IND Vs AUS: Yuvraj Singh-Virat Kohli Serious Discussion During 1st T20, Video Viral - Sakshi
Sakshi News home page

Yuvraj Singh-Virat Kohli: మ్యాచ్‌కు హాజరైన యువరాజ్‌.. కోహ్లితో మాటామంతీ

Published Wed, Sep 21 2022 9:35 AM | Last Updated on Wed, Sep 21 2022 1:03 PM

Yuvraj Singh-Virat Kohli Engaged Serious Discussion 1st T20 IND Vs AUS - Sakshi

మొహలీ వేదికగా మంగళవారం టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన  తొలి టి20కి భారత మాజీ క్రికెటర్లు యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌లు హాజరయ్యారు. క్రికెట్‌లో వారు చేసిన సేవకు గానూ పంజాబ్‌లోని పీసీఏ మొహలీ స్టేడియంలోని రెండు స్టాండ్స్‌కు వీరిద్దరి పేర్లను పెట్టిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌లను పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ప్రత్యేకంగా సత్కరించారు. 

ఈ విషయం పక్కనబెడితే.. మ్యాచ్‌ ప్రారంభమయ్యాకా టీమిండియా ఇన్నింగ్స్‌ సమయంలో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. టీమిండియా రన్‌మెషిన్‌ విరాట్‌ కోహ్లిని కలుసుకున్న యువరాజ్‌ సింగ్‌ ఏదో విషయమై సీరియస్‌గా మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్య చాలాసేపు సీరియస్‌ చర్చ నడిచినట్లు తెలుస్తోంది. బహుశా టీమిండియా ఇన్నింగ్స్‌ సాగుతున్న తీరుపై.. జట్టు ఎంపికపై ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు అభిమానులు పేర్కొన్నారు. 

ఏది ఏమైనా మాజీ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌, విరాట్‌ కోహ్లిలను ఇలా ఒకే ఫ్రేమ్‌లో చూడడం మాత్రం అభిమానులకు కనువిందుగా అనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: 'పాకిస్తాన్‌ కూడా ఓడిపోయింది'.. ఇంగ్లండ్‌ ఘన విజయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement