అభివృద్ధికి అండగా నిలుద్దాం: బచ్చిరెడ్డి | TRS Election Campaign In Mahabubnagar | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి అండగా నిలుద్దాం :బచ్చిరెడ్డి

Published Wed, Dec 5 2018 4:18 PM | Last Updated on Wed, Dec 5 2018 4:19 PM

TRS Election Campaign In Mahabubnagar - Sakshi

రాజాపూర్‌లో టీఆర్‌ఎస్‌ నాయకుల ఇంటింటి ప్రచారం  

సాక్షి, రాజాపూర్‌: రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షే మానికి అండగా నిలిచి మరొక్కసారి టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మనదేనని టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యదర్శి బచ్చిరెడ్డి అన్నారు. మంగళవారం రాజాపూర్‌ మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమాలు, పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందన్నారు. దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రం నెంబర్‌వన్‌గా నిలించింద ని అన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. నేడు వృద్ధులకు ఆసరా పింఛన్‌లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. కల్యాణలక్ష్మి ఆడపిల్లలపెళ్లికి వరంగా మారిందన్నారు. దానికోసం కారుగుర్తుకు ఓటేసి మరోసారి టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తేవాలని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నర్సింలు, నాయకులు అల్తాఫ్, సత్యయ్య, అల్తాఫ్, దేవేందర్, రాజు, సాయి, లక్ష్మయ్య పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement