Ashwin
-
ఆరేళ్లలో వేకా రూ. 100 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తలుపులు, కిటికీలకి సంబంధించిన యూపీవీసీ ప్రొఫైల్స్ తయారీ సంస్థ వేకా వచ్చే ఆరేళ్లలో కార్యకలాపాల విస్తరణపై రూ. 100 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది రూ. 16 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. ఎన్సీఎల్–వేకాలో 100 శాతం వాటాలను కొనుగోలు చేసి కంపెనీని టేకోవర్ చేసిన సందర్భంగా వేకా ఏజీ జర్మనీ సీఈవో ఆండ్రియాస్ హార్ట్‌లీఫ్ ఈ విషయాలు తెలిపారు. జేవీలో వేకాకు గతంలో 50 శాతం వాటాలు ఉండగా, తాజాగా ఎన్సీఎల్ నుంచి మరో 50 శాతాన్ని కొనుగోలు చేసింది. టేకోవర్‌తో ప్రస్తుతం ఎన్సీఎల్ వేకా చైర్మన్‌గా ఉన్న అశ్విన్ దాట్ల ఇకపై డైరెక్టరుగా కొనసాగనుండగా, ఎండీగా యూఎస్ మూర్తి కొనసాగుతారు. ప్రణాళికల్లో భాగంగా వేకా ప్రధానంగా ఎక్స్ట్రూషన్పైన, ఎన్సీఎల్.. ఫ్యాబ్రికేషన్పైనా దృష్టి పెట్టనున్నట్లు ఈ సందర్భంగా అశ్విన్ వివరించారు. కంపెనీకి ప్రస్తుతం హైదరాబాద్‌లో 28 లైన్లతో ఒక ఎక్స్‌ట్రూషన్ ప్లాంటు, బెంగళూరులో ఫ్యాబ్రికేషన్ ప్లాంటు ఉన్నట్లు చెప్పారు. కంపెనీ గతేడాది రూ. 442 కోట్ల ఆదాయం ఆర్జించగా, 15 శాతం వార్షిక వృద్ధి అంచనా వేస్తున్నట్లు మూర్తి తెలిపారు. -
అజేయ శతకాలతో చెలరేగిన కేఎస్ భరత్, అశ్విన్
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy 2024-25)లో ఆంధ్ర జట్టు అదరగొడుతోంది. గ్రూప్-‘బి’లో భాగంగా మేఘాలయతో పోరులో ఘన విజయం సాధించింది. తద్వారా ఈ సీజన్లో నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. ముంబై వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 10 వికెట్ల తేడాతో మేఘాలయ(Andhra vs Meghalaya )ను మట్టికరిపించింది.టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన మేఘాలయ జట్టు 48.2 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ నిశాంత చక్రవర్తి (108 బంతుల్లో 101; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా... అర్పిత్ (90 బంతుల్లో 66; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో రాణించాడు. దీంతో ఒకదశలో మేఘాలయ జట్టు 182/1తో పటిష్ట స్థితిలో కనిపించింది.యారా సందీప్ 5 వికెట్లతో అదరగొట్టాడుఅయితే ఆ తర్వాత ఆంధ్ర బౌలర్లు విజృంభించి వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టారు. దీంతో మేఘాలయ బ్యాటర్లు ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆంధ్ర బౌలర్లలో యారా సందీప్ 28 పరుగులిచ్చి 5 వికెట్లతో అదరగొట్టగా... ఆంజనేయులు, మహీప్ కుమార్ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆంధ్ర 29.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 228 పరుగులు చేసింది.భరత్, అశ్విన్ అజేయ శతకాలుఆంధ్ర కెప్టెన్ శ్రీకర్ భరత్ (KS Bharat- 81 బంతుల్లో 107 నాటౌట్; 9 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీతో విజృంభించాడు. మరో ఓపెనర్ అశ్విన్ హెబర్ (Ashwin Hebbar- 96 బంతుల్లో 108 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్) కూడా ‘శత’క్కొట్టడంతో ఆంధ్ర జట్టు ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. మేఘాలయ బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్న భరత్... సిక్స్‌లతో చెలరేగిపోతే అశి్వన్ బౌండరీలతో హోరెత్తించాడు. వీరిద్దరూ పోటీపడి పరుగులు రాబట్టడంతో లక్ష్యం చిన్నబోయింది.రెండో స్థానంలోగత మ్యాచ్‌లో సర్వీసెస్‌పై అజేయ అర్ధశతకాలతో వికెట్ నష్టపోకుండానే జట్టును గెలిపించిన భరత్, అశ్విన్... ఈసారి కూడా దాన్ని పునరావృతం చేశారు. 5 వికెట్లు తీసిన సందీప్నకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. గ్రూప్‌లో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లాడిన ఆంధ్ర జట్టు 4 విజయాలు, ఒక పరాజయంతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకొని రెండో స్థానంలో కొనసాగుతోంది. తదుపరి మ్యాచ్‌లో శుక్రవారం మహారాష్ట్రతో ఆంధ్ర జట్టు తలపడుతుంది. చదవండి: సిగ్గుపడాలి!.. టీమిండియాకు ఇలాంటి ఆటగాడు అవసరమా?: ఇర్ఫాన్ పఠాన్ -
ఆంతా వాళ్లే చేశారంట..! క్రికెటర్ల తండ్రుల ఆవేదన
-
స్నేహితుడే కారణమా..? అశ్విన్ రిటైర్మెంట్ వెనుక సంచలన నిజాలు
-
ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన రవిచంద్రన్ అశ్విన్
-
అశ్విన్‌తో ఢీకి రెడీ!
మెల్బోర్న్: భారత వెటరన్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందని, ఈసారి అతడు మ్యాచ్‌పై పట్టు బిగించకుండా చేస్తానని ఆ్రస్టేలియన్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అన్నాడు. కంగారూ గడ్డపై అశ్విన్‌కు మంచి రికార్డు లేదు. స్వదేశంలో 21.57 సగటు నమోదు చేస్తే ఆసీస్‌లో అది 42.15 మాత్రమే. అయితే గత రెండు బోర్డర్–గావస్కర్ సిరీస్‌లలో ఫామ్‌లో ఉన్న స్మిత్‌ను అదే పనిగా అవుట్ చేసి పైచేయి సాధించాడు. ఈ రెండు సిరీస్‌లలో అశ్విన్ అతన్ని క్రీజులో పాతుకుపోనీయకుండా ఐదుసార్లు పెవిలియన్ చేర్చాడు. దీనిపై ఆసీస్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్మిత్ మాట్లాడుతూ ‘ఈసారి అలా జరగకుండా చూసుకోవాలి. అయితే అశ్విన్ మాత్రం ఉత్తమ స్పిన్నర్. తప్పకుండా తన ప్రణాళికలు తనకు ఉంటాయి. గతంలో అతని ఎత్తుగడలకు బలయ్యాను. నాపై అతనే ఆధిపత్యం కనబరిచాడు. ఇప్పుడలా జరగకుండా చూసుకోవాలంటే ఆరంభంలోనే అతను పట్టు బిగించకుండా దీటుగా ఎదుర్కోవాలి’ అని అన్నాడు. గత కొన్నేళ్లుగా తమ ఇద్దరి మధ్య ఆసక్తికర సమరమే జరుగుతోందన్నాడు. ఒకరు పైచేయి సాధిస్తే, మరొకరు డీలా పడటం జరుగుతుందని... ఐదు టెస్టుల్లో పది ఇన్నింగ్స్‌ల్లో ఇప్పుడు ఎవరూ ఆధిపత్యం కనబరుస్తారో చూడాలని స్మిత్ తెలిపాడు. అతన్ని బ్యాట్‌తో పాటు మానసికంగానూ దెబ్బకొట్టాలంటే ఆరంభంలోనే మంచి షాట్లతో ఎదురుదాడికి దిగాలని చెప్పాడు. 35 ఏళ్ల స్మిత్ టెస్టుల్లో 10 వేల పరుగుల మైలురాయికి 315 పరుగుల దూరంలో ఉన్నాడు. త్వరలో జరిగే ఐదు టెస్టుల బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో అతను తనకెంతో ఇష్టమైన, అచ్చొచి్చన నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఇటీవలి కాలంలో స్మిత్ తరచూ ఓపెనర్‌గా బరిలోకి దిగి పూర్తిగా విఫలమయ్యాడు. -
ధూమ్ ధామ్
హిమాలయాల చెంత భారత టెస్టు క్రికెట్ ప్రదర్శన మరింత ఉన్నతంగా శిఖరానికి చేరింది...ధర్మశాలలో అంచనాలకు అనుగుణంగా చెలరేగిన మన జట్టు ప్రత్యర్థిని చావుదెబ్బ కొట్టి టెస్టు సిరీస్‌ను 4–1తో సగర్వంగా గెలుచుకుంది... 259 పరుగుల ఆధిక్యం అంటేనే టీమిండియా గెలుపు లాంఛనం అనిపించింది... కానీ ఇంగ్లండ్ కనీస స్థాయి పోరాటపటిమ కూడా ప్రదర్శించలేక చేతులెత్తేసింది. బజ్‌బాల్ ముసుగులో అసలు టెస్టును ఎలా ఆడాలో మరచిపోయిన ఆ జట్టు ఆటగాళ్లు గుడ్డిగా బ్యాట్లు ఊపి పేలవ షాట్లతో వేగంగా తమ ఓటమిని ఆహ్వానించారు. తన వందో టెస్టులో ఐదు వికెట్ల ప్రదర్శనతో అశ్విన్ ఈ మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకోగా...విజయంతో తమ వంతు పాత్ర పోషించిన కుర్రాళ్లంతా సంబరాలు చేసుకున్నారు. ఓటమితో మొదలైన ఈ ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌కు ఇన్నింగ్స్ విజయంతో భారత్ ఘనమైన ముగింపునిచ్చింది. ధర్మశాల: సొంతగడ్డపై టెస్టుల్లో భారత జట్టు తమ స్థాయి ఏమిటో మరోసారి చూపించింది. మూడో రోజే ముగిసిన చివరిదైన ఐదో టెస్టులో భారత్ ఇన్నింగ్స్, 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులు వెనుకబడి శనివారం రెండో ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లండ్ 48.1 ఓవర్లలో 195 పరుగులకే కుప్పకూలింది. జో రూట్ (128 బంతుల్లో 84; 12 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, అశ్విన్ (5/77) ఐదు వికెట్లు పడగొట్టాడు. 7 వికెట్లతో పాటు కీలక పరుగులు చేసిన కుల్దీప్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఓడిన భారత్ తర్వాతి నాలుగు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను 4–1తో సొంతం చేసుకుంది. 2 డబుల్ సెంచరీలు సహా మొత్తం 712 పరుగులు సాధించిన యశస్వి జైస్వాల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది. రూట్ మినహా... వెన్నునొప్పితో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ సమయంలో కెపె్టన్ రోహిత్ మైదానంలోకి దిగలేదు. దాంతో బాధ్యతలు తీసుకున్న బుమ్రా ఆలస్యం చేయకుండా రెండో ఓవర్లోనే అశ్విన్ కు బౌలింగ్ బాధ్యత అప్పగించాడు. అంతే...ఐదో బంతికి డకెట్ (2) అవుట్‌తో మొదలైన ఇంగ్లండ్ పతనం వేగంగా సాగింది. కొద్ది సేపటికి క్రాలీ (0) కూడా వెనుదిరగ్గా, ఒలీ పోప్ (19) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. ఈ దశలో జానీ బెయిర్‌స్టో (31 బంతుల్లో 39; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), రూట్ మాత్రమే 56 పరుగుల భాగస్వామ్యంతో కొద్దిసేపు ప్రతిఘటించారు. ముఖ్యంగా అశ్విన్ బౌలింగ్‌లోనే మూడు సిక్సర్లతో బెయిర్‌స్టో దూకుడు ప్రదర్శించాడు. అయితే కుల్దీప్ తన తొలి ఓవర్లోనే బెయిర్‌స్టోను వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా, స్టోక్స్ (2) పేలవ ఫామ్ కొనసాగింది. లంచ్ వరకే ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయింది. విరామం తర్వాత ఫోక్స్ (8)ను పడగొట్టి అశ్విన్ ఐదో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. బుమ్రా ఒకే ఓవర్లో రెండు వికెట్లతో దెబ్బ కొట్టగా...తర్వాతి వికెట్ జడేజా ఖాతాలో చేరింది. మరో ఎండ్‌లో పోరాడుతున్న రూట్ ఇక లాభం లేదనుకొని ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కుల్దీప్ బౌలింగ్‌లో కొట్టిన షాట్‌కు లాంగాన్ వద్ద బుమ్రా క్యాచ్ అందుకోవడంతో ఇంగ్లండ్ ఆట ముగిసింది. టెస్టు క్రికెట్‌కు ప్రోత్సాహకాలు... యువ ఆటగాళ్లు టెస్టు ఫార్మాట్‌పై మరింత శ్రద్ధ పెట్టేందుకు బీసీసీఐ కొత్త తరహా ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. టెస్టులు రెగ్యులర్‌గా ఆడే ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజుతో పాటు ‘టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్’ పేరుతో భారీ మొత్తం అందించనుంది. 2022–23 సీజన్‌నుంచే దీనిని వర్తింపజేస్తారు. దీని ప్రకారం ఏడాదిలో భారత జట్టు ఆడే టెస్టుల్లో కనీసం సగానికి పైగా టెస్టులు ఆడితే రూ. 30 లక్షలు అందిస్తారు. 75 శాతం పైగా మ్యాచ్‌లు ఆడితే ఈ మొత్తం రూ.45 లక్షలు అవుతుంది. తుది జట్టులో లేని ప్లేయర్‌కు ఇందులో సగం లభిస్తుంది. ఉదాహరణకు భారత జట్టు ఏడాదిలో 10 టెస్టులో ఆడితే ఒక ఆటగాడు అన్ని మ్యాచ్‌లలోనూ బరిలోకి దిగితే అతనికి రూ.4.50 కోట్లు లభిస్తాయి. ఒక్కో మ్యాచ్ ఫీజు రూ.15 లక్షల ద్వారా వచ్చే రూ.1.50 కోట్లకు ఇది అదనం. సగంకంటే తక్కువ టెస్టులు ఆడితే ఇది వర్తించదు. స్కోరు వివరాలు: ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 218; భారత్ తొలి ఇన్నింగ్స్ 477; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (సి) సర్ఫరాజ్ (బి) అశ్విన్ 0; డకెట్ (బి) అశ్విన్ 2; పోప్ (సి) యశస్వి (బి) అశ్విన్ 19; రూట్ (సి) బుమ్రా (బి) కుల్దీప్ 84; బెయిర్‌స్టో (ఎల్బీ) (బి) కుల్దీప్ 39; స్టోక్స్ (బి) అశ్విన్ 2; ఫోక్స్ (బి) అశ్విన్ 8; హార్ట్లీ (ఎల్బీ) (బి) బుమ్రా 20; వుడ్ (ఎల్బీ) (బి) బుమ్రా 0; బషీర్ (బి) జడేజా 13; అండర్సన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (48.1 ఓవర్లలో ఆలౌట్) 195. వికెట్ల పతనం: 1–2, 2–21, 3–36, 4–92, 5–103, 6–113, 7–141, 8–141, 9–189, 10–195. బౌలింగ్: బుమ్రా 10–2–38–2, అశ్విన్ 14–0–77–5, జడేజా 9–1–25–1, కుల్దీప్ 14.1–0–40–2, సిరాజ్ 1–0–8–0. జిమ్మీ@ 700 ఇంగ్లండ్ పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ టెస్టు క్రికెట్లో అత్యంత అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టెస్టుల్లో 700 వికెట్లు సాధించిన మూడో బౌలర్‌గా, తొలి పేసర్‌గా ఘనతకెక్కాడు. శనివారం కుల్దీప్ను అవుట్ చేయడంతో ఈ వికెట్ అతని ఖాతాలో చేరింది. అత్యధిక వికెట్ల జాబితాలో స్పిన్నర్లు మురళీధరన్ (800), షేన్ వార్న్ (708) మాత్రమే అతనికంటే ముందున్నారు. 41 ఏళ్ల 7 నెలల వయసులో తన 187వ టెస్టులో అతను ఈ రికార్డు నమోదు చేయడం విశేషం. మే 2003లో జింబాబ్వేపై అండర్సన్ తన తొలి టెస్టు ఆడాడు. 178 = 178 భారత జట్టు టెస్టు చరిత్రలో తొలి సారి విజయాలు, పరాజయాల సంఖ్య సమానంగా వచ్చింది. ఇప్పటివరకు మన విజయాలకంటే ఓటములే ఎక్కువగా ఉన్నాయి. భారత్ మొత్తం 579 టెస్టులు ఆడగా 222 మ్యాచ్‌లు ‘డ్రా’ గా ముగిసి మరో టెస్టు ‘టై’ అయింది. 36 అశ్విన్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టడం ఇది 36వ సారి. రిచర్డ్ హ్యాడ్లీ (36)ని సమం చేశాడు. ‘ఒక టెస్టు గెలవాలంటే అన్నీ సరిగ్గా కుదరాలి. ఈ సారి మేం అలాగే చేయగలిగాం. కొందరు ఆటగాళ్లు ఏదో ఒక దశలో సిరీస్‌లో అందుబాటులో ఉండరని తెలుసు. టెస్టులు ఎక్కువగా ఆడకపోయినా ఈ కుర్రాళ్లందరికీ మంచి అనుభవం ఉంది. మ్యాచ్‌కు అనుగుణంగా వారిని వాడుకున్నాం. ఒత్తిడి ఎదురైనప్పుడు అంతా సరిగా స్పందించారు. ఇది సమష్టి విజయం. పరుగులు చేయడం గురించే చర్చిస్తాం కానీ టెస్టు గెలవాలంటే 20 వికెట్లు తీయాలి. మా బౌలర్లు దానిని చేసి చూపించారు. కుల్దీప్, యశస్వి గొప్పగా ఆడారు’ –రోహిత్ శర్మ, భారత కెప్టెన్ -
100th Test: అశ్విన్, జానీ బెయిర్ స్టో ఎమోషనల్ మూమెంట్స్.. పడిక్కల్ కూడా (ఫొటోలు)
-
IND vs ENG : ఐదో టెస్టు కోసం ప్రాక్టీస్ సెషన్లో టీమిండియా (ఫొటోలు)
-
‘వంద’కు అటు ఇటు...
ధర్మశాల: టి20ల మెరుపులతో సంప్రదాయ టెస్టు సిరీస్‌లే కుదించబడుతున్నాయి. 3, 5 టెస్టుల సిరీస్ నుంచి 2, 3 టెస్టుల సిరీస్ లేదంటే అనామక జట్లయితే మొక్కుబడిగా ఏకైక టెస్టుతో ఐదు రోజుల ఆటను కానిచ్చేస్తున్నారు. మరోవైపు ఆటగాళ్లు కూడా ధనాధన్ ఆట మాయలో అసలైన ఫార్మాట్‌కు మంగళం పాడి లీగ్, పరిమిత ఓవర్ల ఫార్మాట్లతోనే కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఒక క్రికెటర్ 100వ టెస్టు ఆడటం ఆ ఆటగాడికే కాదు... ఇప్పుడు టెస్టు ఫార్మాట్‌కే మైలురాయిగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. మరి ప్రత్యర్థి జట్ల నుంచి చెరొకరు 100వ టెస్టు ఆడటమైతే అనూహ్యం! ఆతిథ్య భారత్ నుంచి దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ బృందం నుంచి బెయిర్‌స్టోలకు రేపటి నుంచి ఇరు జట్ల మధ్య ధర్మశాలలో జరిగే ఐదో టెస్టు చిరస్మరణీయం కానుంది. ఈ ఇద్దరు 99 మ్యాచ్‌లాడి టెస్టు క్రికెట్‌కు అభి‘వంద’నం పలుకేందుకు సిద్ధమయ్యారు. 14వ భారత క్రికెటర్‌గా... భారత క్రికెట్లోనే విజయవంతమైన సారథులుగా వెలుగొందిన అజహరుద్దీన్ (99), ధోని (90)లు కూడా 100 టెస్టులు ఆడలేకపోయారు. జహీర్ ఖాన్ (92) సైతం ‘వంద’ భాగ్యానికి నోచుకోలేకపోయాడు. కొందరికే సాధ్యమైన ఈ మైలురాయిని అందుకోవడానికి అశ్విన్ సిద్ధమయ్యాడు. ఇటీవలే 500 వికెట్ల క్లబ్లో చేరిన అశ్విన్ ... కుంబ్లే తర్వాత ఈ మైలురాయి అందుకున్న రెండో భారత బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 2011లో వెస్టిండీస్‌పై ఢిల్లీ టెస్టులో అరంగేట్రం చేసిన అశ్విన్ 13 ఏళ్ల కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించాడు. టెస్టుల్లో టీమిండియా ఘనవిజయాల్లో భాగమైన అశ్విన్ ... ధోని సారథ్యంలో తురుపుముక్కగా రాటుదేలాడు. 99 టెస్టులాడి 507 వికెట్లు పడగొట్టాడు. 35 సార్లు ఐదేసి వికెట్లు, 8 సార్లు 10 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాటర్లను తిప్పేశాడు. వందో టెస్టు ఆడుతున్న 14వ భారత ఆటగాడిగా అశ్విన్ ఘనత వహిస్తాడు. 17వ ఇంగ్లండ్ ప్లేయర్ బెయిర్‌స్టో ఇంగ్లండ్ వికెట్ కీపర్, బ్యాటర్ జానీ బెయిర్‌స్టో గురించి మనవాళ్లకి, ప్రత్యేకించి హైదరాబాద్ వాసులకి బాగా తెలుసు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్‌గా వార్నర్‌తో కలిసి మెరిపించాడు. టెస్టుల్లో నిలకడైన బ్యాటర్. 2012లో వెస్టిండీస్‌తో అరంగేట్రం చేసిన బెయిర్‌స్టో 99 టెస్టుల్లో 36.42 సగటుతో 5974 పరుగులు చేశాడు. ఇందులో 12 శతకాలు, 26 అర్ధ శతకాలున్నాయి. కీపర్‌గా 242 క్యాచ్‌ల్ని పట్టడంతో పాటు 14 స్టంపౌట్లు చేశాడు. వందోటెస్టు ఆడుతున్న స్టార్ వికెట్ కీపర్ ఈ ఘనతకెక్కనున్న 17వ ఇంగ్లండ్ క్రికెటర్. వన్డేల్లో వందో మ్యాచ్ కూడా ధర్మశాలలోనే ఆడిన బెయిర్‌స్టో ఇప్పుడు అక్కడే మరో 100కు సై అంటున్నాడు. ఇది అతిపెద్ద సంబరం. ఎందుకంటే నా కెరీర్లో ఇది గమ్యాన్ని మించిన పయనం. ఎప్పటికీ ప్రత్యేకం. ఎన్నో ఎత్తుపల్లాల్ని చూశాను. ఎంతో నేర్చుకున్నాను. 2012లో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ నా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. నాలుగు టెస్టుల్లో 52.64 సగటుతో 14 వికెట్ల పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్నా. కెరీర్ ఆరంభంలోనే పనైపోయిందనుకున్న ప్రతీసారి నన్ను నేను మార్చుకుంటూ సరికొత్త బౌలింగ్ అస్త్రాలతో ఇక్కడిదాకా ప్రయాణించడం గొప్ప అనుభూతిని ఇస్తోంది. –అశ్విన్ ఇది నాకు భావోద్వేగానికి గురిచేసే మ్యాచ్. ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలనే అందరూ కలలు కంటారు. నేనైతే ఆ కలల్ని నిజం చేసుకొని కెరీర్లో వందో ఆటకు రెడీ కావడం చాలా గొప్పగా అనిపిస్తుంది. 8 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయిన నాకు నా తల్లే సర్వస్వం. అందుకే ఈ ఘనత ఆమెకే అంకితం. –బెయిర్‌స్టో -
సొంతమా... సమమా!
అటో...ఇటో... కాదు! స్పిన్ ఎటు తిప్పుతుందో ఎవరికీ తెలియదు. దీంతో రాంచీ టెస్టు రసవత్తర ముగింపునకు చేరుకుంది. మూడో రోజు ఆటలో 13 వికెట్లు రాలితే... ఇందులో 12 స్పిన్ వలలోనే చిక్కాయి. ఈ నేపథ్యంలో భారత్ ముందు ఊరించే 192 పరుగుల లక్ష్యం ఉన్నప్పటికీ... ఇంకా 152 పరుగుల దూరం స్పిన్ టర్న్ దృష్ట్యా భారత్‌కు అంత సులభం కాదు. భారత బ్యాటర్లు స్పిన్‌కు నిలబడితే సిరీస్ 3–1తో మన సొంతమవుతుంది. ఇంగ్లండ్ స్పిన్నర్లు 10 వికెట్లు తీస్తే మాత్రం సిరీస్ 2–2తో సమమవుతుంది. రాంచీ: మూడో రోజు పూర్తిగా స్పిన్ మలుపు తీసుకున్న నాలుగో టెస్టులో భారత్ పైచేయి సాధించింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయిన టీమిండియా... ప్రత్యర్థి రెండో ఇన్నింగ్స్‌ను 150 పరుగుల్లోపే కూల్చేసింది. ఈ మ్యాచ్ గెలిచేందుకు, సిరీస్ చేజిక్కించుకొనేందుకు 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోకుండా 40 పరుగులు చేసింది. రోహిత్ (24 బ్యాటింగ్), యశస్వి (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. విజయానికి భారత్ 152 పరుగుల దూరంలో ఉంది. మూడో రోజు ఆట సాగిందిలా... ఓవర్‌నైట్ స్కోరు 219/7తో ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ 103.2 ఓవర్లలో 307 పరుగుల వద్ద ఆలౌటైంది. ధ్రువ్ జురెల్ (149 బంతుల్లో 90; 6 ఫోర్లు, 4 సిక్స్) అద్భుతమైన పోరాటం చేశాడు. ఓవర్‌నైట్ సహచరుడు కుల్దీప్ (131 బంతుల్లో 28; 2 ఫోర్లు)తో ఎనిమిదో వికెట్‌కు 76 పరుగులు జోడించిన జురెల్ తొలి అర్ధసెంచరీ సాధించాడు. వెంటనే జురెల్ సెల్యూట్ చేసి మాజీ సైనికుడు, కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న తన నాన్నకు ఈ అర్ధ సెంచరీ అంకితమిచ్చాడు. 253 స్కోరు వద్ద కుల్దీప్ అవుటైనా... అప్పు డే జట్టు ఆలౌట్ కాలేదు. ఆకాశ్‌దీప్ (9)తో తొమ్మి దో వికెట్‌కు 40 పరుగులు జతచేసి జట్టు స్కోరు 300 దాటాకే జురెల్ అవుటయ్యాడు. మూడో రోజు భారత్ 88 పరుగులు చేస్తే అందులో 68 పరుగులు జురెలే సాధించి టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ కూలిందిలా... తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులు ఆధిక్యం పొందిన ఇంగ్లండ్ లంచ్ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అయితే తొలి ఓవర్ నుంచే కెపె్టన్ రోహిత్ ఇంగ్లండ్ మెడకు అశ్విన్‌తో స్పిన్ ఉచ్చు బిగించాడు. ఇది ఐదో ఓవర్ నుంచి ఫలితాల్ని ఇవ్వడంతో ఇంగ్లండ్ కుదేలైంది. ఐదో ఓవర్లో అశ్విన్ ఓపెనర్ డకెట్ (15), పోప్ (0)లను వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. మరో ఓపెనర్ క్రాలీ (91 బంతుల్లో 60; 7 ఫోర్లు) అశ్విన్, జడేజా, కుల్దీప్ల స్పిన్ త్రయానికి కాసేపు ఎదురునిలిచాడు. కానీ ఈ లోపే రూట్ (11)ను అశ్విన్, అర్ధ శతకం తర్వాత క్రాలీ, స్టోక్స్ (4) వికెట్లను కుల్దీప్ పడేశాడు. జడేజా కూడా బెయిర్ స్టో (30)ను అవుట్ చేయడం ద్వారా 120/6 స్కోరు వద్ద ఇంగ్లండ్ బ్యాటింగ్ బలగమంతా పెవిలియన్‌లో కూర్చుంది. మిగిలిన టెయిలెండర్లలో హార్ట్లీ (7), రాబిన్సన్ (0)లను కుల్దీప్ వెనక్కి పంపగా, అండర్సన్ (0)ను అవుట్ చేసిన అశ్విన్ ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌కు 145 పరుగుల వద్ద తెరదించాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు భారత స్పిన్నర్లకే (అశ్విన్ 5/51; కుల్దీప్ 4/22; జడేజా 1/56) దక్కడం విశేషం. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 353; భారత్ తొలి ఇన్నింగ్స్: 307; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (బి) కుల్దీప్ 60; డకెట్ 15; పోప్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 0; రూట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 11; బెయిర్స్టోక్ (సి) పటిదార్ (బి) జడేజా 30; స్టోక్స్ (బి) కుల్దీప్ 4; ఫోక్స్ (సి అండ్ బి) అశ్విన్ 17; హార్ట్లీ (సి) సర్ఫరాజ్ (బి) కుల్దీప్ 7; రాబిన్సన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 0; బషీర్ (నాటౌట్) 1; అండర్సన్ (సి) జురెల్ (బి) అశ్విన్ 0; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (53.5 ఓవర్లలో ఆలౌట్) 145. వికెట్ల పతనం: 1–19, 2–19, 3–65, 4–110, 5–120, 6–120, 7–133, 8–133, 9–145, 10–145. బౌలింగ్: అశ్విన్ 15.5–0–51–5, జడేజా 20–5–56–1, సిరాజ్ 3–0–16–0, కుల్దీప్ 15–2–22–4. భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (బ్యాటింగ్) 24; యశస్వి (బ్యాటింగ్) 16; మొత్తం (8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 40. బౌలింగ్: రూట్ 4–0–17–0, హార్ట్లీ 3–0–22–0, బషీర్ 1–0–1–0. -
Ashwin Ramaswami: జార్జియా చట్టసభ్యుడిగా ఎన్నికైతే రికార్డే!
భారతీయ అమెరికన్ అశ్విన్ రామస్వామి జార్జియా చట్టసభ్యుడిగా ఎన్నికై రికార్డు సృష్టించనున్నారు. అమెరికాలోని జార్జియా సెనేట్ స్థానానికి పోటీ చేస్తున్న మొదటి జనరల్ జెడ్ (1997-2012 మధ్య పుట్టినవాళ్లు) భారతీయా అమెరికన్ అశ్విన్ రామస్వామి నిలిచారు. 34 ఏళ్ల క్రితం భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన భారతీయ కుటుంబానికి చెందిన 24 ఏళ్ల అశ్విన్.. జార్జియాలోని డిస్ట్రిక్ట్ 48 స్టేట్ సెనేట్ కోసం డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ స్థానానికి రిపబ్లికన్ షాన్ స్టిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. తన రాష్ట్రమైన జార్జియాకు సేవ చేయాలన్న ఉద్దేశంతో తాను సెనెట్‌కు పోటీ చేస్తున్నట్లు అశ్విన్ రామస్వామి తెలిపారు. తనలా రాజకీయంగా ఎదగాలనుకునే ప్రతి ఒక్కరికీ మెరుగైన అవకాశాలు ఉండాలని పేర్కొన్నారు. 24 ఏళ్లకే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా, ఎన్నికల భద్రత, టెక్నాలజీతో పాటు పలు రంగాల్లో అశ్విన్ రామస్వామి పని చేశారు. అశ్విన్ రామస్వామి ఎన్నికైతే.. కంప్యూటర్ సైన్స్‌తో పాటు న్యాయవాద డిగ్రీ కలిగి ఉన్న ఏకైక జార్జియా చట్టసభ్యుడిగా రికార్డు సృష్టించనున్నారు. ఇక.. తన తల్లిదండ్రులు 1990లో తమిళనాడు నుంచి అమెరికా వచ్చారని అశ్విన్ తెలిపారు. తాను భారత, అమెరికా సంస్కృతులతో పెరిగిగానని.. తాను హిందువునని తెలిపారు. తనకు భారతీయ సంస్కృతిపై చాలా ఆసక్తి ఉందని.. తాను కాలేజీ సమయంలో సంస్కృతం కూడా నేర్చుకున్నట్లు వెల్లడించారు. తాను రోజూ యోగా, ధ్యానం చేస్తూ ఉంటానని అశ్విన్ పేర్కొన్నారు. చదవండి: Alexei Navalny: నావల్నీ తల, ఒంటిపై కమిలిన గాయాలు -
డకెట్ ధనాధన్...
35 ఓవర్లలో 5.91 రన్‌రేట్‌తో 207 పరుగులు. పిచ్‌ను, ప్రత్యర్థిని లక్ష్య పెట్టకుండా ఇంగ్లండ్ మూడో టెస్టులోనూ తమ ‘బజ్‌బాల్’ మంత్రాన్ని చూపించింది. ఫలితంగా 445 పరుగుల భారీ స్కోరు కూడా భారత్‌కు సురక్షితం కాదనిపిస్తోంది. భారత గడ్డపై ఒక విదేశీ బ్యాటర్ ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఒకటిగా నిలిచిపోయే శతకంతో ఓపెనర్ బెన్ డకెట్ చెలరేగాడు. దాంతో రెండు రోజుల ఆట తర్వాత రాజ్‌కోట్ టెస్టు సమంగా నిలిచింది. అశ్విన్ టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకోవడం శుక్రవారం ఆటలో గుర్తుంచుకోదగ్గ మరో హైలైట్. మూడో రోజు ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు ఎలా నిలువరిస్తారన్నదే ఆసక్తికరం. రాజ్‌కోట్: భారత్‌తో మూడో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ దూకుడుగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. బెన్ డకెట్ (118 బంతుల్లో 133 బ్యాటింగ్; 21 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో సత్తా చాటాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 326/5తో ఆట కొనసాగించిన భారత్ 445 పరుగులకు ఆలౌటైంది. ధ్రువ్ జురేల్ (46), అశ్విన్ (37) ఎనిమిదో వికెట్‌కు 77 పరుగులు జత చేశారు. ఇంగ్లండ్ మరో 238 పరుగులు వెనుకబడి ఉంది. కీలక భాగస్వామ్యం... రెండో రోజు ఆరంభంలోనే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోరుకు మరో ఐదు పరుగులు జోడించగానే ఒకే స్కోరు వద్ద కుల్దీప్ (4), జడేజా (112) వెనుదిరిగారు. ఈ దశలో అశ్విన్, జురేల్ భాగస్వామ్యం భారత్‌ను 400 పరుగులు దాటించింది. అశ్విన్ జాగ్రత్తగా ఆడగా, అరంగేట్ర ఆటగాడు జురేల్ కొన్ని దూకుడైన షాట్లతో ఆకట్టుకున్నాడు. అయితే తన తొలి మ్యాచ్‌లో అతను అర్ధ సెంచరీని చేజార్చుకున్నాడు. ఈ భాగస్వామ్యం తర్వాత చివర్లో బుమ్రా (28 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని విలువైన పరుగులు జోడించాడు. శుక్రవారం 44.5 ఓవర్లు ఆడిన భారత్ మరో 119 పరుగులు జత చేసింది. దూకుడే దూకుడు... ఇన్నింగ్స్ ఆరంభంలో డకెట్ కాస్త తడబడ్డాడు. కానీ బుమ్రా వేసిన ఐదో ఓవర్లో రెండు ఫోర్లతో ధాటిని మొదలు పెట్టిన అతను ఏ బౌలర్‌నూ వదలకుండా చివరి వరకు దూకుడు కొనసాగించాడు. సెంచరీ వరకు కూడా ఒక్క తప్పుడు షాట్ లేకుండా అతని ఇన్నింగ్స్ అద్భుతమైన స్ట్రోక్‌లతో దూసుకెళ్లింది. టీ తర్వాత తొలి ఓవర్‌నుంచి స్పిన్నర్ కుల్దీప్తో బౌలింగ్ వేయించిన ప్రణాళిక ఫలించలేదు. కుల్దీప్ తొలి 4 ఓవర్లలో డకెట్ స్వీప్, రివర్స్ స్వీప్‌లతో 7 ఫోర్లు బాదడం విశేషం. సిరాజ్ ఓవర్లో కొట్టిన రెండు ఫోర్లతో 39 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయింది. మరో ఎండ్‌లో దాదాపు ప్రేక్షక పాత్రకే పరిమితమైన క్రాలీ (15)ని అవుట్ చేసి ఎట్టకేలకు అశ్విన్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. తర్వాత వచ్చి న ఒలీ పోప్ (39; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా ఇంగ్లండ్ జోరును కొనసాగించాడు. అశ్విన్ ఓవర్లో వరుస బంతుల్లో 6, 4 కొట్టి 90ల్లోకి చేరుకున్న డకెట్... సిరాజ్ ఓవర్లో బౌండరీతో 88 బంతుల్లోనే కెరీర్లో మూడో శతకాన్ని అందుకున్నాడు. చివరకు సిరాజ్ చక్కటి బంతికి పోప్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఐదు పరుగులు పెనాల్టీ... భారత బ్యాటర్లు నిబంధనలకు విరుద్ధంగా పిచ్‌పై పరుగెత్తడంతో అంపైర్లు చర్య తీసుకున్నారు. తొలి రోజు ఆటలో జడేజాను ఈ విషయంపై అంపైర్లు హెచ్చరించగా... రెండో రోజు అశ్విన్ కూడా అలాగే చేయడంతో భారత ఇన్నింగ్స్ 102వ ఓవర్లో 5 పరుగులు పెనాల్టిగా విధించారు. దాంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 5/0తో మొదలైంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (సి) రూట్ (బి) వుడ్ 10; రోహిత్ (సి) స్టోక్స్ (బి) వుడ్ 131; గిల్ (సి) ఫోక్స్ (బి) వుడ్ 0; పటిదార్ (సి) డకెట్ (బి) హార్ట్లీ 5; జడేజా (సి) అండ్ (బి) రూట్ 112; సర్ఫరాజ్ (రనౌట్) 62; కుల్దీప్ (సి) ఫోక్స్ (బి) అండర్సన్ 4; జురేల్ (సి) ఫోక్స్ (బి) రేహన్ 46; అశ్విన్ (సి) అండర్సన్ (బి) రేహన్ 37; బుమ్రా (ఎల్బీ) (బి) వుడ్ 26; సిరాజ్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (130.5 ఓవర్లలో ఆలౌట్) 445. వికెట్ల పతనం: 1–22, 2–24, 3–33, 4–237, 5–314, 6–331, 7–331, 8–408, 9–415, 10–445. బౌలింగ్: అండర్సన్ 25–7–61–1, వుడ్ 27.5–2– 114–4, హార్ట్లీ 40–7–109–1, రూట్ 16–3– 70–1, రేహన్ 22–2–85–2. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాసీ (సి) పటిదార్ (బి) అశ్విన్ 15; డకెట్ (బ్యాటింగ్) 133; పోప్ (ఎల్బీ) (బి) సిరాజ్ 39; రూట్ (బ్యాటింగ్) 9; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (35 ఓవర్లలో 2 వికెట్లకు) 207. వికెట్ల పతనం: 1–89, 2–182. బౌలింగ్: బుమ్రా 8–0–34–0, సిరాజ్ 10–1–54–1, కుల్దీప్ యాదవ్ 6–1–42–0, అశ్విన్ 7–0–37–1, జడేజా 4–0–33–0. అశ్విన్ @ 500 ఇంగ్లండ్ ఓపెనర్ క్రాలీని అవుట్ చేయడం ద్వారా అశ్విన్ టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. తన 98వ టెస్టులో ఈ ఘనత సాధించిన అశ్విన్... ఓవరాల్‌గా 9వ ఆటగాడిగా, అనిల్ కుంబ్లే (619) తర్వాత రెండో భారత బౌలర్‌గా నిలిచాడు. మ్యాచ్‌లు, బంతుల పరంగా చూస్తే... అత్యంత వేగంగా 500 వికెట్ల మార్క్‌ను చేరిన బౌలర్లలో అశ్విన్ రెండో స్థానంలో నిలవడం విశేషం. 2011లో విండీస్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన అశ్విన్ ఇప్పటి వరకు ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు 24 సార్లు... ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు 34 సార్లు... మ్యాచ్ మొత్తంలో 10 వికెట్లు 8 సార్లు తీశాడు. టెస్టు నుంచి తప్పుకున్న అశ్విన్ రాజ్‌కోట్ టెస్టులో అనూహ్య పరిణామం సంభవించింది. తన కుటుంబంలో ఏర్పడిన అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో అశ్విన్ మూడో టెస్టు నుంచి మధ్యలోనే తప్పుకున్నాడు. -
జోరుగా హుషారుగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో విరాజ్ అశ్విన్ స్పీచ్
-
ఆంధ్రను గెలిపించిన భరత్, అశ్విన్
రాంచీ: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు ఖాతాలో వరుసగా రెండో విజయం చేరింది. గుజరాత్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ 19.2 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. ఆర్య దేశాయ్ (35 బంతుల్లో 62 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు అర్ధ సెంచరీ చేశాడు. ఆంధ్ర బౌలర్లు స్టీఫెన్ (3/25), కావూరి సాయితేజ (2/45), కేవీ శశికాంత్ (2/22), మనీశ్ (2/47) గుజరాత్ జట్టును దెబ్బ తీశారు. అనంతరం 166 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్ర జట్టు 17.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెపె్టన్ కోన శ్రీకర్‌భరత్ (41 బంతుల్లో 60; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), అశి్వన్ హెబ్బర్ (36 బంతుల్లో 53; 7 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడి తొలి వికెట్‌కు 10.2 ఓవర్లలో 87 పరుగులు జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక విహారి (16 బంతుల్లో 24 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు), రికీ భుయ్ (13 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఆంధ్ర జట్టును విజయతీరానికి చేర్చారు. నేడు జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో మణిపూర్ జట్టుతో ఆంధ్ర ఆడుతుంది. -
పారిశ్రామిక దిగ్గజం అశ్విన్ డానీ కన్నుమూత
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక రంగ ప్రముఖులు, ఏషియన్ పెయింట్స్ నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మాజీ చైర్మన్ అశ్విన్ డానీ (81) తుది శ్వాస విడిచారు. 1968 నుండి ఏషియన్ పెయింట్స్‌తో డానీకి అనుబంధం ఉంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కంపెనీలో వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, నాన్–ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌తో సహా కంపెనీ బోర్డ్‌లో వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు. 2018 నుండి 2021 మధ్య డానీ ఏషియన్ పెయింట్స్ సంస్థకు, బోర్డ్‌కు చైర్మన్‌గా ఉన్నారు. డానీ తండ్రి సూర్యకాంత్ ఏషియన్ పెయింట్స్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు. వివిధ ప్రభుత్వ– వాణిజ్య సంస్థల్లో డానీ కీలక బాధ్యతలు నిర్వహించారు. పలు అవార్డులు అందుకున్నారు. సీఎన్‌బీసీ–టీవీ 18 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, బిజినెస్ ఇండియా మ్యాగజైన్ బిజినెస్మెన్ ఆఫ్ ది ఇయర్ (2015), ఇండియన్ పెయింట్ అసోసియేషన్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 2002లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ నుండి కెమినార్ అవార్డు ఇందులో ఉన్నాయి. తాజా ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, అశ్విన్ డానీ, ఆయన కుటుంబం 7.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 64,000 కోట్లు) నికర విలువను కలిగి ఉంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా 293వ స్థానంలో నిలిచారు. -
ఏషియన్ పెయింట్స్ అశ్విన్ డాని కన్నుమూత
ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ (Asian Paints) నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రమోటర్ గ్రూప్ సభ్యుడు, బిలియనీర్ అశ్విన్ డాని (Ashwin Dani) 79 ఏళ్ల వయసులో కన్నుమూశారు. భారతదేశపు అతిపెద్ద పెయింట్ తయారీ కంపెనీ అయిన ఏషియన్ పెయింట్స్ నలుగురు సహ-వ్యవస్థాపకులలో ఒకరైన డాని మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు కంపెనీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లిన ఘనత పొందారు. ఆసియాలోని అతిపెద్ద పెయింట్ కంపెనీలలో ఒకటిగా ఉన్న ఏషియన్ పెయింట్స్‌లో అశ్విన్ డాని 1968లో చేరారు. ఈ కంపెనీని అతని తండ్రి సూర్యకాంత్ డాని, మరో ముగ్గురు 1942లో స్థాపించారు. డాని కుమారుడు మాలావ్ కూడా కంపెనీ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. ఫోర్బ్స్ ప్రకారం.. 2023 నాటికి అశ్విన్ డాని నికర విలువ 7.1 బిలియన్ డాలర్లు (రూ. 59 వేల కోట్లు). ఏషియన్ పెయింట్స్ హోమ్ పెయింటింగ్ సేవలతోపాటు ఇంటీరియర్ డిజైన్ సర్వీస్‌ను కూడా అందిస్తోంది. అశ్విన్ డాని కన్నుమూతతో గురువారం (సెప్టెంబర్ 28) ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ షేర్లు ట్రేడింగ్‌లో 4 శాతానికి పైగా పడిపోయాయి. -
హారర్ థ్రిల్లర్
అశ్విన్ కాకుమణి, పవిత్ర మరిముత్తు, గౌరవ్ నారాయణన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పిజ్జా 3’. మోహన్ గోవింద్ దర్శకత్వంలో సీవీ కుమార్ నిర్మించిన ఈ సినిమా జూలై 28న తమిళంలో విడుదలై, హిట్ సాధించింది. ఈ చిత్రాన్ని అదే పేరుతో కనెక్ట్ మూవీస్ ఎల్‌ఎల్‌పీపై ఎంఎస్ మురళీధర్ రెడ్డి, ఆశిష్ వేమిశెట్టి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ‘‘హారర్ అండ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘పిజ్జా 3 ’’ అన్నారు నిర్మాతలు. -
అశ్విన్-జడేజాల ముంగిట వరల్డ్ రికార్డు.. మరో 3 వికెట్లు తీస్తే..!
భారత స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్-రవీంద్ర జడేజాల కోసం ఓ వరల్డ్ రికార్డు కాసుకు కూర్చుంది. ఈ స్పిన్ ద్వయం విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ నాలుగో రోజు మరో 3 వికెట్లు పడగొడితే టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన స్పిన్ ద్వయంగా రికార్డుల్లోకెక్కుతుంది. ఈ ఇద్దరు కలిసి ఇప్పటివరకు టెస్ట్‌ల్లో 49 మ్యాచ్‌ల్లో 498 వికెట్లు పడగొట్టారు. వీరికి ముందు భారత మాజీ స్పిన్ ద్వయం అనిల్ కుంబ్లే-హర్భజన్ సింగ్ 54 మ్యాచ్‌ల్లో 501 వికెట్లు పడగొట్టారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన స్పిన్ ద్వయం రికార్డు కుంబ్లే-భజ్జీ జోడీ పేరిట ఉంది. విండీస్‌తో నేటి మ్యాచ్‌లో అశ్విన్-జడేజా ఇద్దరు కలిసి మరో 3 వికెట్లు పడగొడితే, కుంబ్లే-భజ్జీ జోడీని వెనక్కునెట్టి టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్ ద్వయం రికార్డును వారి ఖాతాలో వేసుకుంటారు. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన జోడీ రికార్డు ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలింగ్ పెయిర్ జేమ్స్ ఆండర్సన్-స్టువర్ట్ బ్రాడ్ పేరిట ఉంది. వీరిద్దరు కలిసి 137 టెస్ట్‌ల్లో 1034 వికెట్లు పడగొట్టారు. వీరి తర్వాత షేన్ వార్న్-గ్లెన్ మెక్‌గ్రాత్ ద్వయం ఉంది. వీరు 104 మ్యాచ్‌ల్లో 1001 వికెట్లు సాధించారు. ఈ జాబితాలో ప్రస్తుతం కుంబ్లే-భజ్జీ జోడీ 11వ స్థానంలో.. అశ్విన్-జడేజా జోడీ 12వ స్థానంలో ఉన్నాయి. ఇదిలా ఉంటే, రెండో టెస్ట్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (75), తేజ్‌నరైన్ చంద్రపాల్ (33), కిర్క్ మెక్కెంజీ (32), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (20), జాషువ డిసిల్వ (10) ఔట్ కాగా.. అలిక్ అథనేజ్ (37), జేసన్ హోల్డర్ (11) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో జడేజా 2, ముకేశ్ కుమార్, సిరాజ్, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌటైంది. 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లి (121) సెంచరీతో కదంతొక్కగా.. యశస్వి (57), రోహిత్ (80), జడేజా (61), అశ్విన్ (56)అర్ధసెంచరీలతో రాణించారు. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, వార్రికన్ చెరో 3 వికెట్లు.. హోల్డర్ 2, గాబ్రియల్ ఓ వికెట్ పడగొట్టారు. -
భారత బౌలర్ల జోరు
రోసీయూ (డొమినికా): వెస్టిండీస్‌తో ప్రారంభమైన తొలి టెస్టులో మొదటి రోజే భారత్ పైచేయి సాధించింది. తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో ప్రత్యర్థిని కుప్పకూల్చింది. భారత బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. తొలి రోజు టీ విరామ సమయానికి వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కెరీర్లో మొదటి టెస్టు ఆడుతున్న అలిక్ అతనజ్ (99 బంతుల్లో 47; 6 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. అశ్విన్ 4 వికెట్లు పడగొట్టగా, జడేజాకు 2 వికెట్లు దక్కాయి. టాస్ గెలిచి విండీస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వికెట్‌కు 31 పరుగులు జత చేసి ఓపెనర్లు క్రెయిగ్ బ్రాత్‌వైట్ (20), తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ (12) కుదురుకున్నట్లుగా అనిపించారు. అయితే 7 పరుగుల వ్యవధిలో వీరిద్దరిని అశ్విన్ అవుట్ చేసి దెబ్బ కొట్టాడు. శార్దుల్ తన తొలి ఓవర్లోనే రీఫర్ (2)ను వెనక్కి పంపగా, సిరాజ్ చక్కటి క్యాచ్‌కు బ్లాక్‌వుడ్ (14) అవుట్ కావడంతో లంచ్ సమయానికే స్కోరు 68/4కు చేరింది. మరో ఎండ్‌లో అలిక్ మాత్రమే ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. సొంత మైదానంలో అతను కొన్ని చక్కటి షాట్లతో జట్టును ఆదుకున్నాడు. రెండో సెషన్లో భారత్ మరో 3 వికెట్లు తీయడంలో సఫలమైంది. డి సిల్వ (2) ప్రభావం చూపలేకపోగా, హోల్డర్ (18) వికెట్ సిరాజ్ ఖాతాలో చేరింది. ఐదు పరుగుల వ్యవధిలో జోసెఫ్ (4), అలిక్లను అశ్విన్ అవుట్ చేశాడు. జోసెఫ్ వికెట్‌తో అశ్విన్ అంతర్జాతీయ వికెట్ల సంఖ్య 700కు చేరడం విశేషం. యశస్వి, ఇషాన్ అరంగేట్రం తొలి టెస్టులో భారత జట్టు ఇద్దరు కొత్త ఆటగాళ్లకు అవకాశం క ల్పించింది. ఊహించిన విధంగానే యశస్వి జైస్వాల్‌కు తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం లభించగా... వికెట్ కీపర్‌గా ఇప్పటికే 14 వన్డేలు, 27 టి20లు ఆడిన ఇషాన్ కిషన్ తొలిసారి టెస్టు క్రికెట్ బరిలోకి దిగాడు. భారత్ తరఫున టెస్టులు ఆడిన 306వ, 307వ ఆటగాళ్లుగా వీరిద్దరు నిలిచారు. భారత్ ఆడిన గత ఐదు టెస్టుల్లో కీపర్‌గా ఉన్న ఆంధ్ర ఆటగాడు కేఎస్ భరత్ స్థానంలో ఈసారి టీమ్ మేనేజ్మెంట్ ఇషాన్‌కు తుది జట్టులో చోటు ఇచ్చింది. జార్ఖండ్‌కు చెందిన ఇషాన్ 48 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 38.76 సగటుతో 2985 పరుగులు చేశాడు. ముంబై ఆటగాడు యశస్వి గత రెండేళ్లుగా అన్ని ఫార్మాట్లలో సత్తా చాటుతూ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్లో మెరుపులు, దేశవాళీ వన్డేల్లో మెరుపు బ్యాటింగ్ మాత్రమే కాకుండా 15 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలోనే 9 సెంచరీలతో 80.21 సగటుతో 1845 పరుగులు సాధించడం అతనికి అవకాశం క ల్పించింది. -
టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా అశ్విన్
-
ఒకే బంతికి రెండు రివ్యూలు ధోనిని మించిపోయిన అశ్విన్
-
ఒకే బంతికి రెండు రివ్యూలు ధోనిని మించిపోయిన అశ్విన్..!
-
ధోని మెరుపులు వృధా.. సీఎస్కేపై రాజస్తాన్ విజయం
చెన్నై: వరుసగా మూడో విజయం సాధించి ఈ ఐపీఎల్ సీజన్లో ‘హ్యాట్రిక్’ నమోదు చేయాలని ఆశించిన నాలుగుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నిరాశ ఎదురైంది. మాజీ విజేత రాజస్తాన్ రాయల్స్ సమష్టి ప్రదర్శనతో చెన్నై జట్టుకు వారి సొంత మైదానంలోనే షాక్ ఇచ్చిం ది. 2008 తర్వాత చెన్నై వేదికలో చెన్నై జట్టును రాజస్తాన్ ఓడించడం ఇదే తొలిసారి. టాస్ గెలిచి చెన్నై జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీ త 20 ఓవర్లలో 8 వికెట్లకు 175 పరుగులు సాధించింది. జోస్ బట్లర్ (36 బంతుల్లో 52; 1 ఫోర్, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా... దేవదత్ పడిక్కల్ (26 బంతుల్లో 38; 5 ఫోర్లు), అశ్విన్ (22 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్స్‌లు), హెట్‌మైర్ (18 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఆకాశ్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, రవీంద్ర జడేజా రెండు వికెట్ల చొప్పున తీశారు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు నిర్ణీ త 20 ఓవర్లలో 6 వికెట్లకు 172 పరుగులు చేసి ఓడిపోయింది. డెవాన్ కాన్వే (38 బంతుల్లో 50; 6 ఫోర్లు), అజింక్య రహానే (19 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) కీలకదశలో అవుటవ్వగా... చివర్లో రవీంద్ర జడేజా (15 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు), ధోని (17 బంతుల్లో 32; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరిపించి ఆరో వికెట్‌కు ఐదు ఓవర్లలో 59 పరుగులు జోడించినా చెన్నైను విజయతీరానికి చేర్చలేకపోయారు. డెవాన్ కాన్వే అవుటయ్యే సమయానికి చెన్నై స్కోరు 15 ఓవర్లలో 113/6. చెన్నై గెలవాలంటే 30 బంతుల్లో 63 పరుగులు చేయాలి. క్రీజులో జడేజా, ధోని ఉన్నారు. అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో 4 పరుగులు... చహల్ వేసిన 17వ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. దాంతో చెన్నై విజయసమీకరణం 18 బంతుల్లో 54 పరుగులుగా మారింది. జంపా వేసిన 18వ ఓవర్లో ధోని, జడేజా 14 పరుగులు... హోల్డర్ వేసిన 19వ ఓవర్లో 19 పరుగులు రాబట్టారు. దాంతో చెన్నై నెగ్గడానికి చివరి ఓవర్లో 21 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ వేసేందుకు వచ్చిన సందీప్ శర్మ తొలి రెండు బంతులను వైడ్ వేశాడు. ఆ తర్వాతి బంతికి పరుగు ఇవ్వని సందీప్... తర్వాతి రెండు బంతులు ఫుల్‌టాస్ వేయడంతో వాటిని ధోని సిక్స్‌లుగా మలిచాడు. దాంతో చెన్నై గెలవడానికి 3 బంతుల్లో 7 పరుగులు చేయాలి. అయితే సందీప్ శర్మ వేసిన మూడు బంతుల్లో ధోని, జడేజా మూడు పరుగులే చేయడంతో చెన్నై ఓటమి పాలైంది. రాజస్తాన్ స్పిన్నర్లు అశ్విన్ (2/25), యజువేంద్ర చహల్ (2/27) కీలక వికెట్లు తీసి చెన్నైను కట్టడి చేశారు. నిలబడి...తడబడి...: అంతకుముందు రాజస్తాన్ జట్టుకు ఓపెనర్లు శుభారంభం ఇవ్వలేకపోయారు. తుషార్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో యశస్వి జైస్వాల్ (8 బంతుల్లో 10; 2 ఫోర్లు) భారీ షాట్‌కు ప్రయత్నించి మిడ్ ఆఫ్ వద్ద శివమ్ దూబే చేతికి చిక్కాడు. అనంతరం బట్లర్, దేవ్‌దత్ ఇన్నింగ్స్‌ను నిరి్మంచారు. స్పిన్నర్ తీక్షణ బౌలింగ్‌లో వీరిద్దరు దూకుడుగా ఆడారు. తీక్షణ వేసిన తొలి ఓవర్లో 10 పరుగులు... రెండో ఓవర్లో 17 పరుగులు పిండుకున్నారు. ఆ తర్వాత తుషార్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లోని తొలి రెండు బంతులను దేవ్‌దత్ బౌండరీకి తరలించాడు. పవర్‌ప్లే ముగిసేసరికి రాజస్తాన్ 57/1తో నిలిచింది. పవర్‌ప్లే తర్వాత కూడా బట్లర్, దేవదత్ ధాటిగానే ఆడారు. మొయిన్ అలీ వేసిన ఎనిమిదో ఓవర్లో బట్లర్ వరుసగా రెండు సిక్స్‌లు కొట్టడంతో ఈ ఓవర్లో రాజస్తాన్ మొత్తం 18 పరుగులు సాధించింది. సాఫీగా సాగుతున్న రాజస్తాన్ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో తడబడింది. రవీంద్ర జడేజా మూడు బంతుల వ్యవధిలో దేవదత్‌ను, కెప్టెన్ సంజూ సామ్సన్ (0)ను పెవిలియన్‌కు పంపించాడు. అనంతరం నాలుగు ఓవర్లపాటు రాజస్తాన్ బ్యాటర్లు బట్లర్, అశ్విన్ ఆచితూచి ఆడారు. వీరిద్దరు ఈ నాలుగు ఓవర్లలో ఒక్క బౌండరీ కొట్టలేకపోయారు. ఆకాశ్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో అశ్విన్ రెండు వరుస సిక్స్‌లు కొట్టాడు. అయితే ఇదే ఓవర్ చివరి బంతికి అశ్విన్‌ను ఆకాశ్ అవుట్ చేశాడు. దాంతో బట్లర్, అశ్విన్ 47 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. 15 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ 135/4తో నిలిచింది. చివరి ఐదు ఓవర్లలో చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ప్రమాదకరంగా మారిన బట్లర్‌తోపాటు ధ్రువ్, హోల్డర్లను వెంటవెంటనే అవుట్ చేశారు. చివరి ఐదు ఓవర్లలో చెన్నై కేవలం 40 పరుగులిచ్చి 4 వికెట్లు తీసింది. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (సి) శివమ్ దూబే (బి) తుషార్ దేశ్‌పాండే 10; బట్లర్ (బి) మొయిన్ అలీ 52; దేవదత్ పడిక్కల్ (సి) కాన్వే (బి) జడేజా 38; సంజూ సామ్సన్ (బి) జడేజా 0; అశ్విన్ (సి) మగాలా (బి) ఆకాశ్ సింగ్ 30; హెట్‌మైర్ (నాటౌట్) 30; ధ్రువ్ జురేల్ (సి) శివమ్ దూబే (బి) ఆకాశ్ సింగ్ 4; హోల్డర్ (సి) కాన్వే (బి) తుషార్ దేశ్‌పాండే 0; జంపా (రనౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1–11, 2–88, 3–88, 4–135, 5–142, 6–167, 7–174, 8–175. బౌలింగ్: ఆకాశ్ సింగ్4–0–40–2, తుషార్ దేశ్‌పాండే 4–0–37–2, తీక్షణ 4–0–42–0, రవీంద్ర జడేజా 4–0–21–2, మొయిన్ అలీ 2–0–21–1, సిసాంద మగాలా 2–0–14–0. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (సి) యశస్వి (బి) సందీప్ శర్మ 8; డెవాన్ కాన్వే (సి) యశస్వి (బి) చహల్ 50;, అజింక్య రహానే (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 31; శివమ్ దూబే (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 8; మొయిన్ అలీ (సి) సందీప్ శర్మ (బి) జంపా 7; రాయుడు (సి) హెట్‌మైర్ (బి) చహల్ 1; జడేజా (నాటౌట్) 25; ధోని (నాటౌట్) 32; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–10, 2–78, 3–92, 4–102, 5–103, 6–113. బౌలింగ్: సందీప్ శర్మ 3–0–30–1, కుల్దీప్ సేన్ 2–0–8–0, హోల్డర్ 3–0–37–0, ఆడమ్ జంపా 4–0–43–1, అశ్విన్ 4–0–25–2, యజువేంద్ర చహల్ 4–0–27–2. ఐపీఎల్లో నేడు పంజాబ్ VS గుజరాత్ (రాత్రి గం. 7:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
Border-Gavaskar Trophy: మలుపు ఎటువైపు?
మనం నమ్ముకున్న ‘స్పిన్’ మంత్రం మనకే బెడిసి కొట్టింది. రెండో రోజు ఆటలో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను కూల్చేసింది. ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు పరుగు ముందే టీమిండియా ఆలౌటైంది. అక్షర్ పటేల్, అశ్విన్ ఆదుకోకుంటే మాత్రం పరిస్థితి ఇంకాస్త క్లిష్టంగా ఉండేది. టాపార్డర్ నుంచి మిడిలార్డర్ దాకా ప్రధాన బ్యాటర్లను లయన్ తిప్పేస్తుంటే ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఆపద్భాంధవుడి పాత్ర పోషించాడు. న్యూఢిల్లీ: ఎవరి ఊహకు అందనంతగా స్పిన్ తిరుగుతోంది. మ్యాచ్ అనూహ్య మలుపులు తిరుగుతోంది. రెండు రోజుల్లోనే 21 వికెట్లు కూలాయి. ఇందులో 16 వికెట్లు స్పిన్నర్లవే! ప్రత్యేకించి రెండో రోజు ఆటలో పడిన 11 వికెట్లలో 10 వికెట్లు స్పిన్నర్లే పడేశారు. దీంతో ఢిల్లీ టెస్టు రసవత్తరంగా మారింది. మిగిలిన మూడు రోజుల ఆటలో గెలుపు ఎటు మళ్లుతుందో చెప్పలేని స్థితి! టీమిండియాకు ఎదురులేని ఢిల్లీ కోటలో ఆస్ట్రేలియా ‘స్పిన్’తో ప్రతిదాడి చేసింది. దీంతో రెండో రోజు ఆటలో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 83.3 ఓవర్లలో 262 పరుగుల వద్ద ఆలౌటైంది. లోయర్ ఆర్డర్లో అక్షర్ పటేల్ (115 బంతుల్లో 74; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. ఆసీస్ స్పిన్నర్లలో లయన్ (5/67) చెలరేగాడు. కున్మన్, మర్పీలకు రెండేసి వికెట్లు దక్కాయి. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి 12 ఓవర్లలో వికెట్ కోల్పోయి 61 పరుగులు చేసింది. లయన్ ఉచ్చులో... ఓవర్‌నైట్ స్కోరు 21/0తో శనివారం ఆట కొనసాగించిన భారత్ 7 ఓవర్లపాటు బాగానే ఆడింది. కున్మన్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ లాంగాన్ లో భారీ సిక్సర్ బాదాడు. ఇక ఓపెనర్లు కుదురుకున్నట్లే అనుకుంటున్న తరుణంలో లయన్ బౌలింగ్‌కు దిగాడు. తన రెండు వరుస ఓవర్లలో టాపార్డర్‌ను ఎల్బీడబ్ల్యూగా దెబ్బ మీద దెబ్బ తీశాడు. ముందుగా రాహుల్ (17; 1 సిక్స్)ను బోల్తా కొట్టించిన లయన్ తన మరుసటి ఓవర్లో కెప్టెన్ రోహిత్ శర్మ (32; 2 ఫోర్లు), 100వ టెస్టు ఆడుతున్న పుజారా (0)లను పెవిలియన్ చేర్చాడు. ఇంకో ఓవర్లో అయ్యర్ (4) ఆట ముగించడంతో భారత్ 66 పరుగులకే 4 ప్రధాన వికెట్లను కోల్పోయింది. కోహ్లి క్రీజులో ఉండటమే జట్టుకు కాస్త ఊరట కాగా 88/4 స్కోరు వద్ద తొలి సెషన్ ముగిసింది. అక్షర్ వీరోచితం లంచ్ తర్వాత కోహ్లి, జడేజా జాగ్రత్తగా ఆడటంతో భారత్ వంద పరుగులు పూర్తి చేసుకుంది. అనంతరం స్పిన్నర్లు మర్ఫీ, కున్మన్ కలిసి భారత్‌ను పెద్ద దెబ్బే కొట్టారు. జడేజా (26; 4 ఫోర్లు)ను మర్ఫీ, కోహ్లి (44; 4 ఫోర్లు)ని కున్మన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నారు. శ్రీకర్ భరత్ (6) లయన్ ఉచ్చులో చిక్కాడు. 139/7 స్కోరు వద్ద భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే అశ్విన్ (37; 5 ఫోర్లు) అండతో అక్షర్ జట్టును ఒడ్డున పడేశాడు. అక్షర్ 94 బంతుల్లో (6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించాడు. దీంతో టీమిండియా... ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు దాకా వెళ్లగలిగింది. వార్నర్ కన్కషన్ ఆసీస్ స్టార్ ఓపెనర్ వార్నర్ రెండో టెస్టు మిగతా ఆటకు దూరమయ్యాడు. తొలిరోజు ఆటలోనే సిరాజ్ పదో ఓవర్లో వార్నర్ మోచేతికి గాయమైంది. కాసేపు ఫిజియో సేవలతో బ్యాటింగ్ చేశాడు. అయితే గాయం తీవ్రత దృష్ట్యా టెస్టు నుంచి తప్పుకోగా... కన్కషన్ (ఆటలో గాయమైతేనే) సబ్‌స్టిట్యూట్‌గా రెన్షాను తీసుకున్నారు. మూడో టెస్టుకల్లా వార్నర్ కోలుకునేది అనుమానంగానే ఉంది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 263; భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (బి) లయన్ 32; రాహుల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) లయన్ 17; పుజారా (ఎల్బీడబ్ల్యూ) (బి) లయన్ 0; కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) కున్మన్ 44; అయ్యర్ (సి) హ్యాండ్స్కాంబ్ (బి) లయన్ 4; జడేజా (ఎల్బీడబ్ల్యూ) (బి) మర్ఫీ 26; శ్రీకర్ భరత్ (సి) స్మిత్ (బి) లయన్ 6; అక్షర్ (సి) కమిన్స్ (బి) మర్ఫీ 74; అశ్విన్ (సి) రెన్షా (బి) కమిన్స్ 37; షమీ (బి) కున్మన్ 2; సిరాజ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (83.3 ఓవర్లలో ఆలౌట్) 262. వికెట్ల పతనం: 1–46, 2–53, 3–54, 4–66, 5–125, 6–135, 7– 139, 8–253, 9–259, 10–262. బౌలింగ్: కమిన్స్ 13–2–41–1, కున్మన్ 21.3– 4–72–2, లయన్ 29–5–67–5, మర్ఫీ 18–2–53–2, హెడ్ 2–0–10–0. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: ఖాజా (సి) అయ్యర్ (బి) జడేజా 6; హెడ్ (బ్యాటింగ్) 39; లబుషేన్ బ్యాటింగ్ 16; మొత్తం (12 ఓవర్లలో వికెట్ నష్టానికి) 61. వికెట్ల పతనం: 1–23. బౌలింగ్: అశ్విన్ 6–1–26–0, షమీ 2–0–10–0, జడేజా 3–0–23–1, అక్షర్ 1–0–2–0. -
IND vs BAN 2nd Test: భారత బౌలర్లదే పైచేయి
ఒకవైపు ఉమేశ్, ఉనాద్కట్ పదునైన పేస్... మరోవైపు అనుభవజ్ఞుడైన అశ్విన్ స్పిన్ తంత్రం... వెరసి రెండో టెస్టులో తొలి రోజే బంగ్లాదేశ్ కుప్పకూలింది. భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేని ఆతిథ్య జట్టు కనీస స్కోరు కూడా సాధించలేక చతికిలపడింది. మోమినుల్ హక్ పోరాటం మినహా జట్టు బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ విశేషమేమీ లేకపోయింది. గత టెస్టుతో పోలిస్తే అశ్విన్ మెరుగైన ప్రదర్శన ఇవ్వగా, ఉపఖండం పిచ్‌లపై ఉమేశ్ మళ్లీ సత్తా చాటాడు. పుష్కరకాలం తర్వాత టెస్టు ఆడిన ఉనాద్కట్ కూడా రెండు వికెట్లతో సంతృప్తిగా ముగించాడు. ఆపై టీమిండియా వికెట్ కోల్పోకపోయినా... ఆడిన 9 ఓవర్లలోనే ఎన్నో సార్లు బంతి అనూహ్యంగా స్పందించడంతో ఓపెనర్లు ఉత్కంఠభరిత క్షణాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనిని చూస్తే రెండో రోజు ఆట భారత బ్యాటింగ్‌కు సవాల్ విసిరేలా ఉంది. మిర్పూర్: భారత్‌తో గురువారం మొదలైన రెండో టెస్టులో బంగ్లాదేశ్ పేలవ బ్యాటింగ్ ప్రదర్శన కొనసాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 73.5 ఓవర్లలో 227 పరుగులకే ఆలౌటైంది. మోమినుల్ హక్ (157 బంతుల్లో 84; 12 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా, మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. భారత్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్, అశ్విన్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ ఆట ముగిసే సమయానికి 8 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 19 పరుగులు చేసింది. షకీబ్ విఫలం... బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో 40 పరుగులకు పైగా నమోదైన భాగస్వామ్యాలు నాలుగు కాగా, అత్యధికం 48 మాత్రమే! ఇదీ ఆ జట్టు బ్యాటింగ్ పరిస్థితిని చూపిస్తోంది. ఒక్కో జోడీ నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉండగానే భారత బౌలర్లు వికెట్ తీసి బంగ్లాకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. మొత్తంగా చూస్తే జట్టు ఇన్నింగ్స్ ఏ దశలోనూ భారీ స్కోరు దిశగా వెళ్లలేదు. ఓపెనర్లు నజ్ముల్ హొస్సేన్ (24), జాకీర్ హసన్ (15) ఆరంభంలో కొంత జాగ్రత్త ప్రదర్శించినా... అదీ ఎక్కువ సేపు సాగలేదు. ‘0’ వద్ద జాకీర్ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేసినా దాని వల్ల భారత్‌కు పెద్దగా నష్టం జరగలేదు. జాకీర్‌ను అవుట్ చేసి ఉనాద్కట్ టెస్టుల్లో తొలి వికెట్ సాధించాడు. అదే స్కోరు వద్ద నజ్ముల్ కూడా అవుట్ కాగా... లంచ్ సమయానికి బంగ్లా స్కోరు 82/2కు చేరింది. అయితే విరామం తర్వాత తొలి బంతికే చెత్త షాట్ ఆడిన షకీబ్ (16) నిష్క్రమించాడు. మరోవైపు మోమిన్ మాత్రం పట్టుదలగా నిలబడి కొన్ని చక్కటి షాట్లతో పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు. అతనికి కొద్ది సేపు ముష్ఫికర్ రహీమ్ (26) సహకరించాడు.అశ్విన్ ఓవర్లో ముష్ఫికర్ వరుసగా మూడు ఫోర్లు కొట్టడం సహా ఒక దశలో పది బంతుల వ్యవధిలో వీరిద్దరు ఆరు ఫోర్లు బాదడం విశేషం. ఈ జోడీని జైదేవ్ ఉనాద్కట్ విడదీయగా... సిరాజ్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టి దూకుడు ప్రదర్శించిన లిటన్ దాస్ (25) దానిని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి 78 బంతుల్లో మోమినుల్ అర్ధసెంచరీ పూర్తయింది. టీ బ్రేక్ తర్వాత ఒకదశలో బంగ్లా 213/5తో మెరుగైన స్థితిలోనే ఉంది. అయితే భారత బౌలర్లు చెలరేగడంతో మరో 14 పరుగులకే ఆ జట్టు తర్వాతి ఐదు వికెట్లు కోల్పోయింది. అనంతరం ఎనిమిది ఓవర్ల ఆటలో భారత్ వికెట్ తీయడంలో బంగ్లాదేశ్ బౌలర్లు సఫలం కాలేకపోయారు. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: నజ్ముల్ (ఎల్బీ) (బి) అశ్విన్ 24; జాకీర్ (సి) రాహుల్ (బి) ఉనాద్కట్ 15; మోమినుల్ (సి) పంత్ (బి) అశ్విన్ 84; షకీబ్ (సి) పుజారా (బి) ఉమేశ్ 16; ముష్ఫికర్ (సి) పంత్ (బి) ఉనాద్కట్ 26; లిటన్ దాస్ (సి) రాహుల్ (బి) అశ్విన్ 25; మెహదీ హసన్ (సి) పంత్ (బి) ఉమేశ్ 15; నూరుల్ (ఎల్బీ) (బి) ఉమేశ్ 6; తస్కీన్ (సి) సిరాజ్ (బి) ఉమేశ్ 1; తైజుల్ (నాటౌట్) 4; ఖాలెద్ (సి) ఉనాద్కట్ (బి) అశ్విన్ 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (73.5 ఓవర్లలో ఆలౌట్) 227. వికెట్ల పతనం: 1–39, 2–39, 3–82, 4–130, 5–172, 6–213, 7–219, 8–223, 9–227, 10–227. బౌలింగ్: సిరాజ్ 9–1–39–0, ఉమేశ్ యాదవ్ 15–4–25–4, జైదేవ్ ఉనాద్కట్ 16–2–50–2, అశ్విన్ 21.5–3– 71–4, అక్షర్ 12–3–32–0. భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (బ్యాటింగ్) 3; గిల్ (బ్యాటింగ్) 14; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 19. బౌలింగ్: తస్కీన్ 4–2–8–0, షకీబ్ 4–2–11–0. -
యాక్షన్ థ్రిల్లర్
అశ్విన్, నందితా శ్వేత జంటగా అనీల్ కన్నెగంటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘హిడింబ’. శ్రీ విఘ్నేశ్ కార్తీక్ సినిమాస్ బ్యానర్‌పై శ్రీధర్ గంగపట్నం నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయింది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘ఒక షాకింగ్ పాయింట్‌తో డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘హిడింబ’. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తాయి. ఈ సినిమా కోసం అశ్విన్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. ఇప్పటికే విడుదలైన మా చిత్రం ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. మకరంద్ దేశ్‌పాండే, సిజ్జు, రాజీవ్ కనకాల, శ్రీనివాస రెడ్డి, ‘శుభలేఖ’ సుధాకర్, రఘు కుంచె ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: బి.రాజశేఖర్, సంగీతం: వికాస్ బడిసా. -
1770: రాజమౌళి శిష్యుడి డైరెక్షన్లో పాన్ ఇండియా చిత్రం
ఇండియన్ సినిమా వైవిధ్య కథా చిత్రాల కోసం తపిస్తోందని చెప్పవచ్చు. ముఖ్యంగా చారిత్రక, జానపద, పౌరాణిక, ఇతివృత్తాలపై దృష్టి సారిస్తుందా అని అనిపిస్తుంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు ఘన విజయాలు దీనికి కారణం కావచ్చు. అలాంటి చారిత్రక ఇతివృత్తంతో 1770 అనే పాన్ ఇండియా చిత్రానికి బీజం పడింది. దీనికి రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించబోతున్నారు. ప్రఖ్యాత రచయిత బకించంద్ర చటర్జీ రాసిన అనందమత్ నవల ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రానికి బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ, కథనాలను అందిస్తున్నారు. దీనిని నిర్మాతలు శైలేంద్ర కువర్, సుజాయ్ కుట్టి, పి.కృష్ణకుమార్, సరజ్ శర్మ కలిసి ఎస్ఎస్ 1 ఎంటర్టైన్మెంట్, పీకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. కాగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి 150 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ధ్వనిస్తున్న వందేమాతరం గీతంతో కూడిన టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం, బెంగాలీ మొదలగు భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. నవరాత్రి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్య ప్రకటనను వెల్లడించనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఈ చిత్రంలో నటించే తారాగణం, సాంకేతిక వర్గం దీపావళి సందర్భంగా వెల్లడించనున్నట్లు తెలిపారు. కాగా చిత్ర దర్శకుడు అశ్విన్, గంగరాజు తన యూనిట్ సభ్యులతో ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రవన ముఖ్య ప్రకటనను వెల్లడించనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఈ చిత్రంలో నటించే తారాగణం, సాంకేతిక వర్గం దీపావళి సందర్భంగా వెల్లడించనున్నట్లు తెలిపారు. కాగా చిత్ర దర్శకుడు అశ్విన్, గంగరాజు తన యూనిట్ సభ్యులతో ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
IPL 2022: ఢిల్లీ ఆశలు పదిలం
ముంబై: సీజన్లో ఒక విజయం తర్వాత ఒక పరాజయం... గత పది మ్యాచ్‌లలో ఇలాగే పడుతూ, లేస్తూ సాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ అదే శైలిని కొనసాగించింది! తాజా ఫలితం అనంతరం సరిగ్గా సగం మ్యాచ్‌లలో విజయం, సగం పరాజయాలతో ఆ జట్టు ఇంకా ప్లే ఆఫ్స్ ఆశలు పదిలంగా ఉంచుకుంది. బుధవారం జరిగిన పోరులో క్యాపిటల్స్ 8 వికెట్లతో రాజస్తాన్ రాయల్స్‌పై నెగ్గింది. ముందుగా రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు చేసింది. అశ్విన్ (38 బంతుల్లో 50; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, దేవదత్ పడిక్కల్ (30 బంతుల్లో 48; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం ఢిల్లీ 18.1 ఓవర్లలో 2 వికెట్లకు 161 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ మార్ష్ (62 బంతుల్లో 89; 5 ఫోర్లు, 7 సిక్స్‌లు), డేవిడ్ వార్నర్ (41 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 144 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. రాణించిన పడిక్కల్... ప్రమాదకర బ్యాటర్ బట్లర్ (7)ను అవుట్ చేసి సకరియా ఢిల్లీకి శుభారంభం అందించగా, యశస్వి జైస్వాల్ (19) కూడా ఎక్కువసేపు నిలవలేదు. అయితే అనూహ్యంగా మూడో స్థానంలో వచ్చిన అశ్విన్ కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. శార్దుల్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అతను, అక్షర్ ఓవర్లో వరుస బంతుల్లో 4, 6 బాదాడు. మరో ఎండ్‌లో పడిక్కల్ కూడా ధాటిని ప్రదర్శించాడు. అక్షర్ ఓవర్లో వరుస బంతుల్లో అతను రెండు సిక్సర్లు కొట్టాడు. 37 బంతుల్లో అశ్విన్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఐపీఎల్ సహా టి20 క్రికెట్లో అతనికి ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. మూడో వికెట్‌కు పడిక్కల్‌తో 36 బంతుల్లో 53 పరుగులు జోడించిన అనంతరం అశ్విన్ వెనుదిరగ్గా... సామ్సన్ (6), పరాగ్ (9) విఫలమయ్యారు. శతక భాగస్వామ్యం... కేఎస్ భరత్ (0) మరోసారి విఫలమవ్వగా... వార్నర్, మార్ష్ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. పవర్‌ప్లే ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 38 పరుగులకు చేరింది. మార్ష్ దూకుడు కనబర్చగా, వార్నర్ నెమ్మదిగా ఆడాడు. కుల్దీప్ సేన్ ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన మా చహల్ ఓవర్లో మరో భారీ సిక్స్‌తో 38 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. 79 బంతుల్లో 100 పరుగుల భాగస్వామ్యం నమో దైంది. వేగంగా ఆడుతూ సెంచరీ దిశగా దూసుకుపోయిన మార్ష్ ఆ అవకాశం చేజార్చుకున్నాడు. 18 బంతుల్లో 17 పరుగులు చేయాల్సిన స్థితిలో మా అవుటయ్యాడు. వార్నర్, పంత్ (13 నాటౌ ట్; 2 సిక్స్‌లు) కలిసి మిగతా పనిని పూర్తి చేశారు. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) లలిత్ (బి) మార్ష్ 19; బట్లర్ (సి) శార్దుల్ (బి) సకరియా 7; అశ్విన్ (సి) వార్నర్ (బి) మార్ష్ 50; పడిక్కల్ (సి) (సబ్) నాగర్కోటి (బి) నోర్జే 48; సామ్సన్ (సి) శార్దుల్ (బి) నోర్జే 6; పరాగ్ (సి) పావెల్ (బి) సకరియా 9; డసెన్ (నాటౌట్) 12; బౌల్ట్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–11, 2–54, 3–107, 4–125, 5–142, 6–146. బౌలింగ్: సకరియా 4–0–23–2, నోర్జే 4–0–39–2, శార్దుల్ 4–0–27–0, అక్షర్ 2–0–25–0, మా 3–0–25–2, కుల్దీప్ 3–0–20–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: భరత్ (సి) సామ్సన్ (బి) బౌల్ట్ 0; వార్నర్ 52 (నాటౌట్); మార్ష్ (సి) కుల్దీప్ సేన్ (బి) చహల్ 89; పంత్ (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (18.1 ఓవర్లలో 2 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–0, 2–144. బౌలింగ్: బౌల్ట్ 4–0–32–1, ప్రసిధ్ 3–1–20–0, అశ్విన్ 4–0–32–0, కుల్దీప్ సేన్ 3.1–0–32–0, చహల్ 4–0–43–1. ఐపీఎల్లో నేడు ముంబై ఇండియన్స్ X చెన్నై సూపర్ కింగ్స్ వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం. -
బ్యాటింగ్ తడబడింది
కఠినమైన పిచ్‌పై భారత జట్టు రోజంతా నిలవలేకపోయింది. సఫారీ బౌలర్లు పరిస్థితులను సమర్థంగా వాడుకొని టీమిండియాను తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. కేఎల్ రాహుల్, అశ్విన్ పట్టుదలగా ఆడినా ఇతర బ్యాటర్లు చేతులెత్తేశారు. అయితే ఆ తర్వాత మన బౌలర్లు కూడా ప్రభావం చూపడంతో 18 ఓవర్ల పాటు దక్షిణాఫ్రికా బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రెండో రోజూ ఇదే ఒత్తిడిని కొనసాగిస్తే భారత్ సాధించిన 202 పరుగులు కూడా విజయానికి బాటలు వేయవచ్చు. మూడేళ్ల క్రితం ఇదే మైదానంలో మొదటి ఇన్నింగ్స్‌లో 187 పరుగులు చేసి కూడా టీమిండియా గెలవగలగడం మానసికంగా ప్రేరణనిచ్చే అంశం! జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో సోమవారం మొదలైన రెండో టెస్టులో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే ఆలౌటైంది. బ్యాటింగ్ వైఫల్యంతో మన ఇన్నింగ్స్ 63.1 ఓవర్లకే ముగిసింది. తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (133 బంతుల్లో 50; 9 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... అశ్విన్ (50 బంతుల్లో 46; 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సఫారీ బౌలర్లలో మార్కో జాన్సెన్ 31 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టడం విశేషం. ఒలీవియర్, రబడ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టపోయి 35 పరుగులు చేసింది. కీగన్ పీటర్సన్ (14 బ్యాటింగ్), డీన్ ఎల్గర్ (11 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా మరో 167 పరుగులు వెనుకబడి ఉంది. పుజారా, రహానే విఫలం... ఆట తొలి గంటలో 36 పరుగులు చేసిన భారత్ బ్రేక్ ముగిసిన వెంటనే తొలి బంతికే మయాంక్ అగర్వాల్ (26) వికెట్‌ను కోల్పోయింది. ఆపై మరో 13 పరుగుల తర్వాత జట్టుకు గట్టి దెబ్బ తగిలింది. ఫామ్‌లో లేని పుజారా (3), రహానే (0)లను ఒలీవియర్ వరుస బంతుల్లో పెవిలియన్ పంపించాడు. ఈ దశలో రాహుల్, విహారి (53 బంతుల్లో 20; 3 ఫోర్లు) కలిసి జాగ్రత్తగా ఆడటంతో తొలి సెషన్ తర్వాత భారత్ స్కోరు 53/3 వద్ద నిలిచింది. అయితే లంచ్ తర్వాత 9 పరుగుల వద్ద బవుమా క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన విహారి దానిని ఉపయోగించుకోలేకపోయాడు. రబడ బౌలింగ్‌లో అనూహ్యంగా లేచిన బంతిని విహారి ఆడబోగా, షార్ట్‌లెగ్‌లో వాన్ డర్ డసెన్ అద్భుత రీతిలో క్యాచ్ అందుకున్నాడు. అర్ధసెంచరీ సాధించిన వెంటనే రాహుల్ వెనుదిరగ్గా... పంత్ (17), శార్దుల్ (0) ప్రభావం చూపలేకపోయారు. అయితే అశ్విన్ పట్టుదలగా ఆడి జట్టు కుప్పకూలిపోకుండా కాపాడాడు. టీ విరామ సమయానికి 21 బంతులు ఆడిన అశ్విన్ 4 ఫోర్లతో 24 పరుగులు చేయడం విశేషం. మూడో సెషన్లో భారత్ ఇన్నింగ్స్ మరో 12.1 ఓవర్ల పాటు సాగింది. చూడచక్కటి షాట్లు ఆడిన అశ్విన్ అర్ధ సెంచరీ చేజార్చుకోగా, రబడ ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టిన బుమ్రా (14 నాటౌట్) భారత్ స్కోరును 200 పరుగులు దాటించాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా ఓపెనర్ మార్క్రమ్ (7)ను ఆరంభంలోనే అవుట్ చేసి షమీ దెబ్బ కొట్టగా... ఎల్గర్, పీటర్సన్ మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. బుమ్రా బౌలింగ్‌లో 12 పరుగుల వద్ద పీటర్సన్ మొదటి స్లిప్‌లోకి సులువైన క్యాచ్ ఇవ్వగా... కీపర్ పంత్ అడ్డుగా వెళ్లి దానిని అందుకునే ప్రయత్నంలో వదిలేయడంతో సఫారీ టీమ్ ఊపిరి పీల్చుకుంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (సి) రబడ (బి) జాన్సెన్ 50; మయాంక్ (సి) వెరీన్ (బి) జాన్సెన్ 26; పుజారా (సి) బవుమా (బి) ఒలీవియర్ 3; రహానే (సి) పీటర్సన్ (బి) ఒలీవియర్ 0; విహారి (సి) డసెన్ (బి) రబడ 20; పంత్ (సి) వెరీన్ (బి) జాన్సెన్ 17; అశ్విన్ (సి) పీటర్సన్ (బి) జాన్సెన్ 46; శార్దుల్ (సి) పీటర్సన్ (బి) ఒలీవియర్ 0; షమీ (సి అండ్ బి) రబడ 9; బుమ్రా (నాటౌట్) 14; సిరాజ్ (సి) వెరీన్ (బి) రబడ 1; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (63.1 ఓవర్లలో ఆలౌట్) 202. వికెట్ల పతనం: 1–36, 2–49, 3–49, 4–91, 5– 116, 6–156, 7–157, 8–185, 9–187, 10–202. బౌలింగ్: రబడ 17.1–2–64–3, ఒలీవియర్ 17–1–64–3, ఎన్గిడి 11–4–26–0, జాన్సెన్ 17–5–31–4, కేశవ్ మహరాజ్ 1–0–6–0. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: ఎల్గర్ (బ్యాటింగ్) 11; మార్క్రమ్ (ఎల్బీ) (బి) షమీ 7; పీటర్సన్ (బ్యాటింగ్) 14; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18 ఓవర్లలో వికెట్ నష్టానికి) 35. వికెట్ల పతనం: 1–14. బౌలింగ్: బుమ్రా 8–3–14–0, షమీ 6–2–15–1, సిరాజ్ 3.5–2–4–0, శార్దుల్ 0.1–0–0–0. -
‘శత’క్కొట్టిన శ్రీకర్ భరత్.. అశ్విన్ సెంచరీ.. ఆంధ్ర జట్టు విజయం
Vijay Hazare Trophy: Andhra Beat Himachal Pradesh Hyderabad Lost To Uttar Pradesh: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్ర జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. హిమాచల్ ప్రదేశ్‌తో ఆదివారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 30 పరుగుల తేడాతో గెలిచింది. భారత జట్టు రిజర్వ్ వికెట్ కీపర్, ఆంధ్ర జట్టు కెప్టెన్ కోన శ్రీకర్ భరత్ ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 109 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్స్‌లతో 161 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఓపెనర్ అశ్విన్ హెబ్బార్ (132 బంతుల్లో 100; 10 ఫోర్లు) కూడా సెంచరీ సాధించాడు. ఆంధ్ర జట్టు తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 322 పరుగులు సాధించింది. అనంతరం 323 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హిమాచల్ ప్రదేశ్ జట్టు 46 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర బౌలర్లలో గిరినాథ్ రెడ్డి నాలుగు వికెట్లు తీశాడు. మళ్లీ ఓడిన హైదరాబాద్ మరోవైపు మొహాలీలో ఉత్తరప్రదేశ్‌తో జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు ఏడు వికెట్లతో ఓడింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 42.5 ఓవర్లలో 149 పరుగులకు ఆలౌటైంది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఉత్తరప్రదేశ్ 26 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసి గెలిచింది. చదవండి: Vijay Hazare Trophy MP VS CG: శతక్కొట్టాక రజనీ స్టైల్లో ఇరగదీసిన వెంకటేశ్ అయ్యర్ -
ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాదే హీరో: దిల్ రాజు
‘‘ఔట్ అండ్ ఔట్ యూత్ మూవీ ‘రౌడీ బాయ్స్’. చాలా కాలం తర్వాత మా బ్యానర్లో వస్తున్న యూత్ ఫిల్మ్ ఇది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. అనిత సమర్పణలో ఆదిత్య మ్యూజిక్‌తో కలసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘రౌడీ బాయ్స్’. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేసిన అనంతరం ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘రౌడీ బాయ్స్’ సినిమాకి హీరో దేవిశ్రీ ప్రసాద్. కొత్త వాళ్లతో సినిమా చేస్తున్నప్పుడు ప్రేక్షకుల్ని థియేటర్స్‌కు రప్పించాలంటే మొదట అందర్నీ మెప్పించేది సంగీతమే. ఆశిష్‌ను హీరోగా లాంచ్ చేస్తున్నామని, మ్యూజిక్ చేయాలని అడిగితే వారం టైమ్ తీసుకుని ఓకే అన్నాడు. దేవిశ్రీ, నా జర్నీలో అన్ని సినిమాలు వేరు.. ఈ ‘రౌడీ బాయ్స్’ వేరు. ఇద్దరి హీరోలకంటే అనుపమా పరమేశ్వరన్ పెద్దగా కనిపిస్తుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ, తను బాగా చేసింది. దేవిశ్రీ తర్వాత ఈ సినిమాకి తనే సెకండ్ హీరో. దసరాకు సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఇటీవలే విడుదలైన మా సినిమా టైటిల్ సాంగ్, ఇప్పుడు విడుదలైన టీజర్ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను’’ అన్నారు ఆశిష్. ‘‘రౌడీబాయ్స్’ లో మొత్తం 9 పాటలు ఉన్నాయి. పాటలన్నీ ఆడియన్స్‌కు ఫీస్ట్‌లా ఉంటాయి’’ అన్నారు హర్ష. ‘‘రౌడీ బాయ్స్’ కి మ్యూజిక్ అందించేందుకు ‘దిల్’ రాజుగారు అడిగిన వెంటనే ఓకే చెప్పాను. ఆశిష్ సినిమాకు మ్యూజిక్ అందించడం నా బాధ్యత. ఈ సినిమాకు మరో మ్యూజిక్ డైరెక్టర్‌ను తీసుకుని ఉంటే నేను ధర్నా చేసేవాణ్ణి. ‘రౌడీబాయ్స్’ సినిమాతో కాలేజీ డేస్‌ను గుర్తుచేసుకుంటారు.. యూత్ అంతా కలిసి నవ్వుకుంటూ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. ఆశిష్ నటన చూస్తే తొలి సినిమాకే ఇంత బాగా యాక్ట్ చేశాడేంటి? అనిపించింది. ఆశిష్, విక్రమ్ పోటాపోటీగా నటించారు’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. చదవండి: కావ్య కోసం కొట్టుకున్న 'రౌడీ బాయ్స్' -
'కావ్య నా పిల్ల'.. కాలర్ పట్టుకున్న కాలేజ్ స్టూడెంట్స్
Rowdy Boys Teaser released: ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కుటుంబంలో నుంచి ఒకరు హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. దిల్‌రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రౌడీ బాయ్స్’.ఇందులో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. హర్ష దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. కాలేజ్ బ్యాక్ డ్రాప్లో సినిమా సాగుతుందని అర్ధమవుతుంది. రెండు వేర్వేరు కాలేజీల మధ్య గొడవ, హీరోయిన్ కోసం ఇద్దరు గొడవ పడటం వంటివి టీజర్లో చూపించారు. ఇక ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
IND Vs ENG: నన్ను ఎందుకు ఆడించలేదంటే...
లండన్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు నలుగురు పేసర్లతో ఆడింది. రెండో టెస్టుకు వచ్చే సరికి శార్దుల్ గాయపడగా, అతని స్థానంలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు అవకాశం దక్కవచ్చని అంతా భావించారు. కానీ ఈ సారి కూడా అదే నలుగురు పేసర్లు వ్యూహాన్ని టీమిండియా అనుసరించింది. అయితే అశ్విన్‌ను ఆడించేందుకు టీమ్ మేనేజ్మెంట్ దాదాపుగా సిద్ధపడగా...ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో అతడిని పక్కన పెట్టాల్సి వచ్చింది. ఈ విషయాన్ని అశ్విన్ స్వయంగా వెల్లడించాడు. టీమ్ ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్‌తో అతను దీనిని పంచుకున్నాడు. ‘మ్యాచ్ జరిగే రోజుల్లో ముందస్తు వాతావరణ సూచన చూస్తే బాగా ఎండ కాస్తుందని, వేడి గాలులు వీస్తాయని ఉంది. మ్యాచ్ ఆడేందుకు నువ్వు సిద్ధంగా ఉండు అని నాతో టీమ్ మేనేజ్మెంట్ చెప్పింది కూడా. అయితే మ్యాచ్ రోజు మేం బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఒక్కసారిగా చల్లగా మారిపోయి చినుకులు కురుస్తున్నాయి. దాంతో నాకు చోటు దక్కలేదు. వాతావరణం మన చేతుల్లో లేదు కదా’ అని అశ్విన్ వెల్లడించాడు. -
చెలరేగిన అశ్విన్.. 69 పరుగులకే ప్రత్యర్ధి ఆలౌట్
లండన్: ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2021 ఫైనల్లో తేలిపోయిన టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఇంగ్లండ్ గడ్డపై సత్తాచాటాడు. ప్రస్తుతం కౌంటీ క్రికెట్లో సర్రే తరఫున ఆడుతున్న అశ్విన్ ఒకే ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో చెలరేగాడు. సోమర్‌సెట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లు వేసిన యాష్.. 6 వికెట్లు తీసి ప్రత్యర్ధి నడ్డి విరిచాడు. అశ్విన్‌కి మరో స్పిన్నర్ డేనియల్ మోరియార్టీ (4 వికెట్లు) తోడవ్వడంతో సోమర్సెట్ 69 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్ ధాటికి ముగ్గురు బ్యాట్స్‌మన్ మాత్రమే రెండంకెల స్కోర్ సాధించగా, జె హిల్డ్రెత్ (14) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే, జులై 11న (ఆదివారం) మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సోమర్సెట్, తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. హిల్డ్రెత్(107) శతకానికి మరో అయిదుగురు ఆటగాళ్లు 40లు సాధించడంతో సోమర్సెట్ తొలి ఇన్నింగ్స్‌లో 429 పరుగులకు ఆలౌటైంది. సర్రే బౌలర్లు జోర్డాన్ క్లార్క్, అమర్ విర్ధి చెరో 3 వికెట్లు పడగొట్టగా, డేనియల్ మోరియార్టీ 2, అశ్విన్, ఆర్ క్లార్క్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సర్రే జట్టులో ఓపెనర్లు రోరీ బర్న్స్(50), స్టోన్మెన్(67) మాత్రమే రాణించడంతో కేవలం 240 పరుగులకే ఆలౌటైంది. సోమర్సెట్ బౌలర్లు జాక్ లీచ్ 6, వాన్ డెర్ మెర్వే 4 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సోమర్సెట్కు స్పిన్నర్లు అశ్విన్(6), మోరియార్టీ(4) చుక్కలు చూపించారు. వీరి ధాటికి సోమర్సెట్ రెండో ఇన్నింగ్స్‌లో 69 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సర్రే జట్టు కడపటి వార్తలందేసరికి 3 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. క్రీజ్‌లో హషీమ్ ఆమ్లా(24), జేమీ స్మిత్(26) ఉన్నారు. సర్రే గెలుపునకు మరో 178 పరుగుల అవసరం ఉంది. కాగా, ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ముగిశాక టీమిండియా ఆటగాళ్లకు మూడు వారాల విరామం దొరకడంతో వారంతా కుటుంబాలతో కలిసి విహార యాత్రలో ఉన్నారు. అశ్విన్‌కు మాత్రం అనుకోకుండా కౌంటీ జట్టు సర్రే నుంచి ఆహ్వానం అందిండంతో ఆయన వెంటనే జట్టుతో చేరాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీసుకు ముందు ఈ కౌంటీ మ్యాచ్ ద్వారా మంచి ప్రాక్టీస్ దొరుకుతుందని భావించిన యాష్.. వెంటనే సర్రే జట్టు ఆహ్వానాన్ని అంగీకరించాడు. -
క్రికెటర్ అశ్విన్ ఇంట్లో కరోనా కలకలం.. ఏకంగా పది మందికి
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. రోజువారి రికార్డు స్థాయి కేసులతో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా భారత్ ఆఫ్ స్పిన్నర్, ఆల్ రౌండర్ అశ్విన్ కుటుంబంలో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. ఏకంగా ఇంట్లో ఉన్న పది మందికి వైరస్ సోకింది. ఈ విషయాన్ని అశ్విన్ భార్య ప్రీతి నారాయణన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అశ్విన్ కుటుంబ సభ్యులు ఈ శుక్రవారం కోవిడ్ పరీక్షలు చేసుకోగా.. పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని ప్రీతి ట్వీట్ చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలో ఉన్న అశ్విన్ గతవారం సీజన్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రీతి తమ అనుభవాలను అటు ట్విటర్, ఇటు ఇన్‌స్టాలో షేర్ చేశారు. గతవారంమంతా ఒక పీడకలలా గడిచింది ‘‘మా ఇంట్లో ఉన్న పది మందికి కరోనా వైరస్ సోకింది. అందులో 6గురు పెద్దలు, 4 పిల్లలు ఉన్నారు. పిల్లల కారణంగా అందరికీ ఈ మహమ్మారి వ్యాపించింది. ప్రస్తుతం కుటుంబంలోని అందరూ వేర్వేరు ఇళ్లలో, ఆసుపత్రుల్లో చేరడంతో గతవారం మా కుటుంబానికి ఓ పీడకలలా గడిచింది. 5-8 రోజులు చాలా కష్టంగా గడిచాయి. సాయం చేయడానికి అందరూ ఉన్నా.. చేయలేని పరిస్థితి. ఇదో మాయదారి వైరస్. మానసిక ఆరోగ్యం కంటే శారీరక ఆరోగ్యం ద్వారానే వేగంగా కోలుకోగలమని భావిస్తున్నాను. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ప్రతీ ఒక్కరూ టీకా తీసుకోండి, టీకాతోనే మనం ,మన కుటుంబ సభ్యులు ఈ మహమ్మారితో పోరాడగలం‘‘ అంటూ ప్రీతి ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ ఈ ఐపీఎల్ సీజన్‌కు తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నట్లు గత ఆదివారం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఐపీఎల్ 2021 సీజన్లో లీగ్ నుంచి తప్పుకున్న తొలి భారతీయ క్రికెటర్ అశ్విన్. కరోనా సోకి కష్టకాలంలో ఉన్న తన కుటుంబ సభ్యులు మద్దతుగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. ( చదవండి: తండ్రికి కరోనా పాజిటివ్.. ఐపీఎల్ వదిలి వెళ్లిన మాజీ ఆటగాడు ) Feeling ok enough to croak a tiny hi to all of you.6 adults and 4 children ended up testing+ the same week,with our kids being the vehicles of transmission - the core of my family,all down with the virus in different homes/hospitals..Nightmare of a week.1 of 3 parents back home. — Wear a mask. Take your vaccine. (@prithinarayanan) April 30, 2021 -
విషాదం: మాజీ క్రికెటర్ అశ్విన్ యాదవ్ ఇకలేరు
సాక్షి, హైదరాబాద్: ఒక వైపు ఐపీఎల్ సంబరం జరుగుతుండగా హైదరాబాద్ రంజీ జట్టులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రంజీ జట్టు మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ అశ్విన్ యాదవ్(33) శనివారం గుండెపోటుతో కన్ను మూశారు. అశ్విన్ అకాలమరణంపై పలువురు క్రికెట్ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. అశ్విన్‌కు భార్య, ముగ్గురు కుమారులున్నారు. అశ్విన్ యాదవ్ మరణ వార్త తనను దిగ్భ్రాంతి గురి చేసిందని భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ ట్వీట్ చేశారు. సరదాగా ఉండే అశ్విన్ ఇక లేడంటే నమ్మలేకపోతున్నానంటూ మాజీ రంజీ ఆఫ్ స్పిన్నర్, విశాల్ శర్మ సంతాపం తెలిపారు. అశ్విన్ టీమ్ మ్యాన్ అని ఎపుడు జట్టు విజయం కోసం ఆరాటపడేవాడని గుర్తు చేసుకున్నారు. స్థానిక మ్యాచ్‌లలో ఎస్‌బిహెచ్ తరఫున అశ్విన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన హైదరాబాద్ మాజీ ఓపెనర్ డేనియల్ మనోహర్ మాట్లాడుతూ అశ్విన్ ఇంత చిన్న వయసులో మనకి దూరంకావడం విచారకరమన్నారు. ఫాస్ట్ బౌలర్‌గా టీమ్‌కు అండగా ఉండేవాడు. ఫిట్‌నెస్‌కు ప్రాణమిచ్చే అశ్విన్‌కు గుండెపోటు రావడం షాకింగ్ ఉందన్నారు. అశ్విన్ తన ఆటతో ఎపుడూ ఆకట్టుకునేవాడని, చిన్న వయస్సు నుండే వికెట్లు తీసే సామర్ధ్యం కలిగి ఉన్నాడని ఆండ్రూస్ స్కూల్ కోచ్‌గా పనిచేసిన నోయెల్ కార్ సంతాపం తెలిపారు. 2002లో సౌత్ జోన్ ఛాంపియన్‌షిప్‌లో రాష్ట్ర అండర్ -14 జట్టుకు 25 వికెట్లతో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడు నిలిచాడంటూ నివాళులర్పించారు. కాగా కరియర్లో 14 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ యాదవ్ 34 వికెట్లు పడగొట్టాడు. రంజీ ట్రోఫీలో 2007 లో మొహాలిలో పంజాబ్‌తో రంజీ ట్రోఫీకి అరంగేట్రం చేశాడు. 2008-09 సీజన్లో ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీపై 52 పరుగులకు 6 వికెట్లు తీశాడు. యాదవ్ చివరి సారిగా 2009లో ముంబైతో తన రంజీ మ్యాచ్ ఆడాడు. రెండు టీ 20 మ్యాచ్‌లు కూడా ఆడాడు. Devastated to hear the news of #Ashwinyadav passing away. A Very jovial and fun loving guy, team man to the core, punched way above his skills as a fast bowler. I pray to God for strength to his family. #gonetooearly #OmShanti You will be missed. pic.twitter.com/0gIuOKZr6L — R SRIDHAR (@coach_rsridhar) April 24, 2021 -
అరుదైన క్లబ్లో చేరికకు వికెట్ దూరంలో..
ముంబై: ఫార్మాట్లకతీతంగా గత కొంత కాలంగా విశేషంగా రాణిస్తున్న టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. టీ20 క్రికెట్లో ఇప్పటివరకు 249 వికెట్లు పడగొట్టిన అతను.. మరో వికెట్ తీస్తే అరుదైన 250 వికెట్ల క్లబ్‌లోకి చేరతాడు. అంతర్జాతీయ టీ20ల్లో 46 మ్యాచ్‌ల్లో 52 వికెట్లు, ఐపీఎల్లో 155 మ్యాచ్‌ల్లో 139 వికెట్లు, ఇతర టీ20ల్లో 58 వికెట్లు పడగొట్టిన అశ్విన్.. మొత్తంగా 249 వికెట్లు పడగొట్టాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో 4/8, ఐపీఎల్లో 4/34 అశ్విన్ అత్యుత్తమ ప్రదర్శనలుగా ఉన్నాయి. ప్రస్తుతం ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న 34 ఏళ్ల అశ్విన్.. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో వెటరన్ పేసర్ లసిత్ మలింగ 170 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా అమిత్ మిశ్రా(160), పియూశ్ చావ్లా(156), డ్వేన్ బ్రావో(154), హర్భజన్‌సింగ్(150) వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ఐపీఎల్ 2021లో భాగంగా గురువారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో అశ్విన్ 250 వికెట్ల క్లబ్లో చేరే అవకాశం ఉంది. చదవండి: టీమిండియా కెప్టెన్‌కు అరుదైన గౌరవం -
నేనే కోహ్లినైతే వారి బదులు అశ్విన్, జడ్డూలను తీసుకుంటా..
లండన్: ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లినైతే టీ20 ప్రపంచకప్ జట్టులోకి చహల్, కుల్దీప్ యాదవ్‌లను అస్సలు తీసుకోనని, వారి స్థానాల్లో సీనియర్ స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌లకు అవకాశం ఇస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. స్పిన్నర్లకు స్వర్గధామమైన భారత పిచ్‌లపై చహల్-కుల్దీప్ల కంటే అనుభవజ్ఞులైన జడేజా-అశ్విన్‌లవైపు మొగ్గుచూపడమే భారత్‌కు మంచిదని, ఈ ఇద్దరు స్పిన్నర్లు ఆల్‌రౌండర్లనే విషయం మర్చిపోకూడదని ఆయన పేర్కొన్నాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ప్రస్తుత భారత్ జట్టు అన్ని రంగాల్లో బలంగా కనిపిస్తున్నప్పటికీ.. స్పిన్నర్ల విభాగమే కాస్త కలవరపెడుతోందని ఆయన తెలిపాడు. గత కొంతకాలంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లో టీమిండియా స్పిన్నర్లుగా కుల్దీప్, చహల్ కొనసాగుతున్నారని, ఈ ఫార్మట్‌లో వీరి ప్రదర్శన అంత మెరుగ్గా లేకపోవడం వల్లనే తాను ఈ తరహా వ్యాఖ్యలు చేశానని పనేసర్ వెల్లడించాడు. గత 10 మ్యాచ్‌ల్లో చహల్ కేవలం 9 వికెట్లు మాత్రమే పడగొట్టగా, కుల్దీప్ ఆ మాత్రం ప్రభావం కూడా చూపలేకపోయాడన్నాడు. ఈ నేపథ్యంలోనే అశ్విన్-జడేజాలకు మరో అవకాశం ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్కు ఆయన సూచించాడు. కాగా, ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ చహల్, కుల్దీప్కు అగ్ని పరీక్షలాంటిదని, ఇందులో విఫలమైతే వారి టీ20 ప్రపంచకప్ బెర్త్‌లపై సందిగ్ధత నెలకొంటుందని అభిప్రాయపడ్డాడు. వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా టీమిండియాలోకి పునరాగమనం చేసే అవకాశం లేకపోలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. -
రాజమౌళి మెచ్చిన టీజర్: మీరూ చూసేయండి
దర్శకధీరుడు రాజమౌళి దగ్గర సహాయకుడిగా పని చేసిన అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆకాశవాణి. ఎమ్ఎమ్ కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా టీజర్‌ను డైరెక్టర్ రాజమౌళి శుక్రవారం రిలీజ్ చేశాడు. పచ్చని ప్రకృతి మధ్యలోకి, స్వచ్ఛమైన గాలిని పీల్చే గిరిజనుల మధ్యలోకి మనల్ని తీసుకువెళ్తున్నట్లుగా ఉందీ టీజర్. చెట్టూపుట్టను నమ్ముకునే అడవి బిడ్డల కథలను, వ్యథలను కళ్లకు కట్టినట్లు చెప్పే ప్రయత్నమే ఈ సినిమా అనిపిస్తోంది. కరెంటు లేక అర్ధరాత్రి కూడా కాగడాలు పట్టుకుని నడవడం వారి పరిస్థితిని వివరిస్తోంది. చూడటానికి ఎంతో బాగున్న ఈ టీజర్లో ఇక్కడేదో తప్పు జరుగుతుంది శీను అన్న డైలాగ్ ఒక్కటే ఉంది. ఇక మర్రిచెట్టు ఊడలను పట్టుకుని ఊయలూగుతున్న బాలుడు, మరో ఊడకు రేడియో తగిలించడం చూస్తుంటే ఈ సినిమా మనల్ని గత స్మృతుల్లోకి లాక్కెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే ఈ టీజర్‌పై ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోయాడు రాజమౌళి. "ఆ విజువల్స్ , మ్యూజిక్ ఎంతో కొత్తగా ఉన్నాయి. ఈ సినిమాతో అశ్విన్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడా అని ఆతృతగా ఎదురు చూస్తున్నా" అని పేర్కొన్నాడు. పద్మనాభరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అందిస్తున్నాడు. సురేశ్ రగుతు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ షూట్లో హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మహేశ్ మరో సినిమా -
ఆంధ్ర అదరహో
ఇండోర్: ఇతర సమీకరణాలపై ఆధారపడకుండా ఆంధ్ర క్రికెట్ జట్టు దర్జాగా విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. జార్ఖండ్‌తో ఆదివారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో గాదె హనుమ విహారి నాయకత్వంలోని ఆంధ్ర జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. జార్ఖండ్ నిర్దేశించిన 140 పరుగుల విజయలక్ష్యాన్ని ఆంధ్ర జట్టు కేవలం 9.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించడం విశేషం. ఓపెనర్లు అశ్విన్ హెబ్బర్ (18 బంతుల్లో 44; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), రికీ భుయ్ (27 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) తొలి బంతి నుంచే జార్ఖండ్ బౌలర్ల భరతం పట్టారు. దాంతో 5.5 ఓవర్లలో తొలి వికెట్‌కు 82 పరుగులు జోడించాక అశ్విన్ అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన విహారి (2 బంతుల్లో 4; ఫోర్), నితీశ్ కుమార్ రెడ్డి (5 బంతుల్లో 15; 2 సిక్స్‌లు), నరేన్‌రెడ్డి (7 బంతుల్లో 16 నాటౌట్; ఫోర్, 2 సిక్స్‌లు) కూడా ఏమాత్రం దూకుడు తగ్గించకుండా ఆడటంతో ఆంధ్ర లక్ష్యం దిశగా బుల్లెట్ వేగంతో దూసుకుపోయింది. జార్ఖండ్ జట్టులోని భారత బౌలర్లు వరుణ్ ఆరోన్ 2 ఓవర్లలో 30 పరుగులు... షాబాజ్ నదీమ్ 2 ఓవర్లలో 26 పరుగులు సమర్పించుకున్నారు. అంతకుముందు జార్ఖండ్ జట్టు 46.2 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. ఆంధ్ర బౌలర్లు హరిశంకర్ రెడ్డి (4/30), షోయబ్ మొహమ్మద్ ఖాన్ (2/30), కార్తీక్ రామన్ (2/38) జార్ఖండ్ పతనాన్ని శాసించారు. ప్రణాళిక ప్రకారం... ఈ మ్యాచ్‌కు ముందు ఆంధ్ర ఎనిమిది పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. క్వార్టర్ ఫైనల్ బెర్త్ నేరుగా దక్కాలంటే గ్రూప్ ‘టాపర్’గా నిలవాలి. ఈ నేపథ్యంలో రన్‌రేట్ మెరుగు పర్చుకోవడానికి ఆంధ్ర జట్టు టాస్ నెగ్గగానే ఛేజింగ్ చేయడానికే మొగ్గు చూపింది. జార్ఖండ్‌ను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత ఆఫ్ స్పిన్నర్ షోయబ్ మొహమ్మద్ ఖాన్ ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో ఓపెనర్ ఉత్కర్ష్ సింగ్ (19; 3 ఫోర్లు)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత జార్ఖండ్ 11 పరుగుల తేడాలో మరో మూడు వికెట్లను కోల్పోయింది. దాంతో 54 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి జార్ఖండ్ కష్టాల్లో పడింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (38; 3 ఫోర్లు) నిలదొక్కుకుంటున్న దశలో షోయబ్ అతడిని అవుట్ చేయడంతో జార్ఖండ్ కోలుకోలేకపోయింది. అనంతరం మీడియం పేసర్లు హరిశంకర్ రెడ్డి, కార్తీక్ రామన్ విజృంభించడంతో జార్ఖండ్ ఇన్నింగ్స్ 139 పరుగులవద్ద ముగిసింది. లక్ష్యం చిన్నది కావడంతో ఆంధ్ర బ్యాట్స్‌మెన్ ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగారు. పది ఓవర్లలోపే లక్ష్యాన్ని ఛేదించి రన్‌రేట్‌ను మెరుగుపర్చుకున్నారు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆరు జట్లున్న గ్రూప్ ‘బి’లో ఆంధ్ర, తమిళనాడు, జార్ఖండ్, మధ్యప్రదేశ్ జట్లు 12 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్ కారణంగా ఆంధ్ర జట్టు (0.73) ‘టాప్’ ర్యాంక్‌లో నిలిచింది. తమిళనాడు (0.65), జార్ఖండ్ (0.29), మధ్యప్రదేశ్ (–0.46) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. గ్రూప్ ‘ఎ’ నుంచి గుజరాత్... గ్రూప్ ‘సి’ నుంచి కర్ణాటక క్వార్టర్ ఫైనల్ చేరాయి. గ్రూప్ ‘డి’ నుంచి ముంబై, ఢిల్లీ... గ్రూప్ ‘ఇ’ నుంచి సౌరాష్ట్ర, చండీగఢ్ క్వార్టర్ ఫైనల్ రేసులో ఉన్నాయి. వెంకటేశ్ అయ్యర్ 198 పంజాబ్‌తో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ 105 పరుగుల తేడాతో గెలిచింది. మధ్యప్రదేశ్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (146 బంతుల్లో 198; 20 ఫోర్లు, 7 సిక్స్‌లు) రెండు పరుగుల తేడాతో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. మధ్యప్రదేశ్ 50 ఓవర్లలో 3 వికెట్లకు 402 పరుగులు చేసింది. అనంతరం పంజాబ్ 42.3 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. పంజాబ్ ఓపెనర్ అభిషేక్ శర్మ (49 బంతుల్లో 104; 8 ఫోర్లు, 9 సిక్స్‌లు) మెరుపు సెంచరీ చేశాడు. తన్మయ్, తిలక్ వర్మ సెంచరీలు సూరత్: విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టు విజయంతో లీగ్ దశను ముగించినా నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోయింది. గోవా తో జరిగిన ఎలైట్ గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ రెండు పరుగుల తేడాతో నెగ్గింది. ముందుగా హైదరాబాద్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 345 పరుగులు సాధించింది. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (150; 19 ఫోర్లు, సిక్స్), తిలక్ వర్మ (128, 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 264 పరుగులు జతచేయడం విశేషం. లిస్ట్–ఎ క్రికెట్లో హైదరాబాద్ తరఫున తొలి వికెట్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. 2002లో గోవాపై అంబటి రాయుడు, వినయ్ కుమార్ తొలి వికెట్‌కు 196 పరుగులు జతచేశారు. 346 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గోవా జట్టు 50 ఓవర్లలో 5 వికెట్లకు 343 పరుగులు సాధించి ఓడిపోయింది. ఓపెనర్ ఏక్నాథ్ కేర్కర్ (169 నాటౌట్; 19 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్నేహల్ (112 బంతుల్లో 116; 15 ఫోర్లు) రెండో వికెట్‌కు 225 పరుగులు జోడించారు. ఏక్నాథ్ చివరిదాకా అజేయంగా ఉన్నా గోవాను గెలిపించలేకపోయాడు. 12 పాయింట్లతో గ్రూప్ ‘ఎ’లో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. ‘శత’క్కొట్టిన దేవ్‌దత్, సమర్థ్ రైల్వేస్‌తో జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో కర్ణాటక 10 వికెట్ల తేడాతో నెగ్గింది. 285 పరుగుల లక్ష్యాన్ని కర్ణాటక 40.3 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఛేదించింది. లిస్ట్–ఎ క్రికెట్ లో భారత గడ్డపై ఇదే అత్యధిక ఛేదన. దేవ్‌దత్ పడిక్కల్ (145 నాటౌట్; 9 ఫోర్లు, 9 సిక్స్‌లు), సమర్థ్ (130 నాటౌట్; 17 ఫోర్లు) అజేయ శతకాలు సాధించారు. అంతకుముందు ప్రథమ్ సింగ్ (129; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ చేయడం తో రైల్వేస్ 9 వికెట్లకు 284 పరుగులు చేసింది. ఢిల్లీలో 7 నుంచి నాకౌట్ మ్యాచ్‌లు విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌లు ఈనెల 7 నుంచి ఢిల్లీలో జరగనున్నాయి. మొత్తం ఐదు ఎలైట్ గ్రూప్‌ల్లో ‘టాప్’లో నిలిచిన ఐదు జట్లు... ఆ తర్వాత రెండో స్థానంలో నిలిచిన రెండు అత్యుత్తమ జట్లు క్వార్టర్ ఫైనల్ చేరుకుంటాయి. చివరిదైన ఎనిమిదో బెర్త్ కోసం ఓవరాల్ ఎలైట్ గ్రూప్‌ల్లో ఎనిమిదో స్థానంలో నిలిచిన జట్టు, ప్లేట్ గ్రూప్ విజేత జట్టుతో 7న ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు చివరి క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారవుతుంది. ఈనెల 8, 9 తేదీల్లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు... 11న సెమీఫైనల్స్... 14న ఫైనల్ జరుగుతాయి. -
స్మిత్, కోహ్లి ర్యాంక్‌లు యథాతథం
దుబాయ్: తొలి డే–నైట్ టెస్టులో భారత్‌కు పరాభవం ఎదురైనప్పటికీ ర్యాంకుల పరంగా కెప్టెన్ విరాట్ కోహ్లి ర్యాంక్‌లో ఎలాంటి మార్పు రాలేదు. అతను 888 రేటింగ్ పాయింట్లతో రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. అడిలైడ్ టెస్టులో కెప్టెన్ ఇన్నింగ్స్ (74) ఆడిన కోహ్లి రెండు రేటింగ్ పాయింట్లను మెరుగు పర్చుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో విఫలమైన టాప్ ర్యాంకర్ స్మిత్ (911) పది రేటింగ్ పాయింట్లు కోల్పోయాడు. దీంతో అగ్రస్థానంలోనే కొనసాగుతున్న స్మిత్‌కు రెండో స్థానంలో ఉన్న కోహ్లికి వ్యత్యాసం తగ్గింది. అయితే తన భార్య ప్రసవం కోసం తదుపరి టెస్టులకు గైర్హాజరీ కానున్న నేపథ్యంలో కోహ్లి రేటింగ్ మారే అవకాశం ఉండదు. బౌలర్ల విభాగంలో భారత స్పిన్నర్ అశ్విన్ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని 9వ ర్యాంకుకు ఎగబాకాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా 3వ ర్యాంక్‌లో ఉన్నాడు. -
అశ్విన్‌ను అలా చేయనివ్వను!
న్యూఢిల్లీ: గత ఏడాది ఐపీఎల్లో రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ‘మన్కడింగ్’ ద్వారా జాస్ బట్లర్‌ను రనౌట్ చేయడం తీవ్ర వివాదంగా మారిన సంగతి తెలిసిందే. తాను నిబంధనల ప్రకారమే చేశానని అశ్విన్ ఒకే మాటపై నిలబడగా...అది క్రీడా స్ఫూర్తినికి విరుద్ధమంటూ విమర్శలు వచ్చాయి. ఈ సారి 2020 ఐపీఎల్లో అశ్విన్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఆడనున్నాడు. దానికి హెడ్ కోచ్‌గా ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ వ్యవహరిస్తున్నాడు. ఇకపై అలాంటి ఘటన జరగదని, ఈ విషయంలో తాను అశ్విన్‌తో ‘గట్టిగా’ మాట్లాడతానని పాంటింగ్ వ్యా ఖ్యానించాడు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఎలాంటి ఘటనా జరగదని పాంటింగ్ హామీ ఇచ్చాడు. ‘మా జట్టు అలాంటి తరహా క్రికెట్‌ను ఆడబోవడం లేదు. నేను అశ్విన్‌ను కలవగానే అన్నింటికింటే ముందు ఇదే విషయంపై మాట్లాడతా. గత ఏడాది అతను మా జట్టుతో లేడు. అశ్విన్ అద్భుతమైన బౌలర్. ఈ ఘటన జరిగినప్పుడు నేను మా ఆటగాళ్లతో కూడా అది తప్పని చెప్పాను. అశ్విన్‌లాంటి స్థాయి ఆటగాడు అలా చేస్తే మరికొందరు అతడిని అనుసరిస్తారు. కాబట్టి ఇప్పుడు అతడిని కలిశాక దీనిపై చర్చిస్తా. నాకు తెలిసి అతను మళ్లీ తన చర్యను సమర్థించుకోవచ్చు. అయితే క్రీడా స్ఫూర్తికి మాత్రం ఇది పూర్తిగా విరుద్ధం. నేను, మా ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మాత్రం అలాగే భావిస్తాం’ అని పాంటింగ్ వివరించాడు. అయితే అశ్విన్ తరహాలో ‘మన్కడింగ్’ ద్వారా బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేయడం తప్పేమీ కాదంటూ ఎంసీసీ రూపొందించిన నిబంధనల కమిటీలో పాంటింగ్ కూడా సభ్యుడు కావడం విశేషం. మరో వైపు 2008లో సిడ్నీలో భారత్‌తో జరిగిన టెస్టు లో పలు మార్లు క్రీడా స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరించిన పాంటింగ్, ఇప్పుడు క్రీడా స్ఫూర్తి మాటలు చెప్పడం హాస్యాస్పదమని భారత అభిమానులు అతనిపై విరుచుకు పడ్డారు. -
ప్రేయసిని పెళ్లాడిన కమెడియన్
చెన్నై: తమిళ కమెడియన్ అశ్విన్ రాజా తన ప్రేయసి విద్య శ్రీని పెళ్లాడాడు. బుధవారం చెన్నైలో వీరి వివాహం సాంప్రదాయ పద్ధతిలో నిరాడంబరంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. "చూడముచ్చటైన జంట" అంటూ అభిమానులు అతడికి పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా గత నాలుగేళ్లుగా విద్య శ్రీ, అశ్విన్ ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. (24న ప్రముఖ హాస్య నటుడి వివాహం) వీరి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపడంతో ఇటీవలే నిశ్చితార్థం కూడా జరిగింది. చెన్నైకు చెందిన రాజశేఖర్ కుమార్తె విద్య శ్రీ. ఆమె అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఇక వి.స్వామినాథన్ కుమారుడైన అశ్విన్ 'బాస్ ఎంగిరా భాస్కరన్' చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమయ్యాడు. ఆ తర్వాత నటించిన ‘కుంకి’ సినిమా అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా నుంచి ఆయన అభిమానులు అశ్విన్‌ను ప్రేమగా "కుంకి అశ్విన్" అని పిలుచుకుంటున్నారు. (కూరగాయలు అమ్ముతున్న కమెడియన్) -
24న ప్రముఖ హాస్య నటుడి వివాహం
చెన్నై: ప్రముఖ తమిళ హాస్య నటుడు అశ్విన్ రాజా(కుంకి అశ్విన్) ఓ ఇంటివాడు కాబోతున్నాడు. జూన్ 24న చెన్నైలో తన ప్రేయసి విద్యాశ్రీని పెళ్లాడబోతున్నాడు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహ వేడుక జరగనుంది. కాగా గత నాలుగేళ్లుగా విద్యాశ్రీ, అశ్విన్ ప్రేమించుకుంటుండగా, ప్రస్తుతం మూడు ముళ్ల బంధంతో ఒకటి కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇటీవల నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించినట్లు తెలుస్తోంది. (ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున) చెన్నైకు చెందిన రాజశేఖర్ కుమార్తె విద్యాశ్రీ. ఈమె అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ పరిస్థితుల్లో నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలు పాటిస్తూ కేవలం 20 మంది మాత్రమే పెళ్లికి హాజరు కానున్నట్లు సమాచారం. ఇక అశ్విన్.. లక్ష్మీ మూవీ మేకర్స్ నిర్మాతాల్లో ఒకరైన వి. స్వామినాథన్ కుమారుడు. హీరో ఆర్య నటించిన ‘బాస్ ఎంగిరా బాస్కరన్’ చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత దర్శకుడు ప్రభు సోలమన్ ‘కుంకి’ సినిమాలో నటించి మంచి పేరును సంపాదించారు. అప్పటి నుంచి తమిళ అభిమానులు అశ్విన్ రాజాను ప్రేమతో అశ్విన్ కుంకీ అని పిలుచుకుంటారు. (ఆరోగ్యానికే కాదు.. అందానికీ ఔషధమే) -
నేను 8 వికెట్లు తీయలేనా..!
కొలంబో: టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు (800) నెలకొల్పిన దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ తన ఆఖరి టెస్టులో ఈ ఘనత నమోదు చేసాడు. 2010లో స్వదేశంలో భారత్‌తో జరిగిన ఈ సిరీస్‌కు ముందే తాను మొదటి టెస్టు మాత్రమే ఆడి రిటైర్ అవుతానని అతను ముందే ప్రకటించాడు. అప్పటికి అతని ఖాతాలో 792 వికెట్లు ఉన్నాయి. అయితే సహచరుడు సంగక్కర మాత్రం 800 మైలురాయిని వచ్చేవరకు ఆడాల్సిందేనని ఒప్పించే ప్రయత్నం చేశాడు. అవసరమైతే తర్వాతి టెస్టునుంచి విశ్రాంతి తీసుకొని లేదా మరుసటి సిరీస్ అయినా ఆడాల్సిందే తప్ప ఇలా తప్పుకోవద్దని మళ్లీ మళ్లీ చెప్పాడు. దీనిపై స్పందించిన మురళీ...‘నేను నిజంగా అత్యుత్తమ స్పిన్నర్నే అయితే ఒకే టెస్టులో 8 వికెట్లు తీస్తాను తప్ప ఇలా సాగదీయను’ అని బదులిచ్చాడు. చివరకు అతను అన్నట్లుగానే సరిగ్గా 8 వికెట్లు తీసి చరిత్రలో తన పేరు లిఖించుకున్నాడు. గురువారం భారత స్పిన్నర్ అశ్విన్‌తో జరిపిన ఇన్స్టాగ్రామ్ సంభాషణలో సంగక్కర ఇది వెల్లడించాడు. -
నేనీ స్థాయిలో ఉండటానికి కారణం నా తమ్ముళ్లే
అశ్విన్, అవికా గోర్ జంటగా నటించిన చిత్రం ‘రాజుగారి గది 3’. ఓక్ ఎంటర్టైన్మెంట్స్పై ఓంకార్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రేపు విడుదలకానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ–రిలీజ్ వేడుకలో ప్రముఖ కెమెరామన్ ఛోటా కె. నాయుడు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం సంచలన విజయం సాధిస్తుంది. సాంకేతిక అభివృద్ధి వల్ల నటీనటుల్లో బద్ధకం పెరిగిందని నేను చెప్పినట్లు ఓ దిన పత్రికలో వచ్చింది. నా ఉద్దేశం అది కాదు. సాంకేతికత పెరగడం వల్ల సాంకేతిక నిపుణుల పని కాస్త తేలికైందని నా అభిప్రాయం’ అన్నారు. ‘‘యాంకర్ నుంచి నేనీ స్థాయికి ఎదగడానికి కారణం నా తమ్ముళ్లు అశ్విన్, కల్యాణ్. చదువును కూడా మర్చిపోయి నా కెరీర్ కోసం కష్టపడ్డారు. నాకు జన్మనిచ్చింది మా అమ్మానాన్నలు అయితే.. నా సినీ కెరీర్‌కు జన్మనిచ్చింది నా తమ్ముళ్లే. ఈ సినిమాతో అశ్విన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. కల్యాణ్ నిర్మాతగా త్వరలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వరంగల్ శ్రీనుగారి నమ్మకం నిజం అవుతుందని నమ్ముతున్నాను. మా నాన్నగారు గత ఏడాది చనిపోయారు. అందుకే నేను ఎక్కువగా తెల్ల దుస్తుల్లో కనిపిస్తున్నా. ఈ సినిమాతో అశ్విన్‌ను ప్రేక్షకులు హీరోగా అంగీకరించిన తర్వాత తిరిగి మామూలు దుస్తులు వేసుకుంటాను’’ అన్నారు ఓంకార్. ‘‘జీనియస్’ నుంచి ఇప్పటివరకు ఐదు సినిమాలు చేశాను. హీరోగా ఈ శుక్రవారం నా డ్రీమ్‌ను చూడబోతున్నాను’’ అన్నారు అశ్విన్. ‘‘ఇదివరకు ‘హుషారు’, ‘ఇస్మార్ట్ శంకర్’, ‘గద్దలకొండ గణేష్’ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశాను. ఈ విజయాల వరుసలో ఈ చిత్రం కూడా చేరుతుంది’’ అన్నారు వరంగల్ శ్రీను. -
‘రాజుగారి గది 3’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
అద్దంలో చూసుకొని భయపడ్డాను
‘‘సినిమా రిలీజ్ అయిపోతే మార్చడానికి ఏమీ ఉండదు. కానీ సీరియల్స్ విషయానికి వస్తే గత ఎపిసోడ్లో జరిగిన తప్పులను ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవచ్చు. టీవీ ద్వారానే పాపులారిటీ సంపాదించాను. అందుకే టాలీవుడా? బాలీవుడా? టీవీ ఇండస్ట్రీయా? అని అడిగితే ఎప్పుడూ టీవీకే నా ఓటు’’ అన్నారు అవికా గోర్. ‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ ద్వారా గుర్తింపు పొంది హీరోయిన్గా మారారామె. ఓంకార్ దర్శకత్వంలో అశ్విన్ హీరోగా నటించిన ‘రాజుగారి గది 3’లో హీరోయిన్గా నటించారు అవికా. ఈ నెల 18న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అవికా మాట్లాడుతూ – ‘‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా తర్వాత వరుసగా టీవీ షోలు, ఒక హిందీ సినిమా చేశాను. అందుకే తెలుగులో సినిమాలు చేయలేకపోయాను. పేరుకి చేశాం అనేట్టు సినిమా అంగీకరించడం నాకు ఇష్టం ఉండదు. ప్రస్తుతం ‘ఖత్రా’ అనే టీ షో చేస్తున్నాను. ఆ సమయంలో ఓంకార్‌గారు కలసి ‘రాజుగారి గది 3’ కథ చెప్పారు. ఈ సినిమాలో ముందు తమన్నాను అనుకున్నాం, డేట్స్ క్లాష్‌తో ఆమె తప్పుకున్నారు అని ముందే చెప్పారు. ఆయన కథ చెప్పడం పూర్తయ్యే సమయానికి భయపడిపోయాను. హారర్ సినిమాలు ఒక్కదాన్నే చూడటానికి భయపడుతుంటాను. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఉంటేనే చూస్తాను. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక పూర్తి మేకప్ వేసుకున్నాక నన్ను నేను అద్దంలో చూసుకుని, భయపడ్డాను. మా నాన్నగారైతే ‘ఇదే నువ్వు’ అని ఆటపట్టించారు. ప్రేక్షకులు భయపడుతూనే విపరీతంగా నవ్వుతారు. అదే మా సినిమా హైలెట్. ప్రస్తుతం తెలుగు అర్థం అవుతోంది. నేర్చుకుంటున్నాను. సెట్లో పెద్ద పెద్ద టెక్నీషియన్స్‌తో వర్క్ చేయడం మంచి ఎక్స్పీరియన్స్. అలీగారి లాంటి లెజెండ్‌తో నటించడం మర్చిపోలేను. కుదిరితే బిగ్ బాస్ షో హోస్ట్ చేయాలనుంది కానీ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లలేను. ఒక తెలుగు ప్రాజెక్ట్ కమిట్ అయ్యాను. త్వరలోనే ప్రకటిస్తాను’’ అన్నారు. అన్ని ఇండస్ట్రీల్లో తెలుగు ఇండస్ట్రీ బెస్ట్ అని నా అభిప్రాయం. ఇక్కడ ఉన్నంత ప్లానింగ్, పద్ధతి ఎక్కడా ఉండదు. జూలైలో సినిమా ప్రారంభించి అక్టోబర్‌లో వచ్చేస్తున్నాం. యాక్టర్‌గా నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది తెలుగు ఇండస్ట్రీయే. -
సఫారీల పోరాటం
దక్షిణాఫ్రికా తేలిగ్గా తలవంచలేదు. ముందు రోజే మూడు వికెట్లు కోల్పోయినా పట్టుదలగా నిలబడిన బ్యాట్స్‌మెన్ భారత బౌలింగ్‌ను నిరోధించారు. ఎల్గర్, డి కాక్ సెంచరీలతో సత్తా చాటి తమ జట్టును తక్షణ ప్రమాదం నుంచి తప్పించారు. వీరితో పాటు కెపె్టన్ డు ప్లెసిస్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడగా... సఫారీ జట్టు ఆలౌట్ కాకుండా రోజంతా నిలబడింది. ఆధిక్యానికి అవకాశం లేకపోయినా తొలిఇన్నింగ్స్ స్కోరు అంతరాన్ని మాత్రం బాగా తగ్గించింది. పేసర్లు పెద్దగా ప్రభావం చూపని చోట ఎప్పటిలాగే సొంతగడ్డపై నమ్ముకున్న స్పిన్నర్లే టీమిండియాను నడిపించారు. అశి్వన్ మరోసారి ఐదు వికెట్లతో మెరవడం, జడేజా 200 వికెట్ల మైలురాయిని చేరుకోవడం భారత కోణంలో శుక్రవారం ఆటలో చెప్పుకోదగ్గ విశేషాలు. అనూహ్య బౌన్స్‌తో పిచ్ ఇప్పటికే భిన్నంగా స్పందించడం మొదలైన నేపథ్యంలో నాలుగో రోజు సఫారీలు మరెన్ని పరుగులు జోడిస్తారో, ఆ తర్వాత భారత్ ఎలా ఆడుతుందో అనేది ఆసక్తికరం. విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు గట్టి పోరాటపటిమ ప్రదర్శించింది. శుక్రవారం 98 ఓవర్లు ఆడినా కేవలం 5 వికెట్లు మాత్రమే చేజార్చుకొని మెరుగైన ప్రదర్శన కనబర్చింది. మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. ఓపెనర్ డీన్ ఎల్గర్ (287 బంతుల్లో 160; 18 ఫోర్లు, 4 సిక్సర్లు), వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్ (163 బంతుల్లో 111; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలు సాధించగా... కెపె్టన్ డు ప్లెసిస్ (103 బంతుల్లో 55; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఎల్గర్ ఐదో వికెట్‌కు ప్లెసిస్‌తో 115 పరుగులు, ఆరో వికెట్‌కు డి కాక్‌తో 164 పరుగులు జోడించాడు. ఒకే రోజు దక్షిణాఫ్రికా 346 పరుగులు నమోదు చేసింది. భారత బౌలర్లలో అశ్విన్ 5 వికెట్లు పడగొట్టగా, జడేజాకు 2 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికా మరో 117 పరుగులు వెనుకబడి ఉంది. తొలి సెషన్: తడబడి... నిలబడి... ఓవర్‌నైట్ స్కోరు 39/3 నుంచి తడబడుతూనే దక్షిణాఫ్రికా తమ ఇన్నింగ్స్ కొనసాగించింది. ఆట మొదలైన కొద్దిసేపటికి బవుమా (18)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకొని ఇషాంత్ మూడో రోజు మొదటి దెబ్బ వేశాడు. కానీ మొదటి సెషన్ ముగిసేసరికి ఆ ఆనందం భారత ఆటగాళ్ల నుంచి దూరమైంది. ఎల్గర్, డు ప్లెసిస్ కలిసి ప్రశాంతంగా, చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేశారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిపోవడం కూడా వారికి కలిసొచి్చంది. ఐదు బంతుల వ్యవధిలో మూడు ఫోర్లు కొట్టి ప్లెసిస్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. వేగంగా ఆడిన ఈ జోడీని విడగొట్టడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. ఓవర్లు: 30, పరుగులు: 114, వికెట్లు: 1 రెండో సెషన్: డి కాక్ దూకుడు లంచ్ తర్వాత కొద్ది సేపటికే 91 బంతుల్లో డు ప్లెసిస్ అర్ధసెంచరీ పూర్తవడంతో పాటు ఎల్గర్‌తో భాగస్వామ్యం వంద పరుగులు దాటింది. భారత శిబిరంలో అసహనం పెరిగిపోతున్న దశలో ఎట్టకేలకు అశి్వన్ బ్రేక్ ఇచ్చాడు. వ్యూహాత్మకంగా లెగ్ స్లిప్‌లో ఫీల్డర్‌ను ఉంచి బంతిని వేయగా డు ప్లెసిస్ నేరుగా అక్కడే ఉన్న పుజారా చేతుల్లోకి కొట్టాడు. అయితే తర్వాత వచ్చిన డి కాక్ కూడా ఎల్గర్‌కు చక్కటి సహకారం అందించాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా కీపర్ కొన్ని చూడచక్కటి షాట్లు ఆడాడు. అశి్వన్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అతను, జడేజా వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా 6, 4 బాదడం విశేషం. భాగస్వామ్యాన్ని పడగొట్టే ప్రయత్నంలో విహారి, రోహిత్‌లతో బౌలింగ్ వేయించినా లాభం లేకపోయింది. అశి్వన్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి 79 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్న డి కాక్... విహారి వేసిన తర్వాతి ఓవర్లోనూ మరో రెండు బౌండరీలు బాది ఆధిపత్యం ప్రదర్శించాడు. టీ విరామానికి అర గంట ముందే చీకటిగా మారడంతో ఫ్లడ్‌లైట్లలో మ్యాచ్‌ను కొనసాగించారు. అందుకే భారత్ కొత్త బంతిని తీసుకున్నా అంపైర్ల సూచన మేరకు వెంటనే పేసర్లతో బౌలింగ్ చేయించలేదు. ఓవర్లు: 37, పరుగులు: 139, వికెట్లు: 1 మూడో సెషన్: అశ్విన్ మెరిసె... విరామం తర్వాత కూడా ఎల్గర్, డి కాక్ల జోరు కొనసాగింది. వీరిద్దరు భారత బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ పరుగులు సాధించారు. కొత్త బంతితో ఇషాంత్, షమీ ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో రెండు వైపుల నుంచి అశ్విన్, జడేజాలే భారం మోశారు. ఎల్గర్‌ను అవుట్ చేసి భారత్ కాస్త ఊపిరి పీల్చుకుంది.అశ్విన్ ఓవర్లో వరుస బంతుల్లో 6, 4 బాదిన డి కాక్ 149 బంతుల్లో కెరీర్లో ఐదో సెంచరీని సాధించాడు. అయితే డి కాక్‌ను అవుట్ చేసి అశ్విన్ ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఫిలాండర్ (0)ను వెనక్కి పంపి అశి్వన్ ఐదు వికెట్ల ఘనతను పూర్తి చేసుకున్నాడు. ఓవర్లు: 31, పరుగులు: 93, వికెట్లు: 3 ఆ రెండు క్యాచ్‌లు పట్టి ఉంటే... మూడో రోజు భారత జట్టు మైదానంలో బాగా తడబడింది. రెండు క్యాచ్‌లు చేజారడం మ్యాచ్ గతిని మార్చేశాయి. 74 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా బౌలింగ్‌లో ఎల్గర్ ఇచి్చన క్యాచ్‌ను సాహా వదిలేశాడు. ఆ తర్వాత ఎల్గర్ మరో 86 పరుగులు జోడించాడు. విహారి బౌలింగ్‌లో 7 పరుగుల వద్ద డి కాక్ ఇచి్చన క్యాచ్‌ను సిల్లీ పాయింట్లో రోహిత్ అందుకోవడంలో విఫలమయ్యాడు. సరైన సమయంలో కిందకు వంగడంలో రోహిత్ విఫలమయ్యాడు. ఇది మరో 104 పరుగులు నష్టాన్ని కలిగించింది. ఇద్దరూ సిక్సర్లతోనే... దక్షిణాఫ్రికా జట్టులో సెంచరీ సాధించిన ఇద్దరు బ్యాట్స్‌మెన్ కూడా సిక్సర్లతోనే వాటిని పూర్తి చేయడం విశేషం. అశి్వన్ బౌలింగ్‌లో స్లాగ్ స్వీప్‌తో ఎల్గర్ శతకం చేరగా... అశ్విన్ బౌలింగ్‌లోనే కవర్స్ మీదుగా సిక్సర్ బాది డి కాక్ ఆ మైలురాయిని అందుకున్నాడు. 2002లో పాకిస్తాన్‌పై పాంటింగ్, స్టీవ్ వా మాత్రమే ఇదే తరహాలో ఒకే ఇన్నింగ్స్‌లో శతకాలు సాధించారు. సూపర్ ఇన్నింగ్స్... భారత గడ్డపై ఒక విదేశీ బ్యాట్స్‌మన్ టెస్టుల్లో సాధికారికంగా బ్యాటింగ్ చేయడం చాలా అరుదు. సుదీర్ఘ సమయం పాటు క్రీజ్‌లో గడపడం, స్పిన్నర్ల పరీక్షకు ఎదురుగా నిలవడం అంత సులువు కాదు. అయితే దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ తన కెరీర్లోనే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌తో జట్టు కుప్పకూలిపోకుండా కాపాడాడు. 2015లో 0–3తో చిత్తుగా ఓడిన బృందంలో ఎల్గర్ కూడా సభ్యుడే. ఆ సిరీస్‌లో 7 ఇన్నింగ్స్‌లలో కేవలం 137 పరుగుల పేలవ ప్రదర్శనతో అతను వెనుదిరగ్గా... ఈ సారి తొలి ఇన్నింగ్స్‌లో అంతకంటే ఎక్కువ పరుగులు సాధించడం విశేషం. ఓపెనర్‌గా వచ్చి మూడు సందర్భాల్లో చివరి వరకు నాటౌట్‌గా నిలిచిన రెండో బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు ఉన్న ఎల్గర్ అసలు సమయంలో తన సత్తాను ప్రదర్శించగలిగాడు. క్రీజ్‌లో ఉన్నంతసేపు ఏ దశలోనూ తడబడకుండా, పూర్తి ఆత్మవిశ్వాసంతో, బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ చక్కటి షాట్లు ఆడటం ఎల్గర్ ఇన్నింగ్స్‌లో కనిపించింది. ఇదే అతడిని ప్రత్యేకంగా నిలబెట్టింది. మ్యాచ్ రెండో రోజు అవతలి ఎండ్‌లో మూడు వికెట్లు పడ్డా, ఎల్గర్ మాత్రం ఒత్తిడికి లోను కాకుండా స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించాడు. జడేజా బౌలింగ్‌లో అతను బాదిన సిక్సరే అందుకు నిదర్శనం. శుక్రవారం రెండు సెంచరీ భాగస్వామ్యాల్లో కీలక పాత్రతో ఎల్గర్ జట్టును నడిపించాడు. 112 బంతుల్లో అతని అర్ధసెంచరీ పూర్తయింది. ఆ తర్వాత జడేజా వేసిన ఓవర్లో దూకుడు అతని ఆత్మవిశ్వాసాన్ని చూపించింది. ఈ ఓవర్లో ఎల్గర్ 2 భారీ సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టడం విశేషం. షమీ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి 90ల్లోకి చేరుకున్న ఎల్గర్‌కు కెరీర్లో 12వ సెంచరీ సాధించేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. సెంచరీ తర్వాత కూడా జోరు తగ్గించని ఎల్గర్ మరికొన్ని షాట్లతో అలరించాడు. ఏడు బంతుల వ్యవధిలో 3 ఫోర్లు కొట్టి 150 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అయితే తన అత్యధిక స్కోరు 199ను అధిగమించి తొలి డబుల్ సెంచరీ మాత్రం నమోదు చేయలేకపోయాడు. జడేజా బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్‌కు ప్రయత్నించగా బౌండరీ నుంచి వేగంగా దూసుకొచ్చిన పుజారా చక్కటి క్యాచ్ పట్టడంతో ఎల్గర్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ముగిసింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 502/7 డిక్లేర్డ్; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: ఎల్గర్ (సి) పుజారా (బి) జడేజా 160; మార్క్రమ్ (బి) అశి్వన్ 5; బ్రూయిన్ (సి) సాహా (బి) అశి్వన్ 4; పీట్ (బి) జడేజా 0; బవుమా (ఎల్బీ) (బి) ఇషాంత్ 18; డు ప్లెసిస్ (సి) పుజారా (బి) అశ్విన్ 55; డి కాక్ (బి) అశ్విన్ 111; ముత్తుసామి (బ్యాటింగ్) 12; ఫిలాండర్ (బి) అశి్వన్ 0; మహరాజ్ (బ్యాటింగ్) 3; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (118 ఓవర్లలో 8 వికెట్లకు) 385 వికెట్ల పతనం: 1–14, 2–31, 3–34, 4–63, 5–178, 6–342, 7–370, 8–376. బౌలింగ్: ఇషాంత్ శర్మ 14–2–44–1, షమీ 15–3–40–0, అశి్వన్ 41–11–128–5, జడేజా 37–4–116–2, విహారి 9–1–38–0, రోహిత్ 2–1–7–0. ►200 జడేజా టెస్టుల్లో 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. 44వ టెస్టులో ఈ ఘనత సాధించిన అతను అందరికంటే వేగంగా ఈ మైలురాయిని అందుకున్న లెఫ్టార్మ్ బౌలర్‌గా రంగన హెరాత్ (47) రికార్డును సవరించాడు. ఓవరాల్‌గా భారత బౌలర్లలో 37 టెస్టుల్లోనే 200 వికెట్లు తీసిన అశి్వన్ మొదటి స్థానంలో ఉన్నారు. ►27 అశి్వన్ కెరీర్లో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టడం ఇది 27వ సారి. అతను అండర్సన్, బోథమ్ (27)లతో సమంగా నిలిచాడు. ఓవరాల్‌గా మరో ఆరుగురు మాత్రమే అశ్విన్‌కంటే ముందున్నారు. -
ఆటకి డేట్ ఫిక్స్
గేమ్ ఫినిష్ చేశారు హీరోయిన్ తాప్సీ. మరి.. ఎలా ఆడారు? అనే విషయాన్ని మాత్రం వెండితెరపై చూడాల్సిందే. తాప్సీ ప్రధాన పాత్రలో అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఎస్. శశికాంత్ నిర్మించిన చిత్రం ‘గేమ్ ఓవర్’. చక్రవర్తి రామచంద్ర సహ–నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. జూన్ 14న విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘ఈ చిత్రకథ విన్నప్పుడు సరికొత్తగా ఉందనిపించింది. విజయం సాధించే చిత్రం అనిపించింది. ‘ఆనందోబ్రహ్మ’ తర్వాత నా చిత్రాలపై ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకాన్ని ఈ చిత్రం వమ్ము చేయదు’’ అన్నారు తాప్సీ. ‘‘సరికొత్త కథ, కథనాలతో తెలుగు, తమిళ భాషల్లో ఈ ‘గేమ్ ఓవర్’ చిత్రాన్ని నిర్మించాం. మా గత చిత్రాలు ‘లవ్ ఫెయిల్యూర్’, ‘గురు’ విజయాల సరసన ఈ చిత్రం కూడా నిలుస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు. ‘‘ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా తప్పకుండా అలరిస్తుంది’’ అన్నారు దర్శకుడు అశ్విన్. ఈ చిత్రానికి సంగీతం: రోన్ ఏతాన్ యోహాన్, లైన్ ప్రొడ్యూసర్: ముత్తు రామలింగం. -
3,000 కార్లను సమకూర్చుకుంటున్న డ్రైవెన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీ బ్రాండ్ లగ్జరీ కార్ సబ్స్క్రిప్షన్ సర్వీసుల కంపెనీ కార్2డ్రైవ్ హైదరాబాద్‌లో తన సేవలను ప్రారంభించింది. సంప్రదాయ పద్ధతిలో కారు కొనుగోలుకు బదులు.. ఎటువంటి డౌన్ పేమెంట్, రిజిస్ట్రేషన్ చార్జీలు లేకుండా కేవలం చందా చెల్లించడం ద్వారా కస్టమర్ తనకు నచ్చిన కారును ఎంపిక చేసుకోవచ్చు. కారు డ్యామేజ్, రిపేర్లు, బీమా భారం అంతా కంపెనీదే. డ్రైవెన్ ప్రమోట్ చేస్తున్న కార్2డ్రైవ్ బెంగళూరులో కూడా సేవలు అందిస్తోంది. ఒక్కో కారు ఖరీదు రూ.1 కోటి పైనే ఉంటుందని డ్రైవెన్ ఎండీ అశ్విన్ జైన్ శుక్రవారమిక్కడ మీడియాకు చెప్పారు. ‘ప్రస్తుతం కంపెనీ వద్ద 145 లగ్జరీ కార్లున్నాయి. 500 సీసీ అపై సామర్థ్యమున్న సూపర్ ప్రీమియం 55 బైక్‌లు ఉన్నాయి’ అని వివరించారు. కొత్తగా 3,000 వాహనాలు.. దీర్ఘకాలిక చందా, అద్దె విధానంలో కార్లను అందించేందుకు డ్రైవెన్ వచ్చే 12 నెలల్లో 3,000 కార్లను కొనుగోలు చేయనుంది. కస్టమర్ కోరిన మోడల్, ఫీచర్ల ఆధారంగా వాహనాన్ని అందజేస్తారు. ఈ విధానంలో రూ.3 లక్షల కారును సైతం వినియోగదారు ఎంచుకోవచ్చు. వాహనాల కొనుగోలుకు రూ.700 కోట్లు సమీకరించే పనిలో ఉన్నట్టు డ్రైవెన్ భాగస్వామి సయ్యద్ హుస్సేన్ వెల్లడించారు. ‘ఈ–వీ’ పేరుతో షేర్డ్ మొబిలిటీ సేవలను ఏప్రిల్‌లో ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. వచ్చే 18 నెలల్లో ఆరు నగరాల్లో 30,000 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఇందుకోసం వినియోగిస్తామని పేర్కొన్నారు. -
ట్రాఫిక్ పోలీస్ ‘మన్కడింగ్’
బట్లర్‌ను ‘మన్కడింగ్’ ద్వారా అశ్విన్ ఔట్ చేయడం ఎంత వివాదం రేపిందో తెలిసిందే. అయితే కోల్‌కతా పోలీసులు దీనిలో మరో కోణాన్ని చూశారు. వెంటనే దానిని పోస్టర్‌గా మలచి ప్రజల్లో ‘ట్రాఫిక్ అవగాహన’ కోసం వాడుకునే ప్రయత్నం చేశారు. ‘ఆకుపచ్చ లైట్ రాక ముందే ముందుకు వెళ్లవద్దు, గీత దాటితే తప్పించుకోలేరు... అంటూ బెంగాలీలో వ్యాఖ్య రాసి ట్రాఫిక్ ఫోటో కూడా కలిపి పెట్టారు. దీనిపై స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరం. ఎందుకంటే 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో బుమ్రా నోబాల్ కారణంగా బతికిపోయిన ఫఖర్ జమాన్ సెంచరీతో పాక్‌ను గెలిపించడంతో ఇదే తరహాలో జైపూర్ పోలీసులు పోస్టర్లు వేశారు. దేశం తరఫున ఆడే ఆటగాడికి మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ అప్పట్లో స్వయంగా బుమ్రా దీనిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పోలీసులు వాటిని తొలగించాల్సి వచ్చింది. -
‘మన్కడింగ్’ రేపిన దుమారం
జైపూర్: ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్తాన్ బ్యాట్స్‌మన్ బట్లర్‌ను ‘మన్కడింగ్’ ద్వారా ఔట్ చేసి పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ కొత్త వివాదాన్ని తెర మీదకు తెచ్చాడు. అతను నిబంధనల ప్రకారమే వ్యవహరించాడంటూ కొందరు మద్దతు పలుకుతుండగా... భారత టాప్ స్పిన్నర్ చేసింది తప్పేనంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. అయితే తాజా ఘటనపై అశ్విన్ మాత్రం మొదటి నుంచీ ఒకే మాటకు కట్టుబడి ఉన్నాడు. తాను చేసిన దాంట్లో తప్పేమీ లేదని అతను మ్యాచ్ తర్వాత కూడా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడాడు. ‘నేను అలా ఔట్ చేయాలని వ్యూహం ఏమీ రచించుకోలేదు. అది అప్పటికప్పుడు జరిగిపోయిందంతే. నిబంధనలకు అనుగుణంగానే నేను వ్యవహరించాను. క్రీడా స్ఫూర్తి అనే మాటను ఎందుకు ముందుకు తెస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. స్ఫూర్తికి విరుద్ధమని భావిస్తే నిబంధనలే మార్చేయండి. ఎప్పుడో 1987 ప్రపంచకప్‌లో జరిగిన ఘటనతో దీనిని పోల్చవద్దు. నాటి మ్యాచ్‌లో నేను గానీ బట్లర్ గానీ ఆడలేదు. బంతి వేసే సమయంలో కావాలని ఆలస్యం చేశాననే మాటను కూడా నేను అంగీకరించను. అతను అప్పటికే ముందుకు వెళ్లిపోయాడు’ అని అశ్విన్ వివరణ ఇచ్చాడు. 2012లో బ్రిస్బేన్‌లో జరిగిన వన్డేలో కూడా అశ్విన్ ఇదే తరహాలో తిరిమన్నెను ఔట్ చేయగా... భారత తాత్కాలిక కెప్టెన్ సెహ్వాగ్ తమ అప్పీల్‌ను వెనక్కి తీసుకోవడంతో తిరిమన్నె బ్యాటింగ్ కొనసాగించాడు. 2014లో ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన వన్డేలో బట్లర్‌ను ఇదే రీతిలో సేననాయకే మన్కడింగ్ చేశాడు. మరోవైపు గతంలో జరిగిన ఐపీఎల్ కెప్టెన్ల సమావేశంలో మన్కడింగ్ చేయరాదంటూ నిర్ణయం తీసుకున్నామంటూ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా గుర్తు చేయగా... అది నిబంధనలు మారక ముందు జరిగిన సమావేశమని బోర్డు అధికారి ఒకరు స్పష్టం చేశారు. మన్కడింగ్ అంటే..: క్రికెట్ నిబంధనలు రూపొందించే ఎంసీసీ ప్రకారం... బౌలర్ బంతిని వేయడానికి సిద్ధమై, అతని చేతినుంచి ఇంకా బంతి వెళ్లక ముందే నాన్‌స్ట్రైకర్ క్రీజ్ దాటి బయటకు వస్తే బెయిల్స్‌ను పడగొట్టి బౌలర్ సదరు బ్యాట్స్‌మన్ ఔట్ కోసం అప్పీల్ చేయవచ్చు. ఇది సాంకేతికంగా రనౌట్ జాబితాలో వస్తుంది. 2017 అక్టోబర్ 1నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం బౌలర్ బంతిని విసిరే లోగా ఏ సమయంలోనైనా నాన్‌స్ట్రైకర్ క్రీజ్ బయట ఉంటే ఔట్‌గానే పరిగణిస్తారు. నిబంధల ప్రకారం అశ్విన్ చేసింది సరైందే. క్రీడా స్ఫూర్తి ప్రకారం బ్యాట్స్‌మన్‌ను ఔటే చేసే ముందు ఒక సారి హెచ్చరిస్తే బాగుంటుందని అంటారు కానీ నిబంధనల్లో ఎక్కడా ముందుగా హెచ్చరించాలని లేదు. 1947లో సిడ్నీ టెస్టులో ఆసీస్ బ్యాట్స్‌మన్ బ్రౌన్‌ను భారత ఆల్‌రౌండర్ వినూ మన్కడ్ ఇలా ఔట్ చేయడంతో ‘మన్కడింగ్’ అని పేరు వచ్చింది. అశ్విన్ చేసిన పని అతను ఎలాంటివాడో చెబుతుంది. పంజాబ్ జట్టు సభ్యుల కళ్లలోకి నేను చూసినప్పుడు అపరాధ భావం కనిపించింది. అలా చేయడం సరైందో కాదో అభిమానులే నిర్ణయిస్తారు.’ – రాజస్తాన్ కోచ్ ప్యాడీ ఆప్టన్ ఒక వ్యక్తిగా, కెప్టెన్‌గా అశ్విన్ చేసిన పని నిరాశ కలిగించింది. అశ్విన్ కావాలనే బంతి వేయకుండా ఆగిపోయాడు. దానిని డెడ్‌బాల్‌గా ప్రకటించాల్సింది. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. – వార్న్, మాజీ క్రికెటర్ నిబంధనలు ఉన్నాయి. మైదానంలో కెమెరాలూ ఉన్నాయి. నాకు కుప్పలు తెప్పలుగా మెసేజ్‌లు పంపడం ఆపండి. ఏదైనా ఉంటే అశ్విన్ టైమ్‌లైన్‌లో చేసుకోండి. దీనికంటే నా సౌందర్యపోషణ గురించి, లిప్‌స్టిక్ షేడ్ గురించి అడుగుతున్నవారే నయం.’ – అశ్విన్ భార్య ప్రీతి అసహనం క్రీడాస్ఫూర్తి గురించి అశ్విన్‌కు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అంతా రూల్స్ ప్రకారమే జరిగింది. ఏదైనా తప్పు ఉంటే అంపైర్లు, రిఫరీ చూసుకుంటారు. అశ్విన్‌కు నియమాలు ఏమిటో వాటిని ఎలా వాడుకోవాలో బాగా తెలుసు.’ – బీసీసీఐ -
ఎక్కడి నుంచైనా ఓటు వేయనివ్వండి
న్యూఢిల్లీ: దేశంలోని ప్రతీ ఒక్కరు ఓటు వేసే విధంగా అవగాహన పెంచే కార్యక్రమానికి మద్దతు పలకాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ క్రికెటర్లను కూడా భాగం చేస్తూ ట్వీట్ చేశారు. ఇందులో అశ్విన్, శిఖర్ ధావన్, భువనేశ్వర్ పేర్లు ఉన్నాయి. దీనిపై స్పందించిన అశ్విన్... ప్రజాస్వామ్య దేశంలో కీలకమైన ఓటును అందరూ వినియోగించి సరైన నేతను ఎన్నుకోవాలని పిలుపునిచ్చాడు. అయితే పనిలో పనిగా తన వైపు నుంచి మరో విజ్ఞప్తిని కూడా ప్రధానికి పంపాడు. ఐపీఎల్ కారణంగా వేర్వేరు నగరాల్లో ఉండాల్సి వస్తున్న తమ క్రికెటర్ల తరఫున అతను ట్వీట్ చేశాడు. ‘ఐపీఎల్లో ఆడుతున్న ప్రతీ క్రికెటర్ తాము ఎక్కడ ఉంటే అక్కడి నుంచే ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం కల్పించాల్సిందిగా మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ప్రధానికి అశ్విన్ ట్వీట్ చేశాడు. ఇలాంటి అంశంపై నిర్ణయం తీసుకోవాల్సిన ఎన్నికల సంఘం క్రికెటర్ విజ్ఞప్తిపై ఏమైనా స్పందిస్తుందో చూడాలి. -
అశ్విన్ తప్పు చేశాడా!
రాజస్తాన్, పంజాబ్ మ్యాచ్‌లో బట్లర్ ఔట్ కొత్త వివాదాన్ని రేపింది. ఇన్నింగ్స్ 13వ ఓవర్ చివరి బంతికి ఈ ఘటన జరిగింది. బట్లర్‌ను అశ్విన్ ‘మన్కడింగ్’ ద్వారా ఔట్ చేయడమే దీనికి కారణం. అశ్విన్ బంతి వేయబోయే సమయానికే బట్లర్ క్రీజ్ వదిలి కాస్త ముందుకు వచ్చాడు. దాంతో వెంటనే చేతిని వెనక్కి తీసుకున్న అశ్విన్ బెయిల్స్‌ను పడగొట్టి అప్పీల్ చేశాడు. థర్డ్ అంపైర్ కూడా దానిని ఔట్‌గానే ప్రకటించడంతో బట్లర్ వెనుదిరగాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాదోపవాదం కూడా చోటు చేసుకుంది. నిబంధనల (రూల్ 41.16) ప్రకారమైతే థర్డ్ అంపైర్ చేసింది సరైందే. కానీ సుదీర్ఘ కెరీర్లో ‘జెంటిల్మన్’గా గుర్తింపు ఉన్న అశ్విన్... ఎలాగైనా వికెట్ తీయాలనే ప్రయత్నంలో ఇలా చేయడం అందరినీ ఆశ్చర్యపరచింది. బంతిని వేసేందుకు ముందుకు వచ్చిన అశ్విన్ భుజాల వరకు చేతిని తెచ్చి అర క్షణం ఆగినట్లు రీప్లేలో కనిపించింది. బట్లర్ క్రీజ్ దాటేవరకు కావాలనే అతను వేచి చూసినట్లు అనిపించింది. ఇదే ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణమై అశ్విన్ క్రీడా స్ఫూర్తిని ప్రశ్నించేలా చేసింది. ‘‘మన్కడింగ్ ఘటనపై అసలు చర్చే అనవసరం. అదేమీ కావాలని చేసింది కాదు. అలా జరిగిపోయిందంతే. నా బౌలింగ్ యాక్షన్ పూర్తి కాకముందే అతను క్రీజ్ వదిలాడు. ఈ విషయంలో నేను స్పష్టంగా ఉన్నా. ఇలాంటి చిన్న చిన్న విషయాలే మ్యాచ్‌ను మలుపు తిప్పుతాయి కాబట్టి బ్యాట్స్‌మన్ జాగరూకతతో ఉండటం అవసరం.’’ –అశ్విన్, పంజాబ్ కెప్టెన్ -
అడిలైడ్ అందేందుకు ఆరు వికెట్లు
అడిలైడ్: పట్టును మరింత బిగిస్తూ, పై చేయిని కొనసాగిస్తూ, ప్రత్యర్థి వికెట్లను ఒకదాని వెంట ఒకటి పడగొడుతూ అడిలైడ్ టెస్టులో భారత్ విజయం ముంగిట నిలిచింది. మ్యాచ్‌ను పూర్తి నియంత్రణలోకి తీసుకుని, ప్రత్యర్థికి పరాజయం తప్పదనే పరిస్థితి కల్పించింది. బ్యాట్స్‌మెన్ బాధ్యత నెరవేర్చడంతో 323 పరుగుల కఠిన లక్ష్యం విధించి... బౌలర్లు మరింత మెరుగ్గా రాణించడంతో నాలుగో రోజు ఆట ముగిసేసరికి 104 పరుగులకే 4 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను ఆత్మరక్షణలోకి నెట్టింది. గెలవాలంటే కోహ్లి సేన ఆరు వికెట్లు పడగొట్టాల్సి ఉండగా, ఆతిథ్య జట్టు మరో 219 చేయాలి. క్రీజులో ఉన్న షాన్ మార్‡్ష (92 బంతుల్లో 31 బ్యాటింగ్; 3 ఫోర్లు), ట్రావిస్ హెడ్ (37 బంతుల్లో 11 బ్యాటింగ్; 1 ఫోర్) మినహా మరో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ లేనందున ‘డ్రా’గా ముగించాలన్నా వారు సోమవారమంతా ఆడాల్సి ఉంటుంది. అశ్విన్ (2/44) స్పిన్‌తో పాటు, ప్రభావవంతంగా బంతులేస్తున్న షమీ (2/15), ఇషాంత్, బుమ్రాలను తట్టుకుని నిలవడం ఏమంత సులువు కాదు. కాబట్టి... కంగారూల కథ చివరి రోజు రెండో సెషన్‌లోపే ముగిసేలా కనిపిస్తోంది. అంతకుముందు 151/3తో ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా 307 పరుగులకు ఆలౌటైంది. భారత్ చివరి 4 వికెట్లు 4 పరుగులకే చేజార్చుకుంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా (204 బంతుల్లో 71; 9 ఫోర్లు); అజింక్య రహానే (147 బంతుల్లో 70; 7 ఫోర్లు) అర్ధశతకాలతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. రిషభ్ పంత్ (16 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్స్) ఎదురుదాడితో పరుగులు రాబట్టాడు. ఆసీస్ బౌలర్లలో లయన్ (6/122) ఆరు వికెట్లు పడగొట్టగా, స్టార్క్ (3/40)కు మూడు వికెట్లు దక్కాయి. అద‘రహానే’... టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో కోహ్లి, పుజారా తర్వాత నమ్మదగ్గ బ్యాట్స్‌మన్ అయిన వైస్ కెప్టెన్ అజింక్య రహానే చాలా రోజుల తర్వాత చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. జట్టుకు బాగా అవసరమైన సమయంలో పుజారాతో కలిసి నాలుగో వికెట్‌కు 87 పరుగులు జోడించాడు. ఉదయం సెషన్‌ను వీరిద్దరూ నింపాదిగా ప్రారంభించారు. వ్యక్తిగత స్కోరు 40తో బరిలో దిగిన పుజారా కాసేపటికే అర్ధశతకం (140 బంతుల్లో) అందుకున్నాడు. 17 పరుగుల వద్ద ఉండగా అంపైర్ క్యాచ్ ఔట్ ఇచ్చినా సమీక్ష కోరి రహానే బయటపడ్డాడు. తర్వాత నుంచి అతడు వేగం పెంచాడు. అయితే, లంచ్‌కు కొద్దిగా ముందు పుజారాను లయన్ పెవిలియన్ పంపి ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. అర్ధ శతకం (111 బంతుల్లో) పూర్తి చేసుకుని రహానే ఊపుమీదుండగా... సహకరించాల్సిన స్థితిలో రోహిత్‌శర్మ (1) మరింత పేలవంగా ఔటయ్యాడు. క్రీజు వదలి ముందుకొచ్చిన అతడు సిల్లీ పాయింట్లో సులువైన క్యాచ్ ఇచ్చాడు. పంత్ ఔటయ్యాక అశ్విన్ (5)ను స్టార్క్ పెవిలియన్‌కు పం పాడు. స్కోరును సాధ్యమైనంత పెంచే ఉద్దేశంతో రివర్స్ స్వీప్‌నకు యత్నించిన రహానే... స్టార్క్‌కు చిక్కాడు. తొలి బంతికే భారీ షాట్ ఆడబోయి షమీ (0) వెనుదిరిగాడు. ఏడు బంతుల వ్యవధిలో ఈ మూడు వికెట్లు పడిపోయాయి. ఇషాంత్ (0)ను పెవిలియన్ పంపి స్టార్క్ భారత్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. ఆసీస్... ఆపసోపాలు ఒకరికి ఇద్దరు బ్యాట్స్‌మెన్ నిలిస్తేనే ఛేదించగలిగే భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఆస్ట్రేలియాకు ఇషాంత్ మొదటి ఓవర్లోనే చుక్కలు చూపాడు. రెండో బంతికే ఓపెనర్ అరోన్ ఫించ్ (11)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కానీ, బ్యాట్స్‌మన్ సమీక్ష కోరగా నోబాల్‌గా తేలింది. తర్వాత వంతుగా వచ్చిన షమీ... ఇంకా కట్టుదిట్టంగా బంతులేశాడు. అశ్విన్‌కు 9వ ఓవర్లో బంతినివ్వడం ఫలితమిచ్చింది. అతడి బౌలింగ్‌లో ఫించ్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. అయితే రీప్లేలో బంతి ఫించ్ బ్యాట్‌కు తాకలేదని తేలింది. ఫించ్ సమీక్ష కోరి ఉంటే బతికిపోయేవాడు! కంగారూలు 28/1తో టీకి వెళ్లారు. విరామం అనంతరం హారిస్ (26)ను వెనక్కు పంపి షమీ బ్రేక్ ఇచ్చాడు. మరోసారి క్రీజులో పాతుకుపోయేందుకు యత్నిస్తున్న ఉస్మాన్ ఖాజా (8)ను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. మార్‡్షకు కొద్దిసేపు తోడ్పాటు అందించిన హ్యాండ్స్కోంబ్(14)... షమీ బౌలింగ్‌లో పుల్ చేయబోయి మిడ్ వికెట్లో పుజారాకు క్యాచ్ ఇచ్చాడు. జట్టు 84/4తో నిలిచిన సందర్భంలో మార్‡్ష, హెడ్ జోడీ 12 ఓవర్లపైగా వికెట్ కాపాడుకుని రోజును ముగించింది. సోమవారం ఇదీ సీన్... అడిలైడ్‌లో 315 పరుగులే ఇప్పటివరకు ఆసీస్‌కు అత్యధిక ఛేదన. అది కూడా 1902లో ఇంగ్లండ్‌పై సాధించింది. 323 లక్ష్యాన్ని అందుకుని వారిప్పుడు ఈ రికార్డును తిరగరాయాలంటే సోమవారం మార్‡్ష, హెడ్ సామర్థ్యానికి మించి ఆడాలి. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లో మార్‡్ష టచ్‌లోకి వచ్చాడు. హెడ్ తొలి ఇన్నింగ్స్‌లో మంచి స్కోరు చేశాడు. వీరితో పాటు టిమ్ పైన్ ఒక సెషన్ అయినా నిలవాల్సి ఉంటుంది. భారత పేస్ త్రయం, ఆఫ్ స్పిన్నర్ అశ్విన్‌ను ఎదుర్కొంటూ ఇదేమంత సులువు కాదు. పంత్ పటాకా... భారత ఇన్నింగ్స్‌లో కాసేపే అయినా, రిషభ్ పంత్ ఆట హైలైట్‌గా నిలిచింది. లంచ్ నుంచి రాగానే పంత్... లయన్‌పై విరుచుకుపడి మూడు ఫోర్లు, సిక్స్ బాదాడు. స్వే్కర్ లెగ్ దిశగా అతడు కొట్టిన సిక్స్‌కు బంతి డగౌట్ రూఫ్‌పై పడింది. కానీ, మరుసటి ఓవర్ తొలి బంతికే లయన్ తన ఆట కట్టించాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 250 ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 235 భారత్ రెండో ఇన్నింగ్స్: రాహుల్ (సి) పైన్ (బి) హాజల్‌వుడ్ 44; విజయ్ (సి) హ్యాండ్స్కోంబ్ (బి) స్టార్క్ 18; పుజారా (సి) ఫించ్ (బి) లయన్ 71; కోహ్లి (సి) ఫించ్ (బి) లయన్ 34; రహానే (సి) స్టార్క్ (బి) లయన్ 70; రోహిత్ శర్మ (సి) హ్యాండ్స్కోంబ్ (బి) లయన్ 1; పంత్ (సి) ఫించ్ (బి) లయన్ 28; అశ్విన్ (సి) హారిస్ (బి) స్టార్క్ 5; ఇషాంత్ (సి) ఫించ్ (బి) స్టార్క్ 0; షమీ (సి) హారిస్ (బి) లయన్ 0; బుమ్రా (0 నాటౌట్); ఎక్స్‌ట్రాలు 36; మొత్తం (106.5 ఓవర్లలో ఆలౌట్) 307. వికెట్ల పతనం: 1–63, 2–76, 3–147, 4–234, 5–248, 6–282, 7–303, 8–303, 9–303, 10–307. బౌలింగ్: స్టార్క్ 21.5–7–40–3; హాజల్‌వుడ్ 23–13–43–1; కమిన్స్ 18–4–55–0; లయన్ 42–7–122–6; హెడ్ 2–0–13–0. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: ఫించ్ (సి) పంత్ (బి) అశ్విన్ 11; హారిస్ (సి) పంత్ (బి) షమీ 26; ఖాజా (సి) రోహిత్ (బి) అశ్విన్ 8; షాన్ మార్‡్ష (31 బ్యాటింగ్); హ్యాండ్స్కోంబ్ (సి) పుజారా (బి) షమీ 14; హెడ్ (11 బ్యాటింగ్); ఎక్స్‌ట్రాలు 3; మొత్తం: (49 ఓవర్లలో 4 వికెట్లకు) 104. వికెట్ల పతనం: 1–28, 2–44, 3–60, 4–84. బౌలింగ్: ఇషాంత్ 8–3–19–0; బుమ్రా 11–5–17–0; అశ్విన్ 19–4–44–2; షమీ 9–3–15–2; విజయ్ 2–0–7–0. హారిస్ వికెట్ తీసిన షమీ ఉత్సాహం -
ఆడుకోనిచ్చారు..
ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ అనుభవ లేమిని టీమిండియా బౌలర్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. అంతగా పేరు లేని వారిని అడ్డుకోలేకపోయారు. రోజంతా బంతులేసినా... పార్ట్‌టైమర్ హనుమ విహారితో పాటు ఆఖరికి కెప్టెన్ విరాట్ కోహ్లి సైతం రంగంలోకి దిగినా ఆలౌట్ చేయలేక పోయారు. ఫలితంగా ప్రాక్టీస్ మ్యాచ్‌లో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఎలెవెన్... భారత తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకుంది. అయితే... బుమ్రా, భువనేశ్వర్ బౌలింగ్‌కు దిగనందున మనం పూర్తిగా తేలిపోయామనడానికి వీల్లేదు. సిడ్నీ: టీమిండియా బ్యాట్స్‌మెన్‌కు మంచి ప్రాక్టీస్నిచ్చిన సన్నాహక మ్యాచ్... బౌలర్లకు మాత్రం కొంత కఠినం గానే సాగుతోంది. శుక్రవారమంతా శ్రమించినా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఎలెవెన్ ఇన్నింగ్స్‌కు వారు ముగింపు పలకలేకపోయారు. ఓపెనర్లు డీ ఆర్సీ షార్ట్ (91 బం తుల్లో 74; 11 ఫోర్లు), మ్యాక్స్ బ్రయాంట్ (65 బంతుల్లో 62; 9 ఫోర్లు, 1 సిక్స్)ల దూకుడైన ఆరంభంతో పాటు వికెట్ కీపర్ హ్యారీ నీల్సన్ (106 బంతుల్లో 56 నాటౌట్; 4 ఫోర్లు), అరోన్ హార్డీ (121 బంతుల్లో 69; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో మూడోరోజు ఆట ముగిసే సమ యానికి ప్రత్యర్థి జట్టు 6 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. భారత పేసర్లలో మొహమ్మద్ షమీ (3/67) ఫర్వాలేదనిపించగా, ఇషాంత్‌శర్మ (0/57), ఉమేశ్ యాదవ్ (1/81), జడేజా (0/37) ప్రభావం చూపలేకపోయారు. అశ్విన్ (1/63) పొదుపుగా బౌలింగ్ చేశాడు. ముందు వారు... తర్వాత వీరు తొలి వికెట్‌కు 114 పరుగులు జోడించి షార్ట్, బ్రయాంట్ సీఏ ఎలెవెన్‌కు శుభారంభమిచ్చారు. ముగ్గురు పేసర్లను సమర్థంగా ఎదుర్కొన్న వీరు ఓవర్‌కు ఆరు రన్‌రేట్‌తో పరుగులు రాబట్టారు. అశ్విన్ బంతినందుకుని బ్రయాంట్‌ను బౌల్డ్ చేయడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. కొద్దిసేపటికే షార్ట్‌ను షమీ వెనక్కుపంపాడు. జేక్ కార్డర్ (38), కెప్టెన్ వైట్మన్ (35) మూడో వికెట్‌కు 60 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నడిపించారు. అయితే, 21 పరుగుల వ్యవధిలో వీరిద్దరితో పాటు పరమ్ ఉప్పల్ (5), మెర్లో (3)లను ఔట్ చేసిన భారత్ పట్టు బిగించినట్లే కనిపించింది. 234/6తో నిలిచిన జట్టును ఏడో వికెట్‌కు అభేద్యంగా 122 పరుగులు జోడించి నీల్సన్, హార్డీ ఆదుకున్నారు. ప్రధాన బౌలర్లు ఈ భాగస్వామ్యాన్ని విడదీయలేకపోవడంతో హనుమ విహారితో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా బౌలింగ్‌కు దిగాడు. మ్యాచ్‌కు శనివారం ఆఖరి రోజు. సీఏ ఎలెవెన్ ఇన్నింగ్స్‌ను ఎంత త్వరగా ముగిస్తే మన బ్యాట్స్‌మెన్‌కు అంత ఎక్కువ ప్రాక్టీస్ దొరుకుతుంది. లయన్‌తో పోలిక అనవసరం: అశ్విన్ ఆస్ట్రేలియా ఆఫ్ స్పినర్ నాథన్ లయన్‌తో తనను పోల్చడం పట్ల భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒకింత తీవ్రంగా స్పందించాడు. అశ్విన్ కొంతకాలంగా విదేశీ గడ్డపై టెస్టుల్లో విఫలమవుతున్నాడు. ఇదే సమయంలో లయన్ ఎక్కడైనా వికెట్లు తీస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరినీ పోల్చి చూడటం తగదని అశ్విన్ పేర్కొన్నాడు. తమ ఇద్దరి శైలి మధ్య వైరుధ్యాన్ని చెబుతూనే... దక్షిణాఫ్రికా పేసర్ ఫిలాండర్, భారత పేసర్ ఇషాంత్ శర్మల బౌలింగ్ ఒకేలా ఉండదు కదా? అని ఉదహరించాడు. లయన్, తాను ఒకేసారి కెరీర్ ప్రారంభించామని, తమ ఇద్దరి మధ్య చక్కటి సమన్వయం ఉందని, పరస్పరం గౌరవించుకుంటామని పేర్కొన్నాడు. అతడి నుంచి నేర్చుకునేది ఏముంటుందని ప్రశ్నించాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవెన్‌పై సన్నాహక మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్ బాగానే సాగిందని వివరించాడు. తొలి టెస్టు సమయానికి తాను గాడిన పడతానని తెలిపాడు. ఆసీస్ సిరీస్‌లో పిచ్‌లు ఫ్లాట్‌గా ఉంటాయని భావిస్తున్నానని అన్నాడు. అయినా, అప్రమత్తంగా ఉండాల్సిందేనని పేర్కొన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ భాగస్వామ్యాలు ముఖ్యమని వివరించాడు. ఆస్ట్రేలియా జట్టు అంతర్గత సమస్యల గురించి తాము ఆలోచించడంలో అర్థం లేదని, తమ జట్టు బలంపైనే దృష్టి పెట్టినట్లు అశ్విన్ వెల్లడించాడు. -
నేటి నుంచే దేవధర్ ట్రోఫీ
న్యూఢిల్లీ: ఉనికి చాటేందుకు అటు సీనియర్లకు, సత్తా నిరూపించుకునేందుకు ఇటు కుర్రాళ్లకు మరో అవకాశం. ఢిల్లీ వేదికగా మంగళవారం నుంచే దేవధర్ ట్రోఫీ వన్డే టోర్నీ. టీమిండియా వన్డే జట్టులోకి పునరాగమనం ఆశిస్తున్న అజింక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్, దినేశ్ కార్తీక్‌లకు ఈ టోర్నీ కీలకంగా మారనుంది. దీంతోపాటు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్న భారత్ ‘ఎ’కు ఎంపికయ్యేందుకు కుర్రాళ్లకూ ఓ వేదిక కానుంది. మంగళవారం జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’తో భారత్ ‘బి’ తలపడుతుంది. ఈ టోర్నీలో భాగంగా ప్రతి జట్టు రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. ఫైనల్ 27న జరుగుతుంది. అశ్విన్, పృథ్వీ షా, కరుణ్ నాయర్, కృనాల్ పాండ్యా, మొహమ్మద్ సిరాజ్‌లతో కూడిన భారత్ ‘ఎ’ జట్టుకు దినేశ్ కార్తీక్ సారథిగా వ్యవహరించనున్నాడు. శ్రేయస్ అయ్యర్ ఆధ్వర్యంలోని ‘బి’ జట్టులో మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, రోహిత్ రాయుడు, దీపక్ చహర్‌లకు స్థానం దక్కింది. రహానే కెప్టెన్‌గా ఉన్న ‘సి’ జట్టులో సురేశ్ రైనా, అభినవ్ ముకుంద్, శుబ్‌మన్ గిల్, ఆర్. సమర్థ్, వాషింగ్టన్ సుందర్ తదితర ఆటగాళ్లున్నారు. -
నేనేం విఫలమవలేదు...
సాక్షి క్రీడావిభాగం: ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనలో సౌతాంప్టన్‌లో నాలుగో టెస్టు...! ప్రత్యర్థి జట్టు స్పిన్నర్ మొయిన్ అలీ (5/63; 4/71) రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ చెలరేగి భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు.ఇదే సమయంలో అతడి కంటే అన్ని విధాలా మెరుగైన టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విజృంభిస్తాడని అభిమానులు ఆశించారు. కానీ, అశ్విన్ (2/40; 1/84) తేలిపోయాడు. దీంతో అలీతో పోల్చుతూ అతడిపై విమర్శలు వచ్చాయి. పూర్తి ఫిట్‌గా లేడన్న వ్యాఖ్యలు వినిపించాయి. దీనికి తగ్గట్లే అతడిని తర్వాతి టెస్టు ఆడించలేదు. అనంతరం అశ్విన్ బెంగళూరులోని ఎన్సీఏలో పునరావాస శిబిరంలో చేరాడు. ఆ గతమంతా వదిలేస్తే ఇప్పుడు సీనియర్ స్పిన్నర్ ఫిట్నెస్ సంతరించుకుని వెస్టిండీస్‌తో సిరీస్‌కు సిద్ధంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సౌతాంప్టన్ టెస్టు వైఫల్యం, వన్డేలకు దూరం కావడం, కొంతకాలంగా తన ప్రదర్శనతో పాటు పలు అంశాలపై ఇంటర్వ్యూ ఇచ్చాడు. అఫ్గానిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ ముజీబుర్ రెహ్మాన్ నుంచి కొత్త అస్త్రాన్ని నేర్చుకున్నానన్న ఆసక్తికర సంగతిని అందులో వివరించాడు. ఆ విశేషాలేమిటో చదవండి...! సౌతాంప్టన్‌లో వైఫల్యంపై... మూడో టెస్టులోనే సమస్య తలెత్తింది. సౌతాంప్టన్‌లో ఇబ్బందిపడింది వాస్తవమే. అయినా జట్టు గెలుపు కోసం కృషి చేశా. ఓడిపోవడంతో అందరి దృష్టి నా ప్రదర్శనపైనే పడింది. నా బౌలింగ్ ఏమంత దారుణంగా లేదు. క్రికెట్ గురించి అవగాహన ఉన్నవారికి ఈ విషయం తెలుస్తుంది. కానీ, ప్రత్యర్థి స్పిన్నర్‌తో పోల్చి నేను రాణించలేదని అంటున్నారు. శరీరం సహకరించి ఉంటే మెరుగ్గా ఆడేవాడినే కదా? సౌతాంప్టన్ పిచ్‌పై పగుళ్లను నా కంటే మొయిన్ అలీ ఎక్కువ సద్వినియోగం చేసుకున్నాడనే దానిని అంగీకరించను. ఇక్కడ ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ స్పిన్‌ను ధాటిగా ఎదుర్కొన్న తీరును గమనించాలి. పైగా మా బ్యాటింగ్ సందర్భంగా రెండు ఇన్నింగ్స్‌లోనూ వారిదే పైచేయిగా ఉంది. మొత్తమ్మీద ఇంగ్లండ్‌లో నా బౌలింగ్‌ను గాయం ఇబ్బంది పెట్టలేదు. అయినా, ఇదంతా ఆటలో భాగం. తాజా ఫిట్‌నెస్‌పై... ఇంగ్లండ్ నుంచి వస్తూనే పరుగు సాధన చేశా. ఇప్పుడు ఎన్సీఏలో ఉన్నా. తొడ కండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా. బౌలింగ్ శైలిలో మార్పులపై... గాలిలో బంతి వేగం (ఎయిర్ స్పీడ్)ను సరిచేసుకోవాలని భావించా. అందుకనే చేతులను స్వేచ్ఛగా కదుపుతూ బంతిని విసిరే నా పాత బౌలింగ్ శైలికి మారాను. ఈ మార్పు ఫలించింది. అనుకున్నది సాధించా. నాకు నేనే పెద్ద విమర్శకుడిని. ఏది సరైనదో నాకు తెలుసు. కాబట్టి ఇతరుల విమర్శలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. వన్డేల్లో చోటు కోల్పోయిన ఈ ఏడాదిపై... నేను సానుభూతి కోరుకునే రకం కాదు. ఏం జరిగినా మన మంచికే అనుకుంటా. ఈ ఏడాదిలో నా గురించి నేను తెలుసుకున్నా. పరిస్థితులు అనుకూలంగా మారే వరకు ఓపిక పట్టాలి. అవకాశం వచ్చినప్పుడు మానసికంగా దృఢంగా ఉంటూ సద్వినియోగం చేసుకోవాలి. ఈ క్రమంలో శారీరకంగా ఫిట్‌గా ఉండటంపైనా దృష్టిపెట్టా. ప్రతి క్రికెటర్ కెరీర్లో ఇలాంటివి సహజమే. ఇంగ్లండ్ కౌంటీల్లో వన్డేలు ఆడటం నేనింకా పోటీలో ఉండేలా చేసింది. బ్యాటింగ్ సామర్థ్యంపై... గత 18 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క అర్ధ శతకం కూడా చేయనిది వాస్తవమే. కానీ, నాలుగు సార్లు 30లు, రెండుసార్లు 20లు చేశా. రెండుసార్లు సహచరుల కారణంగా రనౌటయ్యా. జట్టు స్కోరే 200 ఉన్నప్పుడు నేను చేసిన 20లు, 30లు ప్రాధాన్యమైనవే అనేది గుర్తించాలి. అయితే, 30లను మరింత పెద్ద స్కోరుగా మలుచుకోవడంపై దృష్టిపెట్టాల్సి ఉంది. ముజీబ్ నుంచి నేర్చుకోవడంపై... ఐపీఎల్లో నాకు కూడా అతడినుంచి నేర్చుకునే అవకాశం కలిగింది. క్యారమ్ బాల్ సహా నేను వేసే బంతులన్నీ అతడు వేస్తాడు. ముజీబ్ నుంచి రివర్స్ అండర్ కటర్ వేయడం ఎలాగో నేను తెలుసుకున్నా. అది టి20ల్లో చాలా బాగా పనిచేస్తుంది. ఆఫ్ స్పిన్నర్ల ప్రాధాన్యంపై... ఈ అంశం రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో వికెట్లు తీయడమే ముఖ్యం అనుకుంటున్నారు. దీంతో ఆఫ్ స్పిన్నర్లకు గడ్డు కాలం నడుస్తోంది. అయితే, ఇంగ్లండ్ పర్యటనలో మొయిన్ అలీ, ఇటీవలి ఆసియా కప్‌లో ముజీబ్, జడేజా, మెహదీ హసన్ రాణించిన సంగతిని మర్చిపోవద్దు. పరిమిత ఓవర్ల క్రికెట్ కెరీర్‌పై... తెల్ల బంతితో ఆడకపోవడంపై ఎలాంటి అసంతృప్తి లేదు. నాతో పాటు జడేజా స్థానంలో వచ్చిన కుల్దీప్, చహల్ అద్భుతంగా రాణిస్తున్నారు. ఇలాంటి మెరుగైన ఆరోగ్యకర పోటీ అనేది ఏ జట్టులోనూ లేదు. అవకాశం కోసం చూడడమే మేం చేయాల్సింది. -
ఆఫ్ స్పిన్నర్లకు లెగ్ స్పిన్ అదనపు బలం
ముంబై: ఆఫ్ స్పిన్నర్‌కు అప్పుడప్పుడు లెగ్ బ్రేక్స్ వేయగల సత్తా ఉంటే అది అదనపు బలమవుతుందని ‘బర్త్ డే బాయ్’ సచిన్ టెండూల్కర్ అన్నాడు. 45వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్న అతను మీడియాతో ముచ్చటించాడు. ఆఫ్ స్పిన్నర్ అయిన అశ్విన్ ఇటీవల సందర్భాన్ని బట్టి లెగ్ బ్రేక్స్ వేస్తున్నాడు. దీనిపై సచిన్ మాట్లాడుతూ ‘వైవిధ్యమనేది ఇక్కడ ఆయుధమవుతుంది. ఎలాగంటే ఒకరికి రెండు, మూడు భాషలు బాగా తెలుసు. అయితే అతడు మరో నాలుగైదు భాషలు నేర్చుకుంటే మంచిదే. బహుభాష కోవిదుడవుతాడు. ఇక్కడ పరిజ్ఞానం పెరుగుతుందే తప్ప తగ్గదు కదా. అలాగే స్పిన్నర్లు వైవిధ్యం చూపగలిగితే వారి అమ్ములపొదిలోని అస్త్రాలు పెరుగుతాయి. అంతేగానీ అలా వేయడం తప్పు అనడం సమంజసం కాదు. ఇది బంతులు సంధించడంలో పురోగమనంగానే భావించాలి తప్ప... దోషంగా చూడకూడదు. ఇలాంటి దురభిప్రాయాల్నే మనం మార్చుకోవాలి. ఎందుకంటే ఆఫ్ స్పిన్నర్లు దూస్రాలతో పాటు గూగ్లీలు వేస్తే తప్పేంటి. దీన్ని ఎందుకు కాదనాలి’ అని అన్నాడు. మారుతున్న కాలంతో పాటే క్రికెట్ కూడా మారుతోందన్నాడు. 1991, 92లోనే ఐపీఎల్ వచ్చివుంటే తన ఆట అలాగే ఉండేదన్నాడు. ఐపీఎల్‌నే చూసుకుంటే... ప్రారంభమైనప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు చెందిందని చెప్పాడు. వన్డే ప్రపంచకప్ (2011) గెలిచిన రోజు ముంబైలో తన కారు టాప్‌పై అభిమానుల గంతులతో ఏర్పడిన సొట్టల్ని ‘హ్యాపీ డెంట్స్’గా అతను అభివర్ణించాడు. -
అశ్విన్ ‘బల్లే బల్లే’ చేయిస్తాడా!
గేల్, ఫించ్, మిల్లర్, యువరాజ్, లోకేశ్ రాహుల్... బ్యాటింగ్ భారాన్ని మోసేందుకు ఈ స్టార్లు సరిపోతారా? అశ్విన్, అక్షర్, ఆండ్రూ టై బౌలింగ్‌తో ప్రత్యర్థిని నిలవరించగలరా? సెహ్వాగ్, వెంకటేశ్ ప్రసాద్‌ల మార్గనిర్దేశం జట్టును టైటిల్ దిశగా తీసుకుపోగలదా? ఐపీఎల్ పదేళ్ల ప్రస్థానంలో పడుతూ లేస్తూ సాగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. లీగ్‌లో ఇప్పటి వరకు ముద్దూ ముచ్చట్లకే పరిమితమైన ప్రీతి జింటా మోముపై సంతోషం విరబూయాలంటే స్టార్లంతా చెలరేగాల్సిందే. సాక్షి క్రీడా విభాగం: ఐపీఎల్లో ఢిల్లీ డేర్డెవిల్స్లాగే పక్కనే ఉన్న మరో ఉత్తరాది జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ది కూడా దాదాపు అదే పరిస్థితి. యువరాజ్ సింగ్ నాయకత్వంలో తొలి ఐపీఎల్లో సెమీస్ చేరిన ఆ జట్టు బెయిలీ కెప్టెన్సీలో 2014లో అత్యుత్తమంగా ఫైనల్ వరకు వెళ్లగలిగింది. ఆ తర్వాత రెండేళ్లు చివరి స్థానానికే పరిమితమై గత ఏడాది ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. దాంతో ఫలితం మారాలంటే జట్టు మారాల్సిందేనంటూ ఒక్క అక్షర్ పటేల్ మినహా అందరినీ వదిలేసింది. ఆ తర్వాత వేలంలో కొందరిని మళ్లీ తీసుకున్నా... మిగతా జట్లతో పోలిస్తే ఎక్కువ భాగం కొత్తవారు కనిపిస్తోంది పంజాబ్ టీమ్‌లోనే. అనుకూలం... కెప్టెన్‌గా గతంలో ఎప్పుడూ చెప్పుకోదగ్గ రికార్డు లేకపోయినా అశ్విన్ ఇప్పుడు జట్టును నడిపించబోతున్నాడు. సౌతిండియా ‘తలైవా’గా ఇప్పటివరకు గుర్తింపు ఉన్న అతను, ‘పాజీ’గా ఇప్పుడు పంజాబీ అభిమానుల ఆశలను నిలబెట్టాల్సి ఉంది. అయితే గతంలో కెప్టెన్‌గా ఉండటంతో పాటు సీనియర్ అయిన యువరాజ్ సింగ్ సలహాలు, మెంటార్‌గా సెహ్వాగ్ వ్యూహాలు అశ్విన్ పనిని సులువు చేస్తాయి. గేల్, మిల్లర్, ఫించ్ రూపంలో భారీ హిట్టర్లు ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. దేశవాళీలో పరుగుల వరద పారించిన మయాంక్ అగర్వాల్‌తో పాటు టీమిండియా రెగ్యులర్ ఆటగాడు రాహుల్ కూడా మ్యాచ్ ఫలితాన్ని శాసించగలడు. ప్రతికూలం: యువరాజ్ మెరుపులు ప్రదర్శించి చాలా కాలమైంది. అతను ఎంత వరకు జట్టుకు ఉపయోగపడగలడో చెప్పలేం. స్వయంగా అశ్విన్ భారత పరిమిత ఓవర్ల జట్టుకు దూరమైపోయాడు. అతని బౌలింగ్‌లో పదును తగ్గిందనేది వాస్తవం. మిల్లర్ సీజన్లో ఒక మ్యాచ్ మినహా ప్రతీ సారి పంజాబ్‌ను ఇబ్బంది పెట్టినవాడే. ఫించ్‌కు ప్రత్యామ్నాయంగా గేల్ అందుబాటులో ఉన్నా... అతని పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. జట్టు వివరాలు: అశ్విన్ (కెప్టెన్), కరుణ్ నాయర్, మనోజ్ తివారి, మయాంక్, అంకిత్, శరణ్, మయాంక్ డగర్, మోహిత్ శర్మ, అక్షర్ పటేల్, మంజూర్ దార్, పర్దీప్, యువరాజ్, ఆకాశ్‌దీప్ నాథ్, రాహుల్ (భారత ఆటగాళ్లు), ఫించ్, మిల్లర్, టై, డ్వార్షుస్, జద్రాన్, గేల్, స్టొయినిస్ (విదేశీ ఆటగాళ్లు). -
ఏడాది శిక్ష... చాలా ఎక్కువ!
బాల్ ట్యాంపరింగ్‌లో స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్ అడ్డంగా దొరకడంతో క్రీడాలోకం ఒక్కసారిగా భగ్గుమంది. క్షమించరాని నేరమంది. వారు చేసింది ఘోరమంది. శిక్షలు పడ్డాక... పశ్చాత్తాపంతో విలపిస్తుంటే అదే ‘లోకం’ అయ్యో పాపమంటోంది. సానుభూతి కురిపిస్తోంది. న్యూఢిల్లీ: బాల్ ట్యాంపరింగ్‌లో తీవ్రమైన శిక్ష ఎదుర్కొంటున్న స్మిత్ విలాపం బహుశా అందర్ని కదిలిస్తోంది. దీంతో అప్పుడు ఛీ అన్నోళ్లే ఇప్పుడు కనికరించాలంటున్నారు. ఐదు రోజుల క్రితం కెప్టెన్ స్మిత్‌పై ఐసీసీ కేవలం ఒక మ్యాచ్ సస్పెన్షన్ విధించడంతో భారత స్పిన్నర్ హర్భజన్ ఐసీసీది ద్వంద్వ నీతంటూ ధ్వజమెత్తాడు. అతనే ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా క్రికెటర్లు స్మిత్, వార్నర్ చేసిన నేరానికి విధించిన ఏడాది శిక్ష చాలా ఎక్కువని... ఏదో ఒక టెస్టు సిరీస్‌కో లేదంటే రెండు సిరీస్‌లకో వేటు వేయాల్సిందని భజ్జీ అన్నాడు. మరో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఆస్ట్రేలియన్లపై సానుభూతి చూపాడు. ‘ప్రపంచం మీ కన్నీళ్లు చూడాలనుకుంది... చూసింది. ఇప్పుడు చూశాక సంతోషించినట్లుంది. కానీ సానుభూతి అనేది పదంలా మాత్రమే కాకుండా నిజంగా చూపిస్తే బాగుంటుంది. దీనినుంచి బయటపడే ధైర్యాన్ని దేవుడు వారికివ్వాలి’ అని అశ్విన్ ట్వీట్ చేశాడు. మోసగాళ్లు, దోషులు అని పతాక శీర్షికల్లో నిందించిన దిన పత్రికలు కూడా ఇవేం శిక్షలంటూ రాశాయి. ‘దిస్ ఈజ్ బాల్ ట్యాంపరింగ్. నాట్ మర్డర్’ (ఇది బాల్ ట్యాంపరింగే... హత్య కాదు), అని, ‘డియర్ ఆస్ట్రేలియా దట్స్ ఎనఫ్ నౌ’ (ఆస్ట్రేలియా... ఇక చాలు) అని పత్రికలు ఆసీస్ ఆటగాళ్లపై నిందలు చాలించాలని కోరాయి. పాక్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియన్ మైకీ అర్థర్ మాట్లాడుతూ స్మిత్‌కు క్రికెటే లోకమని, ఆటకోసమే పరితపిస్తాడని... అతని కెరీర్లో ఇలాంటి ఘటన దురదృష్టకరమని అన్నారు. మళ్లీ పునరాగమనంలో మరింత కష్టపడతాడని... సుదీర్ఘకాలం జట్టుకు సేవలందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. -
జడేజా అవుట్.. అశ్విన్ ఇన్
న్యూఢిల్లీ : ఇరానీ కప్ క్రికెట్ టోర్నమెంట్‌ను దృష్టిలో పెట్టుకుని టీమ్‌ను సెలెక్ట్ చేసిన బీసీసీఐ సీనియర్ స్పిన్నర్ అశ్విన్‌కు చోటు కల్పించింది. గాయంతో బాధపడుతున్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్థానాన్ని అశ్విన్ భర్తీ చేయనున్నాడు. గాయం కారణంగా దేవధర్ ట్రోఫీకి దూరమైన అశ్విన్ ప్రస్తుతం కోలుకోవడంతో రెస్టాఫ్ ఇండియా స్క్వాడ్‌కు ఎంపిక చేసినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ టీమ్‌కు కరుణ్ నాయర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ వంటి యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు. రెస్టాఫ్ ఇండియా జట్టు మార్చ్ 14 నుంచి 18 వరకు నాగపూర్‌లో జరగనున్న మ్యాచ్‌లో రంజీ ట్రోఫీ చాంపియన్స్‌తో తలపడనుంది. రెస్టాఫ్ ఇండియా జట్టు: కరుణ్ నాయర్(కెప్టెన్), పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్, ఆర్. సమర్థ్, మయాంక్ అగర్వాల్, హనుమ విహారీ, కేఎస్ భరత్(వికెట్ కీపర్), అశ్విన్, జయంత్ యాదవ్, షాబాజ్ నదీమ్, అన్మోల్ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ కౌల్, అంకిత్ రాజ్‌పుత్, నవ్‌దీప్ సైనీ, అతీత్ -
అశ్విన్‌కు గాయం... ‘దేవధర్’కు దూరం
న్యూఢిల్లీ: భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గాయంతో దేవధర్ ట్రోఫీకి దూరమయ్యాడు. ఈ నెల 4 నుంచి 8 వరకు జరగనున్న ఈ వన్డే టోర్నీలో అతను భారత్ ‘ఎ’ జట్టు సారథిగా ఎంపికయ్యాడు. అయితే అతను దూరం కావడంతో షాబాజ్ నదీమ్‌ను జట్టులోకి తీసుకున్నారు. అంకిత్ బావ్నేకు ‘ఎ’ జట్టు పగ్గాలు అప్పగించారు. -
అప్పుడు చురకలు.. ఇప్పుడు విషెస్!
సాక్షి, స్పోర్ట్స్: ఇటీవల ఏదో జోక్ చేయబోయి టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేతికి చిక్కి, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హర్షల్ గిబ్స్ నోరు కరుచుకున్న విషయం తెలిసిందే. కానీ వారం కూడా గడవకముందే వీరి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడం, పరిస్థితుల్లో ఎంతో మార్పు రావడంతో క్రికెట్ అభిమానులు ఇది నమ్మలేకపోతున్నారు. నేడు గిబ్స్ జన్మదినం సందర్భంగా భారత బౌలర్ అశ్విన్ సఫారీ మాజీ ఆటగాడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. 'మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలి గిబ్స్. ఈ ఏడాది నీకు కలిసిరావాలంటూ' అశ్విన్ ట్వీట్ చేశాడు. అందుకు ధన్యవాదాలు తెలుపుతూ గిబ్స్ ట్వీట్ ద్వారా బదులిచ్చాడు. మ్యాచ్ ఫిక్సర్‌ను సైతం తమ క్రికెటర్ క్షమించి శుభాకాంక్షలు తెలిపాడని టీమిండియా క్రికెట్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. గిబ్స్ ఫిక్సర్ అని తెలియక కొందరు అశ్విన్‌కు వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారు. అశ్విన్ వర్సెస్ గిబ్స్.. తన కొత్త షూ ప్రత్యేకతలు, పరుగెత్తడంలో ఉండే సౌకర్యం గురించి చెబుతూ అశ్విన్ ఒక షూ వీడియో ట్వీట్ చేశాడు. వికెట్ల మధ్య, అవుట్ ఫీల్డ్‌లో అశ్విన్ చురుగ్గా పరుగెత్తలేడనే అంశాన్ని గుర్తు చేసే విధంగా ‘ఇకనైనా నువ్వు మరింత వేగంగా పరుగెత్తగలవని ఆశిస్తున్నా’ అంటూ ఒకింత వ్యంగ్యంతో గిబ్స్ వ్యాఖ్య వదిలాడు. అయితే దీనిపై వెంటనే స్పందించిన అశ్విన్.. నాకు తిండి పెట్టే మ్యాచ్‌లను ఫిక్స్ చేయకూడదనే నైతిక విలువలు పాటించడంలో మాత్రం చాలా అదృష్టవంతుడిని’ అని ఘాటుగా జవాబిచ్చాడు. దాంతో షాక్‌కు గురైన గిబ్స్... జోక్ చేశానని, దీన్ని ఇంతటితో వదిలేయమన్నాడు. తాను కూడా జోక్ చేశానని, నీతో కలసి డిన్నర్ చేస్తానని ట్వీట్ చేశాడు. గిబ్స్ ఓ ఫిక్సర్ 2000 ఏడాది భారత పర్యటనలో భాగంగా మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో గిబ్స్ దోషిగా తేలి దాదాపు ఏడాదిపాటు నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. తనకు 15000 డాలర్ల ఆఫర్ వచ్చిందని గిబ్స్ తన తప్పు ఒప్పుకున్న విషయం తెలిసిందే. Thanks bud 🤙 have a good day — Herschelle Gibbs (@hershybru) 23 February 2018 -
నీలా ఫిక్సింగ్ చేయడం రాదు!
చెన్నై: పదునైన వ్యాఖ్యలతో దూస్రాలు సంధించడంలో అశ్విన్ తనకు తానే సాటి. తాజాగా అశ్విన్ దెబ్బకు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హెర్షల్ గిబ్స్ విలవిల్లాడాడు! ఏదో జోక్ చేయబోయిన అతను అనవసరంగా ఇరుక్కున్నాడు. వివరాల్లోకెళితే... తన కొత్త షూ ప్రత్యేకతలు, పరుగెత్తడంలో ఉండే సౌకర్యం గురించి చెబుతూ అశ్విన్ ఒక వీడియో ట్వీట్ చేశాడు. వికెట్ల మధ్య, అవుట్ ఫీల్డ్‌లో అశ్విన్ చురుగ్గా పరుగెత్తలేడనే అంశాన్ని గుర్తు చేసే విధంగా ‘ఇకనైనా నువ్వు మరింత వేగంగా పరుగెత్తగలవని ఆశిస్తున్నా’ అంటూ ఒకింత వ్యంగ్యంతో గిబ్స్ వ్యాఖ్య వదిలాడు. అయితే దీనిపై వెంటనే స్పందించిన అశ్విన్ ‘ఈ విషయంలో నీ అంత అదృష్టవంతుడిని కాదు కాబట్టి నిజంగానే వేగంగా పరుగెత్తలేను మిత్రమా. అయితే నాకు తిండి పెట్టే మ్యాచ్‌లను ఫిక్స్ చేయకూడదనే నైతిక విలువలు పాటించడంలో మాత్రం చాలా అదృష్టవంతుడిని’ అని ఘాటుగా జవాబిచ్చాడు. 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో గిబ్స్ దోషిగా తేలి ఆరు నెలల పాటు నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. దాంతో షాక్‌కు గురైన గిబ్స్... తన జోక్‌ను అశ్విన్ తప్పుగా భావించాడని, విషయాన్ని ఇంతటితో వదిలేస్తున్నట్లు మరో ట్వీట్ చేశాడు. దీనిపై మళ్లీ స్పందించిన అశ్విన్... తన ప్రత్యుత్తరం కూడా జోక్ మాత్రమే అంటూ, మున్ముందు కలిసి డిన్నర్ చేద్దామంటూ పిలిచాడు. -
సన్‌రైజర్స్‌కు ధావన్, పంజాబ్‌కు అశ్విన్
సాక్షి, బెంగళూరు: పది సీజన్లు ముగించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదకొండో సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ప్రారంభించింది. క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని, ఉత్కంఠను రెకెత్తిస్తున్న ఈ వేలంలో తొలి ఆటగాడిగా ఉన్న శిఖర్ ధావన్‌ను పాత జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. ఈ వేలంలో ముంబై ఇండియన్స్, పంజాబ్, సన్‌రైజర్స్ జట్లు పోటీపడగా చివరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.5.2 కోట్లకు ధావన్‌ను కొనుగోలు చేసి ధావన్‌పై నమ్మకాన్ని ఉంచింది. నిషేధం విదించక ముందు వరకు 8 సీజన్ల వరకు చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడిన స్టార్ స్పిన్నర్ అశ్విన్‌ను ఆ ఫ్రాంచైజీ వదులుకుంది. వేలంలో 7.6 కోట్ల భారీ ధరకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సొంతం చేసుకుంది. ముంబై ఇండియన్స్, పంజాబ్ జట్లు అశ్విన్ కోసం ఆసక్తి చూపాయి. అయితే సెహ్వాగ్ సూచనతో ప్రీతి జింతా అశ్విన్‌ను కొనుగోలు చేసి విలువైన ఆటగాడిని పంజాబ్‌కు తీసుకున్నారు. -
అశ్విన్ అజేయ శతకం
చెన్నై: బీసీసీఐ అండర్–23 సౌత్‌జోన్ వన్డే లీగ్‌లో ఆంధ్ర జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. కర్ణాటకతో సోమవారం మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలి మ్యాచ్ సెంచరీ హీరో అశ్విన్ హెబర్ (121 బంతుల్లో 137 నాటౌట్; 13 ఫోర్లు, 4 సిక్సర్లు) ఈ మ్యాచ్‌లోనూ మరో భారీ శతకంతో జట్టుకు ఘనవిజయాన్ని అందించాడు. తొలుత కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 324 పరుగులు చేసింది. దేవ్ పడిక్కల్ (112; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో పాటు... నిష్కల్ (67; 6 ఫోర్లు), భరత్ (65; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయడంతో జట్టు భారీ స్కోరు సాధించింది. ఆంధ్ర బౌలర్లలో హరిశంకర్ రెడ్డి, కేవీ శశికాంత్ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం అశ్విన్ జోరుతో ఆంధ్ర 44.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది. రికీ భుయ్ (52; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), చైతన్య (32 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. -
అశ్విన్ చెత్త రికార్డు
సెంచూరియన్: టీమిండియా స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ వికెట్ తీయడానికి సంధించిన బంతులు 177(29.3 ఓవర్లు). తద్వారా విదేశీ పిచ్‌లపై రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ తీయడానికి అశ్విన్ అత్యధిక బంతుల్ని తీసుకున్న అపప్రథను సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా చూస్తే ఇది అశ్విన్‌కు మూడో చెత్త ప్రదర్శనగా చెప్పొచ్చు. అంతకుముందు 2012లో అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో అశ్విన్ వికెట్ తీయడానికి 257 బంతులు అవసరం కాగా, 2011లో వెస్టిండీస్‌తో కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో వికెట్ తీయడానికి 215 బంతులు అవసరమయ్యాయి. ఈ మ్యాచ్‌లో 287 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు నిర్దేశించింది. నాల్గో రోజు ఆటలో భాగంగా దక్షిణాఫ్రికా తన రెండో ఇన్నింగ్స్‌లో 258 పరుగుల వద్ద ఆలౌటైంది. 90/2 ఓవర్ నైట్ స్కోరుతో మంగళవారం ఇన్నింగ్స్ కొనసాగించిన సఫారీలు.. మరో 168 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయారు. దాంతో సఫారీలకు 286 పరుగుల ఆధిక్యం లభించింది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో ఎన్గిడి చివరి వికెట్‌గా అశ్విన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. -
క్రికెట్ చరిత్రలో స్పిన్నర్లు తొలిసారి..
న్యూఢిల్లీ: గడిచిన ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో బ్యాటింగ్ పరంగా చూస్తే భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌లు పరుగుల వరద సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే 2017 స్పిన్నర్లకు కూడా బాగా కలిసొచ్చింది. కచ్చితంగా చెప్పాలంటే గతేడాది స్పిన్నర్స్‌కు సూపర్ ఇయర్‌గా నిలిచింది. టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా స్పిన్నర్లు రెచ్చిపోయి వికెట్లు సాధించారు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో ఒక క్యాలెండర్ ఇయర్లో ఆరు వందలకు పైగా వికెట్లు సాధించిన ఘనతను స్పిన్నర్లు మొదటిసారి తమ ఖాతాలో వేసుకున్నారు. 2017లో స్పిన్నర్లు సాధించిన టెస్టు వికెట్లు 638. ఫలితంగా గతేడాది స్పిన్నర్లు సాధించిన అత్యధిక వికెట్ల రికార్డు(584)ను బద్దలు కొట్టారు. ఓవరాల్‌గా స్పిన్నర్లు ఐదు వందలకు పైగా సాధించింది కేవలం ఐదుసార్లు మాత్రమే. 2001లో 521 టెస్టు వికెట్లను తీసిన స్పిన్నర్లు.. 2004లో 577 వికెట్లు సాధించారు. ఇక 2015లో 554 వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు.గతేడాది అత్యధిక వికెట్లు సాధించిన స్పిన్నర్ల జాబితాలో నాథన్ లయాన్(63), అశ్విన్(56)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. -
అశ్విన్, జడేజా శైలి మార్చుకోవాలి: రహానే
న్యూఢిల్లీ: సీనియర్ స్పిన్నర్లు అశ్విన్, రవీంద్ర జడేజాలిద్దరు దక్షిణాఫ్రికా పిచ్‌లకు అనుగుణంగా తమ బౌలింగ్ శైలి మార్చుకోవాలని భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ రహానే సూచించాడు. జాతీయ టీవీ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ ‘సొంతగడ్డపైనే కాదు విదేశాల్లోనూ వాళ్లిద్దరు విజయవంతం కావాలి. భారత పిచ్‌లపై ఎలా బౌలింగ్ వేయాలో వాళ్లకు బాగా తెలుసు. అలాగే విదేశీ పిచ్‌లపై కూడా తెలుసుకోవాలి. మొయిన్ అలీ (ఇంగ్లండ్), లయన్ (ఆసీస్) దేశం మారితే వాళ్ల శైలి మార్చుకుంటారు. భిన్నమైన శైలితో ఫలితాలు రాబడతారు’ అని అన్నాడు. కెప్టెన్ కోహ్లి, కోచ్ రవి శాస్త్రిలు జట్టులోని ఆటగాళ్లందరికీ మద్దతుగా ఉంటారని, బాగా రాణించేందుకు వెన్నుతట్టి ప్రోత్సహిస్తారని చెప్పుకొచ్చాడు. -
అశ్విన్, జాదవ్‌లపై నిషేదం విధించండి?
సాక్షి, హైదరాబాద్: భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, కేదార్ జాదవ్, హర్భజన్ సింగ్‌ల బౌలింగ్‌పై నిషేదం విధించాలని పాకిస్థాన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఐసీసీని డిమాండ్ చేస్తున్నారు. దీనికి కారణం పాక్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ హఫీజ్ అనుమానస్పద బౌలింగ్‌పై మరోసారి నిషేదం విధించడమే. ఇక అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ చేయడానికి అతడిని గురువారం ఐసీసీ అనర్హుడిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల అబుదాబి వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో హఫీజ్ బౌలింగ్ యాక్షన్‌పై అంపైర్లు సందేహం వ్యక్తం చేశారు. హఫీజ్ బంతులను వేసే సమయంలో తన మోచేతిని నిబంధనలు విరుద్దంగా వంచుతున్నాడని ఐసీసీ పేర్కొంది. ఇలా హఫీజ్ ఆఫ్‌స్పిన్ బౌలింగ్‌పై నిషేధం విధించడం ఇది మూడోసారి. 2014 డిసెంబర్లో తొలిసారి ఐదు నెలల నిషేధం ఎదుర్కొన్న హఫీజ్ తర్వాత 2015 జూన్‌లో వివాదాస్పద బౌలింగ్ యాక్షన్‌తో నిషేధం కారణంగా 12 నెలల పాటు బౌలింగ్ చేయలేదు. ఈ వార్త విన్న హఫీజ్ ట్విట్టర్ వేదికగా తన బాధను వ్యక్త పరిచాడు. ‘తన బౌలింగ్ శైలిని పూర్తిగా మార్చుకున్న తర్వాత కూడా ఐసీసీ నిషేదించడం బాధగా ఉంది. ఇది నన్ను ఎప్పటికి వెనుకడుగేయనివ్వదు. దేశం కోసం ఆడటానికి రెండు సార్లు ఎంతో కష్టపడి నా శైలిని మార్చుకున్నాను.ఇలానే మరింత కష్టపడి దేశం కోసం ఆడుతా’అని ట్వీట్ చేశాడు. ఇక పాక్ అభిమానులు హఫీజ్‌ను ప్రశంసిస్తూ త్వరలో ఐసీసీ నుంచి క్లీన్‌చీట్ అందుతోందని ఈ ఆల్‌రౌండర్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. మరి కొందరు భారత బౌలర్ల యాక్షన్ కూడా నిబద్దనలకు విరుద్దంగా ఉందని వారిపై కూడా నిషేదం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేగాకుండా జాదవ్, అశ్విన్, హర్భజన్ బౌలింగ్ యాక్షన్ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఐసీసీని ప్రశ్నిస్తున్నారు. I don't know kyn icc ko ya nazar nhe ata pic.twitter.com/Ubw6MecWGI — Amir Khan (@Amirkh3456) November 17, 2017 -
అశ్విన్, జడేజాలకు మొండిచేయి
న్యూఢిల్లీ: సీనియర్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు సెలక్షన్ కమిటీ మళ్లీ మొండిచేయి చూపింది. న్యూజిలాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు వారిద్దరిని ఎంపిక చేయలేదు. ప్రస్తుతం అశ్విన్ (తమిళనాడు), రవీంద్ర జడేజా (సౌరాష్ట్ర) రంజీ ట్రోఫీలో తమ రాష్ట్ర జట్ల తరఫున మ్యాచ్‌లు ఆడుతున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో జట్టు సభ్యులైన బ్యాట్స్‌మన్ లోకేశ్ రాహుల్, పేస్ బౌలర్లు ఉమేశ్ యాదవ్, షమీలను కివీస్ సిరీస్ కోసం తప్పించారు. అయితే వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్, యువ పేసర్ శార్దుల్ ఠాకూర్లకు జట్టులో స్థానం కల్పించారు. ఓపెనర్ శిఖర్ ధావన్ తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. తన భార్య అనారోగ్యం వల్ల అతను ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ ఆడలేదు. వెస్టిండీస్‌లో పర్యటించిన కార్తీక్ చివరి సారిగా చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు సభ్యుడిగా ఉన్నాడు. 32 ఏళ్ల ఈ వికెట్ కీపర్ ఆసీస్‌తో ముగిసిన టి20 సిరీస్‌కు ఎంపికైనప్పటికీ... ఆడే అవకాశం రాలేదు. ఈ నెల 22న ముంబైలో జరిగే తొలి వన్డేతో కివీస్‌తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది. 25న పుణేలో రెండో వన్డే, 29న కాన్పూర్‌లో మూడో వన్డే జరుగుతాయి. భారత వన్డే జట్టు: కోహ్లి (కెప్టెన్), రోహిత్ (వైస్ కెప్టెన్), ధావన్, రహానే, మనీశ్ పాండే, జాదవ్, దినేశ్ కార్తీక్, ధోని, పాండ్యా, అక్షర్, కుల్దీప్ యాదవ్, చహల్, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, శార్దుల్ ఠాకూర్. -
అశ్విన్ ‘యో యో’ పాస్
చెన్నై: భారత క్రికెట్ జట్టులోని ప్రధాన క్రికెటర్లలో చురుకుదనం కాస్త ‘తక్కువగా’ కనిపించే ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్‌కు పేరుంది. కొంత మంది ఆటగాళ్లను మైదానంలో ఎక్కడ దాచాలో కూడా తెలీదు అంటూ కెప్టెన్‌గా ఉన్న సమయంలో స్వయంగా ధోని కూడా ఈ విషయాన్ని పరోక్షంగా అనేక సార్లు ప్రస్తావించాడు. టెస్టుల్లో టాప్ స్పిన్నర్‌గా గుర్తింపు ఉన్నా... పరిమిత ఓవర్ల మ్యాచ్‌లలో కొన్నాళ్లుగా అశ్విన్‌ను పక్కన పెడుతున్న కారణాలలో ఇది కూడా ఒకటి. అయితే ఇప్పుడు అశ్విన్ ఫిట్‌నెస్‌లోనూ తన సత్తా చాటి దేనికైనా సిద్ధమే అంటూ సందేశం పంపించాడు. ఇటీవల భారత ఆటగాళ్లకు తప్పనిసరిగా మారిన కఠినమైన ‘యో యో’ టెస్టులో అశ్విన్ పాసయ్యాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో తాను ఈ టెస్టుకు హాజరై సఫలమైనట్లు అశ్విన్ ట్విట్టర్లో వెల్లడించాడు. 20 మార్కుల ఈ టెస్టులో బీసీసీఐ ప్రమాణాల ప్రకారం కనీసం 16.1 మార్కులు స్కోరు చేయాల్సి ఉంటుంది. సీనియర్లు యువరాజ్, రైనాలాంటి వాళ్లు కూడా యో యో టెస్టులో విఫలమైన చోట అశ్విన్ ఆ లైన్‌ను దాటగలగటం విశేషం. రంజీ ట్రోఫీలో భాగంగా ఆంధ్రతో తొలి మ్యాచ్‌లో ఆడిన అశ్విన్... శనివారం నుంచి త్రిపురతో జరిగే మ్యాచ్ కోసం కూడా అందుబాటులో ఉన్నాడు. మరోవైపు మంగళవారం ప్రకటించిన తాజా ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అశ్విన్ మూడు నుంచి నాలుగో స్థానానికి పడిపోయాడు. అశ్విన్‌ను అధిగమించి కగిసో రబడ మూడో స్థానానికి చేరాడు. అండర్సన్, రవీంద్ర జడేజా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. -
వన్డేల్లో ఘోరంగా ఏమీ ఆడలేదు
వన్డేల్లో తన పునరాగమనంపై అంత తొందరేం లేదని, సమయం వచ్చినపుడు తప్పకుండా అవకాశం లభిస్తుందని భారత ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. వన్డే ఫార్మాట్లో తన ప్రదర్శన మెరుగ్గానే ఉందని, మరీ తీసికట్టుగా ఏం లేదని అతను అభిప్రాయపడ్డాడు. ఏదో ఒకరోజు తిరిగి వన్డే జట్టులోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. శ్రీలంక, ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లలో అశ్విన్‌ను ఎంపిక చేయలేదు. -
కౌంటీ క్రికెట్లో అశ్విన్ శుభారంభం
తొలిసారి కౌంటీ క్రికెట్ బరిలోకి దిగిన భారత టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మొదటి మ్యాచ్‌లో రాణించాడు. వార్సెష్టర్‌షైర్ తరఫున ఆడుతున్న అశ్విన్... గ్లూసెస్టర్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 94 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లో తమ జట్టు తరఫున మొత్తం నాలుగు మ్యాచ్‌లు కూడా ఆడాలని భావిస్తున్నట్లు అశ్విన్ చెప్పాడు. అతని నిర్ణయానికి బీసీసీఐ ఆమోదం తెలిపితే అశ్విన్, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు దూరమవుతాడు. -
దుబాయ్‌లో అశ్విన్ అకాడమీ
చెన్నై: సీనియర్ సహచరుడు ధోని బాటలోనే భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా దుబాయ్‌లో క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయనున్నాడు. జనరేషన్ నెక్ట్స్ పేరుతో నిర్వహించే ఈ అకాడమీలో చిన్నారులకు శిక్షణ ఇస్తారు. ఇదే పేరుతో అశ్విన్‌కు చెన్నైలో ఇప్పటికే సొంత అకాడమీ ఉంది. అకాడమీ కోసం కోచింగ్‌కు సంబంధించిన ప్రత్యేక ప్రోగ్రామ్‌ను అశ్విన్ స్వయంగా రూపొందించడం విశేషం. ఈ నెల చివర్లో అకాడమీ ప్రారంభమవుతుంది. దీనికి డైరెక్టర్‌గా మాజీ క్రికెటర్, కెన్యా క్రికెట్ సీఈఓ కోబస్ ఒలివర్‌ను అశ్విన్ నియమించాడు. -
కోహ్లి సేన కొత్త చరిత్ర
-
కౌంటీ క్రికెట్లో అశ్విన్
పల్లెకెలె: భారత క్రికెట్ జట్టు అగ్రశ్రేణి ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లండ్‌లో జరిగే కౌంటీ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి ఆడనున్నాడు. అతను వొర్సెస్టర్‌షైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. ‘శ్రీలంకతో టెస్టు సిరీస్ ముగియడంతో చతేశ్వర్ పుజారా కౌంటీల్లో నాటింగ్హమ్షైర్ జట్టు తరఫున మళ్లీ ఆడేందుకు వెళ్లనున్నాడు. అశ్విన్‌కు కూడా మేము అనుమతి ఇచ్చాం. వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో భారత జట్టు ఐదు టెస్టులు ఆడనుంది. కౌంటీల్లో ఆడటం ద్వారా అక్కడి పరిస్థితులపై వీరిద్దరికీ అవగాహన ఏర్పడుతుంది’ అని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు.