ఎమ్మెల్యే కారు ఢీ కొని ఆరుగురుకి తీవ్ర గాయాలు | Six people injured MLA car - auto accident in Mahabubnagar | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కారు ఢీ కొని ఆరుగురుకి తీవ్ర గాయాలు

Published Sun, Feb 23 2014 1:24 PM | Last Updated on Tue, Nov 6 2018 4:55 PM

ఎమ్మెల్యే కారు ఢీ కొని ఆరుగురుకి తీవ్ర గాయాలు - Sakshi

ఎమ్మెల్యే కారు ఢీ కొని ఆరుగురుకి తీవ్ర గాయాలు

మహబూబ్నగర్ జిల్లా ఉప్పునుంతల మండలం కట్టబండ వద్ద ఆదివారం మధ్యాహ్నం కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రయాణిస్తున్న కారు ఆటోను ఢీ కొట్టింది. ఆ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు  తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మెల్యే  అంగరక్షకులు, అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే క్షతగాత్రులలో ఇద్దరు పరిస్థితి విషంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే ఆ ప్రమాదంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్కు మాత్రం ఎటువంటి గాయాలు కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement