వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు | Police Raids On Prostitution House Mahabubnagar | Sakshi
Sakshi News home page

వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు

Jan 28 2025 1:48 PM | Updated on Jan 28 2025 1:48 PM

Police Raids On Prostitution House Mahabubnagar

గద్వాల క్రైం: జిల్లా కేంద్రంలో గుట్టుగా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇంటిపై పట్టణ పోలీసులు దాడులు చేపట్టి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్‌ తెలిపారు. పట్టణంలోని బీరోలు చౌరస్తాలోని ఓ ఇంటిలో కడప జిల్లా ఇందిరానగర్‌కు చెందిన రమణయ్యగౌడ్‌ కొన్ని నెలలుగా వ్యభిచార దందాను గుట్టుగా నిర్వహిస్తున్నాడు. అయితే సోమవారం సాయంత్రం నమ్మదగిన సమాచారం మేరకు వ్యభిచార  గృహాంపై దాడులు చేపట్టిన పోలీసులు ఇద్దరు మహిళలు, ముగ్గురు విటులతో పాటు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. 

వారి నుంచి 7 సెల్‌ఫోన్లు, నగదును స్వాదీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అయితే 20 రోజుల క్రితం ఇదే తరహాలో జిల్లాకేంద్రంలోని పాత హౌసింగ్‌బోర్డు కాలనీలో పట్టుబడిన ఘటన మరవక ముందే మరోసారి పట్టణంలో వ్యభిచార దందా వెలుగులోకి రావడంతో జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంలో దాగి ఉన్న ప్రధానసూత్రదారులెవరో గుర్తిస్తే తప్ప ఈ దందాను కట్టడి చేయొచ్చని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement