Aakashavaani Teaser: Director SS Rajamouli Released By Aakashavaani Movie Teaser - Sakshi
Sakshi News home page

ఆకాశవాణి టీజర్‌: కట్టిపడేస్తోన్న విజువల్స్‌

Published Fri, Mar 5 2021 4:16 PM | Last Updated on Fri, Mar 5 2021 4:56 PM

SS Rajamouli Unveiled Aakashavaani Teaser - Sakshi

దర్శకధీరుడు రాజమౌళి దగ్గర సహాయకుడిగా పని చేసిన అశ్విన్‌ గంగరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆకాశవాణి. ఎమ్‌ఎమ్‌ కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా టీజర్‌ను డైరెక్టర్‌ రాజమౌళి శుక్రవారం రిలీజ్‌ చేశాడు. పచ్చని ప్రకృతి మధ్యలోకి, స్వచ్ఛమైన గాలిని పీల్చే గిరిజనుల మధ్యలోకి మనల్ని తీసుకువెళ్తున్నట్లుగా ఉందీ టీజర్‌. చెట్టూపుట్టను నమ్ముకునే అడవి బిడ్డల కథలను, వ్యథలను కళ్లకు కట్టినట్లు చెప్పే ప్రయత్నమే ఈ సినిమా అనిపిస్తోంది.

కరెంటు లేక అర్ధరాత్రి కూడా కాగడాలు పట్టుకుని నడవడం వారి పరిస్థితిని వివరిస్తోంది. చూడటానికి ఎంతో బాగున్న ఈ టీజర్‌లో ఇక్కడేదో తప్పు జరుగుతుంది శీను అన్న డైలాగ్‌ ఒక్కటే ఉంది. ఇక మర్రిచెట్టు ఊడలను పట్టుకుని ఊయలూగుతున్న బాలుడు, మరో ఊడకు రేడియో తగిలించడం చూస్తుంటే ఈ సినిమా మనల్ని గత స్మృతుల్లోకి లాక్కెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే ఈ టీజర్‌పై ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోయాడు రాజమౌళి.

"ఆ విజువల్స్‌ , మ్యూజిక్‌ ఎంతో కొత్తగా ఉన్నాయి‌. ఈ సినిమాతో అశ్విన్‌ ఎలాంటి మ్యాజిక్‌ చేస్తాడా అని ఆతృతగా ఎదురు చూస్తున్నా" అని పేర్కొన్నాడు. పద్మనాభరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బుర్రా సాయిమాధవ్‌ సంభాషణలు అందిస్తున్నాడు. సురేశ్‌ రగుతు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తుండగా, శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

చదవండి: ‘ఆర్‌ఆర్‌ఆర్’‌ క్లైమాక్స్‌ షూట్‌లో హాలీవుడ్‌ యాక్షన్‌ డైరెక్టర్‌

అనిల్‌ రావిపూడితో మహేశ్‌ మరో సినిమా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement