Ind vs Aus
-
మెల్బోర్న్ టెస్టులో 184పరుగుల తేడాతో టీమిండియా ఓటమి (ఫొటోలు)
-
విశాఖలో మిన్నంటిన సంబరాలు
విశాఖ స్పోర్ట్స్/అక్కిరెడ్డిపాలెం: బాక్సింగ్ డే టెస్ట్‌లో సెంచరీతో అదరగొట్టి మెల్బోర్న్ హీరోగా మారిన నితీష్‌కుమార్ రెడ్డిపై ప్రశంసలు కురుస్తుండగా, విశాఖలో సంబరాలు అంబరాన్ని తాకాయి. భారత టాపార్డర్ ఆసీస్ బౌలర్లను ఎదుర్కొనలేక చేతులెత్తేసిన తరుణంలో నితీష్ ఒత్తిడిని తట్టుకుని చేసిన అసమాన పోరాటం చాలా కాలం గుర్తుండిపోతుందని చెబుతూ.. పలువురు అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. 8వ నంబర్ బ్యాటర్‌గా వచ్చి తొలి సెంచరీ చేయడంతో శనివారం జీవీఎంసీ 69వ వార్డు తుంగ్లాంలోని ఆయన నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. నితీష్ నాన్నమ్మ అప్పల కొండమ్మ, బాబాయిలు కాకి గోవిందరెడ్డి, కాకి రామిరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు కేక్ కట్ చేశారు. ఇంటి వద్ద బాణసంచా కాల్చుతూ, తీన్మార్ డ్యాన్స్‌లతో సంబరాలు చేసుకున్నారు. భారత క్రికెట్ జట్టుకు తమ గ్రామానికి చెందిన నితీష్ ఆడుతుండటం తమకెంతో ఆనందంగా ఉందని గ్రామస్తు లు తెలిపారు.ప్రస్తుతం నితీష్ నివాసం ఉంటున్న కొమ్మాదిలోని అపార్ట్మెంట్ వద్ద కూడా కోలాహలం నెలకొంది. అపార్ట్మెంట్ వాసులు నితీష్ ఆటను పూర్తిగా ఆస్వాదించారు. అతను సెంచరీ చేసిన దృశ్యాలను టీవీల్లో వీక్షిస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ కమిటీ ప్రతినిధి వి.వి.రావు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. నితీష్ తక్కువ సమయంలోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడని సంతోషం వ్యక్తం చేశారు. రెండేళ్ల కిందటే వారు అపార్ట్మెంట్లోకి వచ్చారని తెలిపారు.నితీష్‌కు కలెక్టర్ అభినందనలుమహారాణిపేట: మెల్బోర్న్లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఉత్తమ ఆటతీరు కనబరిచిన యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డిని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అభినందించారు. అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తున్న నితీష్ ఆంధ్రప్రదేశ్‌కు, విశాఖపట్నానికి గర్వకారణమని కొనియాడారు. ఇదే ఒరవడి కొనసాగించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు నమోదు చేయాలని ఆకాంక్షించారు. తన ఆటతో విశాఖకు మంచి పేరు తీసుకొచ్చిన నితీష్ కుమార్ రెడ్డికి జిల్లా యంత్రాంగం, ప్రజల తరఫున అభినందనలు తెలుపుతున్నట్లు శనివారం విడుదల చేసిన ప్రకటనలో కలెక్టర్ పేర్కొన్నారు. -
ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్న నితీష్ రెడ్డి.. పిచ్‌పై పుష్ప స్టైల్ వార్నింగ్ (ఫొటోలు)
-
ఆర్థిక సంస్కరణల సారథి, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్సింగ్ అస్తమయం
-
IND Vs AUS: ఆస్ట్రేలియా- భారత్ నాలుగో టెస్టు టెస్టు హైలెట్స్ (ఫొటోలు)
-
ఆసీస్‌తో మ్యాచ్: టీమిండియాకు ఆఖరి అవకాశం
ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న గవాస్కర్-బోర్డర్ ట్రోఫీ ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా మెల్బోర్న్లో గురువారం నుంచి జరగనున్న బాక్సింగ్ డే టెస్ట్(Boxing Day Test) కోసం రెండు దిగ్గజ జట్లు సంసిద్ధంగా ఉన్నాయి. ఈ సిరీస్ లో మూడు టెస్ట్ ల అనంతరం రెండు జట్లు చెరో టెస్ట్ మ్యాచ్ గెలిచి 1-1తో సమఉజ్జీలుగా ఉండగా, ఈ సిరీస్ ఫలితం పై రెండు జట్ల వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ భవితవ్యం కూడా ఆధారపడి ఉండటం ఈ సిరీస్ మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.ఆస్ట్రేలియా ఆశలన్నీ ఈ సిరీస్ పైనేరెండేళ్లకి ఒకమారు తొమ్మిది టెస్ట్ లు ఆడే దేశాల మధ్య జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(World Test Championship:) ఫైనల్ ఈ కాలంలో వివిధ జట్లు కనబరిచిన ప్రతిభ ఆధారంగా రెండు ఫైనల్ కి అర్హత సాధించే జట్లను నిర్ణయిస్తారు. ప్రస్తుత 2023-25 సీజన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పట్టిక లో దక్షిణాఫ్రికా ప్రధమ స్థానంలో ఉంది.శ్రీలంక తో సొంత గడ్డపై జరిగిన రెండు టెస్టుల సిరీస్ లో 2-౦ తేడాతో విజయం సాధించిన దక్షిణాఫ్రికా, పాయింట్ల పట్టిక లో 63.33 సగటు తో ప్రధమ స్థానానికి దూసుకుపోయింది. ఆస్ట్రేలియా ప్రస్తుతం 58.89 సగటు తో రెండో స్థానం లో ఉంది.అయితే ఆస్ట్రేలియా ప్రస్తుతం భారత్ తో జరుగుతున్న గవాస్కర్-బోర్డర్ ట్రోఫీ లోని మిగిలిన రెండు టెస్ట్ మ్యాచ్ ల తోపాటు శ్రీ లంక తో ఆ దేశంలో జరిగే మరో రెండు టెస్ట్ మ్యాచ్ ల్లో ఆడాల్సి ఉంది. అయితే ఆస్ట్రేలియా కి శ్రీ లంక ని స్పిన్ కి అనుకూలంగా ఉండే అక్కడ పిచ్ ల పై శ్రీ లంక ని ఓడించడం అంత సులువైన పని కాదు. అందుకే ఆస్ట్రేలియా కూడా ఈ రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించి తన అవకాశాలని సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది. అందుకే ప్రస్తుత సిరీస్‌పైనే ఆస్ట్రేలియా ఆశలు పెట్టుకుంది.టీమిండియాకు ఆఖరి అవకాశం ఈ సిరీస్ ఆరంభానికి ముందు న్యూజిలాండ్ తో సొంత గడ్డపై జరిగిన రెండు మ్యాచ్ ల సిరీస్ లో 0-2 తో ఘోర పరాభవం పొందిన భారత్(Team India) తొలిసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ స్థానాన్ని జారవిడుచుకునే ప్రమాదంలో పడింది. వరుసగా రెండు సార్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి అర్హత సాధించి, రెండింటిలో పరాభవాన్ని మూటగట్టుకున్న భారత్ కి ఈ రెండు టెస్టులలో విజయం సాధిస్తేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి అర్హత సాధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టిక లో భారత్ 55.88 సగటుతో మూడో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ సిరీస్ కి ముందు పాయింట్ల పట్టిక లో ప్రథమ స్థానంలో ఉన్న భారత్ కి ఇది ఎదురుదెబ్బే .రెండు సార్లు పరాభవం ఇంతకుముందు 2019-21 లో కరోనా అనంతరం ఇంగ్లాండ్ లోని సౌతాంఫ్టన్ లోని రైస్ బౌల్ స్టేడియంలో జరిగిన ప్రథమ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో భారత్ న్యూజిలాండ్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. తర్వాత 2021- 23 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి ఇంగ్లాండ్ లోన్ ఓవల్ స్టేడియం ఆతిధ్యాన్నిచ్చింది. ఈ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడిన భారత్ 209 పరుగుల తేడాతో వరుసగా రెండోసారి పరాజయంచవిచూసింది .ఈ నేపథ్యంలో ఈ సారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి అర్హత సాధించాలని భారత్ చాలా గట్టి పట్టుదలతో ఉంది. ఇందుకు ఈ రెండు టెస్ట్ ల లో విజయం సాధించడం ఒక్కటే భారత్ ముందున్న అవకాశం. లేని పక్షంలో వరుసగా రెండు టెస్ట్ ఛాంపియన్షియప్ ఫైనల్స్ లో పాల్గొన్న వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుత భారత జట్టు సారధి రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీలు కూడా అదే బాటలో పయనించి భారత్ టెస్ట్ జట్టు నుంచి తప్పుకున్నా ఆశ్చర్యం లేదు. -
వర్షం ఎఫెక్ట్.. ఆస్ట్రేలియా- భారత్ మూడో టెస్టు హైలెట్స్ (ఫొటోలు)
-
భారత క్రికెట్‌కు ‘బ్యాడ్ సండే’
క్రికెట్ మైదానంలో ఆదివారం భారత్‌కు ఏదీ కలిసిరాలేదు! ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ రెండో టెస్టులో రోహిత్ శర్మ సారథ్యంలోని పురుషుల జట్టు ఆ్రస్టేలియా చేతిలో పరాజయం చవిచూడగా... ఆస్ట్రేలియాలోని మరో వేదిక బ్రిస్బేన్‌లో భారత మహిళల జట్టుకూ భారీ ఓటమి ఎదురైంది. అడిలైడ్ ‘పింక్ బాల్’ టెస్టులో పురుషుల జట్టు ప్రభావం చూపలేకపోగా... రెండో వన్డేలో ఓడిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని మహిళల జట్టు కంగారూలకు సిరీస్ కోల్పోయింది. ఇక దుబాయ్‌లో జరిగిన ఆసియా జూనియర్ కప్ అండర్–19 టోర్నీలో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన యువ భారత జట్టు తుదిపోరులో బంగ్లాదేశ్ చేతిలో ఓడి టైటిల్‌కు దూరమైంది. మొత్తానికి ఒకే రోజు మూడు వేర్వేరు విభాగాల్లో భారత క్రికెట్ జట్లను పరాజయం పలకరించడంతో ‘హ్యాపీ సండే’ కావాల్సిన చోట ‘బ్యాడ్ సండే’గా మారింది.అడిలైడ్‌లో అదే వ్యథఅడిలైడ్: గులాబీ బంతి పరీక్షలో భారత జట్టు గట్టెక్కలేదు. నాలుగేళ్ల క్రితం అడిలైడ్‌లో జరిగిన ‘పింక్ బాల్’ టెస్టులో ఘోర పరాజయం ఎదుర్కొన్న టీమిండియా... ఇప్పుడు మరోసారి అడిలైడ్ వేదికగా ఓటమి వైపు నిలిచింది. ఆదివారం ముగిసిన ‘డే అండ్ నైట్’ టెస్టులో భారత్ 10 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియా చేతిలో ఓడింది. తొలి టెస్టులో చిత్తుగా ఓడిన ఆ్రస్టేలియా... తమకు అచ్చొచి్చన ‘పింక్ బాల్’ టెస్టులో ఘనవిజయంతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ‘ని 1–1తో సమం చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 128/5తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా... 36.5 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (47 బంతుల్లో 42; 6 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి భారత టాప్ స్కోరర్‌గా నిలవగా... మిగతా వాళ్లు ప్రభావం చూపలేకపోయారు. ఆ్రస్టేలియా బౌలర్లలో కెపె్టన్ కమిన్స్ 5 వికెట్లు పడగొట్టగా... బోలండ్ 3 వికెట్లు, స్టార్క్ 2 వికెట్లు తీశారు. అనంతరం 19 పరుగుల స్వల్ప విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 3.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు మెక్‌స్వీనీ (10 నాటౌట్), ఖ్వాజా (9 నాటౌట్) అజేయంగా నిలిచారు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీతో చెలరేగిన ట్రావిస్ హెడ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఈ నెల 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టు జరుగుతుంది. మరో 47 పరగులే జోడించి... ప్రధాన ఆటగాళ్లు రెండో రోజే అవుటైనా... రిషబ్ పంత్ (28), నితీశ్ కుమార్ రెడ్డి క్రీజులో ఉండటంతో... భారత అభిమానులు అడిలైడ్‌లో అద్భుతం జరగకపోతుందా అని ఆశిస్తే... అది అడియాశే అయింది. క్రితం రోజు స్కోరు వద్దే పంత్.. స్టార్క్ బౌలింగ్‌లో స్లిప్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పుడే పరాజయం ఖాయమైపోగా... నితీశ్ రెడ్డి దూకుడు పెంచి జట్టుకు ఇన్నింగ్స్ ఓటమిని తప్పించాడు. ఈ ఆంధ్ర కుర్రాడు జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లిన తర్వాత 9వ వికెట్ రూపంలో అవుటయ్యాడు. తాజా సిరీస్‌లో ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో మూడుసార్లు భారత్ తరఫున నితీశ్ రెడ్డి టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం. అశి్వన్ (7), హర్షిత్ రాణా (0), సిరాజ్ (7) ఇలా ఒకరివెంట ఒకరు పెవిలియన్ చేరిపోవడంతో టీమిండియా ఆలౌటైంది. చేతిలో ఐదు వికెట్లతో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన రోహిత్ బృందం క్రితం రోజు స్కోరుకు మరో 47 పరుగులు మాత్రమే జోడించగలిగింది. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి భారత జట్టు కేవలం 81 ఓవర్లు మాత్రమే ఆడింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 180; ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 337; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) కేరీ (బి) బోలండ్ 24; రాహుల్ (సి) కేరీ (బి) కమిన్స్ 7; గిల్ (బి) స్టార్క్ 28; కోహ్లి (సి) కేరీ (బి) బోలండ్ 11; పంత్ (సి) స్మిత్ (బి) స్టార్క్ 28; రోహిత్ (బి) కమిన్స్ 6; నితీశ్ రెడ్డి (సి) మెక్‌స్వీనీ (బి) కమిన్స్ 42; అశి్వన్ (సి) కేరీ (బి) కమిన్స్ 7; హర్షిత్ (సి) ఖ్వాజా (బి) కమిన్స్ 0; బుమ్రా (నాటౌట్) 2; సిరాజ్ (సి) హెడ్ (బి) బోలండ్ 7; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (36.5 ఓవర్లలో ఆలౌట్) 175. వికెట్ల పతనం: 1–12, 2–42, 3–66, 4–86, 5–105, 6–128, 7–148, 8–153, 9–166, 10–175. బౌలింగ్: స్టార్క్ 14–1–60–2; కమిన్స్ 14–0–57–5; బోలండ్ 8.5–0–51–3. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: మెక్‌స్వీనీ (నాటౌట్) 10; ఖ్వాజా (నాటౌట్) 9; మొత్తం (3.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 19. బౌలింగ్: బుమ్రా 1–0–2–0; సిరాజ్ 1.2–0–9–0; నితీశ్ కుమార్ రెడ్డి 1–0–8–0.12 ఇప్పటి వరకు 13 డే అండ్ నైట్ టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా 12 టెస్టుల్లో నెగ్గడం విశేషం. అడిలైడ్‌లో ఆడిన 8 డే నైట్ టెస్టుల్లోనూ ఆ్రస్టేలియా గెలిచి అజేయంగా ఉంది. మరోవైపు ఇప్పటి వరకు ఐదు డే అండ్ నైట్ టెస్టులు ఆడిన భారత జట్టు రెండింటిలో ఓడిపోయింది. ఈ రెండూ అడిలైడ్‌లోనే కావడం గమనార్హం. -
ముద్దులు విసురుతూ విరాట్ సెలబ్రేషన్స్.. అనుష్క ఎదురుగా ఉంటే..!
-
Ind vs Aus: పెర్త్ టెస్టు.. తొలిరోజు హైలైట్స్ (ఫొటోలు)
-
వస్తాడు.. సునామీలా విరుచుకుపడతాడు..!
-
భారతదేశపు మొట్టమొదటి దళిత క్రికెటర్.. ఎవరీ పల్వంకర్ బాలూ
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి చెందిన విషయం తెలిసిందే. లీగ్ మ్యాచుల్లో అదరగొట్టి ఓటమి ఎరుగని జట్టుగా పేరుతెచ్చిన భారత్.. ఫైనల్లో చతికిలబడింది. తుదిపోరులో ఆరు వికేట్ల తేడాతో రోహిత్ సేన జట్టు కంగారుల చేతిలో ఘోర పరాజయపాలైంది. అయితే హోం గ్రౌండ్లో టీమిండియా ఓటమిని భారత క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 12 తర్వాత ప్రపంచకప్‌ను ముద్దాడుతుందనుకున్న భారత్‌కు ఇలా జరగడంపై తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఉద్వేగంతో కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ తరుణంలో కన్నడ నటుడు, సామాజిక కార్యకర్త చేతన్ కుమార్ అహింస చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. క్రికెట్లో కూడా రిజర్వేషన్లు ఉండాలని, ఒకవేళ ఇప్పటికే రిజర్వేషన్లు ఉంటే భారత్ వరల్డ్‌కప్ సులువగా గెలిచేదని తెలిపారు. వరల్డ్ కప్ జరిగే రోజు చేతన్ మరో ట్వీట్ కూడా చేశాడు. డబ్బు, కీర్తి కోసం కాకుండా సమాజం గురించి ఆలోచించే ఆటగాళ్లు దేశానికి అవసరమని.. 1876లో కర్ణాటకలోని ధర్వాడ్‌లో జన్మించిన భారత దేశపు మొట్టమొదటి దళిత క్రికెటర్ పల్వకంర్ బాలూ ప్రస్తావన తీసుకొచ్చారు. వందేళ్ల క్రితం పల్వంకర్ బాలూ క్రికెటర్(బౌలర్)గా, సామాజిక, రాజకీయ కార్యకర్తగా చురుకుగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చేతన్ అహింస ప్రస్తావనతో పల్వంకర్ బాలూ గురించి బయటకొచ్చింది. పల్వంకర్ బాలూ భారతీయ క్రికెటర్, రాజకీయ కార్యకర్త. 1876 మార్చి 19న కర్ణాటకలోని ధార్వాడ్‌లో(ఒకప్పటి బాంబే ప్రెసిడెన్సీ) జన్మించాడు. ప్రపంచ క్రీడల్లో పేరు ప్రఖ్యాతలు సాధించిన దళిత సమాజానికి చెందిన మొదటి వ్యక్తిగా బాలూ చరిత్రకెక్కాడు. అతడు పరమానందాస్ జీవందాస్ హిందూ జింఖానా, బాంబే బెరార్, కేంద్ర రైల్వేశాఖకు చెందిన కార్పొరేట్ క్రికెట్ జట్టు తరపున ఆడాడు. ఎడమ చేతి స్పిన్ బౌలర్ అయిన బాలూ.. మొత్తం 33 ఫస్ట్-క్లాస్మ్యాచ్లలో (15.21 బౌలింగ్ సగటుతో) 179 వికెట్లు పడగొట్టాడు. 1911 ఇంగ్లాండ్ పర్యటనలో ఇండియా తరపున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ‘రోడ్స్ ఆఫ్ ఇండియా’గా పేరు సంపాదించాడు. అయితే బాలూ తన సామాజిక వర్గం కారణంగా కెరీర్లో అనేక వివక్షతను ఎదుర్కొన్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. తక్కువ కులానికి చెందిన వ్యక్తిగా ముద్ర పడటంతో సమాన అవకాశాలు దక్కలేదనే విమర్శ ఉంది. ఒకసారి పుణెలో మ్యాచ్ ఆడుతుండగా.. టీ విరామం సమయంలో అతనికి టీం సభ్యులందరితో కాకుండా బయట డిస్పోజబుల్ కప్పులో అందించినట్లు, అతనికి భోజనం కూడా ప్రత్యేక టేబుల్‌పై వడ్డించినట్లు వార్తలొచ్చాయి. పల్వంకర్ తన ముఖం కడక్కోవాలనుకున్నా అణగారిన వర్గానికి చెందిన అటెండర్ అతనికి ఒక మూలన నీళ్లు తెచ్చి పెట్టేవాడని తెలుస్తోంది. అయితే బాలూ బొంబాయికి మారిన తర్వాత పరిస్థితులు మెరుగుపడినప్పటికీ.. క్వాడ్రాంగ్యులర్ టోర్నమెంట్లో అతనికి హిందూ జట్టు కెప్టెన్సీ నిరాకరించారు. భారత క్రికెట్ చరిత్రలో గొప్ప క్రికెటర్లలో ఒకరిగా పల్వంకర్ పేరు గాంచారు. గాంధీ భావజాలంతో ప్రభావితమై.. దేశంలో హోమ్ రూల్ తీసుకురావడానికి కృషి చేశాడు. 1910లో పల్వంకర్ బీఆర్ అంబేద్కర్‌ను తొలిసారి కలిశాడు. అనంతరం ఇరువురు మంచి మిత్రులుగా మారారు. వీరిద్దరూ అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేసి ప్రశంసలు అందుకున్నారు. అనంతరం వీరిద్దరి మధ్య స్నేహం దెబ్బతింది. 1932లో అణగారిన తరగతులకు ప్రత్యేక నియోజకవర్గాల కోసం డాక్టర్ అంబేద్కర్ చేసిన డిమాండ్‌ను బాలూ వ్యతిరేకించాడు. అనంతరం అంబేద్కర్‌కు వ్యతిరేకంగా ‘రాజా-మూంజే ఒప్పందం’పై సంతకమూ చేశాడు. అంబేద్కర్ బౌద్ధమతంలోకి మారాలనే తన ఉద్దేశాన్ని వ్యక్తం చేసినప్పుడు.. అణగారిన వర్గాలను ఇతర మతాల్లోకి మార్చడాన్ని 'ఆత్మహత్య'గా అభివర్ణించాడు. 1933లో బాలూ హిందూ మహాసభ టికెట్‌పై బొంబాయి మున్సిపాలిటీ నియోజకవర్గానికి పోటీ చేసి ఓటమి చెందాడు. నాలుగు సంవత్సరాల తరువాత కాంగ్రెస్‌లో చేరి బొంబాయి శాసనసభ ఎన్నికలలో బీఆర్ అంబేద్కర్‌కు వ్యతిరేకంగా పోటీ చేసి మరోసారి పరాజయం పొందాడు. స్వాతంత్ర్యం అనంతరం 1955 జూలై4న బాంబే స్టేట్‌లో మరణించాడు. డాయన అంత్యక్రియలకు పలువురు జాతీయ నాయకులు మరియు క్రికెటర్లు హాజరయ్యారు. -
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తూ గుండెపోటుతో యువకుడి మృతి
సాక్షి, తిరుపతి: తిరుపతిలో విషాదం చోటుచేసుకుంది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ మ్యాచ్ చూస్తూండగా ఉత్కంఠ లోనైన క్రికెట్అభిమాని గుండె పోటుతో మృతి చెందాడు. వివరాలు.. తిరుపతి రూరల్ మండలం దుర్గసముద్రం గ్రామానికి చెందిన జ్యోతి కుమార్ యాదవ్ అనే యువకుడు బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తున్న జ్యోతి కుమార్.. ఇంటి వద్దనే ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ఫైన్ మ్యాచ్‌ను స్నేహితులతో కలిసి చూశాడు. ఎంతో ఉద్వేగంతో మ్యాచ్ వీక్షిస్తున్న సమయంలో గుండె నొప్పి రావడంతో చికిత్స కోసం స్నేహితులు తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మ్యాచ్ చూస్తున్న సమయంలో ఆస్ట్రేలియా జట్టు మూడు వికెట్లు పడే సరికి ఆనందంతో తట్టుకోలేక ఊగిపోయాడని, ఆ తర్వాత గుండె నొప్పి రావడంతో తుది శ్వాస విడిచాడని స్నేహితులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. మృతుడు కుటుంబాన్ని తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పరామర్శించారు. చదవండి: దేశం ఎప్పుడూ మీ వెంటే: వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్ ఓటమిపై ప్రధాని మోదీ -
ఆస్ట్రేలియా కెప్టెన్ కమ్మిన్స్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ప్రధాని మోదీ
అహ్మదాబాద్: అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాని మోదీ పక్కపక్కనే కూర్చుని మ్యాచ్‌ని వీక్షించారు. క్రికెట్ వరల్డ్‌కప్‌లో నేడు భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా మొతేరా స్టేడియంలో నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్‌ను వీక్షించడానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. 10 వికెట్లు కోల్పోయి 240 పరుగులు సాధించింది. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మొదట్లో కాస్త తడబడింది. కానీ లబుషేన్, రాబిన్ హెడ్లు నిలదొక్కుకుని ఆస్ట్రేలియాను విజయానికి చేరువ చేశారు. లబుషేన్ అర్ధసెంచరీ, రాబిన్ హెడ్ సెంచరీతో చెలరేగిపోయారు. ఇదీ చదవండి: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో కలకలం.. ఫ్రీ-పాలస్తీనా టీషర్ట్‌తో మైదానంలోకి దూసుకొచ్చిన వ్యక్తి -
వరల్డ్‌కప్ ఫీవర్.. పెళ్లికి వచ్చిన అతిథుల కోసం ఎల్ఈడీ స్క్రీన్..
సాక్షి, కరీంనగర్: క్రికెట్‌పై భారతదేశ ప్రజలకు ఉన్న క్రేజ్ మాటల్లో చెప్పలేనిది. ప్రస్తుతం దేశమంతా క్రికెట్ ఫీవర్ నడుస్తోంది. ఐసీసీ వరల్డ్ కప్‌లో భాగంగా నేడు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న వేళ.. క్రికెట్ అభిమానులంతా టీవీల ముందు సెటిలైపోయారు. అందులోనూ ఈరోజు ఆదివారం సెలవు దినం కావటంతో.. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలవాలని ఆకాంక్షిస్తూ భారతీయులంతా ప్రార్థిస్తున్నారు. వరల్డ్‌కప్ ఫీవర్ ఇతర కార్యక్రమాలకు అంటుకుంది. ఈ సందర్భంగా కరీంనగర్లో ఓ ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. నగరంలోని ఓ ఫంక్షన్ హల్లో ఆదివారం పెళ్లి జగుతుండగా.. ఎల్ఈడీ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. వివాహానికి వచ్చిన అతిథుల కొసం పెళ్లి వారు క్రికెట్ లైవ్ ప్రసారం చేశారు. దీంతో పెళ్లి పనుల హడావిడీలోనూ అందరూ తమకెంతో ఇష్టమైన క్రికెట్ మ్యాచ్‌ను కూడా వీక్షించారు. ఇక అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వరల్డ్ కప్ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. టోర్నీలో అత్యుత్తమ జట్లలో విజేతగా నిలిచేది ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. -
మ్యాచ్ అహ్మదాబాద్‌లో.. ‘రెట్టించిన ఉత్సాహం’ ఢిల్లీలో..
ఈరోజు (ఆదివారం) గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ-ఎన్సీఆర్లోని పలు పబ్‌లు, రెస్టారెంట్లలో క్రీడాప్రియులు మ్యాచ్‌ను మరింత ఉత్సాహంతో తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారీ టీవీ స్క్రీన్లను ఏర్పాటు చేయడం మొదలుకొని ప్రత్యేక పానీయాలు అందించడం వరకు అన్నింటినీ అందుబాటులో ఉంచారు. ప్రపంచ కప్ ఫైనల్‌ను క్యాష్ చేసుకునేందుకు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని పలు పబ్‌లు, రెస్టారెంట్లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. సెమీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన టీమ్ఇండియా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించడం విశేషం. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా ‘ఎస్ మినిస్టర్ - పబ్ అండ్ కిచెన్’ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ ఇది బిగ్ మ్యాచ్ కావడంతో ‘కవర్ ఛార్జీ’గా మూడు వేల రూపాయలు వసూలు చేస్తున్నాం. సాధారణ రోజుల్లో, మేము దీనిని వసూలు చేయం. ఫైనల్ మ్యాచ్ అయినందున ఇంత రేటును వసూలు చేస్తున్నాం. దీనిని ఆహారానికి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది’ అని అన్నారు. కాగా బ్లూ జెర్సీ ధరించి వచ్చే వారి కోసం ‘బీర్ కేఫ్’లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బీర్ కేఫ్ వ్యవస్థాపకుడు రాహుల్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ‘టీమ్ ఇండియా ఫైనల్‌కు చేరడంతో ఆదివారం దేశవ్యాప్తంగా ఉన్న మా అవుట్లెట్లలో అభిమానులను స్వాగతించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పెద్ద స్క్రీన్లపై మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చేస్తాం. టీమ్ ఇండియా జెర్సీ ధరించి వచ్చిన వారికి ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నాం’ అని అన్నారు. హర్యానాలోని సైబర్ సిటీ ఆఫ్ గురుగ్రామ్‌లోని ‘సోయి 7 పబ్’, ‘బ్రూవరీ’లలో క్రీడాభిమానులు ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ను తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ‘సోయి 7 పబ్’కి చెందిన లలిత్ అహ్లావత్ మాట్లాడుతూ ‘మ్యాచ్‌లను ప్రసారం చేయడానికి మూడు పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశాం. సైబర్ సిటీలో అతిపెద్ద వేదిక ఏర్పాటు చేశాం. భారత జట్టుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం’ అని అన్నారు. ఇది కూడా చదవండి: మ్యాచ్ తిలకించేందుకు అహ్మదాబాద్‌కు అనుష్క శర్మ -
టీం ఇండియాకి భారీ షాక్..ఎందుకంటే..!
-
CWC 2023 Final : భారత్, ఆస్ట్రేలియా ఫైనల్‌కు సర్వం సిద్ధం (ఫోటోలు)
-
వరల్డ్‌కప్ మ్యాచ్ కోసం హీరో రవితేజ.. సరికొత్త రికార్డ్
మాస్ మహారాజ్ రవితేజ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం కామెంట్రీ చేసిన ఇతడు.. సినిమా విశేషాలతో పాటు మ్యాచ్ గురించి మాట్లాడాడు. అలానే టీమిండియాలో కోహ్లీతో మరో క్రికెటర్ అంటే ఇష్టమని చెప్పాడు. ఈ క్రమంలోనే ఎవరికీ సాధ్యం కానీ అరుదైన ఫీట్ సాధించాడు. ఇంతకీ ఏంటి సంగతి? వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య చెన్నైలో మ్యాచ్ జరిగింది. అయితే తెలుగు కామెంటరీ బాక్సులో కనిపించిన రవితేజ.. తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. కోహ్లీ, సిరాజ్ అంటే ఇష్టమని చెప్పాడు. ఇకపోతే కోహ్లీ యాటిట్యూడ్, అగ్రెషన్, లుక్ అంటే తనకు ఇష్టమని చెప్పాడు. అలానే ఈ మ్యాచ్‌లో క్యాచ్ పట్టిన స్టైల్ నచ్చిందని కామెంట్రీ చెప్పాడు. (ఇదీ చదవండి: ఫారెన్ టూర్లో విజయ్-రష్మిక.. అది నిజమేనా?) అయితే గతంలో ఐపీఎల్ సందర్భంగా విజయ్ దేవరకొండ ఇలా కామెంటరీ బాక్సులో కాదు గానీ స్టేడియంలో కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు రవితేజ మాత్రం ఏకంగా వరల్డ్‌కప్ మ్యాచ్ కోసం కామెంటరీ చేశాడు. అయితే ఓ తెలుగు హీరో ఇలా ప్రపంచకప్ మ్యాచ్‌కి కామెంటరీ చేయడం ఇదే తొలిసారి. ఇలా ఎవరికీ సాధ్యపడని ఘనత సాధించాడు. స్టూవర్టుపురం గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. అక్టోబరు 20న పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'జవాన్'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!) Men In Blue slaying on the field and Mass Maharaja @RaviTeja_offl slaying it with a mic in hand 🔥🔥#INDvAUS the TIGER's way ❤🔥#TigerNageswaraRao in Cinemas Oct 20th 🥷@DirVamsee @AnupamPKher @AbhishekOfficl @NupurSanon @gaya3bh #RenuDesai @Jisshusengupta @gvprakash… pic.twitter.com/zK12hPtbCe — Abhishek Agarwal Arts (@AAArtsOfficial) October 8, 2023 -
Ind Vs Aus 2nd ODI Photos: రెండో వన్డేలో ఆసీస్‌పై భారత్ ఘన విజయం (ఫోటోలు)
-
రాన్నున్న T -20 సిరీస్ లో ఈ యువ ఆటగాళ్లు
-
‘వన్డే’ విజేత ఎవరో? భారత్, ఆస్ట్రేలియా చివరి మ్యాచ్.. గెలిచినోళ్లదే సిరీస్
అంతర్జాతీయ క్రికెట్లో రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య సమరం చివరి ఘట్టానికి చేరింది. టెస్టు సిరీస్‌ను గెలుచుకొని భారత్ ఆధిక్యం ప్రదర్శించగా, ఒక విజయంతో ఆసీస్ కూడా సంతృప్తిగా ముగించింది. ఇప్పుడు వన్డేల్లో ఇరు జట్లు సమంగా నిలిచిన స్థితిలో సిరీస్ విజేతను తేల్చే ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. విశాఖలో ఎదురైన ఘోర పరాజయానికి బదులు తీర్చుకుంటూ ఘనంగా ముగించాలని టీమిండియా భావిస్తుండగా... భారత్‌లో సిరీస్ సాధించే అరుదైన అవకాశాన్ని వదులుకోరాదని కంగారూలు పట్టుదలగా ఉన్నారు. ఇరు జట్లుసమ ఉజ్జీలుగా కనిపిస్తున్న నేపథ్యంలో ఆసక్తికర పోరుకు చెన్నై వేదిక కానుంది. చెన్నై: ఆ్రస్టేలియాతో తొలి వన్డేలో ఎంతో శ్రమించి నెగ్గిన భారత రెండో వన్డేలో పూర్తిగా చేతులెత్తేసింది. టెస్టు సిరీస్ ఫలితం ఎలా ఉన్నా మన వన్డే టీమ్ బలహీనతలను గత మ్యాచ్ చూపించింది. వరల్డ్ కప్ ఏడాదిలో ఆస్ట్రేలియాలాంటి పటిష్టమైన జట్టు ఎదురైతే పరిస్థితి ఎలా ఉంటుందనేది మనకు తాజా ఫలితం చూపించింది. ఈ నేపథ్యంలో ఆసీస్‌ను ఓడించి సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకోవడం భారత జట్టు తక్షణ లక్ష్యం. అయితే గత మ్యాచ్ ఇచ్చి న ఉత్సాహంతో స్మిత్ సేన కూడా సిరీస్ గెలుపుపై దృష్టి పెట్టింది. ఇలాంటి స్థితిలో భారత్, ఆసీస్ నేడు జరిగే చివరి వన్డేలో తలపడబోతున్నాయి. సుందర్‌కు చాన్స్! ‘సూర్యకుమార్‌కు మేం కనీసం 7–10 వన్డేల్లో అవకాశం కల్పిస్తాం’ వరుసగా రెండు మ్యాచ్‌లలో తొలి బంతికే అవుటైన తర్వాత కూడా కెప్టెన్ రోహిత్ చేసిన వ్యాఖ్య ఇది. దీనిని బట్టి చూస్తే భారత బ్యాటింగ్‌కు సంబంధించి టీమ్‌లో మార్పులు ఉండకపోవచ్చు. ఈ బ్యాటింగ్ బలగంతోనే విజయాన్ని అందుకోవాలని రోహిత్ పట్టుదలగా ఉన్నాడు. అయితే వైజాగ్‌లో స్టార్క్ బౌలింగ్‌ను చూస్తే టాప్–5 బ్యాటర్లు చాలా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. స్వయంగా రోహిత్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉండగా, గిల్ నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన రాలేదు. కోహ్లి కూడా సత్తా చాటితేనే భారత్ విజయవంపై ఆశలు పెంచుకోవచ్చు. బౌలింగ్ విషయంలో భారత్ ముందు ఇతర ప్రత్యామ్నాయాలేవీ లేవు కాబట్టి పేసర్లుగా షమీ, సిరాజ్ ఖాయం. పాండ్యా ఆల్‌రౌండర్‌గా తన పాత్ర నెరవేర్చగలడు. అక్షర్, జడేజాలాంటి స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లుకు తోడు గా మరో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు ఈ మ్యాచ్‌లో చోటు దక్కవచ్చు. పెద్దగా ఆకట్టుకోని కుల్దీప్ యాదవ్ స్థానంలో సుందర్ తన సొంతగడ్డపై తొలి మ్యాచ్ ఆడే అవకాశాలున్నాయి. వార్నర్ సిద్ధం... మరోవైపు సిరీస్ గెలిచే అవకాశాన్ని కోల్పోరాదని భావిస్తున్న ఆ్రస్టేలియా దానికి తగిన వ్యూహరచన చేస్తోంది. స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో ఒక పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అబాట్‌ను తప్పించి అతని స్థానంలో మ్యాక్స్‌వెల్‌ను ఆడించనుంది. దూకుడైన బ్యాటర్ వార్నర్ గాయం నుంచి కోలుకోవడం జట్టు బలం పెంచింది. టెస్టుల్లో వార్నర్ విఫలమైనా... పరిమిత ఓవర్ల క్రికెట్లో అతను ఇప్పటికీ స్టార్ బ్యాటరే. మార్ష్ , హెడ్ విజయవంతమైన ఓపెనింగ్ జోడీనే అయినా వార్మర్ ఆడితే మార్ష్ మిడిలార్డర్‌కు మారతాడు. స్టొయినిస్, గ్రీన్‌లాంటి ఆల్‌రౌండర్లతో ఆసీస్ పటిష్టంగా ఉంది. అన్నింటికి మించి స్టార్క్ సూపర్ ఫామ్ జట్టును ముందంజలో నిలుపుతోంది. రెండు మ్యాచ్‌ల లోనూ అతను భారత బ్యా టర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. ఇదే ఒత్తిడిని స్టార్క్ కొనసాగించాలని ఆసీస్ కోరుకుంటోంది. -
ఇండియా-ఆసీస్ మ్యాచ్‌లో లైగర్.. సందడి చేసిన బాలీవుడ్ హీరో
భారత్‌లో క్రికెట్‌కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు సినీనటులు కూడా మ్యాచ్‌లను చూసేందుకు స్టేడియాలకు క్యూ కడతారు. ఇటీవల హైదరాబాద్‌లో ఉప్పల్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో బాలీవుడ్, టాలీవుడ్ నటులు సందడి చేశారు. సోనూ సూద్‌తో కలిసి విజయ్ దేవరకొండ మ్యాచ్‌ను తిలకించారు. విజయ్ తమ్ముడు ఆనంద్ కూడా ఉప్పల్ మ్యాచ్‌ను వీక్షించారు. వీరంతా టీమిండియాను సపోర్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇటీవల థియేటర్లలో విడుదలైన విజయ్ దేవరకొండ మూవీ లైగర్ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ కూాడ నటుడే. టాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించారు. టీమిండియా మ్యాచ్ చూస్తున్న వీడియో క్లిప్‌ను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆగస్టులో దుబాయ్‌లో ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన 2022 ఆసియా కప్ మ్యాచ్‌లోనూ విజయ్ దేవరకొండ సందడి చేశారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన చివరిదైన మూడో టీ20లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. THE #VijayDeverakonda Cheering & Clapping Along With @ananddeverkonda & @SonuSood Team INDIA 🇮🇳 ❤️🔥🤙@TheDeverakonda #INDvAUS pic.twitter.com/twUN8iI3Ug — Vijay Deverakonda Online Fans (@VDRowdiesOnline) September 25, 2022 -
అభిమానులతో కిక్కిరిసిన ఉప్పల్ స్టేడియం.. సామర్థ్యానికి మించి లోపలికి
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆదివారం అభిమానులతో కిక్కిరిసింది. భారత్– ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ–20 మ్యాచ్ చూసేందుకు అభిమానులు ఉప్పెనలా తరలివచ్చారు. మూడేళ్ల తర్వాత ఇక్కడ మ్యాచ్ జరుగుతుండటంతో క్రీడాభిమానుల్లో ఆసక్తి పెరిగింది. మైదానానికి క్రికెటర్లు రాకముందే దాదాపుగా రెండు గంటల ముందు నుంచి వారిని చూసేందుకు అభిమానులు ఉప్పల్‌కు బారులుదీరారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు భిన్న విభిన్న వేషధారణలతో ఉప్పల్‌కు తరలివచ్చారు.క్రికెటర్ల పేర్లతో ఉన్న టీ షర్టులను గ్రౌండ్ బయట విక్రయిస్తుండటంతో వాటిని కొనేందుకు యువత ఎగబడ్డారు. గ్రౌండ్లో నుంచి వచ్చే శబ్దాలతో బయట ఉన్న అభిమానులు సైతం ఎంజాయ్ చేశారు. వీఐపీ బాక్స్‌లోకి ప్రజాప్రతినిధులు? ఉప్పల్ క్రికెట్ స్టేడియం టికెట్ల విషయంలో అంతా పారదర్శకమని చెబుతున్న హెచ్‌సీఏ అధికార పార్టీ నేతలను అందలమెక్కించుకుంది. ఎమ్మెల్యే స్థాయి నేతలతో కలిసి వచ్చిన, కార్పొరేటర్లు, కార్యకర్తలు, నేరుగా వీఐపీ బాక్స్‌లోకి ప్రవేశించి హంగామా సృష్టించారు. దీంతో టికెట్లు కొనుక్కున్న వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సామర్థ్యానికి మించి ప్రేక్షకులు లోపలికి వెళ్లినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
IND VS AUS 3rd T20: వేలల్లో టికెట్లు.. కోట్లలో బెట్టింగ్‌లు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం వేదికగా భారత్–ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం జరిగిన మూడో టీ20 క్రికెట్ మ్యాచ్ ద్వారా బ్లాక్‌మార్కెటింగ్, బెట్టింగ్ మాఫియాలు భారీగా డబ్బు దండుకున్నాయి. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు వరకు బ్లాక్‌లో టికెట్ల దందా యథేచ్ఛగా సాగగా మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ సైతం జోరుగా జరిగింది. స్టేడియంలో ఫస్ట్ ఫ్లోర్, సౌత్ పెవిలియన్, నార్త్ పెవిలియన్, టెర్రస్.. ఇలా పలు రకాలుగా ఉండే టికెట్లను బ్లాక్ మార్కెట్ మాఫియా కనీసం నాలుగింతలు పెంచి అమ్మింది. మరోవైపు మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ మాఫియా రూ. కోట్లలో కొల్లగొట్టినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాన ఆటగాళ్లు చేయబోయే పరుగులు, వికెట్లు తీసే బౌలర్లు, మొత్తంగా జట్టు సాధించే స్కోర్.. ఇలా పలు విభాగాల్లో బెట్టింగ్ సాగింది. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్‌ల ద్వారా బెట్టింగ్ గ్రూపులు క్రియేట్ చేసి ఆధార్ కార్డుతో కూడిన వ్యక్తిగత వివరాలు పంపిన వారినే ఇందులో చేర్చుకున్నట్లు తెలిసింది. ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా కేంద్రాలుగా సాగిన ఈ దందాలో రూ.1000 మొదలు రూ. 10 లక్షల దాకా ఒక్కో బంతికి లేదా ఒక్కో పరుగుకు బెట్టింగ్ జరిగినట్లు సమాచారం. -
జింఖానా ‘తొక్కిసలాట’.. మహిళను కాపాడేందుకు ఆ లేడీ కానిస్టేబుల్ ఏం చేసిందంటే?
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద ఉదయం ఆసీస్-భారత్ మ్యాచ్ టిక్కెట్ల కోసం జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ లేడీ కానిస్టేబుల్ చాకచక్యంగా వ్యవహరించింది. ప్రాణాపాయంలో ఉన్న మహిళకు వెంటనే సీపీఆర్ చేసి ఆ ప్రాణాన్ని నిలబెట్టింది. టిక్కెట్ల కోసం ఒక్కసారిగా అభిమానులు తోసుకుని రావడంతో అందులో 45 ఏళ్ల మహిళ పూర్తిగా స్పృహ తప్పి పడిపోయారు. చదవండి: హెచ్‌సీఏపై సమీక్ష.. కఠినచర్యలు తప్పవ్..! మంత్రి షాకింగ్ కామెంట్స్ దీంతో బేగంపేట మహిళా పీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ నవీన తక్షణమే స్పందించి ఆ మహిళను బయటకులాగారు. అప్పటికే ఆమె స్పృహ కోల్పోయి ఊపిరి అందని పరిస్థితిలో ఉండటంతో ఆ కానిస్టేబుల్ సీపీఆర్ చేశారు. మహిళను కాపాడిన కానిస్టేబుల్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా కానిస్టేబుల్ నవీన సాక్షితో మాట్లాడుతూ, సాటి మహిళను కాపాడాలని ఆలోచించానని తెలిపారు. -
హెచ్‌సీఏపై సమీక్ష.. కఠినచర్యలు తప్పవ్..! మంత్రి షాకింగ్ కామెంట్స్
India Vs Australia 2022 3rd T20 Uppal Stadium Tickets- HCA: జింఖానా తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. హెచ్‌సీఏ నుంచి ప్రభుత్వం వివరణ కోరింది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులతో సమావేశమయ్యారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్, రాచకొండ సీపీ మహేష్ భగవత్ హాజరయ్యారు. చదవండి: హెచ్‌సీఏ ఘోర వైఫల్యం.. 32 వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయి? సమావేశానికి ముందు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, టికెట్ల అమ్మకాలు పారదర్శకంగా జరగలేదన్నారు. టికెట్ల అమ్మకాల్లో అక్రమాలపై విచారణ చేపడతామన్నారు. అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠినచర్యలు తప్పవన్నారు. తెలంగాణ ప్రతిష్టను దిగజారిస్తే ఊరుకునేదిలేదన్నారు.హెచ్‌సీఐ పూర్తిగా వైఫల్యం చెందిందని మంత్రి అన్నారు. కాగా, ఆసీస్-భారత్ జట్ల మధ్య ఉప్పల్‌లో జరగబోయే మ్యాచ్ కోసం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద టికెట్ల అమ్మకాల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)ఘోర వైఫల్యం మూటగట్టుకుంది. టిక్కెట్లు కోసం ఒక్కసారిగా అభిమానులు తోసుకుని రావడంతో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెచ్‌సీఏ తీరుపై తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. హెచ్‌సీఏ ఘోర వైఫల్యంపై ఆ అసోసియేషన్ మాజీ కార్యదర్శి శేష్ నారాయణ్ మండిపడ్డారు. 32 వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. -
హెచ్‌సీఏ ఘోర వైఫల్యం.. 32 వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయి?
సాక్షి, హైదరాబాద్: ఆసీస్-భారత్ జట్ల మధ్య ఉప్పల్‌లో జరగబోయే మ్యాచ్ కోసం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద టికెట్ల అమ్మకాల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)ఘోర వైఫల్యం మూటగట్టుకుంది. టిక్కెట్లు కోసం ఒక్కసారిగా అభిమానులు తోసుకుని రావడంతో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెచ్‌సీఏ తీరుపై తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. హెచ్‌సీఏ ఘోర వైఫల్యంపై ఆ అసోసియేషన్ మాజీ కార్యదర్శి శేష్ నారాయణ్ మండిపడ్డారు. 32 వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. చదవండి: ఉప్పల్ స్టేడియంలో ఇండియా– ఆస్ట్రేలియా మ్యాచ్.. అభిమానులతో ఆటలా! ‘‘ఒక్కరోజే ఇన్ని టిక్కెట్లు ఎలా అమ్ముదామనుకున్నారు. ఆన్లైన్లో అని చెప్పి ఆఫ్‌లైన్‌లోకి ఎందుకెళ్లారు?. హెచ్‌సీఏలో అజారుద్దీన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. తొక్కిసలాటకు ఆయనే బాధ్యత వహించాలి. 32 వేల టిక్కెట్లు అందుబాటులో ఉండాలి. టికెట్ల విక్రయానికి అన్ని చోట్ల కౌంటర్లు ఏర్పాటు చేయాలి. ఒక్కచోటే కౌంటర్ పెట్టడం సరికాదు. ఒక్కరోజే టికెట్లు విక్రయించడం సరికాదు. కనీసం నాలుగైదు రోజులు టికెట్లు విక్రయించాలి. ఆన్లైన్లో అమ్మిన టికెట్లలో అక్రమాలు జరిగాయి. ఎవరికి టికెట్లు అమ్మారో వివరాలు బయటపెట్టాలి’’ అని శేష్ నారాయణ్ డిమాండ్ చేశారు. -
ఉప్పల్ స్టేడియంలో ఇండియా– ఆస్ట్రేలియా మ్యాచ్.. అభిమానులతో ఆటలా!
సాక్షి, ఉప్పల్: ఈ నెల 25న ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇండియా– ఆస్ట్రేలియా జట్ల మధ్య నిర్వహించే టీ– 20 మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల విక్రయాల్లో అవకతవకలు జరిగాయని, వీటిపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మానవ హక్కుల కమిషన్‌ను ఫిర్యాదు చేసింది. క్రికెట్ క్రీడాభిమానులకు టికెట్లు ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్లోకి తరలించడానికి హెచ్‌సీఏ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిన పత్రాలతో ఏఐవైఎఫ్ ప్రతినిధులు టికెట్లతో పాటు ఆట సమయంలో తిను బండారాలు, శీతల పానీయాలను సైతం అధిక రేట్లకు విక్రయించే యత్నాలపైనా విచారణ చేపట్టాలని కోరారు. కేవలం 25 శాతం టికెట్లను ఆన్లైన్లో విక్రయించి 75 శాతం టికెట్లను బ్లాక్ మార్కెట్ చేయడానికి హెచ్‌సీఏ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ఏఐవైఎఫ్ అధ్యక్షుడు వలి ఉలా ఖాద్రి, రాష్ట్ర ఉపాద్యక్షుడు ఎన్.శ్రీకాంత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర పాల్గొన్నారు. రసూల్‌పుర: ‘హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ను రద్దు చేయాలి.. అధ్యక్షుడిగా అజారుద్దీన్‌ను తొలగించాలి.. అజారుద్దీన్ డౌన్ డౌన్’ అంటూ క్రికెట్ అభిమానులు జింఖానా గ్రౌండ్లో నినాదాలు చేశారు. భారత్– ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న టీ– 20 మ్యాచ్ నేపథ్యంలో.. టికెట్ల కోసం వేలాది మంది జింఖానా మైదానానికి వచ్చారు. టికెట్లు విక్రయించాలంటూ గోడ దూకి గ్రౌండ్ లోపలికి చేరుకున్నారు. చదవండి: జింఖానా గ్రౌండ్ తొక్కిసలాటలో ఎవరూ చనిపోలేదు: అడిషనల్ సీపీ టికెట్లు ఇచ్చేవరకూ తిరిగి వెళ్లేది లేదంటూ అక్కడే బైఠాయించారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి టికెట్ల కోసం వచ్చామని.. తీరా చూస్తే వాటిని అమ్ముకున్నారని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జింఖానా గ్రౌండ్స్ వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జ్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 25వ తేదీన భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య హైదరాబాద్ వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం నగరంలోని జింఖానా మైదానంలో టికెట్ విక్రయాలు జరుగుతున్నాయి. కాగా, మ్యాచ్ వీక్షేందుకు టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు అర్ధర్రాతి నుంచే క్యూ లైన్లలో బారులుతీరారు. పెద్ద సంఖ్యలో అభిమానులు జింఖానా మైదానం వద్దకు తరలివచ్చారు. ఈ క్రమంలో టికెట్స్ కోసం ఒక్కసారిగా ఎగబడటంతో గ్రౌండ్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో నలుగురు త్రీవంగా గాయపడ్డారు. పలువురు స్పృహ తప్పపడిపోయారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పోలీసులు సైతం గాయపడ్డారు. పరిస్థితి అదుపుతప్పి ఉద్రికత్త చోటుచేసుకుంది. దీంతో, పరిస్థితులను చక్కదిద్దేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇదిలా ఉండగా.. టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు తెలంగాణ క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. మ్యాచ్ టికెట్స్ విషయంలో బ్లాక్ టికెట్స్‌పై సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. టికెట్స్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని సేల్ చేశారు? ఎవరికి ఎన్ని టికెట్స్ కేటాయిస్తున్నారో చెప్పాలన్నారు. బ్లాక్ దందా కోసం మ్యాచ్ టికెట్స్ ఇవ్వలేదన్నారు. క్రికెట్ మ్యాచ్ టికెట్స్ విషయంలో తెలంగాణ రాష్ట్ర పరువు తీయొద్దన్నారు. బ్లాక్ దందా జరిగినట్లు తెలిస్తే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
IND Vs AUS: టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్‌కు పోటెత్తిన అభిమానులు (ఫొటోలు)
-
INDvsAUS : తొలి టీ20లో ఆస్ట్రేలియా విజయం (ఫొటోలు)
-
బ్యాండ్ బాజాతో రహానేకు ఘన స్వాగతం..
-
అజింక్య రహానేకు గ్రాండ్ వెల్కమ్ : వీడియో వైరల్
సాక్షి, ముంబై: ఆస్ట్రేలియా గడ్డపై సరికొత్త చరిత్రను లిఖించిన టీమిండియా కెప్టెన్ అంజిక్య రహానేకు ముంబైలో ఘన స్వాగతం లభించింది. అపూర్వ విజయయంతో బోర్డర్-గావస్కర్ ట్రోఫిని దక్కించుకున్న రహానే టీంపై దేశవ్యాప్తంగా ప్రశంసలజల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో ముంబైలోని ఆయన అభిమానులు, స్థానికులు కూడా రహానే ఘన స్వాగతం పలికారు. గురువారం ముంబైలోని ఆయన నివాసానికి తిరిగివచ్చిన తరుణంలో బాండ్ బాజాలతో స్థానికులు సంబరాలు చేసుకున్నారు. టీమిండియా విజయంతో దేశం గర్వపడేలా చేసిన కూల్ కెప్టెన్ రహానేకు అపూర్వ స్వాగతం పలికారు అభిమానులు. కుమార్తె ఆర్యను ఎత్తుకుని వస్తున్న రహానేపై పూల వర్షం కురిపించారు. దీనికి సంబంధించిన వీడియోను రహానె భార్య రాధిక ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది ఆస్ట్రేలియాలో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకపోవడంతో టీమ్ ఇండియాకు నాయకత్వం వహించిన అజింక్య రహానే నేతృత్వంలోని యంగ్ ఇండియా టీం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా రహానే తన చిన్ననాటి స్నేహితురాలు రాధికా దొపావ్కర్‌ను సెప్టెంబర్ 26, 2014లో లవ్ కమ్ ఆరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతుల ముద్దుల కూతురే ఆర్య . Skipper Ajinkya Rahane received a grand reception at his home in Mumbai. ❤🤩 pic.twitter.com/2h3W0Khest — Anish Singh (@The_anishsingh) January 21, 2021 -
చారిత్రాత్మక విజయం : నీతా అంబానీ ప్రశంసలు
సాక్షి, ముంబై: ఆస్ట్రేలియా గడ్డపై సంచలన విజయాన్ని నమోదు చేసిన టీమిండియాను రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ అభినందించారు. మూడు దశాబ్దాల తరువాత ఆసిస్ జట్టును మట్టికరపించి బోర్డర్-గావస్కర్ ట్రోఫీని గెలుచుకున్న భారత క్రికెటర్లను యంగ్ ఇండియా అంటూ అభివర్ణించారు నీతా అంబానీ. (అద్భుత విజయం : బీసీసీఐ భారీ నజరానా) ‘‘ఇంతటి చారిత్రాత్మక విజయానికి భారత జట్టుకు అభినందనలు. మీలో ప్రతి ఒక్కరూ ఆత్మ విశ్వాసం, సంకల్పం, నిర్భీతితో ఈ అద్భుతమైన సిరీస్‌ను సొంతం చేసుకున్నారు. ఇదీ మన యంగ్ ఇండియా, న్యూ ఇండియా. దేశం మొత్తాన్ని ఉత్తేజితం చేసిన మీ విజయానికి, ధైర్యానికి ఒక భారతీయురాలిగా గర్వపడుతున్నాను అంటూ నీతా అంబానీ తన అధికారిక ప్రకటనలో తెలిపారు. కాగా బ్రిస్బేన్‌లోని గబ్బాలో యువ భారత జట్టు ఆస్ట్రేలియాను మూడు వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ అద్భుత విజయంపై అటు క్రికెట్ లెజెండ్స్, ఇతర క్రీడాభిమానులతోపాటు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హర్షం వక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. (పాపం లాంగర్.. ఓడిపోయాకా తెలిసొచ్చినట్లుంది) -
అద్భుత విజయం : బీసీసీఐ భారీ నజరానా
సాక్షి, న్యూఢిల్లీ : బ్రిస్బేన్‌లోని గబ్బాలో టీమిండియా చారిత్రక విజయంపై అటు విశ్వవ్యాప్తంగా టీమిండియా క్రికెటర్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇటు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కూడా భారీ నజరానా ప్రకటించింది. గబ్బాలో ఆస్ట్రేలియా 32 సంవత్సరాల అజేయ చరిత్రకు చెక్ పెట్టిన టీమిండియా సంచలన విజయానికి భారీ గిఫ్ట్ ప్రకటించింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని చేజిక్కించుకున్న టీమిండియా ఆటగాళ్లకు రూ.5 కోట్ల టీమ్ బోనస్‌ను ప్రకటించింది బీసీసీఐ. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షా ట్వీట్ చేశారు. (టీమిండియా గెలుపు : దిగ్గజాల స్పందన) గబ్బాలో జరిగిన సిరీస్ ఆఖరి టెస్టులో అజింక్యా రహానె నేతృత్వంలోని భారత్ టీం 3 వికెట్ల తేడాతో నెగ్గిన టీమిండియా.. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకున్నసంగతి తెలిసిందే. భారత క్రికెట్ చరిత్రలో ఇదో అద్భుత విజయం అని, ఆస్ట్రేలియాకు గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవడం అపూర్వమని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ పేర్కొన్నారు. ఈ విజయాన్ని ఎన్నటికీ మరిచిపోలేమంటూ జట్టులోని ప్రతి ఆటగాడిని గంగూలీ ప్రశంసించారు. టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ బోనస్‌గా 5 కోట్లు ప్రకటించింది. భారత క్రికెట్‌కు ఇవి ప్రత్యేకమైన క్షణాలు. భారత జట్టుఅద్భుత నైపుణ్యాన్ని, ప్రతిభను ప్రదర్శించిందంటూ కార్యదర్శి జే షా తన ట్వీట్ చేశారు. -
#TeamIndia మోత మోగింది!
న్యూఢిల్లీ: బ్రిస్బేన్‌లో టీమిండియా సత్తా చాటింది. నిర్ణయాత్మక గబ్బా టెస్ట్ మ్యాచ్‌లో చిరస్మరణీయ విజయాన్ని సాధించి భారత్ జాతీయ పతకాన్ని సగర్వంగా రెపరెపలాడించింది. కుర్రాళ్ల పోరాట పటిమతో బోర్డర్–గావస్కర్ ట్రోఫీని వరుసగా రెండోసారి దక్కించుకుని ఆస్ట్రేలియాపై తమదే పైచేయి అని నిరూపించింది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియాపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో టీమిండియా హాష్టాగ్ ట్విటర్లో ట్రెండింగ్‌లో నిలిచింది. మ్యాచ్ ముగిసిన పది నిమిషాల్లోపు లక్షల్లో ట్వీట్లు, రీ ట్వీట్లతో ట్విటర్లో మోత మోగింది. (చదవండి: చెలరేగిన పంత్.. భారత్ సంచలన విజయం) టీమిండియా పేరుతో అభినందనలు, శుభాకాంక్షలు, ప్రశంసలు, ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. ఇక రెండో ఇన్నింగ్స్‌లో రాణించిన యువ ఆటగాళ్లు శుభమన్ గిల్, రిషబ్ పంత్‌లపై మాజీ ఆటగాళ్లు, క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మ్యాచ్ విజయంలో వీరిద్దరూ ముఖ్యపాత్ర పోషించారని తెగ మెచ్చుకుంటున్నారు. మ్యాచ్ గెలిచిన తర్వాత త్రివర్ణ పతాకంతో టీమిండియా ఆటగాళ్లు మైదానం అంతా కలియ తిరగడం భారత క్రికెట్ అభిమానులను ఎంతోనే ఆటగానో ఆకట్టుకుంది. ‘ప్రౌడ్ మూమెంట్’ అంటూ అభిమానులు గర్వంగా ఫీలవుతున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ట్విటర్లో ట్రెండ్ అవుతున్న హాష్‌ట్యాగ్స్ #INDvsAUS #TeamIndia #RishabhPant Test cricket at its best 🙌 . One of the best test series I was watched every session was so exciting . Big congratulations to each and everyone from @indiancricketteam . #test #indvsaus #winnerwinnerchickendinner #teamrajasthan pic.twitter.com/WHyFpFufaZ — Deepak chahar (@deepak_chahar9) January 19, 2021 -
తప్పు నాదే.. క్షమించండి : గిల్‌క్రిస్ట్
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అడమ్ గిల్‌క్రిస్ట్ పెద్ద పొరపాటు చేశాడు. ఇటీవలే టీమిండియా ఆటగాడు మహ్మద్ సిరాజ్ తండ్రి మహ్మద్ గౌస్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిరాజ్ తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో సిరాజ్‌కు భారత జట్టు ఆటగాళ్లతో పాటు ఆసీస్ క్రికెటర్లు కూడా సానుభూతి ప్రకటించారు. (చదవండి : రాహుల్‌కు క్షమాపణ చెప్పా: మ్యాక్స్‌వెల్) శుక్రవారం ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో గిల్‌క్రిస్ట్ కామెంటేటర్‌గా వ్యవహరించాడు. కామెంటరీ సమయంలో సిరాజ్ తండ్రి చనిపోయిన విషయం గురించి మాట్లాడిన గిల్‌క్రిస్ట్ పొరపాటున సిరాజ్ బదులు నవదీప్ సైనీ పేరును ప్రస్తావించాడు. 'తండ్రి చనిపోయిన వెంటనే బీసీసీఐ సైనీకి ఇంటికి వెళ్లేందుకు అవకాశమిచ్చింది. కానీ జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అతను వెళ్లలేదు' అని పేర్కొన్నాడు. అయితే గిల్‌క్రిస్ట్ చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. (చదవండి : హార్దిక్ బౌలింగ్ ఇప్పట్లో లేనట్లేనా?) గిల్లీ వ్యాఖ్యలను గుర్తించిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మెక్లీన్‌గన్‌తో పాటు కొంతమంది అభిమానులు ట్విటర్ ద్వారా అతని పొరపాటును ట్యాగ్ చేశారు. చనిపోయింది సిరాజ్ తండ్రి.. నవదీప్ సైనీ తండ్రి కాదంటూ తెలిపారు. విషయం గ్రహించిన గిల్లీ వెంటనే ట్విటర్లో స్పందించాడు.' నా పొరపాటును గ్రహించాను. సిరాజ్‌కు బదులు పొరపాటుగా సైనీ పేరు వాడాను. ఈ సందర్భంగా సిరాజ్, సైనీలకు ఇవే నా క్షమాపణలు. నేను పొరపాటుగా చేసిన వ్యాఖ్యలను గుర్తించిన మెక్లీన్‌గన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నా.. మరొకసారి మీ అందరిని క్షమాపణ కోరుతున్నా' అంటూ గిల్లీ ట్వీట్ చేశాడు. Yes, thanks @anshu2912 I realize I was mistaken in my mention. Huge apologies for my error, to both @navdeepsaini96 and Mohammed Siraj. 🙏😌 https://t.co/618EUIEyNU — Adam Gilchrist (@gilly381) November 27, 2020 Yep, thanks @Mitch_Savage My huge apologies again to all. https://t.co/F8rYsD6fxm — Adam Gilchrist (@gilly381) November 27, 2020 -
‘ఎంసీజీ’లో మ్యాచ్ కోసం ప్రయత్నాలు
మెల్బోర్న్ : కరోనా కారణంగా ఈ ఏడాది చివర్లో ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) నుంచి భారత్–ఆ్రస్టేలియా ‘బాక్సింగ్ డే’ టెస్టు తరలిపోనుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో స్థానిక ప్రభుత్వం జోక్యం చేసుకునేందుకు సిద్ధమైంది. పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించి డిసెంబర్ 26 నుంచి 30 వరకు ‘బాక్సింగ్ డే’ టెస్టును ఎంసీజీలోనే జరిగేలా చూడాలని భావిస్తున్నట్లు మెల్బోర్న్ నగరం ఉన్న విక్టోరియా రాష్ట్ర ప్రీమియర్ డేనియల్ ఆండ్రూస్ వెల్లడించారు. మరోవైపు వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోరీ్నకి కూడా ఇదే తరహా ఏర్పాట్లు చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. గత ఏడాది ‘బాక్సింగ్ డే’ టెస్టుకు 2 లక్షల మంది ప్రేక్షకులు హాజరు కాగా... ఆస్ట్రేలియన్ ఓపెన్ జరిగిన మెల్బోర్న్ పార్క్‌లో 8 లక్షల మంది మ్యాచ్‌లను వీక్షించారు. అయితే ప్రస్తుతం ఆ్రస్టేలియాలోని 70 శాతం కరోనా కేసులు విక్టోరియా రాష్ట్రంలోనే నమోదు కాగా... మరణాలు 90 శాతం ఇక్కడి నుంచే ఉన్నాయి. ‘గరిష్టంగా ఎంత మందిని టెస్టు మ్యాచ్‌లు అనుమతించాలనే విషయంలో చర్చిస్తున్నాం. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అందరి ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తూనే సాధ్యమైనంత ఎక్కువ మందిని లోపలికి పంపేందుకు ప్రయతి్నస్తాం. దీనికి సంబంధించి క్రికెట్ ఆ్రస్టేలియాతో మాట్లాడుతున్నాం. ఒక్క క్రీడా ఈవెంట్ కారణంగా ఇప్పటి వరకు మేం చేస్తున్న శ్రమ వృథా కాకూడదనే మా ప్రయత్నం. ఒక్కసారి ఇలాంటి చోట కోవిడ్–19 వ్యాప్తి మొదలైందంటే అది ఎక్కడి వరకు సాగుతుందో చెప్పలేం’ అని డేనియల్ ఆండ్రూస్ అభిప్రాయ పడ్డారు. మెల్బోర్న్లో ‘బాక్సింగ్ డే’ టెస్టు సాధ్యంకాకపోతే టెస్టు మ్యాచ్ వేదిక అడిలైడ్‌కు మారే అవకాశం ఉంది. -
రెండో వన్డేలో టీమిండియా ఘనవిజయం
-
రాజ్‌కోట్ వన్డేలో టీమిండియా ఘనవిజయం
రాజ్‌కోట్ : ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో 36 పరుగుల తేడాతో భారత్ ఘన విజయాన్ని నమోదు చేసింది. టీమిండియా విధించిన 341 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక ఆసీస్ చతికిలపడింది. ఆసీస్ బ్యాట్సమెన్లలో స్టీవ్ స్మిత్(102 బంతుల్లో 98 పరుగులు), లబుషేన్( 47 బంతుల్లో 46 పరుగులు)తో కొంత ప్రతిఘటించినా తర్వాత వచ్చిన బ్యాట్సమెన్ విఫలం కావడంతో 49.1 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. కాగా భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీలు తలా 2 వికెట్లు తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్‌లు అర్థశతకాలతో చెలరేగడంతో భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 1-1తో సమం చేసింది. దీంతో నిర్ణయాత్మకంగా మారిన చివరి వన్డే ఆదివారం బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. కుల్దీప్ @ సెంచరీ ఆసీస్‌కు భారీ టార్గెట్ -
'బుమ్రా బౌలింగ్‌లో ఆడడం చాలా కష్టం'
ముంబై : టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాది గొప్ప బౌలింగ్ నైపుణ్యమని, అతడు వేసే యార్కర్లు, బౌన్సర్లు తనను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. బుమ్రా బౌలింగ్‌లో ఆడటం ఎంతో కష్టమని పేర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం వార్నర్ మాట్లాడుతూ... 'బ్రెట్‌లీ లాంటి బౌలర్ కొంత తడబడుతూ 150 కి.మీ వేగంతో బంతులు వేయడాన్ని నేను ఊహించలేను. అందుకు అలవాటు పడాలంటే కాస్త సమయం అవసరం. బుమ్రాది గొప్ప బౌలింగ్ నైపుణ్యం. అతడి బౌన్సర్లు, యార్కర్లు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. బుమ్రా బౌలింగ్ చేసే సమయంలో అతను తన యాక్షన్‌లో చేసే మార్పు నాకు కష్టంగా అనిపిస్తుంది. శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ గంటకు 140 కి.మీ వేగంతో స్వింగ్ చేసినప్పుడు ఎదుర్కొనేందుకు కొంత ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు బుమ్రా విషయంలో కూడా అలాగే ఇబ్బందులకు గురవుతున్నా. అయితే క్రీజులో నిలదొక్కుకోవడంతోనే పరుగులు చేశా' అని తెలిపాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం ముంబైలోని వాంఖడే మైదానంలో టీమిండియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసీస్ భారత జట్టుపై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వార్నర్ (112 బంతుల్లో 128 నాటౌట్; 17 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ ఆరోన్ ఫించ్ (114 బంతుల్లో 110 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకాలతో చెలరేగడంతో ఆసీస్ వికెట్ కోల్పోకుండా సునాయాస విజయాన్ని అందుకుంది. కాగా ఇరు జట్ల మధ్య రెండో వన్డే శుక్రవారం రాజ్‌కోట్‌లో జరగనుంది. (వార్నర్ సరికొత్త రికార్డు) (బుమ్రాను హిట్ చేశా.. కానీ ఔట్ చేశాడు!) -
కోహ్లిపై అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ క్రికెటర్
ముంబై : మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఘోర పరాభవం మూట గట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రావడంపై మాజీ ఆటగాళ్లు పెదవి విరుస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ విధ్వంసకర ఆటగాడు మాథ్యూ హేడెన్ కోహ్లిపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రసుత్తం హెడెన్ కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. 'విరాట్ కోహ్లి ఇప్పటివరకు 243 మ్యాచ్‌లు ఆడగా అందులో 180 ఇన్నింగ్స్‌ల్లో మూడో స్థానంలో ఆడి 63.09 స్ర్టైక్ రేట్‌తో 10వేల పరుగులకు పైగా సాధించాడు. అతనికి అచ్చి వచ్చిన స్థానం నుంచి కోహ్లి ఎందుకు తప్పుకోవాలి. అందరూ భారత ఓటమి గురించే మాట్లాడుతున్నారు గానీ ఎవరు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో కేఎల్ రాహుల్ కోసం కోహ్లి తన స్థానాన్ని వదులుకోవడం నాకు నచ్చలేదు. కోహ్లి మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సిందే' అంటూ హేడెన్ పేర్కొన్నాడు. శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో రోహిత్‌కు విశ్రాంతి కల్పించడంతో ధావన్,రాహుల్‌లు ఓపెనింగ్‌లో రాగా కోహ్లి మూడో స్థానంలో వచ్చాడు. అయితే లంకతో జరిగిన సిరీస్‌లో రాహుల్‌తో పాటు జట్టులో పునరాగమనం చేసిన ధావన్ కూడా బాగా ఆకట్టుకున్నాడు. దీంతో ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో రాహుల్, ధావన్‌లలో ఎవరికి చోటు కల్పించాలనేదానిపై సెలక్టర్లకు తలనొప్పిగా మారింది. ఇక చేసేదేంలేక కోహ్లి తన మూడో స్థానాన్ని రాహుల్‌కు ఇచ్చేసి నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే కోహ్లి ఇప్పటివరకు 38 ఇన్నింగ్స్‌ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 1751 పరుగులు చేశాడు. దీంట్లో 7 శతకాలు, 8అర్థశతకాలు ఉన్నాయి. 2015 నుంచి 6సార్లు నాలుగోస్థానంలో బరిలోకి దిగిన కోహ్లి అంతగా ఆకట్టుకోలేదు. ఈ ఆరు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 9,4, 3, 11, 12, 7, 16 పరుగులు చేశాడు. -
'భారత్‌తో పోరు ఎప్పటికి రసవత్తరమే'
సిడ్నీ : 2020 ఏడాది చివర్లో టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ' భారత్, ఆస్ట్రేలియాలు ఆడే ఏ సిరీస్ అయిన ఆసక్తికరంగానే ఉంటుంది. ఇది ఒక సంప్రదాయంలా మారింది. ఇంకా 12 నెలలు టైం ఉన్నా ఇప్పుడే నాకు సిరీస్‌పై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం భారత జట్టు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందనడంలో సందేహం లేదు. నేను ఆస్ట్రేలియాతో జరగనున్న గులాబి టెస్టుకోసం ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే మా దేశంలో ఏ జట్టుకైనా డే- నైట్ టెస్టు ఆడడమంటే సవాల్ కిందే లెక్క. అయితే ప్రస్తుతం ఇరు జట్ల ఆటగాళ్లను పరిశీలిస్తే మంచి రసవత్తర పోరు ఉంటుందనడంలో సందేహం లేదు. అందుకే భారత్‌తో సిరీస్ చిరకాలం గుర్తుండిపోనుంది. రెండు జట్లు ప్రస్తుతం కఠినమైన క్రికెట్ ఆడుతున్నాయి. స్మిత్, వార్నర్ బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత మా జట్టు వేగంగా ఫుంజుకుంది. అది ఎంతలా అంటే లబుషేన్ లాంటి నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు జట్టుకు దొరికారు. ఆస్ట్రేలియా జట్టు 2019లో భారత్‌ను వారి సొంతగడ్డపైనే వన్డే, టీ20 సిరీస్‌లలో ఓడించి మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంది. ఐసీసీ టోర్నీలను కైవసం చేసుకోవడం అంత సులభం కాదు. భారత్‌కు వాటిని సాధించే స్వామర్థ్యం ఉంది. ఎలాంటి టోర్నీలైనా భారత్‌తో మా పోటీ ఎప్పుడు రసవత్తరంగానే ఉంటుంది. టెస్టు చాంపియన్‌షిప్ టోర్నీ నుంచి నాలుగురోజుల టెస్టు మ్యాచ్‌లను ప్రవేశపెట్టనున్న ఐసీసీతో నేను విబేదిస్తున్నా. ఎందుకంటే నా దృష్టిలో ఐదు రోజుల మ్యాచ్‌లే గొప్పవిగా కనిపిస్తాయి. మనం ఐదు రోజుల టెస్టుల్లోనే ఎన్నో ఉత్కంఠబరితమైన మ్యాచుల్ని చూశాం. ఐసీసీ దానిని అలాగే వదిలేస్తే బాగుంటుదనేది నా అభిప్రాయం. కానీ ఇప్పుడు ఐసీసీ దానిని ఎందుకు మార్చాలనుకుంటుందో అర్థం కావడం లేదని' స్టీవ్ వా పేర్కొన్నాడు. -
'ఆ మ్యాచ్‌తోనే హర్భజన్‌కు ఫిదా అయ్యా'
భారత టెస్టు క్రికెట్లో 2001 సంవత్సరం మరిచిపోలేనిది. ఎందుకంటే ఆ సంవత్సరమే భారత టెస్టు క్రికెట్లో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. అప్పటికే 16 వరుస విజయాలతో క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఆస్ట్రేలియా జట్టును ఈడెన్‌గార్డెన్స్‌లో భారత్ ఓడించిన తీరు క్రికెట్ ప్రేమికులకు ఎప్పుడు గుర్తుండిపోతుంది. అయితే తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరోసారి ఆ మ్యాచ్ గురించి ప్రస్తావించాడు. ఆ మ్యాచ్‌లో వివిఎస్ లక్ష్మణ్ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌తో పాటు ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బౌలింగ్‌ను అందరూ గుర్తు పెట్టుకునే ఉంటారు. కాగా, ఆ మ్యాచ్‌లో మేము గెలవడానికి బ్యాట్సమెన్ సహకారం ఎంత ఉందో బౌలర్ల కృషి కూడా అంతే ఉందని గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఆ మ్యాచ్‌కు సంబంధించి సౌరవ్ గంగూలీ కొన్ని విషయాలు ప్రస్తావిస్తూ..' ఈడెన్ టెస్టు మ్యాచ్‌లో నా సూచనలతో బౌలింగ్‌కు దిగి హర్భజన్ హ్యాట్రిక్‌తో మెరవడం, అదే మ్యాచ్‌లో మొత్తం 13 వికెట్లు పడగొట్టడం చకచకా జరిగిపోయాయి. ఆ మ్యాచ్ తర్వాత హర్భజన్ ప్రదర్శనను చూసి నేను అతని ఆటకు ఫిదా అయిపోయా. ఎందుకంటే అప్పటకే ఆస్ట్రేలియా 15 వరుస విజయాలు సాధించి అప్రతిహాతంగా దూసుకుపోతుంది. స్టీవా నేతృత్వంలో మా గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియా మొదటి టెస్టును గెలిచి 16వ విజయం తమ ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో ఈడెన్‌లో జరిగిన రెండో టెస్టులో చారిత్రాత్మక విజయంతో పాటు ఆ తర్వాత సిరీస్‌ను గెలుచుకోవడం జరిగింది. ఇక అక్కడి నుంచి హర్భజన్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అంతర్జాతీయ క్రికెట్లో 700 పైగా వికెట్లు సాధించి ఈ దశాబ్దపు అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. సమకాలీన భారత క్రికెట్లో అనిల్ కుంబ్లే, హర్భజన్లు మా జట్టులో ఉండడం మేం చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. ఈ ఇద్దరు కలిసి ఎన్నో టెస్టు మ్యాచ్‌లో భారత జట్టుకు అపూర్వమైన విజయాలు అందించారని' దాదా చెప్పుకొచ్చాడు.అయితే 2001లో కీలకమైన ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌కు దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లేతో పాటు ఫాస్ట్ బౌలర్ జగవల్ శ్రీనాథ్‌లు గాయంతో దూరమయ్యారని గంగూలీ పేర్కొన్నాడు. 'ఇదే సిరీస్‌లో నా కెప్టెన్సీలో హర్భజన్‌కు జోడిగా మూడు టెస్టుల్లో ముగ్గురు వేర్వేరు స్పిన్నర్లతో బరిలోకి దిగాము. మొదటి మ్యాచ్‌లో రాహుల్ సింగ్వీ, రెండో మ్యాచ్‌లో వెంకటపతి రాజు, మూడో మ్యాచ్‌లో నీలేశ్ కులకర్ణిలను ఆడించామని' గంగూలీ గుర్తు చేశాడు. అయితే కుంబ్లే లేని లోటును తెలియకుండా హర్భజన్ ఆ సిరీస్‌లో ఒక చాంపియన్లాగా బౌలింగ్ చేశాడని దాదా ప్రశంసించాడు. ఈడెన్ గార్డెన్లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 441 పరుగులు చేయగా, భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకు ఆలౌటైంది. అనంతరం పాలోఆన్ ఆడిన భారత జట్టు వివిఎస్ లక్ష్మణ్ చారిత్రాత్మక ఇన్నింగ్స్(281 పరుగులు), రాహుల్ ద్రావిడ్ అజేయ శతకంతో తమ రెండో ఇన్నింగ్స్‌లో 657 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను 212 పరుగులకు ఆలౌట్ చేసి 171 పరుగులతో మ్యాచ్‌ను గెలుచుకొని ఆపై సిరీస్‌ను సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లోనే మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ హ్యాట్రిక్‌తో మెరవడం, రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 13 వికెట్లు తీసుకున్నాడు. మొత్తం ఆ సిరీస్‌లో హర్భజన్ మూడు టెస్టుల్లో కలిపి 32 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. -
నగరంలో ధోని
విశాఖ స్పోర్ట్స్: వన్డేలలో భారత్‌కు ఎంతో అచ్చి వచ్చిన స్టేడియం అది. మొదలైన తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ మీద చిరస్మరణీయ విజయాన్ని అందించిన మైదానమది. తర్వాత మెన్ ఇన్ బ్లూకు విజయ పరంపరను అందించిన క్రీడాంగణమది. అలాటి స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్‌లో కూడా భారత్‌కు వేరే ఫలితం ఎలా వస్తుంది? అందుకే ఇక్కడ ‘జరిగిన’ తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ దుమ్ము రేపింది. టీ20 సిరీస్‌లో గెలవాలన్న ఆరాటంతో భారత్ వచ్చిన శ్రీలంక జట్టు విశాఖలో జరిగిన మ్యాచ్ కారణంగానే సిరీస్ చేజార్చుకుంది. అలా అతిథి జట్టుకు మరోసారి చేదు జ్ఞాపకాల్ని మిగిల్చింది వైఎస్సార్ స్టేడియం. మూడేళ్ల క్రితం భారత పర్యటనలో శ్రీలంక జట్టు సిరీస్‌లో చివరిదైన మూడో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ను విశాఖలో ఆడింది. చెరో మ్యాచ్ గెలిచి రెండు జట్లూ సమ ఉజ్జీగా నిలవగా, విశాఖలో జరగిన ఆఖరి మ్యాచ్‌లో విజయభేరి మోగించి, భారత్ సిరీస్‌ను గెలుచుకుంది. దాదాపు మూడేళ్ల క్రితం (2016 ఫిబ్రవరి 14)డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో విశాఖ క్రీడాభిమానులకు చిరస్మరణీయ జ్ఞాపకాన్ని పంచి ఇస్తూ, భారత జట్టు పూర్తి ఆధిక్యాన్ని కనబరిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ కేవలం ఒకే వికెట్ కోల్పోయి విజయలక్ష్యాన్నందుకుంది. ఆడుకున్న బౌలర్లు ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోనీ టాస్ గెలిచి ఫీల్డింగ్‌ను ఎంచుకున్నాడు. భారత బౌలర్లు ఏమాత్రం సత్తా లేని శ్రీలంక బ్యాటింగ్ లైనప్‌తో ఆడుకున్నారు. గురితప్పని బౌలింగ్‌తో ఆ జట్టును చిందరవందర చేశారు. శ్రీలంక 18 ఓవర్లు ఆడి 82 పరుగులకు ఆలౌట్ కాగా భారత్ ఆడుతూ పాడుతూ పధ్నాలుగో ఓవర్లోనే విజయభేరి మోగించింది. శ్రీలంక 12 పరుగులకే తొలి మూడు వికెట్లు కోల్పోగా 21 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను చేజార్చుకుంది ఎండి శనక అత్యధికంగా 19 పరుగులు చేయగా, ఎన్‌ఎల్‌టీసీ పెరీరా12 పరుగులు సాధించాడు. శ్రీలంక జట్టులో వీరిద్దరే రెండంకెల స్కోర్ చేయగలిగారు. అశ్విన్ ఎనిమిది పరుగులిచ్చి నలుగుర్ని పెవిలియన్ దారిపట్టించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. రైనా ఆరు పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. జడేజా, బుమ్రా, నెహ్రా ఒకో వికెట్ తీసి శ్రీలంకను మూడంకెల స్కోర్ చేయకుండా నిలువరించారు. ఇక భారత్ తరపున ధావన్ (46), రహానే (22) జోడీ జట్టుకు విజయాన్నందించారు. రోహిత్ 13 పరుగుల వద్ద చమీరాకు లెగ్‌బిఫోర్‌గా దొరికిపోయాడు. సిరీస్ తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన భారత్ చివరి రెండు టీ20 మ్యాచ్‌ల్లోనూ విజయ భేరి మోగించగా... విశాఖ క్రీడాభిమానులకు ఆఖరి టీ20 ఓ తీపి జ్ఞాపకంగా మిగిలిపోయంది. తొలి టీ20 వర్షార్పణం 2012 సంవత్సరం. సెప్టెంబర్. జోరందుకుంటున్న పొట్టి ఫార్మాట్ క్రికెట్లో వైఎస్ఆర్ స్టేడియంలో తొలి మ్యాచ్ సెప్టెంబర్ 8న నిర్వహించడానికి సన్నాహాలు జరిగాయి. న్యూజిలాండ్, భారత్ జట్లు రెండూ మ్యాచ్ ఆడేందుకు స్టేడియంకు వచ్చాయి. అప్పటికే మేఘావృతమైన ఆకాశం ఆరోజు కుండపోతగా వర్షాన్ని కురిపించింది. దాందో ఒక బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దు కావడంతో విశాఖ క్రీడాభిమానులు తొలి టీ20 మ్యాచ్‌ను చూడలేకపోయారు. మరో నాలుగేళ్లకు గానీ ఈ స్టేడియంలో టీ20 మ్యాచ్ జరగలేదు. అప్పుడే క్యాన్సర్ నుంచి తేరుకున్న యవరాజ్ సింగ్ ఈమ్యాచ్ ఆడేందుకు విశాఖ వచ్చాడు. వర్షం కారణంగా రద్దయిపోయిన ఈ మ్యాచ్‌లో కాస్త తెరిపిచ్చిన సమయంలో యువీ స్టేడియం నలుదిశలా కలయతిరిగి అభిమానుల్లో ఉత్సాహం నింపాడు. యువరాజ్ సింగ్‌కు విశాఖవాసులు నీరాజనాలు పట్టారు. ఈమ్యాచ్‌లో ఆడేందుకు కోహ్లి అప్పట్లో జట్టు సభ్యుడి వచ్చాడు. అయితే విశాఖ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆడేందుకు అతడు రాలేదు. ఈసారి కోహ్లి నాయకత్వంలోనే వస్తున్న జట్టు విశాఖ వాసులకు మరో ఉత్కంఠభరిత మ్యాచ్‌ను ఈనెల 24న వీక్షించే అవకాశం కల్పించనుంది. వెల్కమ్ మహీ! గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, సీనియర్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ విశాఖ వచ్చేశాడు. ఆదివారం జరగనున్న టీ20 మ్యాచ్ కోసం ధోనీ అందరు ఆటగాళ్ల కన్నా ముందుగా విశాఖ గడ్డ మీద గురువారమే కాలుమోపాడు. విశాఖ విమానాశ్రయంలో గురువారం ధోనీకి ఘనస్వాగతం లభించింది. రాయపూర్ నుంచి విమానంలో వచ్చిన ఆయనను ఇక్కడ అధిక సంఖ్యలో అభిమానులు కలిసి కరచాలనాలు చేశారు. ధోనీ...ధోనీ...అంటూ నినాదాలు చేశారు. కేరింతలు కొట్టారు. ♦ మూడేళ్ల క్రితం విశాఖలో ♦ ‘తొలి’ టీ20 శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయభేరి ♦ ఈ గెలుపుతోభారత్ సిరీస్ కైవసం ♦ 2012లో జరగాల్సిన మొదటి మ్యాచ్ వర్షార్పణం ♦ భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ రద్దు -
ఇండోర్ వన్డేలో భారత్ ఘనవిజయం
-
‘మ్యాక్స్’ ముంచేశాడు
0-3తో సిరీస్ కోల్పోయిన భారత్ ► మూడో వన్డేలో 3 వికెట్లతో ఆసీస్ విజయం ► చెలరేగిన మ్యాక్స్‌వెల్ ► కోహ్లి సెంచరీ వృథా ► నాలుగో వన్డే బుధవారం మూడొందలకు పైగా పరుగులు చేసిన చోట కూడా ఓటమిని మూటగట్టుకున్న టీమిండియా అంతకంటే తక్కువ స్కోరుకే విజయంపై ఆశలు పెంచుకుంది. ఛేదనలో 30 ఓవర్లలోపే ప్రత్యర్థి జట్టులోని నలుగురు ప్రధాన బ్యాట్స్‌మెన్ వికెట్లు తీసి పట్టు బిగించింది. కానీ మనోళ్లు స్మిత్, బెయిలీ అంటూ వ్యూహాలు పన్నిన చోట ఈసారి మ్యాక్స్‌వెల్ అడ్డుపడ్డాడు. కీలక దశలో కొరకరాని కొయ్యగా మారి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. ఇప్పుడు నా వంతు అన్నట్లుగా కోహ్లి తన శతకంతో భారత్‌ను నడిపిస్తే... మ్యాక్స్‌వెల్ మెరుపుల ముందు దాని విలువ తగ్గిపోయింది. సెంచరీలు భారత్వయితే, విజయాలు ఆసీస్‌కు అన్నట్లుగా పరిస్థితి కనిపించింది. బ్యాట్స్‌మెన్ నమ్మకం నిలబెట్టిన చోట బౌలర్లు మళ్లీ నిరాశపర్చడంతో వరుసగా మూడు పరాజయాలతో ధోని సేన సిరీస్ కోల్పోయింది. ఇక మిగిలింది పరువు కోసం పోరాటమే. మెల్బోర్న్: వేదిక మారినా, స్కోరు మారినా, మళ్లీ మన బ్యాట్స్‌మన్ సెంచరీ బాదినా... మ్యాచ్ ఫలితంలో మాత్రం మార్పు రాలేదు. మళ్లీ మూడొందలకు చేరువలో స్కోరు చేసినా ధోని సేన దానిని కాపాడుకోవడంలో విఫలమైంది. ఆదివారం ఇక్కడ జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (117 బంతుల్లో 117; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ సాధించాడు. శిఖర్ ధావన్ (91 బంతుల్లో 68; 9 ఫోర్లు), రహానే (55 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. హేస్టింగ్స్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం ఆస్ట్రేలియా 48.5 ఓవర్లలో 7 వికెట్లకు 296 పరుగులు చేసింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (83 బంతుల్లో 96; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడైన ఇన్నింగ్స్‌కు తోడు షాన్ మార్ష్ (73 బంతుల్లో 62; 6 ఫోర్లు) కీలక పాత్ర పోషించాడు. భారత్ రెండు సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పినా... మ్యాక్స్‌వెల్, ఫాల్క్‌నర్ మధ్య నెల కొన్న 81 పరుగుల భాగస్వామ్యం టీమిండియాకు విజయాన్ని దూరం చేసింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌ను ఆసీస్ 3-0తో సొంతం చేసుకుంది. ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే బుధవారం కాన్బెర్రాలో జరుగుతుంది. విరాట్ కీలక ఇన్నింగ్స్... టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఈసారి కూడా ఛేదనపైనే ఆసక్తి చూపిం చి భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. టీమిండియా ఆశ్చర్యకరమైన రెండు మార్పులు చేసింది. ఇద్దరు కొత్త ఆటగాళ్లు గుర్కీరత్ సింగ్, రిషి ధావన్‌లకు తొలి మ్యాచ్ ఆడే అవకాశం ఇవ్వడంతో జట్టు ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగినట్లయింది. వరుసగా రెండు సెంచరీలతో ఊపు మీదున్న రోహిత్ (6) ఈ మ్యాచ్‌లో త్వరగానే వెనుదిరగడంతో భారం కోహ్లి, శిఖర్లపై పడింది. ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న ధావన్ నిలదొక్కుకోవడానికి సమయం తీసుకున్నాడు. కోహ్లి కూడా దూకుడుకు పోకుండా జాగ్రత్తగా ఆడాడు. ఈ క్రమంలో వరుస బంతుల్లో ఇద్దరి అర్ధ సెంచరీలు పూర్తయ్యాయి. చివరకు హేస్టింగ్స్ బౌలింగ్‌లో శిఖర్ బౌల్డ్ కావడంతో 119 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. మరోవైపు కొన్ని చక్కటి షాట్లు ఆడిన కోహ్లి 105 బంతుల్లో శతకం మార్క్‌ను చేరుకున్నాడు. హాఫ్ సెంచరీ పూర్తి కాగానే బౌండరీ వద్ద స్మిత్-మ్యాక్స్‌వెల్ కాంబినేషన్లో అద్భుత క్యాచ్‌కు రహానే అవుటయ్యాడు. కోహ్లి, రహానే మూడో వికెట్‌కు 109 పరుగులు జత చేశారు. ధోని (9 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాధన్ బ్యాటింగ్ చేసినా... భారత్ స్కోరు 300 లోపే ఆగిపోయింది. చెలరేగిన మ్యాక్స్‌వెల్... ఓపెనర్లు షాన్ మార్ష్, ఫించ్ (21) 43 బంతుల్లోనే చకచకా 48 పరుగులు జత చేయడంతో ఆసీస్‌కు మంచి ఆరంభం లభించింది. 20 పరుగుల వద్ద ఫించ్ క్యాచ్‌ను గుర్కీరత్ వదిలేసినా అతను వెంటనే అవుట్ కావడంతో దాని ప్రభావం పడలేదు. అనంతరం స్మిత్ (45 బంతుల్లో 41; 5 ఫోర్లు), బెయిలీ (21 బంతుల్లో 23; 3 ఫోర్లు) తమదైన శైలిలో ఆడుతూ ఎక్కడా రన్‌రేట్‌ను తగ్గనీయలేదు. అయితే జడేజా తక్కువ వ్యవధిలో వీరిద్దరిని అవుట్ చేసి ఆశలు రేపాడు. షాన్ మార్ష్‌ను ఇషాంత్ అవుట్ చేయడంతో ఆసీస్‌పై ఒత్తిడి పెరిగింది. మరోవైపు నుంచి శరణ్ ఓవర్లో రెండు ఫోర్లు బాది మ్యాక్స్‌వెల్ తన దూకుడు మొదలు పెట్టాడు. ఉమేశ్ చక్కటి ఫీల్డింగ్‌కు మిషెల్ మార్ష్ (17) రనౌట్ కాగా, వేడ్ (6) కూడా వెంటనే అవుటయ్యాడు. ఈ దశలో ఆస్ట్రేలియా విజయానికి మరో 81 పరుగులు చేయాల్సి ఉండగా భారత బౌలర్లు ఒత్తిడిని కొనసాగించడంలో విఫలమయ్యారు. దాంతో స్వేచ్ఛగా, సమయస్ఫూర్తితో ఆడిన మ్యాక్స్‌వెల్ దూసుకుపోయాడు. ఉమేశ్ వేసిన 43వ ఓవర్లో అతను 15 పరుగులు రాబట్టాడు. ఉమేశ్ బౌలింగ్‌లోనే వరుస బంతుల్లో సిక్స్, ఫోర్ కొట్టి స్కోరు సమం చేసిన మ్యాక్స్‌వెల్ సెంచరీ కోసం భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ కాగా.... ఫాల్క్‌నర్ సింగిల్‌తో మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) వేడ్ (బి) రిచర్డ్సన్ 6; శిఖర్ ధావన్ (బి) హేస్టింగ్స్ 68; కోహ్లి (సి) బెయిలీ (బి) హేస్టింగ్స్ 117; రహానే (సి) మ్యాక్స్‌వెల్ (బి) హేస్టింగ్స్ 50; ధోని (సి) మ్యాక్స్‌వెల్ (బి) హేస్టింగ్స్ 23; గుర్కీరత్ (బి) ఫాల్క్‌నర్ 8; జడేజా (నాటౌట్) 6; రిషి ధావన్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 295. వికెట్ల పతనం: 1-15; 2-134; 3-243; 4-265; 5-274; 6-288. బౌలింగ్: రిచర్డ్సన్ 10-0-48-1; హేస్టింగ్స్ 10-0-58-4; ఫాల్క్‌నర్ 10-0-63-1; బోలండ్ 9-0-63-0; మ్యాక్స్‌వెల్ 9-0-46-0; మిషెల్ మార్ష్ 2-0-12-0. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: షాన్ మార్ష్ (సి) ధోని (బి) ఇషాంత్ 62; ఫించ్ (సి) ధోని (బి) ఉమేశ్ 21; స్మిత్ (సి) రహానే (బి) జడేజా 41; బెయిలీ (స్టంప్డ్) ధోని (బి) జడేజా 23; మ్యాక్స్‌వెల్ (సి) శిఖర్ ధావన్ (బి) ఉమేశ్ 96; మిషెల్ మార్ష్ (రనౌట్) 17; వేడ్ (సి) శిఖర్‌ధావన్ (బి) ఇశాంత్ 6 ; ఫాల్క్‌నర్ (నాటౌట్) 21; హేస్టింగ్స్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (48.5 ఓవర్లలో 7 వికెట్లకు) 296. వికెట్ల పతనం: 1-48; 2-112; 3-150; 4-167; 5-204; 6-215; 7-295. బౌలింగ్: ఉమేశ్ 9.5-0-68-2; శరణ్ 8-0-63-0; ఇషాంత్ 10-0-53-2; రిషి ధావన్ 6-0-33-0; గుర్కీరత్ 5-0-27-0; జడేజా 10-0-49-2. ♦ కోహ్లి వన్డేల్లో 7 వేల రన్స్ పూర్తి చేసుకున్నాడు. ఈ మైలురాయి దాటిన 8వ భారత బ్యాట్స్‌మన్ కోహ్లి. తక్కువ ఇన్నింగ్స్‌లలో (161) ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా అతను డివిలియర్స్ (166) రికార్డును సవరించాడు. ♦ సొంతగడ్డపై ఆస్ట్రేలియాకు ఇది వరుసగా 17వ విజయం. దీంతో వెస్టిండీస్ (16 మ్యాచ్‌లు) రికార్డు కనుమరుగైంది. భారత జట్టుకు 300 అంతర్జాతీయ మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించిన ఘనతను ధోని సొంతం చేసుకున్నాడు. ♦ కోహ్లి కెరీర్లో ఇది 24వ సెంచరీ. ఈ క్రమంలో సచిన్ (219 ఇన్నింగ్స్‌లు) కంటే చాలా వేగంగా ఇన్ని సెంచరీలు చేసిన రికార్డు విరాట్ (161 ఇన్నింగ్స్‌లు)కు దక్కింది.