jaipal yadav
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో జైపాల్ యాదవ్ విచారణ
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను విచారించిన పోలీసులు.. శనివారం కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్‌ను ప్రశ్నించారు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ అదనపు ఎస్పీ మేకల తిరుపతన్న ఫోన్లో జైపాల్ యాదవ్‌కు సంబంధించిన లింకు దొరికిన నేపథ్యంలో.. ఆ ఆధారాలను జైపాల్ ముందుపెట్టి విచారించినట్టు తెలిసింది. జూబ్లీహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయంలో సుమారు రెండు గంటల పాటు ప్రశ్నించి, వాంగ్మూలం నమోదు చేసుకున్నట్టు సమాచారం. రెండు ఫోన్ నంబర్ల విషయంలో.. ప్రధానంగా తిరుపతన్నకు జైపాల్‌యాదవ్ ఇచ్చిన రెండు ఫోన్ నంబర్లపై విచారణ సాగినట్టు తెలిసింది. తమ కుటుంబానికి, మరో కుటుంబంతో వివాదాల నేపథ్యంలో అదనపు ఎస్పీ తిరుపతన్నను కలిశానని.. తిరుపతన్న తమ సామాజికవర్గం వ్యక్తికావడంతో వివాదం పరిష్కరించాలని కోరా నని జైపాల్‌యాదవ్ వెల్లడించినట్టు సమాచారం. తాను ఇచ్చిన రెండు ఫోన్ నంబర్లను తిరుపతన్న ట్యాప్ చేశారని.. అంతేతప్ప వారికి రాజకీయాలకు సంబంధం లేదని వివరించినట్టు తెలిసింది. ఫోన్ల నుంచి రికవరీ చేసిన డేటా ఆధారంగా.. ఫోన్ ట్యాపింగ్‌పై కేసు నమోదుకు, పోలీసు అధికారుల అరెస్టుకు మధ్య కొంత సమయం వచ్చింది. ఆ సమయంలో తిరుపతన్న, మరికొందరు అధికారులు, మాజీ అధికారులు తమ ఫోన్లను ఫార్మాట్ చేయడం చేశారు. అయితే ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్‌రావుల అరెస్టు తర్వాత పోలీసులు వారి ఫోన్లు స్వాదీనం చేసుకుని.. చెరిపేసిన డేటాను వెలికితీయడానికి (రిట్రీవ్) వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. నిపుణులు డేటాను వెలికితీసి పోలీసులకు అందించారు. అందులో తిరుపతన్న ఫోన్ నుంచి రిట్రీవ్ చేసిన డేటాను విశ్లేషించిన నేపథ్యంలో.. ఆయనతో చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్ సంప్రదింపులు జరిపినట్టు వెల్లడైంది. దీంతో పోలీసులు వారిని విచారణకు పిలిచి ప్రశ్నించారు. -
కల్వకుర్తి నియోజకవర్గంలో తదుపరి అధికారం ఎవరిది?
కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన జైపాల్ యాదవ్ మూడోసారి గెలిచారు. గతంలో రెండుసార్లు టిడిపి పక్షాన గెలిచిన యాదవ్, టిఆర్ఎస్ లో కి వచ్చి పోటీచేసి విజయం సాదించారు. జైపాల్ యాదవ్ తన సమీప బిజెపి ప్రత్యర్ది తల్లోజు ఆచారిపై 3447 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. ఇక్కడ 2014లో గెలిచి సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్ ఐ అభ్యర్ది వంశీచంద్ రెడ్డి మూడోస్థానానికి పరిమితం అవడం విశేషం. ఆయన కు 46523 ఓట్లు వచ్చాయి. కాగా గెలిచిన జైపాల్ యాదవ్‌కు 62892 ఓట్లు రాగా, ఆచారికి 59445 ఓట్లు వచ్చాయి. జైపాల్ యాదవ్ సామాజికవర్గం పరంగా యాదవ వర్గానికి చెందినవారు. కల్వకుర్తి నియోజకవర్గంలో 2014లో ఆసక్తికర ఘట్టం చోటు చేసుకుంది. ఇక్కడ కౌంటింగ్ ముగిసే సమయానికి వంశీచంద్‌రెడ్డి సుమారు 150ఓట్ల ఆధిక్యతలో ఉండగా, చివరన ఒక ఇవిఎమ్. మొరాయించింది. దాంతో ఆ పోలింగ్ బూత్ పరిదిలో ఎన్నికల సంఘం రీపోల్ నిర్వహించింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఆ రీపోల్ తర్వాత 72 ఓట్ల ఆధిక్యతతో యువజన కాంగ్రెస్ అద్యక్షుడుగా కూడా ఉన్న వంశీచంద్ రెడ్డి బిజెపి-టిడిపి కూటమి అభ్యర్ధి టి. ఆచారిపై గెలుపొందారు. కాని 2018లో ఓటమి చెందారు. 2014 ఎన్నికలకు ముందు టిడిపికి గుడ్ బై చెప్పి టిఆర్ఎస్లోకి మారి పోటీచేసిన అప్పటి సిటింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ 29844 ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో మిగిలారు. 2018లో గెలవగలిగారు. కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి గతంలో నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించిన కల్వకుర్తి నియోజకవర్గానికి విశేష ప్రాధాన్యం ఉంది. తెలుగుదేశం పార్టీని స్థాపించి సంచలనం సృష్టించి, వందల మందికి రాజకీయ జీవితాన్ని అందించిన నందమూరి తారకరామారావు 1989లో ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోవడం ఒక పెద్ద విశేషం. ఎన్.టి.ఆర్.పై కాంగ్రెస్ ఐ అభ్యర్దిగా పోటీచేసిన జె.చిత్తరంజన్ దాస్ గెలిచారు. ఇక్కడ వై.కిష్టారెడ్డి రెండుసార్లు, గెలిచారు. జె. చిత్తరంజన్‌దాస్ రెండుసార్లు గెలిచారు. కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి రాజకీయ జీవితం ఇక్కడ నుంచే ఆరంభమైంది. ఆయన 1969లో జరిగిన ఉప ఎన్నిక ద్వారా తొలిసారి గెలిచి (సిట్టింగ్ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా కోర్టు తీర్పురావడంతో ఉప ఎన్నిక జరిగింది) ఆ తర్వాత వరసగా మరోమూడుసార్లు గెలుపొందారు. జైపాల్‌రెడ్డి మహబూబ్‌నగర్, మిర్యాలగూడలలో రెండేసిసార్లు లోక్‌సభకు ఎన్నికై 2009లో చేవెళ్ళ నుంచి లోక్‌సభక ఎన్నికయ్యారు. కాని 2014లో మహబూబ్‌నగర్‌లో లోక్‌సభకు పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆయన రాజ్యసభకు కూడా ప్రాతినిధ్యం వహించారు. 1980లో ఇందిరాగాంధీపై పోటీచేసి జైపాల్‌రెడ్డి, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ఐలో చేరి కేంద్రమంత్రి కావడం విశేషం. అంతకుముందు యున్కెటెడ్‌ఫ్రంట్ హయాంలో కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. కల్వకుర్తిలో మరోసారి కూడా ఎన్నిక చెల్లకుండా పోవడం వల్ల ఉప ఎన్నిక జరిగంది. కోర్టు తీర్పు కారణంగా 1962లో గెలిచిన అభ్యర్ధి వెంకటరెడ్డి ఎన్నిక చెల్లకుండా పోవడంతో జరిగిన ఉప ఎన్నికలో శాంతాబాయి గెలిచారు. శాంతబాయి ఇక్కడ రెండుసార్లు మక్తల్‌లో ఒకసారి, గగన్‌మహల్‌లో మరోసారి మొత్తం నాలుగుసార్లు గెలిచారు. 1989లో ఎన్.టి.ఆర్.ను ఓడిరచిన చిత్తరంజన్‌దాస్‌కు చెన్నారెడ్డి మంత్రివర్గంలో స్థానం లభించింది. కల్వకుర్తి నియోజకవర్గంలో తొమ్మిదిసార్లు కాంగ్రెస్, కాంగ్రెస్ఐ జనతా పార్టీ రెండుసార్లు, టిడిపి రెండుసార్లు, టిఆర్ఎస్ ఒకసారి, ఇండిపెండెంట్లు మూడుసార్లు గెలిచారు. కల్వకుర్తిలో ఎనిమిదిసార్లు రెడ్డి సామాజికవర్గం, ఆరుసార్లు బిసి వర్గం నేతలు, రెండుసార్లు బ్రాహ్మణ నేత, రెండుసార్లు ఎస్.సి.నేతలు ఎన్నికయ్యారు. కల్వకుర్తి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
కల్వకుర్తి గులాబీ పార్టీలో ఆధిపత్య పోరు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కల్వకుర్తి గులాబీ పార్టీలో ఆధిపత్య పోరు జోరుగా సాగుతోంది. రాజకీయ చైతన్యానికి ప్రతీకగా నిలిచిన ఈ నియోజకవర్గంలో ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య వర్గపోరు పతాక స్థాయికి చేరుకుంది. నువ్వా... నేనా.. అనేవిధంగా ఇద్దరు నేతలు బహిరంగంగా సవాలు చేసుకోకున్నా.. అంతర్గతంగా అదే తలపిస్తోంది. వీరిద్దరి గ్రూపులు ఆరోపణలు, ప్రత్యారోపణలతో దుమ్మెత్తి పోసుకుంటుండటం జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న రాజకీయ విభేదాలు.. తమ అనుయాముల నిరసనల రూపంలో బహిర్గతమవుతున్నాయి. దీనికి కొనసాగింపుగా పార్టీ శ్రేణులు సైతం రెండుగా విడిపోవడంతో వర్గపోరు రచ్చకెక్కిందని చెప్పవచ్చు. ఇటీవల స్థానికంగా చోటుచేసుకున్న పలు సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇరువర్గాల ప్రెస్మీట్లు, నిరసనలు, విమర్శలు, వ్యాఖ్యలు, ఆరోపణలతో కల్వకుర్తి నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది. ఇతర పార్టీల నేతలు, అధికార పార్టీలోని తటస్థులు ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. చదవండి: లైసెన్సుల ‘లొల్లి’ యుద్ధం మొదలైందిలా... గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన నాయకుల్లో జైపాల్‌యాదవ్,ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ముందు వరుసలో ఉన్నారు. చివరకు జైపాల్‌కు టికెట్ దక్కడం.. గెలవడం చకాచకా జరిగిపోయాయి. కొంతకాలంగా నియోజకవర్గంలో నారాయణరెడ్డి క్రియాశీలకంగా వ్యవహిస్తున్నారు. కాంగ్రెస్ పారీ్టకి చెందిన కడ్తాల ఎంపీపీ కమ్లి మోత్యానాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్ ఇటీవల ఆయన సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిణామంపై ఎమ్మెల్యే వర్గం నొచ్చుకుంది. నియోజవకర్గ బాస్‌గా ఎమ్మెల్యేకు కనీస సమాచారం ఇవ్వకుండా పార్టీలో ఎలా చేర్చుకుంటారనేది ఆయన అనుయాయుల ప్రశ్న. దీనిపై ప్రెస్‌మీట్ పెట్టి... ఎమ్మెల్సీ తీరును సైతం ఎండగట్టి తప్పుబట్టారు. అయితే, ఆమనగల్లు మున్సిపాలిటీ టీఆర్ఎస్ కన్వినర్ వస్పుల జంగయ్యతోపాటు పలువురు ఎమ్మెల్యేకు కొన్ని రోజులుగా దూరం పాటిస్తూ.. తాజాగా ఎమ్మెల్సీకి దగ్గరయ్యారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే వర్గానికి చెందిన ఆమనగల్లు ఎంపీపీ అనితవిజయ్ కొన్ని రోజుల కిందట ఎమ్మెల్సీ వర్గం వైపు వచ్చారు. వీటన్నింటినీ గమనించిన ఎమ్మెల్యే వర్గం.. ఎమ్మెల్సీపై గుర్రుగాఉంది. చినికిచినికి గాలివాన.. ఇటీవల ఆమనగల్లు మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే.. ఎంపీపీ కుర్చీలో ఆసీనులయ్యారు. దీనిని స్థానిక ఎంపీపీ అనిత తీవ్రంగా తప్పుబట్టారు. తనకు కనీస సమాచారం ఇవ్వకుండా కార్యాలయంలో సమావేశం నిర్వహించడమే కాకుండా ఎంపీపీ కుర్చీలో కూర్చోవడమేంటనేది ఆమె వాదన. ఒకరకంగా తనను అవమానించారని, గిరిజన ఎంపీపీ కావడంతోనే ఇలా చేశారని ఆమె మండిపడుతున్నారు. ఆమె ఆరోపణలు.. ఎమ్మెల్సీ ప్రోత్సాహ ఫలితమేనని ఎమ్మెల్యే వర్గం ప్రత్యారోపణ చేస్తోంది. గ్రూపు రాజకీయాలు చేస్తూ.. పార్టీని భ్రష్టు పటిస్తున్నారని బాహాటంగానే కసిరెడ్డిపై విమర్శల దాడికి దిగింది. మరోపక్క ఎమ్మెల్సీ వర్గం కూడా వీటిపై ఘాటుగానే స్పందిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్సీని ఆహ్వానించవద్దని అధికారులకు ఎమ్మెల్యే హెచ్చరికలు జారీ చేస్తున్నారని మండిపడుతున్నాయి. రాజకీయం.. వ్యాపారం కాదు ఆమనగల్లు: రాజకీయం అంటే వ్యాపారం కాదని, సేవాభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తున్నట్లు వివరించారు. ఎమ్మెల్యేగా తనకు ఉన్న అధికారాలను వినియోగించుకుంటున్నానే తప్పా ఇతర ప్రజాప్రతినిధులను కించపరిచే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. కల్వకుర్తిలో ఉన్న మంచి వాతావరణాన్ని కొందరు నేతలు స్వార్థ ప్రయోజనాల కోసం కలుషితం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలు వద్దూ.. అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని ఆయన కోరారు. కులమతాలకు అతీతంగా తాను పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. 20 లక్షలతో సరుకుల పంపిణీ ఆమనగల్లు మండలంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రూ.20 లక్షలతో పది వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ చెప్పారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. కడ్తాల్ మండలంలో రూ.20 లక్షలతో దాదాపు 4 వేల మంది ప్రైవేటు వాహనాల డ్రైవర్లు, వలస కార్మికులకు సరుకులు అందించామన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యురాలు అనురాధ, సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేశ్‌గుప్తా, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నిట్టె నారాయణ, వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి తదితరులు ఉన్నారు. చదవండి: మిడతలు మిక్సీ.. కోడికి మస్తీ! పార్టీ బలోపేతం కోసమే.. ‘ఇతర పార్టీలోంచి టీఆర్ఎస్లోకి వస్తామంటే చేర్చుకున్నాం. ఒక ఎమ్మెల్సీగా పార్టీలో చేర్చుకునే హోదా నాకు లేదా? దీనిని తప్పు బట్టాల్సిన అవసరమేం ఉంది..? ఎంపీపీ అనిత వ్యాఖ్యలతో నాకు ఎటువంటి సంబంధం లేదు. అది ఆమె వ్యక్తిగతం. దీని వెనక నా ప్రమేయం ఉందని ఆరోపించడం.. నూరుపాళ్లు తప్పు. ఎన్నికల సమయంలో జైపాల్ యాదవ్ గెలుపునకు కృషి చేశా. నేను సహకరించలేదని ప్రచారం చేస్తున్నారు. పార్టీ బలోపేతం కోసమే తప్ప నాకు స్వార్థం లేదు’ అని ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. దురుద్దేశంతోనే ఆరోపణలు ‘ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఓ ఎమ్మెల్యేగా వమ్ము చేయలేను. రాజకీయం అంటే వ్యాపారం కాదు. సేవాభావంతో పనిచేసేవారే రాజకీయాల్లో ఉండాలి. కొందరు రాజకీయ దురుద్దేశంతో నాపై ఆరోపణలు చేస్తున్నారు. శాసనసభ్యునిగా నాకున్న అధికారాలను వినియోగించుకుంటున్నా. కుల, మతాలకు అతీతంగా పనిచేస్తున్నా. ఇతర ప్రజాప్రతినిధులను కించపరిచే ఉద్దేశం నాకు లేదు. కల్వకుర్తిలో కొందరు నేతలు స్వార్థం కోసం రాజకీయాలను కలుషితం చేస్తున్నారు’ అని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చెప్పారు. -
ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంటిపై దాడి
సాక్షి, కల్వకుర్తి టౌన్: స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంటిపై టీఆర్ఎస్ నాయకులే దాడిచేసిన ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వెల్దండ మండలం పోతేపల్లికి చెందిన సంజీవ్‌కుమార్‌యాదవ్ 9వ డైరెక్టర్ స్థానం, 7వ డైరెక్టర్ స్థానం నుంచి జూపల్లికి చెందిన భాస్కర్‌రావు పోటీచేసి గెలుపొందారు. వీరిలో జూపల్లి భాస్కర్‌రావుకు పీఏసీఎస్ చైర్మన్ పదవి ఇస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న సంజీవ్ అనుచరులు కల్వకుర్తిలో ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతుండగా సంజీవ్, జూపల్లి భాస్కర్‌రావు అనుచరులకు మాటమాట పెరిగి గొడవకు దారితీసి.. దాడి చేసుకునే స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే సంజీవ్ అనుచరులు ఎమ్మెల్యే ఇంటికి ఉన్న కిటికీ అద్దాలను ధ్వంసం చేయడంతోపాటు ఏకంగా ఎమ్మెల్యేపై దాడిచేసేందుకు యత్నించారు. వెంటనే తేరుకున్న గన్మెన్లు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆందోళనకారులను చెదరగొట్టారు. అయితే ఇద్దరు కార్యకర్తలు ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అద్దాలను ధ్వంసం చేస్తున్న సమయంలో ఓ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో డివిజన్లోని అన్ని పోలీస్స్టేషన్ల పోలీసులు ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. పరిశీలించిన డీఎస్పీ.. ఎమ్మెల్యే ఇంటిపై దాడి సమాచారం తెలుసుకున్న డీఎస్పీ గిరిబాబు అక్కడికి చేరుకొని పరిశీలించారు. ఎమ్మెల్యే ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తున్న సంజీవ్‌యాదవ్‌కు, మద్దతుదారులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. అనంతరం డీఎస్పీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ను కలిసి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై డీఎస్పీ స్పందిస్తూ ఫిర్యాదు అందితే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
కల్వకుర్తి అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యం
సాక్షి,కల్వకుర్తి: కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధి సాధించాలంటే టీఆర్ఎస్కే పట్టం కట్టాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కోరారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జైపాల్ యాదవ్ మాట్లాడారు. ఎకరెన్ని కూటమిలను కట్టినా టీఆర్ఎస్ను ఏమీ చేయలేరన్నారు. అభివృద్దే టీఆర్ఎస్ను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కేసీఆర్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కల్వకుర్తి రూరల్: ప్రచారంలో అభ్యర్థులతో పాటు కార్యకర్తలు, నాయకులు తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం మండలంలోని మార్చాల గ్రామంలో ప్రచారంలో పాల్గొన్న వేపూర్ మాజీ సర్పంచ్ కొండూరు గోవర్ధన్ కొద్దిసేపు బైక్ మెకానిక్ పనులు చేస్తూ జైపాల్ యాదవ్‌ను గెలిపించాలని ఓట్లను అభ్యర్థించారు. వెల్దండ: కల్వకుర్తిలో టీఆర్ఎస్ గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలని వెల్దండ ఎంపీపీ జయప్రకాష్ పేర్కొన్నారు. ఆధివారం మండలంలోని అంకమోనికుంటలో టీఆర్ఎస్ ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జగన్, మల్లేష్, శ్రీనివాస్, నర్సింహ, అంజయ్య, అంతిరెడ్డి, తానయ్య, శ్రీశైలం తదితరులు ఉన్నారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థికి తప్పిన ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: కల్వకుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు ప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ఎక్వాయిపల్లి వద్ద ఓ టిప్పర్ వెనుక నుంచి వచ్చి ఆయన ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఆయన కారు మాత్రం పాక్షికంగా దెబ్బతింది. -
కల్లు డిపోలు తెరిపిస్తాం
-
కల్లు డిపోలు తెరిపిస్తాం
లిక్కర్ లాబీతో కుమ్మక్కై సీమాంధ్ర ప్రభుత్వాలు వాటిని మూసేశాయి: కేసీఆర్ టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, బాలకిషన్ సాక్షి, హైదరాబాద్: తాము అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్‌లో మూతపడిన కల్లు డిపోలను తిరిగి తెరిపిస్తామని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. లిక్కర్ లాబీతో కుమ్మక్కైన సీమాంధ్ర ప్రభుత్వాలు హైదరాబాద్‌లోని కల్లు డిపోలను మూసివేయించాయని ఆరోపించారు. ఆదివారం కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, టీజీవోల సంఘం అధ్యక్షుడు వి.శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ ధూంధాం కన్వీనర్ రసమయి బాలకిషన్ టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు, పాల మూరులో వలసలకు, నల్లగొండలో ఫ్లోరైడ్ బాధలకు, ఆదిలాబాద్‌లో అంటు రోగాలకు, దుబాయి వలసలకు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలే కారణమని కేసీఆర్ మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లాలో నదులు, నీళ్లు ఉన్నా.. కల్వకుర్తి, నెట్టెంపాడులను ఎందుకు పూర్తిచేయలేకపోయారని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ నుండి ఇప్పటిదాకా మంత్రులు, సామంతులు లేరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ వంటి స్వీయ రాజకీయ అస్తిత్వం ఉన్న పార్టీలు ఉండాలని... కాంగ్రెస్‌లో విలీనం చేస్తే మొదటికే మోసమని అనేకమంది హెచ్చరించారని కేసీఆర్ చెప్పారు. అందుకే విలీనం చేయలేదని, పొత్తులు కూడా ఉండవని ఇప్పటికే ప్రకటించానని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఆశించిన బంగారు తెలంగాణ టీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. తెలంగాణ పోరాటంలో అగ్రభాగాన నిలిచిన ఉద్యమకారులు ఎన్నికల్లో అభ్యర్థులుగా ఉంటారని, వారిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మందా జగన్నాథం, పార్టీ నేతలు నిరంజన్‌రెడ్డి, సి.లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్‌ను కలిసిన జలగం వెంకట్రావు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేత జలగం వెంకట్రావు ఆదివారం సమావేశమయ్యారు. ఖమ్మం లోక్‌సభ లేదా కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుండి పోటీకి దిగాలని జలగం ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా.. పటాన్చెరు ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ టీఆర్ఎస్లో సోమవారం చేరనున్నారు. -
తెలంగాణాలో టీడీపీ ఉనికి లేదు: కేసీఆర్
-
ఎమ్మెల్యే కారు ఢీ కొని ఆరుగురుకి తీవ్ర గాయాలు
మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునుంతల మండలం కట్టబండ వద్ద ఆదివారం మధ్యాహ్నం కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రయాణిస్తున్న కారు ఆటోను ఢీ కొట్టింది. ఆ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మెల్యే అంగరక్షకులు, అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే క్షతగాత్రులలో ఇద్దరు పరిస్థితి విషంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే ఆ ప్రమాదంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు మాత్రం ఎటువంటి గాయాలు కాలేదు. -
అరుణ సభలో రభస
తలకొండపల్లి, న్యూస్‌లైన్: తలకొండపల్లి మండలం పడకల్లో మంత్రి డీకే అరుణ వచ్చిన సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో రభస చోటుచేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌ను వేదికమీదకు ఆహ్వానించకుండా అవమానించారని ఆరోపిస్తూ తెలుగుదేశం కార్యకర్తలు సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు మంత్రి డీకే అరుణ ఇక్కడికి గురువారం వచ్చారు. ఈ సందర్భంగా జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతుండగా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ను పిలువాలని, ఆయన లేకుండా సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తూ సభా ప్రాంగణలోకి చొచ్చుకు వచ్చారు. అప్రమత్తమైన పోలీస్‌లు వారిని అడ్డుకున్నారు. ఇంతలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఇది అధికారిక సమావేశం కాదనీ, పార్టీ కార్యకర్తల సమావేశమని ఈ విషయం తెలిపామని చెప్పారు. అధికారికి సమావేశం కాకుంటే ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు నిర్వహిస్తున్నారని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తూ అక్కడే బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో టీడీపీ, కాంగ్రెస్ నాయకులు బాహాబాహీకి దిగి గొడవపడ్డారు. కుర్చీలు విసురుకొన్నారు. ఫలితంగా సమావేశం గందరగోళంగా తయారైంది. పరిస్థితి విషమించడంతో పోలీస్‌లు లాఠీలు ఝలిపించి టీడీపీ నాయకులను చెదరగొట్టి సమావేశ ప్రాంగణం నుంచి బయటికి పంపించి వేశారు. తదుపరి సమావేశం ప్రశాంతంగా కొనసాగింది.