
న్యూఢిల్లీ: ఇటీవల ప్రారంభించిన నమో టీవీపై నివేదిక సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం సమాచార, ప్రసార మంత్రిత్వ(ఐబీ) శాఖను ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో ఆ చానెల్ ప్రసారాలను నిలిపేసేలా ఆదేశాలివ్వాలని కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు ఈసీని కోరాయి. చానెల్ ప్రారంభం, ప్రసారాల వివరాల్ని శుక్రవారం సాయంత్రం లోగా అందించాలని ఐబీ మంత్రిత్వ శాఖను ఈసీ కోరినట్లు తెలుస్తోంది. ఐబీ శాఖ సమర్పించే పత్రాల ఆధారంగా ఆ చానెల్ కోడ్‌ను ఉల్లంఘిస్తుందో లేదో ఈసీ నిర్ధారించనుంది. మోదీ చిత్రాన్ని చిహ్నంగా కలిగి ఉండి ప్రసారాలు నిర్వహిస్తున్న నమో టీవీని మార్చి 31న ప్రారంభించిన సంగతి తెలిసిందే. మోదీ ర్యాలీలు, ప్రసంగాలు, బీజేపీ నాయకుల ఇంటర్వ్యూలను ఈ చానెల్ డీటీహెచ్, కేబుల్ టీవీ ప్లాట్‌ఫాంలపై ప్రసారం చేస్తోంది.
కేంద్ర వర్సిటీల్లో నియామకాలకు అనుమతివ్వండి
దేశంలో సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో కేంద్ర విశ్వవిద్యాలయాల్లో చేపట్టే నియామకాలకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భారత ఎన్నికల కమిషన్ (ఈసీ)ని కోరింది. దీనికి సంబంధించి కేంద్ర మానవ వనరుల శాఖ (హెచ్చార్డీ) ఈసీకి లేఖ రాసింది. 40 కేంద్ర వర్సిటీల్లో 2018 నవంబర్ 1 నాటికి 17,425 పోస్టులకు 6,141 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మానవ వనరుల శాఖ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment