ఆధిక్యానికి ఆపసోపాలు | India vs England, 3rd Test Day 2, Highlights: Ind 271/6 at stumps | Sakshi
Sakshi News home page

ఆధిక్యానికి ఆపసోపాలు

Published Sun, Nov 27 2016 11:37 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 PM

ఆధిక్యానికి ఆపసోపాలు

ఆధిక్యానికి ఆపసోపాలు

తడబడిన భారత బ్యాటింగ్  
ఆదుకున్న అశ్విన్, జడేజా  
భారత్ 271/6  
ఇంగ్లండ్‌తో మూడో టెస్టు 

ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసిన తర్వాత మన జట్టు అలవోకగా భారీ ఆధిక్యం అందుకోగలదని అంతా అనుకుంటే ప్రత్యర్థి రివర్స్‌లో దెబ్బ కొట్టింది. మరో భారీ స్కోరు సాధించే దిశగా పునాది వేసుకొని రెండో రోజే కోహ్లి సేన పట్టు చేజిక్కించుకోగలదని భావిస్తే అచ్చం మన ఆట కూడా వారినే అనుసరించింది. రుణం తీర్చుకున్నట్లు ఇంగ్లండ్ కూడా క్యాచ్‌లు వదిలేసి కాస్త అవకాశం ఇచ్చినా దానిని పూర్తి స్థారుులో ఉపయోగించుకోలేక రెండో రోజు భారత బ్యాటింగ్‌లో అనూహ్య తడబాటు కనిపించింది.


కోహ్లి, పుజారా 75 పరుగుల భాగస్వామ్యంతో జట్టు ముందుకు దూసుకుపోతున్న సమయంలో ఎనిమిది పరుగుల వ్యవధిలో పడిన మూడు వికెట్లు ఒక్కసారిగా జోరుకు బ్రేక్‌లు వేశారుు. ఆపద్బాంధవుడు కోహ్లి కూడా నిష్క్రమించిన దశలో మన జట్టు మరో 79 పరుగులు వెనుకబడి ఉంది. ఆధిక్యం దక్కడం సంగతి తర్వాత, దానిని కోల్పోయే ప్రమాదం కనిపించింది. అరుుతే ఆల్‌రౌండర్ పదానికి న్యాయం చేస్తూ అశ్విన్, జడేజా అజేయంగా 67 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఈ ఇద్దరితో పాటు జయంత్ కూడా కలిసి ఎంత ఆధిక్యం అందిస్తారనేదే మూడో రోజు కీలకం.

మొహాలీ: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు తొలి ఇన్నింగ్‌‌స ఆధిక్యానికి మరో 13 పరుగుల దూరంలో నిలిచింది. చక్కటి బౌలింగ్‌కు తోడు రెండు అద్భుత ఫీల్డింగ్ ప్రదర్శనలు  ఇంగ్లండ్‌కు ఆధిక్యంపై ఆశలు రేపినా... చివరకు భారత్ రెండో రోజును మెరుగైన స్థితిలోనే ముగించింది. ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్‌‌సలో 6 వికెట్లకు 271 పరుగులు చేసింది. అశ్విన్ (82 బంతుల్లో 57 బ్యాటింగ్; 8 ఫోర్లు), రవీంద్ర జడేజా (59 బంతుల్లో 31 బ్యాటింగ్; 3 ఫోర్లు, 1 సిక్సర్) క్రీజులో ఉన్నారు. అంతకు ముందు కోహ్లి (127 బంతుల్లో 62; 9 ఫోర్లు), పుజారా (104 బంతుల్లో 51; 8 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడి అర్ధసెంచరీలు చేశారు. ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు కేవలం 12 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 3, స్టోక్స్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు 268/8తో తొలి ఇన్నింగ్‌‌సను కొనసాగించిన ఇంగ్లండ్ జట్టు మరో 3.5 ఓవర్లలోనే మిగతా రెండు వికెట్లను కోల్పోరుు 283 పరుగులవద్ద ఆలౌటైంది. ఆధిక్యం దాదాపుగా ఖాయమైపోరుునా, మూడో రోజు మిగిలిన నాలుగు వికెట్లతో సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు సాధించాలని భారత్ పట్టుదలగా ఉంది.

సెషన్ 1: విజయ్ విఫలం
రెండోరోజు ఆరంభంలోనే షమీ ఇంగ్లండ్‌కు షాకిచ్చాడు. తాను వేసిన మొదటి బంతికే రషీద్ (4)ను అవుట్ చేసిన అతను కొద్ది సేపటికే బ్యాటీ (1)ను కూడా పెవిలియన్ పంపించి ఇంగ్లండ్ ఇన్నింగ్‌‌సను ముగించాడు. అనంతరం పార్థివ్ పటేల్ (85 బంతుల్లో 42; 6 ఫోర్లు), విజయ్ (12) భారత ఇన్నింగ్‌‌సను ప్రారంభించారు. ఎనిమిదేళ్ల తర్వాత టెస్టు బరిలోకి దిగిన పార్థివ్ ఆత్మవిశ్వాసంతో, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడాడు. వరుసగా రెండు ఫోర్లతో వోక్స్ బౌలింగ్‌లో జోరు కనబరిచాడు. మరో ఎండ్‌లో 11 పరుగుల వద్ద బట్లర్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోరుున విజయ్, ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. మరుసటి ఓవర్‌లోనే స్టోక్స్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తర్వాత మరో వికెట్ పడకుండా పుజారా, పార్థివ్ జాగ్రత్త పడ్డారు.
ఓవర్లు: 25.5, పరుగులు: 75, వికెట్లు: 3
ఇంగ్లండ్: ఓవర్లు: 3.5, పరుగులు: 15, వికెట్లు: 2
భారత్: ఓవర్లు: 22, పరుగులు: 60, వికెట్లు: 1

 

సెషన్ 2: భారత్ ఆధిపత్యం
లంచ్ విరామానంతరం ఆరంభంలోనే భారత్ పార్థివ్ వికెట్‌ను కోల్పోరుుంది. ఈ దశలో పుజారా, కోహ్లి కలిసి జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్‌‌సను నిర్మించారు. అడపాదడపా బౌండరీలు బాదుతూ స్ట్రరుుక్ రొటేట్ చేశారు. స్టోక్స్ బౌలింగ్‌లో రెండు వరుస ఫోర్లతో పుజారా వేగం పెంచాడు. 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టోక్స్ వేసిన రెండో బంతి... పుజారా బ్యాట్‌కు తగిలి లెగ్‌సైడ్‌లోకి వెళ్లింది. అరుుతే దానిని అందుకోవడంలో కీపర్ బెరుుర్‌స్టో విఫలమయ్యాడు. అనంతరం 100 బంతుల్లో పుజారా అర్ధసెంచరీ పూర్తరుుంది. ఈ సెషన్‌లో వీరిద్దరు 75 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఓవర్లు: 29, పరుగులు: 88, వికెట్లు: 1

సెషన్ 3: ఆ ఇద్దరు ఆదుకున్నారు
148/2తో పటిష్ట స్థితిలో ఉన్న భారత్ టీ విరామం తర్వాత కష్టాల్లో పడింది. రషీద్ వేసిన రెండో బంతికే పుజారా భారీ షాట్‌కు ప్రయత్నించి సెషన్ ఆరంభంలోనే వికెట్ పారేసుకోగా... అతని మరుసటి ఓవర్లోనే రహానే (0) డకౌట్ అయ్యాడు. తర్వాత కోహ్లితో సమన్వయ లోపంతో తొలి టెస్టు ఆడుతున్న కరుణ్ నాయర్ (4) రనౌటయ్యాడు. బట్లర్ కళ్లు చెదిరే ఫీల్డింగ్ ఇంగ్లండ్‌కు ఈ వికెట్‌ను అందించింది. ఈ దశలో కోహ్లికి అశ్విన్ చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరు వేగంగా ఆడి ఆరో వికెట్‌కు 10 ఓవర్లలో 48 పరుగులు జోడించారు. అరుుతే 111 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న కొద్ది సేపటికి స్టోక్స్ బౌలింగ్‌లో కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను బెరుుర్‌స్టో అందుకోవడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం అశ్విన్, జడేజా కలిసి ప్రత్యర్థి జోరుకు అడ్డుకట్ట వేశారు. చకచకా పరుగులు సాధిస్తున్న ఈ జోడీని విడదీసేందుకు ఇంగ్లండ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోరుుంది. ఇంగ్లండ్ కొత్త బంతిని తీసుకున్నా...నాలుగు ఓవర్లలో భారత్ 21 పరుగులు రాబట్టింది. ఈ క్రమంలో అశ్విన్ 77 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
ఓవర్లు: 33, పరుగులు: 123, వికెట్లు: 4

►2 టెస్టుల్లో ఒకే ఏడాది 500 పరుగులు చేసి 50 వికెట్లు పడగొట్టిన రెండో భారత ఆటగాడు అశ్విన్. గతంలో కపిల్‌దేవ్ రెండు సార్లు ఈ ఘనత సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement