
సాక్షి, న్యూఢిల్లీ: రష్యా సైనిక దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో భయానక వాతావరణం నెలకొంది. ఇప్పటికే వేల సంఖ్యలో సైనికులు, పౌరులు మృతి చెందారు. దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి భారతీయులను ఆపరేషన్ గంగాతో స్వదేశానికి తరలిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది భారత విద్యార్థులు, పౌరులు స్వదేశానికి చేరుకున్నారు.
ఇదిలా ఉండగా బుధవారం ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి వచ్చిన భారత పౌరులకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతిఇరానీ స్వాగతం పలికారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో మంత్రి స్మృతిఇరానీ.. నాలుగు భాషాల్లో విద్యార్థులకు ఘన స్వాగతం పలికారు. విద్యార్థులు క్షేమంగా స్వదేశానికి తిరిగి రావడం పట్ల ఆనందంగా ఉందన్నారు. ఈ క్రమంలోనే ఎయిర్‌లైన్స్ సిబ్బంది చేసిన సేవలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్‌లోని పరిస్థితులను భారతీయులు ఎంతో ధైర్యంతో ఎదుర్కొన్నారని ప్రశంసించారు.
India welcomes back her children. #OperationGanga pic.twitter.com/GN9134IMed
— Smriti Z Irani (@smritiirani) March 2, 2022