tickets booking
-
India vs England test: 18 నుంచి టికెట్ల విక్రయం
సాక్షి, హైదరాబాద్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఈనెల 25 నుంచి 29 వరకు ఉప్పల్ స్టేడియంలో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను ఈనెల 18 నుంచి ఆన్లైన్లో విక్రయిస్తారు. పేటీఎం ఇన్సైడర్ యాప్‌లో, www.insider.in వెబ్సైట్లో రాత్రి 7 గంటల నుంచి టికెట్లు లభిస్తాయని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు ఆదివారం ప్రకటించారు. మిగిలిన టికెట్లను ఈనెల 22 నుంచి ఆఫ్‌లైన్‌లో సికింద్రాబాద్ జింఖానా మైదానంలో విక్రయిస్తామని ఆయన వివరించారు. టికెట్ల ధరలను ఒక్కో రోజుకు రూ. 200, రూ. 499, రూ. 750, రూ. 1250, రూ. 3000 (కార్పొరేట్ బాక్స్ నార్త్), రూ. 4000 (కార్పొరేట్ బాక్స్ సౌత్)గా నిర్ణయించారు. ఐదు రోజుల సీజన్ టికెట్ల ధరలను రూ. 600, రూ. 1500, రూ. 2250, రూ. 3750, రూ. 12000 (కార్పొరేట్ బాక్స్ నార్త్), రూ. 16000 (కార్పొరేట్ బాక్స్ సౌత్)లుగా నిర్ణయించారు. ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేసిన వారు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించి 22వ తేదీ నుంచి జింఖానా మైదానంలో టికెట్లను రీడీమ్ చేసుకోవాలి. -
APSRTC: ఆర్టీసీలో మల్టీ సిటీ టికెటింగ్ సదుపాయం
సాక్షి, అమరావతి: విమాన ప్రయాణాల తరహాలో మల్టీ సిటీ టికెటింగ్ సదుపాయాన్ని ఆర్టీసీ ప్రవేశపెట్టింది. ఒక పట్టణం లేదా నగరం నుంచి మరో పట్టణం, నగరానికి నేరుగా బస్సు సౌకర్యంలేనప్పుడు బ్రేక్ జర్నీ విధానంలో ఆన్లైన్ ద్వారా రిజర్వేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. తిరుపతి నుంచి భద్రాచలం వెళ్లేందుకు నేరుగా బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తిరుపతి నుంచి విజయవాడకు, అక్కడి నుంచి భద్రచలానికి ఒకేసారి రిజర్వేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి చెన్నై, బెంగళూరు వంటి దూరప్రాంతాలకు కూడా బస్ రిజర్వేషన్ చేసుకునే సౌలభ్యం కల్పించారు. బ్రేక్ జర్నీ సమయం కనీసం రెండు గంటల నుంచి గరిష్టంగా 22 గంటల వరకు ఉండవచ్చు. మొదటి దశలో రాష్ట్రంలో 137 పట్టణాలు, నగరాల నుంచి ఈ మల్టీ టికెటింగ్ సదుపాయాన్ని ఆర్టీసీ ప్రవేశపెట్టింది. ఆ తర్వాత దశల్లో మరిన్ని పట్టణాలకు ఈ సౌలభ్యాన్ని విస్తరించనుంది. ఇది కూడా చదవండి: బాబు సర్కారు కుంభకోణాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు -
మరో 10 రోజుల్లో క్రికెట్ పండుగ.. ఆన్లైన్లో టికెట్లు ఇలా బుక్ చేసుకోవచ్చు
ఐపీఎల్-2023 సీజన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో 10 రోజుల్లో క్రికెట్ పండుగ ప్రారంభంకానుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మార్చి 31న జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 16వ ఎడిషన్ ప్రారంభమవుతుంది. మార్చి 31 నుంచి మే 28 వరకు జరిగే ఈ క్రికెట్ సంబరంలో మొత్తం 70 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ప్రతి జట్టు సొంత మైదానాల్లో 7 మ్యాచ్‌లు ఆడనుండటంతో ఈసారి మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందు భారీ సంఖ్యలో అభిమానులు మైదానాలకు తరలిరావచ్చని నిర్వహకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట్లకు భారీగా డిమాండ్ పెరుగనుంది. దీంతో అభిమానులు టికెట్ల కోసం ముందుగానే ఎగబడుతున్నారు. ఈ సీజన్‌కు సంబంధించి ఆన్లైన్లో బుకింగ్ సేవలను పేటీఎమ్ ఇన్సైడర్.ఇన్, బుక్ మై షో, టికెట్జీనీ సంస్థలు అందిస్తున్నాయి. ఆయా ఫ్రాంచైజీల అధికారిక వెబ్సైట్ల ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్ల ధరలు రూ. 500 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది (వెన్యూని బట్టి టికెట్ ధర నిర్ణయించబడుతుంది). వెబ్సైట్ లేదా సంబంధిత యాప్‌ల ద్వారా టికెట్లను కొనుగోలు చేయవచ్చు. బుకింగ్ కన్ఫర్మేషన్ అయిన 72 గంటల తర్వాత టికెట్ హార్ఢ్ కాపీని ఆన్లైన్లోనే పొందవచ్చు. -
TSRTC: బస్ టికెట్‌తో పాటు శ్రీవారి దర్శన టికెట్లు.. భారీ స్పందన..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) బాలాజీ దర్శన్ టికెట్లకు భక్తుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఏడు నెలల్లో 77,200 మంది భక్తులు ఈ టికెట్లను బుక్ చేసుకుని.. క్షేమంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. గత ఏడాది జులైలో 3,109, ఆగస్టులో 12,092, సెప్టెంబర్‌లో 11,586, అక్టోబర్‌లో 14,737, నవంబర్‌లో 14,602, డిసెంబర్లో 6,890, ఈ ఏడాది జనవరిలో 14,182 మంది బస్ టికెట్‌తో పాటు శ్రీవారి శీఘ్ర దర్శన టికెట్లను బుక్ చేసుకున్నారు. తెలంగాణ నుంచి తిరుమల వెళ్లే భక్తుల కోసం గత ఏడాది జులై నుంచి 'బాలాజీ దర్శన్'ను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చింది. తిరుమల వెళ్లేందుకు బస్ టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే శ్రీవారి శీఘ్ర దర్శన టికెట్‌ను బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. అందుకోసం టీటీడీతో టీఎస్ఆర్టీసీ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. "బాలాజీ దర్శన్ టికెట్లకు భక్తుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఈ నెలలో శుభకార్యాలు, పెళ్లిళ్లు ఎక్కువగా ఉన్నాయి. శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని యాజమాన్యం కోరుతోంది. ప్రయాణ టికెట్‌తో పాటు శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్‌ను సంస్థ అందిస్తోంది. ఈ టికెట్ తో ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా ప్రయాణించి వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవచ్చు. బాలాలయ మహా సంప్రోక్షణను టీటీడీ వాయిదా వేసినందున.. ఈ నెల 23 నుంచి మార్చి 1 వరకు బ్లాక్ చేసి ఉన్న శీఘ్ర దర్శన టికెట్లను తిరిగి విడుదల చేయడం జరిగింది. భక్తులు www.tsrtconline.in వెబ్సైట్లో టికెట్లను బుక్ చేసుకోగలరు." అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు. బాలాజీ దర్శన్ టికెట్లను కనీసం వారం రోజుల ముందుగా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. చదవండి: టీచర్ల బదిలీలకు మళ్లీ బ్రేక్ .. బదిలీ జాబితా నిలిపివేత -
తిరుమల వెళ్లే భక్తులకు గమనిక
తిరుమల: సెప్టెంబరు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ సోమవారం ఆన్లైన్లో విడుదల చేయనుంది. మొత్తం 46,470 టికెట్లలో లక్కీ డిప్ సేవా టికెట్లు 8,070 ఉన్నాయి. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన టికెట్లు లక్కీ డిప్లో కేటాయించనుంది. దీని కోసం భక్తులు జూన్ 27 ఉదయం 10 గంటల నుంచి జూన్ 29 ఉదయం 10 గంటల మధ్య ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ఆన్లైన్ లక్కీ డిప్ డ్రా తర్వాత టికెట్ల నిర్థారణ చేస్తారు. కేటాయించిన టికెట్ల జాబితాను జూన్ 29 మధ్యాహ్నం 12 గంటల తర్వాత టీటీడీ వెబ్సైట్లో పొందుపరుస్తారు. భక్తులకు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా కూడా తెలియజేస్తారు. టికెట్లు పొందిన వారు రెండు రోజుల్లోపు దాని ధర చెల్లించాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు జూన్ 29న సాయంత్రం 4 గంటలకు విడుదలవుతాయి. వీటిని ముందుగా వచ్చిన వారికి ముందు అనే ప్రాధాన్యత క్రమంలో కేటాయిస్తారు. ఇది కూడా చదవండి: డల్లాస్‌లో వైభవంగా శ్రీనివాస కల్యాణం -
T20 WC 2022: భారత్-పాక్ మ్యాచ్ అంటే ఇలాగే ఉంటది.. గంటల వ్యవధిలోనే..!
భారత-పాక్ జట్ల మధ్య మెల్బోర్న్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 23న జరగనున్న టీ20 ప్రపంచకప్ టగ్ ఆఫ్ వార్ ఫైట్ కోసం ఇప్పటి నుంచే సన్నాహకాలు మొదలయ్యాయి. టోర్నీ ఆరంభానికి ఇంకా 8 నెలల సమయం ఉన్నా.. దాయాదుల సమరాన్ని తిలకించేందుకు అభిమానులు ఇప్పటి నుంచే ఎగబడ్డారు. గంటల వ్యవధిలోనే ఆన్లైన్లో టికెట్లన్నీ కొనుగోలు చేశారు. ఈ మ్యాచ్‌కి ఉన్న డిమాండ్ దృష్ట్యా చాలా వరకు టికెట్లు బ్లాక్‌లో చలామణి అయ్యే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాది(2021) జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనూ భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు ఇదే తరహాలో హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. అయితే, ఆ మ్యాచ్ చూసేందుకు భారీగా ఎగబడ్డ భారత అభిమానులకు మాత్రం నిరాశే ఎదురైంది. ఎన్నడూ లేని విధంగా టీమిండియా ఆ మ్యాచ్‌లో పాక్ చేతిలో చిత్తుగా ఓడింది. అనంతరం సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా వేదికగా జరిగే 2022 ప్రపంచకప్‌లో గతేడాది తరహాలోనే సూపర్ 12 పద్దతిలో లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. గ్రూప్ 1లో ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌తోపాటు మరో రెండు క్వాలిఫైయర్ జట్లు పోటీపడనుండగా.. గ్రూప్ 2లో భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సహా మరో రెండు జట్లు తలపడనున్నాయి. లీగ్ మ్యాచ్‌ల్లో భాగంగా టీమిండియా అక్టోబర్ 23న పాక్‌తో, 30న సౌతాఫ్రికాతో, నవంబర్ 2న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. చదవండి: కోహ్లి బ్యాటింగ్, ధోని కెప్టెన్సీ స్కిల్స్ కలగలిపితే యశ్ ధుల్.. -
'ఏపీ ప్రభుత్వం ఆలోచన సరైనదే'
‘‘అతి తక్కువ ధరకే ప్రేక్షకులకు వినోదం పంచుతున్నది సినిమా మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌లో ఆన్లైన్లో టిక్కెట్ల అమ్మకం విధానం తీసుకురావాలనే ప్రభుత్వ ఆలోచన సరైనదే. దేశం మొత్తం ఆన్లైన్ టిక్కెట్ విధానం తీసుకురావాలి. అప్పుడే ఎంత వసూళ్లు వస్తున్నాయన్నది నిర్మాతకు తెలుస్తుంది.. ప్రభుత్వానికి కూడా మంచి ఆదాయం వస్తుంది’’ అని నిర్మాత కె. నారాయణ్ దాస్ నారంగ్ అన్నారు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. కె. నారాయణ్ దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో కె. నారాయణ్ దాస్ నారంగ్ మాట్లాడుతూ- ‘‘లాక్డౌన్లో మా ‘లవ్‌స్టోరీ’ సినిమాకి చాలా ఓటీటీ ఆఫర్స్ వచ్చాయి.. అయితే ఇలాంటి సినిమాను థియేటర్లోనే చూడాలని ఇన్ని రోజులు వేచి చూశాం. అన్ని ప్రేమ కథలు ఒక్కటే. అయితే ప్రేక్షకులకు దాన్ని ఎలా చూపించామన్నదే ముఖ్యం. మా ‘లవ్‌స్టోరీ’ సినిమాలో ప్రేమకథతో పాటు ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది’’ అన్నారు. పి. రామ్మోహన్ రావు మాట్లాడుతూ -‘‘1987లో ఎగ్జిబిటర్‌గా నా కెరీర్ మొదలైంది. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్, ఆ తర్వాత నిర్మాతగా మారాను. 15 సినిమాలు నిర్మించాను. వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్లో తొలిసారి ‘లవ్‌స్టోరీ’ సినిమా నిర్మించాం.. మరిన్ని నిర్మిస్తాం. ‘లవ్‌స్టోరీ’ తో శేఖర్ కమ్ముల, మాకు మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. అందుకే ఆయనతో ధనుష్ హీరోగా మరో సినిమా చేస్తున్నాం. ఆ తర్వాత కూడా మరో సినిమా శేఖర్‌తో చేస్తాం. కరోనా వల్లనే ‘లవ్‌స్టోరీ’ సినిమా విడుదల ఆలస్యమైంది. ఆంధ్రప్రదేశ్‌లో టిక్కెట్ల ధరల విషయంలో ఈ నెల 20న జరిగే సమావేశంలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రాలో థియేటర్లకు రాత్రి 10గంటల వరకే పర్మిషన్ ఉంది. ఆ సమయంలోపు రోజుకు నాలుగు ఆటలు వేసేలా ప్రయత్నాలు చేస్తున్నాం. ‘తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ చైర్మన్‌గా నేను ఉన్నప్పుడు తెలంగాణలోనూ ఆన్లైన్లో టిక్కెట్ విక్రయాలు జరిపితే బాగుంటుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను.. ప్రస్తుతం 80శాతం థియేటర్లు ఆన్లైన్లో టిక్కెట్లు విక్రయిస్తున్నాయి. నాగచైతన్యతో మా బాండింగ్ చాలా బాగుంది.. అందుకే ఆయనతో మరో సినిమా చేయనున్నాం. మా బ్యానర్స్‌లో దాదాపు 10 సినిమాలు చేస్తున్నాం. కమల్‌హాసన్‌గారు నారాయణ దాస్‌కి చాలా క్లోజ్.. ధనుష్ సినిమా చర్చల కోసం చెన్నై వెళ్లినప్పుడు కమల్‌గారిని కూడా కలిశాం. ఇప్పటినుంచి వచ్చే ఏడాది ఆఖరు వరకు మేం 10 సినిమాలు రిలీజ్ చేయాలనుకుంటున్నాం. నాగశౌర్య చిత్రాన్ని నవంబర్‌లో, నాగార్జునగారి చిత్రాన్ని ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తాం. ఆ తర్వాత సుధీర్‌బాబు, ధనుష్, శివ కార్తికేయన్ సినిమాలు చేస్తా’’ అన్నారు. -
తిరుమల భక్తులకు శుభవార్త: టికెట్ల కోటా పెంపు
సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పెంచింది. కరోనా రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో మార్చి నుంచి దర్శనాల సంఖ్య గణనీయంగా తగ్గించిన విషయం తెలిసిందే. నాలుగు నెలల పాటు 5 వేల టికెట్లు మాత్రమే టికెట్లు కేటాయిస్తోంది. ఈ క్రమంలోనే ఉచిత దర్శనాలు పూర్తిగా నిలిపివేసింది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గడంతో బుధవారం (జూలై 28) నుంచి రోజుకు 3 వేల చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ జారీ చేస్తోంది. ఈ నెల 28వ తేదీ నుంచి ఆగస్టు 30 వరకు రోజు మూడు వేలు టికెట్లు పెంచడంతో దాదాపు లక్షా పది వేల టికెట్లు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. అయితే బుధవారం ఉదయం 11 గంటలకు అన్లైన్లో విడుదల కావాల్సిన ఈ టికెట్లు సాంకేతిక కారణాలతో ఆగిపోయాయి. సాఫ్ట్‌వేర్‌లో సమస్య తలెత్తడంతో దర్శన టికెట్లు అందుబాటులోకి రాలేదు. టీటీడీ అధికారులు సమస్యను పరిష్కరించారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. -
ప్రయాణికులకు రీఫండ్ వోచర్లు..?
న్యూఢిల్లీ: లాక్డౌన్ సమయంలో ప్రయాణాలకు ముందుగా రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులకు రిఫండ్స్ ఎలా జరగాలన్న అంశంపై తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం రిజర్వ్ చేసుకుంది. బదలాయింపులకు వీలయిన రిఫండ్ వోచర్లు జారీ ద్వారా సమస్యకు సానుకూల పరిష్కారం చూపవచ్చన్న కేంద్రం ప్రతిపాదనను పరిశీలిస్తామని న్యాయమూర్తులు అశోక్ భూషన్, ఆర్ సుభాషన్ రెడ్డి, ఎంఆర్ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. కేంద్ర ప్రతిపాదనలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... లాక్డౌన్ సమయంలో రద్దయిన సర్వీసులకు సంబంధించి ప్రయాణి కులకు డబ్బు వాపసు చేస్తే, ఇప్పటికే తీవ్ర కష్టాల్లో ఉన్న విమానయాన సంస్థలపై ఆర్థికంగా మరింత ప్రతికూల ప్రభావం పడుతుంది. అయితే ఈ సమస్య పరిష్కారానికి ‘బదలాయింపునకు వీలయిన రిఫండ్ వోచర్లను’ ప్రయాణి కులకు జారీ చేస్తే అటు ప్రయాణికులు, ఇటు విమానయాన సంస్థల ప్రయోజనాలకు విఘాతం కలుగదు. వోచర్స్‌ను ప్రయాణికులు టికెట్లు బుక్ చేసిన తమ ఏజెంట్లకు సమర్పించి, డబ్బు వాపసు తీసుకోవచ్చు. లేదా తదుపరి తమ ప్రయాణాల టికెట్ బుకింగ్‌లకు వినియోగించుకోవచ్చు. డబ్బు వాపసు ఇచ్చిన పక్షంలో ఆయా వోచర్లను వేరొకరి ప్రయాణాలకు వినియోగించే సౌలభ్యతను ఏజెంట్లకు కల్పించడం జరుగుతుంది. ఎన్జీఓలు, ప్యాసింజర్ల అసోసియేషన్స్‌సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు రెండు వర్గాల వాదనలు విన్న సంగతి తెలిసిందే. కేంద్రం, డీజీసీఏ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) తరఫున తుషార్ మెహతా చేసిన ‘బదలాయింపులకు వీలయిన రిఫండ్స్ వోచర్ల’ ప్రతిపాదనకు ట్రావెల్ ఏజెంట్ల సంస్థ తరఫున వాదలను వినిపించిన సీనియర్ అడ్వకేట్ పల్లవ్ సిసోడియా సానుకూల స్పందన వ్యక్తం చేయడం శుక్రవారంనాటి మరో కీలకాంశం. ఇండిగో ఎయిర్‌లైన్ తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ కూడా సంబంధిత ప్రతిపాదనకు అంగీకారం తెలిపారు. విదేశీ విమాన సర్వీసులకు వర్తించదు! కాగా వాదనల సమయంలో ‘ప్రవాసీ లీగల్ సెల్’ ఎన్జీఏ సంస్థ తరఫు సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్గే విదేశాల నుంచి టికెట్ బుక్ చేసుకున్న వారికి రిఫండ్ పరిస్థితిని ప్రస్తావించారు. దీనికి అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ, విదేశీ విమాన సర్వీసుల అంశంలోకి వెళ్లలేమని పేర్కొంది. సంబంధిత టికెట్లకు రిఫండ్‌ను భారత్ ప్రభుత్వం ఆదేశించలేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. -
ఏజెంట్లు, ప్రయాణీకులకు రిఫండ్స్ ఎలానో చెప్పండి
న్యూఢిల్లీ: లాక్డౌన్ సమయంలో విమాన ప్రయాణాలకు సంబంధించి ముందుగా బుక్ చేసుకున్న టిక్కెట్ల రద్దు విషయంలో ఏజెంట్లు, ప్రయాణీకులకు రిఫండ్స్ ఎలా జరుపుతారన్న అంశంపై మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉందని అత్యున్నత న్యాయస్థానం బుధవారం కేంద్రానికి స్పష్టం చేసింది. రిఫండ్స్ విధివిధానాలు, ప్రక్రియపై వివరణ ఇస్తూ, ఈ నెల 25వ తేదీలోపు తాజా అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయమూర్తులు అశోక్ భూషన్, ఆర్ సుభాషన్ రెడ్డి, ఎంఆర్ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కేంద్రానికి స్పష్టం చేసింది. ఇప్పటికే దాఖలు చేసిన అఫిడవిట్లో పూర్తి స్పష్టత లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్వయంగా పేర్కొనడం దీనికి నేపథ్యం. అటు పాసింజర్లు, ఇటు విమానయాన సంస్థల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రిఫండ్స్ విషయంలో కేంద్రం తగిన పరిష్కార విధానాన్ని రూపొందించిందని అంతకుముందు విమానయాన, డీజీసీఏల తరఫున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. -
రైల్వే రిజర్వేషన్; తాజా అప్డేట్స్
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రైళ్లకు సంబంధించి ఇటీవల విధించిన నిబంధనలను రైల్వే మంత్రిత్వ శాఖ సవరించించింది. టిక్కెట్ల అడ్వాన్స్ రిజర్వేషన్ గడువును మళ్లీ 120 రోజులకు పెంచింది. అలాగే తత్కాల్ సేవలను పునరుద్ధరించింది. ఇది ఈనెల 31 తేదీ ఉదయం 8 గంటల నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. కరెంట్ బుకింగ్, తత్కాల్ కోటా సీట్ల కేటాయింపులు సాధారణ టైం టేబుళ్ల రైళ్లకు వర్తించే విధంగానే ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపింది. (ప్రయాణికుల ప్రత్యేక రైళ్లు ఇవే) కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా కొనసాగిస్తున్న లాక్‌డౌన్‌తో దాదాపు రెండు నెలలు ప్రయాణికుల రైళ్లను నిలిపివేశారు. ఈ నెల 12 నుంచి 30 ప్రత్యేక రాజధాని రైళ్లను నడుపుతున్నారు. జూన్ 1 నుంచి మరో 200 ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ 230 రైళ్లకు అడ్వాన్స్ రిజర్వేషన్ గడువును అంతకుముందు 30 రోజులకు పరిమితం చేయగా, తాజాగా ఈ నిబంధనను సవరించి 120 రోజులకు పెంచారు. అలాగే పార్సిల్, లగేజీ బుకింగ్‌కు కూడా అనుమతి పునరుద్ధరించారు. (కోవిడ్ టెన్షన్; గంటకో మరణం!) విశాఖలో ఇలా.. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో రైలు ఎక్కడానికి వచ్చేవారు 8వ నంబరు ప్లాట్‌ఫాంకు రావాల్సి ఉంటుంది. 1వ నంబరు ప్లాట్‌ఫాం నుంచి మాత్రమే బయటకు వెళ్లడానికి అనుమతిస్తారు. విశాఖ-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలు జూన్ 1న వైజాగ్ నుంచి బయలుదేరుతుంది. న్యూఢిల్లీ-విశాఖ ఏపీ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలు జూన్ 3 నుంచి పట్టాలెక్కుతుంది. హైదరాబాద్- విశాఖ గోదావరి ఎక్స్‌ప్రెస్ జూన్ 1 నుంచి రాకపోకలు సాగించనుంది. విశాఖ- హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్ జూన్ 2 నుంచి పునఃప్రారంభమవుతుంది. రైలు బయలుదేరే సమయానికి 2 గంటలు ముందగానే ప్రయాణికులు రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలని రైల్వే శాఖ సూచించింది. ఆహార ఏర్పాట్లు ప్రయాణికులే చూసుకోవాలని తెలిపింది. (కార్మికుల రైలు బండికి ‘టైం టేబుల్’ లేదట!) -
భారత్ నుంచి చైనీయులు ఖాళీ!
న్యూఢిల్లీ/ బీజింగ్: కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో భారత్‌లో ఉంటున్న చైనీయులందరినీ ఖాళీ చేసి స్వదేశానికి తరలించాలని పొరుగుదేశం నిర్ణయించింది. కరోనా కాలంలో భారత్‌లో ఉన్న విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు కష్టాలు ఎదుర్కొంటున్నారని స్వదేశానికి వెళ్లాలని అనుకునేవారు ప్రత్యేక విమానాల్లో టికెట్లు బుక్ చేసుకోవాలని చైనా అధికార వెబ్సైట్లో సోమవారం ఒక ప్రకటన వెలువడింది. స్వదేశానికి వెశ్లాలని నిర్ణయించుకున్న వారందరూ అక్కడ క్వారంటైన్, ఇతర వైద్యపరమైన ఏర్పాట్లకు అంగీకరించాలని ఈ నోటీసులో స్పష్టం చేశారు. విమానం ఎక్కేలోపు శరీర ఉష్ణోగ్రత 37.3 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువైనా, ఇతర లక్షణాలేవైనా ఉన్న వారికి అనుమతి నిరాకరిస్తామని నోటీసులో స్పష్టం చేశారు. మాండరిన్ భాషలో ఉన్న ఆ ప్రకటన ప్రకారం కరోనా వైరస్‌కు చికిత్స పొందిన వారు లేదా గత 14 రోజుల్లో జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉన్న వారికి ప్రత్యేక విమానాల్లో చోటు లేదు. భారత్‌తోపాటు ఇతర దేశాల్లో ఉండిపోయిన చైనీయులను కూడా ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఈ ప్రకటనలో సూచనప్రాయంగా తెలిపారు. భారత్ –చైనాల మధ్య లదాఖ్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో చైనీయులందరినీ ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతూండటం గమనార్హం. చైనాలో 51 కేసుల గుర్తింపు వూహాన్లో తాజాగా 51 కరోనా కేసులను గుర్తించామని, ఇందులో 40 కేసుల్లో లక్షణాలేవీ కనిపించలేదని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఆదివారం విదేశాల నుంచి తిరిగి వచ్చిన చైనీయులు 11 మందిలో వైరస్ గుర్తించామని చెప్పారు. స్థానికంగా వ్యాప్తి చెందిన కేసులు ఆదివారం ఏవీ నమోదు కాలేదని చెప్పారు. లక్షణాలేవీ కనిపించని 40 కేసుల్లో 38 వూహాన్ ప్రాంతానికి చెందినవని, ఆ నగరంలోని మొత్తం కోటీ 12 లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. -
శబరిమల దర్శనానికి 550మంది మహిళలు
తిరువనంతపురం: ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న శబరిమల యాత్రకు ఆన్లైన్లో 550 మంది రుతుస్రావ వయసు అమ్మాయిలు, మహిళలు టికెట్లు బుక్ చేసుకున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్ తెలిపింది. కాగా, శుక్రవారం నాటికి దాదాపు 3.50 లక్షల మంది భక్తులు దర్శనానికి బుక్ చేసుకున్నట్లు తెలిపింది. గత రెండు నెలలుగా శబరిమల పరిసరాల్లో ఆందోళనకరమైన పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. మహిళలు శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించవచ్చని సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా.. ఇప్పటి వరకు ఒక్క మహిళను రానివ్వకుండా ఆందోళనకారులు, ఆలయాధికారులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. -
వింత: సీట్లు లేవంటూ.. ఫ్లైట్ నుంచి దించేశారు!
సాక్షి, న్యూఢిల్లీ : బస్సులు, రైళ్లల్లో సీటు లేక బెర్త్ రిజర్వేషన్ చేయించుకోకపోతే దూరపు ప్రయాణం చేసేవారికి కష్టం. కొన్నిసార్లు సీట్లు లేవన్న కారణంగా కొన్ని ప్రత్యేక బస్సు సర్వీసుల్లో ప్రయాణికులను ఎక్కించుకోరు. కానీ విమానంలో మాత్రం వింత ఘటన చోటుచేసుకుంది. సీట్లు లేవు మీరు దిగిపోండి అంటూ ఎయిర్ ఇండియా సిబ్బంది కొందరు ప్రయాణికులను నిర్దాక్షిణ్యంగా విమానం నుంచి దింపేశారు. ఆ వివరాలిలా.. ఢిల్లీ నుంచి రాజ్‌కోట్‌కు ఇక్కడి ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఎయిర్ ఇండియా విమానం ఏఐ-495 బయలుదేరాల్సి ఉంది. అయితే చెకింగ్ పూర్తయ్యాక ప్రయాణీకులు ఎయిర్ ఇండియా ఎక్కారు. సీట్ల మోతాదుకు మించి ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించిన సిబ్బంది వారిని విమానం నుంచి కిందకి దించారు. పొరపాటున 10 శాతం సీట్లు అదనంగా బుక్ అయ్యాయని, ఆ ప్రయాణీకులను తర్వాత విమానంలో తరలించినట్లు ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి వివరణ ఇచ్చుకున్నారు. ఎయిర్ ఇండియా తప్పిదం చేస్తే తమను విమానం నుంచి దింపి వేయడం ఏంటని ప్రయాణీకులు నిలదీయగా యాజమాన్యం ఈ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. బస్సులు, రైళ్లల్లోనే కాదు విమానాల్లోనూ ప్రయాణీకులను సీట్లు లేవని దింపి వేస్తారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
విమాన టిక్కెట్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్
దేశీయ బడ్జెట్ ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో బంపర్ ఆఫర్ ప్రకటించింది. సిటీ బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను వాడుతూ ఎవరైతే విమాన టిక్కెట్లను బుక్ చేసుకుంటారో వారికి రూ.1500 క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని ఇండిగో మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. 2018 ఏప్రిల్ 18 నుంచి 2018 ఏప్రిల్ 21 మధ్యలో టిక్కెట్లను బుక్ చేసుకునే వారు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొంది. అయితే ఈ ఆఫర్ పొందాలంటే కనీస లావాదేవీ రూ.7500 ఉండాలి. అంతేకాక ఇండిగో యాప్ లేదా వెబ్సైట్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకునే వారు మాత్రమే ఈ ఆఫర్‌ను పొందవచ్చని ఎయిర్‌లైన్స్ తెలిపింది. అయితే కార్డుల ద్వారా నిర్వహించే మొట్టమొదటి చెల్లుబాటు లావాదేవీ మాత్రమే ఈ ఆఫర్ కింద ప్రయోజనాలకు అర్హత సాధిస్తుంది. టిక్కెట్ బుక్ చేసిన 90 రోజుల్లో కస్టమర్ల కార్డుకు ఈ క్యాష్ బ్యాక్ అందుతుంది. ఈ ఆఫర్‌ను, క్యాష్‌బ్యాక్‌ను ట్రాన్సఫర్ చేయడానికి, ఎక్స్చేంజ్ చేయడానికి కుదరదని ఇండిగో పేర్కొంది. ఈ ఆఫర్లో పాల్గొనే కస్టమర్లు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏమన్నా దెబ్బతింటే ఇండిగో బాధ్యత వహించదని కూడా తెలిపింది. ఈ ఆఫర్‌ను మరే ఇతర ఆఫర్ లేదా ప్రమోషన్‌కు కలుపబోమని ఇండిగో వెల్లడించింది. ముందస్తు ప్రకటన లేకుండానే ఆ ఆఫర్‌ను ఇండిగో, సిటీ బ్యాంకు ఏ సమయంలోనైనా సవరించడం లేదా ఆపివేయడం జరుగవచ్చని, ఈ ఆఫర్‌పై ఉన్న అన్ని ఫిర్యాదులను, సమస్యలను సిటీ బ్యాంకుతో సంప్రదించి పరిష్కరించుకోవాలని, ఇండిగో దీనికి బాధ్యత వహించదని కూడా చెప్పింది. -
పండక్కి ప్రయాణమెలా?
సాక్షి, అమరావతి: సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఆర్టీసీ గట్టి షాక్ ఇచ్చింది. ప్రత్యేక బస్సుల పేరుతో 50 శాతం అదనంగా వసూలు చేస్తోంది. ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ కూడా దోపిడీకి తెరతీశాయి. గతంలో ఆన్లైన్లో ఆర్టీసీ టికెట్లు రిజర్వేషన్ చేసుకు నేందుకు మూడు నెలల గడువు ఉండేది. అంటే ప్రయాణానికి తొంబై రోజులకు ముందుగా టికెట్లు రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఆర్టీసీ ఈ గడువును 30 రోజులకు కుదించింది. దీంతో సంక్రాంతి పండుగ సీజన్లో ప్రయాణి కులకు టిక్కెట్ల రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులో లేకుండా పోయింది. టికెట్ రిజర్వేషన్ ఫ్రాంచైజీని ఆర్టీసీ యాజమాన్యం నాలుగు కంపెనీలకు అప్పగించింది. రెడ్‌బస్, అభీబస్, పేటీఎమ్, ఐబిబో కంపెనీలు టికెట్ రిజర్వేషన్ ప్రాంఛైజీలు పొందాయి. ప్రాంఛైజీల కోసమే ఆర్టీసీ రిజర్వేషన్ల గడువును కుదించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీకి సొంతంగా ఆన్లైన్ రిజర్వేషన్ వ్యవస్థ ఉన్నప్పటికీ ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం గమనార్హం. ఆర్టీసీ రిజర్వేషన్లకు నెల గడువు విధించినట్లు యాజమాన్యం పేర్కొంటున్నా.. టిక్కెట్లు అందుబాటులో లేకపోవడం గమనార్హం. అంటే పండక్కి ముందు డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు టిక్కెట్లను ముందుగానే బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. జనవరి 11వ తేదీ తర్వాత ప్రయాణానికి ఆర్టీసీ టిక్కెట్లు అందుబాటులో లేకుండా పోయాయి. మరో దారిలేక ప్రైవేట్ బస్సులను ఆశ్రయిద్దామంటే టిక్కెట్ల ధరలు షాక్ కొడుతున్నాయి. జేబులకు చిల్లు పడేలా పండగ సీజన్లో టిక్కెట్టు ధర రూ.3 వేలకు పైగా ఉంది. రైళ్లదీ అదే పరిస్థితి రైళ్లలో టిక్కెట్ల రిజర్వేషన్లు సైతం గగనంగా మారాయి. రైళ్లలో 120 రోజులు ముందుగా రిజర్వేషన్ చేసుకునేందుకు వీలుంది. అయితే ప్రధాన రైళ్లలో చాంతాండంత వెయిటింగ్ లిస్టులు దర్శనమిస్తున్నాయి. విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్ వెళ్లే ముఖ్య రైళ్లలో ఇప్పటికే ‘నో రూమ్’ కనిపిస్తోంది. పైగా దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికీ ప్రత్యేక రైళ్లను ప్రకటించలేదు. ప్రైవేటు ట్రావెల్స్ దందా ఆర్టీసీలో అధిక చార్జీలను సాకుగా చూపి ప్రైవేటు ట్రావెల్స్ కూడా ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నాయి. నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. కాంట్రాక్టు క్యారియర్లుగా అనుమతులు తీసుకుని స్టేజీ క్యారియర్లుగా తిప్పుతున్నా రవాణా శాఖ అటువైపు కన్నెత్తి చూడడం లేదు. విజయవాడ నుంచి విశాఖపట్నం టిక్కెట్టు ధర రూ.3 వేలకు పైగా చెబుతున్నారంటే ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. టిక్కెట్ల ధరలను కట్టడి చేయాల్సిన రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం మానేశారు. ‘ప్రత్యేక’ దోపిడీకి రెడీ ఆర్టీసీ కూడా పండుగ సీజన్లో ప్రత్యేక చార్జీల పేరుతో దోపిడీకి రంగం సిద్ధం చేసింది. సాధారణంగా విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే అమరావతి ఏసీ సర్వీసుకు చార్జీ రూ.808. అదే ప్రత్యేక బస్సుకు 50 శాతం అధికంగా వసూలు చేస్తారు. అంటే రూ.1,200కు పైగా చెల్లించాలన్నమాట! ప్రైవేటు బస్సుల్లో విజయవాడ–విశాఖపట్నం రూటుకు జనవరి 11న టిక్కెట్ ధర రూ.1,550–రూ.1,800, జనవరి 12న రూ.3 వేలు, జనవరి 13న రూ.3,500 వరకు ఉండడం గమనార్హం. విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య దూరం 337 కిలోమీటర్లు. అంటే కిలోమీటర్‌కు రూ.10కి పైగానే దండుకుంటున్నారు. ప్రత్యేక బస్సుల పేరిట ఆర్టీసీ అధికంగా వసూలు చేస్తుండగా, తాము డిమాండ్‌ను బట్టి ఎక్కువ తీసుకుంటే తప్పేంటని ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. సంక్రాంతి సీజన్‌కు 2,135 ప్రత్యేక బస్సులు సంక్రాంతి పండుగ సీజన్లో జనవరి 9 నుంచి ప్రతి రోజూ 2,135 ప్రత్యేక బస్సులను విజయవాడ నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి, ఇతర ప్రాంతాలకు నడుపుతున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అధికంగా చార్జీలు వసూలు చేస్తామని స్పష్టం చేసింది. టిక్కెట్లు బ్లాక్ చేశారు ‘‘ప్రైవేటు బస్సులో ప్రయాణం కంటే ఆర్టీసీ బస్సు సురక్షితమని ఆన్లైన్లో టిక్కెట్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నించా. కానీ, పండుగ సీజన్లో టిక్కెట్లు బ్లాక్ చేసినట్లు కనిపిస్తోంది. ప్రైవేటు బస్సుల్లో టిక్కెట్టు ధరలు దారుణంగా ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు’’ – శ్రీధర్, విజయవాడ ప్రతి పండక్కీ ఇదే ఆనవాయితీ ‘‘దసరా, దీపావళి, సంక్రాంతి ఏ పండుగకైనా ఇటు ఆర్టీసీ, అటు ప్రైవేటు ఆపరేటర్ల తీరు మారడం లేదు. ఆర్టీసీ టిక్కెట్లను ముందుగానే బ్లాక్ చేయడం వల్ల నానా ఇబ్బందులు పడుతున్నాం. నెల గడువు అని అధికారులు చెబుతున్నా.. నెలకు ముందు రోజు కూడా రిజర్వేషన్ దొరకడం లేదు’’ – కిరణ్మయి, సాఫ్ట్వేర్ ఉద్యోగిని ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అధిక చార్జీలు ‘‘ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపితే కచ్చితంగా 50 శాతం అధిక చార్జీలు వసూలు చేస్తాం. ఎందుకంటే తిరుగు ప్రయాణంలో బస్సులు ఖాళీగా రావాల్సి ఉంటుంది. రిజర్వేషన్ గతంలో 90 రోజులకు ఆన్లైన్లో బుక్ చేసుకునే వీలుండేది. ఇప్పుడు 30 రోజులకే పరిమితం చేశాం’’ – జయరావు, ఆర్టీసీ ఈడీ -
రైల్వే టిక్కెట్ల బుకింగ్‌కు కొత్త యాప్
రైల్వే టిక్కెట్ల బుకింగ్‌ను ప్రయాణికులు మరింత వేగవంతంగా పూర్తి చేసుకోవడానికి వీలుగా ఐఆర్సీటీసీ కొత్త టిక్కెటింగ్ యాప్‌ను త్వరలోనే లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతమున్న టిక్కెట్ బుకింగ్ యాప్‌కు మరిన్ని కొత్త ఫీచర్లను కలుపుతూ ఈ యాప్‌ను ఐఆర్సీటీసీ ఆవిష్కరించనుంది. లేటెస్ట్ టెక్నాలజీతో ఈ యాప్‌ను రూపొందిస్తున్నామని, మరింత వేగవంతంగా, సులభతరంగా ఐఆర్సీటీసీ ద్వారా ఇక టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని రైల్వే మంత్రిత్వశాఖ అధికారులు చెబుతున్నారు. ఆన్లైన్ ట్రైన్ టిక్కెట్ బుకింగ్ కోసం ఐఆర్సీటీసీ అధికారికంగా ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌ను వచ్చే వారంలో ప్రారంభించనుందని పేర్కొన్నారు. ప్రయాణికుల డిమాండ్ పెరుగుతుండటంతో ఆ యాప్‌ను రైల్వే లాంచ్ చేయనుంది. తర్వాత తరం ఈ-టిక్కెటింగ్ సిస్టమ్ ఆధారంతో దీన్ని తీసుకొస్తున్నారు. రైల్వే టిక్కెట్లను సెర్చ్ చేసుకోవడానికి, బుక్ చేసుకోవడానికి ఈ యాప్ ప్రయాణికులకు ఉపయోగపడనుంది. టిక్కెట్లను క్యాన్సిల్ చేసుకునే సదుపాయాన్ని ప్రయాణికులకు ఈ యాప్ ద్వారా ఐఆర్సీటీసీ కల్పించనుంది. ఈ కొత్త అప్లికేషన్ ద్వారా తర్వాత చేయబోయే ప్రయాణ అలర్ట్‌లను పొందవచ్చు.