అలవోకగా ముగించారు | india beat in england 3rd test match | Sakshi
Sakshi News home page

అలవోకగా ముగించారు

Published Tue, Nov 29 2016 11:49 PM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM

అలవోకగా ముగించారు

అలవోకగా ముగించారు

మూడో టెస్టులో భారత్ ఘనవిజయం
8 వికెట్లతో ఇంగ్లండ్ చిత్తు
సిరీస్‌లో 2-0తో ఆధిక్యం
డిసెంబర్ 8 నుంచి నాలుగో టెస్టు  

గెలవడం కాస్త ఆలస్యం అరుుందేమో గానీ... గెలుపు మాత్రం అనాయాసంగానే వచ్చింది. ఊహించినదానికి భిన్నంగా నాలుగో రోజు ఆట చివరి సెషన్ వరకు వెళ్లినా, భారత్‌కు ఎలాంటి ఇబ్బందీ ఎదురుకాలేదు. ముందుగా ఆరు వికెట్లు తీసి ఇంగ్లండ్ పని పట్టిన కోహ్లి సేన, ఆ తర్వాత చిన్నపాటి లక్ష్యాన్ని వేగంగా చేరుకుంది. ఆల్‌రౌండర్ నైపుణ్యం భారత్‌కు విజయాన్ని అందించగా, బ్యాటింగ్ వైఫల్యం ఇంగ్లండ్‌ను దెబ్బ తీసింది. మూడో రోజే కీలక వికెట్లు కోల్పోయి వెనుకబడిపోయిన కుక్ బృందం... భారత్‌ను రెండోసారి బ్యాటింగ్‌కు దించడం మినహా ఎలాంటి ప్రతిఘటన, సంచలనం లేకుండానే తలవంచింది. గాయంతో బాధపడుతూనే హమీద్ చేసిన పోరాటం ఆ జట్టు కనీస పోటీ ఇచ్చేందుకు సరిపోకపోగా... జడేజా, షమీ బౌలింగ్‌తోపాటు పార్థివ్ పటేల్ మెరుపులతో మొహాలీలో మన జట్టు భాంగ్రా నృత్యం చేసింది. 

మొహాలీ: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత జట్టు మూడో టెస్టులో అలవోక విజయం సాధించింది. మ్యాచ్ నాలుగో రోజు మంగళవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 78/4తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్ లో 236 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (179 బంతుల్లో 78; 6 ఫోర్లు), హసీబ్ హమీద్ (156 బంతుల్లో 59 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. భారత బౌలర్లలో అశ్విన్ 3 వికెట్లు తీయగా, జయంత్, షమీ, జడేజా తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 103 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 20.2 ఓవర్లలో 2 వికెట్లకు 104 పరుగులు చేసింది. పార్థివ్ పటేల్ (54 బంతుల్లో 67 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు రవీంద్ర జడేజాకు దక్కింది. ఈ విజయంతో ఐదు టెస్టులో సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యం సాధించింది. ఇక జట్టు సిరీస్ చేజార్చుకునే అవకాశం ఏ మాత్రం లేదు. కొంత విరామం తర్వాత నాలుగో టెస్టు డిసెంబర్ 8 నుంచి ముంబైలో జరుగుతుంది.

సెషన్-1: రూట్ అర్ధ సెంచరీ
నాలుగో రోజు జడేజా తాను వేసిన తొలి ఓవర్లోనే నైట్ వాచ్‌మన్ బ్యాటీ (0)ని అవుట్ చేసి ఇంగ్లండ్ పతనానికి శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే బట్లర్ (18) కూడా వెనుదిరిగాడు. దూకుడుగా ఆడబోరుున బట్లర్, జయంత్ వేసిన తొలి ఓవర్లోనే బౌండరీ వద్ద జడేజాకు క్యాచ్ ఇచ్చాడు. చేతిగాయంతో ఓపెనింగ్ చేయలేకపోయిన హసీబ్ హమీద్ ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చాడు. మరోవైపు జడేజా బౌలింగ్‌లో ఫోర్‌తో 147 బంతుల్లో రూట్ అర్ధసెంచరీ పూర్తయింది. 6 పరుగుల వద్ద హమీద్ ఇచ్చిన కష్టసాధ్యమైన క్యాచ్‌ను పార్థివ్ వదిలేయగా... రూట్, హమీద్ కలిసి కొద్దిసేపు ఇంగ్లండ్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 45 పరుగులు జోడించిన తర్వాత జడేజా ఈ జోడీని విడదీశాడు. స్లిప్‌లో ఒంటిచేత్తో రహానే అద్భుత క్యాచ్ పట్టడంతో రూట్ వెనుదిరిగాడు. ఓవర్లు: 32, పరుగులు: 78, వికెట్లు: 3

సెషన్-2:  హమీద్ పోరాటం
లంచ్ తర్వాత హమీద్, క్రిస్ వోక్స్ (47 బంతుల్లో 30; 3 ఫోర్లు) కలిసి మరి కొంత సేపు పోరాడారు. వోక్స్ కొన్ని చక్కటి షాట్లతో చకచకా పరుగులు సాధించగా... హమీద్ దుర్బేధ్యమైన డిఫెన్‌‌సతో భారత బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా గట్టిగా నిలబడ్డాడు. ఈ స్థితిలో 82 ఓవర్ల తర్వాత కోహ్లి కొత్త బంతి తీసుకోవడంతో మ్యాచ్‌పై మన పట్టు బిగిసింది. షమీ కొత్త బంతితో తన తొలి ఓవర్లోనే ఫలితం సాధించాడు. మొదటి బంతినే అతను బౌన్సర్ వేయగా వోక్స్ హుక్ షాట్ ఆడటంలో విఫలమయ్యాడు. దాంతో బంతి అతని హెల్మెట్‌కు తగిలి దాని స్టెమ్‌గార్డ్ పడిపోరుుంది. ఆందోళనతో కోహ్లి బ్యాట్స్‌మన్ వద్దకు వెళ్లి చూశాడు. కొంత చికిత్స తర్వాత వోక్స్ మళ్లీ బ్యాట్ పట్టాడు. అరుుతే తగ్గని షమీ తర్వాతి బంతినే మళ్లీ బౌన్సర్‌గా విసిరాడు. ఇది వోక్స్ బ్యాట్ హ్యాండిల్‌కు తగిలి గాల్లోకి లేవగా పార్థివ్ క్యాచ్ అందుకోవడంతో 43 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.

మరో రెండు బంతులకే మరో బౌన్సర్‌తో రషీద్ (0)ను కూడా షమీ పెవిలియన్ పంపించాడు. అరుుతే ఆ తర్వాత హమీద్ వేగంగా పరుగులు చేశాడు. అశ్విన్ వేసిన ఒక ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అతను, అశ్విన్ మరుసటి ఓవర్లో మరో సిక్స్‌తో 147 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరకు రెండో పరుగు తీసే ప్రయత్నంలో అండర్సన్ (5) రనౌట్ కావడంలో ఇంగ్లండ్ ఇన్నింగ్‌‌స ముగిసింది. స్వల్ప  లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఆరంభంలోనే విజయ్ (0) వికెట్ కోల్పోరుుంది. మరోవైపు వోక్స్, అండర్సన్ వేసిన వరుస ఓవర్లలో పార్థివ్ రెండేసి బౌండరీలు కొట్టి దూకుడు ప్రదర్శించాడు.
ఓవర్లు: 20.2, పరుగులు: 80, వికెట్లు: 3 (ఇంగ్లండ్)
ఓవర్లు: 6, పరుగులు: 33, వికెట్లు: 1 (భారత్)

సెషన్-3:  పార్థివ్ దూకుడు
విరామం తర్వాత కూడా పార్థివ్ జోరు కొనసాగింది. రషీద్ వేసిన ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టిన అతను 39 బంతుల్లోనే హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. పార్థివ్, పుజారా (25) కలిసి రెండో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. అరుుతే విజయానికి మరో 15 పరుగుల దూరంలో రషీద్ బౌలింగ్‌లో స్వీప్ చేయబోరుు పుజారా వెనుదిరి గాడు. అరుుతే కోహ్లి (6 నాటౌట్) తో కలిసి పార్థివ్ మ్యాచ్ ముగిం చాడు. బ్యాటీ వేసిన బంతిని కవర్స్‌లో పార్థివ్ ఫోర్ కొట్టడంతో భారత్ గెలుపు ఖాయమైంది. ఓవర్లు: 14.2, పరుగులు: 71, వికెట్లు: 1

6  మొహాలీ మ్యాచ్‌తో భారత జట్టు వరుసగా 16 టెస్టుల్లో పరాజయం లేకుండా కొనసాగుతోంది. గతంలో 1985-87 మధ్య ఇండియా వరుసగా 17 టెస్టులు ఓడలేదు.

 12   కెప్టెన్‌గా వ్యవహరించిన 20 టెస్టుల్లో కోహ్లికి ఇది 12వ విజయం. గతంలో ధోనికి కూడా తన తొలి 20 టెస్టుల్లో సరిగ్గా ఇలాగే 12 విజయాలు, 2 పరాజయాలు,  6 డ్రాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement