సాక్షి, హైదరాబాద్ : ఈసారి మేడారం జాతరకు కోటి న్నరదాకా భక్తులు వచ్చినా తొక్కిసలాటలు, అవాంఛ నీయ ఘటనలు జరగకుం డా ఉండేందుకు తొలిసారి గా పోలీస్‌శాఖ ఉపయోగిం చిన కృత్రిమ మేథో సాంకేతిక పరిజ్ఞానం పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యింది. డీజీపీ మహేందర్‌రెడ్డి సూచనలతో ఐటీ విభాగం చాలా నెలల ముందు నుంచే కసరత్తు ప్రారంభించింది. జాతరలో భక్తులను గమనించేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను వినియోగించింది. ఎల్ అండ్ టీ సంస్థతోపాటు మరో రెండు స్టార్టప్‌లు కూడా క్రౌడ్ మేనేజ్‌మెంట్‌లో పోలీసులకు సాయం అందించాయి. ఆడ, మగ, పిల్లలు ఇలా ప్రతి ఒక్కరినీ గుర్తిస్తూ.. జాతరకు ఎంత మంది వచ్చారనే విషయాన్ని 99% కచ్చితత్వం తో లెక్కగట్టే ఏఐతో కూడిన ప్రత్యేక అల్గారి థమ్‌ను రూపొందించాయి. దీనికోసం అమ్మ వారి గద్దెలు ఉన్న ప్రాంతాలతో పాటు భక్తులు ప్రవేశించే మార్గాల్లో 15 కెమెరాలను బిగించా రు. ఇవి నిత్యం జాతరకు ఎందరు వచ్చారనే సంఖ్యను తెరపై చూపిస్తుంటాయి.
ఆరు నెలలపాటు..
ప్రయాగ కుంభమేళా స్ఫూర్తి తోనే ఈ సాఫ్ట్‌వేర్‌ను అభి వృద్ధి చేసినా ఇది దాని కంటే భిన్నమైనది. దీంతో దేశం లోనే ఇలాంటి సాఫ్ట్‌వేర్ వాడిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. దీనికోసం ప్రయాగలో జన నియంత్రణకు ఉపయోగిం చిన ఏఐ పరిజ్ఞానాన్ని ఐటీ అధికారులు ఆరు నెలలు అధ్యయనం చేశారు. మేడారంలో అక్కడ ఉపయోగించిన సాంకేతికతకు స్థానిక అనుభవాలను అనుసంధానించారు. పలుచోట్ల 15 ఆర్టిఫీషియల్ హైడెఫినేషన్ కెమెరాలను అమర్చారు. ఈ కెమెరాలను మేడారం పోలీస్ క్యాంప్‌లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించారు. కృత్రిమ మేథో సాంకేతిక పరిజ్ఞానంతో జాతరకు వచ్చే భక్తుల సంఖ్యను ఎప్పటికప్పుడు అంచనా వేసి వారిని అదుపుచేసే విధంగా కంట్రోల్ రూమ్ నుంచి సూచనలను అందించారు. దీంతో ఎలాంటి తొక్కిసలాటలు జరగలేదు.
ప్రతీ తలకూ లెక్కుంది!
Published Sun, Feb 9 2020 3:36 AM | Last Updated on Sun, Feb 9 2020 3:36 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment