విండీస్‌పై భారత్‌ విజయం | India won by an innings and 92 runs | Sakshi
Sakshi News home page

విండీస్‌పై భారత్‌ విజయం

Published Mon, Jul 25 2016 2:29 AM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

విండీస్‌పై భారత్‌ విజయం

విండీస్‌పై భారత్‌ విజయం

ఆంటిగ్వా: నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఆఫ్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ చెలరేగడంతో భారత జట్టు చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది. ఫాలో ఆన్ ఆడిన విండీస్ తన రెండో ఇన్నింగ్స్ లో 231 పరుగులకే కుప్పకూలడంతో భారత్ ఇంకా రోజు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో గెలిచింది.

 

తొలి ఇన్నింగ్స్ లో 243 పరుగులు చేసి ఫాలో ఆన్ ఆడిన విండీస్ .. రెండో ఇన్నింగ్స్ లోనూ కుప్పకూలింది. బ్యాటింగ్ లో సెంచరీతో ఆకట్టుకున్న ఆఫ్‌ స్పిన్నర్‌ అశ్విన్‌.. బౌలింగ్ లోనూ రాణించాడు. అశ్విన్ ఏడు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించాడు. భారత్‌ మిగతా బౌలర్లు ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌, అమిత్‌ మిశ్రాలకు తలో ఒక వికెట్ దక్కింది. విండీస్ ఆటగాళ్లలో శామ్యూల్స్(50),  బ్రాత్ వైట్(51 నాటౌట్) బిషూ(45) రాణించగా, చంద్రిక(31) ఫర్వాలేదనిపించాడు.

 

స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్ 566/8 డిక్లేర్డ్;
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ 243
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: 231 ఆలౌట్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement