వ్యాపారవేత్తలే కాకుండా ప్రముఖులు సైతం కంపెనీలు స్థాపిస్తున్నారు. అందులో పెట్టుబడి పెడుతున్నారు. భవిష్యత్తులో అభివృద్ధి అయ్యే మంచి బిజినెస్ మోడల్ ఉన్నవారికి ఇన్వెస్టర్లుగా మారుతున్నారు. దాంతో ఇరువురికి లాభం జరిగేలా వ్యవహరిస్తున్నారు. అందులో కొన్ని కంపెనీలు మరింత వృద్ధి చెంది ఐపీవోగా స్టాక్‌మార్కెట్‌లోనూ లిస్ట్ అవుతున్నాయి. అలాంటి సంస్థ ‘గో డిజిట్’ ఐపీవోకు తాజాగా సెబీ ఆమోదం తెలిపింది.
ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ పెట్టుబడి పెట్టిన ‘గో డిజిట్’ ఐపిఓకి వెళ్లేందుకు లైన్‌క్లియర్ అయింది. అందుకు సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఆమోదం తెలిపింది. గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్‌లో ఇన్వెస్టర్ అయిన కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ గ్రూప్ కూడా మద్దతు తెలిపింది.
ఆగస్టు 2022లో కంపెనీ ఐపీఓ కోసం ప్రిలిమినరీ పత్రాలను దాఖలు చేసింది. డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) వివరాల ప్రకారం..గో డిజిట్ ఐపీఓలో రూ.1,250 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నట్లు తెలిసింది. ఐపీఓ ద్వారా సమకూరే మూలధనాన్ని కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.
ఐపీవో ద్వారా నిధులు సేకరించేందుకు కంపెనీ మొదటగా ఆగస్టు 2022లో సెబీకు డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసింది. అయినప్పటికీ, ఉద్యోగులకు సంబంధించి స్టాక్ అప్రిసియేషన్ రైట్స్ స్కీమ్‌లోని కొన్ని కారణాల వల్ల కొద్దికాలంపాటు నిలిచిపోయింది. సెబీ జనవరి 30, 2023న గో డిజిట్ డ్రాఫ్ట్ ఐపీఓ పేపర్‌లను తిరిగి ఇచ్చింది. కంపెనీ నుంచి మరింత సమాచారం కోరింది.
ఇదీ చదవండి: మరో సంస్థపై ఆంక్షలు విధించిన ఆర్‌బీఐ
సవరించిన సమాచారంతో ఏప్రిల్ 2023లో ప్రిలిమినరీ ఐపీఓ పత్రాలను సెబీకి దాఖలు చేసింది. అన్ని పరిశీలించిన సెబీ తాజాగా ఐపీవోకు లైన్ క్లియర్ చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment