ఉఫ్... గట్టెక్కాం! | Kohli stands strong as Rajkot Test ends in draw | Sakshi
Sakshi News home page

ఉఫ్... గట్టెక్కాం!

Published Sun, Nov 13 2016 11:40 PM | Last Updated on Mon, Sep 4 2017 8:01 PM

ఉఫ్...   గట్టెక్కాం!

ఉఫ్... గట్టెక్కాం!

ఇంగ్లండ్‌తో తొలి టెస్టును ‘డ్రా’ చేసుకున్న భారత్  ఆఖరి వరకూ పోరాడిన కోహ్లి
అండగా నిలిచిన అశ్విన్, జడేజా  రెండో టెస్టు 17 నుంచి వైజాగ్‌లో 

లక్ష్యం పెద్దది... కాబట్టి గెలవడం సాధ్యం కాదు... 53 ఓవర్ల పాటు నిలబడితే మ్యాచ్‌ను డ్రా చేసుకోవచ్చు. తొలి ఇన్నింగ్‌‌సలో అందరూ బాగానే ఆడారు... అటు ఐదో రోజు ఉదయం సెషన్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ కూడా బాగా ఆడారు. కాబట్టి ఇది అసాధ్యమేమీ కాదు... ఇలాంటి స్థితిలో రెండో ఇన్నింగ్‌‌స మొదలుపెట్టిన భారత్... వరుసగా వికెట్లు కోల్పోతూ ఓ దశలో ఓటమి ప్రమాదంలో పడింది. నమ్ముకున్న బ్యాట్స్‌మెన్ అంతా నిరాశపరిచినా... అశ్విన్, జడేజాల సహకారంతో కోహ్లి పోరాడటంతో భారత్ గట్టెక్కింది. ఇంగ్లండ్‌తో తొలి టెస్టును డ్రా చేసుకుని టీమిండియా ఊపిరి పీల్చుకుంది. 

రాజ్‌కోట్: పిచ్ చుట్టూ ఫీల్డర్ల మోహరింపు.... స్పిన్నర్లు వేసే బంతులను ఆడేందుకు బ్రేక్ డ్యాన్‌‌స చేసే బ్యాట్స్‌మెన్... భారత్‌లో జరిగే టెస్టు మ్యాచ్‌ల్లో ఆఖరి రోజు ఆటలో ఇలాంటి దృశ్యాలు కనిపించడం సాధారణమైపోరుుంది. ప్రత్యర్థిని స్పిన్‌తో ఉక్కిరిబిక్కిరి చేసి మ్యాచ్‌లు గెలవడం భారత్‌కు అలవాటుగా మారింది. అరుుతే ఈసారి సీన్ రివర్స్ అరుుంది. ఇంగ్లండ్ జట్టు సంచలన ఆటతీరుతో భారత్‌ను ఆఖరి నిమిషం వరకూ వణికించింది. భారత్‌కు అలవాటైన శైలిలో ఆడిన కుక్ సేన తొలి టెస్టును పూర్తి ఆధిపత్యంతో ‘డ్రా’ చేసుకుంది. సౌరాష్ట్ర క్రికెట్ సంఘం (ఎస్‌సీఏ) స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆదివారం ఆఖరి రోజు 310 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్... ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్‌‌సలో 52.3 ఓవర్లలో ఆరు వికెట్లకు 172 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లి (98 బంతుల్లో 49 నాటౌట్; 6 ఫోర్లు) చివరి దాకా పోరాడి మ్యాచ్‌ను డ్రా చేయగలిగాడు. అశ్విన్ (53 బంతుల్లో 32; 6 ఫోర్లు), రవీంద్ర జడేజా (33 బంతుల్లో 32 నాటౌట్; 6 ఫోర్లు) కెప్టెన్‌కు అండగా నిలబడ్డారు. ఇంగ్లండ్ స్పిన్నర్ రషీద్ మూడు వికెట్లు తీశాడు.

అంతకుముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్‌‌సలో 75.3 ఓవర్లలో మూడు వికెట్లకు 260 పరుగుల వద్ద ఇన్నింగ్‌‌సను డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్, కెప్టెన్ కుక్ (243 బంతుల్లో 130; 13 ఫోర్లు) సెంచరీ సాధించగా... హమీద్ (177 బంతుల్లో 82; 7 ఫోర్లు, 1 సిక్సర్) ఆకట్టుకున్నాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 180 పరుగులు జోడించడం విశేషం. స్టోక్స్ (29 నాటౌట్) కూడా రాణించాడు. భారత బౌలర్లలో అమిత్ మిశ్రాకు రెండు వికెట్లు లభించగా... అశ్విన్ ఒక వికెట్‌తో సంతృప్తి పడ్డాడు. తొలి ఇన్నింగ్‌‌స ఆధిక్యం 49 పరుగులు కలుపుకుని ఇంగ్లండ్‌కు మొత్తం 309 పరుగుల ఆధిక్యం లభించడంతో భారత్‌కు 310 పరుగుల లక్ష్యం ఎదురరుుంది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొరుున్ అలీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఐదు టెస్టుల సిరీస్‌లో రెండు జట్లు ప్రస్తుతం 0-0తో సమఉజ్జీగా ఉన్నారుు. రెండో టెస్టు ఈ నెల 17 నుంచి విశాఖపట్నంలో జరుగుతుంది.

సెషన్ 1: ఓపెనర్ల జోరు
ఇంగ్లండ్ ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ కుక్, హమీద్ నిలకడగా ఆడారు. 122 బంతుల్లో కుక్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓపెనర్లిద్దరూ అడపాదడపా బౌండరీలతో మంచి భాగస్వామ్యాన్ని నిర్మిస్తూ వెళ్లారు. ఓ ఎండ్‌లో కుక్ వేగం పెంచగా... రెండో ఎండ్‌లో హమీద్... మిశ్రా బౌలింగ్‌లో బౌలర్‌కే క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. తన మరుసటి ఓవర్లోనే మిశ్రా... రూట్‌ను కూడా అవుట్ చేశాడు. రెండు వికెట్లు వెంటవెంటనే పడ్డా...కుక్ ఏ మాత్రం తడబడకుండా ఆడాడు. ఈ క్రమంలోనే 194 బంతుల్లో తన 30వ టెస్టు శతకం చేశాడు.
ఓవర్లు: 29 పరుగులు: 97 వికెట్లు: 2

సెషన్ 2: భారత్ తడబాటు
లంచ్ తర్వాత కుక్ మరికొంత వేగం పెంచాడు. వేగంగా పరుగులు చేసే ప్రయత్నంలో అశ్విన్ బౌలింగ్‌లో లాంగాఫ్‌లో క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఇంగ్లండ్ వెంటనే ఇన్నింగ్‌‌సను డిక్లేర్ చేసింది. భారత్ రెండో ఇన్నింగ్‌‌స  రెండో ఓవర్లోనే వోక్స్ బౌలింగ్‌లో గంభీర్ సున్నాకే అవుటయ్యాడు. తొలి మూడు ఓవర్ల పాటు భారత్ ఒక్క పరుగు కూడా చేయలేదు. పుజారా, విజయ్ ఇద్దరూ ఆత్మరక్షణ ధోరణిలో ఆడారు. 13 పరుగుల వద్ద విజయ్, 10 పరుగుల వద్ద పుజారా ఇచ్చిన క్యాచ్‌లను ఇంగ్లండ్ ఫీల్డర్లు వదిలేశారు.   పుజారా అవుట్ కావడంతో ఇంగ్లండ్ ఈ సెషన్‌లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది.
ఓవర్లు: 27.3 పరుగులు: 98 వికెట్లు: 3

సెషన్ 3: ఆఖర్లో ఉత్కంఠ
టీ తర్వాత ఐదో ఓవర్లో విజయ్‌ను కూడా రషీద్ అవుట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే రహానే కూడా అలీ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దీంతో కోహ్లి, అశ్విన్ కలిసి మరింత జాగ్రత్తగా ఆడారు. ఉన్నంతసేపు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ కంటే నిలకడగా ఆడిన అశ్విన్... అన్సారీ బౌలింగ్‌లో రూట్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. సాహా రెండు ఫోర్లు కొట్టినా రషీద్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ ఆరో వికెట్ కోల్పోరుుంది. అప్పటికి మరో 26 నిమిషాల ఆట మిగిలి ఉంది. ఈ దశలో కోహ్లి జతగా వచ్చిన జడేజా బాగా ఆడాడు. నిజానికి ఈ సమయంలో మరో వికెట్ పడితే మ్యాచ్ చేజారేదే. అరుుతే జడేజా, కోహ్లి ద్వయం కలిసి ఆ ప్రమాదం జరగకుండా చేసుకున్నారు. ఆఖరి ఓవర్‌లో మూడు బంతులు వేశాక ఇక ఫలితం రాదు కాబట్టి ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచ్‌ను డ్రాగా ముగించేందుకు అంగీకరించారు.
ఓవర్లు: 34.3 పరుగులు: 123 వికెట్లు: 4

5   భారత్‌లో కుక్ చేసిన సెంచరీలు. భారత్‌లో అత్యధిక సెంచరీలు చేసిన విదేశీ ఆటగాడిగా కుక్ రికార్డు సృష్టించాడు.

12   మ్యాచ్ మూడో ఇన్నింగ్‌‌సలో కుక్ చేసిన సెంచరీల సంఖ్య. సంగక్కర రికార్డును సమం చేశాడు. అలాగే ఇంగ్లండ్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్‌గా గూచ్ (11) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు.

12   స్వదేశంలో వరుసగా 12 విజయాల తర్వాత భారత్ ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. చివరిసారిగా 2012లో ఇంగ్లండ్ జట్టుతో డ్రా తర్వాత భారత్ ఇక్కడ ఆడిన అన్ని మ్యాచ్‌లూ గెలిచింది.

5   ఏడాదిలో వెరుు్య పరుగులు పూర్తి చేయడం కుక్‌కు ఇది ఐదోసారి. సచిన్ (6) తర్వాత స్థానంలో కుక్ ఉన్నాడు. హేడెన్, పాంటింగ్, సంగక్కర, లారా, కలిస్ కూడా ఐదు సార్లు ఏడాదిలో వెరుు్య పరుగులు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement