కల్వకుర్తి అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం | TRS Election Campaign In Kalwakurty Jaipalyadav | Sakshi
Sakshi News home page

కల్వకుర్తి అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం

Published Mon, Dec 3 2018 1:50 PM | Last Updated on Mon, Dec 3 2018 1:50 PM

TRS Election Campaign In Kalwakurty  - Sakshi

మాట్లాడుతున్న జైపాల్‌ యాదవ్‌

సాక్షి,కల్వకుర్తి: కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధి సాధించాలంటే టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ కోరారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జైపాల్‌ యాదవ్‌ మాట్లాడారు. ఎకరెన్ని కూటమిలను కట్టినా టీఆర్‌ఎస్‌ను ఏమీ చేయలేరన్నారు. అభివృద్దే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కేసీఆర్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.
కల్వకుర్తి రూరల్‌: ప్రచారంలో అభ్యర్థులతో పాటు కార్యకర్తలు, నాయకులు తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం మండలంలోని మార్చాల గ్రామంలో ప్రచారంలో పాల్గొన్న వేపూర్‌ మాజీ సర్పంచ్‌ కొండూరు గోవర్ధన్‌ కొద్దిసేపు బైక్‌ మెకానిక్‌ పనులు చేస్తూ జైపాల్‌ యాదవ్‌ను గెలిపించాలని ఓట్లను అభ్యర్థించారు.
వెల్దండ: కల్వకుర్తిలో టీఆర్‌ఎస్‌ గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలని వెల్దండ ఎంపీపీ జయప్రకాష్‌ పేర్కొన్నారు. ఆధివారం మండలంలోని అంకమోనికుంటలో టీఆర్‌ఎస్‌ ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు జగన్, మల్లేష్, శ్రీనివాస్, నర్సింహ, అంజయ్య, అంతిరెడ్డి, తానయ్య, శ్రీశైలం తదితరులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement