సాక్షి, కందనూలు: బిజినేపల్లి మండలంలో సమస్యాత్మక ప్రాతాలపై ప్రత్యేక నిఘా పెంచనున్నారు. ముందస్తు ఎన్నికల సందర్భంగా ఈ నెల 12వ తేదీ నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలు కానుండటంతో మండలంలో ప్రశాతంగా ఎన్నికల నిర్వహణ జరిగేలా రెవెన్యూ, పోలీసు అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. బిజినేపల్లి మండల కేంద్రంతోపాటు మొత్తం 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో మండల కేంద్రంతోపాటు, మంగనూర్ అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా (హైపర్ సెన్సిటీవ్ ) గుర్తించారు. మిగతా గ్రామాలను సాధారణ సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా స్పెషల్ పార్టీ పోలీసులను పటిష్ట బందోబస్తు చేస్తున్నారు.
మండలంలో 14పోలింగ్ స్టేషన్లు
మండలంలో 24పంచాయతీల పరిధిలో మొత్తం 64 పోలింగ్ స్టేషన్లును ఏర్పాటు చేస్తున్నారు. అందులో బిజినేపల్లిలో 6, మంగనూర్ 5, షాయిన్‌పల్లి 1, వట్టెం 1, నందివడ్డెమాన్‌లో 1పోలింగ్ స్టెషన్ చొప్పున మొత్తం 14 పోలింగ్ స్టేషన్లను హైపర్ సెన్సీటీవ్ పోలింగ్ స్టేషన్లుగా గుర్తించి, వీటిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ పోలింగ్ స్టేషన్ల పరిధిలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. 50 పోలింగ్ స్టేషన్లను సాధారణ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా గుర్తించి, ప్రతిరోజు మండలంలోని అన్ని గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహించడంతో, అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు నిర్భయంగా ఓటు వినియోగించుకునేలా ప్రజలను చైతన్యవంతం చేసేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవలే మండల కేంద్రంలో సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ లక్ష్మీనర్సింహు ఆధ్వర్యంలో 100మంది పోలీసులతో కవాత్ నిర్వహించారు.
ఇప్పటివరకు 13మంది బైండోవర్..
త్వరలో జరిగే ఎన్నికల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏడుగురు రౌడిషీటర్లు, శాయిన్‌పల్లిలో గత ఎన్నికలో గొడవలు సృష్టించిన ఆరుగురిని, ఆయా గ్రామాలకు చెందిన బెల్టుషాపుల నిర్వహుకులను బైండోవర్ చేశారు.
నిఘా పెంచాం..
బిజినేపల్లితోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో నిఘా పెంచాం. కొన్ని అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నాం. మండలంలో ఎవరైన శాంతిభంద్రతలకు విఘాతం కలిగిస్తే వెంటనే అరెస్టు చేయడంతోపాటు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు నిర్భయంగా ఓటు వినియోగించుకునేలా అవగాహణ కార్యక్రమాలు చేపడుతున్నా.
– లక్ష్మీనర్సింహులు, ఎస్‌ఐ, బిజినేపల్లి
Comments
Please login to add a commentAdd a comment