ముంబై: రుతుస్రావం గురించి అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. గురువారం మెన్స్‌స్ట్రవల్ హైజీన్ డే సందర్భంగా ఆమె ట్వీట్ చేశారు. ‘జన ఔషధి కేంద్రాలలో లక్షల మంది మహిళల కోసం శానిటరీ నాప్‌కిన్లను ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలలో ఉంచాం. అమ్మాయిలతో పాటు అబ్బాయిలకు రుతుస్రావం గురించి అవగాహన కల్పిద్దాం. రుతుస్రావం సిగ్గుపడాల్సిన విషయం కాదు’ అని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు. (‘కోహ్లి.. అనుష్కకు విడాకులు ఇచ్చేయ్’)
దీనిపై మంత్రి మన్సూక్ మాండవీయా స్పందిస్తూ ఈ మహమ్మారి కాలంలో మాత్రమే కాకుండా మామూలు రోజుల్లో కూడా రుతుస్రావ సమయంలో జాగ్రత్తలు పాటించడం అవసరమని తెలిపారు. రుతుస్రావం గురించి చర్చించడం సిగ్గు పడాల్సిన విషయం కాదని పేర్కొన్నారు. ఎందుకంటే రుతుస్రావం వల్ల మహిళలు రక్తాన్ని కోల్పొతారు కానీ, గౌరవాన్ని కాదు అని ట్వీట్ చేశారు. రుతుస్రావ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది మే 28న మెన్స్‌స్ట్రవల్ హైజీన్ డేను నిర్వహిస్తున్నారు. (వైరస్ భయం: ఫ్లైట్లో ‘ఆ నలుగురు’)
Comments
Please login to add a commentAdd a comment