Kohli
-
స్టార్స్ ఫ్లాప్ షో...
ఆఫ్‌స్టంప్ అవతల పడ్డ బంతులను ఆడే విషయంలో తీరు మార్చుకోని విరాట్ కోహ్లి... బ్యాటింగ్ ఆర్డర్లో ఏ స్థానంలో బరిలోకి దిగినా వైఫల్యాల బాట వీడని రోహిత్ శర్మ... అడపా దడపా మెరుపులు తప్ప నిలకడగా ఆకట్టుకోలేక ఇబ్బంది పడ్డ కేఎల్ రాహుల్... ఆల్‌రౌండరే అయినా అటు బ్యాట్‌తో, ఇటు బంతితోతనదైన ముద్ర వేయలేకపోయిన రవీంద్ర జడేజా... పేరుకు ప్రధాన పేసరే అయినా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన మొహమ్మద్ సిరాజ్... ఇలా ఒకరిని మించి మరొకరు పేలవ ప్రదర్శన కనబరిస్తే ఫలితం ఇలా కాక మరెలా ఉంటుంది! స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో అనూహ్య ‘వైట్‌వాష్’ నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండానే... ఆ్రస్టేలియాలో అడుగు పెట్టిన భారత జట్టు ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో కనీస ప్రదర్శన కనబర్చలేకపోయింది. గత రెండు పర్యాయాలు అద్వి తీయ ఆటతీరుతో కంగారూలను మట్టికరిపించి ప్రతిష్టాత్మక సిరీస్ చేజిక్కించుకున్న టీమిండియా... ముచ్చటగా మూడోసారి అదే మ్యాజిక్ చేయాలని ప్రయత్నించినా సాధ్యంకాలేదు. ‘కర్ణుడి చావుకు కారణాలు అనేకం’ అన్నట్లు... భారత జట్టు సిరీస్ కోల్పోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. వాటిని ఓసారి పరిశీలిస్తే... –సాక్షి క్రీడావిభాగం ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత జట్టు పరాజయానికి ప్రధాన కారణం బ్యాటింగే అనడంలో సందేహం లేదు. గత రెండు పర్యటనల్లో ఆ్రస్టేలియాపై భారత జట్టు పైచేయి సాధించడంలో అటు బౌలర్లతో పాటు బ్యాట్‌తో చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా గంటల తరబడి క్రీజులో పాతుకుపోయి కంగారూ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన పుజారా వంటి ఆటగాడు తాజా జట్టులో లేకపోవడం జట్టు విజయావకాశాలను దెబ్బ కొట్టింది. అంతర్జాతీయ స్థాయిలో సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ ప్లేయర్లు.. స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోవడంతో సిరీస్‌లో ఏ దశలోనూ భారత జట్టు పూర్తి ఆధిపత్యం కనబర్చలేకపోయింది. వ్యక్తిగత కారణాలతో తొలి టెస్టుకు అందుబాటులో లేకపోయిన రెగ్యులర్ కెపె్టన్ రోహిత్ శర్మ ఆ తర్వాత వరుసగా ఐదు ఇన్నింగ్స్‌ల్లో 3, 6, 10, 3, 9 పరుగులు చేశాడు. మిడిలార్డర్ నుంచి ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన తర్వాత నిలకడ పెరగడంతో పాటు విధ్వంసకర బ్యాటర్‌గా గుర్తింపు సాధించిన ‘హిట్ మ్యాన్’... వరుస వైఫల్యాలతో చివరి మ్యాచ్ నుంచి తనంతట తానే తప్పుకున్నాడంటే అతడి ఫామ్ ఎంత పేలవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జట్టులో అందరికంటే సీనియర్ అయిన విరాట్ కోహ్లి తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన తర్వాత వరుసగా 7, 11, 3, 36, 5, 17, 13 స్కోర్లు చేశాడు. విరాట్ అంకెల కన్నా అతడు అవుటైన తీరే సగటు అభిమానులను తీవ్రంగా కలచివేసింది. ఆస్ట్రేలియా బౌలర్లు ఆఫ్‌స్టంప్ అవతల బంతి వేయడం... విరాట్ దాన్ని ఆడాలా వద్దా అనే సంశయంలో బ్యాట్ తాకించడం... వికెట్ల వెనక క్యాచ్ ఇచ్చి వెనుదిరగడం... ఈ సిరీస్ మొత్తం ఇదే తంతు సాగింది. టన్నుల కొద్దీ పరుగులు చేసి ‘రన్ మెషిన్’ అనిపించుకున్న విరాట్ ఈ సిరీస్‌లో పూర్తిగా విఫలమవడం... జట్టు అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది. నిలకడలేమే ప్రధాన సమస్య రోహిత్ గైర్హాజరీలో ఓపెనర్‌గా బరిలోకి దిగి ఆకట్టుకున్న కేఎల్ రాహుల్ ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమయ్యాడు. 26, 77, 37, 7, 84, 4, 24, 0, 4, 13 ఈ సిరీస్‌లో రాహుల్ గణాంకాలివి. తొలి మూడు మ్యాచ్‌ల్లో ఫర్వాలేదనిపించిన అతడు చివరి రెండు టెస్టుల్లో విఫలం కావడంతో జట్టుకు మెరుగైన ఆరంభాలు లభించలేదు. స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో విఫలమయ్యాడు.సీనియర్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సిరీస్ మధ్యలోనే కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా... జడ్డూ తన వంతు బాధ్యత సక్రమంగా నిర్వర్తించలేకపోయాడు. ఆసీస్ పిచ్‌లపై మెరుగైన రికార్డు, మంచి అనుభవం ఉన్న హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఆ స్థాయి ప్రభావం చూపలేకపోయాడు. మరో ఎండ్ నుంచి బుమ్రా కంగారూల వెన్నులో వణుకు పుట్టిస్తుంటే... దాన్ని సొమ్ము చేసుకుంటూ వికెట్లు పడగొట్టాల్సింది పోయి... ప్రత్యరి్థకి సులువుగా పరుగులు చేసే అవకాశం ఇచ్చాడు. మొత్తంగా ఐదు మ్యాచ్‌ల్లో కలిపి 20 వికెట్లు తీసినా... ఈ ప్రదర్శన అతడి స్థాయికి తగ్గదని చెప్పలేం. జట్టు పరిస్థితులతో సంబంధం లేకుండా పదే పదే తప్పుడు షాట్ సెలెక్షన్ కారణంగా వికెట్ సమర్పించుకున్న రిషబ్ పంత్ విమర్శల పాలైతే... వచ్చిన కొన్ని అవకాశాలను శుబ్‌మన్ గిల్ ఒడిసి పట్టలేకపోయాడు. టెస్టు ఫార్మాట్లో ఇంటా బయట నిలకడైన ఆటతీరు కనబరుస్తూ గత రెండు పర్యాయాలు ‘ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్’ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత జట్టు... ఈసారి మాత్రం నిరాశ పరిచింది. చివరగా ఆడిన ఎనిమిది టెస్టుల్లో టీమిండియా కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలవడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ రేసుకు దూరం కాక తప్పలేదు. ముఖ్యంగా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0–3తో సిరీస్ కోల్పోవడం టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. నితీశ్, యశస్వి అదుర్స్ పదేళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ చేజారడంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయినప్పటికీ ఈ సిరీస్ ద్వారా భారత జట్టుకు కొంత మేలు కూడా జరిగింది. స్టార్ ఆటగాళ్లు అంచనాలకు అందుకోలేకపోతున్న సమయంలో మేమున్నామంటూ యువ ఆటగాళ్లు బాధ్యతలు తీసుకున్నారు. తొలిసారి ఆ్రస్టేలియాలో పర్యటించిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆటకట్టుకోగా... ఈ సిరీస్ ద్వారానే అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అదరగొట్టాడు. ఐదు మ్యాచ్‌ల్లో 43.44 సగటుతో 391 పరుగులు చేసిన జైస్వాల్ భారత జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్, బోలండ్ వంటి పేసర్లను జైస్వాల్ అలవోకగా ఎదుర్కొన్న తీరు భవిష్యత్తుపై భరోసా పెంచుతోంది. ఇక పేస్ ఆల్‌రౌండర్ కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న టీమిండియాకు నితీశ్ రెడ్డి రూపంలో జవాబు దొరికింది. మీడియం పేస్‌కు తోడు చక్కటి బ్యాటింగ్‌తో అతడు ఈ సిరీస్‌పై తనదైన ముద్రవేశాడు. 9 ఇన్నింగ్స్‌లు కలిపి నితీశ్ మొత్తం 298 పరుగులు సాధించి సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. టి20 ఫార్మాట్లో ధనాధన్ షాట్లు ఆడే నితీశ్... సుదీర్ఘ ఫార్మాట్‌కు పనికిరాడని విమర్శించిన వారికి మెల్బోర్న్ సెంచరీతో బదులిచ్చాడు. తనలో దూకుడుగా ఆడే శక్తితో పాటు క్రీజులో సుదీర్ఘ సమయం గడపగల సంయమనం కూడా ఉందని నిరూపించాడు. ఈ ప్రదర్శనతో నితీశ్ రెడ్డి టెస్టు జట్టులో చోటు నిలబెట్టుకోవడం ఖాయం కాగా... బౌలింగ్‌లో అతడు మరింత రాటుదేలితే భారత జట్టుకు అదనపు బలం చేకూరుతుంది. ఇక ఈ సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన అంటే అది బుమ్రాదే. తొలి టెస్టులో సారథిగా జట్టును గెలిపించిన బుమ్రా... సిరీస్ ఆసాంతం టీమ్ భారాన్ని భుజాల మీద మోశాడు. 9 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 32 వికెట్లు తీసిన బుమ్రా... చివరి ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కు చేయలేకపోవడంతోనే టీమిండియా పరాజయం పాలైందనడంలో అతిశయోక్తిలేదు. ‘బుమ్రా ఎడం చేత్తో బౌలింగ్ చేసేలా చట్టం తీసుకొస్తాం’ అని ఆ్రస్టేలియా ప్రధాని ఆల్బనీస్ అన్నాడంటే ఈ సిరీస్‌లో జస్ప్రీత్ జోరు ఎలా సాగిందో ఊహించుకోవచ్చు. -
సచిన్ ఎవరెస్ట్.. కోహ్లీ బిస్కెట్.. ఇదిగో ప్రూఫ్!
-
వర్షం ఎఫెక్ట్.. ఆస్ట్రేలియా- భారత్ మూడో టెస్టు హైలెట్స్ (ఫొటోలు)
-
సంధి కాలం కాదు... సత్తా చాటాల్సిన సమయం!
సొంతగడ్డపై టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్ చేతిలో అనూహ్యంగా చిత్తయిన తర్వాత భారత క్రికెట్ జట్టు అతి పెద్ద సమరానికి సిద్ధమైంది. ఐదు టెస్టుల బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో పాల్గొనేందుకు టీమిండియా ఆ్రస్టేలియాకు బయలదేరింది. స్వదేశంలో ప్రదర్శన తర్వాత జట్టుపై అంచనాలు తక్కువగానే ఉన్నా... కంగారూ గడ్డపై గత రెండు సిరీస్‌లూ నెగ్గి ఆధిపత్యం ప్రదర్శించిన తమ ఆటతీరు స్ఫూర్తిగా కొత్త ఆశలు రేపుతోంది. ఈ నేపథ్యంలో తాజా ఓటమిని మరచి ఆసీస్‌పై సత్తా చాటుతామని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చెబుతున్నాడు. రోహిత్, కోహ్లి ఫామ్‌లోకి వచ్చి తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇస్తారని అతను విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. విరాట్ కోహ్లితో కలిపి జట్టులోని ఏడుగురు ఆటగాళ్లు ముందే ఆ్రస్టేలియాకు చేరుకోగా... కెపె్టన్ రోహిత్ శర్మ మినహా మిగతా వారంతా సోమవారం బయలుదేరి వెళ్లారు. నవంబర్ 22 నుంచి పెర్త్‌లో తొలి టెస్టు జరుగుతుంది. ముంబై: భారత జట్టు సంధి దశలో ఉందా లేదా అనే విషయాన్ని తాను పట్టించుకోనని, ప్రస్తుతానికి ఆ్రస్టేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌పైనే తన దృష్టి ఉందని భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. వరల్డ్ టెస్టు చాంపియన్íÙప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరే అంశాన్ని కూడా పట్టించుకోవడం లేదని అతను వ్యాఖ్యానించాడు. కోచ్‌గా తనపై ఎలాంటి ఒత్తిడీ లేదన్న గంభీర్ ఆ్రస్టేలియాకు బయలుదేరే ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. విశేషాలు అతని మాటల్లోనే... కోచ్‌గా ఒత్తిడి ఎదుర్కోవడంపై... న్యూజిలాండ్ చేతిలో ఓటమిపై నన్ను విమర్శించ డంలో తప్పు లేదు. వాటిని స్వీకరించేందుకు నేను సదా సిద్ధం. మా ఓటమికి సాకులు వెతకడం లేదు. కివీస్ అన్ని రంగాల్లో చాలా బాగా ఆడింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో నాపై విరుచుకుపడటంలో అర్థం లేదు. దాని వల్ల మా జీవితాల్లో ఏమైనా తేడా వస్తుందా? నేను ఈ బాధ్యతలు తీసుకున్నప్పుడే చాలా కష్టమైన పని అని తెలుసు. ఒత్తిడి బాగా ఉంటుందనేది కూడా తెలుసు. నా బాధ్యతను నేను నిజాయితీలో నిర్వర్తిస్తున్నా. కాబట్టి ఒత్తిడి నాకు సమస్య కాదు. భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. రోహిత్, కోహ్లి ఫామ్‌పై... ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల ఫామ్‌పై ఎలాంటి ఆందోళన లేదు. వారిద్దరూ మానసికంగా చాలా దృఢమైన వారు. ఇప్పటికే భారత్ తరఫున ఎంతో సాధించిన వారిద్దరు మరిన్ని ఘనతలకు సిద్ధంగా ఉన్నారు. వారిలో ఇంకా ఎంతో తపన మిగిలి ఉంది. దాని కోసం చాలా కష్టపడుతున్నారు. గత సిరీస్ వైఫల్యం తర్వాత పరుగులు సాధించాలనే కసి వారిలో కనిపిస్తోంది. దేశం తరఫున వారి అంకితభావాన్ని ఎప్పుడూ ప్రశి్నంచవద్దు. ఇది పూర్తిగా కొత్త సిరీస్. కాబట్టి అక్కడ బాగా ఆడి సిరీస్ గెలవడమే అందరి లక్ష్యం. టీమిండియా సంధి దశపై... ఎంతో సాధించాలనే ఆటగాళ్లు పెద్ద సంఖ్యలో మా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నారు. జట్టుకు సంబంధించి ఇది సంధి కాలం అనే మాటను నేను నమ్మను. బయటి వారు ఎలా అనుకున్నా నేను అలాంటి పదాలను వాడను. పేరు ఏం పెట్టుకున్నా మార్పు అనేది సహజం. గతంలోనూ భారత జట్టులో ఇలాంటివి జరిగాయి కాబట్టి ఇక ముందూ జరుగుతాయి. నా ధ్యాసంతా ప్రస్తుతం ఆ్రస్టేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌పైనే ఉంది. ఇప్పుడు నాకు అన్నింటికంటే అదే ముఖ్యం. ఆసీస్‌లో పరిస్థితులపై... మా ముందు అన్నింటికంటే పెద్ద సవాల్ అక్కడి పరిస్థితులకు అలవాటు పడటమే. వచ్చే పది రోజులు అందుకే చాలా కీలకం. ఈ సమయంలో తగిన విధంగా సన్నద్ధమైతే తొలి మ్యాచ్‌కు ముందు అంతా బాగుంటుంది. గతంలో ఆ్రస్టేలియాలో ఆడిన అనేక మంది అనుభవజు్ఞలు జట్టులో ఉండటం సానుకూలాంశం. వారి అనుభవం యువ ఆటగాళ్లకు కూడా పనికొస్తుంది. ఈ పది రోజులు సన్నాహాలు బాగా సాగితే 22న ఉదయం తొలి బంతి నుంచే చెలరేగిపోయే అవకాశం ఉంటుంది. వారు ఎలాంటి పిచ్‌లు ఇస్తారనేది అనవసరం. మేం అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం. పిచ్ ఎలా ఉన్నా మా సామర్థ్యానికి తగినట్లు ఆడితే ఎవరినైనా ఓడించగలం. జట్టులోని యువ ఆటగాళ్లపై... గతాన్ని పక్కన పెట్టి ముందుకు వెళ్లడం అవసరం కాబట్టి అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకున్న తర్వాతే వీరిని ఎంపిక చేశారు. విజయానికి ఉపయోగపడగలరనే నమ్మకంతో అత్యుత్తమ జట్టునే ఎంపిక చేశాం. వ్యక్తిగత రికార్డులకంటే జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలని జూనియర్లకు గట్టిగా చెప్పాను. నితీశ్ కుమార్ రెడ్డి మంచి ప్రతిభావంతుడు. అవకాశం లభిస్తే అతను సత్తా చాటగలడు. సుదీర్ఘ టెస్టు సిరీస్‌కు ముందు పేసర్లు అలసట లేకుండా ఉండాలనే కారణంతోనే హర్షిత్ రాణాను ‘ఎ’ జట్టుతో పంపలేదు. రంజీ ట్రోఫీలో అతను తగినంత బౌలింగ్ కూడా చేశాడు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాం. మా ఐదుగురు పేసర్లూ భిన్నమైన శైలి కలవారు కాబట్టి బౌలింగ్‌లో మంచి పదును ఉంది. ఓపెనర్‌గా రాహుల్! కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టు ఆడటంపై ఇంకా సందేహాలు ఉన్నాయి. మ్యాచ్ సమయానికే దీనిపై స్పష్టత వస్తుంది. అయితే ఓపెనర్‌గా భారత్‌కు తగినన్ని ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని గంభీర్ చెప్పాడు. అయితే అభిమన్యు ఈశ్వరన్‌తో పోలిస్తే అనుభవజ్ఞుడైన రాహుల్‌కే అవకాశం దక్కవచ్చని పరోక్షంగా వెల్లడించాడు. ‘అటు ఓపెనర్‌గా, ఇటు మిడిలార్డర్లోనూ ఆడగలిగే సామర్థ్యం ఉన్న బ్యాటర్లు ప్రపంచ క్రికెట్లో చాలా తక్కువ మంది ఉంటారు. రాహుల్ అలాంటి వారిలో ఒకడు. తనకు ఏ బాధ్యత అయినా అప్పగించవచ్చు’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు. -
ఎదురీత!
అనూహ్య తడబాటు నుంచి కోలుకున్న టీమిండియా... న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఎదురీదుతోంది. బ్యాటింగ్‌కు అనువుగా మారిన బెంగళూరు పిచ్‌పై ప్రత్యర్థి భారీ స్కోరు చేయగా... మనవాళ్లు కూడా దీటుగా బదులిస్తున్నారు. రచిన్ రవీంద్ర సూపర్ సెంచరీ, టిమ్ సౌతీ సమయోచిత ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరును నమోదు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత టాపార్డర్ రాణించింది. రోహిత్, కోహ్లి, సర్ఫరాజ్ అర్ధ శతకాలతో టీమిండియా ఇన్నింగ్స్ గాడిన పడింది. మూడో రోజు ఇన్నింగ్స్ చివరి బంతికి విరాట్ కోహ్లిను అవుట్ చేసి న్యూజిలాండ్ పైచేయి సాధించగా... కోహ్లి పెవిలియన్ చేరడంతో ఈ మ్యాచ్‌లో భారత్ గట్టెక్కాలంటే మిగిలిన బ్యాటర్లు విశేషంగా రాణించాల్సి ఉంటుంది. బెంగళూరు: తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలిన భారత జట్టు... రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం గట్టిగానే పోరాడుతోంది. ప్రత్యర్థికి భారీ ఆధిక్యం దక్కిన ఈ మ్యాచ్‌లో అద్భుతం జరిగితే తప్ప టీమిండియా గట్టెక్కడం కష్టమే అనిపిస్తోంది. 356 పరుగులతో వెనుకబడి శుక్రవారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (70; 8 ఫోర్లు, ఒక సిక్సర్), సర్ఫరాజ్ ఖాన్ (78 బంతుల్లో 70 బ్యాటింగ్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), కెపె్టన్ రోహిత్ శర్మ (63 బంతుల్లో 52; 8 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధ శతకాలతో ఆకట్టుకోగా... యశస్వి జైస్వాల్ (35; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. చేతిలో 7 వికెట్లున్న టీమిండియా ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే మరో 125 పరుగులు చేయాలి. క్రీజులో ఉన్న సర్ఫరాజ్‌తోపాటు ఇంకా రావాల్సిన కేఎల్ రాహుల్, పంత్, జడేజా, అశ్విన్ భారీ ఇన్నింగ్స్ ఆడితే భారత్ కోలుకోవచ్చు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 180/3తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 91.3 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌటైంది. రచిన్ రవీంద్ర (157 బంతుల్లో 134; 13 ఫోర్లు, 4 సిక్సర్లు) తన కెరీర్లో రెండో సెంచరీ సాధించాడు. మాజీ కెపె్టన్ టిమ్ సౌతీ (73 బంతుల్లో 65; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో రచిన్‌కు అండగా నిలిచాడు. చివరి బంతికి కోహ్లి అవుట్... తొలి ఇన్నింగ్స్‌లో తడబడ్డ భారత టాపార్డర్ రెండో ఇన్నింగ్స్‌లో మెరుగ్గా ఆడింది. యశస్వి, రోహిత్ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం కనబర్చడంతో టీమిండియాకు శుభారంభం దక్కింది. తొలి వికెట్‌కు 72 పరుగులు జోడించాక జైస్వాల్ అవుట్ కాగా... కాసేపటికి అర్ధశతకం పూర్తి చేసుకున్న రోహిత్ కూడా వెనుదిరిగాడు. ఈ రెండు వికెట్లు ఎజాజ్ పటేల్ ఖాతాలోకే వెళ్లాయి. మరోసారి వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లి ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యత తీసుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి చకచకా పరుగులు చేస్తూ... ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ 42 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... కోహ్లి 70 బంతుల్లో ఆ మార్క్ అందుకున్నాడు. టీమిండియా కోలుకున్నట్లే అనుకుంటున్న దశలో చివరి బంతికి కోహ్లి అవుటవ్వడంతో భారత జట్టుకు నిరాశ తప్పలేదు. ఆ భాగస్వామ్యం లేకుంటే... భారత సంతతి ఆటగాడు రచిన్... కుటుంబ సభ్యుల సమక్షంలో చిన్నస్వామి స్టేడియంలో చెలరేగి ఆడటంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయగలిగింది. మిచెల్ (18), బ్లండెల్ (5), ఫిలిప్స్ (14), హెన్రీ (8) విఫలమవడంతో కివీస్ జట్టు 233/7తో నిలిచింది. కాసేపట్లో కివీస్ ఆలౌట్ కావడం ఖాయమే అనుకుంటే... సౌతీ సహకారంతో రచిన్ రెచ్చిపోయాడు. ఎనిమిదో వికెట్‌కు 137 పరుగులు జోడించి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. 4 టెస్టు క్రికెట్లో 9 వేల పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లి నిలిచాడు. సచిన్ టెండూల్కర్ (15,921), రాహుల్ ద్రవిడ్ (13,265), సునీల్ గవాస్కర్ (10,122) ముందున్నారు. ఓవరాల్‌గా ఈ మైలురాయి దాటిన 18వ ప్లేయర్‌గా కోహ్లి ఘనత సాధించాడు.స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 46; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 15; కాన్వే (బి) అశి్వన్ 91; యంగ్ (సి) కుల్దీప్ (బి) జడేజా 33; రచిన్ (సి) (సబ్) జురేల్ (బి) కుల్దీప్ 134; మిచెల్ (సి) జైస్వాల్ (బి) సిరాజ్ 18; బ్లండెల్ (సి) రాహుల్ (బి) బుమ్రా 5; ఫిలిప్స్ (బి) జడేజా 14; హెన్రీ (బి) జడేజా 8; సౌతీ (సి) జడేజా (బి) సిరాజ్ 65; ఎజాజ్ (ఎల్బీ) కుల్దీప్ 4; రూర్కే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (91.3 ఓవర్లలో ఆలౌట్) 402. వికెట్ల పతనం: 1–67, 2–142, 3–154, 4–193, 5–204, 6–223, 7–233, 8–370, 9–384, 10–402. బౌలింగ్: బుమ్రా 19–7–41–1, సిరాజ్ 18–2–84–2, అశ్విన్ 16–1–94–1, కుల్దీప్ 18.3–1–99–3, జడేజా 20–1–72–3.భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (స్టంప్డ్) బ్లండెల్ (బి) ఎజాజ్ 35; రోహిత్ (బి) ఎజాజ్ 52; కోహ్లి (సి) బ్లండెల్ (బి) ఫిలిప్స్ 70; సర్ఫరాజ్ (బ్యాటింగ్) 70; ఎక్స్ ట్రాలు 4; మొత్తం (49 ఓవర్లలో 3 వికెట్లకు) 231. వికెట్ల పతనం: 1–72, 2–95, 3–231. బౌలింగ్: సౌతీ 7–1–22–0; హెన్రీ 11–1–52–0; రూర్కే 11–1–48–0; ఎజాజ్ 12–2–70–2; ఫిలిప్స్ 8–1–36–1. -
‘మసాలా’ వార్తలకు ముగింపునిస్తున్నాం: కోహ్లి, గంభీర్
చెన్నై: మైదానంలో దూకుడైన స్వభావానికి వారిద్దరు చిరునామా... ఆటతోనే కాకుండా ప్రత్యర్థులపై మాటలతో దూసుకుపోయేందుకు ఎవరూ వెనుకాడరు... భారత ఆటగాళ్లుగా ఇతర జట్లతో తలపడిన సందర్భాలే కాదు... ఒకరికొకరు కూడా ఆవేశంతో మాటా మాటా అనుకున్న సందర్భాలు ఉన్నాయి. ఐపీఎల్లో అలాంటివి అభిమానులు చూశారు.అలాంటివారు ఒకరు ప్లేయర్‌గా, మరొకరు అదే జట్టుకు కోచ్‌గా కలిసి భారత జట్టును నడిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు ‘ఢిల్లీ బాయ్స్’ విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ల మధ్య ఆసక్తకర సంభాషణ జరిగింది. తామిద్దరి మధ్య ఏదో వైరం ఉందంటూ మసాలా వార్తలు రాసుకునే వారికి ఈ సంభాషణ తర్వాత అలాంటి అవకాశం ఉండదని వారు ఈ ‘బీసీసీఐ’ వెబ్సైట్ రూపొందించిన వీడియోలో చెప్పేశారు. » మైదానంలో బ్యాటింగ్ సమయంలో దూషణలకు దిగితే అది బ్యాటింగ్‌పై ప్రభావం చూపి అవుటవుతారా లేక మరింత దూకుడుగా ఆడి ఆధిపత్యం ప్రదర్శించవచ్చా అని గంభీర్‌ను కోహ్లి అడిగాడు. దీనిపై గంభీర్ ‘ఇలాంటి తరహా అనుభవాలు నాకన్నా నీకే ఎక్కువగా ఉన్నాయి. నువ్వే బాగా చెప్పగలవు’ అని సమాధానం ఇవ్వడంతో నవ్వులు విరిశాయి. ‘ఇది తప్పు కాదు. ఇలా చేయవచ్చు అని నాకు మద్దతిస్తావని ఆశించా’ అంటూ కోహ్లి బదులిచ్చాడు. తన విషయంలో ఆ తరహా దూకుడు బాగా పని చేసిందని గంభీర్ అన్నాడు. » మెదానంలో మంచి ఇన్నింగ్స్‌లు ఆడిన సందర్భాల్లో దైవభక్తి బాగా పని చేసిందని ఇద్దరూ గుర్తు చేసుకున్నారు. తాను న్యూజిలాండ్‌పై నేపియర్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్న సమయంలో ‘హనుమాన్ చాలీసా’ పారాయణం చేసినట్లు గంభీర్ చెప్పగా... అడిలైడ్‌లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసినప్పుడు ‘ఓం నమఃశివాయ’ అంటూ వచ్చానని కోహ్లి వెల్లడించాడు. » 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించిన క్షణాల వీడియో చూస్తుండటంతో వీరి సంభాషణ మొదలైంది. ఢిల్లీ గ్రౌండ్లో గంభీర్‌ను చూసి తాను ఎలా కెరీర్లో ఎదగాలో స్ఫూర్తిగా తీసుకున్న విషయాన్ని కోహ్లి చెప్పగా... కెరీర్ ఆరంభంలో కోహ్లి ఆడిన కొన్ని అత్యుత్తమ ఇన్నింగ్స్‌లపై గంభీర్ ప్రశంసలు కురిపించాడు. అనంతరం ఈ చర్చ భారత టెస్టు క్రికెట్ వైపు మళ్లింది. ఒక ఆటగాడి గొప్పతనాన్ని గుర్చించేందుకు టెస్టు క్రికెట్ మాత్రమే అసలైన వేదిక అని ఇద్దరూ అభిప్రాయ పడ్డారు. భారత జట్టు బ్యాటింగ్‌లో చాలా కాలంగా బలంగా ఉందని... అయితే బౌలింగ్‌ను శక్తివంతంగా మార్చి బౌలర్ల ద్వారా మ్యాచ్‌లను గెలిపించిన ఘనత కెపె్టన్‌గా కోహ్లిదేనని గంభీర్ వ్యాఖ్యానించాడు. రాబోయే తరంలో టెస్టులను ఇష్టపడేలా ఆటగాళ్లను ప్రోత్సహించాల్సిన బాధ్యత తమపై ఉందని వీరిద్దరు అభిప్రాయపడ్డారు. » లక్ష్య ఛేదన అంటేనే తనకు ఇష్టమని, తాను చేయాల్సిన పనిపై స్పష్టత ఉంటుందని కోహ్లి అన్నాడు. ఒక ఆటగాడు సొంత మైలురాళ్ల గురించి ఆలోచించకుండా టీమ్ కోసం ఏం కావాలో ఆలోచిస్తేనే ఛేదన సులువై జట్టుకు విజయాలు లభిస్తాయని గంభీర్ విశ్లేషించాడు. వరల్డ్ కప్ ఫైనల్లో తాను సెంచరీ గురించి ఆలోచించనే లేదని, అవుటైనప్పుడు కూడా ప్రత్యర్థి కోలుకునే అవకాశం ఇవ్వడం పట్ల బాధపడ్డానని గంభీర్ వివరించాడు. » తర్వాతి అతిథి రోహిత్ శర్మ అయితే ఏం ప్రశ్న వేయాలని గంభీర్ అడగ్గా... ఉదయమే నానబెట్టిన బాదం పలుకులు తిన్నావా లేదా అని అడగాలని (అతని మతిమరపును గుర్తు చేస్తూ)... ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూకు రమ్మంటే రాత్రి 11 గంటలకు వస్తాడని కోహ్లి చెప్పడంతో నవ్వులతో సంభాషణ ముగిసింది. -
జాక్స్ ధమాకా...
బెంగళూరు గెలిచేందుకు 6 ఓవర్లలో 53 పరుగులు చేయాలి. కోహ్లి 69 పరుగులతో... విల్ జాక్స్ 44 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక్కడ సెంచరీ అయితే గియితే కోహ్లిదే అవుతుంది లేదంటే లేదు! కానీ ఎవరూ ఊహించని విధంగా జాక్స్ రెండే ఓవర్లలో సెంచరీ పూర్తి చేశాడు. మోహిత్ శర్మ వేసిన 15వ ఓవర్లో జాక్స్ 4, 6, నోబాల్ 6, 2, 6, 4, 0లతో 29 పరుగులు సాధించాడు. రషీద్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో తొలి బంతికి కోహ్లి ఒక పరుగు తీసి జాక్స్‌కు స్ట్రయిక్ ఇచ్చాడు. జాక్స్ వరుసగా 6, 6, 4, 6, 6లతో 28 పరుగులు పిండుకొని సంచలన శతకం సాధించి అబ్బురపరిచాడు. జాక్స్ 29 బంతుల్లో 44 పరుగులు చేయగా... ఆ తర్వాత 12 బంతుల్లో ఏకంగా 56 పరుగులు సాధించి సెంచరీ మైలురాయిని అందుకోవడం విశేషం. అహ్మదాబాద్: మళ్లీ బౌలర్ డీలా... బంతేమో విలవిల... బ్యాట్ భళా! అంతే మరో 200 పైచిలుకు స్కోరు... దీన్ని 16 ఓవర్లలోనే ఛేదించిన తీరు చూస్తుంటే ఈ వేసవి వడగాడ్పులతో వేడెక్కించడమే కాదు... ఐపీఎల్ సిక్సర్లతో కిక్ ఎక్కిస్తోంది! ప్లే ఆఫ్స్ రేసుకు దాదాపు దూరమనుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఇంటాబయటా పరుగుల హోరెత్తిస్తోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై జయభేరి మోగించింది. 201 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే ఉఫ్‌మని ఊదేసింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీస్కోరు చేసింది. సాయి సుదర్శన్ (49 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), షారుఖ్ ఖాన్ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగారు. అనంతరం ఆర్సీబీ 16 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 206 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విల్ జాక్స్ (41 బంతుల్లో 100 నాటౌట్; 5 ఫోర్లు, 10 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (44 బంతుల్లో 70 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) సిక్సర్లతో హోరెత్తించారు. జాక్స్ 2 ఓవర్ల విధ్వంసంతో... కోహ్లితో ఛేదన ప్రారంభించిన డుప్లెసిస్ (12 బంతుల్లో 24; 1 ఫోర్, 3 సిక్స్‌లు) నాలుగో ఓవర్లో నిష్క్రమించాడు. సాయికిశోర్ వేసిన ఆ ఓవరే వికెట్ దక్కించుకుంది. ఆ తర్వాత ఎవరూ బౌలింగ్‌కు దిగినా... పరుగులు, ఈ దశ దాటి మెరుపులు... దాన్ని మించి ఉప్పెనే! పవర్‌ప్లేలో బెంగళూరు 63/1 స్కోరు చేసింది. సగం ఓవర్లు ముగిసేసరికి 98/1 అంటే వంద కూడా చేయని జట్టు ఇంకో 6 ఓవర్లు ముగిసేసరికే 108 పరుగుల్ని చేసి మ్యాచ్‌నే ముగించింది. కోహ్లి 32 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నప్పుడు జాక్స్ 16 బంతుల్లో 16 పరుగులే చేశాడు. 14 ఓవర్లలో బెంగళూరు స్కోరు 148/1. ఈ దశలో మోహిత్ వేసిన 15వ ఓవర్లో, రషీద్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో జాక్స్ విశ్వరూపం ప్రదర్శించడంతో ఆర్సీబీ 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని అధిగమించి విజయతీరానికి చేరింది.స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) కరణ్ శర్మ (బి) స్వప్నిల్ 5; గిల్ (సి) గ్రీన్ (బి) మ్యాక్స్‌వెల్ 16; సుదర్శన్ (నాటౌట్) 84; షారుఖ్ (బి) సిరాజ్ 58; మిల్లర్ (నాటౌట్) 26; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–6, 2–45, 3–131. బౌలింగ్: స్వప్నిల్ 3–0–23–1, సిరాజ్ 4–0–34–1, యశ్ దయాళ్ 4–0–34–0, మ్యాక్స్‌వెల్ 3–0–28–1, కరణ్ శర్మ 3–0–38–0, గ్రీన్ 3–0–42–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (నాటౌట్) 70; డుప్లెసిస్ (సి) సబ్–శంకర్ (బి) సాయికిశోర్ 24; విల్ జాక్స్ (నాటౌట్) 100; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (16 ఓవర్లలో వికెట్ నష్టానికి) 206. వికెట్ల పతనం: 1–40. బౌలింగ్: అజ్మతుల్లా 2–0–18–0, సందీప్ 1–0–15–0, సాయికిశోర్ 3–0–30–1, రషీద్ ఖాన్ 4–0–51–0, నూర్ అహ్మద్ 4–0–43–0, మోహిత్ 2–0–41–0. ఐపీఎల్లో నేడుకోల్‌కతా X ఢిల్లీ వేదిక: కోల్‌కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
కోహ్లీ, అనుష్క శర్మల కంపెనీకి లైన్ క్లియర్
వ్యాపారవేత్తలే కాకుండా ప్రముఖులు సైతం కంపెనీలు స్థాపిస్తున్నారు. అందులో పెట్టుబడి పెడుతున్నారు. భవిష్యత్తులో అభివృద్ధి అయ్యే మంచి బిజినెస్ మోడల్ ఉన్నవారికి ఇన్వెస్టర్లుగా మారుతున్నారు. దాంతో ఇరువురికి లాభం జరిగేలా వ్యవహరిస్తున్నారు. అందులో కొన్ని కంపెనీలు మరింత వృద్ధి చెంది ఐపీవోగా స్టాక్మార్కెట్లోనూ లిస్ట్ అవుతున్నాయి. అలాంటి సంస్థ ‘గో డిజిట్’ ఐపీవోకు తాజాగా సెబీ ఆమోదం తెలిపింది. ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ పెట్టుబడి పెట్టిన ‘గో డిజిట్’ ఐపిఓకి వెళ్లేందుకు లైన్‌క్లియర్ అయింది. అందుకు సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఆమోదం తెలిపింది. గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్‌లో ఇన్వెస్టర్ అయిన కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ గ్రూప్ కూడా మద్దతు తెలిపింది. ఆగస్టు 2022లో కంపెనీ ఐపీఓ కోసం ప్రిలిమినరీ పత్రాలను దాఖలు చేసింది. డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) వివరాల ప్రకారం..గో డిజిట్ ఐపీఓలో రూ.1,250 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నట్లు తెలిసింది. ఐపీఓ ద్వారా సమకూరే మూలధనాన్ని కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఐపీవో ద్వారా నిధులు సేకరించేందుకు కంపెనీ మొదటగా ఆగస్టు 2022లో సెబీకు డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసింది. అయినప్పటికీ, ఉద్యోగులకు సంబంధించి స్టాక్ అప్రిసియేషన్ రైట్స్ స్కీమ్‌లోని కొన్ని కారణాల వల్ల కొద్దికాలంపాటు నిలిచిపోయింది. సెబీ జనవరి 30, 2023న గో డిజిట్ డ్రాఫ్ట్ ఐపీఓ పేపర్లను తిరిగి ఇచ్చింది. కంపెనీ నుంచి మరింత సమాచారం కోరింది. ఇదీ చదవండి: మరో సంస్థపై ఆంక్షలు విధించిన ఆర్బీఐ సవరించిన సమాచారంతో ఏప్రిల్ 2023లో ప్రిలిమినరీ ఐపీఓ పత్రాలను సెబీకి దాఖలు చేసింది. అన్ని పరిశీలించిన సెబీ తాజాగా ఐపీవోకు లైన్ క్లియర్ చేసినట్లు తెలిసింది. -
పదుగురు స్వామీజీలు.. 2023లో అందరినీ ఆకర్షించి..
2023వ సంవత్సరం ముగింపు దశకు వచ్చేసింది. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పలువురు స్వామీజీలు అటు రాజకీయాలను, ఇటు ప్రజలను అమితంగా ప్రభావితం చేశారు. వీరు వార్తల్లో తరచూ కనిపించారు. ఇలాంటి 10 మంది స్వామీజీల గురించి ఇప్పుడు తెలసుకుందాం. 1. సంత్ ప్రేమానంద్ సంత్ ప్రేమానంద్ మహారాజ్ ఏడాది పొడవునా అగ్రస్థానంలో వార్తల్లో నిలిచారు. బృందావనంలో నివసిస్తున్న సంత్ ప్రేమానంద్ సత్సంగాన్ని వినడానికి జనం ఎక్కడెక్కడి నుంచో తరలివస్తుంటారు. విరాట్ కోహ్లి, అనుష్క శర్మ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితరులు సంత్ ప్రేమానంద్ మహరాజ్‌ను దర్శించుకున్నారు. ప్రేమానంద్ చిన్ననాటి పేరు అనిరుధ్ కుమార్ పాండే. ఆయన 13 సంవత్సరాల వయసులోనే సన్యాసం స్వీకరించారు. 2. పండిట్ ధీరేంద్ర శాస్త్రి బాగేశ్వర్ ధామ్‌కు చెందిన పండిట్ ధీరేంద్ర గార్గ్ ప్రవచనకర్తగా రెండవ స్థానంలో నిలిచారు. తన ముందున్నవారి ఆలోచనలు గ్రహించి, వారి సమస్యలను పరిష్కరించగలరనే పేరు సంపాదించారు. ధీరేంద్ర గార్గ్ దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ప్రసిద్ది చెందారు. తొమ్మిదేళ్ల వయసులోనే ఆయన హనుమంతుని పూజించడం ప్రారంభించారు. 3. జయ కిషోరి కథకురాలు జయ కిషోరి జీ 2023లో ఎంతో పాపులారిటీ సంపాదించారు. ఆమె పూర్తి పేరు జయ శర్మ. ఆమె 1995లో రాజస్థాన్‌లోని సుజన్‌గఢ్‌లో జన్మించారు. ఈ 27 ఏళ్ల కథకురాలు యూట్యూబ్‌లో ఎంతో ఫేమస్ అయ్యారు. జయ కిషోరి చిన్న వయస్సులోనే భగవద్గీతను పారాయణం చేస్తూ, ప్రజలను ఆకట్టుకున్నారు. జయ కిషోరి భజన గాయకురాలిగానూ పేరొందారు. 4. సద్గురు జగ్గీ వాసుదేవ్ కర్ణాటకలో జన్మించిన సద్గురు జగ్గీ వాసుదేవ్ మోటివేషనల్ స్పీకర్, యోగా టీచర్. జగ్గీవాసుదేవ్ స్థాపించిన ఇషా ఫౌండేషన్ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. జగ్గీవాసుదేవ్‌ను సద్గురు అని కూడా పిలుస్తారు. జగ్గీవాసుదేవ్ యూట్యూబ్ చానళ్లు ఇంగ్లీషుతో సహా అనేక భాషల్లో అందుబాటులో ఉన్నాయి. 5. శ్రీశ్రీ రవిశంకర్ తమిళనాడులో జన్మించిన ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ తన ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యూమన్ వాల్యూస్ ద్వారా కోట్లాదిమందిని ప్రభావితం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతి చర్చల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. 6. గౌర్ గోపాల్ దాస్ మహారాష్ట్రలో జన్మించిన మోటివేషనల్ స్పీకర్, కృష్ణ భక్తుడైన సన్యాసి గౌర్ గోపాల్ దాస్ 2023లో తన అభిప్రాయాలు, వ్యాఖ్యానాలతో వార్తల్లో నిలిచారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా హోల్డర్ అయిన సంత్ గోపాల్‌దాస్ ఇస్కాన్‌లో సభ్యునిగా ఉన్నారు. 7. పండిట్ ప్రదీప్ మిశ్రా భోపాల్‌కు చెందిన పండిట్ ప్రదీప్ మిశ్రా.. శివ మహాపురాణం చెప్పడంలో ప్రసిద్ధి చెందారు. ఈ ఏడాది పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, వార్తల్లో నిలిచారు. ఆయన ప్రవచనాలు వినేందుకు లక్షలాది మంది తరలివస్తుంటారు. 8. అనిరుద్ధాచార్య జీ మహారాజ్ ఈయన బృందావన నివాసి. మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలో జన్మించారు. తన ఉపన్యాసాలలో గోసేవ, జీవిత విలువల గురించి చెబుతుంటారు. సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తుంటారు. అనిరుద్ధాచార్య జీ మహారాజ్‌కు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. 9. వైష్ణవ్ రామ భద్రాచార్య వైష్ణవ శాఖకు చెందిన రామానందాచార్య స్వామి శ్రీరామ భద్రాచార్య మహారాజ్ ఐదేళ్ల వయసులో కంటిచూపు కోల్పోయారు. అయితే పీహెచ్డీ పొందడమే కాకుండా విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం ద్వారా దివ్యాంగులకు అనేక విద్యావకాశాలు కల్పించారు. 2015లో భారత ప్రభుత్వం అతనిని పద్మభూషణ్‌తో సత్కరించింది. 10. దేవకీ నందన్ ఠాకూర్ దేవకీ నందన్ ఠాకూర్ జీ ప్రముఖ కథకునిగా పేరొందారు. 2022, 2023లలో సనాతన ధర్మానికి మద్దతు ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలిచారు. దేవకీ నందన్ ఠాకూర్ మధురలోని ఓహవా గ్రామంలో జన్మించారు. తన ఆరేళ్ల వయస్సులో బృందావనం చేరుకుని, పరమ భక్తునిగా మారిపోయారు. ఇది కూడా చదవండి: యూజర్స్ అత్యధికంగా డిలీట్ చేసిన యాప్ ఏది? -
‘ఆ క్షణం లైబ్రరీలా అనిపించింది’
సిడ్నీ: వన్డే వరల్డ్ కప్ గెలిచి వారం రోజులు దాటినా ఆ్రస్టేలియా జట్టు తమ విజయాన్ని ఇంకా వేడుకలా జరుపుకుంటూనే ఉంది. మంగళవారం సిడ్నీ మైదానంలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, పేసర్ మిచెల్ స్టార్క్ కలిసి వరల్డ్ కప్ ట్రోఫీని ప్రదర్శించాడు. ఈ సందర్భంగా కమిన్స్ తన ఫైనల్ మ్యాచ్ అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. ముఖ్యంగా కోహ్లి వికెట్ తీయడం మ్యాచ్‌ను మలుపు తిప్పిందని అతను అన్నాడు. కమిన్స్ బంతిని కోహ్లి వికెట్లపైకి ఆడుకోవడంతో భారత్ భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. ఆ క్షణం మైదానంలో ఆవరించిన నిశ్శబ్దం మరచిపోలేనని కమిన్స్ అన్నాడు. ‘కోహ్లి వికెట్ పడిన తర్వాత మా జట్టు సభ్యులంతా ఒక చోట చేరి సంబరాలు చేసుకుంటుంటే స్మిత్ ఒక మాట అన్నాడు. మైదానంలో ఏదైనా శబ్దం వినిపిస్తోందా అని అడిగాడు. మేం ఒక క్షణం ఆగి గమనించాం. స్టేడియం మొత్తం ఒక లైబ్రరీలా అనిపించింది. లక్ష మంది ఉన్న మైదానంలో అంతా నిశ్శబ్దం ఆవరించింది. ఈ ఘట్టాన్ని చిరకాలం గుర్తుంచుకుంటా’ అని కమిన్స్ వ్యాఖ్యానించాడు. ఒకే సమయంలో భిన్న ఫార్మాట్లలో తాము ప్రపంచ చాంపియన్లుగా ఉండటం చాలా గర్వంగా ఉందని అన్నాడు. ఆరుగురు ఆసీస్ ఆటగాళ్లు ముందుగానే... భారత్‌తో జరుగుతున్న టి20 సిరీస్‌లో పాల్గొంటున్న ఆ్రస్టేలియా జట్టులోని ఆరుగురు ప్రధాన ఆటగాళ్లు సిరీస్ ముగియడానికి ముందే స్వదేశానికి వెళ్లిపోతున్నారు. వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యులుగా ఉన్నవారిలో ఏడుగురు టి20 సిరీస్ కోసం ఇక్కడే ఆగిపోయారు. వీరిలో హెడ్ ఒక్కడే సిరీస్ ముగిసే వరకు ఉండనున్నారు. స్మిత్, జంపా ఇప్పటికే బయల్దేరిపోగా...మరో నలుగురు మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, ఇన్‌గ్లిస్, అబాట్ మూడో మ్యాచ్ ముగియగానే వెళ్లిపోతారు. చివరి రెండు మ్యాచ్‌లకు వీరు అందుబాటులో ఉండటం లేదు. వీరి స్థానాల్లో జోష్ ఫిలిప్, బెన్ మెక్‌డెర్మాట్, బెన్ డ్వార్షియస్, క్రిస్ గ్రీన్‌లను ఆ్రస్టేలియా సెలక్టర్లు ఎంపిక చేశారు. -
డ్రెస్సింగ్ రూంలో క్రికెటర్లను ఓదార్చిన మోదీ
అహ్మదాబాద్: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి తర్వాత తీవ్ర నిరాశలో ఉన్న భారత క్రికెటర్లను ప్రధాని మోదీ ఓదార్చారు. ఓటమి సాధారణమైనది, నిరుత్సాపడకూడదని ప్రోత్సహించారు. టోర్నీలో వరుసగా పది మ్యాచ్‌లు గెలిచిన తీరును గుర్తుచేశారు. దేశమంతా చూస్తోంది.. దయచేసి నవ్వండని కోరారు. అప్పుడప్పుడు ఇలా జరగుతుందని కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి చేతులు పట్టుకుని ఉత్సాహపరిచారు. ఆటగాళ్లు ఒకరినొకరు నిరంతరం ప్రోత్సహించుకోవాలని చెప్పారు. గుజరాతీ అయిన రవీంద్ర జడేజాతో ప్రధాని మోదీ గుజరాతీలో మాట్లాడారు. ఏం బాబు అని పలకరిస్తూ ఇరువురు నవ్వులు కురిపించారు. మహ్మద్ షమీ వద్దకు వచ్చిన మోదీ.. షమీని కౌగిలించుకున్నారు. అద్భుతమైన ఆటతీరు కనబరిచావని మెచ్చుకున్నారు. #WATCH | Prime Minister Narendra Modi met Team India in their dressing room after the ICC World Cup Finals at Narendra Modi Stadium in Ahmedabad, Gujarat on 19th November. The PM spoke to the players and encouraged them for their performance throughout the tournament. (Video:… pic.twitter.com/ZqYIakoIIj — ANI (@ANI) November 21, 2023 అహ్మదాబాద్ వేదికగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్ పోరుకు దిగింది. అయితే.. 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఆసిస్ అలవోక విజయం సాధించింది. ఓటమిని చవిచూసిన భారత ఆటగాళ్లు నిరుత్సాహంతో మైదానాన్ని వీడారు. కొందరు ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. మ్యాచ్‌ను వీక్షించడానికి వెళ్లిన ప్రధాని మోదీ క్రికెటర్లను డ్రస్సింగ్ రూంలో కలిశారు. నిరుత్సాహంలో ఉన్న ఆటగాళ్లను ఓదార్చారు. ఇదీ చదవండి: ద్రవిడ్‌ను కొనసాగిస్తారా లేక సాగనంపుతారా.. టీమిండియా తదుపరి కోచ్ ఎవరు..? -
కోహ్లి... నీకో బహుమతి: సచిన్
అహ్మదాబాద్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డేల్లో తన 49 సెంచరీల రికార్డును చెరిపేసిన కింగ్ కోహ్లికి అమూల్యమైన బహుమతిని బహూకరించాడు. 24 ఏళ్ల కెరీర్లో తన 10 నంబర్ జెర్సీ అంతర్జాతీయ క్రికెట్లో లిఖించిన చరిత్ర అందరికీ తెలిసిందే. ఫైనల్‌కు ముందు సచిన్ స్వయంగా చేసిన ఆటోగ్రాఫ్ జెర్సీని కోహ్లికి అందజేశాడు. ఈ జెర్సీని సచిన్ 2012లో జరిగిన ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన ఆఖరి వన్డే సందర్భంగా ధరించాడు. ‘ఈ ప్రత్యేక సందర్భంలో ప్రత్యేక అనుభూతినిచ్చే గిఫ్ట్‌ను సచిన్... విరాట్‌కు అందజేశాడు’ అని బీసీసీఐ సచిన్, కోహ్లిల ఫోటోతో పోస్ట్ చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి 50వ సెంచరీతో సచిన్ రికార్డు (49)ను బద్దలు కొట్టాడు. -
అభిమాని కలకలం
అహ్మదాబాద్: రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య లక్ష పైచిలుకు అభిమానులున్న స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. 6000 మందికి పైగా సాయుధ బలగాలు పహారా కాస్తున్నాయి. ఇంతటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన కూడా... ఆస్ట్రేలియాకు చెందిన పాలస్తీనా సానుభూతిపరుడు ఇన్ని అంచెలను దాటుకొని కోహ్లిని కలవడం, కౌగిలించుకోవడం కలకలం సృష్టించింది. ఇది భద్రత డొల్లతనాన్ని భయటపెట్టింది. వెంటనే అప్రతమత్తమైన భద్రత దళాలు వేన్ జాన్సన్ అనే ఆ్రస్టేలియన్ను నిర్బంధించాయి. అతన్ని చాంద్ ఖేడా పోలీస్ స్టేషన్‌కు తరలించి తదుపరి విచారణ చేపట్టింది. ప్రస్తుతం పాలస్తీనాలో హమాస్, ఇజ్రాయెల్‌ల మధ్య భీకర దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే! -
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో కలకలం
అహ్మదాబాద్: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో కలకలం రేగింది. మ్యాచ్ జరుగుతుండగా పాలస్తీనాకు మద్దతు తెలుపుతూ ఓ వ్యక్తి మైదానంలోకి దూసుకొచ్చాడు. క్రీజ్‌లో ఉన్న విరాట్ కోహ్లిని కౌగిలించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. దీంతో మ్యాచ్ నిర్వహణలో భద్రతా వైఫల్యంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. #ICCCricketWorldCup | Security breach during the India versus Australia ICC World Cup 2023 Final match, in Ahmedabad after a spectator entered the field (Pics: ANI Photos) pic.twitter.com/AfilmF75sB — ANI (@ANI) November 19, 2023 మైదానంలోకి దూసుకొచ్చిన వ్యక్తి పాలస్తీనాను ప్రతిబింబించే వేషధారణను కలిగి ఉన్నాడు. ఎర్రని షార్ట్ ధరించాడు. తెల్లని టీ షర్ట్ ముందు భాగంలో పాలస్తీనాపై బాంబు దాడులు నిలిపివేయండి అని పేర్కొని ఉంది. టీషర్ట్ వెనుక భాగంలో ఫ్రీ పాలస్తీనా అని రాసి ఉంది. పాలస్తీనా జెండాను ప్రతిబింబించేలా మాస్క్‌ను ధరించాడు. మ్యాచ్ జరుగుతుండగా.. ఎక్కసారిగా మైదానంలోకి దూసుకొచ్చాడు. క్రీజ్ వరకు చేరుకుని విరాట్ కోహ్లిని హత్తుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలో రంగంలోకి దిగిన సిబ్బంది అతన్ని పట్టుకుని వెనక్కి తీసుకెళ్లారు. క్రికెట్ వరల్డ్‌కప్‌లో నేడు భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా మొతేరా స్టేడియంలో నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్‌ను వీక్షించడానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఇప్పటికే ఐదు వికెట్లు కోల్పోయింది. 37 ఓవర్లకు 182 పరుగులు సాధించింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 7న ప్రారంభం అయింది. హమాస్ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. రాకెట్ దాడుల అనంతరం భూతల యుద్ధం చేపట్టింది. హమాస్ మూకలను మట్టికరిపిస్తూ ఇప్పటికే ఉత్తర గాజాను ఆక్రమించింది. అటు దక్షిణ గాజాను కూడా ఖాలీ చేయాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు చేసింది. అటు అల్-షిఫా ఆస్పత్రిని రక్షణ కవచంగా హమాస్ మూకలు ఉపయోగించుకుంటున్నాయని ఆరోపిస్తూ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ సేనలు దాడులు చేస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ వైపు 1,200 మంది మరణించగా.. పాలస్తీనా వైపు 12,500 మంది మరణించారు. ఇందులో 5,000 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఇదీ చదవండి: పాలస్తీనాకు భారత్ రెండోసారి మానవతా సాయం -
మరో 280 పరుగులు...
టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగుల ఛేదన 418... సాధించి 20 ఏళ్లయింది... ఓవల్ మైదానంలో అయితే 263 పరుగులే, అదీ 1902లో వచ్చింది. ఈ రెండింటితో పోలిస్తే ప్రస్తుత లక్ష్యం 444 పరుగులు చాలా ఎక్కువ... అయితే పాత లెక్కల ప్రతికూలతలకంటే పట్టుదలతో కూడిన ప్రదర్శన ఫలితాన్ని ఇవ్వవచ్చు! వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ను గెలుచుకునేందుకు భారత్‌ను విజయం ఊరిస్తోంది. పరుగు తేడాతో రోహిత్, పుజారా వెనుదిరిగినప్పుడు సందేహం ఉన్నా... కోహ్లి, రహానే కలిసి ఆశలు రేపారు. వీరిద్దరి ఆటతో పాటు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న తీరు చూస్తే చివరి రోజు 280 పరుగులు చేయడం అసాధ్యమేమీ కాదు. అయితే మరో వికెట్ ఆసీస్‌కు దారులు తెరిచే అవకాశమూ ఉంది. టీమిండియా స్ఫూర్తి పొందేందుకు ఆ్రస్టేలియాపై ఆఖరి రోజు 325 పరుగులు సాధించి మరీ గెలిచిన ‘గాబా’ను గుర్తు చేసుకుంటే చాలు! లండన్: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) విజేతగా నిలిచేందుకు భారత్, ఆ్రస్టేలియా మధ్య ఆఖరి రోజు ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆట ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కోహ్లి (60 బంతుల్లో 44 బ్యాటింగ్; 7 ఫోర్లు),రహానే (59 బంతుల్లో 20 బ్యాటింగ్; 3 ఫోర్లు) చక్కటి బ్యాటింగ్‌తో ఇప్పటికే అభేద్యంగా 71 పరుగులు జోడించారు. ఆఖరి రోజు విజయం కోసం భారత్‌కు మరో 280 పరుగులు కావాల్సి ఉండగా, ఆసీస్‌కు 7 వికెట్లు అవసరం. అంతకుముందు ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌ను 8 వికెట్లకు 270 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. క్యారీ జోరు... ఆ్రస్టేలియా భారత్‌కు భారీ లక్ష్యాన్ని విధించగలగడంలో కీపర్ క్యారీ (105 బంతుల్లో 66 నాటౌట్; 8 ఫోర్లు)దే కీలకపాత్ర. శనివారం ఆసీస్ 40.3 ఓవర్లు ఆడి మరో 147 పరుగులు జత చేసింది. వాటిలో క్యారీ, మిచెల్ స్టార్క్ (57 బంతుల్లో 41; 7 ఫోర్లు) ఏడో వికెట్‌కు 20 ఓవర్లలో 93 పరుగులు జోడించడం విశేషం. ఓవర్ నైట్ బ్యాటర్లు లబుషేన్ (41; 4 ఫోర్లు), గ్రీన్ (25; 4 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోగా, క్యారీ మాత్రం బౌండరీలతో చకచకా పరుగులు రాబట్టాడు. 82 బంతుల్లో క్యారీ అర్ధసెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు స్టార్క్‌ను అవుట్ చేసి షమీ ఈ భాగస్వామ్యాన్ని విడదీయగా, తాను అవుట్ కాగానే కమిన్స్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. రోహిత్ రాణించినా... ఛేదనను ఓపెనర్లు రోహిత్, గిల్ (19 బంతుల్లో 18; 2 ఫోర్లు) దూకుడుగానే ఆరంభించారు. దాంతో 7 ఓవర్లలోనే స్కోరు 41 పరుగులకు చేరింది. ఈ దశలో గ్రీన్ పట్టిన వివాదాస్పద క్యాచ్‌తో గిల్ నిష్క్రమించాడు. గ్రీన్ క్యాచ్ అందుకుంటున్నప్పుడు బంతి నేలకు తగిలినట్లుగా కనిపించింది. టీవీ రీప్లేలోనూ సందేహాస్పదంగానే ఉన్నా అంపైర్ చివరకు అవుట్‌గా ప్రకటించడంతో గిల్ నిష్క్రమించక తప్పలేదు. టీ విరామం తర్వాతా రోహిత్ ధాటి కొనసాగింది. అయితే లయన్ తొలి ఓవర్లో అనవసరపు స్వీప్ షాట్‌కు ప్రయత్నించి అతను వికెట్ల ముందు దొరికిపోయాడు. మరో ఐదు బంతులకే పుజారా (47 బంతుల్లో 27; 5 ఫోర్లు) కూడా అవుట్ కావడంతో భారత్ కుప్పకూలుతుందేమో అనిపించింది. కానీ కోహ్లి, రహానే తమ అపార అనుభవంతో జట్టును ఆదుకున్నారు. ప్రత్యర్థి బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పట్టుదలగా క్రీజులో నిలబడటంతో పాటు వేగంగా పరుగులు సాధించారు. ఆసీస్ బౌలర్లు కూడా పూర్తిగా నియంత్రణ కోల్పోయి బంతులు వేశారు. ఆట చివర్లో మరో వికెట్ తీయలేక కంగారూ శిబిరంలో తీవ్ర అసహనం కనిపించింది. భారత్ ఈ ఇన్నింగ్స్‌లో 4.10 రన్‌రేట్‌తో పరుగులు సాధించడం విశేషం. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 469; భారత్ తొలి ఇన్నింగ్స్: 296; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: ఖ్వాజా (సి) భరత్ (బి) ఉమేశ్ 13; వార్నర్ (సి) భరత్ (బి) సిరాజ్ 1; లబుషేన్ (సి) పుజారా (బి) ఉమేశ్ 41; స్మిత్ (సి) శార్దుల్ (బి) జడేజా 34; హెడ్ (సి అండ్ బి) జడేజా 18; గ్రీన్ (బి) జడేజా 25; క్యారీ (నాటౌట్) 66; స్టార్క్ (సి) కోహ్లి (బి) షమీ 41; కమిన్స్ (సి) (సబ్) అక్షర్ (బి) షమీ 5; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం (84.3 ఓవర్లలో 8 వికెట్లకు డిక్లేర్డ్) 270. వికెట్ల పతనం: 1–2, 2–24, 3–86, 4–111, 5–124, 6–167, 7–260, 8–270. బౌలింగ్: షమీ 16.3–6–39–2, మొహమ్మద్ సిరాజ్ 20–2–80–1, శార్దుల్ ఠాకూర్ 8–1–21–0, ఉమేశ్ యాదవ్ 17–1–54–2, రవీంద్ర జడేజా 23–4–58–3. భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (ఎల్బీ) (బి) లయన్ 43; శుబ్‌మన్ గిల్ (సి) గ్రీన్ (బి) బోలండ్ 18; పుజారా (సి) క్యారీ (బి) కమిన్స్ 27; విరాట్ కోహ్లి (బ్యాటింగ్) 44; అజింక్య రహానే (బ్యాటింగ్) 20; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (40 ఓవర్లలో 3 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–41, 2–92, 3–93. బౌలింగ్: కమిన్స్ 9–0–42–1, బోలండ్ 11–1–38–1, మిచెల్ స్టార్క్ 7–0–45–0, గ్రీన్ 2–0–6–0, నాథన్ లయన్ 11–1–32–1. -
కోహ్లీ పేరు ఫుల్ కిక్ ఇస్తుంది
-
నవీన్ ఉల్ హుక్ కి ఎటకారం ఎక్కువే ..
-
ఆసియాలోనే ఒకే ఒక్కడు కోహ్లీ దరిదాపుల్లో కూడా ఎవరు లేరు ..
-
యశస్విజైస్వాల్ రుతురాజ్ గైక్వాడ్.. వెల్కమ్ టు టీమ్ ఇండియా
-
WTC ఫైనల్ కి ముందు కోహ్లి గాయం...అడతాడ లేదా..
-
కోహ్లి కన్నీళ్లు పెట్టిన వేళ డ్యుప్లెసిస్ వ్యాఖ్యలు
-
కోహ్లీ అరుదైన రికార్డు ఫైనల్ కు అడుగు దూరంలో ఆర్సీబీ
-
కోహ్లి సూపర్ సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ఆర్సీబీ ఘన విజయం
సాక్షి, హైదరాబాద్: కోహ్లి కొడితే కొండ కూడా పిండి కావాలి. ఉప్పల్‌లో గురువారం సరిగ్గా అదే జరిగింది. ఛేజింగ్‌లో కోహ్లి ఉప్పెనల్లే చెలరేగడంతో బెంగళూరు 8 వికెట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను సులువుగా ఓడించింది. మొదట సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను క్లాసెన్ (51 బంతుల్లో 104; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) అంతా తానై మెరిపించాడు. హైదరాబాద్ అంతపెద్ద స్కోరు చేస్తే సొంతగడ్డపై సిరాజ్ (4–0–17–1) పొదుపుగా బౌలింగ్ చేశాడు. అనంతరం బెంగళూరు 19.2 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి 187 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కోహ్లి (63 బంతుల్లో 100; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఆరో సెంచరీ నమోదు చేయగా... డుప్లెసిస్ (47 బంతుల్లో 71; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా ఆడుకున్నాడు. ఈ శతకంతో ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా క్రిస్ గేల్ (6 సెంచరీలు) పేరిట ఉన్న రికార్డును కోహ్లి సమం చేశాడు. అంతేకాకుండా ఒకే జట్టు తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా కోహ్లి నిలిచాడు. అతనొక్కడే... హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ (11), రాహుల్ త్రిపాఠి (15) నిరాశపరిచారు. వీరిద్దరిని బ్రేస్‌వెల్ ఒకే ఓవర్లో పడగొట్టేశాడు. వాళ్లు చేసింది తక్కువే అయినా ఆ ప్రభావం ఇన్నింగ్స్‌పై పడకుండా క్లాసెన్ దూకుడుగా నడిపించాడు. కెప్టెన్ మార్క్రమ్ (20 బంతుల్లో 18) అండతో సన్‌రైజర్స్ స్కోరును అదే పనిగా పెంచాడు. ఈ క్రమంలో బౌండరీలు సిక్సర్లు అవలీలగా బాదేశాడు. క్లాసెన్ వీరబాదుడుతో బలమైన భాగస్వామ్యం వేగంగా నమోదైంది. మార్క్రమ్ను బౌల్డ్ చేసి షహబాజ్ 76 పరుగుల భాగస్వామ్యానికి ముగింపు పలికినా... క్లాసెన్ బ్యాటింగ్ జోరు, పరుగుల హోరేం తగ్గనేలేదు. 49 బంతుల్లోనే శతక్కొట్టేశాడు. ఎట్టకేలకు 19వ ఓవర్లో అతని విధ్వంసానికి హర్షల్ తెరదించాడు. చకచకా లక్ష్యం వైపు... లక్ష్యం కష్టమైందే... మ్యాచ్ ఆర్సీబీకి కీలకమైంది. అందుకే ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్ ఛేదనకు తగ్గట్లే అడుగులు వేశారు. చకచకా పరుగులు చేశారు. బౌండరీలతో స్కోరుబోర్డును పరుగెత్తించి... సిక్సర్లతో స్టేడియాన్ని హుషారెత్తించారు. ప్రేక్షకులంతా సొంతజట్టు కంటే బెంగళూరు జట్టుకే జై కొట్టడంతో రెట్టించిన ఉత్సాహంతో ఓపెనింగ్ జోడీ చెలరేగిపోయింది. ఇద్దరు కూడా కలసికట్టుగా చితగ్గొట్టేయడంతో పవర్‌ప్లేలో ఆర్సీబీ 64/0 స్కోరు చేసింది. 11.1 ఓవర్లలో వంద పరుగుల్ని ఏ కష్టం లేకుండా దాటింది. లక్ష్యతీరానికి చేరాక ఓపెనర్లిద్దరు అవుటైనప్పటికీ మ్యాక్స్‌వెల్ (5 నాటౌట్), బ్రేస్‌వెల్ (4 నాటౌట్) డ్రామా లేకుండా ముగించారు. ఉప్పల్‌లో ఊపేశాడు... ముందుగా డుప్లెసిస్ (34 బంతుల్లో) ఫిఫ్టీ చేస్తే తర్వాతి ఓవర్లోనే కోహ్లి 35 బంతుల్లో పూర్తి చేసుకున్నాడు. అర్ధసెంచరీ అయ్యాక కోహ్లి ఆట మరో లెవెల్‌కు చేరింది. ఛేదనలో మొనగాడిగా పేరున్న కోహ్లి తన పాత ‘విరాట్రూపం’ చూపించాడు. డ్రైవ్, కట్, హుక్ ఇలా కచ్చితత్వంతో కూడిన షాట్లు అతని బ్యాట్ నుంచి జాలువారడంతో కొండంత లక్ష్యం ఐస్ముక్కలా కరిగిపోయింది. మరో 27 బంతుల్లోనే కింగ్ కోహ్లి 50 నుంచి 100 పరుగులకు చేరుకున్నాడు. భువీ వేసిన 18వ ఓవర్ నాలుగో బంతికి కోహ్లి డీప్ మిడ్‌వికెట్ మీదుగా కొట్టిన సిక్సర్‌తో స్టేడియం ఊగిపోయింది. డగౌట్‌లోని సహచరులే కాదు... గ్యాలరీలోని ప్రేక్షకులంతా కరతాళధ్వనులతో సవ్వడి చేశారు. అతని అసాధారణ ఇన్నింగ్స్‌కు ముగ్దులైన ప్రత్యర్థులు సైతం హ్యాట్సాఫ్ చెప్పారు. మరుసటి బంతికి అతను అవుటై నిష్క్రమిస్తుంటే స్టేడియం హోరెత్తింది. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) మహిపాల్ (బి) బ్రేస్‌వెల్ 11; త్రిపాఠి (సి) హర్షల్ (బి) బ్రేస్‌వెల్ 15; మార్క్రమ్ (బి) షహబాజ్ 18; క్లాసెన్ (బి) హర్షల్ 104; బ్రూక్ (నాటౌట్) 27; ఫిలిప్స్ (సి) పార్నెల్ (బి) సిరాజ్ 5; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–27, 2–28, 3–104, 4–178. 5–186. బౌలింగ్: సిరాజ్ 4–0–17–1, పార్నెల్ 4–0–35–0, బ్రేస్‌వెల్ 2–0–13–2, షహబాజ్ 3–0–38–1, హర్షల్ 4–0–37–1, కరణ్ శర్మ 3–0–45–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) ఫిలిప్స్ (బి) భువనేశ్వర్ 100; డుప్లెసిస్ (సి) త్రిపాఠి (బి) నటరాజన్ 71; మ్యాక్స్‌వెల్ (నాటౌట్) 5; బ్రేస్‌వెల్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.2 ఓవర్లలో 2 వికెట్లకు) 187. వికెట్ల పతనం: 1–172, 2–177. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–48–1, అభిషేక్ శర్మ 3–0–28–0, నటరాజన్ 4–0–34–1, త్యాగి 1.2–0–21–0, నితీశ్ కుమార్ రెడ్డి 2–0–19–0, మయాంక్ డాగర్ 4–0–25–0, ఫిలిప్స్ 1–0–10–0. ఐపీఎల్లో నేడు పంజాబ్ VS రాజస్తాన్ (రాత్రి గం. 7:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
మరోసారి గొడవ పడిన కోహ్లి, గంబీర్
-
నా ఫేవరేట్ ఐపీఎల్ టీం అదే.. మనసులో మాట చెప్పేసిన శ్రీవల్లి
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. పుష్ప సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ సంపాదించుకున్న కన్నడ బ్యూటీకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. టాలీవుడ్లో సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప-2లో బన్నీ సరసన మరోసారి అలరించనుంది. ఇప్పటికే పుష్ప-2 షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది శాండల్‌వుడ్ భామ. (ఇది చదవండి: సోషల్ మీడియాలో మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న రష్మిక) అయితే ఈ ఏడాది ఐపీఎల్-2023 ప్రారంభోత్సవంలో తమన్నా భాటియాతో సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఐపీఎల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన ఫేవరేట్ జట్టు గురించి మనసులోని మాటను బయటపెట్టింది. అంతే కాకుండా తన ఫేవరేట్ క్రికెటర్ ఎవరో చెప్పేసింది ముద్దుగుమ్మ. రష్మిక మందన్నా మాట్లాడుతూ.. ' నేను కర్ణాటక నుంచి వచ్చా. ఈసారి ఐపీఎల్ తప్పకుండా ఆర్సీబీ గెలుస్తుందని ఆశిస్తున్నా.( ఈ సాలా కప్ నమ్దే) . ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఆర్సీబీ ఆటను ఆస్వాదిస్తున్నా. ఐపీఎల్లో నా ఫేవరేట్ క్రికెటర్ విరాట్ సర్. అతను ఓ స్వాగర్. అతనొక అద్భుతం.' అంటూ కొనియాడింది. కాగా.. ప్రస్తుతం దేవ్‌మోహన్‌తో కలిసి రెయిన్బో చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంది. మరోవైపు టాలీవుడ్ హీరో నితిన్‌తో ఓ చిత్రంలో కనిపించనుంది. (ఇది చదవండి: మహారాణి పాత్రలో నటించనున్న రష్మిక మందన్నా!) .@iamRashmika reveals her RCB FAN-GIRL side. 🙈💓 From being a die-hard @ImVkohli fan to chanting ‘Ee Sala Cup Namde’, she is a TOTAL RCBian! 🤩 Tune-in to #LSGvRCB on #IPLonStar Today | Pre-show at 6:30 PM & LIVE action at 7:30 PM | Star Sports Network#GameOn #BetterTogether pic.twitter.com/C3NkP9KRl0 — Star Sports (@StarSportsIndia) May 1, 2023 View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
పరుగుల వరద పారిస్తున్న మరో కోహ్లి.. 3 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు
Taruwar Kohli Shines In Ranji Trophy 2022: ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో మిజోరం కెప్టెన్ తరువార్ కోహ్లి పేరు మార్మోగిపోతుంది. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మాజీ సహచరుడైన ఈ కోహ్లి రంజీ ట్రోఫీ 2022లో పరుగుల వరద పారిస్తూ హెడ్‌లైన్స్‌లో నిలిచాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 6 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 526 పరుగులు స్కోర్ చేశాడు. ఇందులో ఓ అర్ధ సెంచరీ, 3 సెంచరీలు ఉన్నాయి. బీహార్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకాలు (151, 101 నాటౌట్, వికెట్) బాదిన కోహ్లి, మణిపూర్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో బౌలింగ్‌లో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు, 22 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లతో పాటు అర్ధ సెంచరీ (69 పరుగులు) కూడా సాధించాడు. Found this photograph in our comm box in Ranchi. The boys who lifted the 2008 U19 World Cup.. Two Kohlis, a local boy, a keeper and a southpaw in there. Let’s see who gets all@of them right ... #IndvSA — Jatin Sapru (@jatinsapru) October 19, 2019 ఇక నాగాలాండ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో కోహ్లి మరోసారి రెచ్చిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లతో పాటు 32 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌తో పాటు మరో భారీ శతకాన్ని (151 నాటౌట్) బాదాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఇప్పటివరకు 49 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 51.02 సగటుతో 3827 పరుగులు చేశాడు. రంజీల్లో పంజాబ్ తరఫున అరంగేట్రం చేసిన కోహ్లి.. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంకు వలస వచ్చి అద్భుతాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో మిజోరం యువ ఆటగాళ్లకు మార్గదర్శకుడిగా నిలుస్తున్నాడు. కాగా, 33 ఏళ్ల తరువార్ కోహ్లి.. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అండర్-19 ప్రపంచకప్ (2008) గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే, జాతీయ స్థాయిలో ఆశించిన అవకాశాలు రాకకపోవడంతో దేశవాళీ క్రికెట్‌కే పరిమితమయ్యాడు. చదవండి: రోహిత్ శర్మ కెప్టెన్సీపై దిగ్గజ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు -
నువ్వు కాకపోతే ఇంకొకరు.. పంత్‌కు కోహ్లి వార్నింగ్..!
Virat Kohli Rishabh Pant Banter Ahead Of T20 World Cup 2021: రేపటి(అక్టోబర్ 17) నుంచి ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో టోర్నీ ప్రసారదారు స్టార్ స్పోర్ట్స్ ఓ సరదా వీడియోను రూపొందించింది. ఇందులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వికెట్‌కీపర్ రిషబ్ పంత్‌ల మధ్య సరదా సంభాషణ జరుగుతుంది. వీడియో కాల్ మాధ్యమం ద్వారా నడిచే ఈ సంభాషణలో తొలుత కోహ్లి పంత్‌ను ఉద్దేశిస్తూ.. టీ20ల్లో సిక్సర్లే మ్యాచ్‌లను గెలిపిస్తాయని అంటాడు. అందుకు పంత్ స్పందిస్తూ.. నువ్వేం కంగారుపడకు భయ్యా, నేను రోజు ప్రాక్టీస్ చేస్తున్నా. .@imVkohli remembers @msdhoni while calling @RishabhPant17 🤔 Learn why in Part 1 of #SkipperCallingKeeper & stay tuned for Part 2!#LiveTheGame, ICC Men's #T20WorldCup 2021:#INDvENG | Oct 18, Broadcast: 7 PM, Match: 7.30 PM#INDvAUS | Oct 20, Broadcast: 3 PM, Match: 3.30 PM pic.twitter.com/SLYXUQj75g — Star Sports (@StarSportsIndia) October 14, 2021 ఇంతకుముందు కూడా వికెట్ కీపర్‌గా ఉన్న వ్యక్తే సిక్సర్ కొట్టి టీమిండియాకు ప్రపంచకప్ అందించాడు అంటూ 2011 వన్డే ప్రపంచకప్‌లో ధోని విన్నింగ్ షాట్‌ను ఉద్దేశిస్తూ బదులిస్తాడు. ఇందుకు రిప్లైగా కోహ్లి.. నిజమే కానీ, ధోని భాయ్ తర్వాత అంతటి వికెట్‌కీపర్ భారత్‌కు ఇంకా దొరకలేదని సెటైర్ వేస్తాడు. అందుకు పంత్.. నేనూ టీమిండియా కీపర్‌నే కదా అంటాడు. దీంతో చిర్రెత్తిపోయిన కోహ్లి.. చూడు పంత్.. నువ్వు కాకపోతే చాలా మంది వికెట్‌కీపర్లున్నారంటూ వార్నింగ్ ఇస్తాడు. ఈ తతంగం మొత్తానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తుంది. జట్టులో స్థానం గురించి, జట్టుకు టైటిల్ అందించడం గురించి వీరిద్దరే మాట్లాడుకోవాలి అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. Skipper 🤙 'keeper - What's brewing between @imVkohli & @RishabhPant17 ahead of the ICC #T20WorldCup 2021? 🤨 Guess 👇 & stay tuned for more interesting chats when it’s time for #SkipperCallingKeeper!#LiveTheGame #TeamIndia #ViratKohli #RishabhPant pic.twitter.com/1DiUkUfo5E — Star Sports (@StarSportsIndia) October 14, 2021 ఇదిలా ఉంటే, రేపటి నుంచి ప్రారంభమయే మెగా టోర్నీలో తొలుత గ్రూప్-ఏ, గ్రూ-బిలోని క్వాలిఫయర్స్ జట్ల మధ్య తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. అనంతరం మేజర్ జట్ల మధ్య సూపర్ 12 స్టేజ్ మ్యాచ్‌లు అక్టోబర్ 23 నుంచి ప్రారంభమవుతాయి. అంతకుముందే భారత్.. ఇంగ్లండ్(అక్టోబర్ 18), ఆస్ట్రేలియా(అక్టోబర్ 20) జట్లతో వార్మప్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఇక, ఈ టోర్నీలో టీమిండియా లీగ్ దశలో తలపడబోయే మ్యాచ్‌ల విషయానికొస్తే.. అక్టోబర్ 24న పాక్‌తో, అక్టోబర్ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్ 3న అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. చదవండి: అసలు ఇతను కపిల్ దేవేనా.. ఎంతలా మారిపోయాడో చూడండి..! -
కోహ్లిని వెనక్కు నెట్టిన రోహిత్.. అగ్రస్థానానికి ఎగబాకిన రూట్
-
కోహ్లి, రూట్ కొట్టుకున్నంత పని చేశారట..!
లీడ్స్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మూడో టెస్ట్ ఆరంభానికి కొన్ని గంటల ముందు ఓ సంచలనాత్మక ఘటన వెలుగులోకి వచ్చింది. దీని ప్రభావం మూడో టెస్ట్ మ్యాచ్‌పై పడే అవకాశాలు లేకపోలేదు. ఈ అంశం ఇరు జట్ల క్రికెటర్లు, కెప్టెన్ల ఆటతీరు, వారి వ్యూహాలను ప్రభావితం చేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ప్రతిష్ఠాత్మకమైన లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు ఘోరంగా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే, ఆ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ కోహ్లి, ఇంగ్లండ్ సారధి రూట్ మధ్య వాడివేడి వాగ్వాదం నడిచినట్లు తెలుస్తోంది. లార్డ్స్ పెవిలియన్ లాంగ్ రూమ్ వేదికగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ వాగ్వాదంలో ఇరు జట్ల ఆటగాళ్లు గ్రూపులుగా విడిపోయి వ్యక్తిగత దాడుల వరకూ వెళ్లినట్లు బ్రిటిష్ మీడియా కథనాలు ప్రసారం చేసింది. కోహ్లి, రూట్ అయితే ఏకంగా బాహాబాహికి దిగినట్లు సమాచారం. రెండో టెస్ట్ మూడో రోజు రూట్ భారీ శతకం సాధించిన అనంతరం ఈ ఘర్షణకు బీజం పడినట్లు తెలుస్తోంది. అప్పుడు 11వ నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన అండర్సన్‌ను టార్గెట్‌గా చేసుకుని బుమ్రా వరుసగా షార్ట్ పిచ్ బంతులను సంధించిన విషయం తెలిసిందే. బుమ్రా గంటకు 90 మైళ్ల వేగంతో బంతులు సంధించడంతో ఆండర్సన్ గాయలపాలయ్యాడు. దీన్ని మనసులో పెట్టుకున్న ఆండర్సన్.. ఔటైన అనంతరం బుమ్రాను దూషించడంతో ఇరు జట్ల మధ్య చిన్నపాటి యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి మ్యాచ్ పూర్తయ్యేవరకూ ఇరు జట్ల మధ్య ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. కాగా, ఈ మ్యాచ్ టీమిండియా 151 పరుగుల తేడాతో ఆతిధ్య జట్టును మట్టికరిపించిన సంగతి తెలిసిందే. చదవండి: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. అశ్విన్‌కు మరోసారి నిరాశే -
వార్నర్, కోహ్లీలను వెనక్కు నెట్టిన పాక్ కెప్టెన్..
న్యూఢిల్లీ: పాకిస్థాన్ కెప్టెన్, ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజమ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 14 సెంచరీలు బాదిన బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో మంగళవారం అర్థరాత్రి వరకు జరిగిన మూడో వన్డేలో బాబర్ ఆజామ్ (139 బంతుల్లో 158; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కి కెరీర్లో 14వ శతకాన్ని నమోదు చేశాడు. బాబర్ ఈ ఘనతను కేవలం 81 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించాడు. దీంతో ఈ జాబితాలోని దక్షిణాఫ్రికాకు చెందిన హషీమ్ ఆమ్లా(84 ఇన్నింగ్స్‌లు), ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(98 ఇన్నింగ్స్‌లు), టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (103 ఇన్నింగ్స్‌లు)లను వెనక్కునెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. మరోవైపు మహిళల క్రికెట్లోనూ ఏ బ్యాటర్ కూడా బాబర్ సాధించినంత తొందరగా 14 సెంచరీలు సాధించలేదు. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ మెగ్ లాన్నింగ్ 14 సెంచరీలు సాధించడానికి 82 ఇన్నింగ్స్‌లు ఆడాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే, బాబర్ శతకంతో చెలరేగిన పాక్‌కు మాత్రం పరాజయం తప్పలేదు. ఇంగ్లండ్ యువ బ్యాట్స్‌మెన్ జేమ్స్ విన్స్(95 బంతుల్లో 102; 11 ఫోర్లు) సూపర్ సెంచరీ సాధించడంతో పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో ఇంగ్లండ్ క్వీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 331 రన్స్ చేసింది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(56), మహ్మద్ రిజ్వాన్(74) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రిడన్ కేర్స్ (5/61) ఐదు వికెట్లతో రాణించగా.. సకీబ్ మహమూద్(3/60) మూడు, మాట్ పార్కిన్సన్ ఓ వికెట్ తీశాడు. అనంతరం ఛేదనలో జేమ్స్ విన్స్(102), లూయిస్ గ్రెగరి(77) రాణించడంతో ఇంగ్లండ్ జట్టు మరో రెండు ఓవర్లు ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. -
సచిన్ 'దేవుడు', ధోని 'లెజెండ్', కోహ్లి..?
ముంబై: ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్.. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో "ఆస్క్ మీ ఎనీ థింగ్" అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. అందులో అభిమానులు అడిగిన ప్రశ్నలకు అతను సింగల్ వర్డ్‌లో సమాధానమిచ్చాడు. సచిన్ గురించి అభిమానులు అడగ్గా.. క్రికెట్ దేవుడని, ధోనిని దిగ్గజ క్రికెటర్ అని, కోహ్లి అంటే ఇన్స్పిరేషన్(స్పూర్తి) అని, రోహిత్ శర్మ అంటే హిట్‌మ్యాన్ అని, పోలార్డ్ అంటే లార్డ్ అని, హార్దిక్ పాండ్య అంటే ఎంటర్టైనర్ అని టకాటకా బదులిచ్చాడు. ఇక క్రికెటే తన ఊపిరని, అందులో తనకిష్టమైన షాట్ స్వీప్‌షాట్ అని చెప్పుకొచ్చాడు. ముంబై ఇండియన్స్ జట్టును అతను కుటుంబంతో పోల్చాడు. క్రికెటర్ కాకపోయుంటే ఏమైవుండేవాడివని ఓ అభిమాన్ని అడిగిన ప్రశ్నకు.. నటుడిగా రాణించేవాడినని సమాధానమిచ్చాడు. క్రికెట్‌కు సంబంధించిన అంశాలే కాకుండా, అభిమానులడిన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ప్రశ్నలకు కూడా సూర్యకుమార్ ఓపికగా సమాధానమిచ్చాడు. బిర్యాని తనకిష్టమైన ఆహారమని, బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ ఫేవరెట్ తన యాక్టర్ అని వెల్లడించాడు. కాగా, గత ఐపీఎల్ సీజన్ సందర్భంగా.. సూర్యకుమార్, కోహ్లిల మధ్య మైదానంలో జరిగిన ఘర్షన నేపథ్యంలో కోహ్లిని స్పూర్తిదాయకమైన ఆటగాడని పేర్కొనడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. చదవండి: 45 ఏళ్ల వయసులో ఇరగదీశాడు.. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు -
ఆర్సీబీ అభిమానినే కానీ, కోహ్లికి కాదు: రష్మిక
బెంగళూరు: మత్తెక్కించే అందచందాలతో దక్షిణ భారత చిత్రసీమను ఉర్రూతలూగిస్తున్న కన్నడ భామ రష్మిక మంధన.. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే క్రికెట్‌ను కూడా రెగ్యులర్‌గా ఫాలో అవుతానంటోంది. ముఖ్యంగా ఐపీఎల్ అంటే తనకు పిచ్చి అని పేర్కొంది. ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. ఐపీఎల్లో తన ఫేవరెట్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని చెప్పుకొచ్చింది. ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్‌ను ఆర్సీబీ ఎలాగైనా సాధించాలని ఆకాంక్షించానని, కానీ అనుకోని పరిస్థితుల్లో లీగ్ వాయిదా పడటం ఆర్సీబీ అభిమానిగా తనను చాలా బాధించిందని తెలిపింది. స్వతహాగా ఆర్సీబీ అభిమానినే అయినప్పటికీ, తన ఫేవరెట్ క్రికెటర్ మాత్రం ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి కాదని వెల్లడించి, అందరిని ఆశ్చర్యపరిచింది. తనకు టీమిండియా మాజీ సారధి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. అతని బ్యాటింగ్, వికెట్ కీపింగ్, సారధ్యం అన్నీ తనకు బాగా నచ్చుతాయని, అతనో మాస్టర్ క్లాస్ ప్లేయర్ అని అభివర్ణించింది. క్రికెట్లో ధోని తన ఆల్‌టైమ్ హీరో అని ఆకాశానికెత్తింది. ఇదిలా ఉంటే రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ లీడ్ రోల్లో నటిస్తున్న "పుష్ప" సినిమాలో నటిస్తోంది. చదవండి: సెంచరీ చేయలేకపోయినా నీలా మ్యాచ్ ఫిక్సింగ్ మాత్రం చేయలేదు.. -
సెంచరీ చేయలేకపోయినా నీలా మ్యాచ్ ఫిక్సింగ్ మాత్రం చేయలేదు..
లండన్: పాకిస్థాన్ మాజీ ఆటగాడు సల్మాన్ బట్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మధ్య మాటల యుద్దం చినికి చినికి గాలివానలా మారుతుంది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ భారత్‌లో పుట్టుంటే కోహ్లికి మించిన ప్రజాదరణ లభించేదని, అతను కోహ్లిని వెనక్కు నెట్టి ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా చలామణి అయ్యేవాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వాన్‌కు సల్మాన్ బట్ చురకలంటించాడు. వన్డేల్లో కనీసం ఒక్క సెంచరీ కూడా చేయని వాన్‌కు.. అంతర్జాతీయ క్రికెట్లో 70 సెంచరీలు చేసిన కోహ్లి గురించి మాట్లాడే అర్హత లేదంటు ఘాటుగా విమర్శించాడు. అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ ఆటతీరును కనబర్చే కోహ్లిని ఇతరులతో పోల్చడం అర్దరహితమన్నాడు. ఈ నేపథ్యంలో సల్మాన్ బట్ వ్యాఖ్యలపై వాన్ కూడా ఘాటుగానే స్పందించాడు. సెంచరీ చేయలేకపోయినా నీలా మ్యాచ్ ఫిక్సింగ్ మాత్రం చేయలేదంటూ ట్విటర్ వేదికగా ధ్వజమెత్తాడు. ఈ వ్యాఖ్యలకు సల్మాన్ బట్ కూడా ధీటుగా బదులిచ్చాడు. వాన్ మానసిక సంబంధమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఘాటుగా విమర్శించాడు. ఇద్దరు అత్యుత్తమ ఆటగాళ్ల గురించి అనవసర చర్చను లేవనెత్తినందుకు తాను స్పందించానని, దానికి అతను పాత విషయాలను తవ్వడం ఏమాత్రం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా, 2010లో మ్యాచ్ ఫిక్సింగ్వివాదంలో చిక్కుకున్న బట్.. పదేళ్ల నిషేదానికి గురైన సంగతి తెలిసిందే. చదవండి: కోహ్లి అత్యుత్తమ ఆటగాడు.. మాట మార్చిన ఆసీస్ కెప్టెన్ -
బట్లర్ జట్టులో విధ్వంసకర వీరులకు దక్కని చోటు
లండన్: ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్, రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ ఐపీఎల్ ఆల్ టైమ్ బెస్ట్ ఎలెవెన్‌ను ఎంపిక చేశాడు. ఈ జట్టులో తనతో పాటు టీమిండియా స్టార్ ఓపెనర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను మరో ఓపెనర్‌గా ప్రకటించాడు. అయితే బట్లర్ ఎంపిక చేసిన జట్టులో విధ్వంసకర వీరులైన గేల్, వార్నర్, ధవన్‌లకు చోటు దక్కకపోవడం గమనార్హం. వీరితో పాటు అతను మిస్టర్ ఐపీఎల్ రైనాను కూడా పక్కన పెట్టాడు. మిడిలార్డర్లో టీమిండియా కెప్టెన్, ఆర్సీబీ సారధి విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, సీఎస్కే సారధి ధోనీలను తీసుకున్నాడు. ధోనీని ఆరాధ్య క్రికెటర్‌గా భావించే బట్లర్.. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా ఎంచుకున్నాడు. ఇక ఆటకు దూరంగా ఉన్న మిస్టర్ 360 ఆటగాడు డివిలియర్స్‌ను ఎంపిక చేయడాన్ని ఆయన సమర్ధించుకున్నాడు. ఆల్‌రౌండర్ల కోటాలో విండీస్ విధ్వంసకర యోధుడు పోలార్డ్, రవీంద్ర జడేజాలను ఎంపిక చేశాడు. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. పేస్ విభాగాన్ని భారత పేసు గుర్రం బుమ్రా, భువనేశ్వర్ కుమార్, లసిత్ మలింగాలతో భర్తీ చేశాడు. ఈ ముగ్గురు కొత్త బంతిని స్వింగ్ చేయడంతో పాటు డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంలో సమర్ధులని వీరి వైపు మొగ్గు చూపానన్నాడు. స్పిన్ విభాగంలో జడేజాకు తోడుగా హర్భజన్ సింగ్‌ను ఎంపిక చేసుకున్నాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో 150కి పైగా వికెట్లు తీసిన హర్భజన్ అనుభవం జట్టుకు కలిసొస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు. జట్టు వివరాలు: జోస్ బట్లర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోనీ(కీపర్), కీరన్ పొలార్డ్, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, లసిత్ మలింగా. చదవండి: కరోనా కాటుకు మాజీ క్రికెటర్ బలి -
కోహ్లి 70 సెంచరీలు చేశాడు.. మరి నువ్వు.?
ఇస్లామాబాద్: అనవసర కామెంట్లు చేస్తూ, అర్ధం పర్ధం లేని చర్చలను లేవనెత్తుతూ ఇటీవల కాలంలో తరుచూ వార్తల్లో నిలుస్తున్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్‌పై పాక్ మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ సల్మాన్ బట్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. కొద్ది రోజుల కిందట టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని న్యూజిలాండ్ సారధి కేన్ విలియమ్సన్తో పోలుస్తూ వాన్ తెరలేపిన చర్చపై బట్ మండిపడ్డాడు. విలియమ్సన్ భారత్‌లో జన్మించి ఉంటే కోహ్లిని వెనక్కు నెట్టి ప్రపంచపు అత్యుత్తమ క్రికెటర్‌గా నిలిచేవాడని వాన్ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని పేర్కొన్నాడు. వన్డే ఫార్మాట్లో ఒక్కటంటే ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేని వాన్ అర్ధరహితమైన చర్చలకు తెరలేపుతూ తన స్థాయిని దిగజార్చుకుంటున్నాడంటూ చురకలంటించాడు. 86 వన్డేల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగి ఒక్క శతకం కూడా నమోదు చేయలేని ఆటగాడు చర్చల్లో పాల్గొనేందుకు అనర్హుడని పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 70 శతకాలు నమోదు చేసి అత్యధిక శతకాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్, పాంటింగ్ తర్వాత మూడో స్థానంలో నిలిచిన కోహ్లిని ప్రస్తుత తరం క్రికెటర్లతో పోల్చడాన్ని ఆయన తప్పుబట్టాడు. ఇంగ్లండ్ కెప్టెన్‌గా మంచి ట్రాక్ రికార్డు కలిగిన వాన్.. కోహ్లిలా గొప్ప క్రికెటర్ మాత్రం కాదని, అలాంటి వ్యక్తికి ఆల్ టైమ్ గ్రేట్ బ్యాట్స్మెన్లలో ఒకరైన కోహ్లి గురించి మాట్లాడే అర్హత లేదని ఘాటుగా విమర్శించాడు. ప్రస్తుత తరం క్రికెటర్లలో కోహ్లికి మించిన ఆటగాడు లేడని, ఇందుకు అతని గణాంకాలే నిదర్శనమన్నాడు. రికార్డుల పరంగా చూసినా కోహ్లి ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడని, అలాంటప్పుడు అతన్ని సమకాలీకులతో పోల్చడం సమంజసం కాదని అభిప్రాయడ్డాడు. కాగా, వన్డే ఫార్మాట్లో ఒక్క సెంచరీ కూడా సాధించని వాన్.. టెస్టుల్లో మాత్రం 18 శతకాలు నమోదు చేశాడు. 1999 నుంచి 2007 మధ్యకాలంలో అతను 82 టెస్టుల్లో 5719 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో ఐదేళ్ల నిషేదానికి గురైన సల్మాన్ బట్.. పాక్ తరఫున 33 టెస్టులు, 78 వన్డేలు, 24 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. చదవండి: 'ఆ నెంబర్ వాన్ మరిచిపోలేదు.. అందుకే స్పందించాడు' -
వైరలవుతున్న టీమిండియా ప్రస్తుత, మాజీ కెప్టెన్ల భార్యల ఫోటోలు
న్యూఢిల్లీ: టీమిండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి, మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనిల జీవిత భాగస్వాములు చిన్నతనంలో క్లాస్మేట్స్ అన్న విషయం ఇటీవలి కాలంలో అందరికి తెలిసిపోయింది. వీరిద్దరు చిన్నతనంలో అసోంలోని ఓ పాఠశాలలో చదువుకున్నట్లు 2012లో అనుష్క శర్మ వెల్లడించింది. ధోని భార్య సాక్షి, తను అసోంలోని ఓ చిన్న పట్టణంలో నివాసం ఉన్నట్లు, తామిద్దరం కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నట్లు ఆమె ఓ ప్రైవేట్ కార్యక్రమంలో తెలిపింది. ఈ సందర్భంగా ఆమె, సాక్షి కలిసి స్కూల్లో తీయించుకున్న ఫోటోను ఆమె బహిర్గతం చేసింది. ఈ ఫోటోలో సాక్షి ఏంజెల్ వేషంలో ఉండగా, అనుష్క తన ఫేవరెట్ హీరోయిన్ మాధురి దీక్షిత్ తరహాలో గాగ్రా చోలీ ధరించి కనిపించింది. ఈ ఫోటోలు అప్పట్లో తెగ వైరలయ్యాయి. ఇదిలా ఉంటే, సాక్షి.. నాటి టీమిండియా టీ20 కెప్టెన్ ధోనిని 2010 జులై 4న వివాహం చేసుకోగా, కోహ్లి, అనుష్కల వివాహం 11 డిసెంబర్ 2017లో జరిగింది. అయితే వీరిద్దరి నిజ జీవితాల్లో చాలా కామన్ పాయింట్లు ఉన్నాయి. ఈ చిన్ననాటి స్నేహితురాళ్లు.. భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్లను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ఒక్కో కూతురు జన్మనిచ్చారు. ధోని దంపతులు తమ కుమార్తెకు జీవా అని నామకరణం చేయగా, విరుష్క జంట తమ గారాలపట్టికి వామిక అని పేరు పెట్టారు. ప్రస్తుతం ధోని, కోహ్లిలిద్దరూ ఐపీఎల్ 2021 సీజన్లో బిజీగా ఉండగా.. సాక్షి, అనుష్క శర్మలు ఎప్పటికప్పుడూ తమ అప్ డేట్స్ ను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. అయితే ఈ త్రో బ్యాక్ ఫోటోలను అనుష్క శర్మ ఫ్యాన్స్ క్లబ్ ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. చదవండి: అందమైన రాజస్థానీ రాయల్‌కు జన్మదిన శుభాకాంక్షలు.. -
ధోని తెరపైకి తెచ్చాడు.. కోహ్లి పాటిస్తున్నాడు!
అహ్మదాబాద్: భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అప్పట్లో తెరపైకి తెచ్చిన ఓ నూతన సంప్రదాయాన్ని ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా కొనసాగిస్తున్నాడు. అహ్మదాబాద్ వేదికగా శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి 3-2తో సీరీస్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం ట్రోఫీని అందుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ దాన్ని నేరుగా తీసుకెళ్లి అరంగేట్రం ఆటగాడైన ఇషాన్ కిషన్ చేతికి అందించాడు. ధోనిని ఫాలో అవుతున్నకోహ్లీ గతంలో సిరీస్ గెలిచిన సందర్భాల్లో ధోని కూడా ఇలానే జట్టులోకి కొత్తగా వచ్చిన ఆటగాడి చేతికి మొదట ట్రోఫీని అందించి, తాను పక్కకి వెళ్లి నిల్చునేవాడు. ఇప్పుడు కోహ్లి కూడా అదే సంప్రదాయాన్నికొనసాగిస్తున్నాడు. వాస్తవానికి చివరి టీ20 మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ తుది జట్టులో లేడు. కానీ.. రెండు, మూడు టీ20ల్లో ఆడిన ఇషాన్ కిషన్.. తన హిట్టింగ్తో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత తొడ కండరాల గాయం కారణంగా రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇదే సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ కూడా భారత్ జట్టులోకి అరంగేట్రం చేసి.. అంచనాలకి మించి రాణించాడు. కానీ.. సూర్యకుమార్ వయసు 30 ఏళ్లుకాగా.. ఇషాన్ కిషన్ వయసు కేవలం 22 ఏళ్లే. దాంతో.. ధోని తరహాలో యువ క్రికెటర్లలో ఉత్సాహం నింపేందుకు ఇషాన్ చేతికి ట్రోఫీని అందించాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు.. విరాట్ కోహ్లీ (80) నాటౌట్, రోహిత్ శర్మ (64) మెరుపు హాఫ్ సెంచరీలు, పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ తమదైన శైలిలో మెరుపులు మెరిపించడంతో భారత్ 2 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో డేవిడ్ మలాన్ (68) జోస్ బట్లర్ (52) హాఫ్ సెంచరీలతో పోరాడినా వారి వికెట్ల అనంతరం ఇంగ్లండ్ జట్టు 188/8కే పరిమితమైంది. దాంతో.. 36 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. ( చదవండి :ఆఖరి పోరులో అదరగొట్టారు ) C.H.A.M.P.I.O.N.S! 🏆🏆#TeamIndia @GCAMotera #INDvENG @Paytm pic.twitter.com/V0zCW4BugT — BCCI (@BCCI) March 20, 2021 -
‘అందుకే కోహ్లిని లీడర్ అంటాం’
అహ్మదాబాద్ : ఇంగ్లండ్‌తో అహ్మదాబాద్ వేదికగా గురువారం జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తన ఫేవరెట్ స్థానాన్ని సూర్యకుమార్ యాదవ్ కోసం త్యాగం చేశాడు. ఈ సీరీస్ లో రెండో టీ20 మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన యాదవ్‌కి ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. ఆ తర్వాత మూడో టీ20లో అతడిని రిజర్వ్ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. నాలుగో మ్యాచ్‌లో కోహ్లికి మూడో స్థానంలో ఆడే అవకాశం ఉన్నా తాను కాదని సూర్యను ఆ స్థానంలో పంపాడు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ ఆరంభంలోనే ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ చేజార్చుకుంది. దాంతో.. నెం.3 బ్యాటింగ్ స్ధానంలో కోహ్లీ వస్తాడని అంతా అనుకున్నారు. కానీ సూర్యకుమార్ యాదవ్ అనూహ్యంగా క్రీజులోకి వచ్చాడు. మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న మొదటి బంతినే భారీ సిక్స్‌తో బోణి కొట్టడమే కాక చక్కటి ఇన్నింగ్స్ తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో యాదవ్ (57; 31 బంతుల్లో 6x4,3x6) హాఫ్ సెంచరీ బాదేశాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ( 1) పరుగుతో వెనుదిరిగాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ తీసుకున్న నిర్ణయానికి స్పందిస్తూ భారత మాజీ ఫాస్ట్ ఇర్ఫాన్ పఠాన్ ‘కోహ్లీని లీడర్‌గా నేను గౌరవించడానికి కారణం ఇదే. కొత్తగా భారత్ జట్టులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్‌కి అవకాశం ఇవ్వడం కోసం తన ఫేవరెట్ బ్యాటింగ్ పొజీషన్‌ని త్యాగం చేశాడని’ కొనియాడాడు. మరోవైపు నెటిజన్లు కూడా కోహ్లీ త్యాగంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గతంలో జరిగిన మూడో టీ20లోనూ యువ హిట్టర్ ఇషాన్ కిషన్ కోసం కోహ్లీ తన నెం.3 స్థానాన్ని త్యాగం చేసిన విషయం తెలిసిందే. (చదవండి :సూర్య ప్రతాపం.. భారత్ విజయం ) -
విలియమ్సన్ సరసన కోహ్లి
అహ్మదాబాద్ : ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20లో వీరాట్ కోహ్లి కెప్టెన్‌గా విలియమ్సన్ పేరిట ఉన్న అత్యధిక అర్ధ సెంచరీల రికార్డును సమం చేశాడు. అంతర్జాతీయ టీ 20లో ప్రస్తుతం కోహ్లి ,విలియమ్సన్ 11 అర్ధ సెంచరీలతో సమంగా ఉన్నారు. మంగళవారం అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మూడవ టీ20 లో కోహ్లి కేవలం 46 బంతుల్లో 77 పరుగులు (నాటౌట్) చేసి ఈ ఘనతను సాధించాడు. ఇక ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అంతరాతీయ పురుషుల టీ20 క్రికెట్లో 3000 పరుగుల చేసిన మొదటి క్రికెటర్‌గా తన పేరును నమోదు చేసుకున్నాడు . టీ 20లో 138.96 స్ట్రైక్ రేట్‌తో సగటున 52.17 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ 20 లో కెప్టెన్ల జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన ఆరోన్ ఫించ్, ఇంగ్లాండ్‌కు చెందిన ఇయాన్ మోర్గాన్ వీరిద్దరు తొమ్మిది అర్ధ సెంచరీలు సాధించి కోహ్లీ ,విలియమ్సన్ తర్వాతి స్థానంలో ఉన్నారు. మూడో టీ20లో భారత బ్యాట్స్‌మెన్ తడబాటు పవర్‌ప్లేలోనే 24 పరుగులకు 3 వికెట్లను కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన భారత్‌కు కోహ్లి తన ఇన్నింగ్స్ ద్వారా గౌరవప్రదమైన స్కోర్‌ను ఇంగ్లాండ్ ముందు ఉంచాడు. ప్రత్యేకంగా మార్క్ వుడ్ వేసిన 18 వ ఓవర్లో 6, 6, 4 పరుగులు చేసి డెత్ ఓవర్లో తన విధ్వంసకర బ్యాటింగ్‌ను మరో సారి ప్రత్యర్థి జట్టుకు రుచి చూపించాడు. కోహ్లీ ( 77), రిషబ్ పంత్ (25) చివర్లో హార్దిక్ పాండ్యా (17) మినహా ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. -
మొన్న అలా, నేడు ఇలా.. కోహ్లిపై సెహ్వాగ్
అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో డకౌటైనా, రెండో మ్యాచ్‌లో మాత్రం మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్(49 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆడిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. తొలి టీ20 తుది జట్టు ఎంపిక విషయంలో(రోహిత్‌కు విశ్రాంతినివ్వడం) కొద్ది రోజుల కిందట టీమిండియా సారధిపై విరుచుకుపడిన ఆయన.. రెండో టీ20లో కోహ్లి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌ను ఆకాశానికెత్తేశాడు. అంతటితో ఆగకుండా మ్యాచ్‌ను ముగించడంలో కోహ్లి.. దిగ్గజ ఆటగాడు సచిన్‌తో సరిసమానమని కొనియాడాడు. ఈ విషయంలో యువ క్రికెటర్లు రిషబ్ పంత్, ఇషాన్ కిషన్‌లు కోహ్లిని ఆదర్శంగా తీసుకోవాలని సూచనలు చేశాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే ఇషాన్ కిషన్(32 బంతుల్లో 56; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అదరగొట్టే ప్రదర్శన చేసినా, కోహ్లిలా ఆఖరి దాకా క్రీజ్‌లో ఉండేందుకు అనాసక్తి కనబరిచాడని, ఈ విషయంలో అతను కెప్టెన్ సలహాలు తీసుకోవాలని సూచించాడు. అలాగే మరో యువ ఆటగాడు రిషబ్ పంత్ (13 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) సైతం వేగంగా పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించాడే కానీ, కోహ్లిలా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడన్నాడు. జట్టును విజయతీరాలకు చేర్చడంలో కోహ్లి చాలా పట్టుదలగా ఉంటాడని, ఈ కసిని యువ క్రికెటర్లు కూడా కలిగి ఉండాలని అభిప్రాయపడ్డాడు. ఇటీవలకాలంలో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న విరాట్ కోహ్లికి తాజా ఇన్నింగ్స్ ఊరట కలిగించి ఉంటుదని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్ట్ సిరీస్‌లో సైతం అంతగా ఆకట్టుకోని కోహ్లి రెండో టీ20లో అద్భుతమైన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి యువ క్రికెటర్లకు మార్గదర్శిగా నిలిచాడని సెహ్వాగ్ కితాబునిచ్చాడు. కాగా, ఇంగ్లండ్‌తో ముగిసిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి 1-1తో సిరిస్‌ను సమం చేసింది. ఇరు జట్ల మధ్య మూడో మ్యాచ్ ఇదే వేదికగా ఇవాళ ప్రారంభంకానుంది. -
టెస్ట్ సిరీస్‌కు పూర్తి స్థాయిలో సన్నద్దం : కోహ్లీ
సిడ్నీ : ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌కు పూర్తి స్థాయిలో సన్నదమవుతున్నట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. మంగళవారం సిడ్ని వేదికగా జరిగిన మూడో టీ-20 మ్యాచ్‌లో భారత్ ఓడినా 2-1తో తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. లక్ష్యాన్ని చేధించే క్రమంలో టాప్ ఆర్డర్ రాణించినప్పటికి మిడిల్ ఆర్డర్ విఫలమైందని తెలిపాడు. చివర్లో హర్థిక్ భారీ షాట్లు ఆడడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయిందన్నాడు. టీ-20 సిరిస్ విజయంతో మరింత ఆత్మవిశ్యాసం పెంపొందించాకున్నామని.. సరైన ప్రణాళికలను రూపొందించి టెస్ట్ సిరిస్‌కు పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతామని తెలిపాడు. కాగా గతంలో పర్యటించిన జట్టు కంటే ప్రస్తుత జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందన్నాడు. ఆసీస్ పర్యటనలో భాగంగా భారత్ నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. మొదటి డే-నైట్ టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 17న అడిలైడ్ వేదికగా ప్రారంభం కానుంది. -
టెండూల్కర్ డ్రైవ్... కోహ్లి క్రెసెంట్
మెల్బోర్న్: రియల్ ఎస్టేట్ మాయలు, జిమ్మిక్కులు ఇక్కడే కాదు ఆస్ట్రేలియాలోనూ ఉంటాయి. తాము డెవలప్ చేసినవి అమ్ముకోవాలన్నా, సొమ్ము చేసుకోవాలన్నా... కొనుగోలు దారుల కంట్లో పడాలని ఆసీస్ వెంచర్ యజమాని మన క్రికెటర్ల పేర్లపై పడ్డాడు. మెల్బోర్న్లోని రాక్బ్యాంక్ ప్రాంతంలో అకొలేడ్ ఎస్టేట్ ఓ వెంచర్‌ని అభివృద్ధి చేసింది. ఇక్కడ భారత సంతతి ప్రజలు ఎక్కువగా ప్లాట్లను కొనుగోలు చేస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఆ వెంచర్ డైరెక్టర్ అక్కడి వీధులకు సచిన్, కోహ్లి, కపిల్ దేవ్ల పేర్లు పెట్టారు. టెండూల్కర్ డ్రైవ్, కోహ్లి క్రెసెంట్, దేవ్ టెర్రస్లతో బోర్డులు పాతాడు. అలాగే విదేశీ ఇతర దేశ అభిమానుల కోసం మిగతా వీధులకు వా స్ట్రీట్, మియందాద్ స్ట్రీట్, ఆంబ్రోస్ స్ట్రీట్, సోబర్స్ డ్రైవ్, కలిస్ వే అనే పేర్లు పెట్టారు. దీనిపై ఆ వెంచర్ డైరెక్టర్ ఖుర్రమ్ సయీద్ మాట్లాడుతూ తనకిష్టమైన క్రికెటర్ల పేర్లను కొత్త వెంచర్ వీధులకు పెట్టినట్లు చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీధుల పేర్లకు ఆమోదం కోసం 60 పేర్లతో స్థానిక మెల్టన్ కౌన్సిల్‌కు అతను దరఖాస్తు చేశాడు. -
కోహ్లికి స్మిత్‌కు మధ్య 9 పాయింట్లే
దుబాయ్: సంవత్సరం పాటు ఆటకు దూరమైనా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మాత్రం ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ మళ్లీ దూసుకొచ్చాడు. తాజాగా ప్రకటించిన టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో స్మిత్ రెండో స్థానానికి (913 రేటింగ్ పాయింట్లు) చేరుకున్నాడు. యాషెస్ సిరీస్‌లో మూడు ఇన్నింగ్స్‌లలో కలిపి 378 పరుగులు చేసిన స్మిత్... కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను వెనక్కి తోసి కోహ్లి తర్వాతి స్థానంలో నిలిచాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి (922) ఈ జాబితాలో నంబర్‌వన్‌గానే కొనసాగుతున్నాడు. యాషెస్‌లో స్మిత్‌కు మరో మూడు టెస్టులు మిగిలి ఉండగా, కోహ్లి విండీస్‌తో రెండు టెస్టులు ఆడనున్నాడు. ఇద్దరి మధ్య పాయింట్ల తేడా 9 మాత్రమే కావడంతో అగ్రస్థానానికి ఇప్పుడు హోరాహోరీ పోటీ తప్పదు. కోహ్లితో పాటు టాప్–10లో భారత్ నుంచి పుజారా (4వ స్థానంలో) ఉన్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా (5వ ర్యాంక్), అశ్విన్ (10వ ర్యాంక్) టాప్–10లో ఉండగా... ప్యాట్ కమిన్స్ (914 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్‌పై సెంచరీ సాధించిన కరుణరత్నే (8వ ర్యాంక్) నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని టాప్–10లోకి అడుగు పెట్టగా...వరుసగా విఫలమవుతున్న జో రూట్ 6 నుంచి 9వ స్థానానికి పడిపోయాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో జేసన్ హోల్డర్ నంబర్‌వన్‌గా నిలిచాడు. -
సిరీస్‌పై గురి
కరీబియన్ పర్యటనలో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ను అజేయంగా ముగించేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. టి20ల్లో క్లీన్ స్వీప్ చేసి, రెండో వన్డేలో సునాయాస విజయం సాధించిన కోహ్లి సేన... ఆఖరిదైన మూడో వన్డేనూ హస్తగతం చేసుకుని సిరీస్ సొంతం చేసుకునే ప్రయత్నంలో ఉంది. వెస్టిండీస్ మాత్రం ఈ మ్యాచ్‌లోనైనా నెగ్గి సొంతగడ్డపై పరువు దక్కించుకోవాలని చూస్తోంది. అన్ని రంగాల్లో బలంగా ఉన్న భారత్‌ను నిలువరించాలన్నా, తమ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్‌కు ఘనంగా వీడ్కోలు ఇవ్వాలన్నా ఆ జట్టు శక్తికి మించి రాణించాల్సి ఉంటుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్: నిన్నటివరకు టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో నంబర్–4 స్థానంపై సాగిన చర్చ... ఇప్పుడు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఫామ్ వైపు మళ్లింది. ప్రపంచ కప్‌లో అద్భుత సెంచరీతో ఊపుమీదున్న స్థితిలో గాయంతో వైదొలగిన ధావన్ పునరాగమనంలో పరుగులకు ఇబ్బంది పడుతున్నాడు. టి20ల్లో, రెండో వన్డేలో అతడు ఏమాత్రం సాధికారికంగా ఆడలేకపోయాడు. బుధవారం వెస్టిండీస్‌తో ఇక్కడ జరిగే చివరి మ్యాచ్‌లోనైనా ధావన్ గాడిలో పడాల్సిన అవసరం ఉంది. విజయాల ఊపులో ఉన్న భారత్ ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇవ్వకుండా ఆడితే మరో సిరీస్ మన ఖాతాలో చేరడం ఖాయం. సిరీస్‌ను సమ చేయడంతో పాటు కెరీర్లో ఆఖరి మ్యాచ్‌గా ప్రకటించిన గేల్‌ను గౌరవంగా సాగనంపడం ఇప్పుడు కరీబియన్ల ముందున్న రెండు లక్ష్యాలు. గత మ్యాచ్ ఆడిన జట్టుతోనే భారత్ బరిలో దిగనుండగా... విండీస్ ఒక మార్పు చేయనున్నట్లు తెలుస్తోంది. అతడి ఆటపైనే దృష్టి... ధావన్ ఫామ్ కోసం కష్టాలు పడుతుండటంతో జట్టుకు శుభారంభాలు దక్కడం లేదు. రెండో వన్డేలో రోహిత్ కూడా విఫలమడంతో కష్టాల్లో పడింది. కెప్టెన్ కోహ్లి అద్భుత శతకం, యువ శ్రేయస్ అయ్యర్ సమయోచిత అర్ధసెంచరీతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. సిరీస్ ఫలితాన్ని తేల్చే మ్యాచ్‌లో ఓపెనర్లు రాణిస్తే భారత్ ఆదిలోనే పైచేయి సాధిస్తుంది. పలుసార్లు విఫలమైనా నాలుగో నంబరులో రిషభ్ పంత్‌నే దించే అవకాశం కనిపిస్తోంది. ఆరో స్థానంలో వచ్చే జాదవ్‌కూ ఈ మ్యాచ్ కీలకమే. స్పిన్ ద్వయం జడేజా, కుల్దీప్... పేస్ త్రయం షమీ, భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్‌లతో భారత బౌలింగ్ పటిష్టంగా ఉంది. వీరిని ఎదుర్కొంటూ పరుగులు సాధిచండం ప్రత్యర్థికి బ్యాట్స్‌మెన్‌కు సవాలేనని రెండో వన్డేలో స్పష్టమైంది. ఓ దశలో చేజారేలా కనిపించిన మ్యాచ్‌ను బౌలర్లు మనవైపు తిప్పారు. మూడో వన్డేలోనూ ఇదే జోరు చూపితే ప్రపంచ కప్ నిష్క్రమణను మరిపిస్తూ టెస్టు చాంపియన్ షిప్‌నకు ఆత్మవిశ్వాసంతో వెళ్లొచ్చు. విండీస్‌కు బ్యాటింగ్ బెంగ... బౌలింగ్‌లో ఫర్వాలేకున్నా బ్యాటింగ్ వెస్టిండీస్‌ను కలవరపరుస్తోంది. విధ్వంసక క్రిస్ గేల్ తన ఆఖరి మ్యాచ్‌లో ఎలా ఆడతాడో చూడాలి. హోప్, హెట్‌మైర్, పూరన్, చేజ్‌లతో భారీ లైనప్ ఉన్నా ఎవరి నుంచి విన్నింగ్ ఇన్నింగ్స్ రావడం లేదు. ఆరు వికెట్లు చేతిలో ఉన్నా రెండో వన్డేలో 71 బంతుల్లో 91 పరుగుల చేయలేకపోవడమే దీనికి నిదర్శనం. ఓపెనర్లలో లూయిస్ స్థానంలో క్యాంప్‌బెల్‌ను తీసుకోవచ్చని భావిస్తున్నా అందుకు పెద్దగా అవకాశాల్లేవు. లోయరార్డర్లో కెప్టెన్ హోల్డర్, బ్రాత్‌వైట్ బ్యాట్ ఝళిపిప్తేనే ఆతిథ్య జట్టు గెలుపుపై ఆశలు పెట్టుకోవచ్చు. పార్ట్‌టైమర్ చేజ్‌తో కొంత ప్రయత్నిస్తున్నా స్పెషలిస్ట్ స్పిన్నర్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడం విండీస్‌కు లోటు. రోచ్, కాట్రెల్, థామస్‌ల పేస్ త్రయం అనూహ్యంగా చెలరేగితే టీమిండియాకు కళ్లెం పడుతుంది. తుది జట్లు (అంచనా) భారత్: ధావన్, రోహిత్, కోహ్లి (కెప్టెన్), అయ్యర్, పంత్, జాదవ్, జడేజా, భువనేశ్వర్, కుల్దీప్, షమీ, ఖలీల్. వెస్టిండీస్: గేల్, లూయిస్/క్యాంప్‌బెల్, హోప్, హెట్‌మైర్, పూరన్, చేజ్, హోల్డర్, బ్రాత్‌వైట్, రోచ్, కాట్రెల్, థామస్. పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు అంతంతమాత్రమే సహకరించిన, రెండో వన్డే ఆడిన పిచ్‌పైనే ఈ మ్యాచ్ జరగనుంది. వాతావరణ పరిస్థితులు చూస్తే అంతరాయాలు తప్పకపోవచ్చని సమాచారం. జల్లుల వాన కురిసే వీలుంది. ఈ ప్రకారం చూస్తే టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ ఎంచుకోవచ్చు. -
సోషల్ మీడియాలోనూ కోహ్లీకి అరుదైన రికార్డు
-
బెంగళూరును చెన్నై చుట్టేసింది
ఎంత ‘పొట్టి’ క్రికెటైతే మాత్రం ఎప్పుడు మెరుపులేనా? బ్యాట్లే ఝళిపించాలా? బంతులు బౌండరీని దాటాలా? బౌలర్లకే చుక్కల్ని చూపించాలా? వారే బలికావాలా..! అని అనుకుందేమో ఐపీఎల్. అందుకే ఈ సీజన్ ఆరంభం భారీ షాట్లతో, వీర విధ్వంసంతో కాకుండా బౌలర్ల చాణక్యంతో మొదలైంది. చెన్నై స్పిన్నర్లు కనికట్టుతో... మూకుమ్మడిగా పనిపట్టడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కుదేలైంది. స్పిన్‌తో మొదలుపెట్టి, బెంగళూరును నిర్ణీత ఓవర్లకు ముందే చెన్నై చుట్టేసింది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై ‘సూపర్ కింగ్స్’లా బోణీ కొట్టేసింది. చెన్నై: ఐపీఎల్ అంటే ధనాధన్ షాట్లు... ఫటాఫట్ మెరుపులు... కానీ ఆనవాయితీకి భిన్నంగా, విధ్వంసానికి విరుద్ధంగా 12వ సీజన్ మొదలైంది. కోహ్లి, డివిలియర్స్‌లాంటి బ్యాటింగ్ హేమాహేమీలున్న జట్టుపై ధోని సేన స్పిన్‌తో విన్నయింది. ఇక్కడి చిదంబరం స్టేడియంలో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు 17.1 ఓవర్లలో 70 పరుగులకే కుప్పకూలింది. పార్థివ్ పటేల్ (35 బంతుల్లో 29; 2 ఫోర్లు) ఇన్నింగ్స్ టాప్ స్కోరర్. హర్భజన్, ఇమ్రాన్ తాహిర్ చెరో 3 వికెట్లు తీయగా... రవీంద్ర జడేజాకు రెండు వికెట్లు లభించాయి. తర్వాత చెన్నై 17.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసి గెలిచింది. రాయుడు (42 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. హర్భజన్ సింగ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇలా మొదలై... అలా ఆలౌటై బెంగళూరు ఇన్నింగ్స్‌లో పరుగులు, ఫోర్లు, సిక్సర్ల కన్నా నిలువెత్తు నిర్లక్ష్యమే నిండుగా కనిపించింది. బాధ్యత తీసుకునేందుకంటే వికెట్లను పారేసుకునేందుకే బ్యాట్స్‌మెన్ క్రీజులోకి వచ్చారనిపించింది. ఒకరిని మించి ఒకరు పెవిలియన్ చేరేందుకు అదేపనిగా పోటీపడ్డారు. పతనం కెప్టెన్ కోహ్లితో మొదలైంది. దీనికి మొయిన్ అలీ వికెట్ జతయ్యింది. ఇంకాసేపటికి డివిలియర్స్ వికెట్టూ పడింది. అయినా బెంగళూరు బ్యాట్స్‌మెన్ కళ్లు తెరవలేదు. ఆ మూడు వికెట్లూ వన్నె తగ్గిన వెటరన్ స్పిన్నర్ హర్భజన్ తీశాడని, పిచ్ స్పిన్‌కు వశమైందని దీంతో ఇక పదును ఉన్న ఇమ్రాన్ తాహిర్, జడేజాల బౌలింగ్ కష్టమని ఏ ఒక్కరూ అంచనాకు రాలేదు. వచ్చారు... ఆడారు... ఔటయ్యారు... అంతే! పరుగుల హోరులో జరగాల్సిన మ్యాచ్ వికెట్ల జోరుకు విలవిల్లాడింది. ఒక్కరంటే ఒక్కరు మూడు పదులైనా చేయలేదు. 10 మంది పదేసి చొప్పున కూడా పరుగులు చేయలేకపోయారు. అదేం చిత్రమో గానీ క్యాచ్ మిస్సయితే తర్వాతి బంతికి క్యాచ్ ఇచ్చి వెళ్లడం డివిలియర్స్‌కు చెల్లితే... రనౌట్ నుంచి తప్పించుకొని మళ్లీ మరుసటి బంతికే రనౌట్ కావడం హెట్మైర్కే సాధ్యమైంది. భజ్జీ భల్లే భల్లే... టాస్ నెగ్గిన చెన్నై కెప్టెన్ ధోని బౌలింగ్ ఎంచుకోగా... బెంగళూరు ఇన్నింగ్స్‌ను కెప్టెన్ కోహ్లి, పార్థివ్ పటేల్‌తో కలిసి ప్రారంభించాడు. మైదానంలోకి దిగిన ఆటగాళ్లను ఇంకా గుర్తుపట్టకముందే... చెన్నై బౌలర్లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ పనిపట్టారు. నాలుగో ఓవర్లో కోహ్లి (6) ఔటయ్యాడు. ఆరో ఓవర్లో మొయిన్ అలీ (9; 1 సిక్స్), 8వ ఓవర్లో డివిలియర్స్ (9) పెవిలియన్ చేరారు. ఈ ముగ్గురినీ హర్భజన్ సింగే ఔట్ చేశాడు. 8వ ఓవర్ రెండో బంతికి బెంగళూరు స్కోరు 38/3. ఈ ఓవర్ ముగిసేసరికి ఒక పరుగు వచ్చింది. మరో వికెట్ కూడా పడింది. హెట్‌మైర్ (0) రనౌట్. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ కూడా పిచ్‌ను పసిగట్టలేదు. స్పిన్నర్లను జాగ్రత్తగా ఎదుర్కోలేదు. క్రీజులో నిలబడే సాహసం చేయలేదు. ఓపెనర్ పార్థివ్ సరైన భాగస్వామి కోసం చూస్తుండగానే వచ్చినవారు వచ్చినట్లే ఔటయ్యారు. ఇమ్రాన్ తాహిర్ స్పిన్‌కు శివమ్ దూబే (2), నవ్‌దీప్ సైనీ (2), చహల్ (4) తలవంచారు. గ్రాండ్‌హోమ్ (4)ను, చివర్లో ఉమేశ్ (1)ను రవీంద్ర జడేజా పెవిలియన్ చేర్చితే, పార్థివ్ వికెట్ తీసి బ్రేవో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. చెన్నై జాగ్రత్తగా... ఛేదించాల్సిన లక్ష్యం తక్కువే అయినా ఒక్క వికెట్ పడగానే చెన్నై జాగ్రత్త పడింది. అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మన్ వాట్సన్ (0) చహల్ బౌలింగ్‌లో డకౌట్ కాగానే స్పిన్ తడాఖా తెలుసుకున్న సూపర్ కింగ్స్ నింపాదిగా ఆడింది. మరో ఓపెనర్ రాయుడు, రైనా (21 బంతుల్లో 19; 3 ఫోర్లు) రెండో వికెట్‌కు 32 పరుగులు జోడించారు. పదో ఓవర్లో జట్టు స్కోరు 40 పరుగుల వద్ద రైనా కూడా మొయిన్ అలీ స్పిన్‌కే వెనుదిరిగాడు. కాసేపటికి రాయుడు ఔటయినప్పటికీ చెన్నై గెలిచే స్థితిలో నిలిచింది. మిగతా లాంఛనాన్ని జాదవ్ (13 నాటౌట్; 1 ఫోర్), జడేజా (6 నాటౌట్) పూర్తి చేశారు. వ్యక్తిగత స్కోరు 15 పరుగుల వద్ద సురేశ్ రైనా ఐపీఎల్ చరిత్రలో 5000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాట్స్‌మన్‌గా ఘనత సాధించాడు. -
200 స్టార్ @200
సాక్షి క్రీడావిభాగం: వన్డే క్రికెట్లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో మూడు డబుల్ సెంచరీలు బాదిన భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కెరీర్లో మరో డబుల్ సెంచరీ కొట్టేందుకు చేరువయ్యాడు. ఈ ద్విశతకాల వీరుడు నేడు కెరీర్లో 200వ వన్డే మ్యాచ్ ఆడబోతున్నాడు. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన 15వ ఆటగాడు రోహిత్. వన్డేల్లో అత్యధిక స్కోరు (264) సహా అనేక ఘనతలు తన ఖాతాలో వేసుకున్న 32 ఏళ్ల ఈ ముంబైకర్ పలు చిరస్మరణీయ విజయాల్లో భాగంగా నిలిచాడు. కోహ్లి (4,248 పరుగులు), శిఖర్ ధావన్ (4,334 పరుగులు)లతో రోహిత్ నమోదు చేసిన రికార్డు భాగస్వామ్యాలు టీమిండియాకు మరచిపోలేని మధుర జ్ఞాపకాలను అందించాయి. దిగ్గజాలు కూడా సాధించలేని రీతిలో వన్డేల్లో రోహిత్ కళ్లు చెదిరే గణాంకాలు నమోదు చేశాడు. కోహ్లి అద్భుత ప్రదర్శనతో కొన్ని సార్లు రోహిత్ ఆట మరుగున పడినట్లు కనిపించినా... 2013 నుంచి 2018 వరకు వరుసగా ఆరేళ్ల పాటు రోహిత్ ప్రతీ సంవత్సరం అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడంటే అతిశయోక్తి కాదు. ఆరేళ్లు అంతంతే... 2007లో తొలి వన్డే ఆడిన నాటి నుంచి 2012 వరకు... 2013 నుంచి ఇప్పటి వరకు... రోహిత్ కెరీర్‌ను ఈ రెండు భాగాలుగా విశ్లేషించవచ్చు. తొలి ఆరేళ్ల పాటు ‘ప్రతిభావంతుడు’గా గుర్తింపు ఉన్నా దానికి న్యాయం చేయలేకపోయిన ఆటగాడిగానే రోహిత్ కనిపించాడు. ఆస్ట్రేలియాలో 2008 సీబీ సిరీస్‌లో రెండు కీలక అర్ధ సెంచరీలు సహా అప్పుడప్పుడు కొన్ని మెరుపులు ఉన్నా అవి రోహిత్ కెరీర్‌కు కావాల్సిన ఊపును ఇవ్వలేకపోయాయి. 2011లో దక్షిణాఫ్రికా గడ్డపై ఓపెనర్‌గా ప్రయత్నిస్తే చచ్చీ చెడి 23, 1, 5 పరుగులు చేశాడు. దాంతో వరల్డ్ కప్‌లో చోటు కూడా గల్లంతయింది. కొద్ది రోజులకే వెస్టిండీస్‌తో సిరీస్‌లో రాణించిన తర్వాత కూడా తడబాటు కొనసాగింది. 2012 వరకు కేవలం 2 సెంచరీలు చేస్తే అవి జింబాబ్వే, శ్రీలంకపైనే వచ్చాయి. అదే ఏడాది చివర్లో అతని ఆఖరి ఆరు ఇన్నింగ్స్‌ల స్కోర్లు 5, 0, 0, 4, 4, 4 మాత్రమే! ఈ స్థితిలో అతని కెరీరే ముగిసిపోయే పరిస్థితి కనిపించింది. చాంపియన్స్ ట్రోఫీతో షురూ... 2013 జనవరిలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ధోని మరోసారి రోహిత్‌ను ఓపెనర్‌గా పంపే సాహసం చేశాడు. ఈ మ్యాచ్‌లో అతను 83 పరుగులు చేశాడు. అయితే అసలు మాస్టర్ స్ట్రోక్ మాత్రం అదే ఏడాది జూన్‌లో చాంపియన్స్ ట్రోఫీతో మొదలైంది. ఈ టోర్నీతో మొదలైన రెగ్యులర్ ఓపెనర్ ప్రస్థానం రోహిత్‌ను వన్డే క్రికెట్ హీరోను చేసింది. అదే ఏడాది ఆస్ట్రేలియాపై సాధించిన తొలి డబుల్ సెంచరీతో అతని కెరీర్ తారాజువ్వలా దూసుకుపోయింది. తొలి ఆరేళ్లతో పోలిస్తే ఓపెనర్‌గా వచ్చాక పరుగులు, సగటు, సెంచరీలు, స్ట్రైక్‌రేట్... ఇలా ప్రతీదాంట్లో రోహిత్ శిఖర సమాన పురోగతి సాధించాడు. 2013నుంచి 2018 వరకు ఆరేళ్ల పాటు ప్రతీ సంవత్సరం అతని బ్యాటింగ్ సగటు 50 కంటే ఎక్కువగా ఉండటం మరో విశేషం. ఇప్పటికే వన్డే క్రికెట్లో అనేక రికార్డులు తన పేరిట లిఖించుకున్న రోహిత్ మున్ముందు మరెన్నో ఘనతలు సాధిస్తాడని ఆశిద్దాం. -
ధోనినే ‘బెస్ట్ ఫినిషర్’
న్యూఢిల్లీ: వన్డే క్రికెట్లో మ్యాచ్‌ను విజయవంతంగా ముగించడంలో ధోని తర్వాతే ఎవరైనా అని ఆస్ట్రే లియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అభిప్రాయ పడ్డారు. ఈ తరంలో అతడిని మించినవారు ఎవరూ లేరని, ఇప్పటికీ అతనే ‘బెస్ట్ ఫినిషర్’ అని చాపెల్ ప్రశంసించారు. ‘చివరి వరకు నిలిచి జట్టును గెలిపించడంలో ధోని అంత సమర్థంగా ఎవరూ ఒత్తిడిని జయించలేరు. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది, ఇక కష్టం అనిపించినప్పుడల్లా కొన్ని అద్భుతమైన షాట్లు ఆడి అతను లెక్క సరి చేస్తాడు. ఉత్కంఠభరిత క్షణాల్లో తన వ్యూహానికి అనుగుణంగా ప్రశాంతంగా ఆడటం చూస్తే అతని బుర్ర ఎంత పక్కాగా పని చేస్తుందో అర్థం చేసుకోవచ్చు’ అని చాపెల్ విశ్లేషించారు. గతంలో మైకేల్ బెవాన్‌కు ఈ విషయంలో మంచి రికార్డు ఉన్నా...మారిన పరిస్థితులను పరిగణలోకి తీసుకున్నా కూడా బెవాన్కంటే ధోనినే అత్యుత్తమమని ఆసీస్ దిగ్గజం అభిప్రాయం వ్యక్తం చేశారు. కోహ్లి ఇలాగే ఆడితే... వన్డే క్రికెట్లో నలుగురు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా రిచర్డ్స్, సచిన్, డివిలియర్స్, కోహ్లిలను చాపెల్ అభివర్ణించారు. వీరిలో కోహ్లి ఒక్కడే ఇప్పుడు ఆడుతున్నాడని...అతను ఇప్పటి జోరును కొనసాగిస్తే సచిన్‌కంటే 100 తక్కువ ఇన్నింగ్స్‌లలోనే అతని అన్ని రికార్డులు అధిగమిస్తాడని, మరో 20 సెంచరీలు ఎక్కువ చేస్తాడని కూడా ఇయాన్ అన్నారు. ఇదే జరిగితే విరాట్‌ను ‘వన్డే బ్రాడ్‌మన్’గా పిలవడంలో ఎలాంటి సందేహం ఉండనవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. -
కోహ్లి సేన అరుదైన రికార్డు సృష్టించే ఛాన్స్!
-
ఆసీస్ దాసోహం వెనుక!
సాక్షి క్రీడా విభాగం: ఆస్ట్రేలియా నుంచి అదీ దాని సొంతగడ్డపై ఏమాత్రం ఊహించని స్థాయి ఆట ఇది. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లేకపోవడంతో బ్యాటింగ్ బాగా బలహీనపడిందని అంతా అనుకున్నదే. అయితే, అనుభవజ్ఞులైన ఉస్మాన్ ఖాజా, షాన్ మార్‡్ష ఆ లోటును కొంతైనా భర్తీ చేస్తారని భావించారు. ఇదేమీ జరగకపోగా, అనూహ్యంగా బౌలింగ్‌లోనూ కంగారూలు తేలిపోయారు. ప్రధాన పేసర్ మిషెల్ స్టార్క్ తీవ్రంగా విఫలమయ్యాడు. హాజల్వుడ్డూ అతడికి తోడయ్యాడు. కాస్తోకూస్తో కమిన్సే నయమనిపించాడు. సహజంగా తమ ఆటగాళ్లను వెనుకేసుకొచ్చే ఆస్ట్రేలియా సీనియర్లకూ ఈ ప్రదర్శనతో చిర్రెత్తినట్లుంది. దీంతో తక్షణమే జట్టులోంచి కొందరిని తీసేయాలంటూ సూచించారు. టెస్టు టెస్టుకూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్, బౌలర్ల సత్తా తగ్గిపోవడంతో భారత్ పని సులువైపోయింది. సిరీస్ కోహ్లి సేన వశమైంది. అతడు నిలవలేదు... ‘కోహ్లికి దీటుగా పరుగులు సాధిస్తాడు...’ ఈ సిరీస్‌కు ముందు ఉస్మాన్ ఖాజాపై ఉన్న అంచనా ఇది. అక్టోబరులో దుబాయ్‌లో పాకిస్తాన్‌పై రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత శతకంతో టెస్టును కాపాడిన ఖాజా ఫామ్‌ను చూస్తే ఈ అంచనాలో తప్పేం లేదనిపించింది. కానీ, వాటిని అందుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఓపెనర్లు ఫించ్, హారిస్‌లకు అనుభవం లేనందున, జట్టులో సీనియర్‌గా, కీలకమైన వన్‌డౌన్ బ్యాట్స్‌మన్‌గా ఖాజా బాధ్యత రెట్టింపైంది. అయితే, అతడు 8 ఇన్నింగ్స్‌లలో ఒక్కటే అర్ధ సెంచరీతో 198 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మొత్తం స్కోరును టీమిండియా వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా అటు ఇటుగా సిడ్నీ టెస్టులో (193)నే చేయడం గమనార్హం. ఇక్కడే రెండు జట్ల మధ్య తేడా తెలిసిపోతోంది. ఇక షాన్ మార్‡్ష చేసినవి 183 పరుగులే. ఇందులో ఒక్క అర్ధశతకమూ లేదు. ట్రావిస్ హెడ్, హ్యాండ్స్కోంబ్, ఫించ్‌ల ఇన్నింగ్స్‌లు జట్టుకు ఏమాత్రం ఉపయోగ పడలేకపోయా యి. వీరికంటే, కొత్తవాడైనా హారిసే నయం అనిపించాడు. పైన్ బ్యాటింగ్ సామర్థ్యం అంతంతే కావడం, మిషెల్ మార్‡్ష వంటి ఆల్‌రౌండర్‌ను సరిగా ఉపయోగించుకోలేకపోవడం ఆసీస్ వనరులను పరిమితం చేశాయి. వీరంతా రాణించి ఉంటే లోయరార్డర్లోనూ ఆత్మవిశ్వాసం పెంచి ఉండేవారు. కానీ, అదేమీ జరగలేదు. మొత్తమ్మీద 8 అర్ధ శతకాలు చేసి నా, ఎవరి నుంచి సెంచరీ నమోదు కాకపోవడంతో ఆసీస్ పోరాడగలిగే స్కోర్లూ చేయలేకపోయింది. పదును లేక పస తగ్గింది... బ్యాటింగ్‌లో జట్టు వైఫల్యం ఆసీస్ పేసర్లపైనా ప్రభావం చూపినట్లుంది. స్టార్క్ తీరు చూస్తే ఇది వాస్తవమేనన్నట్లుంది. గతేడాది ప్రారంభంలో డర్బన్ టెస్టులో 109 పరుగులకే 9 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను పరాజయం పాల్జేసిన స్టార్క్... తాజాగా భారత్‌తో ఆడిన స్టార్క్ ఒక్కడేనా అన్నట్లుగా సాగింది అతడి బౌలింగ్. పేస్ ఉన్నా, అందులో పదును లేకపోవడంతో అతడి బౌలింగ్‌లో భారత బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడలేదు. తొలి రెండు టెస్టులు ఫర్వాలేదనేలా సాగినప్పటికీ తర్వాతర్వాత మరీ పేలవంగా బౌలింగ్ చేశాడు. దీంతో చివరి టెస్టులో పైన్... స్టార్క్‌ను కాదని పార్ట్ టైమర్ ఖాజాకు బంతినిచ్చాడు. సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో షార్ట్ బంతులతో మయాంక్, పుజారాలను ఇబ్బంది పెట్టడం, రహానేను అద్భుత బౌన్సర్‌తో ఔట్ చేయడం, 150 కి.మీ. వేగం నమోదు మినహా సిరీస్‌లో స్టార్క్ ప్రభావం శూన్యం. మొత్తమ్మీద 13 వికెట్లే పడగొట్టగలిగాడు. చిత్రంగా ఇదే టెస్టులో వందకుపైగా పరుగులిచ్చిన అతడు ఓ దశలో 25 ఓవర్లు వేసినా, అందులో ఒక్క మెయిడెనూ లేకపోయింది. 2018 పూర్తవకుండానే 200 వికెట్ల మైలురాయిని అందుకుంటాడని అంతా భావిస్తే... 2019 వచ్చినా 199 వికెట్ల వద్దే ఆగిపోయాడు. ఏమాత్రం ప్రభావం చూపకపోయినా మరో పేసర్ హాజల్‌వుడ్‌ను కొనసాగించి ఆసీస్ తప్పు చేసింది. భారత బ్యాట్స్‌మెన్‌కు ఇతడి నుంచి ఇబ్బందులు తప్పవని సిరీస్ ప్రారంభానికి ముందు ఊహాగానాలు వచ్చాయి. అయితే, హాజల్‌వుడ్ ఏ దశలోనూ ప్రమాదకారిగా కనిపించలేదు. సరికదా... పేలవ ప్రదర్శనలో స్టార్క్‌తో పోటీపడి 13 వికెట్లే తీయగలిగాడు. ► సిరీస్‌లో కంగారూల తరఫున కమిన్స్ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (6/27) నమోదు చేసినప్పటికీ అది మెల్బోర్న్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అవసరం లేని సందర్భంలో వచ్చినదే. ఇక అడిలైడ్, పెర్త్‌లో ఏకంగా 16 వికెట్లు నేలకూల్చిన ఆఫ్ స్పిన్నర్ లయన్‌ను మూడో టెస్టు నుంచి మన ఆటగాళ్లు అటు వ్యూహాత్మకంగా, ఇటు ఎదురుదాడితో దెబ్బకొట్టి ఆసీస్ బౌలింగ్‌పై పూర్తి ఆధిపత్యం చలాయించారు. ►79 తాజాగా ముగిసిన టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ నమోదు చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరిది. సిడ్నీ టెస్టులో ఓపెనర్ మార్కస్ హారిస్ చేశాడివి.గత వందేళ్లలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ టెస్టులతో కూడిన సిరీస్‌లలో ఓ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ చేసిన ‘అతి తక్కువ అత్యధిక వ్యక్తిగత’ స్కోరు ఇదే. ►27.90 సిరీస్‌లో ఆస్ట్రేలియా టాప్–6 బ్యాట్స్‌మెన్ ఉమ్మడి సగటు ఇది. స్వదేశంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ టెస్టుల సిరీస్‌లో గత వందేళ్లలో ఇది వారి మూడో అత్యల్ప సగటు. ►30.90 కంగారూ ముగ్గురు పేసర్ల సంయుక్త బౌలింగ్ సగటు ఇది. వ్యక్తిగతంగా చూస్తే ఇందులో స్టార్క్ సగటు (34.53) మరీ ఘోరం. సొంతగడ్డపై అతడికిది మూడో దారుణ ప్రదర్శన. హాజల్‌వుడ్ (30.61)ది స్వదేశంలో రెండో చెత్త గణాంకం. ►1 నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ బౌలర్లు ఒక్కటంటే ఒక్కటే ఎల్బీడబ్ల్యూ చేయగలిగారు. మూడో టెస్టులో స్పిన్నర్ లయన్... రహానేను ఈ విధంగా ఔట్ చేశాడు. ముగ్గురు పేసర్లు ఒక్కరిని కూడా వికెట్ల ముందు దొరకబుచ్చుకోలేకపోయారు. దీంతో వికెట్ లక్ష్యంగా కాకుండా బంతులేస్తున్నారంటూ ఓ దశలో కంగారూ బౌలింగ్ ప్రమాణాలపై చర్చ జరిగింది. -
చరిత్ర సృష్టించిన కోహ్లీ సేన
-
ఇంతగా ఎప్పుడూ గర్వపడలేదు
ఆటగాడిగా, కెప్టెన్‌గా ఎన్నో విజయాలు సాధించిన కోహ్లి ఆస్ట్రేలియాపై గెలుపు తర్వాత కొత్తగా కనిపించాడు. సిరీస్ విజయం ఇచ్చిన అమితానందంతో అతను ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. సిడ్నీ టెస్టు తర్వాత భావోద్వేగభరితమైన అతను పలు అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘నా కెరీర్లో ఇదే అతి పెద్ద ఘనత. అన్నింటికంటే అగ్రస్థానం ఇదే విజయానికి ఇస్తాను. 2011లో ప్రపంచకప్ గెలిచిన జట్టులో నేను జూనియర్ సభ్యుడిని. అంతకుముందు వరల్డ్‌కప్ గెలవలేకపోయిన బాధ ఏమీ లేదు కాబట్టి విజయం తర్వాత కూడా కొందరు సీనియర్లలా నేను భావోద్వేగానికి గురి కాలేదు. అది మంచి విజయమే అయినా ఇక్కడ నేను చాలా భావోద్వేగానికి లోనవుతున్నాను. వరుసగా మూడోసారి పర్యటించాను కాబట్టి ఇక్కడ గెలుపు ఎంత ప్రత్యేకమో చెప్పగలను. ఈ సిరీస్ విజయం భారత జట్టును కొత్తగా చూపిస్తుంది. జట్టులో సభ్యుడిగా నేనెప్పుడూ ఇంతగా గర్వపడలేదు. ఇలాంటి టీమ్‌ను నడిపించడం గౌరవంగా భావిస్తున్నా. నాలుగేళ్ల క్రితం ఇక్కడే తొలిసారి కెప్టెనయ్యాను. ఇప్పుడు ఇక్కడే సిరీస్ గెలవడం మధురానుభూతి. గత 12 నెలలుగా మేం పడిన కష్టానికి ఇది ప్రతిఫలం.’ ‘సాంప్రదాయ శైలిలో టెస్టు క్రికెట్ మూలాలకు కట్టుబడి బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. అద్భుతంగా ఆడిన పుజారాను ప్రత్యేకంగా ప్రశంసించాలి. మయాంక్ చాంపియన్‌లా ఆడాడు. బ్యాట్స్‌మెన్ అంతా తమ వంతు పాత్ర పోషించారు. నా దృష్టిలో మెల్బోర్న్లో ఓపెనర్‌గా హనుమ విహారి దాదాపు 70 బంతులు ఆడటం కూడా సెంచరీతో సమానం. మన బౌలర్లు ఇంతగా ఆటను శాసించిన తీరును గతంలో ఎప్పుడూ చూడలేదు. వారి సన్నద్ధత, ఫిట్నెస్, ఆలోచనా ధోరణి అన్నీ గొప్పగా ఉన్నాయి. వారు పిచ్‌ను చూసి మాకు అనుకూలిస్తుందా అని ఎప్పుడూ ఆలోచించలేదు. జట్టు కోసం ఏదైనా చేసేందుకు వారు సిద్ధమయ్యారు. ఇది ఇంకా ఆరంభం మాత్రమే.’ ‘దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లలో కూడా మమ్మల్ని మేం నమ్మాం. అక్కడి పరాజయాలు మేం తప్పులు దిద్దుకునేలా చేశాయి. మనం సరైన దిశలో పని చేస్తే దేవుడు కూడా సహకరిస్తాడు. ఒక టెస్టులో గెలిస్తే చాలదని, సిరీస్ నెగ్గాలని మేం భావించాం కాబట్టి ఈ గెలుపు ఎంతో ప్రత్యేకం. మేం ఏదైనా చేయగలమని ఈ జట్టు నిరూపించింది. ఈ విజయం తర్వాతి తరం టెస్టులపై ఆసక్తి కనబర్చేందుకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశిస్తున్నా. వేడుకలు జరుపుకునే అర్హత మాకుంది. ఇవి సుదీర్ఘంగా సాగుతాయని మాత్రం చెప్పగలను. అభిమానులు కూడా అండగా నిలిచారు. విదేశీ గడ్డపై ఆడుతున్నట్లుగా అనిపించనే లేదు.’ ►1 కెరీర్లో తొలిసారి పుజారా ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెల్చుకున్నాడు. ►3 దక్షిణాఫ్రికాలోనూ భారత్ గెలిస్తే... తొమ్మిది వేర్వేరు దేశాలపై వారి గడ్డపైనే టెస్టు సిరీస్‌లు గెలిచిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సరసన చేరుతుంది. ► 4 కోహ్లి సారథ్యంలో భారత జట్టు విదేశాల్లో నాలుగో సిరీస్ నెగ్గింది. తాజా విజయంతో సౌరవ్ గంగూలీ (4 సిరీస్‌లు) పేరిట ఉన్న రికార్డును కోహ్లి సమం చేశాడు. ► 5 ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ విజయాలు సాధించిన జట్ల సంఖ్య. ఇంగ్లండ్ (13 సార్లు), వెస్టిండీస్ (4 సార్లు), దక్షిణాఫ్రికా (3 సార్లు), న్యూజిలాండ్, భారత్ (ఒక్కోసారి) ఈ ఘనత సాధించాయి. -
టీ బ్రేక్..కోహ్లీ ప్రాక్టీస్.. వైరల్ వీడియో!
-
సెంచరీనో, డబుల్ సెంచరీనో కొడతా!
మెల్బోర్న్: గత ఏడాది ఆగస్టులో శ్రీలంకపై కొలంబోలో అజింక్య రహానే తన ఆఖరి సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత 15 టెస్టులు ఆడిన అతను మళ్లీ శతకం చేయలేదు. ఐదు అర్ధ సెంచరీలు మాత్రం సాధించగలిగాడు. వీటిలో రెండు తాజా ఆసీస్ సిరీస్‌లోనే వచ్చాయి. అయితే తాను భారీ స్కోరు సాధించడానికి మరెంతో దూరంలో లేనని, మెల్బోర్న్ టెస్టులో భారీ ఇన్నింగ్స్ ఆడతానని రహానే విశ్వాసం వ్యక్తం చేశాడు. సెంచరీ కాదంటే డబుల్ సెంచరీ కూడా కొట్టగలనని అతను చెప్పాడు. ‘అడిలైడ్, పెర్త్‌లలో నేను ఆడిన తీరు చూస్తుంటే మూడో టెస్టులోనే సెంచరీ సాధించగలనని నమ్ముతున్నా. కౌంటర్ అటాక్ చేయడంలో నా మానసిక దృక్పథం, నేను బ్యాటింగ్ చేస్తున్న లయను బట్టి చూస్తే 100 లేదంటే 200 పరుగులు కూడా చేయగలనేమో’ అని రహానే వ్యాఖ్యానించాడు. అయితే దాని గురించి అతిగా ఆలోచించడం అనవసరమని, పరిస్థితిని అర్థం చేసుకుంటూ ప్రస్తుతం ఆడుతున్న శైలిలోనే ఆడితే జట్టుకు మేలు చేసినవాడినవుతానని అన్నాడు. ఆస్ట్రేలియాతో 2014 సిరీస్‌లో ఎంసీజీ మైదానంలో రహానే... 171 బంతుల్లోనే 21 ఫోర్లతో 147 పరుగులు చేశాడు. కోహ్లి దూకుడే... కానీ! రెండో టెస్టు సందర్భంగా భారత కెప్టెన్ కోహ్లి తనకు అతి దగ్గరగా వచ్చాడే తప్ప... కోపమేమీ ప్రదర్శించలేదని ఆస్ట్రేలియా సారథి టిమ్ పైన్ అన్నాడు. ‘వాస్తవంగా చెప్పాలంటే నేను అంతర్జాతీయ క్రికెట్లో లేని రోజుల్లో కోహ్లిని అభిమానించేవాడిని. ఇతర ప్రొఫెషనల్ అథ్లెట్లలానే అతడు ఓటమిని ఒప్పుకోడు. వ్యక్తిగతంగా ఏమిటో తెలియకున్నా, ఆటపట్ల కోహ్లి దృక్పథాన్ని, దూకుడును నేను ఇష్టపడతా’ అని పైన్ అన్నాడు. -
టాపర్స్ కోహ్లి, సింధు
ముంబై: మైదానంలో పరుగుల వర్షం కురిపిస్తున్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మైదానం బయట కూడా తన ఇమేజ్‌తో కాసుల పంట పండిస్తున్నాడు. అమెరికాకు చెందిన ప్రముఖ బిజినెస్ మేగజైన్ ‘ఫోర్బ్స్’ విడుదల చేసిన భారత ధనవంతుల తాజా జాబితాలో కోహ్లి ఓవరాల్‌గా రెండో స్థానంలో... క్రీడాకారుల విభాగంలో తొలి స్థానాన్ని అలంకరించాడు. ఈ ఏడాది కోహ్లి రూ. 228 కోట్ల 9 లక్షలు ఆర్జించినట్లు ‘ఫోర్బ్స్’ పత్రిక తెలిపింది. మహిళల క్రీడాకారిణుల జాబితాలో హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఈ ఏడాది ఆమె మొత్తం రూ. 36 కోట్ల 50 లక్షలు సంపాదించింది. ఓవరాల్ జాబితాలో సింధు 20వ ర్యాంక్‌లో ఉంది. రూ. 16 కోట్ల 54 లక్షలతో మరో బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ 58వ ర్యాంక్‌లో నిలిచింది. భారత ధనవంతుల టాప్–100 జాబితాలో 21 మంది క్రీడాకారులకు చోటు లభించింది. రూ. 101 కోట్ల 77 లక్షల సంపాదనతో ధోని 5వ ర్యాంక్‌లో... రూ. 80 కోట్లతో సచిన్ టెండూల్కర్ 9వ ర్యాంక్‌లో ఉన్నారు. -
తేలిగ్గా తలొగ్గుతుందా?
ఆస్ట్రేలియాతో సిరీస్ అంటే గతంలో మాటకు మాటతో మొదలయ్యేది. ఇప్పుడు దాని స్థానంలో ‘ఆట’ చర్చకు వస్తోంది. బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో మైదానంలో కంటే ఆ జట్టు మానసికంగా ఎక్కువ కుదేలైంది. ఈ నేపథ్యంలో కంగారూలు బలహీన పడ్డారని, వారి సొంతగడ్డపై టీమిండియా తొలిసారి సిరీస్ నెగ్గేస్తుందని ఊహాగానాలు వస్తున్నాయి. మూలాలను విశ్లేషిస్తే మాత్రం ఇదేమంత సులువు కాదని తెలుస్తుంది. ఎందుకంటే... సాక్షి క్రీడా విభాగం:సరిగ్గా రెండు నెలల క్రితం యూఏఈలో ఆస్ట్రేలియా–పాకిస్తాన్ టెస్టు మ్యాచ్. పరాజయం తప్పించుకోవాలంటే ఐదో రోజంతా ఆడాల్సిన పరిస్థితి ఆసీస్‌ది. అది కూడా మెరుగైన పాక్ బౌలింగ్‌ను కాచుకుంటూ! మిగతా జట్లయితే పరాజయం ఖాయం అనుకుని చేతులెత్తేసేవి. కానీ, కంగారూలు అదరలేదు. బెదరలేదు. ప్రత్యర్థి ఎంత గింజుకున్నా పట్టు వదల్లేదు. చివరకు ‘డ్రా’ చేసుకుని గాని మైదానం వీడలేదు. ఈ మ్యాచ్‌లో ఉస్మాన్ ఖాజా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అద్భుతంగా ఆడగా, కెప్టెన్ టిమ్ పైన్ వీరోచితంగా నిలిచి పరాజయం తప్పించాడు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎంత బలహీనపడినా... ఆస్ట్రేలియా తేలిగ్గా తలొగ్గదని చెప్పేందుకు ఈ తాజా ఉదాహరణ ఒక్కటి చాలు. తటస్థ వేదికపైనే ప్రత్యర్థిది పైచేయి కాకుండా చూసుకున్న ఆ జట్టు... సొంత గడ్డపై మరింత ధీమా గా ఆడుతుందనడంలో సందేహం లేదు. వారు లేకుంటేనేం... పూర్తిగా కాకున్నా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లోటును భర్తీ చేయగల బ్యాట్స్‌మెన్ ఆసీస్‌కు ఉన్నారు. ఇందులో ఉస్మాన్ ఖాజా, షాన్ మార్‡్ష కీలకం కాగా, పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్ అరోన్ ఫించ్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్‡్ష నమ్మదగ్గవారు. ట్రావిస్ హెడ్ స్ట్రోక్ ప్లేయర్. పైన్ అచ్చమైన టెస్టు ఆటగాడు. అరంగేట్ర ఓపెనర్ మార్కస్ హ్యారిస్ ఇటీవల దేశవాళీల్లో భారీగా పరుగులు సాధించి ఫామ్‌లో ఉన్నాడు. ఆగస్టులో భారత్‌లో పర్యటించిన ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు సభ్యుడైన ఖాజా రెండు శతకాలు బాదాడు. అదే ఫామ్‌ను యూఏఈలోనూ కొనసాగించి కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతడి నిలకడకు మార్‡్ష సోదరుల ప్రతిభ తోడైతే జట్టుకు భారీ స్కోరు ఖాయం. వీరితో పాటు ఫించ్, హెడ్, హ్యారిస్‌ల అనుభవరాహిత్యాన్ని సొమ్ము చేసుకుంటేనే టీమిండియాకు అవకాశాలుంటాయి. అయితే, గతంలో ఇక్కడ పర్యటించిన ఇషాంత్, షమీలకు తోడు భువనేశ్వర్, బుమ్రా, ఉమేశ్ యాదవ్ రూపంలో ఈసారి మరింత మెరుగైన పేస్ వనరులున్నందున కోహ్లి సేన ఏం చేస్తుందో చూడాలి. నిలవగలరా వీరి ధాటికి... మిషెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, హాజల్‌వుడ్ వైవిధ్యమైన పేస్ త్రయం ఇది. యార్కర్లు, ఇన్ స్వింగర్లతో విరుచుకుపడే ఎడంచేతి వాటం స్టార్క్ ప్రపంచ స్థాయి బౌలర్. నాణ్యమైన బౌలరైన ఇతడిని దీటుగా ఎదుర్కొనగలిగే టెక్నిక్ భారత బ్యాట్స్‌మెన్‌లో కెప్టెన్ కోహ్లి ఒక్కడికే ఉంది. నిప్పులు చెరిగే స్టార్క్ బంతులు టీమిండియా ఓపెనర్లకు కఠిన సవాలే. రెండేళ్ల క్రితం పునరాగమనం చేసినప్పటి నుంచి కమిన్స్ పేస్ మరింత పదునెక్కింది. జట్టంతా తేలిపోయిన దక్షిణాఫ్రికా సిరీస్‌లో అతడు విశేషంగా రాణించి మూడు టెస్టుల్లో 20 వికెట్లు పడగొట్టాడు. పెర్త్‌లాంటి వేగవంతమైన పిచ్‌పై కమిన్స్ మ్యాచ్‌ను మలుపు తిప్పగలడు. ఇక హాజల్‌వుడ్ నిలకడైన వేగంతో పాటు కచ్చితమైన బంతులతో బ్యాట్స్‌మెన్‌ను పరీక్షిస్తాడు. ఈ సిరీస్‌లో బ్యాటింగ్‌లో ఖాజాపై ఎంత అంచనాలున్నాయో బౌలింగ్‌లో హాజల్‌వుడ్‌పై అంతే అంచనాలున్నాయి. చిన్నోడేనని చిన్నచూపొద్దు... ఆసీస్ జట్టులో అందరికంటే బలహీనంగా కనిపిస్తూ, పెద్దగా వార్తల్లోనూ నిలవని ఆటగాడు ఆఫ్ స్పిన్నర్ నాథన్ లయన్. చాపకింద నీరులా తన పని తాను చేసుకుంటూ పోయే అతడిని చిన్నచూపు చూస్తే పెద్ద దెబ్బ తినడం ఖాయం. గత పర్యటనలో అడిలైడ్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ ప్రధాన బౌలర్లను దీటుగా ఎదుర్కొని విజయం దిశగా వెళ్తున్న భారత్‌ను లయన్ ఊహించని విధంగా కుప్పకూల్చాడు. కోహ్లి (141), విజయ్ (99), రహానే (0), రోహిత్ (6) సహా ఏకంగా ఏడుగురిని ఔట్ చేసి కంగారూలను గెలిపించాడు. దేశవాళీ, అంతర్జాతీయం కలిపి ఇటీవలి పది మ్యాచ్‌ల్లో ఒకటి, రెండింట్లో మినహా మిగతా వాటిలో లయన్ మూడు అంతకుపైనే వికెట్లు తీశాడు. ఈ విషయంలో భారత స్పిన్నర్ అశ్విన్ కూడా అతడి ముందు దిగదుడుపే. మరి... గతం కంటే మరింత మెరుగైన లయన్‌ను ఈసారి ఎలా ఎదుర్కొంటారో చూడాలి. అప్పుడేం జరిగిందంటే... సౌరభ్ గంగూలీ నేతృత్వంలో టీమిండియా 2003–04 సీజన్లో ఆస్ట్రేలియాలో పర్యటించింది. నాడు ఆసీస్ జట్టుకు తురుపుముక్కల్లాంటి పేసర్ మెక్‌గ్రాత్, స్పిన్నర్ షేన్ వార్న్ సేవలు సిరీస్ మొత్తానికి అందుబాటులో లేవు. నాలుగు టెస్టులకు గాను బ్రెట్‌లీ రెండే ఆడాడు. జాసన్ గిలెస్పీ, నాథన్ బ్రాకెన్లాంటి పేసర్లే వారికి పెద్ద దిక్కయ్యారు. అయినా సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్‌లాంటి దిగ్గజాలున్న భారత్‌ను ఆస్ట్రేలియా నిలువరించింది. కొంత తడబడినా సిరీస్‌ను 1–1తో సమం చేసింది. దీన్నిబట్టి చెప్పేదేమంటే... ఆస్ట్రేలియా బయటకు ఎలాగైనా ఉండని, మైదానంలోకి దిగితే దాని ఆటే మారిపోతుంది. -
కోహ్లి (Vs) ఆస్ట్రేలియా
లాలా అమర్నాథ్, చందూ బోర్డే, మన్సూర్ అలీఖాన్ పటౌడీ, బిషన్ సింగ్ బేడీ, సునీల్ గావస్కర్, కపిల్ దేవ్, మొహమ్మద్ అజహరుద్దీన్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, మహేంద్ర సింగ్ ధోని... వీరంతా ఆస్ట్రేలియా గడ్డపై భారత టెస్టు జట్టుకు నాయకత్వం వహించిన కెప్టెన్లు. అయితే ఇందులో ఒక్కరు కూడా సిరీస్‌ను గెలుచుకున్న ఘనతను దక్కించుకోలేకపోయారు. కొన్నిసార్లు అరుదైన, అద్భుతమైన మ్యాచ్ విజయాలు దక్కినా సిరీస్ తుది ఫలితానికి వచ్చేసరికి మాత్రం నిరాశే ఎదురైంది. అయితే ఇప్పుడు కొత్త చరిత్రను లిఖించే అవకాశం కోహ్లి ముంగిట నిలిచింది. ఇప్పుడు అతను కెప్టెన్‌గా మాత్రమే కాకుండా ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ హోదాలో కంగారూల గడ్డపై యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. కోహ్లి తాజా ఫామ్‌ను, అతని ఆత్మవిశ్వాసాన్ని చూస్తుంటే ఇది ఆస్ట్రేలియాతో భారత్ సమరంకంటే కోహ్లి, ఆసీస్ మధ్య పోరుగానే కనిపిస్తోంది. సాక్షి క్రీడా విభాగం:విరాట్ కోహ్లి ఆస్ట్రేలియాలో జరిగిన గత సిరీస్‌లోనూ రెండు టెస్టుల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో భారత్ ఒకటి గెలిచి, మరొకటి ఓడింది. అయితే నాడు ధోని గైర్హాజరు, ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటన వల్ల అనూహ్య పరిస్థితుల నేపథ్యంలో అప్పటికప్పుడు జరిగిన కెప్టెన్సీ ఎంపిక అది. కాబట్టి నాటి ఫలితాన్ని పూర్తిగా కోహ్లి నాయకత్వానికి ఆపాదించలేము. మరోవైపు బ్యాట్స్‌మన్‌గా మాత్రం అప్పుడే అతను ఆసీస్ పని పట్టాడు. ఏకంగా 692 పరుగులతో ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు. కోహ్లి దూకుడుతో భారత్ గెలిచే అవకాశాలు సృష్టించుకోగలిగింది. దురదృష్టవశాత్తూ ఫలితం ప్రతికూలంగా వచ్చినా కంగారూల గుండెల్లో విరాట్ వణుకు పుట్టిం చాడు. మిషెల్ జాన్సన్‌ను సాధారణ బౌలర్ స్థాయికి దిగజార్చిన నాటి విరాట్ కోహ్లి బ్యాటింగ్ ప్రదర్శన ఆసీస్‌ను ఇప్పటికీ వెంటాడుతోంది. ఈ నాలుగేళ్లలో కోహ్లి శిఖర స్థాయికి చేరుకున్నాడు. ఆటగాడిగా లెక్కలేనన్ని రికార్డులు సృష్టించిన అతను, కెప్టెన్‌గా కూడా తనదైన ప్రత్యేకతను ప్రదర్శించాడు. ‘డ్రా’ల కోసం కాకుండా ఎలాగైనా గెలవాలనే కసి, ఎంతటి లక్ష్యాన్నైనా లెక్క చేయని తత్వంతో కోహ్లి సిద్ధంగా ఉన్నాడు. కోహ్లి ఆలోచనాశైలి కూడా ఆసీస్ గడ్డపై భారత్ సిరీస్ విజయంపై ఆశలు పెంచుతోంది. కోహ్లి మినహా... భారత్‌తో తలపడబోతున్న ఆస్ట్రేలియా జ ట్టులో ఇద్దరు స్టార్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లేరు. అయితే ప్రత్యర్థి బలహీనతలకంటే సహజంగా తమ బలంపైనే ఏ జట్టయినా దృష్టి పెడుతుంది. 2014–15 సిరీస్‌ను గుర్తు చేసుకుంటే కోహ్లి విలువేమిటో, ఇతర ఆటగాళ్ల పాత్ర ఏమిటో స్పష్టంగా అర్థమవుతుంది. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లతో జరిగిన సిరీస్‌లు, అక్కడ వచ్చిన ఫలితాలు చూస్తే ఇతర బ్యాట్స్‌మెన్ రాణించినా కూడా చివరకు కోహ్లి వల్లే గెలుపు సాధ్యమని తెలిసిపోతుంది. కాబట్టి ఆస్ట్రేలియా మాజీలు చెప్పినట్లు కోహ్లిపైనే అంతా ఆధారపడి ఉంది. అతడిని పడగొడితే చాలు సిరీస్ చిక్కినట్లే అనే భావనలో ఆసీస్ బౌలర్లు కూడా ఉన్నారు. గత సిరీస్‌లో కోహ్లి కాకుండా మురళీ విజయ్ 482 పరుగులు, రహానే 399 పరుగులతో నిలకడగా రాణించారు. బహుశా నాటి ప్రదర్శనే విజయ్‌కు ఆసీస్ గడ్డపై మరో అవకాశం కల్పించింది. అయితే ఇటీవల ఇంగ్లండ్‌లో విజయ్ ఆటతీరు, చాలా కాలంగా రహానే వైఫల్యాలు ఆందోళనపరిచేవే. పుజారా ఆ సిరీస్‌లో ఒకే ఒక అర్ధ సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియాలోనే తొలి సెంచరీ చేసిన రాహుల్ ఇప్పుడు తడబడుతుండగా... కుర్రాళ్లు పృథ్వీ షా, హనుమ విహారిలకు ఇది పెద్ద సవాల్. గత సిరీస్‌లోనూ మూడు టెస్టుల్లో కలిపి 173 పరుగులే చేసిన రోహిత్ శర్మ టెస్టు ఆటగాడిగా ఎదిగిందీ లేదు. అంతకు ముందూ అతనే... భారత్ జట్టు 0–4తో చిత్తుగా ఓడిన 2011–12 సిరీస్‌లో కూడా కోహ్లినే భారత టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 8 ఇన్నింగ్స్‌లలో కలిపి అతను 300 పరుగులు చేశాడు. కోహ్లి కెరీర్లో తొలి సెంచరీ ఇదే సిరీస్‌లోని చివరి టెస్టులో వచ్చింది. గణాంకాలన్నీ చూస్తే భూమి గుండ్రంగా ఉందన్నట్లుగా కోహ్లి చుట్టే మన జట్టు పరిభ్రమిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే అతడిని నమ్ముకొనే సిరీస్‌ను సాధించగలమని భావిస్తోంది. ఒకే ఒక్కడుతో తలపడేందుకు ఆసీస్ 11 మందితో సిద్ధమవుతోందనేది స్పష్టం. మరి కోహ్లి మన ఆశలు నిలబెడతాడా, అతని కోసం ప్రత్యర్థి ప్రత్యేక వ్యూహాలతో సిద్ధమైందా అనేది ఆసక్తికరం. ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లి టెస్టు రికార్డు టెస్టులు 8 ఇన్నింగ్స్ 16 పరుగులు 992 సగటు 52.0 సెంచరీలు 5 అర్ధ సెంచరీలు 2 అత్యధిక స్కోరు 169 -
బాదలేకపోయారు
...టీమిండియా బోల్తా పడింది! బౌలింగ్‌లో నియంత్రణ లేక... ఫీల్డింగ్‌లో బంతిని పట్టలేక... బ్యాటింగ్‌లో హిట్టింగూ చేయలేక... ఆస్ట్రేలియా గడ్డపై పెద్ద మైదానాల్లో టి20 మ్యాచ్ సంక్లిష్టతలను అధిగమించలేక... ఓటమి పాలైంది. వీటన్నిటిని సరిగ్గా చేసిన కంగారూ జట్టు విజయాన్నందుకుంది. స్వయంకృతానికి తోడు వర్షం కూడా విరాట్ కోహ్లి సేనను కొంత దెబ్బతీసింది. ఆడిన ఓవర్ల మేరకు ప్రత్యర్థి కంటే ఎక్కువ స్కోరే చేసినా, డక్‌వర్త్ లూయీస్ నిబంధన ముందు నెగ్గడానికి అది సరిపోలేదు. ఫలితం... ఫేవరెట్‌గా బరిలో దిగిన భారత్‌కు ఆసీస్ చేతిలో అనూహ్య పరాజయం. బ్రిస్బేన్: 6 బంతుల్లో 13 పరుగులు. చివరి ఓవర్లో టీమిండియా విజయ సమీకరణం ఇది. క్రీజులో ‘నిదహాస్ ట్రోఫీ’ ఫైనల్ ఆఖరి బంతి సిక్స్ వీరుడు దినేశ్ కార్తీక్ (13 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్)... ‘ఐపీఎల్ హిట్టర్’ కృనాల్ పాండ్యా (4 బంతుల్లో 2)... మీడియం పేసర్ మార్కస్ స్టొయినిస్ బౌలింగ్. సాధారణంగా ఇవే పరిస్థితులు భారత్‌లో ఉంటే మన జట్టు గెలుపు నల్లేరుపై నడకే. కానీ, ఆస్ట్రేలియాలో ఈ పప్పులుడకలేదు. కార్తీక్, కృనాల్ షాట్లకు బంతి స్టాండ్స్‌లోకి కాకుండా ఫీల్డర్ల చేతుల్లోకి వెళ్లింది. దీంతో కోహ్లి సేన లక్ష్యానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ 1–0తో ముందంజ వేసింది. రెండు జట్ల మధ్య బుధవారం ఇక్కడ జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 17 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (24 బంతుల్లో 46; 4 సిక్స్‌లు), స్టొయినిస్ (19 బంతుల్లో 33; 3 ఫోర్లు, సిక్స్); క్రిస్ లిన్ (20 బంతుల్లో 37; ఫోర్, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. కుల్దీప్ యాదవ్ (2/24) రెండు వికెట్లు పడగొట్టాడు. వర్షం కారణంగా గంట సమయం కోల్పోవడంతో ఆసీస్ ఇన్నింగ్స్‌ను, మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదించారు. అనంతరం డక్‌వర్త్ లూయీ స్ పద్ధతి ప్రకారం భారత్ లక్ష్యాన్ని 17 ఓవర్లలో 174 పరుగులుగా నిర్దేశించారు. ఓపెనర్ ధావన్ (42 బంతుల్లో 76; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకంతో అద్భుత ఇన్నింగ్స్ ఆడినా... దినేశ్ కార్తీక్, పంత్ (16 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్) దూకుడు చూపినా... ఫినిషింగ్ లోపంతో టీమిం డియా మ్యాచ్‌ను చేజార్చుకుంది. స్పిన్నర్ ఆడమ్ జంపా (2/22)కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. రెండో టి20 శుక్రవారం మెల్బోర్న్లో జరుగనుంది. ఆ ముగ్గురు... తొలి ఐదు ఓవర్లు సాధారణంగా, తర్వాతి ఐదు ఓవర్లు కొంత వేగంగా, ఆట సాగిన మిగతా ఓవర్లు రాకెట్లా దూసుకెళ్లింది ఆసీస్ స్కోరు. ఓపెనర్లలో షార్ట్ (7)ను బౌలింగ్‌కు దిగుతూనే ఖలీల్ అహ్మద్ ఔట్ చేశాడు. కోహ్లి క్యాచ్ వదిలేయడంతో లైఫ్ దక్కిన కెప్టెన్ ఫించ్ (24 బంతుల్లో 27; 3 ఫోర్లు)... లిన్‌తో కలిసి స్కోరును నడిపించాడు. ఖలీల్ బౌలింగ్‌లో విజృంభించిన లిన్ మూడు సిక్స్‌లు కొట్టాడు. అయితే, కుల్దీప్ వీరిద్దరినీ వరుస ఓవర్లలో పెవిలియన్ పంపి ఊరటనిచ్చాడు. జట్టు స్కోరు 75/3తో ఉన్న దశలో జత కలిసిన మ్యాక్స్‌వెల్, స్టొయినిస్ పరిస్థితిని మార్చేశారు. ఖలీల్, కృనాల్‌లను లక్ష్యంగా చేసుకుని చెలరేగారు. మ్యాక్స్‌వెల్ హ్యాట్రిక్ సిక్స్‌లతో కృనాల్‌కు చుక్కలు చూపాడు. వీరి ధాటికి అతడు రెండు ఓవర్లలోనే 40 పరుగులిచ్చాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 16.1 ఓవర్ వద్ద ఉండగా వర్షం మొదలైంది. విరామం తర్వాత తొలి బంతికే మ్యాక్స్‌వెల్‌ను బుమ్రా ఔట్ చేశాడు. మిగిలిన నాలుగు బంతుల్లో ప్రత్యర్థి ఐదు పరుగులు చేసింది. ఈ ముగ్గురు... ఓవర్‌కు పదికి పైగా రన్‌రేట్‌తో ఛేదనకు దిగిన భారత్‌కు బౌండరీల మీద బౌండరీలు బాదుతూ ధావన్ శుభారంభం ఇచ్చాడు. మరోవైపు స్వేచ్ఛగా ఆడలేక రోహిత్ శర్మ (8 బంతుల్లో 7) వికెట్ ఇచ్చేశాడు. అయినా, జోరు తగ్గించని ధావన్ స్కోరు బోర్డును ఉరకలెత్తిస్తూ 28 బంతుల్లోనే అర్ధ శతకం అందుకున్నాడు. అవతలి ఎండ్‌లో పదేపదే జంపాపై ఆధిపత్యానికి యత్నించిన కేఎల్ రాహుల్ (12 బంతుల్లో 13; ఫోర్) స్టంపౌటయ్యాడు. జంపా... కోహ్లి (8 బంతుల్లో 4)ని సైతం పరీక్షకు గురిచేశాడు. రన్‌రేట్ పెరిగిపోతుండటంతో ముందుకొచ్చి ఆడబోయిన కెప్టెన్ షాట్ గురితప్పి క్యాచ్ ఇచ్చాడు. స్టాన్లేక్ వేసిన బౌన్సర్‌ను అద్భుత రీతిలో థర్డ్‌మ్యాన్ దిశగా పంపిన ధావన్... బౌండరీ లైన్ ముందు దొరికిపోవడంతో భారత్ మరింత కష్టాల్లో పడింది. రిషభ్ పంత్, కార్తీక్ జత కలిసే సమయానికి లక్ష్యం 32 బంతుల్లో 68. ఆండ్రూ టై ఓవర్లో చెరో ఫోర్, సిక్స్ బాది 25 పరుగులు పిండుకుని ఈ సవాల్‌ను వారు అధిగమిం చేలానే కనిపించారు. అయితే, 10 బంతుల్లో 18 పరుగులు చేయాల్సిన స్థితిలో పంత్ స్కూప్ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. చివరి ఓవర్లో భారత్ 13 పరుగులు చేయలేక పోయింది. టి20ల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా ధావన్ గుర్తింపు పొందాడు. ఈ ఏడాది ధావన్ 16 మ్యాచ్‌ల్లో 646 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కోహ్లి (2016లో 15 మ్యాచ్‌ల్లో 641 పరుగులు) పేరిట ఉన్న రికార్డును ధావన్ అధిగమించాడు. ‘మ్యాక్సీ’మమ్... ఆసీస్ బ్యాటింగ్‌లో మ్యాక్స్‌వెల్ ఆటే హైలైట్. తన సిక్స్‌లు పాత మ్యాక్స్‌వెల్‌ను గుర్తుకు తెచ్చాయి. అంతేగాక, 16వ ఓవర్లో అతడు కొట్టిన షాట్ మైదానంలో తిరిగే స్పైడర్ కెమెరాను తాకడం విశేషం. కార్తీక్ షాట్‌ను బౌండరీ లైన్ వద్ద పట్టుకునేందుకు మ్యాక్స్‌వెల్ చేసిన ప్రయత్నం ఆకట్టుకుంది. అయ్యో కృనాల్... ►ఐపీఎల్లో ముంబై తరఫున కీలక ఇన్నింగ్స్‌లతో ఆల్‌రౌండర్‌గా టీమిండియాలోకి వచ్చిన కృనాల్ పాండ్యాకు ఈ మ్యాచ్ చేదు జ్ఞాపకమే. బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్, స్టొయినిస్ ధాటికి ఆరు సిక్స్‌లు సహా ఏకంగా 55 పరుగులిచ్చిన అత డు... జట్టును గెలిపించాల్సిన స్థితిలో బ్యాటింగ్‌కు వచ్చి ఏమీ చేయలేకపోయాడు. దీంతోపాటు టి20ల్లో చహల్ (64), జోగిందర్ శర్మ (57) తర్వాత అత్యధిక పరుగులిచ్చిన భారత బౌలర్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ పొరపాట్లే ఓడించాయి... ► బ్రిస్బేన్ మ్యాచ్‌లో టీమిండియాను పలు పొరపాట్లు పరాజయం పాలు చేశాయి. అవేం టంటే... ఆఖరి ఓవర్ తొలి బంతికి కృనాల్ 2 పరుగులు తీయకుండా సింగిల్‌తో సరిపెట్టుకుంటే దినేశ్ కార్తీక్‌కు స్ట్రయికింగ్ వచ్చేది. ఊపులో ఉన్న కార్తీక్ ముగించగలిగేవాడు. ► గెలుపు అవకాశాలు సమంగా ఉన్న దశలో పంత్... స్కూప్ షాట్‌కు యత్నించి వికెట్ పారేసుకున్నాడు. అతడు ఉండుంటే స్టొయినిస్ ఓవర్‌ను ఎదుర్కొనడం సులువయ్యేది. ► డెత్ ఓవర్లను చాలా పొదుపుగా వేసే బుమ్రా, భువీ చివరి కోటాకు దిగాల్సి ఉండగా వర్షం మొదలైంది. అంతకుముందు కృనాల్, ఖలీల్ ఓవర్లలో ఆసీస్ చేసిన పరుగులే వారి స్కోరును పైకి తీసుకెళ్లాయి. ► ఫించ్ ఆరు పరుగుల వద్ద ఉండగా ఇచ్చిన సులువైన క్యాచ్‌ను కోహ్లి జారవిడిచాడు. ఖలీల్ బౌలింగ్‌లో కోహ్లి మిస్ ఫీల్డింగ్ కారణంగా ప్రత్యర్థికి 3 పరుగులు వచ్చాయి. ► 17వ ఓవర్ తొలి బంతికి స్టొయినిస్ క్యాచ్‌ను థర్డ్‌మ్యాన్‌లో ఖలీల్ వదిలేశాడు. ఆ వెంటనే వర్షం మొదలైంది. అప్పటికి స్టొయినిస్ ఔటై ఉంటే ‘డక్‌వర్త్’ సమీకరణం కొంతైనా మారేది. -
కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన రోహిత్
లక్నో: పరిమిత ఓవర్ల క్రికెట్లో తనదైన మార్కుతో దూసుకుపోతున్న టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మరో రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. విరాట్ కోహ్లి పేరిట ఉన్న రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. వెస్టిండీస్ జరుగుతున్న రెండో టీ20లో కోహ్లి(2,102)ని రోహిత్ అధిగమించాడు. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లికి విశ్రాంతినివ్వడంతో రోహిత్ శర్మ జట్టు భారత క్రికెట్ జట్టు పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తొలి వన్డేలో గెలిచిన రోహిత్ బృందం.. రెండో టీ20లో సైతం గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గప్తిల్ 2,271 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా. రోహిత్ శర్మ(2,203) రెండో స్థానంలో ఉన్నాడు. పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 2,171 పరుగులతో మూడో స్థానంలో, న్యూజిలాండ్‌కు చెందిన మాజీ క్రికెటర్ మెకల్లమ్ 2,140 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా, కోహ్లి ఐదో స్థానంలో ఉన్నాడు. -
ముగింపు అదిరింది
సొంతగడ్డపై తమకు ఎదురే లేదని భారత్ మరోసారి నిరూపించింది...పుణేలో పరాజయం చాలా అరుదైన సందర్భంగా చూపిస్తూ వరుసగా రెండు ఏకపక్షవిజయాలతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఐదుగురు టీమిండియా బౌలర్లు ఒకరితో మరొకరు పోటీ పడి వికెట్లు తీయడంతో చేతులెత్తేసిన విండీస్ 104 పరుగులకే కుప్పకూలి పరాజయాన్ని ఆహ్వానించింది. చివరి మ్యాచ్‌లో కొంతైనా పోటీనివ్వగలదని భావించిన ఆ జట్టు తమ టెస్టు ప్రదర్శనను పునరావృతం చేసి మ్యాచ్‌ను అప్పగించేసింది. ఛేదనలో ఎప్పటిలాగే రోహిత్, కోహ్లి తమదైన శైలిలో ఫటాఫట్ షాట్లతో రికార్డు స్థాయిలో మరో 35.1 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించారు. ఎదురులేని ఆటతో సిరీస్‌ను సంతృప్తిగా ముగించిన కోహ్లి సేన వరల్డ్ కప్ దిశగా ఆడబోయే 18 వన్డేల్లో ఐదింటిలో తమ అస్త్రశస్త్రాలను అనుకున్న విధంగా పరీక్షించుకొని విజయవంతంగా తమ లెక్కలు సరి చూసుకుంది. తిరువనంతపురం: అనూహ్యమేమీ జరగలేదు... ప్రత్యర్థి నుంచి కనీస ప్రతిఘటన కూడా ఎదురు కాకుండా సిరీస్ వచ్చి టీమిండియా ఒళ్లో వాలింది. పటిష్టమైన భారత్ ముందు వెస్టిండీస్ మరోసారి కూనలా మారిపోయింది. ఫలితంగా చివరి వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్‌ను 3–1తో సొంతం చేసుకుంది. రెండో వన్డే ‘టై’గా ముగియగా, మూడో మ్యాచ్‌లో విండీస్ నెగ్గింది. మిగతా మూడు వన్డేలలో భారత్ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గురువారం గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ 31.5 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ జేసన్ హోల్డర్ (33 బంతుల్లో 25; 2 ఫోర్లు), మార్లోన్ శామ్యూల్స్ (38 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) ఓ మాదిరిగా ఆడగా, జట్టులో ఎనిమిది మంది కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రవీంద్ర జడేజా (4/34) ముందుండి నడిపించగా, మిగతా నలుగురు బౌలర్లూ కనీసం ఒక మెయిడిన్ ఓవర్ వేస్తూ కనీసం ఒక వికెట్ అయినా తీయడం విశేషం. అనంతరం భారత్ 14.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 105 పరుగులు చేసి సునాయాసంగా విజయాన్ని అందుకుంది. రోహిత్ శర్మ (56 బంతు ల్లో 63 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), విరాట్ కోహ్లి (29 బంతుల్లో 33 నాటౌట్; 6 ఫోర్లు) రెండో వికె ట్‌కు 99 పరుగులు జోడించారు. మూడు సెంచరీలు సహా సిరీస్‌లో 453 పరుగులు చేసిన విరాట్ కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఈ నెల 4న కోల్‌కతాలో జరుగుతుంది. టపటపా... భారత బౌలింగ్ ధాటికి వెస్టిండీస్‌లో ఒక్క బ్యాట్స్‌మన్ కూడా నిలవలేకపోయారు. సిరీస్ ఆరంభంలో చూపించిన పట్టుదలను ఎవరూ ప్రదర్శించకపోవడంతో ఆ జట్టు కుప్పకూలింది. ఇన్నింగ్స్ నాలుగో బంతినుంచే విండీస్ పతనం మొదలైంది. భువీ వేసిన చక్కటి బంతికి కీరన్ పావెల్ (0) కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్లోనే షై హోప్ (0)ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ దశలో శామ్యూల్స్ కొన్ని చక్కటి షాట్లతో ఎదురు దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఖలీల్ ఓవర్లో అతను సిక్స్, ఫోర్ కొట్టాడు. అయితే తన తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా ముగించిన జడేజా, రెండో ఓవర్లో విండీస్‌ను దెబ్బ తీశాడు. జడేజా బంతిని అంచనా వేయలేక శామ్యూల్స్ కవర్స్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చాడు. మరి కొద్దిసేపటికి హెట్‌మైర్ (9)ను కూడా జడ్డూ పెవిలియన్ పంపించగా, ఖలీల్ వేసిన తర్వాతి ఓవర్లోనే రావ్మన్ పావెల్ (16) ఔటయ్యాడు. దాంతో 57 పరుగులకు విండీస్ సగం వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత మరో ఎండ్‌లో హోల్డర్ కొంత పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. విండీస్ తమ చివరి ఐదు వికెట్లు 38 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. హోల్డర్‌ను వెనక్కి పంపించిన ఖలీల్ ఆ ఓవర్‌ను మెయిడిన్‌గా ముగించగా, మిగతా వికెట్లు కూలడానికి ఎక్కువ సమయం పట్టలేదు. 32వ ఓవర్లో జడేజా రెండు వికెట్లతో ప్రత్యర్థి ఆట కట్టించాడు. భారత్ మార్పులేమీ లేకుండా ఈ మ్యాచ్‌లో దిగగా... విండీస్ రెండు మార్పులు చేసింది. గాయంతో ఈ మ్యాచ్ ఆడని ఆష్లే నర్స్ టి20 సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ఆడుతూ పాడుతూ... ఛేదనలో భారత జట్టు ఆరంభంలోనే శిఖర్ ధావన్ (6) వికెట్ కోల్పోయింది. థామస్ బంతిని అతను వికెట్లపైకి ఆడుకున్నాడు. థామస్ తర్వాతి ఓవర్లో 4 పరుగుల వద్ద కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో హోల్డర్ వదిలేయడం భారత్‌కు కలిసొచ్చింది. అనంతరం థామస్ బౌలింగ్‌లోనే 18 పరుగుల వద్ద రోహిత్...కీపర్‌కు క్యాచ్ ఇచ్చినా అది నోబాల్ కావడంతో బతికిపోయాడు. ఆ తర్వాత హోల్డర్ ఓవర్లో రోహిత్ వరుసగా 4, 6 బాదాడు. ఈ సిక్సర్ రోహిత్ కెరీర్లో 200వది కావడం విశేషం. జోరు తగ్గించని భారత ఓపెనర్... కీమో పాల్ ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్సర్ బాదడంతో 17 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో 45 బంతుల్లో రోహిత్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇద్దరు స్టార్ బ్యాట్స్‌మెన్ అలవోకగా జట్టును గెలిపించారు. ►వెస్టిండీస్‌కు భారత్‌పై ఇదే అత్యల్ప స్కోరు. గతంలో కరీబియన్ జట్టుపోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో 121 పరుగులకు ఆలౌటైంది. ►మిగిలిన బంతులపరంగా చూస్తే భారత్‌కు ఇది రెండో అతి పెద్ద (211) విజయం. గతంలో కెన్యాపై 231 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది. ►4000 వన్డేల్లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ 4060 పరుగులు జత చేశారు. వీరిద్దరు కేవలం 66 పార్ట్నర్షిప్లలోనే ఈ మైలురాయిని దాటారు. గతంలో రాహుల్ ద్రవిడ్, గంగూలీ కలిసి 80 భాగస్వామ్యాల్లో 4 వేల పరుగులు పూర్తి చేశారు. ►202 వన్డేల్లో రోహిత్ శర్మ సిక్సర్ల సంఖ్య. 200కు పైగా సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో అఫ్రిది, గేల్, జయసూర్య, ధోని, డివిలియర్స్, బ్రెండన్ మెకల్లమ్ మాత్రమే ఉన్నారు. ఈ ఏడుగురిలో అందరికంటే తక్కువ ఇన్నింగ్స్ (187)ల్లో రోహిత్ ఈ ఘనత సాధించడం విశేషం. గతంలో అఫ్రిది 200 సిక్సర్ల కోసం 195 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. ►6 సొంతగడ్డపై భారత్‌కు ఇది వరుసగా ఆరో సిరీస్ విజయం -
ఆటలో ‘అరటిపండు’!
ముంబై: ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు ఓటమికి కారణమేంటి? మన జట్టు సభ్యులను అడిగితే ‘అరటిపండ్లు’ అంటారేమో! ఎందుకంటే అక్కడి అధికారులు మనకు అరటిపండ్లు ఇవ్వలేదట!! అందుకే వచ్చే వరల్డ్ కప్‌లో అరటిపండ్లు కచ్చితంగా ఉండాలంటూ మనోళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఆశ్చర్యపోతున్నారా... సీఓఏ ముందు క్రికెటర్లు ఉంచిన కోరికల జాబితాలో ఇది కూడా ఉంది మరి. వెస్టిండీస్‌తో రెండో టెస్టు సమయంలో ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి జట్టు సభ్యుల డిమాండ్లను వెల్లడించారు. ఇందులో సీఓఏ చీఫ్ వినోద్ రాయ్‌తో పాటు సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా పాల్గొన్నారు. ‘ఇంగ్లండ్ పర్యటన సమయంలో మన ఆటగాళ్లు ఇష్టపడిన ఫలాలు ఆతిథ్య బోర్డు అందించలేదు. అయితే సీఓఏ ఈ డిమాండ్ పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బీసీసీఐ ఖర్చులతో తమకు అరటిపండ్లు తెచ్చి పెట్టమని టీమ్ మేనేజర్‌ను క్రికెటర్లు అడగాల్సింది కదా అని వారు అభిప్రాయ పడ్డారు’ అని బోర్డులో కీలక సభ్యుడొకరు దీనిపై వ్యాఖ్యానించారు. సరైన జిమ్ సదుపాయాలు ఉన్న హోటళ్లను మాత్రమే తమ కోసం బుక్ చేయాలని కూడా కోహ్లి బృందం సీఓఏను కోరింది. అన్నింటికి మించి వరల్డ్ కప్ సమయంలో తాము రైలులోనే ప్రయాణం చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని, అందుకోసం ఒక ప్రత్యేక బోగీని బ్లాక్ చేయాలని కూడా భారత క్రికెటర్లు కోరుతున్నారు. ‘ఇంగ్లండ్‌లో రైలు ప్రయాణమే సౌకర్యవంతంగా ఉంటుందని టీమిండియా సభ్యులు చెప్పారు. అభిమానులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉండటం, ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని అందుకు ముందుగా సీఓఏ అంగీకరించలేదు. అయితే ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే మాత్రం సీఓఏ కానీ బీసీసీఐ కానీ బాధ్యత వహించదని షరతు పెట్టి దీనికి అంగీకరించింది’ అని బోర్డు అధికారి వెల్లడించారు. పర్యటన మొత్తం తమ భార్యలను వెంట తీసుకెళ్లేందుకు అనుమతించాలని కూడా డిమాండ్ చేశారు. అయితే దీనిపై సీఓఏ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. భార్యలు వెంట ఉంటేనే తమ ఏకాగ్రత చెడుతుందని కొందరు క్రికెటర్లు భావిస్తారని, అందరితో చర్చించిన తర్వాత దీనిపై ఆలోచిస్తామని సీఓఏ స్పష్టం చేసింది. త్వరలో జరిగే ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో మాత్రమే రెండు వారాల పాటు భార్యలను అనుమతిస్తామని, వారు టీమ్ బస్సులో ప్రయాణించడానికి వీల్లేదని సీఓఏ గతంలోనే నిర్ణయం తీసుకుంది. -
నాలుగో వన్డేలో భారత్ ఘన విజయం
-
రోహిత్ ధమాకా రాయుడు పటాకా
టీమిండియా గర్జించింది. పుణేలో పల్టీ కొట్టినా ముంబైలో మేల్కొంది. కీలకమైన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను పసికూనలా మార్చేసి ఓడించింది. ‘హిట్‌మ్యాన్’ రోహిత్‌శర్మ... తెలుగు తేజం అంబటి తిరుపతి రాయుడు అమోఘమైన భాగస్వామ్యంతో శతకాల మోత మోగించడంతో భారత్ భారీ స్కోరు చేసింది. బౌలింగ్‌లో ఖలీల్ అహ్మద్, కుల్దీప్ మాయాజాలంతో ప్రత్యర్థిని చుట్టేసింది. సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ముంబై: కోహ్లి సేన దుమ్మురేపింది. నాలుగో వన్డేలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో వెస్టిండీస్‌ను మట్టికరిపించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (137 బంతుల్లో 162; 20 ఫోర్లు, 4 సిక్స్‌లు), మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు (81 బంతుల్లో 100; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతకాల మోతతో టీమిండియా తిరుగులేని విజయాన్ని అందు కుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా... మూడో వికెట్‌కు రోహిత్, రాయుడు 211 పరుగుల అద్భుత భాగస్వామ్యంతో నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్ల ధాటితో పాటు ఫీల్డర్ల చురుకుదనంతో ఛేదనలో వెస్టిండీస్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. 36.2 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ జాసన్ హోల్డర్ (70 బంతుల్లో 54 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మినహా మరే బ్యాట్స్‌మన్ నిలవలేకపోవడంతో విండీస్ 224 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. భారత బౌలర్లలో యువ పేసర్ ఖలీల్ అహ్మద్ (3/13), స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (3/42) మూడేసి వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని పతనంలో పాలుపంచుకున్నారు. రోహిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సిరీస్‌లో చివరిదైన ఐదో వన్డే గురువారం తిరువనంతపురంలో జరుగుతుంది. శుభారంభం... ఆపై అమోఘం సిరీస్‌లో తొలిసారిగా ఓపెనర్లిద్దరూ నిలవడంతో ఈ మ్యాచ్‌లో భారత్‌కు శుభారంభం దక్కింది. ముందుగా రోహితే మొదలుపెట్టినా, కొద్దిసేపటికే జోరందుకున్న శిఖర్ ధావన్ (40 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కొన్ని చక్కటి షాట్లతో అతడిని మించిపోయాడు. అయితే, కీమో పాల్ ఓవర్లో పుల్ చేయబోయి మిడ్ వికెట్లో రావ్మన్ పావెల్‌కు చిక్కాడు. దీంతో తొలి వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. హ్యాట్రిక్ సెంచరీల ఊపులో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి (16) ఈసారి ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఆఫ్ స్టంప్ మీద పడిన రోచ్ బంతిని థర్డ్‌మ్యాన్ దిశగా ఆడే ప్రయత్నంలో విఫలమై కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఈ ఏడాది వన్డేల్లో కోహ్లికిదే తక్కువ స్కోరు. భారీ ఇన్నింగ్స్‌లతో టీమిండియాకు వెన్నెముకలా నిలుస్తున్న కెప్టెన్ వెనుదిరగడంతో జట్టుకు సవాల్ అనదగ్గ పరిస్థితి ఎదురైంది. దీనిని రోహిత్, రాయుడు దీనిని సమర్థంగా ఎదుర్కొన్నారు. కుదురుకునేందుకు సమయం తీసుకున్నా, తర్వాత దూకుడు పెంచారు. ఈ క్రమంలో రోహిత్ 60 బంతుల్లో అర్ధశతకాన్ని అందుకున్నాడు. అనంతరం రావ్మన్ పావెల్ ఓవర్లో మూడు, నర్స్ ఓవర్లో రెండు బౌండరీలతో చకచకా 90ల్లోకి వెళ్లిపోయాడు. మరో ఎండ్‌లో రాయుడు పూర్తి సంయమనం చూపాడు. అలెన్ బౌలింగ్‌లో ఫోర్‌తో కెరీర్లో రోహిత్ 21వ వన్డే సెంచరీని పూర్తిచేసుకున్నాడు. కాసేపటికే రాయుడు అర్ధశతకం మార్క్‌ను చేరుకున్నాడు. ఇక ఇక్కడి నుంచి బౌలర్ ఎవరన్నది లెక్క చేయకుండా ఫోర్లు, సిక్స్‌లతో ఇద్దరూ ధాటైన ఆటను కనబర్చారు. 33 ఓవర్లకు 199/2తో ఉన్న స్కోరు 43వ ఓవర్‌కు 300 దాటిందంటేనే ఈ ద్వయం ఎంత జోరుగా బ్యాటింగ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇదే ఊపులో రోహిత్ 150 పరుగుల మైలురాయి (131 బంతుల్లో)ని అధిగమించాడు. కానీ, కాసేపటికే అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది. రోచ్ ఓవర్లో యార్కర్ లెంగ్త్ బంతిని సిక్స్ బాది 90ల్లోకి చేరుకున్న రాయుడు... అనంతరం ఒక్కో పరుగు జోడిస్తూ వన్డేల్లో మూడో శతకాన్ని (80 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. సెంచరీ అయిన వెంటనే రాయుడు రనౌటయ్యాడు. ధోని (23; 2 ఫోర్లు), కేదార్ జాదవ్ (16 నాటౌట్; 3 ఫోర్లు), జడేజా (7 నాటౌట్; 1 ఫోర్) ఆఖర్లో తమవంతుగా జట్టు స్కోరును పెంచారు. విండీస్... పేలవంగా: అతి భారీ లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ తేలిపోయింది. గత మూడు మ్యాచ్‌ల్లో తలా కొన్ని పరుగులతో జట్టు భారీ స్కోర్లకు ఉపయోగపడిన బ్యాట్స్‌మెన్... ఈసారి పూర్తిగా చేతులెత్తేశారు. ఓపెనర్లు కీరన్ పావెల్ (4), హేమ్రాజ్ (14)తో పాటు నిలకడగా రాణిస్తున్న షై హోప్ (0) వికెట్లను ఒకే స్కోరు వద్ద కోల్పోయిన జట్టు ముందే కుదేలైంది. ఖలీల్ స్వింగ్ బంతులకు మార్లోన్ శామ్యూల్స్ (18), అద్భుత ఫామ్‌లో ఉన్న హెట్‌మైర్ (13), రావ్మన్ పావెల్ (1) వరుస కట్టడంతో చేసేదేమీ లేకపోయింది. 56/6తో నిలిచిన జట్టును హోల్డర్ మరీ తక్కువ స్కోరుకే పరిమితం కాకుండా చూశాడు. కోహ్లి... సూపర్ రనౌట్ మ్యాచ్ ఏదైనా తనదైన ముద్ర ఉండేలా చూసే కోహ్లి... ముంబైలో తక్కువ స్కోరుకే ఔటైనా మెరుపు ఫీల్డింగ్‌తో తళుక్కుమన్నాడు. విండీస్ బ్యాట్స్‌మన్ శామ్యూల్స్ కవర్స్ దిశగా కొట్టిన షాట్‌ను అడ్డుకున్న కోహ్లి... అంతే వేగంగా డైవ్‌తో బంతిని నాన్ స్ట్రయికింగ్ వైపు వికెట్లకేసి విసిరాడు. అది గురి చూసి వదిలిన బాణంలా తగలడం క్షణాల్లో జరిగి పోయింది. అప్పటికే చాలా ముందుకొచ్చిన కీరన్ పావెల్ తిరిగి క్రీజును చేరే అవకాశమూ లేకపోయింది. ►భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్ జాబితాలో సచిన్ (196)ను దాటి రెండో స్థానానికి చేరిన రోహిత్ శర్మ (198). ధోని (211) తొలి స్థానంలో ఉన్నాడు. ►పరుగుల పరంగా (224) భారత్‌కిది మూడో పెద్ద విజయం. ఇంతకుముందు 2007 ప్రపంచకప్‌లో బెర్ముడాపై 257 పరుగులతో, 2008లో హాంకాంగ్‌పై 256 పరుగులతో నెగ్గింది. ►వన్డేల్లో రోహిత్ ఏడుసార్లు 150 పైగా స్కోరు చేశాడు. సచిన్ (5), జయసూర్య, గేల్, ఆమ్లా, కోహ్లి (4 సార్లు చొప్పున) తర్వాత ఉన్నారు. -
ధోని... ‘సాక్షి’
ఆష్లే నర్స్ బౌలింగ్‌లో 37వ ఓవర్ మూడో బంతిని లాంగాన్ దిశగా పంపి సింగిల్ (81వ పరుగు) తీయడంతో ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ సమయంలో నాన్ స్ట్రయికింగ్‌లో ఉన్న ధోని అతడి వద్దకు వచ్చి అభినందించగా కోహ్లి బిగ్గరగా నవ్వాడు. ఇక్కడ చెప్పుకోవాల్సిందేమంటే... భారత క్రికెట్లో మధుర ఘట్టాలుగా నిలిచే సందర్భాలన్నింటిలో ధోని సాక్షిగా నిలవడం! 2007 టి20 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టినపుడు, 2010లో సచిన్ వన్డేల్లో తొలి డబుల్ సెంచరీని సాధించినపుడు, రోహిత్ శర్మ వన్డేల్లో తన తొలి ద్విశతకాన్ని అందుకున్నప్పుడు... నాన్ స్ట్రయికర్‌గా ధోనినే ఉండటం విశేషం. ఇక వీటన్నింటికీ మించినదేమంటే, స్ట్రయికింగ్‌లో ఉండి... 2011 ప్రపంచ కప్ ఫైనల్లో సిక్స్‌తో దేశాన్ని విశ్వ విజేతగా నిలపడం. ఆ మ్యాచ్..: వన్డే క్రికెట్లో అందరికంటే ముందుగా 10 వేల పరుగుల మైలు రాయిని చేరుకోవడం మాస్టర్ బ్లాస్టర్‌కే సాధ్యమైంది. మార్చి 31, 2001న ఇండోర్‌లో ఆస్ట్రేలియాపై అతను ఈ ఘనతను నమోదు చేశాడు. భారత్ 118 పరుగుల భారీ తేడాతో గెలిచిన ఆ మ్యాచ్‌లో సచిన్ 125 బంతుల్లో 19 ఫోర్లతో 139 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఇది సచిన్ కెరీర్లో 28వ సెంచరీ. -
వైజాగ్ వన్డే : ఆదిలోనే భారత్‌కు ఎదురు దెబ్బ
సాక్షి, విశాఖపట్నం : ఇక్కడ వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. తొలి మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకున్న ఓపెనర్ రోహిత్ శర్మ(4) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగి నిరాశ పరిచాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి మరో ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి ఆచితూచి ఆడుతున్నాడు. ఇక అంతకు ముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లకు కెప్టెన్ కోహ్లి మొగ్గు చూపడంతో పేసర్ కలీల్ అహ్మద్ స్థానంలో కుల్దీప్ తుది జట్టులోకి వచ్చాడు. ఐదు వన్డేల సీరిస్‌లో ఇప్పటికే కోహ్లి సేన తొలి వన్డేలో ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచిన విషయం తెలిసిందే. అదే ఊపుతో అచ్చొచ్చిన వైజాగ్‌లో మరో విజయం నమోదు చేయాలని ఉవ్విళ్లురుతోంది. కాగా తొలి మ్యాచ్‌లో భారీ స్కోర్ సాధించి విజయం చేజార్చుకున్న విండీస్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. వైజాగ్‌లో భారత్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన 7 వన్డేల్లో భారత్ కేవలం ఒక్కటి మాత్రమే ఓడి 6 గెలిచింది. అయితే ఆ ఒక్క ఓటమి కూడా విండీస్‌పైనే కావడం భారత్‌కు ప్రతికూలాంశం. ఇప్పటి వరకు ఇక్కడ టాస్ గెలిచిన జట్లే ప్రతీ సారి విజయం సాధించాయి. దీంతో భారత్‌కు మరో విజయం కాయమని అభిమానులు భావిస్తున్నారు. -
అయితే క్లీన్‌బౌల్డ్ లేదా ఎల్బీడబ్ల్యూ
సొంతగడ్డపై వెస్టిండీస్‌తో రెండు టెస్టులలో బరిలోకి దిగిన 11 మంది భారత జట్టు సభ్యులలో (శార్దుల్‌ను మినహాయించి) ప్రతీ ఒక్కరు ఏదో ఒక దశలో జట్టు విజయంలో తలా ఓ చేయి వేశారు. టాప్–7లో ఆరుగురు కనీసం అర్ధ సెంచరీ సాధించారు, బౌలర్లలో ఉమేశ్ పది వికెట్లు, కుల్దీప్ ఐదు వికెట్ల ఘనతను సొంతం చేసుకోగా, రాజ్‌కోట్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో షమీ, అశ్విన్ కీలక వికెట్లతో విజయానికి బాటలు వేశారు. అయితే ఇంతటి ‘పండగ’ వాతావరణాన్ని సరిగా ఆస్వాదించలేకపోయిన దురదృష్టవంతుడు మాత్రం లోకేశ్ రాహుల్ ఒక్కడే. బలహీన ప్రత్యర్థిపై భారీగా పరుగులు సాధించి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాల్సిన స్థితిలోనూ విఫలమైనందుకు రాహుల్ తనను తానే నిందించుకోవాలి. వరుస వైఫల్యాల తర్వాత కూడా తనను వెనకేసుకొస్తున్న టీమ్ మేనేజ్మెంట్ నమ్మకాన్ని రాహుల్ నిలబెట్టేదెప్పుడు? సాక్షి క్రీడా విభాగం : ఓపెనర్ లోకేశ్ రాహుల్ గత 19 టెస్టు ఇన్నింగ్స్‌లో రెండు సార్లు మాత్రమే 50 పరుగులు దాటగలిగాడు. ఇందులో సొంత నగరంలో అఫ్గానిస్తాన్‌పై చేసిన అర్ధసెంచరీని పక్కన పెడితే ఇంగ్లండ్‌తో ఓవల్‌లో జరిగిన చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సాధించిన సెంచరీ మాత్రమే చెప్పుకోదగ్గది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో కోహ్లి మినహా దాదాపు అందరూ విఫలం కాగా ఆ జాబితాలో రాహుల్ కూడా ఉన్నాడు. ఆ పర్యటనలో చివరి ఇన్నింగ్స్‌కు ముందు అతను వరుసగా 4, 13, 8, 10, 23, 36, 19, 0, 37 (మొత్తం 150) పరుగులు సాధించాడు. ఎలా చూసినా ఇది భారీ వైఫల్యం కిందే లెక్క.అదృష్టవశాత్తూ మురళీ విజయ్ తరహాలో సిరీస్ మధ్యలో గానీ సిరీస్ తర్వాత ధావన్‌లా కానీ అతనిపై వేటు పడలేదు. నిజానికి విండీస్ సిరీస్‌కు ముందు ఓవల్‌లో చేసిన 149 పరుగులే అతడిని కాపాడాయి. అప్పటికే సిరీస్ చేజారిపోయి చివరి మ్యాచ్‌లోనూ గెలిచే అవకాశాలు సన్నగిల్లిన స్థితిలో పోయేదేమీ లేదన్నట్లుగా ఎడాపెడా బాదిన ఆ ఇన్నింగ్స్‌ను బట్టి ఒక ఓపెనర్ సత్తాను అంచనా వేయడం పూర్తిగా తప్పు. అయితే ‘అపార ప్రతిభ’ కలవాడంటూ హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కూడా అతనికి గట్టిగా మద్దతు పలుకుతుండటంతో రాహుల్‌కు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. సరిగ్గా గమనిస్తే ఇంత నిలకడగా అటు విదేశాల్లో, ఇటు సొంతగడ్డపై విఫలమవుతున్న ఒక ఆటగాడికి ఇన్ని అవకాశాలు రావడం నిజంగా ఆశ్చర్యకరం. బౌల్డ్ లేదా ఎల్బీడబ్ల్యూ... రాహుల్ 51 ఇన్నింగ్స్‌ల కెరీర్లో 5 సెంచరీలు, 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే అతి పేలవంగా ఆడిన సందర్భాలు అంతకంటే చాలా ఎక్కువ. కనీస సమయం పాటు కూడా క్రీజ్‌లో నిలబడకుండా ఆరంభంలోనే రాహుల్ చాలాసార్లు వికెట్ చేజార్చుకున్నాడు. తాజాగా రాజ్‌కోట్ టెస్టులో తొలి ఓవర్లోనే ఔటైన అతను... హైదరాబాద్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 25 బంతులకే వెనుదిరిగాడు. కెరీర్లో ఏకంగా 24 సార్లు అతని ఆట 25 బంతుల్లోపే ముగిసిపోయింది! ఒక ఓపెనర్ నుంచి ఇలాంటి ఆటను ఏ జట్టూ ఆశించదు. ప్రత్యర్థి బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ సాధ్యమైనంత ఎక్కువసేపు మైదానంలో నిలబడటం, తొందరగా వికెట్ కోల్పోకుండా జట్టు ఇన్నింగ్స్‌కు మంచి పునాది వేయడం ఓపెనర్ల సహజ లక్షణాలు. ఈ రకంగా పోలిస్తే రాహుల్‌కంటే విజయ్ ఎంతో మెరుగు. ఇక అతని బ్యాటింగ్‌లో ఇటీవల కనిపిస్తున్న అతి పెద్ద లోపం ఫుట్‌వర్క్. ఆరంభంలో పేసర్లను ఎదుర్కొనేందుకు కావాల్సిన పాదాల కదలిక, చురుకుదనం అతనిలో కనిపించడం లేదు. సరిగ్గా చెప్పాలంటే ‘ఔట్ స్వింగర్’లు అంటే అతను ముందే భయపడిపోతున్నట్లుగా కనిపిస్తోంది. క్రీజ్‌లో చిక్కుకుపోయి ఎల్బీడబ్ల్యూ కావడం లేదంటే బ్యాట్, ప్యాడ్ మధ్యలోంచి బంతి వెళ్లిపోయేలా ఆడి క్లీన్ బౌల్డ్ కావడం అలవాటుగా మారిపోయింది. లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్ నుంచి హైదరాబాద్ టెస్టు తొలి ఇన్నింగ్స్ వరకు వరుసగా 9 ఇన్నింగ్స్‌లలో అతను 5 సార్లు క్లీన్‌బౌల్డ్ కాగా, మరో 4 సార్లు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. దీనిని సరిదిద్దేందుకు, అతనిలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు బంగర్ ఏమైనా ప్రయత్నించాడా లేదా అనేదానిపై స్పష్టతే లేదు. ఆస్ట్రేలియాలో ఎలా? తాజా వైఫల్యానికి ముందు అతను 11 వరుస ఇన్నింగ్స్‌లలో 9 అర్ధ సెంచరీలు సాధించాడు. వీటిలో 9 భారత గడ్డపై రాగా, మరో 2 శ్రీలంకలో స్కోరు చేశాడు. అయితే ఇప్పుడు ఒక్కసారిగా నాటి రాహుల్‌కు, ప్రస్తుతం అతని ఆటకు చాలా తేడా కనిపిస్తోంది. రాజ్‌కోట్‌లో వైఫల్యం తర్వాత హైదరాబాద్ టెస్టులో మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేయాలంటూ అన్ని వైపుల నుంచి వ్యాఖ్యలు వినిపించిన సమయంలో కూడా కోహ్లి మద్దతు ఉండటంతో రాహుల్‌కు ఇబ్బంది ఎదురు కాలేదు. కానీ అక్కడైనా భారీ స్కోరు చేసే అవకాశాన్ని అతను చేజార్చుకున్నాడు. 72 పరుగుల లక్ష్యంతో విజయం ఖాయమైన స్థితిలో చేసిన 33 పరుగులను పరిగణలోకి తీసుకోనవసరం లేదు కాబట్టి విండీస్‌పై అతను విఫలమైనట్లుగానే భావించాలి. మరి సొంతగడ్డపై విండీస్‌పైనే పరుగులు సాధించలేని ఆటగాడు ఆస్ట్రేలియాలో ఎలా ఆడగలడంటూ ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. అలాంటి ఆటగాడిపై జట్టు ఎలా విశ్వాసం ఉంచగలదు? ఓపెనర్‌గా పృథ్వీ షా దూసుకొచ్చినా... విజయ్, ధావన్ వైఫల్యాల తర్వాత మరో సీనియర్ అవసరం ఉంటుందనే కారణం ఒక్కటే ఆస్ట్రేలియా పర్యటనకు కూడా రాహుల్‌కు అవకాశం కల్పించవచ్చు. కౌంటీల్లో ప్రదర్శనతో విజయ్‌కు మరో అవకాశం ఇస్తారా అనేది చెప్పలేం. కాబట్టి రాహుల్ స్థానానికి అప్పుడే వచ్చిన ప్రమాదమేమీ లేదు. అయితే తాజా ఫామ్‌తో గనక అతను అక్కడ ఓపెనర్‌గా అడుగు పెడితే ఆసీస్ పిచ్‌లపై స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్ ముందు ఈ ఓపెనర్‌కు విషమ పరీక్ష ఎదురు కావచ్చు. దాదాపు నాలుగేళ్ల క్రితం సిడ్నీలో అద్భుత సెంచరీతో రాహుల్ తనను తాను ప్రపంచానికి పరిచయం చేసుకున్నాడు. ఇప్పటికే విమర్శల పాలవుతున్న రాహుల్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఆసీస్ గడ్డ మళ్లీ వేదిక కాగలదు. అయితే ఆలోగా తన బ్యాటింగ్‌లోని సాంకేతిక లోపాలు సవరించుకునేందుకు మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. లేదంటే నాడు రోహిత్ శర్మ స్థానంలో కొత్త కుర్రాడిగా తనను ఎంపిక చేసినట్లే ఇప్పుడు మయాంక్ అగర్వాల్‌ను తీసుకొస్తే తన కెరీర్‌కే దెబ్బ కాగలదు! లోకేశ్ రాహుల్ ఇప్పుడు సాంకేతిక సమస్యతో పాటు మానసికంగా కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. షాట్ ఆడేటప్పుడు అతను తలను నిటారుగా ఉంచకుండా ఒక వైపు వంగిపోతున్నాడు.దాంతో శరీరం వికెట్లకు అడ్డంగా వస్తోంది. ఫలితంగా మళ్లీ మళ్లీ బౌల్డ్ లేదా ఎల్బీ అవుతున్నాడు. దీనిని అతను తొందరగా సరిదిద్దుకోవాలి. వరుసగా ఒకే తరహాలో ఔట్ కావడం కూడా అతనిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. – సునీల్ గావస్కర్ -
టాప్ ర్యాంక్‌లోనే కోహ్లి
దుబాయ్: ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి నంబర్‌వన్ స్థానంలోనే కొనసాగుతున్నాడు. సోమవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో అతను తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నాడు. ఇతర భారత ఆటగాళ్లలో యువ సంచలనాలు పృథ్వీ షా 73 నుంచి 60వ ర్యాంక్‌కు... రిషభ్ పంత్ 85 నుంచి 62వ స్థానానికి ఎగబాకారు. బౌలర్ల జాబితాలో విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ కెరీర్లో తొలిసారి టాప్–10 (9వ)లోకి అడుగు పెట్ట గా, హైదరాబాద్ టెస్టులో పది వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్ 25వ స్థానంలో నిలిచాడు. టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. -
మూడు సెక్షన్ల కింద కేసు నమోదు...
మైదానంలోకి దూసుకెళ్లి కోహ్లితో సెల్ఫీ దిగి హల్చల్ చేసిన యువకుడిని కడప జిల్లా వాసి మొహమ్మద్ ఖాన్‌గా గుర్తించారు. అతనిపై సెక్షన్–341, 448, 506ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. కోహ్లికి వీరాభిమాని అయిన 19 ఏళ్ల మొహమ్మద్ ఖాన్ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడని... అతని తండ్రి మొహమ్మద్ జమీల్ రియల్ ఎస్టేట్ వ్యాపారి అని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. టెస్టు మ్యాచ్ చూసేందుకు గురువారం కడప నుంచి రైలులో బయలుదేరిన ఖాన్ శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగాడని... అక్కడి నుంచి మ్యాచ్ టికెట్లు విక్రయిస్తున్న జింఖానా మైదానానికి చేరుకొని అక్కడ రూ. 100 టికెట్ కొనుగోలు చేసి ఉప్పల్ స్టేడియానికి వచ్చాడని ఆయన తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు... ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో విధులు నిర్వహిస్తూ నిర్లక్ష్యం వహించిన పోలీస్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆదేశాలు జారీ చేశారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కోహ్లి వీరాభిమాని గ్రౌండ్లోకి దూసుకెళ్లడాన్ని సీపీ తీవ్రంగా పరిగణించారు. కోహ్లి వీరాభిమాని మహ్మద్ ఖాన్ గ్రౌండ్లోకి దూసుకొచ్చిన ప్రాంతంలో బాధ్యతలు నిర్వహిస్తున్న నేరెడ్మెట్ ఎస్ఐ ప్రభాకర్, జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ శ్రీను, కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ హోంగార్డు నారాయణలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. -
ముద్దు మీరిన అభిమానం
సాక్షి, హైదరాబాద్: రాజ్‌కోట్ టెస్టులో అభిమాని మైదానంలోకి దూసుకొచ్చి కోహ్లితో సెల్ఫీ తీసుకున్న ఘటన తర్వాత ఇప్పుడు రెండో టెస్టుల్లో మళ్లీ అలాంటిదే జరిగింది. ఈసారి కోహ్లి ఫ్యాన్‌గా చెప్పుకున్న ఆ యువకుడు తన అభిమానాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లాడు. సరిగ్గా చెప్పాలంటే అతిగా వ్యవహరించి క్షణ కాలం పాటు కోహ్లినే భయపెట్టేశాడు. విండీస్ ఇన్నింగ్స్‌లో 15వ ఓవర్ ముగిసిన తర్వాత ఈ ఘటన జరిగింది. కోహ్లి ఫీల్డింగ్ కోసం మరో ఎండ్‌కు వెళ్లే ప్రయత్నంలో ఉండగా వెస్ట్ గ్యాలరీ నుంచి ఒక యువకుడు నేరుగా అతని వైపు దూసుకొచ్చాడు. ప్రమాదాన్ని ఊహించిన కోహ్లి తప్పించుకునే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. వేగంగా వచ్చిన అతను వెంటనే కోహ్లికి చేరువగా వచ్చి సెల్ఫీ తీసేసుకున్నాడు. దీనికి కూడా సరేలే అన్నట్లుగా కెప్టెన్ సర్దుకున్నాడు. కానీ ఆ వ్యక్తి అంతటితో ఆగలేదు. అనూహ్యంగా కోహ్లి భుజాల మీదుగా చేతులు వేసి దగ్గరకు లాక్కున్నాడు. దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టే ప్రయత్నం కూడా చేయడంతో బిత్తరపోవడం కోహ్లి వంతైంది. అతడి నుంచి తల తిప్పుకొని ఎలాగోలా దూరం జరిగిన విరాట్ ఆ ముద్దును తప్పించుకోగలిగాడు. ఇంత జరిగిన తర్వాత నింపాదిగా వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది మొత్తానికి ఆ యువకుడిని అక్కడి నుంచి తీసుకొని వెళ్లిపోయారు. కోహ్లిని చూస్తే అతను కూడా ఒకింత ఆందోళనకు లోనైనట్లు కనిపించింది. ఈ రెండు ఘటనలు చూస్తే వీటిని ఏమాత్రం సరదాగా, అభిమానంతో చేసే పనులుగా చూడాల్సిన పరిస్థితి దాటిపోయింది. మైదానంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరాన్ని ఇది చూపించింది. -
శార్‘దస్’ ఠాకూర్...
భారత్ తరఫున టెస్టు క్రికెట్ ఆడిన 294వ క్రికెటర్ శార్దుల్ ఠాకూర్... ప్రతీ క్రికెటర్ కలలు గనే రోజు ఆరేళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్ తర్వాత అతనికి వచ్చింది... రవిశాస్త్రి చేతుల మీదుగా క్యాప్ గర్వంగా అందుకొన్న క్షణాన ఠాకూర్ మురిసిపోయి దానిపై ఉన్న లోగోను ముద్దాడాడు. కెప్టెన్ కోహ్లి అయితే చిన్నపిల్లాడిలా చప్పట్లు కొడుతూ తన సంతోషాన్ని వెలిబుచ్చాడు. అయితే ఈ ఆనందం శార్దుల్‌కు పట్టుమని 10 బంతులే నిలిచింది. తన రెండో ఓవర్ నాలుగో బంతిని బౌల్ చేసిన అనంతరం ఒక్కసారిగా అతని తొడ కండరాలు పట్టేశాయి. మరో అడుగు కూడా వేయలేనన్నట్లుగా శార్దుల్ నొప్పితో బాధ పడ్డాడు. ఫిజియో ప్యాట్రిక్ ఫర్హర్ట్ మైదానంలోకి వచ్చిన అతడిని పరిశీలించినా అప్పటికప్పుడు చికిత్సకు అవకాశం లేకపోయింది. దాంతో కెప్టెన్ కోహ్లితో చర్చించిన అనంతరం శార్దుల్ మైదానం వీడాడు. ఆ తర్వాత శార్దుల్ తొడకు స్కానింగ్ జరిగిందని, తొలి రోజు మొత్తం మైదానంలో అడుగు పెట్టడని బీసీసీఐ ప్రకటించింది. పరిస్థితి చూసిన అనంతరం టెస్టులో కొనసాగే విషయంపై స్పష్టతనిస్తామని చెప్పింది. దురదృష్టవశాత్తూ 1.4 ఓవర్లకే అరంగేట్ర టెస్టులో శార్దుల్ బౌలింగ్ ముగియగా... భారత్ ఒక ప్రధాన పేసర్ లోటుతోనే ఆటను కొనసాగించాల్సి వచ్చింది. గత రెండేళ్లుగా భారత జట్టు ఆడిన ప్రతీ సిరీస్‌లో సభ్యుడిగా ఉంటూ వచ్చిన శార్దుల్‌కు ఇన్నాళ్ళకు అవకాశం దక్కింది. షమీ వరుసగా ఆరు టెస్టులు ఆడటంతో విశ్రాంతినిచ్చి అతడిని ఎంపిక చేశారు. ఆసియా కప్‌లో కూడా హాంకాంగ్‌తో మ్యాచ్ తర్వాత తొడ కండరాల గాయంతోనే శార్దుల్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. -
కోహ్లికంటే రోహిత్ అదృష్టవంతుడా!
ఆసియా కప్‌ను మాత్రమే కాకుండా ఇటీవలి ఇంగ్లండ్ పర్యటన తర్వాత కోల్పోయిన అభిమానుల విశ్వాసాన్ని కూడా గెలుచుకునే లక్ష్యంతో భారత్ బరిలోకి దిగు తోంది. మన జట్టు ఏదో అద్భుతం చేస్తుందంటూ ఇంగ్లండ్ పర్యటనపై ఉంచిన అంచనాలు దెబ్బ తినడంతో మెల్లగా మబ్బులు వీడిపోయాయి. ఆసియా కప్‌లో అద్భుతంగా ఆడితే ఆ గాయాలు మరచిపోయేలా చేయడంతో పాటు భారత క్రికెట్‌పై ఆసక్తి తగ్గిపోయిన వారిని కూడా మళ్లీ ఇటు వైపు చూసేలా చేయవచ్చు. హాంకాంగ్‌తో జరిగే తొలి మ్యాచ్ తర్వాతి రోజు పాకిస్తాన్‌తో పోరుకు ముందు మంచి వార్మప్‌గా చెప్పవచ్చు. భారత్ వరుసగా రెండు రోజులు మ్యాచ్‌లు ఆడాల్సి రావడం, అదీ రెండో రోజు పాకిస్తాన్‌తో తలపడే విధంగా నిర్వాహకులు అసలు షెడ్యూల్‌ను ఎలా తయారు చేశారో అర్థం కావడం లేదు. అయితే దాని గురించి ఏమీ చేయలేం. క్వాలిఫయింగ్ టోర్నీలో తమకంటే బలమైన జట్లను ఓడించి హాంకాంగ్ ఈ దశకు అర్హత సాధించింది. తొలి మ్యాచ్‌లో పాక్ చేతిలో చిత్తుగా ఓడిన ఆ జట్టు భారత్‌పై కాస్త మెరుగ్గా ఆడాలని భావిస్తోంది. భారత జట్టు కుర్రాళ్లు, అనుభవజ్ఞులతో సమతూకంగా ఉంది. ముఖ్యం గా రోహిత్ తన ఖాతాలో మరో ఒకట్రెండు సెంచరీలు చేర్చుకో వాలని భావిస్తున్నాడు. క్లిష్ట సమయాల్లో అండగా నిలిచేందుకు పక్కనే ధోని ఉండటం కూడా రోహిత్ అదృష్టం. సాధారణంగా ఇండియా జట్టు ఆకర్షణ అంతా బ్యాటింగ్‌లోనే కనిపిస్తుంది. కానీ ఈసారి బౌలింగ్‌లో ఉన్న వైవిధ్యం కూడా ఆకట్టుకునేలా చేస్తోంది. ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు చహల్, కుల్దీప్ వేర్వేరు శైలిలో వికెట్లు పడగొట్టడమే కాకుండా ఒకరిని మరొకరు ప్రోత్స హించుకునే తీరు చాలా బాగుంటుంది. మామూలుగా అయితే తమ బ్యాట్స్‌మెన్ ఎక్కువసేపు క్రీజ్‌లో గడపాలని కోరుకుంటుంది కాబట్టి అవకాశం లభిస్తే భారత్ తొలుత బ్యాటింగ్‌కే మొగ్గు చూపుతుంది. అయితే తర్వాతి రోజే పాకిస్తాన్‌తో ఆడాల్సి ఉంది కాబట్టి ఈ మ్యాచ్‌ను వీలైనంత తొందరగా ముగించి ప్రధాన పోరు కోసం తమ శక్తిని కాపాడుకునే ప్రయత్నం చేయవచ్చు. అది జరగాలంటే భారత్ టాస్ నెగ్గాలి. ఈ విషయంలో కోహ్లితో పోలిస్తే రోహిత్ అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి. -
పట్టు చేజారినట్టే!
బౌలింగ్‌లో ఇంగ్లండ్ లోయర్ ఆర్డర్‌ను కట్టడి చేయలేకపోయిన టీమిండియా... బ్యాటింగ్ వైఫల్యంతో చివరి టెస్టులోనూ కష్టాల్లో పడింది. ఆతిథ్య జట్టు పేసర్ల పదునైన బంతులు మన బ్యాట్స్‌మెన్‌ను చుట్టు చుట్టేశాయి. ఎప్పటిలాగే కెప్టెన్ విరాట్ కోహ్లి యోధుడిలా పోరాడినా మిగతావారు యథాప్రకారం నిష్క్రమించారు. ప్రత్యర్థి చివరి వరుస బ్యాట్స్‌మెన్ జోడించిన పరుగులే ఇరు జట్ల మధ్య తేడా చూపనున్నాయి. అరంగేట్ర హనుమ విహారి మూడో రోజు ఏమేరకు పోరాడతాడో... అంతరం ఎంతవరకు తగ్గిస్తాడో చూడాలి. లండన్: సుదీర్ఘ పర్యటనను గౌరవప్రదంగా ముగించాలనుకుంటే టీమిండియా శక్తికి మించి పోరాడక తప్పేలా లేదు. చివరిదైన ఐదో టెస్టులో శనివారం రెండో రోజు ఆట పూర్తయ్యాక పరిస్థితి చూస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 158 పరుగులు వెనుకబడి ఉంది. కెప్టెన్ కోహ్లి (70 బంతుల్లో 49; 6 ఫోర్లు), ఓపెనర్ రాహుల్ (53 బంతుల్లో 37; 4 ఫోర్లు), పుజారా (101 బంతుల్లో 37; 5 ఫోర్లు) భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. కొత్త కుర్రాడు హనుమ విహారి (25 బ్యాటింగ్; 3 ఫోర్లు, 1 సిక్స్), ఆల్‌రౌండర్ జడేజా (8 బ్యాటింగ్) పోరాడుతున్నారు. స్వింగ్‌తో చెలరేగిన అండర్సన్ (2/20) కీలక వికెట్లు పడగొట్టాడు. స్టోక్స్ (2/44) తనవంతుగా ఓ చేయి వేశాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 198/7తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 332 పరుగులకు ఆలౌటైంది. ‘బర్త్ డే బాయ్’ జాస్ బట్లర్ (133 బంతుల్లో 89; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫటాఫట్ ఇన్నింగ్స్‌తో జట్టుకు మంచి స్కోరు అందించాడు. భారత బౌలర్లలో జడేజా (4/79)కు నాలుగు వికెట్లు దక్కాయి. మళ్లీ తోక జాడించారు... సిరీస్ మొదటి నుంచి టీమిండియాను వేధిస్తున్న ఇంగ్లండ్ లోయర్ ఆర్డర్ ఈసారీ అదే పని చేసింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్‌లో ఆదిల్ రషీద్ (15) తొందరగానే ఔటైనా... బ్రాడ్ (38; 3 ఫోర్లు) తోడుగా బట్లర్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. దీంతో లంచ్‌కు ముందే జట్టు స్కోరు 300 దాటింది. శుక్రవారం రోజంతా ఆడి 198 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లండ్ శనివారం తొలి సెషన్లోనే 107 పరుగులు చేయడం గమనార్హం. లంచ్ తర్వాత మూడో ఓవర్లోనే బ్రాడ్ ఆట ముగిసింది. జడేజా బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన అతడు రాహుల్ పట్టిన అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. దీంతో 9వ వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అండర్సన్ (0 నాటౌట్)ను అవతలి ఎండ్‌లో ఉంచి ఎక్కువగా స్ట్రయికింగ్ తీసుకున్న బట్లర్... బుమ్రా బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు బాదాడు. అదే ఊపులో జడేజా వేసిన బంతిని షాట్ కొట్టబోయి స్లిప్‌లో రహానేకు చిక్కాడు. చివరి మూడు వికెట్లకు 151 పరుగులు జతకూరడంతో ఇంగ్లండ్‌కు మోస్తరు స్కోరు సమకూరింది. ధావన్ మళ్లీ... ప్చ్! భారత్ ఇన్నింగ్స్‌ను మరోసారి ఓపెనింగ్ వైఫల్యం వెంటాడింది. రెండో ఓవర్ మొదటి బంతికే ధావన్ (3) బ్రాడ్‌కు వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. అయితే, రాహుల్ సానుకూలంగా కని పించాడు.దూకుడుగా షాట్లు కొట్టాడు. సరిగ్గా టీ విరామానికి ముందటి ఓవర్లో టీమిండియా స్కోరు 50 దాటింది. బ్రేక్ తర్వాత కూడా పరుగులు సులభంగా వస్తున్న స్థితిలో కరన్ దెబ్బకొట్టాడు. తక్కువ వేగంతో అతడు వేసిన బంతి రాహుల్‌ను బోల్తా కొట్టిస్తూ వికెట్లకు తగిలింది. రెండో వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. పుజారా, కోహ్లి కొద్దిసేపు సాధికారికంగా ఆడారు. అండర్సన్ రివర్స్ స్వింగ్‌తో కోహ్లిని ఇబ్బందిపెట్టాడు. ఓసారి వికెట్ల ముందు దొరికినా అంపైర్ ఎల్బీగా ప్రకటించలేదు. కానీ, తర్వాతి ఓవర్లోనే అండర్సన్ పుజారా ఇన్నింగ్స్‌కు తెరదించాడు. అనూహ్యంగా వచ్చిన ఇన్ స్వింగర్ పుజారా బ్యాట్‌ను తాకుతూ కీపర్ చేతుల్లో పడింది. వైస్ కెప్టెన్ రహానే (0) ఇలా వచ్చి అలా వెళ్లాడు. భారత్ 103 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో కోహ్లికి విహారి జత కలిశాడు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. అర్ధ శతకం దిశగా సాగుతున్న సమయంలో స్టోక్స్ బంతిని డ్రైవ్ చేయబోయి స్లిప్‌లో రూట్‌కు కోహ్లి క్యాచ్ ఇచ్చాడు. పంత్ (5) ప్రతిఘటన లేకుండానే లొంగిపోయాడు. విహారి... ఉత్కంఠను తట్టుకుని ఆంధ్ర బ్యాట్స్‌మన్ హనుమ విహారి తీవ్ర ఉత్కంఠను తట్టుకుని నిలిచాడు. బ్రాడ్ పదునైన బంతికి అతడు వికెట్ల ముందు దొరికినా అంపైర్ ఔట్ ఇవ్వలేదు. ఇంగ్లండ్ కూడా రివ్యూ కోరలేదు. రెండోసారీ ఇలాంటి సందర్భమే ఎదురవగా సమీక్షలో బంతి వికెట్లకు దూరంగా వెళ్తున్నట్లు తేలింది. దీంతోపాటు మరికొన్ని క్లిష్టమైన బంతులు విహారికి పరీక్ష పెట్టాయి. వాటన్నిటిని ఎదుర్కొన్న అతడు కోహ్లికి అండగా నిలిచాడు.ఆత్మవిశ్వాసం కూడగట్టుకున్నాక బ్యాట్ ఝళిపించాడు. స్టోక్స్ వేసిన షార్ట్ లెగ్ బంతిని వికెట్ల వెనుకకు సిక్స్‌గా పంపాడు. భారత ఇన్నింగ్స్‌లో ఇదే ఏకైక సిక్స్ కావడం విశేషం. అనంతరం సైతం చక్కటి షాట్లు కొట్టాడు. ►1 టెస్టుల్లో భారత్‌పై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అండర్సన్ (106) గుర్తింపు పొందాడు. ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక–105 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును ఈ ఇంగ్లండ్ బౌలర్ సవరించాడు. ► 59 ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌లో భారత పేసర్లు (ఇషాంత్ 18, షమీ 14, బుమ్రా 14, హార్దిక్ పాండ్యా 10, ఉమేశ్ 3) తీసిన వికెట్లు. గతంలో పాక్‌తో జరిగిన 1979–80 సిరీస్‌లో భారత పేస్ బౌలర్లు (కపిల్‌దేవ్ 32, కర్సన్ ఘావ్రి 15, రోజర్ బిన్నీ 11) అత్యధికంగా 58 వికెట్లు పడగొట్టారు. -
గెలుపు కాదు... ఓటమి పలకరింపే
మన లోలోపల ఉన్న ఆందోళనే నిజమైంది! క్లిష్టమైనా, కష్ట సాధ్యం కాని లక్ష్యంలో సగంపైగా పరుగులు ముందు రోజే చేసేసినా... మిగిలిన ఆ కొంత కొండంతలా కనిపించాయి! స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ వైఫల్య ప్రభావం స్పష్టంగా కనిపించిన వేళ... విదేశీ గడ్డపై మరో టెస్టు సిరీస్‌ను భారత్ పరాజయంతోనే ప్రారంభించింది. తొలి ఇన్నింగ్స్ మాదిరిగా లోయర్ ఆర్డర్‌ను కాపాడుకుంటూ అద్భుతం చేస్తాడనుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లి వెనుదిరగడం ఆలస్యం... భారత్ విజయం ఆశలకు తెరపడింది. ఇంగ్లండ్ గెలుపునకు తెరలేచింది. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో తమకే ‘ఎడ్జ్’ ఉంటుందని ఆతిథ్య జట్టు మరోసారి చాటింది! అచ్చొచ్చిన చోట... 1000వ టెస్టును విజయంతో ముగించి మధురానుభూతిగా మిగుల్చుకుంది. బర్మింగ్‌హామ్: ఊరించిన విజయం చేజారింది. ఒంటరి పోరాటాలతో నాలుగో ఇన్నింగ్స్‌లో మోస్తరు లక్ష్యానైన్నా అందుకోలేమని టీమిండియాకు మళ్లీ అనుభవమైంది. ఆల్‌రౌండర్లు ఆపద్బాంధవులుగా నిలవడంతో తొలి టెస్టులో కోహ్లి సేనపై ఇంగ్లండ్ జయభేరి మోగించింది. 194 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 110/5తో శనివారం ఆట ప్రారంభించిన భారత్... 162 పరుగులకు ఆలౌటైంది. విజయానికి 31 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కెప్టెన్ కోహ్లి (93 బంతుల్లో 51; 4 ఫోర్లు) అర్ధ శతకం అనంతరం కీలక సమయంలో ఔటవ్వడం భారత అవకాశాలను దెబ్బతీసింది. హార్దిక్ పాండ్యా (61 బంతుల్లో 31; 4 ఫోర్లు) ప్రతిఘటన జట్టును గట్టెక్కించలేకపోయింది. బెన్ స్టోక్స్ (4/40) వీరిద్దరినీ ఔట్ చేశాడు. ఆల్‌రౌండ్ ప్రతిభ చూపిన సామ్ కరన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఈ నెల 9 (గురువారం) నుంచి లార్డ్స్‌లో జరుగుతుంది. ఈసారి స్ట్రోక్ స్టోక్స్‌ది... నాలుగో రోజు విజయానికి భారత్ చేయాల్సిన పరుగులు 84. కోహ్లికి తోడుగా ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్ (20) కొంతైనా స్కోరు జోడిస్తే లక్ష్యం క్రమంగా కరిగేది. కానీ, అతడు తొలి ఓవర్ చివరి బంతికే అండర్సన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. కెప్టెన్‌కు జత కలిసిన పాండ్యా... ఉత్కంఠ పరిస్థితులను అధిగమించి కుదురుకున్నాడు. కోహ్లి కంటే అతడికే స్ట్రయికింగ్ ఎక్కువగా వచ్చింది. ఇద్దరూ రక్షణాత్మకంగానే ఆడటంతో 7 ఓవర్లలో 11 పరుగులే వచ్చాయి. ఇటు బ్రాడ్ బౌలింగ్‌లో పాండ్యా, అటు అండర్సన్ బౌలింగ్‌లో కోహ్లి చెరో బౌండరీ బాదడంతో ఎట్టకేలకు స్కోరులో కదలిక వచ్చింది. ఈ క్రమంలో కోహ్లి అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. అనంతరం బ్రాడ్ బౌలింగ్‌లో పాండ్యా రెండు ఫోర్లు కొట్టడంతో మ్యాచ్ భారత్ వైపు మొగ్గుతున్నట్లు కనిపించింది. అప్పటికి లక్ష్యం 53 పరుగులే కావడం... ఇద్దరు బ్యాట్స్‌మెన్ స్వేచ్ఛగా ఆడేందుకు ప్రయత్నిస్తుండటంతో ప్రమాదాన్ని గ్రహించిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ వెంటనే బౌలింగ్‌లో మార్పు చేశాడు. అండర్సన్ బదులు స్టోక్స్‌ను బరిలో దించాడు. ఇది ఫలితం ఇచ్చింది. స్టోక్స్ ఫుల్ డెలివరీని లెగ్ సైడ్ ఫ్లిక్ చేసేందుకు ప్రయత్నించిన కోహ్లి వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ ఎల్బీ ఇవ్వగా, విరాట్ రివ్యూ కోరినా ప్రతికూలంగానే వచ్చింది. ఇదే ఓవర్ చివరి బంతిని షార్ట్ లెంగ్త్‌లో వేయగా... షమీ (0) బ్యాట్‌ను తాకుతూ బంతి కీపర్ బెయిర్ స్టో చేతుల్లోకి వెళ్లింది. దీంతో పరిస్థితి 141/6 నుంచి 141/8కి మారింది. ఇషాంత్ శర్మ (11) స్టోక్స్ బౌలింగ్‌లో రెండు బౌండరీలు కొట్టడంతో లక్ష్యం 40ల్లోకి వచ్చింది. కానీ రషీద్ అతడిని ఎల్బీగా వెనక్కు పంపాడు. ఆఖరి వికెట్‌కు పాండ్యా –ఉమేశ్ (0 నాటౌట్) జంట నాలుగు ఓవర్ల పాటు బండి లాగించి 8 పరుగులు జోడించింది. ఆఫ్ స్టంప్‌పై పడిన స్టోక్స్ బంతి పాండ్యా బ్యాట్‌ను ముద్దాడుతూ స్లిప్‌లోని కుక్ చేతుల్లో çపడటంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. శనివారం 18.2 ఓవర్లు ఆడిన టీమిండియా 52 పరుగులు జోడించి మిగతా 5 వికెట్లు కోల్పోవడం గమనార్హం. ఇదంతా ఓ కలలా ఉంది. నమ్మలేక పోతున్నాను. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో టెయిలెండర్ల సాయంతో విరాట్ కోహ్లి ఆడిన తీరు నుంచి నేర్చుకునేందుకు ప్రయత్నించా. రెండో రోజు ఆట తర్వాత హోటల్లో కుమార సంగక్కరతో మాట్లాడా. టెయిలెండర్లతో కలిసి బ్యాటింగ్ ఎలా చేయాలో అతడు చెప్పాడు. ఇంతమంది జనం మధ్య, నేను చూస్తూ పెరిగిన ఆటగాళ్లతో కలిసి ఆడుతూ రోజూ ఎంతో కొంత నేర్చుకోవడానికి ప్రయత్నిస్తా. – సామ్ కరన్ -
ఇది అ‘ద్వితీయం’: కోహ్లి
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో తాను చేసిన శతకం తన కెరీర్లో రెండో అత్యుత్తమమని అంటున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. సహచరులంతా చేతులెత్తేసిన పరిస్థితుల్లో, ఒంటి చేత్తో జట్టును గట్టెక్కించిన ఈ ఇన్నింగ్స్ కంటే... 2014 ఆడిలైడ్ టెస్టులో చేసిన 141 పరుగులకే అతడు అగ్రస్థానం ఇచ్చాడు. ‘ఆడిలైడ్ ఇన్నింగ్స్ నాకు చాలా ప్రత్యేకం. అప్పుడు మేం భారీ ఛేదన (364 పరుగులు)లో ఉన్నాం. అందుకని ఈ శతకానిది రెండో స్థానమే. అయినా నేను చాలా సంతోషంగా, గొప్పగా భావిస్తున్నా’ అని అన్నాడు. మరోవైపు ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించలేకపోవడంపై విరాట్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘మూడంకెల స్కోరు కాదు. తర్వాత కొనసాగడం ముఖ్యం. వారికంటే కనీసం 10–15 పరుగులైనా ఎక్కువ చేయాల్సింది’ అని పేర్కొన్నాడు. కోహ్లికి మందలింపు... మూడో రోజు ఆట ప్రారంభానికి ముందు భారత కెప్టెన్ కోహ్లితో మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో వ్యక్తిగతంగా మాట్లాడారు. తొలి ఇన్నింగ్స్‌లో రూట్‌ను రనౌట్ చేశాక బూతు మాటలతో అతడిని సాగనంపడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారికంగా ఎలాంటి చర్యా లేకపోయినా... క్రికెటర్‌గా మైదానంలో ఎలా క్రీడా స్ఫూర్తితో వ్యవహరించాలో, క్రమశిక్షణతో మెలగాలో కోహ్లికి ఆయన గుర్తు చేశారు. -
వన్డే వీరులెవరో..!
ఏకంగా 31 సార్లు 300కు పైగా స్కోరు... 11 సార్లు 350కు పైగా... 3 సార్లు 400కు పైగా... గత వన్డే వరల్డ్ కప్‌లో ఘోర వైఫల్యం తర్వాతి నుంచి ఇంగ్లండ్ జోరు ఇది. వన్డే ఆటకు కొత్త అర్థాన్ని చెబుతున్న మోర్గాన్ సేన ఒక వైపు... అక్కడా, ఇక్కడా అని తేడా లేకుండా ఎక్కడైనా సవాల్‌కు సిద్ధం అన్నట్లుగా చెలరేగిపోతూ వరుసగా ఆరు వన్డే సిరీస్‌లను గెలుచుకున్న భారత్ మరోవైపు. సొంతగడ్డపై ఆడటం, అద్భుతమైన ఫామ్ ఇంగ్లండ్‌కు బలమైతే... ఇప్పటి వరకు మాలాంటి ప్రత్యర్థి మీకు ఎదురు కాలేదన్నట్లుగా టి20 సిరీస్‌లో విజయంతో చూపించిన దూకుడు కోహ్లి బృందం సొంతం. ఈ నేపథ్యంలో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్–1 ఇంగ్లండ్, నంబర్–2 భారత్ మధ్య వన్డే వీరులెవరో తేలిపోయే సమరానికి నేడు తెర లేవనుంది. నాటింగ్‌హామ్: సరిగ్గా వచ్చే ఏడాది ఇదే సమయంలో ఇంగ్లండ్ గడ్డపై వన్డే వరల్డ్ కప్ ఆడనున్న భారత్‌కు అక్కడి పరిస్థితులు, పిచ్‌లపై ఒక అంచనాకు వచ్చేందుకు, తమ బలగాన్ని పరీక్షించుకునేందుకు ఇది సదవకాశం. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడి ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో నేడు భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే టి20 సిరీస్ గెలుచుకున్న టీమిం డియా ఇక్కడా విజయం సాధించాలని పట్టుదలతో ఉండగా, వన్డేల్లో ఇటీవలి తమ ధాటిని కొనసాగించాలని ఇంగ్లండ్ భావిస్తోంది. 2014లో ఇక్కడ ఆడిన తమ చివరి పర్యటనలో భారత్ వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. నాలుగో స్థానంలో కోహ్లి! టి20 సిరీస్‌లో విజయం సాధించిన తర్వాత వన్డేల కోసం కూడా భారత జట్టులో పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం కనిపించడం లేదు. దాదాపు అదే జట్టు ఇక్కడా కొనసాగవచ్చు. కేఎల్ రాహుల్ ఫామ్‌ను బట్టి చూస్తే అతని కోసం కోహ్లి మరోసారి నాలుగో స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంది. రోహిత్ శర్మ ఊపు మీదుండగా, ధావన్ ఫామ్ కొంత ఇబ్బందిగా మారింది. అయితే వన్డేల్లో ధావన్ ప్రమాదకరమైన ఆటగాడే కాబట్టి జట్టు బెంగ పడటం లేదు. టి20ల్లో అవకాశం దక్కని దినేశ్ కార్తీక్‌కు మిడిలార్డర్లో బ్యాట్స్‌మన్‌గా చోటు ఖాయమైంది. అతని కోసం రైనాను పక్కన పెట్టాలని టీమ్ మేనేజ్మెంట్ యోచిస్తోంది. చివరి ఓవర్లలో పాండ్యా, ధోని చెలరేగిపోగలరు. బౌలింగ్‌లో మరోసారి ఇద్దరు లెగ్‌స్పిన్నర్లు కుల్దీప్, చహల్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు పరీక్ష పెట్టగలరు. పేస్‌లో ఉమేశ్‌కు చోటు ఖాయం కాగా, భువనేశ్వర్ కోలుకోకపోతే శార్దుల్ జట్టులోకి వస్తాడు. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆడిన 26 వన్డేల్లో 21 గెలవడం భారత్ ఫామ్‌కు సూచిక. హేల్స్ స్థానంలో స్టోక్స్! ఇటీవలే ఆస్ట్రేలియాను 5–0తో చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్ అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని కోరుకుంటోంది. ఓపెనర్లు జేసన్ రాయ్, బెయిర్ స్టో ఇటీవల వందకు పైగా స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధిస్తున్నారు. 864 పరుగులతో బెయిర్ స్టో 2018లో టాప్‌స్కోరర్‌గా కొనసాగుతుండగా, జేసన్ రాయ్ మూడు సెంచరీలు బాదాడు. రూట్ చక్కటి వన్డే ఆటగాడు కాగా, మోర్గాన్ బ్యాటింగ్ కూడా కీలకం. ఐపీఎల్ నుంచి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న బట్లర్ ఈసారి మిడిలార్డర్లో తన సత్తా ప్రదర్శించేందుకు సిద్ధమయ్యాడు. ఆసీస్‌తో వన్డేలు ఆడని ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు ఇప్పుడు నేరుగా జట్టులో చోటు ఖాయం. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో మరో హిట్టర్ హేల్స్‌ను ఇంగ్లండ్ పక్కన పెట్టాల్సి వస్తోంది. బౌలింగ్ కొంత బలహీనంగా కనిపిస్తున్నా... బ్యాటింగ్ బలంతో దానిని అధిగమించగలమని ఇంగ్లండ్ నమ్ముతోంది. గత ఏడాది కాలంలో ఆడిన 21 వన్డేల్లో ఇంగ్లండ్ 4 మాత్రమే ఓడింది. పిచ్, వాతావరణం ఇంగ్లండ్‌లో ఇది నడి వేసవి. పొడిబారిన పిచ్ సిద్ధం. కాబట్టి పరుగుల వరద ఖాయం. ఇంగ్లండ్ రెండు వరల్డ్ రికార్డు స్కోర్లు (444, 481) గత రెండు మ్యాచ్‌లలో ఇదే మైదానంలో వచ్చాయి. సాయంత్రం గం. 5 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్–3లో ప్రత్యక్ష ప్రసారం -
తొలి సమరానికి సై
మాంచెస్టర్: గత కొంతకాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో తిరుగులేని ప్రదర్శనలు చేస్తున్న భారత్ ఓ వైపు... తమపై ఉన్న సంప్రదాయ ముద్రను మరిపిస్తూ పొట్టి ఫార్మాట్లో చెలరేగుతున్న ఇంగ్లండ్ మరోవైపు. రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య సమరానికి నేటితో తెరలేవనుంది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా మంగళవారం భారత్ తమ తొలి టి20లో బరిలో దిగనుంది. ఐర్లాండ్‌తో పొట్టి సిరీస్‌లో కోహ్లిసేనకు విజయంతో మంచి మ్యాచ్ ప్రాక్టీస్ లభించగా... సొంతగడ్డపై ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఇంగ్లండ్ అదే జోరు ఇక్కడ కొనసాగించాలని భావిస్తోంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో రికార్డులు తిరగరాస్తున్న మోర్గాన్ సేనను భారత్ బౌలర్లు ఎంతవరకు నిలువరిస్తారో చూడాలి. పూర్తిస్థాయిలో కోహ్లిసేన... ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడానికి ప్రత్యర్థి బంగ్లాదేశో, అఫ్గానిస్తానో కాదు. పటిష్ట ఇంగ్లండ్. అందుకే భారత్ ఈ టోర్నీ కోసం పూర్తి స్థాయి జట్టుతో సన్నద్ధమైంది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు రోహిత్, ధావన్‌లతో పాటు కెప్టెన్ కోహ్లి, టి20 స్పెషలిస్ట్ రైనా, సీనియర్ ధోని, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలతో బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తోంది. అయితే నాలుగో స్థానంలో ఎవరు ఆడతారనేదే ఆసక్తికరం. రాహుల్‌ను స్పెషలిస్ట్ ఓపెనర్‌గానే పరిగణిస్తే మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్‌లలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. జట్టులో ధోనీలాంటి వికెట్ కీపర్, అత్యుత్తమ ఫినిషర్ ఉన్న నేపథ్యంలో పాండే వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నా యి. గాయం కారణంగా బుమ్రా సిరీస్‌కు దూరం కావడంతో అతని స్థానంలో చహర్‌ను ఎంపిక చేసినా... అతనికి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు తక్కువే. భువనేశ్వర్‌తో పాటు ఉమేశ్‌ను ఆడించే అవకాశాలే ఎక్కువ. స్పిన్ జోడీ చహల్, కుల్దీప్ తామి క్కడ కూడా సత్తా చాటగలమని ఐర్లాండ్ సిరీస్‌తో నిరూపించుకున్నారు. భారత్ ఆడిన గత 20 టి20ల్లో 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించి జోరు మీద ఉంది. పటిష్ట బ్యాటింగ్‌తో ఇంగ్లండ్... బ్యాటింగే ప్రధాన బలంగా ఇంగ్లండ్ బరిలో దిగనుంది. ఇటీవల సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను 5–0తో క్లీన్‌స్వీప్ చేసిన మోర్గాన్ సేన ఏకైక టి20లోనూ జయభేరి మోగించింది. బట్లర్, రాయ్, బెయిర్‌స్టో, మోర్గాన్, హేల్స్, రూట్లతో ఆ జట్టు బ్యాటింగ్ దుర్బేధ్యంగా కనిపిస్తోంది. ఐపీఎల్–11 ఫామ్‌ను కొనసాగిస్తున్న బట్లర్ ఓపెనర్ అవతారం ఎత్తి జట్టు భారీ స్కోరుకు బాటలు వేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో టి20 మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలో దిగిన అతను తొలి మ్యాచ్‌లోనే తమ దేశం తరఫున వేగవంతమైన అర్ధశతకం (22 బంతుల్లో) సాధించిన ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. ఇక్కడ కూడా అదే జోరు కొనసాగిస్తే భారత్‌కు కష్టకాలమే. ►రాత్రి గం. 10.00 నుంచి సోనీ సిక్స్, సోనీ–టెన్ 3లలో ప్రత్యక్ష ప్రసారం -
ఈసారి అలా జరగదు..!
న్యూఢిల్లీ: కొన్నాళ్ల క్రితం ఎలాంటి సన్నాహాలు లేకుండా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత క్రికెట్ జట్టు తొలి రెండు టెస్టులు ఓడి సిరీస్ కోల్పోయింది. ఆ తర్వాత మూడో టెస్టుతో పాటు వన్డే సిరీస్‌ను కూడా గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ పర్యటన షెడ్యూల్‌ను తమకు అనుకూలమైన రీతిలో మార్చుకుంది. అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ముందుగా టి20లు, వన్డేలు ఆడనున్న భారత్, ఆ తర్వాత టెస్టు సిరీస్ కోసం బరిలోకి దిగుతుంది. అందుకే ఈ సిరీస్‌ను విదేశీ గడ్డపై ఆడుతున్నామనే భావన తమకు కలగడం లేదని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. 81 రోజుల సుదీర్ఘ పర్యటనకు టీమిండియా బయల్దేరడానికి ముందు కోహ్లి, కోచ్ రవిశాస్త్రి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘నాలుగేళ్ల క్రితం మా జట్టులో అందరం సమష్టిగా విఫలమయ్యాం. అయితే ఈసారి అలా జరగదు. ఒక్కసారి లయ అందిపుచ్చుకుంటే పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా సమస్య రాదు. అయితే దక్షిణాఫ్రికా సిరీస్‌తో పోలిస్తే మరింత కఠినమైన క్రికెట్ ఆడేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం. అక్కడి వాతావరణంలో ఎంత ఎక్కువ సమయం గడిపితే అంత మంచిది. టెస్టులు మొదలయ్యే సమయానికి మేం బాగా అలవాటు పడిపోతాం కాబట్టి మాకు అంతా సౌకర్యంగా మారిపోతుంది. అసలు విదేశంలో టెస్టులు ఆడుతున్నట్లే అనిపించకపోవచ్చు’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. ఈ పర్యటనలో ఐర్లాండ్‌తో భారత్ రెండు టి20లు... ఇంగ్లండ్‌తో మూడు టి20లు, మూడు వన్డేలు, 5 టెస్టులు ఆడనుంది. జూన్ 27న ఐర్లాండ్‌తో భారత్ తొలి టి20 ఆడనుండగా... ఆగస్టు 1 నుంచి ఇంగ్లండ్‌తో తొలి టెస్టు జరుగుతుంది. 2014లో జరిగిన సిరీస్‌లో కోహ్లి 10 ఇన్నింగ్స్‌లలో 13.40 సగటుతో 134 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యాడు. ఈసారి మెరుగైన సన్నాహాల కోసం సర్రే జట్టు తరఫున అతను కౌంటీ ఆడేందుకు కూడా సిద్ధమయ్యాడు. అయితే గాయంతో అది సాధ్యపడలేదు. కానీ తాను దాని గురించి బాధ పడటం లేదని కోహ్లి అన్నాడు. ‘ఏది జరిగినా అంతా మన మంచికే అని నేను భావిస్తా. నాలుగేళ్లలో పరిస్థితులు చాలా మారి ఉంటాయి కాబట్టి కౌంటీల్లో ఆడితే బాగుంటుందని అనుకున్నా. అయితే ఒక రకంగా ఆడకపోవడం మేలే చేసింది. అక్కడ బరిలోకి దిగితే మన సిరీస్ ప్రారంభమయ్యే సమయానికి అలసిపోయి ఇప్పుడు ఉన్నంత తాజాగా ఉండకపోయేవాడినేమో. ప్రస్తుతం నేను పూర్తి ఫిట్‌గా ఉన్నాను. ఎప్పుడెప్పుడు బరిలోకి దిగుదామా అనిపిస్తోంది’ అని కోహ్లి అన్నాడు. తమ దృష్టిలో విదేశీ మైదానం ఉంటూ ఏమీ లేదని, ప్రపంచంలో ఎక్కడ ఆడినా పరిస్థితులను ఆకళింపు చేసుకొని 22 గజాల పిచ్‌ను గెలవగలమనే నమ్మకంతోనే బరిలోకి దిగుతామని రవిశాస్త్రి వ్యాఖ్యానించారు. చాలా మంది ఇంకా 2014 పర్యటన వద్దే ఆగిపోయినట్లున్నారు. ఆ తర్వాత మేం చాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడాం. అదేమీ బంగ్లాదేశ్‌లో జరగలేదుగా? గత సిరీస్ సమయంలో కూడా నా లక్ష్యాల గురించి అడిగారు. నేను రోడ్లపై తిరుగుతూ కాఫీ తాగడం అని చెప్పాను. ఏదైనా విదేశీ పర్యటనలో నా ఆలోచనా తీరు భిన్నంగానే ఉంటుంది. నేను ఎంత బాగా ఆడగలనో నాకు బాగా తెలుసు. ఎవరో చెప్పనవసరం లేదు. క్రీజ్‌లోకి వెళ్లాక నేనేం చేయాలో తెలుసు. –2014 సిరీస్ వైఫల్యంపై అసహనంతో కోహ్లి సమాధానం యో యో టెస్టు ఏదో ఒకసారి జరుగుతుందని భావించడం పొరపాటు. అది ఇక ముందూ కొనసాగుతుంది. మీరు పాస్ అయితే సంతోషం. మీ వల్ల కాదంటే వెళ్లిపోవడం ఉత్తమం. ఆటలో ఎంత సత్తా ఉన్నా ఫిట్‌గా ఉండటం కూడా ముఖ్యమనే ఉద్దేశంతోనే యో–యో టెస్టుపై ప్రత్యేక దృష్టి పెట్టాం. – రవిశాస్త్రి, కోచ్ -
బీసీసీఐ చాంపియన్ క్రికెటర్ కోహ్లి
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి మైదానంలోనే కాదు... బీసీసీఐ వార్షిక అవార్డుల్లోనూ దుమ్మురేపాడు. గత రెండు సీజన్లకు అతనే ‘బెస్ట్ క్రికెటర్’ అవార్డుకు ఎంపికయ్యాడు. 2016–17, 2017–18 సీజన్లకు సంబంధించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక అవార్డుల్లో ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. మహిళల కేటగిరీలో ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్లుగా హర్మన్‌ప్రీత్ కౌర్ (2016–17), స్మృతి మంధాన (2017–18) లాలా అమర్నాథ్ అవార్డులకు ఎంపికయ్యారు. అఫ్గానిస్తాన్‌తో చారిత్రక టెస్టుకు రెండు రోజుల ముందు ఈ నెల 12న బెంగళూరులో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. 2016–17 సీజన్లో కోహ్లి 13 టెస్టులాడి 74 సగటుతో 1332 పరుగులు చేశాడు. 27 వన్డేల్లో 84.22 సగటుతో 1516 పరుగులు సాధించాడు. తదుపరి సీజన్లో ఆరు టెస్టుల్లోనే 896 పరుగులతో 89.6 సగటు నమోదు చేశాడు. వన్డేల్లో 75.50 సగటుతో రెచ్చిపోయాడు. ఈ అవార్డు కింద అతనికి రూ. 15 లక్షల చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ.30 లక్షలు ప్రైజ్‌మనీగా దక్కనుంది. హైదరాబాద్ కుర్రాడు ఠాకూర్ తిలక్‌వర్మ బీసీసీఐ అవార్డుల జాబితాలో నిలిచాడు. 2016–17లో జరిగిన విజయ్ మర్చంట్ అండర్–16 టోర్నీలో అత్యధిక పరుగులు (8 మ్యాచ్‌లలో 96 సగటుతో 5 సెంచరీలు సహా 960 పరుగులు) చేసిన తిలక్... జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ (అండర్–16 కేటగిరీ)కి ఎంపికయ్యాడు. సీఓఏ కమిటీ సభ్యురాలు డయానా ఎడుల్జీ 2016–17 సీజన్లో జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికవగా... ప్రస్తుతమున్న హోదా వల్ల ఆమె ఆ అవార్డును తిరస్కరించారు. -
ఫాలోయింగ్ పెరిగింది
మహేశ్‌బాబు టాలీవుడ్ టాప్ స్టార్స్‌లో ఒకరు. ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హెడ్డింగ్ చూసి స్పెషల్‌గా ఫాలోయింగ్ పెరగడమేంటీ అని అనుకుంటున్నారు. ఇది సోషల్ మీడియాలో ఫాలోయింగ్ గురించి. ట్వీటర్ అకౌంట్లో మహేశ్‌బాబును సుమారు 65 లక్షలమంది ఫాలో అవుతారు. కానీ ఈ సూపర్ స్టార్ మాత్రం తన బావ గల్లా జయదేవ్, దర్శకుడు కొర టాల శివను మాత్రమే ఫాలో అవుతుంటారు. కానీ రీసెంట్గా ఆయన ఫాలో అయ్యేవారి సంఖ్య 2 నుంచి 8కి పెరిగింది. అందులో దర్శకులు రాజమౌళి, క్రికెట్ ప్లేయర్స్ సచిన్ టెండుల్కర్, మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లి, రాజకీయ నాయకుడు కేటీఆర్ రచయిత టోనీ రాబిన్స్ ఉన్నారు. ట్వీటర్లో చాలా యక్టీవ్గా ఉండే మహేశ్ తను అభిమానించే వాళ్లని, తన సన్నిహితులను ఫాలో అవుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఫారిన్లో హాలిడే ఎంజాయ్ చేస్తున్న మహేశ్ జూన్ 9న ఇండియా రిటర్న్ అవుతారట. ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న సినిమా షూటింగ్లో జాయిన్ అవుతారు మహేశ్. -
మోదీకి ఛాలెంజ్ విసిరిన తేజస్వి యాదవ్
-
ఐపీఎల్ 2018 టోర్నీలో కెప్టెన్ల హవా
-
అదిరే ఫీల్డింగ్..కళ్లు చేదిరే క్యాచ్‌లు
-
గుర్తుపట్టలేనంతగా మారిన అనుష్క..
బాలీవుడ్ : వరుణ్ ధావన్, అనుష్క శర్మ జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సుయి ధాగా’. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. అనుష్క నటిస్తున్న చిత్రం కావడంతో ఆమె అభిమానులే కాక కోహ్లి అభిమానులు కూడా ఈ సినిమాపై ఆసక్తి కనబరుస్తున్నారు. కొత్తగా కనిపిస్తున్న అనుష్క ఫొటోలను చూసిన అభిమానులు ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తుందేమో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్లూ సారీ, రెడ్ బ్యాంగిల్స్ ధరించిన అనుష్క పూర్తిగా ఢిపరెంట్ లుక్‌లో ఉండటంతో అభిమానులు ఆమెని సరిగా పోల్చుకోలేకపోతున్నారు. ఇటీవలే విడుదలైన పరీలో అద్భుత నటనతో ఆకట్టుకున్న అనుష్క ప్రస్తుతం సుయి ధాగాలో డీ గ్లామర్ పాత్రలో నటిస్తున్నారు. వరుణ్ కూడా ఈ చిత్రంలో ఢిపరెంట్ లుక్‌లో కనిపించబోతున్నారు. యశ్ రాజ్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మమతా, మౌజీ పాత్రల్లో అనుష్క, వరుణ్ కనిపించనున్నారు. మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం వరుణ్ కుట్టుమిషన్, అనుష్క ఎంబ్రాయిడరీ నేర్చుకున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నాడు కోహ్లిని ధోని వద్దన్నాడు: వెంగ్‌సర్కార్
ముంబై: ప్రస్తుత భారత కెప్టెన్ విరాట్ కోహ్లిని 2008లో జట్టులోకి ఎంపిక చేసిన కారణంతో తాను పదవి కోల్పోయానని అంటున్నాడు నాటి చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్. కోహ్లిని తీసుకోవడం నాటి కెప్టెన్ ధోని, కోచ్ కిర్‌స్టెన్‌లకు ఏమాత్రం ఇష్టం లేదని తెలిపాడు. వీరిద్దరితో పాటు నాడు బీసీసీఐ కోశాధికారిగా ఉన్న శ్రీనివాసన్ తమిళనాడు ఆటగాడు బద్రీనాథ్ కోసం పట్టుబట్టారని వివరించాడు. ‘కోహ్లి అండర్–19 ప్రపంచకప్ గెలవడంతో ఆస్ట్రేలియాలో అండర్–23 వర్ధమాన ఆటగాళ్ల టోర్నీకి అతడిని ఎంపిక చేశాం. కోహ్లి ఓపెనర్‌గా వచ్చి çన్యూజిలాండ్ జట్టుపై 123 పరుగులు చేశాడు. దీంతో అతడు టీమిండియాలోకి రావడానికి శ్రీలంక సిరీసే సరైనదిగా భావించాం. అయితే... కోహ్లి ప్రతిభ పూర్తిగా తెలియని కిర్‌స్టెన్, ధోని దీనిని వ్యతిరేకించారు. తమ చెన్నై ఫ్రాంచైజీ బ్యాట్స్‌మన్ బద్రీనాథ్‌ను పక్కన బెట్టాల్సి వస్తుండటంతో ధోని, శ్రీనివాసన్ కూడా ఇష్టపడలేదు. ఆ ఏడాది 800 పరుగులు చేసిన బద్రీనాథ్ సంగతేంటని శ్రీనివాసన్ వాదించారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు శరద్ పవార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నన్ను పదవి నుంచి తప్పించారు. -
కోహ్లితో స్నేహానికి రాజకీయ పరిమితుల్లేవు: ఆఫ్రిది
పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది తన స్నేహ స్వభావాన్ని చాటుకున్నాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లితో తన స్నేహాన్ని రాజకీయ పరిస్థితులు నిర్వచించలేవని అన్నాడు. వ్యక్తులు, దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడానికి క్రికెటర్లుగా ఆదర్శంగా ఉండాలనేదే తన సిద్ధాంతమని ఆఫ్రిది చెప్పాడు. ‘విరాట్ ఒక అద్భుత వ్యక్తి. ప్రస్తుతం భారత క్రికెట్‌కు అతనే అంబాసిడర్. కోహ్లితో మాట్లాడిన ప్రతీసారి ఆత్మీయ అనుభూతి పొందుతా. అతడికి వివాహ అభినందనలు కూడా తెలిపా. నా స్వచ్ఛంద సంస్థకు సంతకం చేసిన తన జెర్సీని పంపించాడు’ అని ఆఫ్రిది గుర్తుచేసుకున్నాడు. -
మ్యాచ్ గెలిస్తే కొత్త చరిత్రే!
-
తొలి గెలుపే మలుపు
భారత్... పరిమిత ఓవర్ల క్రికెట్లో చాలా బలమైన జట్టై ఉండొచ్చు. రెండు ప్రపంచ కప్‌లూ గెలిచి ఉండొచ్చు. కొన్నిసార్లు విదేశాల్లో ముక్కోణపు సిరీస్‌లలో జయకేతనం ఎగురేసి ఉండొచ్చు. దక్షిణాఫ్రికా... ఐసీసీ టోర్నీల్లో తడబడి ఉండొచ్చు. ప్రపంచకప్‌లు సాధించి ఉండకపోవచ్చు. కానీ, సొంతగడ్డపై వారిని వన్డేల్లో ఓడించడం బహు కష్టం. మిగతా జట్ల కంటే టీమిండియాకు ఇది బాగా అనుభవం. డర్బన్: పరిస్థితులు కలిసొస్తే దక్షిణాఫ్రికాలో భారత జట్టు టెస్టు సిరీస్‌నైనా గెలవొచ్చేమో కాని, వన్డేల్లో మరీ ముఖ్యంగా ద్వైపాక్షిక సిరీస్‌ను నెగ్గడమంటే అద్భుతంగా రాణించినట్లే. నాలుగు పర్యటనల్లో కేవలం నాలుగు మ్యాచ్‌లే గెలిచిన చరిత్ర దీనికి నిదర్శనం. రెండు ముక్కోణపు సిరీస్‌ల లోనూ మనకు చేదు అనుభవాలే మిగిలాయి. 8 వన్డేల్లో ఒక్కటంటే ఒక్కసారే ప్రత్యర్థిని ఓడించగలిగాం. ఇలాంటి రికార్డుల మధ్య ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం సఫారీలతో డర్బన్‌లో మొదటి మ్యాచ్ జరుగనుంది. బలాబలాల రీత్యా అన్ని విభాగాల్లో రెండు జట్లూ సమానంగా కనిపిస్తున్నా పరిమిత ఓవర్ల క్రికెట్లో ఒకటి రెండు మెరుపు ప్రదర్శనలే మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశిస్తాయి. ప్రత్యర్థి జట్టులో 9వ నంబరు వరకు బ్యాటింగ్ చేయగల వారున్నందున భారీ స్కోరు చేయకుండా అడ్డుకోవడం మన బౌలర్ల ప్రధాన బాధ్యత కానుంది. ఒకవేళ తొలుత భారత్ బ్యాటింగ్ చేసినా భారీ లక్ష్యాన్ని నిర్దేశించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చివరి టెస్టు పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ... అందని ద్రాక్షలా ఊరిస్తున్న వన్డే సిరీస్‌ను ఖాతాలో వేసుకోవాలంటే విరాట్ కోహ్లి సేన తొలి మ్యాచ్‌లోనే గెలిచి మానసికంగా పైచేయి సాధించాలి. నాలుగులో రహానే..? ఎప్పటిలాగే తుది జట్టు ఎంపిక పరంగా టీమిండియాకు కొంత సంక్లిష్టత ఎదురుకానుంది. ఓపెనర్లుగా రోహిత్, ధావన్, వన్‌డౌన్‌లో కోహ్లి ఖాయం. నమ్మదగిన బ్యాట్స్‌మన్ అయిన అజింక్యా రహానే, మనీశ్‌పాండే పోటీలో ఉండటంతో ఎటుతిరిగి నాలుగో స్థానంపైనే చర్చ సాగుతోంది. వీరిలో ఒకరికే అవకాశం ఉంటుంది. లంకతో సిరీస్‌లో రాణించిన శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్ బెంచ్‌కే పరిమితం కాక తప్పదు. స్పిన్ వేయగలడు కాబట్టి అయిదో నంబరులో కేదార్ జాదవ్‌కు ఢోకా లేనట్లే. ఆరు, ఏడు స్థానాలు ధోని, హార్దిక్ పాండ్యాలివి. పిచ్ పరిస్థితుల రీత్యా ఒక్కరే స్పిన్నర్‌ను ఆడిస్తే వైవిధ్యం చూపే కుల్దీప్యాదవ్ వైపు మొగ్గు ఉంటుంది. కానీ భువనేశ్వర్ బ్యాటింగ్‌లోనూ మెరుగవడం, పేస్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ ఉన్నందున మూడో పేసర్ బదులు మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్‌కు చోటిచ్చినా ఆశ్చర్యం లేదు. డివిలియర్స్ స్థానంలో మార్క్రమ్ డాషింగ్ బ్యాట్స్‌మన్ డివిలియర్స్ గాయంతో దూరమైనందున డుప్లెసిస్ నేతృత్వంలోని ఆతిథ్య జట్టుకు బ్యాటింగ్‌లో పెద్ద లోటు ఏర్పడింది. అందుకని కొత్తవారి బదులు టెస్టుల్లో సత్తా చాటిన మార్క్రమ్ను ఏబీ బదులుగా ఆడించనున్నారు. డిపెండబుల్ ఆమ్లా, కీపర్ డికాక్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు. వీరికితోడుగా మిల్లర్, డుమిని వంటి ప్రమాదకర ఆటగాళ్లు భారత్‌కు సవాల్ విసరడానికి సిద్ధమవుతున్నారు. స్పిన్నర్‌గా ఇమ్రాన్ తాహిర్ వైపే మొగ్గు చూపొచ్చు. ప్రధాన పేసర్లు రబడ, మోర్కెల్‌తో పాటు ఆల్రౌండర్లుగా ఫెలూక్వాయో, క్రిస్ మోరిస్ ఉంటారు. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్, ధావన్, కోహ్లి (కెప్టెన్), రహానే/పాండే, కేదార్, ధోని, పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్, షమీ, బుమ్రా దక్షిణాఫ్రికా: ఆమ్లా, డికాక్, డుప్లెసిస్ (కెప్టెన్), మార్క్రమ్, మిల్లర్, డుమిని, మోరిస్, ఫెలూక్వాయో, మోర్కెల్, రబడ, ఇమ్రాన్ తాహీర్. ►102 పరుగులు చేస్తే వన్డేల్లో ధోని 10 వేల పరుగులు పూర్తవుతాయి. ►దక్షిణాఫ్రికా గడ్డపై ఆ జట్టుతో భారత్ ఆడిన 28 వన్డేల్లో 5 గెలిచి 21 ఓడింది. 2 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఇరుజట్ల మధ్య జరిగిన ఆఖరి వన్డే సిరీస్‌లో (భారత్‌లో) టీమిండియా 2–3తో ఓడింది. ‘ఇప్పటివరకు నాలుగో స్థానంపై పలు ప్రయోగాలు చేశాం. అక్కడ బలపడితే జట్టు మరింత సమతూకంగా మారుతుంది. మా స్పిన్నర్లు విదేశాల్లో తొలిసారి ఆడుతున్నారు. వారికిది కఠిన పరీక్ష. డర్బన్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. పరిస్థితులకు ఎవరైతే సరిపోతారో వారినే తీసుకోవాలనేది మా ఉద్దేశం. జట్టుకు అవసరమైన సందర్భంలో చేసిన 40 పరుగులే గొప్ప. ప్రపంచ కప్‌లోగా అందరినీ పరీక్షిస్తాం. రహానే ఓపెనరే అయినా గత ప్రపంచకప్‌లో నాలుగో స్థానంలో ఆడాడు. ఇంగ్లండ్ పరిస్థితుల్లో అతడు ఈ స్థానానికి గట్టి పోటీదారు. అయ్యర్, పాండే సహా అందరికీ అవకాశాలున్నాయి’ – కోహ్లి -
కోహ్లి@900
దుబాయ్: ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచిన రోజే విరాట్ కోహ్లి మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. గురువారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో అతను తొలిసారి 900 రేటింగ్ పాయింట్లు సాధించాడు. దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గావస్కర్ (916 పాయింట్లు–1979లో) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. తాజా పాయింట్లతో అతను వరల్డ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం 947 పాయింట్లతో స్మిత్ నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. గత వారం 880 పాయింట్లతో ఉన్న కోహ్లి సెంచూరియన్ టెస్టులో 153 పరుగులు సాధించడంతో అతని ఖాతాలో మరో 20 పాయింట్లు చేరాయి. ఇంగ్లండ్‌పై 1979 (ఓవల్)లో తన 50వ టెస్టులో 221 పరుగులు సాధించినప్పుడు గావస్కర్ 916 పాయింట్లకు చేరుకున్నాడు. గతంలో భారత ఆటగాళ్లు సచిన్ (898), ద్రవిడ్ (892) ఈ మార్క్‌కు చేరువగా వచ్చినా దానిని అందుకోలేకపోయారు. ఓవరాల్‌గా 900 రేటింగ్ పాయింట్ల మైలురాయిని అందుకున్న 31వ బ్యాట్స్‌మన్ కోహ్లి. డాన్ బ్రాడ్‌మన్ 961 పాయింట్లతో ఆల్‌టైమ్ టాప్‌గా నిలిచాడు. బ్యాటింగ్ టాప్–10లో భారత్ తరపున పుజారా (ఆరో స్థానం), బౌలర్ల జాబితాలో జడేజా (3), అశ్విన్ (5) కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా 2, అశ్విన్ మూడో స్థానంలో ఉన్నారు. -
కేప్‌టౌన్ వీధుల్లో కోహ్లి, ధావన్ చిందులు
-
దక్షిణాఫ్రికా కనిపించింది!
లంకేయులే కదా అని ప్రాక్టీస్‌కు సరిపోతుందనుకున్నారు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనకోసం లంకతో సిరీస్‌ను సన్నాహకంగా భావించారు. అందుకే కావాలని మరీ ఈడెన్ గార్డెన్స్‌లో పేస్ వికెట్ తయారు చేయించుకున్నారు. కానీ ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. కోల్‌కతా టెస్టు తొలిరోజే భారత బ్యాట్స్‌మన్ బోల్తాపడ్డారు. వర్షం కారణంగా రోజంతా 11.5 ఓవర్లే సాగినా.. కోహ్లి అండ్ కోకు మాత్రం కోల్‌కతాలోనే దక్షిణాఫ్రికా కనిపించింది. వాతావరణంలోని తేమ, పిచ్‌పై పచ్చికను అద్భుతంగా వినియోగించుకున్న లంక పేసర్ సురంగ లక్మల్.. భారత టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. అతడినుంచి దూసుకొస్తున్న బంతులను ఎదుర్కోలేక బ్యాట్స్‌మెన్ అష్టకష్టాలు పడ్డారు. ఆరు ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా లక్మల్ 3 వికెట్లు తీసి మన స్టార్ బ్యాట్స్‌మెన్ వెన్ను విరిచాడు. కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో మూడ్రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా కోల్‌కతాలో గురువారం ఉదయం నుంచీ కారుమేఘాలు కమ్ముకున్నాయి. వర్షం కూడా కురుస్తుండటంతో మ్యాచ్‌కు ముందే ఫ్లడ్‌లైట్లు వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన లంక భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలిరోజు ఆట సాధ్యమైన 11.5 ఓవర్లలో భారత్ మూడు వికెట్లు కోల్పోయి 17 పరుగులు చేసింది. రాహుల్ (0), ధావన్ (8), కోహ్లి (0) విఫలం కాగా...చతేశ్వర్ పుజారా(43 బంతుల్లో 8 బ్యాటింగ్; 2 ఫోర్లు), అజింక్యా రహానే (0 బ్యాటింగ్) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. లక్మల్ బంతులను చక్కగా ఎదుర్కొన్న పుజారా మాత్రం క్రీజ్‌లో పాతుకుపోయాడు. 22 బంతుల తర్వాత అతను ఖాతా తెరవడం విశేషం. వర్షం కారణంగా తొలి సెషన్లో ఆట సాధ్యం కాలేదు. రెండో సెషన్లో మధ్యాహ్నం 1.42 గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. ఆ తర్వాత కేవలం 43 నిమిషాలపాటు మాత్రమే వాతావరణం సహకరించింది. లక్ష్మణ్ గంటకొడితే.. కోల్‌కతాలో టెస్టు ప్రారంభానికి ముందు గంట కొట్టే సాంప్రదాయం ఉంది. భారత్–లంక తొలిటెస్టును మాజీ భారత క్రికెటర్, ఈడెన్ పిచ్‌పై గొప్ప రికార్డున్న వీవీఎస్ లక్ష్మణ్ గంటకొట్టి ప్రారంభించారు. వర్షం కారణంగా మ్యాచ్‌కు పదే పదే ఆటంకం కలగటంతో.. మధ్యాహ్నం 1.40 గంటలకు తొలి బంతి వేసేందుకు అవకాశం దొరికింది. ‘ఇలాంటి వికెట్‌పై ఆడటం సంతోషకరం. సులభంగా ఉండే పరిస్థితుల్లో ఆడేందుకు ఏ జట్టూ ఇష్టపడదు. మాకు మేమే ఈ పరిస్థితిని కల్పించుకున్నాం. జట్టులోని ఆటగాళ్లంతా ఈ సవాల్‌ను స్వీకరించేందుకు అంగీకరించారు. ఓ జట్టుగా మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. గతేడాది న్యూజిలాండ్‌లో ఆడిన పిచ్లాంటిదే ఇది. వాతావరణం బ్యాటింగ్‌కు అనుకూలించలేదు. అయినా మ్యాచ్ కొనసాగుతున్న కొద్దీ మేం పుంజుకుంటాం. ఈ పిచ్‌పై రాణించేందుకు అవసరమైన స్వింగ్, సీమ్ మా జట్టులో పుష్కలంగా ఉన్నాయి. మాకు ఇద్దరు స్పిన్నర్లు కీలకం. భారత బ్యాట్స్‌మెన్ తీరును తప్పుబట్టలేం. అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన లక్మల్‌కే క్రెడిట్ ఇవ్వాలి’ – సంజయ్ బంగర్, భారత అసిస్టెంట్ కోచ్ లక్మల్ 6–6–0–3 కోల్‌కతా టెస్టుకు ముందు సురంగ లక్మల్ ఆడిన మ్యాచ్‌లు 39 కాగా పడగొట్టిన వికెట్లు 88 మాత్రమే. ఒకేసారి ఐదువికెట్ల ప్రదర్శన నమోదు చేయగా 43.35 సగటు కూడా గొప్ప విశేషమేం కాదు. ఏడేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నా ఎప్పుడూ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచని శ్రీలంక పేసర్ సురంగ లక్మల్ ఈడెన్ టెస్టు తొలిరోజు ప్రదర్శనతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. వాతావరణంలో తేమతోపాటు కోల్‌కతా వికెట్‌పై పచ్చికను చక్కగా వినియోగించుకున్నాడు. ఆరు ఓవర్లలో ఒక్క పరుగూ ఇవ్వకుడా మూడు వికెట్లనూ తన ఖాతాలో వేసుకున్నాడు. బంతిని అంచనావేయటంలో ఏమరపాటుగా ఉన్నా వికెట్ ఇచ్చుకోవాల్సిందే అన్నట్లుగా పేస్‌కు చక్కని లైన్ అండ్ లెంగ్త్ జోడించి అదరగొట్టాడు. ఇన్నింగ్స్ తొలి బంతికి రాహుల్‌కి షాకిచ్చాడు. కోహ్లికి వేసిన బంతి అయితే అనూహ్యం. ఈ మ్యాచ్ తుది ఫలితం ఎలా ఉన్నా లక్మల్ మాత్రం అందరికీ గుర్తుండిపోవడం ఖాయం. ►2 టెస్టు క్రికెట్ చరిత్రలో శ్రీలంక జట్టు తొలి బంతికే వికెట్ తీసుకోవటం ఇది రెండోసారి. రెండుసార్లూ బౌలర్ సురంగ లక్మలే కావటం విశేషం. ► 6 ఇన్నింగ్స్ తొలి బంతికే అవుటైన ఆరో భారత బ్యాట్స్‌మన్ రాహుల్ కాగా... గావస్కర్ మూడు సార్లు ఈ విధంగా అవుటయ్యారు. శిఖర్ ధావన్ ఏడో ఓవర్ రెండో బంతి. లక్మల్ వేసిన బంతి తక్కువ ఎత్తులో ఆఫ్‌స్టంప్ అవతలగా వెళ్తోంది. షాట్ ఆడేందుకు అవకాశమున్న బంతి. ధావన్ బ్యాట్ లోపలి అంచు తగిలి బంతి వికెట్లను తాకింది. విరాట్ కోహ్లి స్టార్ బ్యాట్స్‌మన్ కోహ్లి కూడా పేస్‌కు అనుకూలిస్తున్న వికెట్‌పై దూసుకొస్తున్న బంతులను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డాడు. లక్మల్ వేసిన 11 ఓవర్ తొలి బంతి ఆఫ్‌స్టంప్ అవతలపడి వికెట్లవైపు దూసుకొచ్చింది. ఈ ఫుల్‌లెంగ్త్ డెలివరీని అంచనా వేయటంలో కోహ్లి విఫలం కాగా, బంతి కోహ్లి ప్యాడ్లను తాకింది. అంపైర్ అవుట్‌గా ప్రకటించటంతో భారత కెప్టెన్ రివ్యూ కోరాడు. రీప్లేలో అవుటైనట్లు తేలింది. లోకేశ్ రాహుల్ ఇన్నింగ్స్ తొలి బంతి. లంక పేసర్ లక్మల్ ఆఫ్‌స్టంప్‌కు అవతల వేసిన బాల్.. అదనపు బౌన్స్‌తో రాహుల్‌పైకి దూసుకొచ్చింది. దీంతో ఆడక తప్పని పరిస్థితుల్లో బంతి రాహుల్ బ్యాట్ అంచును తాకుతూ వికెట్ కీపర్ డిక్వెలా చేతుల్లోకి వెళ్లింది. -
సిరీస్ వైపు భారత్ చూపు
వన్డే సిరీస్‌లో హవా కొనసాగించిన టీమిండియా ఇప్పుడు టి20 సిరీస్‌నూ తమ ఖాతాలో వేసుకునేందుకు సన్నద్ధమైంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా ఆశలు ముగించాలని కోహ్లి సేన పట్టుదలగా ఉంది. భారత బ్యాట్స్‌మెన్, బౌలర్లు అంతా ఫామ్‌లో ఉండటంతో ఇదేమంత కష్టం కూడా కాకపోవచ్చు. మరో వైపు గత మ్యాచ్ వైఫల్యం నుంచి కోలుకునే ప్రయత్నంలో కంగారూలు ఉన్నారు. గువాహటి: పర్యాటక జట్టుపై అన్నింటా ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న భారత జట్టు తాజాగా ఈ టి20 సిరీస్‌పై కూడా కన్నేసింది. చివరి మ్యాచ్ దాకా వెళ్లకుండా సిరీస్ ఫలితాన్ని ఇక్కడే రాబట్టాలనే లక్ష్యంతో ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ జరగనుంది. భారత్ ఫామ్ దృష్ట్యా ఇక్కడే సిరీస్ విజయం దక్కినా ఆశ్చర్యం లేదు. ఓపెనర్ల నుంచి బౌలర్ల వరకు అంతా జోరుమీదున్నారు. ఇక ఆసీస్ మాత్రం ఈ పర్యటన ఆసాంతం అగచాట్లతోనే సతమతమవుతోంది. ఈ మ్యాచ్ ద్వారా భారత క్రికెట్ సిగలో మరో కొత్త స్టేడియం చేరనుంది. అస్సాం క్రికెట్ సంఘం (ఏసీఏ) కొత్తగా నిర్మించిన బర్సపర స్టేడియంలో తొలి అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతోంది. టి20ల్లో ఆసీస్‌పై భారత్‌దే ఘనమైన రికార్డు. ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లు జరిగితే పదింట గెలిచి నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది. వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో ఓటమన్నదే ఎరుగదు. ఆస్ట్రేలియా చేతిలో చివరి సారిగా ఐదేళ్ల క్రితం 2012లో భారత్ ఓడింది. ఈ నేపథ్యంలో తమ అద్భుత రికార్డును కొనసాగించాలని కోహ్లి సేన భావిస్తోంది. జోరు మీదున్న భారత్ అసాధారణ ప్రదర్శనతో దూసుకెళ్తున్న భారత్ టి20 సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు సమష్టిగా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను దెబ్బతీశారు. బుమ్రా, భువనేశ్వర్ పేస్‌తో కట్టడి చేస్తుంటే... మణికట్టు స్పిన్నర్లు చహల్, కుల్దీప్ యాదవ్ ఇద్దరు ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నారు. వన్డే సిరీస్‌తో కలిపి ఈ స్పిన్ ద్వయమే 16 వికెట్లు పడగొట్టింది. ఐపీఎల్ అనుభవం ఉన్న ఆసీస్ ఆటగాళ్లపై కూడా వీళ్లిద్దరు ప్రభావం చూపించడం సానుకూలాంశం. ఇక బ్యాటింగ్‌లో రోహిత్ శర్మకు జతయిన శిఖర్ ధావన్ ఈ సిరీస్‌లో తన సత్తాచాటేందుకు ఈ మ్యాచ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాడు. కెప్టెన్ కోహ్లి సహా మిడిలార్డర్లో ధోని, హార్దిక్ పాండ్యా అంతా ఫామ్‌లో ఉండటంతో భారత్ భారీ స్కోరుకు ఢోకాలేదు. వార్నరే పెద్ద దిక్కు ఆసీస్ బ్యాటింగ్ బలమంతా ముగ్గురిమీదే నడుస్తోంది. వార్నర్, ఫించ్, స్మిత్లనే కంగారూ జట్టు నమ్ముకుంది. అయితే స్మిత్ భుజం గాయం కారణంగా పొట్టి ఫార్మాట్‌కు దూరమయ్యాడు. దీంతో వార్నరే జట్టును, బ్యాటింగ్‌ను నడిపించే బాధ్యత తీసుకున్నాడు. పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్ మ్యాక్స్‌వెల్ వన్డే సిరీస్‌లో చేసింది తక్కువే. తొలి టి20లో కూడా అతను విఫలమయ్యాడు. ఈ టూర్లో అతను ప్రతీసారి మణికట్టు స్పిన్నర్ చహల్ చేతికే చిక్కాడు. అతనిపై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. బౌలింగ్‌లో కూల్టర్ నీల్ ఒక్కడే భారత్‌ను ఇబ్బందిపెడుతున్నాడు. వన్డే సిరీస్‌లో అతను 10 వికెట్లు తీశాడు. ఆల్‌రౌండర్ స్టొయినిస్ కూడా మెరుగైన ఆటతీరు కనబరుస్తున్నాడు. వర్షంతో కుదించుకుపోయిన తొలి టి20లో పెద్దగా ఎవరికీ బౌలింగ్ చేసే అవకాశం లేకపోయింది. జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రోహిత్ శర్మ, మనీశ్ పాండే, ధోని, హార్దిక్ పాండ్యా, కేదార్ జాదవ్, కుల్దీప్ యాదవ్, చహల్, భువనేశ్వర్, జస్ప్రీత్ బుమ్రా. ఆస్ట్రేలియా: వార్నర్ (కెప్టెన్), అరోన్ ఫించ్, ట్రెవిస్ హెడ్, మ్యాక్స్‌వెల్/ హెన్రిక్స్, స్టొయినిస్, క్రిస్టియాన్, టిమ్ పైన్, కూల్టర్ నీల్, జంపా/ ఆండ్రూ టై, రిచర్డ్సన్, బెహ్రెండార్ఫ్. పిచ్–వాతావరణం ఈ వేదికపై ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. పిచ్ స్వభావాన్ని అంచనా వేయలేం. ఇక ఈ మ్యాచ్‌నూ వరుణుడు వెంటాడుతున్నాడు. సోమవారం ఇక్కడ ఓ మోస్తరు వర్షం కురిసింది. నేడు చినుకులు పడే అవకాశముందని స్థానిక వాతావరణ కేంద్రం తెలిపింది. ►1 గువాహటిలో కొత్తగా నిర్మించిన బర్సపర స్టేడియంలో ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. గతంలో ఇక్కడి నెహ్రూ స్టేడియం 16 వన్డేలకు ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో భారత్ 14 గెలవగా, 2 వర్షం కారణంగా రద్దయ్యాయి. ► 38 మరో 38 పరుగులు చేస్తే విరాట్ కోహ్లి అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకుంటాడు. ► రాత్రి గం. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
మళ్లీ అదరగొట్టారు
-
మళ్లీ అదరగొట్టారు
►రెండో వన్డేలో భారత్ 50 పరుగులతో విజయం ►రాణించిన కోహ్లి, రహానే ►కుల్దీప్ యాదవ్ ‘హ్యాట్రిక్’ ►భువనేశ్వర్ 3/9 ►మూడో వన్డే ఆదివారం భారత్ తమదైన శైలిలో మరోసారి సత్తా చాటింది. శ్రీలంకను చిత్తుగా ఓడించి వచ్చినా, ఆస్ట్రేలియాతో అంత సులువు కాదని అంతా భావించారు. అయితే అద్భుతమైన ఆట ముందు ఆసీస్ అయినా ఎవరైనా ఒకటే అని మన జట్టు మళ్లీ రుజువు చేసింది. టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శన ముందు నిలవలేక కంగారూలు మళ్లీ తలవంచారు. భారీ స్కోరు సాధించకపోయినా... తమ బౌలింగ్ వనరులతో చెలరేగిన కోహ్లి సేన ప్రత్యర్థి పని పట్టింది. వరుసగా రెండో విజయంతో సిరీస్‌పై పట్టు బిగించింది. కోహ్లి కీలక ఇన్నింగ్స్... అండగా నిలిచిన రహానే... ఈ ఇద్దరి శతక భాగస్వామ్యం భారత్‌ను నడిపించాయి. చివర్లో ఎలాంటి మెరుపులు లేకున్నా... జట్టు మెరుగైన స్కోరుతో సవాల్ విసిరింది. ఛేదనలో భువనేశ్వర్ కుమార్ దెబ్బకు 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆసీస్ గత మ్యాచ్ వైఫల్యాన్నే కొనసాగించింది. మధ్యలో కుల్దీప్ యాదవ్ ‘హ్యాట్రిక్’ జోరుకు ఆ జట్టు కుదేలైంది. స్మిత్, స్టొయినిస్ అర్ధ సెంచరీలు గెలుపు అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగాయి. కోల్‌కతా: ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌లో భారత్ మళ్లీ పైచేయి సాధించింది. సమష్టి కృషితో టీమిండియా మరో సారి సత్తా చాటింది. గురువారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో భారత్ 50 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లి (107 బంతుల్లో 92; 8 ఫోర్లు) త్రుటిలో సెంచరీ కోల్పోగా, అజింక్య రహానే (64 బంతుల్లో 55; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం ఆస్ట్రేలియా 43.1 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. మార్కస్ స్టొయినిస్ (65 బంతుల్లో 62 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), స్టీవ్ స్మిత్ (76 బంతుల్లో 59; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. భారత చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ‘హ్యాట్రిక్’ సాధించడం విశేషం. 33వ ఓవర్లో వరుస బంతుల్లో వేడ్, అగర్, కమిన్స్‌లను కుల్దీప్ అవుట్ చేశాడు. విరాట్ కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సిరీస్‌లో మూడో వన్డే ఆదివారం ఇండోర్‌లో జరుగుతుంది. సెంచరీ భాగస్వామ్యం... 35 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 185/3. కోహ్లి మరో సెంచరీ దిశగా సాగుతున్నాడు. ఈ దశలో భారత్ 300 పరుగులు చేసేలా కనిపించింది. అయితే తర్వాతి ఐదు ఓవర్ల వ్యవధిలో కోహ్లితో పాటు పాండే, ధోని కూడా అవుట్ కావడంతో భారత్ జోరుకు కళ్లెం పడింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ చివర్లో కూడా భారత్ ఆఖరి 20 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేసి నాలుగు వికెట్లు కోల్పోయి సాధారణ స్కోరుకే పరిమితమైంది. పిచ్‌పై ఉన్న తేమను బాగా ఉపయోగించుకున్న ఆసీస్ పేసర్లు కమిన్స్, కూల్టర్ నీల్ ఆరంభంలో భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. ఆరో ఓవర్లో కూల్టర్‌నీల్‌కు రోహిత్ శర్మ (7) రిటర్న్ క్యాచ్ ఇవ్వడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో రహానే, కోహ్లి కలిసి చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేశారు. జాగ్రత్తగా ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. అయితే రహానే రనౌట్‌తో వీరిద్దరి 102 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. రెండో పరుగు తీసే ప్రయత్నంలో కోహ్లి వేగానికి తగిన విధంగా స్పందించని రహానే వెనుదిరగాల్సి వచ్చింది. అప్పటి వరకు కోల్‌కతా వేడిలో చెమటలు చిందిస్తూ ఇబ్బంది పడిన ఆసీస్‌కు ఈ వికెట్ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇదే జోరులో తక్కువ వ్యవధిలో పాండే (3), ధోని (5), కోహ్లిలను అవుట్ చేసి ఆ జట్టు పట్టు బిగించింది. ఒక దశలో తాను ఆడిన వరుస బంతుల్లో 4, 4, 6 కొట్టి దూకుడు ప్రదర్శించిన కేదార్ జాదవ్ (24 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా ఆ వెంటనే పెవిలియన్ చేరాడు. పాండ్యా (20), భువనేశ్వర్ (20) కలిసి ఏడో వికెట్‌కు 35 పరుగులు జత చేయడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. సొంతగడ్డపై ముందుగా బ్యాటింగ్ చేస్తూ భారత్ ఆలౌట్ కావడం 2013 జనవరి (పాక్‌పై) తర్వాత ఇదే తొలిసారి. స్మిత్ మినహా... సాధారణ విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మరోసారి తడబాటుకు లోనైంది. భువనేశ్వర్ అద్భుత బౌలింగ్ ముందు ఆసీస్ ఓపెనర్లు పరుగు తీయడమే గగనంగా మారింది. భువీ జోరుకు ముందుగా కార్ట్‌రైట్ (15 బంతుల్లో 1), ఆ తర్వాత వార్నర్ (9 బంతుల్లో 1) తక్కువ వ్యవధిలో వెనుదిరిగారు. అనంతరం స్మిత్, హెడ్ (39 బంతుల్లో 39; 5 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. 15 పరుగుల వద్ద హెడ్ ఇచ్చిన క్యాచ్‌ను రోహిత్ వదిలేయగా... వీరిద్దరు క్రీజ్‌లో ఉన్నంత సేపు చకచకా పరుగులు సాధించి భారత్‌పై ఒత్తిడి పెంచారు. ఈ జంట మూడో వికెట్‌కు 73 బంతుల్లోనే 76 పరుగులు జత చేసిన అనంతరం చహల్ ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత కుల్దీప్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాది జోరు ప్రదర్శించిన మ్యాక్స్‌వెల్ (14) ఎక్కువ సేపు నిలవలేదు. చహల్ చక్కటి బంతికి ధోని మెరుపు స్టంపింగ్ తోడై మ్యాక్సీ పెవిలియన్ చేరాడు. మరో ఎండ్‌లో 65 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న స్మిత్... పాండ్యా ఉచ్చులో చిక్కాడు. బౌన్సర్‌ను పుల్ షాట్ ఆడబోయి జడేజాకు క్యాచ్ ఇవ్వడంతో ఆసీస్ మ్యాచ్‌పై ఆశలు కోల్పోయింది. చివర్లో స్టొయినిస్ పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ►భారత్ తరఫున వన్డేల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన మూడో బౌలర్ కుల్దీప్ యాదవ్. గతంలో చేతన్ శర్మ (న్యూజిలాండ్‌పై), కపిల్‌దేవ్ (శ్రీలంకపై) ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్లో కుల్దీప్‌కిది రెండో హ్యాట్రిక్. 2014లో జరిగిన అండర్–19 వరల్డ్ కప్‌లో స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లోనూ కుల్దీప్ ‘హ్యాట్రిక్’ సాధించాడు. ► 1 ఆస్ట్రేలియాపై రెండో వన్డేలో విజయం సాధించిన భారత్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, భారత్ 119 రేటింగ్ పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. -
‘ఫుట్సల్ లీగ్’తో కోహ్లి కటీఫ్
ఫుట్‌బాల్ ప్రీమియర్ ఫుట్సల్ లీగ్‌కు గత ఏడాది బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి దాని నుంచి తప్పుకున్నాడు. ఈ లీగ్‌కు అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) గుర్తింపు లేకపోగా... గుర్తింపు పొందిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ఒక జట్టుకు యజమాని అయిన కోహ్లి మరో ప్రైవేట్ లీగ్‌తో జత కట్టడాన్ని ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ ప్రశ్నించారు. కోహ్లి దూరం కావడంతో ఇకపై అతని ఫొటోలు, వీడియోలు తమ లీగ్ ప్రచారంలో ఉపయోగించబోమని ఫుట్సల్ ప్రతినిధులు స్పష్టం చేశారు. -
బలనిరూపణకు సిద్ధం!
∙ సొంతగడ్డపై వన్డేల్లో ఆస్ట్రేలియాతో పోరు ∙ పూర్తి స్థాయి జట్టుతో భారత్ ∙ ప్రపంచ చాంపియన్‌తో సవాల్ సరిగ్గా ఏడాది క్రితం భారత జట్టు ఇదే సమయంలో సొంతగడ్డపై వరుసగా టెస్టు మ్యాచ్‌లతో బిజీగా ఉంది. ప్రత్యర్థులు మారినా మన పట్టు మాత్రం ఎక్కడా చేజారకుండా 12 టెస్టుల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఇప్పుడు ఈ సీజన్లో పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు టీమిండియాను ముంచెత్తనున్నాయి. 2017 ముగిసేలోగా భారత్ వన్డేలు, టి20లు కలిపి 20 మ్యాచ్‌లు ఆడనుంది. 2019 ప్రపంచ కప్‌నకు ముందు సాధ్యమైనన్ని ఎక్కువ అవకాశాలు ఆటగాళ్లకు కల్పిస్తామని చెబుతున్న నేపథ్యంలో బలాబలాల పరీక్షకు విజిల్ మోగినట్లే. శ్రీలంకపై వన్డేలు, టి20ల్లో కూడా క్లీన్ స్వీప్... అయితే ప్రస్తుతం లంక జట్టు పరిస్థితిని చూస్తే భారత్ విజయానికి పెద్దగా విలువ లేకుండా పోయింది. ఆ సిరీస్‌కు వచ్చిన స్పందన కూడా అంతంత మాత్రమే. ఇప్పుడు మరోసారి గట్టి ప్రత్యర్థితో పోరు, హోరాహోరీ మ్యాచ్‌లతో మన రిజర్వ్ ఆటగాళ్ల అసలు బలమేమిటో తెలుస్తుంది. ఆస్ట్రేలియా రూపంలో ఆ సవాల్‌తో మన పరీక్ష మొదలు కానుంది. కొన్నాళ్ల క్రితం న్యూజిలాండ్, ఇంగ్లండ్ కూడా వన్డేల్లో మనకు పోటీనిచ్చాయి. ఆ కోణంలో చూస్తే ప్రపంచ చాంపియన్ ఆసీస్‌ను ఎదుర్కోవడం అంత సులువు కాదు. సాక్షి క్రీడా విభాగం : భారత్‌లో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా ఏడు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడితే అందులో భారత్ మూడు గెలిచి, నాలుగు ఓడింది. ఆఖరిసారిగా నాలుగేళ్ల క్రితం 2013లో జరిగిన సిరీస్‌లో అయితే పరుగుల వరద పారింది. అనేక రికార్డులు నమోదై భారత్ 3–2తో గెలిచిన ఆ సిరీస్‌లో ఆస్ట్రేలియా కూడా దీటుగా ఆడింది. ఏ రకంగా చూసినా ఆసీస్‌ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా ఎంపిక చేసిన 14 మందిలో ముగ్గురు మినహా అందరికీ రెగ్యులర్‌గా ఐపీఎల్లో ఆడుతున్న అనుభవం, ఇక్కడి పరిస్థితులపై అంచనా ఉన్నాయి. భారత్‌లో ఇటీవల ఆడి ఓడిన టెస్టు జట్టు బలహీనంగా కనిపించినా... వన్డే ఆటగాళ్లకు మాత్రం టీమిండియాను చక్కగా ఎదుర్కోగల సామర్థ్యం ఉంది. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా రెండో, భారత్ మూడో ర్యాంక్‌లో ఉన్నాయి. ఈ సిరీస్‌ను కోహ్లి సేన 4–1తో గెలుచుకుంటే నంబర్‌వన్ ర్యాంక్ జట్టు సొంతమవుతుంది. కుర్రాళ్లు నిరూపించుకోవాలి... శ్రీలంకతో వన్డే సిరీస్‌లో స్పిన్నర్లు అక్షర్ పటేల్, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్ ఆకట్టుకునే ప్రదర్శన కనబర్చారు. ఇప్పుడు ఈ ముగ్గురినీ ఆస్ట్రేలియాలాంటి జట్టుపై సత్తా చాటేందుకు సరైన అవకాశంగా చెప్పవచ్చు. స్పిన్‌ను సమర్థంగా ఆడగల స్మిత్, వార్నర్‌లను వీరు కట్టడి చేయగలిగితే భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించినవారవుతారు. విశ్రాంతి కావచ్చు లేదా వేటు కావచ్చు... కారణమేదైనా భారత ప్రధాన స్పిన్నర్లు అశ్విన్, జడేజాలు జట్టుకు దూరం కావడంతో కుర్ర స్పిన్నర్లు తమదైన ముద్ర చూపించవచ్చు. టెస్టుల్లో అద్భుతమైన విజయాలు అందించినా... పరిమిత ఓవర్లలో అశ్విన్, జడేజాలను దాటి కెప్టెన్ కోహ్లి ఆలోచిస్తున్నట్లు అర్థమవుతోంది. వేర్వేరు శైలి గల ఈ ముగ్గురు స్పిన్నర్లను మరింత రాటుదేల్చే ప్రయత్నంలో అతను ఉన్నాడు. అవసరమైతే కేదార్ జాదవ్‌తో ఆఫ్ స్పిన్ వేయించుకోవచ్చు కాబట్టి స్పెషలిస్ట్ ఆఫ్ స్పిన్నర్ జట్టులో కనిపించడం లేదు. అయితే ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో బ్యాటింగ్‌లో చెలరేగిన జాదవ్... శ్రీలంకతో నాలుగో వన్డే మినహా వరుసగా విఫలమయ్యాడు. మున్ముందు జట్టులో కొనసాగాలంటే అతను కూడా రాణించడం అవసరం. నాలుగో స్థానానికి ఇక మనీశ్ పాండే ఖరారైనట్లే. హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు ఆస్ట్రేలియాపై వన్డే ఆడలేదు. వారిద్దరికీ ఇది చక్కటి అవకాశం. ఇక ఆసీస్‌ను అనేక సార్లు ఆడుకున్న సీనియర్లు రోహిత్, ధావన్, కోహ్లి, ధోనిల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారత వన్డే జట్టులో రహానే పాత్ర ఏమిటో కూడా ఈ సిరీస్‌లో తేలిపోవచ్చు. బౌలింగ్ బలహీనం... వార్నర్, స్మిత్, ఫించ్, మ్యాక్స్‌వెల్... వన్డేల్లో విధ్వంసం సృష్టించేందుకు ఈ పేర్లు సరిపోతాయి. వీరికి స్టొయినిస్, హెడ్‌లాంటి కుర్రాళ్లు తోడయితే ఆస్ట్రేలియా బ్యాటింగ్ బలం అమాంతం పెరిగిపోతుంది. ఈ సిరీస్‌లో ఆసీస్ బలం ప్రధానంగా బ్యాటింగ్‌పైనే ఆధార పడి ఉంది. బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అది కనిపించింది కూడా. ఈ ఏడాది ఆరంభంలో ఎరుపు బంతిని ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డ వార్నర్, మ్యాక్స్‌వెల్ వన్డేల్లో మాత్రం వేదిక ఏదైనా స్టార్లే. అన్ని ఫార్మాట్లలో స్మిత్ నిలకడ ఆ జట్టును నిలబెడుతోంది. బౌలింగ్‌తో ఆ జట్టు ఏమాత్రం ప్రభావం చూపిస్తుందనేదే సందేహం. ఐపీఎల్లో ఆకట్టుకున్న కమిన్స్, కూల్టర్ నీల్లే ఆసీస్ బలం కాగా...హాజల్‌వుడ్ భారత్‌లో ఎప్పుడూ వన్డేల్లో బౌలింగ్ చేయలేదు. ఐపీఎల్లో ఆకట్టుకున్న లెగ్‌స్పిన్నర్ ఆడమ్ జంపాపై ఆసీస్ ఆశలు పెట్టుకుంది. స్పిన్నర్ అగర్ అయితే కెరీర్లో ఆడిందే 2 వన్డేలు! భారత్ దుర్భేద్యమైన బ్యాటింగ్‌కు అడ్డుకునేందుకు ఇది సరిపోకపోవచ్చు. అయితే పోటీతత్వంలో, ప్రొఫెషనలిజంలో మేటి, ఢీ అంటే ఢీ అంటూ తలపడే ఆసీస్‌ను చిత్తు చేయగలిగితే మన జట్టుకు తిరుగుండదు. 2013లో ఇక్కడ భారత్, ఆస్ట్రేలియా సిరీస్ హోరాహోరీగా సాగేందుకు నాటి ఆసీస్ బౌలింగ్ బలగం కూడా కారణం. కానీ ఈ సారి అది కనిపించడం లేదు. వారి బ్యాటింగ్ చాలా బాగున్నా... భారత్‌ను నిలువరించే స్థాయిలో బౌలింగ్ కనిపించడం లేదు. స్పిన్నర్లకు ఏమాత్రం అనుభవం లేదు. భారత్ 4–1తో గెలుస్తుందని నా అంచనా. శ్రీలంకపై సిరీస్‌లో రాణించినా...ఆస్ట్రేలియాలాంటి ప్రత్యర్థితో ఆడితేనే అసలు సత్తా తెలుస్తుంది కాబట్టి భారత స్పిన్నర్లకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నా. ఈ సిరీస్‌లో ఆకట్టుకునే ఆటగాళ్లకు మంచి భవిష్యత్తు ఉంటుంది. –వీవీఎస్ లక్ష్మణ్, భారత మాజీ ఆటగాడు -
శ్రీలంక గడ్డపై భారత్ సంపూర్ణ విజయం
-
శ్రీలంక గడ్డపై భారత్ సంపూర్ణ విజయం
►ఏకైక టి20లో 7 వికెట్లతో ఘన విజయం ►గెలిపించిన కోహ్లి, మనీశ్ పాండే ►ఆతిథ్య జట్టుకు శూన్యహస్తం మూడు ఫార్మాట్లు... ఆటగాళ్లు మారారు... వేదికలు మారాయి... కానీ ఫలితం మాత్రం మారనే లేదు. శ్రీలంక గడ్డపై భారత జట్టు దిగ్విజయ యాత్ర పూర్తయింది. ఆడిన తొమ్మిది అంతర్జాతీయ మ్యాచ్‌లలోనూ అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమిండియా సంపూర్ణ విజయాన్ని సాధించింది. తిరుగులేని ఆటతో ప్రత్యర్థిని చెడుగుడు ఆడుకున్న టీమిండియా సగర్వంగా పర్యటన ముగించింది. సొంతగడ్డపై కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేని అశక్తతతో, అవమాన భారంతో ఆతిథ్య శ్రీలంక ఖాతాలో అతి పెద్ద శూన్యం చేరింది. 171 పరుగుల విజయలక్ష్యం... 42 పరుగులకు 2 వికెట్లు పడ్డాయి. అయితే ఎప్పటిలాగే తనదైన శైలిలో వేటగాడు విరాట్ కోహ్లి ఆడుతూ పాడుతూ ఫినిషింగ్ లైన్ దిశగా జట్టును నడిపించాడు. అతనికి మనీశ్ పాండే అండగా నిలవడంతో భారత్ ఏ దశలోనూ ఆందోళన చెందాల్సిన అవసరమే రాలేదు. మూడో వికెట్‌కు వీరిద్దరు 119 పరుగులు జోడించడంతో జట్టుకు సునాయాస గెలుపు దక్కింది. 48 రోజుల లంక టూర్ అమితానందంతో ముగిసింది. ముఖ్యంగా ఈ పర్యటన మాజీ కెప్టెన్ ధోనికి తీపి జ్ఞాపకాలు మిగిల్చింది. ఈ సిరీస్ మొత్తంలో ధోని ఒక్కసారి కూడా అవుట్ కాకపోవడం విశేషం. కొలంబో: విరాట్ కోహ్లి నాయకత్వంలోని భారత జట్టు శ్రీలంక పర్యటనను చిరస్మరణీయంగా మార్చుకుంది. టెస్టు, వన్డే సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేసిన జట్టు పొట్టి క్రికెట్లోనూ తమ పదును చూపించింది. బుధవారం ఇక్కడ జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంక 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. దిల్షాన్ మునవీరా (29 బంతుల్లో 53; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, అషాన్ ప్రియాంజన్ (40 బంతుల్లో 40 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించాడు. చహల్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 19.2 ఓవర్లలో 3 వికెట్లకు 174 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ విరాట్ కోహ్లి (54 బంతుల్లో 82; 7 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగిపోగా... మనీశ్ పాండే (36 బంతుల్లో 51 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో అతనికి సహకరించాడు. తాజా విజయంతో మూడు ఫార్మాట్లలో కలిపి భారత్ 9–0 తేడాతో లంకను ఓడించినట్లయింది. మునవీరా జోరు... తొలి 10 ఓవర్లలో 90 పరుగులు...తర్వాతి 8 ఓవర్లలో 54 పరుగులు...చివరి 2 ఓవర్లలో 26 పరుగులు... సంక్షిప్తంగా శ్రీలంక ఇన్నింగ్స్ సాగిన తీరు ఇది. భారత్‌తో రెండు వన్డేల్లో విఫలమైన మునవీరా టి20లో సత్తా చాటగా... ఈ మ్యాచ్‌తో టి20ల్లో అరంగేట్రం చేసిన ప్రియాంజన్ లంక ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించాడు. బుమ్రా వేసిన రెండో ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టి శుభారంభం అందించిన డిక్వెలా (17) చివరకు అతని బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. అంతకుముందు భువనేశ్వర్ ఓవర్లో తరంగ (5) కూడా క్లీన్‌బౌల్డయ్యాడు. మరోవైపు మునవీరా తన ధాటిని ప్రదర్శించాడు. చహల్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన అతను, అక్షర్ ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టాడు. ధోని అద్భుత స్టంపింగ్‌తో మాథ్యూస్ (7)ను వెనక్కి పంపించగా, చహల్ మరో ఓవర్లో మునవీరా 2 సిక్సర్లు, ఫోర్‌తో పండగ చేసుకున్నాడు. 26 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయింది. చివరకు కుల్దీప్, మునవీరా ఇన్నింగ్స్‌ను ముగించాడు. ఆ తర్వాత చహల్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. మధ్య ఓవర్లలో భారత స్పిన్నర్లు కట్టి పడేయడంతో లంక పరుగులు చేయడంలో ఇబ్బంది పడింది. అయితే చివరి 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు రాబట్టిన ఆ జట్టు మెరుగైన స్కోరు సాధించగలిగింది. అదే జోరు... లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఆరంభంలోనే రోహిత్ (9) వికెట్ కోల్పోయింది. రాహుల్ (18 బంతుల్లో 24; 3 ఫోర్లు) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. అయితే కోహ్లి, పాండే భాగస్వామ్యం భారత్‌ను విజయం వైపు నడిపించింది. శ్రీలంక బౌలింగ్, చురుకైన ఫీల్డింగ్‌కు మొదట్లో పరుగులు తీయడంలో వీరిద్దరు కాస్త ఇబ్బంది పడ్డారు. కొన్ని ఉత్కంఠ క్షణాలు కూడా ఎదుర్కొన్నారు. ఫలితంగా పవర్‌ప్లేలో స్కోరు 43 పరుగులకే పరిమితమైంది. అయితే ఒక్కసారి నిలదొక్కుకున్న తర్వాత ఈ జంట సాధికారికంగా ఆడింది. ముఖ్యంగా కోహ్లి ఏ బౌలర్‌నూ వదల్లేదు. పెరీరా ఓవర్లో మూడు ఫోర్లతో 15 పరుగులు రాబట్టిన భారత్... మాథ్యూస్ వేసిన ఓవర్లో మరో 17 పరుగులు సాధించింది. శ్రీలంక బౌలర్లు నియంత్రణ తప్పడంతో టీమిండియాకు సునాయాసంగా పరుగులు లభించాయి. ఈ క్రమంలో 30 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గెలుపునకు చేరువైన దశలో కోహ్లి వెనుదిరిగినా... పాండే మిగతా పనిని పూర్తి చేశాడు. -
అది శక్తికి మించిన పని
‘సచిన్ సెంచరీల’ రికార్డుపై కోహ్లి కొలంబో: వన్డే క్రికెట్లో విఖ్యాత బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన అత్యధిక సెంచరీల (49) రికార్డును అధిగమించడం అత్యంత కష్టమైన పని అని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. 30వ సెంచరీతో రికీ పాంటింగ్ (ఆసీస్) రికార్డును సమం చేసిన ఈ భారత స్టార్ మాట్లాడుతూ ‘గ్రేట్ మ్యాన్ (సచిన్) రికార్డు అయ్యే పని కాదు. దాని కోసం శక్తికి మించి శ్రమించాలి. అందుకే దానిపై ఆలోచించడం లేదు. టీమ్ గెలిచేందుకు నేను అజేయంగా 90 పరుగులు చేసినా అదే అమూల్యమైందిగా భావిస్తాను’ అని అన్నాడు. 2019 ప్రపంచకప్‌పై: మెగా ఈవెంట్‌కు 20–25 మంది ప్లేయర్లను సన్నద్ధం చేస్తామని కోహ్లి అన్నాడు. వీరందరికీ ప్రపంచకప్ బరిలోకి దిగే సత్తా ఉండేలా తీర్చిదిద్దుతామన్నాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో కీలకమైన సిరీస్‌ల్లో కుర్రాళ్లకు అవకాశమిస్తామని... సుదీర్ఘమైన ఈ ప్రక్రియలో పారదర్శకతతో ఆటగాళ్లను ఎంపిక చేస్తామని చెప్పాడు. తద్వారా అత్యుత్తమ తుది జట్టు ప్రపంచకప్ ఆడుతుందన్నాడు. అత్యధిక రేటింగ్ పాయింట్లతో.... దుబాయ్: ఐసీసీ వన్డే క్రికెటర్ల ర్యాంకింగ్స్‌లో రెండు దశాబ్దాల క్రితం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డును స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి సమం చేశాడు. తాజా ర్యాంకింగ్స్‌లో కోహ్లి నంబర్‌వన్ ర్యాంక్‌ను మరింత పటిష్టం చేసుకుంటూ అత్యధికంగా 887 పాయింట్లు సాధించాడు. దీంతో భారత క్రికెటర్లలో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ఆటగాడిగా సచిన్ సరసన నిలిచాడు. 1998లో సచిన్ ఈ ఫీట్ సాధించి నంబర్‌వన్‌గా నిలిచాడు. -
విజయంతో ముగిస్తే...
టెస్టు, వన్డే సిరీస్‌లను భారత్ క్లీన్‌స్వీప్ చేయడంతో మిగిలిన ఏకైక టి20లోనూ సహజంగా టీమిండియానే ఫేవరెట్. ఇందులోనూ గెలిస్తే భారత్‌కు ఈ పర్యటన చిరస్మరణీయంగా నిలుస్తుంది. ఏ రకంగా చూసినా శ్రీలంక కంటే భారతే అత్యంత పటిష్టంగా ఉంది. దీనికి కొలమానం చెప్పాలంటే అడుగు కాదు ఏకంగా ఓ మైలు దూరమంత మెరుగైన స్థితిలో ఉంది భారత్. లంక మేటి జట్టునే బరిలోకి దించినా కోహ్లి సేనను ఓడించడం అంత ఆషామాషీ కాదు. గాయాలు, నిషేధాలు (తరంగ) చాలవన్నట్లు కెప్టెన్ల మార్పు లంక కొంపముంచింది. ఇలాంటి అనిశ్చితి వల్ల డ్రెస్సింగ్ రూమ్‌లో జవాబుదారీతనం ఉండదు. ఆటగాళ్ల ఆత్మస్థైర్యం, విశ్వాసం సన్నగిల్లుతాయి. వెన్నుతట్టి ప్రోత్సహించే సమర్థ నాయకుడు లేక మైదానంలో ఒత్తిడి పెరుగుతుంది. మొత్తానికి ఈ క్లీన్‌స్వీప్ విజయాల క్రెడిట్ అంతా భారత ఆటగాళ్లదే. వాళ్లు ఏ దశలోనూ పట్టు సడలించలేదు. లంకను ఓడించేందుకు అన్ని రకాల ప్రయోగాల్లో సఫలమయ్యారు. అయితే 50 ఓవర్ల మ్యాచ్ కంటే టి20 చాలా భిన్నమైంది. కొన్ని అద్భుతమైన డెలివరీలు చాలు మ్యాచ్ చేజారడానికి... చేజిక్కించుకోడానికి! ఇక్కడ ఏదైనా వేగంగానే జరుగుతుంది. పుంజుకోవడానికి ఆస్కారమూ తక్కువే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏకైక టి20 మ్యాచ్ ఎవరిదైనా కావొచ్చు. అయితే లంక నుంచి భారత్‌కు కొత్తగా వచ్చే ఆశ్చర్యకర ఉత్పాతలేవీ లేవనే అనుకుంటున్నా. రెండో వన్డేలో ధనంజయ మ్యాజిక్‌ను తట్టుకుని కూడా భారత్ గెలిచింది. ఆటగాళ్ల ఫామ్ అసాధారణంగా ఉంది. కోహ్లి, రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో దంచేస్తున్నారు. మిగతావారు సహాయక పాత్రను సమర్థంగా నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందు బ్యాటింగ్ చేసినా... తర్వాత ఛేజింగ్‌కు దిగినా ఎలాంటి సమస్య ఉండబోదు. బౌలింగ్‌లో భువనేశ్వర్ లంకేయుల్ని కట్టడి చేసిన తీరు... స్పిన్నర్లు ఆక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లు తిప్పేసిన వైనం బాగుంది. దీంతో టెస్టులు, వన్డేల కంటే మరింత రాటుదేలిన బృందంతో టీమిండియా టి20ని ఆడబోతుంది . - సునీల్ గావస్కర్ -
లంకపై భారత్ క్లీన్‌స్వీప్
-
లంకపై భారత్ క్లీన్‌స్వీప్
♦ సెంచరీ సాధించిన కోహ్లి ♦ అర్ధ సెంచరీతో మెరిసిన జాదవ్ కొలంబో: శ్రీలంకతో జరిగిన చివరి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీ, కేదార్‌జాదవ్ అర్ధసెంచరీతో రాణించడంతో చివరి మ్యాచ్‌లో సైతం భారత్ సునాయసంగా గెలుపొందింది. లంక నిర్ధేశించిన 239 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. రాక రాక వచ్చిన అవకాశాన్ని రహానే(5) సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రోహిత్ శర్మ(16) కూడా త్వరగా అవుటవ్వడంతో క్రీజులో ఉన్న కోహ్లి, పాండేతో ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 99 పరుగులు జోడించిననంతరం పాండే అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కేదార్ జాదవ్ ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో కోహ్లికి అండగా నిలిచాడు. ఈ దశలో 107 బంతుల్లో 8 ఫోర్లతో కెరీర్లో 30 వ సెంచరీ సాధించిన కోహ్లి వన్డేల్లోఅత్యధికంగా సెంచరీలు సాధించిన రెండో బ్యాట్స్‌మన్ పాటింగ్(30) సరసన చేరాడు. ఇక రెండు పరుగుల విజయ దూరంలో ఉండగా జాదవ్ అవుటవ్వడంతో ధోని క్రీజులోకి వచ్చాడు. చెరో సింగిల్‌తో మ్యాచ్ భారత్ వశమైంది. ఇక లంక బౌలర్లలో మలింగ, పుష్పకుమార, డిసిల్వా, ఫెర్నాండోలు తలో వికెట్ తీశారు. భువీ విజృంభణ.. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లంకపై భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ విజృంభించాడు. పదునైన బంతులతో చెలరేగి పోయిన భువీ ఐదు వికెట్లతో లంక పతనాన్ని శాసించాడు. భువనేశ్వర్ దెబ్బకు లంక 49.4 ఓవర్లలో 238 పరుగులకు కుప్పకూలింది. భువీకి జతగా బూమ్రా రెండు వికెట్లతో మెరవడంతో లంక సాధారణ స్కోరుకే పరిమితమైంది. స్పిన్నర్లు కుల్దీప్, చాహల్ కు తలో వికెట్ దక్కింది. -
దంచి కొట్టారు
►సెంచరీలతో చెలరేగిన కోహ్లి, రోహిత్ ►నాలుగో వన్డేలో 168 పరుగులతో భారత్ విజయం నాలుగో వన్డేలో భారత్ మరింత నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడింది. ఓపెనర్ రోహిత్ శర్మ వరుసగా రెండో శతకంతో చెలరేగగా కెప్టెన్ విరాట్ కోహ్లి తన క్లాస్ ఇన్నింగ్స్‌తో అలరించి సిరీస్‌లో తొలిసెంచరీతో అదరగొట్టాడు. దాదాపు 28 ఓవర్ల వరకు సాగిన వీరి విధ్వంసంతో స్టేడియం పరుగుల వర్షంతో తడిసి ముద్దయ్యింది. ఆ తర్వాత భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు.. ప్రారంభం నుంచే ఎలాంటి ఆశలు లేకుండా ఆడటంతో భారత్ సునాయాసంగా మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. కొలంబో: సిరీసే పోయింది.. ఇక ఆడి ఏం లాభం అనుకున్నారేమో లంక ఆటగాళ్లు.. గురువారం జరిగిన నాలుగో వన్డేలో మరింత చెత్తగా ఓడారు. కోహ్లి (96 బంతుల్లో 131; 17 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ (88 బంతుల్లో 104; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకాల మోత మోగించడంతో లంక ముందు కొండంత లక్ష్యం ఏర్పడింది. అయితే కనీస పోరాటమే లేకుండా ఆతిథ్య జట్టు తోకముడిచింది. ఫలితంగా భారత్ 168 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ప్రేమదాస స్టేడియంలో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 375 పరుగుల భారీ స్కోరు సాధించింది. మనీష్ పాండే (42 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా, 300వ వన్డే ఆడిన ఎంఎస్ ధోని (42 బంతుల్లో 49 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) తన ఫామ్‌ను కొనసాగించాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 42.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటయ్యింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా కోహ్లి నిలిచాడు. విరాట్, రోహిత్ పరుగుల మోత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ రెండో ఓవర్లో ధావన్ (4) వికెట్‌ను కోల్పోయింది. అయితే ఆ తర్వాత రోహిత్, కోహ్లి వీరవిహారంతో లంక ఆటగాళ్లు చేష్టలుడిగిపోయారు. నాలుగో ఓవర్లో కోహ్లి వరుసగా మూడు ఫోర్లతో తన ప్రతాపం చూపెట్టాడు. ఆ తర్వాత కూడా తన వేగం కొనసాగడంతో 38 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. అటు రోహిత్ కూడా 14వ ఓవర్లో వరుసగా 4, 6 బాదడంతో జట్టు స్కోరు వంద పరుగులు దాటింది. అంతేకాకుండా లంక బౌలర్లపై యథేచ్చగా విరుచుకుపడిన కోహ్లి 76 బంతుల్లో ఓ ఫోర్‌తో సెంచరీని అందుకున్నాడు. 26 ఓవర్లలోనే జట్టు స్కోరు 200కు చేరింది. ఆ తర్వాత మరింత దూకుడు పెంచిన తను 26వ ఓవర్లో సిక్స్, ఫోర్ బాదినా 30వ ఓవర్లో మలింగ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అయితే అప్పటికే రెండో వికెట్‌కు 219 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదైంది. మరో వైపు రోహిత్ 34వ ఓవర్లో ఫోర్‌తో కెరీర్లో 13వ శతకం అందుకున్నాడు. అయితే ఆ మరుసటి ఓవర్లోనే మాథ్యూస్ వరుస బంతుల్లో పాండ్యా (19), రోహిత్‌లను పెవిలియన్‌కు పంపాడు. రాహుల్ (7) మరోసారి విఫలం కాగా ఇక చివరి 10 ఓవర్లలో మనీష్ పాండే, ధోని జోడి లంక బౌలర్లను ఆటాడుకుంది. ముఖ్యంగా తనకు వచ్చిన అవకాశాన్ని పాండే చక్కగా వినియోగించుకుని ఇన్నింగ్స్ చివరి బంతికి అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. అటు ధోని ఎప్పటిలాగే తన సూపర్ బ్యాటింగ్‌తో అలరించగా ఆరో వికెట్‌కు అజేయంగా 101 పరుగులు వచ్చాయి. ఇందులో ఆఖరి ఏడు ఓవర్లలోనే 70 పరుగులు చేరాయి. శ్రీలంక ఎప్పటిలాగే.. ఈ సిరీస్‌లో 200 పరుగులు దాటడానికే ఆపసోపాలు పడుతున్న శ్రీలంక.. ఇక 376 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగితే ఎలా ఉంటుంది? శార్దుల్ వేసిన మూడో ఓవర్లో డిక్వెల్లా వికెట్‌ను భారత్ రివ్యూ ద్వారా సాధించింది. ఆ తర్వాత కూడా లంక ఆటతీరులో మార్పు లేకపోవడంతో 68 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. మాథ్యూస్ ఒక్కడే తన స్థాయికి తగ్గట్టుగా ఆడాడు. తనకు సిరివర్ధన కొద్దిసేపు సహకారం అందించాడు. వీరిద్దరూ కుదురుకుంటున్న దశలో సిరివర్ధనను పాండ్యా అవుట్ చేయడంతో ఐదో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం 38వ ఓవర్లో మాథ్యూస్‌ను అక్షర్ అవుట్ చేయడంతో లంక ఆశలు వదిలేసుకుంది. ఎప్పటికీ నువ్వే మా కెప్టెన్! కెరీర్లో 300వ వన్డే ఆడిన ధోనిని జట్టు సహచరులు అభినందనలతో ముంచెత్తారు. మ్యాచ్‌కు ముందు టీమ్ తరఫున ఒక ప్రత్యేక జ్ఞాపికను ధోనికి అందజేశారు. ఈ సందర్భంగా కోహ్లి ‘ఈ క్షణం గురించి ఏమని మాట్లాడను. మనలో 90 శాతం మంది అతని నాయకత్వంలోనే జట్టులోకి వచ్చారు. అలాంటి వ్యక్తికి చిరు జ్ఞాపిక అందించడం కూడా గౌరవంగా భావిస్తున్నాం. మా అందరికి ఎప్పటికీ నువ్వే కెప్టెన్‌వి’ అని వ్యాఖ్యానించాడు. సచిన్ ‘10’ రిటైర్ కాలేదా! జెర్సీ నంబర్ 10... క్రికెట్ ప్రపంచంలో ఈ అంకె గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. భారత దిగ్గజం సచిన్ ‘టెన్’డుల్కర్ కెరీర్ ఆసాంతం వాడిన ఈ నంబర్ అతనికి పర్యాయపదంగా మారిపోయింది. సచిన్ రిటైర్ అయిన సమయంలో గౌరవపూర్వకంగా తాము 10 నంబర్‌కు కూడా రిటైర్మెంట్ ఇస్తున్నామని... భవిష్యత్తులో ఏ భారత క్రికెటర్ కూడా ఆ అంకెతో జెర్సీ ధరించడని బీసీసీఐ ఘనంగా ప్రకటించింది. అయితే గురువారం ఆశ్చర్యకరంగా అది మరోసారి మైదానంలో కనిపించింది. తొలి అంతర్జాతీయ మ్యాచ్ బరిలోకి దిగిన పేసర్ శార్దుల్ ఠాకూర్ 10 నంబర్ జెర్సీతో ఆడటం అందరినీ ఆశ్చర్యపరచింది. బీసీసీఐ తన మాటను నిలబెట్టుకోవడంలో విఫలమైందని సచిన్ అభిమానులుతీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. భారత్ తరఫున వన్డేలు ఆడిన 218వ క్రికెటర్‌గా శార్దుల్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ►29 వన్డేల్లో కోహ్లి సెంచరీల సంఖ్య. సచిన్ (49), పాంటింగ్ (30) తనకన్నా ముందున్నారు. ►300 వన్డేల్లో మలింగ వికెట్ల సంఖ్య. ఓవరాల్‌గా 11వ బౌలర్ ►73 అత్యధిక సార్లు నాటౌట్ (73)గా నిలిచిన ఆటగాడిగా ధోని రికార్డు -
ప్రయోగాల సమయం
∙ తుది జట్టులో మార్పులకు భారత్ సిద్ధం ∙ నేడు శ్రీలంకతో నాలుగో వన్డే ∙ ఆతిథ్య జట్టుకు విజయం దక్కేనా! టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్... వన్డే సిరీస్ ఇప్పటికే సొంతం... శ్రీలంక గడ్డపై అడుగు పెట్టిన నాటినుంచి ఎదురు లేకుండా సాగుతున్న భారత క్రికెట్ జట్టు ఆడుతూ పాడుతూ విజయాలు అందుకుంటోంది. ఇప్పుడు ఇదే జోరులో మరో మ్యాచ్ కోసం కోహ్లి సేన సన్నద్ధమైంది. దాంతో పాటు ఇప్పటి వరకు అవకాశం దక్కని ఆటగాళ్లను పరీక్షించేందుకు కూడా ఈ మ్యాచ్‌ను ఉపయోగించుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే లక్ష్యం మాత్రం మరో గెలుపే.వరుసగా మూడు వన్డేల్లో ఓటమి, ఆటగాళ్ల సమష్టి వైఫల్యం, ఇప్పటికే ఇద్దరు కెప్టెన్లు మారారు... సెలక్టర్ల రాజీనామా, గత మ్యాచ్‌పై విచారణ, మరో కెప్టెన్‌తో మ్యాచ్ బరిలోకి... శ్రీలంక కష్టాల జాబితా చాంతాడంత ఉంది. ఇలాంటి స్థితిలో ఆ జట్టు ఎంత వరకు కోలుకోగలదు? సమస్యలను పక్కన పెట్టి పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగగలదా? సొంతగడ్డపై ఆ జట్టు ఆశిస్తున్న మొదటి విజయం దక్కే అవకాశం ఏమాత్రమైనా ఉందా! కొలంబో: శ్రీలంకతో వన్డే సిరీస్‌ను ఇప్పటికే 3–0తో సొంతం చేసుకున్న భారత్, ఈ ఆధిక్యాన్ని మరింత పెంచుకోవాలని పట్టుదలగా ఉండగా... స్వదేశంలో ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న శ్రీలంక కాస్తయినా పరువు దక్కించుకోవాలంటే ఒక మ్యాచ్‌లోనైనా విజయం సాధించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నేడు ఇక్కడ జరిగే నాలుగో వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి. గత మ్యాచ్ ఆడిన టీమ్‌నుంచి ఒకటి, రెండు మార్పులతో టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉండగా...లంక జట్టులో మాత్రం సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. పాండే, కుల్దీప్లకు చాన్స్! ప్రపంచ కప్ సన్నాహకాల్లో భాగంగా అందరికీ అవకాశాలు కల్పిస్తామని కెప్టెన్ కోహ్లి పదే పదే చెబుతున్నాడు. ఇప్పటికే సిరీస్ గెలవడంతో నాలుగో వన్డేలో భారత జట్టులో మార్పులు ఉండవచ్చు. కుల్దీప్ను ఆడించేందుకు సిద్ధమంటూ కోహ్లి ఇప్పటికే పరోక్షంగా చెప్పేశాడు. కాబట్టి అక్షర్, చహల్‌లో ఒకరిని తప్పించే అవకాశం ఉంది. బ్యాటింగ్‌లో రోహిత్ గత రెండు మ్యాచ్‌లలోనూ చెలరేగాడు. ధావన్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. కోహ్లి, ధావన్ బ్యాటింగ్ గురించి ఆందోళనే అనవసరం. అయితే తనకు పెద్దగా అలవాటు లేని నాలుగో స్థానంలో రాహుల్ కాస్త ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది. అతను ఒక చక్కటి ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. ఇక ధనంజయ స్పిన్‌ను ఆడలేక వరుసగా విఫలమైన కేదార్ జాదవ్ స్థానంలో మనీశ్ పాండేను ఆడించవచ్చు. మున్ముందు తుది జట్టులో రెగ్యులర్ అయ్యే అవకాశం ఉన్న పాండేకు ఇక్కడ కనీసం రెండు మ్యాచ్‌లలో అవకాశం ఇవ్వడం ముఖ్యం. అయితే తుది జట్టు కూర్పును బట్టి చూస్తే రహానే, శార్దుల్ ఠాకూర్లు మాత్రం మళ్లీ బెంచీకే పరిమితం అయ్యే అవకాశాలే ఎక్కువ. ఇక కెరీర్లో 300వ వన్డే మ్యాచ్ బరిలోకి దిగుతున్న ధోని ఈ మ్యాచ్‌ను ఎలా చిరస్మరణీయం చేసుకుంటాడనేది ఆసక్తికరం. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రోహిత్, రాహుల్, పాండే, పాండ్యా, ధోని, అక్షర్/చహల్, కుల్దీప్, భువనేశ్వర్, బుమ్రా. శ్రీలంక: మలింగ (కెప్టెన్), డిక్వెలా, మునవీరా, కుషాల్ మెండిస్, తిరిమన్నె, మాథ్యూస్, ధనంజయ డి సిల్వ, సిరివర్ధన, అఖిల ధనంజయ, చమీరా, ఫెర్నాండో కపుగెడెరపై విచారణ మూడో వన్డేలో టాస్ గెలిచిన తర్వాత కూడా బ్యాటింగ్ ఎంచుకోవడంపై శ్రీలంక క్రికెట్ బోర్డు విచారణ చేపట్టనుంది. మ్యాచ్‌కు ముందు రోజు టాస్ గెలిస్తే ఫీల్డింగ్ తీసుకోవాలని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. టాస్ గెలిచిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లంతా ఫీల్డింగ్‌కు సిద్ధమైపోయారు. అయితే కెప్టెన్ కపుగెడెర వచ్చి అనూహ్యంగా బ్యాటింగ్ అని చెప్పడంతో వారంతా ఆశ్చర్యపోయారు. పరిస్థితులు పేస్‌కు అనుకూలంగా ఉండటంతో లంక తొలుత బ్యాటింగ్ చేసి 217 పరుగులు మాత్రమే చేసింది. పిచ్, వాతావరణం: ప్రేమదాస స్టేడియంలోని పిచ్‌పై ఎక్కువ సందర్భాల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. అయితే ఆరంభంలో పేస్ బౌలింగ్‌కు అనుకూలిస్తుంది. వర్షం అంతరాయం కలిగించవచ్చు. కెప్టెన్‌గా మలింగ... తొలి రెండు వన్డేల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన ఉపుల్ తరంగ సస్పెన్షన్‌తో దూరం కాగా, మూడో వన్డేలో కెప్టెన్‌గా ఉన్న కపుగెడెర గాయంతో సిరీస్ నుంచి తప్పుకున్నాడు. దాంతో ఈ మ్యాచ్‌లో లసిత్ మలింగ నాయకత్వంలో శ్రీలంక బరిలోకి దిగుతోంది. అయితే కెప్టెన్ ఎవరైనా జట్టులో ఇప్పుడు స్ఫూర్తి నింపడం అవసరం. గత ఏడాది కాలంలో శ్రీలంక వన్డే జట్టులోకి 40 మంది ఎంపిక కావడం ఆ టీమ్ నిలకడలేమిని చూపిస్తోంది. గత మ్యాచ్‌లో ఆడిన చండిమాల్ కూడా గాయంతో తప్పుకున్నాడు. ఇలాంటి స్థితిలో లంక విజయం సాధించాలంటే అసాధారణ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాటింగ్‌లో డిక్వెలా, కుషాల్ పెరీరా మాత్రం కొంత వరకు ఫర్వాలేదనిపిస్తున్నారు. గత మ్యాచ్‌లో అర్ధసెంచరీ చేసిన తిరిమన్నె మళ్లీ రాణించాలని లంక కోరుకుంటోంది. మాజీ కెప్టెన్ మాథ్యూస్ ఇప్పటి వరకు టీమ్‌కు ఉపయుక్తమైన ఆటతీరు ప్రదర్శించలేకపోవడం జట్టును మరింత దెబ్బ తీస్తోంది. మలింగ బౌలింగ్‌లో మునుపటి వాడి లేకపోవడంతో లంక పేస్ బలహీనంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ కోసం ధనంజయ డి సిల్వ, దిల్షాన్ మునవీరాలను లంక జట్టులోకి తీసుకుంది. ►మధ్యాహ్నం గం. 2.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
నిర్దాక్షిణ్యంగా...
►భారత్‌కు మరో భారీ విజయం ►తొలి వన్డేలో 9 వికెట్లతో శ్రీలంక చిత్తు ►శిఖర్ ధావన్ సెంచరీ రాణించిన కోహ్లి ఫార్మాట్ మాత్రమే మారింది... భారత్ విధ్వంసకర ఆటలో మార్పు లేదు. శ్రీలంక పేలవ ప్రదర్శన మెరుగైందీ లేదు! టెస్టు సిరీస్ తరహాలోనే మరో అద్భుత విజయంతో వన్డే సిరీస్‌లో కూడా భారత్ బోణీ చేసింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. ముందుగా బౌలర్లు సమష్టితత్వంతో లంకను తక్కువ స్కోరుకే పరిమితం చేయగా... ఆ తర్వాత ఏకంగా 21.1 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించేసి కోహ్లి సేన మన జట్టు సత్తాను మరోసారి ప్రదర్శించింది. 94, 113, 79, 91, 125... ఈ మ్యాచ్‌కు ముందు శ్రీలంకపై శిఖర్ ధావన్ వరుసగా ఐదు వన్డేల్లో చేసిన పరుగులు ఇవి. ఇప్పుడు కూడా అదే ప్రేమను కొనసాగిస్తూ ధావన్ మరో అద్భుత శతకంతో చెలరేగాడు. 132 స్కోరులో 98 పరుగులు బౌండరీల ద్వారానే రాబట్టి తన ధాటిని ప్రదర్శించిన అతను తన కెరీర్లో వేగవంతమైన సెంచరీని సాధించాడు. అటువైపు తనకు అలవాటైన రీతిలో ఛేదనలో మరో చక్కటి ఇన్నింగ్స్‌తో కోహ్లి అండగా నిలవడంతో టీమిండియాకు తిరుగులేకపోయింది. దంబుల్లా: శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్‌కు ఘనమైన ఆరంభం లభించింది. ఆదివారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తుగా ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 43.2 ఓవర్లలో 216 పరుగులకే ఆలౌటైంది. నిరోషన్ డిక్వెలా (74 బంతుల్లో 64; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. ఒక దశలో 139/1తో మెరుగైన స్థితిలో నిలిచిన ఆ జట్టు 77 పరుగులకే మిగతా 9 వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ అవలీలగా 28.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. వికెట్ నష్టానికి 220 పరుగులు చేసి విజయాన్ని దక్కించుకుంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ శిఖర్ ధావన్ (90 బంతుల్లో 132 నాటౌట్; 20 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ సాధించగా, విరాట్ కోహ్లి (70 బంతుల్లో 82 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. లంక పడగొట్టిన ఒక్క వికెట్ కూడా రోహిత్ శర్మ రనౌట్ రూపంలో అదృష్టవశాత్తూ లభించిందే. సిరీస్‌లో భారత్ 1–0తో ఆధిక్యంలో నిలవగా రెండో వన్డే పల్లెకెలెలో గురువారం జరుగుతుంది. డిక్వెలా మినహా... టాస్ గెలిచిన కోహ్లి ఫీల్డింగ్ ఎంచుకున్న అనంతరం శ్రీలంకకు ఓపెనర్లు డిక్వెలా, గుణతిలక (44 బంతుల్లో 35; 4 ఫోర్లు) శుభారంభం అందించారు. భారత ఆరంభ బౌలర్లు భువనేశ్వర్, పాండ్యాలను వీరిద్దరు సమర్థంగా ఎదుర్కొంటూ తొలి పవర్ ప్లేలో 55 పరుగులు జోడించారు. చివరకు యజువేంద్ర చహల్ ఈ జోడీని విడదీశాడు. రివర్స్ స్వీప్ ఆడబోయిన గుణతిలక ఎక్స్ట్రా కవర్లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత చహల్ వేసిన మరో ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి కుషాల్ మెండిస్ (37 బంతుల్లో 36; 5 ఫోర్లు) జోరు ప్రదర్శించాడు. మరో ఎండ్‌లో డిక్వెలా కూడా ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో 65 బంతుల్లో అతని అర్ధసెంచరీ పూర్తయింది. ఈ దశలో డిక్వెలాను అవుట్ చేసి జాదవ్ శ్రీలంక పతనానికి శ్రీకారం చుట్టాడు. అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించిన తర్వాత డిక్వెలా రివ్యూ కోరినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత లంక టపటపా వికెట్లు కోల్పోయింది. జాదవ్‌తో పాటు బుమ్రా, అక్షర్ పటేల్ పరిస్థితులను చక్కగా ఉపయోగించుకొని ప్రత్యర్థి పని పట్టారు. మెండిస్‌ను అక్షర్ బౌల్డ్ చేయగా, కెప్టెన్ తరంగ (13) జాదవ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మరోవైపు మాథ్యూస్ (50 బంతుల్లో 36 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) పోరాడే ప్రయత్నం చేసినా ఇతర బ్యాట్స్‌మెన్ నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. ఫలితంగా 6.4 ఓవర్ల ముందే లంక ఆట ముగిసింది. 11 ఓవర్ల వ్యవధిలోనే ఆ జట్టు చివరి 7 వికెట్లు కోల్పోయింది. కోహ్లి సహకారం... సునాయాస లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. వైస్ కెప్టెన్‌గా తొలిసారి బరిలోకి దిగిన రోహిత్ శర్మ (4) రనౌటయ్యాడు. సింగిల్‌కు ప్రయత్నించిన సమయంలో బ్యాట్ చేజారిపోగా రోహిత్ గాల్లోకి ఎగిరి క్రీజ్‌లోకి చేరే ప్రయత్నం చేశాడు. అయితే ఆలోపే కపుగెడెర డైరెక్ట్ త్రో వికెట్లను తాకడంతో అతను వెనుదిరగక తప్పలేదు. శ్రీలంక గడ్డపై ఆడిన గత పది వన్డే ఇన్నింగ్స్‌లలో కలిపి రోహిత్ 37 పరుగులు మాత్రమే చేయగలిగాడు! అయితే ఆ తర్వాత భారత్ వెనుదిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. ధావన్, కోహ్లి కలిసి ఆడుతూ పాడుతూ బ్యాటింగ్ చేశారు. ఫెర్నాండో, పెరీరా వేసిన రెండు ఓవర్లలో కలిపి వీరిద్దరు చెరో మూడు బౌండరీలు బాదారు. ఈ క్రమంలో 36 బంతుల్లోనే ధావన్ అర్ధ సెంచరీ పూర్తయింది. 87 పరుగుల వద్ద ధావన్ ఇచ్చిన కష్టసాధ్యమైన క్యాచ్‌ను కీపర్ డిక్వెలా వదిలేశాడు. అనంతరం డి సిల్వ వేసిన ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన ధావన్ 71 బంతుల్లోనే సెంచరీ సాధించడం విశేషం. కోహ్లి కూడా సరిగ్గా 50 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకోగా... 118 పరుగుల వద్ద తరంగ క్యాచ్ వదిలేయడంతో ధావన్ మళ్లీ అవుట్ కాకుండా తప్పించుకున్నాడు. సందకన్ ఓవర్లో కోహ్లి వరుసగా 4, 4, 6 కొట్టి జట్టును విజయానికి మరింత చేరువగా తెచ్చాడు. చివరకు సిల్వ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి ధావన్, భారత్‌కు భారీ విజయాన్ని అందించాడు. ► 11 ధావన్ కెరీర్లో ఇది 11వ సెంచరీ. బంతులపరంగా అతనికి ఇదే (71) వేగవంతమైన శతకం. ►127 భారత్ గెలిచే సమయానికి ఇన్నింగ్స్‌లో మిగిలిన బంతులు. కనీసం 200 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఛేదిస్తున్న సమయంలో మిగిలిన బంతులపరంగా భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం -
లక్ష్యం క్లీన్‌స్వీప్
-
లక్ష్యం క్లీన్‌స్వీప్
♦ మరో విజయంపై భారత్ దృష్టి ♦ నేటి నుంచి శ్రీలంకతో మూడో టెస్టు భారత జట్టు తమ టెస్టు చరిత్రలో మూడు అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల సిరీస్‌లను నాలుగు సార్లు క్లీన్‌స్వీప్ చేసింది. అయితే ఇవన్నీ సొంతగడ్డపైనే వచ్చాయి. 85 ఏళ్లలో ఒక్కసారి కూడా విదేశాల్లో ఆ ఘనత నమోదు చేయలేదు. ఇప్పుడు అలాంటి అరుదైన అవకాశం కోహ్లి సేన ముందుంది. అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో పాటు ప్రత్యర్థి పేలవ ఆటతీరు కూడా భారత్ విజయంపై అంచనాలు పెంచుతోంది. తొలి రెండు టెస్టుల్లాగే ఈ సారి కూడా మన జట్టు సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శిస్తుందా...? స్వదేశంలో వరుస పరాభవాలు ఎదు ర్కొంటున్న శ్రీలంక కాస్తయినా పోటీ ఇచ్చి పరువు కాపాడుకోగలదా చూడాలి. కాండీ: బ్యాటింగ్‌లో జోరు, పేసర్ల దూకుడు, స్పిన్నర్ల సత్తా... వెరసి శ్రీలంక పర్యటనలో భారత జట్టు తిరుగులేని ఆటతీరు కనబరుస్తోంది. తొలి రెండు టెస్టులను భారీ తేడాతో గెలుచుకున్న టీమిండియా అదే ఊపులో మరో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి భారత్, శ్రీలంక మధ్య ఇక్కడి పల్లెకెలె మైదానంలో మూడో టెస్టు జరగనుంది. సీనియర్లు దూరమయ్యాక ఇప్పటికీ కోలుకోలేకపోవడంతో పాటు కీలక ఆటగాళ్లు వరుస గాయాల బారిన పడటంతో శ్రీలంక పరిస్థితి మరీ ఇబ్బందికరంగా తయారైంది. రెండు ఓటముల తర్వాత ఈ మ్యాచ్‌లోనైనా కోలుకోవడంపై చండిమాల్ బృందం దృష్టి పెట్టింది. భువీకి చోటు! తొలి రెండు టెస్టులతో పోలిస్తే ఈ పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలంగా కనిపిస్తోంది. మ్యాచ్ ముందు రోజు వరకైతే పచ్చికను తొలగించలేదు. పైగా ఇక్కడి శీతల వాతావరణం కారణంగా స్వింగ్ కూడా ప్రభావం చూపిస్తుంది. మ్యాచ్ రోజు కూడా పిచ్ ఇలాగే ఉంటే సస్పెన్షన్‌కు గురైన జడేజా స్థానంలో మూడో పేసర్‌గా భువనేశ్వర్ కుమార్‌ను జట్టులోకి తీసుకోవాలని భారత్ భావిస్తోంది. అయితే రెండో స్పిన్నర్ కూడా అవసరమని భావిస్తే పాండ్యా స్థానంలో భువీ వస్తాడు. అప్పుడు కుల్దీప్కు కూడా అవకాశం దక్కుతుంది. దక్షిణాఫ్రికా నుంచి ఈ మ్యాచ్ కోసం వచ్చిన అక్షర్ పటేల్ బెంచీకే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువ. వరుస రికార్డులతో చెలరేగిపోతున్న అశ్విన్‌ను ఎదుర్కోవడం కూడా లంకకు సులువు కాదు. ఓపెనర్లు ధావన్, రాహుల్‌లతో పాటు కెప్టెన్ కోహ్లి, రహానే బ్యాటింగ్ గురించి కూడా ఎలాంటి బెంగ లేదు. ఇక పుజారా అయితే అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గతంలో విదేశాల్లో మూడు టెస్టుల సిరీస్‌లో మరే భారత బ్యాట్స్‌మన్ మూడు మ్యాచుల్లోనూ సెంచరీ చేయలేదు. పుజారా ఆటను చూస్తే అతను ఈ ఘనత సాధించగలడని అనిపిస్తోంది. మొత్తంగా ఎలాంటి లోపాలు లేని విధంగా భారత లైనప్ కనిపిస్తోంది. కెప్టెన్‌గా కోహ్లి వరుసగా 29వ టెస్టులోనూ తుది జట్టులో మార్పులు చేయనుండటం విశేషం. ముగ్గురు పేసర్లతో... గత టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక చూపిన పోరాట పటిమ ఆ జట్టుకు విజయాన్ని ఇవ్వలేకపోయింది కానీ టీమ్ సభ్యులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా బ్యాట్స్‌మెన్ తమ ఆటతీరును మార్చుకుంటే ఫలితాలు రాబట్టవచ్చని ఆ ఇన్నింగ్స్ నిరూపించింది. ఇప్పుడు అదే పట్టుదలను వారు కనబర్చాల్సి ఉంది. ఈ ఏడాది లంక బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా నిలిచిన కరుణరత్నే మరోసారి కీలకం కానున్నాడు. తన తాజా ఫామ్‌ను అతను మరో రెండు ఇన్నింగ్స్‌ల పాటు కొనసాగించాలని లంక కోరుకుంటోంది. ఇక కుశాల్ మెండిస్, డిక్వెలా కూడా తమ బ్యాటింగ్ సామర్థ్యాన్ని గత మ్యాచ్‌లో చూపించారు. వీరితో పాటు మాథ్యూస్, కెప్టెన్ చండిమాల్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇస్తే శ్రీలంక మెరుగైన స్థితిలో నిలుస్తుంది. బౌలింగ్‌లో ఆ జట్టు కూడా ముగ్గురు పేసర్లను తీసుకునే అవకాశం కనిపిస్తోంది. విశ్వ ఫెర్నాండో, గమగేలను ఈ మ్యాచ్ కోసమే ప్రత్యేకంగా ఎంపిక చేశారు. మూడో బౌలర్‌గా పేసర్ చమీరా లేదా చైనామన్ లక్షణ్ సందకన్లలో ఒకరికి చోటు దక్కుతుంది. విజయం కంటే కూడా ఈ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకోగలిగినా లంక పరువు దక్కుతుంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రాహుల్, పుజారా, రహానే, సాహా, అశ్విన్, ఉమేశ్, షమీ, భువనేశ్వర్/ పాండ్యా, కుల్దీప్. శ్రీలంక: చండిమాల్ (కెప్టెన్), తరంగ, కరుణరత్నే, కుషాల్ మెండిస్, మాథ్యూస్, డిక్వెలా, ధనంజయ డి సిల్వా, దిల్రువాన్ పెరీరా, ఫెర్నాండో, గమగే, చమీరా/ సందకన్. ‘జడేజా లేకపోవడం నిరాశ కలిగించేదే. ఆటగాళ్లకు ఐసీసీ నిబంధనలపై అవగాహన ఉండాలనే మాట వాస్తవం. అయితే నిబంధనల విషయంలో ఐసీసీ అన్ని సమయాలు, సందర్భాల్లో ఒకే తరహా విధానాన్ని పాటిస్తేనే అది సాధ్యమవుతుంది. ఇలాంటి విషయంలో ఐసీసీ మరింత స్పష్టతనిస్తే మంచిది.’ – విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ గత మూడేళ్లలో శ్రీలంకలో ఒక్క టెస్టు కూడా ‘డ్రా’ కాలేదు. ఈ మధ్య కాలంలో జరిగిన మొత్తం 18 టెస్టులలోనూ ఫలితం వచ్చింది. పిచ్, వాతావరణం పల్లెకెలె మైదానం సాధారణంగా పేస్ బౌలర్లకు అనుకూలం. మంచి బౌన్స్‌తో పాటు ఆరంభంలో స్వింగ్‌కు కూడా అవకాశం ఉంటుంది. కొద్దిగా నిలబడితే ఆ తర్వాత పరుగులు రాబట్టవచ్చు. ఇక్కడ వర్షం చాలా సహజం. కాబట్టి మ్యాచ్‌కు అప్పుడప్పుడు అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఉదయం గం. 10 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఖలీ బెల్ట్ నా దగ్గరే ఉంది: రోహిత్
భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి స్నేహితుల దినోత్సవం సందర్భంగా డబ్ల్యూడబ్ల్యూ రెజ్లర్ ది గ్రేట్ ఖలీని కలిసిన విషయం తెలిసిందే. కానీ తెలియని విషయం ఏమిటంటే అదే రోజు ఈ గ్రేట్ ఇండియన్ రెజ్లర్‌తో భారత ఆటగాళ్లు హర్ధిక్ పాండ్యా, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇక ఈ ఫోటోలను బయటపెట్టింది ఎవరో తెలుసా..? టీమిండియా మరో ఓపెనర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ. ఓ మంచి క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో ఈ ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. అంతే ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇక క్యాఫ్షన్‌గా ఎం పెట్టాడో తెలుసా..‘ ఖలీ రెజ్లింగ్ బెల్ట్ కోసం గొప్ప ప్రయత్నం చేశారు మిత్రులారా.. కానీ ఆ బెల్ట్ నాదగ్గరే ఉంది’ అని డబ్ల్యూడబ్ల్యూఈ బెల్ట్‌తో ఉన్న ఫోటోతో వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. ఐపీఎల్-10 ట్రోఫీని ముంబై ఇండియన్స్ జట్టు గెలుచుకున్న సందర్భంగా 14 సార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచిన ట్రిపుల్ హెచ్ తన టైటిల్(బెల్టు)ని రోహిత్ శర్మకి కానుకగా అందించిన విషయం తెలిసిందే. అదే బెల్టుతో ఈ ముంబై స్టార్ ఫోజు ఇచ్చాడు. రెండో టెస్టు అనంతరం దొరికిన సమయాన్ని సరదాగా గడిపిన క్రికెటర్లు మూడో టెస్టుకు సిద్దమయ్యారు. రెండు రోజుల విశ్రాంతి అనంతరం ప్రాక్టీస్ మొదలు పెట్టారు. టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని కోహ్లీసేన భావిస్తోంది. ఇక మూడో టెస్టు ఆగస్టు 12న పల్లకిలా వేదికగా జరగనుంది. -
'అందుకు కారణం కోహ్లి సపోర్ట్'
కొలంబో:శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. తొలి టెస్టు మ్యాచ్ కు తీవ్ర జ్వరం కారణంగా దూరమైన రాహుల్.. రెండో టెస్టులో ఆకట్టుకున్నాడు. భారత్ కు చక్కటి ఆరంభాన్ని అందించి అర్థ శతకం సాధించాడు. ఇది రాహుల్ కు వరుసగా ఆరో హాఫ్ సెంచరీ కావడం విశేషం. తద్వారా ఈ ఘనత సాధించిన మూడో భారత ఆటగాడిగా రాహుల్ గుర్తింపు పొందాడు. అయితే తన ఆట తీరుపై సంతృప్తిని వ్యక్తం చేస్తున్న రాహుల్.. అందుకు కారణం కెప్టెన్ విరాట్ కోహ్లినే అంటున్నాడు. తనలో ఆత్మవిశ్వాసం పెరిగి రాణించడానికి కోహ్లి ఇచ్చిన సపోర్టే కారణమన్నాడు. 'నేను గాయంతో కొన్ని నెలల పాటు జట్టుకు దూరమైన తరువాత సహచర క్రికెటర్ల నుంచి లభించిన మద్దతు మరువలేనిది. నేను సర్జరీ చేయించుకున్న తరువాత నా పరిస్థితిని తోటి క్రికెటర్లు ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తూ ఉండేవారు. ఇక్కడ ప్రధానంగా కోహ్లి నుంచి చక్కటి సహకారం లభించింది. నీ కోసం జట్టు నిరీక్షిస్తుందంటూ మెస్సేజ్ లతో నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు. ఇదే నేను భయం లేకుండా తిరిగి జట్టులో అడుగుపెట్టడానికి కారణమైంది. కోహ్లితో పాటు సహాయక సిబ్బంది కూడా అండగా నిలిచారు. వారు చూపించిన సహాకారం నా చిన్న కెరీర్ లో కచ్చితంగా చాలా పెద్దది. నాకు ప్రతీ విషయంలో కోహ్లి అండగా నిలిచాడు' అని రాహుల్ పేర్కొన్నాడు. -
‘రెండు’లోనే ముగించాలని...
►సిరీస్ విజయంపై భారత్ కన్ను ►తీవ్ర ఒత్తిడిలో శ్రీలంక ►నేటి నుంచి రెండో టెస్టు ►తుది జట్టులోకి రాహుల్ కొద్ది రోజుల క్రితం టీమిండియా నంబర్‌వన్ టెస్టు జట్టు హోదాలోనే శ్రీలంకలో అడుగు పెట్టింది. భారత్ ఆటపై అపార నమ్మకం ఉన్నా... సొంతగడ్డపై శ్రీలంక మరీ ఇంత పేలవంగా ఆడి తలవంచుతుందని కూడా ఎవరూ ఊహించలేదు. కానీ తొలి టెస్టులో ఆ జట్టు ప్రదర్శన ఇరు జట్ల మధ్య అంతరాన్ని భారీగా పెంచేసింది. అద్భుత ఫామ్‌లో ఉన్న టీమిండియాను లంక ఇక ముందు కూడా ఆపే అవకాశం కనిపించడం లేదు. అదే జరిగితే వరుసగా రెండో పర్యటనలోనూ సిరీస్ భారత్ సొంతమవుతుంది. రెండేళ్ల క్రితం తొలి టెస్టులో ఓడి ఆ తర్వాత వరుసగా రెండు విజయాలతో భారత బృందం సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. నాటితో పోలిస్తే ఇప్పుడు మన జట్టు మరింత పటిష్టంగా మారగా, శ్రీలంక జట్టు మాత్రం ఎన్నడూ లేనంత బలహీనంగా కనిపిస్తోంది. పైగా కీలక ఆటగాళ్లు గాయపడటంతో తుది జట్టును ఎంచుకునే విషయంలో కూడా లంక తర్జనభర్జన పడుతోంది. ఈ నేపథ్యంలో ఆతిథ్య జట్టు ప్రత్యర్థికి ఏమాత్రం పోటీ ఇస్తుందో చూడాలి. కొలంబో: శ్రీలంకతో తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్ సిరీస్ విజయంపై దృష్టి పెట్టింది. నేటి నుంచి ఇక్కడి సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది. తొలి మ్యాచ్‌లో భారత్ 304 పరుగుల తేడాతో గెలిచింది. అనారోగ్యం నుంచి కోలుకున్న శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండిమాల్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతుండగా... భారత జట్టులోకి లోకేశ్ రాహుల్ రావడం ఖాయమైంది. అందరూ ఫామ్‌లో... గాలే టెస్టులో భారత జట్టు టాప్–5 బ్యాట్స్‌మెన్ అంతా కనీసం అర్ధ సెంచరీ అయినా సాధించారు. వీరిలో ధావన్, పుజారా, కోహ్లి సెంచరీలతో చెలరేగారు. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 840 పరుగులను అతి వేగంగా 4.5 రన్‌రేట్‌తో సాధించింది. కాబట్టి బ్యాటింగ్ విషయంలో టీమిండియా ఏ రకంగా కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. అయితే తుది జట్టులో ఒక కీలక మార్పు జరగనుంది. ఓపెనర్ ముకుంద్ స్థానంలో రాహుల్ బరిలోకి దిగుతున్నట్లు కోహ్లి ఇప్పటికే ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ఏడు ఇన్నింగ్స్‌లలో ఆరు అర్ధ సెంచరీలు చేసిన అనంతరం ఆటకు దూరమయ్యాడు. ఇప్పుడు అతని రాక జట్టు బలాన్ని మరింత పెంచనుంది. బౌలింగ్ విభాగంలో గత మ్యాచ్‌లో భారత జట్టులో అందరూ వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యా కూడా తన తొలి మ్యాచ్‌లోనే ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో భారత్ మూడో స్పిన్నర్‌ను ఆడించే ఆలోచన ఉంది. కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకుంటే పాండ్యా తప్పుకోవాల్సి రావచ్చు. ఓవరాల్‌గా దుర్భేద్యంగా కనిపిస్తున్న భారత్‌ను నిలువరించాలంటే లంక తీవ్రంగా శ్రమించాలి. హెరాత్ ఆడతాడా? తొలి టెస్టులో పరాజయంతో పాటు కీలక ఆటగాళ్ల గాయాలు లంక మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీశాయి. గాయం కారణంగా ప్రధాన బ్యాట్స్‌మన్ అసెలా గుణరత్నే తప్పుకోవడం జట్టును బలహీనం చేసింది. అతని స్థానంలో తిరిమన్నె లేదా ధనంజయ డి సిల్వా బరిలోకి దిగుతారు. హెరాత్ గాయంతో గత టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కే రాలేదు. అతని ఫిట్‌నెస్‌పై ఇంకా స్పష్టత లేకపోయినా... ఆడాలని లంక కోరుకుంటోంది. శ్రీలంక కూడా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భావిస్తోంది. మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ మలింద పుష్పకుమారకు తొలి టెస్టు ఆడే అవకాశం లభించవచ్చు. మరోవైపు కెప్టెన్, కీలక బ్యాట్స్‌మన్ చండిమాల్ తిరిగి రావడం మాత్రం ఊరటనిచ్చే అంశం. తొలి టెస్టులో ఘోర పరాభవంతో అన్ని వైపుల నుంచి జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని లంక పట్టుదలగా ఉంది. పిచ్, వాతావరణం తొలి టెస్టుతో పోలిస్తే ఇక్కడి పిచ్ పొడిగా ఉంది. రెండు రోజుల పాటు మంచి బ్యాటింగ్ చేయవచ్చు. మూడో రోజు నుంచి స్పిన్‌కు బాగా అనుకూలిస్తుంది. మ్యాచ్ జరిగే రోజుల్లో చిరుజల్లులకు అవకాశం ఉంది. ► 31 ఈ మ్యాచ్‌తో భారత్ తరఫున కనీసం 50 టెస్టులు ఆడిన 31వ క్రికెటర్‌గా పుజారా గుర్తింపు పొందనున్నాడు ►28 రాహుల్ తుది జట్టులోకి వస్తే కెప్టెన్‌గా తుది జట్టు విషయంలో కోహ్లి తన ప్రత్యేకతను మరోసారి నిలబెట్టుకున్నట్లవుతుంది. ►వరుసగా 27 టెస్టుల్లో కనీసం ఒక్క ఆటగాడినైనా మార్చిన కోహ్లి... 28వ టెస్టులోనూ దానిని కొనసాగించనున్నాడు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రాహుల్, పుజారా, రహానే, అశ్విన్, సాహా, జడేజా, పాండ్యా/కుల్దీప్, ఉమేశ్, షమీ. శ్రీలంక: చండిమాల్ (కెప్టెన్), తరంగ, కరుణరత్నే, కుషాల్ మెండిస్, మాథ్యూస్, డిక్వెలా, ధనంజయ, పెరీరా, హెరాత్, పుష్పకుమార, ప్రదీప్. ►ఉదయం గం. 10.00 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
డైలమాలో టీమిండియా సెలెక్టర్లు..
గాలె టెస్టు విజయానంతరం రెండో టెస్టుకు భారత జట్టు కూర్పు సెలక్టర్లకు కత్తి మీద సాములా మారింది. నలుగురు ఓపెనర్లు అందుబాటులో ఉండటం.. గాలే మ్యాచ్‌లో అందరూ రాణించడంతో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీలకు పెద్ద సమస్యగా మారింది. జ్వరంతో లోకెశ్ రాహుల్ తొలి టెస్టుకు దూరం కాగా అతని స్థానంలో అభినవ్ ముకుంద్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో అభినవ్ నిరాశపరిచనప్పటికి రెండో ఇన్నింగ్స్‌లో బాధ్యతాయుతంగా ఆడి కెప్టెన్ కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ తొలుత జట్టులో చోటు దక్కకపోవడంతో హాంకాంగ్‌లో హాలిడే ట్రిప్‌కు వెళ్లాడు. అనంతరం మెల్బోర్న్ వెళ్లి వన్డేలకు సిద్దమవ్వాలని ప్రణాళిక సిద్దం చేసుకున్నాడు. కానీ టెస్టు రెగ్యులర్ ఓపెనర్ మురళీ విజయ్ గాయంతో సిరీస్ మొత్తానికి దూరం కావడంతో అనూహ్యంగా ధావన్‌కు చోటు దక్కింది. టెస్టుల్లో మళ్లీ ఆడాలనే ధృడ సంకల్పంతో ఉన్న ధావన్ అందిన అవకాశాన్ని అందిపుచ్చుకొని చెలరేగాడు. తొలిఇన్నింగ్స్‌లో అద్భుత బ్యాటింగ్‌తో(190) అజెయ సెంచరీ సాధించాడు. గతేడాది న్యూజిలాండ్ సిరీస్‌లో గాయపడి జట్టుకు దూరమైన రోహిత్ శర్మ.. చాంపియన్స్ ట్రోఫీలో చోటు దక్కించుకొని అదరగొట్టడంతో శ్రీలంక పర్యటనకు ఎంపికయ్యాడు. కానీ తొలి టెస్టులో అవకాశం లభించలేదు. రెండో టెస్టులోనైనా చోటు దక్కుతుందనే ఆశతో ఎదురుచూస్తున్నాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పుజారా, రహానే, పాండ్యాలు కూడా రాణించడంతో జట్టు కూర్పు పెద్ద తలనొప్పిలా మారింది. ఇప్పటికే ఓపెనర్‌గా ఉన్న రహానేను నాలుగోస్థానంలో బ్యాటింగ్‌కు పంపిస్తుండగా.. నలుగురు ఓపెనర్ బ్యాట్స్మెన్లలో ఎవరికీ అవకాశం ఇవ్వాలో అర్థం కాగా కోచ్, కెప్టెన్లు తల బాదుకుంటున్నారు. -
భారత్ స్టోక్స్.. పాండ్యానే..
ఆడిన తొలి టెస్టులోనే ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత ఆటగాడు హార్ధిక్ పాండ్యాను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి భారత్ స్టోక్స్‌గా అభివర్ణించాడు. బ్యాటింగ్, బౌలింగ్‌తో ప్రపంచ గొప్ప ఆల్ రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ స్టోక్స్‌తో పాండ్యాను పోల్చుతూ ప్రశంసల జల్లు కురిపించాడు. మ్యాచ్ గెలిచిన అనంతరం మాట్లాడిన కోహ్లీ.. పాండ్యా స్టోక్స్‌లా రాణిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదని అభిప్రాయపడ్డాడు. తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్ అవకాశం తక్కువగా వచ్చినా రెండో ఇన్నింగ్స్‌లో దక్కిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడని కొనియాడాడు. వేగంతో కూడిన షార్ట్ పిచ్ బంతులు అద్భుతంగా వేయడం ఆకట్టుకుందని కోహ్లి చెప్పుకొచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో 540-550 మధ్యలోనే భారత్ ఇన్నింగ్స్ ముగుస్తుందని భావించామని.. కానీ పాండ్యా హాఫ్ సెంచరీతో భారీ స్కోరు నమోదైందని పేర్కొన్నాడు. గత రెండు సంవత్సరాలుగా భారత బౌలర్లు స్థిరంగా రాణిస్తున్నారని కోహ్లి వ్యాఖ్యానించాడు. సెంచరీపై స్పందిస్తూ.. గత ఆస్ట్రేలియా సిరీస్, తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన కోహ్లి.. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించడంపై మాట్లాడుతూ.. వైఫల్యాలను టార్గెట్ చేస్తూ వేలిత్తి చూపేవారిని పట్టించుకోనని.. పరిస్థితుల తగ్గట్టు ఆడడమే తన కర్తవ్యమని కోహ్లి అభిప్రాయపడ్డాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో మేము కొంత ఆడాల్సిన అవసరం ఏర్పడింది. ఆ పరిస్థితిని అభినవ్‌తో అందిపుచ్చుకున్నానని కోహ్లి తెలిపాడు. ఎన్ని మ్యాచుల్లో విఫలమయ్యానని ఎప్పుడూ లెక్కించుకోనని, అన్ని ఫార్మట్లు ఆడుతున్నప్పుడు ఏ ఫార్మట్‌లో ఎన్ని ఇన్నింగ్స్‌లు ఆడలేదని లెక్కించుకోవడం కష్టమని కోహ్లి అభిప్రాయపడ్డాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ 304 పరుగులతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ(103 నాటౌట్) కెరీర్లో 17 వ సెంచరీ నమోదు చేశాడు. హార్ధిక్ పాండ్యా ఆడిన తొలి మ్యాచ్‌లోనే అర్ధ సెంచరీతో పాటు ఒక వికెట్ పడగొట్టాడు. -
బ్యాట్స్‌మెన్‌కు ఫుల్ ప్రాక్టీస్
♦ వార్మప్ మ్యాచ్ డ్రా ♦ కోహ్లి అర్ధ సెంచరీ ♦ భారత్ తొలి ఇన్సింగ్స్ 312/9 డిక్లేర్డ్ కొలంబో: శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో జరిగిన రెండు రోజుల వార్మప్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి రోజు భారత బౌలర్లు పూర్తి స్థాయిలో తమ సత్తాను ప్రదర్శించగా... రెండో రోజు బ్యాట్స్‌మెన్‌కు కూడా ఫుల్ ప్రాక్టీస్ లభించినట్టయ్యింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (76 బంతుల్లో 53; 7 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా... రెండో రోజు ఆట ముగిసేసమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 68 ఓవర్లలో 312/9 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి రోజు ఆటలో లోకేశ్ రాహుల్ కూడా హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. 135/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన భారత బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేసేందుకు లంక బౌలర్లు తెగఇబ్బంది పడ్డారు. కేవలం వారికి పాండ్యా (11), జడేజా (18) వికెట్లను మాత్రమే తీయగలిగారు. అంతకుముందు రహానే (40), రోహిత్ శర్మ (38), శిఖర్ ధావన్ (41) కూడా తమ బ్యాట్లకు పనిచెబుతూ క్రీజులో కాస్త సమయాన్ని గడిపారు. కోహ్లి సహా వీరంతా రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగారు. చాంపియన్స్ ట్రోఫీ అనంతరం విశ్రాంతి తీసుకున్న రోహిత్, ధావన్ మధ్య 16 ఓవర్లలో 80 పరుగులు జత చేరాయి. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా (36 నాటౌట్) ఆకట్టుకున్నాడు. జడేజా అవుట్ కాగానే ఇరు జట్లు డ్రాకు అంగీకరించాయి. సంక్షిప్త స్కోర్లు: శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 187 ఆలౌట్; భారత్ తొలి ఇన్నింగ్స్: 312/9 డిక్లేర్ (68 ఓవర్లలో) (రాహుల్ 54, కోహ్లి 53, ధావన్ 41; ఫెర్నాండో 2/37). -
అన్నీ మరచి ఆటపై దృష్టి!
-
అన్నీ మరచి ఆటపై దృష్టి!
►ఇటీవలి పరిణామాలు జట్టుపై ప్రభావం చూపించవు ►ఫలితాలు సాధించడమే కీలకం: భారత కెప్టెన్ కోహ్లి ►కోచ్‌ల కంటే ఆటగాళ్లు ముఖ్యం: రవిశాస్త్రి ►శ్రీలంక చేరిన భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఘోర పరాజయం తర్వాత భారత క్రికెట్ జట్టుకు సంబంధించిన వార్తల్లో క్రికెట్ వెనక్కి వెళ్లిపోగా... వివాదాలు, విమర్శలు వెల్లువలా వచ్చి పడ్డాయి. ఒకవైపు ఎవరూ పట్టించుకోకుండా విండీస్ సిరీస్ సాగిపోగా... మరోవైపు కెప్టెన్, కోచ్ విభేదాలు, అనిల్ కుంబ్లే అనూహ్య రాజీనామా అనంతరం కొత్త కోచ్ ఎంపిక ప్రహసనంలాంటి అంశాలతో అంతా గందరగోళంగా సాగింది. సరిగ్గా నెల రోజుల పాటు సాగిన ఈ పరిణామాలను మరచి ఇప్పుడు ఆట వైపు మళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. కెప్టెన్ కోరుకున్న కోచ్, కోచ్ కోరుకున్న సహాయక బృందంతో కలిసి భారత్ ఇప్పుడు శ్రీలంక పర్యటన నుంచి కొత్త ఆరంభం దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమైంది. ముంబై: భారత క్రికెట్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో తనపై ఎలాంటి అదనపు ఒత్తిడి ఉండదని కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యానించాడు. మైదానం బయట చోటు చేసుకునే ఘటనలు జట్టుపై ప్రభావం చూపించవని అతను స్పష్టం చేశాడు. మూడు టెస్టులు, ఐదు వన్డేల సిరీస్ కోసం బుధవారం భారత జట్టు శ్రీలంకకు వెళ్లింది. ఈ నెల 26 నుంచి భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్టు జరుగుతుంది. జట్టు బయల్దేరడానికి ముందు కోహ్లి మీడియాతో ముచ్చటించాడు. ‘కొన్ని సార్లు ఏం జరగాలో అది కచ్చితంగా జరిగి తీరుతుందని నేను నమ్ముతాను. ఇలాంటి వాటి వల్ల నాపై అదనపు ఒత్తిడి ఏమీ ఉండదు. ఒక జట్టుగా ఏం సాధించాలనే దానిపైనే మేం దృష్టి పెడతాం. గతంలోనూ అందరూ క్లిష్ట పరిస్థితులను అధిగమించారు. విమర్శలకు గురి కావడం మాకు కొత్త కాదు. నా బాధ్యతలను నేను ఎప్పుడూ భారంగా భావించను’ అని కోహ్లి స్పష్టం చేశాడు. తాను కెప్టెన్‌గా ఉన్నంత వరకు ఎలాంటి బాధ్యత ఇచ్చినా దానిని నెరవేరుస్తానని, పాత విషయాలను మనసులోంచి తుడిచేసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అతను అన్నాడు. కుంబ్లేతో విభేదాల గురించి నేరుగా వ్యాఖ్యానించకపోయినా... పరోక్షంగా తన వ్యాఖ్యలతో కోహ్లి ‘సమన్వయం’ ఎలా ఉంటుందో గుర్తు చేయడం విశేషం. ‘ఇద్దరు వ్యక్తుల మధ్య అవగాహన అనేది ఆటలోనే కాదు జీవితంలో కూడా బాగా పని చేస్తుంది. నేను దానిని పాటిస్తాను. ప్రతీ ఒక్కరికి జీవితంలో సంబంధాలు కొనసాగించే విషయంలో ఈ తరహా అనుభవాలు ఎదురయ్యే ఉంటాయి. సహకారం, సమన్వయం ఎంత కీలకమో అప్పుడే తెలుస్తుంది’ అని విరాట్ విశ్లేషించాడు. 2015లో శ్రీలంకతో ఆడిన సిరీస్ నుంచే భారత్ వరుస విజయాల జోరు మొదలైంది. నాటితో పోలిస్తే ఈ రెండేళ్లలో ఆటగాళ్లు మరింత పరిణతి చెందారని, తమపై తాము విశ్వాసం ఉంచడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయని కోహ్లి అభిప్రాయపడ్డాడు. సచిన్ కూడా కావాలన్న శాస్త్రి! భారత సహాయక సిబ్బంది ఎంపికకు సంబంధించి రవిశాస్త్రి, బీసీసీఐ ప్రత్యేక కమిటీ మధ్య జరిగిన చర్చల గురించి ఒక ఆసక్తికర అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. జట్టు సలహాదారుడిగా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఉంటే బాగుంటుందని ఈ సమావేశంలో శాస్త్రి సూచించారు. అదే జరిగితే సచిన్ ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్’ పరిధిలోకి వచ్చే అవకాశం ఉండేది. తాత్కాలిక ప్రాతిపదికన కొద్ది రోజుల కోసం సలహాదారుడిగా పని చేసినా... సచిన్ ఐపీఎల్ సహా తన ఇతర అనేక ఒప్పందాలకు దూరం కావాల్సి ఉంటుంది. దాంతో ఈ ప్రతిపాదనకు బీసీసీఐ కమిటీ బ్రేక్ వేసింది. నేను చాలా మారిపోయాను.... హెడ్ కోచ్ హోదాలో రవిశాస్త్రి కూడా తొలిసారి మీడియాతో మాట్లాడి తన అభిప్రాయాలు వెల్లడించారు. భారత క్రికెట్ వ్యవస్థలో ఎంతో మంది వచ్చి వెళుతుంటారని, వారికంటే ఆట ముఖ్యమని ఆయన అన్నారు. కోచ్‌లకంటే కూడా ఆటగాళ్లు కీలకమని గుర్తు చేశారు. ‘ఇటీవలి ఘటనల బరువును నా నెత్తిన పెట్టుకొని నేను రాలేదు. గత మూడేళ్లుగా భారత జట్టు చాలా బాగా ఆడుతోంది. గొప్పతనమంతా ఆటగాళ్లదే. రవిశాస్త్రి కావచ్చు, కుంబ్లే కావచ్చు ఎవరైనా వచ్చి వెళుతుంటారు. భారత్ నంబర్‌వన్ అయిందంటే అది ఆటగాళ్ల శ్రమ వల్లే తప్ప కోచ్‌ల వల్ల కాదు. ఎవరు ఉన్నా లేకున్నా భారత క్రికెట్ స్వరూపంలో మార్పుండదు’ అని శాస్త్రి వ్యాఖ్యానించారు. గతంలో శ్రీలంకలో పర్యటించడంతో పోలిస్తే తనలో చాలా మార్పు వచ్చిందని, గత మూడు వారాల్లో అయితే తాను మరింత పరిణతి చెందానని ఆయన చెప్పారు. తాను పట్టుబట్టి తీసుకున్న బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌పై శాస్త్రి ప్రశంసలు కురిపించారు. ‘దాదాపు పదిహేనేళ్లు ఆయన కోచింగ్‌లోనే గడిపారు. ఇండియా ‘ఎ’, అండర్–19 స్థాయిలో అరుణ్ మంచి ఫలితాలు సాధించారు. 2015 వరల్డ్ కప్‌లో మన బౌలర్లు ఎనిమిది మ్యాచ్‌లలో 77 వికెట్లు తీశారు. ఆటగాడిగా చెప్పుకోదగ్గ రికార్డు లేకపోవడం వల్లే ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదు. లేకపోతే అతని గురించి గొప్పగా చెప్పేవారు. నేను చెప్పడంకంటే అంతా అతడి పనితీరును చూస్తే బాగుంటుంది’ అని హెడ్ కోచ్ సమర్థించారు. శాస్త్రి నాకు సరి జోడి! హెడ్ కోచ్ రవిశాస్త్రితో కలిసి పని చేయడంలో తనకు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాకపోవచ్చని కోహ్లి అన్నాడు. గతంలోనూ తమ మధ్య మంచి సమన్వయం కొనసాగిందని అతను గుర్తు చేశాడు. ‘2014 నుంచి 2016 వరకు వరుసగా మూడేళ్ల పాటు కలిసి పని చేశాం. కాబట్టి మంచి అవగాహన ఉండటం సహజం. కొత్తగా నేను ఆయనను అర్థం చేసుకోవడానికేమీ లేదు. ఒకరి నుంచి మరొకరం ఏం ఆశిస్తున్నామో, అందుబాటులో ఎలాంటి వనరులు ఉన్నాయో ఇద్దరికీ బాగా తెలుసు. సమన్వయం కోసం కొత్తగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు’ అని కోహ్లి తన భావాన్ని ప్రకటించాడు. -
బెస్ట్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ: పాక్ క్రికెటర్
కరాచీ: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీనే ప్రపంచ అత్యున్నత బ్యాట్స్‌మన్ అని పాక్ పేస్ బౌలర్ మహ్మద్ అమీర్ అభిప్రాయపడ్డాడు. ట్వీటర్లో ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసిన అమీర్‌ను అభిమానులు ప్రపంచ అత్యున్నత బ్యాట్స్‌మన్ ఎవరూ అని ప్రశ్నించగా.. కోహ్లీతో పాటు జోరూట్, విలియమ్సన్, స్టీవ్స్మిత్లని సమాధానమిచ్చాడు. అభిమానులు వీరిలో బెస్ట్ బ్యాట్స్‌మన్ ఎవరినో ఒకరినే ఎంచుకోవాలని సూచించడంతో అందరూ గొప్ప ఆటగాళ్లే.. నా బెస్ట్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీనే అని తెలిపాడు. మరో అభిమాని అమీర్‌ను మీరు ఆడిన తొలి చాంపియన్స్ ట్రోఫీలో సచిన్ వికెట్ తీశారు. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కోహ్లీ వికెట్ పడగొట్టారు.. ఏ వికెట్ ఎక్కువగా సంతోషాన్నించింది అని ప్రశ్నించగా.. కీలకమైన రెండు వికెట్లు తీయడం సంతోషాన్నిచ్చిందని అమీర్ తెలిపాడు. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఈ స్పీడ్ స్టార్ (6-2-16-3)తో భారత్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బకొట్టిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం అమీర్‌ను ఉద్దేశించి విరాట్ కోహ్లీ తన తప్పులను సరిదిద్దుకోని రాణించడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించాడు. వీరిద్దరూ అనేక సందర్భాల్లో స్నేహంగా ఉంటూ క్రీడాస్పూర్తిని చాటుకున్నారు. కోహ్లీ తన బ్యాటును అమీర్ కు బహుమానంగా కూడా ఇచ్చాడు. who is currently the best batsman in the world according to u ? — Muhammad Hamza Saeed (@masakadza09) 16 July 2017 Virat kohli https://t.co/MzcRQfBigg — Mohammad Amir (@iamamirofficial) 16 July 2017 Wicket of Virat Kohli in this Champions trophy or Sachin's wicket in Your First Champions trophy? Which one you enjoyed More? — N. (@_Screenager) 16 July 2017 Both equally -
'నా లవ్‌తో బ్రేక్ చాలా అవసరం'
న్యూయార్క్: ప్రేమ పక్షులు విరాట్ కోహ్లి, అనుష్క శర్మలు న్యూయార్క్‌లో వాలాయి. న్యూయార్క్ నగర వీధుల్లోని గాలిలో ప్రేయసితో కలిసి తిరుగుతుండటం కోహ్లికి బాగా ఊరటనిస్తున్నట్లుంది. ఇంగ్లాండ్, వెస్టిండీస్‌లలో వరుసగా మ్యాచ్‌లలో పాల్గొన్న విరాట్.. మచ్ నీడెడ్ బ్రేక్ విత్ మై లవ్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అనుష్కతో కలిసివున్న ఓ ఫోటోను పోస్టు చేశాడు. ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరలైంది. నెటిజన్లు ‘విరుష్క’ చక్కటి జంట అంటూ లైకులు, కామెంట్స్ పెడుతున్నారు. అనుష్క.. న్యూయార్క్‌లో జరగనున్న ఐఫా అవార్డుల కార్యక్రమం నిమిత్తం వెళ్లినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. జులై 15న న్యూయార్క్‌లోని మెట్‌లైఫ్ స్టేడియంలో ఐఫా ఈవెంట్ జరగబోతోంది. మరోవైపు విరాట్ వెస్టిండీస్ టూర్ ముగించుకుని అటు నుంచి యూఎస్ వచ్చినట్లు తెలుస్తోంది. -
అత్యుత్తమ జట్టు తయారవుతుంది!
భారత కోచ్ రవిశాస్త్రి ఆశాభావం ముంబై: భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ జట్టుగా ఎదిగే లక్షణాలు ప్రస్తుత టీమ్‌కు ఉన్నాయని కొత్త కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. రాబోయే రోజులన్నీ గొప్పగా ఉంటాయని ఆయన అన్నారు. ‘గతంలో ఎప్పుడూ లేనంత బలమైన భారత టెస్టు జట్టు త్వరలో సిద్ధం కావచ్చు. అన్ని పరిస్థితుల్లోనూ రాణిస్తూ 20 వికెట్లు తీయగల పేస్ బలగం మనకుంది. వారి వయసు కూడా అందుకు తగిన అవకాశం కల్పిస్తోంది’ అని శాస్త్రి అన్నారు. కోహ్లి అద్భుతంగా ఆడుతున్నా... రాబోయే ఐదారేళ్లు అతని అత్యుత్తమ ఆటను చూస్తామని, అతని గొప్పతనం అప్పుడు కనిపిస్తుందని శాస్త్రి చెప్పారు. తాను ఇప్పుడే ఎంపికయ్యానని, కోహ్లితో చర్చించిన తర్వాతే 2019 ప్రపంచకప్‌తో పాటు ధోని, యువరాజ్ తదితరుల గురించి ఆలోచిస్తామని చెప్పారు. మరోవైపు సౌరవ్ గంగూలీతో విభేదాలు అనేది ముగిసిన అంకమని, ఎవరు ఏం మాట్లాడినా భారత జట్టు ప్రయోజనాల కోసమేనన్న రవిశాస్త్రి... ఇంటర్వ్యూలో గంగూలీ తనను చక్కటి ప్రశ్నలు అడిగినట్లు వెల్లడించారు. -
కోహ్లి అద్భుతమైన కెప్టెన్: రవిశాస్త్రి
న్యూఢిల్లీ: టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లి అద్భుతమైన కెప్టెన్ అని కోచ్ రవిశాస్త్రి అన్నారు. కెప్టెన్‌గా మరో ఐదేళ్లు రాణించే సత్తా కోహ్లికి ఉందని చెప్పారు. భారత జట్టుకు మరిన్ని విజయాలను చేకూర్చుతానని అన్నారు. భారత క్రికెట్ ఇప్పటివరకూ చూడని టెస్టు క్రికెట్ టీమ్ కోహ్లి సారథ్యంలో సాధ్యమవుతుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. టీంలో ఉన్న ఆటగాళ్లందరూ అన్ని పరిస్ధితిల్లో ఆడగల సత్తా కలిగి ఉన్నారని అన్నారు. గత 12 నెలలుగా టీమిండియాలో ఏం జరిగిందో తనకు తెలీదని చెప్పారు. కానీ, ఇక నుంచి కొత్త శకాన్ని ప్రారంభిస్తామని అన్నారు. టీంలో ఉన్న ఫాస్ట్ బౌలర్లు అన్ని రకాలు రాణిస్తుండటం శుభసూచకమని అన్నారు. ఈ నెల 26 నుంచి ప్రారంభంకానున్న శ్రీలంక పర్యటన నుంచి రవిశాస్త్రి చూపిన బాటలో భారత టీమ్ నడవనుంది. -
భారత్ ఘన విజయం
-
భారత్ ఘన విజయం: సిరీస్ కైవసం
కింగ్స్టన్: కరీబియన్ గడ్డపై టీమ్ఇండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. నాలుగో వన్డేలో అనూహ్య విజయం సాధించిన సిరీస్ రేసులో నిలిచిన హోల్డర్ సేన చివరిదైన ఐదో వన్డేలో విఫలమైంది. టీమిండియా సారధి విరాట్ కోహ్లి 111(115) సెంచరీతో కప్పును సొంతం చేసుకుంది. గురువారం కింగ్‌స్టన్‌లో జరిగిన ఆఖరి వన్డేలో వెస్టిండీస్‌పై 8 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించడంతో 3-1 తేడాతో సిరీస్‌ను కోహ్లీసేన సొంతం చేసుకుంది. కీలకమైన చివరి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన విండీస్, మహ్మద్ షమీ(4/48), ఉమేశ్ యాదవ్(3/53) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 205 పరుగులు చేసింది. హోప్ సోదరులు షెయ్(51), కైల్(46) పరుగులు చేశారు. విజృంభించిన బౌలర్లు టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. విండీస్ స్కోరు 39 వద్ద హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో లూయిస్(9) వెనుతిరగడంతో విండీస్ వికెట్ల పతనం ప్రారంభమైంది. ఉమేశ్ వరుస బంతుల్లో ఫీల్డర్ చేజ్ల పెవిలియన్ చేర్చాడు. 76 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన విండీస్‌ను షెయ్, మహ్మద్‌లు కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇన్నింగ్స్ గాడిలో పెడుతున్నమహ్మద్(16)ను జాదవ్ ఔట్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హోల్డర్ ధాటిగానే ఆడాడు. 34 బంతులాడిన హోల్డర్ 4ఫోర్లు, సిక్సర్ లతో 36 పరుగులు చేశాడు. స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ యాదవ్‌లు ప్రత్యర్థి బౌలర్లను కట్టడి చేశారు. రాణించిన విరాట్, రహానే 206 పరుగుల స్వల్ప ఛేదనలో భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జోసెఫ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఆఖరి బంతికే శిఖర్ ధావన్(4) ఔటయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన విరాట్, మరో ఓపెనర్ రహానె వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. చెత్తబంతులను బౌండరీలు దాటిస్తూ.. వీలుచిక్కినప్పుడల్లా సింగిల్స్ తీస్తూ లక్ష్యం వైపు అడుగులేశారు. భారీ భాగస్వామ్యం వైపు దూసుకెళ్తున్న ఈ జోడీని దేవేంద్ర బిషూ విడదీశాడు. 19వ ఓవర్ ఆఖరి బంతికి రహానె 39(51)ఎల్బీగా వెనుదిరిగాడు. విరాట్‌కోహ్లీ 22వ ఓవర్లో ఫోర్‌తో 67 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. చాలా రోజుల తర్వాత కోహ్లీ తనదైన శైలిలో అలరించాడు. లక్ష్యానికి దగ్గరవుతున్నా కొద్దీ కోహ్లీ, కార్తీక్ ద్వయం భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. విలియమ్స్ వేసిన 35వ ఓవర్లో ఫోర్ బాదిన విరాట్ వన్డే కెరీర్లో 28వ శతకాన్ని సాధించాడు. 108 బంతులాడిన విరాట్ 12 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం 37వ ఓవర్ మూడో బంతికి సింగిల్ తీసి కార్తీక్ 50(52)బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. శతకంతో రాణించిన ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ను విరాట్ కోహ్లి అందుకోగా.. ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును ఆజింక్య రహానె దక్కించుకున్నాడు. -
భారత బౌలర్ల జోరు
►వెస్టిండీస్ 189/9 ►పాండ్యా, ఉమేశ్‌లకు చెరో 3 వికెట్లు ►భారత్‌తో నాలుగో వన్డే నార్త్ సౌండ్ (ఆంటిగ్వా): సిరీస్‌లో తమ ఆశలు నిలుపుకోవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్ లోనూ వెస్టిండీస్ ఆటలో ఎలాంటి మార్పు కనిపించలేదు. భారత బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ విలవిలలాడడంతో ఓ మాదిరి స్కోరు కూడా చేయలేకపోయింది. ఆదివారం సర్ వివియన్ రిచర్డ్స్ మైదానంలో జరిగిన నాలుగో వన్డేలో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు చేసింది. ఓపెనర్లు లూయిస్ (60 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కైల్ హోప్ (63 బంతుల్లో 35; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. హార్దిక్ పాండ్యా, ఉమేశ్ యాదవ్ చెరో 3 వికెట్లు తీయగా, కుల్దీప్కు 2 వికెట్లు దక్కాయి. యువరాజ్, అశ్విన్ స్థానాల్లో దినేశ్ కార్తీక్, జడేజాతో పాటు భువనేశ్వర్ స్థానంలో రెండేళ్ల అనంతరం పేసర్ షమీ తొలిసారి వన్డే బరిలోకి దిగాడు. అదే తీరు... టాస్ గెలిచిన విండీస్ ఈసారి సిరీస్‌లో తొలిసారిగా బ్యాటింగ్ చేపట్టింది. అయితే ఆరంభంలో పేసర్లు షమీ, ఉమేశ్ యాదవ్ కట్టుదిట్టమైన బంతులతో విండీస్‌ను ఇబ్బందిపెట్టారు. వీరిద్దరి ధాటికి తొలి పది ఓవర్లలో కేవలం 31 పరుగులు మాత్రమే చేసింది. కానీ పరుగులు పెద్దగా చేయకపోయినా క్రీజులో పాతుకుపోయి విసిగించిన విండీస్‌ను 18వ ఓవర్లో పాండ్యా దెబ్బతీశాడు. నిదానంగా కుదురుకుంటున్న కైల్ హోప్... జాదవ్‌కు క్యాచ్ ఇవ్వడంతో తొలి వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. జడేజా బౌలింగ్‌లో సిక్సర్ బాదిన మరో ఓపెనర్ లూయిస్‌ను కుల్దీప్ తను వేసిన తొలి ఓవర్లోనే అవుట్ చేయడంతో విండీస్ మరో కీలక వికెట్‌ను కోల్పోయింది. కొద్దిసేపటికి ఓ మాదిరిగా ఆడుతున్న చేజ్‌ను కూడా కుల్దీప్ అవుట్ చేయడంతో 121 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత భారత బౌలర్లు ఒక్కసారిగా చెలరేగడంతో 32 పరుగుల వ్యవధిలోనే షై హోప్ (39 బంతుల్లో 25; 1 ఫోర్), హోల్డర్ (11), పావెల్ (2), మొహమ్మద్ (20) వికెట్లను కోల్పోయి విండీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత కూడా పరిస్థితి మారకపోవడంతో జట్టు 200 పరుగులు కూడా చేయలేకపోయింది. భారత్ 53/3 కడపటి వార్తలు అందేసరికి భారత్ 15 ఓవర్లలో 3 వికెట్లకు 53 పరుగులు చేసింది. ధావన్(5), కోహ్లి(3), కార్తీక్(2) విఫలం కాగా, రహానే (36), ధోని (4) క్రీజులో ఉన్నారు. -
విండీస్‌పై భారత్ ఘనవిజయం
► రహానే అజయ శతకం ► రాణించిన కోహ్లీ, ధావన్ ► ఆకట్టుకున్న కుల్ధీప్, భువీ పోర్ట్ ఆఫ్ స్పెయిన్: కరీబియన్ పర్యటనలో భారత్ బోణి కొట్టింది. ఏకంగా 105 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. ఓపెనర్ అజింక్యా రహానే శతకంతో చెలరేగగా, ధావన్, కోహ్లీ అర్ధ సెంచరీలతో రాణించారు. ఇక యువ బౌలర్ కుల్ధీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. దీంతో భారత్ విండీస్‌పై సునాయసంగా విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు మంచి శుభారంబాన్ని అందించారు. తొలి వన్డేలో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న రహానే ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో శతకం (104 బంతుల్లో 103; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) బాదాడు. అతడికి తోడు కెప్టెన్ కోహ్లి (66 బంతుల్లో 87; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), శిఖర్ ధావన్ (59 బంతుల్లో 63; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించగా భారత్ 43 ఓవర్లలో ఐదు వికెట్లకు 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. జోసెఫ్‌కు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు భారీ వర్షం కారణంగా మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. భారీ లక్ష్య చేదనకు దిగిన విండీస్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ పోవెల్ భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్ మూడో బంతికే డకౌటయ్యాడు. ఆ తర్వత క్రీజులోకి వచ్చిన మహ్మద్‌ను కూడా భువీ డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. మరో ఓపెనర్ షై హోప్(89) ఒంటిరి పోరాటం చేయగా మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి సహాకారం అందకపోవడంతో నిర్ణీత 43 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఇక భారత్ బౌలర్లలో భువీ 2, కుల్దీప్ యాదవ్ (3), అశ్విన్ (1) దక్కాయి. శతక వీరుడు అజింక్యా రహానేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. -
చెప్పను బ్రదర్!
కుంబ్లేతో వివాదంపై నోరు విప్పని కోహ్లి పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారత కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా, అందుకు దారి తీసిన కారణాల గురించి చర్చ జరగడంతో ఈ వివాదంలో రెండో కోణంపై అందరికీ ఆసక్తి నెలకొంది. కోహ్లి కూడా తన వాదనలు వినిపిస్తాడని అనిపించింది. అయితే దీనిపై కోహ్లి మౌనాన్నే ఆశ్రయించాడు. కుంబ్లే రాజీనామా అనంతరం గురువారం కోహ్లి తొలిసారి మీడియా ముందుకు వచ్చాడు. కుంబ్లే అంటే తనకు ‘గౌరవం’ ఉందని చెప్పిన కోహ్లి... ఆటగాళ్ల మధ్య జరిగిన విషయాలను తాను బయటకు చెప్పబోనన్నాడు. ‘అనిల్ భాయ్ తన అభిప్రాయాలు వెల్లడించారు. కోచ్ పదవి నుంచి తప్పుకోవాలని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మేం గౌరవిస్తాం. క్రికెటర్‌గా దేశానికి ఎనలేని సేవలందించిన ఆయనంటే మాకు చాలా గౌరవం ఉంది. ఆ విషయంలో కుంబ్లేను తక్కువ చేయలేం’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. అయితే డ్రెస్సింగ్ రూమ్ ‘పవిత్రత’ను తాను కాపాడాల్సిన అవసరం ఉందని అన్నాడు. ‘చాంపియన్స్ ట్రోఫీ సమయంలో నేను 11 సార్లు మీడియా సమావేశాల్లో పాల్గొన్నాను. గత 3–4 నాలుగేళ్లుగా భారత జట్టులో ఒక సంస్కృతి నెలకొంది. మా మధ్య అంతర్గతంగా ఏం జరిగినా దానిని బయటకు చెప్పకూడదని మేం గట్టిగా నిర్ణయించుకున్నాం. అదంతా వ్యక్తిగత వ్యవహారం. డ్రెస్సింగ్ రూమ్ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మాకుంది. అన్నింటికంటే మాకు అదే ముఖ్యం. దాని గురించి బహిరంగంగా మాట్లాడను. కుంబ్లే తాను చెప్పదల్చుకున్నది చెప్పారు. ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తాం’ అని అన్నాడు. -
కోహ్లి మదిలో ఎవరు?
కోచ్ కోసం మళ్లీ దరఖాస్తులు కోరనున్న బీసీసీఐ ముంబై: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ మరోసారి కొత్తగా దరఖాస్తులను ఆహ్వానించనుంది. వాస్తవానికి మే 31తోనే ఈ గడువు ముగిసినా... తాజాగా కుంబ్లే నిష్క్రమణ అనంతరం ఆసక్తిగల వారి నుంచి మళ్లీ అప్లికేషన్లు తీసుకుంటే బాగుం టుందని బోర్డు భావిస్తోంది. దరఖాస్తు పంపేందుకు వారం నుంచి పది రోజుల గడువు ఇచ్చే అవకాశం ఉంది. ‘మేం ఇంతకు ముందు దరఖాస్తులు తీసుకున్న సమయంలో కుంబ్లే కూడా బరిలో ఉన్నారు. అతని రికార్డు వల్ల మళ్లీ కుంబ్లేనే కొనసాగే అవకాశం ఉందని, పోటీ పడినా ఫలితం లేదని చాలా మంది భావించి ఆగిపోయారు. ఇప్పుడు కుంబ్లే లేకపోవడంతో పరిస్థితులు మారిపోయాయి. ఈ సమయంలో మరికొందరు ఆసక్తిగా ముందుకు వస్తున్నారు’ అని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం సెహ్వాగ్, మూడీ, రాజ్‌పుత్, పైబస్, దొడ్డ గణేశ్ దరఖాస్తులు మాత్రమే బీసీసీఐ వద్ద ఉన్నాయి. చాంపియన్స్ ట్రోఫీకి వెళ్లే ముందే రవిశాస్త్రి కోచ్‌గా ఉంటే బాగుంటుందంటూ కోహ్లి సూచించినట్లు వార్తలు వచ్చాయి. తాజా పరిణామాల నేపథ్యంలో కోహ్లి మాట చెల్లుబాటయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. మరోవైపు కుంబ్లే, కోహ్లి విభేదాలకు సంబంధించిన పరిణామాలపై తమకు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రిని సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ కోరారు. మెతకగా ఉండే కోచ్‌ను ఆటగాళ్లు కోరుకుంటున్నట్లు అనిపిస్తోంది. ఇవాళ మీరు బాగా అలసిపోయారు కాబట్టి ప్రాక్టీస్ అవసరం లేదు. సెలవు తీసుకోండి లేదా షాపింగ్‌కు వెళ్లండి అని చెప్పే కోచ్ వారికి కావాలేమో. తీవ్రంగా సాధన చేయించి ఫలితాలు రాబట్టే కోచ్ వారికి అవసరం లేదు. నిజంగా కోచ్ గురించి ఏ ఆటగాళ్లయినా ఫిర్యాదు చేస్తే వారిని జట్టులోంచి తీసేయాలి. – సునీల్ గావస్కర్ -
లెజెండ్స్‌కు పాక్ క్రికెటర్ ధన్యవాదాలు
పాకిస్తాన్ ఓపెనర్ అజార్ అలీ ఇండియా క్రికెటర్లపై ఒక అద్భుతమైన ట్వీట్ చేశాడు. అలీ క్రికెట్ లెజెండ్స్ అయినా ధోని, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్‌లకు తన ట్వీట్ ద్వారా ధన్యవాదాలు తెలిపాడు. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ పైనల్ తర్వాత ఈ ముగ్గురితో తన కుమారులు ఫోటోలు దిగారు. తమ సమయాన్ని ఫోటోలు దిగేందుకు కేటాయించినందుకు అలీ చాలా సంతోషంగా ఉన్నాడు. తన కుమారులు సంతోషంగా ఉన్నారని అన్నారు. కొద్దిసేపటి క్రితం పోస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికే దాదాపుగా 4700 లైక్స్ కొట్టారు. ఈ ట్వీట్‌కు 2300 రిట్వీట్స్ వచ్చాయి. అలీ తన కుమారులు లెజెండ్స్‌తో దిగిన ఫోటోలను ట్వీటర్లో పెట్టాడు. -
ఫైనల్లో అంతే.. కోహ్లి చెత్త రికార్డు..!
ప్రస్తుత భారత జట్టులో డ్యాషింగ్ బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లికి ఘనమైన చరిత్ర ఉంది. సెంచరీల మీద సెంచరీలు చేయడమే కాదు అనేక మ్యాచుల్లో భారత్‌ను గెలిపించిన ఘనత అతనిది. మూడు ఫార్మెట్లలోనూ సారథిగా బాధ్యతలు చేపట్టి జట్టుకు వరుస విజయాలను కోహ్లి అందిస్తూ వచ్చాడు. జట్టు ప్రతిష్టను పెంచాడు. కానీ కోహ్లిపై ఒక మచ్చ ఉంది. అదే కీలకమైన ఫైనల్ మ్యాచుల్లో ఆడకపోవడం. విరాట్ కోహ్లి ఇప్పటివరకు ఎనిమిది ఫైనల్ మ్యాచులు ఆడాడు. కానీ ఒక్క ఫైనల్ మ్యాచ్‌లోనూ కోహ్లి సెంచరీగానీ, అర్ధసెంచరీగానీ చేయలేదు. ఈ ఎనిమిది ఫైనల్ మ్యాచుల్లోనూ కోహ్లి బ్యాటింగ్ సగటు 22 మాత్రమే. అత్యంత కీలకమైన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లోనూ కోహ్లి చేతులెత్తేశాడు. ఆమిర్ బౌలింగ్‌లో మొదట స్లిప్‌లో క్యాచ్ మిస్ అయి.. లైఫ్ దొరికినా.. దానిని కోహ్లి సద్వినియోగం చేసుకోలేదు. ఆ వెంటనే ఆమిర్ బౌలింగ్‌లోనే కోహ్లి పెవిలియన్ బాట పట్టాడు. ఫైనల్లో ఏమాత్రం ఆడిన ఘనత లేని కోహ్లి దాయాది పోరులో ఇంతకన్నా ఎక్కువ స్కోరు చేస్తాడని తాము ఆశించలేమని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
ఆనాటి మ్యాచ్‌లో పాక్‌పై 329 కొట్టేశాం!
ఎంతో ఆసక్తి రేపుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరులో పాకిస్థాన్ జట్టు అంచనాలకు మించి ఆడి 339 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియాకు విసిరింది. ఐసీసీ టోర్నమెంటు ఫైనల్లో నమోదైన రెండో అత్యధిక స్కోరు ఇది. 2003 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా జట్టు చేసిన 359/2 పరుగులు ఇప్పటివరకు అత్యధిక స్కోరు కాగా..రెండో అత్యధిక స్కోరు కూడా భారత్‌కు వ్యతిరేకంగానే నమోదు కావడం గమనార్హం. ఇక 1975లో లార్డ్స్ వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాపై చేసిన 291/8 పరుగులు మూడో అత్యధిక స్కోరుగా ఉంది. ఇక భారత్‌పై పాకిస్థాన్ చేసిన రెండో అత్యధిక స్కోరు కూడా ఇదే. 2004లో కరాచీ మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్ 8వికెట్లకు 344 పరుగులు చేసింది. అయితే, పాకిస్థాన్‌పై 300 పైచిలుకు భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన చరిత్ర భారత్‌కు ఉంది. 2012 ఆసియా కప్‌లో విరాట్ కోహ్లి చెలరేగి 183 పరుగులు చేయడంతో 329 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా అలవోకగా ఛేదించింది. టీమిండియాకు ఉన్న బ్యాటింగ్ లైనప్, బ్యాటింగ్‌లో మన బ్యాట్స్‌మన్ వీరోచిత ప్రతిభను గమనిస్తే.. ప్రస్తుతం 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం పెద్ద కష్టం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించి భారత్ విజయం సాధించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. -
'చాంపియన్'లా వేటాడారు
⇒ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ⇒సెమీస్‌లో 9 వికెట్లతో బంగ్లాదేశ్ చిత్తు ⇒రోహిత్ శర్మ సెంచరీ, కోహ్లి 96 నాటౌట్ ⇒ఆదివారం పాక్‌తో తుది పోరు అద్భుతాలు లేవు. అనూహ్యానికి అవకాశమే కనిపించలేదు. సంచలనం అనేది అందనంత దూరంలో ఉండిపోయింది. అలవోకగా, అలసట అన్నదే దరి చేరకుండా, తమకు అలవాటైన రీతిలో భారత్ మరో అతి సునాయాస విజయాన్ని అందుకుంది. అది మామూలు మ్యాచ్ అయినా, ఐసీసీ టోర్నీలో సెమీఫైనల్ అయినా తమకు ఒకటే అన్నట్లుగా మనోళ్లు చెలరేగిపోయారు. కోటి ఆశలతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కోరికను నిర్దాక్షిణ్యంగా తుంచేస్తూ టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇదీ ఆటంటే అన్నట్లుగా బంగ్లా ఆటగాళ్లను భారత త్రయం ఒక ఆటాడుకుంది. మరో చోట ఎలా గెలిచినా మన ముందు మాత్రం ఇంకా బంగ్లా బేబీలేనని భారత్ నిరూపించింది. తమీమ్, ముష్ఫికర్ భాగస్వామ్యం బంగ్లాదేశ్ బ్యాటింగ్‌కు అండగా నిలిస్తే... ‘ట్రంప్ కార్డ్’ కేదార్ జాదవ్ జాదూతో మళ్లీ కోలుకున్న భారత్, ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా కట్టి పడేసింది. ఆ తర్వాత ఏ దశలోనూ ఇబ్బంది పడకుండా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించి డిఫెండింగ్ చాంపియన్ సత్తానుప్రదర్శించింది. రోహిత్ శర్మ సెంచరీ, కోహ్లి క్లాసిక్‌తో పాటు శిఖర్ ధావన్ మెరుపులు వరుసగా రెండోసారి చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను ఫైనల్‌కు చేర్చాయి. ఇక సాధారణ క్రికెట్ అభిమాని కలలు గనే పోరుకు రంగం సిద్ధమైంది. ఒక ఐసీసీ టోర్నీ తుది పోరులో భారత్, పాకిస్తాన్ తలపడటం అంటే ఫ్యాన్స్‌కు కనులవిందు. పదేళ్ల తర్వాత ఈ దాయాదుల పోరుతో మరో ‘బ్లాక్ బస్టర్ సండే’కు అంతా సిద్ధం కండి. బర్మింగ్‌హామ్: డిఫెండింగ్ ఛాంపియన్ భారత్.. చాంపియన్స్ ట్రోఫీని నిలబెట్టుకునేందుకు మరో విజ యం దూరంలో నిలిచింది. గురువారం ఇక్కడ జరిగి న రెండో సెమీఫైనల్లో టీమిండియా 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్లోకి అడుగు పెట్టింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. తమీమ్ ఇక్బాల్ (82 బంతుల్లో 70; 7 ఫోర్లు, 1 సిక్స్), ముష్ఫికర్ (85 బంతుల్లో 61; 4 ఫోర్లు) అర్ధసెంచరీలు చేశారు. జాదవ్, బుమ్రా, భువనేశ్వర్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 40.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 265 పరుగులు సాధించింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (129 బంతుల్లో 123 నాటౌట్; 15 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగి అజేయ సెంచరీ సాధించగా... కోహ్లి (78 బంతుల్లో 96 నాటౌట్; 13 ఫోర్లు) అండగా నిలిచాడు. శిఖర్ ధావన్ (34 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆదివారం ఓవల్ మైదానంలో జరిగే ఫైనల్లో పాకిస్తాన్‌తో భారత్ తలపడుతుంది. భారీ భాగస్వామ్యం... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. భువనేశ్వర్ వేసిన చివరి బంతికి సౌమ్య సర్కార్ (0) బౌల్డ్ అయ్యాడు. ఫామ్‌లో ఉన్న తమీమ్ నిలదొక్కుకునేందుకు సమయం తీసుకోగా, షబ్బీర్ రహమాన్ (19) వచ్చీ రాగానే చకచకా ఫోర్లతో జోరు ప్రదర్శించాడు. భువీ, బుమ్రా బౌలింగ్‌లో అతను రెండేసి బౌండరీలు బాదాడు. అయితే ఆ తర్వాత భారత్ చక్కటి బౌలింగ్‌తో బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను కట్టి పడేసింది. వరుసగా 13 బంతుల పాటు ఒక్క పరుగు కూడా రాలేదు. దాంతో అసహనం పెరిగిన షబ్బీర్, భువీ బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. అనంతరం ముష్ఫికర్ కూడా దూకుడు ప్రదర్శించాడు. భువీ ఓవర్లో వరుసగా అతను మూడు ఫోర్లు కొట్టడం విశేషం. పాండ్యా ‘నోబాల్’తో అదృష్టవశాత్తూ బతికిపోయిన తమీమ్, ముష్ఫికర్ కలిసి ఆ తర్వాత జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరు భారత ప్రధాన స్పిన్నర్లు అశ్విన్, జడేజాలను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో తమీమ్ 62 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా దూకుడు తగ్గించని తమీమ్, అశ్విన్ వేసిన ఓ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లతో చెలరేగాడు. మరోవైపు 61 బంతుల్లో ముష్ఫికర్ హాఫ్ సెంచరీ కూడా పూర్తయింది. ఇలాంటి స్థితిలో కేదార్‌తో బౌలింగ్ చేయించడం ఆటను మలుపు తిప్పింది. జడేజా బౌలింగ్‌లో ధోని అద్భుతమైన క్యాచ్‌కు షకీబ్ (15) వెనుదిరగ్గా, మొసద్దిక్ (15) కూడా ఎక్కువసేపు నిలవలేదు. 4 పరుగుల వద్ద అశ్విన్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన మహ్ముదుల్లా (21) కొన్ని పరుగులు జోడించగా... చివర్లో కెప్టెన్ మొర్తజా (25 బంతుల్లో 30 నాటౌట్; 5 ఫోర్లు) ఇన్నింగ్స్ బంగ్లాకు గౌరవప్రదమైన స్కోరు అందించింది. చివరి 10 ఓవర్లలో బంగ్లా 57 పరుగులు చేసింది. ఓపెనర్ల శుభారంభం... ఛేదనలో భారత్ ఆరంభం నుంచే సాధికారికంగా ఆడింది. ఓపెనర్లు రోహిత్, ధావన్ బంగ్లా బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వేగంగా పరుగులు సాధించారు. ముస్తఫిజుర్ బౌలింగ్‌లో ధావన్ వరుసగా రెండు ఫోర్లు కొట్టడంతో భారత్ దూకుడు మొదలైంది. ముస్తఫిజుర్ తర్వాతి ఓవర్లో రోహిత్ ఇదే తరహాలో మరో రెండు బౌండరీలు బాదాడు. తస్కీన్ వేసిన ఎనిమిదో ఓవర్లో రెండు ఫోర్లు, సిక్స్‌తో భారత్ 16 పరుగులు రాబట్టింది. అయితే తొలి వికెట్‌కు 87 పరుగులు జోడించిన అనంతరం ధావన్‌ను మొర్తజా అవుట్ చేయడంతో బంగ్లా ఊపిరి పీల్చుకుంది. అయితే జోరు తగ్గించని రోహిత్, షకీబ్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి 57 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బంగ్లాదేశ్ బౌలర్లు పదే పదే షార్ట్, వైడ్ బంతులు వేయడంతో రోహిత్, కోహ్లి ఏమాత్రం ఇబ్బంది పడకుండా అలవోకగా పరుగులు రాబట్టారు. రూబెల్ బౌలింగ్‌లో రోహిత్, ముస్తఫిజుర్ బౌలింగ్‌లో కోహ్లి వరుసగా రెండేసి బౌండరీలు కొట్టారు. రూబెల్ మరో ఓవర్లో భారత్ మూడు ఫోర్లతో 17 పరుగులు పిండుకుంది. ఇదే ఉత్సాహంతో కోహ్లి 42 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. మరో వైపు తన ధాటిని కొనసాగించిన రోహిత్, ముస్తఫిజుర్ బౌలింగ్‌లో సిక్సర్‌తో 111 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. ఇక ఆ తర్వాత భారత్‌కు ఎదురు లేకుండా పోయింది. చివర్లో కోహ్లికి సెంచరీ చేసే అవకాశం వచ్చినా... అతను అంతగా పట్టించుకోకుండా విజయంపైనే దృష్టి పెట్టాడు. 300వ మ్యాచ్ ఆడిన యువరాజ్ సింగ్‌కు బ్యాటింగ్ అవకాశం మాత్రం రాలేదు. కేదార్ పంచ్... కొన్నాళ్ల క్రితమే కివీస్‌పై అనూహ్య బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న కేదార్ జాదవ్ ఈ సారి కీలక మ్యాచ్‌లో కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. భారత ఐదో బౌలర్ పాండ్యా 3 ఓవర్లలో 28 పరుగులు ఇవ్వడంతో మరో ప్రత్యామ్నాయం కావాల్సి వచ్చింది. ఈ దశలో జాదవ్ స్లో ఆఫ్ స్పిన్ భారత్‌కు కీలక వికెట్లు అందించింది. ముందుగా జాదవ్ వేసిన బంతిని స్లాగ్ స్వీప్ ఆడబోయిన ప్రధాన బ్యాట్స్‌మన్ తమీమ్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత జాదవ్ బౌలింగ్‌లో ముందుకొచ్చి షాట్ ఆడబోయే ప్రయత్నం చేసిన ముష్ఫికర్, మిడ్ వికెట్లో కోహ్లికి సునాయాస క్యాచ్ ఇచ్చాడు. ఆ సమయంలో కోహ్లి ప్రదర్శించిన హావభావాలు ఈ వికెట్ విలువను చూపించాయి. రెండు నోబాల్స్... పాండ్యా వేసిన 13వ ఓవర్లో రెండు నోబాల్స్ పడ్డాయి. రెండో బంతిని తమీమ్ మిడాన్ వైపుగా ఆడాడు. ఆ సమయంలో 30 గజాల సర్కిల్ లోపల నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉండటంతో అంపైర్లు దానిని నోబాల్‌గా ప్రకటించారు. మరో మూడు బంతుల తర్వాత పాండ్యా బంతిని తమీమ్ వికెట్లపైకి ఆడుకున్నాడు. అయితే ఈసారి పాండ్యా గీత దాటడంతో తమీమ్ బతికిపోయాడు. ఆ సమయంలో అతని స్కోరు 17 పరుగులు. ఇన్నింగ్స్ 40వ ఓవర్లో ధోని కారణంగా బంగ్లాకు 5 పెనాల్టీ పరుగులు లభించాయి. లాంగ్‌లెగ్ నుంచి ఫీల్డర్ విసిరిన బంతిని అందుకునేందుకు ధోని ముందుగానే తన గ్లవ్స్‌ను విసిరేశాడు. ఆ తర్వాత వచ్చిన బంతిని వికెట్లపైకి తోసే క్రమంలో బంతి నేలపై ఉన్న గ్లవ్స్‌కు తాకింది. దాంతో భారత్‌కు ఐదు పరుగుల జరిమానా పడింది. పదేళ్ల తర్వాత... భారత్, పాక్ ఒక ఐసీసీ టోర్నీ ఫైనల్లో తలపడనుండటం ఇది రెండోసారి. 2007లో జరిగిన తొలి టి20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ 5 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించి టైటిల్ గెలుచుకోవడం అభిమానులు ఎప్పటికీ మరచిపోలేని క్షణం. ఐసీసీ వన్డే టోర్నీ ఫైనల్లో మాత్రం ఇరు జట్ల మధ్య పోరు జరగడం ఇదే తొలిసారి. అయితే నాటితరం అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకునే మ్యాచ్ 1985లో మెల్బోర్న్లో జరిగింది. అప్పట్లో 7 ప్రధాన జట్లు పాల్గొని దాదాపు ప్రపంచకప్‌లాగే సాగిన ‘వరల్డ్ చాంపియన్‌షిప్’ ఫైనల్లో భారత్ 8 వికెట్లతో పాక్‌ను ఓడించి విజేతగా నిలిచింది. ⇒1 వన్డేల్లో 8 వేల పరుగులు పూర్తి చేసుకున్న కోహ్లి, తక్కువ ఇన్నింగ్స్‌లలో (175) ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ⇒ 11 రోహిత్ కెరీర్లో ఇది 11వ సెంచరీ ⇒ 1 చాంపియన్స్ ట్రోఫీలో గంగూలీ (665)ని అధిగమించి అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా ధావన్ (680) నిలిచాడు. -
కొట్టేశాం...సఫారీని, సెమీస్ బెర్త్‌ని
►టీమిండియా సమష్టి ప్రదర్శన ►బ్యాటింగ్‌లో రాణించిన కోహ్లి, ధావన్ ►బౌలింగ్‌లో మెరిసిన బుమ్రా, భువనేశ్వర్ బౌలర్లు భళా... ఫీల్డర్లు భేష్... బ్యాట్స్‌మెన్ జోష్... తుదకు భారత్ చేరింది సెమీస్. క్వార్టర్స్‌ను తలపించిన ఈ లీగ్ పోరులో కోహ్లి సేన ఆల్‌రౌండ్ విశ్వరూపమిది. కేవలం పరుగులు సాధిస్తే సరిపోదని గత మ్యాచ్ అనుభవంతో గుర్తించిన టీమిండియా అన్నింటా ఆధిపత్యాన్ని చూపింది. సఫారీ జట్టును దెబ్బమీద దెబ్బ కొట్టింది. మొదట దక్షిణాఫ్రికా ఓపెనర్ల శుభారంభానికి భారత బౌలర్లు తూట్లు పొడిస్తే, ఫీల్డర్లు కీలక బ్యాట్స్‌మెన్‌ను రనౌట్ చేశారు. విజయ లక్ష్యంలో టాపార్డర్ జాగ్రత్తగా ఆడి సెమీస్ బెర్త్‌ను తెచ్చిపెట్టింది. లండన్: ప్రపంచ నంబర్‌వన్ జట్టు దక్షిణాఫ్రికాను డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆల్‌రౌండ్ షోతో దెబ్బ కొట్టింది. చాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. గ్రూప్ ‘బి’లో ఆదివారం జరిగిన పోరులో భారత్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా 44.3 ఓవర్లలో 191 పరుగులు చేసి ఆలౌటైంది. డికాక్ (72 బంతుల్లో 53; 4 ఫోర్లు) రాణించాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్, బుమ్రా చెరో 2 వికెట్లు తీయగా... జడేజా, అశ్విన్, పాండ్యా తలా ఒక వికెట్‌తో టాపార్డర్‌ను దెబ్బతీశారు. తర్వాత భారత్ 38 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసి జయభేరి మోగించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (83 బంతుల్లో 78; 12 ఫోర్లు, 1 సిక్స్) తన సూపర్ ఫామ్ చాటగా... కెప్టెన్ కోహ్లి (101 బంతుల్లో 76 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. ప్రొటీస్ బౌలర్లలో మోర్కెల్, తాహిర్ చెరో వికెట్ తీశారు. బుమ్రాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ప్రస్తుతం గ్రూప్ ‘బి’లో భారత్ నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఫలితంగా సెమీఫైనల్లో గ్రూప్ ‘ఎ’లో రెండో స్థానం పొందిన బంగ్లాదేశ్‌తో భారత్ తలపడటం దాదాపుగా ఖాయమైంది. నేడు పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య గెలిచిన జట్టు కూడా నాలుగు పాయింట్లతో భారత్‌తో సమఉజ్జీగా ఉంటుంది. అయితే భారత్ రన్‌రేట్ చాలా మెరుగ్గా ఉండటంతో శ్రీలంక లేదా పాక్ రెండో స్థానానికే పరిమితం కావొచ్చు. స్పిన్‌తో మొదలైన పతనం టాస్ గెలిచిన కోహ్లి ఫీల్డింగ్‌కు మొగ్గుచూపాడు. దీంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను డికాక్, ఆమ్లా ప్రారంభించారు. ఇద్దరు జాగ్రత్తగా ఆడటంతో తొలి 10 ఓవర్లలో 35 పరుగులే వచ్చాయి. కోహ్లి స్పిన్నర్లను దించినా...రన్‌రేట్ మందగించినా... వికెట్ కాపాడుకొని ఓపెనర్లు శుభారంభమిచ్చారు. జట్టు స్కోరు 76 పరుగుల వద్ద ఎట్టకేలకు ఇన్నింగ్స్ 18వ ఓవర్లో అశ్విన్... ఆమ్లా (54 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ తీసి భారత శిబిరంలో ఆనందం నింపాడు. తర్వాత వచ్చిన డుప్లెసిస్ (50 బంతుల్లో 36; ఒక ఫోర్) కూడా నింపాదిగానే ఆడటంతో 22వ ఓవర్లో జట్టు స్కోరు 100 పరుగులకు చేరింది. డికాక్ 68 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాక ఆ మరుసటి ఓవర్లోనే జడేజా క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇంతదాకా బాగానే ఉన్నా జట్టు స్కోరు 140 పరుగుల వద్ద డివిలియర్స్ (16) రనౌట్‌తో మొదలైన పతనం వడివడిగా సఫారీని ముంచేసింది. సమన్వయ లోపంతో ఆ తర్వాతి ఓవర్లోనే మిల్లర్ (1) కూడా రనౌట్ కాగా, మోరిస్ (4), ఫెలుక్వాయో (4)లను బుమ్రా ఔట్ చేశాడు. రబడ (5), మోర్కెల్ (0) భువీ బౌలింగ్‌లో నిష్క్రమించారు. ఫలితంగా 140/2 స్కోరుతో పటిష్టంగా ఉన్న దక్షిణాఫ్రికా 191కే ఆలౌటైంది. ఓవైపు డుమిని (20 నాటౌట్) పోరాడుతున్నా మరో ఎండ్‌లో వికెట్ల పతనంతో ఏమీ చేయలేని స్థితి. తాహిర్ (1)తో రనౌట్ల సంఖ్య 3కు చేరింది. సఫారీ జట్టు చివరి 8 వికెట్లను కేవలం 51 పరుగుల వ్యవధిలోనే కోల్పోవడం గమనార్హం ‘సూపర్’ శిఖర్ భారత ఓపెనర్ శిఖర్ ధావన్ తన సూపర్ ఫామ్ కొనసాగించాడు. ఆరో ఓవర్లోనే రోహిత్ శర్మ (12) వికెట్ పడినప్పటికీ కెప్టెన్ కోహ్లితో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. చేయాల్సిన లక్ష్యం సులువైనదే కావడంతో భారీషాట్లకు వెళ్లకుండా బాధ్యతాయుతంగా ఆడారు. దీంతో భారత్ 13వ ఓవర్లో 50 పరుగుల్ని, 21వ ఓవర్లో 100 పరుగుల్ని అధిగమించింది. ప్రత్యర్థి కెప్టెన్ బౌలర్లందరిని మార్చిమార్చి ప్రయోగించినా శిఖర్, కోహ్లిల ఏకాగ్రతను దెబ్బతీయలేకపోయారు. ఈ క్రమంలో ముందుగా ధావన్ 61 బంతుల్లో, కోహ్లి 71 బంతుల్లో అర్ధసెంచరీలు సాధించారు. లక్ష్యం దిశగా సాగుతున్న తరుణంలో జట్టు స్కోరు 151 పరుగుల వద్ద ధావన్ ఔటయ్యాడు. తాహిర్ బౌలింగ్‌లో డు ప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. దీంతో రెండో వికెట్‌కు 128 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత క్రీజులోకి వచ్చిన యువరాజ్, కోహ్లితో కలిసి మిగిలిన లాంఛనాన్ని పూర్తిచేశాడు. ► 40 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో సఫారీపై టీమిండియా రికార్డిది. 2000, 2002, 2013, 2017లో గెలిచింది. ► 51/8 డివిలియర్స్ సేన చివరి 8 వికెట్లను 51 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. ఒక దశలో 140/2తో పటిష్టంగా ఉంది. ► 6 ఈ టోర్నీలో భారత ఫీల్డర్లు చేసిన రనౌట్లు. ఇంకే జట్టు 2 రనౌట్లను దాటలేదు. ► 271 ఈ టోర్నీలో శిఖర్ ధావన్ చేసిన పరుగులివి. ఇంకెవరూ ఇతని దరిదాపుల్లో లేరు. చాంపియన్స్ ట్రోఫీలో నేడు శ్రీలంక & పాకిస్తాన్ వేదిక: కార్డిఫ్, గ్రూప్: ‘బి’, మ. గం. 3.00 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్ ‘బి’ నుంచి రెండో సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే శ్రీలంక, పాక్ మూడు పాయింట్లతో సమఉజ్జీగా నిలుస్తాయి. ఈ దశలో మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టు ముందంజ వేస్తుంది. ప్రస్తుతం పాక్ (–1.544) కంటే శ్రీలంక (–0.879) మెరుగైన రన్‌రేట్ కలిగి ఉంది. దాంతో శ్రీలంకకే సెమీఫైనల్ బెర్త్ అవకాశం ఉంటుంది. -
కోహ్లి.. సర్దుకుపోతేనే మంచిది!
న్యూఢిల్లీ:భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఇటీవల బీసీసీఐ ప్రకటన విడుదల చేసినప్పటికీ, ప్రస్తుతానికి కోచ్ ను మార్చే యోచనలో లేనట్లే కనబడుతోంది. చాంపియన్స్ ట్రోఫీ తరువాత భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ వస్తాడని ఆశించినా, కొంతకాలం పాటు అనిల్ కుంబ్లేనే ఆ పదవిలో కొనసాగించాలని బోర్డు చూస్తోంది. దీనిలో భాగంగానే ఈ నెల చివర్లో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టుకు కుంబ్లేనే కోచ్ గా ఉండనున్నాడు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లితో విభేదాల కారణంగానే కుంబ్లే పదవి పొడిగింపుపై పెద్దగా ఆసక్తికనబరచని బీసీసీఐ.. ఆ మేరకు కోచ్ పదవికి ఆప్లికేషన్స్ ను కూడా ఆహ్వానించింది. అయితే మరికొంత కాలం కుంబ్లే కొనసాగింపుకు బీసీసీఐ మొగ్గుచూపుతోంది. దీనిలో భాగంగా కోహ్లిని సముదాయించినట్లు తెలుస్తోంది. 'చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే కొత్త కోచ్ ను నియమించాలని బీసీసీఐ క్రికెట్ సలహాదారుల కమిటీ (సీఏసీ) భావించడం లేదు. వెస్టిండీస్ పర్యటనకు కుంబ్లే వెళ్లనున్నాడు. అది చిన్న పర్యటన కావడంతో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కుంబ్లే కొనసాగింపుపై బీసీసీఐ సీఈవోకు సీఏసీ ఇప్పటికే స్పష్టం చేసింది. మరొకవైపు కుంబ్లే-కోహ్లిలతో కూడా సమావేశమైంది. ఆ సమయంలోనే కుంబ్లేతో సర్దుకోవాలని కోహ్లికి ముగ్గురు సభ్యులతో కూడిన సీఏసీ తెలిపింది' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. -
ఇప్పుడేమీ చెప్పదలుచుకోలేదు:కోహ్లి
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే కీలక మ్యాచ్‌కు అన్ని రకాలుగా సిద్ధమైనట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. రేపటి మ్యాచ్ కు సంబంధించి తమకు అందుబాటులో ఉన్న అన్ని వనరులపైనా చర్చించి ఇప్పటికే తుది నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొన్నాడు. అయితే తమ జట్టు ప్రణాళిక ఏమిటో ఇప్పుడే చెప్పదలుచుకోలేదని కోహ్లి పేర్కొన్నాడు. అయితే భారత తుది జట్టులో స్వల్ప మార్పులు ఉంటాయనే సంకేతాలిచ్చాడు. అయితే జట్టును సమతుల్యంగా ఉంచడమే ఇక్కడ ప్రధానంగా కోహ్లి పేర్కొన్నాడు. సఫారీలతో మ్యాచ్ ను కూడా సాధారణ మ్యాచ్ లాగే తీసుకుని ఆడాలని ఆటగాళ్లకు సూచించాడు. 'రేపు జరిగే మ్యాచ్ లో నిలకడ అనేది చాలా ముఖ్యం. ఇక్కడ ఎవరైతే పరిస్థితులకు తగ్గట్టు రాణిస్తారో వారిదే విజయం. గతంలో నాకు ఎదురైన అనుభవాల ఆధారంగానే ఈ విషయం చెబుతున్నా. మాకున్న అన్ని వనరులు గురించి ఇప్పటికే చర్చించాం. సఫారీలతో అమీతుమీ పోరుకు సిద్ధంగా ఉన్నాం. గ్రూప్ స్టేజ్ లో మాకు తప్పకుండా చివరి మ్యాచ్ కావడంతో పూర్తి స్థాయి జట్టుతోనే బరిలోకి దిగుతాం. మ్యాచ్ గురించి ప్రణాళికలు గురించి ఇప్పుడేమీ చెప్పదలుచుకోలేదు 'అని కోహ్లి పేర్కొన్నాడు. -
డివిలియర్స్, కోహ్లీ డకౌట్లకు కారణం అదే!
లండన్: క్రికెటర్లతో సెల్ఫీ దిగిన పాపానికి ఓ పాకిస్తానీ పాత్రికేయురాలు అడ్డంగా బుక్కయ్యారు. సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ ఆమెపై అకారణంగా విరుచుకుపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఛాంపియన్స్ ట్రోఫి సందర్భంగా పాకిస్తాన్ స్పోర్స్ట్ రిపోర్టర్ జైనాబ్ అబ్బాస్.. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌తో సెల్ఫీలు దిగారు. ఆ సెల్పీలు చూసుకొని ఆమె సంబరపడిపోయింది కూడా. కానీ.. ఆ తరువాతే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. అనూహ్యంగా ఆమెతో సెల్ఫీలకు పోజిచ్చిన ఇద్దరు బ్యాట్స్‌మెన్ డకౌట్ అయ్యారు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో డివిలియర్స్ డకౌట్ కాగా.. శ్రీలంకతో మ్యాచ్‌లో కోహ్లీ ఖాతా తెరవలేదు. దీంతో జైనాబ్‌పై సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనూ విరాట్ కోహ్లీ విఫలమవడానికి అనుష్క శర్మ కారణమని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. Two great batsmen - yesterday de Villiers, today Kohli- of the modern era have bagged ducks after a selfie with @ZAbbasOfficial. #BanHer — Mazher Arshad (@MazherArshad) 8 June 2017 -
వానలో కుమ్మేశారు
► భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తు ► 124 పరుగులతో టీమిండియా ఘనవిజయం ► చెలరేగిన యువరాజ్, కోహ్లి ► రాణించిన రోహిత్, ధావన్ ► హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శన అవలీలగా, అలవోకగా... అతి సునాయాసంగా, అసలు పోటీ అనేదే లేకుండా భారత్ ప్రత్యర్థిని కుమ్మేసింది... మాటలకే తప్ప మన ‘పక్కింటోడు’ ఆటలో మనకు ఆమడ దూరం దిగువన ఉన్నాడని మరో మారు ఢంకా బజాయించి చెప్పింది... ఎక్కడా తడబాటు లేకుండా పాకిస్తాన్ పని పట్టిన టీమిండియా ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో 24,156 మంది రికార్డు స్థాయి ప్రేక్షకుల మధ్య మన విజయ ధ్వజాన్ని గర్వంగా ఎగరేసింది. వర్షం పదే పదే వెంటాడినా... చివరకు కోహ్లి సేననే విక్టరీ వానలో తడిసింది. ఏడాదిన్నర విరామం తర్వాత మళ్లీ జత కట్టిన రోహిత్, శిఖర్ జంట సాధికారికంగా తమ ఓపెనింగ్ బాధ్యతలు నెరవేర్చింది... ఆపై కోహ్లి ఎప్పటిలాగే మరో అర్ధ సెంచరీ...పాత బాకీ తీర్చాలన్నట్లుగా యువరాజ్ సింగ్ బ్యాటింగ్ మోతతో చెలరేగిపోగా, చివర్లో పాండ్యా హ్యాట్రిక్ సిక్సర్లతో తానూ ఉన్నానని గుర్తు చేశాడు. ఆరంభం నుంచే ఆపసోపాలు పడిన పాక్‌కు ఇది తలకు మించిన భారమే అయిపోయింది. ప్రతీ పరుగు కోసం శ్రమించిన ఆ జట్టు చివరకు బొక్కబోర్లా పడింది. బర్మింగ్‌హామ్: చాంపియన్స్ ట్రోఫీ విజయయాత్రను భారత్ ఘనంగా ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై సునాయాస విజయంతో డిఫెండింగ్ టీమ్ తమ పదును చూపించింది. ఆదివారం ఇక్కడ ఏకపక్షంగా సాగిన వన్డేలో భారత్ 124 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 48 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (119 బంతుల్లో 91; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లి (68 బంతుల్లో 81 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), శిఖర్ ధావన్ (65 బంతుల్లో 68; 6 ఫోర్లు, 1 సిక్స్), యువరాజ్ సింగ్ (32 బంతుల్లో 53; 8 ఫోర్లు, 1 సిక్స్) భారీ స్కోరులో కీలక పాత్ర పోషించారు. చివరి 4 ఓవర్లలో భారత్ ఏకంగా 72 పరుగులు కొల్లగొట్టడం విశేషం. వర్షంతో అంతరాయం కలిగిన కారణంగా పాకిస్తాన్ లక్ష్యాన్ని 41 ఓవర్లలో 289 పరుగులుగా నిర్దేశించారు. అయితే పాక్ 33.4 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌటైంది. ఉమేశ్ యాదవ్‌కు 3 వికెట్లు దక్కాయి. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో ఈనెల 8న శ్రీలంకతో ఆడుతుంది. మరో సెంచరీ... నాలుగేళ్ల క్రితం చాంపియన్స్ ట్రోఫీలో తొలిసారి ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఐదు మ్యాచ్‌లలో వరుసగా 127, 101, 58, 77, 19 పరుగులు జోడించి జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించారు. ఈసారి కూడా వీరిద్దరు భారత్‌కు అదిరే ఆరంభం ఇచ్చారు. ఆరంభంలో జాగ్రత్తగా ఆడిన వీరిద్దరు కుదురుకున్నాక చక్కటి షాట్లతో అలరించారు. ఆమిర్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా వేయడంతో భారత్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. ఆ తర్వాత తాను ఎదుర్కొన్న 17వ బంతికి రోహిత్ తొలి ఫోర్ కొట్టగా, ధావన్ 23 బంతులు తీసుకున్నాడు. వర్షంతో వచ్చిన విరామం తర్వాత వీరిద్దరు వేగంగా దూసుకుపోయారు. షాదాబ్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ దిశగా భారీ సిక్సర్ కొట్టి రోహిత్ 71 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా... వహాబ్ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన ధావన్ 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో మూడు సెంచరీల భాగస్వామ్యాలు నమోదు చేసిన ఏకైక జోడి రోహిత్, ధావన్‌దే కావడం విశేషం. ఎట్టకేలకు ధావన్‌ను అవుట్ చేసిన షాదాబ్, పాక్‌కు తొలి వికెట్ అందించాడు. కొద్ది సేపటి తర్వాత సెంచరీ దిశగా దూసుకుపోతున్న సమయంలో రోహిత్ రనౌట్‌గా వెనుదిరిగాడు. మరోవైపు 43 పరుగుల వద్ద కోహ్లి ఇచ్చిన క్యాచ్‌లో డీప్ స్క్వేర్ లెగ్‌లో ఫహీం అష్రఫ్ వదిలేశాడు. యువీ మెరుపులు... ఇటీవల సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో వన్డేల్లో చెలరేగిన యువీ, ఇప్పుడు ఇంగ్లండ్‌లో తన సత్తా ప్రదర్శించాడు. 8 పరుగుల వద్ద లాంగాఫ్‌లో తాను ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను హసన్ అలీ వదిలేయగా, యువరాజ్ దానిని పూర్తిగా ఉపయోగించుకున్నాడు. అదే హసన్ బౌలింగ్‌లో 4 ఫోర్లు, ఒక భారీ సిక్సర్ కొట్టిన యువీ, వహాబ్ బౌలింగ్‌లో 3 బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున వేగవంతమైన అర్ధ సెంచరీ (29 బంతుల్లోనే)ని నమోదు చేశాడు. మరో ఎండ్‌లో కోహ్లి తనదైన శైలిలో చూడచక్కటి షాట్లతో అలవోకగా అర్ధ సెంచరీ సాధించాడు. వహాబ్ వేసిన 46వ ఓవర్లో భారత్ పండగ చేసుకుంది. ఈ ఓవర్లో కోహ్లి వరుసగా 4, 4, 6 కొట్టగా, యువీ మరో ఫోర్ బాదడంతో మొత్తం 21 పరుగులు వచ్చాయి. హసన్ బౌలింగ్‌లో యువీ అవుట్ కావడంతో ఈ 93 పరుగుల (9.4 ఓవర్లలో) భారీ భాగస్వామ్యానికి తెర పడింది. పాండ్యా సూపర్... ఇమాద్ వేసిన ఆఖరి ఓవర్లో కూడా భారత్ 23 పరుగులు పిండుకుంది. ఐపీఎల్ ఉత్సాహంతో ఉన్న హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 20 నాటౌట్; 3 సిక్సర్లు)ను బ్యాటింగ్‌లో ధోనికంటే ముందు పంపి భారత్ ఫలితం సాధించింది. తొలి మూడు బంతుల్లో పాండ్యా భారీ సిక్సర్లతో చెలరేగాడు. అదే ఓవర్ చివరి బంతికి కోహ్లి మరో ఫోర్ కొట్టి ఇన్నింగ్స్‌ను ముగించాడు. చాంపియన్స్ ట్రోఫీలో అతి చెత్త బౌలింగ్ ప్రదర్శన వహాబ్ రియాజ్ (0/87) పేరిట నమోదైంది. టపటపా... భారీ లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ఏ దశలోనూ దూకుడు కనబర్చలేకపోయింది. ఓపెనర్ షహజాద్ (12), బాబర్ ఆజం (8) ఏ మాత్రం ప్రభావం చూపించకుండానే వెనుదిరిగారు. భారత పేసర్లు కట్టుదిట్టమైన బంతులు విసరడంతో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం దక్కలేదు. తొలి 15 ఓవర్లలో (90 బంతుల్లో) పరుగులు రాని బంతులు (డాట్ బాల్స్) ఏకంగా 56 ఉండటం మన బౌలింగ్ సత్తాను, పాక్ ఘోర వైఫల్యాన్ని చూపిస్తోంది. ఆ తర్వాత కూడా పాక్ పుంజుకోలేదు. రోహిత్ అవుటా...నాటౌటా? షాదాబ్ వేసిన ఇన్నింగ్స్ 37వ ఓవర్లో కోహ్లి పాయింట్ దిశగా ఆడి సింగిల్‌కు ప్రయత్నించగా... బాబర్ విసిరిన త్రోను అందుకొని కీపర్ బెయిల్స్‌ను పడగొట్టాడు. ఆ సమయంలో రోహిత్ డైవ్ చేసేందుకు ప్రయత్నించిన సమయంలో నేలని తాకిన అతని బ్యాట్ పైకి లేచింది. థర్డ్ అంపైర్ కెటిల్‌బరో పలు రీప్లేల తర్వాత రోహిత్ అవుటైనట్లు ప్రకటించారు. అయితే దీనిపై కూడా సందేహాలు తలెత్తాయి. పాయింట్ దిశ నుంచే కాకుండా దానికి వ్యతిరేక దిశ అయిన స్క్వేర్ లెగ్ నుంచి అంపైర్ ఒక్క రీప్లే కూడా చూడలేదు. అప్పుడు మరింత స్పష్టత వచ్చి ఉండేదని వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. వర్షంతో అంతరాయం... ఊహించినట్లుగానే భారత్, పాక్ మ్యాచ్‌కు వాన అడ్డంకిగా నిలిచింది. ఆరంభంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్ణీత సమయానికే మ్యాచ్ ప్రారంభం అయింది. అయితే 9.5 ఓవర్లలో భారత్ స్కోరు 46/0 ఉన్న సమయంలో జోరుగా వాన కురిసింది. 45 నిమిషాల పాటు బ్రేక్ వచ్చిన తర్వాత మ్యాచ్ మళ్లీ మొదలైంది. 33.1 ఓవర్ల తర్వాత మరోసారి వర్షం బర్మింగ్‌హామ్ మైదానాన్ని పలకరిచింది. ఈసారి మరో 48 నిమిషాల పాటు ఆట ఆగిపోవడంతో మ్యాచ్‌ను 48 ఓవర్లకు కుదించారు. పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో 4.4 ఓవర్ల తర్వాత మళ్లీ వర్షం రావడంతో ఆ జట్టు లక్ష్యాన్ని, ఓవర్లను కుదించాల్సి వచ్చింది. మ్యాచ్‌కు ముందు లండన్‌లో శనివారం రాత్రి జరిగిన కత్తిపోట్ల దుశ్చర్యలో మరణించినవారికి నివాళిగా ఇరు జట్ల ఆటగాళ్లు మౌనం పాటించారు. ► భారత్ తరఫున అత్యధిక ఐసీసీ టోర్నీలు ఆడిన ఆటగాడిగా యువరాజ్ సింగ్ (14) నిలిచాడు. అతను 3 వన్డే వరల్డ్ కప్‌లు, 6 టి20 ప్రపంచ కప్‌లు, 5 చాంపియన్స్ ట్రోఫీలు ఆడాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ రనౌట్ 91; ధావన్ (సి) అజహర్ (బి) షాదాబ్ 68; కోహ్లి నాటౌట్ 81; యువరాజ్ సింగ్ ఎల్బీడబ్ల్యూ (బి) హసన్ అలీ 53; హార్దిక్ పాండ్యా నాటౌట్ 20; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (48 ఓవర్లలో 3 వికెట్లకు) 319. వికెట్ల పతనం: 1–136, 2–192, 3–285. బౌలింగ్: ఆమిర్ 8.1–1–32–0, ఇమాద్ వసీమ్ 9.1–0–66–0, హసన్ అలీ 10–0–70–1, వహాబ్ రియాజ్ 8.4–0–87–0, షాదాబ్ ఖాన్ 10–0–52–1, షోయబ్ మాలిక్ 2–0–10–0. పాకిస్తాన్ ఇన్నింగ్స్: అజహర్ అలీ (సి) పాండ్యా (బి) జడేజా 50; షెహజాద్ ఎల్బీడబ్ల్యూ (బి) భువనేశ్వర్ 12; బాబర్ ఆజం (సి) జడేజా (బి) ఉమేశ్ 8; హఫీజ్ (సి) భువనేశ్వర్ (బి) జడేజా 33; షోయబ్ మాలిక్ రనౌట్ 15; సర్ఫరాజ్ అహ్మద్ (సి) ధోని (బి) పాండ్యా 15; ఇమాద్ వసీమ్ (సి) జాదవ్ (బి) పాండ్యా 0; షాదాబ్ ఖాన్ నాటౌట్ 14; ఆమిర్ (సి) జాదవ్ (బి) ఉమేశ్ 9; హసన్ అలీ (సి) ధావన్ (బి) ఉమేశ్ 0; వహాబ్ రియాజ్ (అబ్సెంట్ హర్ట్); ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (33.4 ఓవర్లలో ఆలౌట్) 164. వికెట్ల పతనం: 1–47, 2–61, 3–91, 4–114, 5–131, 6–135, 7–151, 8–164, 9–164. బౌలింగ్: భువనేశ్వర్ 5–1–23–1, ఉమేశ్ 7.4–1–30–3, బుమ్రా 5–0–23–0, పాండ్యా 8–0–43–2, జడేజా 8–0–43–2. -
భారత్‌పై మేం ఓడిపోతాం
చాంపియన్స్ ట్రోఫిలో భాగంగా ఇండియాతో జరగనున్న మ్యాచ్‌లో తమ జట్టు ఓడిపోతుందని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది అభిప్రాయపడ్డాడు. పాకిస్తాన్‌పై భారత్ పైచేయి సాధిస్తుందని అనడానికి రెండు కారణాలను చెప్పుకొచ్చాడు. అందులో ఒకటి భారత్ రికార్డు బాగుండటమని మరొటి భారత్ ఆటగాళ్లు మంచి సమతూకంతో ఉండటమని తెలిపాడు. అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్న బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు ఆఫ్రిది. కోహ్లీ గురించి కొత్తగా చెప్పేదేమీ లేదని వన్డేల్లో అతని రికార్డుల గురించి అందరికీ తెలుసునని అన్నాడు. కోహ్లిని త్వరగా ఔట్ చేయడంపైనే పాకిస్తాన్ బౌలర్లు దృష్టి సారించాలని సూచించాడు. క్రీజులో కోహ్లి పాతుకుపోక ముందే అతన్ని ఔట్ చేయాలని అన్నాడు. -
ప్రాక్టీస్‌లో అంతా బాగుంది!
కోచ్, కెప్టెన్ కలిసి సన్నద్ధం బర్మింగ్‌హామ్: కెప్టెన్ కోహ్లి, కోచ్ కుంబ్లే మధ్య విభేదాల గురించి బయట ఎన్ని వార్తలు ప్రచారంలో ఉన్నా... అసలైన ఆట సమయంలో మాత్రం వారిద్దరు ఎలాంటి సమస్య లేకుండా పని చేస్తున్నారు. శుక్రవారం భారత జట్టు నెట్స్‌లో ఇది బాగా కనిపించింది. ప్రాక్టీస్‌లో భాగంగా కోహ్లికి దాదాపు 20 నిమిషాల పాటు కుంబ్లే త్రో డౌన్స్ విసిరారు. ముందుగా డ్రైవ్ చేసిన కోహ్లి, ఆ తర్వాత కొన్ని బంతులను షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. మనసులో ఏమున్నా తమ శారీరక భాషలో మాత్రం దానిని వారు కనపడనీయలేదు. అనారోగ్యంతో రెండు వార్మప్ మ్యాచ్‌లకు దూరమైన యువరాజ్ సింగ్, సుదీర్ఘ సమయం పాటు సాధన చేశాడు. మరోవైపు ముందుగా అనుకున్నట్లుగా మాజీ కెప్టెన్ గంగూలీ భారత ఆటగాళ్లు ఎవరితోనూ సమావేశం కాలేదు. -
భారత క్రికెట్లో ‘సూపర్ స్టార్’ సంస్కృతి
► వాళ్లు ఏం చేసినా చెల్లుతోంది ► కోచ్ ఎంపికతో కోహ్లికి ఏం పని? ► ధోని, గంగూలీ, ద్రవిడ్లదీ తప్పే ► రామచంద్ర గుహ తీవ్ర వ్యాఖ్యలు క్రికెట్ చరిత్రకారుడు బీసీసీఐ చరిత్రను తవ్వే పనిలో పడ్డారు. పదవి నుంచి తప్పుకుంటూ భారత దిగ్గజాల వ్యవహార శైలిని ఘాటుగా ప్రశ్నిస్తూ పోయారు. కోర్టు అప్పజెప్పిన పనిని పూర్తి చేయడంలో సీఓఏ వైఫల్యాన్ని కూడా గుర్తు చేశారు. పరిపాలకుల కమిటీ నుంచి తప్పుకుంటూ తన రాజీనామా లేఖలో అనేక అంశాలను రామచంద్ర గుహ ప్రస్తావించారు. ఇందులో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా... గుహ లేవనెత్తిన అంశాలు భారత క్రికెట్లో మళ్లీ చర్చకు దారి తీయడం ఖాయం. న్యూఢిల్లీ: ప్రముఖ చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ భారత క్రికెట్ పని తీరుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పరిపాలకుల కమిటీ (సీఓఏ) నలుగురు సభ్యులలో ఒకరిగా ఉన్న గుహ, వ్యక్తిగత కారణాల పేరుతో గురువారం తన పదవి నుంచి తప్పుకున్నారు. అయితే తన రాజీనామా సమయంలో కమిటీ చైర్మన్ వినోద్ రాయ్‌కు ఆయన సుదీర్ఘ లేఖ రాశారు. తాను సభ్యుడిగా ఉన్న గత నాలుగు నెలల కాలంలో తాను పరిశీలించిన అంశాలను ఆయన రాయ్ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ లేఖలో ఆయన ప్రశ్నించిన కొన్ని ప్రధాన అంశాలను సంక్షిప్తంగా చూస్తే... కోచ్‌ల కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ భారత జట్టుకు కోచ్‌లుగా పని చేసేవారు ఐపీఎల్ జట్లకూ కోచ్‌గా వ్యవహరించడం సరికాదు. అవసరమైతే వారికి కొంత అదనపు మొత్తం చెల్లించవచ్చు. రాహుల్ ద్రవిడ్, ఆర్.శ్రీధర్, సంజయ్ బంగర్, భరత్ అరుణ్‌లకు ఈ విషయంలో బోర్డు అపరిమిత స్వేచ్ఛ ఇచ్చింది. పది నెలల కాంట్రాక్ట్ మాత్రమే ఇస్తూ వారు ఐపీఎల్లో పని చేసే విధంగా సడలింపు ఇస్తున్నారు. ఇదంతా అనైతిక వ్యవహారం. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో జూనియర్ క్రికెటర్ల క్యాంప్ ఉంటే ఒక కోచ్ ఐపీఎల్ ఉందని వెళ్లిపోయారు. సీఓఏ సమావేశాల్లో పలు మార్లు ఈ అంశాన్ని నేను ప్రస్తావించినా పట్టించుకోలేదు. కామెంటేటర్ల కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ సునీల్ గావస్కర్ పీఎంజీ అనే ప్లేయర్ మేనేజ్మెంట్ కంపెనీకి యజమా ని. అది శిఖర్ ధావన్, రిషభ్ పంత్ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. అదే గావస్కర్ బీసీసీఐ కామెంటరీ టీమ్‌లో సభ్యుడిగా వారి గురించి వ్యాఖ్యానిస్తారు. ఇది పూర్తిగా తప్పు. ఆయన రెండింటిలో ఏదో ఒకదానికే పరిమితం కావాలి. ఒక ప్రఖ్యాత క్రికెటర్ (సౌరవ్ గంగూలీ) ఒక క్రికెట్ సంఘానికి అధ్యక్షుడిగా ఉంటూ మళ్లీ కామెంటరీ కూడా చేస్తే ఎలా? దేశవాళీలో తక్కువ చెల్లింపులు ఒక రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడితే ఆటగాడికి రూ.1.14 లక్షలు లభిస్తాయి. అయితే పది వేలు మాత్రమే ముందుగా ఇస్తారు. మిగతావన్నీ వాయిదాల్లోనే. ఐపీఎల్ లేకుండా దీనిపైనే బతికే ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. దీనిని ఒక క్రమపద్ధతిలో ఉంచాలి. కొన్నిసార్లు రాష్ట్ర సంఘాలు ఆటగాళ్లకు పూర్తి మొత్తాలు కూడా ఇవ్వడం లేదు. సీఓఏ సరిగా పని చేయలేదు కొన్ని అంశాల్లో మా సీఓఏ కూడా చురుగ్గా వ్యవహరించలేదు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం అనర్హులైన అనేక మంది బోర్డు, రాష్ట్ర సంఘాల ఆఫీస్ బేరర్లు స్వేచ్ఛగా సమావేశాలకు హాజరయ్యారు. వీరిలో కొందరు అతిగా చొరవ చూపించి చాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకోవాలని ప్రచారం చేశారు. ఇవన్నీ పత్రికల్లో వచ్చాయి కూడా. అయితే ఈ విషయాన్ని సీఓఏ కోర్టు దృష్టికి తీసుకుపోలేదు. నాకు కనీస సమాచారం లేకుండా సీఓఏ తమ లాయర్‌ను మార్చేసింది కూడా. క్రికెటర్ ఉండాలి: సీఓఏలో ఒక పురుష క్రికెటర్ లేకపోవడం వల్ల కూడా అనేక సమస్యలు వచ్చాయి. బిషన్‌సింగ్ బేడీ, వెంకట్రాఘవన్ పేర్లు నేను చెప్పినా 70 ఏళ్లు దాటాయని చెప్పి తీసుకోలేదు. నేను జవగళ్ శ్రీనాథ్ పేరు చెప్పాను. నా స్థానంలో కమిటీలో క్రికెటర్ వస్తాడని ఆశిస్తున్నా. నాకేమీ తెలీదు.. శ్రీనాథ్: మరోవైపు సీఓఏలో తాను సభ్యుడైతే బాగుంటుందంటూ గుహ చేసిన సూచనపై జవగళ్ శ్రీనాథ్ మాట్లాడుతూ... ‘ఆ ప్రతిపాదన గురించి నాకేమీ తెలీదు. దానికి సంబంధించి నా మనసులో ప్రస్తుతం ఎలాంటి ఆలోచన లేదు. అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే స్పందిస్తా’ అని అన్నారు. కుంబ్లే, కోహ్లి వివాదం గురించి చర్చించేందుకు ఇది సరైన సమయం కాదన్న శ్రీనాథ్, భారత్ చాంపియన్స్ ట్రోఫీ గెలవడమే అన్నింటికంటే ముఖ్యమన్నారు. ధోనికి కాంట్రాక్ట్ భారత క్రికెట్లో ఉన్న సూపర్ స్టార్ సంస్కృతి ధోనికి వరంలా మారింది. తాను టెస్టులు ఆడలేనంటూ స్వయంగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా అతనికి ‘ఎ’ గ్రేడ్ కాంట్రాక్ట్ ఇవ్వడంలో అర్థం లేదు. ఇది తప్పుడు సంకేతాలు పంపిస్తుంది. దీనిని కూడా నేను విరోధించాను. సూపర్ స్టార్ కెప్టెన్ కోచ్‌పై తమకు ప్రత్యేక అధికారం ఉందని సీనియర్ ఆటగాళ్లు భావిస్తున్నారు. ప్రొఫెషనల్ క్రీడల్లో ప్రపంచంలో ఏ దేశంలో, ఏ క్రీడలో కూడా ఇలాంటిది జరగదు. సూపర్ స్టార్ సంస్కృతి ఇప్పటికే అదుపు తప్పిపోయింది.ఎక్కడా లేని విధంగా కోచ్‌లు, కామెంటేటర్ల ఎంపిక విషయంలో ఆటగాళ్లు జోక్యం చేసుకోవడం ఏమిటి ? (కోహ్లిపై వ్యాఖ్యలతోనే గతంలో హర్షా భోగ్లేపై వేటు పడింది). రేపు సెలక్టర్లు, ఆఫీస్ బేరర్లను కూడా వారే ఎంపిక చేస్తారేమో? కెప్టెన్, కోచ్ మధ్య విభేదాలు ఉన్నాయని భావిస్తే ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిసిన వెంటనే కొత్త కోచ్ గురించి చర్చించాల్సింది. ఇప్పుడు ప్రధాన టోర్నీకి ముందు ఆ అంశాన్ని తీసుకొస్తారా? కుంబ్లే వ్యవహారంలో బోర్డు చాలా నిర్దాక్షిణ్యంగా, ప్రొఫెషనలిజానికి విరుద్ధంగా వ్యవహరించింది. దురదృష్టవశాత్తూ సీఓఏ కూడా ఈ సమయంలో చురుగ్గా పని చేయడంలో విఫలమైంది. -
టీమిండియాలో ముసలం?
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెట్ కోచ్ అనిల్ కుంబ్లేపై కెప్టెన్ కోహ్లి, కొందరు సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారా?. తాజా రిపోర్టులు ఈ విషయాన్ని ధ్రువపరుస్తున్నాయి. కోహ్లికి దగ్గరి వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం.. కుంబ్లే టీంను గైడ్ చేసే పద్దతిపై కెప్టెన్ కోహ్లితో పాటు కొందరు సినీయర్లు గుర్రుగా ఉన్నారని చెప్పారు. దీంతో ప్లేయర్లను శాంతిపజేసేందుకు సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌లు రంగంలోకి దిగినట్లు వెల్లడించారు. కుంబ్లే వర్కింగ్ స్టైల్ కంటే రవిశాస్త్రి వర్కింగ్ స్టైల్‌ను ప్లేయర్లు ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు సమాచారం. కోచ్‌పై ఆటగాళ్ల అసంతృప్తి గురించి సీఓఏ వినోద్‌రాయ్ ముగ్గురు సభ్యుల కమిటీతో చర్చించనున్నట్లు తెలిసింది. అయితే, కుంబ్లేకు ఆటగాళ్లకు మధ్య సమస్య ఇంకా గాలివానగా మారలేదు. దీంతో సమస్యను పరిష్కరించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. న్యూజిలాండ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ అనంతరం ఈ సమస్యపై గంగూలీతో కోహ్లీ మాట్లాడినట్లు తెలిసింది. వాస్తవానికి కుంబ్లేను కోచ్‌గా కొనసాగించాలని బీసీసీఐ భావించినా.. కోహ్లీ అందుకు నిరాకరించినట్లు సమాచారం. చాంపియన్స్ ట్రోపి ముగిసిన అనంతరం కుంబ్లే కాంట్రాక్టు పూర్తవనుంది. కొత్త టీమిండియా కోచ్‌కు దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే, కొత్త కోచ్ ఎంపిక జరిగే వరకూ కుంబ్లేను బీసీసీఐ కోచ్‌గా కొనసాగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సీఓఏ ప్రత్యక్షంగా టీంను పర్యవేక్షించలేదు కాబట్టి కొత్త కోచ్‌ను ముగ్గురు సభ్యుల కమిటీనే ఎన్నుకుంటుందని సమాచారం. కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవాలని సెహ్వాగ్‌ను కొందరు కోరగా, వీరూ అందుకు నిరాకరించినట్లు తెలిసింది. రవిశాస్త్రి కూడా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి కనబరచలేదు. ఆస్ట్రేలియా ప్లేయర్ టామ్ మూడీ కోచ్ పదవికి మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్రిమూర్తుల్లో ఒకరైన రాహుల్ ద్రవిడ్ కూడా కోచ్ పదవికి దరఖాస్తు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. కీలక చాంపియన్స్ ట్రోఫి ముందు ఆటగాళ్లు, కోచ్ మధ్య విభేదాలు తలెత్తయనే వార్త అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
ప్రయోగాలకు ఆఖరి అవకాశం
►బంగ్లాదేశ్‌తో నేడు భారత్ వార్మప్ మ్యాచ్ ►అందుబాటులో రోహిత్ శర్మ ►యువరాజ్ అనుమానమే! లండన్: చాంపియన్స్ ట్రోఫీ అసలు సమరానికి ముందు భారత జట్టు తమ చివరి మ్యాచ్ ప్రాక్టీస్‌కు సిద్ధమవుతోంది. బంగ్లాదేశ్‌తో నేడు (మంగళవారం) జరిగే రెండో వార్మప్ మ్యాచ్‌లో కోహ్లి సేన పాల్గొంటుంది. ఆ తర్వాత వచ్చే నెల 4న పాకిస్తాన్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో తమ టైటిల్ వేటను సాగించనుంది. న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన తొలి వార్మప్‌లో బౌలర్లు దాదాపు 40 ఓవర్ల పాటు బౌలింగ్ చేసినా వర్షం కారణంగా బ్యాట్స్‌మెన్‌కు మాత్రం ఫుల్ ప్రాక్టీస్ లభించలేకపోయింది. కేవలం 26 ఓవర్లపాటు మాత్రమే బ్యాటింగ్ చేయగలిగారు. కెప్టెన్ విరాట్ కోహ్లి చక్కటి అర్ధ సెంచరీతో రాణించగా... ధావన్ కూడా బాగానే సద్వినియోగం చేసుకున్నాడు. అయితే నేటి మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ మరింత ఎక్కువ సేపు క్రీజులో నిలిస్తే పాక్‌తో మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో వెళ్లే అవకాశం ఉంటుంది. తుది జట్టులో ఎవరెవరిని తీసుకోవాలనే విషయంలో టీమ్ మేనేజిమెంట్ ఈ మ్యాచ్ ద్వారా ఓ అంచనాకు వచ్చే వీలుంది. రోహిత్ శర్మ బరిలోకి... వ్యక్తిగత కారణాలతో స్వదేశంలోనే ఉండిపోయిన రోహిత్ శర్మ శనివారం సాయంత్రం జట్టుతో చేరాడు. అయితే తొలి వార్మప్‌లో అతను బరిలోకి దిగలేదు. నాలుగేళ్ల క్రితం జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజేతగా నిలిచేందుకు ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ధావన్ ఆట కీలకంగా మారింది. అప్పుడు కెప్టెన్‌గా ఉన్న ధోని... రోహిత్‌ను ఓపెనర్‌గా పంపి మంచి ఫలితం సాధించాడు. అయితే గాయం కారణంగా ఇటీవలే రోహిత్ ఐదు నెలల పాటు జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్లో ఆడినా ఇప్పుడు వన్డే ఫార్మాట్‌కు అలవాటు పడాల్సిన అవసరం ఉంది. దీంతో పాక్‌తో మ్యాచ్‌కు ముందు తగిన ప్రాక్టీస్ కోసం రోహిత్ సిద్ధమవుతున్నాడు. ఓపెనర్‌గా రహానే తొలి మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కోహ్లి చక్కటి షాట్లతో అలరించగా మ్యాచ్ ఆగిపోయేంత వరకు ధోని ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేసాడు. అయితే అస్వస్థతతో ఉన్న యువరాజ్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది అనుమానంగానే ఉంది. ఇక కివీస్‌ను 189 పరుగులకే ఆలౌట్ చేసిన బౌలింగ్ విభాగం ఫుల్ జోష్‌లో ఉంది. పేస్ ద్వయం షమీ, భువనేశ్వర్ ఫామ్‌లో ఉండగా ఉమేశ్, బుమ్రా కూడా ఈ మ్యాచ్‌ను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. మరోవైపు వన్డే ఫార్మాట్లో గణనీయంగా మెరుగుపడిన బంగ్లాదేశ్ జట్టుకు పాకిస్తాన్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో నిరాశ ఎదురైంది. ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేసి 341 పరుగుల భారీ స్కోరు చేసినా ఓడిపోయింది. మధ్యాహ్నం గం. 2.50 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
ఆటగాళ్లకంటే ఎక్కువ!
ముంబై: అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ ఖర్చు చేసే విషయంలో కూడా ఆటగాళ్లకంటే అధికారులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. విదేశాల్లో పర్యటించేటప్పుడు రోజూవారీ భత్యం క్రికెటర్లకంటే అధికారులకే ఎక్కువగా ఉండటం విశేషం. త్వరలో ఇంగ్లండ్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ కోసం కోహ్లి బృందంలోని ఒక్కొక్కరికి రోజూవారీ భత్యంగా 125 పౌండ్లు (రూ. 10, 400), బీసీసీఐ అధికారులకు 500 పౌండ్లు (రూ. 41, 600) చెల్లించనున్నారు. ఆటగాళ్ల కంటే సుమారు 4 రెట్లు అధిక మొత్తం అధికారులకు అందుతోంది. అయితే ఆటగాళ్లలా వార్షిక కాంట్రాక్టు ఫీజుల్లేని అధికారులకు కాస్త ఎక్కువ మొత్తం దక్కడం మంచిదే అయినప్పటికీ అది మరీ నాలుగు రెట్లు ఎక్కువగా ఉండకూడదని బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. -
విజయంతో ముగించారు
. చివరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీని ఓడించిన బెంగళూరు ∙ కోహ్లి అర్ధ సెంచరీ న్యూఢిల్లీ: ఐపీఎల్ పదో సీజన్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఊరట విజయంతో ముగించింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఆదివారం ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన నామమాత్రమైన ఈ మ్యాచ్‌లో కోహ్లి సేన 10 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ రెండు జట్లు ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. తమ చివరి ఎనిమిది మ్యాచ్‌ల్లో బెంగళూరుకిదే తొలి విజయం కావడం విశేషం. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు హర్షల్ పటేల్‌కి దక్కింది. అంతకుముందు టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లి (45 బంతుల్లో 58; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా... క్రిస్ గేల్ (38 బంతుల్లో 48; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. వీరిద్దరి భాగస్వామ్యంలో రెండో వికెట్‌కు 66 పరుగులు జత చేరాయి. అయితే వీరి ఇన్నింగ్స్‌లో మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా రాణించలేకపోయారు. ఆఖరి ఓవర్లో నేగి (5 బంతుల్లో 13 నాటౌట్; 3 ఫోర్లు) వరుసగా మూడు ఫోర్లు కొట్టడంతో ఓ మాదిరి స్కోరైనా చేయగలిగింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రెండో బంతికే వికెట్ పడినా శ్రేయస్ అయ్యర్ (30 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్), కరుణ్ నాయర్ (22 బంతుల్లో 26; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. అయితే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో సరైన భాగస్వామ్యాలు ఏర్పడలేదు. రిషభ్ పంత్ (34 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాటం 17వ ఓవర్లో ముగియగా ఆఖర్లో షమీ (9 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగినా ఫలితం లేకపోయింది. -
గెలిపించని శతకాలు ఇవే..
హైదరాబాద్: ఐపీఎల్ అంటేనే బౌండరీల మోత. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయడమే బ్యాట్సమన్ ప్రధాన లక్ష్యం. ఇలాంటి లీగ్ లో ఇక సెంచరీ బాదెస్తే మ్యాచ్ గెలవడం ఎంతో సులభం. కానీ పూర్తిగా బ్యాటింగ్ మద్దతుగా ఉండే ఈ పొట్టి క్రికెట్ లీగ్ లో కొందరు క్రికెటర్లు సెంచరీలు బాదినా మ్యాచ్ లు గెలిపించలేకపోయారు. ఇలా ఐపీఎల్ చరిత్రలో సెంచరీలు బాది జట్టును గెలిపించ లేక పోయినా ఆటగాళ్లపై ఓ లుక్కెద్దాం. హషీమ్ ఆమ్లా, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (2017) ఆమ్లా ఈ సీజన్ లో రెండు సెంచరీలు బాదాడు. కానీ రెండు మ్యాచుల్లో పంజాబ్ ఓడడం గమనార్హం. ముంబై ఇండియన్స్ పై 60 బంతుల్లో 104 పరుగులతో తొలి సెంచరీ నమోదు చేశాడు. ఈ సెంచరీ తో పంజాబ్ ముంబై కి 198 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఇక గెలుపు కాయం అనుకున్న సందర్భంలో ముంబై కేవలం 15 ఓవర్లలోనే లక్ష్యాన్ని సునాయసంగా చేదించింది. ఆమ్లా సెంచరీ వృధా అయింది. ఇక మరో సెంచరీ గుజరాత్ లయన్స్ పై మరో సారి 104 పరుగలే నమోదు చేశాడు. ఈ శతకంతో ఒక సీజన్ లో రెండు అంతకన్నా ఎక్కువ సెంచరీలు నమోదు చేసిన మూడో బ్యాట్స్ మన్ గా ఆమ్లా గుర్తింపు పొందాడు. పంజాబ్, ఆమ్లా శతకంతో గుజరాత్ కు 190 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించినా గెలువలేక పోయింది. ఆమ్లా రెండు సెంచరీలు బాదినా రెండు మ్యాచుల్లో జట్టు గెలవకపోవడం గమనార్హం. విరాట్ కోహ్లీ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (2016) ఐపీఎల్-9 సీజన్లో విరాట్ కోహ్లీ గుజరాత్ లయన్స్ పై రాజ్ కోట్ లో సెంచరీ నమోదు చేశాడు. కానీ ఈ మ్యాచ్ లో బెంగళూరు ఓడిపోయింది. కోహ్లీ 63 బంతుల్లో 100 పరుగులు చేయడంతో బెంగళూరు 180 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని గుజరాత్ 5 బంతులు మిగిలి ఉండగానే చేదించింది. దీంతో ఈ సీజన్ లో సెంచరీ చేసిన జట్టును గెలిపించకపోయినా ఆటగాడిగా కోహ్లీ నిలిచిపోయాడు. వృద్ధిమాన్ సాహా, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (2014) ఐపీఎల్-2014 ఫైనల్లో కోల్ కతా నైట్ రైడర్స్ పై సాహా కెరీర్ లో తొలి సెంచరీ చేసినా జట్టు గెలువలేకపోయింది. సాహా 66 బంతుల్లో 115 పరుగులు చేయడంతో కింగ్స్ పంజాబ్ 199 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఒంటి చేత్తో టైటిల్ అందించాలని భావించిన సాహాకు చివరకు నిరాశే మిగిలింది. కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు మనీష్ పాండే(94) చెలరేగడంతో పంజాబ్ కు ఓటమి తప్పలేదు. ఇలా ఈ సీజన్ లో సెంచరీ చేసి జట్టును గెలిపించలేక పోయిన ఆటగాడిగా సాహా నిలిచాడు. సచిన్ టెండూల్కర్, ముంబై ఇండియన్స్(2011) ఐపీఎల్-2011 సీజన్ లో వాంఖేడ్ స్టేడియంలో సచిన్ టెండూల్కర్ అప్పటి టీం కొచ్చి టస్కర్స్ పై 66 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. సచిన్ 12 ఫోర్లు, 3సిక్సర్లతో చెలరేగడంతో ముంబై 182 పరుగులు చేసింది. కానీ బ్రెండన్ మెకల్లమ్(81), మహేలా జయవర్ధనే(56) ఆట ముందు ముంబై లక్ష్యం చిన్నబోయింది. ఈ సీజన్ లో సెంచరీ చేసి జట్టును గెలిపించలేకపోయిన ఆటగాడిగా సచిన్ నిలిచాడు. యూసఫ్ పఠాన్, రాజస్థాన్ రాయల్స్ (2010) ఐపీఎల్-2010 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఆటగాళ్లు అంబటి రాయుడు(55), సౌరభ్ తివారీ(53) లు చెలరేగడంతో రాజస్థాన్ కు ముంబై 212 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ లక్ష్య చేధనలో తడబడిన రాజస్థాన్ 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో బ్యాటింగ్ కు దిగిన యూసఫ్ పఠాన్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగమైన సెంచరీ నమోదు చేశాడు. యూసఫ్ కేవలం 37 బంతుల్లోనే శతకం బాదాడు. ఈ రికార్డు ఇప్పటి వరకు బ్రేక్ కాలేదు. 173 పరుగుల వద్ద రనౌట్ గా యూసఫ్ వెనుదిరిగాడు. చివర్లో పారాస్ దోగ్రా (41) ప్రయత్నించినా, రాజస్థాన్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఈ సీజన్లో సెంచరీ వృథా చేసుకున్న బాట్స్ మన్ గా యూసఫ్ నిలిచాడు. ఆండ్రూ సైమండ్స్, డెక్కన్ చార్జెర్స్ (2008) ఐపీఎల్ తొలి సీజన్లో రాజస్థాన్ రాయల్స్ పై సైమండ్స్ 53 బంతుల్లో 117 పరుగులు బాదడంతో డెక్కన్ చార్జెర్స్ 214 పరుగులు చేసింది. గెలుపు కాయం అనుకున్న తరుణంలో రాజస్థాన్ బ్యాట్స్ మెన్స్ గ్రేమ్ స్మిత్ (71), యూసఫ్ పఠాన్ (61) విజృంభించడంతో డెక్కన్ చార్జెర్స్ కు పరాజయం తప్పలేదు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల చేజింగ్ రికార్డుగా నమోదు అయింది. ఈ రికార్డు ఇప్పటి వరకు ఎవరూ అధిగమించకపోవడం గమనార్హం. సెంచరీ వృధా చేసుకున్న ఆటగాడిగా సైమండ్స్ నిలిచాడు. -
మళ్లీ చిత్తుగా ఓడిన కోహ్లి జట్
-
బెంగళూరు బేలగా...
-
బెంగళూరు బేలగా...
►మళ్లీ చిత్తుగా ఓడిన కోహ్లి జట్టు ► 19 పరుగులతో పంజాబ్ విజయం ►గెలిపించిన సందీప్, అక్షర్ ఒకప్పుడు ఐపీఎల్లో పరుగుల వరద పారించి బ్యాటింగ్‌లో రికార్డులు సృష్టించడాన్ని అలవాటుగా మార్చుకున్న ఆ జట్టుకు ఇప్పుడు పరుగులు తీయడమే గగనంగా మారింది. స్టార్ ఆటగాళ్లంతా ఒకరితో ఒకరు పోటీపడి విఫలమవుతున్న వేళ బెంగళూరు మరో పరాభవాన్ని మూటగట్టుకుంది. 139 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక కోహ్లి సేన చతికిలపడింది. అక్షర్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పాటు సందీప్ శర్మ సూపర్ బౌలింగ్ పంజాబ్‌కు కీలక విజయాన్ని అందించింది. బెంగళూరు: ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు మరో ఓటమి ఎదురైంది. శుక్రవారం ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 19 పరుగుల తేడాతో ఆర్సీబీపై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ (17 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. మన్దీప్ సింగ్ (40 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టు టాప్ స్కోరర్‌గా నిలవగా... ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సందీప్ శర్మ (3/22), అక్షర్ పటేల్ (3/11) ప్రత్యర్థిని కుప్పకూల్చారు. ఐదో విజయంతో పంజాబ్ తమ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. అక్షర్ ఒక్కడే... ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్ పటేల్ మెరుపు బ్యాటింగ్ మినహా పంజాబ్ ఇన్నింగ్స్ అతి సాధారణంగా సాగింది. పిచ్ నెమ్మదిగా ఉండటంతో బ్యాట్స్‌మెన్ ప్రతీ పరుగు కోసం శ్రమించాల్సి వచ్చింది. తొలి ఓవర్లోనే ఆమ్లా (1) అవుట్ కాగా, కొద్దిసేపటికే గప్టిల్ (9) కూడా వెనుదిరిగాడు. ఫలితంగా పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు 35 పరుగులు మాత్రమే చేయగలిగింది. షాన్ మార్‡్ష (17 బంతుల్లో 20; 3 ఫోర్లు), వోహ్రా (28 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్), సాహా (25 బంతుల్లో 21; 1 ఫోర్) కొద్ది సేపు క్రీజ్‌లో నిలిచినా... ధాటిగా ఆడటంలో విఫలమయ్యారు. మ్యాక్స్‌వెల్ (6) ఏ మాత్రం ప్రభావం చూపలేకపోవడంతో కింగ్స్ ఎలెవన్ ఇన్నింగ్స్ మెల్లగా సాగింది. ఈ దశలో అక్షర్ జట్టుకు ఆపద్భాంధవుడిగా మారాడు. ముందుగా చహల్ ఓవర్లో ఫోర్, సిక్స్‌తో అతను జోరును ప్రదర్శించాడు. కీలకమైన 19వ ఓవర్‌ను అనికేత్ మెయిడిన్‌గా వేయడం విశేషం. అయితే వాట్సన్ వేసిన ఆఖరి ఓవర్లో అక్షర్ చెలరేగడంతో పంజాబ్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. ఈ ఓవర్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో పటేల్ 19 పరుగులు రాబట్టాడు. బెంగళూరు బౌలర్లలో అనికేత్ (2/17), చహల్ (2/21) రాణించారు. సందీప్ హవా... సొంత మైదానంలో సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముగ్గురు భారీ హిట్టర్లు కలిపి చేసిన పరుగులు 16 మాత్రమే! సందీప్ శర్మ చక్కటి బంతులకు తోడు నిర్లక్ష్యపూరిత బ్యాటింగ్ బెంగళూరును ఇబ్బందుల్లో పడేసింది. గేల్ (0), కోహ్లి (6), డివిలియర్స్ (10) ముగ్గురూ దాదాపు ఒకే తరహాలో సందీప్ పేస్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ముందుకు దూసుకొచ్చి అవుటయ్యారు. వరుసగా తన తొలి మూడు ఓవర్లలో ఈ వికెట్లు తీసిన సందీప్... ఒకే ఇన్నింగ్స్‌లో గేల్, కోహ్లి, డివిలియర్స్‌లను అవుట్ చేసిన తొలి బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. మరో ఎండ్ నుంచి మన్దీప్ కొంత పోరాడే ప్రయత్నం చేసినా, జాదవ్ (6), వాట్సన్ (3) విఫలం కావడంతో ఆర్సీబీ కోలుకోలేకపోయింది. మ్యాక్స్‌వెల్ తన తొలి ఓవర్లోనే మన్‌దీప్‌ను బౌల్డ్ చేయడంతో బెంగళూరు గెలుపు ఆశలు ఆవిరైపోయాయి. పవన్ నేగి (23 బంతుల్లో 21; 2 ఫోర్లు) చివర్లో పోరాడినా లాభం లేకపోయింది. -
పంజాబ్ దూకుడు కొనసాగిస్తుందా..?
►నేడు బెంగళూరుతో కింగ్స్ ఢీ ►క్వాలిఫై కోసం పంజాబ్ పోరు ►పరువు కోసం కోహ్లిసేన ఆరాటం బెంగళూరు: ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలనే లక్ష్యంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. చివరి మ్యాచ్‌ల్లో ఢిల్లీపై పది వికెట్లతో గెలుపొందిన మ్యాక్స్‌వెల్‌సేన.. ఈ మ్యాచ్‌లో నెగ్గి నాకౌట్ సమరానికి మరింత చేరువ కావాలని యోచిస్తోంది. మరోవైపు ఈ సీజన్లో ఎనిమిది ఓటములతో ప్లే ఆఫ్‌కు దూరమైన బెంగళూరు పరువు కోసం ఈ మ్యాచ్‌లో నెగ్గాలని కృతి నిశ్చయంతో ఉంది. పంజాబ్ దూకుడు.. ఈ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్రస్థానం పడుతూ లేస్తూ సాగుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన పంజాబ్.. అనంతరం వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. అనంతరం తేరుకున్న పంజాబ్ తను ఆడిన చివరి మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలను నమోదు చేసింది. ముఖ్యంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో సమష్టి విజయం సాధించింది. తొలుత పేసర్లు చెలరేగడంతో ఢిల్లీని కేవలం 67 పరుగులకు కుప్పకూల్చారు. పంజాబ్ జోరుకు టోర్నీ చరిత్రలోనే ఢిల్లీ తన అత్యల్ప స్కోరును నమోదు చేసింది. అనంతరం బ్యాటింగ్‌లో రెచ్చిపోయిన మ్యాక్స్‌వెల్‌సేన కేవలం 7.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ముఖ్యంగా న్యూజిలాండ్ విధ్వంసక ప్లేయర్ మార్టన్ గప్టిల్ కేవలం 27 బంతుల్లోనే అర్ధసెంచరీ నమెదుచేయడం విశేషం. ఓవరాల్‌గా తొమ్మిది మ్యాచ్‌లాడిన పంజాబ్ నాలుగు విజయాలు, ఐదు పరాజయాలు నమోదు చేసింది. దీంతో పట్టికలో ఎనిమిది పాయింట్లతో ఐదోస్థానంలో కొనసాగుతోంది. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే హషీమ్ ఆమ్లా అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఎనిమిది మ్యాచ్‌ల్లో 63 సగటుతో 315 పరుగులు నమోదు చేశాడు. అయితే కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ 193 పరుగులతో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. మనన్ వోహ్రా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మాత్రమే సత్తాచాటాడు. వీరు త్వరలో గాడిలో పడాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. మార్టిన్ గప్టిల్ రెండు మ్యాచ్‌ల్లో 73 పరుగులతో ఆకట్టుకున్నాడు. షాన్ మార్‡్ష, వృద్ధిమాన్ సాహా, అక్షర్ పటేల్ స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించాల్సి ఉంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే సందీప్ శర్మ ఎనిమిది మ్యాచ్‌ల్లో 11 వికెట్లతో సత్తాచాటాడు. ముఖ్యంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో పదునైన బంతులతో ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌ను సందీప్ కుప్పకూల్చాడు. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ 10 వికెట్లతో రాణిస్తున్నాడు. వరుణ్ ఆరోన్, మోహిత్ శర్మ ఫర్వాలేదనిపిస్తున్నారు. ఈ సీజన్లో ఇరుజట్లు పరస్పరం ఓ సారి తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ఆరు వికెట్లతో పంజాబ్ ఘన విజయం సాధించింది. మరోసారి అలాంటి ప్రదర్శనే పునరావృతం చేయాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. పంజాబ్‌కు మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్‌ల్లో విజయం సాధించాలని కృత నిశ్చయంతో ఉంది. భారత మాజీ విధ్వంసక ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మార్గదర్శకత్వంలో ఈసారి ఎలాగైనా నాకౌట్‌కు చేరాలని భావిస్తోంది. దీంతో గతేడాది నమోదు చేసిన చెత్త ప్రదర్శనను మరిపించాలని ఆశిస్తోంది. ‘బెంగ’ తీరేనా...? గతేడాది అద్భుత ఆటతీరుతో రన్నరప్‌గా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈసారి మాత్రం చెత్త ప్రదర్శననను నమెదు చేస్తోంది. ఇప్పటివరకు ఎనిమిది ఓటములు నమోదు చేసిన బెంగళూరు అధికారికంగానే ప్లే ఆఫ్స్‌కు దూరమైన తొలి జట్టుగా అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఓవరాల్‌గా 11 మ్యాచ్‌లాడిన బెంగళూరు కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందింది. ముఖ్యంగా బెంగళూరు చివరగా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క విజయాన్ని నమోదు చేయలేకపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో ఒక్క పాయింట్‌ను సాధించింది. దీంతో ఓవరాల్‌గా ఐదు పాయింట్లతో పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటిన కోహ్లి, డివిలియర్స్, గేల్‌లాంటి ఆటగాళ్లున్నా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 49 పరగులకు కుప్పకూలింది. మరోవైపు రైజింగ్ పుణే సూపర్‌జెయింట్‌పై 158 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బెంగళూరు కనీసం 100 పరుగుల మార్కును సైతం దాటలేకపోయింది. ఏదీ ఏమైనా నాకౌట్ దశకు అర్హత పొందకపోయినా ఇతర జట్ల అవకాశాలపై ఇప్పుడు బెంగళూరు ప్రభావం చూపనుంది. కోహ్లిసేనకు మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఎలాగైనా నెగ్గి పరువు దక్కించుకోవాలని ఆశిస్తోంది. దీంతో బెంగళూరుతో తలపడాల్సిన పంజాబ్, ఢిల్లీ, కోల్‌కతా కొంచెం కంగారుపడుతున్నాయి. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే కేదార్ జాదవ్ 10 మ్యాచ్‌ల్లో 241 పరుగులతో జట్టు తరఫున అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ లాంటి విధ్వంసక ఆటగాళ్లు ఈ సీజన్లో అనుకన్నంత మేరకు రాణించలేకపోయారు. మిగతా మ్యాచ్ల్లోనైన వీరు తమ బ్యాట్‌కు పదును పెట్టాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే యజ్వేంద్ర చహల్ 11 వికెట్లతో సత్తా చాటాడు. పవన్ నేగి 10 వికెట్లతో ఆకట్టుకున్నాడు. షేన్ వాట్సన్, స్టువర్ట్ బిన్నీ, శ్రీనాథ్ అరవింద్ తదీతరులు బంతితో రాణించాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. ఈ సీజన్లో తొలి మ్యాచ్‌లో పంజాబ్ చేతులో ఎదురైన ఓటమికి ఇప్పుడు బదులు తీర్చుకునే అవకాశం బెంగళూరుకు చిక్కింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోహ్లిసేన కృతనిశ్చయంతో ఉంది. -
కోహ్లీని అధిగమించిన ధోని
హైదరాబాద్: ఐపీఎల్-10 లో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీని రైజింగ్ పుణే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఓ విషయంలో అధిగమించాడు. ఈ సీజన్ లో రైజింగ్ ఫుణే యాజమాన్యం కెప్టెన్ గా ధోనిని తొలిగించి స్టీవ్ స్మిత్ ను నియమించడం, ధోని పై విమర్శలు చేయడం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో ధోని అభిమానులు పుణే యాజమాన్యం పై బాహాటంగానే విరుచుకు పడ్డారు. అయినా ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో తన విరోచిత బ్యాటింగ్ తో మరో మారు ఫినిషర్ గా గుర్తింపు పొందిన ధోని తాజాగా ట్వీటర్ లో అత్యధికంగా చర్చించుకుంటున్న ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఐపీఎల్-10లో ప్లేయర్స్ ఫోటోలతో ట్వీటర్ ఎమోజీ కాన్సెప్ట్ ను ప్రవేశ పెట్టారు. దీనిలో ఐపీఎల్ అభిమానులు అభిమాన ఎమోజీ ఫోటోతో హ్యాష్ టాగ్ చేస్తారు. గత నాలుగు వారాలుగా ధోని ట్వీటర్ ఎమోజీ లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సోషల్ మీడియాలో అత్యంత ఆదరణ కలిగిన కోహ్లీని వెనక్కి నెట్టి ధోని అగ్రస్థానానికి చేరాడు. ఇక ఈ వారం కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ రెండో స్థానానికి చేరుకున్నాడు. వరుస వైఫల్యాలతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ అర్హత కోల్పోవడంతో ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో స్థానానికి పరిమితమయ్యాడు. నాలుగో స్ధానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఫుణే రైజింగ్ ఆటగాడు బెన్ స్టోక్స్ ఐదో స్ధానంలో ఉన్నారు. ఈ క్యాష్ రిచ్ లీగ్ లో నాలుగో వారంలో అత్యంత ఆదరణ పొందిన ఫ్రాంచైజీగా ముంబై ఇండియన్స్ గుర్తింపు పొందింది. ఇక గుజరాత్ లయన్స్, ముంబైల మధ్య జరిగిన సూపర్ ఓవర్ మ్యాచ్ అత్యంతగా చర్చించుకున్న మ్యాచ్ గా నిలిచింది. -
కోహ్లీ సేన వైఫల్యానికి కారణం?
హైదరాబాద్: ఐపీఎల్ లో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుస వైఫల్యాలతో ప్లే ఆఫ్ అవకాశాన్ని కోల్పోయింది. గత సీజన్ లో సమిష్టంగా రాణించి ఫైనల్లో వరకూ వెళ్లిన ఆర్సీబీ.. ఈ సీజన్ లో అత్యంత చెత్త ప్రదర్శనతో అభిమానులను నిరాశ పరిచింది. భయంకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న బెంగళూరు బ్యాట్స్ మెన్ లు బ్యాట్ జులిపించక పోవడంతో వరుస వైఫల్యాలను మూటగట్టుకుంది. జట్టులోని ప్రధానమైన బ్యాట్స్ మెన్ లో ఏ ఒక్కరు టాప్-10 లిస్టులో లేకపోవడం గమనార్హం. ఇక కోల్ కతా పై 49 పరుగులకు కుప్పకూలి సగటు క్రికెట్ అభిమానిని ఆశ్చర్య పరిచింది. ఇది బెంగళూరు జట్టే నా అనే అనుమానం కలిగింది. ఇక బౌలింగ్ లో కూడా ప్రత్యర్ధులను కట్టడి చేయడంలో విఫలమైంది. జట్టులోని ప్రధాన ఆటగాళ్ల ప్రదర్శన పరిశీలిస్తే బ్యాటింగ్ లో కెప్టెన్ కోహ్లీ, బౌలింగ్ విభాగంలో చాహాల్ తప్ప ఎవరూ వారి స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయారు. మరోవైపు ఆటగాళ్ల గాయాలు కూడా బెంగళూరును వెంటాడాయి. ఓపెనర్ కే ఎల్ రాహుల్, యువ బ్యాట్స్ మన్ సర్ఫరాజ్ ఖాన్ లు ఈ సీజన్ మొత్తానికి దూరం కాగా, కెప్టెన్ కోహ్లీ, విధ్వంసకర ఆటగాడు డివిలియర్స్ తొలి మ్యాచులకు దూరమయ్యారు. దీంతో జట్టు తగిన మూల్యం చెల్లించుకోంది. ఇక ప్రధానమైన ఆటగాళ్ల ఆటను పరిశీలిస్తే.. విరాట్ కోహ్లీ: ఈ సీజన్ తొలి మ్యాచుల్లో గాయం కారణంగా దూరమైన కోహ్లీ, వచ్చిరావడంతో తన బ్యాటింగ్ తో ఆకట్టుకున్న జట్టును గెలిపించలేకపోయాడు. ఏడు ఇన్నింగ్స్ ల్లో 124.47 స్ట్రైక్ రేట్ తో కోహ్లీ 239 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధసెంచరీలున్నాయి. గత సీజన్ లో 4 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలతో దూకుడుగా ఆడిన కోహ్లీ 973 పరుగులతో టాప్ లో నిలిచాడు. ఒంటి చేత్తో మ్యాచ్ లు గెలిపించి జట్టును ఫైనల్ కు చేర్చాడు. ఈ సీజన్ లో మాత్రం అతని స్ధాయికి తగిన ప్రదర్శన కనబర్ఛకపోవడంతో బెంగళూరు వరుస వైఫల్యాలను మూటగట్టుకుంది. ఏబీ డివిలియర్స్: విధ్వంసకర బ్యాటింగ్ కు నిర్వచనంగా చెప్పుకునే మిస్టర్ 360 ఒకే ఒక మ్యాచ్ తప్ప అన్ని మ్యాచ్ ల్లో విఫలమయ్యాడు. 7 ఎన్నింగ్స్ లు ఆడిన డివిలియర్స్ 131.54 స్ట్రైక్ రేట్ తో కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. గత సీజన్ లో ఒక సెంచరీ 6 హాఫ్ సెంచరీలతో 687 పరుగులతో టాప్-3 లో నిలిచాడు. ఈ సీజన్ లో మాత్రం కేవలం ఒకే ఒక అర్ధసెంచరీతో బెంగళూరు అభిమానులను తీవ్రంగా నిరాశపర్చాడు. డివి ఆడిన ఏ ఒక్క మ్యచ్ బెంగళూరు గెలవకపోవడం విశేషం. క్రిస్ గేల్: బిగ్ వెస్టీండియన్ ఈజ్ బిగ్ డిజాప్పాయింట్ మెంట్ ఫర్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. అవును బెంగళూరును తీవ్రంగా నిరాశపరిచింది క్రిస్ గేల్. హిట్టింగ్ అంటనే గేల్, గేల్ అంటేనే హిట్టింగ్ అన్నట్లు ఉండే అతని బ్యాటింగ్. ఈ సీజన్ లో మాత్రం అతని బ్యాట్ మూగబోయింది. జట్టులో ఎప్పుడు కీలక ఆటగాడిగా ఉండే గేల్ ఈ సీజన్ లో జట్టులో చోటుకోసం పోటి పడాల్సి వచ్చింది. ఒకే ఒక మ్యాచ్ లో 77 పరుగులతో ఆకట్టుకున్న గేల్ 6 ఇన్నింగ్స్ ల్లో 124.59 స్ట్రైక్ రేట్ తో కేవలం 152 పరుగులు మాత్రం చేశాడు. యజువేంద్ర చాహల్: ఐపీఎల్-10 లో అంతో ఇంతో రాణించిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది చాహలే. 10 మ్యాచ్ లు ఆడిన చాహాల్ 7.66 ఎకానమితో 11 వికెట్లు పడగొట్టాడు. గత సీజన్ లో 21 వికెట్లు పడగొట్టి టాప్-2 లో నిలిచాడు. తైమల్ మిల్స్: ఐపీఎల్-10 వేలంలో అత్యంత ధర పలికిన రెండో ఆటగాడు ఈ ఇంగ్లండ్ బౌలర్. కానీ అతను పలికిన ధరకు తగిన న్యాయం చేయలేకపోయాడు. 5 మ్యాచ్ లు ఆడిన మిల్స్ 8.50 ఎకానమితో 5 వికెట్లు పడగొట్టాడు. ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ పరుగులు చేయకుండా కట్టడి చేయడంలో విఫలమయ్యాడు. గత భారత్-ఇంగ్లండ్ టీ20 సిరీస్ లో వైవిధ్యమైన బంతులతో ఆకట్టుకున్న మిల్స్ పై ప్రాంచైజీలు ఆసక్తి చూపాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు రూ.12 కోట్లకు దక్కించుకుంది. -
టీమిండియా@ 3
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌ల్లో భారత్ మూడోస్థానాన్ని దక్కించుకుంది. ఇటీవల వన్డేల్లో మెరుగైన ప్రదర్శనతో కోహ్లిసేన ఐదు పాయింట్లు తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం 117 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న భారత్ కంటే మెరుగ్గా దక్షిణాఫ్రికా (123 పాయింట్లు), ఆస్ట్రేలియా (118 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, వెస్టిండీస్, అఫ్గానిస్తాన్ వరుసగా నాలుగు నుంచి పది స్థానాల్లో కొనసాగుతున్నాయి. -
‘బెంగ’ తీరేనా..?
⇒నేడు గుజరాత్‌తో తలపడనున్న రాయల్ చాలెంజర్స్ ⇒ఒత్తిడిలో కోహ్లిసేన.. అట్టడుగు స్థానంలో లయన్స్ బెంగళూరు: గతేడాది అప్రతిహత విజయాలతో రన్నరప్‌గా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తోంది. ఈక్రమంలో పట్టికలో అట్టడుగున ఉన్న గుజరాత్ లయన్స్‌తో గురువారం తలపడనుంది. ఎలాగైనా తిరిగి విజయాల బాట ఎక్కాలని కోహ్లిసేన భావిస్తుండగా.. పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపర్చుకోవాలని గుజరాత్ యోచిస్తోంది. బెంగళూరుకు చావోరేవో... టోర్నీలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు ఇప్పటివరకు కేవలం రెండు విజయాలను మాత్రమే సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగియగా.. మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఈక్రమంలో ఐదు పాయింట్లతో పట్టికలో ఆరోస్థానంలో కొనసాగుతోంది. బెంగళూరు చేతిలో ఇంకా ఆరు మ్యాచ్‌లు మాత్రమే ఉండడంతో ఇప్పటి నుంచి ప్రతీమ్యాచ్‌లోనూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాలి. ఇలాగైతేనే ఆ జట్టు నాకౌట్ రేసులో నిలుస్తుంది. మరోవైపు కోహ్లి, క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ లాంటి భీకర బ్యాట్స్‌మెన్‌తో కూడిన బెంగళూరు.. కోల్‌కతాతో మ్యాచ్‌లో 132 పరుగుల సాధారణ లక్ష్యాన్ని కూడా ఛేదించలేదు. అత్యంత అవమానకరంగా 49 పరుగులకే కుప్పకూలింది. పదేళ్ల టోర్నీ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. జట్టులోని ఏ ఒక్క బ్యాట్స్‌మన్ కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. అయితే బెంగళూరు ఆడిన చివరిమ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంలా మారింది. ఈక్రమంలో ఇప్పటి నుంచి ప్రతీ మ్యాచ్‌ను కోహ్లిసేన చావో రేవో అని భావించి ఆడాల్సి ఉంటుంది. బ్యాటింగ్ విషయానికొస్తే పేపర్ చాలా బలంగా కన్పిస్తోన్న బెంగళూరు.. మైదానంలో మాత్రం తడబడుతోంది. జట్టు కీలక ఆటగాళ్లు కోహ్లి (154 పరుగులు), గేల్ (144 పరుగులు), డివిలియర్స్ (145 పరుగులు) ఫర్వాలేదనిపిస్తున్నారు. బెంగళూరు తిరిగి విజయాల బాట పట్టాలంటే ఈ ముగ్గురు గర్జించాల్సి ఉంటుంది. కేదార్ జాదవ్ 175 పరుగులతో జట్టు తరఫున అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. మన్దీప్ సింగ్, స్టువర్ట్ బిన్నీ రాణించాలని జట్టు మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే ఈ విభాగం సాదాసీదా కన్పిస్తోంది. స్పిన్నర్ యజ్వెంద్ర చహల్ జట్టు తరఫున పది వికెట్లతో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. పవన్ నేగి, శామ్యూల్ బద్రీ చెరో ఆరు వికెట్లతో ఫర్వాలేదనిపిస్తున్నారు. శ్రీనాథ్ అరవింద్, స్టువర్ట్ బిన్నీ బంతితో సత్తా చాటాల్సిన అవసరముంది. మరోవైపు ఈ సీజన్లో ఇరుజట్లు పరస్పరం తలపడగా అందులో బెంగళూరు విజయం సాధించింది. గేల్, కోహ్లి దూకుడుతో భారీస్కోరు సాధించిన బెంగళూరు.. రైనాసేనపై అద్భుత విజయం సాధించింది. మరోసారి అలాంటి ప్రదర్శన చేయాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. నిరాశలో గుజరాత్.. గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన గుజరాత్ లయన్స్ టోర్నీలో మూడోస్థానం పొంది అకట్టుకుంది. అయితే ఈసారి మాత్రం గుజరాత్ ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. టోర్నీలో ఏడు మ్యాచ్‌లు ఆడిన గుజరాత్.. కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. మరో ఐదు మ్యాచ్‌ల్లో ఓడిన లయన్స్ కేవలం నాలుగు పాయింట్లతో పట్టికలో అట్టడుగున నిలిచింది. జట్టులో కెప్టెన్ సురేశ్ రైనా, బ్రెండన్ మెకల్లమ్ , దినేశ్ కార్తిక్ రాణిస్తున్నారు. అయితే వీరికి ఇతర బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం అందడం లేదు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన చివరిమ్యాచ్‌లో పోరాడి ఓడిపోయారు. జట్టులో రైనా 275 పరుగులతో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. మెకల్లమ్, కార్తిక్ ఫర్వాలేదనిపిస్తున్నారు. అయితే ఆరోన్ ఫించ్, డ్వేన్ స్మిత్ విఫలమవడం జట్టును కలవరపరుస్తోంది. మరోవైపు స్వదేశీ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా తమ బ్యాట్లకు పనిచెప్పల్సిన అవసరముంది. ఇక గుజరాత్ గెలిచిన రెండు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగ్ ప్రతిభతోనే నెగ్గింది. ఈ సీజన్లో అత్యంత బలహీన బౌలింగ్ లైనప్ ఉన్న జట్టు గుజరాత్ అనడంలో సందేహంలేదు. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లాడిన రైనాసేన కేవలం 26 వికెట్లను మాత్రమే తీయగలిగింది. బౌలర్లలో అండ్రూ టై , కేరళ పేసర్ బాసిల్ థంప్సి ఆకట్టుకుంటున్నారు. నాలుగు మ్యాచ్‌ల నుంచి తొమ్మిది వికెట్లు తీసిన టై జట్టు తరఫున అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. దేశవాళీ బౌలర్లైన ప్రవీణ్ కుమార్, జడేజా ఘోరంగా విఫలమవుతున్నారు. ముఖ్యంగా ఐదు మ్యాచ్‌లాడిన జడేజా కేవలం రెండు వికెట్లను మాత్రమే తీశాడు. శుభమ్ అగర్వాల్, నాథూ సింగ్ తదీతరులు విఫలమవుతున్నారు. మరోవైపు గాయంతో జట్టుకు దూరమైన డ్వేన్ బ్రావో స్థానంలో ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ బరిలోకి దిగనున్నాడు. ఈ సీజన్ వేలంలో అమ్ముడుపోని ఇర్ఫాన్‌ను గుజరాత్ జట్టులోకి తీసుకుంది. పేస్ బౌలింగ్‌తోపాటు లోయర్ అర్డర్‌లో ఉపయుక్తమైన బ్యాట్స్‌మన్‌గా ఇర్ఫాన్ ఉపకరిస్తాడు. గత సీజన్లన్నీ కలిపి 102 మ్యాచ్‌లాడిన ఇర్ఫాన్ అనుభవం జట్టుకు ఉపయోగపడగలదు. గతేడాది ఇరుజట్లు రెండుసార్లు తలపడగా.. చెరోసారి విజయం సాధించాయి. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో బెంగళూరు నెగ్గింది కనుక ఈ మ్యాచ్‌లో తాము విజయం సాధించే అవకాశముందనే అత్మవిశ్వాసంతో జట్టు బరిలోకి దిగనుంది. -
కోహ్లీ చెప్పాడు.. టీం సభ్యులు పాటించారు!
ఐపీఎల్ చరిత్రలోనే ఒక మ్యాచ్‌లో ఎక్కువ పరుగులు చేసిన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 2013 ఐపీఎల్లో పూణే వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 20 ఓవర్లలో 263 పరుగులు సాధించి రికార్డు సృష్టించింది. అయితే.. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 పరుగులకే ఆలౌటై ఐపీఎల్లో అతి తక్కువ స్కోరు నమోదు చేసిన జట్టుగా కూడా ఆర్సీబీ రికార్డులకెక్కింది. ఆర్సీబీ చెత్త ప్రదర్శనపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. ఆర్సీబీ కొత్త టోల్ నంబర్(70189820250)ను అనౌన్స్ చేసిందని ఆ జట్టు సభ్యులు చేసిన గణాంకాలను సోషల్ మీడియా యూజర్లు చూపుతున్నారు. కొందరైతే.. ఆర్సీబీ మొత్తం స్కోరు(49)ను అంతకుముందు రోజు మ్యాచ్‌లో ధోని టోటల్ స్కోర్(61)తో పోల్చి విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇంకొందరు మాత్రం కోహ్లీ తన టీం సభ్యులకు 10 ఓవర్లలో మ్యాచ్ అయిపోవాలని చెప్పగా.. వారు పాటించారని, అంతుకే ఫలితం ఇలా ఉందని అంటున్నారు. ఏదేమైనా ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో వస్తున్న కామెంట్స్ కోహ్లీ అభిమానులకు మింగుడుపడటం కష్టంగానే ఉంది.**Kohli in dressing room**Kohli-Finish dis match in 10 oversTeam- Sure captain.Result:49 all out in 9.4 overs#KKRvRCB#Gambhir@KKRiders— Nabarun D (@NabarunD1) 23 April 2017