Virat Kohli Stunning Reaction To Umesh Yadav On His Bowling, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Virat Kohli: ఆ ఎక్స్‌ప్రెషన్‌ ఏంటి..? పిల్లలు జడుసుకుంటారు!

Published Wed, Sep 21 2022 11:24 AM | Last Updated on Wed, Sep 21 2022 1:50 PM

Virat Kohli Stunning Reaction To-Umesh Yadav After 4 Boundaries Viral - Sakshi

టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా రన్‌మెషిన్‌ విరాట్‌ కోహ్లి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు మంచి ఆరంభం దక్కింది. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ ఉమేశ్‌ యాదవ్‌ వేశాడు.

చాలా రోజుల తర్వాత టీమిండియా తరపున టి20 మ్యాచ్‌ ఆడుతున్న ఉమేశ్‌ యాదవ్‌కు ఓపెనర్‌ కామెరున్‌ గ్రీన్‌ చుక్కలు చూపించాడు. ఉమేశ్‌ వేసిన నాలుగు బంతుల్ని ఫోర్లుగా మలిచిన గ్రీన్‌ 16 పరుగులు రాబట్టాడు. దీంతో ఉమేశ్‌ యాదవ్‌ మొహం మాడిపోగా.. కోహ్లి.. ఏంటి ఉమేశ్‌ యాదవ్‌ ఈ బౌలింగ్‌ అన్నట్లుగా కళ్లతోనే భయపెట్టాడు. కోహ్లి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌కు చిన్నపిల్లలు జడుసుకోవడం ఖాయం. అంత భయపెట్టేలా ఉంది అతని లుక్‌. 

అందుకే కోహ్లి ఎక్స్‌ప్రెషన్‌ ఇప్పుడు సరికొత్త మీమ్‌గా మారిపోయింది. కోహ్లి రియాక్షన్‌పై క్రికెట్‌ ఫ్యాన్స్‌ సరదాగా కామెంట్‌ చేశారు. ''ఇన్నింగ్స్‌ చివర్లో భువనేశ్వర్‌ బౌలింగ్‌ అప్పుడు కూడా కోహ్లి రియాక్షన్‌ ఇదే అనుకుంటా''.. ''ఎప్పుడైనా పిల్లాడు అన్నం తినకపోతే.. బూచోడికి పట్టిస్తా అని కోహ్లి ఫోటో చూపిస్తారేమో''.. ''19వ ఓవర్‌లో భువీ బౌలింగ్‌ చూసి ప్రతీ అభిమాని కోహ్లి లాంటి లుక్‌ ఇస్తారు''.. ''కోహ్లి కెప్టెన్సీలో టీమిండియా 200 పరుగులు చేసిన సందర్భాల్లో ఒక్క మ్యాచ్‌ ఓడిపోలేదు.. అందుకే ఆ లుక్‌'' అంటూ పేర్కొన్నారు. 

చదవండి: భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌.. హెచ్‌సీఏలో టికెట్ల రగడ

'సరైన బౌలర్లు లేరు.. అందుకే ఓడిపోయాం'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement