intelengence
-
ఖషోగి హత్య వెనుక సౌదీ యువరాజు హస్తం
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్టు జమాల్ ఖషోగి హత్య వెనుక సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రమేయం ఉందని తేలడంతో సౌదీపై అమెరికా ఆంక్షలు విధించింది. సౌదీ పౌరులకు వీసాలు ఇవ్వడాన్ని బైడెన్ ప్రభుత్వం శుక్రవారం నిషేధించింది. సౌదీ యువరాజుని ఆంక్షల నుంచి మినహాయించింది. ఖషోగిపై అక్కసు పెంచుకున్న సౌదీ యువరాజు ఆయనను సజీవంగా బంధించడం లేదంటే చంపేయండి అంటూ తన అనుచరులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా అమెరికా ఇంటలిజెన్స్ తన నివేదికలో వివరించింది. సౌదీ యువరాజు అనుమతితోనే జర్నలిస్టు ఖషోగిని హత్య చేసినట్టుగా అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు ఒక నివేదిక సమర్పించడంతో బైడెన్ సర్కార్ చర్యలకు దిగింది. ట్రంప్ హయాంలో వివిధ దేశాలతో క్షీణించిన సంబంధాలను పునరుద్ధరించి ప్రపంచంలో అమెరికాని తిరిగి అగ్రగామిగా నిలబెడతామని బైడెన్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. అందుకే ఆంక్షల నుంచి యువరాజుని మినహాయించింది. ‘అధ్యక్షుడు బైడెన్ సంబంధాలు పూర్తిగా తెగిపోవాలని భావించడం లేదు. మళ్లీ ఎప్పటికైనా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనాలని ఆశిస్తున్నారు. అయితే మానవ హక్కులకు భంగం వాటిల్లుతూ ఉంటే మాత్రం చేతులు ముడుచుకొని కూర్చోరు’అని బైడెన్ ప్రభుత్వంలోని అధికారి ఒకరు వెల్లడించారు. -
ప్రతీ తలకూ లెక్కుంది!
సాక్షి, హైదరాబాద్ : ఈసారి మేడారం జాతరకు కోటి న్నరదాకా భక్తులు వచ్చినా తొక్కిసలాటలు, అవాంఛ నీయ ఘటనలు జరగకుం డా ఉండేందుకు తొలిసారి గా పోలీస్‌శాఖ ఉపయోగిం చిన కృత్రిమ మేథో సాంకేతిక పరిజ్ఞానం పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యింది. డీజీపీ మహేందర్‌రెడ్డి సూచనలతో ఐటీ విభాగం చాలా నెలల ముందు నుంచే కసరత్తు ప్రారంభించింది. జాతరలో భక్తులను గమనించేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను వినియోగించింది. ఎల్ అండ్ టీ సంస్థతోపాటు మరో రెండు స్టార్టప్‌లు కూడా క్రౌడ్ మేనేజ్మెంట్లో పోలీసులకు సాయం అందించాయి. ఆడ, మగ, పిల్లలు ఇలా ప్రతి ఒక్కరినీ గుర్తిస్తూ.. జాతరకు ఎంత మంది వచ్చారనే విషయాన్ని 99% కచ్చితత్వం తో లెక్కగట్టే ఏఐతో కూడిన ప్రత్యేక అల్గారి థమ్‌ను రూపొందించాయి. దీనికోసం అమ్మ వారి గద్దెలు ఉన్న ప్రాంతాలతో పాటు భక్తులు ప్రవేశించే మార్గాల్లో 15 కెమెరాలను బిగించా రు. ఇవి నిత్యం జాతరకు ఎందరు వచ్చారనే సంఖ్యను తెరపై చూపిస్తుంటాయి. ఆరు నెలలపాటు.. ప్రయాగ కుంభమేళా స్ఫూర్తి తోనే ఈ సాఫ్ట్‌వేర్‌ను అభి వృద్ధి చేసినా ఇది దాని కంటే భిన్నమైనది. దీంతో దేశం లోనే ఇలాంటి సాఫ్ట్వేర్ వాడిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. దీనికోసం ప్రయాగలో జన నియంత్రణకు ఉపయోగిం చిన ఏఐ పరిజ్ఞానాన్ని ఐటీ అధికారులు ఆరు నెలలు అధ్యయనం చేశారు. మేడారంలో అక్కడ ఉపయోగించిన సాంకేతికతకు స్థానిక అనుభవాలను అనుసంధానించారు. పలుచోట్ల 15 ఆర్టిఫీషియల్ హైడెఫినేషన్ కెమెరాలను అమర్చారు. ఈ కెమెరాలను మేడారం పోలీస్ క్యాంప్‌లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించారు. కృత్రిమ మేథో సాంకేతిక పరిజ్ఞానంతో జాతరకు వచ్చే భక్తుల సంఖ్యను ఎప్పటికప్పుడు అంచనా వేసి వారిని అదుపుచేసే విధంగా కంట్రోల్ రూమ్ నుంచి సూచనలను అందించారు. దీంతో ఎలాంటి తొక్కిసలాటలు జరగలేదు. -
నమో టీవీ’పై వివరణ ఇవ్వండి
న్యూఢిల్లీ: ఇటీవల ప్రారంభించిన నమో టీవీపై నివేదిక సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం సమాచార, ప్రసార మంత్రిత్వ(ఐబీ) శాఖను ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో ఆ చానెల్ ప్రసారాలను నిలిపేసేలా ఆదేశాలివ్వాలని కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు ఈసీని కోరాయి. చానెల్ ప్రారంభం, ప్రసారాల వివరాల్ని శుక్రవారం సాయంత్రం లోగా అందించాలని ఐబీ మంత్రిత్వ శాఖను ఈసీ కోరినట్లు తెలుస్తోంది. ఐబీ శాఖ సమర్పించే పత్రాల ఆధారంగా ఆ చానెల్ కోడ్‌ను ఉల్లంఘిస్తుందో లేదో ఈసీ నిర్ధారించనుంది. మోదీ చిత్రాన్ని చిహ్నంగా కలిగి ఉండి ప్రసారాలు నిర్వహిస్తున్న నమో టీవీని మార్చి 31న ప్రారంభించిన సంగతి తెలిసిందే. మోదీ ర్యాలీలు, ప్రసంగాలు, బీజేపీ నాయకుల ఇంటర్వ్యూలను ఈ చానెల్ డీటీహెచ్, కేబుల్ టీవీ ప్లాట్‌ఫాంలపై ప్రసారం చేస్తోంది. కేంద్ర వర్సిటీల్లో నియామకాలకు అనుమతివ్వండి దేశంలో సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో కేంద్ర విశ్వవిద్యాలయాల్లో చేపట్టే నియామకాలకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భారత ఎన్నికల కమిషన్ (ఈసీ)ని కోరింది. దీనికి సంబంధించి కేంద్ర మానవ వనరుల శాఖ (హెచ్చార్డీ) ఈసీకి లేఖ రాసింది. 40 కేంద్ర వర్సిటీల్లో 2018 నవంబర్ 1 నాటికి 17,425 పోస్టులకు 6,141 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మానవ వనరుల శాఖ పేర్కొంది. -
ఆయన ఎప్పుడు పిలిచినా కాదనను – ప్రభాస్
సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా వీవీ వినాయక్ దర్శకత్వంలో సీకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సి. కల్యాణ్ నిర్మించిన చిత్రం ‘ఇంటిలిజెంట్’. ఫిబ్రవరి 9న రిలీజ్ కానున్న ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ‘లెట్స్ డు’ను హీరో ప్రభాస్ ఆదివారం రిలీజ్ చేశారు. ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘సాంగ్ లాంచ్ చేయాలని వినాయక్‌గారు మొహమాటపడుతూ పిలిచారు. ఆయన ఒక్క మెసేజ్ చేసి, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తా. ఆయన ఎప్పుడు పిలిచినా కాదనను. వినాయక్‌గారితో సినిమా చేయడం లక్కీ అని తేజ్‌కు చెప్పాను. చిరంజీవిగారు చేసిన ‘చమకు.. చమకు..’ నా మోస్ట్ ఫేవరెట్ సాంగ్. ఈ సాంగ్‌ను తేజ్ ఎలా చేశాడో చూడాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను’’ అన్నారు. ‘‘ప్రభాస్ అంటే స్నేహానికి నిలువెత్తు రూపం. ప్రభాస్ లాంటి మనిషి ఇండస్ట్రీలో ఉండటం అరుదు. సినిమాలో తేజ్ ఇరగదీశాడు’’ అన్నారు దర్శకుడు వినాయక్. ‘‘ప్రభాస్ అన్నను ఫ్యామిలీ మెంబర్లా ఫీలవుతాం. సాంగ్‌ను రిలీజ్ చేసిన ప్రభాస్ అన్నకు థ్యాంక్స్’’ అని సాయిధరమ్ తేజ్ అన్నారు. -
విలీనగ్రామాల్లో ఇంటెలిజెన్స్ రహస్య సర్వే..!
ఆత్మకూరు(ఎం) : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న మోటకొండూరు మండలంలో విలీన గ్రామాలైన ఆత్మకూరు(ఎం) మండలంలోని చాడ, కాటెపల్లి, నాంచారిపేట, కొండాపురం, సింగారంలో సోమవారం ఉదయం జిల్లా ఇంటెలిజెన్స్ అధికారులు రహస్య సర్వే నిర్వహించారు. ప్రతి గ్రామం నుంచి 20 నుంచి 30 మందిని కలిసి సమాచారం సేకరించారు. మహిళలు, యువకులు, వృద్ధులు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులను కలిసినట్లు సమాచారం. మోటకొండూరు మండలం ఎందుకు వద్దంటున్నారు? ఆత్మకూరు(ఎం) మండలంలోనే ఎందుకు ఉందామనుకుంటున్నారు? తదితర ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. ఆత్మకూరు(ఎం) మండలం తమకు దగ్గరగా ఉంటుందని, మోటకొండూరు చాలా దూరంగా ఉంటుందని విలీన గ్రామాల వారు అన్నారు. ఆత్మకూరు(ఎం) మండలంలోనే ఉంచాలని ఇంటెలిజెన్స్ అధికారులకు మొరపెట్టుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా పలు చోట్ల ప్రజలు మీరు ఎవరు అడగడంతో తాము ఇంటెలిజెన్స్ అధికారులమని, ఉన్నతా«ధికారుల ఆదేశం మేరకు సమాచారం సేకరిస్తున్నామని చెప్పినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.