
సాక్షి, ఉప్పల్: వ్యభిచార నిర్వాహకురాలిని ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఉప్పల్ ఎస్సై మధుసూదన్ తెలిపిన మేరకు.. ఉప్పల్ ఆదర్శ్‌నగర్‌లో ఉంటున్న కుర్రి అరుణ అలియాస్ అరుణారెడ్డి (36) ఇంట్లో ఒంటరిగా ఉంటూ వ్యభిచారం నిర్వహిస్తుందన్న సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో సోదాలు నిర్వహించి ఒక సెల్‌ఫోన్, కండోమ్ ప్యాకెట్లు, నగదును స్వాదీనం చేసుకొని నిందితురాలిని రిమాండ్‌కు తరలించారు.
చదవండి: భార్య, బావమరిది పేర్లతో పే రోల్స్.. ఉద్యోగం మానేయడంతో అసలు విషయం బయటకు
Comments
Please login to add a commentAdd a comment