Special flights
-
కాసేపట్లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు తెలుగు విద్యార్థులు
-
హైదరాబాద్ నుంచి విద్యార్థుల స్వస్థలాలకు చేర్చేందుకు స్పెషల్ బస్సులు
-
2 ప్రత్యేక విమానాల్లో విద్యార్థులను తరలిస్తున్న ఏపీ ప్రభుత్వం
-
మరో 674 మంది స్వదేశానికి..
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో చిక్కుకున్న భారత వైద్య విద్యార్థులను ‘ఆపరేషన్ గంగ’లో భాగంగా అధికారులు శుక్రవారం స్వదేశానికి తరలించారు. సుమీ నుంచి పోలండ్‌కు చేరుకున్న 674 మందిని మూడు ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి తీసుకొచ్చారు. మొదట ఎయిర్ ఇండియా విమానం 240 మంది విద్యార్థులతో ఉదయం 5.45 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. 221 మందితో ఇండిగో విమానం మధ్యాహ్నం 12.20 గంటలకు ఢిల్లీకి చేరింది. భారత వైమానికి దళానికి(ఐఏఎఫ్) చెందిన మూడో విమానం 213 మంది విద్యార్థులతో మధ్యాహ్నం 12.15 గంటలకు ఢిల్లీలోని హిండాన్ ఎయిర్‌బేస్‌కు చేరుకుంది. సి–17 సైనిక రవాణా విమానంలో విద్యార్థులను ఢిల్లీకి చేర్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాణాలతో బయటపడడం ఒక అద్భుతమే రష్యా సైనిక దాడులతో దద్దరిల్లుతున్న సుమీ నగరం నుంచి క్షేమంగా బయటపడడం నిజంగా ఒక అద్భుతమేనని భారత వైద్య విద్యార్థులు చెప్పారు. ‘ఆపరేషన్ గంగ’లో భాగంగా వారు ప్రత్యేక విమానాల్లో శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో భావోద్వేగపూరిత దృశ్యాలు కనిపించాయి. సుమీ నుంచి వచ్చిన విద్యార్థులు తమ తల్లిదండ్రులను, బంధువులను ఆలింగనం చేసుకొని, కన్నీరు పెట్టుకున్నారు. తల్లిదండ్రులు తమ బిడ్డల మెడలో పూలమాలలు వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భారత్ మాతాకీ జై అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. ఎయిర్‌పోర్టులో తన తల్లిదండ్రులను కళ్లారా చూడడం చాలా ఆనందంగా ఉందని ధీరజ్ కుమార్ అనే విద్యార్థి తెలిపాడు. యుద్ధభూమి నుంచి తాము ప్రాణాలతో స్వదేశానికి తిరిగిరావడం ఒక భయానక అనుభవమేనని పేర్కొన్నాడు. మార్గమధ్యంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని చెప్పాడు. సుమీలో సైరన్లు వినిపించినప్పుడల్లా వెంటనే బంకర్లకు చేరుకొనేవాళ్లమని ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన వైద్య విద్యార్థిని మహిమా వెల్లడించింది. భారత్‌కు తిరిగి వస్తామో లేదోనన్న భయాందోళన ఉండేదని తెలిపింది. స్వదేశానికి వచ్చిన తర్వాత ప్రాణాలు తిరిగొచ్చినట్లుగా ఉందని, ఇప్పుడే హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నామని పేర్కొంది. సహకరించిన దేశాలకు ఎస్.జైశంకర్ కృతజ్ఞతలు ఉక్రెయిన్ నుంచి తమ విద్యార్థుల తరలింపునకు సహకరించిన ఉక్రెయిన్, రష్యా ప్రభుత్వాలకు, రెడ్ క్రాస్‌కు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా సుమీ నగరం నుంచి విద్యార్థుల తరలింపు ప్రక్రియ పెనుసవాలు విసిరిందని శుక్రవారం ట్విట్టర్లో వెల్లడించారు. ‘ఆపరేషన్ గంగ’లో భాగంగా భారత విద్యార్థులను క్షేమంగా వెనక్కితీసుకురావడంలో ఉక్రెయిన్ పొరుగు దేశాలైన రొమేనియా, హంగేరి, పోలండ్, స్లొవేకియా, మాల్డోవా ఎంతగానో సహకరించాయని, ఆయా దేశాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. ఉక్రెయిన్ నుంచి ఇప్పటిదాకా దాదాపు 18,000 మంది భారతీయులను కేంద్రం స్వదేశానికి తీసుకొచ్చింది. -
ఉక్రెయిన్ నుంచి భారత్ చేరుకున్న విమానం.. ఫ్లైట్‌లో స్మృతిఇరానీ ఏం చేశారంటే..?
సాక్షి, న్యూఢిల్లీ: రష్యా సైనిక దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో భయానక వాతావరణం నెలకొంది. ఇప్పటికే వేల సంఖ్యలో సైనికులు, పౌరులు మృతి చెందారు. దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి భారతీయులను ఆపరేషన్ గంగాతో స్వదేశానికి తరలిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది భారత విద్యార్థులు, పౌరులు స్వదేశానికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా బుధవారం ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి వచ్చిన భారత పౌరులకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతిఇరానీ స్వాగతం పలికారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో మంత్రి స్మృతిఇరానీ.. నాలుగు భాషాల్లో విద్యార్థులకు ఘన స్వాగతం పలికారు. విద్యార్థులు క్షేమంగా స్వదేశానికి తిరిగి రావడం పట్ల ఆనందంగా ఉందన్నారు. ఈ క్రమంలోనే ఎయిర్‌లైన్స్ సిబ్బంది చేసిన సేవలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్‌లోని పరిస్థితులను భారతీయులు ఎంతో ధైర్యంతో ఎదుర్కొన్నారని ప్రశంసించారు. India welcomes back her children. #OperationGanga pic.twitter.com/GN9134IMed — Smriti Z Irani (@smritiirani) March 2, 2022 -
భారతీయ విద్యార్థులూ.. భయం వద్దు
కీవ్: రెండు రోజులైంది. తినడానికి తిండి లేదు, నిద్ర లేదు. తాగడానికి మంచినీరు కూడా దొరకడం లేదు. ప్రాణభయంతో బేస్మెంట్లలో తలదాచుకోవాల్సిన దుస్థితి. బాంబులతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. రష్యా సేనలు పౌర నివాస ప్రాంతాలపైన కూడా బాంబుల వర్షం కురిపిస్తూ ఉండడంతో ఎటువైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రాణాలర చేతుల్లో పెట్టుకొని ఉన్నారు. దేశం కాని దేశంలో యుద్ధ భయంతో భీతిల్లుతున్న తమ కన్న బిడ్డలకి ఎలాంటి ముప్పు వస్తుందో తెలీక భారత్‌లో ఉన్న తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు. రెండు రోజులుగా తిండి, నిద్ర లేకుండా గడుపుతున్న విద్యార్థుల్ని క్షేమంగా వెనక్కి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. రెండు ప్రత్యేక విమానాల్ని రుమేనియా రాజధాని బుకారెస్ట్‌కు పంపించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి బుకారెస్ట్కి చేరుకోగలిగే విద్యార్థుల్ని వెనక్కి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా విదేశాంగ శాఖ అ«ధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. విద్యార్థుల్ని వెనక్కి తీసుకురావడానికయ్యే ఖర్చులన్నీ కేంద్రమే భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల్ని బుకారెస్ట్ తీసుకురావడానికి కీవ్‌లో భారత రాయబార కార్యాలయం వారికి సహకారం అందిస్తుంది. రుమేనియా, హంగేరి నుంచి వారిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తోంది. రుమేనియా, హంగేరి సరిహద్దు ప్రాంతాలైన చాప్ జహోని, చెర్నివిట్సికి సమీపంలో సిరెత్ సరిహద్దుల్లో నివసించే భారతీయులు ఒక క్రమ పద్ధతిలో చెక్ పాయింట్ల దగ్గరకు చేరుకోవాలని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. భారతీయులందరూ ధైర్యంగా, అప్రమత్తంగా ఉండాలని హితవు పలికింది. పాస్‌పోర్టు, కోవిడ్–19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్తో పాటు అత్యంత అవసరమైన సామాన్లు మాత్రమే వెంట తీసుకురావాలని సూచించింది. ఉక్రెయిన్‌లో ప్రస్తుతం 16 వేల మంది భారతీయులు చిక్కుకొని ఉంటే వారిలో అత్యధికులు విద్యార్థులే. 8 కి.మీ. నడుచుకుంటూ 40 మంది భారతీయ వైద్య విద్యార్థులు నడుచుకుంటూ పోలండ్ సరిహద్దులకు చేరుకున్నారు. లివివ్ మెడికల్ కాలేజీలో చదువుకుంటున్న వారంతా 8కి.మీ.కు పైగా నడుచుకుంటూ సురక్షిత ప్రాంతాలకు వచ్చారు. ఉక్రెయిన్ ఇరుగు పొరుగు దేశాల నుంచి విద్యార్థుల్ని వెనక్కి తీసుకురావడానికి కేంద్రం ఏర్పాట్లు చేస్తూ ఉండడంతో వీరంతా ప్రాణాలు దక్కించుకోవడానికి నడుచుకుంటూ వచ్చారు. -
భారత్ నుంచి చైనీయులు ఖాళీ!
న్యూఢిల్లీ/ బీజింగ్: కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో భారత్‌లో ఉంటున్న చైనీయులందరినీ ఖాళీ చేసి స్వదేశానికి తరలించాలని పొరుగుదేశం నిర్ణయించింది. కరోనా కాలంలో భారత్‌లో ఉన్న విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు కష్టాలు ఎదుర్కొంటున్నారని స్వదేశానికి వెళ్లాలని అనుకునేవారు ప్రత్యేక విమానాల్లో టికెట్లు బుక్ చేసుకోవాలని చైనా అధికార వెబ్సైట్లో సోమవారం ఒక ప్రకటన వెలువడింది. స్వదేశానికి వెశ్లాలని నిర్ణయించుకున్న వారందరూ అక్కడ క్వారంటైన్, ఇతర వైద్యపరమైన ఏర్పాట్లకు అంగీకరించాలని ఈ నోటీసులో స్పష్టం చేశారు. విమానం ఎక్కేలోపు శరీర ఉష్ణోగ్రత 37.3 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువైనా, ఇతర లక్షణాలేవైనా ఉన్న వారికి అనుమతి నిరాకరిస్తామని నోటీసులో స్పష్టం చేశారు. మాండరిన్ భాషలో ఉన్న ఆ ప్రకటన ప్రకారం కరోనా వైరస్‌కు చికిత్స పొందిన వారు లేదా గత 14 రోజుల్లో జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉన్న వారికి ప్రత్యేక విమానాల్లో చోటు లేదు. భారత్‌తోపాటు ఇతర దేశాల్లో ఉండిపోయిన చైనీయులను కూడా ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఈ ప్రకటనలో సూచనప్రాయంగా తెలిపారు. భారత్ –చైనాల మధ్య లదాఖ్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో చైనీయులందరినీ ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతూండటం గమనార్హం. చైనాలో 51 కేసుల గుర్తింపు వూహాన్లో తాజాగా 51 కరోనా కేసులను గుర్తించామని, ఇందులో 40 కేసుల్లో లక్షణాలేవీ కనిపించలేదని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఆదివారం విదేశాల నుంచి తిరిగి వచ్చిన చైనీయులు 11 మందిలో వైరస్ గుర్తించామని చెప్పారు. స్థానికంగా వ్యాప్తి చెందిన కేసులు ఆదివారం ఏవీ నమోదు కాలేదని చెప్పారు. లక్షణాలేవీ కనిపించని 40 కేసుల్లో 38 వూహాన్ ప్రాంతానికి చెందినవని, ఆ నగరంలోని మొత్తం కోటీ 12 లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. -
గన్నవరం చేరిన తొలి విమానం
సాక్షి, అమరావతి/గన్నవరం: విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రెండో దశ ‘వందే భారత్ మిషన్’లో భాగంగా గన్నవరం విమానాశ్రయానికి బుధవారం తొలి విమానం వచ్చింది. లండన్ నుంచి ముంబైకి చేరుకున్న 143 మంది ప్రవాసాంధ్రులను.. అక్కడి నుంచి ఎయిరిండియా విమానంలో ఉదయం 8.15 గంటలకు గన్నవరం తీసుకొచ్చారు. వీరిలో పదేళ్లలోపు పిల్లలు ముగ్గురు, ఏడాదిలోపు చిన్నారులు ఇద్దరు ఉన్నారు. ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి.. ► విమానం నుంచి ప్రయాణికులు దిగిన వెంటనే అత్యంత భద్రత మధ్య ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. ► అనంతరం ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి.. జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల వద్ద ప్రయాణికుల వివరాలు నమోదు చేసుకున్నారు. ► ఆ తరువాత ఆర్టీసీ లగ్జరీ బస్సుల్లో ప్రయాణికులను వారి జిల్లాల్లోని ప్రభుత్వ, పెయిడ్ క్వారంటైన్ సెంటర్లకు తరలించారు. ► ప్రతి బస్సుకు రెవెన్యూ శాఖకు చెందిన ప్రత్యేక అధికారిని నియమించి పోలీస్ ఎస్కార్ట్ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. ► ప్రవాసాంధ్రులు ఎయిర్ పోర్టుకు చేరుకున్న నేపథ్యంలో ఎయిర్ పోర్ట్ విధుల్లో ఉన్న వివిధ శాఖల అధికారులు, భద్రత దళాలు, ఎయిర్‌లైన్స్, వైద్య సిబ్బంది పీపీఈ సూట్స్ ధరించారు. సీఎం కృషి ఫలితంగానే.. విదేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసాంధ్రులను రాష్ట్రానికి తీసుకురావడంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించారు. సీఎం కృషి ఫలితంగా వందే భారత్ మిషన్ ఫేజ్–2లో ప్రవాసాంధ్రుల కోసం వైజాగ్, విజయవాడ, తిరుపతి ఎయిర్ పోర్టులకు 13 విమానాలు కేటాయించారు. 4వ ఫేజ్‌లో మరిన్ని విమానాలు ఏపీకి రానున్నాయి. త్వరలో గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన ఏపీకి చెందిన కార్మికులను తీసుకువచ్చేందుకు ఉచిత విమానాలను నడిపే యోచన ఉంది. విదేశాల నుంచి ఏపీకి వచ్చేందుకు సుమారు 4 వేల మంది ప్రవాసాంధ్రులు ఇప్పటికే ఏపీ ఎన్ఆర్టీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. – వెంకట్ ఎస్.మేడపాటి, అధ్యక్షుడు, ఏపీ ఎన్ఆర్టీ అధ్యక్షుడు. ప్రత్యేక కౌంటర్లు సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కీలక శాఖల అధికారులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అంతర్జాతీయ టెర్మినల్‌లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి ఇమ్మిగ్రేషన్, మెడికల్ టెస్టులు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసుకునేందుకు అవకాశం కల్పించాం. – జి.మధుసూదనరావు, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ అప్పుడే వస్తామనుకోలేదు.. విజిటింగ్ వీసా ద్వారా నవంబర్ 19న లండన్‌లోని కుమారుడి వద్దకు వెళ్లాను. తిరిగి వద్దామనుకున్న సమయంలో లాక్డౌన్ వల్ల విమాన సర్వీసులు నిలిచిపోవడంతో అక్కడే చిక్కుకుపోయాం. ఇక్కడికి ఎప్పుడు తిరిగి వస్తామో తెలియని పరిస్థితుల్లో తీవ్రంగా ఆందోళన చెందా. అయితే ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉంది. – వి.సరస్వతి, ఏలూరు మరిన్ని విమానాలు నడపాలి యూకేలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో మార్చిలోనే ఏపీకి తిరిగి వద్దామనుకున్నాం. విమాన సర్వీసులు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నాం. వందే భారత్ మిషన్ ఫేజ్–2లో ముంబై మీదుగా విజయవాడకు సర్వీసులు ఏర్పాటు చేయడంతో ఎట్టకేలకు సొంతగడ్డకు చేరుకున్నాం. లండన్‌లో ఏపీకి చెందిన వారి కోసం మరిన్ని సర్వీసులు నడిపితే బాగుంటుంది. – చిత్తూరు జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రుడు అరబ్ ఎమిరేట్స్ నుంచి విశాఖకు 463 మంది రాక క్వారంటైన్‌కు తరలించిన అధికారులు అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చిన వారి లగేజీలను సైతం హైపో క్లోరైట్‌తో శుభ్రం చేస్తున్న ఎయిర్‌పోర్టు సిబ్బంది ఎన్ఏడీ జంక్షన్ (విశాఖ): ‘వందే భారత్ మిషన్’ కార్యక్రమం కింద అరబ్ దేశమైన ఖతర్ నుంచి ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలకు చెందిన 463 మంది ప్రత్యేక విమానాల్లో విశాఖ చేరుకున్నారు. దోహా విమానాశ్రయం నుంచి బుధవారం రాత్రి 149 మంది విశాఖ రాగా.. వీరిలో అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు, కర్నూలు 8, కడప 9, తూర్పు గోదావరి 13, పశ్చిమ గోదావరి 6, గుంటూరు 1, కృష్ణా 5, నెల్లూరు 5, ప్రకాశం 4, శ్రీకాకుళం 19, విజయనగరం 11, విశాఖపట్నానికి చెందిన 48 మంది ఉన్నారు. వీరితోపాటు కేరళ, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన మరో 20 మంది కూడా విశాఖ చేరుకున్నారు. వీరందరినీ ప్రత్యేక బస్సుల్లో క్వారంటైన్లకు తరలించారు. ఇదిలావుండగా.. మంగళవారం రాత్రి బాగా పొద్దుపోయాక రెండు విమానాల్లో 314 మంది అరబ్ దేశాల నుంచి విశాఖ చేరుకున్నారు. వీరి కోసం విశాఖ విమానాశ్రయంలో ఎయిర్‌పోర్టు డైరెక్టర్ రాజకిషోర్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జాయింట్ కలెక్టర్ వేణుగోపాలరెడ్డి సమీక్షించారు. -
గన్నవరానికి మూడు ప్రత్యేక విమానాలు
గన్నవరం: లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రెండో విడత ‘‘వందే భారత్ మిషన్’’లో భాగంగా ఈ నెల 20 నుండి 27 వరకు మూడు ప్రత్యేక విమానాలు గన్నవరం ఎయిర్‌పోర్టుకు రానున్నాయి. ఎయిరిండి యాకు చెందిన తొలి విమానం (ఏఐ 1913) సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఉన్న కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ నెల 20న బయల్దేరి రాత్రి 10.15 గంటలకు ఇక్కడికి చేరుకుంటుంది. ఇదే విమానం (ఏఐ 1914) అర్ధరాత్రి 12 గంటలకు ఇక్కడి నుండి హైదరాబాద్ వెళ్తుంది. ఈ నెల 23న ఎయిరిండియాకు చెందిన మరో విమానం (ఏఐ 1920) సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఉన్న కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరి రాత్రి 10.15 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటుంది. అదే విమానం రాత్రి 11 గంటలకు ఇక్కడి నుంచి హైదరాబాద్ బయల్దేరుతుంది. వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రవాసాంధ్రులను తీసుకుని న్యూఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానం (ఏఐ 1200) ఈ నెల 27న ఉదయం 11.30 గంటలకు గన్నవరం చేరుకుంటుందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ఎయిర్‌పోర్టులోని అంతర్జాతీయ టెర్మినల్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రయాణికులు ఇక్కడికి చేరుకోగానే వైద్య పరీక్షలు, థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులు ద్వారా ప్రయాణికుల ఎంపిక మేరకు ప్రభుత్వ, పెయిడ్ క్వారంటైన్ సెంటర్లకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
యూకే నుంచి హైదరాబాద్‌కి 328 మంది
సాక్షి, హైదారాబాద్: ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి బారిన చిక్కుకున్నవిపత్కర సమయంలో ‘వందే భారత్’ మిషన్ కింద విదేశాల్లో చిక్కుకు పోయిన భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చే ప్రక్రియ జరుగుతోంది. దీనిలో భాగంగా నేడు(మంగళవారం) తెల్లవారుజామున యూకే నుంచి ఢిల్లీ మీదుగా ఒక విమానం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. యూకేలో చిక్కుకుపోయిన 328 మంది భారతీయులతో తెల్లవారు జామున 2.21 గంటల సమయంలో ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఇదే విమానం తిరిగి తెలంగాణలో చిక్కుకుపోయిన 87 మంది అమెరికా జాతీయులను తీసుకుని ఉదయం 5.31 గంటల సమయంలో ఢిల్లీకి తిరిగి వెళ్లింది. అమెరికా జాతీయులను తిరిగి ఢిల్లీ నుంచి మరో విమానం ద్వారా అమెరికాకు పంపుతారు. (మలేషియాలో మనోళ్ల ఆకలి కేకలు) యూకే నుంచి వచ్చిన భారతీయులు, అమెరికా వెళ్లే ప్రయాణికుల కోసం విమానాశ్రయంలో ఎయిరో బ్రిడ్జి నుంచి అరైవల్స్ ర్యాంప్ వరకు పూర్తిగా శానిటైజ్, ఫ్యూమిగేషన్ చేశారు. దీంతో పాటు విమానాశ్రయంలోని వాష్ రూంలు, కుర్చీలు, కౌంటర్లు, ట్రాలీలు, రెయిలింగులు, లిఫ్టులు, ఎస్కలేటర్లు మొదలైనవాటిని కూడా శానిజైట్ చేశారు. ఎయిరో బ్రిడ్జి నుంచి బయటికి వచ్చేంత వరకు ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది సామాజిక దూరాన్ని పాటించారు. ఇక విమానాశ్రయంలోకి ప్రయాణికులను 20-25 మందితో ఒక బృందంగా చేసి తీసుకువచ్చారు. ఇమిగ్రేషన్ నిబంధనలకు పూర్తి చేయడానికి ముందు ఎయిర్పోర్ట్ హెల్త్ అధికారులు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శాకల ప్రకారం ప్రతి ప్రయాణికుడికి థర్మల్ కెమెరాల ద్వారా స్క్రీనింగ్ నిర్వహించారు. (కరోనా ఫ్రీగా కరీంనగర్) స్క్రీనింగ్ అనంతరం, సీఐఎస్ఎఫ్ సిబ్బంది వారిని ఇమిగ్రేషన్ క్లియరెన్స్ కోసం తీసుకువెళ్లారు. ప్రయాణికులు, ఇమిగ్రేషన్ సిబ్బంది మధ్య ఎడబాటు ఉండేందుకు ఇమిగ్రేషన్ కౌంటర్ల వద్ద గ్లాస్ షీల్డులను ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటర్ వద్ద సామాజిక దూరం నిబంధనలు పాటించారు. ఎయిరిండియా గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బంది, ఎయిర్ పోర్ట్ సిబ్బంది ప్రయాణికులు సామాజిక దూరం నిబంధనలు పాటించడంలో సహకరించారు. బ్యాగేజ్ బెల్టుతో అనుసంధానించిన డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్ ద్వారా ప్రయాణికుల బ్యాగేజీని శానిటైజ్ చేశారు. కస్టమ్స్ క్లియరెన్స్ పూర్తైన అనంతరం టెర్మినల్ బిల్డింగ్ నుంచి బయటికి వెళ్లడానికి పంపిస్తూ ప్రయాణికులకు కాంప్లిమెంటరీ ఆహార పొట్లాలను అందించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రయాణికులను నగరంలో ముందుగా గుర్తించిన ప్రదేశాలకు 14 రోజుల తప్పనిసరి క్వారంటైన్‌కు తరలించారు. ప్రయాణికులు తరలివెళ్లిన అనంతరం ఎయిర్‌పోర్ట్‌ను మరొకసారి పూర్తిగా శానిటైజ్, ఫ్యూమిగేట్, డిస్ఇన్ఫెక్ట్ చేశారు. తరలింపు విమానాలు ఇప్పటివరకు నాలుగు వందే భారత్ తరలింపు విమానాలు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చి వెళ్లాయి. వీటి ద్వారా కువైట్, యూఏఈ, అమెరికా, యూకేలో చిక్కుకుపోయిన సుమారు 750 మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చారు. ఇలా తీసుకువచ్చిన భారతీయులందరినీ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా క్వారంటైన్ చేశారు. ఇప్పటివరకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 12 ఎవాక్యుయేషన్ ఫ్లయిట్స్ ద్వారా అమెరికా, యూకే, జర్మనీ, కెన్యా, జర్మనీ జాతీయులను వారి స్వదేశాలకు పంపించారు. -
హైదరాబాద్‌కు చేరుకున్న‘వందేభారత్’ ఫ్లైట్
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు చేపట్టిన వందేభారత్ మిషన్ ప్రత్యేక విమానాల్లో భాగంగా రెండో విమానం అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నుంచి బయల్దేరి సోమవారం నగరానికి చేరుకుంది. ఉదయం 9.22 గంటలకు తెలుగురాష్ట్రాలకు చెందిన 118 మంది ప్రయాణికులతో ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ (ఏఐ 1617) హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. కాగా, అబుదాబి(యూఏఈ) నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్(ఏఐ1920) రాత్రి హైదరాబాద్ విమానాశ్రయం చేరుకుంది. 170 మంది ప్రయాణికులు నగరానికి చేరుకున్నారు. ప్రయాణికులతో పాటు వైమానిక సిబ్బంది కోసం విమానాశ్రయంలో ఎయిరోబ్రిడ్జి నుంచి అరైవల్స్ ర్యాంప్ వరకు శానిటైజ్, కెమికల్ ఫ్యూమిగేషన్ చేశారు. విమానాశ్రయం లోని వాష్ రూంలు, కుర్చీలు, కౌంటర్లు, ట్రాలీలు, రెయిలింగులు, లిఫ్టులు, ఎస్కలేటర్లన్నింటినీ శానిటైజ్ చేశారు. ఎయిరోబ్రిడ్జి నుంచి బయటికి వచ్చే వరకు ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది భౌతిక దూరా న్ని పాటించారు. 20 నుంచి 25 మందిని ఒక బృందంగా ఏర్పా టు చేసి తీసుకొచ్చారు. ఇమిగ్రేషన్ నిబంధనలకు ముందు ఎయిర్ పోర్ట్ హెల్త్ అధికారులు ప్రతి ప్రయాణికుడికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. బ్యాగే జ్ బెల్టుతో అనుసంధానించిన డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్ ద్వారా ప్ర యాణికుల బ్యాగేజీని శానిటైజ్ చేశారు. కస్టమ్స్ క్లియరెన్స్ పూర్త యి, టెర్మినల్ బిల్డింగ్ నుంచి బయటికి వెళ్లడానికి ముందు, ప్రయాణికులకు కాంప్లిమెంటరీ ఆహార పొట్లాలను అందించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రయాణికులను నగరంలోని నోవాటెల్, షెహరటాన్, వైష్ణవి తదితర హోటళ్లల్లో ఏర్పాటు చేసిన పెయిడ్ క్వారంటైన్లకు బస్సుల్లో తరలించినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. 14 రోజుల పాటు వారు ఈ క్వారంటైన్‌లోనే ఉండవలసి ఉంటుంది. విజయవాడకు పంపించండి అమెరికా నుంచి నగరానికి వచ్చిన వారిలో ఏపీకి చెందిన 16 మంది ప్రయాణికులను సైతం ఇక్కడే హోటళ్లలో ఏర్పాటు చేసిన పెయిడ్ క్వారంటైన్లకు తరలించడం పట్ల పలువురు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమను ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక బస్సులో విజయవాడకు పంపించి ఉంటే బాగుండేదని, లాక్డౌన్ కారణంగా చాలా రోజులుగా అమెరికాలో చిక్కుకుపోయామని, ఇక్కడికి వచ్చిన తరువాత కూడా ఇంటికి చేరుకోలేకపోవడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో తమను క్వారంటైన్ కేంద్రానికి పంపించినా బాగుండేదన్నారు. మరోవైపు పలు హోటళ్లలో అధిక చార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వ్యక్తమయ్యాయి. -
మేఘాలను మథిస్తారా?
కర్ణాటక, హుబ్లీ: రాష్ట్రంలో, ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలోని తీవ్ర వర్షాభావం నెలకొంది. కృష్ణమ్మ ఉప్పొంగుతున్నా, చినుకులేక రైతన్న కుంగిపోతున్నాడు. ఈ తరుణంలో కృత్రిమ వర్షాల కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందుకోసం ఒక చిన్న విమానం హుబ్లీ విమానాశ్రయానికి వచ్చి చేరింది. రాష్ట్ర ప్రభుత్వం వర్షధారె పథకానికి ఒకటి, రెండు రోజుల్లో శ్రీకారం చుట్టనుంది. జూన్‌లో వర్షాలు కురవని సమయంలో మేఘ మథనం కోసం విమానం వచ్చి ఉంటే బాగుండేది. అయితే ప్రస్తుతం వర్షాలు ఓ మోస్తరుగా కురుస్తున్న వేళ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారా? అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. గత ఏడాది కూడా వర్షాలు పడుతున్నప్పుడు హుబ్లీ విమానాశ్రయం కేంద్రంగా మేఘమథనాన్ని ప్రారంభించారు. గత కుమారస్వామి ప్రభుత్వ హయాంలో గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ రూ.45 కోట్ల వ్యయంతో వర్షధారె పేరిట మేఘమథనాన్ని నిర్వహించింది. బీదర్‌ను కాదని హుబ్లీ నుంచి.. బీదర్‌లో వాయుసేన విమానాశ్రయం ఉంది. మేఘమథనం కార్యాచరణను అక్కడి నుంచే నిర్వహించడం సులభమే అయితే హుబ్లీ విమానాశ్రయాన్ని ఎంపిక చేసుకోవడంపై అనుమానాలు తలెత్తాయి. సురపురలో రాడార్ కేంద్రం ఉంది. ఆ ప్రాంతంలో అక్కడి నుంచే సిగ్నల్ పొందడానికి బదులుగా గదగ్ సమీపంలోని హులకోటి కేంద్రం నుంచి సిగ్నల్‌ను పొందాలని యోచించారు. ఇక్కడి నుంచి విమానం యాదగిరి ప్రాంతానికి వెళ్లేలోపు మేఘాలు మాయమైపోతే ఎలాగనే ప్రశ్నలున్నాయి. ఖ్యాతి సంస్థ చైర్మన్ ప్రకాశ్ కోళివాడ కాంగ్రెస్ ప్రముఖ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ రాణిబెన్నూరుకు చెందిన కేబీ కోళివాడ పుత్రుడు కావడంతో ఆయనకే ఆగమేఘాలపై కాంట్రాక్టు కట్టబెట్టినట్లు విమర్శలున్నాయి. రూ.45 కోట్ల లెక్కను తేల్చేవారెవరు? ఎంత మేర సిల్వర్ అయోడైడ్ వాడారు, ఎంత ప్రమాణంలో వర్షం వచ్చింది అన్న దానిపై కాంట్రాక్టర్లు, ప్రభుత్వ అధికారులు చెప్పిందే లెక్క. వర్షధారె పథకానికి రూ.45 కోట్లను కేటాయించారు. వరుణుడు కరుణించకపోయినా ఈసారి పూర్తిగా రూ.45 కోట్లను కృత్రిమ వర్షాలకు ఖర్చుపెట్టడం ఖాయమన్న విమర్శలు వినబడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కృత్రిమ వర్షాల ఫలితాలపై చాలా అనుమానాలు తలెత్తాయి. రాడార్ గుర్తిస్తుంది, విమానం వెళ్తుంది రాడార్ కేంద్రంలో ఆర్డీపీఆర్, ఐఐఎం, ఐఐటీ శాస్త్రవేత్తలు, నిపుణుల బృందం మేఘాల అధ్యయనం చేస్తారు. రాడార్ సుమారు 200 కిలోమీటర్ల వరకు గల మేఘాలను అధ్యయనం చేస్తుంది. తేమ శాతం గల ఫలవంతమైన మేఘాలను గుర్తించి పైలెట్లకు సూచిస్తుంది. పైలెట్లు విమానం ద్వారా ఆ మేఘాలపై సిల్వర్ అయోడైడ్ ద్రావణంను చల్లుతారు. అప్పుడు మేఘాలు ద్రవరూపం దాల్చి వర్షం కురుస్తుంది. నిపుణులు వర్షనమూనాలను పరిశీలించి ఈ వర్షం సిల్వర్ అయోడైడ్ వల్లనే కురిసిందా, లేదా అనేది నివేదిక ఇస్తారు. అమెరికా నుంచి విమానాల రాక ఖ్యాతి క్లైమేట్ మాడిఫికేషన్ కంపెనీకి మేఘమథనం బాధ్యతలను అప్పగించారు. ఆ మేరకు అమెరికా నుంచి రెండు ప్రత్యేక విమానాలు వచ్చాయి. జూలై 25న మైసూరులో కృత్రిమ వర్షాలకు శ్రీకారం చుట్టారు. కాగా హుబ్లీ విమానాశ్రయానికి ఓ ప్రత్యేక విమానం వచ్చింది. బెంగళూరు, గదగ్, సురపురలలో మూడు రాడార్ కేంద్రాలున్నాయి. గదగ్ రాడార్ కేంద్రం శాస్త్రవేత్తల మార్గదర్శనం ప్రకారం పైలెట్లు ఉత్తర కర్ణాటకలోని విజయపుర, బాగల్కోటె, రాయచూరు, యాదగిరి, బీదర్, కొప్పళ, ధార్వాడ, గదగ్, హావేరి తదితర జిల్లాల పరిధిలో మేఘమథనం జరుగుతుందని వర్షధారె పథకం నోడల్ ఆఫీసర్ డాక్టర్ చిదానందమూర్తి తెలిపారు. హైదరాబాద్ కర్ణాటక జిల్లాల్లో వర్షపాతం తగ్గింది. రాయచూరు, కలబుర్గి, యాదగిరి జిల్లాల్లో కొన్ని చోట్ల సరైన వర్షాలు లేనేలేవు. -
దావోస్‌లో ఏపీ లాంజ్ ఖర్చు రూ.17 కోట్లు
సాక్షి, అమరావతి: ‘‘నా ప్రతిభను ప్రపంచ దేశాలు గుర్తించాయి. అందుకే దేశంలో ఏ ముఖ్యమంత్రినీ పిలవని విధంగా కేవలం నన్ను మాత్రమే వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సమావేశాలకు పిలుస్తారు’’... ఇవీ చంద్రబాబు నాయుడు తరచూ చెప్పే మాటలు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని, డబ్ల్యూఈఎఫ్ సదస్సులకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబును ప్రత్యేకంగా ఎప్పుడూ పిలవలేదని, ఆయనే రూ.కోట్లు ఖర్చు పెట్టి టిక్కెట్లు కొనుక్కొని వెళ్లినట్లు సాక్ష్యాలతో సహా బయటపడింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(సీఐఐ) ద్వారా దావోస్‌లో రూ.కోట్లు పెట్టి లాంజ్‌లను కొనుగోలు చేసి ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వానికి సీఐఐ సమర్పించిన బిల్లులే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. దావోస్‌లో లాంజ్‌ను కొనుగోలు చేయడానికి ఎంత మొత్తం చెల్లించాలో ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుకు(ఏపీఈడీబీ) రాసిన లేఖలో సీఐఐ వివరంగా పేర్కొంది. ఆ మొత్తాన్ని చెల్లించమని కోరింది. రూ.కోట్లు పెట్టి కొనుగోలు చేసిన లాంజ్ల్లో సీఐఐ ద్వారా సమావేశాలు నిర్వహించి, తనను చూసి పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారంటూ చంద్రబాబు ప్రచారం చేసుకునేవారు. 2019 జనవరిలో జరిగిన దావోస్ సమావేశాలకు అయిన ఖర్చు రూ.14.41 కోట్లు చెల్లించాలంటూ సీఐఐ బిల్లు సమర్పించింది. దీనిపై 18 శాతం జీఎస్టీ, ఇతర సుంకాలను కలిపితే ఈ మొత్తం రూ.17 కోట్లు దాటుతోంది. ఇందులో కేవలం ఏపీ లాంజ్ అద్దె రూ.2.48 కోట్లు. ఆ లాంజ్‌ను కంప్యూటర్లు, సోఫాలతో అందంగా తీర్చిదిద్దినందుకు రూ.2.51కోట్లు, నాలుగు రోజుల భోజనాలకు రూ.1.05 కోట్లు బిల్లు వేసింది. విచిత్రం ఏమిటంటే ఎల్ఈడీ తెరకు ఏకంగా రూ.1.45 కోట్ల బిల్లు వేశారు. 2018 సమావేశాలకు కూడా సీఐఐ రూ.9.86 కోట్ల బిల్లును సమర్పించింది. ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించారు. ప్రత్యేక విమానాలు,బస ఖర్చులు అదనం ఇవి కేవలం దావోస్‌లో లాంజ్ ఏర్పాటు, అక్కడి సమావేశాలకు అయిన ఖర్చు మాత్రమే. ఇది కాకుండా చంద్రబాబు తన మందీ మార్బలంతో వెళ్లిన ప్రత్యేక విమానాలు, బస వంటి ఖర్చులు కలుపుకుంటే ఈ వ్యయం రెండింతలవుతుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి చంద్రబాబు ఏటా క్రమం తప్పకుండా దావోస్ సమావేశాలకు హాజరై, రూ.వేల కోట్ల పెట్టుబడులు, భారీగా పరిశ్రమలు వస్తున్నాయంటూ ప్రచారం చేశారు. కానీ ఇందులో ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. సీఐఐ దావోస్ బిల్లు కాపీ -
చంద్రబాబు ప్రత్యేక విమానాలకు మరో రూ.10.36 కోట్లు
-
చంద్రబాబు ప్రత్యేక విమానాలకు మరో రూ.10.36 కోట్లు
సాక్షి, అమరావతి: ప్రత్యేక విమానాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణాల కోసం ఓటాన్ అకౌంట్ నాలుగు నెలల బడ్జెట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ.10.36 కోట్లు విడుదల చేసింది. దేశంలో ఏ రాష్ట్రానికైనా లేదా రాష్ట్రంలోని ఏ జిల్లాకైనా చంద్రబాబు ప్రత్యేక విమానం, హెలికాప్టర్లోనే వెళ్తున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారిగా సింగపూర్ పర్యటనకు వెళ్లారు. సింగపూర్‌కు కూడా ప్రత్యేక విమానంలో వెళ్లిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు రికార్డు సృష్టించారు. ఇతర దేశాలకు ఎప్పుడు వెళ్లినా ప్రత్యేక విమానాలే వాడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీకి రెగ్యులర్ విమానాలున్నప్పటికీ గత ఐదేళ్లుగా ప్రత్యేక విమానంలోనే ప్రయాణాలు చేశారు. అధికార పర్యటనలైనా, పార్టీ పర్యటనలైనా ప్రత్యేక విమానాల్లోనే చంద్రబాబు వెళ్తూ వచ్చారు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం రెవెన్యూ లోటు భారీగా ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు రెగ్యులర్ విమానాలున్న నగరాలకు కూడా ప్రత్యేక విమానాల్లో వెళ్లడాన్ని అధికారులు తప్పుపట్టారు. అయినా ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు. ఎన్నికల ముందు ధర్మపోరాట దీక్షల పేరుతో పలు జిల్లాలకు వెళ్లారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల మధ్య ఉండాల్సిన గీతను చెరిపేశారు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. చంద్రబాబు ఉపయోగించే ప్రత్యేక విమానం, హెలికాప్టర్‌కు గన్నవరం విమానాశ్రయంలో ప్రత్యేకంగా పార్కింగ్ కేటాయించారు. ఈ పార్కింగ్ చార్జీలను ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంది. అలాగే పైలెట్, ఇతర సిబ్బందికి స్టార్ హోటళ్లలో బసకు అయ్యే చార్జీలను కూడా ప్రభుత్వమే భరించాల్సి ఉంది. గత ఐదేళ్లగా చంద్రబాబు ప్రత్యేక విమానాల కోసం ఖజానా నుంచి ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు పెట్టారు. బాబు గారి ప్రత్యేక విమాన చార్జీలను చెల్లించేందుకు నాలుగు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు మరో రూ.10.36 కోట్లు విడుదల చేస్తూ మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. -
ఎన్నికల వేళ హెలికాప్టర్లు, విమానాలకు భలే గిరాకీ
గతంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు రాజకీయ నాయకులు కార్లు, బస్సులు వాడేవారు. ఊళ్లలో అయితే ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల వంటిని ఉపయోగించేవారు. ఇప్పుడంతా స్పీడ్.. తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో ప్రచారం చేయాలి. దాంతో ప్రచారానికి హెలికాప్టర్లు, చిన్న విమానాలు వాడుతున్నారు. వీటి వల్ల ఖర్చు ఎక్కువైనా తక్కువ టైమ్‌లో ఎక్కువ ప్రాంతాలను చుట్టేయొచ్చు. రోడ్డు సౌకర్యం లేని శివారు ప్రాంతాలకు కూడా వెళ్లి ప్రచారం చేయొచ్చు. ఈ ఉద్దేశంతోనే ప్రధాన పార్టీల నేతలంతా అందుబాటులో ఉన్న హెలికాప్టర్లు, చిన్న విమానాలను బుక్ చేసేసుకున్నారు.మే మూడో వారం వరకు.. దేశంలో ప్రస్తుతం 250 వరకు రిజిస్టరయిన హెలికాప్ట ర్లు ఉన్నాయని రోటరీ వింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా పశ్చిమ విభాగం అధ్యక్షుడు కెప్టెన్ ఉదయ్ గెల్లి చెబు తున్నారు. వీటిలో హెలికాప్టర్ కంపెనీల దగ్గర 75 వరకు ఉన్నాయి. అవన్నీ ముందుగానే బుక్ అయిపోయాయి. చిన్నపాటి విమానాల్లో ఒక ఇంజిన్, రెండు ఇంజిన్లు, అంతకంటే ఎక్కువ ఇంజిన్లు ఉన్నవి ఉన్నాయి. పైలట్‌తో పాటు ఆరుగురు ప్రయాణించే కింగ్ఎయిర్ సీ90, ఇద్దరు పైలట్లు, 8 మంది ప్రయాణించగల కింగ్ ఎయిర్ బీ200 వంటి విమానాలు దేశంలో డజను వరకు ఉన్నాయని ముంబైకి చెందిన విమానయాన నిపుణుడు ప్రదీప్ చెప్పారు. వీటికిప్పుడు డిమాండు బాగా ఉందని, మే మూడో వారం వరకు ఇవన్నీ ముందే బుక్ అయిపోయాయని చెప్పారు. గంటల్లో కాంట్రాక్టు.. లక్షల్లో అద్దె దేశంలో అందుబాటులో ఉన్న హెలికాప్టర్లు, చిన్న విమానాల్లో 50 శాతం బీజేపీయే బుక్ చేసుకున్నట్టు తెలుస్తోంది. చాలా పార్టీలు 45–60 రోజుల కోసం వీటిని అద్దెకు తీసుకున్నాయని గెల్లి చెప్పారు. రకాన్ని బట్టి వీటి అద్దె గంటకు 75 వేల నుంచి మూడున్నర లక్షల వరకు ఉంటుంది. వీటిని రోజూ కనీసం 3 గంటల పాటు బుక్ చేసుకోవాలి. అన్ని గం టలు తిరిగినా తిరగకున్నా అద్దె మాత్రం చెల్లించాలి. గరిష్టంగా అరగంటలో ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఎన్నికల సంఘం నిబంధనలు హెలికాప్టర్లు, విమానాలను ఎన్నికల ప్రచారానికి వాడే విషయంలో ఎన్నికల సంఘం కొన్ని నిబంధన లు పెట్టింది. ప్రధాని మినహా మిగతా వారెవరూ ప్రభుత్వ హెలికాప్టర్/ విమానాలను వాడరా దు. హెలికాప్టర్ల అద్దె, రాకపోకల లెక్కలు పక్కా ఉండాలి. -
కుంభమేళాకు ఎయిర్ఇండియా ప్రత్యేక సర్వీసులు
-
దుబారాకు లోటులేదు..!
సాక్షి, అమరావతి: సాధారణంగా ఎవరి ఇంట్లోనైనా ఆదాయం తక్కువ.. ఖర్చులు ఎక్కువగా ఉంటే ఏం చేస్తారు.. అనవసర ఖర్చులను తగ్గించుకుంటారు.. వీలుంటే కొన్నింటిని వాయిదా వేసుకుంటారు. కానీ.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం అందుకు విరుద్ధం. రాష్ట్రం భారీ రెవెన్యూ లోటులో ఉన్నా సరే దుబారాతో ఖజానాకు తూట్లు పొడుస్తున్నారు. ఏటేటా రెగ్యులర్ విమానాలను కాదని ప్రత్యేక విమానాల్లో పర్యటనలు, అర్భాటాలు, ప్రచార ఈవెంట్లు, ధర్మపోరాటాలకు భారీగా వ్యయం చేస్తున్నారు. నాలుగేళ్లలో చంద్రబాబు ఆర్భాటపు దుబారాకు అయిన మొత్తం రూ.2,620.76 కోట్లకు పెరిగిపోయిందంటే అనవసర ఖర్చులు ఏ రేంజ్లో ఉన్నాయో అర్ధమవుతుంది. వీటివల్ల నాలుగేళ్లలో రాష్ట్రానికి ఎలాంటి శాశ్వత వసతి కానీ, ఆస్తిగానీ సమకూరలేదు. పైగా.. ఏమీ చేయకుండా చేస్తున్నట్లు విస్తృత ప్రచారం చేసుకుంటూ.. రాష్ట్ర ఖజానాను విచ్చలవిడిగా వాడేసుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబేనని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా రియల్ టైమ్ గుడ్ గవర్నెన్స్ అంటూ.. పరిష్కార వేదిక 1100 నెంబర్ అంటూ వందల కోట్ల రూపాయలను ప్రచారం కోసం వినియోగించుకుంటున్నారు. నాలుగేళ్లుగా రాష్ట్రం ఏటా రెవెన్యూ లోటులోనే కొనసాగుతున్నప్పటికీ అనవసరపు ఖర్చులను అదుపు చేయాల్సిన ముఖ్యమంత్రే అందుకు విరుద్ధంగా ఈ వెంట్ల పేరుతో భారీగా నిధులు ఖర్చుపెడుతుండడంపై అధికార యంత్రాంగం విస్మయం వ్యక్తంచేస్తోంది. ఓ పక్క రాజధాని కోసం ప్రజలను విరాళాలు ఇవ్వండంటూ పిలుపునిస్తూ.. మరోపక్క ప్రజాధనాన్ని సొంత ప్రచారం కోసం దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసం అంటూ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. సర్కార్ సొమ్ముతో ధర్మపోరాటమా!? మొన్నటి వరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు కేంద్ర కేబినెట్ నుంచి బయటకు వచ్చి ప్రత్యేక హోదా పల్లవి అందుకుని ధర్మపోరాటం అంటూ సర్కార్ సొమ్ముతో సభలు నిర్వహించడాన్ని ఉన్నతస్థాయి అధికారి ఒకరు తప్పుపట్టడం గమనార్హం. సీఎంగా ఉంటూ ధర్మపోరాటాలు ఎవ్వరైనా చేస్తారా అంటూ ఆ అధికారి వ్యాఖ్యానించడం విశేషం. రాజధానిలో శంకుస్థాపనల పేరుతో వందల కోట్ల రూపాయలు వ్యయం చేసినా ఇప్పటివరకూ ఒక్క శాశ్వత భవనాన్నీ సమకూర్చలేదు. పైగా తాత్కాలిక సచివాలయ వ్యయాన్ని రూ.300 కోట్ల నుంచి మరమ్మతులు, ఇతర సౌకర్యాల పేరుతో ఏకంగా రూ.1,100 కోట్లకు పెంచేశారు. భాగస్వామ్య సదస్సులకు రూ.150కోట్లు అలాగే, పెట్టుబడుల కోసం భాగస్వామ్య సదస్సులను నిర్వహించడాన్ని ఎవ్వరూ తప్పుపట్టక పోయినప్పటికీ వాటి నిర్వహణకు చేస్తున్న వ్యయంపై మాత్రం అధికారులే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు మూడు భాగస్వామ్య సదస్సులు నిర్వహించగా.. ఒక్కో సదస్సుకు రూ.50 కోట్ల చొప్పున మొత్తం రూ.150 కోట్లు వ్యయం చేయడాన్ని అధికారులే తప్పుపడుతున్నారు. అంత వ్యయం చేసినప్పటికీ ఇప్పటివరకు చెప్పుకోదగ్గ భారీ పరిశ్రమ ఒక్కటి కూడా రాలేదని వారు పేర్కొంటున్నారు. మరోపక్క.. ఇప్పటివరకూ ఐదుసార్లు జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కరించడమే జన్మభూమి లక్ష్యమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అవి సీఎం ప్రచార సభలుగా మారిపోయాయని అధికార వర్గాలు ఆరోపిస్తున్నాయి. కాగా, ఇప్పటివరకు జరిగిన ఐదు జన్మభూమి కార్యక్రమాలకు మొత్తం రూ.125 కోట్లు వ్యయం చేశారని, ఇదంతా దుబారా కిందకే వస్తుందని పేర్కొంటున్నాయి. నయాపైసా ఉపయోగంలేని నవనిర్మాణ దీక్షలు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపకుండా నవ నిర్మాణ దీక్షల పేరుతో ఏటా 20 కోట్ల రూపాయలను వ్యయం చేస్తున్నారని, ఇప్పటివరకు నాలుగుసార్లు నవ నిర్మాణ దీక్షల పేరుతో సీఎం ప్రచార సభలు నిర్వహించారు తప్ప వాటివల్ల ఎటువంటి ప్రయోజనంలేదని అధికారులే అంటున్నారు. అలాగే, కొత్తగా ఈ ఏడాది హ్యాపీ సిటీస్ సదస్సును తెరమీదకు తీసుకువచ్చిన సీఎం.. ఇందుకు రూ.61 కోట్లు వ్యయం చేశారు. పోలవరం ప్రాజెక్టు డ్యాం పునాదులు కూడా పూర్తికాకముందే బస్సుల్లో జనాన్ని ఆ ప్రాజెక్టు దగ్గరకు తీసుకువెళ్లి చూపించడానికి ఏకంగా 22.50 కోట్ల రూపాయలను వ్యయం చేశారు. రాజధాని శంకుస్థాపనకు రూ.250 కోట్లను వ్యయం చేసిన సర్కారు ఆ తరువాత పరిపాలన నగరం, సీడ్ కేపిటల్.. రహదారుల శంకుస్థాపనల పేరుతో ఈవెంట్లను నిర్వహించి రూ.100 కోట్లు వ్యయం చేసింది. అయినా ఇప్పటివరకూ రాజధాని ఒక్క శాశ్వత నిర్మాణానికీ నోచుకోలేదు. ప్రత్యేక విమానం, హెలికాప్టర్ ఖర్చు రూ.100కోట్లు ఈ ఏడాది విదేశీ పర్యటనలు, రోడ్‌షోలకు రూ.62 కోట్లు కేటాయింపు నాలుగేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు జరిపిన విదేశీ పర్యటనలవల్ల రాష్ట్రానికి ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేకపోయినా ఖజానాకు మాత్రం బాగా చమురు వదిలింది. దేశంలో ఏ ముఖ్యమంత్రి వ్యవహరించని విధంగా చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో, హెలికాప్టర్లలో ప్రయాణం చేస్తున్నారు. దేశంలోనూ ఎక్కడికి వెళ్లాలన్నా రెగ్యులర్ ఫ్లైట్లున్నప్పటికీ చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో వెళ్లారు. చంద్రబాబు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లకు గత నాలుగేళ్లలో రూ.100 కోట్లు వెచ్చించారు. గన్నవరం విమానాశ్రయంలో బాబు ప్రత్యేక విమానం, హెలికాప్టర్ పార్కింగ్ చేసి ఉంటాయి. పార్కింగ్ చేసి ఉంచినందుకు కూడా రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు చెల్లించాల్సి వస్తోందని.. అలాగే పైలెట్లకు స్టార్ హోటల్స్‌లో బస ఏర్పాటుచేయాల్సి వస్తోందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రెగ్యులర్ ఫ్లైట్లున్నా ప్రత్యేక చార్టెడ్ విమానాల్లో తిరగడాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసిన అజేయ కల్లాం తాను రాసిన మేలుకొలుపు పుస్తకంలో తప్పుపట్టారంటే సీఎం ఎలా దుబారా చేశారో తేటతెల్లం అవుతోంది. అలాగే, ఈ ఏడాది విదేశీ యాత్రల కోసం ప్రత్యేకంగా ఆర్థికాభివృద్ధి మండలిని ఏర్పాటుచేశారు. విదేశీ పర్యటనలు, రోడ్ షోల నిర్వహణకు ఏకంగా బడ్జెట్లో రూ.62కోట్లను కేటాయించారు. -
వేడుకలకూ విమానంలో షికారు..
♦ జెట్‌సెట్‌గో ఏవియేషన్ సీఈవో కనిక టేక్రివాల్ ♦ ప్రత్యేక విమానాలకు పెరుగుతున్న క్రేజ్ ♦ విదేశాలు చుట్టి వస్తున్న యువ జంటలు ♦ ఈ ఏడాది 14 జెట్స్ కొంటున్నాం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపారం, విహారం, వేడుక.. సందర్భం ఏదైతేనేం ప్రత్యేక విమానాల్లో విహరించడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. అనుకూల సమయానికితోడు ప్రైవసీ ఉంటుందన్నది కస్టమర్ల భావన. అంతేకాదు ప్రయాణ ఖర్చులూ ఇతర విమానాల మాదిరిగానే ఉంటున్నాయి. ఇంకేం ఒక్క క్లిక్‌తో ప్రత్యేక విమానంలో దూసుకెళ్తున్నారని అంటున్నారు జెట్‌సెట్‌గో ఏవియేషన్ సర్వీసెస్ సీఈవో కనిక టేక్రివాల్. రేడియో క్యాబ్స్ మాదిరిగా జెట్‌సెట్‌గో.ఇన్ వెబ్సైట్ ద్వారా విమాన సర్వీసులను అందిస్తున్న ఈ సంస్థ భారత్‌లో ప్రైవేటు జెట్లు, హెలికాప్టర్లను ఒక వేదికపైకి తొలిసారిగా తీసుకొచ్చింది. మార్కెట్ తీరుతెన్నులు, కంపెనీ విస్తరణపై సాక్షి బిజినెస్ బ్యూరోకు ఆమె ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు ఇవీ.. ప్రత్యేక విమానాల అవసరం ఏ విధంగా పెరుగుతోంది? వ్యాపారస్తులైనా, మరొకరైన తక్కువ సమయంలో మరో నగరానికి చేరుకోవాలంటే ప్రత్యేక విమానాలు బెటర్. భారత్‌లోని నగరాలే కాదు యూఎస్, దుబాయ్, హాంకాంగ్, ఆఫ్రికా తదితర దేశాలను చిన్న విమానాల్లో ఇక్కడి నుంచి చుట్టివస్తున్నారు. అలాగే ఒక విమానంలో తమవారితో మాత్రమే ప్రయాణించడంలో ఉన్న సంతృప్తి అంతా ఇంతా కాదు. పెళ్లికి వచ్చిన బంధువులకు జాయ్ రైడ్స్ చేయించడం, కొత్త జంటలు హనీమూన్‌కు విదేశాలు లేదా దేశీయంగా సందర్శనీయ స్థలాలకు వెళ్లడం, ఫొటో షూట్స్ కోసం విమానాల్లో చక్కర్లు కొట్టడం ఫ్యాషన్ అయిపోయింది. కుటుంబ సభ్యులతో పక్షులు, జంతువులూ ప్రయాణించడం విశే షం. కంపెనీ ఆఫర్ చేస్తున్న చార్జీల వివరాలు చెప్పండి? దూరాన్నిబట్టి మాత్రమే చార్జీ చేస్తున్నాం. పౌర విమానయాన రంగంలో ఉన్న సంస్థలు సమయాన్నిబట్టి చార్జీ చేస్తాయి. అంటే రేపో ఎల్లుండో టికెట్ కావాల్సి వస్తే కస్టమర్‌కు తడిసిమోపెడు కావాల్సిందే. పూర్తి విమాన బుకింగ్‌తోపాటు ఒక విమానంలో పలువురు ప్రయాణించేలా విడిగా టికెట్లను విక్రయిస్తున్నాం. జెట్ స్టీల్ పేరుతో రూ.4 వేల నుంచే ఒక్కో టికెట్‌ను అందుబాటులోకి తెచ్చాం. అలాగే గంటకు రూ.40 వేలతో 4 సీట్లున్న చిన్న విమానాన్ని బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-తిరుపతి, బెంగళూరు-చెన్నై తదితర రూట్లలో గంటలో ప్రయాణించొచ్చు. 17 సీట్లున్న విమానమైతే రూ.4 లక్షలు ఖర్చు అవుతుంది. రోజుకు ఎన్ని బుకింగ్స్ నమోదు చేస్తున్నారు? 2014 మార్చిలో కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించింది. ఆ ఏడాది మొత్తం 300 బుకింగ్స్ అయ్యాయి. 2015లో ఈ సంఖ్య 1,100లకు పైమాటే. ఇప్పుడు రోజుకు 6 బుకింగ్స్ అవుతున్నాయి. ప్రస్తుతం ఏడాది కాలానికిగాను కంపెనీ చేతిలో రూ.130 కోట్ల విలువైన ఆర్డర్ బుక్ ఉంది. ఇప్పటి వరకు రూ.60 కోట్ల వ్యాపారం చేశాం. వేడుకలకు, సమావేశాలకు పెద్ద విమానాల బుకింగ్ సేవలను అందిస్తున్నాం. ప్రముఖ ఎయిర్‌లైన్స్‌తో చేతులు కలిపాం. ఎమర్జెన్సీ మెడికల్ ఫ్లైట్స్ కోసం రోజుకు ఒక బుకింగ్ వస్తోంది. హైదరాబాద్ నుంచి వారంలో 8 బుకింగ్స్ అవుతున్నాయి. సొంతంగా విమానాలు కొనుగోలు చేసే ఆలోచన ఉందా? ప్రస్తుతం కంపెనీ చేతిలో 10 సీట్లున్న హాకర్ బీచ్‌క్రాఫ్ట్ విమానముంది. ఈ ఏడాది డిసెంబరుకల్లా మరో 14 జెట్స్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించాం. క్రికెటర్ యువరాజ్ సింగ్, వ్యాపారవేత్త పునీత్ దాల్మియా కంపెనీలో పెట్టుబడి పెట్టారు. ఇక వివిధ కంపెనీలు, వ్యక్తులకు చెందిన 120 ఎయిర్‌క్రాఫ్ట్స్ మా వద్ద రిజిష్టర్ అయి ఉన్నాయి. వీటిలో 35 హెలికాప్టర్లున్నాయి. ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసులను (అంబులెన్సు) 8 విమానాలు అందిస్తున్నాయి. రూ.5 వేలతో కంపెనీని పెట్టాం. 8 మంది సిబ్బందితో మొదలై ఇప్పుడు 50 మంది వరకు ఉన్నారు. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, దుబాయి, లండన్, న్యూయార్క్‌లో ఆఫీసులున్నాయి. త్వరలో హైదరాబాద్, విజయవాడలో కార్యాలయాలు ప్రారంభిస్తాం. అయిదేళ్లలో మూడు రెట్ల వ్యాపారం నమోదవుతుందని ఆశిస్తున్నాం. -
చంద్రబాబు విమానం మోత
-
స్పెషల్ ఫ్లైయిట్‌లో సీఎం చంద్రబాబు
-
బాబు తీరు.. విమానాల హోరు
పర్యటనంటే ‘ప్రత్యేక’ ఫ్లైట్ ఎక్కాల్సిందే.. సీఎం మోజు ఖర్చు ఇప్పటి వరకూ రూ.12 కోట్లుపైనే.. రాజధాని కోసం విరాళాలు అడుగుతూ జనం సొమ్ముతో టూర్లు ఢిల్లీ, సింగపూర్, జిల్లాలు.. ఎక్కడికైనా అలా వెళ్లాల్సిందే.. సింగపూర్ ప్రత్యేక విమానానికి సర్కారు వ్యయం రూ.అర కోటి హైదరాబాద్: ప్రత్యేక విమానాలను వినియోగించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రికార్డు సృష్టించారు. సాధారణంగా ఢిల్లీకి వెళ్లినా, విదేశీ పర్యటనలకైనా సీఎంలు ఎవరూ ప్రత్యేక విమానాలను వినియోగించరు. సాధారణ విమానాల్లోనే వెళతారు. చంద్రబాబు మాత్రం ఢిల్లీతో సహా జిల్లాల పర్యటనలకు సైతం ప్రత్యేక ఫ్లైట్లలో తప్ప రెగ్యులర్ విమానాల్లో కాలు పెట్టట్లేదు. విదేశీ పర్యటనలకు ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి మాత్రమే ప్రత్యేక విమానాల్లో వెళుతుంటారు. బాబు మాత్రం సింగపూర్‌కు ప్రత్యేక విమానంలో వెళ్లి రికార్డు సృష్టించారు. ఏ ముఖ్యమంత్రి విదేశాలకు ప్రత్యేక విమానంలో వెళ్లరని, అయితే టీడీపీకి చెందిన పి.అశోకగజపతిరాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నందున ప్రత్యేక విమానాల ఏర్పాటు సాధ్యమైందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఢిల్లీకి చెందిన క్లబ్-1 ప్రత్యేక విమానంలో బాబు సింగపూర్ పర్యటనకు వెళ్లారు. విమాన చార్జీల కింద రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రూ.అర కోటి చెల్లించింది. ఢిల్లీకి బాబు ఐదుసార్లూ ‘ప్రత్యేకం’గానే చంద్రబాబు ఎక్కువగా నవయుగ, కృష్ణపట్నం, జీవీకే, జీఎంఆర్ సంస్థలకు చెందిన 9, 15 సీట్లు కలిగిన ప్రత్యేక విమానాలను వాడుతున్నారు. వీటి చార్జీల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.12 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఇప్పటిదాకా సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఐదు దఫాలూ ప్రత్యేక విమానాల్లోనే వెళ్లారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్ పర్యటనకు కూడా ప్రత్యేక విమానంలో వెళ్లారు. బెజవాడకు వెళ్లాలన్నా .. . చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జన్మభూమి కార్యక్రమాలతోపాటు జిల్లాల్లో ఇతర అన్ని పర్యటనలకు కూడా ప్రత్యేక విమానాల్లోనే వెళ్లారు. ఆఖరికి విజయవాడ, విశాఖపట్టణం, రాజమండ్రి, తిరుపతిలకు కూడా రెగ్యులర్ విమానాల్లో కాకుండా ప్రత్యేక విమానాల్లో వెళ్లారు. ఒక పక్క రాజధాని కోసం ప్రజల నుంచి విరాళాలు వసూలు చేస్తూ మరో పక్క కోట్ల రూపాయలను ప్రత్యేక విమానాలపై కుమ్మరించటం పట్ల అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. మంత్రులు, అధికారులు పొదుపు చర్యలు పాటించాలని ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రే స్వయంగా వాటిని ఉల్లంఘిస్తూ అవసరం లేకున్నా ప్రత్యేక విమానాల్లో విహరించడం పట్ల ఉన్నతస్థాయి అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.