కల్వకుర్తి నియోజకవర్గంలో తదుపరి అధికారం ఎవరిది? | Who Is The Next Incumbent In Kalwakurty Constituency | Sakshi
Sakshi News home page

కల్వకుర్తి నియోజకవర్గంలో తదుపరి అధికారం ఎవరిది?

Published Mon, Aug 7 2023 12:47 PM | Last Updated on Thu, Aug 17 2023 1:10 PM

Who Is The Next Incumbent In Kalwakurty Constituency - Sakshi

కల్వకుర్తి నియోజకవర్గం

కల్వకుర్తి నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌ అభ్యర్దిగా పోటీచేసిన జైపాల్‌ యాదవ్‌ మూడోసారి గెలిచారు. గతంలో రెండుసార్లు  టిడిపి పక్షాన గెలిచిన యాదవ్‌, టిఆర్‌ఎస్‌ లో కి వచ్చి పోటీచేసి విజయం సాదించారు. జైపాల్‌ యాదవ్‌ తన సమీప బిజెపి ప్రత్యర్ది తల్లోజు ఆచారిపై 3447 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. ఇక్కడ 2014లో గెలిచి సిటింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్‌ ఐ అభ్యర్ది వంశీచంద్‌ రెడ్డి మూడోస్థానానికి పరిమితం అవడం విశేషం. ఆయన కు 46523 ఓట్లు వచ్చాయి. కాగా గెలిచిన జైపాల్‌ యాదవ్‌కు 62892 ఓట్లు రాగా, ఆచారికి 59445 ఓట్లు వచ్చాయి. జైపాల్‌ యాదవ్‌ సామాజికవర్గం పరంగా యాదవ వర్గానికి చెందినవారు.

కల్వకుర్తి నియోజకవర్గంలో 2014లో ఆసక్తికర ఘట్టం చోటు చేసుకుంది. ఇక్కడ కౌంటింగ్‌ ముగిసే సమయానికి వంశీచంద్‌రెడ్డి సుమారు 150ఓట్ల ఆధిక్యతలో ఉండగా, చివరన ఒక ఇవిఎమ్‌. మొరాయించింది. దాంతో ఆ పోలింగ్‌ బూత్‌ పరిదిలో ఎన్నికల సంఘం రీపోల్‌ నిర్వహించింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఆ రీపోల్‌ తర్వాత 72 ఓట్ల ఆధిక్యతతో యువజన కాంగ్రెస్‌ అద్యక్షుడుగా కూడా ఉన్న వంశీచంద్‌ రెడ్డి బిజెపి-టిడిపి కూటమి అభ్యర్ధి టి. ఆచారిపై గెలుపొందారు. కాని 2018లో ఓటమి చెందారు. 2014 ఎన్నికలకు ముందు టిడిపికి గుడ్‌ బై చెప్పి టిఆర్‌ఎస్‌లోకి మారి పోటీచేసిన అప్పటి  సిటింగ్‌ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ 29844 ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో మిగిలారు.

2018లో గెలవగలిగారు. కేంద్రమంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి గతంలో నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించిన కల్వకుర్తి నియోజకవర్గానికి విశేష ప్రాధాన్యం ఉంది. తెలుగుదేశం పార్టీని స్థాపించి సంచలనం సృష్టించి,  వందల మందికి రాజకీయ జీవితాన్ని అందించిన నందమూరి తారకరామారావు 1989లో ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోవడం ఒక పెద్ద విశేషం. ఎన్‌.టి.ఆర్‌.పై కాంగ్రెస్‌ ఐ అభ్యర్దిగా పోటీచేసిన  జె.చిత్తరంజన్‌ దాస్‌ గెలిచారు. ఇక్కడ వై.కిష్టారెడ్డి  రెండుసార్లు, గెలిచారు. జె. చిత్తరంజన్‌దాస్‌ రెండుసార్లు గెలిచారు.

కేంద్రమంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి రాజకీయ జీవితం ఇక్కడ నుంచే ఆరంభమైంది. ఆయన 1969లో జరిగిన ఉప ఎన్నిక ద్వారా తొలిసారి గెలిచి (సిట్టింగ్‌ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా కోర్టు తీర్పురావడంతో ఉప ఎన్నిక జరిగింది) ఆ తర్వాత వరసగా మరోమూడుసార్లు గెలుపొందారు. జైపాల్‌రెడ్డి మహబూబ్‌నగర్‌, మిర్యాలగూడలలో రెండేసిసార్లు లోక్‌సభకు ఎన్నికై 2009లో  చేవెళ్ళ నుంచి లోక్‌సభక ఎన్నికయ్యారు. కాని 2014లో మహబూబ్‌నగర్‌లో లోక్‌సభకు పోటీచేసి  స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆయన రాజ్యసభకు కూడా ప్రాతినిధ్యం వహించారు.

1980లో ఇందిరాగాంధీపై పోటీచేసి జైపాల్‌రెడ్డి, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్‌ ఐలో చేరి కేంద్రమంత్రి కావడం విశేషం. అంతకుముందు యున్కెటెడ్‌ఫ్రంట్‌ హయాంలో కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. కల్వకుర్తిలో మరోసారి కూడా ఎన్నిక చెల్లకుండా పోవడం వల్ల ఉప ఎన్నిక జరిగంది. కోర్టు తీర్పు కారణంగా 1962లో గెలిచిన అభ్యర్ధి  వెంకటరెడ్డి ఎన్నిక చెల్లకుండా పోవడంతో  జరిగిన ఉప ఎన్నికలో శాంతాబాయి  గెలిచారు. శాంతబాయి ఇక్కడ రెండుసార్లు మక్తల్‌లో ఒకసారి, గగన్‌మహల్‌లో మరోసారి మొత్తం నాలుగుసార్లు గెలిచారు.

1989లో ఎన్‌.టి.ఆర్‌.ను ఓడిరచిన చిత్తరంజన్‌దాస్‌కు చెన్నారెడ్డి మంత్రివర్గంలో స్థానం లభించింది. కల్వకుర్తి నియోజకవర్గంలో  తొమ్మిదిసార్లు కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ఐ జనతా పార్టీ రెండుసార్లు, టిడిపి రెండుసార్లు, టిఆర్‌ఎస్‌ ఒకసారి, ఇండిపెండెంట్లు మూడుసార్లు గెలిచారు. కల్వకుర్తిలో ఎనిమిదిసార్లు రెడ్డి సామాజికవర్గం, ఆరుసార్లు బిసి వర్గం నేతలు, రెండుసార్లు బ్రాహ్మణ నేత, రెండుసార్లు ఎస్‌.సి.నేతలు ఎన్నికయ్యారు.

కల్వకుర్తి నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement