Uppal
-
పుట్టిన రోజే.. ఆఖరి రోజు.. అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి
వాషింగ్టన్ డీసీ : పుట్టిన రోజును సంతోషంగా స్నేహితులతో జరుపుకొంటూ.. అంతలోనే పుట్టిన ఓ సరదా అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి ప్రాణం తీసింది. ఈ ఘటనలో విద్యార్థి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులను శోఖ సంద్రంలో ముంచింది. కండ్ల ముందే స్నేహితుడు ప్రాణ కోల్పోవడంతో పక్కనే ఉన్న స్నేహితులు ఏమీ చేయలేని స్థితిలో గుండెలవిసేలా రోదించారు. దీంతో ఉప్పల్ కళ్యాణ్ పురిలో విషాదఛాయలు అలుముకున్నాయి. అమెరికా పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.ఉప్పల్ కళ్యాణ్ పురికి చెందిన ఆర్యన్ రెడ్డి(23) అమెరికాలోని జోర్జియా స్టేట్ అట్లాంటా పట్టణంలో ఎమ్మెస్ చదువుతున్నాడు. అయితే ఈ క్రమంలో నవంబర్ 13న అతని పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే అదే రోజు తన వద్ద ఉన్న తుపాకీని క్లీన్ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో తుపాకీ మిస్‌ఫైర్ అయి ఆర్యన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్లు అమెరికా పోలీసులు వెల్లడించారు. ఇవాళ రాత్రి ఆర్యన్ రెడ్డి మృతదేహాన్ని తరలించనున్నారు. -
తొమ్మిదో అంతస్తు నుంచి దూకి టెకీ ఆత్మహత్య
సాక్షి,హైదరాబాద్:సాఫ్ట్వేర్ ఉద్యోగిని హరిత హైదరాబాద్ నగరం ఉప్పల్‌లోని బహుళ అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సోమవారం(అక్టోబర్21) అర్ధరాత్రి ఉప్పల్ డీఎస్ఎల్ మాల్ పక్కన ఉన్న ఐటీ కంపెనీ భవనం తొమ్మిదవ అంతస్తు నుంచి దూకడంతో ఆమెను చికిత్స కోసం రామంతాపూర్‌లోని మ్యాట్రిక్స్ ఆస్పత్రికి తరలించారు.అయితే ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే హరిత మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. ఐటీ ఉద్యోగిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: పెళ్లి చేయడం లేదని తండ్రి హత్య -
HCA: అజారుద్దీన్‌కు ఈడీ సమన్లు
టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. హెచ్‌సీఏలో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదు అందిన నేపథ్యంలో సమన్లు ఇచ్చింది. కాగా అంతర్జాతీయ క్రికెట్లో 1984- 2000 వరకు అజారుద్దీన్ టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.తన కెరీర్లో మొత్తంగా 99 టెస్టులు, 334 వన్డేలు ఆడిన ఈ హైదరాబాదీ.. సంప్రదాయ క్రికెట్లో 6215, యాభై ఓవర్ల ఫార్మాట్లో 9378 పరుగులు సాధించాడు. విజయవంతమైన బ్యాటర్‌గా పేరొందిన అజారుద్దీన్ కెప్టెన్‌గానూ సేవలు అందించాడు. అయితే, ఫిక్సింగ్ ఆరోపణలతో అతడి కీర్తిప్రతిష్టలు మసకబారగా.. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.ఈ క్రమంలో 2020 - 2023 మధ్యలో హెచ్‌సీఏలో దాదాపు రూ. 3.8 కోట్ల మేర అక్రమాలు జరిగాయంటూ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. విచారణలో భాగంగా.. క్రికెట్ బాల్స్ కొనుగోలు, జిమ్ ఎక్విప్మెంట్, ఫైర్ ఎక్విప్మెంట్, బకెట్ చైర్స్ కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు గుర్తించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్‌కు ఈడీ తాజాగా నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో అజారుద్దీన్ ఇప్పటికే ముందస్తు బెయిల్ పొందాడు. -
తెలంగాణలో కొత్త లైన్, ఉప్పల్ స్టేషన్.. రైల్వే మంత్రికి బండి సంజయ్ లేఖ
సాక్షి, ఢిల్లీ: కరీంనగర్–హసన్‌పర్తి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు పూర్తి నివేదిక (డీపీఆర్) సిద్ధమైనందున నిర్మాణ పనులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి బండి సంజయ్..రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. ఈ మేరకు ఢిల్లీలో రైల్వే మంత్రిని కలిసి బండి సంజయ్ లేఖ ఇచ్చారు.ఈ సందర్భంగా బండి సంజయ్ లేఖలో..‘కరీంనగర్ నుండి హసన్‌పర్తి వరకు 61.8 కి.మీల మేరకు నిర్మించే కొత్త రైల్వే లైన్‌కు రూ.1415 కోట్లు వ్యయం అవుతుంది. ఈ మేరకు డీపీఆర్ కూడా సిద్ధమైందని తెలిపారు. రైల్వే బోర్డులో ఈ అంశం పెండింగ్‌లో ఉందని, తక్షణమే ఆమోదం తెలపాలని కోరారు. కొత్త రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని, కరీంనగర్–వరంగల్ మధ్య వాణిజ్య కనెక్టివిటీ పెరిగి ఆర్దిక వృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.దీంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్ రైల్వే స్టేషన్‌ను అప్ గ్రేడ్ చేయాలని, జమ్మికుంట స్టేషన్ వద్ద దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ మరో లేఖ అందజేశారు. ఉప్పల్ స్టేషన్ అప్ గ్రేడ్‌లో భాగంగా ప్లాట్ ఫాం, రైల్వే స్టేషన్ భవనాన్ని ఆధునీకరించాలని, కొత్త రైల్వే సేవలను ప్రవేశపెట్టాలని కోరారు. ప్రయాణీకుల రాకపోకలకు సంబంధించిన సౌకర్యాలను మెరుగుపర్చాలని, పార్కింగ్‌ను విస్తరించాలన్నారు. అలాగే, సోలార్ ప్యానల్స్‌ను కూడా అమర్చాలని, టిక్కెట్ కౌంటర్, లగేజీ నిర్వహణ వ్యవస్థను మెరుగుపర్చాలని లేఖలో పేర్కొన్నారు. ప్రజలకు ఎంతో మేలు కలిగించే ఉప్పల్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు సంబంధించి నిధులను వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఇది కూడా చదవండి: ఎందుకీ హైడ్రామాలు.. బండి సంజయ్ ఫైర్ -
హబ్సిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం.. 6వ తరగతి విద్యార్థిని మృతి
సాక్షి, హైదరాబాద్: హబ్సిగూడలో గురువారం విషాదం చోటు చేసుకుంది. లారీ ఢీకొట్టడంతో పాఠశాల విద్యార్థిని మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు.. గురువారం సాయంత్రం జూన్సన్ గ్రామర్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న కామేశ్వరి.. పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో లారీ ఢీకొంది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు.ప్రమాదంతో అప్రమత్తమైన వాహనదారులు బాలికను ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ బాలిక మరణించింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.కొద్దిరోజుల క్రితంమరోవైపు హబ్సిగూడా ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఇదే ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురై పదో తరగతి విద్యార్థిని మృతి చెందింది.ఆగస్ట్ 17, శనివారం ఉదయం హబ్సిగూడలోని గౌతమ్ మోడల్ స్కూల్లో పదో తరగతి విద్యార్థిని సాత్విక ఎప్పటిలాగే ఉదయం 7 గంటలకు ఆటోలో స్కూల్‌కు బయలుదేరింది. హబ్సిగూడ చౌరస్తాలో సిగ్నల్ పడి ఉండటంతో ఆర్టీసీ బస్సు వెనకాల ఆటోను ఆపి ఉంచాడు డ్రైవర్. ఈ క్రమంలో మితిమీరిన వేగంలో వెనక నుంచి దూసుకువచ్చిన ఓవర్ లోడ్‌తో ఉన్న టస్కర్ (18 చక్రాల లారీ) వాహనం ఆటోను ఢీకొట్టింది. దీంతో స్వాతిక ప్రయాణిస్తున్న ఆటో ముందున్న ఆర్టీసీ బస్సు కిందకు చొచ్చుకెళ్లింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ ఎల్లయ్య తీవ్రంగా గాయపడగా..సాత్విక ప్రాణాలు కోల్పోయింది. ఇలా వరుస ప్రమాదాలతో ఉన్నత విద్యాసంస్థలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న హబ్సిగుడాలో వరుస రోడ్డు ప్రమాదాలు విద్యార్థులు,వారి తల్లిదండ్రుల్ని కలవరానికి గురి చేస్తున్నాయి. -
ఎట్టకేలకు స్పందించారు
‘ఎన్నాళ్లీ నరకం’ శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన కథనానికి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. వరంగల్ జాతీయ రహదారిపై అసంపూర్తి దశలో నిలిచిపోయిన ఉప్పల్– నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, అధికారులతో కలిసి ఫ్లై ఓవర్ నిర్మాణంపై అక్కడికక్కడే సమీక్షించారు. ఈ సందర్భంగా వరంగల్ రహదారిపై భారీగా ట్రాఫిక్‌జాం ఏర్పడింది. Uppal - Narapally Flyover: ఎన్నాళ్లీ నరకం? -
Uppal - Narapally Flyover: ఎన్నాళ్లీ నరకం?
ప్రత్యక్ష నరకం మీరెప్పుడైనా చవిచూశారా? అయితే.. ఉప్పల్– నారపల్లి రహదారిలో ప్రయాణించండి నరకం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఆరేళ్లుగా వాహనదారులు, ప్రయాణికులు, స్థానికులు, వ్యాపారులు తిప్పలు పడుతూనే ఉన్నారు. వరంగల్ జాతీయ రహదారిలో ఉప్పల్– నారపల్లి మధ్య 6.2 కిలో మీటర్ల మేర చేపట్టిన కారిడార్ ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ పనులు అర్ధాంతరంగా ఆగిపోవడంతో నిత్యం నరకాన్ని అనుభవించాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దుమ్మూ ధూళి.. బురద.. కంకర తేలి గుంతలు ఏర్పడి.. వానొస్తే రోడ్డుపై కుంటలను తలపిస్తున్నాయి. ఎక్కడ గొయ్యి ఉందో తెలియక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుర్గతి పట్టింది. ఆరేళ్లుగా ఈ దురావస్థతోనే ప్రజలు కాలం వెళ్లబుచ్చుతుండటం శాపంలా పరిణమించింది. ఎంతటి దయనీయ పరిస్థితి దాపురించిందో ప్రజాప్రతినిధులు అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. తమ గోడు ఎవరితో చెప్పుకోవాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ఉప్పల్ ఫ్లై ఓవర్ నిర్మాణ బాధితులు. ఇప్పటికైనా ఏళ్లుగా పడుతున్న నరకం నుంచి తమను గట్టెక్కించాలని వేడుకొంటున్నారు. ఉప్పల్: వరంగల్ జాతీయ రహదారిలో ఉప్పల్ నుంచి నారపల్లి వరకు 6.2 కిలో మీటర్ల మేర 148 పిల్లర్లతో ఫ్లై ఓవర్ పనులకు అప్పటి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ.625 కోట్లు. 2018 జులైలో ప్రారంభమైన పనులు 2020 జూన్‌లో పూర్తి కావాలి. కానీ.. పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో 6.2 కి.మీ మేర రోడ్డంతా గుంతలమయంగా మారింది. దీంతో ప్రజలు, వాహనదారులు నిత్యం ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. ఈ రహదారిలో నిమిషానికి దాదాపు 960 నుంచి 1000 వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఉప్పల్ కూడా ఒకటి. దీంతో రోడ్డు సరిగా లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అనేక మంది అమాయకులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు సైతం కోల్పోయిన ఘటనలున్నాయి. అభివృద్ధి శరవేగం.. ఇటు అధ్వానం..ఉప్పల్ నుంచి నల్ల చెరువు వరకు రోడ్డుకు ఇరు వైపులా ఉన్న వర్తక, వాణిజ్య దుకాణాలు రోడ్డు వెడల్పు పనులతో తీవ్రంగా నష్టపోయాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నల్ల చెరువు వరకు రోడ్డుకు ఇరువైపులా 450 షాపులు ఉన్నాయి. ఫ్లై ఓవర్ నిర్మాణంతో రోడ్డు సరిగా లేని కారణంగా వ్యాపారాలు పూర్తిగా దెబ్బ తిన్నాయని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల జాబితాల్లో ఉప్పల్ మొదటి స్థానంలో ఉంది. ఒకవైపు మెట్రో రైలు.. మినీ శిల్పారామం, స్కైవాక్ వంతెన, ఉప్పల్ టు నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. ఇలా ఎటు చూసినా అన్నివిధాలా ఉప్పల్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కానీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల్లో జాప్యంతో ఇక్కడి ప్రజలు, వాహనదారులు, వ్యాపారులు ఆరేళ్లుగా నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. కేవలం రెండేళ్లలో పూర్తి కావాల్సిన నిర్మాణానికి అనేక అడ్డంకులు రావడంతో పనులు నిలిచి పోయాయి. దీంతో ఇక్కడి ప్రజలకు ఎదురు చూపులే మిగిలాయి. కాంట్రాక్టు రద్దు చేశారా? ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల కాంట్రాక్టును గాయత్రీ కన్స్ట్రక్షన్స్ సంస్థ దక్కించుకున్న విషయం విదితమే. కానీ.. పనుల్లో తీవ్ర జాప్యం కారణంగా సదరు సంస్థ గడువులోగా పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో సదరు కాంట్రాక్టును ప్రభుత్వం రద్దు చేసినట్లు ప్రకటించింది. మరో సంస్థకు మిగిలిన పనులను అప్పగించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.బిజినెస్ నిల్.. వరంగల్ జాతీయ రహదారి ఉప్పల్ మార్గంలో స్టేషనరీ, వస్త్ర, వాణిజ్య షాపులు, పూజా సామగ్రి, కిరాణా, ఆటోమొబైల్, ఫర్నిచర్, స్వీట్ దుకాణాలు, హోటళ్లు తదితర అనేక వ్యాపారాలు మనుగడ పొందుతున్నాయి. కాగా.. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల కారణంగా దుమ్మూ ధూళితో వ్యాపారాలు దెబ్బ తిన్నాయి. రోడ్లు వేయక పోవడం, విద్యుత్ స్తంభాలను మార్చకపోవడం, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచక పోవడంతో వందలాది మంది వ్యాపారులు అవస్థలు పడుతున్నట్లు వర్తక సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆరేళ్లుగా వ్యాపారాలు నిల్.. కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభించినప్పటి నుంచి రోడ్లు లేక దుమ్ము కొట్టుకుపోవడంతో గిరాకీ లేక అవస్థలు పడుతున్నాం. 90 శాతం గిరాకులు దెబ్బతిన్నాయి. వ్యాపారులమంతా తీవ్రంగా నష్టపోయాం. – శేఖర్ సింగ్, ఉప్పల్ వర్తక సంఘం ప్రతినిధి రోడ్డుపైకి రావాలంటే సాహసం చేయాల్సిందే.. ఉప్పల్ రోడ్డు మీదకు రావాలంటే సాహసం చేయాల్సి వస్తోంది. ఏళ్లుగా పాడైపోయిన రోడ్ల మీద వాహనం నడిపి ఆరోగ్యం పోగొట్టుకోవాల్సి వస్తోంది. ఎవరికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండాపోయింది. మా బాధలను పట్టించుకునే వారే లేకుండాపోయారు. స్కూల్ పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. – శ్రీనివాస్ గౌడ్, స్కూల్ కరస్పాండెంట్గత ప్రభుత్వ అశ్రద్ధతోనే.. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అశ్రద్ధ వల్లనే రోడ్డు ఎటూ కాకుండా పోయింది. ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పని చేయాలి. కాని పారీ్టలను దృష్టిలో పెట్టుకుని కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరితగతిన ముందుకు వచ్చి నిర్ణయం తీసుకోవాలి. – మేకల శివారెడ్డి, ఉప్పల్ పట్టణ మున్సిపల్ మాజీ చైర్మన్ -
హైదరాబాద్ లో పిల్లర్ పక్కనే కుంగిపోయిన భూమి
-
ఇన్‌స్టా రీల్స్ చేస్తోందన్న కోపంతో భార్యను..!
ఉప్పల్: ఫోన్లో నిత్యం రీల్స్ చూస్తోందని.. ఇన్‌స్టాలో, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉందని భార్యపై కక్షగట్టిన ఓ భర్త.. ఆమెను చంపేసి పరారైన కేసును ఉప్పల్ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. శనివారం ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ చక్రపాణి వివరాలను వెల్లడించారు. ఈ నెల 12న ఉప్పల్ న్యూభరత్నగర్లోని ఓ ఇంట్లోంచి దుర్వాసన వస్తోందని స్థానికులు డయల్ 100కు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి వచ్చి చూడగా ఓ గోనే సంచిలో కుళ్లిపోయిన స్థితిలో ఓ మహిళ మృతదేహం కనిపించింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రదీప్ బోలా, మధుస్మిత (28) దంపతులు ఆరు నెలలుగా ఉప్పల్ న్యూ భరత్‌నగర్‌లో ఉంటున్నారు. వీరికి కేన్సర్‌తో బాధపడుతున్న 8 నెలల కూతురు ఉంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగు తున్నాయి. ఇంటికి వచ్చిన భర్త ప్రదీప్‌ను మధుస్మిత పట్టించుకోకపోవడం, పలకరించకపోవడం.. ఎప్పుడు చూసినా ఫోన్లో రీల్స్ చూస్తూ ఉండేది. మధుస్మిత నిత్యం వేరే వాళ్లతో ఫోన్ మాట్లాడేదని, దీంతో ఆమెపై అనుమానంతో ఈ నెల 7న రొట్టెల పీటతో కొట్టి చంపేశాడు. 8 నెలల కూతురును వెంట తీసుకుని సికింద్రాబాద్‌కు రైల్వేస్టేషన్‌కు వెళ్లాడు. తన కూతురును కాస్త చూస్తూ ఉండండని పక్కవాళ్లకు చెప్పి ప్రదీప్ అక్కడి నుంచి పరారయ్యాడు. అతడు బేగంపేట్‌లోని ఓ హోటల్ పని చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో శనివారం ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి ఆధ్వర్యంలో నిందితుడు ప్రదీప్ బోలాను పట్టుకున్నారు. భార్య తనను పట్టించుకోకపోయేదని, రోజంతా ఫోన్లో రీల్స్ చూస్తుండట.. రీల్స్ చేస్తుండటం.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటంతో అనుమానం పెంచుకుని భార్యను చంపినట్లు విచారణంలో తేలిందని పోలీసులు చెప్పారు. కేసు మిస్టరీని ఛేదించిన సీఐ ఎలక్షన్ రెడ్డి, స్పెషల్ టీమ్ బృందాన్ని ఏసీపీ అభినందించారు. -
సీఎం రేవంత్‌రెడ్డి.. దీనికి ఏం సమాధానం చెప్తారు?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కరెంట్ కోతల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమ ర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి కరెంట్ కోతలు లేవుని, 24 గంటలు నాణ్యమైన కరెంట్‌ను తమ ప్రభుత్వం సరాఫరా చేస్తుందని చెప్పారు. అలా చెప్పి 24 గంటలు కూడా కాకముందే ప్రజలు కరెంట్ కోసం రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారని ‘ఎక్స్’ వేదికగా ఫైర్ అయ్యారు.CM Revanth says NO power cuts & 24 Hour uninterrupted, quality power is being supplied Why are these people protesting at Substation ? https://t.co/xlAK3PDFcA— KTR (@KTRBRS) June 3, 2024 హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో రాత్రి కరెంట్ లేక సబ్ స్టేషన్ ముందు ప్రజలు ధర్నాలు చేశారని తెలిపారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు? అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వీడియో షోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
Hyderabad: కట్టుకున్నోడే కడతేర్చాడు..
హైదరాబాద్: ఉప్పల్ ఎస్బీఐ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్నోడే కాలయముడయ్యాడు. భర్తపై ఉన్న అనుమానంతో ప్రశి్నంచినందుకు అర్దరాత్రి భార్య గొంతుపై కాలు పెట్టి తొక్కి అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడో కిరాతకుడు. ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జనగాం లింగంపల్లి ప్రాంతానికి చెందిన భూక్యా రమేశ్, కొండాపూర్ దుబ్బ తండాకు చెందిన భూక్యా కమలకు 2016లో వివాహం జరిగింది. బతుకు దెరువుకోసం నగరానికి వచ్చి ఉప్పల్ ఎస్బీఐ కాలనీలో ఉంటున్నారు.వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వేసవి సెలవులు కావడంతో పిల్లలు నానమ్మ ఇంటికి వెళ్లారు. కాగా గత కొంత కాలంగా భర్త రమేష్ వ్యవహారం అనుమానాస్పదంగా కనిపించడంతో.. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కమల అనుమానించింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు నిలదీసి పంచాయితీ పెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం భార్యా భర్తల మధ్య గొడవ మొదలయింది. అనంతరం ఇద్దరు కలిసి ఇంటికి తాళం పెట్టి బయటకు వెళ్లి తిరిగి సాయంత్రం వచ్చారు. రాత్రి వీరిద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగి..రమేశ్ భార్య తలపై కొట్టడంతో కింద పడిపోయింది. వెంటనే ఆమె గొంతు మీద కాలు పెట్టి తొక్కి..చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కమల హత్య వార్త తెలుసుకున్న కుంటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం ఉదయం ఉప్పల్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. -
కొడితే ఫోర్లు, సిక్సర్లే!.. ఓడిపోతే అందరూ అనేవాళ్లే!
‘‘నాకసలు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. టీవీలోనే ఇలాంటి బ్యాటింగ్ చూశాం. కానీ ఇప్పుడిలా.. అస్సలు నమ్మలేకపోతున్నాం. ప్రతి బంతి బౌండరీ లేదంటే సిక్సర్.వారి నైపుణ్యాలకు హ్యాట్సాఫ్. సిక్స్‌లు కొట్టేందుకు వాళ్లు పడిన శ్రమ ఇక్కడ కనిపిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో అసలు పిచ్ ఎలా ఉంటుందో అంచనా వేసే ఛాన్స్ కూడా వాళ్లు మాకివ్వలేదు.మొదటి బంతి నుంచే వారి దూకుడు కొనసాగగా.. మేము ఏ దశలోనూ అడ్డుకట్ట వేయలేకపోయాం. జట్టు ఓడిపోయినట్లయితే.. మనం తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూనే ఉంటారు.మేము కనీసం ఇంకో 40- 50 పరుగులు చేయాల్సింది. పవర్ ప్లేలో వికెట్లు కోల్పోయిన తర్వాత అస్సలు కోలుకోలేకపోయాం. ఆయుశ్, నిక్కీ అద్భుతంగా బ్యాటింగ్ చేసినందు వల్లే 166 టార్గెట్ విధించగలిగాం’’ అని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు.ఒకవేళ తాము 240 పరుగులు చేసినా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆ లక్ష్యాన్ని ఛేదించేదేనేమో అంటూ ప్రశంసలు కురిపించాడు. కాగా ఐపీఎల్-2024 తాజా మ్యాచ్‌లో లక్నో సన్‌రైజర్స్‌తో తలపడింది.టాపార్డర్ పూర్తిగా విఫలం ఉప్పల్‌లో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో తొలుత బ్యాటింగ్ చేసి.. పరుగులు రాబట్టేందుకు ఆపసోపాలు పడింది. ఓపెనర్, కెప్టెన్ కేఎల్ రాహుల్(29) సహా టాపార్డర్‌లో క్వింటన్ డికాక్(2), మార్కస్ స్టొయినిస్(3) పూర్తిగా విఫలమయ్యారు.నాలుగో నంబర్ బ్యాటర్ కృనాల్ పాండ్యా(21 బంతుల్లో 24) నిలదొక్కునే ప్రయత్నం చేసినా రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అతడి పప్పులు ఉడకనివ్వలేదు. దీంతో కష్టాల్లో పడిన లక్నోను నికోలస్ పూరన్(26 బంతుల్లో 48), ఆయుశ్ బదోని(30 బంతుల్లో 55) ఆదుకున్నారు.పరుగుల సునామీవీరిద్దరి భాగస్వామ్యం కారణంగానే లక్నో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగలిగింది. అయితే, లక్ష్య ఛేదనలో ఊహించని విధంగా పరుగుల సునామీ సృష్టించారు సన్‌రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ(28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు- 75 పరుగులు), ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లు- 89 రన్స్).కొడితే బౌండరీ లేదంటే సిక్స్ అన్నట్లుగా సాగింది వీళ్లిద్దరి విధ్వంసం. అభిషేక్ 267.86, హెడ్ 296.67 స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేయడంతో.. దెబ్బకు 9.4 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసింది సన్‌రైజర్స్.పాపం రాహుల్లక్నోను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇక ఈ పరుగుల విధ్వంసానికి సాక్షిగా నిలిచిన వికెట్ కీపర్ బ్యాటర్, కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓటమి అనంతరం పైవిధంగా స్పందించాడు. కాగా ఓటమి నేపథ్యంలో లక్నో యజమాని సంజీవ్ గోయెంకా రాహుల్‌పై సీరియస్ అయ్యాడు. చదవండి: SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్WHAT. A. CHASE 🧡A 🔟-wicket win for @SunRisers with more than 🔟 overs to spare! Scorecard ▶️ https://t.co/46Rn0QwHfi#TATAIPL | #SRHvLSG pic.twitter.com/kOxzoKUpXK— IndianPremierLeague (@IPL) May 8, 2024 -
SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్‌కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
సాక్షి, హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంత మైదానంలో మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఉప్పల్ వేదికగా బుధవారం తలపడనుంది. ప్లే ఆఫ్స్ రేసులో సాఫీగా ముందుకు వెళ్లాలంటే లక్నోతో మ్యాచ్‌లో కమిన్స్ బృందం తప్పక గెలవాలి.అయితే, వర్షం రూపంలో సన్‌రైజర్స్- లక్నో పోరుకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. నగరంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా మ్యాచ్ గనుక రద్దైతే ఇరు జట్లకు చెరో పాయింట్ వస్తుంది.ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లుఇదిలా ఉంటే.. హోంగ్రౌండ్లో సన్‌రైజర్స్ మెరుపులను వీక్షించడానికి వచ్చే అభిమానుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ కోసం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.ఆ ప్రాంతాల నుంచి స్పెషల్ బస్సులు ఈసీఐఎల్, ఎల్బీనగర్, కొండాపూర్, జీడిమెట్ల, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం,మియాపూర్,లక్డీకాపూల్, కూకట్పల్లి హౌసింగ్‌బోర్డ్, జూబ్లీ బస్‌స్టేషన్, హకీంపేట్, మేడ్చల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, మెహిదీపట్నం, బీహెచ్ఈఎల్ తదితర ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు ప్రత్యేక బస్సులను నడుపనున్నారు.మెట్రోలో సైతంఅలాగే ప్రయాణికుల రద్దీ మేరకు వివిధ మార్గాల్లో అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రాయదుర్గం నుంచి నాగోల్ వరకు మియాపూర్ నుంచి ఎల్బీనగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మధ్య ప్రయాణికుల డిమాండ్ మేరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి.చదవండి: సంజూ శాంసన్‌కు ఊహించని షాకిచ్చిన బీసీసీఐThe Risers are back to Hyderabad 🧡💪 pic.twitter.com/uecAotesSz— SunRisers Hyderabad (@SunRisers) May 7, 2024 -
SRH Vs RCB: తెలుగులో మాట్లాడిన కమిన్స్.. ఆర్సీబీకి వార్నింగ్!
ఐపీఎల్-2024లో వరుస విజయాలతో సత్తా చాటుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. సొంతమైదానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గురువారం తలపడనుంది. ఇందుకోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది.ఈ సీజన్లో ఇప్పటికే ఆర్సీబీని తమ సొంతగడ్డపైనే ఓడించిన సన్‌రైజర్స్ ఉప్పల్‌లోనూ ఆ సీన్‌ను రిపీట్ చేయాలని భావిస్తోంది. చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారించి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు(287) సాధించిన రైజర్స్... హైదరాబాద్‌లో తమ రికార్డును బ్రేక్ చేయాలని పట్టుదలగా ఉంది.ప్యాట్ కమిన్స్ బృందం జోరు చూస్తుంటే ఇదేమీ అసాధ్యం కాకపోవచ్చనే అనిపిస్తోంది. మరోవైపు.. ఆర్సీబీ సైతం ఘోర పరాభవానికి బదులు తీర్చుకోవాలని భావిస్తున్న తరుణంలో ఇరుజట్ల మధ్య హోరాహోరీ ఖాయమంటూ ఈ మ్యాచ్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.The crossover we all love to see 🤩 pic.twitter.com/nLlDlUcH7E— SunRisers Hyderabad (@SunRisers) April 24, 2024ఇదిలా ఉంటే.. ఈ కీలక పోరుకు ముందే సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌ను తన మాటలతో ఖుషీ చేశాడు. ‘‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను.కమిన్స్ అంటే క్లాస్ అనుకుంటివా? మాస్.. ఊరమాస్.. ఎస్ఆర్హెచ్ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరూ’’ అంటూ తెలుగులో డైలాగ్స్ చెప్పి దుమ్ములేపాడు. తగ్గేదేలే అంటూ ఆర్సీబీకి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు స్పందించిన ఆరెంజ్ ఆర్మీ.. ‘‘కెప్టెన్ ఓ రేంజు.. మామ మనోడే.. సూపర్ కమిన్స్’’ అంటూ కామెంట్లతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.కాగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రాకతో సన్‌రైజర్స్ తలరాత మారిపోయింది. గత మూడేళ్లుగా వైఫల్యాలతో చతికిల పడ్డ రైజర్స్‌ను తన కెప్టెన్సీతో ఈ సీజన్లో హాట్ ఫేవరెట్‌గా మార్చాడు ఈ పేస్ బౌలర్. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ వంటి హిట్టర్లకు తోడు బౌలర్లు కూడా రాణిస్తుండటంతో తన కెప్టెన్సీ వ్యూహాలకు మరింత పదును పెట్టి వరుస విజయాలు సాధిస్తున్నాడు. ఇక ఈ ఎడిషన్‌లో సన్‌రైజర్స్ ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఐదు గెలిచి పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. ఆర్సీబీ ఎనిమిదింట ఏడు ఓడి అట్టడుగున ఉంది.చదవండి: IPL 2024: అన్ని జట్లు ఓడాయి.. ఒక్క సన్‌రైజర్స్ మాత్రమే..!ఓవైపు కెప్టెన్‌గా #OrangeORangeu అనిపిస్తున్నాడు 💪అది సరిపోదు అన్నట్టు.. ఈ Mass డైలాగ్స్ 💥@patcummins30 మామ.. నువ్వు సూపర్ అంతే! 🤩చూడండి#TATAIPLHyderabad v Bengaluru | రేపు 6 PM నుంచిమీ #StarSportsTelugu లో#IPLonStar #OrangeORangeu #ProudToBeTelugu pic.twitter.com/wv5IzPZhFe— StarSportsTelugu (@StarSportsTel) April 24, 2024 -
గ్రేటర్లో బీఆర్ఎస్కు మరో నేత రాజీనామా
మేడ్చల్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై అధికారంలో కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు నేతలు అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీలోకి క్యూ కడుతున్నారు. అయితే తాజాగా మరో నేత బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రటించారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు తన రాజీనామా లేఖ పంపారు సుభాష్ రెడ్డి. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు మద్దతు ఇవ్వనున్నట్లు బేతి సుభాష్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ పలువరు కీలక నేతలు బీఆర్ఎస్ను వీడటం ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నగేందర్ ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వారితో పాటు కే. కేశవరావు, పట్నం మహేందర్‌రెడ్డి వంటి పలువురు కీలక నేతలు కూడా బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి అధికార కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే దానం నగేందర్‌ను సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా నిలపటం గమనార్హం. -
ఉప్పల్ మ్యాచ్ టికెట్లు నిమిషాల్లో సోల్డ్ అవుట్.. అభిమానులకు మరోసారి నిరాశే
సాక్షి, హైదరాబాద్: నగరంలో క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. మరోసారి ఉప్పల్ మ్యాచ్ టికెట్స్ దొరకకుండా చేసారంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్‌లో ఈ నెల 25న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, మే 2న రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. టికెట్లను పేటీఎంలో నిర్వాహకులు విక్రయానికి పెట్టారు. పెట్టిన మరునిమిషమే సోల్డ్ అవుట్ చూపిస్తున్నాయని అభిమానుల ఆవేదన చెందుతున్నారు. పేటీఎంలో ఎన్ని టికెట్స్ విక్రయిస్తున్నారో సన్‌రైజర్స్ యాజమాన్యం లెక్క చెప్పడం లేదు. టిక్కెట్లు దొరక్క అభిమానుల తీవ్ర నిరాశ చెందుతున్నారు. బ్లాక్ లో టికెట్స్ అమ్ముకుంటున్నారంటూ మండిపడుతున్నారు. ఇదీ చదవండి: వారెవ్వా.. ఐపీఎల్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! రోహిత్ షాక్ (వీడియో) -
CSK అభిమానికి చేదు అనుభవం.. HCAపై ఆగ్రహం! పోస్ట్ వైరల్
మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తలాకు ఇదే చివరి సీజన్ అన్న నేపథ్యంలో గతేడాది అతడిని చూసేందుకు అభిమానులు మైదానాలకు పోటెత్తిన విషయం తెలిసిందే. స్టేడియం ఏదైనా.. తమ సొంత జట్టును కూడా కాదని ధోని బ్యాటింగ్ వచ్చిన మూమెంట్స్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే, ధోని ఐపీఎల్-2024లోనూ ఆడుతుండటంతో అభిమానులకు రెట్టింపు సంతోషాన్నిస్తోంది. ఇక ఈసారి ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా కాకున్నా ఆటగాడిగా మైదానంలో దిగుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడి వీరాభిమాని అయిన జునైద్ అహ్మద్ అనే యువకుడు సన్‌రైజర్స్‌తో సీఎస్కే మ్యాచ్ నేపథ్యంలో టికెట్ బుక్ చేసుకున్నాడు. From Orange 🧡, To Yellow 💛 For MS Dhoni 🫶🏻 ft. Hyderabad #TATAIPL | #SRHvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/iGYeoxxCvi — IndianPremierLeague (@IPL) April 6, 2024 అయితే, శుక్రవారం ఉప్పల్ స్టేడియానికి వచ్చిన అతడికి వింత అనుభవం ఎదురైంది. ఏకంగా రూ. 4,500 పెట్టి ఖర్చు పెట్టి మ్యాచ్ కోసం వచ్చిన జునైద్ అహ్మద్ టికెట్లో.. అతడికి J-66 సీట్ నెంబర్ అలాట్ చేసినట్లు ఉంది. సంతోషంగా స్టేడియానికి వెళ్లగా.. ఆ నంబరుతో అసలు సీటే కనిపించలేదు. J-65 తర్వాత J-67 సీట్ ఉండటంతో అతడు షాకయ్యాడు. సిబ్బందికి విషయం చెప్పినా వారూ ఏమీ చేయలేకపోయారు. ఫలితంగా జునైద్ అహ్మద్ మ్యాచ్ మొత్తం నిలబడే చూడాల్సి వచ్చింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్లక్ష్యం వల్లే తనకు ఈ దుస్థితి తలెత్తిందంటూ అతడు ఎక్స్ వేదికగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నాడు. డబ్బులు పెట్టి టికెట్ కొంటే.. నాలుగు గంటలపాటు నిలబడి మ్యాచ్ చూడాల్సి వచ్చిందని వాపోయాడు. తనకు కలిగిన అసౌకర్యానికి నష్టపరిహారంగా తిరిగి డబ్బులు పొందగలనా? అంటూ బీసీసీఐతో పాటు హెచ్‌సీఏ అధ్యక్షుడిని కూడా జునైద్ ట్యాగ్ చేశాడు. అతడి ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌కు ముందు స్టేడియంలోకి అనుమతించే క్రమంలోనూ పోలీసులకు, అభిమానులకు మధ్య తోపులాట జరిగిన విషయం తెలిసిందే. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఏదేమైనా హెచ్‌సీఏ తీరు మారకపోవడంతో ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. స్టేడియానికి వెళ్తే ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది పడుతూనే ఉంటామని వాపోతున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సొంత మైదానంలో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. చదవండి: జడ్డూ అవుట్ కావాలి కదా? కమిన్స్ ఎందుకు వదిలేశాడు? వీడియో వైరల్ Disappointed that I’ve booked a ticket and seat Number was J66 in Stand. Sorry state that seat doesn’t exist and had to stand and enjoy the game. Do I get a refund and compensation for this.#SRHvCSK #IPL2024 @JayShah @BCCI @IPL @JaganMohanRaoA @SunRisers pic.twitter.com/0fwFnjk641 — Junaid Ahmed (@junaid_csk_7) April 5, 2024 -
#Dhoni: కమిన్స్‌కు ‘షాకిచ్చిన’ ప్రేక్షకులు.. అట్లుంటది ధోనితోని!
IPL 2024- SRH vs CSK- Dhoni Entry Viral Video: మహేంద్ర సింగ్ ధోని.. ఇది కేవలం ఒక పేరు మాత్రమే కాదు.. ఒక ఎమోషన్.. ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు హైదరాబాద్ ప్రేక్షకులు. తలా మైదానంలో అడుగుపెట్టగానే ఆరెంజ్ ఆర్మీ సైతం ధోని నామస్మరణతో అభిమానం చాటుకుంది. ఇక సీఎస్కే ఫ్యాన్స్ తమ జెండాలు రెపరెపలాడిస్తూ ధోనికి ఘన స్వాగతం పలికారు. కేవలం అభిమానులు మాత్రమే కాదు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు సైతం ధోని ఆగమనాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఐపీఎల్-2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్- సన్‌రైజర్స్ మ్యాచ్ సందర్భంగా ఈ అందమైన దృశ్యాలు చోటుచేసుకున్నాయి. Overwhelming Yellove! Chaala Thanks, Hyderabad! 🥳💛#SRHvCSK #WhistlePodu 🦁💛 pic.twitter.com/nZIYuBrbdA — Chennai Super Kings (@ChennaiIPL) April 5, 2024 ఇక ధోని క్రేజ్‌ను చూసి సన్‌రైజర్స్ సారథి ప్యాట్ కమిన్స్ ఆశ్చర్యపోయాడు. తమ సొంతమైదానంలో సీఎస్కే స్టార్‌కు ప్రేక్షకులు స్వాగతం పలికిన తీరును తాను ముందెన్నడూ చూడలేదన్నాడు. ధోని బ్యాటింగ్‌కు రాగానే.. మైదానం దద్దరిల్లిపోయిందని.. ఇంత వరకూ తాను అంత శబ్దం ఎప్పుడూ వినలేదంటూ ధోని క్రేజ్‌కు ఫిదా అయ్యాడు. కాగా శుక్రవారం ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్.. సీఎస్కేను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. స్లో వికెట్‌పై పరుగులు తీసేందుకు చెన్నై బ్యాటర్లు బాగా ఇబ్బంది పడ్డారు. ఓపెనర్లు రచిన్ రవీంద్ర (12), రుతురాజ్ గైక్వాడ్(26) నిరాశపరచగా.. అజింక్య రహానే(35) నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. అయితే, శివం దూబే మాత్రం(24 బంతుల్లో 45) తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఐదో స్థానంలో వచ్చిన రవీంద్ర జడేజా(23 బంతుల్లో 31) నాటౌట్‌గా నిలవగా.. ఏడో స్థానంలో డారిల్ మిచెల్(13) దిగడంతో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. అయితే, నటరాజన్ బౌలింగ్‌లో మిచెల్ అవుట్ కాగానే ధోని ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటాయి. From Orange 🧡, To Yellow 💛 For MS Dhoni 🫶🏻 ft. Hyderabad #TATAIPL | #SRHvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/iGYeoxxCvi — IndianPremierLeague (@IPL) April 6, 2024 తలా అలా గ్రౌండ్లో అడుగుపెట్టగానే కేరింతలతో ఉప్పల్ స్టేడియం ప్రాంగణం దద్దరిల్లిపోయింది. ధోని ఒక్క పరుగు చేసి అజేయంగా నిలిచాడు. ఇక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి సీఎస్కే 165 పరుగులు చేయగా.. సన్‌రైజర్స్ 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆరు వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది. ఏదేమైనా ధోని ఎంట్రీ ఈ మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. వైజాగ్‌లో వింటేజ్ ధోని విధ్వంసం విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్-2024లో ధోని తొలిసారి బ్యాటింగ్ చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ కేవలం 16 బంతుల్లోనే 37 పరుగులు రాబట్టాడు. There is nothing beyond Thala's reach 🔥💪 #IPLonJioCinema #Dhoni #TATAIPL #DCvCSK pic.twitter.com/SpDWksFDLO — JioCinema (@JioCinema) March 31, 2024 చదవండి: #Kavya Maran: పట్టపగ్గాల్లేని సంతోషం.. కావ్యా మారన్ పక్కన ఎవరీ అమ్మాయి? 2024? 2005? 🤔#DCvCSK #WhistlePodu #Yellove🦁💛pic.twitter.com/T6tWdWO5lh — Chennai Super Kings (@ChennaiIPL) March 31, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
SRH: వావ్.. గెలిచాం.. కావ్యా మారన్ పక్కన ఎవరీ అమ్మాయి?
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తిరిగి గెలుపుబాట పట్టింది. సొంత మైదానంలో వరుసగా రెండో మ్యాచ్ గెలిచి సత్తా చాటింది. కాగా ఐపీఎల్ తాజా ఎడిషన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయంతో ఆరంభించిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయిన కమిన్స్ బృందం.. తర్వాత సొంతగడ్డపై రికార్డు విజయం అందుకుంది. ఉప్పల్‌లో ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించి తొలి గెలుపు నమోదు చేసింది. అయితే, ఆ తర్వాత అహ్మదాబాద్ వెళ్లిన సన్‌రైజర్స్‌కు మళ్లీ భంగపాటు తప్పలేదు. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ఈ క్రమంలో నాలుగో మ్యాచ్ కోసం మళ్లీ ఉప్పల్‌కు విచ్చేసిన సన్‌రైజర్స్ హోం గ్రౌండ్లో తమకు తిరుగు లేదని నిరూపించింది. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి మళ్లీ విన్నింగ్స్ ట్రాక్ ఎక్కేసింది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ సహ యజమాని కావ్యా మారన్ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. చెన్నైపై రైజర్స్ విజయం తర్వాత ఆమె ఒక్కసారిగా ఎగిరి గంతేశారు. Joy for the Orange Army 🧡 as they register their second home win of the season 👌👌@SunRisers climb to number 5⃣ on the Points Table 😎 Scorecard ▶️ https://t.co/O4Q3bQNgUP#TATAIPL | #SRHvCSK pic.twitter.com/QWS4n2Ih8D — IndianPremierLeague (@IPL) April 5, 2024 ‘‘అవును.. గెలిచాం.. వావ్’’ అంటూ చప్పట్లతో కావ్య తన జట్టును అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక చెన్నైతో మ్యాచ్‌లో రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. Abhishek sambhavam 🔥🤩#SRHvCSK #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/rkekTCQOve — JioCinema (@JioCinema) April 5, 2024 మొత్తంగా 12 బంతులు ఎదుర్కొన్న 23 ఏళ్ల ఈ యువ బ్యాటర్ 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 37 పరుగులు రాబట్టాడు. తద్వారా రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ తల్లి, సోదరి వచ్చి అభిషేక్‌తో ఫొటోలు దిగారు. ఆ అమ్మాయి ఎవరంటే? ఇక అభిషేక్ శర్మ సోదరి.. విక్టరీ సింబల్ చూపిస్తూ కావ్యా మారన్‌తో కూడా ఫొటోలకు ఫోజులివ్వడం విశేషం. కాగా కావ్యా మారన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ మ్యాచ్ అంటే చాలా మందికి ఆమె గుర్తుకువస్తారు. స్టాండ్స్‌లో ఉండి సన్‌రైజర్స్‌ను ఉత్సాహపరుస్తూ ఆమె చేసే సందడి అంతా ఇంతా కాదు. కావ్య ఎక్స్ప్రెషన్స్ ఒడిసిపట్టేందుకు కెమెరామెన్ చాలా మటుకు ఆమెపైనే ఫోకస్ పెడుతూ ఉంటారని ప్రత్యేకంగా చెప్పాలా?! చదవండి: జడ్డూ అవుట్ కావాలి కదా? కమిన్స్ ఎందుకు వదిలేశాడు? వీడియో వైరల్ -
మా బౌలర్ల తప్పు లేదు.. ఓటమికి కారణం అదే: పాండ్యా
IPL 2024: Hardik Pandya backs bowlers after SRH mauling: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాకు వరుసగా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఐపీఎల్-2024లో తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఆరు పరుగుల స్వల్ప తేడాతో ఓడిన ముంబై.. రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో మాత్రం ఘోర ఓటమిని చవిచూసింది. ముఖ్యంగా బౌలర్ల వైఫల్యం కారణంగా ప్రత్యర్థి జట్టు కేవలం మూడు వికెట్ల నష్టానికే 277 పరుగులు చేసే అవకాశం ఇచ్చింది. తద్వారా సన్‌రైజర్స్ ఐపీఎల్లో ఆల్‌టైమ్ రికార్డు సృష్టిస్తే.. ముంబై పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో పరాజయంపై స్పందించిన ముంబై సారథి హార్దిక్ పాండ్యా ఉప్పల్ వికెట్ బాగుందని.. ఓటమికి బౌలర్లను బాధ్యులను చేయడం సరికాదని పేర్కొన్నాడు. ఈ పిచ్‌పై ఇంత స్కోరు నమోదు అవుతుందని అస్సలు ఊహించలేదన్నాడు. ‘‘ఈ వికెట్ చాలా బాగుంది. ఇక్కడ బౌలర్లు ఎంత మంచిగా బౌలింగ్ చేసినా.. ప్రత్యర్థి 277 పరుగులు స్కోరు చేయడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. ఈ విషయంలో క్రెడిట్ రైజర్స్ బ్యాటర్లకు కూడా ఇవ్వాలి. నిజానికి.. టాస్ సమయంలో.. ఎస్ఆర్హెచ్ ఇంత స్కోరు చేస్తుందని అనుకోలేదు. వాళ్లను కట్టడి చేయడానికి మా బౌలర్లు బాగానే ప్రయత్నం చేశారు. కానీ పిచ్ వారికి అనుకూలించలేదు. ఇక్కడ 500కు పైగా పరుగులు స్కోర్ అయ్యాయంటే.. వికెట్ బ్యాటర్లకు అనుకూలించిందనే అర్థం కదా! ఏదేమైనా ఇప్పుడు మా జట్టులో చాలా మంది యువ బౌలర్లే ఉన్నారు. ఈ మ్యాచ్ నుంచి వాళ్లు పాఠాలు నేర్చుకుంటారు. ఈరోజు క్వెనా మఫాకా అద్భుతంగా ఆడాడు. తన తొలి మ్యాచ్‌లోనే ఎంతో ఆత్మవిశ్వాసంగా కనిపించాడు. తనకిది మొదటి మ్యాచ్. ఇక్కడ కుదురుకోవడానికి తనకు ఇంకాస్త సమయం కావాలి. మా బ్యాటర్లు కూడా పర్వాలేదనిపించారు. కానీ.. సరైన సమయంలో రాణించలేకపోయారు’’ అని హార్దిక్ పాండ్యా తమ బౌలింగ్ విభాగాన్ని సమర్థించాడు. కాగా ఉప్పల్‌లో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాండ్యా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 277 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. 246 పరుగుల వద్దే నిలిచి.. తాజా ఎడిషన్‌లో వరుసగా రెండో పరాజయం నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో పాండ్యా నాలుగు ఓవర్ల బౌలింగ్‌లో 46 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. లక్ష్య ఛేదనలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 20 బంతుల్లో 24 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ ద్వారా సౌతాఫ్రికాకు చెందిన 17 ఏళ్ల పేసర్ క్వెనా మఫాకా ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ముంబై తరఫున బరిలోకి దిగిన అతడు నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 66 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. WHAT. A. MATCH! 🔥 Raining sixes and 500 runs scored for the first time ever in #TATAIPL 💥 Hyderabad is treated with an epic encounter 🧡💙👏 Scorecard ▶️ https://t.co/oi6mgyCP5s#SRHvMI pic.twitter.com/hwvWIDGsLh — IndianPremierLeague (@IPL) March 27, 2024 -
500 కోట్లు స్కాం బోర్డు తిప్పేసిన జేపీ బిల్డర్స్
-
ఎల్ఈడీ లైట్లే కొంప ముంచాయా?
ఉప్పల్: ఉప్పల్ సీఎంఆర్ వస్త్ర దుకాణంలో మంగళవారం రాత్రి చోటు చేసుకున్న అగ్ని ప్రమాదానికి ఎల్ఈడీ లైట్లే కారణమని భావిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఎలివేషన్ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల కారణంగా షార్ట్ సర్యూట్ జరిగి మంటలు చెలరేగినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై సీఎంఆర్ మేనేజర్ గౌతమ్ ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనుమతులపై అన్నీ అనుమానాలే..? సీఎంఆర్ దుకాణం ఏర్పాటు చేసిన భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేదు అయినా వస్త్ర దుకాణం నిర్వహణకు అధికారులు అనుమతి ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా 300 మందికి పైగా ఉద్యోగులు పని చేసే చోట భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అధికారులు వాటిని పట్టించుకోకుండా, ఆక్యుపెన్సీ(ఓసి) లేకుండా అనుమతులు ఇవ్వడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ప్రమాదం నేపథ్యంలో బుధవారం జీహెచ్ఎంసీ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిబంధనల మేరకే వ్యాపార సంస్థకు అనుమతులు ఇచ్చారా లేదా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. వీటితో పాటు ట్రాఫిక్ విషయంలో సంబంధిత అధికారులు అనుమతి ఉందా? ఫైర్ ఎన్ఓసీ తదితర అంశాలను సైతం అధికారులు పరిశీలిస్తున్నారు. జీహెచ్ఎంసీ నుంచి పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు బుధవారం ఉదయం అనుమతులపై ఆరా తీశారు. నిర్వాహకులు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న మాట వాస్తమే కానీ సర్టిఫికెట్ మంజూరు చేయలేదని టౌన్‌ప్లానింగ్ అధికారి స్వయంగా పేర్కొనడం గమనార్హం. -
మహాదేవ్ యాప్ ‘రవి’ అరెస్టు
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ యజమాని రవి ఉప్పల్ (43)ను దుబాయ్ పోలీసులు గత వారం అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ అధికారులు బుధవారం వెల్లడించారు. అతడిని భారత్ ర్రప్పించి విచారిస్తామని తెలిపారు. -
గద్వాలలో కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్లో చేరిన డీసీసీ అధ్యక్షుడు
సాక్షి, జోగులాంబ గద్వాల: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు నేతలు పార్టీని వీడారు. గద్వాల జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గద్వాల నుంచి ఎమ్మెల్యే టికెట్‌కెట్ దక్కలేదన్న అసంతృప్తితో ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. అనంతరం మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ప్రభాకర్ రెడ్డి టీపీసీసీ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. గద్వాల కాంగ్రెస్ టికెట్‌ను రేవంత్ కొత్తగా వలస వచ్చిన జడ్పీ చైర్ పర్సన్ సరితకు అమ్ముకున్నారని విమర్శించారు. గద్వాలలో రేవంత్ రెడ్డి బ్యానర్‌ను ప్రభాకర్ రెడ్డి అనుచరులు దగ్ధం చేశారు. ఇప్పటికే సరిత అభ్యర్థిత్వాన్ని అటు కాంగ్రెస్ అసమ్మతి నేతలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉప్పల్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, ఉప్పల్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి రాగిడి లక్ష్మారెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. తనకు గౌరవం లేని పార్టీలో ఉండకూడదని నిర్ణయించుకన్న లక్ష్మారెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. సాయంత్రం ప్రగతి భవన్‌కు వెళ్లి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను కలువనున్నారు. అనంతరం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. చదవండి: మహబూబ్‌నగర్ నా గుండెల్లో ఉంటుంది: సీఎం కేసీఆర్ -
WC 2023: ‘పసికూన’పై కివీస్ ప్రతాపం.. వరుసగా న్యూజిలాండ్ రెండో విజయం
ICC Cricket WC 2023- New Zealand vs Netherlands, 6th Match: వన్డే వరల్డ్‌కప్-2023లో న్యూజిలాండ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన కివీస్.. రెండో మ్యాచ్‌లో ‘పసికూన’ నెదర్లాండ్స్‌ను 99 పరుగుల తేడాతో మట్టికరిపించింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ మ్యాచ్‌లో జయకేతనం ఎగురవేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. రాజీవ్ గాంధీ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్... నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు సాధించింది. ముగ్గురు అర్ధ శతకాలతో రాణించి ఓపెనర్ విల్ యంగ్ 70 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. వన్‌డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర 51, కెప్టెన్ టామ్ లాథమ్ 53 పరుగులతో రాణించారు. ఆఖర్లో మిచెల్ సాంట్నర్ 36 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ ఆరంభంలోనే ఓపెనర్లు విక్రంజిత్ సింగ్(12), మాక్స్ ఒడౌడ్(16) వికెట్లు కోల్పోయి డీలా పడినప్పటికీ.. వన్‌డౌన్ బ్యాటర్ కొలిన్ అకెర్మాన్ డచ్ శిబిరంలో ఆశలు రేపాడు. ఆశలు రేపాడు 69 పరుగులతో రాణించిన అతడు అవుట్ కావడంతో నెదర్లాండ్స్ బ్యాటింగ్ ఆర్డర్ పతనం మొదలైంది. సాంట్నర్ దెబ్బకు డచ్ జట్టు పెవిలియన్‌కు క్యూ కట్టింది. దీంతో... 99 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఐదు వికెట్లతో చెలరేగిన సాంట్నర్ స్పిన్ బౌలర్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మిచెల్ సాంట్నర్ అత్యధికంగా ఐదు వికెట్లు కూల్చి నెదర్లాండ్స్ పతనాన్ని శాసించగా.. పేసర్ మ్యాట్ హెన్రీకి మూడు, మరో లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ రచిన్ రవీంద్రకు ఒక వికెట్ దక్కాయి. ఇక తెలుగు మూలాలున్న డచ్ బ్యాటర్ తేజ నిడమనూరు రనౌట్‌గా వెనుదిరిగాడు. చదవండి: WC 2023: తడబడి.. నిలబడిన టీమిండియాకు బిగ్ షాక్! పాకిస్తాన్‌తో మ్యాచ్ నాటికి.. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc)