న్యాయమూర్తులు, రాజకీయనాయకులు నన్ను విమర్శించారు’’ అని గుర్తు చేసుకున్నారు ఆనందాదేవి. ముగింపు పాఠకులకే! ‘‘రచయిత పురుషుడైతే, ఇంటికి వెళ్లగానే, తనను డిస్టర్బ్ చేయవద్దని, తాను రాసుకోవాలని చెప్పగలుగుతాడు. స్త్రీకి అలా కుదరదు. ఇంటికి వెళ్లి అన్ని పనులూ చేసుకుని, పిల్లలకు కావలసినవన్నీ చూసి, ఆ తరువాత సమయం, ఓపిక... ఉంటేనే రాసుకుంటారు. అంతేగాని, ‘నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను రాసుకుంటున్నాను’ అనే అర్హత ఆమెకు ఉండదు కదా!’’ అంటారు ఆనంద. ఇంకా... ‘‘రచనలు చేయడమంటే పాఠకులను చాలెంజ్ చేయడమే. ఒక రచన చేస్తే, అందులోకి పాఠకుడు ప్రవేశించాలి. పాఠకులతో సున్నితంగా ఆడుకోవడమంటే నాకు ఇష్టం. అందుకే ముగింపు ఒక్కోసారి పాఠకులకే వదిలేస్తుంటాను. నా తాజా నవల ‘లెస్ జోర్స్ వివంత్స్ (ద లివింగ్ డేస్), నవల ముగింపును పాఠకులకే వదిలేశాను’’ అన్నారు, ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్న ఆనందాదేవి. అయితే సమస్యలను మాత్రం ఆమె అలా గాలికి వదిలేయలేదు. తనకు చేతనైన పరిష్కారాలను సూచిస్తుంటారు. బహుశ ఆ అలవాటే ఆమె పురస్కారాలు అందుకోవడానికి అర్హురాలిని చేసి ఉండవచ్చు! గుర్తింపు లేకపోవడమే మంచిది... నన్నొక ప్రత్యేక వ్యక్తిగా నిలిపింది మారిషస్. అయినప్పటికీ నేను నా రచనలు చేసేటప్పుడు నేను మారిషస్ స్త్రీని అనుకోను. నేను కంప్యూటర్ ముందు కూర్చునే ఒక ప్రాణిని. ఒక్కోసారి పెన్ పేపరు పుచ్చుకునే ప్రాణిని. కథలు రాస్తూ, నాకు తెలియని ప్రదేశాలకు ప్రయాణిస్తుంటాను. రచయితగా నాకొక గుర్తింపు లేకపోవడాన్ని, లేదనుకోవడాన్ని నేను ఇష్టపడతాను. కొత్తకొత్త వ్యక్తుల మస్తిష్కంలో నన్ను నేను ఆవిష్కరించుకోగలను... వారిలాగ ఆలోచిస్తూ, వారిలాగ ఉంటూ... - ఆనందాదేవి -
రేడియో జర్నీ
టీవీ, ఇంటర్నెట్ వంటి అధునాతన ప్రసార మాధ్యమాల తాకిడికి తట్టుకుని, కాలానికి అనుగుణంగా రూపు మార్చుకుంది రేడియో. ఈ క్రమాన్ని తెలుపుతూ సినీ నిర్మాత మధుర శ్రీధర్ ట్యాంక్‌బండ్ హోటల్ మారియట్‌లో ‘జర్నీ ఆఫ్ రేడియో’ ప్రదర్శన ఏర్పాటు చేశారు. రేడియో జాకీల్లోనూ, అభిమానుల్లోనూ నూతనోత్సాహాన్ని నింపారు. ఈ నెల 6 వరకు ప్రదర్శన కొనసాగుతుందని వెల్లడించారు. - కోట కృష్ణారావు దక్కన్ రేడియో నుంచి ఎఫ్ఎం రేడియో వరకు... నిజాం జమానా నాటి దక్కన్ రేడియో నుంచి ఎఫ్ఎం రేడియో వరకు ‘ఆకాశవాణి’ పయనంలోని మైలురాళ్లన్నింటినీ ఈ ప్రదర్శనలో కొలువుదీర్చారు. ఆనాటి రేడియో రూపురేఖల నుంచి ప్రస్తుత స్వరూపం వరకు ఎలా మారిందనే దానికి నిదర్శనంగా ఫొటోలను ప్రదర్శనలో ఉంచారు. 1940లలో రేడియో రిసీవర్ ట్రూటోన్ మోడల్ రేడియోను ఎక్కువగా ఉపయోగించేవారు. 1947లో డియోరా ఆగా ఆర్ఎస్జెడ్-50 రేడియో ఓ వెలుగు వెలిగింది. శ్రీలంక రేడియో స్టేషన్‌గా పిలుచుకునే సిలోన్ రేడియో స్టేషన్, మొట్టమొదటి ఎవర్ రివల్యూషనరీ బాస్‌వేవ్ రేడియో, తొలిసారిగా రేడియో-టేప్రికార్డర్లు టూ-ఇన్-వన్‌గా మార్కెట్లోకి వచ్చిన తీరు, తొలితరం ట్రాన్సిస్టర్ రేడియోలు, రేడియో కార్యక్రమాలను ప్రచురించే ఫస్ట్ రేడియో టైమ్స్ మ్యాగజైన్, దేశంలోని ఆకాశవాణి కేంద్రాల సంఖ్య, ఎఫ్ఎం రేడియో కేంద్రాల సంఖ్య, రేడియో వ్యాఖ్యాతల పేర్లు, నాటి నుంచి నేటి వరకు రేడియోలో సాగిన వినోద, విజ్ఞాన కార్యక్రమాలు, ఎంఎస్ సుబ్బులక్ష్మి సుప్రభాతం మొదలుకొని రోజంతా సంగీతంతో పసందు చేసిన గాయకులు, సంగీత దర్శకుల ఫొటోలతో పాటు సమాచారాన్ని ప్రదర్శనలో ఉంచారు. మరిన్ని విశేషాలు... - దక్షిణ భారతదేశంలో మద్రాసు నుంచి తెలుగు, తమిళ భాషల్లో రేడియో కార్యక్రమాలు 1938 జూన్ 16 నుంచి వెలువడ్డాయి. - ఎయిర్ చెన్నై తెలుగు రేడియోకు సంబంధించి మొట్టమొదటి వ్యాఖ్యాత ఉమామహేశ్వరరావు. - ఎయిర్చెన్నైలో మొట్టమొదటి తెలుగు కార్యక్రమం అనార్కలి. దీనికి వ్యాఖ్యాతగా భానుమతి వ్యవహరించారు. - 1947 నాటికి ఇండియాలో 2,75,000 రేడియో సెట్స్ అందుబాటులోకి వచ్చాయి. అప్పట్లో వీటికి లెసైన్స్ తప్పనిసరిగా ఉండేవి. - రేడియో కార్యక్రమాల్లో ప్రాముఖ్యత సంతరించుకున్న వివిధభారతి కార్యక్రమం 1957లో ఫ్రారంభమైంది. - ఆలిండియా రేడియో పేరు 1956 నుంచి అధికారికంగా ఆకాశవాణిగా మారింది. - ఇండియాలో మొట్టమొదటి ప్రైవేట్ చానల్ రేడియో సిటీ. 2001, జూలై 3న ప్రారంభమైంది. ఎఫ్ఎంతో మళ్లీ ఊపిరి రేడియో ఒక వారసత్వ సంపద. ఆధునిక యుగంలో చోటు చేసుకున్న మార్పుల ఫలితంగా కనుమరుగైపోతుందనుకున్న రేడియో, మళ్లీ ఎఫ్ఎం కేంద్రాల కారణంగా ఊపిరి పోసుకుంది. ట్రాఫిక్‌లో ఉన్నా, ఇంట్లో బెడ్రూమ్లో ఉన్నా... రేడియో పంచే వినోదం, విజ్ఞానం ఆపారం. రేడియో ప్రస్థానంలో నాటి, నేటి వైభవాన్ని మరోసారి గుర్తు చేసుకునేందుకే ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు మధుర శ్రీధర్ చెప్పారు. రేడియో జాకీలను, అభిమానులను... ఇలా రేడియోతో అనుబంధం ఉన్నవారందరినీ ఈ ప్రదర్శనతో ఒకచోటుకు చేర్చడం మధురానుభూతిని ఇచ్చిందన్నారు. బాల్యంలో పొలాల్లో రైతుల భుజాలపై కూర్చుని రేడియో వింటూ సాగిన తన జీవితం, క్రమేపీ రేడియోతో అపారమైన అనుబంధాన్ని ముడి వేసుకుందన్నారు. ఈ ప్రదర్శన ద్వారా రేడియోలో సుదీర్ఘకాలం వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన జోత్స్న, ఇలియాస్‌లను సత్కరించారు. -
టీవీ 9 వ్యాఖ్యలు సముచితం కావు
-
టీవీ వస్తుందని...
తపాలా అవి నేను ప్రైవేట్ ఫైనాన్స్‌లో పనిచేస్తున్న రోజులు. ఈ సంఘటన జరిగి దాదాపు పదేళ్లు అయినా, ఇప్పటికీ గుర్తొచ్చినప్పుడల్లా నా అమాయకత్వానికి నవ్వుకుంటాం. ఓరోజు ఫైనాన్స్‌లో దినపత్రికలు తిరగేస్తుంటే ఒక పజిల్ కనిపించింది. దాన్ని పూర్తిచేసి పంపిస్తే, కారు, టీవీ లాంటి బహుమతులు ఉన్నాయని చూసి ఆశపడి, పూర్తిచేసి ఇచ్చిన అడ్రెస్‌కు పోస్ట్ చేశాను. తర్వాత కొన్ని రోజులు దాని గురించి మరిచిపోయాను. ఓ పదిహేను రోజుల తర్వాత, నాకు తపాలా వచ్చింది. నా పజిల్ కరెక్టు అనీ, అందుకు నాకు టీవీ బహుమతిగా వచ్చిందనీ, అందుకు నాలుగొందల రూపాయలు కడితే వివరాలు పంపుతామనీ దాని సారాంశం. నేను మొదట వద్దనుకున్నాను. నాతో పనిచేసే మిగతావారు నీకు వద్దంటే చెప్పు, మేం తీసుకుంటామనే సరికి, నాకు ఆశపుట్టి ఎలాగోలా డబ్బు సర్ది పంపించాను. తర్వాత కొన్ని రోజులకు నాకు రిజిస్టర్ పోస్ట్ వచ్చింది. ఆరొందల రూపాయలు కడితే దాన్ని ఇస్తామన్నారు. ఆనందంతో అవి కూడా కట్టాను. పార్శిల్ ఓపెన్ చేస్తే, టికెట్ బుక్! ఒక్కో టికెట్ రూ.400. నేను అమ్మి వాటిని పంపిస్తే, అప్పుడిస్తారట టీవీ. అంతే, నాకు నాలుక తడారిపోయింది. ఇంట్లో ఒకటే తిట్లు. వీధిలో వారు నవ్వులు. కొన్ని రోజులు ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయాను. ఎందుకంటే అప్పుడు నా జీతం నాలుగొందలు మాత్రమే. కాబట్టి అలాంటి ప్రకటనలు చూసి ఇంకెప్పుడూ మోసపోకూడదనుకున్నాను. - టి.రెడ్డివెంకటరమణ రాయలపేట, చిత్తూరు -
పిల్లలే పెద్ద కొనుగోలుదారులు
సర్వే అవి టీవీలు వచ్చిన తొలిరోజులు... ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ తబలా వాయించడం ఆపి గాజు కప్పులో టీ సిప్ చేసి ‘వాహ్ తాజ్’ అంటారు. బ్యాక్‌డ్రాప్‌లో తాజ్‌మహల్ కనిపిస్తుంటుంది. ఈ ప్రకటన చూసిన పిల్లల మెదళ్లలో తాజ్‌మహల్ అంటే టీ అనే ముద్ర పడిపోయింది. తాజ్‌మహల్ అనే నిర్మాణం ఒకటుందని, ఆ పేరుతో ఒక కంపెనీ తేయాకు పొడిని తయారు చేసిందని తల్లిదండ్రులు పనిగట్టుకుని తెలియచేయాల్సి వచ్చింది. టీ తాగాలనే కోరిక లేకపోయినా ఉస్తాద్ జాకీర్ హుస్సేన్‌లా ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికే టీ కావాలని మారాం చేసిన పిల్లలు ఎక్కువే అప్పట్లో. అంటే పిల్లల మీద ప్రకటనల ప్రభావం అంతగా ఉంటుందన్న మాట. ఇదే విషయాన్ని ఒక అధ్యయన బృందం కూడా నిర్ధారిస్తోంది. ఆర్కైవ్స్ ఆఫ్ పీడియాట్రిక్ అండ్ అడాలసెంట్ మెడిసిన్ అనే మ్యాగజైన్ ఒక అధ్యయన నివేదికను ప్రచురించింది పిల్లలు టీవీ చూసే సమయం పెరిగే కొద్దీ వాళ్లు తల్లిదండ్రులను ‘అది కొనివ్వు... ఇది కొనివ్వు’ అని అడగడం పెరుగుతుందట. స్టాన్ఫోర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, పకార్డ్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు చెందిన బృందం నిర్వహించిన సర్వేలో ఈ విషయం తెలిసింది. మార్కెట్లోకి కొత్త మోడల్ వీడియో గేమ్స్ వస్తే ఇక అప్పటి వరకు తాను ఆడుకుంటున్న వీడియో గేమ్స్ నచ్చవు. వాటితో ఆడుకోవడం అంటే బోర్, చిరాకు, కొత్తది కొనివ్వలేదన్న అలక. పది నుంచి పధ్నాలుగు ఏళ్ల వయసు పిల్లలున్న ఇళ్లలో ఇదో ప్రహసనం. ఇక సాధారణంగా ఫుడ్ ఐటమ్స్, డ్రింక్స్, బొమ్మలు అయితే ఎన్ని ఉన్నా, ఎన్ని కొన్నా ఆ తృప్తి కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చే వరకే. ఒక బొమ్మ కొనిస్తే దాంతో ఆడుకునేది ఒక వారమో లేదా రెండు వారాలే, మూడో వారానికి కొత్త బొమ్మ గురించిన డిమాండ్ ఉండనే ఉంటుంది. తిండి విషయానికొస్తే వాణిజ్య ప్రకటనల్లో వచ్చే వాటిలో ఎక్కువ భాగం కేలరీలు ఎక్కువగా ఉండి పోషకవిలువలు తక్కువగా ఉండేవే ఉంటున్నాయి. అమెరికాలో సగటున పిల్లలు ఏడాదికి నలభై వేల వాణిజ్య ప్రకటనలను చూస్తున్నారని ఒక అధ్యయనం. ఒక వస్తువును అమ్మాలంటే దాని గుణగణాలను తెలియచేయడానికి సులువైన మార్గం అడ్వర్టైజ్మెంట్. అది తినే వస్తువు అయినా, రాసే పెన్నయినా సరే ఆ వస్తువు ఒకటి మార్కెట్లో ఉంది అని తెలియచెప్పే సాధనమే యాడ్. యాడ్ ఎంత ఆకర్షణీయంగా ఉంటే ఆ వస్తువు అంతగా ప్రజల్లోకి చొచ్చుకుపోతుందనేది కాదనలేని సత్యం. కొత్త ప్రొడక్ట్ ప్రజల్లోకి వెళ్లడానికి ఒకప్పుడు చాలా పెద్ద నెట్వర్క్ అవసరమయ్యేది. ఇప్పుడు టీవీలు చాలా ఈజీగా మారుమూల పల్లెలకు చేరవేస్తున్నాయి. మల్టీనేషనల్ కంపెనీ తయారు చేసిన ఆలూ చిప్స్ గురించి బస్సు వెళ్లడానికి రోడ్డు లేని ఊళ్లో ఉన్న పిల్లలకు కూడా తెలుసు. ఇప్పుడు 5-15 ఏళ్ల పిల్లలు ఆయా కంపెనీలకు ప్రధానమైన మార్కెట్. -
సినిమా కోసమే టీవీకి దూరం..
బుల్లితెరపై చాక్లెట్ బాయ్‌గా పేరు తెచ్చుకుని, ప్రేక్షకులపై తనదైన ముద్రను వేసిన నటుడు రాజీవ్ ఖండేల్వాల్. బాలీవుడ్లో ఎక్కువ అవకాశాల కోసమే తాను బుల్లితెరను వీడాల్సి వచ్చిందని చెబుతున్నాడు. కహీతో హోగాతో టెలివిజన్‌కు పరిచయమైన రాజీవ్ అంతకుముందు ఎల్ఎంఎల్, గ్రీన్‌లేబుల్ విస్కీ, కొడాక్ ఎక్స్‌ప్రెస్, వీడియోకాన్ రిఫ్రిజిరేటర్స్ ప్రకటనల్లోనూ కనిపించాడు. 10 ఏళ్ల పాటు టెలివిజన్ పరిశ్రమలో కొనసాగిన రాజీవ్ టైజం డ్రామాతో రూపొందిన ‘ఆమిర్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తరువాత షైతాన్‌లో ఇన్స్పెక్టర్ అరవింద్ మాథుర్ పాత్ర పోషించాడు. టేబుల్ నంబర్ 21లో వివాన్ అగస్తీగా కనిపించి మెప్పించాడు. ‘‘ఆమిర్ అవకాశం వచ్చినప్పుడు నేను మరేమీ ఆలోచించలేదు. కారణం నా ఆలోచనల్లో ఉన్న స్క్రిప్ట్ నా ముందుకొచ్చింది. అందుకే వినగానే ఓకే చెప్పాను. మొదటి సినిమాలో ఏ లవర్ బోయ్ పాత్రనో చేయకుండా, భిన్నమైన పాత్ర పోషించడం నాకు నచ్చింది’’ అంటున్నాడు. రాజ్శ్రీ బ్యానర్ నిర్మిస్తున్న డిటెక్టివ్ థ్రిల్లర్ సినిమా సామ్రాట్ అండ్ కో రాజీవ్ తాజా సినిమా. ఇది కుటుంబ కథా చిత్రాలకు భిన్నంగా ఉంటుందని చెబుతున్నాడు. ఇందులో ఇతడు డిటెక్టివ్‌గా కనిపిస్తాడు. హాలీవుడ్, బాలీవుడ్ గూఢచార చిత్రాల్లో లాగా నేల విడిచి సాము చేయకుండా, కథ వాస్తవానికి దగ్గరగా ఉంటుందని చెబుతున్నాడు. ‘‘నా పాత్ర శక్తివంతమైనదే. అయితే బాలీవుడ్ సినిమాల్లో మాదిరిగా భవనాల మీద నుంచి దూకడం వంటి గిమ్మిక్కులు మాత్రం ఉండవు. తెలివి, లాజిక్ తోనే ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తాను’’ అని అంటున్నాడు. 2008లోనే బాలీవుడ్‌కి వచ్చినా ఇతడు ఎక్కువ చిత్రాలు చేయలేదు. ఏడాదికి రెండు, మూడు చిత్రాలు చేస్తే చాలని పరేష్ రావల్ వంటి తన శ్రేయోభిలాషులు సూచిస్తున్నారని చెబుతున్నాడు. రాజీవ్ ఖండేల్వాల్ రాబోయే చిత్రం ఫీవర్. దీని షూటింగ్ స్విట్జర్లాండ్‌లో కొనసాగుతోంది. -
నిర్మించి ఏడాది వసతి కల్పించేదెన్నడో?
సాక్షి, ముంబై: బిచ్చగాళ్ల వెసులుబాటుకోసం నగర పాలక సంస్థ (బీఎంసీ) ఏడాది క్రితం నగరంలో నిర్మించిన వసతి గృహం ఇప్పటికీ వారికి అందుబాటులోకి రాలేదు. దాదాపు 850 మంది బిచ్చగాళ్లు ఉండేవిధంగా ఈ వసతిగృహాన్ని నిర్మించారు. దీని వైశాల్యం 6,700 చదరపు మీటర్లు.వంట గది కూడా చాలా విశాలంగా ఉంటుంది. అంతేకాకుండా అత్యవసర సమయంలో బిచ్చగాళ్లకు ప్రాథమిక పరీక్షలు జరిపేందుకు చిన్నపాటి ఆస్పత్రిని కూడా అక్కడే నిర్మించారు. ఇందులో 40 పడకలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు అనేక సదుపాయాలు కల్పించారు. అందులోని భారీ హాలులో ఫ్యాన్లు, ట్యూబ్లైట్లను ఏర్పాటు చేయడంతోపాటు వినోదం కోసం ఓ టీవీని కూడా అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా వివిధ అవసరాలతో కూడిన అతి పెద్ద వంట గది, ప్రత్యేక స్నానాల గదులు, వికలాంగులకు ప్రత్యేక ర్యాంప్‌లు కూడా ఏర్పాటు చేశారు. బంధువులు వచ్చినప్పుడు కూర్చోవడానికి పచ్చికలో సీట్లు, అంతేకాకుండా వాకింగ్ చేయడానికి అతిపెద్ద గార్డెన్ వసతి కూడా ఉంది. ఈ భవన నిర్మాణానికి 2008లో అనుమతి లభించింది. 2011లో పనులను ప్రారంభించారు. గత ఏడాది పనులు పూర్తయ్యాయి. అయినప్పటికీ అప్పటి నుంచీ ఈ భవనం నిరుపయోగంగానే పడి ఉంది. ఇదిలాఉంచితే బిచ్చగత్తెల కోసం దీని పక్కనే రెండు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ భవన నిర్మాణం చివరి దశలో ఉంది. వచ్చే నెలాఖరుకు పనులు పూర్తయ్యే అవకాశముందని బీఎంసీ అధికారి గౌతమ్ అగర్వాల్ తెలిపారు. ఈ భవనం ప్రస్తుతం ప్రజాపనుల శాఖ అధీనంలో ఉందని, తమ అధీనంలోకి రాగానే బిచ్చగాళ్లను అనుమతిస్తామన్నారు. -
టీవీ.. సెల్‌ఫోన్!
వికారాబాద్, న్యూస్‌లైన్: విలువైన వస్తువులను ఎర వేసి ఓట్ల చేపలను బుట్టలో పడవేసేందుకు మున్సిపల్ అభ్యర్థులు గాలాలు వేస్తున్నారు. కాదేదీ ఎన్నికల తాయిలాలకు అనర్హం అన్నట్లుగా.. గుండుగుత్తగా ఓట్లను దండుకునేందుకు విలువైన గృహోపకరణాలు, బంగారు ఉంగరాలు, పట్టు చీరల ఎర వేస్తున్నారు. ఓటుకో రేటు కట్టి మరీ బేరాలాడుతున్నారు. సకల రాచ మర్యాదలతో మచ్చిక చేసుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఆఖరి ఘట్టానికి చేరుకోవడంతో అభ్యర్థులు చివరి ప్రయత్నంగా అన్ని అస్త్రాలను సంధిస్తున్నారు. వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు, వారి కుటుంబీకులు, స్నేహితులు కలిసి ఓటర్లను కలుస్తున్నారు. తమకే ఓటు వేయాలని వేడుకుంటున్నారు. వరుసలు కలుపుతూ మచ్చిక చేసుకొంటున్నారు. శర పరంపరగా హామీల వర్షం కురిపిస్తున్నారు. డబ్బుతో పాటు కలర్ టీవీలు, ఫ్రిజ్‌లు, సెల్ఫోన్లు, బంగారు ఉంగరాలు, ఆడపడచులకు పట్టు చీరలు ఇస్తామని రహస్యంగా ఎర వేస్తున్నారు. వారం రోజులుగా వికారాబాద్‌లో మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో 12 వార్డులో రెండు రోజుల క్రితం ఓ పార్టీ నాయకుడు పట్టు చీరలు, మద్యం పంపిణీ చేస్తుండగా పట్టుకున్న పోలీసులు చూసీ చూడన్నట్లు ఊర్కున్నట్లు విశ్వసనీయ సమాచారం. తాము ఓడితే భవితవ్యమేంటని ప్రధానంగా పట్టణంలోని జనరల్ వార్డుల అభ్యర్థులు ప్రశ్నించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చావోరేవో తేల్చుకోవాలని భావించి ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలిచి తీరాలనే కాంక్షతో అన్ని దారులనూ ఆశ్రయిస్తున్నారు. తమ ఆర్థిక స్థోమతను బట్టి ఓటర్లకు విలువైన వస్తువులను ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు. 3, 4, 10, 12, 24 వార్డుల్లో నువ్వా.. నేనా అనే తరహాలో పోటీ ఎక్కువగా ఉండటంతో అభ్యర్థులు ఓటర్లతో బేరాలకు దిగుతున్నారు. కలర్ టీవీ, ఫ్రిజ్, సెల్‌ఫోన్, బంగారు ఉంగరాలు, పట్టుచీరలు తదితర విలువైన వస్తువులను ఓటర్లకు ఎర వేస్తున్నారు. ఏదీ వద్దంటే ఓటుకు ఎంత నోటు కావాలో చెప్పాలంటూ క్యాష్ ఇస్తున్నారు. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి. మీ రేటు ఎంత చెప్పండి. నాకే ఓటేయండి. నన్నే గెలిపించండి అంటూ అభ్యర్థిస్తున్నారు. -
పురుష ప్రపంచంలో వనితా నాదం
తెలుగునాట దర్శకత్వ శాఖలో కనిపించే యువతులు చాలా తక్కువ. నందినీ రెడ్డి లాంటి ఒకరిద్దరు దర్శకులుగా ఎదిగినా, అవకాశం కోసం చూస్తూ, సహాయ, సహకార దర్శకులుగా అలుపెరుగని కృషి చేస్తున్నవాళ్ళే ఎక్కువ. పుష్కరకాలం పైగా దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న ప్రియదర్శినీ కృష్ణ ఈ పరిణామానికీ, పరిస్థితికీ ప్రత్యక్షసాక్షి. పైగా, ఇటీవలే ‘తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం’ ఎన్నికలలో కార్యవర్గ సభ్యురాలిగా పోటీ చేసి, ఏకంగా 830 ఓట్లలో 590 ఓట్లు సంపాదించి, గెలిచారు. ‘‘దర్శకత్వంలో సహాయకులుగా పనిచేసే వారికి జీతభత్యాల దగ్గర నుంచి చాలా సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించడానికి కృషి చేయాలనుకుంటున్నా’’ అని దృఢంగా చెప్పారు ప్రియదర్శిని. జర్నలిస్టుగా జీవితం మొదలుపెట్టి, పత్రిక, ఇంటర్నెట్, టీవీ వార్తా రంగాలు మూడింటిలోనూ పనిచేసిన ఈ ఎం.ఏ, ఎం.ఫిల్ - గోల్డ్ మెడలిస్ట్ ‘‘చిన్నప్పటి నుంచి సినిమాలు తెగ చూసే’’వారు. ‘‘రచన మీద ఆసక్తి, ఎంచుకున్న రంగంలో అందరికీ సారథిగా నిలవాలన్న కోరికతో సృజనాత్మకతకు పదునుపెట్టే దర్శకత్వశాఖలోకి వచ్చా’’రు. జర్నలిస్టుగా రాజకీయ వార్తాసేకరణలో అతికొద్దిమంది మహిళల మధ్య ఒకరుగా పనిచేశారు. పుష్కరకాలంగా దర్శకత్వశాఖలో ఉండి, ఇరవయ్యేళ్ళ స్థిరనివాసంతో పక్కా హైదరాబాదీ అయిపోయినా, తన మూలాలను మర్చిపోని ఈ విశాఖపట్నం అమ్మాయి సినీ దర్శకత్వ శాఖలో స్త్రీలకుండే ఇబ్బందులు తక్కువేమీ కాదంటారు. ‘‘జూదంలా మారిన సినీ వ్యాపారంలో, ఎవరైనా హీరో కానీ, చిత్ర నిర్మాణ సంస్థ - స్టూడియో కానీ చేతిలో లేనప్పుడు మహిళా దర్శకులుగా అవకాశాలు రావడం, వచ్చినా నిలబడడం కొద్దిగా కష్టమే’’న ంటారు. లింగ వివక్ష, లైంగిక వేధింపుల గురించి ప్రశ్నిస్తే, ‘‘అసలు లేదని చెప్పలేను కానీ, జర్నలిజమ్ నుంచి రావడం వల్లనో ఏమో నాకలాంటి అనుభవాలు ఎదురుకాలేద’’ని తేల్చేశారు. ‘‘ఇక్కడ మనం గాజులా ఉంటే ప్రతి ఒక్కరూ రాయి విసురుతారు. మనమే రాయిలా దృఢంగా ఉంటే పురుషాధిక్య భావజాలమున్నవాళ్ళూ మనతో మర్యాదగానే ఉంటారు’’ అని సినీ జీవిత సూక్ష్మం చెప్పారు ప్రియదర్శిని. ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్ లాంటి పనులతో పోలిస్తే, కుటుంబ బాధ్యతల రీత్యా దర్శకత్వ శాఖలో పని ఆడవారికి కొద్దిగా కష్టమే. ‘‘అండగా నిలిచే తల్లితండ్రులు, అర్థం చేసుకొనే భర్త (టీవీ మీడియా ప్రముఖుడు వెంకట కృష్ణ) లభించడం నా అదృష్టం’’ అంటారు మూడేళ్ళ క్రితం ఓ పాపకు జన్మనిచ్చిన ప్రియదర్శిని. వివిధ టీవీ చానళ్ళకు ఇప్పటికే పలు కార్యక్రమాలు చేసిన ఈ నవతరం మహిళ ‘‘ఇక్కడ ఎవరూ ఎవరికీ ఏదీ నేర్పరు. మనమే అన్నీ గమనిస్తూ, మన సృజనాత్మకతను జోడిస్తూ ముందుకు సాగాలి’’ అంటారు. ఆ అనుభవం, అవగాహన మహిళలకే కాదు, ఏ అసిస్టెంట్ డెరైక్టర్కైనా అవసరమే. - రెంటాల జయదేవ -
టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీల ధరలు దిగొస్తాయ్!
రేట్ల తగ్గింపు పరిశీలిస్తున్నాం: ఎల్జీ, ప్యానాసోనిక్ న్యూఢిల్లీ: ఫ్రిజ్‌లు, టీవీలు, ఏసీలు ఇతరత్రా కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలుదిగొచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కన్జూమర్ గూడ్స్‌పై ఎక్సైజ్ సుంకాన్ని 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తామని ఆర్థిక మంత్రి పి. చిదంబరం మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదించడంతో ఈ రంగంలోని కంపెనీలు స్పందించాయి. ధరలు తగ్గించే విషయమై ప్యానాసానిక్ ఇండియా, ఎల్జీ ఇండియా కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ తగ్గింపు ప్రభావాన్ని మదింపు చేస్తున్నామని వెల్లడించాయి. మార్కెట్ పరిస్థితులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ధరలపై నిర్ణయం తీసుకుంటామని ఎల్జీ ఇండియా ఎండీ సూన్ క్వాన్ పేర్కొన్నారు. ఈ బడ్జెట్ సానుకూలంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మార్కెట్ పరిస్థితులను ఈ బడ్జెట్ మెరుగుపరుస్తుందని, తయారీ రంగానికి ఊపునిస్తుందని ఆయన చెప్పారు. వినియోగదారుల సెంటిమెంట్ సానుకూలంగా మారుస్తుందని, కొత్త వస్తువుల కొనుగోళ్లకు ప్రోత్సాహాన్నిస్తుందని పేర్కొన్నారు. 2 శాతం ఎక్సైజ్ సుంకం తగ్గింపు అనేది ధరలపై పెద్దగా ప్రభావం చూపనప్పటికీ, ఇది ఆహ్వానించదగ్గ చర్య అని ప్యానాసానిక్ ఇండియా ఎండీ మనీష్ శర్మ చెప్పారు. -
ఆగిన సమైక్య గుండెలు
రుద్రవరం/కర్నూలు రూరల్, న్యూస్‌లైన్:రాష్ట్ర విభజన నిర్ణయాన్ని జీర్ణించుకోలేక జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు సమైక్య వాదులు మృతి చెందాడు. రుద్రవరం ఎస్సీ కాలనీకి చెందిన చిటికెల సంతోషమ్మ(55) సోమవారం రాత్రి టివీలో రాష్ట్ర విభజన వార్తలను చూసూ భావోద్వేగానికి గురై కుప్పకూలిపోయింది. కుటుంబీకులు గుర్తించి స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.అలాగే కర్నూలు మండలం నిడ్జూరు గ్రామానికి చెందిన కురువ నాగేశ్వరరావు(42) లారీ డ్రైవర్‌గా పని చేసేవారు. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చినప్పటి నుంచి రోజు పనికి పోకుండా కర్నూలులో జరిగే సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్నారు. 60 రోజులుగా సమైక్యాంధ్ర కోసం సీమాంధ్రలో ఉద్యమాలు చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తీరులో మార్పు రాదని, సోమవారం రాత్రి 9 గంటల సమయంలో టీవీలో సమైక్యాంధ్ర ఉద్యమంపై వస్తున్న వార్తలు చూస్తూ అక్కడే కుప్ప కూలిపోయారు. గమనించిన భార్య మంజుల, కాలనీ వాసులు హాస్పిటల్‌కు తరలించే ప్రయత్నంలోనే మార్గమధ్యంలోనే మరణించాడు. -
దూరదర్శన్‌లో భారీ సీరియళ్లు!
న్యూఢిల్లీ: దూరదర్శన్‌లో ప్రసారమయ్యే ఒకే తరహా మూస కార్యక్రమాలతో విసిగెత్తిన ప్రేక్షకులకు శుభవార్త! ఇకపై బుల్లితెరపై భారీ బడ్జెట్‌తో నిర్మించిన ధారావాహికలను ప్రసారం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నాణ్యమైన కార్యక్రమాలను అందచేసే నిర్మాతలతో కలిసి ఆదాయం పంచుకోవాలని దూరదర్శన్ నిర్ణయించింది. కొత్త విధానం ప్రకారం భారీ బడ్జెట్‌తో సీరియళ్లు నిర్మించే నిర్మాతలు ప్రకటనదారులను తెచ్చుకోవచ్చు. ఈ ప్రతిపాదనలను ప్రసార భారతి బోర్డు ఇటీవల ఆమోదించింది. ఆదాయ పంపిణీ విధానం కింద సీరియళ్ల నిర్మాతలు వాటిని దూరదర్శన్‌లో ప్రసారం కోసం ఉచితంగా అందచేయాలి. దీనిద్వారా లభించే ఆదాయాన్ని ప్రత్యేక ఖాతాకు జమచేసి దూరదర్శన్, నిర్మాతలు పంచుకుంటారు. కనీసం ఎయిర్టైం ఖర్చులైనా దూరదర్శన్‌కు దక్కేలా నిబంధన రూపొందించారు. -
కరెంట్ వచ్చింది... కట్నం పెంచింది!
ఆ ఊరిలో అడుగుపెట్టిన ప్రతి కోడలు పిల్ల ఒక టీవీని వరకట్నంగా వెంట పెట్టుకుని వస్తోంది. అతి త్వరలో ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక శక్తుల్లో ఒకటిగా నిలుస్తుందనే అంచనాలున్న ‘భారతదేశం’లో ఇప్పుడిప్పుడే విద్యుత్ సౌకర్యాన్ని పొందుతున్న గ్రామాలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంది కదూ! స్వతంత్రం వచ్చి ఆరు దశాబ్దాలు గడిచి, మరో ఆరేళ్లు గడిచాక చిబావుఖేరా గ్రామానికి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విద్యుత్‌సరఫరా ప్రారంభమైంది. అలాగని ఇది ఏ మారుమూల గ్రామమో అనుకుంటే పొరపాటు. లక్నోకు 20 కిలోమీటర్ల దూరంలోని ఒక గ్రామం ఇది. ఈ ఊరికే విద్యుత్ సరఫరా ‘కాస్తంత’ ఆలస్యంగా మొదలైంది. ఈ సౌకర్యం ఇక్కడి ప్రజల జీవితాలను ఏ విధంగా మార్చింది? కరెంట్ సరఫరా మొదలైన ఐదు నెలలకు ఇక్కడి ప్రజలను జీవితాలు ఏ విధంగా ప్రభావితమయ్యాయి? ఈ విషయం గురించి ఒక వార్తా సంస్థ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో ఆసక్తికరమైన పరిణామాలెన్నో ఆవిష్కృతమయ్యాయి. 150 ఇళ్లు ఉండే ఈ ఊరికి విద్యుత్ సరఫరా మొదలవ్వడం పెళ్లి సంబంధాలను ప్రభావితం చేస్తోంది. ఊరికి కరెంట్ వచ్చింది కాబట్టి.. ఇంట్లో టీవీ ఉంటే బావుంటుందన్న ఆశ మొదలైంది ఇక్కడి ప్రజల్లో. టీవీలను సొంతంగా కొనుక్కోవడం కాకుండా, పెళ్లిళ్లలో కట్నంగా ఇవ్వాలని అడిగి తెప్పించుకునే పనిలో పడ్డారు వీరు. ఈ మధ్యకాలంలో ఈ ఊరిలో అడుగుపెట్టిన ప్రతి కోడలు పిల్ల ఒక టీవీని వెంటపెట్టుకుని వస్తోంది. మరికొందరు తమ తాహతును బట్టి.. టీవీతో పాటు డీవీడీ ప్లేయర్, టీవీ స్థాయి కట్నం ఇవ్వలేని వాళ్లు టేప్రికార్డర్లను కట్నంగా తెస్తున్నారు. అయితే టీవీల వల్ల అమాంతం కట్నం పెరిగిపోయిందని అమ్మాయిల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవేం కరెంటు కష్టాలో! -
టీవీ పడి బాలుడి మృతి
కుషాయిగూడ, న్యూస్‌లైన్: అందరి ఇళ్లల్లో కృష్ణాష్టమి వేడుకలకు చిన్నారులు సిద్ధమవుతుంటే.. మరో పక్క తల్లిచేతి గోరు ముద్దలు తింటూ ఆడుకుంటున్న ఏడాదిన్నర వయసున్న ఆ చిన్నారికి అంతలోనే నూరేళ్లు నిండిపోయాయి. తల్లి చూస్తుండగానే టీవీ రూపంలో వచ్చిన మృత్యువు పైనబడి ఆ బాలుడి ని కబళించింది. హృదయ విదారకమైన ఈ సంఘటన మంగళవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాగార్జున నగర్లో చోటుచేసుకుంది. బొమ్మల రామారంలోని ‘బాంబుల కంపెనీ’లో మేనేజర్‌గా పనిచేస్తున్న శంకర్ రెడ్డి.. భార్య ప్రణతి ఇద్దరు కుమారులతో నాగార్జున నగర్ కాలనీలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. మంగళవారం ఉదయం పెద్ద కుమారుడు(3)కి టిఫిన్ తినిపించిన ప్రణతి.. చిన్న కుమారుడు ప్రణవ్ (16నెలలు)కు కూడా గోరు ముద్దలు తినిపించింది. ఉదయం పదకొండు గంటలకు కొడుకుకు స్నానం చేయిద్దామని ఆమె బాత్రూంలోకి వెళ్లింది. అదే సమయంలో ఇల్లంతా పాకుతూ ఆడుకుంటున్న ఆ బాలుడు ఒక్కసారిగా టీవీ స్టాండ్‌ను పట్టుకొని లాగాడు. వీల్స్‌పై ఉన్న టీవీ ఒక్కసారిగా ఆ చిన్నారిపై పడంది. ఆ శబ్దానికి గాబరా పడుతూ బయటకు వచ్చిన ప్రణతి బిడ్డని ఒళ్లోకి తీసుకుంది. అప్పటికే తిన్నదంతా వాంతి చేసుకుని సొమ్మసిల్లిన ప్రణవ్ను ఇరుగు, పొరుగు సహాయంతో ఆమె స్థానిక ఆసుపత్రికి తీసుకు వెళ్లింది. అయితే అప్పటికే ఆ బాలుడు మృతిచెందాడని తెలియడంతో ఆమె హతాశురాలైంది. విషయం తెలిసిన భర్త, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. బాలుడిని మంగళవారం సాయంత్రం వారి స్వస్థలం నల్లగొండ జిల్లా నాగిరెడ్డి పల్లి గ్రామంలో ఖననం చేశారు. -
బ్రదర్ అనిల్ కుమార్ సత్యవాఖ్యోపదేశమ్ 21st july 2013
-
సాక్షి ది హెడ్ లైన్ షో 8th July 2013
-
ప్రాపర్టీ ప్లస్ 2nd july 2013
-
సాక్షి భవిత 30th June 2013
-
బ్రదర్ అనిల్ కుమార్ సత్యవాఖ్యోపదేశమ్ 30th June 2013