AP Tops In Country For Giving Top Priority To Health Of Female Students, Know Full Details Inside - Sakshi
Sakshi News home page

దేశంలోనే ఏపీ అగ్రగామి.. చిట్టి తల్లులకు ‘స్వేచ్ఛ’ 

Published Sat, Apr 15 2023 4:52 AM | Last Updated on Sat, Apr 15 2023 3:11 PM

AP is the leader in the country in giving top priority to the health of female students - Sakshi

సాక్షి, అమరావతి: రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళా సాధికారతలో ఆంధ్రప్రదేశ్‌ మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. రేపటి పౌరులైన కిశోర బాలికల ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. సమర్థవంతంగా మెన్‌స్ట్రువల్‌ హైజీన్‌ (బహిష్టు సమయంలో పరిశుభ్రత) కార్యక్రమాల అమలులో కూడా మన రాష్ట్రం రెండో స్థానంలో ఉంటోంది.

ఈ అంశాన్ని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నెలసరి సమయంలో స్కూళ్లు, కళాశాలల్లో చదివే విద్యార్థినులు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ‘స్వేచ్ఛ’ కార్యక్రమం ద్వారా శానిటరీ నాప్‌కిన్లను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఇలా 2021–22లో 1.48 కోట్ల శానిటరీ నాప్‌కిన్ల పంపిణీతో తమిళనాడు దేశంలో మొదటి స్థానంలో ఉండగా, 1.16 కోట్లతో ఏపీ రెండో స్థానంలో ఉంది.   

ప్రతీనెలా 10 లక్షల మంది బాలికలకు.. 
రుతుక్రమం ఇబ్బందులతో బాలికలు స్కూలుకు దూరమవుతున్న పరిస్థితులను సీఎం జగన్‌ ప్రభుత్వం గుర్తించింది. డ్రాపౌట్స్‌ను తగ్గించడంతో పాటు, బాలికలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా స్వేచ్ఛ కార్యక్రమాన్ని 2021లో ప్రభుత్వం ప్రారంభించింది.

ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో ఏడు నుంచి ఇంటర్మీడియట్‌ చదువుతున్న 10,01,860 మంది బాలికలకు ప్రతినెలా 10 నాణ్యమైన, బ్రాండెడ్‌ శానిటరీ నాప్‌కిన్లను ఉచితంగా అందిస్తున్నారు. ఇందుకోసం ఏటా ప్రభుత్వం రూ.30 కోట్ల మేర ఖర్చుచేస్తోంది. అంతేకాక.. ఎదుగుతున్న సమయంలో శరీరంలో వచ్చే మార్పుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళా ఉపాధ్యాయులు, ఏఎన్‌ఎంలు, ఫ్యామిలీ డాక్టర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.

ప్రత్యేకంగా అడోలసెంట్‌ ఫ్రెండ్లీ క్లినిక్‌లు.
ఇక కౌమార దశలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యల నివృత్తికి,వైద్యసేవలు అందించేందుకు అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో అడోలసెంట్‌ ఫ్రెండ్లీ క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు.    
అపరిశుభ్ర పద్ధతులతో సమస్యలివే..

నెలసరిలో వస్త్రాన్ని వాడే విధానాన్ని అపరిశుభ్ర పద్ధతిగా వైద్యులు చెబుతారు. ఇలా వాడటంతో జననాంగం సంబంధిత ఇన్ఫెక్షన్లు వస్తాయి.  
జననాంగంలో రక్షణకు అవసరమైన హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ను స్రవించే లాక్టోబాసిల్లై అనే మంచి బ్యాక్టీరియాతో పాటు కొద్దిమోతాదులో వేరే బ్యాక్టీరియా కూడా ఉంటుంది. వస్త్రం వంటి అపరిశుభ్ర పద్ధతులతో జననాంగం సంబంధిత ఇన్ఫెక్షన్ల ముప్పు ఏర్పడ్డాక సంతానలేమి, శృంగారంతో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే పెలి్వక్‌ ఇన్‌ఫ్లమేటరీ వ్యాధు­లొ­స్తాయి. హానికరమైన బ్యాక్టీరియాతో యూరినరీ ఇన్ఫెక్షన్‌ కూడా వస్తుంది. సంతానలేమి సమస్యలు తలెత్తుతాయి.  

చాలా మార్పు కనిపిస్తోంది 
ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థినుల్లో చాలామంది పేద కుటుంబాలకు చెందినవారే. వీరు నెలసరిలో పాఠశాలకు గైర్హాజరయ్యే వారు. ప్రస్తుతం ప్రభు­త్వమే ఉచితంగా శానిటరీ నాప్‌కిన్లు ఇస్తోంది. పాఠశాలల్లో బాత్‌రూమ్‌లు, ఇతర వసతులు మెరుగుపడ్డాయి. దీంతో గతంతో పోలిస్తే గైర్హాజరు తక్కువగా ఉంటోంది. 
– కేవీ పద్మావతి, ఉపాధ్యాయురాలు, అడవివరం, జెడ్పీ ఉన్నత పాఠశాల, విశాఖపట్నం 

ప్రతి స్కూల్‌లో అంబాసిడర్లుగా ఇద్దరు టీచర్లు 
మెన్‌స్ట్రువల్‌ హైజీన్‌ కార్యక్రమాలను విద్యా సంస్థల్లో నిర్వహించడానికి ప్రతి విద్యాసంస్థలో ఇద్దరు టీచర్లను హెల్త్, వెల్‌నెస్‌ అంబాసిడర్లుగా గుర్తించారు. వీరితోపాటు మెడి­కల్‌ ఆఫీసర్లకు ఎయిమ్స్‌ వైద్యుల ద్వారా మెన్‌స్ట్రు­వల్‌ హైజీన్‌పై శిక్షణ ఇప్పించాం. వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బాలికలకు అవగాహన కల్పిస్తున్నారు.   
– డాక్టర్‌ కేవీఎన్‌ఎస్‌ అనిల్‌కుమార్,  అడిషనల్‌ డైరెక్టర్‌ వైద్య శాఖ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement