భారత్‌ నుంచి చైనీయులు ఖాళీ! | China To Repatriate Its Citizens From India As Coronavirus | Sakshi
Sakshi News home page

భారత్‌ నుంచి చైనీయులు ఖాళీ!

Published Tue, May 26 2020 4:42 AM | Last Updated on Tue, May 26 2020 4:57 AM

China To Repatriate Its Citizens From India As Coronavirus - Sakshi

న్యూఢిల్లీ/ బీజింగ్‌: కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో భారత్‌లో ఉంటున్న చైనీయులందరినీ ఖాళీ చేసి స్వదేశానికి తరలించాలని పొరుగుదేశం నిర్ణయించింది. కరోనా కాలంలో భారత్‌లో ఉన్న విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు కష్టాలు ఎదుర్కొంటున్నారని స్వదేశానికి వెళ్లాలని అనుకునేవారు ప్రత్యేక విమానాల్లో టికెట్లు బుక్‌ చేసుకోవాలని చైనా అధికార వెబ్‌సైట్‌లో సోమవారం ఒక ప్రకటన వెలువడింది. స్వదేశానికి వెశ్లాలని నిర్ణయించుకున్న వారందరూ అక్కడ క్వారంటైన్, ఇతర వైద్యపరమైన ఏర్పాట్లకు అంగీకరించాలని ఈ నోటీసులో స్పష్టం చేశారు.

విమానం ఎక్కేలోపు శరీర ఉష్ణోగ్రత 37.3 డిగ్రీ సెల్సియస్‌ కంటే ఎక్కువైనా, ఇతర లక్షణాలేవైనా ఉన్న వారికి అనుమతి నిరాకరిస్తామని నోటీసులో స్పష్టం చేశారు. మాండరిన్‌ భాషలో ఉన్న ఆ ప్రకటన ప్రకారం కరోనా వైరస్‌కు చికిత్స పొందిన వారు లేదా గత 14 రోజుల్లో జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉన్న వారికి ప్రత్యేక విమానాల్లో చోటు లేదు. భారత్‌తోపాటు ఇతర దేశాల్లో ఉండిపోయిన చైనీయులను కూడా ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఈ ప్రకటనలో సూచనప్రాయంగా తెలిపారు. భారత్‌ –చైనాల మధ్య లదాఖ్‌ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో చైనీయులందరినీ ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతూండటం గమనార్హం.   

చైనాలో 51 కేసుల గుర్తింపు
వూహాన్‌లో తాజాగా 51 కరోనా కేసులను గుర్తించామని, ఇందులో 40 కేసుల్లో లక్షణాలేవీ కనిపించలేదని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఆదివారం విదేశాల నుంచి తిరిగి వచ్చిన చైనీయులు 11 మందిలో వైరస్‌ గుర్తించామని చెప్పారు. స్థానికంగా వ్యాప్తి చెందిన కేసులు ఆదివారం ఏవీ నమోదు కాలేదని చెప్పారు. లక్షణాలేవీ కనిపించని 40 కేసుల్లో 38 వూహాన్‌ ప్రాంతానికి చెందినవని, ఆ నగరంలోని మొత్తం కోటీ 12 లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement