భారత-పాక్ జట్ల మధ్య మెల్‌బోర్న్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 23న జరగనున్న టీ20 ప్రపంచకప్ టగ్ ఆఫ్ వార్ ఫైట్ కోసం ఇప్పటి నుంచే సన్నాహకాలు మొదలయ్యాయి. టోర్నీ ఆరంభానికి ఇంకా 8 నెలల సమయం ఉన్నా.. దాయాదుల సమరాన్ని తిలకించేందుకు అభిమానులు ఇప్పటి నుంచే ఎగబడ్డారు. గంటల వ్యవధిలోనే ఆన్‌లైన్‌లో టికెట్లన్నీ కొనుగోలు చేశారు. ఈ మ్యాచ్‌కి ఉన్న డిమాండ్ దృష్ట్యా చాలా వరకు టికెట్లు బ్లాక్‌లో చలామణి అయ్యే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
గతేడాది(2021) జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనూ భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు ఇదే తరహాలో హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. అయితే, ఆ మ్యాచ్ చూసేందుకు భారీగా ఎగబడ్డ భారత అభిమానులకు మాత్రం నిరాశే ఎదురైంది. ఎన్నడూ లేని విధంగా టీమిండియా ఆ మ్యాచ్‌లో పాక్ చేతిలో చిత్తుగా ఓడింది. అనంతరం సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టింది.
ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా వేదికగా జరిగే 2022 ప్రపంచకప్‌లో గతేడాది తరహాలోనే సూపర్ 12 పద్దతిలో లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. గ్రూప్ 1లో ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌తోపాటు మరో రెండు క్వాలిఫైయర్ జట్లు పోటీపడనుండగా.. గ్రూప్ 2లో భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సహా మరో రెండు జట్లు తలపడనున్నాయి. లీగ్ మ్యాచ్‌ల్లో భాగంగా టీమిండియా అక్టోబర్ 23న పాక్‌తో, 30న సౌతాఫ్రికాతో, నవంబర్ 2న బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
చదవండి: కోహ్లి బ్యాటింగ్, ధోని కెప్టెన్సీ స్కిల్స్ కలగలిపితే యశ్ ధుల్..
Comments
Please login to add a commentAdd a comment