వరల్డ్‌కప్‌ ఫీవర్‌.. పెళ్లికి వచ్చిన అతిథుల కోసం ఎల్‌ఈడీ స్క్రీన్‌.. | Karimnagar: LED Screen Arrenged At Wedding Hall For World Cup Final | Sakshi

వరల్డ్‌కప్‌ ఫీవర్‌.. పెళ్లికి వచ్చిన అతిథుల కోసం ఎల్‌ఈడీ స్క్రీన్‌..

Nov 19 2023 3:32 PM | Updated on Nov 19 2023 3:54 PM

Karimnagar: LED Screen Arrenged At Wedding Hall For World Cup Final - Sakshi

సాక్షి, కరీంనగర్‌: క్రికెట్‌పై భారతదేశ ప్రజలకు ఉన్న క్రేజ్‌ మాటల్లో చెప్పలేనిది. ప్రస్తుతం దేశమంతా క్రికెట్ ఫీవర్ నడుస్తోంది. ఐసీసీ వరల్డ్ కప్‌లో భాగంగా నేడు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న వేళ.. క్రికెట్ అభిమానులంతా టీవీల ముందు సెటిలైపోయారు. అందులోనూ ఈరోజు ఆదివారం సెలవు దినం కావటంతో.. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ గెలవాలని ఆకాంక్షిస్తూ భారతీయులంతా ప్రార్థిస్తున్నారు.

వరల్డ్‌కప్‌ ఫీవర్‌ ఇతర కార్యక్రమాలకు అంటుకుంది. ఈ సందర్భంగా కరీంనగర్‌లో ఓ ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. నగరంలోని ఓ ఫంక్షన్ హల్‌లో ఆదివారం పెళ్లి జగుతుండగా.. ఎల్‌ఈడీ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. వివాహానికి వచ్చిన అతిథుల కొసం పెళ్లి వారు క్రికెట్ లైవ్ ప్రసారం చేశారు. దీంతో  పెళ్లి పనుల హడావిడీలోనూ అందరూ తమకెంతో ఇష్టమైన క్రికెట్ మ్యాచ్‌ను కూడా వీక్షించారు. 

ఇక అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియం వేదికగా వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్లో భార‌త్, ఆస్ట్రేలియా త‌ల‌ప‌డుతున్నాయి. టోర్నీలో అత్యుత్త‌మ జ‌ట్ల‌లో విజేత‌గా నిలిచేది ఎవ‌రో మ‌రికొన్ని గంట‌ల్లో తేలిపోనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement