Umesh Yadav
-
#MIvsGT: ఊహించని షాక్.. హార్దిక్ రియాక్షన్ వైరల్!
#Hardik Pandya Reaction After Loss Battle To Umesh Yadav: ఐపీఎల్-2024.. గుజరాత్ టైటాన్స్‌తో తమ తొలి మ్యాచ్.. టాస్ గెలిచి.. ప్రత్యర్థిని 168 పరుగులకు కట్టడిచేసిన ముంబై ఇండియన్స్.. లక్ష్య ఛేదనకు దిగిన పాండ్యా సేన.. ఆఖరి ఐదు ఓవర్లలో 43 పరుగులు కావాలి.. అప్పటికి ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి. తిలక్ వర్మ నిలకడగా ఆడుతుండగా.. డెవాల్డ్ బ్రెవిస్ అప్పటికే జోరు మీదున్నాడు.. అతడి తర్వాత టిమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యా వంటి హిట్టర్లు కూడా ఉన్నారు. ఈ సమీకరణాలన్నీ చూసి ముంబై గెలుపు లాంఛనమే అనే అంచనాలు.. అయితే, పదహారో ఓవర్ ఐదో బంతి నుంచి ముంబై బ్యాటింగ్ ఆర్డర్ పతనం మొదలుపెట్టారు గుజరాత్ బౌలర్లు. మోహిత్ శర్మ బ్రెవిస్(46)ను అద్భుత రీతిలో బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. అనంతరం.. పద్దెనిమిదవ ఓవర్ ఆఖరి బాల్‌కు టిమ్ డేవిడ్(11)ను కూడా అవుట్ చేశాడు. ఆ తర్వాతి రెండో బంతికే స్పెన్సర్ జాన్సన్ తిలక్ వర్మ(25)కు సెండాఫ్ ఇచ్చాడు. అనంతరం పందొమ్మిదో ఓవర్ చివరి బంతికి గెరాల్డ్ కొయెట్జీ(1)ని కూడా పెవిలియన్‌కు పంపాడు. అప్పటికి స్కోరు 150-7. ముంబై విజయానికి ఆరు బంతుల్లో 19 పరుగులు కావాలి. టిమ్ డేవిడ్ స్థానంలో క్రీజులోకి వచ్చి సింగిల్‌తో మొదలుపెట్టిన హార్దిక్ పాండ్యాపైనే ఆశలన్నీ! అందుకు తగ్గట్లుగానే ఆఖరి ఓవర్ వేసేందుకు వచ్చిన ఉమేశ్ యాదవ్‌కు సిక్సర్‌తో ఆహ్వానం పలికాడు హార్దిక్. మరుసటి బంతికే ఫోర్ బాదాడు. 6️⃣ • 4️⃣ • 𝗪 Skipper Hardik leads the fightback, but Umesh won the battle ⚔️🔥#IPLonJioCinema #TATAIPL #IPL2024 #GTvMI pic.twitter.com/R3K3ArF7OM — JioCinema (@JioCinema) March 24, 2024 అప్పుడు సమీకరణం.. నాలుగు బంతుల్లో 9 పరుగులు.. కానీ హార్దిక్‌కు.. ముంబై ఇండియన్స్‌కు ఊహించని షాకిచ్చాడు ఉమేశ్. పేసీ షార్ట్ బాల్‌తో పాండ్యాను బురిడీ కొట్టించి క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగేలా చేశాడు. దీంతో అహ్మదాబాద్ స్టేడియం మొత్తం ఉమేశ్ యాదవ్ వికెట్‌ను సెలబ్రేట్ చేసుకుంటూ హోరెత్తింది. Now that's a 𝘾𝙤𝙢𝙚𝙗𝙖𝙘𝙠 😍 Umesh Yadav with the all important wicket of Hardik Pandya when it mattered the most 👏 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱 Match Updates ▶️ https://t.co/oPSjdbb1YT #TATAIPL | #GTvMI | @gujarat_titans pic.twitter.com/1ijg3ISCCt — IndianPremierLeague (@IPL) March 24, 2024 దెబ్బకు హార్దిక్ పాండ్యా ముఖం మాడిపోయింది. ఆ తర్వాతి బంతికి పీయూష్ చావ్లాను అవుట్ చేసిన ఉమేశ్ యాదవ్ ముంబై గెలుపు ఆశలపై నీళ్లు చల్లాడు. ఆఖరి బంతికి షమ్స్ ములానీ సింగిల్ తీసి ఇన్నింగ్స్ ముగించగా.. గుజరాత్ టైటాన్స్ ఆరు పరుగుల తేడాతో గెలిచి గెలుపుతో సీజన్‌ను ఆరంభించింది. కాగా గత సీజన్లో గుజరాత్ టైటాన్స్ సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యా ఈసారి ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అందుకే అహ్మదాబాద్ ప్రేక్షకులు ఆది నుంచే అతడిని ట్రోల్ చేస్తూ అరచి గోలగోల చేశారు. ఇలా హార్దిక్(4 బంతుల్లో 11 రన్స్) అవుట్ కావడం, ముంబై ఓడిపోవడంతో వారి సంబరాలు మిన్నంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చదవండి: #HardikPandya: హత్తుకునేందుకు వచ్చిన హార్దిక్.. మండిపడ్డ రోహిత్! పక్కనే అంబానీ.. -
BCCI Central Contracts: ఆ నలుగురి ఖేల్ ఖతమైనట్లేనా..?
2023-24 సంవత్సరానికి గాను బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో టీమిండియా వెటరన్స్ చతేశ్వర్ పుజారా, శిఖర్ ధవన్, ఉమేశ్ యాదవ్ చోటు కోల్పోయారు. వీరిలో పుజారా ఒక్కడు దేశవాలీ, ఇతరత్రా టోర్నీల్లో యాక్టివ్‌గా ఉంటూ మరోసారి టీమిండియా తలుపులు తట్టేందుకు ప్రయత్నిస్తుండగా.. ఉమేశ్ దేశవాలీ క్రికెట్లో అడపాదడపా దర్శనమిస్తున్నాడు. శిఖర్ అయితే మొత్తానికే క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. కేవలం ఐపీఎల్ కోసమే అతను గేమ్‌లో కొనసాగుతున్నాడు. ఈ ముగ్గురితో పాటు మరో వెటరన్ అజింక్య రహానేను కూడా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంలో పరిగణలోకి తీసుకోలేదు. రహానే రంజీల్లో పూర్తి స్థాయిలో ఆడుతున్నప్పటికీ.. అతని నుంచి చొప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ కూడా లేదు. దీంతో చేసేదేమీ లేక బీసీసీఐ అతన్ని పక్కకు పెట్టి ఉంటుంది. ఈ నలుగురిలో ఒక్క పుజారా మినహా మిగతా ముగ్గురి విషయంలో బీసీసీఐ కరెక్ట్‌గానే వ్యవహరించిందనుకోవచ్చు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోతే వీరి కెరీర్లు ఖతమైనట్లేనా..? ఈ నలుగురు తిరిగి పుంజుకుని టీమిండియాలో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉందా..? ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ ప్రశ్నలకు నో అనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే టీమిండియాలో ఈ నలుగురి పాత్రలకు న్యాయం చేస్తున్న వారి సంఖ్య చాంతాండంత ఉంది. వీరి భవితవ్యం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. పై పేర్కొన్న నలుగురితో పాటు సరైన అవకాశాలు రాని చహల్, దీపక్ హుడాలపై కూడా బీసీసీఐ వేటు వేసింది తాజాగా సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్ల విషయానికొస్తే.. ఏ ప్లస్ కేటగిరిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.. ఏ కేటగిరిలో అశ్విన్, షమీ, సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా.. బి కేటగిరిలో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్.. సి కేటగిరిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ద్ కృష్ణ, అవేశ్ ఖాన్, రజత్ పాటిదార్ చోటు దక్కించుకున్నారు. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, సిరాజ్‌లకు బి నుంచి ఏ కేటగిరికి ప్రమోషన్ లభించగా.. అక్షర్ పటేల్, రిషబ్ పంత్‌లకు ఏ నుంచి బి కేటగిరికి డిమోషన్ వచ్చింది. ఇటీవలికాలంలో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మ, ప్రసిద్ద్ కృష్ణ , అవేశ్ ఖాన్ , రజత్ పాటిదార్ , జితేశ్ శర్మ , ముకేశ్ కుమార్, రవి బిష్ణోయ్‌లకు కొత్తగా కాంట్రాక్ట్ లభించింది. -
టీమిండియాలో నో ఛాన్స్.. కథ ముగిసిందని అర్ధం కాదు! భారత సెలక్టర్లపై?
ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. అయితే ఈ సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లకు కూడా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి దూరమయ్యాడు. కోహ్లితో పాటు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌గా వెన్ను గాయం కారణంగా తప్పుకున్నాడు. మరోవైపు ఎవరూ ఊహించిన విధంగా సెలెక్టర్లు బెంగాల్ పేసర్ ఆకాష్ దీప్‌ను తొలిసారి టెస్టు జట్టుకు ఎంపిక చేశారు. ఉమేశ్‌కు మరోసారి నిరాశే.. ఇక ఇది ఇలా ఉండగా.. జట్టులో చోటు అశించిన వెటరన్ పేసర్ ఉమేశ్ యాదవ్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. దేశవాళీ క్రికెట్లో దుమ్మురేపుతున్నప్పటికి ఉమేశ్‌ను అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకోలేదు. ఈ క్రమంలో ఉమేశ్ యాదవ్ సెలెక్టర్లపై పరోక్షంగా స్పందించాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ క్రిప్టిక్ స్టోరీని ఉమేశ్ పోస్టు చేశాడు. ‘పుస్తకాలపై దుమ్ము పట్టినంత మాత్రాన కథ ముగిసిందని అర్థం కాదు’ అంటూ రాసుకొచ్చాడు. యాదవ్ చివరగా భారత తరపున గతేడాది జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్‌పై ఆడాడు. అయితే ఉమేశ్‌కు టెస్టుల్లో భారత గడ్డపై ఘనమైన రికార్డు ఉంది. స్వదేశంలో 2018 తర్వాత కేవలం 11 టెస్టులే ఆడిన యాదవ్ 43 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా 57 టెస్టుల్లో 170 వికెట్లు ఉమేశ్ సాధించాడు. ప్రస్తుత రంజీ సీజన్లో కూడా 7 ఇన్నింగ్స్‌లలో 19 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్‌తో మూడు టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, కెఎస్ భరత్, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహద్ యాదవ్, సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్. Umesh Yadav gets emotional after the Indian squad announcement vs England.#INDvsENG #CricketTwitter #Cricket pic.twitter.com/daU6gBRYOP — 𝗦𝘁𝗿𝗼𝗸𝗲𝗢𝗚𝗲𝗻𝗶𝘂𝘀✍ 🇮🇳 (@Stroke0Genius41) February 10, 2024 -
బ్యాట్‌తో విజృంభించిన ఉమేశ్ యాదవ్
టీమిండియా వెటరన్ పేసర్ ఉమేశ్ యాదవ్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో సత్తా చాటాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 1 పోటీల్లో భాగంగా హ్యాంప్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంతితో కాకుండా బ్యాటింగ్‌లో చెలరేగాడు. ఎసెక్స్ తరఫున తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఉమేశ్.. 45 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేసి ఔటయ్యాడు. Umesh Yadav smashed a fifty in just 45 balls in the County Championship. pic.twitter.com/2YMfZ15SDW— Mufaddal Vohra (@mufaddal_vohra) September 20, 2023 ఉమేశ్‌తో పాటు కెప్టెన్ టామ్ వెస్లీ (50), సైమర్ హార్పర్ (62) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఆడమ్ రొస్సింగ్టన్ (104) సెంచరీతో కదంతొక్కాడు. మాథ్యూ క్రిచ్లీ (99) పరుగు తేడాతా శతకం చేజార్చుకున్నాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఎసెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 447 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఎసెక్స్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ (0), నిక్ బ్రౌన్ (3), పాల్ వాల్టర్ (14) నిరాశపర్చగా.. ఇంగ్లండ్ టెస్ట్ జట్టు సభ్యుడు డానియెల్ లారెన్స్ (36) పర్వాలేదనిపించాడు. హ్యాంప్‌షైర్ బౌలర్లలో లియామ్ డాసన్ 3 వికెట్లు పడగొట్టగా.. ఫెలిక్స్ ఆర్గన్, మొహమ్మద్ అబ్బాస్ తలో 2 వికెట్లు, బార్కర్, కైల్ అబాట్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా, కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 1 పాయింట్ల పట్టికలో ఎసెక్స్ రెండో స్థానంలో, హ్యాంప్‌షైర్ ఐదో స్థానంలో ఉన్నాయి. సర్రే అగ్రస్థానంలో కొనసాగుతుంది. -
టీమిండియా క్రికెటర్లలో ప్రభుత్వ ఉద్యోగులు వీరే! లిస్టులో ఊహించని పేర్లు..
Team India Cricketers: భారత్‌లో క్రికెట్ మతం లాంటిది. ఇక క్రికెటర్లరంటే పడిచచ్చిపోయే అభిమానులకు కొదవే లేదు. ఇతర క్రీడాకారులెవరికీ లేని విధంగా సూపర్ క్రేజ్ మన క్రికెటర్ల సొంతం. కపిల్ దేవ్, సునిల్ గావస్కర్ నుంచి సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి దాకా ఎంతోమంది సంచలన రికార్డులు సృష్టించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ప్రపంచంలోనే సంపన్న బోర్డు అయిన బీసీసీఐ ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజుల రూపంలో చెల్లిస్తున్న మొత్తం కూడా కళ్లు చెదిరే రీతిలోనే ఉంటుంది. ఇదిలా ఉంటే.. మరి క్రికెట్ రంగానికి చేసిన, చేస్తున్న సేవలకు గానూ ప్రతిఫలంగా సముచిత గౌరవం, ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన క్రికెటర్లు ఎవరో తెలుసా?! సముచిత గౌరవం సచిన్ టెండుల్కర్ టీమిండియా దిగ్గజం, క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ కెరీర్లో 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించి ఎవరికీ సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు. మేటి బ్యాటర్‌గా ఎదిగి టీమిండియా ముఖచిత్రంగా వెలుగొందాడు. అతడి సేవలను గుర్తించి ప్రభుత్వం భారతరత్నతో సత్కరించింది. ఇదిలా ఉంటే.. భారత వాయుదళంలో గ్రూప్ కెప్టెన్ హోదా కూడా అందుకున్నాడు సచిన్ టెండుల్కర్. కపిల్ దేవ్ టీమిండియాకు మొట్టమొదటి ప్రపంచకప్ ట్రోఫీ అందించిన లెజెండరీ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్. 1983 వరల్డ్‌కప్ ఫైనల్లో కపిల్ డెవిల్స్ వెస్టిండీస్‌ను ఓడించి టైటిల్ సాధించింది. ఇక లెజెండ్ కపిల్ దేవ్‌ను భారత ఆర్మీ 2008లో లెఫ్టినెంట్ కల్నల్ హోదా కల్పించి సముచిత గౌరవం ఇచ్చింది. మహేంద్ర సింగ్ ధోని టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించాడు ధోని. టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ-2013 సాధించి లెజెండరీ కెప్టెన్‌గా నీరాజనాలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో మిస్టర్ కూల్‌కు భారత ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంకుతో గౌరవించింది. ప్రభుత్వ ఉద్యోగంలో.. హర్భజన్ సింగ్ భారత మేటి స్పిన్నర్లలో భజ్జీ కూడా ఒకడు. అంతర్జాతీయ క్రికెట్లో ఏడు వందలకు పైగా వికెట్లు పడగొట్టిన ఈ ఆఫ్ స్పిన్నర్ పలు చిరస్మరణీయ విజయాల్లో భాగమయ్యాడు. ఈ క్రమంలో పంజాబ్ పోలీస్.. భజ్జీని డిప్యూటి సూపరిండింటెండ్గా నియమించింది. జోగీందర్ శర్మ టీ20 ప్రపంచకప్-2007 చూసిన వారికి జోగీందర్ శర్మ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పాకిస్తాన్‌తో జరిగిన హోరాహోరీ పోరులో జోగీందర్ తీసిన వికెట్‌తో భారత్ రెండోసారి(వన్డే ఫార్మాట్‌తో కలిపి) విశ్వవిజేతగా అవతరించింది. ఈ క్రమంలో జోగీందర్ శర్మకు హర్యానాలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా అవకాశం వచ్చింది. ఉమేశ్ యాదవ్ మహారాష్ట్ర పేసర్ ఉమేశ్ యాదవ్ చిన్ననాటి నుంచే భారత త్రివిధదళాల్లో ఏదో ఒక విభాగంలో పనిచేయాలని కల కన్నాడు. కానీ క్రికెటర్ అయ్యాడు. టీమిండియాకు ఆడే అవకాశం దక్కించుకున్న అతడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. నాగ్‌పూర్ శాఖలో అసిస్టెంట్ మేనేజర్‌గా అవకాశం కల్పించింది. యజువేంద్ర చహల్ టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పి టీమిండియాకు విజయాలు అందించిన సందర్భాలెన్న! ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో పొట్టి ఫార్మాట్లో.. అత్యధికంగా 91 వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించిన ఏకైన టీమిండియా బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇలా భారత క్రికెట్‌కు తన వంతు సేవ చేస్తున్న చహల్‌కు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్.. టాక్స్ ఆఫీసర్‌గా ఉద్యోగం ఇచ్చింది. ఇక వీరితో పాటు టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు సైతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం ఉంది. చదవండి: సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగింపు.. భువనేశ్వర్ కుమార్ కీలక నిర్ణయం! -
ఆ స్టార్ ఆటగాడిని జట్టు నుంచి తప్పించలేదు.. బీసీసీఐ క్లారిటీ!
వెస్టిండీస్ టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో భారత వెటరన్ ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్‌కు చోటు దక్కకపోయిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ నుంచి బీజీగా గడుపతున్న మహ్మద్ షమీకీ సెలక్టర్లు కావాలనే విండీస్ సిరీస్‌కు విశ్రాంతి ఇచ్చినట్లు సమాచారం. ఈ ఏడాది వరల్డ్‌కప్ సమయానికి అతడిని ఫిట్నెస్గా ఉంచేందకు సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఐపీఎల్‌తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్లో అంతగా అకట్టుకోపోయిన ఉమేశ్ యాదవ్‌ను ఉద్దేశపూర్వకంగానే జట్టు నుంచి తప్పించారని వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలను బీసీసీఐ వర్గాలు కొట్టిపారేశాయి. ఉమేశ్ కావాలని తప్పించలేదని, అతడు మోకాలి గాయంతో బాధపడుతున్నాడని అందుకే విండీస్ టూర్‌కు పరిగణలోకి తీసుకోలేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. "ఉమేశ్ యాదవ్ ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. అతడు బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. అతడు ఇంకా సెలక్టర్లు దృష్టిలో ఉన్నాడు" అని బీసీసీఐ అధికారి ఒకరు టైమ్స్ ఇండియాతో పేర్కొన్నారు. కాగా ఇప్పటివరకు భారత్ తరపున 57 టెస్టులు ఆడిన ఉమేశ్.. 170 వికెట్లు పడగొట్టాడు. విండీస్‌తో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ. చదవండి: Andrew Strauss: ఇంతటి విషాదం దాగుందా! పాపం.. పిల్లల ముద్దూముచ్చట చూడకుండానే.. మళ్లీ పెళ్లి చేసుకోకుండానే.. -
డబ్ల్యూటీసీ ఓటమి ఎఫెక్ట్.. పుజారా, ఉమేశ్ యాదవ్‌లపై వేటు..?
వరుసగా రెండో సీజన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోవడాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. చర్యల్లో భాగంగా గత కొంతకాలంగా పేలవ ప్రదర్శనలు చేస్తున్న ఆటగాళ్లపై వేటు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రముఖ వార్తా సంస్థ కథనం ప్రకారం.. త్వరలో ప్రారంభంకాబోయే విండీస్ టూర్ కోసం టీమిండియాలో సమూల మార్పుల చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. టెస్ట్‌ల్లో దారుణంగా విఫలమవుతున్న చతేశ్వర్ పుజారా, ఉమేశ్ యాదవ్‌లపై వేటుకు సర్వం సిద్ధమైనట్లు సమాచారం. వీరి స్థానంలో యశస్వి జైస్వాల్, ముకేశ్ కుమార్‌లను ఎంపిక చేసే అవకాశం ఉంది. అలాగే పరిమిత ఓవర్ల ఫార్మాట్లోనూ పలు మార్పులకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2023 ప్రదర్శనల ఆధారంగా పలు ఎంపికలు ఉండవచ్చని సమాచారం. టీ20ల్లో రింకూ సింగ్, యశస్వి జైస్వాల్, జితేశ్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, మోహిత్ శర్మలకు దాదాపుగా ఛాన్స్ దక్కవచ్చని తెలుస్తోంది. విండీస్ టూర్లో సీనియర్ల గైర్హాజరీలో వీరికి వీలైనన్ని అవకాశాలు ఇవ్వాలని బోర్డు యోచిస్తున్నట్లు వినికిడి. ఇదే విండీస్ టూర్లో వన్డేల కోసం పలువురు ఆటగాళ్లను ప్రత్యేకంగా ఎంపిక చేయవచ్చన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ లిస్ట్‌లో శిఖర్ ధవన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ధవన్‌కు వయసు పైబడుతుండటంతో వరల్డ్‌కప్‌కు ముందు వీలైనన్ని అవకాశాలు కల్పించాలన్నది బీసీసీఐ యోచనగా తెలుస్తోంది. కాగా, 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ కోసం భారత జట్టు జులై 12 నుంచి వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్ తొలుత టెస్ట్‌లు, ఆతర్వాత వన్డేలు, టీ20లు ఆడుతుంది. విండీస్ పర్యటన వివరాలు.. తొలి టెస్ట్- జులై 12-16, డొమినికా రెండో టెస్ట్- జులై 20-24, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ జులై 27- తొలి వన్డే, బ్రిడ్జ్‌టౌన్ జులై 29- రెండో వన్డే, బ్రిడ్జ్‌టౌన్ ఆగస్ట్ 1- మూడో వన్డే, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఆగస్ట్ 4- తొలి టీ20, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఆగస్ట్ 6- రెండో టీ20, గయానా ఆగస్ట్ 8- మూడో టీ20, గయానా ఆగస్ట్ 12- నాలుగో టీ20, ఫ్లోరిడా ఆగస్ట్ 13- ఐదో టీ20, ఫ్లోరిడా చదవండి: WTC Final 2023: ఆల్ ఫార్మాట్ సూపర్ స్టార్స్‌గా ఈ ఐదుగురు క్రికెటర్లు -
ఉమేశ్ యాదవ్ వైల్డ్ రియాక్షన్ వెనుక కారణం అదేనా?
ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా పోరాడుతోంది. ఆసీస్ ఇప్పటికే 330 పరుగులకు పైగా ఆధిక్యంలో ఉండడంతో టీమిండియాకు ఓటమి ముప్పు పొంచే ఉంది. మరో గంటలో ముగిసే తొలి సెషన్లోపూ ఆసీస్‌ను ఆలౌట్ చేయకుంటే టీమిండియాకు పెను ప్రమాదం ఉంది. 400 పరుగులకు పైగా టార్గెట్‌ను నిర్దేశించే పనిలో ఉన్న ఆసీస్ ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. గ్రీన్ 25, అలెక్స్ కేరీ 22 పరుగులతో ఆడుతున్నారు. ఈ విషయం పక్కనబెడితే.. నాలుగోరోజు ఆట మొదలైన కాసేపటికే ఉమేశ్ యాదవ్ బ్రేక్ ఇచ్చాడు. 41 పరుగులతో నిలకడగా ఆడుతున్న మార్నస్ లబుషేన్‌ను తెలివిగా బుట్టలో వేసుకున్నాడు. ఇన్సైడ్ ఎడ్జ్ అయిన బంతి లబుషేన్ బ్యాట్‌కు తగులుతూ నేరుగా పుజారా చేతుల్లోకి వెళ్లింది. దీంతో ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. అయితే లబుషేన్ ఔట్ చేసిన ఆనందంలో ఉమేశ్ యాదవ్ గట్టిగా అరుస్తూ కాస్త వైల్డ్‌గా రియాక్ట్ అయ్యాడు. అయితే ఉమేశ్ ఇలా చేయడం వెనుక ఒక కారణముందని అభిమానులు భావిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఉమేశ్ యాదవ్ ఒక్క వికెట్ కూడా తీయలేదు.. పైగా దారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అతనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. కానీ ఉమేశ్ ఇవేవి పట్టించుకోకుండా కేవలం తన ప్రదర్శనతోనే సమాధానం చెప్పాలనుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం మంచి బౌలింగ్ ప్రదర్శన కనబరుస్తున్న ఉమేశ్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. సీనియారిటీ ఎప్పటికైనా పనికొచ్చేది కాని వ్యర్థం కాదు అని నిరూపించాడు. అందుకే లబుషేన్ వికెట్ తీయగానే అంత వైల్డ్‌గా రియాక్ట్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: 'గాయాన్ని సైతం లెక్క చేయని మీ పోరాటం అసమానం' -
మిగతా వారు ఏదో ఒక రకంగా పనికొచ్చారు.. నువ్వేందుకు, దండగ.. ఉమేశ్‌పై ఫ్యాన్స్ ఫైర్
ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఏదో అద్భుతం జరిగితే తప్ప, ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవలేదు. గెలవడం పక్కన పెడితే, కనీసం డ్రా కూడా చేసుకోలేదు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 296 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. లంచ్ అనంతరం కొన్ని ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి, 450కిపైగా టార్గెట్ సెట్ చేయాలన్నది ఆసీస్ ప్రణాళిక కావచ్చు. క్రీజ్‌లో లబూషేన్ (41), గ్రీన్ (7) ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ ఉమేశ్‌యాదవ్ తేలిపోవడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస ప్రభావం కూడా చూపలేకపోతున్నాడని దుమ్మెత్తిపోస్తున్నారు. ఉమేశ్‌ను అనవసరంగా తీసుకున్నారని మేనేజ్మెంట్పై మండిపడుతున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడో లేదో తెలుసుకోకుండా ఉమేశ్‌ను లండన్ ఫ్లైట్ ఎక్కించారని ఆరోపిస్తున్నారు. షమీ, సిరాజ్ స్పెషలిస్ట్ రైట్ ఆర్మ్ పేసర్లుగా ఉన్నప్పుడు, ఉమేశ్‌ను తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీస్తున్నారు. ఆసీస్ టాపార్డర్ లెఫ్ట్, రైట్ హ్యాండ్ బ్యాటర్ల కలయికతో ఉంటుందని తెలిసినప్పుడు, మూడో పేసర్‌గా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జయదేవ్ ఉనద్కత్‌ను తీసుకోవాల్సి ఉండిందని అంటున్నారు. ఉనద్కత్‌పై కూడా సదభిప్రాయం లేనప్పుడు మ్యాచ్ విన్నర్, అనుభవజ్ఞుడైన అశ్విన్‌ను అయినా తీసుకోవాల్సిందని కామెంట్స్ చేస్తున్నారు. జట్టులో మిగతా ఆటగాళ్లంతా ఏదో ఒక రకంగా అయినా ఉపయోగపడ్డారని.. ఉమేశ్ తన పాత్రకు కనీస న్యాయం కూడా చేయలేకపోయాడని మండిపడుతున్నాడు. ఒకవేళ టీమిండియా ఓడిపోతే, దానికి ప్రధాన కారణం ఉమేశ్యాదవే అవుతాడని అంటున్నారు. స్పిన్నర్లుకు ఏ మాత్రం సహకరించని పిచ్‌పై జడేజా 3 వికెట్లు తీస్తే.. ఉమేశ్ 30 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసి ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడని ధ్వజమెత్తుతున్నారు. ఓవరాల్‌గా ఉమేశ్‌ను టార్గెట్ చేసి దుమ్మెత్తిపోస్తున్నారు. స్కోర్ వివరాలు.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 469 ఆలౌట్ (హెడ్ 163, స్మిత్ 121, సిరాజ్ 4/108) భారత్ తొలి ఇన్నింగ్స్: 296 ఆలౌట్ (రహానే 89, ఠాకూర్ 51, కమిన్స్ 3/83) ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 123/4 (లబూషేన్ 41 బ్యాటింగ్, జడేజా 2/25) ఆసీస్ 296 పరుగుల ఆధిక్యంలో ఉంది చదవండి: ఆసీస్ పేసర్ సూపర్ డెలివరీ.. భరత్‌కు దిమ్మతిరిగిపోయింది! వీడియో వైరల్ -
WTC Final: రాహుల్ స్థానంలో యువ వికెట్ కీపర్ బ్యాటర్.. బీసీసీఐ ప్రకటన
#WTC Final 2023: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ జట్టులో యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు చోటు దక్కింది. కేఎల్ రాహుల్ స్థానంలో అతడిని జట్టుకు ఎంపిక చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి తెలిపింది. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. కాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 గెలిచిన టీమిండియా.. ఆసీస్‌తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 7-11 వరకు టీమిండియా- ఆస్ట్రేలియా తుదిపోరులో పోటీ పడనున్నాయి. ఇంగ్లండ్ వేదికగా ఇరు జట్లు టైటిల్ వేటలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే బీసీసీఐ ఆసీస్‌తో తలపడే భారత జట్టును ప్రకటించింది. రాహుల్ అవుట్ అయితే, ఐపీఎల్-2023లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్, టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. కుడి తొడ పైభాగంలో నొప్పి తీవ్రమైన నేపథ్యంలో సర్జరీ చేయించుకునేందుకు నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమైన అతడు డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి కూడా వైదొలిగినట్లు బీసీసీఐ తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. అతడి స్థానంలో ఇషాన్ కిషన్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్లు తెలిపింది. వాళ్లిద్దరి సంగతి ఏంటి? ఇక ఎడమ భుజానికి గాయం కావడంతో ఇబ్బంది పడుతున్న పేసర్ జయదేవ్ ఉనాద్కట్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. అతడి గాయం తీవ్రతపై పూర్తిగా స్పష్టత వచ్చిన తర్వాతే డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో కొనసాగే అంశంపై క్లారిటీ వస్తుందని తెలిపింది. ముగ్గురికి ఛాన్స్ అదే విధంగా మరో పేసర్ ఉమేశ్ యాదవ్ కూడా కేకేఆర్ వైద్య బృందం పర్యవేక్షణలో కోలుకుంటున్నాడన్న బీసీసీఐ.. తమ మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటోందని తెలిపింది. ఇక శ్రేయస్ అయ్యర్ వెన్ను నొప్పి కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టాండ్‌బై ప్లేయర్లుగా రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్‌లతో పాటు బౌలర్ ముకేశ్ కుమార్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. కాగా ఇంతవరకు టీమిండియా తరఫున ఒక్క టెస్టు కూడా ఆడని ఇషాన్ ఏకంగా డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రధాన జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. ఆసీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు బీసీసీఐ ఎంపిక చేసిన టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్). స్టాండ్ బై ప్లేయర్లు: రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్ కుమార్, సూర్యకుమార్ యాదవ్. చదవండి: లక్నో సూపర్ జెయింట్స్‌కు మరో బిగ్ షాక్.. స్టార్ ఆటగాడు దూరం! -
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్!
ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు ఫైనల్‌కు ముందు టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ దూరం.. ఇప్పుడు మరో కీలక పేసర్ ఉమేశ్ యాదవ్ గాయపడ్డాడు. ఉమేశ్ ప్రస్తుతం ఐపీఎల్-2023లో కోల్‌కతా నైటరైడర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఉమేష్ యాదవ్ మోకాలికి గాయమైంది. గాయం తీవ్రమైనది కావడంతో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌కు ఉమేష్ దూరమయ్యాడు. అతడు ఈ ఏడాది సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు కూడా దూరమయ్యే ఛాన్స్ ఉంది. ఒక వేళ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఉమేష్ ఫిట్నెస్ సాధించకపోతే భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. ఇక లండన్ ఓవల్ వేదికగా జూన్7 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఇప్పటికే ఇరు క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. భారత జట్టులో అనూహ్యంగా వెటరన్ ఆటగాడు అజింక్యా రహానేకు చోటు దక్కింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, ఉనద్కత్ చదవండి:Ind Vs Aus WTC 2023: టీమిండియా ఆల్‌రౌండర్‌కు బంపరాఫర్.. పాపం సూర్యకుమార్! -
ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ఉమేశ్ యాదవ్.. ఒకే ఒక్కడు!
ఐపీఎల్లో టీమిండియా వెటరన్ పేసర్, కేకేఆర్ ఫాస్ట్‌బౌలర్ ఉమేశ్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. ఒక జట్టుపై అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ఉమేశ్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2023లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజపాక్సేను ఔట్ చేసిన ఉమేశ్ యాదవ్.. ఈ అరుదైన రికార్డు సాధించాడు. పంజాబ్‌పై ఇప్పటివరకు ఉమేశ్ యాదవ్ 34 వికెట్లు పడగొట్టాడు. కాగా గతంలో ఈ రికార్డు సీఎస్కే మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో పేరిట ఉండేది. బ్రావో ముంబై అత్యధికంగా 33 వికెట్ల పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో బ్రావో రికార్డును ఉమేశ్ బ్రేక్ చేశాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. కేకేఆర్‌పై పంజాబ్ కింగ్స్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 16 ఓవర్లలో 7 వికెట్లకు 146 పరుగులు చేసిన దశలో భారీ వర్షంతో ఆట నిలిచిపోయింది. వర్షం తగ్గకపోవడంతో ఆట సాధ్యపడలేదు. దీంతో డిఎల్ఎస్ ప్రకారం 16 ఓవర్లకు కోల్‌కతా విజయ సమీకరణం 154 పరుగులుగా ఉంది. 7పరుగులు కేకేఆర్ వెనుకబడి ఉండడంతో పంజాబ్‌ను విజేతగా నిర్ణయించారు. చదవండి: IPL 2023: చరిత్ర సృష్టించిన మార్క్‌వుడ్.. లక్నో తరపున తొలి బౌలర్‌గా -
తండ్రైన టీమిండియా స్టార్ క్రికెటర్.. మహిళా దినోత్సవం రోజే గుడ్ న్యూస్
టీమిండియా వెటరన్ పేసర్ ఉమేశ్ యాదవ్ రెండోసారి తండ్రయ్యాడు. అతడి భార్య తాన్య వధ్వా బుధవారం(మార్చి8) పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఉమేశ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. 2013 మే 29న పంజాబ్‌కు చెందిన తాన్యాను ఉమేశ్ యాదవ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2021 జనవరి 1న ఆడ బిడ్డకు జన్మనిచ్చిన ఈ జంట.. ఇప్పుడు రెండో సంతనంగా కూడా పాపకే జన్మనిచ్చింది. ఇక మహిళా దినోత్సవం రోజున మహాలక్ష్మి తన ఇంటిలో అడుగుపెట్టడంతో పట్టరాని సంతోషంలో ఉమేశ్ మునిగి తెలిపోతున్నాడు. ఇక ఉమేశ్ యాదవ్‌కు అభిమానులు, సహచర ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు అభినందనలు తెలుపుతున్నారు. కాగా ఉమేష్ యాదవ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బీజీబీజీగా ఉన్నాడు. మార్చి 9 నుంచి అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న ఆఖరిటెస్టులో అదరగొట్టేందుకు ఉమేశ్ సిద్దమవుతున్నాడు. ఈ క్రమంలో అహ్మదాబాద్‌లో ఉన్న అతడు తన కూతురుని చూడటానికి వెళ్లే వీలు పడలేదు. ఆఖరి టెస్టు ముగిసిన అనంతరం తన గారాల పట్టిని చూడటానికి ఉమేశ్ వెళ్లనున్నాడు. ఇక మూడో టెస్టులో భారత్ ఓటమిపాలైనప్పటికీ.. ఉమేశ్ యాదవ్ మాత్రం తన అద్భుత ప్రదర్శనతో అకట్టుకున్నాడు. కాగా ఇటీవలే ఉమేశ్ యాదవ్ తండ్రి తిలక్ యాదవ్(74) అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. చదవండి: Saeed Anwar-PM Modi: ప్రధాని మోదీపై పాక్ మాజీ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. 'సైతాన్' అంటూ..! View this post on Instagram A post shared by Umesh Yaadav (@umeshyaadav) -
'లక్ష్యం చిన్నదే.. రేపు ఏమైనా జరగొచ్చు!'
ఇండోర్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొదలైన మూడో టెస్టు తుది అంకానికి చేరుకుంది. ఈ మ్యాచ్ కూడా తొలి రెండు టెస్టుల్లాగే మూడో రోజునే ముగిసిపోయే అవకాశం ఉంది. రెండో రోజు ఆటలో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులకే ఆలౌట్ కావడంతో ఆసీస్ ముందు 76 పరుగుల స్వల్ప టార్గెట్ మాత్రమే ఉంది. నాథన్ లియోన్ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాసించాడు. ఇక ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఆసీస్ జట్టు గెలుపు లాంచనమే. అయితే టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ మాత్రం టీమిండియా విజయంపై ధీమా వ్యక్తం చేశాడు. ''క్రికెట్లో ఏదైనా జరగొచ్చు. టార్గెట్ 76 పరుగులే కావొచ్చు.. కానీ రేపు(మూడోరోజు ఆటలో) ఏమైనా జరగొచ్చు. టైట్ బౌలింగ్ వేయడానికి ప్రయత్నిస్తాం. ఇండోర్ పిచ్ అంత ఈజీ వికెట్ మాత్రం కాదు. ఈ వికెట్ మా జట్టు బ్యాటర్లు కావొచ్చు.. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు అయినా సరే బ్యాటింగ్ చేయడం మాత్రం కష్టం. అందునా స్కోరు తక్కువ ఉంది కదా అని హిట్టింగ్ ఆడే ప్రయత్నం చేస్తే మొదటికే మోసం వస్తుంది. బంతి మాత్రం వికెట్‌కు చాలా తక్కువ ఎత్తులో వెళుతుంది.. ఇది బ్యాటర్లను ఇబ్బంది పెట్టొచ్చు. వారికి టార్గెట్ చిన్నదే కావొచ్చు.. ఫలితం అనుకూలంగా వచ్చేందుకు మేం చేయాల్సింది చేస్తాం'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఉమేశ్ యాదవ్ ఈ మధ్య కాలంలో టీమిండియాకు టెస్టులకు మాత్రమే పరిమితమ్యాడు. జట్టుకు ఎంపిక అవుతున్నప్పటికి తుదిజట్టులో అవకాశం చాలా తక్కువగానే వస్తోంది. తాజాగా షమీకి రెస్ట్ ఇవ్వడంతో ఉమేశ్ తుది జట్టులోకి వచ్చాడు. తన బౌలింగ్‌తో ఆకట్టుకున్న ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. ఇటీవలే తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఉమేశ్ బౌలింగ్‌లో అదరగొట్టడం అతనికి కాస్త ఊరటనిచ్చే అంశం అని చెప్పొచ్చు. మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ వికెట్ తీయడం ద్వారా ఉమేశ్ స్వదేశంలో టెస్టుల్లో వంద వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఓవరాల్‌గా 54 టెస్టుల్లో 165 వికెట్లు, 75 వన్డేల్లో 106 వికెట్లు, 9 టి20ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. చదవండి: తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉండి కూడా నిప్పులు చెరిగిన ఉమేశ్ మెస్సీనా మజాకా.. జట్టు కోసం గోల్డ్-ఐఫోన్స్ -
తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉండి కూడా నిప్పులు చెరిగిన ఉమేశ్
BGT 2023: ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో మహ్మద్ షమీకి రెస్ట్ ఇవ్వడంతో చివరి నిమిషంలో తుది జట్టులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్.. అందివచ్చిన అవకాశాన్ని సరైన రీతిలో సద్వినియోగం చేసుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌లో (13 బంతుల్లో 17; ఫోర్, 2 సిక్సర్లు) అత్యంత కీలకమైన పరుగులను మెరుపు వేగంతో సాధించిన ఉమేశ్.. ఆ తర్వాత బౌలింగ్‌లో మరింతగా రెచ్చిపోయి స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను తక్కువ స్కోర్‌కు కట్టడి చేయడంతో కీలకంగా వ్యవహరించాడు. రెండో రోజు తొలి సెషన్లో డ్రింక్స్ తర్వాత బంతిని అందుకున్న ఉమేశ్.. స్పిన్‌కు అనుకూలిస్తున్న వికెట్‌పై నిప్పులు చెరుగుతూ తొలుత గ్రీన్‌ను ఎల్బీడబ్ల్యూగా ఆతర్వాత స్టార్క్‌ను, మర్ఫీలను క్లీన్ బౌల్డ్ చేశాడు. స్టార్క్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాక ఉమేశ్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు వచ్చి చేరింది. స్టార్క్ వికెట్‌తో ఉమేశ్ స్వదేశంలో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఉమేశ్ మెరుపు వేగంతో సంధించిన బంతుల ధాటికి స్టార్క్, మర్ఫీ వికెట్లు గాల్లో పల్టీలు కొడుతూ నాట్యం చేశాయి. తొలి రోజు ఆటలో కూడా ఉమేశ్ ఓ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్ట్‌ల్లో ఉమేశ్.. యువరాజ్ సింగ్ (22), రవిశాస్త్రి (22)లను అధిగమించి, కోహ్లి సిక్సర్ల రికార్డును (24) సమం చేశాడు. భారత్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఉమేశ్.. కోహ్లితో కలిసి సంయుక్తంగా 17వ స్థానంలో నిలిచాడు. ఊహించని విధంగా భారత తుది జట్టులోకి వచ్చి రికార్డులు కొల్లగొట్టడంతో పాటు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఉమేశ్.. ఏ పరిస్థితుల్లో ఇలా రాణించాడో తెలిస్తే అతన్ని వ్యతిరేకించే వారు సైతం ప్రశంసించక మానరు. ఉమేశ్ ఫిబ్రవరి 23న తన తండ్రిని కోల్పోయాడు. పుట్టెడు దుఖంలో ఉండి కూడా అతడు రాణించిన తీరు నిజంగా అభినందనీయం. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, జట్టుకు ఉపయోగపడాలన్న అతని కమిట్మెంట్కు ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే. తండ్రిని కోల్పోయి కనీసం దినవారాలు కూడా గడవకముందే దేశం కోసం అతను సర్వశక్తులు ఒడ్డి పాటుపడుతున్న తీరును ఎంత పొగిడినా తక్కువే. ఉమేశ్.. ఈ టెస్ట్‌లో మున్ముందు మరింత కీలకంగా మారి టీమిండియాను గెలిపించాలని ఆశిద్దాం. ఇదిలా ఉంటే, 156/4 స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా 197 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. లంచ్ విరామం సమయానికి వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 75 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
న్యూజిలాండ్‌కు వెళ్లనున్న బుమ్రా
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా తనను దీర్ఘకాలంగా వేధిస్తున్న వెన్ను సమస్యను పరిష్కరించుకునేందుకు న్యూజిలాండ్‌కు బయలుదేరనున్నాడని తెలుస్తోంది. బీసీసీఐ మెడికల్ టీమ్, ఎన్సీఏ మేనేజర్లు బుమ్రా వెన్నుకు చికిత్స చేసేందుకు రోవన్ షౌటెన్ అనే న్యూజిలాండ్ సర్జన్‌ను రెకమెండ్ చేసినట్లు సమాచారం. బుమ్రాకు చికిత్స అందించబోయే సర్జన్.. ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కోలుకోవడంలో కీలకంగా వ్యవహరించాడని, ఈ కారణంగానే బుమ్రాను కూడా అతనికే రెకమెండ్ చేస్తున్నామని బీసీసీఐకి చెందిన కీలక అధికారి ఒకరు తెలిపారు. బుమ్రా.. క్రైస్ట్‌చర్చ్ వెళ్లేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నట్లు సదరు అధికారి వెల్లడించాడు. బుమ్రాకు ఇప్పుడే సర్జరీ అయితే కోలుకునేందుకు 20 నుంచి 24 వారాల సమయం పట్టవచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే బుమ్రా ఐపీఎల్‌తో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు కూడా దూరంగా ఉండాల్సి వస్తుంది. వన్డే వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ వీలైనంత త్వరగా బుమ్రాకు చికిత్స చేయించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐదు నెలలుగా ఆటకు దూరంగా ఉన్న బుమ్రా.. సర్జరీ జరిగితే ఓవరాల్‌గా ఏడాది కాలం పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నట్లవుతుంది. ఇదిలా ఉంటే, బుమ్రా గైర్హాజరీలో బీసీసీఐ ఉమేశ్ యాదవ్‌పై అధికంగా ఫోకస్ పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆసీస్‌తో మూడో టెస్ట్‌కు షమీకి విశ్రాంతిని ఇచ్చి మరీ ఉమేశ్‌కు అవకాశం కల్పించినట్లు స్పష్టమవుతోంది. -
విరాట్ కోహ్లి రికార్డును సమం చేసిన ఉమేశ్ యాదవ్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా బౌలర్ ఉమేశ్ యాదవ్ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం మహ్మద్ షమీకి విశ్రాంతినివ్వడంతో జట్టులోకి వచ్చిన ఉమేశ్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తాను సద్వినియోగం చేసుకున్న అవకాశం బ్యాట్‌తో అనుకుంటే పొరపాటే. ఉమేశ్.. మూడో టెస్ట్ తొలి రోజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది తన బ్యాటింగ్ నైపుణ్యంతో. ఈ మ్యాచ్‌లో పదో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన ఉమేశ్.. 13 బంతుల్లో 2 సిక్సర్లు, బౌండరీ సాయంతో 17 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో ఉమేశ్.. ఓ విషయంలో విరాట్ కోహ్లిని అధిగమించాడు. కోహ్లి తన టెస్ట్ కెరీర్లో ఇప్పటివరకు 24 సిక్సర్లు బాదగా.. ఈ మ్యాచ్‌లో కొట్టిన 2 సిక్సర్లు కలుపుకుని ఉమేశ్ కూడా తన కెరీర్లో అన్నే సిక్సర్లు బాదాడు. విరాట్ సిక్సర్ల రికార్డును సమం చేసే క్రమంలో ఉమేశ్.. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి (22 సిక్సర్లు), భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (22)ల రికార్డులను అధిగమించాడు. ఓవరాల్‌గా చూస్తే.. భారత్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (91) పేరిట ఉండగా.. ధోని (78), సచిన్ టెండూల్కర్ (69), రోహిత్ శర్మ (68), కపిల్ దేవ్ (61) వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో ఉన్నారు. ఉమేశ్, విరాట్‌తో కలిసి సంయుక్తంగా 17వ స్థానంలో నిలిచాడు. మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకు ఆలౌటైంది. కుహ్నేమన్ (5/16) టీమిండియా బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేయగా.. లయోన్ (3/35), మర్ఫీ (1/23) భారత జట్టు పతనంలో తమవంతు పాత్ర పోషించారు. రోహిత్ (12), గిల్ (21), శ్రీకర్ భరత్ (17), అక్షర్ పటేల్ (12 నాటౌట్), ఉమేశ్ యాదవ్ (17) అతికష్టం మీద రెండంకెల స్కోర్ సాధించగా.. విరాట్ కోహ్లి (22) భారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు (54 ఓవర్లు) చేసింది. ట్రవిస్ హెడ్ (9), ఉస్మాన్ ఖ్వాజా (60), లబూషేన్ (31), స్టీవ్ స్మిత్ (26) ఔట్ కాగా.. హ్యాండ్స్కోంబ్ (7), గ్రీన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ కోల్పోయిన వికెట్లన్నీ జడేజా ఖాతాలోకే వెళ్లాయి. ప్రస్తుతానికి ఆసీస్ 47 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. -
Ind Vs Aus: ఆసీస్‌తో సిరీస్.. టీమిండియా క్రికెటర్ తండ్రి కన్నుమూత
నాగ్‌పూర్/ముంబై: టీమిండియా క్రికెటర్ ఉమేశ్ యాదవ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఉమేశ్ తండ్రి తిలక్ యాదవ్(74) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. కానీ, పరిస్థితి విషమించడంతో వైద్యులు ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం కాపర్ఖెడాలోని మిలన్ చౌక్‌లో గల నివాసానికి తీసుకురాగా.. బుధవారం సాయంత్రం తిలక్ యాదవ్ తుదిశ్వాస విడిచారు. కాగా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన తిలక్ ఉద్యోగరీత్యా మహారాష్ట్రలో నాగ్‌పూర్‌లో స్థిరపడ్డారు. వాల్నీ కోల్ మైన్‌లో పని చేసి రిటైర్ అయ్యారాయన. రెజ్లింగ్ పట్ల ఆయనకు అమితాసక్తి. అయితే, కొడుకును పోలీస్‌గా చూడాలని తిలక్ యాదవ్ భావించారు. అందుకు తగ్గట్లుగా ఉమేశ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో క్రికెటర్ అవుతానని తండ్రిని ఒప్పించిన ఉమేశ్ యాదవ్.. టీమిండియా పేసర్‌గా ఎదిగాడు. ప్రస్తుతం అతడు బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడుతున్న జట్టుతో ఉన్నాడు. అయితే, తొలి రెండు మ్యాచ్‌లలోనూ అతడు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌లకు వరుస అవకాశాలు ఇచ్చిన మేనేజ్మెంట్ ఉమేశ్‌కు మొండిచేయి చూపింది. తదుపరి మ్యాచ్‌లలోనైనా తనకు ఆడే అవకాశం వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న ఉమేశ్‌కు.. ఇంతలోనే తండ్రి మరణించాడనే ఈ విషాదకర వార్త తెలిసింది. కాగా మార్చి 1 నుంచి ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ఆరంభం కానుంది. ఇక మొత్తంగా ఉమేశ్ యాదవ్ ఇప్పటి వరకు.. టీమిండియా తరఫున 54 టెస్టులాడి 164 వికెట్లు, 75 వన్డేల్లో 106 వికెట్లు, ఏడు టీ20 మ్యాచ్‌లతో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. కాగా గతేడాది చివరిసారిగా బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడాడు ఉమేశ్ యాదవ్. చదవండి: IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త సారధి పేరు ప్రకటన -
భారత క్రికెటర్‌కు చేదు అనుభవం.. నమ్మితే నట్టేట ముంచాడు
టీమిండియా వెటరన్ పేసర్ ఉమేశ్ యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. స్నేహితుడని నమ్మి పని ఇస్తే నట్టేట ముంచాడు. ఫ్లాట్ కొనుగోలు పేరిట ఉమేశ్ యాదవ్‌ను బురిడీ కొట్టించి రూ. 44 లక్షలు ఎగనామం పెట్టాడు. విషయంలోకి వెళితే.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని కోరాడి పట్టణానికి చెందిన శైలేష్ ఠాక్రే (37)తో ఉమేశ్ యాదవ్‌కు ఎంతోకాలంగా స్నేహం ఉంది. శైలేష్ కు ఉద్యోగం లేపోవడంతో ఉమేశ్ తన మేనేజర్ గా జూలై 2014లో నియమించుకున్నాడు.ఎంతో నమ్మకంగా ఉండటంతో శైలేష్ కు ఆర్థిక వ్యవహారాలు కూడా అప్పగించాడు. ఉమేశ్ యాదవ్ బ్యాంకు ఖాతాలు, ఆదాయపన్ను లావాదేవీలు, ఇతర ఆర్థిక వ్యవహారాలన్నీ శైలేష్ ఠాక్రేనే చక్కబెట్టేవాడు. ఈ క్రమంలో రూ.44లక్షలకే భూమి ఇప్పిస్తానని ఉమేశ్ ను నమ్మించి ఆ ఫ్లాట్ ను తన పేరిట రిజిస్ట్రర్ చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకుని క్రికెటర్ ఉమేశ్ యాదవ్ నివ్వెరపోయాడు. నమ్మిన స్నేహితుడే తనను మోసం చేశాడని తెలిసి ఆవేదనకు గురయ్యాడు. తన డబ్బు తిరిగి ఇవ్వాలని శైలేష్‌ను కోరాడు. అయితే డబ్బు ఇవ్వడానికి శైలేష్ నిరాకరించడంతో ఉమేశ్ యాదవ్ పోలీసులను ఆశ్రయించాడు.ఉమేశ్ యాదవ్ ఫిర్యాదుతో పోలీసుల రంగంలోకి దిగారు. ఐపీసీ సెక్షన్లు 406, 420 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఇక 2011లో టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఉమేశ్ యాదవ్ కొంతకాలంగా టెస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు. 12 ఏళ్ల కెరీర్లో ఉమేశ్ యాదవ్ 54 టెస్టుల్లో 165 వికెట్లు, 75 వన్డేల్లో 106 వికెట్లు, 9 టి20ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. చదవండి: 'భారీ స్కోర్లు రావడం లేవని తెలుసు.. కచ్చితంగా సెంచరీ కొడతా' -
IND vs BAN 2nd Test: భారత బౌలర్లదే పైచేయి
ఒకవైపు ఉమేశ్, ఉనాద్కట్ పదునైన పేస్... మరోవైపు అనుభవజ్ఞుడైన అశ్విన్ స్పిన్ తంత్రం... వెరసి రెండో టెస్టులో తొలి రోజే బంగ్లాదేశ్ కుప్పకూలింది. భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేని ఆతిథ్య జట్టు కనీస స్కోరు కూడా సాధించలేక చతికిలపడింది. మోమినుల్ హక్ పోరాటం మినహా జట్టు బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ విశేషమేమీ లేకపోయింది. గత టెస్టుతో పోలిస్తే అశ్విన్ మెరుగైన ప్రదర్శన ఇవ్వగా, ఉపఖండం పిచ్‌లపై ఉమేశ్ మళ్లీ సత్తా చాటాడు. పుష్కరకాలం తర్వాత టెస్టు ఆడిన ఉనాద్కట్ కూడా రెండు వికెట్లతో సంతృప్తిగా ముగించాడు. ఆపై టీమిండియా వికెట్ కోల్పోకపోయినా... ఆడిన 9 ఓవర్లలోనే ఎన్నో సార్లు బంతి అనూహ్యంగా స్పందించడంతో ఓపెనర్లు ఉత్కంఠభరిత క్షణాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనిని చూస్తే రెండో రోజు ఆట భారత బ్యాటింగ్‌కు సవాల్ విసిరేలా ఉంది. మిర్పూర్: భారత్‌తో గురువారం మొదలైన రెండో టెస్టులో బంగ్లాదేశ్ పేలవ బ్యాటింగ్ ప్రదర్శన కొనసాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 73.5 ఓవర్లలో 227 పరుగులకే ఆలౌటైంది. మోమినుల్ హక్ (157 బంతుల్లో 84; 12 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా, మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. భారత్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్, అశ్విన్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ ఆట ముగిసే సమయానికి 8 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 19 పరుగులు చేసింది. షకీబ్ విఫలం... బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో 40 పరుగులకు పైగా నమోదైన భాగస్వామ్యాలు నాలుగు కాగా, అత్యధికం 48 మాత్రమే! ఇదీ ఆ జట్టు బ్యాటింగ్ పరిస్థితిని చూపిస్తోంది. ఒక్కో జోడీ నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉండగానే భారత బౌలర్లు వికెట్ తీసి బంగ్లాకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. మొత్తంగా చూస్తే జట్టు ఇన్నింగ్స్ ఏ దశలోనూ భారీ స్కోరు దిశగా వెళ్లలేదు. ఓపెనర్లు నజ్ముల్ హొస్సేన్ (24), జాకీర్ హసన్ (15) ఆరంభంలో కొంత జాగ్రత్త ప్రదర్శించినా... అదీ ఎక్కువ సేపు సాగలేదు. ‘0’ వద్ద జాకీర్ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేసినా దాని వల్ల భారత్‌కు పెద్దగా నష్టం జరగలేదు. జాకీర్‌ను అవుట్ చేసి ఉనాద్కట్ టెస్టుల్లో తొలి వికెట్ సాధించాడు. అదే స్కోరు వద్ద నజ్ముల్ కూడా అవుట్ కాగా... లంచ్ సమయానికి బంగ్లా స్కోరు 82/2కు చేరింది. అయితే విరామం తర్వాత తొలి బంతికే చెత్త షాట్ ఆడిన షకీబ్ (16) నిష్క్రమించాడు. మరోవైపు మోమిన్ మాత్రం పట్టుదలగా నిలబడి కొన్ని చక్కటి షాట్లతో పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు. అతనికి కొద్ది సేపు ముష్ఫికర్ రహీమ్ (26) సహకరించాడు.అశ్విన్ ఓవర్లో ముష్ఫికర్ వరుసగా మూడు ఫోర్లు కొట్టడం సహా ఒక దశలో పది బంతుల వ్యవధిలో వీరిద్దరు ఆరు ఫోర్లు బాదడం విశేషం. ఈ జోడీని జైదేవ్ ఉనాద్కట్ విడదీయగా... సిరాజ్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టి దూకుడు ప్రదర్శించిన లిటన్ దాస్ (25) దానిని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి 78 బంతుల్లో మోమినుల్ అర్ధసెంచరీ పూర్తయింది. టీ బ్రేక్ తర్వాత ఒకదశలో బంగ్లా 213/5తో మెరుగైన స్థితిలోనే ఉంది. అయితే భారత బౌలర్లు చెలరేగడంతో మరో 14 పరుగులకే ఆ జట్టు తర్వాతి ఐదు వికెట్లు కోల్పోయింది. అనంతరం ఎనిమిది ఓవర్ల ఆటలో భారత్ వికెట్ తీయడంలో బంగ్లాదేశ్ బౌలర్లు సఫలం కాలేకపోయారు. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: నజ్ముల్ (ఎల్బీ) (బి) అశ్విన్ 24; జాకీర్ (సి) రాహుల్ (బి) ఉనాద్కట్ 15; మోమినుల్ (సి) పంత్ (బి) అశ్విన్ 84; షకీబ్ (సి) పుజారా (బి) ఉమేశ్ 16; ముష్ఫికర్ (సి) పంత్ (బి) ఉనాద్కట్ 26; లిటన్ దాస్ (సి) రాహుల్ (బి) అశ్విన్ 25; మెహదీ హసన్ (సి) పంత్ (బి) ఉమేశ్ 15; నూరుల్ (ఎల్బీ) (బి) ఉమేశ్ 6; తస్కీన్ (సి) సిరాజ్ (బి) ఉమేశ్ 1; తైజుల్ (నాటౌట్) 4; ఖాలెద్ (సి) ఉనాద్కట్ (బి) అశ్విన్ 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (73.5 ఓవర్లలో ఆలౌట్) 227. వికెట్ల పతనం: 1–39, 2–39, 3–82, 4–130, 5–172, 6–213, 7–219, 8–223, 9–227, 10–227. బౌలింగ్: సిరాజ్ 9–1–39–0, ఉమేశ్ యాదవ్ 15–4–25–4, జైదేవ్ ఉనాద్కట్ 16–2–50–2, అశ్విన్ 21.5–3– 71–4, అక్షర్ 12–3–32–0. భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (బ్యాటింగ్) 3; గిల్ (బ్యాటింగ్) 14; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 19. బౌలింగ్: తస్కీన్ 4–2–8–0, షకీబ్ 4–2–11–0. -
బౌలర్ల విజృంభణ.. తొలి రోజు టీమిండియా ఆధిపత్యం
ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు (డిసెంబర్ 22) టీమిండియా ఆధిపత్యం చలాయించింది. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. ఉమేశ్ యాదవ్ (4/25), రవిచంద్రన్ అశ్విన్ (4/71), జయదేవ్ ఉనద్కత్ (2/50) చెలరేగడంతో బంగ్లాదేశ్‌ను 227 పరుగులకే (73.5 ఓవర్లలో) కట్టడి చేసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో మొమినుల్ హాక్ (84) టాప్ స్కోరర్‌గా నిలువగా.. నజ్ముల్ షాంటో (24), జకీర్ హసన్ (15), షకీబ్ (16), ముష్ఫికర్ రహీమ్ (26), లిటన్ దాస్ (25), మెహిది హసన్ (15), నురుల్ హసన్ (6), తస్కిన్ అహ్మద్ (1), ఖలీద్ అహ్మద్ (0) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 19 పరుగులు (8 ఓవర్లలో) చేసింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (20 బంతుల్లో 14 నాటౌట్; ఫోర్, సిక్స్), కేఎల్ రాహుల్ (30 బంతుల్లో 3 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్ కోసం టీమిండియా మేనేజ్మెంట్ ఓ అనూహ్యమైన మార్పు చేసింది. తొలి టెస్ట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు విన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కకు పెట్టి సంచలన నిర్ణయం తీసుకుంది. అతని స్థానంలో 31 ఏళ్ల సౌరాష్ట్ర పేసర్ జయదేవ్ ఉనద్కత్‌కు అవకాశం కల్పించింది. 12 ఏళ్ల తర్వాత జట్టులో చోటు దక్కించుకున్న ఉనద్కత్.. మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా 2 వికెట్లతో రాణించాడు. ఇదిలా ఉంటే, 2 మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 188 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఇదే బంగ్లా పర్యటనలో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 1-2 తేడాతో కోల్పోయింది. దీంతో టెస్ట్ సిరీస్‌ను ఎలాగైనా క్లీన్‌స్వీప్ చేసి, వన్డే సిరీస్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. -
చెలరేగిన ఉమేశ్, సత్తా చాటిన అశ్విన్.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన బంగ్లాదేశ్
ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (డిసెంబర్ 22) ప్రారంభమైన రెండో టెస్ట్‌లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. ఉమేశ్ యాదవ్ (4/25), రవిచంద్రన్ అశ్విన్ (4/71), జయదేవ్ ఉనద్కత్ (2/50) చెలరేగడంతో బంగ్లాదేశ్‌ను 227 పరుగులకే (73.5 ఓవర్లలో) ఆలౌట్ చేసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో మొమినుల్ హాక్ (84) టాప్ స్కోరర్‌గా నిలువగా.. నజ్ముల్ షాంటో (24), జకీర్ హసన్ (15), షకీబ్ (16), ముష్ఫికర్ రహీమ్ (26), లిటన్ దాస్ (25), మెహిది హసన్ (15), నురుల్ హసన్ (6), తస్కిన్ అహ్మద్ (1), ఖలీద్ అహ్మద్ (0) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కాగా, ఈ మ్యాచ్ కోసం టీమిండియా మేనేజ్మెంట్ ఓ అనూహ్యమైన మార్పు చేసింది. తొలి టెస్ట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు విన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కకు పెట్టి సంచలన నిర్ణయం తీసుకుంది. అతని స్థానంలో 31 ఏళ్ల సౌరాష్ట్ర పేసర్ జయదేవ్ ఉనద్కత్‌కు అవకాశం కల్పించింది. 12 ఏళ్ల తర్వాత జట్టులో చోటు దక్కించుకున్న ఉనద్కత్.. మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా 2 వికెట్లతో రాణించాడు. ఇదిలా ఉంటే, 2 మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 188 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఇదే బంగ్లా పర్యటనలో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 1-2 తేడాతో కోల్పోయింది. దీంతో టెస్ట్ సిరీస్‌ను ఎలాగైనా క్లీన్‌స్వీప్ చేసి, వన్డే సిరీస్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. అలాగే, ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరే అవకాశాలు కూడా మెరుగవుతాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఈ మ్యాచ్‌ను చాలా సిరీయస్‌గా తీసుకుంది. -
ఉమేశ్ యాదవ్.. నీలో ఈ టాలెంట్ కూడా ఉందా..?
చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా పైచేయి సాధించింది. 278/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. మరో 126 పరుగులు జోడించి 404 పరుగుల వద్ద ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బంగ్లాదేశ్.. కుల్దీప్ యాదవ్ (4/26), మహ్మద్ సిరాజ్ (3/14), ఉమేశ్ యాదవ్ (1/33) ధాటికి 113 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతానికి బంగ్లాదేశ్.. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 291 పరుగులు వెనుకపడి ఉంది. మెహిది హసన్ (8), ఎబాదత్ హొస్సేన్ (7) క్రీజ్‌లో ఉన్నారు. pic.twitter.com/3B2z3bqfBA — Guess Karo (@KuchNahiUkhada) December 15, 2022 కాగా, పుజరా (90), శ్రేయస్ అయ్యర్ (86), అశ్విన్ (58)లు హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించింది. పంత్ (46), కుల్దీప్ యాదవ్ (40) పర్వాలేదనిపించారు. ఆఖర్లో ఉమేశ్ యాదవ్ (15 నాటౌట్) సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 393/9 స్కోర్ వద్ద అశ్విన్ ఔటయ్యాక బరిలోకి దిగిన ఉమేశ్.. మెహిది హసన్ బౌలింగ్‌లో 101 మీటర్ల రెండు భారీ సిక్సర్లు బాదాడు. pic.twitter.com/nv1fuGd4Wh — Guess Karo (@KuchNahiUkhada) December 15, 2022 దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరలవుతున్నాయి. ఇవి చూసిన అభిమానులు.. ఉమేశ్.. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, 2019 అక్టోబర్‌లో కూడా ఉమేశ్ ఇదే తరహాలో బ్యాట్‌తో రెచ్చిపోయాడు. నాడు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అతను 10 బంతుల్లో 31 పరుగులు పిండుకున్నాడు. -
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్.. భారత-"ఏ" జట్టు కెప్టెన్‌గా పుజారా
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ అనంతరం భారత్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా టీమిండియా మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. డిసెంబర్4న జరగనున్న తొలి వన్డేతో భారత పర్యటన ప్రారంభం కానుంది. వన్డే సిరీస్ అనంతరం టెస్టు సిరీస్ జరగనుంది. అయితే ఈ కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు భారత "ఏ" జట్టు నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ ఆడేందుకు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. అయితే బంగ్లాలో పర్యటించే ఏ జట్టుకు భారత వెటరన్ ఆటగాడు ఛెతేశ్వర్ పుజారా సారథ్యం వహించనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా అతడితో పాటు ఉమేశ్ యాదవ్, శ్రీకర్ భరత్ కూడా ఈ జట్టులో భాగం కానున్నట్లు సమాచారం. ఇక ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌కు కూడా చోటు దక్కే అవకాశం ఉంది. కాగా బంగ్లాతో టెస్టు సిరీస్‌కు ప్రకటించిన జట్టులో ఈ ముగ్గురు సభ్యులుగా ఉన్నారు. ఇక చేతన్ శర్మ నేతృత్వంలోని కమిటీ రానున్న రోజుల్లో ఏ-జట్టును ప్రకటించనుంది. కాగా ఈ సిరీస్ నవంబర్ ఆఖరి వారంలో జరిగే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌తో వన్డేలకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ , వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మొహమ్మద్. సిరాజ్, దీపక్ చాహర్, యష్ దయాల్ బంగ్లాదేశ్‌తో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ , రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్ చదవండి: బాబర్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే మంచిది: అఫ్రిది -
షమీ అవుట్: జట్టులోకి ఉమేశ్ యాదవ్.. అయ్యర్, అహ్మద్ కూడా: బీసీసీఐ
South Africa tour of India, 2022 T20 Series - India Updated Squad: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ నేపథ్యంలో ఉమేశ్ యాదవ్ భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. పేసర్ మహ్మద్ షమీ కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకోని నేపథ్యంలో అతడి స్థానాన్ని ఉమేశ్‌తో భర్తీ చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి పేర్కొంది. హుడా కూడా అవుట్ అదే విధంగా వెన్నునొప్పితో దూరమైన దీపక్ హుడా స్థానంలో శ్రేయస్ అయ్యర్ జట్టులోకి రానున్నట్లు తెలిపింది. ఇక స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ సిరీస్‌కు దూరంగా ఉన్న నేపథ్యంలో యువ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ టీ20 జట్టులోకి వచ్చినట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఇక హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకోనున్నట్లు తెలిపింది. కాగా తిరువనంతపురం వేదికగా బుధవారం టీమిండియా- సౌతాఫ్రికా మధ్య మొదటి టీ20తో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరు జట్లు అక్కడికి చేరుకున్నాయి. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు(అప్డేట్): రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, దినేశ్ కార్తిక్, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, దీపక్ చహర్, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, షాబాజ్ అహ్మద్. చదవండి: Ind Vs SA 1st T20: అతడు లేని జట్టు బలహీనం.. టీమిండియా ఓడిపోతుంది: భారత మాజీ క్రికెటర్ Irfan Pathan: 'ధోని వల్లే కెరీర్ నాశనమైంది'.. ఇర్ఫాన్ పఠాన్ అదిరిపోయే రిప్లై GAME DAY 💪🏻💪🏻 All set for the first T20I in Thiruvananthapuram#TeamIndia | #INDvSA pic.twitter.com/DAb2lks2Ry — BCCI (@BCCI) September 28, 2022 -
ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి..? పిల్లలు జడుసుకుంటారు!
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు మంచి ఆరంభం దక్కింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ ఉమేశ్ యాదవ్ వేశాడు. చాలా రోజుల తర్వాత టీమిండియా తరపున టి20 మ్యాచ్ ఆడుతున్న ఉమేశ్ యాదవ్‌కు ఓపెనర్ కామెరున్ గ్రీన్ చుక్కలు చూపించాడు. ఉమేశ్ వేసిన నాలుగు బంతుల్ని ఫోర్లుగా మలిచిన గ్రీన్ 16 పరుగులు రాబట్టాడు. దీంతో ఉమేశ్ యాదవ్ మొహం మాడిపోగా.. కోహ్లి.. ఏంటి ఉమేశ్ యాదవ్ ఈ బౌలింగ్ అన్నట్లుగా కళ్లతోనే భయపెట్టాడు. కోహ్లి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌కు చిన్నపిల్లలు జడుసుకోవడం ఖాయం. అంత భయపెట్టేలా ఉంది అతని లుక్. అందుకే కోహ్లి ఎక్స్ప్రెషన్ ఇప్పుడు సరికొత్త మీమ్‌గా మారిపోయింది. కోహ్లి రియాక్షన్‌పై క్రికెట్ ఫ్యాన్స్ సరదాగా కామెంట్ చేశారు. ''ఇన్నింగ్స్ చివర్లో భువనేశ్వర్ బౌలింగ్ అప్పుడు కూడా కోహ్లి రియాక్షన్ ఇదే అనుకుంటా''.. ''ఎప్పుడైనా పిల్లాడు అన్నం తినకపోతే.. బూచోడికి పట్టిస్తా అని కోహ్లి ఫోటో చూపిస్తారేమో''.. ''19వ ఓవర్లో భువీ బౌలింగ్ చూసి ప్రతీ అభిమాని కోహ్లి లాంటి లుక్ ఇస్తారు''.. ''కోహ్లి కెప్టెన్సీలో టీమిండియా 200 పరుగులు చేసిన సందర్భాల్లో ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు.. అందుకే ఆ లుక్'' అంటూ పేర్కొన్నారు. చదవండి: భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్.. హెచ్‌సీఏలో టికెట్ల రగడ 'సరైన బౌలర్లు లేరు.. అందుకే ఓడిపోయాం' I can see that Virat Kohli look becoming a meme🤣🤣 — Ian Raphael Bishop (@irbishi) September 20, 2022 When mom says "Maine chaipatti ke dibbe me paise rakhe the kisne nikale" Meanwhile me : pic.twitter.com/SlcFg2ctsW — Rohit 🤡 (@Rohit_ke_memes) September 20, 2022 All Indians when they see Bhuvi bowling 19th over every time. #Bhuvi #INDvsAUS #INDvAUS #ViratKohli𓃵 pic.twitter.com/fxVZbhOOZH — Faizan Mushtaq (@faizanmushtaq77) September 20, 2022 Every Indian fan's reaction when Umesh Yadav is bowling.#INDvsAUS #INDvAUS pic.twitter.com/UD23Xrvckn — Sameer Allana (@HitmanCricket) September 20, 2022 -
షమీ స్థానంలో ఉమేశ్ యాదవ్.. మూడేళ్ల తర్వాత రీ ఎంట్రీ?
ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియాకు షాక్ తగిలింది. జట్టు స్టార్ పేసర్ మహ్మద్ షమీ కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆసీస్‌తో టి20 సిరీస్‌కు దూరమయ్యాడు. షమీ స్థానంలో టీమిండియా సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ జట్టులోకి రానున్నట్లు సమాచారం. ఇది నిజమైతే మాత్రం ఉమేశ్ యాదవ్ మళ్లీ మూడేళ్ల తర్వాత టి20ల్లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆసీస్‌తో టి20 సిరీస్‌కు షమీ కరోనా పాజిటివ్‌గా తేలడంతో అతన్ని తప్పించిన మేనేజ్మెంట్ ఉమేశ్ యాదవ్‌కి చోటు కల్పించినట్లు తెలుస్తోంది. ఇక ఐపీఎల్ 2022లో కేకేఆర్ తరుపున మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన ఉమేశ్ యాదవ్, 12 మ్యాచుల్లో 16 వికెట్లు తీశాడు. ఎక్కువగా మొదటి ఓవర్లో వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్, బ్యాటుతోనూ రాణించాడు. ఐపీఎల్ 2022 తర్వాత రాయల్ లండన్ వన్డే క్రికెట్ టోర్నీలో 7 మ్యాచులు ఆడిన ఉమేశ్ యాదవ్ 16 వికెట్లు పడగొట్టి, మిడిల్సెక్స్ క్లబ్ తరుపున టాప్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. ఈ ప్రదర్శనను పరిగణలోకి తీసుకొనే ఉమేశ్ యాదవ్‌ను ఆఖరి నిమిషంలో షమీ స్థానంలో ఆసీస్‌తో టి20 సిరీస్‌కు ఎంపిక చేసినట్లు సమాచారం. నిజానికి గాయం నుంచి కోలుకున్న ఉమేశ్ యాదవ్, సెప్టెంబర్ 17న తిరిగి జట్టుతో మిడిల్సెక్స్ టీమ్‌తో కలిసి కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆఖరి రెండు మ్యాచుల్లో ఆడాల్సింది. అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఉమేశ్ యాదవ్, చివరి రెండు మ్యాచుల్లో ఆడడం లేదని మిడిల్సెక్స్ ప్రకటించింది .ఇది జరిగిన 24 గంటలకే ఉమేశ్ యాదవ్‌ని ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కి ఎంపిక చేస్తున్నట్టు వార్తలు రావడం విశేషం. ఉమేశ్ యాదవ్ ఫిట్నెస్ పరీక్షల్లో పాస్ అయ్యాడని, అందుకే అతన్ని మహ్మద్ షమీకి రిప్లేస్‌మెంట్‌గా తీసుకున్నారని సమాచారం. కొన్నాళ్లుగా టెస్టుల్లో కొనసాగుతూ వస్తున్న ఉమేశ్ యాదవ్, చివరిగా 2019 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాపై ఆఖరి టీ20 మ్యాచ్ ఆడాడు. దీంతో ఉమేశ్ యాదవ్ మళ్లీ మూడేళ్ల తర్వాత టీమిండియా తరుపున టీ20ల్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. -
కరోనా బారిన షమీ... ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌కు దూరం
భారత జట్టు పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ కరోనా వైరస్ బారిన పడ్డాడు. దాంతో ఈనెల 20 నుంచి ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు షమీ దూరమయ్యాడు. షమీ స్థానంలో మరో పేస్ బౌలర్ ఉమేశ్ యాదవ్‌ను భారత జట్టులో ఎంపిక చేశారు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈనెల 20న మొహాలీలో జరిగే తొలి మ్యాచ్‌తో సిరీస్ మొదలవుతుంది. ఇప్పటికే భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్ జట్టులోని ఇతర ఆటగాళ్లు శనివారం సాయంత్రం చండీగఢ్‌కు చేరుకున్నారు. వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టి20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో షమీకి చోటు లభించలేదు. ఈ మెగా ఈవెంట్‌కు షమీని స్టాండ్‌బైగా ఎంపిక చేశారు. -
పుజారాకు అరుదైన అవకాశం.. కెప్టెన్‌గా ఛాన్స్! ఏ మ్యాచ్‌లో అంటే?
టీమిండియా వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారాకు అరుదైన అవకాశం లభించింది. ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్ డివిజన్ టూ-2022లో భాగంగా ససెక్స్ జట్టుకు సారథిగా వ్యవహరించే ఛాన్స్ దొరికింది. కాగా ససెక్స్ రెగ్యులర్ కెప్టెన్ టామ్ హైన్స్ గత వారం లీసెస్టెర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్ మధ్యలో గాయపడ్డాడు. అతడి స్థానంలో పేసర్ స్టీవెన్ ఫిన్ కెప్టెన్సీ చేశాడు. అయితే, టామ్ చేతి ఎముక విరగడంతో ఐదు నుంచి ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరమైంది. ఈ నేపథ్యంలో టామ్ స్థానంలో మిడిల్సెక్స్తో మ్యాచ్‌కు పుజారా తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఈ సందర్భంగా సస్సెస్ హెడ్‌కోచ్ ఇయాన్ సలిస్బరీ మాట్లాడుతూ.. పుజారా జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించగలడని విశ్వాసం వ్యక్తం చేశాడు. పుజారాపై నమ్మకం ఉంది! ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ‘‘పూజ్.. టామ్ స్థానాన్ని భర్తీ చేయగలడు. జట్టులో చేరిన నాటి నుంచే తన అపార అనుభవంతో సహజంగానే నాయకుడిగా ఎదిగాడు. టామ్ గాయపడిన నేపథ్యంలో కెప్టెన్సీ చేపట్టాడు. గత మ్యాచ్‌లో ఫిన్నీ సారథిగా ఉన్నాడు. అయితే, ఈ మ్యాచ్‌కు మాత్రం ఓ బ్యాటర్‌ను సారథిగా ఎంపిక చేయాలనుకున్నాం. ఎందుకంటే ఫిన్ బౌలింగ్ దళాన్ని ముందుకు నడిపించడంపై దృష్టి సారిస్తాడు. అదే సమయంలో అంతర్జాతీయ క్రికెట్లో అనువజ్ఞుడైన పూజ్.. కెప్టెన్‌గా సరైన వ్యక్తి అని భావించాము’’ అని పేర్కొన్నాడు. కాగా లార్డ్స్ వేదికగా ససెక్స్, మిడిల్సెక్స్ మధ్య మంగళవారం(జూలై 19) టెస్టు మ్యాచ్ ఆరంభమైంది. ఇదిలా ఉంటే.. మిడిల్సెక్స్ జట్టులో టీమిండియా బౌలర్ ఉమేశ్ యాదవ్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇక చాలా కాలం తర్వాత ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్టుతో జాతీయ జట్టులో రీ ఎంట్రీ ఇచ్చిన పుజారా తొలి ఇన్నింగ్స్‌లో 13 పరుగులే చేసి నిరాశపరిచాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 168 బంతులు ఎదుర్కొన్న నయావాల్ 66 పరుగులు చేశాడు. క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నించినప్పటికీ బ్రాడ్ బౌలింగ్‌లో అవుటై పెవిలియన్ చేరాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు జో రూట్, జానీ బెయిర్ స్టో అజేయ శతకాలతో చెలరేగడంతో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2-2తో సమమైంది. చదవండి: India Vs West Indies 2022: విండీస్‌తో టీమిండియా వన్డే, టీ20 సిరీస్.. షెడ్యూల్, జట్లు, పూర్తి వివరాలు! ICC WC: కోహ్లి కెప్టెన్సీలో గనుక నేను ఆడి ఉంటే.. ఇండియా 3 ప్రపంచకప్ టైటిళ్లు గెలిచేది! Following the news of Tom Haines' injury, Cheteshwar Pujara has been named as interim captain. © Good luck to @cheteshwar1 and the team. 👏 #GOSBTS — Sussex Cricket (@SussexCCC) July 19, 2022 -
ఉమేశ్ యాదవ్‌కు బంపరాఫర్.. స్టార్ పేసర్ స్థానంలో ఇంగ్లండ్‌కు పయనం
Umesh Yadav: టీమిండియా వెటరన్ పేసర్ ఉమేశ్ యాదవ్‌కు బంపర్ ఆఫర్ లభించింది. పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది స్థానంలో ఇంగ్లండ్ కౌంటీ టీమ్ మిడిల్సెక్స్ అతనితో ఒప్పందం కుదుర్చుకుంది. వ్యక్తిగత కారణాల చేత అఫ్రిది జట్టును వీడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మిడిల్సెక్స్ యాజమాన్యం సోమవారం (జులై 11) ప్రకటించింది. ఉమేశ్.. 2022 డొమెస్టిక్ సీజన్‌తో పాటు కౌంటీ ఛాంపియన్షిప్, వన్డే కప్‌లకు అందుబాటులో ఉంటాడని మిడిల్సెక్స్ పేర్కొంది. ఓవర్సీస్ బౌలర్ కోటాలో ఉమేశ్ లాంటి బౌలర్ కోసమే తాము ఎదురుచూశామని, ఎట్టకేలకు తమకు సుదీర్ఘ అంతర్జాతీయ అనుభవం ఉన్న ఆటగాడే దొరికాడని తెలిపింది. పేస్‌తో పాటు వైవిధ్యం కలిగిన ఉమేశ్ చేరడం తమకు భారీ ప్రయోజనం చేకూరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా, టీమిండియాలో యువ పేసర్ల హవా పెరగడంతో గత కొంతకాలంగా ఉమేశ్‌కు అవకాశాలు రావడం లేదు. ఈ ఏడాది ఐపీఎల్లో (కేకేఆర్) అంచనాలకు మించి రాణించినా అతనికి టీమిండియా నుంచి పిలుపు రాలేదు. ఉమేశ్.. తన సహచరుడు పుజారాలా కౌంటీల్లో సత్తా చాటి టీమిండియాలోకి పునరాగమనం చేయాలని భావిస్తున్నాడు. టీమిండియా తరఫున 52 టెస్ట్‌లు, 77 వన్డేలు, 7 టీ20 ఆడిన ఉమేశ్.. ఓవరాల్‌గా 273 వికెట్లు పడగొట్టాడు. చదవండి: కంగారూలను ఖంగుతినిపించిన లంకేయులు.. ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం -
IPL 2022: ‘నాలుగు’ పరుగెత్తారు...!
IPL 2022- RR Vs KKR: ఓవర్ త్రో లేకుండా నేరుగా వికెట్ల మధ్య పరుగెత్తి నాలుగు రన్స్ తీయడం సాధ్యమా! సాధ్యమేనని రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లు జోస్ బట్లర్, దేవ్‌దత్ పడిక్కల్ చేసి చూపించారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్ ఉమేశ్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ చివరి బంతిని బట్లర్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడాడు. బంతిని వెంటాడిన వెంకటేశ్ బౌండరీకి చేరువలో దానిని ఆపి వెనక్కి తోయగలిగాడు. ఇక దానిని అందుకున్న రాణా బంతిని కీపర్ వైపు విసిరాడు. అయితే మూడు పరుగులు సునాయాసంగా పూర్తి చేసుకున్న బట్లర్, డైవ్‌తో నాలుగో పరుగు కూడా సాధించడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో.. ‘‘మీ ఫిట్నెస్ లెవల్స్ సూపర్.. పరుగెత్తి నాలుగు పరుగులు సాధించారు.. గ్రేట్’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా సోమవారం రాజస్తాన్, కోల్‌కతా మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ బృందం కోల్‌కతాపై విజయం సాధించింది. ఏడు పరుగుల తేడాతో శ్రేయస్ సేనను ఓడించి ఐపీఎల్-2022లో నాలుగో గెలుపును నమోదు చేసింది. తద్వారా ఎనిమిది పాయంట్లతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. చదవండి: IPL 2022: బట్లర్ భళా... చహల్ చాంగుభళా #JosButtler #DevduttPadikkal ran four runs Incredible #IPL2022 #RRvsKKR pic.twitter.com/No9HK41HHM — Raj (@Raj93465898) April 18, 2022 WHAT. A. GAME! WHAT. A. FINISH! 👏 👏 The 1⃣5⃣-year celebration of the IPL done right, courtesy a cracker of a match! 👌 👌@rajasthanroyals hold their nerve to seal a thrilling win over #KKR. 👍 👍 Scorecard ▶️ https://t.co/f4zhSrBNHi#TATAIPL | #RRvKKR pic.twitter.com/c2gFuwobFg — IndianPremierLeague (@IPL) April 18, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
"మళ్లీ భారత జట్టుకు ఆడాలని ఉంది.. అదంతా వాళ్లపై ఆధారపడి ఉంది"
టీమిండియా వెటరన్ పేసర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ బౌలర్ ఉమేశ్ యాదవ్ ఐపీఎల్-2022లో అదరగొడుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడిన ఉమేశ్ 10 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా ఉమేశ్ పంజాబ్ కింగ్స్‌పై నాలుగు వికెట్లు పడగొట్టి కేకేఆర్‌కు అద్భుతమైన విజయం అందించాడు. కాగా తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉమేశ్ యాదవ్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. "భారత ప్రపంచకప్ జట్టులో చోటు కోసం అలోచించడం లేదు. అదింతా సెలెక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్పై ఆధారపడి ఉంటుంది. అయితే టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్ అనేక వైట్ బాల్ సిరీస్‌లు ఆడనుంది. నేను మొదట ఆ జట్టులో చోటు దక్కించుకుని అక్కడ అద్భుతంగా రాణించాలి. అప్పడే టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు గురించి ఆలోచిస్తా. కానీ ఒక క్రికెటర్‌గా నాకు దొరికిన చిన్న అవకాశాన్నికూడా అందిపుచ్చుకుంటాను" అని ఉమేశ్ యాదవ్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022 CSK Vs GT: "వెల్కమ్ బ్యాక్ రుత్‌రాజ్.. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడావు" -
అంపైర్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్‌కోచ్ వాగ్వాదం
క్రికెట్లో ఎమోషన్స్‌కు కొదువ ఉండదు. తప్పుడు నిర్ణయాలు తీసుకునే అంపైర్లతో ఆటగాళ్లకు గొడవలు జరిగిన ఘటనలు చాలానే ఉన్నాయి.అందులో ఒక అంపైర్ తప్పు చేస్తే.. అవసరంగా మరొక అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన సందర్భాలు ఉన్నాయి.తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్‌కోచ్ రికీ పాంటింగ్ అంపైర్‌తో వాగ్వావాదానికి దిగడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ ఉమేశ్ యాదవ్ వేశాడు. ఆ ఓవర్ రెండో బంతిని ఉమేశ్ ఫుల్‌టాస్ యార్కర్ వేశాడె. బంతి వైడ్ లైన్ అవతల పడినప్పటికి అంపైర్ వైడ్ ఇవ్వలేదు. అయితే శార్దూల్ అది వైడ్ కదా అని అంపైర్‌ను చూసినప్పటికి అతని వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీంతో ఇదేం నిర్ణయమో అంటూ తర్వాతి బంతికి సిద్ధమయ్యాడు. ఇదే సమయంలో డగౌట్లో ఉన్న పాంటింగ్.. ''అదేంటి అంత క్లియర్‌గా వైడ్ అని తెలుస్తుంటే అంపైర్ ఇవ్వకపోవడమేంటి'' అని అరిచాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న మరో అంపైర్‌తో వైడ్ ఇవ్వకపోవడమేంటని వాగ్వాదానికి దిగాడు. ఇదంతా అక్కడి కెమెరాల్లో రికార్డయింది. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. చదవండి: IPL 2022: చెత్త నిర్ణయాలు వద్దు.. మా అంపైర్లను పంపిస్తాం; బీసీసీఐకి చురకలు #RickyPonting fighting with umpire pic.twitter.com/3jPYobJZAe — Raj (@Raj93465898) April 10, 2022 -
IPL 2022: వయసై పోతోందన్నాడు... కానీ..
IPL 2022- KKR Vs PBKS: కోల్‌కతా నైట్‌రైడర్స్ పేసర్ ఉమేశ్ యాదవ్‌పై ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రశంసలు కురిపించాడు. అతడిలో కష్టపడే తత్వం ఎక్కువని, అలాంటి వ్యక్తితో కలిసి ఆడటం తనకు గర్వకారణమని కొనియాడాడు. కాగా ముంబైలోని వాంఖడే వేదికగా పంజాబ్ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఘన విజయం సాధించిన తెలిసిందే. ఆరు వికెట్ల తేడాతో పంజాబ్‌ను మట్టికరిపించి.. ఈ సీజన్లో తమ రెండో గెలుపును నమోదు చేసింది. 34 ఏళ్ల ఉమేశ్ యాదవ్ అద్భుత బౌలింగ్‌కు తోడు 33 ఏళ్ల ఆండ్రీ రసెల్ అదిరిపోయే ఇన్నింగ్స్‌తో ఈ విజయం సాధ్యమైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కేకేఆర్ సారథి శ్రేయస్ అయ్యర్ ఉమేశ్ యాదవ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘తనకు వయసై పోతుందని ఉమేశ్ నాతో అన్నాడు. కానీ నేను మాత్రం నువ్వు రోజురోజుకు ఫిట్‌గా తయారవుతున్నావని చెప్పాను. జిమ్‌కు ఎప్పుడు వెళ్లినా ఉమేశ్ కసరత్తులు చేస్తూ కనిపిస్తాడు. అతడిది కష్టపడే తత్వం. తను నా సహచర ఆటగాడిగా ఉండటం గొప్ప విషయం’’ అని శ్రేయస్ అయ్యర్ వ్యాఖ్యానించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ స్కోర్లు: పంజాబ్ కింగ్స్- 137 (18.2) కేకేఆర్- 141/4 (14.3). చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్.. విధ్వంసకర వీరుడు వచ్చేశాడు! A thumping win for @KKRiders 💪 💪 The @ShreyasIyer15 -led unit returns to winning ways as they beat #PBKS by 6⃣wickets👏 👏 Scorecard ▶️ https://t.co/JEqScn6mWQ #TATAIPL | #KKRvPBKS pic.twitter.com/UtmnpIufGJ — IndianPremierLeague (@IPL) April 1, 2022 -
IPL: ఉమేశ్ యాదవ్ అరుదైన రికార్డు.. రోహిత్, గేల్‌లను అధిగమించి..
టీమిండియా సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ ఐపీఎల్-2022లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమేశ్.. చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టాడు. ఇక తమ జట్టు మూడో మ్యాచ్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు ఉమేశ్ యాదవ్. 4 ఓవర్లలో 23 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. పంజాబ్ కెప్టెన్ మాయంక్ అగర్వాల్, లివింగ్‌స్టోన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్ వికెట్లు తీశాడు. ఈ క్రమంలో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు గానూ అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తద్వారా పంజాబ్‌పై తనకున్న ఘనమైన రికార్డును మరోసారి రిపీట్ చేశాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. ఒకే ప్రత్యర్థి జట్టుతో మ్యాచ్‌లో అత్యధికసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. రోహిత్ శర్మ, క్రిస్‌గేల్ వంటి స్టార్లను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించాడు. కాగా ఉమేశ్ యాదవ్‌కు పంజాబ్‌పై ఇది ఆరో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు. అంతకుముందు యూసఫ్ పఠాన్ దక్కన్ చార్జర్స్‌పై 5 సార్లు, రోహిత్ శర్మ కేకేఆర్‌పై 5 సార్లు, క్రిస్‌గేల్ కేకేఆర్‌పై 5 సార్లు ఈ ఘనత సాధించారు. ఇక ఐపీఎల్-2022లో పంజాబ్‌తో కేకేఆర్ మ్యాచ్ విషయానికొస్తే.. ఉమేశ్ విజృంభణకు తోడు ఆండ్రీ రసెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో కోల్‌కతా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చదవండి: IPL 2022 KKR Vs PBKS: నేనేం చేయగలనో నాకు తెలుసు.. క్రికెట్ ఆడేది అందుకే: రసెల్ A thumping win for @KKRiders 💪 💪 The @ShreyasIyer15 -led unit returns to winning ways as they beat #PBKS by 6⃣wickets👏 👏 Scorecard ▶️ https://t.co/JEqScn6mWQ #TATAIPL | #KKRvPBKS pic.twitter.com/UtmnpIufGJ — IndianPremierLeague (@IPL) April 1, 2022 -
IPL 2022: అతడి సహకారం వల్లే ఇదంతా సాధ్యమైంది: రసెల్
IPL 2022: 31 బంతుల్లో 70 పరుగులు.. రెండు ఫోర్లు.. ఎనిమిది సిక్సర్లు.. స్ట్రైక్ రేటు 225.81. ఇలాంటి అద్భుత ఇన్నింగ్స్‌తో.. భారీ షాట్లతో ఐపీఎల్ అభిమానులకు అమితమైన వినోదాన్ని పంచాడు కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ హిట్టర్ ఆండ్రీ రసెల్. విధ్వంసకర ఆట తీరుతో పంజాబ్ కింగ్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. డెబ్బై పరుగులతో అజేయంగా నిలిచి కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించి తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి తన ప్రదర్శనతో పొట్టి ఫార్మాట్ ప్రేమికులకు రసెల్ అసలైన మజాను అందించాడు. కేకేఆర్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ తానున్నాంటూ సామ్ బిల్లింగ్స్ సహకారంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ నేపథ్యంలో తన ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసిన రసెల్.. తానేం చేయగలనో తనకు తెలుసనని వ్యాఖ్యానించాడు. ఈ మేరకు విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘ఈ ఫీలింగ్ అద్బుతంగా ఉంది. ఇలాంటి అనుభూతుల కోసమే కదా క్రికెట్ ఆడేది! జట్టు అలాంటి పరిస్థితుల్లో ఉన్నపుడు నేనేం చేయాలో.. నేనేం చేయగలనో నాకు తెలుసు. సామ్ బిల్లింగ్స్ వంటి ఆటగాడు సహకారం అందిస్తూ.. స్ట్రైక్ రొటేట్ చేయడం కలిసి వచ్చింది. నా శక్తిసామర్థ్యాలేమిటో నాకు తెలుసు. క్లిష్ట పరిస్థితుల నుంచి జట్టును బయటపడేయడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నోఆ. జట్టు ప్రయోజనాల కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం. బ్యాట్‌తోనే కాదు బంతితోనూ రెడీగా ఉంటా’’ అని రసెల్ పేర్కొన్నాడు. కాగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో బ్యాట్ ఝులిపించడంతో పాటు రసెల్ బంతితోనూ మెరిసిన విషయం తెలిసిందే. కగిసో రబడ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో బౌలర్ ఉమేశ్ యాదవ్ విజృంభణ, రసెల్ మెరుపు బ్యాటింగ్‌తో కేకేఆర్ పంజాబ్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చదవండి: IPL 2022: రసెల్ విధ్వంసం A thumping win for @KKRiders 💪 💪 The @ShreyasIyer15 -led unit returns to winning ways as they beat #PBKS by 6⃣wickets👏 👏 Scorecard ▶️ https://t.co/JEqScn6mWQ #TATAIPL | #KKRvPBKS pic.twitter.com/UtmnpIufGJ — IndianPremierLeague (@IPL) April 1, 2022 -
పంజాబ్ కింగ్స్ అంటే ఉమేశ్ యాదవ్‌కు ఎందుకంత ఇష్టం!
ప్రతీ క్రికెటర్‌కు ఒక ఫెవరెట్ జట్టు ఉంటుంది. ప్రతీ మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేయకున్నప్పటికీ తనకు ఇష్టమైన జట్టుతో మ్యాచ్ అంటే చాలు సదరు బౌలర్‌కు ఉత్సాహం ఉరకలేస్తుంది. అది అంతర్జాతీయ మ్యాచ్ లేదా ఐపీఎల్ లాంటి లీగ్ కావొచ్చు. కేకేఆర్ బౌలర్ ఉమేశ్ యాదవ్ కూడా పంజాబ్ కింగ్స్ పేరు వింటే చాలు విరుచుకుపడతాడు. ఆ జట్టు అంటే ఉమేశ్ యాదవ్‌కు ఎందుకంత ఇష్టం అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. విషయంలోకి వెళితే.. పంజాబ్ కింగ్స్‌పై ఉమేశ్‌కు మంచి గణాంకాలు ఉన్నాయి. తాజాగా ఐపీఎల్ 2022లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను మరోసారి మెరిశాడు. నాలుగు ఓవర్లు వేసి 23 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. తన ఐపీఎల్ కెరీర్లో ఉమేశ్ యాదవ్‌కు ఇది అత్యుత్తమం అని చెప్పొచ్చు. ఇంతకముందు ఇదే పంజాబ్ కింగ్స్‌పై 2017లో (4/33), 2022లో ముంబై ఇండియన్స్‌పై (4/24) నమోదు చేశాడు. ఇక పంజాబ్ కింగ్స్‌పై ఉమేశ్ యాదవ్ ఇప్పటివరకు 33 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో ప్రత్యర్థి జట్టుపై అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా ఉమేశ్ తొలి స్థానంలో ఉన్నాడు. ఇక సునీల్ నరైన్ 32 వికెట్లతో(పంజాబ్ కింగ్స్‌పై) రెండో స్థానంలో, లసిత్ మలింగ 31 వికెట్లతో (సీఎస్కేపై) మూడో స్థానంలో, డ్వేన్ బ్రావో 31 వికెట్లతో( ముంబై ఇండియన్స్‌పై) నాలుగు, అమిత్ మిశ్రా 30 వికెట్లతో(రాజస్తాన్ రాయల్స్) ఐదు స్థానాల్లో ఉన్నారు. చదవండి: Umesh Yadav: పూర్వ వైభవం సాధించే పనిలో క్రికెటర్.. ఐపీఎల్లో అరుదైన ఫీట్ IPL 2022: పగ తీర్చుకున్న కేకేఆర్ బౌలర్.. వీడియో వైరల్ -
పూర్వ వైభవం సాధించే పనిలో క్రికెటర్.. ఐపీఎల్లో అరుదైన ఫీట్
కేకేఆర్ స్టార్ బౌలర్ ఉమేశ్ యాదవ్ ఐపీఎల్లో అరుదైన ఫీట్ సాధించాడు. పవర్ ప్లేలో 50 వికెట్లు సాధించిన నాలుగో ఆటగాడిగా ఉమేశ్ యాదవ్ నిలిచాడు. ఐపీఎల్ 2022లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో తొలి ఓవర్లోనే మయాంక్‌ను ఎల్బీ చేయడం ద్వారా ఉమేశ్ ఈ ఘనత అందుకున్నాడు. కాగా ఉమేశ్ యాదవ్ కంటే ముందు జహీర్ ఖాన్(52 వికెట్లు), సందీప్ శర్మ(52 వికెట్లు), భువనేశ్వర్ కుమార్(51 వికెట్లు) వరుసగా మూడు స్థానాల్లో ఉన్నారు. కాగా టీమిండియా తరపున టి20లు, వన్డేలకు దూరమైన ఉమేశ్ కేవలం టెస్టుల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఒక రకంగా ఐపీఎల్లో అతని ఎంట్రీ సూపర్ అనే చెప్పొచ్చు. 2019 నుంచి ఉమేశ్ యాదవ్ అంతర్జాతీయంగా ఒక్క టి20 మ్యాచ్ ఆడలేదు. ఐపీఎల్ 2022 ఆరంభానికి ముందు జరిగిన మెగావేలంలో ఉమేశ్‌ను కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. తొలి రెండు రౌండ్లలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిన ఉమేశ్ యాదవ్.. మూడో రౌండ్లో కేకేఆర్ కేకేఆర్ కొనుగోలు చేసింది. మొత్తానికి ఉమేశ్ యాదవ్ మరోసారి మంచి ఫామ్ కనబరుస్తున్నాడు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే రానున్న ఆర్నెళ్లలో జరగనున్న టి20 ప్రపంచకప్ 2022కు టీమిండియాకు ఎంపికైనా ఆశ్చర్యపోనవసరం లేదు. ఉమేశ్ పూర్వ వైభవం అందుకునే పనిలో ఉన్నాడు.. అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: IPL 2022: జడ్డూ చేతులెత్తేశాడా.. అందుకే ధోని రంగంలోకి ? Most IPL wickets in first 6 overs 52 - Zaheer Khan 52 - Sandeep Sharma 51 - Bhuvneshwar Kumar 50* - Umesh Yadav#IPL2022 #KKRvsPBKS — S. Kuila (@sukriti_stats) April 1, 2022 -
ఉమేశ్ యాదవ్-వరుణ్ చక్రవర్తి సరికొత్త రికార్డు
ఐపీఎల్ 2022లో భాగంగా ఆర్సీబీతో మ్యాచ్‌లో కేకేఆర్ టెయిలెండర్లు ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలు సరికొత రికార్డు నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో ప్రధాన బ్యాట్స్‌మెన్ విఫలమైన వేళ ఈ ఇద్దరు కలిసి ఆఖరి వికెట్‌కు 27 పరుగులు జత చేశారు. విశేషమేమిటంటే.. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. ఉమేశ్ యాదవ్(18), వరుణ్ చక్రవర్తి(10 నాటౌట్) పరుగులు చేశారు. వీరిద్దరు ఆడడంతో కేకేఆర్ 128 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది. కాగా ఐపీఎల్లో ఒక జట్టు తరపున 10,11 బ్యాట్స్‌మెన్ అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం ఇది ఐదోసారి మాత్రమే. ఇక కేకేఆర్ బ్యాటర్స్‌లో రసెల్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే ఉమేశ్ యాదవ్- వరుణ్ చక్రవర్తిలను చూసి ప్రధాన బ్యాటర్స్ బ్యాటింగ్ ఆడడం నేర్చుకోవాలని అభిమానులు కామెంట్స్ చేశారు. చదవండి: Harshal Patel: ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా హర్షల్ పటేల్ IPL 2022: క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూగా మిగిలిపోనుంది -
"ఉమేశ్ అన్న ముందే చెప్పాడు.. నిజం చేశాడు కదా"
ఐపీఎల్-2022లో కోల్‌కతా నైట్ రైడర్స్ బోణీ కొట్టింది. వాంఖడే వేదికగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా కేకేఆర్ విజయంలో ఆ జట్టు పేసర్ ఉమేశ్ యాదవ్ కీలకపాత్ర పోషించాడు. ఓపెనర్లు రుత్‌రాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వేను ఔట్ చేసి చెన్నై జట్టును ఉమేశ్ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన ఉమేశ్ యాదవ్.. రెండు వికెట్లు పడగొట్టి 20 పరుగులు ఇచ్చాడు. కాగా ఈ ఏడాది సీజన్లో తన సత్తా ఏంటో చూపిస్తానని ఉమేశ్ యాదవ్ ముందే చెప్పాడు. అయితే ఈ మ్యాచ్‌లో అది నిజం చేసి చూపించిన యాదవ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఓ నెటిజన్ స్పందిస్తూ.. "ఉమేశ్ అన్న ముందే చెప్పాడు.. అది నిజం చేశాడు" అంటూ కామెంట్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లలో ధోని (50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 132 పరుగుల లక్ష్యంతో బరిలోకి కోల్‌కతా 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కోల్‌కతా బ్యాటర్లలో రహానే 44 పరుగులతో రాణించాడు.ఈ మ్యాచ్‌లో ఉమేశ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. చదవండి: IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్.. ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్! 1st wicket of Tata IPL 2022 by Umesh Yadav #IPL2022 pic.twitter.com/wiDhG1IiBN — Sumedh Shirke (@shirke_sumedh) March 26, 2022 .@y_umesh is adjudged Man of the Match for his bowling figures of 2/20 as @KKRiders win the season opener by 6 wickets. Scorecard - https://t.co/b4FjhJcJtX #CSKvKKR #TATAIPL pic.twitter.com/qEArbeYYse — IndianPremierLeague (@IPL) March 26, 2022 -
'కేకేఆర్ నాకు లక్కీ టీమ్.. ఈ సారి ఐపీఎల్ కప్ మాదే'
ఐపీఎల్-2022 మెగా వేలంలో టీమిండియా వెటరన్ పేసర్ ఉమేశ్ యాదవ్‌ను రూ. 2 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. కాగా 2014 సీజన్లో కేకేఆర్‌కు ఉమేశ్ యాదవ్ ప్రాతినిద్యం వహించాడు. ఆ సీజన్లో కేకేఆర్ టైటిల్ కైవసం చేసుకుంది. . గత ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ తరుపన ఆడిన ఉమేశ్ యాదవ్ అంతగా రాణించ లేకపోయాడు. అయితే ఈ ఏడాది సీజన్లో కేకేఆర్ తరపున సత్తా చాటాలని యాదవ్ భావిస్తున్నాడు. కేకేఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో ఉమేశ్ యాదవ్ మాట్లాడుతూ... "తిరిగి కేకేఆర్ జట్టులోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. 2014 సీజన్లో మేము ట్రోఫీని గెలిచాము. అప్పుడు నేనే జట్టులో భాగమై ఉన్నాను. కేకేఆర్ నాకు లక్కీ టీమ్. ఇక నా ఫ్యామిలీ నాతోనే ఇక్కడే ఉంది. కాబట్టి మూడు రోజుల క్వారంటైన్ సులభంగా గడిచిపోతుంది. ఇక నా ఫిట్నెస్ గురించి ఎటువంటి సమస్యలేదు. నేనే బాగానే ఉన్నాను. కాబట్టి ఈ సీజన్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను. కేకేఆర్ జట్టు కోసం నా వంతు కృషి చేస్తాను. మరోసారి కేకేఆర్‌కు ట్రోఫీని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను"అని ఉమేశ్ యాదవ్ పేర్కొన్నాడు. ఇక ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కావడంతో యాదవ్‌కు తుది జట్టులో చోటు దక్కడం ఖాయమనిపిస్తోంది. కాగా మార్చి 26 నుంచి ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. ఇక ఈ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో మార్చి 26న ఆడనుంది. చదవండి: IPL 2022: సీఎస్కే స్టార్ ఆల్‌రౌండర్‌కు వీసా సమస్య.. తొలి మ్యాచ్‌కు దూరం! -
Ind Vs Sa 3rd Test: పుజారా అలా.. మయాంక్ ఇలా.. కోహ్లి తీవ్ర అసహనం
Ind Vs Sa 3rd Test- Pujara- mayank- Virat Kohli: దక్షిణాఫ్రికాతో నిర్ణయాత్మక మూడో టెస్టులో టీమిండియా బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. గత మ్యాచ్‌లో చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో రాణించగా... మహ్మద్ షమీ, సిరాజ్స్థానంలో జట్టులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్ కూడా ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో భారత్‌కు 13 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. బౌలర్ల ప్రదర్శన బాగానే ఉన్నా.. ఫీల్డర్లు మాత్రం కొన్ని తప్పిదాలు చేశారు. దీంతో భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. పుజారా వల్ల ఐదు పెనాల్టీ పరుగులు... దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు ఐదు పెనాల్టీ పరుగుల శిక్ష పడింది. శార్దుల్ వేసిన బంతిని బవుమా ఆడగా బంతి మొదటి స్లిప్ దిశగా దూసుకుపోయింది. ఆ స్థానంలో ఉన్న పుజారా, బంతికి అడ్డంగా కుడి వైపునకు వెళ్లి అందుకునే ప్రయత్నం చేసిన కీపర్ పంత్ క్యాచ్ వదిలేశారు. పుజారా చేతికి తగిలిన బంతి పంత్ వెనక ఉన్న హెల్మెట్‌ను తాకింది. దాంతో నిబంధనల ప్రకారం సఫారీలకు అంపైర్ 5 అదనపు పరుగులు అందించాడు. ఇదిలా ఉంటే.. మయాంక్ అగర్వాల్ సైతం బంతి బౌండరీ చేరకుండా సులువుగా ఆపే పరిస్థితి ఉన్నా విఫలమయ్యాడు. బాల్‌ను అందుకున్నప్పటికీ బ్యాలన్స్ చేసుకోలేక రోప్‌ను తాకడంతో బ్యాటర్‌కు నాలుగు పరుగులు లభించాయి. దీంతో కెప్టెన్ కోహ్లి తీవ్ర నిరాశకు లోనయ్యాడు. మయాంక్ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. 34వ ఓవర్లో పీటర్సన్‌కు బుమ్రా బౌలింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం గురించి టీమిండియా దిగ్గజం, కామెంటేటర్ సునిల్ గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘తను ఈజీగా బంతిని వెనక్కి నెట్టి ఉండవచ్చు. కానీ అలా జరుగలేదు. కెప్టెన్ ఇలా అసహనానికి గురికావడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు’’ అని వ్యాఖ్యానించారు. చదవండి: Jasprit Bumrah Vs Marco Jansen: బుమ్రాతో వైరం.. ఫలితం అనుభవించాడు -
Ind Vs Sa: హనుమ విహారికి నో ఛాన్స్.. పంత్‌కు అవకాశం... సిరాజ్ స్థానంలో ఎవరంటే..
Ind Vs Sa 3rd Test: దక్షిణాఫ్రికాలో సరికొత్త చరిత్ర సృష్టించాలంటే మూడో టెస్టులో టీమిండియా కచ్చితంగా గెలిచి తీరాలి. అప్పుడే ఇన్నాళ్లుగా భారత జట్టుకు సఫారీ గడ్డపై అందని ద్రాక్షగా ఉన్న టెస్టు సిరీస్ విజయం సొంతమవుతుంది. అయితే, గాయాల బెడద కోహ్లి సేనకు పెద్ద తలనొప్పిగా మారింది. వెన్ను నొప్పి కారణంగా దూరమైన రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తున్నా ఆఖరి నిమిషం వరకు ఎటూ చెప్పలేని పరిస్థితి. ఇక కీలక ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ సిరాజ్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. వీటికి తోడు మిడిలార్డర్ వైఫల్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే విధంగా రిషభ్ పంత్ వంటి కీలక ఆటగాడు అనవసరపు షాట్లతో వికెట్ పారేసుకోవడం తీవ్ర ప్రభావం చూపుతోంది. అతడిని తుది జట్టు నుంచి తప్పించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ మాత్రం.. ఈ వికెట్ కీపర్‌ను జట్టులో కొనసాగించాలని అంటున్నాడు. ఇన్సైడ్ స్పోర్ట్‌తో అతడు మాట్లాడుతూ.. ‘‘రిషభ్ పంత్ లాంటి ఆటగాడిని మేనేజ్మెంట్ పక్కన పెడుతుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే టీమిండియాకు తనే ఎక్స్ ఫ్యాక్టర్. మ్యాచ్ విన్నర్. షాట్ సెలక్షన్ గురించి కెప్టెన్ విరాట్, కోచ్ రాహుల్ ద్రవిడ్ అతడితో మాట్లాడితే సరిపోతుంది. కేవలం కీపింగ్ నైపుణ్యాల గురించి మాట్లాడుకుంటే వృద్ధిమాన్ సాహా పంత్ స్థానాన్ని భర్తీ చేయగలడు. కానీ... బ్యాటింగ్‌లో పంత్ ఎన్నో మెట్లు పైనే ఉంటాడు’’ అని చెప్పుకొచ్చాడు. ఇక కాస్త కఠిన నిర్ణయమే అయినా... హనుమ విహారిని తుది జట్టు నుంచి తప్పించడం ఖాయమని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. రెండో టెస్టులో అతడు బాగానే ఆడినా.. పుజారా, రహానే అర్ధ సెంచరీలతో రాణించడంతో వాళ్లు కచ్చితంగా మూడో టెస్టు తుది జట్టులో ఉంటారని పేర్కొన్నాడు. విరాట్ వస్తున్నాడు కాబట్టి... విహారిపై వేటు తప్పదన్నాడు. పేస్‌కు అనుకూలించే పిచ్‌పై సిరాజ్ స్థానంలో ఉమేశ్ యాదవ్ జట్టులోకి వస్తే ప్రయోజనకరమని అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టుకు వసీం జాఫర్ ఎంచుకున్న తుదిజట్టు: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, రిషభ్ పంత్, అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా. చదవండి: దక్షిణాఫ్రికా క్రికెటర్లకు భారీ షాక్! Ind Vs Sa 3rd Test: టీమిండియాకు ప్రొటిస్ కెప్టెన్ హెచ్చరికలు.. కచ్చితంగా గెలిచి తీరతాం! -
మెగా వేలంలో అతడి కోసం మూడు జట్లు పోటీ..
టీమిండియా వెటరన్ బౌలర్ ఉమేష్ యాదవ్‌ని ఐపీఎల్-2021సీజన్‌కు గాను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్లో ఉమేష్ యాదవ్ కేవలం బెంచ్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. కాగా ఐపీఎల్-2022 సీజన్ మెగా వేలం ముందు ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రీటైన్ చేసుకోలేదు. ఈ క్రమంలో మెగా వేలంలోకి వెళ్లనున్నాడు. కాగా రానున్న మెగా వేలంలో అతడికోసం మూడు ఫ్రాంఛైజీలు పోటీ పడే అవకాశం ఉంది. మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ అతడిని దక్కించుకోనేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతడు గత ఐపీఎల్ సీజన్లలో ఢిల్లీ, ఆర్సీబీ, కేకేఆర్ జట్లకు ప్రాతనిథ్యం వహించాడు. 121 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఉమేష్ యాదవ్ 121 వికెట్లు పడగొట్టాడు. ఇక మెగా వేలం బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బీసీసీఐ నిర్వహించనున్నట్లు సమాచారం. చదవండి: Ashes 2021: 13 సార్లు 200లోపూ.. 20 మంది ఆటగాళ్లు డకౌట్; ఇంగ్లండ్ చెత్త రికార్డు -
ఉమేశ్ యాదవ్ అరుదైన రికార్డు.. అత్యంత తక్కువ టెస్టుల్లో
లండన్: టీమిండియా ఫాస్ట్‌బౌలర్ ఉమేశ్ యాదవ్ టెస్టుల్లో మరో మైలురాయిని చేరుకున్నాడు. 31 పరుగులు చేసిన డేవిడ్ మలాన్‌ను ఔట్ చేయడం ద్వారా ఉమేశ్ ఈ ఘనతను అందుకున్నాడు. అత్యంత తక్కువ టెస్టుల్లో 150 వికెట్ల ఫీట్‌ను అందుకున్న టీమిండియా బౌలర్లలో జహీర్‌ఖాన్‌తో కలిసి ఉమేశ్ సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. కపిల్‌దేవ్ 39 టెస్టుల్లో 150 వికెట్ల మార్క్‌ను అందుకొని తొలి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత జగవల్ శ్రీనాథ్(40 టెస్టులు), మహ్మద్ షమీ( 42 టెస్టులు) రెండు మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక జహీర్‌ఖాన్ కూడా 49 టెస్టుల్లో 150 వికెట్లు తీశాడు. మొదటి మూడు టెస్టుల్లో ఉమేశ్‌కు అవకాశం ఇవ్వలేదు. అయితే నాలుగో టెస్టులో షమీ స్థానంలో జట్టులోకి వచ్చిన ఉమేశ్ తన బౌలింగ్‌తో అదరగొట్టాడు. ఇప్పటికే నాలుగో టెస్టులో మలాన్, జో రూట్, క్రెయిగ్ ఓవర్టన్‌లను ఉమేశ్ పెవిలియన్ చేర్చాడు. ఇక ఇంగ్లండ్ లంచ్ విరామ సమయానికి 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ఓలీ పోప్ 38, బెయిర్ స్టో 34 పరుగులతో ఆడుతున్నారు. ఇంగ్లండ్ టీమిండియా కంటే ఇంకా 52 పరుగులు వెనుకబడి ఉంది. చదవండి: ENG Vs IND: రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్ ENG Vs IND Intruder Jarvo 69: జార్వో మళ్లీ వచ్చేశాడు.. ఈసారి బౌలర్ అవతారంలో -
జార్వో మళ్లీ వచ్చేశాడు.. ఈసారి బౌలర్ అవతారంలో
లండన్: టీమిండియా, ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ దేశస్తుడు జార్వో ఎంత పాపులర్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరుసగా లార్డ్స్, లీడ్స్ టెస్టుల్లో మైదానంలోకి దూసుకొచ్చిన జార్వో ఆటకు అంతరాయం కలింగించాడు. తాజాగా జార్వో మరోసారి మైదానంలోకి వచ్చేశాడు. ఈసారి బౌలర్ అవతారంలో వచ్చిన జార్వో బౌలింగ్ వేసేందుకు సిద్ధమయ్యాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 34వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఉమేశ్ యాదవ్ 34వ ఓవర్లో రెండు బంతులు వేసి మూడో బంతికి సిద్ధమయ్యాడు. ఇంతలో జార్వో వేగంగా మైదానంలోకి దూసుకొచ్చి రన్ తీసుకుంటూ బౌలింగ్‌కు సిద్ధమయ్యాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బెయిర్ స్టోను తగులుతూ బంతిని విసిరినట్లుగా యాక్షన్ చేశాడు. అయితే జానీ బెయిర్ స్టో జార్వోపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కనిపించింది. చదవండి: ENG Vs IND Intruder Jarvo: 'ఇంగ్లండ్ భయపడింది'.. అందుకే నిషేధం జార్వో చర్యతో టీమిండియా ఆటగాళ్లతో పాటు ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్, అంపైర్లు నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ట్రెండింగ్‌గా మారింది. అనంతరం సెక్యూరిటీ వచ్చి జార్వోను మైదానం నుంచి తీసుకెళ్లారు. ఇక లీడ్స్ టెస్టు అనంతరం జార్వోపై ఆ స్టేడియం నిర్వాహకులు అతనిపై జీవతకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయినా జార్వో మరోసారి అదే తరహాలో చేయడంతో ఈసారి ఏకంగా ఈసీబీ రంగంలోకి దిగే అవకాశం ఉంది. కాగా జార్వోపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్లో టెంట్ వేసుకొని నిద్రపోయాడు Jarvo again!!! Wants to bowl this time 😂😂#jarvo69 #jarvo #ENGvIND #IndvsEng pic.twitter.com/wXcc5hOG9f — Raghav Padia (@raghav_padia) September 3, 2021 -
హడలెత్తించిన ఉమేశ్, సిరాజ్
చెస్టర్ లీ స్ట్రీట్: భారత బౌలర్ల ప్రాక్టీస్ అదిరింది. కౌంటీ సెలెక్ట్ ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత బౌలర్లు ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేశారు. బుధవారం బ్యాటింగ్‌కు దిగిన కౌంటీ జట్టు 82.3 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటైంది. పేసర్లు ఉమేశ్ యాదవ్ (3/22), మొహమ్మద్ సిరాజ్ (2/32) పదునైన బంతులతో కౌంటీ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టారు. ఓపెనర్ హసీబ్ హమీద్ (246 బంతుల్లో 112; 13 ఫోర్లు) శతకంతో జట్టును ఆదుకున్నాడు. అతడు మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కౌంటీ తరఫున బరిలోకి దిగిన భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (1) ప్రాక్టీస్‌ను సద్వినియోగం చేసుకోలేదు. భారత్ 91 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకుంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 306/9తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్... మరో ఐదు పరుగులు మాత్రమే జోడించి 93 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. క్రెయిగ్ మిల్స్ నాలుగు వికెట్లు తీశాడు. అవేశ్ ఖాన్ అవుట్ భారత యువ పేసర్ అవేశ్ ఖాన్ ఇంగ్లండ్ పర్యటన అర్ధాంతరంగా ముగిసిపోయింది. గాయంతో ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు దూరమయ్యాడు. భారత్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో సెలెక్ట్ ఎలెవన్ తరఫున అవేశ్ ఖాన్ బరిలోకి దిగాడు. తొలి రోజు ఆటలో ఇన్నింగ్స్ 10వ ఓవర్‌ను అవేశ్ ఖాన్ బౌలింగ్ చేయగా.... విహారి కొట్టిన రిటర్న్ షాట్‌ను ఆపే ప్రయత్నంలో అతడి ఎడమ చేతి బొటన వేలుకు గాయమైంది. స్కానింగ్‌లో అవేశ్ వేలు విరిగినట్లు తేలింది. అతడు కోలుకోవడానికి కనీసం నెల రోజులకు పైగా సమయం పడుతుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. -
టీమిండియా క్రికెటర్ల పెద్ద మనసు.. ఆ కుటుంబానికి ఆర్థిక సాయం
ముంబై: కరోనా మహమ్మారితో దేశం మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు కరోనా బారీన పడుతుండగా.. మరికొంతమంది ప్రాణాలు వదులతున్నారు. ఆ కోవకు చెందినవారే సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ రుచిర్ మిశ్రా. మిశ్రా టైమ్స్ ఆఫ్ ఇండియాలో పదేళ్లుగా స్పోర్ట్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఈ పదేళ్ల కాలంలో ఆయన టీమిండియా స్వదేశంలో ఆడిన ప్రతీ మ్యాచ్‌తో పాటు డొమస్టిక్ లీగ్‌లను కవర్ చేసేవాడు. మంచి స్పోర్ట్స్ జర్నలిస్ట్‌గా పేరు సంపాదించిన మిశ్రాకు పలువురు టీమిండియా క్రికెటర్లు పరిచయమయ్యారు. ఇలా ఆనందంగా సాగుతున్న అతని జీవితంలో కరోనా పెను విషాదం నింపింది. కొన్ని రోజుల కిందట రుచిర్ మిశ్రా కరోనా బారీన పడి మే4న నాగ్‌పూర్‌లో కన్నుమూశారు. దీంతో అతని కుటుంబం కష్టాల్లో పడింది. వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు రుచిర్ మిశ్రా ఒక ఫండ్ రైజర్‌ను స్థాపించి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది తెలుసుకున్న టీమిండియా క్రికెటర్లు ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, చతేశ్వర్ పుజారా, టీమిండియా వుమెన్స్ కోచ్ రమేశ్ పొవార్‌లు స్పందించారు. ఉమేశ్ రూ. లక్ష విరాళం ఇవ్వగా.. అశ్విన్, పుజారా, పొవార్‌లు రూ. 50 వేలు విరాళంగా ఇచ్చి పెద్ద మనుసు చాటుకున్నారు. మీ ఇంటి పెద్దని మేం తీసుకురాలేకపోవచ్చు.. కానీ మేమిచ్చే ఈ డబ్బు మీ ఆర్థిక పరిస్థితి బాగుండేలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం.. అంటూ క్రికెటర్లు పేర్కొన్నారు. కాగా మిశ్రా కుటుంబానికి క్రికెటర్లు చేసిన సాయం తెలుసుకొని వసీం జాఫర్ సహా మరికొందరు సెలబ్రిటీలు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇక కరోనా సెగతో ఐపీఎల్ 14వ సీజన్‌ను బీసీసీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆటగాళ్లంతా ఇంటికి చేరుకున్నారు. కివీస్‌తో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు సమాయత్తమవుతున్న టీమిండియా జూన్ 2న ఇంగ్లండ్‌కు బయల్దేరనుంది. జూన్ 18 నుంచి 22 వరకు టీమిండియా కివీస్‌తో ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడనుంది. అనంతరం ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో పాల్గొననుంది. చదవండి: క్రికెటర్ భువనేశ్వర్ ఇంట్లో విషాదం I just contributed to this family! If you are from the cricket fraternity and would like to donate. Please do so🙏🙏 https://t.co/3P8q7tht2d pic.twitter.com/12LfO51Dx8 — Mask up and take your vaccine🙏🙏🇮🇳 (@ashwinravi99) May 20, 2021 -
ఉమేశ్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్.. షాక్ తిన్న రహానే
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో సీఎస్కేపై ఘన విజయం సాధించి మంచి జోష్‌లో కనిపిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాక్టీస్‌లోనూ మెరుపులు మెరిపిస్తుంది. ఇటీవలే దగ్గు, గొంతునొప్పితో ఆసీస్‌తో సిరీస్‌కు దూరమైన ఉమేశ్ యాదవ్ ఇంగ్లండ్‌తో జరిగిన చివరి రెండు టెస్టులకు అందుబాటులోకి వచ్చినా తుది జట్టులో చోటు దక్కలేదు. ఐపీఎల్ సీజన్ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న ఉమేశ్ యాదవ్ క్వారంటైన్ పూర్తి చేసుకొని ప్రాక్టీస్‌ను ఆరంభించాడు. ఈ నేపథ్యంలో ఉమేశ్ ఒక స్టన్నింగ్ క్యాచ్‌తో అదరగొట్టడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాక్టీస్‌లో భాగంగా ఉమేశ్ వేసిన బంతిని రహానే ఆఫ్‌సైడ్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి రహానే బ్యాట్ ఎడ్జ్‌కు తాకి ఉమేశ్ వైపు దూసుకొచ్చింది. అయితే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఉమేశ్ యాదవ్ ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. దీంతో బ్యాటింగ్ చేస్తున్న రహానే ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. దీనిని ఢిల్లీ క్యాపిటల్స్ ట్విటర్లో షేర్ చేస్తూ.. ఉమేశ్ ఆన్ ఫైర్.. స్టన్నింగ్ క్యాచ్ అంటూ క్యాప్షన్ జతచేసింది. అంతకముందు ఆసీస్ టూర్‌కు దూరమైన తర్వాత తన ఫిట్నెస్ను మెరుగుపరుచుకునేందుకు ఉమేశ్ యాదవ్ తీవ్ర కసరత్తులు చేశాడు. కొన్ని రోజుల క్రితం తాను ఎంత ఫిట్‌గా ఉన్నానో చెప్పడానికి ఒక వీడియోనూ రిలీజ్ చేశాడు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ ఉమేశ్ యాదవ్‌ను కనీస ధరకు( రూ. కోటి) దక్కించుకున్న సంగతి తెలిసిందే. సీఎస్కేపై విజయంతో జోష్‌లో ఉన్న ఢిల్లీ తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్ 15న ముంబై వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో ఆడనుంది. చదవండి: శ్రేయస్ అయ్యర్‌కు పాంటింగ్ ఆహ్వానం..! ఆఫ్ స్పిన్ టెస్టుల్లో మాత్రమే వేస్తావా.. టీ20ల్లో వేయవా! A mid-air one-handed stunner 🤯#YehHaiNayiDilli #IPL2021 #DCOnThePitch @OctaFX @y_umesh pic.twitter.com/0jrEf5nXOl — Delhi Capitals (@DelhiCapitals) April 13, 2021 -
విదేశీ బౌలర్లకు అంత ఇచ్చి.. అతనికి ఇంత తక్కువ
చెన్నై: ఐపీఎల్ 2021 మినీ వేలంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ కనీస ధరకే అమ్ముడుపోవడంపై భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా పెదవి విరిచాడు. చెన్నై వేదికగా జరిగిన వేలంలో రూ.కోటితో ఉమేశ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. భారత అగ్రశ్రేణి బౌలర్లలో ఒకడిగా కొనసాగుతున్న ఉమేశ్ యాదవ్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ మినహాయిస్తే మిగతా ఫ్రాంఛైజీలు అసక్తి కనబరచకపోవడం ఆశ్చర్యం కలిగించిందని నెహ్రా చెప్పుకొచ్చాడు. ‘తప్పుగా అనుకోమంటే ఒక మాట చెప్పాలని ఉంది. పేరు లేని బౌలర్లకు అంత వెచ్చించి .. ఎంతో అనుభవం ఉన్న ఉమేశ్‌ను అంత తక్కువ ధర ఇవ్వడం బాగాలేదు. వాస్తవానికి జై రిచర్డ్సన్, కైల్ జేమిసన్ ఇంకా నిరూపించుకునే దశలో ఉన్నారు. టెస్టుల పరంగా జేమిసన్ నిలకడగా రాణిస్తున్నాడు. రిచర్డ్సన్ పెర్త్‌లో ఫర్వాలేదనిపించాడు. కానీ ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. ఉమేశ్ యాదవ్‌తో పోలిస్తే.. జేమిసన్, రిచర్డ్సన్ అనుభవం ఎంత..? వేలంలో ఎక్కువ ధరకి ఎలా అమ్ముడుపోయారనేది అర్థం కావడం లేదు. ఉమేశ్ వేలంలో తక్కువ ధరకు అమ్ముడయ్యాడన్న బాధ కన్నా పేరులేని బౌలర్లకు అంత పెట్టినందుకు ఆశ్చర్యం కలిగింది. మిచెల్ స్టార్క్, లసిత్ మలింగ లాంటి బౌలర్లు భారీ ధరకి అమ్ముడుపోయారంటే అర్థం ఉంది.ఎందుకంటే ఇప్పటికే వారు తమ సత్తాను ప్రపంచానికి నిరూపించారు.' అని చెప్పుకొచ్చాడు. కాగా ఉమేశ్‌ను కనీస మద్దతు ధరకే ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకోవడంపై మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ కూడా తప్పుబట్టాడు. కాగా దక్షిణాఫ్రికాకు చెందిన క్రిస్ మోరిస్‌కు వేలంలో రూ.16.25 కోట్లకి అమ్ముడుపోగా.. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ కైల్ జేమిసన్ కోసం రూ.15 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేయగా.. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జై రిచర్డ్సన్కు రూ.14 కోట్లు వెచ్చించి పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. చదవండి: ఇన్నాళ్ల నిరీక్షణ ముగిసింది.. కంగ్రాట్స్ 'అంత తక్కువ ధర.. ఐపీఎల్ ఆడకపోవచ్చు' -
శార్దూల్ స్థానంలో సీనియర్ సీమర్ జట్టులోకి
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో చివరి రెండు టెస్టుల్లో తలపడే భారత జట్టులో సెలక్టర్లు ఒకే ఒక మార్పు చేశారు. అహ్మదాబాద్‌లో జరిగే ఈ మ్యాచ్‌లలో శార్దుల్ ఠాకూర్ స్థానంలో సీనియర్ సీమర్ ఉమేశ్ యాదవ్‌ను ఎంపిక చేశారు. అయితే ఉమేశ్‌ను తీసుకున్నప్పటికీ మ్యాచ్‌కు ముందే అతను తన ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి వుంటుంది. షమీ వంద శాతం ఫిట్‌గా లేకపోవడంతో అతన్ని ఎంపిక చేయలేదు. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా రెండో టెస్ట్‌లో ఉమేష్ యాదవ్ గాయపడిన విషయం తెలిసిందే. కాలికి గాయం కావడంతో స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఇక ఆసీస్ టూర్లో రెండు టెస్టులాడిన ఉమేశ్ నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా నుంచి రిలీజ్ అయిన శార్దూల్ ఠాకూర్ విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్నాడు. చదవండి: అశ్విన్ ఆల్‌రౌండర్ ర్యాంకు పైపైకి -
లక్కీ చాన్స్ కొట్టేసిన నటరాజన్
మెల్బోర్న్: టీమిండియా ప్రదాన బౌలర్ ఉమేశ్ యాదవ్ గాయం కారణంగా ఆసీస్ పర్యటన నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో తమిళనాడుకు చెందిన ‘యార్కర్’ సంచలనం నటరాజన్ జట్టులో చోటు దక్కించుకోనున్నాడు. గాయపడిన ఉమేశ్ యాదవ్ స్థానంలో మిగిలున్న రెండు టెస్టుల్లో ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్‌బౌలర్ బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. ‘సీనియర్ సీమర్ ఉమేశ్ తీవ్రమైన ఎడమకాలి కండరాల గాయంతో బాధపడుతున్నాడు. మూడో టెస్టుకల్లా పూర్తిగా కోలుకునే అవకాశం లేదు. దీంతో మూడు, నాలుగు టెస్టుల కోసం అతని స్థానంలో నటరాజన్ ఆడతాడు’ అని షా వెల్లడించారు. నెట్ బౌలర్‌గా ఉన్న నటరాజన్ తొలుత ఐపీఎల్‌లోనూ ఆపై టీమిండియాలో చోటు సంపాదించి నిరూపించుకున్నాడు. కరోనా కాలంలోనూ లక్కీ చాన్స్ కొట్టేసి టెస్టుల్లోనూ అరంగేట్రం చేయనున్నాడు. (చదవండి: రోహిత్ శర్మకు ప్రమోషన్) ఇదిలాఉండగా.. ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో నటరాజన్ అరంగేట్రం చేసి రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. అదే విధంగా టీ20 సిరీస్‌లో మొత్తంగా ఆరు వికెట్లు (3,2,1) తీసి అందరి చేతా ప్రశంసలు అందుకుంటున్నాడు. మరోవైపు తొలి రెండు వన్డేల్లో ఓటమిపాలై సిరీస్ కోల్పోయిన టీమిండియా మూడో వన్డేలో విజయం సాధించి పరువు నిలుపుకుంది. రెండు టీ20 మ్యాచ్‌లలో వరుసగా విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. మూడో టీ20లో ఆసీస్ గెలుపొందింది. ఇక ప్రతిష్టాత్మక నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు 1-1 తో సమంగా ఉన్నాయి. మూడో టెస్టు సిడ్నీ వేదికగా ఈ నెల 7 నుంచి మొదలు కానుంది. (చదవండి: నెట్ బౌలర్‌గా వచ్చా.. ఇంకేం కావాలి: నటరాజన్) -
తండ్రిగా ప్రమోషన్ పొందిన టీమిండియా పేసర్
టీమిండియా పేసర్ ఉమేష్ యాదవ్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ఆయన భార్య తాన్య వాద్వా శుక్రవారం రోజున ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఉమేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. చిన్న పాప ఫోటోను షేర్ చేస్తూ... ‘ఈ ప్రపంచంలోకి స్వాగతం రాకుమారి. నీ రాకతో ఎంతో థ్రిల్లింగ్‌గా ఫీల్ అవుతున్నాను.’ అని ట్విటర్లో అభిమానులతో పంచుకున్నారు. పేస్ బౌలర్ ఉమేష్, తాన్య వాద్వాలా వివాహం 2013లో జరిగింది. వీరిద్దరికి ఇది మొదటి సంతానం. చదవండి: ఉమేశ్ యాదవ్ స్థానంలో నటరాజన్! It's a girl. 😘😘😍😘😍😘 pic.twitter.com/mdorY5nBUv — Umesh Yaadav (@y_umesh) January 1, 2021 ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న ఉమేశ్ యాదవ్.. త్వరలో భారత్‌కు రానున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో ఉమేష్ యాదవ్ కాలికి గాయమై ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం తన ముద్దుల కూతురితో కాస్తా సమయం గడిపేందుకు అవకాశం దొరికినట్లైంది. ఇదిలా ఉండగా ఈ పర్యటనలో ఉమేష్ యాదవ్ రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు. గాయం కారణంగా వెనుదిరిగిన ఉమేష్ యాదవ్ స్థానంలో లెఫ్టామ్ పేసర్ నటరాజన్‌కు చోటు దక్కింది. ఈ విషయాన్ని శుక్రవారం ట్విటర్ ద్వారా బీసీసీఐ వెల్లడించింది. -
ఉమేశ్ యాదవ్ స్థానంలో నటరాజన్!
సిడ్నీ: బాక్సింగ్ డే టెస్టు సమయంలో గాయపడిన టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. జట్టును వీడి స్వదేశానికి పయనం కానున్నాడు. కాగా రెండో టెస్టు మూడో రోజు ఆటలో భాగంగా బౌలింగ్ చేస్తున్న సమయంలో ఉమేశ్ గాయంతో విలవిల్లాడిన విషయం విదితమే. కాలి(పిక్కల్లో) నొప్పి కారణంగా ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 8వ ఓవర్లోనే మైదానాన్ని వీడాడు. బీసీసీఐ వైద్య బృందం అతడికి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం ఆస్పత్రికి తరలించింది. ఇక అతడి స్థానంలో మహ్మద్ సిరాజ్ 8 వ ఓవర్‌ను పూర్తిచేశాడు. కాగా ఉమేశ్ స్థానంలో యార్కర్ కింగ్ టి. నటరాజన్‌ను సిడ్నీ టెస్టులో ఆడించే అవకాశాన్ని బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా మూడో వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన తమిళనాడు పేసర్ నటరాజన్ మెరుగ్గా రాణించి అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అదే విధంగా టీ20 సిరీస్‌లో(3+2 వికెట్లు)నూ సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో శార్దూల్ ఠాకూర్ కంటే కూడా నటరాజన్ వైపే మేనేజ్మెంట్ మొగ్గుచుపుతున్నట్లు విశస్వనీయ వర్గాలు తెలిపాయి. ఇక ఇప్పటికే బాక్సింగ్ డే టెస్టుతో సంప్రదాయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్ దిగ్గజాల చేత ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా ఆసీస్ టూర్లో భాగంగా రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఉమేశ్ యాదవ్ మొత్తంగా 39.4 ఓవర్లు బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు తీశాడు. (చదవండి:'క్వారంటైన్ తర్వాత మరింత యంగ్ అయ్యావు') గాయపడటానికి ముందు ఆస్ట్రేలియా ఓపెనర్ జో బర్న్స్‌ను అతడు పెవిలియన్‌కు చేర్చాడు. ఇక ఇప్పటికే మహ్మద్ షమీ బోర్డర్- గవాస్కర్ సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. రెండో టెస్టులో ఘోర పరాజయం చెందిన ఆసీస్‌కు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చేరికతో కాస్త ఊరట లభించింది. సిడ్నీలో జరిగే మూడో టెస్టుకు అతడు అందుబాటులో ఉండనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం ప్రకటించింది. -
'శాస్త్రి ఆ విషయం నాకు ముందే చెప్పాడు'
ముంబై : ఆసీస్‌తో జరగనున్న నాలుగు టెస్టు సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు డిసెంబర్ 17 నుంచి అడిలైడ్ వేదికగా ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ కూర్పులో మూడో సీమర్ ఎవరనే దానిపై చర్చ నడుస్తుంది. అయితే ఆసీస్‌తో జరగబోయే తొలి టెస్టులో మూడో పేసర్ ఎవరన్నది తనకు తెలుసని ఆసీస్ మాజీ ఆటగాడు ఇయాన్ చాపెల్ పేర్కొన్నాడు. ప్రస్తుతమున్న అనుభవం దృష్యా ఉమేశ్ యాదవ్‌కే మూడో పేసర్‌గా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలిపాడు. (చదవండి : డ్రింక్స్ తాగడానికే ఐపీఎల్‌కు వచ్చేవాడు : సెహ్వాగ్) 'టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రితో కలిసి సరదాగా డ్రింక్ తాగుతున్న సందర్భంగా ఈ అంశం చర్చకు వచ్చింది. తొలి టెస్టుకి టీమిండియాలో మూడో పేసర్ అవసరం ఉందని.. ఇషాంత్ గైర్హాజరీలో అనుభవం దృష్యా ఉమేశ్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని శాస్త్రి నాతో చెప్పాడు. ప్రస్తుతం టీమిండియా టెస్టు జట్టులో మహ్మద్ షమీ, బుమ్రాలు కీలకంగా మారారని.. ఉమేశ్ లాంటి బౌలర్ ఉంటే మరింత ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమిండియా తొలి టెస్టును డే నైట్‌లో ఆడడం సానుకూలాశంగా మారనుంది. ఒకవేళ భారత్ మొదటి బ్యాటింగ్ చేసి 300 పరుగులు సాధిస్తే గెలిచే అవకాశాలు మెండుగా ఉంటాయి. మొదటి టెస్టు తర్వాత కోహ్లి స్వదేశానికి వెళ్లనున్ననేపథ్యంలో టీమిండియాకు మిగిలిన టెస్టుల్లో ఇబ్బందులు ఎదురయ్యే చాన్స్‌లు ఉన్నాయి. కాగా కోహ్లి స్థానంలో అజింక్యా రహానే మిగిలిన మూడు టెస్టులకు కెప్టెన్‌గా పనిచేయనున్నాడు.(చదవండి : ‘కోహ్లిని పక్కకు పెట్టి ఒత్తిడి తగ్గించండి’) వాస్తవానికి ఆసీస్ టూర్‌కు మొదట ఇషాంత్ శర్మ మూడో పేసర్‌గా ఎంపికయ్యాడు. అయితే ఐపీఎల్ 13వ సీజన్ సందర్భంగా ఇషాంత్ గాయపడడంతో ఆసీస్ టూర్ నుంచి తప్పించారు. అతని స్థానంలో మహ్మద్ సిరాజ్‌ను తీసుకున్నారు. ప్రస్తుతం టీమిండియా పేస్ బౌలింగ్ దళంలో షమీ, బుమ్రాలతో పాటు ఉమేశ్ యాదవ్, నవదీప్ సైనీ, మహ్మద్ సిరాజ్‌లు ఉన్నారు. -
ఆసీస్ ‘ఎ’కు ఆధిక్యం
సిడ్నీ: టెస్టు సిరీస్ సన్నాహాల కోసం జరుగుతోన్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత ‘ఎ’ జట్టు పేసర్లు ఉమేశ్ యాదవ్ (3/44), సిరాజ్ (2/71) టచ్‌లోకి వచ్చినప్పటికీ ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుకు ఆధిక్యం లభించింది. ముందుగా సోమవారం 237/8 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ ‘ఎ’ మరో 10 పరుగులే చేసి 247/9 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ‘ఎ’ రెండో రోజు ఆట నిలిచే సమయానికి 85 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ గ్రీన్ (114 బ్యాటింగ్; 10 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ సాధించాడు. టిమ్ పైన్ (44; 4 ఫోర్లు) కూడా రాణించాడు. సీనియర్ స్పిన్నర్ అశ్విన్ 2 వికెట్లు తీశాడు. ప్రస్తుతం ఆసీస్ ‘ఎ’ జట్టు 39 పరుగుల ఆధిక్యంలో ఉంది. మంగళవారం ఆటకు ఆఖరి రోజు. మిగిలిన 2 వికెట్లను పడగొట్టాక... భారత ఆటగాళ్లు రోజంతా బ్యాటింగ్ చేసే అవకాశముంది. దీంతో ఈ మ్యాచ్ ‘డ్రా’గా ముగియడం ఖాయమైంది. -
ఈసాల కప్ నమ్దే అంటావ్..
దుబాయ్: ఈసాల కప్ నమ్దే(ఈసారి కప్ మనదే).. ఇది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) నినాదం. గత కొన్ని సీజన్లుగా ఇదే స్లోగన్‌తో ఆర్సీబీ బరిలోకి దిగడం , భారంగా కప్‌ను కొట్టకుండానే టోర్నీ నుంచి ముగించడం జరుగుతుంది. 2016లో ఫైనల్‌కు చేరిన ఆర్సీబీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయి రన్‌రప్‌గా సరిపెట్టుకుంది. ఆ ఒక్క సీజన్ మినహా ఆర్సీబీ ఐపీఎల్లో ఆకట్టుకున్న సందర్భంలేదు. ఆర్సీబీలో ఆది నుంచి హేమాహేమీ క్రికెటర్లు ఉన్నప్పటికీ ఆ జట్టు కప్ కొట్టడంలో విఫలమవుతుంది. కోహ్లి వంటి ఒక స్టార్ క్రికెటర్, ఏబీ డివియర్స్ వంటి 360 డిగ్రీస్ ఆటగాడు ఉన్నా ఆ జట్టు నాకౌట్ చేరడానికే అపసోపాలు పడుతుంది. ఐపీఎల్ ఆరంభమయై 12 ఏళ్ల గడిచిన తరుణంలో ఈసారైనా కప్‌ను కొట్టాలని భావిస్తోంది. ఫ్యాన్స్ కోసమైనా కప్‌ను గెలవాలనే కసితో బరిలోకి దిగుతోందని ఆర్సీబీ పేసర్ ఉమేశ్ యాదవ్ పేర్కొన్నాడు. (చదవండి: సీఎస్కేకు మరో ఎదురుదెబ్బ!) యూఏఈలో పెద్ద గ్రౌండ్లో ఉన్నా తమకు అతికినట్లు సరిపోతాయని అంటున్నాడు. కాకపోతే కాస్త శ్రమించాల్సిన అవసరం ఉందని తెలిపాడు. ఏది ఏమైనా తమకు ఫ్యాన్స్‌కు కప్‌ను అందించాలనే సంకల్పంతో పోరుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశాడు. క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నట్లు లెక్కకు మించి ఇక్కడ శ్రమించాలనే దానితో ఏకీభవిస్తున్నట్లు తెలిపాడు. ‘ ఇది క్రికెట్. ఇక్కవ ఎవరూ ఫేవరెట్లు కాదు. ఈ టోర్నమెంట్లో ఫేవరెట్ ఎవరంటే ఏమి చెబుతాం. మనం కష్టించే తత్వమే మనల్ని రేసులో నిలబెడుతుంది. ఇప్పుడు దానిపైనే దృష్టి పెట్టాం. మన వ్యక్తిగత ప్రదర్శనలు చాలా ముఖ్యం. మాకు పెద్ద గ్రౌండ్లతో సమస్య ఉండదనే అనుకుంటున్నా. అది కూడా హార్డ్‌వర్క్ చేసినప్పుడే అవి పెద్ద గ్రౌండ్లా.. చిన్న గ్రౌండ్లా అనిపించవు. మాకు పరిస్థితులు అనుకూలిస్తాయనే ఆశిస్తున్నాం. 100 శాతం ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది’ అని ఉమేశ్ తెలిపాడు.(చదవండి: సీఎస్కే వాట్సాప్ గ్రూప్ నుంచి రైనా ఔట్?) గత సీజన్లలో ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం. మరి చాలా చిన్నస్టేడియం. ఇది బౌలర్ల కంటే బ్యాట్స్‌మన్‌కే అనుకూలిస్తోంది. అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ కల్గిన ఆర్సీబీకి చిన్నస్వామి స్టేడియం చక్కగా సెట్ అవుతుంది. మరి ఈ సీజన్ ఐపీఎల్ యూఏఈలో జరుగుతుంది. ఇక్కడ హోమ్ గ్రౌండ్లో ఫేవరెట్ గ్రౌండ్లు లేవు. ఇక్కడ మైదానాలు పెద్దవిగానే ఉంటాయి. దాంతో ఆర్సీబీకి గతం కంటే ఎక్కువ సమస్యలు వస్తాయోమోనని ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి ఉమేశ్ యాదవ్ ఇచ్చే సమాధానం మిక్కిలి కష్టపడటం. ఏది ఏమైనా ఈసాల కప్ నమ్దే అనే నమ్మకంతో ఉన్నాడు ఉమేశ్. -
బాధితుడిగా భావించడం లేదు!
న్యూఢిల్లీ: పదునైన వేగం, అన్ని పిచ్‌లపై చెలరేగే సత్తా ఉన్నా ఉమేశ్ యాదవ్‌కు ఇతర భారత పేస్ బౌలర్లతో పోలిస్తే తగినన్ని అవకాశాలు రావడం లేదు. వన్డేల్లో చాలా కాలంగా జట్టుకు దూరమైన అతను టెస్టుల్లో కూడా ఇషాంత్, షమీ, బుమ్రాల జోరులో రిజర్వ్ స్థానానికే పరిమితం కావాల్సి వస్తోంది. చాలా సందర్భాల్లో అతనికి తుది జట్టులో చోటు దక్కడం లేదు. అయితే తానేమీ బాధ పడటం లేదని, అవకాశం వచ్చినప్పుడే నిరూపించుకోవడం తన పని అని అతను వ్యాఖ్యానించాడు. 2018నుంచి చూస్తే ఉమేశ్ 10 టెస్టులు మాత్రమే ఆడగలిగాడు. వీటిలో అతను 45 వికెట్లు పడగొట్టాడు. ‘ఈ విషయంలో నన్ను నేను బాధితుడిగా భావించుకోవడం లేదు. కొన్ని సార్లు ఆడతాం. కొన్ని సార్లు ఆడలేమంతే. నిజాయితీగా చెప్పాలంటే మానసికంగా నేను చాలా దృఢంగా ఉంటాను. ఇలాంటి సమయంలో అది ఎంతో ముఖ్యం. మ్యాచ్‌లో ఎవరికైన్నా అవకాశం దక్కవచ్చు. ఫామ్, పిచ్, వాతావరణ పరిస్థితులు... ఇలా ఒక బౌలర్‌ను తీసుకునేందుకు ఎన్నో కారణాలుంటాయి. కాబట్టి దాని గురించి అతిగా ఆలోచించను. మ్యాచ్‌లో అవకాశం దక్కనప్పుడు కూడా నా ఆటను మరింత మెరుగుపర్చుకోవడంపైనే దృష్టి పెడతా. ఇలాంటి సమయంలో ఎవరి దగ్గరికో వెళ్లి సలహాలు అడగను’ అని ఉమేశ్ యాదవ్ చెప్పాడు. లాక్డౌన్ సమయంలో శరీర దారుఢ్యాన్ని పెంచుకునేందుకు స్ట్రెంత్ ట్రైనింగ్‌పైనే దృష్టి పెట్టినట్లు అతను వెల్లడించాడు. -
పనే లేదు.. వర్క్‌లోడ్ అంటే ఏమనాలి?: ఉమేశ్
న్యూఢిల్లీ: తనకు వరుసగా అవకాశాలు ఇవ్వకపోవడంపై టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ తీవ్ర అసంతృప్తితోనే ఉన్న విషయం అతని మాటల ద్వారానే తెలుస్తోంది. ఇక్కడ తన అవకాశాలు ఇవ్వని అంశాన్ని వేలెత్తి చూపిన ఉమేశ్.. అసలు తనకు చాలినంత పనే లేదన్నాడు. ఈ విషయంలో తన వర్క్‌లోడ్ గురించి మాట్లాడే పెద్దలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ జోక్‌లు పేల్చుతూనే తన మనసులోని మాటను వెళ్లగక్కాడు. (నువ్వెంత ఇచ్చావ్’ అనడం దారుణం) ‘నన్ను సెలక్టర్లు వన్డేల్లో సరిగా ఉపయోగించుకోవడం లేదు. నాకు విశ్రాంతి ఇచ్చిన తర్వాత వన్డే ఆడటానికి ఆరు నెలలు నిరీక్షించాల్సి వచ్చింది. ఇది కచ్చితంగా కష్టమే. నా కెరీర్ ఎప్పుడూ నిలకడగా లేదు. 2015 వరల్డ్‌కప్‌లో నా బౌలింగ్ బాగానే ఉంది. కానీ ఆ తర్వాత చాలాకాలం తప్పించారు. అది ఎందుకో నాకు అర్థం కావడం లేదు. ఎక్కడా వైట్ బాల్ క్రికెట్.. రెడ్ బాల్ క్రికెట్ అనే సమస్య ఉండదు. రెండు బంతుల్లో స్వింగ్ ఉంటుంది. నేను ఆ పని చేయగలను. అంతకుముందు చేశాను కూడా. ఒక వన్డే సిరీస్ అంతా నాకు అవకాశం ఇస్తే నేను ఏమిటో నిరూపించుకునే అవకాశం మళ్లీ దొరుకుతుంది. ఇక్కడ నేను ఎవర్నీ తప్పుబట్టడం లేదు. వర్క్‌లోడ్ అంటూ తప్పిస్తున్నారు. కానీ నాకు సరైన పనే లేదనేది నా భావన’ అంటూ ఉమేశ్ చురకలంటించాడు. (వేలంలో ‘బ్లాక్ మాంబా’ టవల్‌కు భారీ ధర) టీమిండియా తరఫున 46 టెస్టులాడిన ఉమేశ్ యాదవ్ 144 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 28 మ్యాచ్‌లను భారత్ గడ్డపై ఆడి 96 వికెట్లు తీసిన ఈ పేసర్.. మిగిలిన 18 మ్యాచ్‌లను విదేశీ గడ్డపై ఆడి 48 వికెట్లు తీశాడు. దీంతో.. విదేశాల్లో ఉమేశ్ రాణించలేడనే ముద్ర పడిపోయింది. ఇక 75 వన్డేలు ఆడిన ఉమేశ్.. 106 వికెట్లు తీశాడు. 2018 నుంచి చూస్తే ఉమేశ్ ఆడిన వన్డేలు నాలుగు మాత్రమే. ఆ కాలంలో టీమిండియా 54 వన్డేలు ఆడింది. -
ఉమేశ్‌ను పించ్ హిట్టర్‌గా పంపిస్తా : కోహ్లి
న్యూఢిల్లీ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి భారత పేస్ బౌలర్ ఉమేశ్ యాదవ్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. 'ఉమేశ్ ఆటతీరు చూస్తుంటే టెస్టుల్లో పించ్ హిట్టర్‌గా నెంబర్ 3వ స్థానంలో పంపించాలని ఉందని' కోహ్లి పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది టెస్టు ఫార్మాట్లో పునరాగమనం చేసిన ఉమేశ్ బంతితో పాటు బ్యాట్‌తోనూ అదరగొడుతున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌కు గాయంతో దూరమైన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన ఉమేశ్ నాలుగు టెస్టుల్లో 13.65 సగటుతో 23 వికెట్లు పడగొట్టాడు. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ ప్రారంభమైన తర్వాత కనీసం నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితా ప్రకారం ఉమేశ్ 23.1 సగటును నమోదు చేసి బెస్ట్ బౌలర్‌గా నిలిచాడు. ఇదంతా ఒకటైతే రాంచీలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో 10 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. ఉమేశ్ ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు ఉండగా, టెస్టు చరిత్రలో 30 పరుగులకు పైగా చేసిన ఆటగాళ్లలో 310 స్టైక్‌రేట్ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు ఈ రికార్డు న్యూజీలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ప్లెమింగ్ పేరిట ఉంది. అతను 11 బంతుల్లో 31 పరుగులు చేశాడు. 'ఒకవేళ విదేశాల్లో హార్థిక్ పాండ్యా ఆల్‌రౌండర్‌గా విఫలమైనా మేము ఐదుగురు బౌలర్లతో ఆడేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఏడో స్థానం వరకు కీపర్‌తో పాటు అశ్విన్, జడేజాలు బ్యాటింగ్ చేయగల సమర్థులు. తాజాగా వీరికి ఉమేశ్ కూడా జతయ్యాడు. అతని ఆటతీరు చూస్తుంటే టెస్టుల్లో పించ్ హిట్టర్‌గా 3వ స్థానంలో పంపించాలని ఉందని' విరాట్ కోహ్లి నవ్వుతూ మీడియాకు తెలిపాడు. కాగా ఉమేశ్ న్యూజీలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు కీలకంగా మారే అవకాశం ఉంది. న్యూజీలాండ్‌తో టీమిండియా 5 టీ20, 3 వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్ వచ్చే ఏడాది జనవరి 24 నుంచి ప్రారంభం కానుంది. -
భరత్ దిద్దిన బలగం
మనది స్పిన్నిండియా! సిరీస్‌ల్లో నెట్టుకొచ్చినా... నెగ్గుకొచ్చినా... అది స్పిన్నర్ల వల్లే సాధ్యమయ్యేది. అందుకే స్పిన్ ఇండియాగా మారింది. కానీ ఇపుడు ఈ పరిస్థితి కూడా మారింది. స్పిన్నర్లకు దీటుగా పేసర్లు దడదడలాడిస్తున్నారు. ఇటీవలే వారిని మించి కూడా రాణిస్తున్నారు. అంతలా ఈ పేస్ పదును పెరగడానికి బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఎంతో కృషి చేశారు... చేస్తున్నారు కూడా! సాక్షి క్రీడా విభాగం: సొంతగడ్డపై భారత్ టెస్టు సిరీస్ గెలిచిందంటే అది స్పిన్నర్ల ఘనతే! కానీ ఇది ఒకప్పటి మాట. ఇప్పుడీ ఆనవాయితీ మారింది. పేస్ పదును తేలింది. ప్రత్యర్థి జట్టును రెండుసార్లు ఆలౌట్ చేసి... మ్యాచ్‌ల్ని, సిరీస్‌లనీ గెలవడంలో పేసర్ల పాత్ర పెరిగింది. ఉన్నపళంగా ఈ మార్పేమీ జరగలేదు. కొంతకాలంగా సానబెడితేనే పేస్ ఫలితాలు సాకారమవుతున్నాయి. ఈ ఫలితాలకు, గణనీయమైన మార్పులకు టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణే కారణం. ఆయన సీమర్లనే కాదు స్పిన్నర్లు చహల్, కుల్దీప్, అశ్విన్, జడేజాల లోపాలను కూడా సరిదిద్దారు. భారత ‘బ్యాటిం గ్’కు మేలురకమైన బౌలింగ్ బలగాన్ని జతచేశారు. దీంతో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో విజయాలు చేకూరుతున్నాయి. భరత్ బౌలర్లకు బంతులెక్కడ సంధించాలో చెప్పరు... ఆ బంతి ఎక్కడ పిచ్ కావాలనేది కచ్చితంగా చెబుతారు. అదే వాళ్లను అలా టర్న్ అయ్యేలా చేస్తుందనేది ఆయన నమ్మకం. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో 1962లో పుట్టిన భరత్ అరుణ్ తమిళనాడు తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడారు. భారత్ తరఫున రెండు టెస్టులు, నాలుగు వన్డేలు ఆడిన ఆయన 1993లో రిటైర్మెంట్ ప్రకటించారు. తొమ్మిదేళ్ల తర్వాత 2002లో తమిళనాడు రంజీ జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. నాలుగేళ్లపాటు భరత్ ఈ పదవిలో ఉన్నారు. రెండుసార్లు తమిళనాడును రంజీ ఫైనల్‌కు చేర్చారు. అనంతరం 2008లో జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించిన ఆయన 2012లో భారత అండర్– 19 జట్టు బౌలింగ్ కోచ్‌గా పని చేశారు. 2014లో ఐపీఎల్–7లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేసిన ఆయన అదే ఏడాది భారత సీనియర్ జట్టు బౌలింగ్ కోచ్‌గా నియమితులయ్యారు. షమీ రనప్ మార్చి... మొహమ్మద్ షమీ ప్రతిభఉన్న పేసరే కానీ... తర్వాత్తర్వాత పూర్తిగా టెస్టు బౌలర్‌గా ముద్రపడిపోయాడు. గాయాలతో సతమతమయ్యాడు. ఆటకు దూరమైన సందర్భాలూ ఉన్నాయి. కానీ ఇప్పుడు అతనో ప్రధాన బౌలర్. కారణం భరత్ అరుణే! అతని సత్తా ఏంటో తెలిసిన కోచ్ ముందు షమీ రనప్‌ను గమనించాడు. పెద్దపెద్ద అంగలతో వేసే అడుగుల్ని మార్చాడు. వేగంగా పరిగెడితేనే సరిపోదని చెప్పాడు. బంతి సంధించేవేళ ఆ వేగాన్ని బ్యాలెన్స్ చేసుకోవడమే కీలకమన్నాడు. ఉదాహరణకు 200 కి.మీ. వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి తీరా బంతివేసే సమయానికి లయ కోల్పోతే లాభమేంటని సూచించాడు. ఎంత వేగంతో బ్యాలెన్స్ చేసుకుంటావో అంతే రనప్ అవసరమని చెప్పిన బౌలింగ్ కోచ్ మాటలు షమీని మార్చేశాయి. వేగం మారి బౌలింగ్ వైవిధ్యం పెరిగింది. కుదురుగా లైన్ అండ్ లెంత్కు కట్టుబడేలా చేసింది. అంతే కొన్ని రోజుల వ్యవధిలోనే అతనికి వన్డే జట్టులో పదిలమైన స్థానాన్ని కట్టబెట్టగా... ఇపుడు ఏకంగా పొట్టి ఫార్మాట్‌కు అక్కరకొచ్చే ఆటగాడ్ని చేసేసింది. పరిమిత ఓవర్ల ఆటకు దూరమైన ఆ బౌలర్‌ను వన్డే ప్రపంచకప్ ఆడే స్థితికి తీసుకొచ్చిన ఘనత అరుణ్‌దే. బుమ్రా శైలిపై సంశయమున్నా.. బౌలింగ్ కోచ్ భరత్ బౌలర్ల ప్రదర్శనకు వికెట్లే ప్రమాణంగా ఎప్పుడూ పరిగణించరు. భారత సంచలన పేసర్ జస్ప్రీత్ బుమ్రా వచ్చీ రాగానే మంచి బౌలర్‌గా కితాబు అందుకున్నాడు. అతను తీసే వికెట్లతో టీమ్ మేనేజ్మెంట్ తెగ సంబరపడింది... కానీ అతని భిన్నమైన బౌలింగ్ శైలిపై అందోళన పడింది మాత్రం అరుణే! ఇది అతని కెరీర్‌కు, ఫిట్‌నెస్‌కు సమస్యగా మారుతుందని తొలినాళ్లలోనే హెచ్చరించారు. శరీరంపై ఆ శైలి తాలూకు పడే అదనపు ఒత్తిడి వల్లే తాజాగా బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితిని ముందే ఊహించడం విశేషమైతే ఫిజియోతో కలిసి అతని ఫిట్‌నెస్‌కు ఢోకా లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై కసరత్తు కూడా చేశారు అరుణ్. అయితే బుమ్రా తనకు ఆ బౌలింగ్ శైలే సౌకర్యవంతమని చెప్పడంతో కాదనలేకపోయారు. అలాగే ఇప్పుడు గాయం నుంచి కోలుకునేందుకు అన్ని రకాలుగా అతనికి సేవలందిస్తున్నారు. వికెట్లు తీస్తే సరిపోదని... నిలకడకూ ప్రాధాన్యమివ్వాలని, ఫిట్నెస్ను కాపాడుకోవాలని పదేపదే హెచ్చరిస్తారు. ఇషాంత్... స్వింగ్ సుల్తాన్ చాలా సార్లు ఇషాంత్ శర్మ వికెట్లు తీయడు. కానీ పొదుపుగా బౌలింగ్ చేస్తాడు. కారణం ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఇషాంత్‌ను పెద్దగా పట్టించుకోకపోవడమే! దీన్ని బౌలింగ్ కోచ్ గమనించారు. అతని బౌలింగ్ కోణం (యాంగిల్), సంధించే ముందు మణికట్టు తీరు (రిస్ట్ పొజిషన్) మార్చుకుంటే సరిపోతుందని తగిన సలహాలిచ్చారు. అన్నట్లుగానే ఇషాంత్ తన బౌలింగ్ లోపాల్ని సరిదిద్దుకున్నాడు. అలా గాడినపడ్డ అతను వైవిధ్యమైన స్వింగ్ బౌలింగ్‌తో రాణిస్తున్నాడు. క్రికెటర్లెవరైనా ఒకసారి మంచిగా అనిపిస్తే అదే శైలిని, అదే దారిని కొనసాగిస్తారు. కానీ అది ఫలితాలను ఇవ్వకపోతే మాత్రం కొత్తదారుల్ని కనుగొనాలని చెబుతాడు అరుణ్. ఏదేమైనా ఇషాంత్ కొత్త యాంగిల్‌ను పరీక్షించడంతో పాటు ఉన్న లోపాల్ని సరిదిద్దుకోవడంతో మంచి స్వింగ్ బౌలర్‌గా మారాడు. ఉమేశ్ పేస్‌కు పదును... ఉమేశ్ సొంతగడ్డపై అద్భుతంగా రాణిస్తాడు. కానీ విదేశాల్లో ఆ మేరకు రాణించలేకపోవడానికి కారణం తగినన్ని అవకాశాలు రాలేకపోవడమేనని భరత్ అరుణ్ విశ్లేషించారు. విదేశీ పిచ్‌లపై అనుభవం లేకే ఉమేశ్ వెనుకబడ్డాడు కానీ ప్రతిభ లేక కాదు అనేది ఆయన అభిప్రాయం. అతని ప్రదర్శనకు మెరుగులు దిద్దేందుకు అరుణ్ బాగా శ్రమించారు. రనప్‌పై ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూనే జట్టుకు అవసరమైనపుడల్లా అందుబాటులో ఉంచుతున్నారు. దక్షిణాఫ్రికాతో ముందుగా ప్రకటించిన టీమిండియాలో ఉమేశ్ లేడు. కానీ బుమ్రా గాయంతో అతనికి అవకాశం వచ్చింది. స్వదేశీ పిచ్‌లపై అతనికి సరైన అవగాహన ఉంది. అప్పుడప్పుడు నిలకడ లోపించినా తుది ఎలెవన్ జట్టులో ఆడే సత్తా అతనికి ఉందని, ముగ్గురికి మించి పేసర్ల అవసరం లేకే అతను తుది జట్టుకు దూరమవుతున్నాడనేది కోచ్ అభిప్రాయం. -
పేస్ బౌలింగ్ సూపర్
సాక్షి క్రీడా విభాగం: ‘స్పిన్ పరీక్ష కోసం సన్నద్ధమై వస్తే సిలబస్‌లో లేని విధంగా భారత పేస్ బౌలర్లు మాకు పరీక్ష పెట్టారు’... అదో రకమైన వైరాగ్యంతో దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్ దాదాపుగా ఇదే మాట చెప్పాడు. భారత జట్టు సొంతగడ్డపై టెస్టులు, సిరీస్‌లు నెగ్గడం కొత్త కాదు. మన బ్యాట్స్‌మెన్ పరుగుల వరద పారించడం కూడా మొదటి సారి కాదు. మనం భారీ స్కోర్లు సాధించిన తర్వాత స్పిన్నర్లు చెలరేగిపోయి టపటపా వికెట్లు పడగొట్టడం రొటీన్‌గా జరిగిపోయేదే. కానీ ఈ సారి విజయానికో విశేషం ఉంది. సఫారీలపై మన గెలుపులో భారత పేస్ బౌలర్లు కీలక పాత్ర పోషించారు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ మన పేసర్లను ఎదుర్కోవడంలో ఎంత ఇబ్బంది పడ్డారో కనిపించింది. సిరీస్‌లో మన ఫాస్ట్ బౌలర్లు షమీ, ఉమేశ్, ఇషాంత్ కేవలం 17.50 సగటుతో వికెట్లు పడగొడితే రబడ, ఫిలాండర్‌లాంటి పదునైన పేసర్లతో కూడిన దక్షిణాఫ్రికా జట్టు మరీ ఘోరంగా 70.20 సగటుతో వికెట్లు తీసిందంటే మన సత్తా అర్థమవుతోంది. మనం సొంతగడ్డపై ఆడుతున్నామని అనుకున్నా... అనుకూలంగా ఉన్న పిచ్‌లపై కూడా ఏమీ చేయలేని సఫారీలతో పోలిస్తే మన బౌలింగ్ ఎంత పదునుగా ఉందో ఇది చూపిస్తోంది. షమీ 3 టెస్టుల్లో 13, ఉమేశ్ 2 టెస్టుల్లో 11 వికెట్లు పడగొట్టారు. ఇషాంత్ 2 వికెట్లే తీసినా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచడంలో సఫలమయ్యాడు. స్పిన్నర్లు తీసిన 32 వికెట్లతో పోలిస్తే పేసర్లు 26 వికెట్లతో చేరువగా రావడం సాధారణంగా భారత్‌లో కనిపించని దృశ్యం. ఉమేశ్ యాదవ్ మాటల్లో చెప్పాలంటే ‘ఆరంభంలో బంతి మెరుపు పోయేలా చేసి స్పిన్నర్లకు అప్పగించడం, ఆ తర్వాత ఎప్పుడో చివర్లో రివర్స్ స్వింగ్ కోసం ప్రయత్నించడం ఇప్పటి వరకు కనిపించేది. కానీ మన బౌలింగ్‌లో పేస్, బౌన్స్ ఉంటే భారత్‌లో కూడా సఫలం కావచ్చని మేం రుజువు చేశాం’ అనేది అక్షర సత్యం. భారత పిచ్‌లపై ఎలా బౌలింగ్ చేయాలో తమకు అర్థం అయిందని, దాని కోసం ఎంతో సాధన చేశామని షమీ చెప్పుకొచ్చాడు. తమ ఫిట్నెస్గా అద్భుతంగా మారడం కూడా అందుకు ఒక కారణమని అతను విశ్లేషించాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై మన ఫాస్ట్ బౌలర్లు ఇంతగా ఆధిపత్యం కనబర్చడం ఎప్పుడూ చూడలేదని మాజీ క్రికెటర్లు కూడా చాలా మంది అభిప్రాయ పడ్డారు. ఇక ఈ సిరీస్‌లో నంబర్‌వన్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఉండి ఉంటే ఏం జరిగేదే ఊహించగలమా! వీరితో పాటు కొంత కాలంగా నిలకడగా మన విజయాల్లో కీలక పాత్ర పోషించిన భువనేశ్వర్ కూడా మరో కీలక బౌలర్. రాబోయే రోజుల్లో ఈ ఐదుగురితో కూడిన మన పేస్ దళంనుంచి మరిన్ని అద్భుతాలు, ముఖ్యంగా విదేశాల్లో నిలకడైన విజయాలు కచ్చితంగా వస్తాయని ఆశించవచ్చు. ‘షమీ, ఉమేశ్ స్ట్రయిక్‌రేట్ చూస్తే భారత్‌లో గతంలో ఏ పేసర్లూ ఇలా బౌలింగ్ చేయలేదని అర్థమవుతోంది. ముఖ్యంగా స్టంప్స్‌పైకి, బ్యాట్స్‌మెన్ ప్యాడ్లపైకి వీరు బంతులు సంధించిన తీరు నిజంగా అద్భుతం. ఇది మన దూకుడుకు మంచి సంకేతం. బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి కొనసాగిస్తూ వీరు వికెట్లు తీయగలిగారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన పేసర్లు బౌలింగ్ చేసే సవాల్‌కు సిద్ధంగా ఉంటున్నారు. వికెట్ తీయాల్సిందే అన్నట్లుగా బంతిని అడిగి మరీ తీసుకుంటున్నారు.’ –విరాట్ కోహ్లి ఏ పిచ్ అయినా ఒకటే పిచ్‌లు ఎలా పోతే మాకేంటి? జొహన్నెస్‌బర్గ్ అయినా మెల్బోర్న్ అయినా ముంబై అయినా మ్యాచ్ ఫలితంపై పిచ్ ప్రభావం లేకుండా చూడటమే మా ఉద్దేశం. ఇంత అద్భుతమైన బ్యాటింగ్ లైనప్, 20 వికెట్లు తీయగల బౌలర్లు ఉన్నప్పుడు ఈ విజయాలు వస్తూనే ఉంటాయి. మా జట్టు ఫెరారీ కారు తరహాలో దూసుకుపోతుంది. సాధారణంగా భారత్‌లో విజయం సాధించినప్పుడు ఒకరో, ఇద్దరికో గుర్తింపు లభిస్తుంది. కానీ ఈసారి ఆరేడుగురు ఆ జాబితాలో ఉన్నారు. షాబాజ్ నదీమ్ ఈ స్థాయికి చేరేందుకు ఎంతో శ్రమించాడు. అతను తన సొంత ప్రేక్షకుల సమక్షంలో మ్యాచ్‌ను ముగించడం సంతోషంగా ఉంది. ప్రతీ బంతిని కచ్చితత్వంతో వేయడం అతని అనుభవానికి నిదర్శనం. –రవిశాస్త్రి, భారత కోచ్ 1932లో టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన భారత్ ఇప్పటివరకు మొత్తం 538 టెస్టులు ఆడింది. ఇందులో 155 మ్యాచ్‌ల్లో గెలిచింది. 165 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 217 టెస్టులు ‘డ్రా’ చేసుకుంది. ఒక మ్యాచ్ ‘టై’గా ముగిసింది. 87 ఏళ్ల తమ టెస్టు చరిత్రలో ఓవరాల్‌గా కనీసం రెండు అంతకంటే ఎక్కువ టెస్టు మ్యాచ్‌లతో జరిగిన సిరీస్‌లను భారత్ ‘క్లీన్‌స్వీప్’ చేయడం ఇది 14వసారి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. భారత్ క్లీన్‌స్వీప్ సిరీస్‌ల జాబితా -
వారితో నాట్యం చేయించడం సంతోషంగా ఉంది: షమీ
-
నాట్యం చేయించడం సంతోషంగా ఉంది
రాంచీ: మూడు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికాను వైట్‌వాష్ చేసిన టీమిండియా ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆగ్రస్థానాన్ని మరింత బలపరుచుకుంది. ఇక ఈ టెస్టు సిరీస్‌లో భారత బౌలర్లు 60 వికెట్లు పడగొట్టగా అందులో పేస్ బౌలర్లే 26 వికెట్లు దక్కించుకోవడం విశేషం. అత్యధికంగా మహ్మద్ షమీ 13 వికెట్లతో భారత బౌలింగ్ దళానికి నాయకత్వం వహించాడు. ఆ తర్వాత కేవలం చివరి రెండు టెస్టుల్లోనే ఉమేశ్ యాదవ్ 11 వికెట్లు దక్కించుకోవడం విశేషం. అయితే ఈ సిరీస్‌లో భారత్‌కు లాభించిన మరో అంశం టెయిలెండర్లు బ్యాట్‌తో రాణించడం. ముఖ్యంగా రాంచీ టెస్టులో ఉమేశ్ యాదవ్ సిక్సర్ల మోతతో పాటు షమీ కూడా తన బ్యాట్‌కు పనిచెప్పడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించగలిగింది. అయితే దీనిపై మ్యాచ్ అనంతరం మహ్మద్ షమీ మాట్లాడాడు. ‘గతంలో మేము(బౌలర్లు) బ్యాటింగ్ చేసేటప్పుడు ప్రత్యర్థి బౌలర్ల ట్యూన్‌కు డ్యాన్స్‌లు చేసేవాళ్లం. ఇప్పుడు రోజులు మారాయి. మేము బ్యాట్‌తో కూడా సమాధానం చెప్పగలం. బౌలర్లు కూడా బ్యాటింగ్ చేయగలరని తాజా సిరీస్‌లు రుజువు చేశాయి. అంతేకాకుండా మేము బ్యాటింగ్‌లో రాణిస్తున్నప్పుడు ప్రత్యర్థి బౌలర్లు, మా టీమ్ సభ్యులు డ్యాన్స్‌లు చేయడం సంతోషంగా ఉంది’ అని షమీ పేర్కొన్నాడు. ఇక రాంచీ టెస్టులో సిక్సర్ల మోతపై ఉమేశ్ యాదవ్ స్పందించాడు. ‘చాలా రోజుల తర్వాత మ్యాచ్ ఆడాను. ఈ సమయంలో సారథి విరాట్ కోహ్లి నాకు పూర్తి స్వేచ్చనిచ్చాడు. బంతిని బ్యాట్‌తో కసి తీరా బాదమని చెప్పాడు. రాంచీ టెస్టులో నా బ్యాటింగ్‌ను చాలా ఎంజాయ్ చేశా’ అంటూ ఉమేశ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇక భారత బౌలర్ల ప్రదర్శనపై ముఖ్యంగా పేస్ విభాగంపై కోచ్ రవిశాస్త్రి ప్రశంసల జల్లు కురిపించాడు. స్పిన్ ట్రాక్‌లపై కూడా రాణించగలమని వారు నిరూపించారని, అదేవిధంగా ప్రత్యర్థి బౌలర్లు పూర్తిగా విఫలమైన చోట మన వాళ్లు గొప్పగా రాణించడం ఆనందంగా ఉందన్నాడు. -
భారీ విజయం ముంగిట టీమిండియా
-
భారీ విజయం ముంగిట టీమిండియా
రాంచీ : ఇంకో రెండు వికెట్లు పడగొడితే మూడో టెస్టులోనూ టీమిండియానే విజయం సాధిస్తుంది. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో కోహ్లి సేన విజయం దాదాపు ఖాయమైంది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో సపారీ జట్టుకు వైట్‌వాష్ తప్పేలా లేదు. ఇప్పటికే విశాఖ, పుణే టెస్టుల్లో ఘన విజయాలు అందుకున్న కోహ్లి సేనకు రాంచీ టెస్టులో భారీ విజయం ముంగిట నిలిచింది. ఆటను మూడో రోజు ముగించాలని చేసిన టీమిండియా, అంపైర్ల ప్రయత్నాలకు సఫారీ ఆటగాళ్లు డి బ్రూయిన్(30 బ్యాటింగ్), నోర్ట్జే(5 బ్యాటింగ్)లు అడ్డుపడ్డారు. మూడో రోజు ఆటముగిసే సమయానికి సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఇంకా 203 పరుగుల వెనుకంజలో ఉంది. భారత బౌలర్లు కేవలం ఒక్క రోజులోనే 16 వికెట్లు పడగొట్టి దకిణాఫ్రికా జట్టు పతనాన్ని శాసించారు. తొలి ఇన్నింగ్స్ సాగింది ఇలా.. ఓవర్ నైట్ స్కోర్ 9/2తో మూడో రోజు ఆటను ప్రారంభించిన సఫారీ జట్టుకు ఆరంభంలోనే ఉమేశ్ యాదవ్ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. డుప్లెసిస్(1) బౌల్డ్ చేశాడు. ఆపై హమ్జా-బావుమాల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ఈ జోడి 91 పరుగులు జత చేసిన తర్వాత హమ్జా(62), బావుమా(32)లు వెంట వెంటనే ఔట్ కావడంతో దక్షిణాఫ్రికా పతనం తిరిగి ప్రారంభమైంది. క్లాసెన్(6), పీయడ్త్(4), రబడా(0)లు స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. అయితేలిండే(37;81 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్)చాలాసేపు ప్రతిఘటించాడు. అతనికి నోర్ట్జే నుంచి సహకారం లభించింది. వీరిద్దరూ సుమారు 18 ఓవర్లు క్రీజ్‌లో ఉన్నారు. కాగా, లిండే తొమ్మిదో వికెట్‌గా ఔటైన తర్వాత నోర్ట్జే(4; 55 బంతులు) చివరి వికెట్‌గా ఔటయ్యాడు. దీంతో 162 పరుగులకే సఫారీ జట్టు ఆలౌట్ కావడంతో ఆ జట్టును టీమిండియా సారథి విరాట్ కోహ్లి ఫాలోఆన్‌కు ఆహ్వానించాడు. కాగా టీమిండియాకు 335 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు సాధించగా, షమీ, నదీమ్, జడేజాలు తలో రెండు వికెట్లు తీశారు. వాళ్లు తీరు మార్చుకోలేదు.. మనోళ్ల ఊపు తగ్గలేదు.. భారీ ఆధిక్యం ఉండటంతో ప్రత్యర్థి జట్టును ఫాలోఆన్ ఆడించాలన్న సారథి నిర్ణయాం సరైనదే అంటూ బౌలర్లు నిరూపించారు. సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే డికాక్(5)ను ఉమేశ్ ఔట్ చేసి వికెట్ల వేటను ప్రారంభించాడు. అనంతరం వచ్చిన బ్యాట్స్‌మెన్ భారత బౌలర్ల జోరుకు పెవిలియన్‌కు క్యూ కట్టారు. వరుసగా హమ్జా(0), డుప్లెసిస్(4), బవుమా(0), క్లాసెన్5) వెంటవెంటనే ఔటయ్యారు. దీంతో 36 పరుగులకే ఐదు వికెట్ల కోల్పోయి సఫారీ జట్టు కష్టాల్లో పడింది. అయితే ఉమేశ్ బౌలింగ్‌లో ఎల్గర్(16) తలకు గాయం కావడంతో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా డిబ్రూయిన్ క్రీజులోకి వచ్చాడు. అయితే లిండే(27), పీట్(30), రబడ(12)లు కాసేపు మెరుపులు మెరిపించినప్పటికీ ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకోలేదు. దీంతో ఆట మూడో రోజు ముగస్తుందని అందరూ భావించారు. అయితే డిబ్రూయిన్ భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ విజయాన్ని నాలుగో రోజుకు వాయిదా వేయించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. ఉమేశ్ రెండు, రవీంద్ర జడేజా, అశ్విన్‌లు తలో వికెట్ పడగొట్టారు. సాహాకు గాయం.. పంత్ కీపింగ్ భాద్యతలు దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ వేసిన 27 ఓవర్ తొలి బంతిని అందుకునే క్రమంలో సాహా వేలికి గాయమైంది. గాయంతో విలవిలాడిన సాహాకు ఫిజియో ప్రాథమిక చికిత్స అందించాడు. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఫిజియోతో కలిసి సాహా మైదానాన్ని వీడాడు. దీంతో స్టాండ్ బై కీపర్‌గా ఉన్న రిషభ్ పంత్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు. -
ఆదిలోనే సఫారీలకు షాక్
రాంచీ: టీమిండియా జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ మూడో రోజు ఆటలో దక్షిణాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్(1) విఫలమయ్యాడు. ఓవర్‌నైట్ ఆటగాడిగా సోమవారం తన ఇన్నింగ్స్ ఆరంభించిన డుప్లెసిస్ ఎంతో సేపు క్రీజ్‌లో నిలవలేదు. ఈ రోజు ఆటలో ఆడిన తొలి బంతికే ఔటయ్యాడు. డుప్లెసిస్ నిన్నటి ఆటతో కలుపుకుని తొమ్మిది బంతులు ఆడగా పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఉమేశ్ యాదవ్ వేసిన ఆరో ఓవర్ ఐదో బంతికి డుప్లెసిస్ బౌల్డ్ అయ్యాడు. దాంతో సఫారీలు 16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఎదురీదుతున్నారు. 9/2 ఓవర్‌నైట్ స్కోరుతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను కొనసాగించడానికి డుప్లెసిస్-హమ్జాలు బ్యాటింగ్‌కు దిగారు. కాగా, ఈ రోజు ఆటలో ఉమేశ్ యాదవ్ వేసిన తొలి ఓవర్ నాలుగు బంతుల్ని హమ్జా ఆడగా, ఐదో బంతిని డుప్లెసిస్ ఎదుర్కొన్నాడు. కాకపోతే ఉమేశ్ బంతిని అంచనా వేయడంలో విఫలమైన డుప్లెసిస్ వికెట్‌ను సమర్పించుకున్నాడు. 15 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 438 పరుగుల వెనుకబడి ఉంది. రెండో రోజు ఆటలో డీన్ ఎల్గర్(0), డీకాక్(4)లు పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా కోల్పోయిన మూడు వికెట్లలో ఉమేశ్‌కు రెండు వికెట్లు లభించగా, షమీకి వికెట్ దక్కింది. (ఇక్కడ చదవండి:టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఉమేశ్ ఫాస్టెస్ట్ రికార్డులు) -
టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఉమేశ్ ఫాస్టెస్ట్ రికార్డులు
రాంచీ: బౌలర్‌గానే కాకుండా అవసరమైతే బ్యాట్‌తో కూడా రాణిస్తానని టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ మరోసారి చాటిచెప్పాడు. స్పెషలిస్టు బౌలరైన ఉమేశ్ యాదవ్.. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 10 బంతుల్లో 31 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సిక్సర్లు ఉండగా, ఇది ఉమేశ్‌కు టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు.ఉమేశ్ యాదవ్ వచ్చీ రావడంతోనే జార్జ్ లిండే వేసిన ఓవర్లో చివరి రెండు బంతుల్ని సిక్సర్లుగా కొట్టాడు. ఆపై మరొకసారి లిండే వేసిన ఓవర్లో మూడు సిక్సర్లు కొట్టాడు. దాంతో సిక్సర్ల రూపంలోనే 30 పరుగులు సాధించాడు. కాగా, ఈ క్రమంలోనే రెండు ఫాస్టెస్ట్ రికార్డుల్ని ఉమేశ్ యాదవ్ ఖాతాలో వేసుకున్నాడు. 30 పరుగుల్ని వేగవంతంగా సాధించిన జాబితాలో ఉమేశ్ టాప్‌లో నిలిచాడు. 9 బంతుల్లోనే ఉమేశ్ 30 పరుగులు చేశాడు. గతంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు స్టీఫెన్ ఫ్లెమింగ్ 30 పరుగుల్ని 10 బంతుల్లో సాధిస్తే దాన్ని ఉమేశ్ బ్రేక్ చేశాడు. వేగవంతంగా 30కి పైగా పరుగులు సాధించిన జాబితాలో ఉమేశ్, ఫ్లెమింగ్‌ల తర్వాత వెస్టిండీస్ ఆటగాడు నామ్ మెక్లీన్స్(1998లో దక్షిణాఫ్రిపై 12 బంతుల్లో), అబ్దుల్ రజాక్(2011లో జింబాబ్వేపై 17 బంతుల్లో)లు వరుస స్థానాల్లో ఉన్నారు. ఇక టెస్టు ఫార్మాట్ చరిత్రలో 10 బంతులు, ఆపై ఆడిన అత్యధిక స్ట్రైక్‌రేట్ కల్గిన ఆటగాళ్లలో ఉమేశ్ అగ్రస్థానంలో నిలిచాడు. ఇక్కడ ఉమేశ్ యాదవ్ 310 స్టైక్‌రేట్‌తో టాప్కు చేరుకున్నాడు. ఆ తర్వాత ఫ్లెమింగ్ 281.81 స్టైక్‌రేట్‌తో రెండో స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 497/9 పరుగుల వద్ద తన తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేయగా, ఆపై ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సఫారీలు 8 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయారు.డీన్ ఎల్గర్‌ను షమీ ఔట్ చేస్తే, డీకాక్‌ను ఉమేశ్ యాదవ్ పెవిలియన్‌కు పంపించాడు. -
ఉమేశ్ సిక్సర్ల మోత
-
భారత్ తొలి ఇన్నింగ్స్ 497 డిక్లేర్డ్
-
ఉమేశ్ సిక్సర్ల మోత
రాంచీ: దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ సాధించాడు. 118 బంతుల్లో 4 ఫోర్లతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే ఆ తర్వాత బంతికే జడేజా ఔటయ్యాడు. అంతకుముంద రోహిత్ శర్మ(212), రహానే(115)లు ఆకట్టుకోగా, జడేజా అర్థ శతకంతో మెరిశాడు. తన ఇన్నింగ్స్ ఆద్యంతం నిదానంగా ఆడిన జడేజా.. అవసరమైన సందర్భాల్లో బ్యాట్ ఝుళిపించాడు. దాంతో 13వ టెస్టు హాఫ్ సెంచరీ సాధించాడు. జడేజా ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఉమేశ్ యాదవ్ వచ్చీ రావడంతోనే బ్యాట్‌కు పని చెప్పాడు. జార్జ్ లిండే వేసిన 112 ఓవర్ ఐదు, ఆరు బంతుల్ని సిక్సర్లుగా కొట్టిన ఉమేశ్.. లిండే వేసిన 114 ఓవర్ తొలి బంతిని సిక్స్‌గా కొట్టాడు. ఆపై మూడో బంతిని కూడా సిక్స్‌గా మలచగా, ఐదో బంతిని సైతం సిక్స్ కొట్టాడు. మళ్లీ భారీ షాట్ కొట్టబోయి ఆ ఓవర్ చివరి బంతికి ఔటయ్యాడు. 10 బంతుల్లో ఓవరాల్‌గా ఐదు సిక్సర్లు కొట్టిన ఉమేశ్(31) తొమ్మిదో వికెట్‌గా ఔటయ్యాడు. అయితే భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 497/9వద్ద డిక్లేర్డ్ చేసింది. భారత్ తన ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసే సమయానికి షమీ(10 నాటౌట్), నదీమ్(1 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. -
కోహ్లి డబుల్, ఉమేష్ దెబ్బకు ఢమాల్..!
పుణె : దక్షిణాఫ్రికాతో పుణెలో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజూ టీమిండియా జోరు కొనసాగుతోంది. అద్భుత బ్యాటింగ్ లైనప్ కలిగిన టీమిండియా మరోమారు సత్తా చాటింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 108, చతేశ్వర్ పుజారా 58, కెప్టెన్ విరాట్ కోహ్లి 254 నాటౌట్, అజింక్య రహానే 59 కు తోడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 91 రెచ్చిపోవడంతో భారత్ 601 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 273/3 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన కోహ్లి సేన ఆకాశమే హద్దుగా చెలరేగి పరుగుల వరద పారించింది. తొలిరోజు 73 బంతుల్లో 27 పరుగులే చేసిన కోహ్లి రెండోరోజు జూలు విదిల్చాడు. రెండో రోజు ఏకంగా 227 సాధించి ఔరా అనిపించాడు. (చదవండి : కోహ్లి ‘డబుల్ సెంచరీ’ల రికార్డులు) ఇకనాలుగో వికెట్‌గా రహానే ఔటైన అనంతరం క్రీజులోకొచ్చిన జడేజా వన్డే మ్యాచ్‌ను తలపించేలా బ్యాట్ ఝళిపించాడు. 104 బంతుల్లోనే 91 పరుగులు సాధించాడు. అయితే, సెంచరీకి చేరువైన జడేజా ఐదో వికెట్‌గా డీ బ్రూయిన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. అతను ఔటైన అనంతరం ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్టు కోహ్లి ప్రకటించాడు. ఇక 254 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన కోహ్లికి ఇది 26వ టెస్టు సెంచరీ కాగా.. సారథిగా 19వది కావడం విశేషం. ఇక ఈ టెస్టుల్లో దక్షిణాఫ్రికాపై నాలుగో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడిగా కోహ్లి- రహానేలు సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు నాలుగో వికెట్‌కు అత్యధిక పరుగులు(145) చేసిన జోడిగా ద్రవిడ్-గంగూలీ పేరిట ఉన్న రికార్డును తాజాగా కోహ్లి-రహానేలు బ్రేక్ చేశారు. (చదవండి : నోరు పారేసుకున్న రబడ.. సర్దిచెప్పిన కెప్టెన్..!) త్వరత్వరగా రెండు వికెట్లు ఢమాల్..! తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేపట్టిన సఫారీ జట్టును పేసర్ ఉమేష్ యాదవ్ దెబ్బ తీశాడు. తొలిటెస్టులో స్థానం దక్కించుకోలేకపోయిన ఉమేష్ రెండో టెస్టులో రాణిస్తున్నాడు. జట్టు స్కోరు రెండు పరుగుల వద్ద అయిడెన్ మార్కరమ్ (0), 13 పరుగుల వద్ద డీన్ ఎల్గర్ (6)ను పెవిలిన్ పంపి పర్యాటక జట్టు వెన్నులో వణుకు పుట్టించాడు. ఇక బవుమా (8)ను మూడో వికెట్‌గా షమీ తన ఖాతాలో వేసుకున్నాడు. సఫారీ జట్టు 15 ఓవర్లకు 36/3 గా ఉన్న సమయంలో రెండో రోజు ఆట ముగిసింది. డి బ్రూయిన్ (20), నూర్జె (2) క్రీజులో ఉన్నారు. దక్షిణాష్రికా 565 పరుగులు వెనుకబడి ఉంది. -
హనుమ విహారి దూరం.. పంత్‌కు నో ఛాన్స్
పుణే: విశాఖ టెస్టులో ఇరగదీసిన టీమిండియా మరో టెస్టు గెలుపుపై కన్నేసింది. బుధవారం మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా- టీమిండియాల మధ్య రెండో టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్ జరిగే కొద్ది పిచ్ బౌలింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో సారథి విరాట్ కోహ్లి బ్యాటింగ్ వైపే మొగ్గు చూపాడు. అయితే ఈ మ్యాచ్‌కు తెలుగు కుర్రాడు హనుమ విహారి అనూహ్యంగా దూరమయ్యాడు. అతడి స్థానంలో ఉమేశ్ యాదవ్‌ను తుదిజట్టులోకి తీసుకున్నారు. దక్షిణాఫ్రికా కూడా ఒక్క మార్పుతో బరలోకి దిగుతోంది. తొలి టెస్టులో ఏమాత్రం ఆకట్టుకోలేని ఆఫ్‌స్పిన్నర్ పీట్‌ను పక్కకు పెట్టి పేసర్ అన్రిచ్ నార్ట్జేను తుది జట్టులోకి తీసుకున్నారు. ఇక రెండో టెస్టు ఎంపికలోనూ రిషభ్ పంత్‌కు నిరాశే ఎదురైంది. తొలి టెస్టులో అంతగా ఆకట్టుకోని సాహాకు టీమ్ మేనేజ్మెంట్ మరో అవకాశం కల్పించింది. అయితే సాహా విఫలమవ్వడంతో తనను ఎంపిక చేస్తారని భావించిన పంత్‌కు నిరాశే మిగిలింది. ఇక హనుమ విహారిని పక్కకు పెట్టడానికి గల కారణాలను టీమ్ మేనేజ్మెంట్ తెలపలేదు. తొలి టెస్టులో దుమ్ము దులిపిన ఓపెనర్ రోహిత్ శర్మపై అందరి దృష్టి ఉంది. ఇక ఈ టెస్టులోనే అతడు అదరగొడితే టెస్టుల్లో ఓపెనర్‌గా సెటిల్ అయినట్టేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక కెప్టెన్‌గా కోహ్లికి 50వ టెస్టు కావడంతో విశేషం. నేటి నుంచి జరిగే పోరులో పైచేయి సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని కోహ్లి సేన భావిస్తోంది. అయితే రెండో టెస్టులో గెలిచి సిరీస్‌ను కాపాడుకోవాలని సఫారీ జట్టు ఆరాటపడుతోంది. తుది జట్లు: టీమిండియా: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్, మయాంక్, పుజారా, రహానే, సాహా, జడేజా, అశ్విన్, ఇషాంత్, షమీ, ఉమేశ్ యాదవ్ దక్షిణాఫ్రికా: డు ప్లెసిస్ (కెపె్టన్), ఎల్గర్, మార్క్రమ్, డి బ్రూయిన్, బవుమా, డి కాక్, ఫిలాండర్, రబడ, అన్రిచ్ నార్ట్జే , ముత్తుసామి, మహరాజ్ -
టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ!
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతున్న టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌కు టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. గాయం కారణంగా బుమ్రా జట్టుకు దూరం కాగా అతడి స్థానంలో ఉమేశ్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. కాగా ఉమేశ్ యాదవ్ 2018లో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా చివరిసారిగా మైదానంలోకి దిగిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల జరిగిన టీమిండియా వెస్టిండీస్ టూర్లో బుమ్రా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రెండు టెస్టు మ్యాచుల్లో మొత్తంగా 13 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. డబుల్ హ్యాట్రిక్ సాధించిన ఈ పేసర్.. టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన మూడో భారతీయ బౌలర్‌గా నిలిచాడు. కాగా గురువారం నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వీసీఏ-ఏడీసీఏ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. ప్రాక్టీస్ మ్యాచ్ అనంతరం టెస్టు సిరీస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ఆటగాళ్లు ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు. టీమిండియా టెస్టు జట్టు వివరాలు విరాట్ కోహ్లి(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే(వైస్ కెప్టెన్), హనుమ విహారి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, శుభ్‌మన్ గిల్ -
రోహిత్‌కు మలుపు.. గిల్‌కు పిలుపు...
అంతా అనుకున్నట్లే జరిగింది... పరిమిత ఓవర్ల హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ కెరీర్లో ‘కొత్త ఇన్నింగ్స్’ మొదలుకానుంది. దేశవాళీ, ‘ఎ’ జట్టు తరఫున దుమ్ము రేపుతున్న యువ కెరటం శుబ్‌మన్ గిల్ ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. పేలవ ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌పై ఊహించినట్లే వేటు పడింది. ఇటీవలి వెస్టిండీస్ పర్యటనలో జట్టుతో ఉన్న పేసర్ ఉమేశ్ యాదవ్‌ను తప్పించడం మినహా పెద్దగా అనూహ్యమేమీ లేకుండానే దక్షిణాఫ్రికా సిరీస్‌కు టీమిండియా ఎంపిక సాగింది. న్యూఢిల్లీ: ‘నాకెప్పుడూ టెస్టుల్లో ఓపెనింగ్ అవకాశం రాలేదు. జట్టు మేనేజ్మెంట్ కోరితే అందుకు సిద్ధం. వన్డేల్లో ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని కనీసం ఊహించకున్నా అదలా జరిగిపోయింది. టెస్టుల్లో ఇలాంటి సందర్భమే వస్తే కాదనేది లేదు. నిరూపించుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తా. టెస్టులు ఆడాలనేది నా కోరిక. కానీ అది నా చేతుల్లో లేదు’... గతేడాది ఆగస్టులో రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలివి. అప్పటి భారత జట్టు ఓపెనర్ల తీవ్ర వైఫల్యాల దృష్ట్యా తనకు ఏమైనా వీలు దొరుకుతుందేమోనని రోహిత్ ఇలా మాట్లాడాడు. సరిగ్గా 13 నెలల అనంతరం అతడి చిరకాల వాంఛ నెరవేరింది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌లో తలపడనున్న భారత్ తరఫున రోహిత్ ఓపెనర్‌గా దిగడం ఖాయమైంది. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ గురువారం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో రోహిత్‌కు సంప్రదాయ ఫార్మాట్లోనూ ఓపెనర్‌గా ప్రమోషన్ దక్కింది. వన్డే, టి20 జట్లకు తాత్కాలిక కెప్టెన్ స్థాయికి చేరినా, 2010 నుంచి దోబూచులాడుతున్న టెస్టు స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో హిట్‌మ్యాన్ కెరీర్‌కు ఇది ఓ మలుపు. ఇక ఈ జట్టులో పంజాబ్ కుర్రాడు శుబ్‌మన్ గిల్ ఒక్కడే కొత్త ముఖం. ఇతడి రాకతో... వరుస వైఫల్యాల్లో ఉన్న కేఎల్ రాహుల్‌కు ఉద్వాసన తప్పలేదు. ముగ్గురు పేసర్లు (ఇషాంత్, షమీ, బుమ్రా)తో సరిపెట్టిన సెలక్టర్లు ఉమేశ్‌ను పక్కనపెట్టారు. పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విశ్రాంతి గడువును పొడిగించారు. స్పిన్ బాధ్యతలు మరోసారి అశ్విన్, జడేజా, కుల్దీప్ త్రయంపై ఉంచారు. ఈ సిరీస్‌తో మయాంక్ అగర్వాల్– రోహిత్ రూపంలో కొత్త కూర్పు కనిపించనుంది. అండర్ 19లో అదరగొట్టి... దేశవాళీలో దంచికొట్టి ప్రతి క్రికెటర్ కోరుకునే టెస్టు జట్టు స్థానాన్ని 20 ఏళ్ల వయసులోనే దక్కించుకున్నాడు శుబ్‌మన్ గిల్. గతేడాది జరిగిన అండర్ 19 ప్రపంచ కప్‌లో అందరి కళ్లు సహచరుడు పృథ్వీ షాపై ఉండగా... అతడికి దీటుగా ఆడి వెలుగులోకి వచ్చాడీ పంజాబ్ కుర్రాడు. ఆపై ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోనూ చెలరేగాడు. ఇప్పటివరకు 14 మ్యాచ్‌ల్లో 72.15 సగటుతో 1,443 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 268. గతేడాది రంజీ సీజన్లో పంజాబ్ తరఫున ఐదు మ్యాచ్‌ల్లోనే 104 సగటుతో 728 పరుగులు సాధించాడు. గిల్ ఈ ఏడాది జనవరి చివర్లో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేశాడు. ఆ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లాడి 16 పరుగుల చేశాడు. తాజాగా గత నెలలో భారత్ ‘ఎ’ తరఫున వెస్టిండీస్ ‘ఎ’ జట్టుపై డబుల్ సెంచరీ (248 బంతుల్లో 204) బాదాడు. అయితే, వెస్టిండీస్ సిరీస్‌కు సీనియర్ జట్టులోకి ఎంపిక కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికా ‘ఎ’తో గురువారంతో ముగిసిన నాలుగు రోజుల మ్యాచ్‌లో భారత ‘ఎ’ జట్టుకు ఆడుతూ 90 పరుగులు చేశాడు. బోర్డు ఎలెవెన్‌కు రోహిత్ సారథ్యం టెస్టు ఓపెనింగ్ స్థానంతో పాటు రోహిత్ శర్మకు బోనస్‌గా బోర్డు ప్రెసిడెంట్ ఎలెవెన్ సారథ్యమూ దక్కింది. ఈ నెల 26 నుంచి దక్షిణాఫ్రికాతో ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో జరిగే మూడు రోజుల మ్యాచ్‌లో బోర్డు జట్టును రోహిత్ నడిపిస్తాడు. ఆంధ్ర వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్‌కు ఈ జట్టులో చోటు దక్కింది. బోర్డు జట్టు: రోహిత్ (కెప్టెన్), మయాంక్, ప్రియాంక్ పాంచల్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, సిద్దేశ్ లాడ్, కేఎస్ భరత్, జలజ్ సక్సేనా, ధర్మేంద్ర జడేజా, అవేశ్ ఖాన్, ఇషాన్ పొరెల్, శార్దుల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్. ►మేం రోహిత్‌పై దృష్టిపెట్టాం. తనకు సామర్ధ్యం ఉన్నందున బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపి కొన్ని అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించాం. అతడితో పాటు సెలక్టర్లందరం స్పష్టతతో ఉన్నాం. ఎలా ఆడతాడో చూసి ఓ అభిప్రాయానికి వస్తాం. వన్డేలు, టి20ల తరహాలోనే టెస్టుల్లోనూ ఆడితే ఇక తిరుగుండదు. గిల్ ఓపెనర్‌గా, మిడిలార్డర్లో రాణిస్తున్నాడు. కాబట్టి అతడు రెండుచోట్లా బ్యాకప్‌గా ఉంటాడు. ధావన్, విజయ్ వైఫల్యాలతో దూరమవడంతో రాహుల్‌కు చాలా మద్దతిచ్చాం. కానీ, టెస్టుల్లో నిలకడ చూపలేకపోయాడు. – చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ -
కోహ్లి ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఆలోచించాడు..!
డెత్ ఓవర్లలో తన బౌలింగ్ అధ్వానంగా ఉంటుందని ఉమేష్ యాదవ్ మరోసారి నిరూపించాడు. సన్‌రైజర్స్‌తో శనివారం జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో చివరి ఓవర్లో 28 పరుగులు సమర్పించుకొని ఆర్సీబీని కష్టాల్లోకి నెట్టాడు. తన స్పెల్‌లో మూడు ఓవర్లలో 18 పరుగులే ఇచ్చుకున్న ఉమేష్ చివరి ఓవర్‌ను మాత్రం కాపాడుకోలేకపోయాడు. ఆ ఓవర్లో సన్‌రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్ రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 23 పరుగులు సాధించి ఆర్సీబీకి 176 టార్గెట్ నిర్దేశించాడు. అయితే, పరుగుల వేట ప్రారంభించిన బెంగుళూరు ఆదిలోనే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయినా హెట్‌మైర్ (47 బంతుల్లో 75; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), గురుకీరత్ (48 బంతుల్లో 65; 8 ఫోర్లు, సిక్స్) వీరోచిత పోరాటం చేశారు. ఇక చివరి 6 బంతుల్లో 6 పరుగులు చేయల్సి ఉండగా... నబీ వేసిన ఆఖరి ఓవర్లో ఉమేశ్ (4 బంతుల్లో 9 నాటౌట్; 2 ఫోర్లు) వరుసగా 2 ఫోర్లు బాది బెంగళూరును విజయతీరాలకు చేర్చాడు. 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు ఆర్సీబీ విజయంతో ఐపీఎల్‌కు ముగింపు పలికింది. కాగా, తక్కువ స్కోరుకే పరిమితం కావాల్సిన సన్‌రైజర్స్‌కు ఉమేష్ భారీ పరుగులు ఇచ్చుకోవడంపై ఆర్సీబీ అభిమానులు గుర్రుగా ఉన్నారు. నాలుగు ఓవర్లలో 46 పరుగులు ఇచ్చుకున్న అపర పేస్ మహనీయుడు అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఆర్సీబీ తరపున ఆడుతూ ప్రత్యర్థి జట్లకు సాయం చేస్తుంటాడని తిట్టిపోస్తున్నారు. ‘విరాట్ కోహ్లి ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఆలోచిస్తున్నాడు. ఉమేష్ చివరి ఓవర్లలో పనికిరాడు అని తెలియదా. అతని కోటా పవర్‌ప్లే ముగిసే వరకే కంప్లీట్ చేయాలి’ అని సూచిస్తున్నారు. ‘ఖచ్చితంగా చెప్తున్నాను. ఉమేష్ కన్నా నేనే బెటర్‌గా బౌలింగ్ చేయగలను’ అని మరొక అభిమాని చురకలంటించారు. ఉమేష్ దిండా అకాడెమీలో చేరాడా అని కొందరు ఎద్దేవా చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ పంజాబ్ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఉమేశ్‌యాదవ్ నాలుగు ఓవర్లు వేసి 36 పరుగులకు 3 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం బెంగళూరు యాజమాన్యం ఉమేశ్ ఫొటోని ట్విటర్లో పోస్టు చేస్తూ.. దిండా అకాడమీ? అదేంటి? అంటూ ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన ఆర్సీబీ మాజీ బౌలర్ అశోక్దిండా తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆర్సీబీని ఉద్దేశిస్తూ తనూ ఫేస్బుక్లో పోస్టు పెట్టాడు. అందులో తన గణంకాలను చూపిస్తూ.. ‘ద్వేషించేవారి వల్ల నా గణంకాలు నిజమేనని తెలుస్తుంది. ఇలాంటివి ఆపి జాగ్రత్తగా ఉండండి. మీ అభిప్రాయాలు నిజాలు కావు. కాబట్టి మీ నోటికి నన్ను దూరంగా ఉంచండి’ అని పేర్కొన్నాడు. Dinda Academy! This is it. Lord Umesh Yadav in his best. #RCBvSRH @RCBTweets pic.twitter.com/xjbZg35YsN — Srishty Rode Fc ™ 💜 (@itsSuroj) May 4, 2019 @Gary_Kirsten Along with structural changes, a lot of common sense n trend analysis needs to be done. Does Virat Kohli pre determine even before d game starts that the last over would be bowled by Umesh Yadav? History suggests that Umesh's quota should be over within d powerplay. — SRB (@iamsrbekal) May 4, 2019 Umesh taken to the cleaners by Kane Williamson in the 20th over 6 4 6 4 2nb 1 4 28 runs from the last over. Is it the game changing over?#RCBvSRH #IPL2019 — Cricbuzz (@cricbuzz) May 4, 2019 -
‘నా భార్య, కూతురిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు’
బెంగళూరు : భారత పేసర్ అశోక్ దిండాను హేళన చేస్తూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తన అధికారిక ట్విటర్లో చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉమేశ్‌ను కొనియాడే క్రమంలో ఆర్సీబీ దిండాను హేళన చేసింది. దిండా అకాడమియే ఏం జరిగిందంటూ? క్యాప్షన్‌గా ఉమేశ్ ఫొటోను ట్వీట్ చేసింది. దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో ఆ ట్వీట్‌ను తొలిగించింది.ఆర్సీబీ ట్వీట్, ట్రోల్స్‌తో విసిగిపోయిన దిండా.. తన కెరీర్లో అందుకున్న ఘనతలను గుర్తు చేశాడు. ‘హేటర్స్.. నా ఈ లెక్కలు చూడండి. నాపై అనవసరంగా నోరుపారేసుకోవడం ఆపండి. మీ నోటి నుంచి నా పేరు రానివ్వకండి’ అని తాను నమోదు చేసిన గణంకాలను జత చేస్తూ ఆర్సీబీకి గట్టి కౌంటరే ఇచ్చాడు. అయితే తాను అంతలా ఎందుకు స్పందించాల్సి వచ్చిందో అశోక్ దిండా వివరణ ఇచ్చాడు. ‘ ఆర్సీబీ ఫ్రాంచైజీ చేసిన ట్వీట్‌తో నేను చాలా విమర్శలు ఎదుర్కొన్నాను. మామూలుగా అయితే నేను వాటికి రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. కానీ ఆర్సీబీ చేసిన ట్వీట్‌తో నా భార్య, నా కూతురిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ట్రోల్ చేశారు. వాడకూడని, వినకూడని భాషతో దూషించారు. కూతుర్ని ఎవరైనా దూషిస్తే బాధ్యత గల తండ్రి ఎవరూ కూర్చొని చూస్తూ ఉండడు. అందుకే ఆర్సీబీ చేసిన ట్వీట్‌కు సమాధానం చెప్పాల్సి వచ్చింది. అసలు ఆర్సీబీ ఒక ఫ్రాంచైజీ అంటే అనుమానం వస్తుంది. ఒక ఆటగాడ్ని కించపరుస్తూ బాధ్యతలేకుండా ప్రవర్తించిన ఆర్సీబీ ఫ్రాంచైజీగా ఉండేందుకు అర్హత ఉందా’ అని దిండా మరోసారి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. -
క్రికెటర్ దిండా ఆవేదన
బెంగళూరు : భారత పేసర్ అశోక్ దిండాను హేళన చేస్తూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తన అధికారిక ట్విటర్లో చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆ జట్టు మాజీ ఆటగాడైన దిండా.. ఆర్సీబీకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉమేశ్‌ను కొనియాడే క్రమంలో ఆర్సీబీ దిండాను హేళన చేసింది. దిండా అకాడమియే ఏం జరిగిందంటూ? క్యాప్షన్‌గా ఉమేశ్ ఫొటోను ట్వీట్ చేసింది. దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో ఆ ట్వీట్‌ను తొలిగించింది. ఆర్సీబీ ట్వీట్, ట్రోల్స్‌తో విసిగిపోయిన దిండా.. తన కెరీర్లో అందుకున్న ఘనతలను గుర్తు చేశాడు. ‘హేటర్స్.. నా ఈ లెక్కలు చూడండి. నాపై అనవసరంగా నోరుపారేసుకోవడం ఆపండి. మీ నోటి నుంచి నా పేరు రానివ్వకండి’ అని తాను నమోదు చేసిన గణంకాలను జత చేశాడు. గత 9 సీజన్లుగా బెంగాల్ రంజీ జట్టు తరఫున తానే ఎక్కవ వికెట్లు తీసానని, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మొత్తం 400 వికెట్లు పడగొట్టానని తెలిపాడు. ఇక ఆర్సీబీ సైతం దిండా విషయంలో చేసిన ట్విట్‌పై వివరణ ఇచ్చింది. ‘ మీరు చెప్పినట్లు మేం చేసిన ఆ ట్వీట్ బాలేదు. మీరందరూ ఉమేశ్‌పై ట్రోలింగ్‌కు దిగారు. అతను వాటిని సవాల్‌గా స్వీకరించి (3/36) అదరగొట్టాడు. చివరి ఓవర్లో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.’ అని మరో ట్వీట్ చేసింది. ఇక దిండా మాత్రం ఈ ట్రోలింగ్‌పై తన ఆవేదనను సుదీర్ఘ పోస్టుద్వారా వ్యక్తం చేశాడు. ‘ ఈ ప్రపంచంలో నేను అంత గొప్ప బౌలర్ కాదని తెలుసు. కానీ ఆ ప్రపంచానికి తెలియనిదేంటంటే.. నేను క్రికెటర్ కావడానికి పడ్డ కష్టం. నేను క్రికెటర్‌ను అవుతానంటే నా కుటుంబం అంగీకరించలేదు. మద్దతుగా నిలవలేదు. 9 ఏళ్ల వయసులోనే బెంగాల్ జట్టు తరఫున ఆడాలని కష్టపడ్డాను. ఎన్నో రోజులు ఆహారం లేకుండా క్రికెట్ మైదానాల్లో పడుకున్నాను. నాకు మద్దతివ్వడం మీకు ఇష్టం లేకుంటే వదిలేయండి. కానీ నా ఆటను మాత్రం అవమానించకండి. ఎందుకంటే క్రికెట్ ఆడటానికి రేయింబవళ్లు ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు.’ అని తన ఆవేదనను వ్యక్తం చేశాడు. భారత జట్టు తరఫున 13 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడిన దిండా 12 వికెట్లు పడగొట్టాడు. 9 టీ20ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. -
ఎవడ్రా అక్కడ.. ధోనికి వయసు అయిపోయిందన్నది!
బెంగళూరు : ‘ఎవడ్రా అక్కడ.. భారత సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనికి వయసు అయిపోయింది.. రిటైర్మెంట్ తీసుకోవాలని మాట్లాడింది. వారంతా ఈ ఒక్క షాట్ చూడండి.. ధోనికి వయసు అయిపోయిందో లేదో తెలుస్తోంది.’ అని అతని అభిమానుల నోట వస్తున్న మాట. అయినా ఆటకు వయసుతో సంబంధం లేదని, ఆడే ఇష్టం ఉంటే సత్తా చాటొచ్చని ఈ జార్ఖండ్ డైనమైట్ ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించాడు. కానీ నిన్న(ఆదివారం) రాయల్‌చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ధోని ప్రదర్శన అద్భుతమైతే.. అతను కొట్టిన ఓ భారీ షాట్ అత్యద్భుతం. ఉమేశ్ యాదవ్ వేసిన ఫైనల్ ఓవర్లో ధోని కొట్టిన ఆ షాట్‌కు మైదానంలో ఆటగాళ్లు, ప్రేక్షకులతో పాటు టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకుల కళ్లు సైతం జిగేల్మన్నాయి. ఇక కామెంటేటర్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఎగిరి గంతేసినంత పనిచేశారు. ఉమేశ్ యాదవ్ వేసిన ఆఖరి ఓవర్లో ధోని వరుసగా ఐదు బంతుల్లో 4, 6, 6, 2, 6తో 24 పరుగులు పిండుకున్నాడు. అయితే ఇందులో కొట్టిన రెండో బంతి సిక్స్ అయితే ఏకంగా 111 మీటర్ల దూరంలో స్టేడియం బయటపడింది. ప్రస్తుతం ఈ సిక్స్‌కు సంబంధించిన వీడియో.. ‘ఇప్పుడు చెప్పండ్రా..ధోని హేటర్స్’ అనే వాట్సాప్స్టేటస్లతో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇక ఉత్కంఠకరంగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన స్థితిలో ధోని షాట్ గురి తప్పడం... పరుగు కోసం ప్రయత్నించడం... బెంగళూరు కీపర్ పార్థివ్ డైర్టెక్ హిట్‌తో శార్దుల్‌ను రనౌట్ చేయడంతో చెన్నై పరాజయం పాలైంది.. ధోని (48 బంతుల్లో 84 నాటౌట్; 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్ వృథా అయింది. ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 161 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పార్థివ్ పటేల్ (37 బంతుల్లో 53; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ కోహ్లి (9), ఏబీ డివిలియర్స్ (19 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించలేకపోయారు. మొయిన్ అలీ (16 బంతుల్లో 26; 5 ఫోర్లు) ధాటిని ప్రదర్శించాడు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసి ఓడింది. -
ఉమేశ్‌ను వెనకేసుకొచ్చిన బుమ్రా
విశాఖపట్నం: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత్ ఓటమికి ఉమేశ్ యాదవే కారణమంటూ విమర్శలు వినిపిస్తున్న తరుణంలో అతనికి మరో పేసర్ బుమ్రా మద్దతుగా నిలిచాడు. ప్రధానంగా చివరి ఓవర్లో ఆసీస్ విజయానికి కావాల్సిన 14 పరుగుల్ని ఉమేశ్ ఇవ్వడంతో విమర్శల వర్షం కురుస్తోంది. అయితే అతనికి బుమ్రా అండగా నిలిచాడు. ఎటువంటి సందర్భంలోనైనా డెత్ ఓవర్లలో బౌలింగ్ చాలా కష్టమన్నాడు. కొన్నిసార్లు మనకు అనుకూలంగా ఫలితం వస్తే, మరికొన్ని ఫలితం ప్రతికూలంగా ఉండవచ్చన్నాడు. తాము విజయం అంచుల వరకూ వచ్చి మ్యాచ్‌ను చేజార్చుకోవడం బాధకరమే అయినప్పటికీ, ఎవరూ కావాలని పరుగులు ఇవ్వరు కదా అంటూ ఉమేశ్‌ను వెనకేసుకొచ్చాడు. (ఇక్కడ చదవండి: టీమిండియా విలన్ ఉమేశ్ యాదవ్!) కాగా, తాము బ్యాటింగ్‌లో ఇంకా 15-20 పరుగులు వెనుకబడిపోయామన్నాడు. కనీసం 140 నుంచి 145 పరుగులు చేసి మంచి టార్గెట్‌ను ఆసీస్‌కు నిర్దేశించే వాళ్లమన్నాడు. తాము అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి యత్నించినప్పటికీ కీలక సమయంలో వికెట్లు కోల్పోవడంతో స్కోరు మందగించిందన్నాడు. అదే తమ ఓటమిపై ప్రభావం చూపించిందని బుమ్రా పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌తో కేఎల్ రాహుల్ తిరిగి ఫామ్‌లో రావడం సంతోషంగా ఉందన్నాడు. (ఇక్కడ చదవండి: బుమ్రా బంతి.. వాహ్!)