ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న గవాస్కర్-బోర్డర్ ట్రోఫీ ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్‌లో గురువారం నుంచి జరగనున్న బాక్సింగ్ డే టెస్ట్(Boxing Day Test) కోసం రెండు దిగ్గజ జట్లు సంసిద్ధంగా ఉన్నాయి. ఈ సిరీస్ లో మూడు టెస్ట్ ల అనంతరం రెండు జట్లు చెరో టెస్ట్ మ్యాచ్ గెలిచి 1-1తో సమఉజ్జీలుగా ఉండగా, ఈ సిరీస్ ఫలితం పై రెండు జట్ల వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ భవితవ్యం కూడా ఆధారపడి ఉండటం ఈ సిరీస్ మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
ఆస్ట్రేలియా ఆశలన్నీ ఈ సిరీస్ పైనే
రెండేళ్లకి ఒకమారు తొమ్మిది టెస్ట్ లు ఆడే దేశాల మధ్య జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(World Test Championship:) ఫైనల్ ఈ కాలంలో వివిధ జట్లు కనబరిచిన ప్రతిభ ఆధారంగా రెండు ఫైనల్ కి అర్హత సాధించే జట్లను నిర్ణయిస్తారు. ప్రస్తుత 2023-25 సీజన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పట్టిక లో దక్షిణాఫ్రికా ప్రధమ స్థానంలో ఉంది.
శ్రీలంక తో సొంత గడ్డపై జరిగిన రెండు టెస్టుల సిరీస్ లో 2-౦ తేడాతో విజయం సాధించిన దక్షిణాఫ్రికా, పాయింట్ల పట్టిక లో 63.33 సగటు తో ప్రధమ స్థానానికి దూసుకుపోయింది. ఆస్ట్రేలియా ప్రస్తుతం 58.89 సగటు తో రెండో స్థానం లో ఉంది.
అయితే ఆస్ట్రేలియా ప్రస్తుతం భారత్ తో జరుగుతున్న గవాస్కర్-బోర్డర్ ట్రోఫీ లోని మిగిలిన రెండు టెస్ట్ మ్యాచ్ ల తోపాటు శ్రీ లంక తో ఆ దేశంలో జరిగే మరో రెండు టెస్ట్ మ్యాచ్ ల్లో ఆడాల్సి ఉంది. అయితే ఆస్ట్రేలియా కి శ్రీ లంక ని స్పిన్ కి అనుకూలంగా ఉండే అక్కడ పిచ్ ల పై శ్రీ లంక ని ఓడించడం అంత సులువైన పని కాదు. అందుకే ఆస్ట్రేలియా కూడా ఈ రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించి తన అవకాశాలని సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది. అందుకే ప్రస్తుత సిరీస్‌పైనే ఆస్ట్రేలియా ఆశలు పెట్టుకుంది.
టీమిండియాకు ఆఖరి అవకాశం
ఈ సిరీస్ ఆరంభానికి ముందు న్యూజిలాండ్ తో సొంత గడ్డపై జరిగిన రెండు మ్యాచ్ ల సిరీస్ లో 0-2 తో ఘోర పరాభవం పొందిన భారత్(Team India) తొలిసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ స్థానాన్ని జారవిడుచుకునే ప్రమాదంలో పడింది. వరుసగా రెండు సార్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్
ఫైనల్ కి అర్హత సాధించి, రెండింటిలో పరాభవాన్ని మూటగట్టుకున్న భారత్ కి ఈ రెండు టెస్టులలో విజయం సాధిస్తేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి అర్హత సాధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టిక లో భారత్ 55.88 సగటుతో మూడో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ సిరీస్ కి ముందు పాయింట్ల పట్టిక లో ప్రథమ స్థానంలో ఉన్న భారత్ కి ఇది ఎదురుదెబ్బే .
రెండు సార్లు పరాభవం
ఇంతకుముందు 2019-21 లో కరోనా అనంతరం ఇంగ్లాండ్ లోని సౌతాంఫ్టన్ లోని రైస్ బౌల్ స్టేడియంలో జరిగిన ప్రథమ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో భారత్ న్యూజిలాండ్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. తర్వాత 2021- 23 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి ఇంగ్లాండ్ లోన్ ఓవల్ స్టేడియం ఆతిధ్యాన్నిచ్చింది. ఈ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడిన భారత్ 209 పరుగుల తేడాతో వరుసగా రెండోసారి పరాజయంచవిచూసింది .
ఈ నేపథ్యంలో ఈ సారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి అర్హత సాధించాలని భారత్ చాలా గట్టి పట్టుదలతో ఉంది. ఇందుకు ఈ రెండు టెస్ట్ ల లో విజయం సాధించడం ఒక్కటే భారత్ ముందున్న అవకాశం. లేని పక్షంలో వరుసగా రెండు టెస్ట్ ఛాంపియన్షియప్ ఫైనల్స్ లో పాల్గొన్న వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుత భారత జట్టు సారధి రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీలు కూడా అదే బాటలో పయనించి భారత్ టెస్ట్ జట్టు నుంచి తప్పుకున్నా ఆశ్చర్యం లేదు.
Comments
Please login to add a commentAdd a comment