సాక్షి, మహబూబ్ నగర్ : దక్షిణ తెలంగాణ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్, టీడీపీలకు కంచుకోటలా ఉండేది. 2014 ఎన్నికల్లో రాష్ట్ర వ్వాప్తంగా టీఆర్‌ఎస్ గాలి వీచిన జిల్లాలో మాత్రం కాంగ్రెస్, టీడీపీలు తమ ఉనికిని చాటుకున్నాయి. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్(7) స్థానాలలో, కాంగ్రెస్(5) స్థానాల్లో, మిగిలిన రెండు స్థానాలను టీడీపీ గెల్చుకుంది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో టీడీపీ నుంచి గెల్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోగా, అదే పార్టీ నుంచి గెలిచిన ఎస్. రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మేల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కారెక్కారు. అసెంబ్లీ రద్దయ్యే నాటికి జిల్లాలో టీఆర్‌ఎస్ బలం 9 కి చేరుకోగా, కాంగ్రెస్ బలం ఐదు(5) గా ఉంది.
అయితే కేసీఆర్ అత్యంత ఆత్మవిశ్వాసంతో 9 నెలల ముందుగానే అసెంబ్లీ రద్దు చేసి, ముందస్తుకు సిద్దమయ్యారు. జిల్లాలో ఉన్న మొత్తం 14 స్థానాలకుగాను 13 స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. 2001 లో పార్టీ ప్రారంభించినప్పటి నుంచి గెలవనీ స్ధానాలైన వనపర్తి, గద్వాల, మక్తల్,ఆలంపూర్, కల్వకుర్తి, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లో సైతం టీఆర్‌ఎస్ విజయకేతనం ఎగరవేసింది. అయితే జిల్లాలో వరుసగా ఎమ్మేల్యేగా గెలుస్తూ వస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు మాత్రం కొల్లాపూర్ కాంగ్రెస్ ఈభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డిపై ఓడిపొయారు. జిల్లాలో కాంగ్రెస్‌కు దక్కిన ఏకైక స్థానం కూడా ఈ మంత్రి ఇలాకానే కావడం విశేషం.
నియోజకవర్గం పేరు | అభ్యర్థి | పార్టీ |
కొడంగల్ | పట్నం నరేందర్ రెడ్డి | టీఆర్‌ఎస్ |
నారాయణపేట | ఎస్ రాజేందర్ రెడ్డి | టీఆర్‌ఎస్ |
దేవరకద్ర | ఆల వేంకటేశ్వర్ రెడ్డి | టీఆర్‌ఎస్ |
మక్తల్ | చిట్టెం రామ్మోహన్ రెడ్డి | టీఆర్‌ఎస్ |
మహబూబ్‌నగర్ | శ్రీనివాస్ గౌడ్ | టీఆర్‌ఎస్ |
వనపర్తి | సంగిరెడ్డి నిరంజన్ రెడ్డి | టీఆర్‌ఎస్ |
నాగర్ కర్నూల్ | మర్రి జనార్థన్ రెడ్డి | టీఆర్‌ఎస్ |
జడ్చర్ల | సీ లక్ష్మారెడ్డి | టీఆర్‌ఎస్ |
షాద్‌నగర్ | వై అంజయ్య యాదవ్ | టీఆర్‌ఎస్ |
అలంపూర్ | ఆబ్రాహాం | టీఆర్‌ఎస్ |
అచ్చంపేట్ | గువ్వల బాల్‌రాజ్ | టీఆర్‌ఎస్ |
కల్వకుర్తి | జీ జైపాల్ యాదవ్ | టీఆర్‌ఎస్ |
కోల్లాపూర్ | బీరం హర్షవర్ధన్ రెడ్డి | కాంగ్రెస్ |
గద్వాల్ | బండ్ల కృష్ణమోహన్ రెడ్డి | టీఆర్‌ఎస్ |
Comments
Please login to add a commentAdd a comment