
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు డ్రాగా ముగిసింది

275 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగగా.. 8/0 స్కోరు వద్ద వెలుతురు లేమి కారణంగా మ్యాచ్‌ను అంపైర్‌లు నిలిపివేశారు

ముందుగానే టీ బ్రేక్‌ను అంపైర్‌లు ప్రకటించారు. అంతలోనే వర్షం మళ్లీ తిరిగి రావడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు

దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 1-1తో ఆస్ట్రేలియా, భారత్ సమంగా నిలిచాయి.






















