melborne
-
13 ఏళ్లకే రెండు శతకాలు రాసిన సంకీర్త్
తెలుగు పదాలను, పద్యాలను సరిగా పలకలేని విద్యార్ధులు ఉన్న ఈ తరంలో 13 ఏళ్ల వయసులోనే జనార్ద, శ్రీనరసింహ శతకాలను రాసి చరిత్ర సృష్టించాడు తెలుగు విద్యార్థి సంకీర్త్ వింజమూరి.. హైదరాబాద్ అమీర్పేటలలోని సిస్టర్ నివేదిత స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న సంకీర్త్‌కు చిన్ననాటి నుంచే తెలుగుపై మక్కువ ఎక్కువ. ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నా కూడా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సంకీర్త్ తెలుగులో పద్యాలు నేర్చుకున్నాడు. అవధానార్చన భారతి బిరుదాంకితులు తటవర్తి శ్రీ కళ్యాణ్ చక్రవర్తి వద్ద పద్య విద్యలో శిక్షణ పొందిన సంకీర్త్ 13 ఏళ్ల వయస్సులోనే జనార్థన శతకాన్ని రచించి అందరిని ఆశ్చర్యపరిచాడు. జనార్దన శతకంలోని ప్రతి పద్యంలో ఎంతో అనుభవం ఉన్న కవిలా వ్రాయడంపై తెలుగు భాష ప్రేమికులు, సాహితీ వేత్తల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. తెలుగు భాష మాధుర్యాన్ని పద్యంలోని ప్రతి పదంలో నింపుతూ ఎంతో చక్కగా జనార్దన శతకం రాసినందుకు సంకీర్త్ వింజమూరిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. చిన్న వయస్సు నుంచే సంకీర్త్ తల్లిదండ్రులు వింజమూరి భార్గవ, తేజస్వీలు తెలుగు భాషపై ప్రేమ పెరిగేలా సంకీర్త్‌ను తీర్చిదిద్దారు. తెలుగు భాషా పాండిత్యాన్ని పెంచేందుకు తటవర్తి గురకులంలో చేర్పించి శిక్షణ ఇప్పించారు. అదే ఈ రోజు సంకీర్త్‌ను 13 ఏళ్ల వయస్సులోనే శతకం రాసేలా తీర్చిదిద్దింది. నేర్చుకోవాలనే అభిలాష, భాష మాధ్యురాన్ని ఆస్వాదించగల సామర్థ్యం చిన్న వయస్సులోనే రావడం సంకీర్త్‌కు కలిసి వచ్చిన అంశమని గురువు తటవర్తి కల్యాణ్ చక్రవర్తి అన్నారు. అంతర్జాల వేదికగా తెలుగు సాహితీవేత్తలు, రచయితలు సంకీర్త్ రచించిన జనార్థన శతకాన్ని ఆవిష్కరించారు. తటవర్తి గురుకులం శతశతకయజ్ఞములో భాగంగా పద్యశతకాలను పేదవిద్యార్థుల చదువుల అవసరాల కొరకు సహాయం చేస్తూ ఆవిష్కరించటం సాంప్రదాయంలా కొనసాగిస్తూ వస్తుంది. ఆ పరంపరలో భాగంగానే సంకీర్త్ రచించిన ఈ రెండు శ్రీనరసింహా,జనార్దన శతకాలు నిజామాబాద్ జిల్లా చెన్నూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పది మంది డిగ్రీ విద్యార్థులకు సహాయానికి గుర్తుగా వీటిని ఆవిష్కరించారు. చెన్నూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రధానోపాధ్యాయులు డాక్టర్ మారేపల్లి పట్వర్థన్ కూడా శతావధాని కావడంతో ఆ కాలేజీ విద్యార్ధులను కూడా భాష పరంగా ప్రోత్సహిస్తున్నారు. అందులో ఆ పది మంది విద్యార్థులు ఈ రెండు శతకాలలోని పద్యాలను గానం చేసి వినిపించారు. ఇలా పద్యసాహిత్యంతో తెలుగు భాష వైభవం, సేవా నిరతిని రెండింటిని మేళవించి తటవర్తి గురుకులం శత శతక యజ్ఞాన్ని నిర్వహిస్తోంది. కళ్యాణ్ చక్రవర్తి వృత్తి రీత్యా ఐటీ రంగానికి చెందినా, ప్రవృత్తి రీత్యా ఆధ్యాత్మిక వికాసం, ఇంటింటా తెలుగుపద్యం, సమాజం సాహిత్యం, సంస్కృతి.. ఇవి తటవర్తి గురుపథంగా ఒక మార్గాన్ని ఎంచుకుని కరోనా సమయంలో జూమ్ ద్వారా సెషన్స్ నిర్వహిస్తూ, వయో బేధం లేకుండా, 8 సం. ల బాలుర నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకూ వారికి సులువుగా పద్య నిర్మాణ మెళుకువలు నేర్పించి, పద్య సేద్యం చేస్తూ తెలుగు భాష కు తనవంతు కృషి చేస్తున్న కృషీవలుడు. త్వరలో తన శతశతక యజ్ఞము ద్వారా పేద విద్యార్థుల కోసం తన ప్రయత్నంలో మరింత మంది పద్యకవులు, పద్యకావ్యాలు వెలుగులోకి రావాలని ఆశిద్దాం.(చదవండి: తెలుగు, సాహితీ ప్రియులకు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు!) -
ఆసీస్‌తో మ్యాచ్: టీమిండియాకు ఆఖరి అవకాశం
ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న గవాస్కర్-బోర్డర్ ట్రోఫీ ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా మెల్బోర్న్లో గురువారం నుంచి జరగనున్న బాక్సింగ్ డే టెస్ట్(Boxing Day Test) కోసం రెండు దిగ్గజ జట్లు సంసిద్ధంగా ఉన్నాయి. ఈ సిరీస్ లో మూడు టెస్ట్ ల అనంతరం రెండు జట్లు చెరో టెస్ట్ మ్యాచ్ గెలిచి 1-1తో సమఉజ్జీలుగా ఉండగా, ఈ సిరీస్ ఫలితం పై రెండు జట్ల వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ భవితవ్యం కూడా ఆధారపడి ఉండటం ఈ సిరీస్ మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.ఆస్ట్రేలియా ఆశలన్నీ ఈ సిరీస్ పైనేరెండేళ్లకి ఒకమారు తొమ్మిది టెస్ట్ లు ఆడే దేశాల మధ్య జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(World Test Championship:) ఫైనల్ ఈ కాలంలో వివిధ జట్లు కనబరిచిన ప్రతిభ ఆధారంగా రెండు ఫైనల్ కి అర్హత సాధించే జట్లను నిర్ణయిస్తారు. ప్రస్తుత 2023-25 సీజన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పట్టిక లో దక్షిణాఫ్రికా ప్రధమ స్థానంలో ఉంది.శ్రీలంక తో సొంత గడ్డపై జరిగిన రెండు టెస్టుల సిరీస్ లో 2-౦ తేడాతో విజయం సాధించిన దక్షిణాఫ్రికా, పాయింట్ల పట్టిక లో 63.33 సగటు తో ప్రధమ స్థానానికి దూసుకుపోయింది. ఆస్ట్రేలియా ప్రస్తుతం 58.89 సగటు తో రెండో స్థానం లో ఉంది.అయితే ఆస్ట్రేలియా ప్రస్తుతం భారత్ తో జరుగుతున్న గవాస్కర్-బోర్డర్ ట్రోఫీ లోని మిగిలిన రెండు టెస్ట్ మ్యాచ్ ల తోపాటు శ్రీ లంక తో ఆ దేశంలో జరిగే మరో రెండు టెస్ట్ మ్యాచ్ ల్లో ఆడాల్సి ఉంది. అయితే ఆస్ట్రేలియా కి శ్రీ లంక ని స్పిన్ కి అనుకూలంగా ఉండే అక్కడ పిచ్ ల పై శ్రీ లంక ని ఓడించడం అంత సులువైన పని కాదు. అందుకే ఆస్ట్రేలియా కూడా ఈ రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించి తన అవకాశాలని సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది. అందుకే ప్రస్తుత సిరీస్‌పైనే ఆస్ట్రేలియా ఆశలు పెట్టుకుంది.టీమిండియాకు ఆఖరి అవకాశం ఈ సిరీస్ ఆరంభానికి ముందు న్యూజిలాండ్ తో సొంత గడ్డపై జరిగిన రెండు మ్యాచ్ ల సిరీస్ లో 0-2 తో ఘోర పరాభవం పొందిన భారత్(Team India) తొలిసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ స్థానాన్ని జారవిడుచుకునే ప్రమాదంలో పడింది. వరుసగా రెండు సార్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి అర్హత సాధించి, రెండింటిలో పరాభవాన్ని మూటగట్టుకున్న భారత్ కి ఈ రెండు టెస్టులలో విజయం సాధిస్తేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి అర్హత సాధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టిక లో భారత్ 55.88 సగటుతో మూడో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ సిరీస్ కి ముందు పాయింట్ల పట్టిక లో ప్రథమ స్థానంలో ఉన్న భారత్ కి ఇది ఎదురుదెబ్బే .రెండు సార్లు పరాభవం ఇంతకుముందు 2019-21 లో కరోనా అనంతరం ఇంగ్లాండ్ లోని సౌతాంఫ్టన్ లోని రైస్ బౌల్ స్టేడియంలో జరిగిన ప్రథమ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో భారత్ న్యూజిలాండ్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. తర్వాత 2021- 23 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి ఇంగ్లాండ్ లోన్ ఓవల్ స్టేడియం ఆతిధ్యాన్నిచ్చింది. ఈ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడిన భారత్ 209 పరుగుల తేడాతో వరుసగా రెండోసారి పరాజయంచవిచూసింది .ఈ నేపథ్యంలో ఈ సారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి అర్హత సాధించాలని భారత్ చాలా గట్టి పట్టుదలతో ఉంది. ఇందుకు ఈ రెండు టెస్ట్ ల లో విజయం సాధించడం ఒక్కటే భారత్ ముందున్న అవకాశం. లేని పక్షంలో వరుసగా రెండు టెస్ట్ ఛాంపియన్షియప్ ఫైనల్స్ లో పాల్గొన్న వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుత భారత జట్టు సారధి రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీలు కూడా అదే బాటలో పయనించి భారత్ టెస్ట్ జట్టు నుంచి తప్పుకున్నా ఆశ్చర్యం లేదు. -
మెల్బోర్న్లో ఘనంగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు
వైయస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో YSR కేడర్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని జగనన్నకు శుభాకాంక్షలు తెలిపారు.పార్టీ నాయకులు వై ఎస్ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్, శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి, కుంచె రమణారావు లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలతో ఎప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి సాధనలను గుర్తు చేసుకున్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కృషిని ప్రశంసించారు.ఆస్ట్రేలియా - టీం మెల్బోర్న్ సభ్యులు కృష్ణా రెడ్డి, భరత్, బ్రాహ్మ రెడ్డి, రామంజి, నాగార్జున.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. జగనన్న స్ఫూర్తి అందరికీ మార్గదర్శకంగా నిలవాలన్నారు. -
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన 22 ఏళ్ల భారతీయ విద్యార్థి నవజీత్ సంధుని పలుమార్లు కత్తితో పొడిచి చంపిన ఘటన విషాదాన్ని నింపింది. ఏడాదిన్నర క్రితం స్టడీ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ మెల్బోర్న్లో ఉంటున్నాడు. ఈ ఘటనపై మెల్బోర్న్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, హర్యానా, కర్నాల్‌లోని గగ్సినా గ్రామానికి చెందిన నవజీత్ స్టడీ వీసాపై ఎంటెక్ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లాడు. కర్నాల్, బస్తాడా గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులు కూడా మూడు నెలల క్రితం చదువుకోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. నవజీత్ స్నేహితుడు శ్రవణ్ మరో ఇద్దరితో కలిసి ఒకే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల, శ్రవణ్ అక్కడి నుండి వేరే ప్రాంతానికి మారాలని నిర్ణయించు కున్నాడు. ఈ విషయంలో స్నేహితుల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో నవజీత్ కారులో సామాన్లు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా నిందితులు మళ్లీ శ్రవణ్‌తో గొడవకు దిగారు. వారిని నివారించినందుకు గాను నవజీత్‌పై కత్తితో దాడిచేశారు. ఛాతీపై తీవ్రమైన కత్తిపోటు గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో శ్రవణ్ కూడా గాయపడ్డాడు.అయితే గొడవ పడవద్దు అన్నందుకే నవజీత్‌పై దాడి చేశారని బాధితురాలి మేనమామ, ఆర్మీ అధికారి యశ్వీర్ తెలిపారు. నవజీత్ తెలివైన విద్యార్థి అనీ, సెలవుల కోసం జూలైలో ఇండియాకు రావాల్సి ఉందని తెలిపారు. రైతు అయిన అతని తండ్రి, నవజీత్ చదువుకోసం ఒకటిన్నర ఎకరాల భూమిని విక్రయించాడని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఆస్ట్రేలియా నుంచి తమ కుమారుడి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు సహకరించాలని మృతుడి కుటుంబం భారత ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. -
ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు!
ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదో వార్షికోత్సవ బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో వెస్ట్ గేట్ స్పోర్ట్స్ సెంటర్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన తేలు విజయగారు బతుకమ్మ ఆట పాటలతో అందర్నీ అల్లరించారు. ఈ కార్యక్రమం గత పది సంవత్సరాలుగా ఎంతో విజయవంతంగా నడిపిస్తున్నామని ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ బైరెడ్డి అన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ముందు తరాలకు అందించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బైరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అవ్వడానికి ముఖ్య కారణము కమిటీ కార్యవర్గ సభ్యులు స్పాన్సర్స్, వాలంటీర్స్ అని అనిల్ బైరెడ్డి తెలిపారు. ఇకముందు కూడా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను మన ఆటపాటలను ముందు తరాల వారికి అందించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మినిస్టర్స్ కౌన్సిల్ మేయర్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఏటీఏఐ కార్యవర్గ సభ్యులు కిరణ్ పాల్వాయి, ఫణికుమార్ , వంశీ కొట్టాల, రవి దామర, మహేష్ రెడ్డి ,శ్రీనివాస్ కర్ర, కిషోర్ యానం, మధుపైల, రఘు కోట్ల,దీపక్ హరి, కృష్ణ ఒడియాల, పుల్లారెడ్డి బద్దం, రాజవర్ధన్ రెడ్డి, మహేష్ బద్దం ,అమరేందర్ రెడ్డి, ప్రవీణ్ దేశం, సతీష్ పటి, శ్యాం లింగంపల్లి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: అబుదాబిలో బతుకమ్మ సంబరాలు!) -
ఐఎఫ్ఎఫ్ఎం అవార్డ్స్ 2023: అదరగొట్టిన నటి, బ్లాక్ చీర ధరపై చర్చ
IFFM Awards 2023 Rani Mukerji మెల్బోర్న్లో (ఆగష్టు 11,2023న) జరిగిన ఐఎఫ్ఎఫ్ఎం అవార్డ్స్ 2023 ప్రదానోత్సవంలో బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వేలో తన అద్భుతమైన నటనకు గాను రాణి ముఖర్జీ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. ఈ సందర్బంగా ఆమె ధరించిన చీర, ఆమె రూపం అక్కడున్న వారందరినీ మెస్మరైజ్ చేసింది. మిసెస్ ఛటర్జీ Vs నార్వేని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆదరించడం చాలా గర్వంగా ఉందంటూ, IFFM జ్యూరీకి తోపాటు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. ఇది తల్లి శక్తి ప్రదర్శించే విశ్వవ్యాప్త కథ అని దీనికి ఉత్తమ నటి అవార్డు రావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా అన్నారు. అలాగే షారుఖ్ ఖాన్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ పఠాన్ IIFMలో పీపుల్స్ ఛాయిస్ అవార్డును అందుకుంది. ఆస్ట్రేలియాలో 4.7 మిలియన్ డాలర్లు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. భర్త, నిర్మాత ఆదిత్య చోప్రా, పఠాన్ టీం తరపున రాణీ ముఖర్జీ ఆస్ట్రేలియాలో ప్రతిష్టాత్మక అవార్డును అందుకుంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటించిన తెలుగు చిత్రం సీతా రామం ఉత్తమ చిత్రం అవార్డును కైవసం చేసుకుంది ఈ ఈవెంట్లో రాణి ముఖర్జీ లుక్ అదిరిపోయింది. ప్రఖ్యాత డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన బ్లాక్ చీరలో అందరి కళ్లను తనవైపు తిప్పుకుంది. విశాలమైన ఈ ఫెదర్ బోర్డ్ర్ చీరకు జతగా సీక్విన్డ్ హాఫ్-స్లీవ్ బ్లౌజ్‌తో జత చేసి అద్భుతంగా కనిపించింది. అంతేనా లగ్జరీ బ్రాండ్ మల్టిపుల్ టైర్డ్ పెర్ల్ నెక్లెస్, చక్కటి మేకప్‌తో మరింత స్టన్నింగ్ లుక్స్‌లో కనిపించడం ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. అంతకుముందు కూడా మసాబా గుప్తా రూపొందించిన నలుపు-రంగు చందేరీ ముల్, వైట్ థ్రెడ్స్ ముడి పట్టు చీరను ధరించింది. దీనిపై దేవనాగరిలో ముద్రించిన 'మా', తెల్లటి టాసెల్ ఎంబ్రాయిడరీ చేయించి ఉండటం విశేషం. దీని ధర రూ. 17,000. దీంతో లేటెస్ట్ సవ్యసాచి డిజైన్డ్ సారీ ధర ఎంత ఉంటుందనే దాని అభిమానుల్లో చర్చ మొదలు కావడం విశేషం View this post on Instagram A post shared by Indian Film Festival of Melbourne (@iffmelbourne) -
కేసీఆర్ పరిపాలన తెలంగాణకు వరం: బీఆర్ఎస్ ఆస్ట్రేలియా హర్షం
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక కార్యక్రమాలు, పథకాలు చేపట్టిందని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ హర్షం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన చర్యలతో తెలంగాణ సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తుందని తెలిపింది. మెల్బోర్న్లో విశ్వామిత్ర మంత్రి ప్రగడ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రగతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సంక్షేమం దిశగా రైతు రుణమాఫీతో పాటు హైదరాబాద్ లో మెట్రోరైలు విస్తరణ, నోటరీ ఆస్తుల క్రమబద్ధీకరణ నిర్ణయం, తదితర అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ, రైతు పక్షపాతిగా నిలిచిందని, రుణమాఫీ సంపూర్ణం చేసిన సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేనిదని సభ్యులు కొనియాడారు. ఈ సమావేశంలో అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి, ఉప్పు సాయిరాం, విశ్వామిత్ర,వినయ్ గౌడ్, సురేష్, ఉదయ్, జమాల్ , సాయి యాదవ్, వేణు , సతీష్ , రాకేష్, సూర్య తదితరులు పాల్గొన్నారు. -
ఆస్ట్రేలియాలో ఘనంగా బోనాల జాతర
మెల్బోర్న్ నగరంలో రాక్బ్యాంక్ దుర్గామాత టెంపుల్ వద్ద ఘనంగా బోనాల జాతర జరిగింది. ఈ వేడుకలు మెల్బోర్న్ తెలంగాణ బోనాలు సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న తెలంగాణ మహిళలు అమ్మ వారికి బోనాలు, తొట్టెలు సమర్పించుకుని తమ మొక్కును చెల్లించుకున్నారు. పోతురాజుల ఆట, పాటలు, యువకుల నృత్యాలతో దుర్గా మాత ఆలయం ఒక్కసారిగా సందడిగా మారింది. బోనాల పాటలకు చేసిన నృత్యాలకు భారత దేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ప్రజలు కూడా నాట్యం చేయడం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. తెలంగాణలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలను అదే స్థాయిలో గత పది సంవత్సరాలుగ నిర్వహిస్తున్న మెల్బోర్న్ తెలంగాణ బోనాలు సంస్థ నిర్వాహకులు తెలంగాణ మధు , రాజు వేముల , ప్రజీత్ రెడ్డి కోతి , దీపక్ గద్దెలను ఈ వేడుకలకు హాజరైన వివిధ సంఘాల నాయకులు, ప్రజలు అభినందించారు. (చదవండి: కువైట్‌లో ఘనంగా రాజన్న 74 వ జయంతి వేడుకలు) -
PAK Vs ENG: ఇంగ్లండ్- పాక్ ఫైనల్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దు అయితే?
టీ20 ప్రపంచకప్-2022 తుది సమరానికి సమయం అసన్నమైంది. ఆదివారం(నవంబర్ 13)న మెల్బోర్న్ వేదికగా ఫైనల్ పోరులో పాకిస్తాన్- ఇంగ్లండ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి పాక్ ఫైనల్లో అడుగు పెట్టగా.. రెండో సెమీఫైనల్లో భారత్‌పై ఘన విజయం సాధించి ఇంగ్లండ్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశం ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో 95 శాతం కురిసే అవకాశం ఉందని బ్యూరో ఆఫ్ మెట్రాలజీ వెల్లడించింది. "ఆదివారం మేఘావృతమై ఉంటుంది. మ్యాచ్ జరిగే సమయంలో 95 శాతం భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఉదయం సమయంలో గంటకు 25 నుంచి 40 కిమీ వేగంతో గాలులు వీస్తాయి" అని బ్యూరో ఆఫ్ మెట్రాలజీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఫైనల్ రద్దు అయితే? కాగా సెమీఫైనల్‌కు,ఫైనల్‌కు రిజర్వ్‌డేను ఐసీసీ కేటాయించింది. కాబట్టి ఒక వేళ ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించి, ఆదివారం ఆట సాధ్యపడకపోతే.. మ్యాచ్ నిలిచిపోయిన దగ్గరి నుంచి రిజర్వ్ డే(సోమవారం)లో కొనసాగిస్తారు. ఒకవేళ రిజర్వ్ డేలో కూడా వర్షం కారణంగా ఆట సాధ్యపడకపోతే మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లను విజేతగా ప్రకటిస్తారు. చదవండి: Kohli Emotional Post: మా కల నేరవేరలేదు.. చాలా బాధగా ఉంది! కోహ్లి భావోద్వేగం -
టీమిండియా కప్ కొడితే ఆ పని చేస్తా.. మనసులో మాట చెప్పిన కింగ్ కోహ్లీ
క్రికెట్లో రన్ మెషీన్, రికార్డుల రారాజు కింగ్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు నేడు(నవంబర్ 5). కింగ్ కోహ్లీ బర్త్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు విరాట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. టీమిండియా ప్లేయర్స్ కూడా కోహ్లీకి బర్త్‌డే విషెస్ చెబుతూ డ్రెస్సింగ్ రూమ్‌లో కేక్ కటింగ్ చేయించారు. కాగా, ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా రేపు(ఆదివారం) జింబాబ్వేతో జరగబోయే టీ20 మ్యాచ్ కోసం మెల్బోర్న్(ఎంసీజీ) క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోంది. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన పలువురు జర్నలిస్టులు విరాట్ కోహ్లీని కలిశారు. అనంతరం, గ్రౌండ్‌లోనే విరాట్‌తో కేక్ కటింగ్ చేయించారు. ఈ క్రమంలో జర్నలిస్టులు విరాట్‌కు శుభాకాంక్షలు చెబుతూ కోహ్లీతో కాసేపు సరదాగా ముచ్చటించారు. విరాట్ కూడా ఎంతో సరదాగా నవ్వుతూ వారికి సమాధానాలు ఇస్తూ హ్యాపీ మూడ్‌లో కనిపించాడు. అయితే, జర్నలిస్టులతో మాట్లాడుతున్న సందర్భంగా పుట్టినరోజు నాడు తన మనసులోని మాట బయటపెట్టాడు విరాట్ కోహ్లీ. ఇప్పుడు మీతో(జర్నలిస్టులతో) చిన్న కేక్ కట్ చేస్తున్నాను. కానీ.. నవంబర్ 13వ తేదీన టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిస్తే పెద్ద కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకుంటాను. కేక్ కట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అని ఎంతో సంతోషంతో కామెంట్స్ చేశాడు. ఇక, తనతో కేక్ కట్ చేయించిన జర్నలిస్టులకు కోహ్లీ కృతజ్ఞతలు తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Virat Kohli celebrate his birthday with journalist . and BTW There were also those journalists who talked about removing him from the team#HappyBirthdayViratKohli pic.twitter.com/Rj9YaJHNfD — Rahul♦️ Virat (@mani_muzic) November 5, 2022 మరోవైపు.. విరాట్ కోహ్లీకి ఐపీఎల్ ప్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు(ఆర్సీబీ) కూడా స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపింది. ఇక, కోహ్లీ బెస్ట్ దోస్త్ ఏబీ డివిలియర్స్ కూడా విరాట్‌కు వీడియో ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ట్విట్టర్ వేదికగా ఏబీ డివిలియర్స్.. ‘హలో వి.. మై బిస్కట్.. ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలి. ప్రస్తుతం బెంగళూరులో ఉన్నా.. నేను ఇక్కడ కూర్చొని బర్త్ డే విషెస్ పంపడం సరదాగా ఉంది. కోహ్లీ.. నువ్వు ఒక స్పెషల్ పర్సన్. అత్యుత్తమ క్రికెటర్‌వి. నీ స్నేహాన్ని నాకు అందించినందుకు ధన్యవాదాలు. వరల్డ్ కప్‌లో నీకు..టీమిండియాకు ఆల్ ది బెస్ట్. టీమిండియా ఫైనల్ చేరాలి. ప్రపంచకప్ ఫైనల్లో ఫైనల్లో దక్షిణాఫ్రికా జట్టును ఎదుర్కోవాలని ఆశిస్తున్నాను అని నవ్వుతూ డివిలియర్స్ విషెస్ తెలిపాడు. ఇక, టీ20 ప్రపంచకప్‌లో కింగ్ కోహ్లీ తన ఫామ్ కొనసాగిస్తున్నాడు. టీమిండియా ఆడిన 4 మ్యాచ్‌లో కోహ్లీ మూడు అర్ధ సెంచరీలు సాధించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మెగా టోర్నీలో 220 పరుగులు చేసి ఇప్పటి వరకు వరల్డ్‌కప్‌లో టాప్ రన్స్ సోర్కర్గా నిలిచాడు. కోహ్లీ ఇదే ఫామ్‌లో కొనసాగుతూ భారత్‌కు వరల్డ్‌కప్ అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. Dear @imVkohli, Here is a very special wish from a very special friend. 🥳🥹#PlayBold #HappyBirthdayViratKohli @abdevilliers17 pic.twitter.com/UT7wEdnde2 — Royal Challengers Bangalore (@RCBTweets) November 5, 2022 ఇది కూడా చదవండి: కోహ్లి కెరీర్లో ముచ్చటగా ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు.. -
ఓటమితో మైండ్ బ్లాంక్.. టీవీ పగలగొట్టిన అభిమాని..అయితే ఆ వీడియో ఇప్పటిది కాదు! ట్విస్ట్
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ అధ్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా ఈ మ్యాచ్ యావత్ క్రికెట్ అభిమానులను అలరించింది. మ్యాచ్ విజయంతో భారత అభిమానులు ఒకరోజు ముందే దీపావళి చేసుకున్నారు. అయితే పాకిస్తాన్ అభిమానులు మాత్రం భారత్ చేతిలో తమ జట్టు ఓటమికి జీర్ణుంచుకోలేక ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. మ్యాచ్ అయిపోగానే కొందరు టీవీలు పగలగొట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ వీడియో ఇప్పటిది కాదు ఇందుకు సంబంధించిన ఓ వీడియోను భారత క్రికెట్ దిగ్గజం వీరేందర్ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. మ్యాచ్ అయిపోగానే ఓ పాక్ అభిమాని తన టీవీని పగలగొట్టినట్లుగా ఇందులో కనిపించిది. దానిపైకి వస్తువును విసరడమే గాక.. కాలుతో తన్ని దాన్ని ముక్కలు ముక్కలు చేసినట్లు ఆ దృశ్యాల్లో ఉంది. అతడి ఆగ్రహాన్ని చూసి సెహ్వాగ్ సైటెర్లు వేశాడు. ఇది కేవలం మ్యాచ్ మాత్రమే.. రిలాక్స్ అవ్వండి. మేము ఇక్కడి దీపావళి టపాసులు పేల్చుతుంటే.. మీరేమో టీవీలు పగలగొడుతున్నారు. పాపం టీవీలు ఏం చేశాయి? అని రాసుకొచ్చాడు. నవ్వే ఓ ఎమోజీ కూడా పెట్టాడు. దీన్ని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. అయితే, నిజానికి ఇది టీ20 వరల్డ్‌కప్-2022లో భారత్- పాక్ నాటి మ్యాచ్‌కు సంబంధించింది కాదు. 2016లో ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా ఓ వ్యక్తి ఈ చర్యకు పాల్పడగా.. దీనిని భారత్- పాక్ మ్యాచ్‌కు లింక్ చేసి వైరల్ చేయడం గమనార్హం. Relax Padosi , it’s only a game. Hamaare yahan Deepawali hai toh pataakhe phod rahe hain aur aap bevajah TV 📺 phod rahe hain 🤣. Nahin yaar, TV ka kya kasoor. pic.twitter.com/AvVL4fOmny — Virender Sehwag (@virendersehwag) October 23, 2022 చదవండి: Ind Vs Pak: భారత్-పాక్ మ్యాచ్.. చివరి ఓవర్లో 'నో బాల్'పై తీవ్ర దుమారం -
యాంటీ స్ట్రెస్ బాల్‌తో సిద్ధం, టీవీ మాత్రం చూడను! ఆనంద్ మహీంద్ర
సాక్షి,ముంబై: ఇండియా, పాకిస్తాన్,క్రికెట్ మ్యాచ్ అంటే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. సెలబ్రిటీస్‌ల దగ్గరినుంచి, సాధారణ క్రికెట్ ఫ్యాన్దాకా తీవ్ర ఉత్కంఠ నెలకొంటుంది. తాజా టీ20 ప్రపంచకప్ పాక్, ఇండియా మ్యాచ్‌పై పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర మరోసారి తన ట్విట్‌తో వార్తల్లో నిలిచారు. ఉత్కంఠ భరితమైన ఈ మ్యాచ్‌కోసం నేను సిద్ధం. యాంటీ-జిన్క్స్ స్ప్రే, యాంటీ-స్ట్రెస్ బాల్, వర్రీ బీడ్స్‌ని సిద్ధంగా ఉంచుకున్నా. సాయంత్రం రానున్న ఫలితాలకోసం ఎదురు చూస్తా తప్ప...టీవీని చూడను ఆఫ్ చేసేశా.. అంటూ మ్యాచ్ ప్రారంభానికి ముందే ట్వీట్ చేశారు. స్టేడియం ఉత్కంఠపూరితంగా ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన ఉద్యోగం టీమిండియా జట్టు సభ్యుడిగా ఉండటం అంటూ కోట్లాది మంది అభిమానులు అంచనాల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్‌లో గెలుపుకోసం ఆటగాళ్ల ఆరాటం, తపనపై మరో ట్వీట్ చేశారు. మ్యాచ్‌కు ముందు అభిమానుల లుంగీ డ్యాన్స్ వీడియోను కూడా షేర్ చేశారు. దీంతో ‘ఆనంద్ సార్, మీ హాస్యం అసాధారణమైనది, అయితే భారత క్రికెట్ జట్టును ఎంకరేజ్ చేసేందుకు ఈ మ్యాచ్‌ని తప్పక చూడాలి, తద్వారా ఇండియా పాకిస్తాన్‌ను ఓడించి పాత ఓటమినుంచి బయటపడుతుంది’ అంటూ ఒక యూజర్ కామెంట్ చేయడం విశేషం. తాజాగా ఆస్ట్రేలియా మెల్బోర్న్ స్టేడియంలో టీ-20 వరల్డ్ కప్ 2022లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కు క్రికెట్ ప్రేమికులు ఎంజాయ్ చేస్తున్నారు. టీమిండియా టార్గెట్ 160 (ఆదివారం, సాయంత్రం 3.30 నిమిషాలకు) కాగా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. తద్వారా భారత్‌కు 160 టార్గెట్ నిర్దేశించింది. భారత ఆటగాళ్లు హార్దిక్, అర్ష్‌దీప్ చెరో 3 వికెట్లు తీయగా, షమీ, భువీ చెరొక వికెట్ పడగొట్టారు. And as always, I am ready for the #indiaVsPakistan match. Have doused myself with the anti-jinx spray & have my anti-stress ball & worry beads at my side. And my TV set firmly switched off! 😀Will only await news of the results in the evening… pic.twitter.com/nxnceKcw9B — anand mahindra (@anandmahindra) October 23, 2022 Right now the real stadium is in the players’ minds. The real battle is being fought over there, in the Mindverse. Right now, with the burden of over a billion expectations, the toughest job in the world is being a member of the Team. Respect. #INDvsPAK pic.twitter.com/aUjTpawPkY — anand mahindra (@anandmahindra) October 23, 2022 Given the strength of the Lungi Dance Division & the Bhangra Battalion, India appears to have already won the #T20WC2022 World Cup of Pre-match Fan Support… pic.twitter.com/hiLuHzqSIP — anand mahindra (@anandmahindra) October 23, 2022 -
T20 WC 2022: భారత్-పాక్ మ్యాచ్ అంటే ఇలాగే ఉంటది.. గంటల వ్యవధిలోనే..!
భారత-పాక్ జట్ల మధ్య మెల్బోర్న్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 23న జరగనున్న టీ20 ప్రపంచకప్ టగ్ ఆఫ్ వార్ ఫైట్ కోసం ఇప్పటి నుంచే సన్నాహకాలు మొదలయ్యాయి. టోర్నీ ఆరంభానికి ఇంకా 8 నెలల సమయం ఉన్నా.. దాయాదుల సమరాన్ని తిలకించేందుకు అభిమానులు ఇప్పటి నుంచే ఎగబడ్డారు. గంటల వ్యవధిలోనే ఆన్లైన్లో టికెట్లన్నీ కొనుగోలు చేశారు. ఈ మ్యాచ్‌కి ఉన్న డిమాండ్ దృష్ట్యా చాలా వరకు టికెట్లు బ్లాక్‌లో చలామణి అయ్యే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాది(2021) జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనూ భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు ఇదే తరహాలో హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. అయితే, ఆ మ్యాచ్ చూసేందుకు భారీగా ఎగబడ్డ భారత అభిమానులకు మాత్రం నిరాశే ఎదురైంది. ఎన్నడూ లేని విధంగా టీమిండియా ఆ మ్యాచ్‌లో పాక్ చేతిలో చిత్తుగా ఓడింది. అనంతరం సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా వేదికగా జరిగే 2022 ప్రపంచకప్‌లో గతేడాది తరహాలోనే సూపర్ 12 పద్దతిలో లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. గ్రూప్ 1లో ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌తోపాటు మరో రెండు క్వాలిఫైయర్ జట్లు పోటీపడనుండగా.. గ్రూప్ 2లో భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సహా మరో రెండు జట్లు తలపడనున్నాయి. లీగ్ మ్యాచ్‌ల్లో భాగంగా టీమిండియా అక్టోబర్ 23న పాక్‌తో, 30న సౌతాఫ్రికాతో, నవంబర్ 2న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. చదవండి: కోహ్లి బ్యాటింగ్, ధోని కెప్టెన్సీ స్కిల్స్ కలగలిపితే యశ్ ధుల్.. -
19వ 'సారి ఫైనల్‌కు చేరిన రాఫెల్ నాదల్
మెల్బోర్న్: స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ తన కెరీర్లో వరుసగా 19వ ఏడాది అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ)కు సంబంధించిన టోర్నీలో ఫైనల్‌కు చేరాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న మెల్బోర్న్ సమ్మర్ సెట్ ఏటీపీ–250 టోర్నీలో నాదల్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ నాదల్ 6–4, 7–5తో ఎమిల్ రుసువోరి (ఫిన్లాండ్)పై గెలిచాడు. నేడు జరిగే ఫైనల్లో మాక్సిమి క్రెసీ (అమెరికా)తో నాదల్ తలపడతాడు. 2004 నుంచి ప్రతి ఏడాది కనీసం ఓ ఏటీపీ టోర్నీలో నాదల్ ఫైనల్ చేరాడు. కెరీర్లో 126వ సింగిల్స్ ఫైనల్ ఆడనున్న నాదల్ 88 టైటిల్స్ సాధించాడు. 37 టోర్నీలలో రన్నరప్‌గా నిలిచాడు. చదవండి: ఇంగ్లండ్‌కు భారీ షాక్.. స్టార్ ఆటగాడు దూరం! -
ఆరేళ్ల చిన్నారి.. రూ.3.6 కోట్ల విలువైన ఇల్లు.. ఎలా కొనుగోలు చేసిందో తెలుసా?
చాలా మందికి చిరకాల కోరిక.. కచ్చితంగా తమకంటూ ఒక ఇల్లు ఉండాలని.. పైగా ఉద్యోగం చేస్తున్నప్పుడే కట్టుకోవాలనుకుంటారు.. కొన్ని సార్లు పరిస్థితులు అనుకూలించకపోవడంతో కట్టుకోలేకపోతారు. కానీ ఇక్కడొక ఆరేళ్ల చిన్నారి ఏకంగా రూ.3.6 కోట్లు విలువ చేసే ఇల్లు కొనేసింది. ఎలాగో చదివేయండి. (చదవండి: పంచాయితీ ఎన్నికల్లో ఒక అభ్యర్థికి కనివినీ ఎరుగని ఓట్లు!... కచ్చితంగా షాక్ అవుతారు!!) అసలు విషయంలోకెళ్లితే...ఆస్ట్రేలియాకి చెందిన రూబీ అనే ఆరేళ్ల చిన్నారి తన తోబుట్టువులైన సోదరుడు గుస్, సోదరి లూసితో కలిసి మెల్బోర్న్లోని క్లైడ్‌లో ఉన్న ఇంటిని ఏకంగా రూ.3.6 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ మేరకు పిల్లలు ఇంటి పనులు చేయడం, పుస్తకాలను ప్యాక్ చేయడం వంటి పనులు చేస్తూ డబ్బలు సంపాదించారని తండ్రి క్యామ్ మెక్లెల్లన్ చెప్పారు. అంతేకాదు ప్రతి ఒక్కరూ లక్ష రూపాయలు చొప్పున ఆదా చేస్తూ వచ్చారని క్యామ్ అన్నారు. అంతేకాదు తన పిల్లలకు ఈ ఆస్తిని వారికి తగిన వయసు వచ్చినప్పుడు పంచుతానని చెప్పానని కూడా వివరించారు. ఈ క్రమంలో ఆ చిన్నారుల తండ్రి క్యామ్ ఈ ఇంటి విలువ పదేళ్లలో రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అన్నారు. పైగా ఇప్పటికే ఈ ఇంటి ధర రూ 5 లక్షల వరకు పెరిగిందని చెప్పారు. అంతేకాదు 2032లో ఈ ఇంటిని అమ్మగా వచ్చిన డబ్బును వారికి సమ భాగాలుగా పంచి ఇస్తానని చెప్పారు. అయితే ఆ చిన్నారుల తండ్రి కామ్ ఏ పని చేయకుండా ఏడాదికి రూ 190 లక్షలను ఆర్జించడం కనుగొనటం విశేషం. ఆ తర్వాత క్యామ్ 36 ఏళ్ల వయసులో పదవీ విరమణ తీసుకున్నాడు. అయితే అతను 20 ఏళ్ల వయసులోనే ఆస్తులు కూడాబెట్టడం ప్రారంభించాడు. పైగా అతనికి 50 ఏళ్ల వయసులో పని చేయడం అసలు ఇష్టం లేదంట.. (చదవండి: బాప్రే! గాలి పటంతో పాటు మనిషి కూడా గాల్లోనే... !! -
అతనికి అదృష్టం 17 కేజీల ఉల్కరూపంలో తగిలింది.. బంగారం కంటే ఎన్నో రెట్లు!!
అది మామూలు రాయని అందరూ అంటుంటే.. తన మనసు మాత్రం కాదని చెబుతోంది. అది చాలా విలువైన రాయని, ఎందుకో తనకు అదృష్టం ఈ రాయి రూపంలోనే వరించబోతోందని గాఢంగా నమ్మాడు. ఎన్నో సంవత్సరాలుగా తన ఇంట్లో భద్రపరిచాడు కూడా. చివరికి తన నమ్మకమే నిజమైంది.. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు చెందిన డేవిడ్ హోల్‌కు అక్కడి స్థానక పార్కులో 2015లో 17 కేజీల రాయి దొరికింది. అప్పటినుంచి అది బంగారమై ఉంటుందని తన ఇంట్లోనే భద్రపరిచాడు. తనకు దొరికిన రాయిని పగలగొట్టడానికి డ్రిల్ మిషన్‌తో సహా ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు. చివరికి యాసిడ్‌లో వేశాడు కూడా.. కానీ దానిని పగులగొట్టి, లోపల ఏముందో చూడలేకపోయాడు. చేసేదిలేక ఆ రాయిని తీసుకుని మెల్బోర్న్లో ఉన్న మ్యూజియంకు తీసుకెళ్లాడు. ఐతే జియాలజిస్టుల పరిశీలనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. ఎందుకంటే సదరు రాయి మామూలుది కాదుమరి! అవును.. అంతరిక్షం నుంచి భూమిపై పడ్డ అరుదైన ఉల్క అది. సుమారు 460 కోట్ల సంవత్సరాలనాటిది. బంగారం కంటే కూడా ఎన్నోరెట్లు విలువైనది. ఈ విషయం తెలుసుకున్న డేవిడ్ ఎగిరి గంతేశాడు.19వ శతాబ్ధంలో అనేక బంగారం రాళ్లు ఈ ప్రాంతానికి తీసుకురాబడ్డాయి. ఈ పార్కులో బంగారం దొరుకుతుందని అక్కడి స్థానికుల నమ్మకం. అంతేకాదు ఈ పార్కులో దొరికిన ఏ వస్తువునైనా సందర్శకులు తమ ఇళ్లకు తీసుకెళ్లొచ్చు కూడా. డేవిడ్ కూడా తనకు దొరికిన రాయిని ఇంటికి తీసుకెళ్లాడు.. ఒక్కసారిగా కోటీశ్వరుడైపోయాడు. చదవండి: Day for Elimination of Violence Against Women:16 రోజులు... పదునెక్కే ఆలోచనలు.. కాలంతో పాటు హింసా రూపాలు మారుతున్నాయి! -
ఆస్ట్రేలియాలో హింసాత్మకంగా మారిన టీకా వ్యతిరేక నిరసనలు
-
ఆస్ట్రేలియాలో యాంటీ వ్యాక్సిన్ నిరసన గళం
మెల్బోర్న్: ఆస్ట్రేలియా రాజధాని మెల్బోర్న్లో యాంటీ వ్యాక్సిన్ నిరసనలు చోటు చేసుకున్నాయి. నిర్మాణ రంగంలో పని చేసే వ్యక్తులు తప్పనిసరిగా ఒక్క డోసు వ్యాక్సిన్ అయినా వేయించుకోవాలని నిబంధన పెట్టింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు 1000 మందికిపైగా నిరసనకారులు రోడ్లెక్కారు. నిర్మాణకారులు ధరించే జాకెట్లు, బూట్లు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. ప్రభుత్వం కూడా భారీ స్థాయిలో పోలీసులను రంగంలోకి దింపి నిరసనను అణచివేసే ప్రయత్నం చేసింది. దీంతో భారీ నిరసన చోటు చేసుకుంది. నిరసనకారులను అణచివేసేందుకు పోలీసులు పెప్పర్ స్ప్రేలను, రబ్బర్ బాల్ గ్రెనేడ్లను, ఫోమ్ బాటన్ రౌంట్లను ప్రయోగించారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయని విక్టోరియా రాష్ట్ర పోలీస్ చీఫ్ షేన్ పాటన్ పేర్కొన్నారు. 40 మంది నిరసనకారులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. షట్‌డౌన్ చేయడంతో.. మెల్బోర్న్ సహా పలు నగరాల్లో నిర్మాణ పనులను మంగళవారం నుంచి రెండు వారాల పాటు నిలిపివే యనున్నట్లు ప్రభుత్వం సోమవారం రాత్రి ప్రకటిం చింది. అప్పటి నుంచే నిరసన ప్రారంభమైంది. అయితే అధికారులు మాత్రం పెరుగుతున్న కోవిడ్ కేసులను తగ్గించడంతో పాటు, ఆరోగ్య కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్ ఒక డోసు తీసుకున్న వారు అక్టోబర్ 5 నుంచి పను లకు రావచ్చని ప్రభుత్వం చెప్పింది. విక్టోరియా స్టేట్‌లో గత 24 గంటల్లో 603 కొత్త కేసులు నమోదయ్యాయి. -
వైరల్: నీ భార్యను ఆ దేవుడే కాపాడాలి..
మెల్బోర్న్ : మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు.. అసలే అంతంత మాత్రం వ్యాపారం జరుగుతున్న ఓ రెస్టారెంట్‌పై ఫ్రాంక్ చేశాడో రాక్షసుడు. పెద్ద మొత్తంలో ఆహారం ఆర్డర్ చేసి తప్పుడు అడ్రస్ ఇచ్చి మోసం చేయటమే కాకుండా ఏంటని ప్రశ్నించినందుకు తిట్ల పురాణం మొదలెట్టాడు. వివరాలు.. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు చెందిన ఓ రెస్టారెంట్‌కు కొద్దిరోజుల క్రితం 21 ఆహార పొట్లాలకు ఆర్డర్ వచ్చింది. డెలివరీ తర్వాత డబ్బులు చెల్లిస్తానని సదరు వినియోగదారుడు చెప్పాడు. డెలివరీ బాయ్ ఆహార పొట్లాలను వినియోగదారుడు చెప్పిన అడ్రస్‌కు తీసుకెళ్లాడు. అది తప్పుడు అడ్రస్ అని తేలింది. దీంతో డెలివరీ బాయ్ అతడికి దీనిపై ‘‘మీరిచ్చిన అడ్రస్ తప్పుగా ఉంది’’ అని మెసేజ్ చేయగా.. ‘‘నాకు తెలుసు, .....’’ అంటూ వినియోగదారుడు బూతు మాట అన్నాడు. ఇక చేసేదేమీ లేక డెలివరీ బాయ్ ఆహార పొట్లాలను వెనక్కు తీసుకెళ్లాడు. ( ఓ అజ్ఞాత వాసి నీ వివరాలు పంపు!) రెస్టారెంట్ యజమాన్యం దీనిపై భావోద్వేగంగా స్పందిస్తూ.. ‘‘ మానవత్వం లేకుండా జోక్ వేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ స్థానిక చిరు వ్యాపారాన్ని దెబ్బ తీసినందుకు కృతజ్ఞతలు’’ అని మెసేజ్ చేసింది. ఫ్రాంక్ చేసిన వ్యక్తి తిరిగి స్పందిస్తూ.. ‘‘ మూర్ఖుడా.... మీ హోటల్ ఆహారాన్ని ఎవరూ కొనరు. నాకు ఇంటిపనులు చేసిపెట్టే భార్య ఉంది. మీ..... ఆహారం అవసరం లేదు’’ అంటూ రెచ్చిపోయాడు. చివరగా రెస్టారెంట్ యజమాన్యం ‘‘ నీ భార్యను ఆ దేవుడే కాపాడాలి’’ అన్న ఉద్ధేశం వచ్చేలా లాస్ట్ పంచ్ వేసింది. ఈ సంభాషణలకు సంబంధించిన స్ర్కీన్ షాట్లను తీసి రెడ్డిట్‌లో షేర్ చేయగా.. నెటిజన్లు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడి క్రూరత్వానికి కూడా పెనాల్టీ వేయాలని అంటున్నారు. లాస్ట్ పంచ్ విషయంలో రెస్టారెంట్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. -
తలుపు తెరిచి చూసి షాకైంది!
కాన్బెర్రా : ఇంటి ముందు అనుకోని అతిథి ప్రత్యక్షమవటంతో ఓ మహిళ గుండె ఝల్లుమంది. తలుపు దగ్గర 14 అడుగుల కొండచిలువను చూసి షాక్‌కు గురైంది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. వారంరోజుల క్రితం క్వీన్స్‌లాండ్‌కు చెందిన ఓ మహిళ పనిమీద బయటకు వెళుతూ ఇంటి తలుపు తెరిచింది. బయటకు అడుగుపెట్టబోతూ కిందకు చూసింది. అంతే షాక్ తిన్నట్లు అయిపోయింది. అక్కడి నేలపై 14 అడుగుల అల్బినో బర్మీస్ పైథాన్ ఉండటం చూసి ఆమె గుండె ఝల్లుమంది. వెంటనే తలుపు మూసి, పాములను పట్టుకునే సిబ్బందికి సమాచారం అందించింది. ఇంటి దగ్గరకు వచ్చిన వారు పామును బంధించారు. 14 అడుగుల అల్బినో బర్మీస్ పైథాన్ ఈ సందర్భంగా పాములను పట్టుకునే సిబ్బంది ఒకరు మాట్లాడుతూ.. ‘‘ మేము పట్టుకున్న పాములలో ఇదే అతి పెద్దది. దాదాపు 80 కేజీల బరువుంది. ఆరోగ్యంగా కూడా ఉంది. ఈ బర్మీస్ పైథాన్లు ఇక్కడివి కాదు. ఎవరో దాన్ని అక్రమంగా పెంచుకుంటున్నారు. వారెవరో తెలిస్తే జీవితాంతం జైలులో ఉండాల్సి వస్తుంద’ని హెచ్చరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
చావు అంచుల దగ్గరకు తీసుకెళ్లింది...
-
ప్రాణం కోసం పోరు.. విజేత ఎవరంటే?..
మెల్బోర్న్ : ఆ రెండు జీవులు ప్రాణాంతకమైనవే. గొడవ ఎలా మొదలైందో తెలియదు కానీ, రెండిటిని చావు అంచుల దగ్గరకు తీసుకెళ్లింది. ఈ భీకరపోరులో ప్రపంచంలోనే రెండవ ప్రాణాంతకమైన దానికి చావు తప్పలేదు. వివరాల్లోకి వెళితే.. అడిలైడ్‌కు చెందిన ఓ మహిళ గత శుక్రవారం బట్టలు ఆరేయటానికి ఇంటి బ్యాక్యార్డ్కు వెళ్లింది. అక్కడ ఆస్ట్రేలియాలోనే అతి ప్రమాదకరమైన జీవులు రెడ్ బ్యాక్ సాలీడు, బ్రౌన్ స్నేక్ గొడవపడుతూ కనిపించాయి. సాలెగూడులో చిక్కుకున్న పాము అందులోనుంచి తప్పించుకోవటానికి ఎంత గానో ప్రయత్నించింది కానీ, కుదరలేదు. సాలీడు దాన్ని పక్కకు తప్పించుకోకుండా తన జిగురు తీగలను మెడకు చుడుతూ కొరకటం ప్రారంభించింది. పెద్దమొత్తంలో జిగురు తీగలను పాము తలకు చుట్టడంతో అది నోరు తెరవలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో సాలీడు.. పాము మెడను తీవ్రంగా కొరికింది. పెద్ద మొత్తంలో విషం పాము తలలోకి ఎక్కటంతో అది చనిపోయింది. చనిపోయిన పాము... రెడ్ బ్యాక్ సాలీడు రెడ్ బ్యాక్ సాలీడుకు తన జిగురు తీగలు, విషమే బలం. పెద్దపెద్ద పాముల్ని కూడా ఈజీగా చంపేయగలదు. అందుకే ఆస్ట్రేలియాలోని అతి ప్రమాదకరమైన జీవుల్లో ఇది కూడా ఒకటి. ఇక బ్రౌన్ స్నేక్ విషయానికి వస్తే ప్రపంచంలోనే రెండవ అతి ప్రమాదకర పాము. ఆ దేశంలో ఏటా సంభవిస్తున్న పాము కాటు మరణాలల్లో 50 శాతం బ్రౌన్ స్నేక్ వల్లే అవటం గమనార్హం. -
‘బుష్ ఫైర్ బాష్’ వేదిక మారింది!
సిడ్నీ: ఆస్ట్రేలియాను ఇటీవల కుదిపేసిన కార్చిచ్చు బాధితుల సహాయార్థం నిధుల సేకరణ కోసం తలపెట్టిన ఎగ్జిబిషన్ మ్యాచ్ వేదిక, తేదీ మారాయి. ‘బుష్ ఫైర్ బాష్’ పేరుతో పలువురు మాజీ క్రికెటర్లు పాల్గొంటున్న ఈ మ్యాచ్ శనివారానికి బదులుగా ఆదివారం నిర్వహిస్తారు. వేదికను కూడా సిడ్నీ నుంచి మెల్బోర్న్కు మార్చారు. వాతావరణ శాఖ సూచన ప్రకారం శనివారం సిడ్నీలో భారీ వర్షం కురిసే అవకాశం ఉండటమే అందుకు కారణం. మెల్బోర్న్లోని జంక్షన్ ఓవల్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో ఒక్కో జట్టు 10 ఓవర్ల చొప్పున ఆడుతుంది. దీంతో పాటు మహిళల జట్లు ఆడుతున్న రెండు అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు, బిగ్‌బాష్ లీగ్ ఫైనల్ కూడా నిధుల సేకరణలో భాగంగా ఉన్నాయి. ఈ నాలుగు మ్యాచ్‌ల ద్వారా వచ్చిన లాభాలను రెడ్ క్రాస్‌కు అందజేస్తారు. ‘బుష్ ఫైర్ బాష్’లో రెండు జట్లలో ఒకదానికి సచిన్ కోచ్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. మరో టీమ్‌కు ఆసీస్ ప్రస్తుత టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ కోచ్‌గా పని చేస్తాడు. జట్ల వివరాలు: పాంటింగ్ ఎలెవన్: హేడెన్, లాంగర్, పాంటింగ్, విలాని, లారా, లిచ్‌ఫీల్డ్, హాడిన్, బ్రెట్ లీ, వసీం అక్రమ్, క్రిస్టియాన్, ల్యూక్ హాడ్జ్, సచిన్ (కోచ్). గిల్‌క్రిస్ట్ ఎలెవన్: గిల్‌క్రిస్ట్, వాట్సన్, బ్రాడ్ హాడ్జ్, యువరాజ్ సింగ్, బ్లాక్వెల్, సైమండ్స్, కోట్నీ వాల్ష్, సిడిల్, రీవోల్ట్. -
వైరల్ : నీ పాటికి పోతే! మా పరిస్థితి ఏంటి?
-
వైరల్ : నీ పాటికి పోతే! మా పరిస్థితి ఏంటి?
మెల్బోర్న్ : ఈ ఫొటోను చూడగానే మనకేమనిపిస్తుంది! కుక్క కారు నడపటానికి ట్రై చేస్తోందేమో అనిపిస్తుంది కదూ. కానీ, ఆ కుక్క సహాయం కోసం అర్థిస్తోంది. అవును! కారులో తనను, తన ఫ్రెండ్‌ను లాక్ చేసి ఎక్కడికో వెళ్లిపోయిన యాజమానికి వినపడేలా సహాయం కోసం మోత మోగించింది. వివరాల్లోకి వెళితే.. సౌత్ మెల్బోర్న్కు చెందిన షర్ పీ అనే కుక్క తన యాజమానితో కలిసి కారులో ఓ చోటుకి వచ్చింది. అయితే యాజమాని మాత్రం దాన్ని కారులో ఉంచి లాక్ వేసుకుని వెళ్లిపోయాడు. యాజమాని తొందరగా రాకపోవటంతో విసుగు చెందిన షర్ పీకి కోపం వచ్చింది. వెంటనే స్టీరింగ్ మీదకు దూకి హారన్ కొట్టడం ప్రారంభించింది. తన కారు హారన్ విన్న యాజమాని వెంటనే అక్కడకు చేరుకున్నాడు. ‘ ఏంట్రా! ఇలా చేశావేంట్రా!.. ఐదు నిమిషాల లేటుకే హారన్ మోత మోగిస్తున్నావేంటి?’ అని ప్రశ్నిస్తూ డోరు తీశాడు. దీంతో షర్ అతడివైపు ‘నీ పాటికి పోతే! మా పరిస్థితి ఏంటి?’ అన్నట్లు చూసి కిందకు దిగింది! దాంతో పాటు దాని మిత్రుడు కూడా కిందకు దిగాడు. ఆ సమయంలో అటుగా వెళుతున్న ఓ సైక్లిస్టు ఈ దృశ్యాలను తన సెల్ ఫోన్లో బంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచాడు. దీంతో వీడియో కాస్తా వైరల్‌గా మారింది.