సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు చేపట్టిన వందేభారత్ మిషన్ ప్రత్యేక విమానాల్లో భాగంగా రెండో విమానం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బయల్దేరి సోమవారం నగరానికి చేరుకుంది. ఉదయం 9.22 గంటలకు తెలుగురాష్ట్రాలకు చెందిన 118 మంది ప్రయాణికులతో ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ (ఏఐ 1617) హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. కాగా, అబుదాబి(యూఏఈ) నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్(ఏఐ1920) రాత్రి హైదరాబాద్ విమానాశ్రయం చేరుకుంది. 170 మంది ప్రయాణికులు నగరానికి చేరుకున్నారు. ప్రయాణికులతో పాటు వైమానిక సిబ్బంది కోసం విమానాశ్రయంలో ఎయిరోబ్రిడ్జి నుంచి అరైవల్స్ ర్యాంప్ వరకు శానిటైజ్, కెమికల్ ఫ్యూమిగేషన్ చేశారు.
విమానాశ్రయం లోని వాష్ రూంలు, కుర్చీలు, కౌంటర్లు, ట్రాలీలు, రెయిలింగులు, లిఫ్టులు, ఎస్కలేటర్లన్నింటినీ శానిటైజ్ చేశారు. ఎయిరోబ్రిడ్జి నుంచి బయటికి వచ్చే వరకు ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది భౌతిక దూరా న్ని పాటించారు. 20 నుంచి 25 మందిని ఒక బృందంగా ఏర్పా టు చేసి తీసుకొచ్చారు. ఇమిగ్రేషన్ నిబంధనలకు ముందు ఎయిర్ పోర్ట్ హెల్త్ అధికారులు ప్రతి ప్రయాణికుడికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. బ్యాగే జ్ బెల్టుతో అనుసంధానించిన డిస్‌ఇన్ఫెక్షన్ టన్నెల్ ద్వారా ప్ర యాణికుల బ్యాగేజీని శానిటైజ్ చేశారు. కస్టమ్స్ క్లియరెన్స్ పూర్త యి, టెర్మినల్ బిల్డింగ్ నుంచి బయటికి వెళ్లడానికి ముందు, ప్రయాణికులకు కాంప్లిమెంటరీ ఆహార పొట్లాలను అందించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రయాణికులను నగరంలోని నోవాటెల్, షెహరటాన్, వైష్ణవి తదితర హోటళ్లల్లో ఏర్పాటు చేసిన పెయిడ్ క్వారంటైన్‌లకు బస్సుల్లో తరలించినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. 14 రోజుల పాటు వారు ఈ క్వారంటైన్‌లోనే ఉండవలసి ఉంటుంది.
విజయవాడకు పంపించండి
అమెరికా నుంచి నగరానికి వచ్చిన వారిలో ఏపీకి చెందిన 16 మంది ప్రయాణికులను సైతం ఇక్కడే హోటళ్లలో ఏర్పాటు చేసిన పెయిడ్ క్వారంటైన్‌లకు తరలించడం పట్ల పలువురు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమను ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక బస్సులో విజయవాడకు పంపించి ఉంటే బాగుండేదని, లాక్‌డౌన్ కారణంగా చాలా రోజులుగా అమెరికాలో చిక్కుకుపోయామని, ఇక్కడికి వచ్చిన తరువాత కూడా ఇంటికి చేరుకోలేకపోవడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో తమను క్వారంటైన్ కేంద్రానికి పంపించినా బాగుండేదన్నారు. మరోవైపు పలు హోటళ్లలో అధిక చార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వ్యక్తమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment