Police Camp
-
పోలీసు క్యాంపుపై మావోయిస్టుల దాడి
రాయ్‌పూర్:ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు పోలీసు క్యాంప్‌పై దాడి చేశారు. సుక్మా జిల్లాలోని జేగురుకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి ఈ దాడి జరిగింది. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని 15నుంచి 20 రౌండ్లు కాల్పులు జరిపారు. మావోయిస్టుల దాడిని భద్రతా బలగాలు తిప్పికొట్టాయి.బలగాల ఎదురుదాడితో మావోయిస్టులు పారిపోయినట్లు సమాచారం. ఈ దాడిలో జవాన్ల వైపు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.30 నుంచి 40 మంది వరకు మావోయిస్టులు ఈ దాడిలో పాల్గొన్నట్లు సమాచారం.అరగంట పాటు మావోయిస్టులు, పోలీసుల మద్య కాల్పులు జరిగాయని తెలిపారు. ఇటీవలి కాలంలో ఛత్తీస్‌గఢ్‌లో బలగాలు జరిపిన కాల్పుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. దీనిని ప్రతీకారంగానే పోలీసు శిబిరంపై మావోయిస్టులు దాడికి యత్నించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇదీ చదవండి..జమ్మూకాశ్మీర్‌లో కాల్పుల మోత -
ఛత్తీస్‌గఢ్: పోలీస్ క్యాంప్‌పై మావోయిస్టుల బాంబుల వర్షం
ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. నారాయణ్‌పూర్ జిల్లాలోని అబూడ్మడ్ అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్‌పై బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బాంబులతో దాడి చేశారు. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి.అర్ధరాత్రి జవాన్లు నిద్రిస్తున్న సమయంలో మావోయిస్టులు ఈరక్ బట్టి క్యాంప్‌పై ఒక్కసారిగా బారెల్ గ్రెనేడ్ లాంచర్లతో విరుచుకుపడ్డారు. నాలుగు బీజీఎల్లను ప్రయోగించారు. దీంతో అప్రమత్తమైన జవాన్లు ఎదురుదాడికి దిగగా మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు. అదనపు బలగాలతో క్యాంపు పరిసర అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దాడికి సంబంధించిన వీడియోను పోలీసులు విడుదల చేశారు. -
షాకింగ్: పోలీసు క్యాంప్‌పై 150 మంది బందిపోట్ల దాడి
ఇస్లామాబాద్: దారి దోపిడిలో భాగంగా బందిపోట్లు దాడి చేయటం చాలా సినిమాల్లో చూసే ఉంటారు. ఎదురించిన వారిని విచక్షణరహితంగా చంపి దోపిడి చేస్తుంటారు. అలాంటి షాకింగ్ సంఘటనే పాకిస్థాన్‌లోని సింధు రాష్ట్రంలో వెలుగు చూసింది. అయితే, తమపై ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన పోలీసులపై దాడికి దిగింది దొంగల ముఠా. రోంటి రీజియన్ కచా ప్రాంతంలోని ఓ పోలీసు క్యాంపుపై భారీ సంఖ్యలో బందిపోట్లు ఆయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు పోలీసులు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. డీఐజీ జావేద్ జాస్కాని తెలిపిని వివరాల ప్రకారం.. కచా ప్రాంతంలో దుండగుల ఆక్రమణలు పెరిగిపోయిన క్రమంలో పోలీసు క్యాంపు ఏర్పాటు చేసి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. అయితే, ఒక్కసారిగా 150 మంది బందిపోట్లు పోలీసు పోస్ట్‌పై విరుచుకుపడ్డారు. ఓ డీఎస్పీ, ఇద్దరు ఎస్హెచ్ఓలతో పాటు మొత్తం ఐదుగురు పోలీసులను హత్యచేశారు. మృతులు డీఎస్పీ అబ్దుల్ మాలిక్ భుట్టో, ఎస్హెచ్ఓ అబ్దుల్ మాలిక్ కమాన్‌గర్, ఎస్హెచ్ఓ డీన్ ముహమ్మద్ లెహారి, ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు సలీమ్ చాచాదర్, జటోయ్ పటాఫిలుగా గుర్తించారు. పోలీసు క్యాంపుపై బందిపోట్లు దాడి చేసిన క్రమంలో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ క్రమంలో భారీగా బలగాలను కచా ప్రాంతానికి తరలించారు. బందిపోట్లు దాడి చేసినప్పటికీ తమ ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు డీఐజీ. మరోవైపు.. పోలీసులపై దాడిని ఖండించారు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్, విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారి. పోలీసుల ప్రాణాలు తీసిన దండగులు తగిన శిక్ష అనుభవిస్తారని పేర్కొన్నారు. ఇదీ చదవండి: పాక్‌లోని చైనీయులకు బులెట్ ప్రూఫ్ కార్లు.. ‘ఇమ్రాన్’ కాల్పులే కారణమా? -
రెండు వర్గాల ఘర్షణ : పిడిగుద్దుల వర్షం
-
రెండు వర్గాల ఘర్షణ : పిడిగుద్దుల వర్షం
సాక్షి, తూర్పు గోదావరి : జిల్లాల్లోని ఎన్ కొత్తపల్లి గ్రామంలో గురువారం ఉదయం జరిగిన ఒక సామాజిక వర్గ సమావేశంలో చిన్నపాటి మాటలు కాస్తా ఘర్షణకు దారితీశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో ఉపాధి క్షేత్ర సహయకుడిగా పని చేస్తున్న పీ సత్యనారాయణ రాజపై గతంలో కొన్ని అభియోగాల వచ్చాయి. అందుకు సంబంధించిన విషయాలు సామాజిక వర్గ సమావేశంలో చర్చకు వచ్చాయి. చర్చల్లో ఒకరుపై ఒకరు వాదనలకు దిగారు. ఒకే సామాజిక వర్గంలో ఉన్న మనం సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని పెద్దలు సముదాయించే లోపు వివాదం తలెత్తి రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ క్రమంలోనే తోపులాటకు దిగారు. దీంతో సమావేశం రసాబసాగా మారి అంతా రోడ్డుపైకి రావడంతో గలాటా ఏర్పడి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఇందులో పలువురు గాయాల పాలయ్యారు. ఇరు వర్గాలకు చెందిన వారి ఆసుపత్రికి వెళ్ళడంతో అక్కడ నుంచి వచ్చిన సమాచారంపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సామాజిక వర్గంలో ఏర్పడ్డ ఘర్షణ ఏ పరిస్థితికి దారితీస్తోందో అని అమలాపురం డీఎస్సీ మసూం భాషా, సీఐలు ఆర్ భీమరాజు, సురేష్‌బాబులతో వచ్చి గ్రామంలో పరిస్థితిని సమీక్షించి పోలీస్ పికెట్ ఏర్పాటు చేయించారు. అనవసరంగా గొడవలకు దిగి ఘర్షణలు సృష్టిస్తే ఊరుకునేది లేదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్ట ప్రకారం శిక్షలు తప్పవని హెచ్చరించారు. చిన్న చిన్న గొడవలను సామాజిక మాధ్యమాల్లో పెట్టి పెద్దవి చేస్తున్నారని, అలాంటి వారిపైనా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
ప్రతీ తలకూ లెక్కుంది!
సాక్షి, హైదరాబాద్ : ఈసారి మేడారం జాతరకు కోటి న్నరదాకా భక్తులు వచ్చినా తొక్కిసలాటలు, అవాంఛ నీయ ఘటనలు జరగకుం డా ఉండేందుకు తొలిసారి గా పోలీస్‌శాఖ ఉపయోగిం చిన కృత్రిమ మేథో సాంకేతిక పరిజ్ఞానం పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యింది. డీజీపీ మహేందర్‌రెడ్డి సూచనలతో ఐటీ విభాగం చాలా నెలల ముందు నుంచే కసరత్తు ప్రారంభించింది. జాతరలో భక్తులను గమనించేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను వినియోగించింది. ఎల్ అండ్ టీ సంస్థతోపాటు మరో రెండు స్టార్టప్‌లు కూడా క్రౌడ్ మేనేజ్మెంట్లో పోలీసులకు సాయం అందించాయి. ఆడ, మగ, పిల్లలు ఇలా ప్రతి ఒక్కరినీ గుర్తిస్తూ.. జాతరకు ఎంత మంది వచ్చారనే విషయాన్ని 99% కచ్చితత్వం తో లెక్కగట్టే ఏఐతో కూడిన ప్రత్యేక అల్గారి థమ్‌ను రూపొందించాయి. దీనికోసం అమ్మ వారి గద్దెలు ఉన్న ప్రాంతాలతో పాటు భక్తులు ప్రవేశించే మార్గాల్లో 15 కెమెరాలను బిగించా రు. ఇవి నిత్యం జాతరకు ఎందరు వచ్చారనే సంఖ్యను తెరపై చూపిస్తుంటాయి. ఆరు నెలలపాటు.. ప్రయాగ కుంభమేళా స్ఫూర్తి తోనే ఈ సాఫ్ట్‌వేర్‌ను అభి వృద్ధి చేసినా ఇది దాని కంటే భిన్నమైనది. దీంతో దేశం లోనే ఇలాంటి సాఫ్ట్వేర్ వాడిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. దీనికోసం ప్రయాగలో జన నియంత్రణకు ఉపయోగిం చిన ఏఐ పరిజ్ఞానాన్ని ఐటీ అధికారులు ఆరు నెలలు అధ్యయనం చేశారు. మేడారంలో అక్కడ ఉపయోగించిన సాంకేతికతకు స్థానిక అనుభవాలను అనుసంధానించారు. పలుచోట్ల 15 ఆర్టిఫీషియల్ హైడెఫినేషన్ కెమెరాలను అమర్చారు. ఈ కెమెరాలను మేడారం పోలీస్ క్యాంప్‌లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించారు. కృత్రిమ మేథో సాంకేతిక పరిజ్ఞానంతో జాతరకు వచ్చే భక్తుల సంఖ్యను ఎప్పటికప్పుడు అంచనా వేసి వారిని అదుపుచేసే విధంగా కంట్రోల్ రూమ్ నుంచి సూచనలను అందించారు. దీంతో ఎలాంటి తొక్కిసలాటలు జరగలేదు. -
ధర్నాకు అనుమతినిచ్చేలా పోలీసుల్ని ఆదేశించండి
సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద ఈ నెల 27న తాము నిర్వహించ తలపెట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) అధ్యక్షుడు బి.రమేశ్‌బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో హోంశాఖ ముఖ్యకార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, సెంట్రల్ జోన్ డీసీపీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. శాంతియుతంగా నిర్వహించతలపెట్టిన ధర్నాకు అనుమతినిచ్చేలా పోలీసులను ఆదేశించాలని పిటిషనర్ కోర్టును కోరారు. హనుమ జయంతి సందర్భంగా శోభా యాత్ర, జీసస్కు సంబంధించి మరో కార్యక్రమం ఉందన్న కారణంతో అనుమతి నిరాకరించారని తెలిపారు. తమ సమస్యలను ప్రజల దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ ధర్నా చేస్తున్నామని, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ధర్నా చేసుకుంటామని తెలిపామని, అయినా పోలీసులు అంగీకరించలేదన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని తమ ధర్నాకు అనుమతినిచ్చేలా పోలీసులను ఆదేశించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. -
ఏవోబీలో పోలీసులు అప్రమత్తం
విశాఖపట్నం ,సీలేరు (పాడేరు): విశాఖ ఏజెన్సీ ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఛత్తీస్గడ్ అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో పది మంది మావోయిస్టులు మృతి చెందారు. సంఘటన స్థలంలో ఆయుధాలు, సామగ్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు 60 మంది వరకు సమావేశమై శిక్షణ పొందుతున్న సమయంలో ఈ ఎన్కౌంటర్ జరగడంతో పదుల సంఖ్యలో మావోయిస్టులు తప్పించుకున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్గడ్ నుంచి ఆంధ్రా, ఒడిశా బోర్డర్లోకి మావోయిస్టులు వచ్చి ఉంటారన్న సమాచారం మేరకు భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి. ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఒడిశా సరిహద్దులో బీఎస్ఎఫ్, ఎస్‌వోజీ, సీఆర్పీఎఫ్ బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తుండగా, ఆంధ్రాలో స్పెషల్ పార్టీ బలగాలతో ముమ్మర గాలింపులు జరుపుతున్నారు. ఈ మధ్యకాలంలో ఒడిశా రాంగుడ ఎన్కౌంటర్ తరువాత మళ్లీ ఛత్తీస్‌గడ్‌లో ఎన్కౌంటర్ జరగడంతో ఇరు రాష్ట్రాల పోలీసు అధికారుల సీరియస్‌గా తీసుకున్నారు. ఏజెన్సీలోని అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశారు. ఇలా ఉండగా సరిహద్దు ప్రాంతాల్లో సీలేరు, చిత్రకొండ, డొంకరాయి, తదితర ప్రాంతాల్లో స్థానిక పోలీసులు ఎక్కడిక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరిహద్దులో పహారా కాస్తున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం వివరాలు సేకరిస్తున్నారు. వారం కిందట ఒడిశా, తూర్పుగోదావరిలో ఒక్కరోజులో బస్సులను కాల్చివేసిన సంఘటనలు జరిగిన నాటి నుంచి కూంబింగ్ ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గడ్‌లో ఎన్‌కౌంటర్‌తో ఈ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. -
ఏపీ సరిహద్దున తెలంగాణ ఎన్నికల వేడి
తూర్పుగోదావరి, నెల్లిపాక (రంపచోడవరం): తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ ఏడో తేదీన ఎన్నికలు జరుగుతున్నందున ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం తనిఖీలను ముమ్మరం చేసింది. తెలంగాణ, ఏపీ సరిహద్దు మండలం ఎటపాకలో కూడా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు వాహన తనిఖీలు చేపడుతున్నారు. భద్రాచలం పట్టణం ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల సరిహద్దు ప్రాంతంలో ఉండడంతో భద్రాచలం నియోజకవర్గంపై తెలంగాణ ప్రభుత్వం గట్టి నిఘా ఏర్పాటు చేసింది. మహాకూటమిలో కీలకంగా ఉన్న టీడీపీ భారీగా నగదు, మద్యాన్ని ఏపీ నుంచి తెలంగాణకు తరలించవచ్చనే నిఘావర్గాల హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. నెల రోజులు ముందుగానే పట్టణ శివార్లలో పోలీసులు ఎన్నికల చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎటపాక మండలంలోని గుండాల గ్రామం జాతీయ రహదారి మీదుగా భద్రాచలం పట్టణంలో ప్రవేశించే అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఆర్టీఏ అధికారులు కూడా వాహన తనిఖీలు చేస్తున్నారు. తెలంగాణలో ఎన్నికల దృష్ట్యా ఇటు గుండాల గ్రామం వద్ద కూడా ఏపీ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక చెక్‌పోస్టు ఏర్పాటు చేసి అక్రమంగా మద్యం తరలించే వారిపై నిఘా పెట్టారు. అనుమానాస్పదంగా వెళ్లే వాహనాలను ఆపి తనిఖీ చేస్తున్నారు. అదే విధంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి తెలంగాణలో ప్రవేశించే ప్రాంతాల్లో కూడా ప్రత్యేక పోలీసు బలగాలతో వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. భద్రాచలం పట్టణం సరిహద్దు కాలనీల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించి పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి, అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా మొత్తం 873 పోలింగ్ కేంద్రాలకు 205 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ జిల్లాలో ఇప్పటి వరకు రూ.30.50 లక్షల నగదు సీజ్ చేసినట్టు వరంగల్ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ వై.నాగిరెడ్డి వెల్లడించారు. అలాగే 3015 మందిని బైండోవర్ చేశారు. -
దాచేపల్లిలో పోలీసుల కూంబింగ్
పోలీసుల బూట్ల చప్పుళ్లతో దాచేపల్లి ప్రాంతం దద్దరిల్లింది. తుపాకులు ధరించిన పోలీసులు దాచేపల్లి మండలంలో శుక్రవారం మావోయిస్టుల కోసం విస్తృత తనిఖీలు చేపట్టారు. పొలాలు, మైదాన ప్రాంతాలను జల్లెడపట్టారు. వడ్డీవ్యాపారులు, రేషన్ బియ్యం మాఫియాను హెచ్చరిస్తూ దాచేపల్లి బీసీ కాలనీ ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం గోడకు పోస్టర్లు వెలసిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై కూంబింగ్ చేపట్టారు. గుంటూరు, దాచేపల్లి : పల్నాడు ప్రాంతంలో మళ్లి కూంబింగ్ అలజడి ప్రారంభమైంది. మావోయిస్టు పార్టీ పల్నాడు రీజియన్ కమిటీ పేరుతో దాచేపల్లిలోని బీసీ కాలనీ ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం గోడకు రెండు పోస్టర్లు వెలసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్లలో అధిక వడ్డీ వ్యాపారులు, రేషన్ మాఫీయాను హెచ్చరించారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. దాచేపల్లి మండల పరిధిలో శుక్రవారం విస్తృతంగా కూంబింగ్ చేపట్టారు. ఏఎన్ఎస్ పోలీసులు దాచేపల్లిలోని పలు ప్రాంతాల్లో జల్లెడ పట్టి కేసానుపల్లి, తక్కెళ్లపాడు, పెదగార్లపాడు, నడికుడి గ్రామాల్లోని పొలాల్లో ముమ్మరంగా కూంబింగ్ చేశారు. పొలాల వెంట విస్తృతంగా తనిఖీలు చేసి అనుమానాస్పద వ్యక్తుల వివరాలను సేకరించారు. కూంబింగ్ చేస్తున్న పోలీసులను పొలాల్లో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలు ఆశ్చర్యంగా చూశారు. నాగులేరు వెంబడి కూడా కూంబింగ్ చేశారు. చాలాకాలం తర్వాత పోలీసులు మండల పరిధిలో కూంబింగ్ చేయటంతో ప్రజలు చర్చించుకుంటున్నారు. పోస్టర్ల ప్రింటింగ్‌పై పోలీసుల ఆరా :దాచేపల్లిలోని బీసీ కాలనీలో ఉన్న ప్రభుత్వ బీసీ బాలుర వసతిగృహం గోడకు అంటించిన పోస్టర్లపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ పోస్టర్లను ఎవరు అంటించారు. అధిక వడ్డీ వ్యాపారాలు చేస్తున్నది ఎవరు.. రేషన్ మాఫీయాకు అండగా ఉంటున్న రాజకీయ నాయకుల వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమైయ్యారు. గోడకు అంటించిన పోస్టర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ పోస్టర్లు ఎక్కడ ప్రింటింగ్ చేశారనే దానిపై కూడా ఎస్ఐ షేక్ మహ్మద్‌రఫీ ఆరా తీస్తున్నారు. దాచేపల్లి, నారాయణపురంలోని పలు ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులతో శుక్రవారం మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ పోస్టర్లను స్థానికంగా ప్రింటింగ్ చేశారా.. ఇతర ప్రాంతాల్లో ప్రింట్ చేసి ఇక్కడకు తీసుకువచ్చి అంటించారా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. ఆందోళన చెందాల్సినఅవసరంలేదు దాచేపల్లిలో వెలసిన మావోయిస్టుల పోస్టర్లపై ఆరా తీస్తున్నాం. ప్రజలు ఆందోళన చెందవద్దు. ముందస్తుగానే విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాం.–ప్రసాద్, గురజాల డీఎస్పీ -
ప్రత్యేక నిఘా..!
సాక్షి, కందనూలు: బిజినేపల్లి మండలంలో సమస్యాత్మక ప్రాతాలపై ప్రత్యేక నిఘా పెంచనున్నారు. ముందస్తు ఎన్నికల సందర్భంగా ఈ నెల 12వ తేదీ నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలు కానుండటంతో మండలంలో ప్రశాతంగా ఎన్నికల నిర్వహణ జరిగేలా రెవెన్యూ, పోలీసు అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. బిజినేపల్లి మండల కేంద్రంతోపాటు మొత్తం 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో మండల కేంద్రంతోపాటు, మంగనూర్ అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా (హైపర్ సెన్సిటీవ్ ) గుర్తించారు. మిగతా గ్రామాలను సాధారణ సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా స్పెషల్ పార్టీ పోలీసులను పటిష్ట బందోబస్తు చేస్తున్నారు. మండలంలో 14పోలింగ్ స్టేషన్లు మండలంలో 24పంచాయతీల పరిధిలో మొత్తం 64 పోలింగ్ స్టేషన్లును ఏర్పాటు చేస్తున్నారు. అందులో బిజినేపల్లిలో 6, మంగనూర్ 5, షాయిన్‌పల్లి 1, వట్టెం 1, నందివడ్డెమాన్‌లో 1పోలింగ్ స్టెషన్ చొప్పున మొత్తం 14 పోలింగ్ స్టేషన్లను హైపర్ సెన్సీటీవ్ పోలింగ్ స్టేషన్లుగా గుర్తించి, వీటిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ పోలింగ్ స్టేషన్ల పరిధిలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. 50 పోలింగ్ స్టేషన్లను సాధారణ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా గుర్తించి, ప్రతిరోజు మండలంలోని అన్ని గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహించడంతో, అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు నిర్భయంగా ఓటు వినియోగించుకునేలా ప్రజలను చైతన్యవంతం చేసేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవలే మండల కేంద్రంలో సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఐ లక్ష్మీనర్సింహు ఆధ్వర్యంలో 100మంది పోలీసులతో కవాత్ నిర్వహించారు. ఇప్పటివరకు 13మంది బైండోవర్.. త్వరలో జరిగే ఎన్నికల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏడుగురు రౌడిషీటర్లు, శాయిన్‌పల్లిలో గత ఎన్నికలో గొడవలు సృష్టించిన ఆరుగురిని, ఆయా గ్రామాలకు చెందిన బెల్టుషాపుల నిర్వహుకులను బైండోవర్ చేశారు. నిఘా పెంచాం.. బిజినేపల్లితోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో నిఘా పెంచాం. కొన్ని అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నాం. మండలంలో ఎవరైన శాంతిభంద్రతలకు విఘాతం కలిగిస్తే వెంటనే అరెస్టు చేయడంతోపాటు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు నిర్భయంగా ఓటు వినియోగించుకునేలా అవగాహణ కార్యక్రమాలు చేపడుతున్నా. – లక్ష్మీనర్సింహులు, ఎస్ఐ, బిజినేపల్లి -
బీ అలర్ట్ ఫ్లీజ్
-
హెలిప్యాడ్ కోసం స్థల పరిశీలన
గోవిందరావుపేట, న్యూస్‌లైన్ : మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి తేవాలని నిర్ణయించడంతో ఆర్డీఓ సభావట్ మోతీలాల్ స్థలాన్ని పరిశీలించారు. తాడ్వాయి తహసీల్దార్ పూల్‌సింగ్ చౌహాన్‌తో కలిసి ఆదివారం పడిగాపూర్ పరిసరాల్లోని కొంగలమడుగు వద్ద గతంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసిన ప్రాంతంలో స్థలాన్ని పరిశీలించారు. గద్దెల సమీపంలోని పోలీస్ క్యాంపు వద్ద ప్రభుత్వ హెలికాప్టర్ దిగేందుకు వీలుగా హెలిప్యాడ్ ఉంది. దీనిని ప్రత్యేకంగా ప్రభుత్వం వినియోగిస్తోంది. 2010లో టర్బో ఏవియేషన్ సంస్థ హెలికాప్టర్ సౌకర్యాన్ని భక్తులకు అందుబాటులోకి తెచ్చిం ది. మళ్లీ ఈ జాతరలో టర్బో ఏవియేషన్ సం స్థ మరోసారి భక్తులకు హెలికాప్టర్ సేవలు అందించే ఏర్పాట్లు చేస్తోంది. గతంలో వరంగల్‌లోని మామునూరు నుంచి మేడారానికి స ర్వీసులు నడిపారు. కానీ ఈసారి సంస్థ మా మునూరుతో పాటు ములుగు నుంచి కూ డా సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. అంతేకాక హెలికాప్టర్‌ను అద్దెకు కూడా ఇవ్వనున్నట్లు సంస్థ ప్రకటించింది. పడిగాపూర్ ప రిధిలోని 44వ సర్వే నంబర్లో ఉన్న రైతులతో ఆర్డీఓ, తహసీల్దార్ మాట్లాడారు. గతంలో హె లిప్యాడ్ తీసుకున్న వారు తమను ఇబ్బందుల కు గురిచేశారని రైతులు అధికారులకు వివరిం చారు. తిన్న అన్నానికి కూడా వారు డబ్బులు ఇవ్వలేదని వాపోయారు. దీంతో ఆర్డీఓ మో తీలాల్ మాట్లాడుతూ ముందుగానే అద్దె డ బ్బులు ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఎక్కడి నుంచో ఇక్కడకు వచ్చి మన జాతరకు వచ్చే భక్తులకు హెలికాప్టర్ సౌకర్యాన్ని అందించే వారికి సహకరించాల్సిన అవసరం ఉంద న్నారు.