భారత్‌లో విరాట్ కోహ్లికి కలిసొచ్చిన మైదానాల్లో ఉప్పల్ స్టేడియం ఒకటి. ఈ గ్రౌండ్‌లో కోహ్లి మూడు ఫార్మాట్‌లలో కలిపి 8 మ్యాచ్‌లు (మూడు టెస్టులు, నాలుగు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్) ఆడాడు. ఒక సెంచరీ, 3 అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 607 పరుగులు స్కోరు చేశాడు. 2019లో చివరిసారి ఈ గ్రౌండ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లో కోహ్లి అజేయంగా 94 పరుగులు చేసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ప్రస్తుతం ఆసీస్‌తో జరుగుతున్న టి20 సిరీస్‌లో కోహ్లి పెద్దగా రాణించలేదు. తొలి టి20లో 2 పరుగులకే వెనుదిరిగిన కోహ్లి.. నాగ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టి20లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు.
మరోవైపు ఈ మైదానం ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మకు అచ్చిరాలేదు. ఈ గ్రౌండ్‌లో రోహిత్ 3 మ్యాచ్‌లు ఆడి కేవలం 46 పరుగులు సాధించాడు. ప్రస్తుత ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్‌కు కూడా ఈ గ్రౌండ్ కలిసి రాలేదు. 2019 మార్చి 2న భారత్‌తో ఇక్కడ జరిగిన వన్డేలో ఫించ్ ‘డకౌట్’ అయ్యాడు. ఇక తొలి రెండు టి20ల్లో చెరొక విజయం సాధించిన ఇరుజట్లు హైదరాబాద్‌లో మ్యాచ్ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తున్నాయి.
చదవండి: ఇన్నింగ్స్ చివర్లో హైడ్రామా.. 'మరో అశ్విన్'లా కనబడింది
Comments
Please login to add a commentAdd a comment