Smiriti Irani
-
స్మృతి ఇరానీకి మద్దతుగా రాహుల్ గాంధీ ట్వీట్!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. కేంద్రమాజీ మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీకి మద్దతుగా ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచడం చర్చనీయాంశంగా మారింది.2019 సార్వత్రిక ఎన్నికల్లో అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లోనూ వీళ్ల మధ్య పోటీ ఉండొచ్చని భావించినప్పటికీ.. అనూహ్యంగా రాయ్‌బరేలీ నుంచి రాహుల్ పోటీ చేశారు. ఈ క్రమంలో స్మృతి ఇరానీ, రాహుల్‌ను ఎద్దేవా చేస్తూ కాంగ్రెస్‌పై కామెంట్లు చేశారు. అయితే కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కిషోరీ లాల్ శర్మ, స్మృతి ఇరానీని ఓడించారు.ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక.. తాజాగా స్మృతి ఇరానీని దూషిస్తూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేస్తున్న సంగతి రాహుల్ గాంధీ దృష్టికి వచ్చింది. దీంతో ఆమెకు మద్దతుగా ఆయన తన ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారు.జీవితంలో గెలుపోటములు వస్తుంటాయి. అలాగని ఒకరిని కించపర్చడం, అవమానించడం సరికాదు. పైగా అది బలహీనత అవుతుందే తప్ప.. బలం అనిపించుకోదు. స్మృతి ఇరానీనో లేదంటే ఇతర నాయకుల్ని అవమానించడం, దుర్భాషలాడడంలాంటివి చేయొద్దని కోరుతున్నా అని రాహుల్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. Winning and losing happen in life. I urge everyone to refrain from using derogatory language and being nasty towards Smt. Smriti Irani or any other leader for that matter. Humiliating and insulting people is a sign of weakness, not strength.— Rahul Gandhi (@RahulGandhi) July 12, 2024 -
ఉక్రెయిన్ నుంచి భారత్ చేరుకున్న విమానం.. ఫ్లైట్‌లో స్మృతిఇరానీ ఏం చేశారంటే..?
సాక్షి, న్యూఢిల్లీ: రష్యా సైనిక దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో భయానక వాతావరణం నెలకొంది. ఇప్పటికే వేల సంఖ్యలో సైనికులు, పౌరులు మృతి చెందారు. దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి భారతీయులను ఆపరేషన్ గంగాతో స్వదేశానికి తరలిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది భారత విద్యార్థులు, పౌరులు స్వదేశానికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా బుధవారం ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి వచ్చిన భారత పౌరులకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతిఇరానీ స్వాగతం పలికారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో మంత్రి స్మృతిఇరానీ.. నాలుగు భాషాల్లో విద్యార్థులకు ఘన స్వాగతం పలికారు. విద్యార్థులు క్షేమంగా స్వదేశానికి తిరిగి రావడం పట్ల ఆనందంగా ఉందన్నారు. ఈ క్రమంలోనే ఎయిర్‌లైన్స్ సిబ్బంది చేసిన సేవలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్‌లోని పరిస్థితులను భారతీయులు ఎంతో ధైర్యంతో ఎదుర్కొన్నారని ప్రశంసించారు. India welcomes back her children. #OperationGanga pic.twitter.com/GN9134IMed — Smriti Z Irani (@smritiirani) March 2, 2022 -
కేంద్ర హోంశాఖ పరిశీలనలో దిశ బిల్లులు
-
స్మృతి ఇరానీ పోస్ట్.. నవ్వకుండా ఉండలేం!
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఫన్నీ మీమ్స్, ఫోటోలు, వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ ఉంటారు. ఆమె తాజాగా ఓ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘మీ చార్టర్డ్ అకౌంటెంట్ స్నేహితులు మార్చి నెల ముగిసే సమయంలో ఇలాగే ఉత్సాహంగా ప్రవర్తిస్తారు’ అంటూ సరదాగా కామెంట్ జతచేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో నలుగురు సంగీత వాయద్యకారులు తమను తాము మరిచి ఉత్సహభరితంగా పాట పాడుతూ తబలా, హార్మోనియం వాయిస్తారు. ఆ సంగీత వాయిద్యకారులు ఇచ్చే ముఖకవలికలు చాలా ఫన్నీగా ఉంటాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మరింత ఫన్నిగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో చేసిన తర్వాత నవ్వకుండా ఉండలేమంటున్నారు. అదే విధంగా ఈ వీడియోను ముంబై పోలీసులు కూడా తమ ఆధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘హ్యాకర్లు చాలా సులభమైన పాస్వర్డ్ ద్వారా అకౌంట్లను ఓపెన్ చేస్తే.. ఈ వీడియోలో ఉన్నవారిలాగానే ఉత్సహంగా ఉంటారు’ అని కామెంట్ జత చేసింది. -
ఫన్నీ మీమ్స్‌తో నవ్విస్తోన్న స్మృతి ఇరానీ !
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్స్‌ను ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తారన్న విషయం తెలిసిందే. తను చేసే పనికి సంబంధించి, కుటుంబ సభ్యులతో కలిసి దిగే ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు. తాజాగా స్మృతి కొన్ని మీమ్స్‌ని పోస్ట్ చేశారు. వాటిలో మొదటిది నేను ఐదు సంవత్సరాల క్రితం నాటి పాత దానిని ధరించాను. అది నాకు సరిగ్గా సరిపోయింది. ఆ విషయంలో చాలా గర్వపడుతున్నాను. ఇంతకీ అదేంటంటే నా స్కార్ఫ్. ప్రతి విషయంలో పాజిటివిటీని చూడాలి అని స్మృతి పోస్ట్ చేశారు. (స్మృతి ఇరానీ పోస్ట్‌కు నెటిజన్లు ఫిదా..) ఇక రెండవ దానిలో ‘నువ్వు అలా అనకూడదు అనే దశ నుంచి అని చూడు ఏమౌంతుందో చూద్దాం’ అని నా మెదడు చెప్పే వయసుకు నేను చేరుకున్నాను అని పోస్ట్ చేశారు. ఇక మూడో పోస్ట్‌లో అర్థం పర్థంలేని వారు ఎలా మాట్లాడతారో అలా ‘మీరు ఎప్పుడైనా ఎవరి మాటలైనా విని ఆశ్చర్యపోయారా, మీకు షూలేస్ ఎవరు కడతారు?’ అని అడిగారు. వీటిని చూసిన వెంటనే పెదవులపై కచ్చితంగా నవ్వు వస్తుంది కదా. ఇలాంటి ఫన్నీ మీమ్స్‌ని పోస్ట్ చేసి స్మృతి ఈ రోజు తన ఫాలోవర్స్‌ను ఆనందపరిచారు. (‘ఒంటరిగా పోరాడితే.. బలవంతులవుతారు’) -
‘అబ్బాయిలు కూడా తెలుసుకోవాలి’
ముంబై: రుతుస్రావం గురించి అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. గురువారం మెన్స్స్ట్రవల్ హైజీన్ డే సందర్భంగా ఆమె ట్వీట్ చేశారు. ‘జన ఔషధి కేంద్రాలలో లక్షల మంది మహిళల కోసం శానిటరీ నాప్కిన్లను ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలలో ఉంచాం. అమ్మాయిలతో పాటు అబ్బాయిలకు రుతుస్రావం గురించి అవగాహన కల్పిద్దాం. రుతుస్రావం సిగ్గుపడాల్సిన విషయం కాదు’ అని ఆమె ట్వీట్లో పేర్కొన్నారు. (‘కోహ్లి.. అనుష్కకు విడాకులు ఇచ్చేయ్’) దీనిపై మంత్రి మన్సూక్ మాండవీయా స్పందిస్తూ ఈ మహమ్మారి కాలంలో మాత్రమే కాకుండా మామూలు రోజుల్లో కూడా రుతుస్రావ సమయంలో జాగ్రత్తలు పాటించడం అవసరమని తెలిపారు. రుతుస్రావం గురించి చర్చించడం సిగ్గు పడాల్సిన విషయం కాదని పేర్కొన్నారు. ఎందుకంటే రుతుస్రావం వల్ల మహిళలు రక్తాన్ని కోల్పొతారు కానీ, గౌరవాన్ని కాదు అని ట్వీట్ చేశారు. రుతుస్రావ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది మే 28న మెన్స్స్ట్రవల్ హైజీన్ డేను నిర్వహిస్తున్నారు. (వైరస్ భయం: ఫ్లైట్‌లో ‘ఆ నలుగురు’) -
నటియిత్రి
లాక్ డౌన్ కాలం అందరిలో ఉన్న అజ్ఞాత ప్రతిభను వెలికితీస్తోంది. అందుకు బాలీవుడ్ తారలు అతీతులేం కాదు. తమ భావాలను చక్కగా లోకానికి వెల్లడిస్తున్నారు. కొన్నాళ్ళ క్రితం ప్రముఖ నటులంతా కలిసి, తమ తమ ఇళ్ళనుంచే స్ఫూర్తిదాయకమైన వీడియో రూపకల్పనలో పాలుపంచుకున్నారు. అదెంత వైరల్ అయ్యిందో అందరం చూశాం. ఇప్పుడు ఒక నటి తన మనసులోని భావాలను చక్కగా వెల్లడించారు. మనం ఏం చేస్తే అందరి మనసులనూ ఆకట్టుకోగలమో... మంచిని పంచగలమో తెలియజెప్పారు. బాలీవుడ్ ప్రముఖ నటి దివ్యా దత్తా మనసు చాలా సున్నితమైనది. ఆమెలోనూ ఒక అజ్ఞాత కవయిత్రి అంతర్లీనంగా దాగి ఉంది. నటిగా, మోడల్‌గా మాత్రమే కాకుండా కవయిత్రిగా ఇప్పుడు ప్రపంచానికి తనలోని అక్షరాలకు రూపం కల్పించింది. కరోనా నేపథ్యంలో ఒక పద్యం రాసింది. అందులోని భావాలను తన గొంతులో ఎంతో హృద్యంగా పలికించింది. ‘జబ్ సబ్ ఠీక్ హోగా నా’ అంటూ ఒకసారి అందరి హృదయాలను సన్నగా తట్టి లేపింది. ఈ లలితమైన గీతాన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ విపత్తు నుండి బయటపడి అందరం ఆహ్లాదంగా ఉన్నప్పుడు కూడా మనం ఈ పనులు చేస్తూనే ఉండాలి. మూడురోజులకొకసారి మనవారందరికీ వీడియో కాల్స్ చేస్తున్నాం. మనం వండిన వంటను ఎలా తయారుచేయాలో వాళ్లకి రెసిపీలు చెబుతున్నాం. మార్కెట్లో ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుందో తెలియపరుస్తున్నాం. అంతా సద్దుమణిగాక కూడా మనం ఈ పనులు చేస్తూనే ఉండాలి. పాత ఆల్బమ్స్ చూస్తూ మన బాల్యాన్ని, మధుర క్షణాలను తీయగా ఆస్వాదిస్తున్నాం. వాటిని చూస్తూ చిన్నప్పుడు తలగడలతో కొట్టుకున్న ఆటలు గుర్తు చేసుకుంటున్నాం. ప్రతిరోజూ ఇల్లు శుభ్రం చేస్తున్నాం. ఆర్డి బర్మన్ సంగీతం వింటూ ఆనందిస్తున్నాం. అంతా సద్దుమణిగాక కూడా మనం ఈ పనులు చేస్తూనే ఉండాలి. వీధి కుక్కలను పలకరిస్తూ వాటికి అన్నం పెడుతున్నాం. మంచి నీళ్లు ఇస్తున్నాం. ఇప్పుడు మనకు చేసిన తప్పులు సరిదిద్దుకునే అవకాశం దొరికింది. అంతా సద్దుమణిగాక కూడా మనం ఈ పనులు చేస్తూనే ఉండాలి. నిత్యం మన పనులను చేయడానికి వస్తున్న పనివారిని పలకరిస్తూ, వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటే, వారి ముఖాలపై నర్తించే చిరునవ్వులు చూడండి. మనలను కంటికిరెప్పలా కాపాడుతున్న మన ఇంటి వాచ్మ్యా¯Œ ని ‘టీ తాగావా, టిఫిన్ అయ్యిందా, భోజనం చేశావా’ అని కడుపునిండుగా నవ్వుతూ పలకరించండి. ఈ పనులన్నీ అటూ ఇటూ వెళ్తూ చేసేవే. ఇంకా కోకిల స్వరాన్ని వింటూ, అది ఏ భావంతో పాడుతోందో అర్థం చేసుకోండి. కాకుల కోసం నీళ్లు పెట్టండి. అంతా సద్దుమణిగాక కూడా మనం ఈ పనులు చేస్తూనే ఉండాలి. అంటూ ఎంతో అనుభూతితో రచించిన ఈ పద్యాన్ని, మనసుకి హత్తుకునేలా చదివారు దివ్యాదత్తా. -
లోక్‌సభలో తొలి అడుగులు
ప్రపంచంలోనే భారీ ఎన్నికలుగా నమోదైన 2019 లోక్‌సభ ఎన్నికల్లో అనేక రికార్డులు నమోదయ్యాయి. రాజకీయ ఉద్దండులైన ఎంతోమంది సీనియర్లను ఈ ఎన్నికల్లో మట్టికరిపించి ఓ సరికొత్త తరం పార్లమెంట్లో అడుగు పెట్టింది. ఈసారి ఏకంగా 300 మంది కొత్తవారు చట్టసభకు ఎన్నికవ్వడం ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓ ప్రత్యేకత. అందులో తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన వారిలో బీజేపీ రాజకీయ వ్యూహకర్తగా పేరొందిన అమిత్ షా మొదలుకుని క్రికెటర్ గౌతమ్ గంభీర్, తేజస్వీ సూర్య, జర్నలిస్టు ఇంతియాజ్, దళిత ప్రతినిధి రమ్యా హరిదాస్తోపాటుగా గాయకులు, సినీరంగ ప్రముఖులు వంటి వారెందరో ఉన్నారు. అమిత్ షా (బీజేపీ– గుజరాత్) బీజేపీ అధ్యక్షుడు, నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్డీయే) చైర్పర్సన్, అమిత్‌షా లోక్‌సభలోకి తొలిసారిగా అడుగుపెడుతున్నారు. చిన్నప్పటి నుంచీ ఆరెస్సెస్‌లో చురుకైన కార్యకర్తగా ఉన్న అమిత్‌షా గుజరాతీ వ్యాపారవేత్త కుమారుడు. 1986లో బీజేపీలో చేరి 33 ఏళ్ళ వయస్సులో 1997లో తొలిసారిగా గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రెండు దశాబ్దాల పాటు ఎమ్మెల్యేగా, హోంమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన్ను గత ఐదేళ్ళుగా భారత రాజకీయాల్లో ప్రముఖ పాత్రపోషించేలా చేసింది. 1990 నుంచి ప్రధాని మోదీ తలలో నాలుకలా ఉంటూ, గుజరాత్‌లోనూ, దేశవ్యాప్తంగానూ బీజేపీని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. జోతిమణి (కాంగ్రెస్– తమిళనాడు) తమిళనాడులో కాంగ్రెస్ తరఫున ఎన్నికైన ఏకైక మహిళా అభ్యర్థి జోతిమణి. కరూర్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికై తొలిసారి లోక్‌సభలో అడుగుపెడుతున్నారు. 22 ఏళ్ళకే రాజకీయాల్లోకి వచ్చిన జోతిమణి, మాజీ డిప్యూటీ స్పీకర్, నాలుగుసార్లు ఎంపీ అయిన ఎం.తంబిదురైని 4 లక్షలకుపైగా ఓట్ల తేడాతో ఓడించారు. ఇంతియాజ్ జలీల్ (ఎంఐఎం–ఔరంగాబాద్) ఎంఐఎం నుంచి లోక్‌సభలోకి ప్రవేశిస్తున్న పాత్రికేయుడు ఇంతియాజ్‌కి లోక్‌సభ సభ్యుడిగా ఇది తొలి అనుభవం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌నుంచి తొలుత ఈయన అభ్యర్థిత్వం తిరస్కరణకు గురైనా ప్రకాష్ అంబేడ్కర్ వంచిత్ బహుజన్ అఘాదీ పొత్తులో అదృష్టవశాత్తూ ఇంతియాజ్‌కి ఈ సీటు దక్కింది. శివసేన సీనియర్ నాయకుడు చంద్రకాంత్ ఖయిరేని అతితక్కువ ఓట్ల మెజారిటీతో ఓడించారు. పదిహేనేళ్ళ అనంతరం మహారాష్ట్ర నుంచి ఓ ముస్లిం లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిమీ చక్రవర్తి (తృణమూల్– పశ్చిమబెంగాల్) చిత్రపరిశ్రమనుంచి వచ్చి ఈ ఎన్నికల్లో రాణించిన వారిలో పశ్చిమబెంగాల్‌కి చెందిన మిమీ చక్రవర్తి, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి పోటీ చేసిన సన్నీడియోల్ ప్రముఖులు. ప్రముఖ సినీతార మిమీ చక్రవర్తి పశ్చిమబెంగాల్లోని జాదవ్‌పూర్ నుంచి లోక్‌సభకు తొలిసారిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి అనుపమ్ హజ్రాని దాదాపు మూడు లక్షల ఓట్ల మెజారిటీతో ఓడించి ఘన విజయం సాధించారు మిమీ చక్రవర్తి. బీజేపీ అభ్యర్థిగా గురుదాస్పూర్నుంచి పోటీ చేసిన సన్నీడియోల్ కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జాఖడ్‌పై 82,459 ఓట్ల మెజారిటీతో గెలుపొంది తొలిసారిగా లోక్‌సభలోకి అడుగిడుతున్నారు. గౌతమ్ గంభీర్ (బీజేపీ–తూర్పు ఢిల్లీ) రాజకీయవేత్తగా మారిన సుపరిచిత క్రికెట్ క్రీడాకారుడు గౌతమ్ గంభీర్ కూడా తొలిసారి లోక్‌సభలో అడుగుపెడుతున్నారు. తూర్పు ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన గౌతమ్ గంభీర్ ఆప్ అభ్యర్థి అతిషీ మర్లేనాపై గెలుపొందారు. హన్స్‌రాజ్ హన్స్ (బీజేపీ– నార్త్‌వెస్ట్ ఢిల్లీ ) నార్త్‌వెస్ట్ ఢిల్లీనుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన ప్రముఖ పంజాబీ సూఫీ గాయకుడు హన్స్‌రాజ్ హన్స్ కూడా మొదటిసారిగా లోక్‌సభలో అడుగుపెడుతున్నారు. మాజీ ఎంపీ ఉదిత్‌రాజ్ స్థానంలో చివరి క్షణంలో హన్స్‌రాజ్ హన్స్‌ని బీజేపీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. తొలినుంచి రాజకీయాల్లో ఆసక్తి కలిగిన హన్స్‌రాజ్‌హన్స్ పంజాబ్‌లోని జలంధర్ నుంచి శిరోమణి అకాలీదళ్ పార్టీతరఫున 2009 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2014లో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. 2016లో బీజేపీలో చేరారు. ప్రజ్ఞాఠాకూర్ (బీజేపీ–భోపాల్) మాలెగావ్ బాంబు పేలుళ్ళ కేసులో నిందితురాలు, సొంతపార్టీ బీజేపీలోనూ, బయటా విమర్శలనెదుర్కొంటున్న ప్రజ్ఞాఠాకూర్ సైతం తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. భోపాల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన ప్రజ్ఞాఠాకూర్ కాంగ్రెస్ దిగ్గజం దిగ్విజయ్‌సింగ్‌ను మట్టికరిపించారు. రవిశంకర్ ప్రసాద్ (బీజేపీ–బిహార్) బిహార్‌లోని పాట్నా సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన రవిశంకర్ ప్రసాద్ సమీప ప్రత్యర్థి, బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హాను 2.84 లక్షల ఓట్ల మెజార్టీతో ఓడించి తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టబోతున్నారు. స్మృతీ ఇరానీ (బీజేపీ–అమేథీ) గాంధీ కుటుంబాన్ని చిరకాలంగా ఆదరిస్తోన్న యూపీలోని అమేథీ నియోజకర్గం నుంచి బీజేపీ తరఫున పోటీచేసిన మాజీ మంత్రి స్మృతీ ఇరానీ ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై 55,120 ఓట్ల మెజార్టీతో గెలుపొంది తొలిసారి లోక్‌సభలో అడుగుపెడుతున్నారు. రమ్యా హరిదాస్ (కాంగ్రెస్– కేరళ) కేరళలోని అలత్తూర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున రమ్యాహరిదాస్ పోటీచేసి గెలుపొందారు. ఈ స్థానానికి ఓ దళిత మహిళ రమ్యాహరిదాస్ పేరు వినిపించగానే అంతా ముక్కున వేలేసుకున్నారు. హేమాహేమీలను వదిలేసి రాజకీయ అక్షరాభ్యాసం చేస్తోన్న పంచాయతీ స్థాయి నాయకురాలు రమ్యని ఎంచుకోవడం కాంగ్రెస్ సీనియర్లకు ససేమిరా మింగుడుపడలేదు. ఎన్ని విమర్శలెదురైనా, ఎంతమంది అగౌరవ పరిచినా మొక్కవోని దీక్షతో పోరాడి ఈ ఎన్నికల్లో గెలుపొందారు. రెండుసార్లు ఎంపీగా ఉన్న సీపీఎం నాయకుడు పీకే బిజూని ఓడించి తొలిసారి లోక్‌సభలోకి అడుపెడుతున్నారు రమ్యాహరిదాస్. మహువా మోయిత్రా (తృణమూల్ – పశ్చిమ బెంగాల్) పశ్చిమబెంగాల్లో బీజేపీ «సునామీకి తట్టుకొని నిలబడిన తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మహువా మోయిత్రా తొలిసారిగా లోక్‌సభలోకి ప్రవేశించబోతున్నారు. కోల్‌కతాలో పుట్టిపెరిగి, అమెరికాలో చదువుకున్న మోయిత్రా 2008లో కాంగ్రెస్‌లో చేరి, ఆ తర్వాత తృణమూల్‌కి మారారు. 2016లో నదియా జిల్లాలోని కరీంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈసారి అదే జిల్లాలోని కృష్ణానగర్ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఫుట్‌బాల్ క్రీడాకారుడు కల్యాణ్ చౌబేపై 65,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తేజస్వీ సూర్య (బీజేపీ– కర్ణాటక) దక్షిణ బెంగళూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికైన తేజస్వీ సూర్య అత్యంత పిన్నవయస్కుడైన ఎంపీగా తొలిసారి లోక్‌సభలోకి అడుగుపెట్టబోతున్నారు. న్యాయవాద వృత్తిలో ఉన్న తేజస్వీ సూర్య ఏబీవీపీ నాయకుడిగా, ఆరెస్సెస్‌లో క్రియాశీలక కార్యకర్తగా ఉంటూ బీజేపీ యువమోర్చా నాయకుడిగా ఎదిగారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ‘‘మీరు మోదీతో ఉంటే దేశం పక్షాన ఉన్నట్టు, లేదంటే దేశానికి వ్యతిరేకంగా ఉన్నట్టు’’అంటూ తేజస్వీ చేసిన వీడియో వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. -
#మీటూ: మహిళల రక్షణకు చట్టాలున్నాయ్
ఇండోర్: మహిళల రక్షణ కోసం దేశంలో పోలీస్ వ్యవస్థ ఉందని, కఠిన చట్టాలు కూడా ఉన్నాయని కేంద్ర జౌళీశాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. రాజమాత విజయ రాజే సింధియా శతదినోత్సవం సందర్భంగానే బీజేపీ మీటూ ఉద్యమాన్ని బలపరుస్తాందా? అన్న విలేకురుల ప్రశ్నలకు ఆమె పైవిధంగా స్పందించారు. ‘మహిళల రక్షణ కోసం పోలీస్ వ్యవస్థ, కఠినమైన చట్టాలు మనదేశంలో ఉన్నాయి. ఏ మహిళకైన న్యాయపరంగా రక్షణ కావాలంటే వారు సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించవచ్చు. అంతేకాకుండా న్యాయస్థానాలను కూడ ఆశ్రయించవచ్చు.’ అని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం మైనర్ బాలికలను అత్యాచారం చేసిన నేరస్థులకు మరణశిక్ష విధించేలా చట్టాన్ని రూపొందించాలనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. అత్యాచార బాధితులకు సాధారణ జీవితం గడపడానికి తగిన సాయం అందుతుందన్నారు. లైంగిక నేరాలను పరిశీలిస్తే.. అవన్నీ తొలుత ఈవ్టీజింగ్తోనే ప్రారంభమవుతాయని, ఆ తర్వాత పెద్ద నేరాలకు దారితీస్తాయని అభిప్రాయపడ్డారు. కుటుంబ సభ్యులు, లేక సోషల్ వర్కర్స్ కానీ ఈవ్‌టీజింగ్ గురించి తెలిసిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మీటూ ఉద్యమ నేపథ్యంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలపై సైతం స్మృతి ఇరానీ స్పందించిన విషయం తెలిసిందే. ఆయనపై వస్తున్న ఆరోపణలపై అక్భర్ సమాధానం చెప్పాలన్నారు. అంతేకాక, లైంగిక వేధింపులపై ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్న మహిళా జర్నలిస్ట్‌లను ఆమె అభినందించారు. -
రోహిత్ వేముల తల్లికి విజ్ఞప్తి
రాజేంద్ర నగర్ : దళిత యువ నేత, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని.. రోహిత్ వేముల తల్లి రాధికకు ఓ విజ్ఞప్తి చేశాడు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటూ ఆమెను కోరుతున్నాడు. తద్వారా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి గుణపాఠం నేర్పాలని జిగ్నేష్ ఆకాంక్షిస్తున్నాడు . ‘‘దళిత పోరాటంలో మా అందరికీ ప్రేరణగా నిలుస్తున్న రాధికమ్మకు నేను చేస్తున్న విజ్ఞప్తి ఒక్కటే. మీరు 2019 ఎన్నికల్లో పోటీ చేయాలి. తద్వారా పార్లమెంట్లో ‘మను’స్మృతి ఇరానీకి గుణపాఠం నేర్పించాలి’’ అని జిగ్నేష్ ఈ ఉదయం తన ట్విటర్లో ట్వీట్ చేశాడు. దళితులనే లక్ష్యంగా చేసుకుని వ్యవహరించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీరుకు వ్యతిరేకంగా.. ఆమె పేరు ముందు మనుస్మృతిని చేర్చి అప్పట్లో పలువురు నేతలు విమర్శలు గుప్పించారు. I strongly appeal to our inspiration Radhika(amma)Vemula to contest in 2019 elections and teach a lesson to Manusmriti Irani in Parliament. — Jignesh Mevani (@jigneshmevani80) 18 January 2018 రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్ సెంట్రల్‌యూనివర్సిటీలో పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రోహిత్ రెండో వర్ధంతి నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చిన జిగ్నేష్.. రాధికమ్మను కలిసి సంఘీభావం తెలిపాడు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రాధిక పాల్గొంటారని.. బీజేపీ ఓటమినే తమ అంతిమ లక్ష్యమని జిగ్నేష్ ఈ సందర్భంలో వెల్లడించారు. దళిత ఉద్యమం దేశంలోని ప్రతీమూలా విస్తరించాల్సిన అవసరం ఉందని.. దళిత వ్యతిరేక చర్యలకు మోదీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని జిగ్నేష్ వెల్లడించాడు. -
సైనికులతో స్మృతి ఇరానీ రక్షాబంధన్..!
న్యూఢిల్లీః కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ యుద్ధ భూమికి పయనమౌతున్నారు. వచ్చేవారం సియాచిన్ గ్లేసియర్ వద్ద సైనికులతో రక్షాబంధన్ జరుపుకునేందుకు సిద్ధమౌతున్నారు. స్మృతీ పర్యటనకు రక్షణమంత్రి మనోహర్ పారికర్ అనుమతికూడా మంజూరు చేశారు. హిమాలయాల్లోని తూర్పు కారాకోరం పర్వతశ్రేణుల్లో ఉన్న సియాచిన్... ఎత్తైన మంచు శిఖరం. ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధక్షేత్రంగా పేరొందిన సియాచిన్ గ్లేసియర్ ప్రాంతానికి వెళ్ళేందుకు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సన్నాహాలు చేస్తున్నారు. ఈశాన్య రాజస్థాన్, కశ్మీర్ సరిహద్దు ప్రాంతంలోని సియాచిన్ లో జవాన్లతో కలసి మంత్రి ఇరానీ రాఖీ పండుగను జరుపుకోనున్నారు. స్మృతి ఇరానీ పర్యటనకు రక్షణమంత్రి మనోహర్ పారికర్ అనుమతికూడా లభించింది. ఈ నెల 18న రక్షా బంధన్ ను పురస్కరించుకొని ఇరానీతోపాటు మహిళా మంత్రుల బృందం సియాచిన్ బేస్ క్యాంప్ కు వెళ్ళనున్నారు. కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, ఉమాభారతి, మేనకాగాంధీ, సాధ్వీ నిరంజన్ జ్యోతి, అనుప్రియ పటేల్ లు స్మతి ఇరానీతోపాటు బేస్ క్యాంపుకు వెళ్ళి అక్కడి సైనికులకు రాఖీ కట్టి రక్షాబంధన్ జరుపుకోనున్నట్లు రక్షణమంత్రిత్వ శాఖ వెల్లడించింది.