prostitution house
-
వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు
గద్వాల క్రైం: జిల్లా కేంద్రంలో గుట్టుగా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇంటిపై పట్టణ పోలీసులు దాడులు చేపట్టి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పట్టణ ఎస్ఐ కళ్యాణ్‌కుమార్ తెలిపారు. పట్టణంలోని బీరోలు చౌరస్తాలోని ఓ ఇంటిలో కడప జిల్లా ఇందిరానగర్‌కు చెందిన రమణయ్యగౌడ్ కొన్ని నెలలుగా వ్యభిచార దందాను గుట్టుగా నిర్వహిస్తున్నాడు. అయితే సోమవారం సాయంత్రం నమ్మదగిన సమాచారం మేరకు వ్యభిచార గృహాంపై దాడులు చేపట్టిన పోలీసులు ఇద్దరు మహిళలు, ముగ్గురు విటులతో పాటు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 7 సెల్ఫోన్లు, నగదును స్వాదీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. అయితే 20 రోజుల క్రితం ఇదే తరహాలో జిల్లాకేంద్రంలోని పాత హౌసింగ్‌బోర్డు కాలనీలో పట్టుబడిన ఘటన మరవక ముందే మరోసారి పట్టణంలో వ్యభిచార దందా వెలుగులోకి రావడంతో జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంలో దాగి ఉన్న ప్రధానసూత్రదారులెవరో గుర్తిస్తే తప్ప ఈ దందాను కట్టడి చేయొచ్చని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. -
Ameerpet: స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం
అమీర్‌పేట: స్పా సెంటర్ ముసుగులో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న కేంద్రంపై సీసీఎస్ పోలీసులు దాడి చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. సంధ్య, నరేష్ దంపతులు ఎస్ఆర్నగర్లో ఓ స్పా సెంటర్ నిర్వహిస్తున్నాడు. వారు నిబంధనలకు విరుద్ధంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్ఆర్నగర్ పోలీసులతో కలిసి సీసీఎస్ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. నిర్వాహకుడు నరేష్ పరారు కాగా విటులు సంతోష్‌దాస్, రామరాజులతో పాటు మరో యువతిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసిన పోలీపులు తదుపరి విచారణ నిమిత్తం ఎస్‌ఆర్‌నగర్‌కు బదిలీ చేశారు. -
Khairatabad: మ్యారేజ్ బ్యూరో ముసుగులో వ్యభిచారం
ఖైరతాబాద్: మ్యారేజ్ బ్యూరో ముసుగులో వ్యభిచారం గృహం నిర్వహిస్తున్న వారిపై సెంట్రల్ జోన్ టాస్క్‌పోర్స్ పోలీసులు దాడిచేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్‌కు చెందిన అయేషా సిద్ధిఖీ షాదాన్ కాలేజ్ లేన్‌లో మ్యారేజ్‌బ్యూరో పేరుతో కొంతకాలంగా వ్యభిచారం నిర్వహిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి వ్యాపారం నిర్వహిస్తోందని తెలుసుకున్న టాస్‌్కఫోర్స్ పోలీసులు శనివారం దాడి చేసి ప్రధాన నిర్వాహకురాలితో పాటు విటులు బానోత్ వీరుడు, షేక్ సిహబ్, మహ్మద్ సులేమాన్, మహ్మద్ నిజాముద్దీన్లను అదుపులోకి తీసుకొని వీరివద్ద నుంచి ఫోన్లు, నగదు, కండోమ్ ప్యాకెట్లు స్వా«దీనం చేసుకొని ఖైరతాబాద్ పోలీసుకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యభిచార ముఠా చేతికి చిక్కి.. బకరా అయిన మాజీ ఉద్యోగి
ఆదిలాబాద్‌టౌన్: వలపు వలలో ఓ రిటైర్డ్ ఉద్యోగి చిక్కుకున్నాడు. వ్యభిచార ముఠా వేసిన గాలానికి బ లయ్యాడు. ఆశపడి వచ్చిన రిటైర్డ్ ఉద్యోగిని వారు నిండా ముంచేందుకు పన్నాగం పన్నారు. ఆ వృద్ధుడి న్యూడ్ ఫొటోలు తీసి బ్లాక్మెయిల్ చేశారు. డబ్బులు సమర్పించకుంటే పోలీసులను ఆశ్రయిస్తామని, సో షల్ మీడియాలో వీడియోను అప్లోడ్ చేస్తామని బె దిరింపులకు పాల్పడ్డారు. ఆ వృద్ధుడు ఆ వ్యభిచార ముఠాకు కొన్ని డబ్బులు అందజేసి అక్కడినుంచి త ప్పించుకొని పోలీసులను ఆశ్రయించాడు. దీంతో బుధవారం వన్‌టౌన్ పోలీసులు ఆ ముఠా గుట్టురట్టు చేశారు. ఈ తతంగం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. ఆదిలాబాద్ పట్టణంలోని వాల్మీకినగర్ సమీపంలోని ఆర్కే కాలనీలో ఓ మహిళ ఇల్లును అద్దెకు తీసుకుని వ్యభిచార దందాను నిర్వహిస్తోంది. ఈమెకు పట్టణానికి చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇటీవల సదరు మహిళ అతడికి ఫోన్‌చేసి మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ వచ్చిందని, ఆమెకు రూ.వెయ్యి, నాకు రూ.500 ఇవ్వాల్సి ఉంటుందని అతడితో చెప్పింది. దీంతో అతడు తనకు తెలిసిన రిటైర్డ్ ఉద్యోగి ఉన్నాడని, ఆ వ్యక్తిని పంపిస్తానని, అతడిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయాలని ప్లాన్ చేశాడు. ప్లాన్ ప్రకారం రిటైర్డ్ ఉద్యోగిని అక్కడికి పంపించాడు. అక్కడి చేరుకోగానే రిటైర్డ్ ఉద్యోగిని గదిలోకి పంపించారు. ఆ గదిలోని మరో మహి ళ న్యూడ్ ఫొటోలు తీసింది. కొంత సేపటికి ఆ గదిలోకి నిర్వాహకురాలుతో పాటు మరో మహిళ, మరో ఇద్దరు వ్యక్తులు వెళ్లి బ్లాక్మెయిల్ చేశారు. తమకు షీటీం వారు తెలుసని భయపెట్టారు. కొంతసేపు తర్వాత బాధితుడిని పంపించిన వ్యక్తి అక్కడికి చేరుకుని ఏమి తెలియన ట్లు జరిగిన విషయాన్ని ఆరా తీశాడు. ముఠా రూ. 2లక్షలు డిమాండ్ చేయగా బాధితుడు రూ.40వేలు ఇచ్చేలా ఒప్పందం చేశాడు. బాధితుడి వద్ద ఉన్న రూ.3వేలు, ఆధార్‌కార్డు, సెల్‌ఫోన్‌ను తీసుకుని మిగి తా డబ్బులు తెచ్చి వీటిని తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో బాధితుడు అక్కడి నుంచి బయటకు వచ్చి మంగళవారం సాయంత్రం వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆరుగురు ముఠా సభ్యులను పట్టుకొని అరెస్టు చేశారు. వీరందరూ ఆదిలా బాద్ పట్టణానికే చెందినవారేనని డీఎస్పీ ఉమేందర్ తెలిపారు. ఈ సమావేశంలో వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ ఉన్నారు. సమాచారం అందించాలి ఎక్కడైన వ్యభిచారం జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలి. మీ వివరాలను గోప్యంగా ఉంచుతాం. ఇల్లు అద్దెకు ఇచ్చే ముందు వారి పూర్తి వివరాలు ఇంటి యజమానులు తెలుసుకోవాలి. ఇల్లు అద్దెకు తీసుకొని వ్యభిచారం నడిపిస్తే ఆ ఇంటిని సీజ్ చేస్తాం. ఈ ముఠా నుంచి మరి న్ని వివరాలు సేకరిస్తున్నాం. ఆరు నెలలుగా వీరు వ్యభిచారం నడుపుతున్నట్లు తేలింది. – ఉమేందర్, డీఎస్పీ, ఆదిలాబాద్ -
వ్యభిచారం కేసులో అరెస్టు
హోసూరు: హోసూరు కార్పొరేషన్ పరిధిలో వ్యభిచారాలు నిర్వహిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాగలూరు రోడ్డులోని ఎన్.జి.జి.వోఎస్. కాలనీలో ఆదివారం రాత్రి పట్టణ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఓ ఇంటిపై దాడి చేసి మూకొండపల్లికి చెందిన కవిత (30), ఎన్జిజివోఎస్ కాలనీకి చెందిన హరిదాస్ (21), ఉడయాండహళ్లి గ్రామానికి చెందిన లత (40), అత్తిముగంకు చెందిన దినేష్(42)లను అరెస్ట్ చేశారు. వీరిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
Hyderabad: వ్యభిచార గృహంపై దాడి
హైదరాబాద్: ఓ వ్యభిచార గృహంపై జీడిమెట్ల పోలీసలు దాడి చేసి ఇద్దరు నిర్వహకులతో పాటు ఓ మహిళ, ఓ యువకుడిని అరెస్టు చేశారు. సీఐ యం.పవన్ వివరాల ప్రకారం.. ఆదివారం గాజులరామారంలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కన్నెపల్లి శోభ(47), మందుల లత(35) అనే ఇద్దరు నిర్వాహకులతో పాటు ఓ మహిళ(23), గుండ్లపోచంపల్లికి చెందిన సందీప్ కుమార్ జేనా(27)లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అందరిని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. మహిళను రెస్క్యూ హోంకు తరలించారు. -
పోలీసుల ఓవర్ యాక్షన్.. వ్యభిచార గృహంలో పేక ముక్కలు ఆడిస్తూ
సాక్షి, కృష్ణాజిల్లా : ఉయ్యూరు పోలీసుల ఓవర్ యాక్షన్ చూపించారు. ఆకునూరులో వ్యభిచారం నడుపుతున్నట్టు సమాచారం రావడంతో ఉయ్యూరు రూరల్ పోలీసులు పోలీసులు తనిఖీలు చేపట్టారు. పోలీసుల దాడిలో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళతో పాటు ఒక విటుడిని, ముగ్గురు యువతుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో వ్యభిచార గృహంలో దర్జాగా కూర్చోని చేత్తో పేక ముక్కలు ఆడిస్తూ యువతులను పోలీసులు బెదిరించారు. దుస్తులు మార్చుకొని వస్తారా, లేక ఇలానే కొట్టుకుంటూ తీసుకెళ్లలా అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉయ్యూరు పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే బెదిరింపులకు పాల్పడటంపై మండిపడుతున్నారు. నిందితులు, నేరస్థుల విషయంలోనూ బాధ్యతగా మెలగాల్సిన పోలీసులు ఇలా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చదవండి: ఏపీఏటీ సిబ్బందిని మరోచోటుకు పంపడమేంటి? -
Hyderabad: వ్యభిచార గృహంపై దాడి.. ఐదుగురి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేసిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ గోనె సురేష్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాఘవేంద్ర కాలనీలోని వైట్ హౌస్ ఓ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచరం అందడంతో గచ్చిబౌలి పోలీసులు, యాంటీ హ్యూమన్ ట్రాకింగ్ యూనిట్ సభ్యులు హోటల్‌పై దాడి చేశారు. ఈ సందర్భంగా పంజాబ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన చెందిన ఇద్దరు యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. నిర్వాహకులు మహ్మద్ అదీమ్, మహ్మద్ సమీర్, హర్బిందర్ కౌర్ అలియాస్ అనికా, మహ్మద్ సల్మాన్, మహ్మద్ అబ్దుల్ కరీంలను అరెస్ట్ చేశారు. మహ్మద్ అదీమ్ పలు రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిందితులపై సైబరాబాద్‌లో పది కేసులు నమోదై ఉన్నట్లు ఆయన వివరించారు. చదవండి: Warangal: బర్త్‌డే వేడుకల్లో గొడవ.. శానిటైజర్ తాగిన విద్యార్థినులు -
Banjara Hills: స్పా ముసుగులో వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో ఎలాన్ స్పా పేరుతో బెజవాడ అభిలాష్ అనే వ్యక్తి వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నాడు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు ఆదివారం రాత్రి దాడులు చేశారు. పలువురు యువతులతో ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మసాజ్ థెరపిస్టుల పేరుతో మణిపూర్ తదితర ప్రాంతాలనుంచి యువతులను తీసుకొచ్చి వారిని సెక్స్ వర్కర్లుగా మార్చి ఈ దందాకు పాల్పడుతున్నట్లుగా నిర్ధారించారు. ముషీరాబాద్‌కు చెందిన బెజవాడ అభిలాష్(33)తో పాటు స్పా మేనేజర్ లిఖినా జవోమితో పాటు అయిదుగురు కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. అభిలా‹Ùతో పాటు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. కస్టమర్లలో ఓ వైద్యుడు, ఓ చాక్లెట్ కంపెనీ వ్యాపారి, సాఫ్ట్వేర్ ఉద్యోగి, వాస్తు కోర్సు చదువుతున్న విద్యార్థి కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో కొనసాగుతున్న స్పోరా స్పాలో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించి నిర్వాహకుడు చింతల స్వామిపై కేసులు నమోదు చేశారు. -
Hyderabad: చంపుతానని బెదిరించి.. భార్యను వ్యభిచారంలోకి దింపి!
సాక్షి, హైదరాబాద్: కడదాక తోడుంటానంటూ కట్టుకున్న భార్యనే వ్యభిచార కూపంలోకి దింపాడో ప్రబుద్ధుడు. ఈ ఘటనపై రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్టకు చెందిన సాదిక్ (34) గతంలోనే వివాహం జరగగా..2019లో పహాడీషరీఫ్‌కు చెందిన మహిళ(25)ను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. పెళ్లైన నాటి నుంచే సాదిక్ రెండో భార్యను చంపుతానంటూ బెదిరించి బయటికి తీసుకెళ్లి వ్యభిచారం చేయించడం మొదలెట్టాడు. ఇది నచ్చని ఆమె భర్తకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో ఈ ఏడాది మార్చిలో విడాకులు తీసుకుంది. తాజాగా ఈ నెల 2న ఆమె సరూర్‌నగర్ పరిధిలో స్నేహితులతో కలిసి రోడ్డుపై ఉండటాన్ని గమనించిన సాదిక్ కొట్టాడు. దీంతో ఆమె సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అంతటితో ఆగకుండా గురువారం పహాడీషరీఫ్‌లోని అత్తగారింట్లో భార్య లేని సమయంలో అత్తని బెదిరించి కుమారుడిని బలవంతంగా ఎత్తుకెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పహాడీషరీఫ్ పోలీసులు బలవంతపు వ్యభిరారం, కిడ్నాప్ కేసులు నమోదు చేశారు. అతని చెర నుంచి క్షేమంగా బాలుడిని విడిపించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కాగా సున్నితమైన కేసు కావడంతో వివరాలు మీడియాకు వెల్లడించలేమని పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ కె.కిరణ్ కుమార్ తెలిపారు. చదవండి: పిల్లలు కావాలా?.. సక్సెస్ రేటు కోసం సంతాన సాఫల్య కేంద్రాల అడ్డదారులు -
బంజారాహిల్స్: గుట్టుచప్పుడు కాకుండా అపార్ట్మెంట్లో వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ఓ వ్యభిచారం గృహంపై వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం దాడి చేశారు. రోడ్ నెం.11లో అల్ కరీమ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని వ్యభిచారం నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిర్వాహకురాలు స్వాతితోపాటు ఇద్దరు యువతులు, ఓ కస్టమర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిర్వాహకురాలు సత్యవతి పరారీలో ఉంది. నిందితులను విచారణ నిమిత్తం వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. -
లాడ్జీలో వ్యభిచారం.. ఇద్దరు మహిళలతో సహా ఆరుగురు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: లాడ్జీలో వ్యభిచారం చేయిస్తున్న లాడ్జీ యజమానితో పాటు ఐదుగురిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ ఎదురుగా కర్నాటి రామారావు అనే వ్యక్తి శ్రీ వెంకటేశ్వర లాడ్జీని నిర్వహిస్తున్నాడు. రిసెప్షనిస్ట్‌గా యడ్డ సహదేవ్ పని చేస్తున్నాడు. సెక్స్ వర్కర్లను నియమించుకుని గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు ఆదివారం రాత్రి వెంకటేశ్వర లాడ్జీపై దాడి చేసి తనిఖీలు చేపట్టారు. విటులు దేవరాజు, మాణిక్ స్వరూప్, కర్నూల్ ప్రాంతాన్ని చెందిన ఒక మహిళ, నల్గొండ జిల్లా డిండికి చెందిన మరో మహిళ పట్టుబడ్డారు. లాడ్జీ నిర్వాహకులు కర్నాటి రామారావు, సహదేవ్‌ను కూడా అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. -
Gachibowli: ఓయో రూమ్‌లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఓయో రూమ్‌లో వ్యభిచారం జరుగుతుందనే సమాచారం మేరకు దాడి చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు రాయదుర్గం పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన∙వివరాలు ఇలా ఉన్నాయి .. గచ్చిబౌలి పీజేఆర్నగర్లోని గ్యాస్ గోడౌన్ రోడ్డులోని ఓయో హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు మంగళవారం సాయంత్రం ఆకస్మిక దాడులు నిర్వహించారు. కమలాకర్‌రెడ్డి అనే వ్యక్తి ఓయో హోటల్లో గదులు తీసుకొని వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నాడని అతనికి ఎండీ రఫీక్(32), అమిత్‌కుమార్ అనే వ్యక్తులు సహాయకులుగా ఉంటూ ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారని, వీరితోపాటు వ్యభిచారానికి పాల్పడుతున్న 9 మంది బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ముంబాయి, కర్నాటక రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలను రెస్క్యూ హోమ్‌లకు తరలించారు. ఇదిలా ఉండగా ప్రధాన నిందితుడు కమలాకర్‌రెడ్డి, అతని సహాయకుడు అమిత్‌కుమార్ పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 5 సెల్ఫోన్లు, 29 కండోమ్ ప్యాకెట్లు, రూ.15,050 నగదు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: ‘నువ్వంటే ఇష్టం... నాతో ఉండిపో’.. వివాహితకు సినీ కెమెరామెన్ వేధింపులు -
వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడ్డ ఏఆర్ కానిస్టేబుల్
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని నవోదయ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో వ్యభిచారం చేస్తూ ఏఆర్ కానిస్టేబుల్ దేవరకొండ జయంత్‌కుమార్(27)తో పాటు బేగరి యాదయ్య(37) పట్టుబడ్డారు. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న జి. వినయ్ పరారీలో ఉండగా మరో నిర్వాహకుడు యానాల శ్రీనివాస్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దాడుల్లో నలుగురు సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకొని పునరావాస కేంద్రానికి తరలించారు. చదవండి: ఫుడ్ డెలివరీకి వెళ్లి ఇదేం పాడుపని.. యువతిని బలవంతంగా..! -
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
సాక్షి, ఖమ్మం: కల్లూరు పంచాయతీ పరిధి శ్రీరాంపురం గ్రామంలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు మంగళవారం అర్ధరాత్రి తనిఖీలు చేపట్టారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం గ్రామానికి చెందిన మహిళ శ్రీరాంపురంలో ఇళ్లు అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తోంది. దీంతో ఎస్ఐ వెంకటేశ్ నేతృత్వంలో తనిఖీలు చేపట్టగా నిర్వాహకురాలితో పాటు మరికొందరు మహిళలు, విటులు పట్టుబడ్డారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
హైదరాబాద్: ఉపాధి ఆశ చూపి వ్యభిచారంలోకి..!
సాక్షి, హైదరాబాద్: ఉపాధి పేరుతో బంగ్లాదేశ్ యువతులను నగరానికి తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్న ముఠాలో ఆరుగురిని యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్ స్పెషల్ ఆపరేషన్, ఉప్పల్ పోలీసులు, ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి కారు, 7 సెల్‌ఫోన్స్, 5 సిమ్ కార్డులు, 7 నకిలీ గుర్తింపు కార్డులు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. వ్యభిచార ముఠా నుంచి నుంచి ఓ బాలికతో పాటు మహిళను కాపాడారు. ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ కార్యాలయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం.. వివరాలు వెల్లడిస్తున్న సీపీ మహేష్ భగవత్ జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సతీష్ రజక్(25) ముంబైలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. తను బంగ్లాదేశ్‌కు చెందిన బ్రిష్టిఖాతున్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆమె అక్రమంగా పశ్చిమ బెంగాల్‌కు వచ్చి అక్కడ నకిలీ ఆధార్ కార్డు తీసుకుని ముంబైకి వచ్చింది. రాజస్థాన్‌కు చెందిన దీపక్ చంద్, మావత్ ప్రకాష్(30), మహారాష్ట్రకు చెందిన సురేష్ బలుసోనన్నే(36,) అస్లాం చంద్ పటేల్, అరుణ్ రామచంద్ర జాదవ్(56), పశ్బిమ బెంగాల్‌కు చెందిన ప్రియాంక కలిసి దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. దీపక్ చంద్, సతీష్ రజక్‌లు వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలు, యువతులును ఉపాధి పేరుతో ఆకర్షించి వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నారు. ఆన్లైన్ డేటింగ్ వెబ్సైట్లో యువతులు, మహిళల అర్ధనగ్న ఫొటోలు అప్లోడ్ చేసి.. కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. దేశంలో క్లయింట్లకు కావాల్సిన చోటికి యువతులను పంపిస్తున్నారు. విమాన, రైలు, బస్సు, నెట్ బ్యాంకింగ్ యాప్స్ ద్వారా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తూ డబ్బు దండుకుంటున్నారు. సతీష్ రజక్, భార్య బ్రిష్టిలు హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతంలో ఉంటూ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలను, బాలికలను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. బంగ్లాదేశ్ చెందిన ఓ మహిళ ఉద్యోగం కోసం తన బంధువైన బ్రిష్టిని సంప్రదించగా ఇండియాలో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఆమె తన సోదరితో కలిసి అక్రమంగా జూన్ 27న బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతాకు రాగా, అక్కడ నుంచి రజక్, బ్రిష్టిలు ఉప్పల్ తీసుకొచ్చారు. వారిద్దరినీ బలవంతంగా వ్యభిచారంలో దింపడంతో వారు ఈనెల 11న అక్కడి నుంచి తప్పించుకుని ఉప్పల్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఈ ముఠాపై నిఘా పెట్టి ఆరుగురు నిందితులను అరెస్టు చేసి బంగ్లాదేశ్ మహిళలతో పాటు 15 ఏళ్ల బాలికను రక్షించారు. దీపక్ చంద్‌కు బంగ్లాదేశ్ మహిళలను అక్రమంగా రవాణా చేసేవారితో మంచి పరిచయాలు ఉన్నాయని, వారు మహిళలను అక్రమంగా భారత దేశ సరిహద్దులు దాటించి పశ్బిమ బెంగాల్‌కు పంపుతారని, వారికి నకిలీ ఆధార్, ఇతర గుర్తింపు కార్డులు తాను ఏర్పాటు చేస్తానని పోలీసుల విచారణలో సతీష్‌రజక్ కు తెలిపాడు. గత ఐదేళ్లుగా వీరు నగరంలోని సంపన్నులు నివాసం ఉండే ప్రాంతాల్లో బ్యూటీపార్లర్లు నిర్వహించేవారు. అమ్మాయిలను మసాజ్ గరల్స్‌గా ఏర్పాటు చేసి వ్యభిచార దందా కొనసాగిస్తున్నారు. మహిళలను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు, శిక్షలు అమలవుతాయని రాచకొండ సీపీ హెచ్చరించారు. పట్టుబడ్డవారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ముఠాలోని ప్రకాష్, ప్రియాంక పరారీలో ఉన్నారని, వీరిని కూడా త్వరలో అరెస్టు చేస్తామన్నారు. సమావేశంలో రాచకొండ ఎస్ఓటీ డీసీపీ మురళీధర్, ఏసీపీ వెంకన్న నాయక్, మాల్కాజిగిరి ఏసీపీ నరేష్‌రెడ్డి, ఏహెచ్‌టీయూ సీఐ నవీన్‌కుమార్, ఉప్పల్ సీఐ గోవింద్‌రెడ్డి, బాలకృష్ణ, సుధాకర్‌రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్: ఇంట్లోనే వ్యభిచారం.. ముగ్గురు అరెస్ట్..
సాక్షి, హైదరాబాద్: వ్యభిచార గృహంపై దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్న సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. మీర్‌పేట సర్వోదయనగర్ కాలనీకి చెందిన నిర్వాహకురాలు వాసిరెడ్డి సుధారాణి తన ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం రాత్రి దాడి చేశారు. నిర్వాహకురాలు సుధారాణి, దిల్సుఖ్నగర్ కృష్ణానగర్‌కాలనీకి చెందిన విటుడు గట్ల రాజు (37)తో పాటు ఓ యువతిని అరెస్ట్ చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. సుధారాణి గతంలోనూ ఇదే కేసులో పట్టుబడినట్లు సీఐ వెల్లడించారు. కోర్టు భవనం -
హైదరాబాద్: అపార్టుమెంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: అపార్టుమెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పంజగుట్ట పోలీసులు దాడిచేసి నిర్వాహకుడు, విటుడు, వీరికి సహకరించే వాచ్‌మెన్‌ను అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బీఎస్ మక్తాలోని ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో వ్యభిచారం జరుగుతోందనే పక్కా సమాచారంలో పంజగుట్ట క్రైమ్ ఇన్స్పెక్టర్ టి.నరసింహరాజు తమ సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇందులో సబ్ ఆర్గనైజర్ బీఎస్ మక్తాకు చెందిన దుర్గాప్రసాద్(26), విటుడు శేరిలింగంపల్లికి చెందిన షేక్ తాహేర్(28), వ్యభిచార నిర్వహణకు సహకరిస్తున్న వాచ్మెన్ చంద్రయ్యను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 4 వేలు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్‌బెంగాల్‌కు చెందిన మహిళలను రెస్క్యూహోంకు తరలించారు. ప్రధాన నిర్వాహకుడు అమర్ అలియాస్ ప్రేమ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. చదవండి: హైదరాబాద్: నిషేధిత హారన్ కొడుతూ రోడ్లపై దూసుకుపోతున్నారా.. తస్మాత్ జాగ్రత్త! -
Hyderabad: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ముగ్గురు అరెస్టు
సాక్షి, పంజగుట్ట: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై పంజగుట్ట పోలీసులు దాడి చేసి ఇద్దరు సెక్స్ వర్కర్లను, ఒక సబ్ నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు... శ్రీనగర్‌కాలనీలోని శ్రీనివాసప్లాజాలో వ్యభిచారం జరుగుతుందని పక్కా సమాచారం అందుకున్న పంజగుట్ట క్రైమ్ ఇన్స్పెక్టర్ టి.నర్సింహరాజు శుక్రవారం అర్ధరాత్రి ఓ కానిస్టేబుల్‌ను కస్టమర్‌గా మొదట అక్కడకు పంపించారు. అనంతరం దాడులు నిర్వహించి ఇద్దరు యువతులను, సబ్ ఆర్గనైజర్ ఈస్ట్‌గోదావరికి చెందిన పి.దుర్గ(47)ను అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ నిర్వాహకుడు కె.రాము పరారీలో ఉన్నాడు. యువతులను రెస్క్యూ హోంకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: రాజేంద్రనగర్‌లో ఆటోడ్రైవర్ వీరంగం.. మహిళలపై దాడి -
ఉప్పల్: ఇంట్లో ఒంటరిగా ఉంటూ వ్యభిచారం.. నిర్వాహకురాలు అరెస్ట్
సాక్షి, ఉప్పల్: వ్యభిచార నిర్వాహకురాలిని ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఉప్పల్ ఎస్సై మధుసూదన్ తెలిపిన మేరకు.. ఉప్పల్ ఆదర్శ్‌నగర్‌లో ఉంటున్న కుర్రి అరుణ అలియాస్ అరుణారెడ్డి (36) ఇంట్లో ఒంటరిగా ఉంటూ వ్యభిచారం నిర్వహిస్తుందన్న సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో సోదాలు నిర్వహించి ఒక సెల్‌ఫోన్, కండోమ్ ప్యాకెట్లు, నగదును స్వాదీనం చేసుకొని నిందితురాలిని రిమాండ్‌కు తరలించారు. చదవండి: భార్య, బావమరిది పేర్లతో పే రోల్స్.. ఉద్యోగం మానేయడంతో అసలు విషయం బయటకు -
గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. నలుగురి అరెస్ట్
సాక్షి, వరంగల్: మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శివనగర్‌లో వ్యభిచార గృహంపై దాడి చేసి నిర్వాహకులు, విటులను అరెస్టు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. వ్యభిచారం చేస్తున్న లేబర్‌కాలనీకి చెందిన తడిగల అరుణ, కాశిబుగ్గకు చెందిన కాకర రజిత, పద్మనగర్ కాలనీకి చెందిన కాసాజోల రేవతి, రెడ్డిపాలెంకు చెందిన రేష్మా, నిర్వాహకుడు శివనగర్‌కు చెందిన దోమల సంపత్, విటులు శివనగర్‌కు చెందిన రంజిత్‌కుమార్, వర్ధన్నపేట ఇల్లందుకు చెందిన బానోతు రాజును అరెస్టు చేసి మిల్స్‌కాలనీ పోలీసులకు అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు ఆర్.సంతోశ్, శ్రీనివాస్ జీ, ఎస్సై వడ్డెబోయిన లవన్‌కుమార్ పాల్గొన్నారు. చదవండి: ప్రేమ పెళ్లి, ఎవరితో మాట్లాడినా అనుమానం.. ఇంట్లో అందరూ నిద్రపోతుండగా.. -
లోటస్ బ్లిస్ స్పా పేరుతో వ్యభిచారం.. సుజాతపై ఇప్పటికే..
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. మసాజ్‌సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిసెప్షనిస్ట్ సచిన్, విటులు సతీష్, రాజ్‌కుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో నలుగురు యువతులను రక్షించారు. లోటస్ బ్లిస్ స్పా పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వివిధ వర్గాల వారిని తన బుట్టలో వేసుకుని చాలా రోజులుగా వ్యభిచారం సాగిస్తున్నట్లు నిర్వహకురాలు సుజాతపై ఆరోపణలు ఉన్నాయి. సుజాతపై గతంలో కూడా పలు సెక్షన్ల కింద మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. చదవండి: (థర్డ్‌వేవ్ ప్రారంభమైంది.. జనవరి చివరి నాటికి..) -
గుట్టుగా వ్యభిచారం.. ఇల్లు అద్దెకు తీసుకుని..
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ), ఎల్బీనగర్ పోలీసులు సంయుక్తంగా ఓ వ్యభిచార గృహంపై దాడి చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ టి.రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జి.వెంకటస్వామి అలియాస్ రవి (45), విజయవాడకు చెందిన బి. వరలక్ష్మి (30) కలిసి నాగోల్ జైపురి కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యువతులు, మహిళలకు డబ్బులు ఎరవేసి వారిని వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. హన్మకొండకు చెందిన విద్యార్థి కృష్ణ ప్రణవ్ (21) వీరిని ఫోన్లో సంప్రదించగా.. కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన ఇద్దరు మహిళలను నాగోల్‌లోని ఇంట్లో సిద్ధంగా ఉంచారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు వ్యభిచారం గృహంపై దాడి చేసి.. వరలక్ష్మి, కృష్ణ ప్రణవ్‌లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై పెటా చట్టం కింద కేసులు నమోదు చేశారు. వీరి నుంచి రూ.1200 నగదు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు వెంకటస్వామి పరారీలో ఉండగా, ఇద్దరు మహిళలను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. లాడ్జిలో ముగ్గురి అరెస్టు నాగోలు: ఎల్బీ నగర్ ఆర్టీసీ కాలనీలోని బాలాజీ గ్రాండ్ లాడ్జిపై ఎల్బీనగర్ పోలీసులు మంగళవారం దాడి చేశారు. లాడ్జిలోని రెండు రూమ్‌ల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న కర్ణాటకకు చెందిన శ్రీనివాస్ హనుమంతప్ప అలియస్ శ్రీను (30)ను, నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన జి.నరేష్‌తో పాటు ఓ యువతిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సెల్ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. -
గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. నిర్వాహకుల అరెస్టు
సాక్షి, మల్లాపూర్ (హైదరాబాద్): గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరితో పాటు మరో వ్యక్తిని రిమాండ్‌కు తరలించిన ఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నాచారం సావర్కర్‌నగర్ అపార్టుమెంట్‌లోని ఓ ఇంట్లో మగ్దూం అలీఖాన్ (44), మల్లికార్జున్ (55) ఇద్దరు అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్వోటీ, నాచారం పోలీసులు సోమవారం ఇంటిపై దాడి చేసి నిర్వాహకులతో పాటు ఓ విటుడిని రిమాండ్‌కు తరలించారు. చదవండి: పిచ్చోడి చేతికి ఫోన్.. మహిళా ఏఎస్సైకి అశ్లీల ఫోటోలు! ఏసీ ఓల్టేజీ కన్వర్టర్‌లో బంగారం స్మగ్లింగ్ శంషాబాద్: అక్రమంగా తరలించిన బంగారాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం ఎఫ్‌జెడ్–439 విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అతడి వద్ద ఉన్న ఏసీ వోల్టేజీ కన్వర్టర్‌ను పరిశీలించగా అందులో 316 గ్రాముల బంగారం బయటపడింది. బంగారం విలువ రూ.15.71 లక్షలుంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలతో వ్యభిచారం.. ఐదుగురు అరెస్టు
సాక్షి, పటాన్చెరు(మెదక్): విశ్వసనీయ సమాచాం మేరకు ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు చేసి ముగ్గురు నిర్వాహకులను, ఇద్దరు మహిళలను, అరెస్టుచేశారు. ఈ సంఘటన అమీన్పూర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ ప్రసాద్ తెలిపిన వివరాలు. జనగామ జిల్లా చిన్నరాంచెర్లకు చెందిన సాదుపల్లి శంకర్ ప్రసాద్,భార్య ప్రతిభ, బావమరిది దీపక్ కలిసి ఆరునెలల క్రితం అమీన్పూర్ మండల పరిధిలో మెట్రో న్క్లేవ్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. వైజాగ్ కు చెందిన ముష్కాన్ ఫాతిమా, అస్సాంకు చెందిన మొంజిల ఖాతూన్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అమీన్పూర్ పోలీసులు వ్యభిచార గృహంపై దాడిచేసి ముగ్గురు నిర్వాహకులను ఇద్దరు మహిళలను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. -
గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఇద్దరు అరెస్టు
సాక్షి, మైసూరు(కర్ణాటక) : మైసూరు నగరం, విజయనగర 2వ స్టేజ్‌లో ఉన్న ఒక ఇంటిలో వేశ్యావాటిక గృహంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు విటులను, ఒక నేపాలీ యువతిని పోలీసులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. కొంతకాలంగా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. ఈ క్రమంలో నిఘా ఉంచిన అధికారులు ఆకస్మికంగా దాడిచేశారు. కాగా, నిందితులనుంచి నాలుగు సెల్ఫోన్లు, రూ.1,18,500 స్వాధీనం చేసుకున్నారు. -
ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచార దందా.. ఇద్దరు అరెస్టు
సాక్షి, చిలకలగూడ (హైదరాబాద్): వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై దాడి చేసి నిర్వాహకులను అరెస్ట్ చేసిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లికి చెందిన రేచల్ సోఫియా (50) నెల రోజుల క్రితం బౌద్ధనగర్‌లోని కమ్యూనిటీహాల్ గల్లీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది. పద్మారావునగర్ ఏషియన్ వైన్స్‌లో పనిచేస్తున్న అప్పుల అనీల్ (26) సాయంతో అమ్మాయిలు, ఆంటీలను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం మధ్యాహ్నం వ్యభిచార గృహంపై దాడి చేసి ఓయువతి (23)కి విముక్తి కల్పించి, నిర్వాహకులు రేచల్ సోఫియా, అనీల్‌తోపాటు అత్తాపూర్‌కు చెందిన విటుడు శ్రీశైలం (40)ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులకు చెందిన మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీఐ నరేష్ తెలిపారు. చదవండి: అమ్మాయితో పరిచయం.. ప్రేమ.. పండుగకు ఇంటికి వచ్చి.. -
గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఇద్దరు మహిళలను రెడ్‌హ్యండెడ్‌గా
సాక్షి, జీడిమెట్ల: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సంజయ్ గాంధీనగర్‌కు చెందిన కటకం సాయి కుమార్ ఓ గదిని అద్దెకు తీసుకొని ఆర్థికంగా వెనుకబడి ఉన్న మహిళలను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు సాయికుమార్‌తో పాటు ఇద్దరు మహిళలను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం సాయికుమార్‌ను రిమాండ్‌కు పంపి మహిళలిద్దరిని రెస్క్యూ హోంకు తరలించారు. చదవండి: దీపావళి ఎఫెక్ట్.. బాణాసంచా పేలుస్తూ 31 మందికి గాయాలు -
సొంత చెల్లిని వ్యబిచారంలోకి దింపిన అక్క.. బాలికపై కన్నేసి!
రాంచీ: ఏడు నెలల క్రితం కనిపించకుండా పోయిన 17 ఏళ్ల అమ్మాయి విగతజీవిగా కనిపించింది. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న బాలిక మృతదేహాన్ని సోనార్ డ్యాం వద్ద ఝార్ఖండ్ పోలీసులు కోర్టు సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. కాగా బాలికను తోడబుట్టిన వారే కడతేర్చినట్లు పోలీసులు వెల్లడించారు.. మైనర్‌ను ఆమె అక్కలు రాఖీ దేవి(30), రూపా దేవి(25), బావ ధనుంజయ్ అగర్వాల్(30), రాఖీ లవర్స్ ప్రతాప్ కుమార్, నితిష్‌లు కలిసి హత్య చేసినట్లు తెలిపారు. నిందితుల్లో నితిష్ తప్ప మిగతా అందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం రాంచిలోని రిమ్స్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. చదవండి: జిమ్ ట్రైనర్ ప్రేమ విఫలం.. పెళ్లి చూపులకు వెళ్లాల్సి ఉండగా.. పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. బాలిక తలకు గాయాలు ఉన్నాయని తేలింది. అయితే మృతురాలి సోదరీలు మాత్రం బాలిక ఆత్మహత్య చేసుకొని మరణించినట్లు చెబుతున్నారు. పోలీసు అధికారి విజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఐదుగురు అక్కాచెల్లెల్లో ఈ బాలిక నాలుగో అమ్మాయి. తల్లిదండ్రులిద్దరూ మరణించడంతో అక్క రాఖీతో కలిసి ఉంటుంది. తన అక్క రాఖీ వ్యభిచారం నిర్వహిస్తుంది. చదవండి: ఎన్నో అనుమానాలు.. ‘మొహంపై గీతలు, రక్తం, కన్ను గుడ్డు లేదు’ రాఖీ, ధనంజయ్‌లు మైనర్‌ను బలవంతంగా వ్యభిచారంలోకి దింపారు. వారు ఆమె ఇష్టానికి విరుద్ధంగా కస్టమర్ల వద్దకు పంపేవారు. అయితే బాలిక ఒక అబ్బాయిని ప్రేమిస్తోంది. అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పగా వారు వ్యతిరేకించారు. ప్రతాప్, నితేష్ ఇద్దరూ బాలికపై కన్నేసి రాఖీ సాయంతో ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి యత్నించారు. ఈ క్రమంలో రాఖీ ఇంట్లో లేని సమయంలో హత్యకు రెండ్రోజులు ముందు ఆమె ఇంటికి వచ్చిన ప్రతాప్ ప్లాన్ ప్రకారం బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడి ఆమెను హత్య చేసి ఆమె శరీరాన్ని ఉరితీశాడు. అనంతరం ఈ విషయం రాఖీ, రూప, ధనంజయ్‌లకు తెలుపగా అందరూ కలిసి మృతదేహాన్ని ఆటోలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి పాతిపెట్టారు. -
గెస్ట్ హౌస్‌లో వ్యభిచారం.. ఇద్దరు విటులు, యువతుల అరెస్టు
సాక్షి, గోల్కొండ: వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ గెస్ట్ హౌస్‌పై గోల్కొండ పోలీసులు దాడి చేశారు. గెస్ట్‌హౌస్ వాచ్‌మెన్‌తో పాటు ఇద్దరు విటులను అరెస్టు చేశారు. గోల్కొండ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కిరణ్ అలియాస్ మున్నాభాయ్ షేక్‌పేట్ ఓయూ కాలనీలో ‘ఎంఎస్పీ గెస్ట్ ఇన్’గెస్ట్ హౌజ్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. గెస్ట్‌హౌజ్‌ను బాగా ఇంటీరియర్ డెకరేషన్ చేసి ఇంటి ముందు ఒక సెక్యూరిటీ గార్డును కూడా నియమించుకున్నాడు. కాగా ఇతర ప్రాంతాల నుంచి యువతులను తెచ్చి వ్యభిచారం నిర్వహించేవాడు. అయితే బుధవారం రాత్రి పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో ఇద్దరు యువతులు, ఇద్దరు విటులతో పాటు గెస్ట్‌హౌజ్ వాచ్మెన్ జనైనాజెమ్ ఉద్దీన్ మలిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడు మున్నాభాయ్ పరారీలో ఉన్నాడు. వాచ్‌మెన్‌తో పాటు పట్టుబడ్డ వి.శ్రీను, గొలుసుల శ్రీనివాస్‌లను రిమాండ్‌కు తరలించారు. పోలీసులు వారి నుంచి రూ.4వేల నగదు, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నాడు. వ్యభిచార ముఠా సభ్యులపై పీడీయాక్ట్ చైతన్యపురి: సులువుగా డబ్బు సంపాదన కోసం వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా సభ్యులపై సరూర్ నగర్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం.. బత్తుల మానస, వల్లపు మల్లికార్జున్, పోకల లింగయ్యలు ఒక ముఠాగా ఏర్పడి తెలుగు రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి వ్యభిచార గృహం నడుపుతున్నారు. సమాచారం అందుకున్న సరూర్‌నగర్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు వారం రోజుల క్రితం ఇంటిపై దాడి చేశారు. మానస, మల్లికాఖార్జులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న పోకల లింగయ్యను గురువారం అరెస్టు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముగ్గురు నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చదవండి: హైటెక్ సిటీ: విదేశీ యువతులతో వ్యభిచారం -
జూబ్లీహిల్స్ వ్యభిచార గృహంపై దాడి
జూబ్లీహిల్స్: వెల్నెస్ సెంటర్ ముసుగులో వ్యభిచార గృహం నడిపిస్తున్న నిర్వాహకురాలితో పాటు మరో ఇద్దరిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటగిరిలో నివాసం ఉంటున్న టమటం శైలజ(33) జూబ్లీహిల్స్ రోడ్ నెబర్ 25లో అవని వెల్నెస్ సెంటర్ నిర్వహిస్తున్నది. కొంత కాలంగా లొకాంటే వెబ్సైట్లో ప్రకటనలు ఇస్తూ యువతుల ఫొటోలతో వల వేస్తూ వ్యభిచారం చేయిస్తుంది. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు. దాడుల్లో ఇద్దరు విటులు రాజు రెడ్డి, అలీలు పట్టుబడ్డారు. వ్యభిచారం కోసం ఉత్తరాది నుంచి యువతులను తీసుకు వచ్చే శైలజ భర్త పరమేశ్వర్రావు పరారయ్యాడు. ఈ మేరకు నిర్వాహకురాలు శైలజపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు ఆమెతో పాటు ఇద్దరు విటులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
వేశ్యావాటిక గుట్టురట్టు
కర్ణాటక ,బనశంకరి: అధిక వేతనంతో కూడిన ఉద్యోగం ఇస్తామని నమ్మించి బయటి రాష్ట్రాల నుంచి యువతులను తీసుకువచ్చి వేశ్యవాటిక నిర్వహిస్తున్న వ్యక్తిని సోమవారం అరెస్ట్ చేసి ఆరుమంది యువతులను కాపాడామని సీసీబీ జాయింట్ కమిషనర్ సందీప్‌పాటిల్ తెలిపారు. సోమవారం నగరంలో మీడియాతో మాట్లాడారు. ఈజీపుర వీజీఎస్లేఔట్లో వేశ్యవాటిక దందా నిర్వహిస్తున్నట్లు సీసీబీ పోలీసులకు పక్కాసమాచారం అందింది. దీని ఆధారంగా సోమవారం సీసీబీ పోలీసులు వీజీఎస్ లేఔట్ రెండో అంతస్తులో నిర్వహిస్తున్న హువాన్ తై స్పాపై దాడిచేసి వేశ్యవాటిక నిర్వాహకుడు సూర్యను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.10,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ఫోన్లలో విటులను సంప్రదించి దందా నడిపేవారు. వేశ్యవాటిక దందాలో చిక్కుకున్న ఆరుమంది ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను రక్షించామని తెలిపారు. పరారీలో ఉన్న అబ్దూల్ముకీద్, గురురాజ్, ప్రజ్వల్ అనే ముగ్గురి కోసం గాలిస్తున్నామని వీరిపై వివేకనగరపోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు. -
వ్యభిచారగృహంపై దాడి
మీర్‌పేట: వ్యభిచార గృహంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి నిర్వాహకురాలితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న సంఘటన గురువారం మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీరమణ కాలనీకి చెందిన ప్రణయ నందిని (28) గత కొన్ని రోజులుగా తన ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తోంది. దీనిపై సమాచారం అందడంతో ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు గురువారం ఇంటిపై దాడి చేసి నిర్వాహకురాలు నందినితో పాటు మరో నిర్వాహకుడు బద్దం నిరంజన్, విటుడు సప్పిడి శ్రీకాంత్‌రెడ్డితో ఓ యువతిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 3,180 నగదు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని మీర్‌పేట పోలీసులకు అప్పగించారు. -
వ్యభిచార గృహంపై దాడి
సాక్షి, హైదరాబాద్: వ్యభిచారంపై పంజాగుట్ట పోలీసులు దాడులు నిర్వహించి నలుగురు యువతులు, ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎల్లారెడ్డిగూడలోని శ్రీతి నిలయం అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్‌లో వ్యభిచారం జరుగుతుందని సమాచారం అందడంతో ఎస్సై మహ్మద్ జాహిద్ ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. క్రైమ్ ఇన్స్పెక్టర్ నాగయ్య, ఆధ్వర్యంలో దాడులు నిర్వహించిన పోలీసులు నిర్వాహకులు భానుప్రకాష్, పవన్‌లతో పాటు నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిర్వాహకుడు కుమార్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిర్వాహకులను రిమాండ్ తరలించి, యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. -
చస్తావా... వ్యభిచారం చేస్తావా...
విజయనగరం టౌన్: అబుదాబి, దుబాయ్ వంటి దేశాల్లో జరిగే ఘోర అకృత్యాలను తలపించే మృగాడి దాష్టీకం జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది. వినడానికే జుగుప్స కలిగించే వేధింపులు, హింసలు ఇక్కడా మహిళలపై జరుగుతున్నాయని బయటపడటంతో జిల్లా ఒక్క సారిగా ఉలిక్కిపడింది. యువతులతో వ్యాపారం చేసే ఓ వ్యక్తి చేతిలో మోసపోయిన యువతి గర్భం ధరించిన కోలకత్తాకు చెందిన నిషా పిర్యాదుతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. స్పెషల్ బ్రాంచ్, వన్‌టౌన్ పోలీసులు తమదైన శైలిలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ప్రాంతాలకు వెళ్లి, రెడ్ హ్యాండెడ్‌గా వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి వన్‌టౌన్ ఎస్ఐ ఫక్రుద్దీన్ అందించిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక లంకాపట్నానికి చెందిన ఆటోడ్రైవర్ బంగారు చక్రధర్‌కు లీల అనే యువతితో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. వీరిద్దరూ కలిసి పట్టణంలోని ఉడాకాలనీ, వి.టి.అగ్రహారం, పూల్‌బాగ్ తదితర ప్రాంతాల్లో వ్యభిచార గృహాలను గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. అద్దెకున్న ఇళ్ల వద్ద బట్టల వ్యాపారం చేస్తున్నట్లు నటించి, ఆ మాటున వ్యభిచారం యధేచ్చగా సాగించారు. బట్టల కోసం కోలకత్తా అప్పుడప్పుడు వీరిద్దరూ వెళ్లేవారు. అక్కడ పరిచయమైన నిషాను తన వలలో వేసుకున్నాడు. వెళ్లి, వచ్చేటప్పుడల్లా తనతో ప్రేమాయణం సాగించేవాడు. అది ప్రేమగా మారి రోజూ ఫోన్లు చేసుకునేవారు, ఈలోగా తన పనిమీద ఆమె ఇటీవల శ్రీకాకుళం వచ్చింది. చక్రధర్ కూడా శ్రీకాకుళం వెళ్లాడు. ఆమెను పెళ్లిచేసుకుంటానని చక్రధర్ నమ్మించాడు. ఆ మాటలు నిషా నమ్మింది. మాయమాటలు చెప్పి విజయనగరంలోని ఉడాకాలనీలో గల ఒక ఇంటి వద్ద లక్ష్మి అనే మహిళను తోడుగా నిషాను ఉంచాడు. శారీరకంగా ఆమె వద్ద సుఖాలనుభవిస్తూ ఆమెను గర్భవతిని చేశాడు. ఆమె పెళ్లిచేసుకోవాలని చక్రధర్‌పై ఎంతగా ఒత్తిడి తీసుకువచ్చినా ఫలితం లేకపోవడంతో తానెలా బతకాలని నిలదీసింది. చక్రధర్ తన నిజస్వరూపం బయటపెట్టి కావాలంటే వ్యభిచారం చేసుకుని బతకమన్నాడు. నిశ్చేష్టురాలైన ఆమె పోలీసులను ఆశ్రయించింది. వన్‌టౌన్ ఎస్ఐ ఫక్రుద్దీన్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. చేసేది లేక పోలీసులకు పిర్యాదు తన బతుకు బుగ్గిపాలైందని, ఎందరో బతుకులు తీసేస్తున్నాడని, తన బతుకు ఏమైనా పర్వాలేదు కానీ, మరే ఆడపిల్ల బతుకు పాడవ్వకూడదనే ఉద్దేశంతో నేరుగా జిల్లా ఎస్పీ జి.పాలరాజును ఈ నెల మూడో తేదీన కలిసి తనగోడు వెళ్లబుచ్చుకుంది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు విటుల్లా నటించి చక్రధర్‌కు ఫోన్ చేసి అమ్మాయిలు కావాలని ఎరవేశారు. అలా వలలో చిక్కిన చక్రధర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అందులో మైనర్ బాలిక ఉండడంతో పోక్సో చట్టం కింద ఒక కేసు, అమ్మాయిని మోసం చేసిన దానిమీద మరో కేసు, వ్యభిచారంకింద మరో కేసు నమోదైంది. పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
మారని మృగాడు!
అనంతపురం న్యూసిటీ: కటకటాలకు వెళ్లొచ్చినా ఈ మృగాడిలో మార్పురాలేదు. పడుపు వృత్తినే ప్రవృత్తిగా మార్చుకుని సమాజంలో చెలామణి అవుతున్నాడన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. కూతురు వయసున్న అమ్మాయిలు కన్పిస్తే చాలు టక్కున వాలిపోయి వారి ఫోన్ నంబర్లను సేకరించి వ్యభిచార కూపంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. నగరపాలక సంస్థలో పనిచేసే ఈ ఉద్యోగి ఈ నెల 13న అనంతపురంలోని సాయినగర్‌లో ఓ అమ్మాయికి మాయమాటలు చెప్పి సెల్ నంబర్ సేకరించిన విషయం విదితమే. పదేళ్ల క్రితమే కేసు నమోదు నగరపాలక సంస్థలోని సదరు ఉద్యోగిపై పదేళ్ల క్రితమే వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. అమ్మాయిలను ట్రాప్ చేసే విషయంలో జైలు జీవితం అనుభవించాడు. 2007–08లో వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఓ గుర్తు తెలియని అమ్మాయిని వాహనంలో తీసుకెళ్తూ ఉండగా పోలీసులు నిఘా ఉంచి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. అప్పట్లో ఈ విషయం పెద్ద సంచలనమైంది. పోలీసులు ఆ ఉద్యోగితో బాధితురాలి కాళ్లు పట్టించారు. చివరకు రిమాండ్‌కు పంపారు. అప్పటి అ«ధికారులు ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు తలొగ్గి వదిలేశారు. దీన్ని అలుసుగా తీసుకుని ఆ ఉద్యోగి మళ్లీ అమ్మాయిలను ట్రాప్ చేసే పనిలో నిమగ్నమయ్యాడు. ఇంటెలిజెన్స్ పోలీసుల విచారణ సదరు ఉద్యోగిపై ఇంటెలిజెన్స్ పోలీసులు ఆదివారం ఆరా తీశారు. నగరపాలక సంస్థలో పని చేస్తున్న ఉద్యోగి అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న వైనం గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దీనిపై మరింత లోతుగా విచారణ చేసే దిశగా చర్యలు తీసుకోనున్నారు. కమిషనర్ విచారణ నగరపాలక సంస్థలోని ఉద్యోగిపై కమిషనర్ పీవీవీఎస్ మూర్తి విచారణకు ఆదేశించారు. సోమవారం ఉద్యోగిని తన ముందు హాజరుపర్చాలని కిందిస్థాయి అధికారులకు సూచించారు. దీనిపై ఉద్యోగుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. రెడ్‌కార్పెట్ నగరపాలక సంస్థ అధికారులు ఈ ఉద్యోగికి రెడ్‌కార్పెట్ వేస్తున్నారు. ఇతని జీతం నెలకు రూ.50 వేల పైమాటే. గత కొన్నేళ్లుగా ఈయన ఒక్క పనీ చేయడం లేదు. కాలక్షేపానికి ఆఫీసుకు వచ్చి వెళ్తుంటారు. ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో పని చేయాల్సి ఉన్నా..పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఏ ఒక్క పనిలోనూ ఇతని ప్రమేయం లేదంటే అధికార పార్టీ నేతల మద్దతు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. -
వ్యభిచారగృహంపై టాస్క్‌ఫోర్స్ దాడి
సాక్షి, సిటీబ్యూరో: పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువతులను సిటీకి తీసుకువచ్చి వ్యభిచారం దందా నిర్వహిస్తున్న వ్యక్తిని పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇతడితో పాటు ఓ విటుడినీ అరెస్టు చేసి ఓ యువతికి విముక్తి కల్పించినట్లు డీసీపీ రాధాకిషన్‌రావు గురువారం వెల్లడించారు. రాజమండ్రికి చెందిన రవికిరణ్ బతుకుతెరువు కోసం సిటీకి వలసవచ్చి కళ్యాణ్‌నగర్‌లో స్థిరపడ్డాడు. తొలినాళ్లల్లో కొన్ని ఉద్యోగాలు చేసినా అలా వచ్చే జీతంతో జల్సాలు చేయడం సాధ్యం కాలేదు. దీంతో తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వ్యభిచార నిర్వాహకుడిగా మారాడు. నెలకు రూ.15 వేల అద్దెకు ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నాడు. పశ్చిమ బెంగాల్ నుంచి యువతులను రప్పిస్తూ వారికి 15 రోజులకు రూ.70 వేల చొప్పున చెల్లించేవాడు. వీరితో పరియస్తులను పిలిపించి వ్యభిచార దందా నిర్వహిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలోని బృందం గురువారం దాడి చేసి రవికిరణ్‌తో పాటు విటుడు కృష్ణసాగర్‌ను అరెస్టు చేసింది. వీరి నుంచి రూ.10,500 నగదు తదితరా లు స్వాధీనం చేసుకుని ఓ బెంగాలీ యువతికి విముక్తి కల్పించారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును ఎస్సార్‌నగర్ పోలీసులకు అప్పగించారు. -
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
తెనాలిరూరల్: పట్టణంలోని సాలిపేటలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు బుధవారం తెల్లవారుజామున దాడి చేశారు. వ్యభిచార నిర్వాహకురాలు, ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు. వ్యభిచారం చేస్తున్న యువతిని స్వధార్ హోంకు తరలించారు. దీనికి సంబంధించి స్థానిక వన్‌టౌన్ సర్కిల్ కార్యాలయంలో సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మరీదు శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సాలిపేట అర్బన్ హెల్త్ సెంటర్ సమీపంలో టెలిఫోన్ ఎక్సే ్ఛంజ్ రోడ్డులో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో వన్‌టౌన్ పోలీసులు దాడులు నిర్వహించారు. వ్యభిచార గృహం నిర్వాహకురాలు చావలి హైమావతి, విటులు కొల్లూరు మండలం చిలుమూరుకు చెందిన తుమ్మపూడి సురేష్, బొండి వెంకట నాగేశ్వరరావు, వ్యభిచారం చేస్తున్న యువతి పట్టుబడ్డారు. యువతిని జేఎంజే స్వధార్ హోంకు తరలించారు. నిర్వాహకురాలు, విటులపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచారు. -
గుట్టుగా ‘హైటెక్’ వ్యభిచారం..!
సాక్షి, కడప అర్బన్/కార్పొరేషన్: కడప నగరశివార్లలోని రామాంజనేయపురం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. రామాంజనేయపురంలో గుట్టుచప్పుడు కాకుండా హైటెక్ వ్యభిచారం సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిరక్ష్యరాస్యులైన మహిళలకు అప్పులిచ్చి లొంగదీసుకొని ఈ రొంపిలోకి దించుతున్నట్లు సమాచారం. గతంలో మరియాపురంలో వ్యభిచార గృహం నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడినట్లు ఓమహిళ ఈ అసాంఘీక కార్య్రక్రమానికి తెరతీసింది. చెన్నై, ముంబయి ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పించి విటులను ఆకర్షిస్తున్నట్లు సమాచారం. ఆ మహిళా డాన్‌కు జిల్లా టీడీపీ నాయకులతో పాటు, స్థానిక పోలీసుల మద్దతు భారీగానే ఉంది. పెద్ద పెద్ద కార్లలో రాజకీయ నాయకులు, పోలీసులు, ఇతర నాయకులు వచ్చిపోతుంటారు. ఐదేళ్లుగా ఆమె ఇదే వ్యాపారం సాగిస్తూ చాపకింద నీరులా తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తోందని చెబుతున్నారు. పెద్ద పెద్ద వాళ్లు ఆమెను పలకరించి పోతుండటంతో స్థానికులెవ్వరూ ఆమెపై ఫిర్యాదు చేయడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొంది. అప్పుడప్పుడు నామమాత్రంగా తనిఖీలకు వచ్చిన పోలీసులను మామూళ్లతో మభ్యపెడుతున్నారు. ‘వీకెండ్ స్పెషల్’ పేరుతో ‘పెద్ద మనుషుల’ కోసం ప్రత్యేక బృందం గుట్టు చప్పుడు కాకుండా సహకారం అందిస్తున్నట్లు సమాచారం. వారికి కావాల్సిన సురక్షిత సరంజామాను కూడా యథేచ్చగా సరఫరా చేస్తున్నారనీ గట్టిగా వినిపిస్తోంది. ఇబ్బంది పడుతున్న స్థానికులు రాత్రిళ్లు వ్యభిచార గృహం అనుకొని ఇతరుల ఇళ్ల తలుపులు కొడుతుండటంతో స్తానికులు లోలోన ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ వ్యవహారంపై కొందరు జిల్లా ఉన్నతాధికారులకు పలు సార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోవట్లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ఈ వ్యవహారంపై ఎస్పీ దృష్టి పెట్టి అసాంఘీక కార్యకలాపాలను నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు. -
ప్రియుడి చేతిలో మోసపోయి..!
రాయచోటి: ఆమెను ప్రేమించిన వాడు పెళ్లి చేసుకుంటానని నమ్మంచి తీసుకొచ్చి మధ్యలోనే వదిలేశాడు. అటు ఇంటికి వెళ్లలేక.. ఇటు బయట ఎలా బతకాలో తెలియని పరిస్థితుల్లో వ్యభిచార కూపంలో ఇరుక్కుపోయింది. చివరకు పోలీసులకు పట్టుబడింది. ఆమె దయనీయ గాథను తెలుసుకున్న పోలీసులు ఆమెను తల్లిదండ్రుల వద్దకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. అర్బన్ సీఐ మహేశ్వర్‌రెడ్డి, బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి అక్కడి కృషి నగర్‌కు చెందిన మహేష్ అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలనుకున్నారు. అయితే ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నాడు. ఈ ఊరిలో ఉంటే మనల్ని పెళ్లి చేసుకోనీయరని నమ్మించి 2013వ సంవత్సరంలో ఆమెతో సహా కడపకు వచ్చాడు. అక్కడి ఆర్టీసీ బస్టాండ్‌లో వదిలిపెట్టి మళ్లీ వస్తానని చెప్పి పారిపోయాడు. ఈ పరిస్థితిలో పరువు పోతుందని ఆమె ఇంటికి వెళ్లలేకపోయింది. ఆమె తండ్రి, సోదరులు అక్కడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదుచేశారు. అప్పటినుంచీ అటు పోలీసులతో పాటు ఇటు కుటుంబసభ్యులు కూడా వెతికి ఫలితం లేదని వదిలేశారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండ్ లో మునీరు అనే మహిళతో ఆ యువతికి అపట్లో పరిచయమైంది. తనతో వస్తే జీవనోపాధి చూపిస్తానని నమ్మించి తన ఇంటికి తీసుకెళ్లి వ్యభిచార ఊబిలోకి దింపింది. శుక్రవారం రాత్రి ఆమె రాయచోటి ఎస్ఎన్ కాలనీలోని ఓ వ్యభిచార గృహంలో పోలీసులకు పట్టుబడింది. వృభిచార గృహ నిర్వాహకురాలు మునీరులో పాటు మరో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. యువతి ఫ్యామిలీకి సమాచారం అందించడంతో ఆమె సోదరులు శనివారం రాయచోటికి వచ్చారు. దాదాపు మూడేళ్ల తర్వాత తమ సోదరి కనిపించిందని వారు ఎంతో సంతోషించారు. అయితే ఇలా వ్యభిచార గృహంలో పోలీసుల చేతికి చిక్కడం వారికి ఒకింత బాధ కలిగించింది. -
వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి
మంత్రాలయం : కర్నూలు జిల్లాలో వ్యభిచార గృహాలపై బుధవారం పోలీసులు దాడులు నిర్వహించారు. మంత్రాలయంలోని ఓ లాడ్జీలో వ్యభిచారం జరుగుతుందనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులను , ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిపై కేసు నమోదు చేశారు. లాడ్జీ నిర్వహకులను విచారిస్తున్నారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వ్యభిచార గృహంపై దాడి.. నలుగురి అరెస్ట్
నేరేడ్మెట్ (హైదరాబాద్): వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై నేరేడ్మెట్ పోలీసులు దాడి చేసి నిర్వాహకురాలితో పాటు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రామకృష్ణాపురంలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న నేరేడ్మెట్ పోలీసులు సోమవారం ఆ ఇంటిపై దాడి చేసి నిర్వహకురాలితో పాటు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి నుంచి ఎనిమిది సెల్ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు, రూ.3,190 నగదును స్వాధీనం చేసుకున్నారు. -
వ్యభిచార గృహంపై దాడి: ముగ్గురి అరెస్టు
జీడిమెట్ల: పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేసి ఇద్దరు మహిళలతో పాటు ఓ నిర్వాహకుడిని అరెస్టు చేశారు. ఎస్సై రాములు తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారం డివిజన్ లాల్ సాహెబ్‌గూడలో జీడిమెట్లకు చెందిన సుల్తాన్(48) అనే వ్యక్తి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు శనివారం వ్యభిచార గృహంపై దాడిచేసి ఇద్దరు మహిళలతో పాటు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మహిళలను పోలీసులు రెస్క్యూహోంకు తరలించారు. -
వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి
-
వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి
కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాలలో వ్యభిచార గృహాలపై సోమవారం ఉదయం పోలీసులు దాడులు నిర్వహించారు. వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగారు. ఈ దాడుల్లో 18 మంది యువతులు, 14 మంది విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తిరువళ్లూరులో కాల్‌గర్ల్స్
ఆధ్యాత్మిక కేంద్రమైన తిరువళ్లూరులో కాల్ గర్ల్స్ కల్చర్ వేగంగా విస్తరిస్తోంది. తిరువళ్లూరులోని శ్రీ వీరరాఘవస్వామి ఆలయం దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి అమావాస్యకు వేలాది మంది భక్తులు స్వామి వారి దర్శనం కోసం వస్తుంటారు. దీంతో ఇక్కడ వ్యభిచార కూపాలు విస్తరిస్తున్నాయి. దీనికి నిదర్శనంగా శుక్రవారం రాత్రి ఏడుగురు వ్యభిచార నిర్వాహకులు పట్టుబడ్డారు. పది మందికిపైగా ఆంధ్రాకు చెందిన బాలికలు విముక్తి పొందారు. తిరువళ్లూరు : తిరువళ్లూరు సమీపంలోని కాకలూరు వద్ద వ్యభిచారం నిర్వహిస్తున్న వేపంబట్టుకు చెందిన ప్రియా, తిరుపతికి చెందిన మహాలక్ష్మి, నెల్లూరుకు చెందిన రమాదేవితోపాటు మరో నలుగురు బ్రోకర్లను పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. పోలీసుల విచారణ లో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. బ్రోకర్లు పేదరికంలో ఉన్న బాలికలపై దృష్టి పెడతారు. ఆ తరువాత వారికి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి తిరువళ్లూరుకు రప్పించి వ్యభిచార కూపంలో దింపుతున్నట్టు విచారణలో తేలింది. రెండువారాల నుంచి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో పది మంది బాలికలు ఈ కూపం నుంచి బయటపడగా, వీరందరూ ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే కావడం గమనార్హం. డీఎస్పీ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో సరైన ఉపాధి లేకపోవడం వలన, ఉద్యోగం ఆశ చూపి 15 నుంచి 17 ఏళ్ల బాలికలను వ్యభిచార కూపంలోకి దింపుతున్నట్లు గుర్తించామన్నారు. వీరికి రోజుకు రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఇస్తున్నారు. అయితే వీరిని అడ్డంగా పెట్టుకుని వ్యభిచార గృహ నిర్వాహకులు లక్షల్లో సంపాదిస్తున్నారని వివరించారు. బాలికలను వ్యభిచార కూపంలో దింపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన డీఎస్పీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి బాలికలను అక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన సూచించారు. -
వ్యభిచార గృహంపై పోలీసులు దాడి
రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో వ్యభిచార గృహాంపై పోలీసులు గురువారం ఆకస్మిక దాడి చేశారు. ఆరుగురు యువతులతోపాటు ఓ విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఓ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విటుడిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరుగురు యువతలను నగరంలోని పునరావాస కేంద్రానికి తరలించారు. ఘట్కేసర్లోని ఓ గృహంలో వ్యభిచారం జరుగుతుందని పోలీసులు సమాచారం అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ గృహంపై పోలీసులు దాడి చేశారు. -
వ్యభిచార గృహంపై దాడి
హైదరాబాద్: ఓ వ్యభిచార గృహంపై బాలానగర్ పోలీసులు దాడిచేసి వ్యభిచారానికి పాల్పడుతున్న ఇద్దరు, నిర్వాహకురాలు, బ్రోకర్లను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ మోహన్‌రెడ్డి తెలిపిన మేరకు..ఐడీపీఎల్ సౌభాగ్యనగర్‌లో ఓ అపార్టుమెంట్లో జ్యోతి వ్యభిచారం నిర్వహిస్తుంది. బ్రోకర్ రాజు సహయంతో విటులను ఆక ర్షించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు మంగళవారం రాత్రి ఆ ఫ్లాట్‌పై దాడిచేశారు. వ్యభిచారిని ప్రియా, విటుడు దుర్గాప్రసాద్, నిర్వాహకురాలు జ్యోతి, బ్రోకర్ రాజులను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.