jadeja
-
434 పరుగుల తేడాతో...
విరామం తర్వాత మళ్లీ తాజాగా మొదలైన మూడో టెస్టులో యశస్వి జైస్వాల్ విధ్వంసం... కొత్త కుర్రాడు సర్ఫరాజ్ ఖాన్ ప్రతాపం... బౌలింగ్‌లో జడేజా మాయాజాలం... వెరసి భారత్ చరిత్రకెక్కే విజయం సాధించింది. మ్యాచ్ మొదలైన రోజు నుంచీ ప్రతీరోజు భారత్ ఆధిపత్యమే కొనసాగడంతో ఏ మలుపు లేకుండా ఈ టెస్టు నాలుగు రోజుల్లోనే ముగిసింది. ఈ గెలుపుతో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో టెస్టు ఈనెల 23 నుంచి రాంచీలో జరుగుతుంది. రాజ్‌కోట్: టీమిండియా బలగం ముందు ఇంగ్లండ్ ‘బజ్‌బాల్’ ఆట కుదేలైంది. మ్యాచ్ జరిగే కొద్దీ బ్యాటర్ల పరుగుల పరాక్రమం, బౌలర్ల వికెట్ల మాయాజాలం ప్రత్యర్థి జట్టును చిత్తు చేసింది. మరో రోజు ఆట మిగిలి ఉండగానే ఈ మ్యాచ్‌లో భారత్ 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై బ్రహ్మాండ విజయం నమోదు చేసింది. పరుగుల తేడా పరంగా టెస్టుల్లో భారత జట్టుకిదే అతి పెద్ద విజయం. ఇంతకుముందు భారత జట్టు 2021లో ముంబైలో న్యూజిలాండ్‌పై 372 పరుగుల తేడాతో గెలిచింది. ఆట నాలుగో రోజు ఓవర్‌నైట్ స్కోరు 196/2తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ 98 ఓవర్లలో 4 వికెట్లకు 430 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్‌కు 557 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రవీంద్ర జడేజా (5/41), కుల్దీప్ యాదవ్ (2/19), అశ్విన్ (1/19) స్పిన్ దెబ్బకు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 39.4 ఓవర్లలో 122 పరుగులకే కుప్పకూలి ఓడిపోయింది. యశస్వి ‘డబుల్’... ఓవర్‌నైట్ బ్యాటర్లు శుబ్‌మన్ గిల్ (91; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), కుల్దీప్ (27; 3 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. గిల్ రనౌటయ్యాక శనివారం వెన్నునొప్పితో వ్యక్తిగత స్కోరు 104 పరుగులవద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన యశస్వి జైస్వాల్ మళ్లీ క్రీజులోకి వచ్చాడు. అదే దూకుడు కొనసాగిస్తూ యశస్వి జైస్వాల్ (236 బంతుల్లో 214 నాటౌట్; 14 ఫోర్లు, 12 సిక్స్‌లు) తన కెరీర్లో రెండో డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ (72 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ధసెంచరీతో అదరగొట్టాడు. ప్రస్తుత టెస్టు క్రికెట్లోనే విశేషానుభవజు్ఞడు అండర్సన్ వేసిన ఇన్నింగ్స్ 85వ ఓవర్లో యశస్వి హ్యాట్రిక్ సిక్సర్లు అతని విధ్వంసానికి మచ్చుతునకలు కాగా... సర్ఫరాజ్ అంతర్జాతీయ టెస్టుకు కొత్తైన... దూకుడు నాకు పాతే అని మరో అర్ధసెంచరీతో నిరూపించుకున్నాడు. 231 బంతుల్లో జైస్వాల్ ద్విశతకాన్ని సాధించాడు. ఇద్దరు అబేధ్యమైన ఐదో వికెట్‌కు 172 జోడించడం విశేషం. స్పిన్ ఉచ్చులో పడి... కొండత లక్ష్యం కావడంతో ఇంగ్లండ్ బజ్‌బాల్ ఆట చేతులెత్తేసింది. కలిసొచ్చిన స్పిన్ పిచ్‌పై జడేజా పట్టు సాధించాడు. ఆరంభంలోనే డకెట్ (4) రనౌటయ్యాక, క్రాలీ (11)ని బుమ్రా ఎల్బీగా పంపాడు. తర్వాత జడేజా స్పిన్ మాయాజాలంలో పోప్ (3), బెయిర్‌స్టో (4), రూట్ (7) తేలిగ్గానే పడిపోయారు. జట్టు స్కోరు 50 వద్దే రూట్‌తో పాటు స్టోక్స్ (15), రేహాన్ అహ్మద్ (0) అవుటయ్యారు. మార్క్ వుడ్ (15 బంతుల్లో 33; 6 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్ టాప్ స్కోరర్ కావడంతో ఇంగ్లండ్ 100 పరుగులు దాటింది. అత్యవసర వ్యక్తిగత కారణాలరీత్యా రెండో రోజు ఆట ముగిశాక చెన్నై వెళ్లిన అశ్విన్ ఆదివారం మైదానంలోకి దిగి ఒక వికెట్ కూడా తీశాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 445; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 319; భారత్ రెండో ఇన్నింగ్స్: 430/4 డిక్లేర్డ్. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 11. డకెట్ (రనౌట్) 4; పోప్ (సి) రోహిత్ (బి) జడేజా 3; రూట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 7; బెయిర్‌స్టో (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 4; స్టోక్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 15; ఫోక్స్ (సి) జురేల్ (బి) జడేజా 16; రేహన్ (సి) సిరాజ్ (బి) కుల్దీప్ 0; హార్ట్లీ (బి) అశ్విన్ 16; వుడ్ (సి) జైస్వాల్ (బి) జడేజా 33; అండర్సన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (39.4 ఓవర్లలో ఆలౌట్) 122. వికెట్ల పతనం: 1–15, 2–18, 3–20, 4–28, 5–50, 6–50, 7–50, 8–82, 9–91, 10–122. బౌలింగ్: బుమ్రా 8–1– 18–1, సిరాజ్ 5–2–16–0, జడేజా 12.4–4– 41–5, కుల్దీప్ 8–2–19–2, అశ్విన్ 6–3–19–1. 3 వరుస టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు బాదిన మూడో భారత బ్యాటర్ యశస్వి జైస్వాల్. ఈ వరుసలో వినోద్ కాంబ్లి (1993లో), కోహ్లి (2017లో) ముందున్నారు. 9 స్వదేశంలో జడేజా అందుకున్న ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డుల సంఖ్య. అనిల్ కుంబ్లే (9) పేరిట ఉన్న రికార్డును జడేజా సమం చేశాడు. 12 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా అక్రమ్ (12 సిక్స్‌లు) పేరిట ఉన్న రికార్డును జైస్వాల్ సమం చేశాడు. 28 రాజ్‌కోట్ టెస్టులో భారత్ సిక్స్‌ల సంఖ్య. ఒకే టెస్టులో అత్యధిక సిక్స్‌లు కొట్టిన జట్టుగా 2019లో వైజాగ్‌లో దక్షిణాఫ్రికాపై నమోదు చేసిన రికార్డును భారత్ సవరించింది. 48 ఈ సిరీస్‌లో ఇప్పటివరకు భారత జట్టు బాదిన సిక్స్‌లు. ఇదో కొత్త రికార్డు. దక్షిణాఫ్రికాపై 2019లో భారత్ 47 సిక్స్‌లు కొట్టింది. -
WTC ఫైనల్లో ఇషాన్ కిషన్ బెస్ట్ ఎందుకంటే..!
-
మోహిత్ కి పాండ్య పాఠాలు చెప్పడం ఏంటి ..!
-
మహి అన్న కోసం ఏదైనా చేస్తా టచ్ చేస్తున్న జడేజా మాటలు..!
-
CSK అభిమానులకు జడేజా భార్య ట్రీట్ ..!
-
ఫైనల్ లో జడేజా బాటింగ్ పై సురేష్ రైనా కామెంట్స్
-
ధోనికి జడేజాకు మధ్య విబేధాలు ఇంకా ప్రూఫ్స్ కావాలా ....!
-
తలా లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా...
-
చెన్నై పాంచ్ పటాకా
-
పీక్స్ కి చేరిన ధోని రవీంధ్ర జడేజా గొడవలు...మధ్యలో ఏంట్రీ ఇచ్చిన జడ్డు వైఫ్
-
మనసున్న మారాజు.. జామ్‌సాహెబ్, ఎవరీ మారాజు?
రష్యా దురాక్రమణతో ఉక్రేనియన్లు లక్షలాదిగా శరణార్ధులవుతున్న దృశ్యాలు చూస్తున్నాం! ప్రాణాలరచేతిలో పెట్టుకొని వచ్చిన ఉక్రేనియన్లకు పోలాండ్, రొమేనియా, హంగరీ, స్లొవేకియా తదితర దేశాలు సరిహద్దులు తెరిచి ఆశ్రయమిస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ స్థాయిలో మానవ సంక్షోభం తలెత్తలేదని నిపుణులు వర్ణిస్తున్నారు. ఇలాంటి సందర్భమే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పలు యూరప్ దేశాలకు ఎదురైంది. ఆ సమయంలో వారికి నేనున్నానంటూ ఒక భారత మహారాజు అక్కున చేర్చుకున్నారు. అనాథలమైపోయామని బాధ పడొద్దంటూ ఆయన యుద్ధ శరణార్ధులకు ఆశ్రయం కల్పించారు. ముఖ్యంగా హిట్లర్ దురాక్రమణతో కకావికలమైన పోలాండ్‌కు ఆ మహారాజు అండగా నిలిచారు. పోలాండ్ చిన్నారులకు ఒక తండ్రిలా మారారు. నిజానికి ఆ సమయంలో భారత్‌లో బ్రిటిష్ పాలన నడుస్తోంది. సొంత ఖండానికి చెందిన వారే అయినా పోలాండ్ శరణార్ధులను అనుమతించకూడదని భారత్‌లో బ్రిటిష్ అధికారులు నిర్ణయించుకున్న సమయంలో మహారాజా దిగ్విజయ్సింహ్జీ రంజిత్సింహ్జీ జడేజా వారికి ఆశ్రయం ఇచ్చి మనసున్న మారాజని నిరూపించుకున్నారు. గుజరాత్‌లోని నవానగర్ సంస్థానాధిపతైన దిగ్విజయ్ సింహ్‌జీని ప్రజలు గౌరవంగా జామ్‌సాహెబ్ అని పిలుస్తారు. నన్ను మీ బాపూ అనుకోండి! 1942లో సోవియట్ సైన్యం పోలాండ్ పైకి వచ్చినప్పుడు 2 నుండి 17 ఏళ్ల మధ్య వయసున్న 600 మందికి పైగా పిల్లలని ఒక నౌకలో ఎక్కించి శరణార్థులుగా పంపించారు. వీళ్లకు ఎవరూ ఆశ్రయమివ్వలేదు. చివరకు భారత్‌లో వలస పాలకులు కూడా శరణార్థుల సాయానికి ఆటంకాలు కల్పించారు. యుద్ధం కారణంగా అనాథలైన పోలాండ్ పిల్లల వెతలు చూసి జామ్‌సాహెబ్ చలించిపోయారు. బ్రిటీష్ అధికారుల ఆటంకాలు లెక్కచేయకుండా పోలండ్ పిల్లల ఓడను తన రాజ్యంలోని రోసి పోర్టుకు ఆయన ఆహ్వానించారు. అక్కడకు సమీపంలోని బాలచడి నగర సరిహద్దుల్లో పోలండ్ శరణార్ధుల కోసం కుటీరాలు ఏర్పాటు చేయించారు. ‘‘నన్ను మీ బాపూ (తండ్రి) అనుకోండి! మీకు ఏ లోటూ రాదు’’ అని వారికి అభయం ఇచ్చారు. యుద్ధం కారణంగా ఇల్లూ వాకిలి వదిలిన పోలండ్ వాసులు సొంతింట్లో ఉన్న భావన కలిగించాలని ఆయన అనేక సదుపాయాలు కల్పించారు. దాదాపు 640 మంది శరణార్ధులు మహారాజు వద్ద ఆశ్రయం పొందారు. ఆ తర్వాత 1946 లో వారిని తిరిగి పోలాండ్ పంపించారు. శరణార్ధులకూ హక్కులుంటాయి! శరణార్ధుల్లో ఒకరు జామ్‌సాహెబ్ ఆతిథ్యం గురించి చెబుతూ ‘‘ఆ సమయంలో మాకు పునరావాస కేంద్రాల్లో ఇస్తున్న ఉడికించిన పాలకూర నచ్చలేదు. దీంతో స్ట్రయిక్ చేద్దామని నిర్ణయించుకున్నాం! ఈ విషయం బాపూ (జామ్‌సాహెబ్) కు తెలిసింది. వెంటనే వంటగాళ్లకు ఆ కూర వండవద్దని ఆదేశించారు. నిజానికి శరణార్ధులుగా ఉన్న మాకు డిమాండ్లు చేసే హక్కుంటుందని మేం భావించలేదు. కానీ ఆయన అతిచిన్న విషయంలో కూడా మాకు ఇబ్బంది లేకుండా చూసుకున్నారు’’ అని తెలిపారు. పొలండ్, పోలిష్ రిపబ్లిక్ గా ఏర్పాటు అయిన తర్వాత ‘కమాండర్స్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మెరిట్‘ అవార్డును ఆయనకు ప్రకటించింది. ఇప్పటికీ పోలండ్వాసులు మహారాజా పెద్ద మనసును మరిచిపోలేదు. ఆయన ఆశ్రయం పొంది అనంతరం పోలండ్ తిరిగివెళ్లిన వాళ్లు ‘సర్వైవర్స్ ఆఫ్ బాలచడి’’ పేరిట బృందంగా ఏర్పడ్డారు. జామ్సాహెబ్కు ఆజన్మాంతం తామంతా రుణపడ్డామని వీళ్లు చెప్పేవాళ్లు. తమ కృతజ్ఞతకు గుర్తుగా వార్సాలో ఆయన పేరిట స్క్వేర్ ఆఫ్ గుడ్ మహారాజా అని ఒక కూడలి ఏర్పాటు చేసుకున్నారు. 2014లో అక్కడ ఒక పార్కు కూడా ప్రారంభించారు. అందులో ఆయన స్మారక చిహ్నం స్థాపించారు. ఎవరీ మారాజు? జామ్ సాహెబ్‌గా ప్రసిద్ధి చెందిన రాజా దిగ్విజయ్‌సింగ్‌జీ రంజిత్‌సింగ్‌జీ జడేజా (1895–1966) యదువంశీ రాజ్‌పుత్ వంశానికి చెందినవారు. ప్రఖ్యాత క్రికెటర్ రంజిత్‌సింగ్‌జీ ఈయనకు మేనమామ. యూనివర్సిటీ కాలేజ్ లండ¯Œ లో విద్యాభ్యాసం చేశారు. 1919లో బ్రిటిష్ ఆర్మీలో సెకండ్ లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. 1947 వరకు లెఫ్టినెంట్–జనరల్ గా బ్రిటీష్ఇండియన్ ఆర్మీ నుంచి గౌరవ భృతి పొందారు. 1935లో ఆయనకు మహా రాజకుమారి బైజీ రాజ్ శ్రీ కంచన్ కున్వెర్బా సాహిబాతో వివాహమైంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నవానగర్‌ను యునైటెడ్ స్టేట్ ఆఫ్ కతియావార్‌లో విలీనం చేశారు. – శాయి ప్రమోద్ -
ప్రభుత్వ ఉద్యోగం అనుకుంటున్నారు!
న్యూఢిల్లీ: సోషల్ మీడియా పోస్టుల్లో తనదైన శైలిలో చురకలు, చలోక్తులతో ఆకట్టుకునే మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చెన్నై సూపర్‌కింగ్స్ బ్యాట్స్‌మెన్ తీరును విమర్శించాడు. మైదానంలో కొందరు ఆటగాళ్లు ఐపీఎల్‌ను ‘ప్రభుత్వ ఉద్యోగం’గా భావిస్తున్నారని చురక వేశాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వాట్సన్ అర్ధసెంచరీ చేశాడు. కానీ అతను అవుట్ కాగానే మిగతా బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో జట్టు 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీనిపై వీరూ స్పందిస్తూ ‘అది ఛేదించాల్సిన లక్ష్యం. పీకలమీదికి వచ్చినా కూడా కేదార్ జాదవ్, జడేజా బంతుల్ని వృథాచేయడం (డాట్ బాల్స్ ఆడటం) వల్లే చెన్నై విజయానికి దూరమైంది. దీన్ని బట్టి చూస్తే కొందరి చెన్నై బ్యాట్స్‌మెన్ ప్రదర్శన తీరు ప్రభుత్వ ఉద్యోగంగా నాకనిపిస్తోంది. పని చేసినా చేయకపోయినా... నెల తిరిగేసరికి జీతం వస్తుందిలే అన్న తరహాలో ఆడినా ఆడకపోయినా పారితోషికానికి ఢోకా లేదులే అన్నట్లు వ్యవహరిస్తున్నారు’ అని విమర్శించారు. మూడుసార్లు ఐపీఎల్ చాంపియన్ అయిన సీఎస్కే ఇప్పటిదాకా ఆరు మ్యాచ్‌లాడి నాలుగింట ఓడిపోయింది. నేడు జరిగే మ్యాచ్‌లో బెంగళూరుతో చెన్నై తలపడుతుంది. -
ఇషాంత్ అవుట్
క్రైస్ట్‌చర్చ్: కివీస్ పర్యటనలో ఆఖరి పోరుకు ముందు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ గాయపడ్డాడు. అతని కుడి చీలమండకు గాయం కావడంతో రెండో టెస్టుకు అతను అందుబాటులో లేకుండా పోయాడు. ఇతని స్థానంలో ఉమేశ్ యాదవ్ బరిలోకి దిగే అవకాశముంది. ఇషాంత్‌కు అయిన గాయం కొత్తదేం కాదు. జనవరిలో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో గాయపడ్డాడు. అప్పుడే అతను కివీస్ పర్యటనకు అనుమానమేనని వార్తలొచ్చాయి. అయితే చక్కటి ఫామ్‌లో ఉన్న ఇషాంత్‌ను... వేగంగా కోలుకున్నాడనే కారణంతో టెస్టు జట్టులోకి తీసుకున్నారు. టీమ్ మేనేజ్మెంట్ ఆశించినట్లుగానే తొలిటెస్టులో ఇషాంత్ (5/68) రాణించాడు. బ్యాటింగ్ వైఫల్యంతో భారత్ ఈ మ్యాచ్ ఓడింది. శుక్రవారం జట్టు సభ్యులు ప్రాక్టీసు చేస్తుండగా... అతను కూడా వచ్చాడు. కానీ అసౌకర్యంగా కనిపించడంతో నెట్ ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నాడు. దీంతో జట్టు మేనేజ్మెంట్ ముందు జాగ్రత్తగా అతని కుడి చీలమండకు స్కానింగ్ కూడా తీయించింది. రిపోర్టులు ప్రతికూలంగా వచ్చినట్లు సమాచారం. బౌలింగ్‌లో ఎదురుదెబ్బ తగిలినా... బ్యాటింగ్‌లో మాత్రం యువ ఓపెనర్ పృథ్వీ షా ఫిట్నెస్తో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. అతని ఎడమ పాదానికి అయిన వాపు మానిందని, రెండో టెస్టు ఆడతాడని భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. ఫామ్‌లోలేని వెటరన్ స్పిన్నర్ అశ్విన్ స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ జడేజాను తీసుకునేది ఖాయమైంది. జడేజా బ్యాటింగ్ చేయగల సమర్థుడు కావడంతో అతన్ని తీసుకోవాలని కోచ్‌తో పాటు కెప్టెన్ కోహ్లి నిర్ణయించినట్లు తెలిసింది. బ్యాటింగ్ పిచ్! క్రైస్ట్‌చర్చ్ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలం. గత టెస్టులా కాకుండా ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారే అవకాశముంది. ఇది బ్యాట్స్‌మెన్‌కు ఊరటనిచ్చే అంశం. ప్రత్యేకించి భారత బ్యాట్స్‌మెన్ ఆఖరి పోరులో అదిరిపోయే ఆట ఆడేందుకు ఇది చక్కని వేదిక. -
రోహిత్ డబుల్ సఫారీ ట్రబుల్
రాంచీ టెస్టులో భారత్‌కు రెండో రోజే పట్టు లభించింది. తొలి రోజు సెంచరీని డబుల్ సెంచరీగా మలచి రోహిత్ పలు రికార్డులను కొల్లగొట్టగా, రహానే ఖాతాలో కూడా శతకం చేరింది. జడేజా, ఉమేశ్ కూడా తలా ఓ చేయి వేయడంతో భారీ స్కోరుతో భారత్ చెలరేగింది. ఆదివారం ఏకంగా 4.67 రన్‌రేట్‌తో భారత్ పరుగులు సాధించడం విశేషం. అనంతరం వేసిన ఐదు ఓవర్లలోనే దక్షిణాఫ్రికాను టీమిండియా ఒక ఆటాడుకుంది. 9 పరుగులకే ఓపెనర్లను వెనక్కి పంపి రాబోయే ప్రమాదానికి సంకేతాలు పంపింది. అప్పుడే పొడిబారిన పిచ్‌పై బంతి అష్టవంకర్లు తిరుగుతుండటంతో తడబడుతున్న సఫారీలు ఎంత వరకు నిలబడగలరో చూడాలి. మొదటి రోజులాగే ఆదివారం కూడా వెలుతురులేమి సమస్యగా మారడంతో 63.3 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ జోరు కొనసాగుతోంది. మ్యాచ్ రెండో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం జుబేర్ హమ్జా (0 బ్యాటింగ్), డు ప్లెసిస్ (1 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 497 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ (255 బంతుల్లో 212; 28 ఫోర్లు, 6 సిక్సర్లు) టెస్టు కెరీర్లో తొలి డబుల్ సెంచరీ నమోదు చేయగా.... అజింక్య రహానే (192 బంతుల్లో 115; 17 ఫోర్లు, 1 సిక్స్) శతకం పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 267 పరుగులు జోడించారు. రవీంద్ర జడేజా (119 బంతుల్లో 51; 4 ఫోర్లు) కూడా అర్ధ సెంచరీ సాధించాడు. సఫారీ బౌలర్లలో లిండేకు 4 వికెట్లు దక్కాయి. రోహిత్ అదే జోరు... ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 117తో బ్యాటింగ్ కొనసాగించిన రోహిత్ శర్మ రెండో రోజు కూడా చక్కటి షాట్లతో అలరించాడు. సఫారీ పేసర్లు అతనిపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఇన్‌గిడి వేసిన ఒకే ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన అతను 199 బంతుల్లో 150 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత అతను మరింత వేగంగా ద్విశతకం దిశగా దూసుకుపోయాడు. 179 పరుగుల వద్ద పీట్ బౌలింగ్‌లో దక్షిణాఫ్రికా చేసిన ఎల్బీ అప్పీల్‌ను అంపైర్ తిరస్కరించాడు. డు ప్లెసిస్ రివ్యూ చేసినా ఫలితం ప్రతికూలంగా రావడంతో రోహిత్‌కు మరో అవకాశం దక్కింది. నోర్జే ఓవర్లో వరుసగా రెండు ఫోర్లతో 190ల్లోకి చేరుకున్న ‘ముంబైకర్’ లంచ్ సమయానికి 199 వద్ద నిలిచాడు. విరామం తర్వాత పీట్ వేసిన మూడో ఓవర్ తొలి బంతికి భారీ సిక్సర్ బాదడంతో రోహిత్ డబుల్ సెంచరీ పూర్తయింది. అదే ఓవర్లో అతను మరో సిక్స్ కొట్టాడు. అయితే మరో నాలుగు బంతుల తర్వాత ఈ అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. రబడ బంతిని హుక్ షాట్ ఆడబోయిన రోహిత్ ఫైన్ లెగ్ బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చాడు. రాణించిన జడేజా... తొలి రోజు 83 పరుగులతో అజేయంగా నిలిచిన రహానేకు ఆదివారం సెంచరీ చేరుకోవడానికి ఎక్కువసేపు పట్టలేదు. ముగ్గురు పేసర్ల ఓవర్లలో ఒక్కో ఫోర్ కొట్టిన అతను ఆ తర్వాత నోర్జే బౌలింగ్‌లో కవర్ పాయింట్ దిశగా సింగిల్ తీసి 169 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 2016 తర్వాత స్వదేశంలో రహానే సెంచరీ చేయడం ఇదే తొలిసారి. శతకం సాధించిన కొద్ది సేపటికే లిండే బౌలింగ్‌లో కీపర్ క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి రహానే పెవిలియన్ చేరాడు. . లిండేకు ఇది తొలి టెస్టు వికెట్ కాగా, క్లాసెన్‌కు తొలి క్యాచ్. మరోసారి ఆరో స్థానానికి ప్రమోట్ అయిన జడేజా తనదైన శైలిలో చకచకా పరుగులు సాధించాడు. సాహా (24)తో కలిసి ఆరో వికెట్‌కు 47 పరుగులు, అశి్వన్ (14)తో ఏడో వికెట్‌కు అతను 33 పరుగులు జోడించాడు. 118 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న జడేజా ఎప్పటిలాగే ‘కత్తి సాము’ సంబరాలు చేసుకున్నాడు. అయితే తర్వాతి బంతికే అతను వెనుదిరిగాడు. దక్షిణాఫ్రికాకు సంకటం... ప్రత్యర్థి భారీ స్కోరు ఎదురుగా కనిపిస్తుండగా ఈసారైనా కొంత మెరుగైన ప్రదర్శన కనబర్చాలని బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా రాత ఏమీ మారలేదు. వెలుతురులేమితో ఆట ఆగిపోవడానికి ముందు సాగిన ఐదు ఓవర్లలోనే జట్టు బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఇన్నింగ్స్ రెండో బంతికే ఎల్గర్ (0)ను షమీ అవుట్ చేయగా, ఉమేశ్ వేసిన తర్వాతి ఓవర్లో డి కాక్ (4) వెనుదిరిగాడు. తొలి టెస్టు ఆడుతున్న నదీమ్ రెండు ఓవర్లు కూడా మెయిడిన్‌గా వేయగా... హమ్జా, డు ప్లెసిస్ కలిసి తడబడుతూ 22 బంతుల్లో ఒక పరుగు చేసి ఎలాగో ఆట ముగించగలిగారు. రికార్డుల వరద... ఆదివారం వీరేంద్ర సెహ్వాగ్ పుట్టిన రోజు... తాజా సిరీస్‌లో రోహిత్ శర్మ తొలిసారి ఓపెనర్‌గా బరిలోకి దిగినప్పుడు బ్యాటింగ్ శైలి, దూకుడులో వీరూతో పోలికలు మొదలయ్యాయి. భవిష్యత్ సంగతేమో కానీ ప్రస్తుతానికి మాత్రం రోహిత్ తన సీనియర్‌ను మరపించాడు. రాంచీ టెస్టులో సిక్సర్‌తో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నప్పుడైతే సరిగ్గా అందరికీ సెహ్వాగే గుర్తుకొచ్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో సెంచరీ మార్క్‌ను కూడా సిక్సర్‌తోనే అందుకున్నాడు. తాజా డబుల్‌తో రోహిత్ అనేక చెప్పుకోదగ్గ ఘనతలు నమోదు చేశాడు. ►4సచిన్, సెహ్వాగ్, క్రిస్ గేల్ తర్వాత టెస్టులు, వన్డేల్లోనూ డబుల్ సెంచరీ సాధించిన నాలుగో బ్యాట్స్‌మన్ రోహిత్. ►1ఒకే సిరీస్‌లో ముగ్గురు భారత బ్యాట్స్‌మెన్ డబుల్ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. వైజాగ్‌లో మయాంక్, పుణేలో కోహ్లి ద్విశతకాలు సాధించారు. అయితే 1955–56లో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో మూడు డబుల్ సెంచరీలు నమోదైనా...వీటిలో రెండు వినూ మన్కడ్ చేయగా, మరొకటి పాలీ ఉమ్రీగర్ సాధించాడు. ►99.84స్వదేశంలో రోహిత్ బ్యాటింగ్ సగటు. 18 ఇన్నింగ్స్‌లలో అతను 6 సెంచరీలు, 5 అర్ధసెంచరీలతో 1298 పరుగులు చేశాడు. సొంతగడ్డపై కనీసం 10 ఇన్నింగ్స్‌లు ఆడిన బ్యాట్స్‌మెన్ సగటుల జాబితా తీసుకుంటే ఆ్రస్టేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ (98.22)కంటే ఇది ఎక్కువ కావడం విశేషం. ►529ఈ సిరీస్‌లో రోహిత్ చేసిన పరుగులు. గావస్కర్ (3 సార్లు), సెహ్వాగ్, వినూ మన్కడ్, బుద్ది కుందేరన్ తర్వాత ఒకే సిరీస్‌లో 500కు పైగా పరుగులు చేసిన ఐదో భారత ఓపెనర్ రోహిత్. అయితే 3 టెస్టుల సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో కోహ్లి (610), సెహా్వగ్ (544), గంగూలీ (534) తర్వాత రోహిత్ నాలుగో స్థానంలో నిలవగా, వీవీఎస్ లక్ష్మణ్ (503) ఐదో స్థానంలో ఉన్నాడు. ఉమేశ్ మెరుపులు... 6, 6, 0, 1, 6, 0, 6, 0, 6, అవుట్... ఉమేశ్ యాదవ్ బ్యాటింగ్ జోరు ఇది. 10 బంతులు ఆడిన అతను ఏకంగా 31 పరుగులు సాధించాడు. ఇందులో 5 సిక్సర్లు ఉన్నాయి. లిండే వేసిన తొలి రెండు బంతుల్లో సిక్సర్లు బాదిన అతను పీట్ ఓవర్లో సింగిల్ తీశాడు. లిండే తర్వాతి ఓవర్లోనే మిగతా మూడు సిక్స్‌లు కొట్టిన ఉమేశ్... అదే ఓవర్ చివరి బంతికి మరో భారీ షాట్‌కు ప్రయతి్నంచి అవుటయ్యాడు. ఇది ఉమేశ్‌కు టెస్టుల్లో అత్యధిక స్కోరు. ‘లేదంటే ఏదో జరిగిపోయేది’ ఓపెనర్‌గా ఆడటం నాకు దక్కిన మంచి అవకాశం. దానిని సమర్థంగా వాడుకోవడం నాకు ఎంతో అవసరం. లేదంటే ఏదో జరిగిపోయేదే.ఆ విషయం నాకు తెలుసు. నా గురించి మీడియా మొత్తం ఎంతో రాసి పడేసేది. ఇప్పుడు నాలుగు మంచి మాటలే రాయగలరు. బ్యాటింగ్ చేసేటప్పుడు మనకు రికార్డుల గురించి తెలియదు. అయితే భవిష్యత్తులో నేను ఆడటం ఆపేసిన తర్వాత ఈ రికార్డుల గురించి తెలుసుకుంటా. ‘ఓపెనర్‌గా మూడు టెస్టులే ఆడాను. నేను ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల గురించి అతిగా ఆలోచించడం లేదు. విదేశాల్లో ఓపెనింగ్ చేసినా ఆట మూలసూత్రాలు ఒక్కటే. ఏ బంతిని ఆడాలి, దేనిని వదిలేయాలో అర్థం చేసుకోవాలి. విదేశీ సిరీస్‌లు నాకు పెద్ద సవాల్లాంటివని తెలుసు. దాని కోసం సిద్ధంగా ఉన్నా’ –రోహిత్ శర్మ -
అతడు భుజం గాయంతోనే ఆసీస్‌కు వచ్చాడు
ఏ మూడ్‌లో ఉన్నాడో... ఏ ఉద్దేశంతో అన్నాడో కాని... ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై తన మాటల ద్వారా టీమిండియా కోచ్ రవిశాస్త్రి కొత్త వివాదానికి తెరలేపాడు. పెర్త్ టెస్టు ఓటమిపై విమర్శల నుంచి వ్యక్తిగతంగా తప్పించుకోలేకపోగా... కెప్టెన్ విరాట్ కోహ్లి చెప్పిన దానికి భిన్నమైన వివరణ ఇచ్చి మరింత బోర్లాపడ్డాడు. అటువైపు బీసీసీఐనీ ఇరకాటంలోకి నెట్టాడు. అర్ధరాత్రి వివరణ ఇచ్చుకునేలా చేశాడు. ఇటువైపు ఈ మొత్తం చర్చకు కారణమైన ‘జడేజా 70–80 శాతం ఫిట్నెస్’... అసలు జట్టు సభ్యుల గాయాలు, వాటిపట్ల తీసుకోవాల్సిన చర్యలపై టీమిండియాకు నిర్దిష్టమైన ప్రణాళిక ఏమీ లేదన్న విషయాన్ని మరోసారి చాటింది. మెల్బోర్న్: ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పూర్తి ఫిట్‌గా లేడని టీమిండియా కోచ్ రవిశాస్త్రి ప్రకటించాడు. రెండో టెస్టు సమయానికి అతడు 70–80 శాతం ఫిట్నెస్తోనే ఉన్నాడని... అందుకనే తుది జట్టులో ఆడించలేదని పేర్కొన్నాడు. జడేజా 80 శాతం ఫిట్నెస్తో ఉన్నా మెల్బోర్న్లో జరిగే మూడో టెస్టులో ఆడిస్తామంటూ చిత్రమైన వివరణ ఇచ్చాడు. ‘స్వదేశంలో రంజీ ఆడుతున్నప్పుడే జడేజా భుజం నొప్పితో ఇబ్బందిపడ్డాడు. ఆస్ట్రేలియాకు వచ్చిన నాలుగు రోజులకు ఇంజెక్షన్లు తీసుకున్నాడు. అవి ప్రభావం చూపేందుకు కొంత సమయం పట్టింది’ అని ఆదివారం ఇక్కడ మీడియా సమావేశంలో వివరించాడు. పెర్త్ ఓటమిపై విమర్శలకు స్పందిస్తూ ‘జట్టుకు ఏది మేలనుకున్నామో అదే చేశాం. సుదూరాన ఉన్నవారు మాట్లాడటం సులువు. మేమిప్పుడు దక్షిణ ధ్రువాన ఉన్నాం’ అంటూ వ్యంగ్యంగా స్పందించాడు. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై రెండు రోజుల్లో ఓ నిర్ణయానికి వస్తామని, బ్యాట్స్‌మన్ రోహిత్‌శర్మ పరిస్థితి మెరుగైందని తెలిపాడు. దక్షిణాఫ్రికాలో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, ఇంగ్లండ్‌లో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్, ఆస్ట్రేలియాలో రవీంద్ర జడేజా... వరుసగా మూడో విదేశీ పర్యటనలోనూ ఆటగాళ్ల గాయాలపై టీమిండియాలో దాగుడుమూతలు కొనసాగుతున్నాయి. జట్టు సభ్యుల వాస్తవ ఫిట్నెస్ను విస్మరించి చివరివరకు ఆడించడం... తీరా అది వికటించి విమర్శల పాలవడం కోహ్లి సేనకు సాధారణమైపోయింది. ఈ విషయంలో కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రితో పాటు బీసీసీఐదీ తప్పున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా ముగిసిన పెర్త్ టెస్టులో ‘జడేజా ఉదంతమే’ దీనంతటికీ బలమైన సాక్ష్యం. అసలేం జరిగింది? రెండో టెస్టుకు ముందు రోజే జడేజా, భువనేశ్వర్ సహా భారత్ 13 మందితో జట్టును ప్రకటించింది. అంతకుముందు బీసీసీఐ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం అందరూ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమని తేలిపోయింది. అయితే, పిచ్ స్వభావం రీత్యా అంటూ నలుగురు పేసర్లతో దిగాడు కోహ్లి. కానీ, ఈ వ్యూహం వికటించింది. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ టీమిండియాను దెబ్బకొట్టాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండా ఆడిన భారత ప్రణాళికను అందరూ తప్పుబట్టారు. అయితే రవీంద్ర జడేజాను ఆడించే ఆలోచన తమకు రాలేదని మ్యాచ్ ముగిశాక విరాట్ వివరణ ఇచ్చాడు. మరోవైపు వివిధ కార ణాలతో జడేజా ఐదుగురు ఆటగాళ్లకు సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలో సుదీర్ఘ సమయం ఫీల్డింగ్ చేశాడు. బంతిని బలంగా విసరాల్సి వచ్చే బౌండరీ లైన్ దగ్గరే ఎక్కువసేపు ఉన్నాడు. కోహ్లి వివరణ, ఫీల్డింగ్‌కు దింపిన తీరునుబట్టి చూస్తే జడేజా ఫిట్‌గా ఉన్నాడనే అనుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడేం జరిగింది? టెస్టు ఓటమిపై విమర్శల పరంపర కొనసాగుతుండగానే, ఆదివారం మీడియాతో మాట్లాడిన రవిశాస్త్రి... జడేజా 70 నుంచి 80 శాతం ఫిట్నెస్తోనే ఉన్నాడని, లేనిపోని ఇబ్బంది ఎందుకనే పెర్త్ మ్యాచ్ ఆడించలేదని ప్రకటించాడు. ఇది పూర్తి అసంబద్ధంగా ఉండటంతో పెద్ద సంచలనమైంది. ఏ స్థాయి ఆటగాడినైనా వంద శాతం ఫిట్‌గా ఉంటేనే మైదానంలోకి దింపుతారు. మరి అలా లేని జడేజాను 13 మందిలో ఎలా చేర్చారు? ఎడమ భుజం గాయంతో ఇబ్బంది పడుతున్న అతడిని సబ్‌స్టిట్యూట్‌గా ఎలా పంపారు? తప్పని పరిస్థితుల్లో అనుకున్నా... బౌండరీల వద్ద ఎలా ఉంచుతారు? అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనర్థం చూస్తే... ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు కారణాలు చెప్పబోయిన రవిశాస్త్రి బయటకు తెలియని జడేజా గాయం గురించి చెప్పేశాడు. అతడు 80 శాతం ఫిట్నెస్తో ఉన్నా మెల్బోర్న్లో ఆడిస్తామంటూ మరో పూర్తి విరుద్ధ ప్రకటన చేశాడు. అంతేకాక, ‘మీరు జడేజా గురించి అడిగారు. నేను చెప్పాను. ఇక జట్టు ఎంపికపై ఎలాంటి సందేహాలు లేవనుకుంటా? ఉంటే... అది మీ సమస్య’ అని మీడియాకు చురకలేశాడు. ఇదేం తీరు? జడేజా విషయం తెలిశాక కూడా అతడిని 13 మందిలో చేర్చడం పొరపాటే. ఎలాగూ నలుగురు పేసర్ల వ్యూహమే సరి అంటూ, స్పిన్నర్‌ను ఆడించమని కోహ్లి చెప్పాడు కాబట్టి అతడి స్థానంలో కుల్దీప్ పేరు ఉంచితే సరిపోయేది. అలాకాకుండా జడేజాతో ఏకంగా ఫీల్డింగ్ కూడా చేయించారు. ఇప్పటికే అశ్విన్‌కు ఫిట్నెస్ ఇబ్బందులున్న నేపథ్యంలో ఒకవేళ గాయం పెద్దదై జడేజా సిరీస్‌కే దూరమైతే ఏం చేసేవారు? ఇదే విధంగా ఇంగ్లండ్‌లో గాయం ఉన్నా అశ్విన్‌ను సౌతాంప్టన్ టెస్టులో ఆడించారు. ప్రత్యర్థి స్పిన్నర్ మొయిన్ అలీ విజృంభించిన చోట అతడు విఫలమై విమర్శలు మూటగట్టుకున్నాడు. తద్వారా జట్టు నిర్ణయానికి వ్యక్తిగతంగా బలయ్యాడు. బీసీసీఐ నష్ట నివారణ రవిశాస్త్రి వ్యాఖ్యలకు దుమారం రేగడంతో బీసీసీఐ నష్ట నివారణకు దిగింది. జడేజా పూర్తి ఫిట్నెస్తో ఉన్నందుకే ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేశామని ప్రకటించింది. ఈ మేరకు మెల్బోర్న్ సమయం ప్రకారం ఆదివారం అర్థరాత్రి దాటాక వివరణ ఇచ్చింది. ‘ఎడమ భుజం గాయం నుంచి జడేజా కోలుకుంటున్నాడు. మెల్బోర్న్ టెస్టుకు అందుబాటులో ఉంటాడు. స్వదేశంలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో అతడికీ ఇబ్బంది తలెత్తింది. నవంబరు 2న ముంబైలో ఇంజక్షన్ తీసుకున్నాడు. తర్వాత సౌరాష్ట్ర తరఫున రంజీ ఆడి... ఎలాంటి ఇబ్బంది లేకుండా 64 ఓవర్లు వేశాడు. ఫిట్‌గా ఉన్నట్లు తేలడంతోనే ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేశాం’ అని పేర్కొంది. నవంబరు 30న సీఏ ఎలెవెన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా మరో ఇంజక్షన్ తీసుకున్నాడని వివరించింది. పెర్త్ టెస్టుకు ముందు నెట్స్‌లో జడేజా ప్రాక్టీస్ చేసినా... అది స్థాయికి తగినట్లు లేకపోవడంతో తుది జట్టులోకి తీసుకోలేదని పేర్కొంది. -
బిగిసింది పట్టు...
ఎదురుగా గుండెలు గుభేల్మనేలా కొండంత స్కోరు... కనీసం ఇద్దరు మూడంకెల స్కోరు చేస్తేనే దీటైన సమాధానం ఇవ్వగల పరిస్థితి! కానీ, వెస్టిండీస్... షమీ పేస్‌ను ఎదుర్కొనలేక, అశ్విన్ త్రయం స్పిన్‌కు తాళలేక చేతులెత్తేసింది. వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్టే వరుస కట్టారు! వెరసి... రాజ్‌కోట్ టెస్టుపై టీమిండియా పట్టు బిగించింది. అంతకుముందు కెప్టెన్ విరాట్ కోహ్లి, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా శతకాలతో జట్టుకు భారీ స్కోరు అందించారు. మిగిలి ఉన్న మూడు రోజుల ఆటలో ఎంత పోరాడినా నిలవడం ప్రత్యర్థికి కష్టమే! భారత్ శనివారమే మ్యాచ్‌ను ముగించినా ఆశ్చర్యం లేదు. రాజ్‌కోట్: ఏమాత్రం సవాలు విసరని బౌలింగ్‌ను ముందుగా బ్యాట్స్‌మెన్ ఆటాడుకున్నారు... అనంతరం అంతంతమాత్రం అనుభవం ఉన్న ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌ను బౌలర్లు కుప్పకూల్చారు! మొత్తమ్మీద సొంతగడ్డపై తమజట్టు ఎంత పటిష్టమైనదో చూపుతూ టీమిండియా రాజ్‌కోట్ టెస్టులో విజయం దిశగా దూసుకెళ్తోంది. అద్భుత శతకంతో మొదటి రోజు యువ ఓపెనర్ పృథ్వీ షా వేసిన బలమైన పునాదిని శుక్రవారం రెండో రోజు విరాట్ కోహ్లి (230 బంతుల్లో 139; 10 ఫోర్లు), రవీంద్ర జడేజా (132 బంతుల్లో 100 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) మరింత బలపరిచారు. వీరికి వికెట్ కీపర్ రిషభ్ పంత్ (84 బంతుల్లో 92; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడు తోడవడంతో తొలి ఇన్నింగ్స్‌ను భారత్ 649/9 వద్ద డిక్లేర్ చేసింది. బిషూ నాలుగు, లూయిస్ రెండు వికెట్లు పడగొట్టగా... గ్రాబియెల్, ఛేజ్, బ్రాత్‌వైట్‌లకు ఒక్కో వికెట్ దక్కాయి. అనంతరం బ్యాటింగ్ దిగిన విండీస్... పేసర్ షమీ (2/11) ధాటికి, అశ్విన్ (1/32), జడేజా (1/9), కుల్దీప్ యాదవ్ (1/19)ల మాయకు కుదేలైంది. రెండో రోజు ఆట ముగిసేసమయానికి విండీస్ 94/6తో నిలిచింది. రోస్టన్ ఛేజ్ (27 బ్యాటింగ్), కీమో పాల్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత్ స్కోరుకు ఇంకా 555 పరుగులు వెనుకబడి ఉన్న ఆ జట్టు కనీసం ఫాలోఆన్‌ను తప్పించుకోవడమూ కష్టమే. నిలిచేవారేరి? ఆడేవారేరి? భీకరంగా సాగిన భారత బ్యాటింగ్‌కు పూర్తి భిన్నంగా నడిచింది పర్యాటక జట్టు తొలి ఇన్నింగ్స్. ఏ బ్యాట్స్‌మన్ కూడా పట్టుమని 10 ఓవర్లు నిలిచేలా కనిపించలేదు. జట్టులో సీనియర్, కీలక బ్యాట్స్‌మన్, ఈ టెస్టుకు కెప్టెన్ అయిన ఓపెనర్ బ్రాత్‌వైట్ (2)... షమీ రెండో ఓవర్లోనే బౌల్డయ్యాడు. నోబాల్ అనే అనుమానంతో పలుమార్లు పరిశీలించినా, చివరకు థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. షమీ తర్వాతి ఓవర్లోనే మరో ఓపెనర్ కీరన్ పావెల్ (1) వికెట్ల ముందు దొరికిపోయాడు. షై హోప్ (10), హేట్‌మైర్ (10) నిలదొక్కుకోవడానికి చూసినా అది అతి కొద్దిసేపే. అశ్విన్... హోప్ వికెట్లను గిరాటేశాడు. అతడి తదుపరి ఓవర్లోనే మిడాన్‌లోకి బంతిని కొట్టి పరుగుకు యత్నించిన హేట్‌మైర్... జడేజా డైరెక్ట్ హిట్‌కు రనౌటయ్యాడు. స్లిప్‌లో రహానే క్యాచ్‌తో సునీల్ ఆంబ్రిస్ (12)ను జడేజా వెనక్కుపంపాడు. వికెట్ కీపర్ డౌరిచ్ (10)ను కుల్దీప్ బలిగొన్నాడు. దీంతో విండీస్ 74 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఛేజ్కు జత కలిసిన కీమో పాల్... సిక్స్, ఫోర్‌తో దూకుడు చూపాడు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. మూడో సెషన్లో 29 ఓవర్లను ఎదుర్కొన్న వెస్టిండీస్ 94 పరుగులు మాత్రమే చేయగలిగింది. ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా ఔటైనందున శనివారం ఆ జట్టు లోయరార్డర్‌ను పడగొట్టడం భారత్‌కు పెద్ద కష్టమేమీ కాదు. తద్వారా భారీ ఆధిక్యం దక్కడం ఖాయం. అయితే, కోహ్లి ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడిస్తాడో? లేక రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు దిగుతాడో చూడాలి. ఆ ముగ్గురూ ఆడుతూ పాడుతూ... ఓవర్‌నైట్ స్కోరు 364/4తో శుక్రవారం కొనసాగిన టీమిండియా స్కోరు కోహ్లి, పంత్ జోరైన బ్యాటింగ్‌తో చకచకా ముందుకు సాగింది. కోహ్లి అడపాదడపా షాట్లు కొట్టగా... రిషభ్ సహజ శైలిలో ఆడాడు. కీమో పాల్ బౌలింగ్‌లో ఫోర్, సిక్స్‌తో అర్ధ శతకం అందుకున్నాడు. తర్వాత ఛేజ్, బిషూల ఓవర్లలోనూ ఇదే తరహాలో బాది పరుగులు పిండుకున్నాడు. 18 బంతుల్లోనే అతడు వ్యక్తిగత స్కోరు 42 నుంచి 83కు చేరుకోవడం విశేషం. అవతలి ఎండ్‌లోని కోహ్లి అప్పటికి చేసివని 22 పరుగులే కావడం గమనార్హం. మరికాసేపటికే బిషూ బౌలింగ్‌లో ఫైన్ లెగ్‌లో బౌండరీ బాదిన కెప్టెన్ కెరీర్లో 24వ శతకాన్ని అందుకున్నాడు. అయితే, శతకం చేసే ఊపులో కనిపించిన పంత్... బిషూ గూగ్లీని షాట్ కొట్టే యత్నంలో షార్ట్ థర్డ్‌మ్యాన్‌లో పాల్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 133 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. జడేజా సైతం బ్యాట్ ఝళిపించడం తో లంచ్‌కు ముందే స్కోరు 500 దాటింది. లంచ్–టీ జడేజా సెషన్... విరామం నుంచి వస్తూనే లూయిస్ బౌలింగ్‌లో బౌండరీ బాదిన కోహ్లి ఈ ఏడాది టెస్టుల్లో 1000 పరుగుల మార్కు దాటాడు. అదే ఊపులో బిషూ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. కోహ్లి ఔటయ్యాక జడేజా విజృంభణ మొదలైంది. ఈ మధ్యలో అశ్విన్ (7), కుల్దీప్ (12) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఫిఫ్టీ అనంతరం సిక్స్‌లు, ఫోర్లతో జడేజా మరింత ధాటిగా ఆడాడు. అతడికి ఉమేశ్ యాదవ్ (22; 2 సిక్స్‌లు) సహకరించాడు. 79 పరుగుల వద్ద దక్కిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకుంటూ భారీ షాట్లతో 90ల్లోకి వచ్చాడు. కానీ, అప్పటికే 9 వికెట్లు పడటంతో అతడి సెంచరీ పూర్తవుతుందా? అనే అనుమానం కలిగింది. దీనికి తగ్గట్లే కొంత ఉత్కంఠ నెలకొన్నా షమీ (2 నాటౌట్) సహకరించాడు. బ్రాత్‌వైట్ బౌలింగ్‌లో మిడాఫ్ లోకి బంతిని కొట్టి పరుగు తీయడంతో టెస్టుల్లో జడేజా తొలి శతకం పూర్తయింది. ఆ వెంటనే కోహ్లి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. సొంతగడ్డపై జడేజాలం... ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో ఆల్‌రౌండ్ ప్రదర్శన, ఏడాది పైగా విరామంతో వన్డేల్లో చోటుతో ఆసియా కప్ ఫైనల్లో విలువైన పరుగులతో మళ్లీ జనం నాట్లో నానుతున్న జడేజా... సొంతగడ్డపై టెస్టులో శుక్రవారం అంతా తానే అయి కనిపించాడు. లోయరార్డర్ అండగా సిక్స్‌లు బాది తొమ్మిదేళ్ల కెరీర్లో తొలి శతకం నమోదుతో కర్ర సాము చేసిన ఈ ఆల్ రౌండర్... ప్రత్యర్థి ఇన్నింగ్స్‌లో ఓ రనౌట్ (హేట్‌మైర్), ఓ వికెట్ పడగొట్టాడు. ఇందులో రనౌట్‌ను కొంత విచిత్రం అనిపించేలా చేశాడు. అదెలాగంటే, అశ్విన్ బౌలింగ్‌లో హేట్‌మైర్ బంతిని మిడాన్‌లోకి ఆడి ఆంబ్రిస్‌ను పరుగుకు పిలిచాడు. కానీ, తర్వాత వెనక్కుతగ్గాడు.ఈలోగా ఆంబ్రిస్ స్ట్రయికర్ క్రీజు వద్దకు వచ్చేశాడు. దీంతో ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఒకేవైపు ఉండిపోయారు. బంతిని అందుకున్న జడేజా... అశ్విన్‌కు ఇవ్వకుండా వికెట్లను పడగొట్టేందుకు నింపాదిగా రాసాగాడు. అవకాశాన్ని గమనించిన హేట్‌మైర్ పరుగుకు యత్నించాడు. ఈ నేపథ్యంలో అశ్విన్ కంగారుపడగా, జడేజా వేగం పెంచి బంతిని వికెట్లకేసి కొట్టాడు. దగ్గరగా ఉన్నప్పటికీ త్రో తరహాలో బంతిని విసిరాడు. అది తగలకుంటే పరిస్థితి ఏమిటన్న రీతిలో అశ్విన్, కోహ్లి అతడికేసి చూడటం, తర్వాత కులాసాగా నవ్వడం గమనార్హం. కోహ్లి సంబరాలు లేకుండానే: సరైన సవాల్ ఉంటేనే కోహ్లికి మజానేమో? దీటైన ప్రత్యర్థిపై ఆడితేనే ఆనందమేమో...? శుక్రవారం అతడి బాడీ లాంగ్వేజ్ ఇలాగే ఉంది మరి. టెస్టులంటే అమితాసక్తి చూపే భారత కెప్టెన్ అందులో సెంచరీ చేస్తే ఆకాశమే పాదాక్రాంతమైనట్లు రెండు చేతులూ చాచి గర్జనలాంటి అరుపుతో సంబరం చేసుకుంటాడు. రాజ్‌కోట్‌లో మాత్రం ఇవేమీ లేకుండానే అతడి శతకాభివాదం సాగిపోయింది.అసలు తాను మూడంకెలను చేరుకున్నాడా లేదా అని అభిమానులకు అనుమానం కలిగేలా అత్యంత సాధారణంగా బ్యాట్‌ను పైకెత్తాడు. ఈ శతకం అమ్మకు అంకితం... గతంలో 80లు, 90లు చేసినా సెంచరీలుగా మల్చలేకపోయా. ఈ రోజు మాత్రం ఎలాంటి చెత్త షాట్లు కొట్టదల్చుకోలేదు. అందుకే ఉమేశ్, షమీలతో ఎప్పటికప్పుడు మాట్లాడా. శతకం చేసి తీరాలని నాకు నేను సంకల్పించుకున్నా. స్థిరంగా ఆడకుంటే ఒత్తిడిలో పడతాం. ప్రతి అవకాశాన్ని వినియోగించుకోదల్చుకున్నా. ఇంగ్లండ్‌లోనూ ఇదే ఆలోచనతో ఉన్నా. ఈ సెంచరీ మా అమ్మకు అంకితం. - జడేజా ►124 టెస్టుల్లో 24 సెంచరీలు చేసేందుకు కోహ్లి తీసుకున్న ఇన్నింగ్స్‌ల సంఖ్య. బ్రాడ్‌మన్ (66 ఇన్నింగ్స్) మాత్రమే ఇంతకంటే వేగంగా 24 సెంచరీలు చేశాడు. సచిన్‌కు 125, గావస్కర్‌కు 128 ఇన్నింగ్స్‌లు పట్టాయి. ►30 టెస్టులు, వన్డేలు కలిపి కెప్టెన్‌గా కోహ్లి సెంచరీల సంఖ్య. నాయకుడిగా అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో పాంటింగ్ (41), గ్రేమ్ స్మిత్ (33) అతనికంటే ముందున్నారు. ►24 టెస్టుల్లో కోహ్లి సెంచరీల సంఖ్య. తాజా శతకంతో సెహ్వాగ్ (23)ను అధిగమించాడు. భారత్ తరఫున సచిన్ టెండూల్కర్ (51), రాహుల్ ద్రవిడ్ (36), సునీల్ గావస్కర్ (34) మాత్రమే అతనికంటే ఎక్కువ సెంచరీలు చేశారు. ►3 వరుసగా మూడో ఏడాది టెస్టుల్లో 1000 పరుగులు చేసిన కోహ్లి ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ►1 జడేజాకు అంతర్జాతీయ క్రికెట్లో ఇదే తొలి సెంచరీ. తన 218వ మ్యాచ్‌లో అతను ఈ మార్క్‌ను అందుకున్నాడు ► 649 టెస్టుల్లో విండీస్‌పై భారత్‌కిదే అత్యధిక స్కోరు. గత రెండేళ్లలో భారత్ 600 అంతకంటే ఎక్కువ స్కోరు చేయడం ఇది ఎనిమిదోసారి. -
భారత్- అఫ్గానిస్తాన్ మ్యాచ్ టై
-
ఊరించి... ఉత్కం‘టై’
దుబాయ్: చివరి ఓవర్లో విజయానికి భారత్‌కు 7 పరుగులు కావాలి. జడేజా క్రీజ్‌లో ఉన్నాడు. నాలుగు బంతుల తర్వాత స్కోర్లు సమమయ్యాయి. మరో రెండు బంతుల్లో సింగిల్ తీయాల్సి ఉండగా జడేజా బంతిని గాల్లోకి లేపాడు. అంతే... ఆ క్యాచ్‌తో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. పసికూనలాంటి జట్టే అయినా అఫ్గానిస్తాన్ అసమాన పోరాట పటిమ కనబర్చగా... ఐదుగురు కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన భారత్ ఈ మ్యాచ్‌లో ఓటమికి చేరువగా వచ్చి చివరకు బయటపడింది. అయితే నిజాయితీగా చెప్పాలంటే మన జట్టు గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకోగా... ఓటమి అంచుల నుంచి ‘టై’ వరకు తీసుకు వచ్చిన అఫ్గాన్ సగర్వంగా ఆసియా కప్ నుంచి తిరుగు ముఖం పట్టింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. షహజాద్ (116 బంతుల్లో 124; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) అద్భుత సెంచరీతో చెలరేగగా, మొహమ్మద్ నబీ (56 బంతుల్లో 64; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జడేజాకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (66 బంతుల్లో 60; 5 ఫోర్లు, 1 సిక్స్), అంబటి రాయుడు (49 బంతుల్లో 57; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేశారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 110 పరుగులు జోడించారు. నేడు జరిగే చివరి సూపర్–4 మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు శుక్రవారం జరిగే ఫైనల్లో భారత్‌తో ఆడుతుంది. రాణించిన నబీ... అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచిన అంశం ఓపెనర్ షహజాద్ అద్భుత బ్యాటింగ్. టాప్–6 లో మిగతా ఐదుగురు విఫలమైన చోటు అతనొక్కడే మెరుపు ప్రదర్శనతో జట్టును నడిపించాడు. దీంతో పాటు చివర్లో నబీ ఆడిన ఇన్నింగ్స్ అఫ్గాన్‌కు గౌరవప్రదమైన స్కోరును అందించింది. అనుభవం తక్కువగా ఉన్న భారత పేసర్లు తడబడటంతో షహజాద్ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. 49 పరుగుల వద్ద మిడాఫ్‌లో సునాయాస క్యాచ్‌ను రాయుడు వదిలేయడంతో బతికిపోయిన షహజాద్ 37 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 63 పరుగులకు చేరింది. అయితే స్పిన్నర్లు రంగప్రవేశం చేసి మరో ఎండ్‌లో అఫ్గాన్ లైనప్‌ను దెబ్బ తీశారు. 17 పరుగుల వ్యవధిలో ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయింది. అహ్మదీ (5), రహ్మత్ (3)లను జడేజా ఔట్ చేయగా... వరుస బంతుల్లో హష్మతుల్లా (0), అస్గర్ (0)లను కుల్దీప్ పెవిలియన్ పంపించాడు. అయితే షహజాద్ మాత్రం జోరు తగ్గించలేదు. తన ధాటిని కొనసాగించిన అతను చహర్ బౌలింగ్‌లో ఫైన్ లెగ్ దిశగా ఫోర్ కొట్టి 88 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఆ సమయంలో జట్టు స్కోరు 131 కాగా, షహజాద్వే 103 పరుగులు ఉండటం అతని బ్యాటింగ్ దూకుడును చూపిస్తోంది. ఎట్టకేలకు జాదవ్ ఈ మెరుపు బ్యాటింగ్‌కు ముగింపు పలికాడు. మరో భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాఫ్‌లో క్యాచ్ ఇవ్వడంతో షహజాద్ ఆట ముగిసింది. అయితే మరో ఎండ్‌లో నబీ కూడా ధాటిని ప్రదర్శించాడు. 45 బంతుల్లోనే అతనూ హాఫ్ సెంచరీ సాధించి 48వ ఓవర్లో వెనుదిరిగాడు. చివరి పది ఓవర్లలో అఫ్గానిస్తాన్ 63 పరుగులు చేసింది. సెంచరీ భాగస్వామ్యం... ఛేదనలో భారత్‌కు కొత్త ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడిన రాహుల్, రాయుడు అఫ్గాన్ బౌలర్లపై చెలరేగారు. 10 పరుగుల వద్ద రాయుడుకు అదృష్టం కలిసొచ్చింది. ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యే అవకాశం కనిపించినా... అఫ్గాన్ జట్టు రివ్యూ కోరకపోవడంతో బతికిపోయాడు. ఆ తర్వాత వీరిద్దరు దూసుకుపోయారు. ముఖ్యంగా గుల్బదిన్ వేసిన 4 ఓవర్ల స్పెల్‌లో భారత్ 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులు రాబట్టింది. ముందుగా 43 బంతుల్లో రాయుడు అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే అదే జోరులో మరో భారీ షాట్ ఆడబోయిన అతను వెనుదిరిగాడు. తర్వాతి బంతికే హాఫ్ సెంచరీని చేరుకున్న రాహుల్ కూడా తక్కువ వ్యవధిలోనే పెవిలియన్ చేరాడు. దురదృష్టవశాత్తూ ధోని (8) కూడా ప్రభావం చూపలేకపోయాడు. అహ్మదీ బౌలింగ్‌లో అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించగా... భారత్ అప్పటికే రివ్యూ కోల్పోవడంతో మరో అవకాశం లేకపోయింది. రీప్లేలో బంతి లెగ్‌స్టంప్‌కు దూరంగా వెళుతున్నట్లు తేలింది. పాండే (8) మరోసారి తనకు లభించిన అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. జాదవ్ (19) రనౌట్ కాగా, కార్తీక్ (66 బంతుల్లో 44; 4 ఫోర్లు) కూడా కీలక సమయంలో ఔటయ్యాడు. ఆ తర్వాత అనుభవం లేని భారత బ్యాటింగ్ తీవ్ర ఒత్తిడిలో వరుసగా వికెట్లు కోల్పోయింది. -
బంగ్లాపై భారత్ ఘనవిజయం
-
జడేజా పరుగుల వేగం కంటే...
కర్ణాటక, బొమ్మనహళ్లి : క్రికెటర్ జడేజా పరుగుల వేగం కంటే దేశంలో పెట్రోల్ ధర వేగంగా పెరుగుతోందని ప్రముఖ నటి, కాంగ్రెస్ నాయకురాలు రమ్య తన ట్వీట్ లో ఎద్దేవా చేశారు. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న భారత్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ రవీంద్ర జడేజా చేసిన పరుగుల కంటే భారత దేశంలో పెట్రోల్ ధర ఎక్కువగా ఉందని ఆమె పేర్కొన్నారు. జట్టులో అత్యధిక స్కోర్ సాధించిన రవీంద్ర జడెజా 86 పరుగులు చేశారని, దేశంలో పెట్రోల్ ధర రూ. 87 ఉందని ఆమె తన ట్వీట్లో ఎద్దేవా చేశారు. -
ఎటువైపో ఈ ‘టెస్టు’
ఓపెనింగ్ శుభారంభం ఇవ్వలేదు. టాపార్డర్ సంయమనంతో ఆడలేదు. ఇక భారత మిడిలార్డర్ ఏం చేస్తుంది? టెయిలెండర్ల ఆట ఎంతసేపు... అని తేలిగ్గా నిట్టూర్చిన క్రికెట్ అభిమానులకు తెలుగు తేజం విహారి, జడేజా షాక్ ఇచ్చే ప్రదర్శన ఇచ్చారు. మొదట కుదురుగా ఆడుకున్నారు. తర్వాత ఇన్నింగ్స్‌ను ఆదుకున్నారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ నిలకడగా ఆడుతుండటంతో ఈ టెస్టు రసకందాయంగా మారింది. ఎటువైపు మొగ్గేది నేటి ఆటతో తేలుతుంది. లండన్: ఇక ఆఖరి టెస్టు ఫలితం ఏకపక్షం కాబోదు. ఆతిథ్య జట్టే గెలుస్తుందన్న అంచనాలు నిలబడవు. గెలిచే బరిలో భారత్ కూడా ఉండే అవకాశముంది. ఇదంతా ఇద్దరి ఆటతీరుతో మారిపోయింది. ఆరు వికెట్లు పారేసుకున్న భారత బ్యాటింగ్‌కు తొలి టెస్టు ఆడుతోన్న తెలుగు తేజం గాదె హనుమ విహారి (124 బంతుల్లో 56; 7 ఫోర్లు, 1 సిక్స్) ఊతమిస్తే... లోయర్ మిడిలార్డర్లో రవీంద్ర జడేజా (156 బంతుల్లో 86; 11 ఫోర్లు, 1 సిక్స్) సత్తా చాటాడు. దీంతో ఇంగ్లండ్ ఆధిపత్యానికి గండిపడింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 95 ఓవర్లలో 292 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆతిథ్య జట్టుకు కేవలం 40 పరుగుల ఆధిక్యమే లభించింది. అండర్సన్, స్టోక్స్, మొయిన్ అలీ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 43 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. కెరీర్లో చివరి టెస్టు ఇన్నింగ్స్ ఆడుతోన్న కుక్ (125 బంతుల్లో 46 బ్యాటింగ్; 3 ఫోర్లు)తోపాటు కలిసి కెప్టెన్ రూట్ (43 బంతుల్లో 29 బ్యాటింగ్; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. షమీ, జడేజా ఒక్కో వికెట్ తీశారు. ప్రస్తుతం 40 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఇంగ్లండ్ 154 పరుగుల ఆధిక్యంలో ఉంది. అర్ధ శతకాలతో... ఓవర్‌నైట్ స్కోరు 174/6తో ఆదివారం ఆట ప్రారంభించిన భారత్‌ను విహారి, జడేజాలిద్దరూ ఆదుకున్నారు. తొలి సెషన్లో వీరిద్దరు నెలకొల్పిన కీలక భాగస్వామ్యం ఇంగ్లండ్ ఆధిక్యాన్ని బాగా తగ్గించింది. ముందుగా క్రీజులో పాతుకునేందుకు ప్రాధాన్యమిచ్చిన వీరిద్దరు ఆ తర్వాత పరుగులు జోడించడంపై దృష్టి పెట్టారు. అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ ఎంత కవ్వించినా షాట్ల జోలికి వెళ్లకుండా నింపాదిగా ఆడారు. తొలి గంటలో 33 పరుగులు వచ్చాయి. అలా 63వ ఓవర్లో జట్టు స్కోరు 200 పరుగులకు చేరింది. అడపాదడపా జడేజా బ్యాట్‌కు పనిచెప్పినా... విహారి మాత్రం కుదురుగా ఆడాడు. ఈ క్రమంలోనే తెలుగు కుర్రాడు తన తొలి టెస్టులోనే 104 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. తద్వారా కరుణ్ నాయర్‌ను కాదని కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకానికి న్యాయం చేశాడు. ఈ సెషన్ సాగుతున్న కొద్దీ ఇంగ్లండ్ శిబిరంలో కలవరం మొదలైంది. అయితే లంచ్ విరామానికి ముందు ఎట్టకేలకు మొయిన్ అలీ ఈ జోడీని విడగొట్టాడు. జట్టు స్కోరు 237 పరుగుల వద్ద విహారి కీపర్ బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. ఏడో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. దీంతో ఇషాంత్ క్రీజ్‌లోకి రాగా లంచ్ తర్వాత పరుగుల బాధ్యతను పూర్తిగా జడేజా తీసుకున్నాడు. అవతలి బ్యాట్స్‌మెన్‌కు అవకాశమివ్వకుండా డబుల్స్, బౌండరీలు బాదేందుకు ఉత్సాహం చూపాడు. 113 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న జడేజా... ఇషాంత్ (4), షమీ (1), బుమ్రా (0) సాయంతో 55 పరుగులు జోడించడం విశేషం. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 332; భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (బి) కరన్ 37; ధావన్ ఎల్బీడబ్ల్యూ (బి) బ్రాడ్ 3; పుజారా (సి) బెయిర్ స్టో (బి) అండర్సన్ 37; కోహ్లి (సి) రూట్ (బి) స్టోక్స్ 49; రహానే (సి) కుక్ (బి) అండర్సన్ 0; విహారి (సి) బెయిర్‌స్టో (బి) మొయిన్ అలీ 56; రిషభ్ పంత్ (సి) కుక్ (బి) స్టోక్స్ 5; జడేజా (నాటౌట్) 86; ఇషాంత్ శర్మ (సి) బెయిర్‌స్టో (బి) మొయిన్ అలీ 4; షమీ (సి) బ్రాడ్ (బి) రషీద్ 1; బుమ్రా (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (95 ఓవర్లలో ఆలౌట్) 292. వికెట్ల పతనం: 1–6, 2–70, 3–101, 4–103, 5–154, 6–160, 7–237, 8–249, 9–260, 10–292. బౌలింగ్: అండర్సన్ 21–7–54–2, బ్రాడ్ 20–6–50–1, స్టోక్స్ 16–2–56–2, కరన్ 11–1–49–1, మొయిన్ అలీ 17–3–50–2, రషీద్ 10–2–19–1. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: అలిస్టర్ కుక్ (బ్యాటింగ్) 46; జెన్నింగ్స్ (బి) షమీ 10; మొయిన్ అలీ (బి) జడేజా 20; రూట్ (బ్యాటింగ్) 29, ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (43 ఓవర్లలో 2 వికెట్లకు) 114. వికెట్ల పతనం: 1–27, 2–62. బౌలింగ్: బుమ్రా 12–4–26–0, ఇషాంత్ శర్మ 7–3–11–0, షమీ 10–3–32–1, జడేజా 14–2–36–1. శభాష్... విహారి దేశవాళీ మ్యాచ్‌ల్లో నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకునే హనుమ విహారి అరంగేట్రం చేసిన అంతర్జాతీయ మ్యాచ్‌లో జట్టును ఆదుకున్నాడు. సరిగ్గా టెస్టులకు సరిపోయే ఇన్నింగ్స్‌ను తన మొదటి టెస్టులోనే పరిచయం చేశాడు. ఆరో నంబర్లో సరిగ్గా నప్పే బ్యాట్స్‌మన్‌గా టీమ్ మేనేజ్మెంట్లో ఆశలు పెంచాడు. జడేజాతో కలిసి తొలి సెషన్లో విహారి చేసిన అర్ధశతక పోరాటం ఏ మాత్రం తీసిపోనిది. అప్పటికే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇన్నింగ్స్‌ను బాధ్యతాయుత బ్యాటింగ్‌తో గాడిన పెట్టాడు. వికెట్‌ను కాపాడుకుంటూ... ఒక్కో పరుగును జత చేస్తూ... పరుగుల పయనాన్ని అర్ధసెంచరీ దాకా సాగించాడు. జడేజా కూడా విహారికి అండగా నిలువడంతో ఇంగ్లండ్ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. ఈ జోడీని తొందరగా విడగొట్టేందుకు కెప్టెన్ రూట్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా విహారి ఏకాగ్రతను కోల్పోలేదు. ఇంగ్లండ్ గడ్డపై అరంగేట్రం టెస్టులోనే అర్ధసెంచరీ చేసిన మూడో భారత బ్యాట్స్‌మెన్‌గా విహారి నిలిచాడు. ఇంతకుముందు గంగూలీ, ద్రవిడ్‌లు ఒకే టెస్టులో ఈ ఘనత సాధించారు. ఈ దిగ్గజాల సరసన విహారి నిలిచాడు. -
చివరి టెస్ట్: జడేజా ఒంటరి పోరాటం
లండన్ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 292 పరుగులుకు ఆలౌట్ అయ్యింది. ఆల్‌రౌండర్ జడేజా 86 పరుగులతో చివరి వరకూ పోరాడి నాటౌట్‌గా నిలిచాడు. 176 పరుగులతో మూడోరోజు ఆట ప్రారంభించిన భారత్‌ను విహారి, జడేజా ఆదుకున్నారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అరంగేట్ర మ్యాచ్‌లోనే తెలుగు కుర్రాడు హనుమ విహారి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. జట్టు స్కోర్ 237 వద్ద హనుమ విహారి (56)ని మెయిన్ అలీ ఔట్ చేశాడు. దీంతో భారత్ మరో ఇరవై పరుగుల లోపు ఆలౌట్ అవుతుందని భావించారు. కానీ జడేజా ఒంటరి పోరాటంతో భారత్ 292 పరుగులు చేయగలిగింది. ఇషాంత్ శర్మ (4) కొద్ది సేపు క్రీజ్‌లో జడేజాకు అండగా నిలిచాడు. ఆ తరువాత వచ్చిన షమి వెంటనే ఔటైనా.. చివరి వికెట్‌గా వచ్చిన బూమ్రా సహాయంతో జడేజా పోరాడాడు. చివరి వికెట్‌గా బూమ్రా రనౌట్ కావడంతో భారత్ ఇన్సింగ్స్ ముగిసింది. చివరి వికెట్‌కు 32 పరుగుల భాగస్వామ్యం నమోదవ్వడం విశేషం. దీంతో ఇంగ్లండ్‌కు మొదటి ఇన్సింగ్స్‌లో 40 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్, స్టోక్స్, మోయిన్ అలీలకు రెండేసి వికెట్లు దక్కగా.. బ్రాడ్, కరణ్, రషీద్‌లు తలో వికెట్ దక్కించుకున్నారు. -
జడేజా వరుస క్యాచ్‌ల్లో విఫలం
-
జడేజా అవుట్.. అశ్విన్ ఇన్
న్యూఢిల్లీ : ఇరానీ కప్ క్రికెట్ టోర్నమెంట్‌ను దృష్టిలో పెట్టుకుని టీమ్‌ను సెలెక్ట్ చేసిన బీసీసీఐ సీనియర్ స్పిన్నర్ అశ్విన్‌కు చోటు కల్పించింది. గాయంతో బాధపడుతున్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్థానాన్ని అశ్విన్ భర్తీ చేయనున్నాడు. గాయం కారణంగా దేవధర్ ట్రోఫీకి దూరమైన అశ్విన్ ప్రస్తుతం కోలుకోవడంతో రెస్టాఫ్ ఇండియా స్క్వాడ్‌కు ఎంపిక చేసినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ టీమ్‌కు కరుణ్ నాయర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ వంటి యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు. రెస్టాఫ్ ఇండియా జట్టు మార్చ్ 14 నుంచి 18 వరకు నాగపూర్‌లో జరగనున్న మ్యాచ్‌లో రంజీ ట్రోఫీ చాంపియన్స్‌తో తలపడనుంది. రెస్టాఫ్ ఇండియా జట్టు: కరుణ్ నాయర్(కెప్టెన్), పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్, ఆర్. సమర్థ్, మయాంక్ అగర్వాల్, హనుమ విహారీ, కేఎస్ భరత్(వికెట్ కీపర్), అశ్విన్, జయంత్ యాదవ్, షాబాజ్ నదీమ్, అన్మోల్ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ కౌల్, అంకిత్ రాజ్‌పుత్, నవ్‌దీప్ సైనీ, అతీత్ -
6,7,8 నిలిచేవారెవరు?
2014 డిసెంబర్ 13... వేదిక అడిలైడ్. ప్రత్యర్థి ఆస్ట్రేలియా. మ్యాచ్ చివరి రోజు లక్ష్యం 364. మురళీ విజయ్ (99), విరాట్ కోహ్లి (141) అద్భుతంగా ఆడుతున్నారు. భారత్ గెలుపు దిశగా దూసుకెళ్తోంది. ఇంతలో శతకం చేజార్చుకుంటూ విజయ్ అవుటయ్యాడు. అప్పటికి చేయాల్సింది 122 పరుగులే. మరో ఎండ్‌లో కోహ్లి పాతుకుపోయాడు. కానీ... తర్వాత అతడికి సహరించేవారు కరవయ్యారు. 78 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కోల్పోయిన భారత్ 48 పరుగుల తేడాతో ఓడిపోయింది. (ఈ జట్టులో అశ్విన్, జడేజా లేరు). 2015 నవంబర్... చండీగఢ్‌లో భారత్, దక్షిణాఫ్రికా టెస్టు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 154 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో జడేజా (38), అశ్విన్ (20) ఎనిమిదో వికెట్‌కు 42 పరుగులు జోడించారు. ఈ ఇన్నింగ్స్‌లో వీరిద్దరిదే రెండో అత్యధిక భాగస్వామ్యం. రెండు జట్ల తరఫున స్వల్ప స్కోర్లు నమోదైన ఈ టెస్టులో భారత్ 108 పరుగులతో గెలిచింది. ...ఈ రెండు ఉదాహరణలు స్వదేశంలో అయినా, విదేశంలో అయినా టెస్టుల్లో 6,7,8 స్థానాల్లో బ్యాటింగ్ చేయగలిగినవారి ప్రాధాన్యతను చాటుతున్నాయి. మొదట బ్యాటింగ్ చేపడితే ప్రధాన బ్యాట్స్‌మెన్‌కు అండగా నిలుస్తూ, తమవంతుగా పరుగులు చేస్తూ భారీ స్కోరుకు దోహదపడటం, రెండోసారి బ్యాటింగ్ చేయాల్సి వస్తే ప్రత్యర్థి స్కోరును అందుకునేందుకు నిచ్చెనలా నిలవడం ఈ స్థానాల్లో ఆడేవారి బాధ్యత. ఒకవేళ బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలమైతే ఫాలోఆన్ ప్రమాదాన్ని తప్పిస్తూ గౌరవప్రదమైన స్కోరుకు పాటుపడటం వీరి విధి. స్వదేశంలో ఈ విషయంలో మన జట్టుకు ఢోకా లేదు. కూర్పు మారిపోయి అదనంగా పేసర్‌ను ఆడించాల్సిన విదేశాల్లోనే ఈ ఇబ్బందంతా. భారత్ ప్రస్తుతం పాటిస్తున్న పద్ధతి ప్రకారం ఓపెనర్లు, పుజారా, కోహ్లి, రహానే/రోహిత్‌లు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా తొలి అయిదు స్థానాల్లో వస్తారు. ఆరో నంబరు వికెట్ కీపర్‌గా వృద్ధిమాన్ సాహాది. ఇక్కడ ఎలాగూ స్పిన్ పిచ్లే కాబట్టి అశ్విన్, జడేజా 7, 8 స్థానాల్లో ఆడేవారు. మ్యాచ్ పరిస్థితులరీత్యా కొంత మారినా అటుఇటుగా ఈ ముగ్గురిది మాత్రం ఇదే బ్యాటింగ్ ఆర్డర్. బయట మాత్రం ఇది చెల్లుబాటు కాదు. విదేశాల్లో కూర్పు మార్పు... అయిదుగురు బ్యాట్స్‌మెన్, కీపర్, ఒక ఆల్‌రౌండర్, ఒక స్పిన్నర్, ముగ్గురు పేసర్లు. బహుశా సఫారీ టూర్లో ఇదే భారత్ వ్యూహం. అలవాటైన వికెట్లపై మన బ్యాట్స్‌మన్ స్వదేశంలో పరుగుల వరద పారించేవారు. లోయర్ ఆర్డర్ ఆడినా, ఆడకున్నా ప్రభావం కనిపించేది కాదు. విదేశాల్లో విజయం సాధించాలంటే మాత్రం సమష్టిగా ఆడాల్సిందే. చివరి శ్రేణిలోని బౌలింగ్ ఆల్‌రౌండర్లు... టాప్, మిడిలార్డర్‌కు దన్నుగా నిలవాల్సిందే. వారు తమవంతుగా 20లు 30లైనా జత చేయాలి. అయితే పూర్తి పేస్ పిచ్‌లుండే దక్షిణాఫ్రికాలో ఒక్క స్పిన్నర్‌తోనే బరిలో దిగాల్సి ఉంటుంది. ఈ ప్రకారం 6, 7 స్థానాల్లో సాహా, హార్దిక్ పాండ్యా, 8లో అశ్విన్ వస్తారు. సరిగ్గా వీరే గెలుపునకు కీలకం అవుతారు. దేశంలో నంబర్‌వన్ టెస్టు కీపర్‌గా పేరున్న సాహా... మూడేళ్ల క్రితం ఆసీస్‌లో కీలక సమ యంలో అనవసర దూకుడు కనబర్చి విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే గతేడాది వెస్టిండీస్‌లో శతకం సాధించి వాటికి తగిన జవాబిచ్చాడు. తెలివైన క్రికెటర్‌గా అశ్విన్ ఎక్కడైనా ఉపయోగపడేవాడే. దక్షిణాఫ్రికా బౌలింగ్ దాడిని కాచుకుంటూ వీరు నమోదు చేసే భాగస్వామ్యాలే జట్టుకు విలువైనవిగా మారతాయనడంతో సందేహం లేదు. హార్దిక్ ఏం చేస్తాడో...? పేస్ ఆల్‌రౌండర్‌గా తుది జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తున్న హార్దిక్ పాండ్యాకు ఈ సిరీస్ కీలకం కానుంది. ఇటీవలే లంకపై అరంగేట్రం చేసిన పాండ్యా శతకం కూడా సాధించాడు. భారీ హిట్టింగ్తో బ్యాట్స్‌మన్‌గా నిరూపించుకున్న పాండ్యా... తన పేస్ పదును చూపాల్సిన సమయం వచ్చింది. మ్యాచ్ స్థితికి అనుగుణంగా తనను తాను మలుచుకోవాల్సి ఉంటుంది. తద్వారా ‘కోహ్లికి పాండ్యా ఒక ఆయుధం’ అన్న మాస్టర్ సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యలకూ సార్థకత చేకూర్చిన వాడవుతాడు. అచ్చొచ్చే(నా) ‘9’ 9... ఈ సంఖ్యను చాలామంది ఇష్టపడతారు. ఇదే సంఖ్య సఫారీ పర్యటనలో భారత జట్టుకూ ఎంతోకొంత ఉపయోగపడుతుందేమో చూడాలి. ఎందుకంటే ఈ స్థానంలో బ్యాటింగ్ వచ్చేది పేసర్ భువనేశ్వర్. కొంతకాలంగా బౌలింగ్‌లో 140 కి.మీ. వేగం అందుకుంటున్న భువీ బ్యాటింగ్‌లోనూ ఓ చేయి వేస్తున్నాడు. శ్రీలంకతో వన్డేలో బ్యాట్స్‌మెన్ విఫలమైన చోట అతడు సాధించిన అర్ధ సెంచరీ జట్టును ఓటమి నుంచి గట్టెక్కించింది. స్ట్రోక్స్ ఆడటంలోనూ భువీ మెరుగయ్యాడు. ఈ నేప థ్యంలో దక్షిణాఫ్రికాలోనూ జట్టు బ్యాటింగ్ ప్రయోజనాలకు ఉపయోగపడతామో చూడాలి. చేజారితే మ్యాచ్ పోయినట్లే... అవి అసలు సిసలు పేస్ పిచ్‌లు... బ్యాట్ అంచులకు తగిలిన బంతి స్లిప్‌లోకి వచ్చేందుకు క్షణం కూడా పట్టదు. అలాంటివాటిని ఒడిసిపట్టాలంటే ఫీల్డర్‌కు ఓపికతో పాటు తీక్షణత అవసరం. గతంలో భారత్‌కు ఈ ఏరియాలో రాహుల్ ద్రవిడ్, లక్ష్మణ్ వంటివారు పెట్టని కోటగా ఉండేవారు. ప్రస్తుత జట్టులో రహానే తప్ప... స్లిప్ స్పెషలిస్టుల లోటు కనిపిస్తోంది. ఇతడికి తోడుగా మరో చురుకైన ఆటగాడిని ఎంచుకోవాలి. కోహ్లి... ఇటీవలి శ్రీలంక సిరీస్‌లో తరచూ స్లిప్ ఫీల్డర్లను మార్చి ప్రయోగం చేసినా ఫలితం రాబట్టలేకపోయాడు. పైగా విలువైన క్యాచ్‌లు నేలపాలయ్యాయి. ఇదే తీరు ఎల్గర్, ఆమ్లా, డివిలియర్స్, డుప్లెసిస్, డికాక్ వంటి బ్యాట్స్‌మన్ ఉన్న దక్షిణాఫ్రికాపైనా కొనసాగితే విజయం గురించి ఆలోచించడం సాహసమే అవుతుంది. ఒంటిచేత్తో ఫలితాన్ని మార్చేసే ఇలాంటివారి క్యాచ్‌లు చేజారిస్తే మ్యాచ్‌లో తిరిగి కోలుకోవడం కష్టం. ధావన్ సిద్ధం... జడేజా అనుమానం! భారత ఓపెనర్ శిఖర్ ధావన్ పూర్తి ఫిట్నెస్తో తొలి టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. అయితే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అస్వస్థత జట్టును కలవరపరుస్తోంది. రేపటి నుంచి కేప్‌టౌన్ టెస్టు ప్రారంభమవుతుండగా... అతను వైరల్ జ్వరం బారిన పడ్డాడు. ‘ధావన్ ఫిట్‌గా ఉన్నాడు. చీలమండ గాయంతోనే సఫారీకి బయల్దేరిన అతను తొలి టెస్టు ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు’ అని బీసీసీఐ తెలిపింది. రెండు రోజులుగా వైరల్ జ్వరం బారిన పడిన జడేజాను బీసీసీఐ వైద్య సిబ్బంది, స్థానిక వైద్యులు పరీక్షించారు. మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అతను తుది జట్టులో ఉండేది లేనిది శుక్రవారమే తెలుస్తుంది.