Menstrual time
-
నెలసరి పురుషులకూ వస్తే తెలిసేది!: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ఓ మహిళా జడ్జికి గర్భస్రావం అయిన పరిస్థితిని కనీస పరిగణనలోకి తీసుకోకుండా తొలగించడాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ హైకోర్టు నిర్ణయాన్ని సుమోటోగా విచారణ జరుపుతోంది. అయితే..ఆశించిన స్థాయిలో పనితీరు లేదనే కారణంతో ఆరుగురు సివిల్ జడ్జిలను తొలగిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు గతేడాది సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే అందులో నలుగురిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఫుల్ బెంచ్ నిర్ణయించింది. ఊరట దక్కని ఇద్దరు.. ఎంత విజ్ఞప్తి చేసినా ఉన్నత న్యాయస్థానం వినలేదు. అయితే.. ఓ న్యాయమూర్తి తనకు గర్భస్రావం కావడంతోపాటు తన సోదరుడు క్యాన్సర్ బారినపడినట్లు హైకోర్టు ధర్మాసనం ముందు వివరణ ఇచ్చినప్పటికీ ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన జస్టిస్ నాగరత్న, ఎన్కే సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. మంగళవారం విచారణ జరిపింది.‘‘ఆ న్యాయమూర్తికి గర్భవిచ్ఛిత్తి జరిగింది. అటువంటి మహిళ మానసికంగా, శారీరకంగా ఎంతో వేదనకు గురయ్యే అవకాశం ఉంది. పురుషులకూ నెలసరి వస్తే ఆ సమస్య ఏంటనేది తెలిసేది’’ అని జస్టిస్ బీవీ నాగరత్న వ్యాఖ్యానించారు. అలాగే.. ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం పనితీరు ఆధారంగా ఆమెను తొలగిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. అటువంటి ప్రమాణాలు పురుష న్యాయమూర్తులకూ ఉండాలని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో.. సివిల్ జడ్జీల తొలగింపు విధివిధానాలపై వివరణ ఇవ్వాలంటూ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. -
మహిళా ఉద్యోగులకు శుభవార్త.. నెలసరి సెలవులపై కీలక ప్రకటన!
దేశంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగినులకు ఒకరోజు నెలసరి సెలవు ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కటక్‌లో జరిగిన జిల్లా స్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఒడిశా ఉప ముఖ్యమంత్రి ప్రవతి పరిదా ఈ ప్రకటన చేశారు.మహిళల ఆరోగ్యం, శ్రేయస్సే లక్ష్యంగా నెలసరి సెలవుల్ని తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు ప్రవితా పరిదా తెలిపారు. ఈ విధానంలో మహిళా ఉద్యోగులు వారి నెలసరి సమయంలో మొదటి లేదా రెండవ రోజు సెలవు తీసుకోవచ్చని అన్నారు. Menstrual LeaveDeputy CM @PravatiPOdisha announces 1-day menstrual leave for working women in both Government & Private sectors pic.twitter.com/D2L91YXtqr— Soumyajit Pattnaik (@soumyajitt) August 15, 2024 ఉద్యోగినులకు నెలసరి సెలవు ఇవ్వాలనే డిమాండ్ ఇటీవల ఎక్కువైంది. సుప్రీంకోర్టు ఈ విషయంలో ఏ నిర్ణయమూ చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వాలతో, ఉపాధి సంస్థలతో చర్చించి కేంద్రం తీసుకోవాల్సిన పాలసీ నిర్ణయం అని తెలిపింది. అంతేకాదు, నెలసరివేళ ఇబ్బందిపడే ఉద్యోగినులకు రుతుస్రావ సెలవులపై మోడల్ పాలసీని రూపొందించాలని గత నెల 9న కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. ఈ విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన విధానానికి రూపకల్పన చేయాలని కూడా ఆదేశించింది. -
విద్యార్థినులకు ‘ప్రత్యేక’ సెలవు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలోనే తొలిసారిగా విశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ (డీఎస్ఎన్ఎల్యూ) విద్యార్థినులకు నెలలో ఒక రోజు నెలసరి సెలవును ప్రకటించింది. కేవలం మెయిల్ ద్వారా ఈ ప్రత్యేక సెలవు తీసుకునే అవకాశం విద్యార్థినులకు కల్పించింది. ప్రస్తుత (2024–25) విద్యా సంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్టు యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. నెలసరి సమయాల్లో మహిళల్లో వచ్చే కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.నెలసరి సమయాల్లో ఆరోగ్య సమస్యలతో విద్యార్థినులు కాలేజీకి వెళ్లడంలేదు. ప్రత్యేకంగా సెలవు కావాలంటే మెడికల్ సరి్టఫికెట్ సమర్పించాలి. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక సెలవు కోరుతూ యూనివర్సిటీ విద్యార్థినులు గత విద్యా సంవత్సరంలోనే రిజి్రస్టార్ ముందు ఈ ప్రతిపాదన పెట్టారు. జనవరిలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దేశంలో 8 యూనివర్సిటీల్లో అమలు ఇప్పటికే దేశంలోని 7 యూనివర్సిటీల్లో ఈ విధానం అమల్లో ఉంది. రాయిపూర్‌లోని హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ, ముంబై, ఔరంగాబాద్‌ల్లో ఉన్న మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీలు, భోపాల్‌లోని నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ, జబల్పూర్లోని ధర్మశాస్త్ర నేషనల్ లా యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని నల్సార్, అసోంలోని నేషనల్ లా యూనివర్సిటీ అండ్ జ్యుడిíÙయల్ అకాడమీల్లో ఈ వి«ధానం అమలవుతోంది. దామోదరం సంజీవయ్య నేషనల్ లా వర్సిటీ ఎనిమిదోది. -
Chhattisgarh: నెలసరి సెలవు విధానం అమలు
ఛత్తీస్‌గఢ్‌లోని హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ (హెచ్‌ఎల్‌యూ) విద్యార్థినులకు పీరియడ్స్ సెలవు విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఈ ఏడాది జూలై ఒకటి నుంచి యూనివర్శిటీలో దీనిని అమలు చేస్తున్నట్లు పేర్కొంది.హెచ్ఎన్ఎల్యు చేపట్టిన ‘హెల్త్ షీల్డ్’ కార్యక్రమంలో భాగంగానే ఈ సెలవు విధానం అమలు చేసినట్లు యూనివర్సిటీ తెలియజేసింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వీ.సీ. వివేకానందన్ మాట్లాడుతూ యువ విద్యార్థినుల ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని పీరియడ్స్ సెలవు విధానాన్ని అమలు చేయడం మెచ్చుకోదగిన విధానమని అన్నారు. దీనికి మద్దతిచ్చినందుకు అకడమిక్ కౌన్సిల్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.యూనివర్శిటీ ప్రతినిధి మాట్లాడుతూ ఈ విధానంలో విద్యార్థినులు క్యాలెండర్ నెలలో ఒక రోజు పీరియడ్స్ సెలవు తీసుకోవచ్చు. భవిష్యత్తులో పరీక్షా రోజులలో కూడా ఇటువంటి ప్రత్యేక సెలవులు మంజూరు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. క్రమరహిత ఋతు సిండ్రోమ్ లేదా పీసీఓఎస్ (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) వంటి రుగ్మతలు ఉన్న బాలికలు ఒక సెమిస్టర్లో ఆరు రోజుల వరకూ సెలవు తీసుకోవచ్చని అన్నారు.అంతకుముందు 2023 జనవరిలో కేరళలోని కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దేశంలో తొలిసారిగా పీరియడ్స్ సెలవు విధానాన్ని ప్రారంభించింది. అనంతరం పంజాబ్ యూనివర్శిటీ ఆఫ్ చండీగఢ్, గువాహటి యూనివర్శిటీ ఆఫ్ అస్సాం, నల్సార్ యూనివర్శిటీ (హైదరాబాద్), అస్సాంలోని తేజ్‌పూర్ యూనివర్శిటీలు కూడా ఈ విధమైన సెలవు విధానాన్ని ప్రారంభించాయి. -
రుతుస్రావ సెలవులపై మోడల్ పాలసీ
న్యూఢిల్లీ: నెలసరివేళ ఇబ్బందిపడే ఉద్యోగిను లకు రుతుస్రావ సెలవులపై మోడల్ పాలసీని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయంలో సంబంధిత వర్గాలు, రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైన విధానానికి రూపకల్పన చేయాలని సోమవారం కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. అయితే విధాన నిర్ణేతల పరిధిలోని ఈ అంశాల్లో కోర్టులు జోక్యంచేసుకోబోవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా విద్యార్థినులు, ఉద్యోగినులకు ప్రతినెలా నెలసరి సెలవులు ఇవ్వాలంటూ లాయర్ శైలేంద్రమణి త్రిపాఠి వేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ కోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. ‘‘రుతుస్రావ సెలవుపై కోర్టు నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగినుల ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. అసౌకర్యంవేళ సెలవు దొరుకుతుందని భావిస్తే ఎక్కువ మంది ఉద్యోగాలు చేసేందుకు మొగ్గుచూపుతారు. అయితే ఉద్యోగినులకు ఇలాంటి సెలవు ఇవ్వడం ఇష్టంలేని సంస్థలు, యాజమాన్యాలు మహిళలకు ఉద్యోగం ఇచ్చేందుకు విముఖత చూపే ప్రమాదం కూడా ఉంది. ఉన్న ఉద్యోగినులను కూడా తగ్గించుకునే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి విపరిణామాలకు మేం అవకాశం ఇవ్వదల్చుకోలేదు. వాస్తవానికి ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. ఇందులో కోర్టు జోక్యం ఉండకూడదు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. చైనా, బ్రిటన్, జపాన్, ఇండోనేసియా, స్పెయిన్, జాంబియా, దక్షిణకొరియాలో ఏదో ఒక కేటగిరీ కింద ఇలాంటి సెలవులు ఇస్తున్నాయంటూ లాయర్ చేసిన వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ‘‘ఈ సెలవులు ఇవ్వాలని గత ఏడాది మే నెలలోనే పిటిషనర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్రం నుంచి ఇంతవరకు స్పందన లేదు. విధానపర నిర్ణయమైన ఇలాంటి అంశంలో కోర్టులు జోక్యం చేసుకోలేవు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. -
నెలసరి సెలవులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: మహిళలకు ఉద్యోగ ప్రదేశాల్లో పీరియడ్ లీవ్స్(నెలసరి సెలవులు) ఇవ్వడం తప్పనిసరిగా చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ చేపట్టింది. నెలసరి సెలవులకు సంబంధించిన విధానాలను రూపొందించాలని కేంద్రం, రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలకు పీరియడ్ సెలవులు తప్పనిసరి చేయడం వాళ్ల వారికి ఉద్యోగ అవకాశాలు దూరం చేసే ప్రమాదం ఉందని. ఈ విధానం ఇది వారికి వ్యతిరేకంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అంతేగాక ఇది కోర్టులు తేల్చాల్సిన విషయం కాదని, ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు పిటిషన్‌ను కొట్టివేసింది.‘మహిళలకు నెలసరి సెలవులు మంచి నిర్ణయమే. కానీ నెలసరి సెలవులను తప్పనిసరి చేయడం వల్ల మహిళలు ఉద్యోగ అవకాశాలకు దూరం కావొచ్చు. కొన్నిసార్లు మనం చేసే మంచి ప్రయత్నాలు వారికి ప్రతికూలంగా మారవచ్చు.’ అని డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు.ఈ సమస్య అనేక విధానపరమైన అంశాలతో ముడిపడి ఉందని, కోర్టు జోక్యం చేసుకోవల్సినది కాదని కోర్టు అభిప్రాయపడింది. పిటిషనర్ తన అభ్యర్థనను కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ దృష్టికి తీసుకెళ్లాలని తెలిపింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం విస్తృత చర్చలు జరిపి ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించే అంశంపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ‘ఈ పిటిషన్‌ను మహిళా, శిశు సంక్షేమ శాఖలోని కార్యదర్శి, అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వద్దకు తీసుకెళ్లేందుకు కోర్టు అనుమతిస్తుంది. విధాన స్థాయిలో ఈ విషయాన్ని పరిశీలించి, అన్ని సంప్రదింపులు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని కార్యదర్శిని అభ్యర్థిస్తున్నాం.’ అని పేర్కొంది. అంతేగాక ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు తమ తీర్పు అడ్డు రాదని కోర్టు స్పష్టం చేసింది. చివరగా ఇది వాస్తవానికి ప్రభుత్వ విధానపరమైన అంశమని, ఈ నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని చెబుతూ.. ఈ పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది.కాగా గత ఫిబ్రవరిలోనూ మహిళా విద్యార్ధినిలకు, ఉద్యోగులకు నెలసరి సెలవులు ఇవ్వాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలవ్వగా.. దీనిపై కూడా విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది.ఇక ప్రస్తుతం బిహార్, కేరళ రాష్ట్రాలు మాత్రమే నెలసరి సెలవులు ఇస్తున్నాయి. బిహార్‌లో మహిళా ఉద్యోగులకు రెండు రోజుల సెలవుల విధానం ఉండగా, కేరళలో మహిళా విద్యార్థులకు మూడు రోజుల సెలవులు ఇస్తోంది. -
అమ్మాయిల్లో తొలి పీరియడ్స్ : అదే పెద్ద ముప్పు అంటున్నతాజా అధ్యయనం
సాధారణంగా ఆడపిల్లలు 12 నుంచి 14 సంవత్సరాల వయసులో రజస్వల అయ్యేవారు. మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్లు, జన్యుపరమైన కారణాలు, తదితర కారణాల రీత్యా ఈ మధ్య కాలంలోనే చాలా చిన్న వయసులోనే పీరియడ్స్ మొదలై పోతున్నాయి. అంటే దాదాపు 8-10 ఏళ్ల మధ్యే మెచ్యూర్ అవుతుండటాన్ని చూస్తున్నాం. అయితే తొలి ఋతుస్రావం, చిన్నతనంలోని స్థూలకాయంతో ముడిపడి ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.హార్వర్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నేతృత్వంలోని అధ్యయనం ప్రకారం, మొదటి పీరియడ్స్ వచ్చే సగటు వయస్సు 1950-1969 నుండి 2000-2005 వరకు జన్మించిన మహిళల్లో 12.5 సంవత్సరాల నుండి 11.9 సంవత్సరాలకు పడిపోయింది. అమెరికాలోని 70వేల మందికి పైగా యువతులపై ఈ పరిశోధన జరిగింది. అంతేకాదు చిన్నతనంలో రజస్వల కావడం హృదయ సంబంధ వ్యాధులు , కేన్సర్ వంటి ప్రతికూల ఆరోగ్య ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం కనుగొంది. ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (JAMA) నెట్వర్క్ ఓపెన్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం, జాతులు , సామాజిక వర్గాలలో మహిళల్లో రుతుక్రమ పోకడలను గుర్తించిన తొలి అధ్యయంనంగా పరిశోధకులు పేర్కొన్నారు.ఋతు చక్రాలు సక్రమంగా ఉండేందుకు సమయం పడుతుందని అధ్యయనం వెల్లడించింది. 1950- 1969 మధ్య జన్మించిన వారిలో 76 శాతంమందిలో తొలి పీరియడ్స్ తర్వాత రెండు సంవత్సరాలలోపు రెగ్యులర్ పీరియడ్స్కనిపించగా, 2000- 2005 మధ్య జన్మించిన 56 శాతం మహిళళ్లో మాత్రమే పీరియడ్స్ రెగ్యులర్‌గా వచ్చాయి. ప్రారంభ నెలసరి, దాని కారణాలను పరిశోధనలు కొనసాగించడం చాలా కీలకమని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో పోస్ట్‌డాక్టోరల్ రీసెర్చ్ ఫెలో , సంబంధిత రచయిత జిఫాన్ వాంగ్ తెలిపారు. -
‘నెలసరి విషయం వారికి ఎందుకు తెలియాలి?’
ఢిల్లీ: నెలసరి అనేది మహిళల జీవితంలో ఒక సహజమైన ప్రక్రియ అని.. అదేం వైకల్యం కాదని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మహిళా మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. భారత్‌లో మహిళా ఉద్యోగులకు నెలసరికి పెయిడ్ లీవ్ ఇవ్వాలన్న డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. నెలసరి సమయంలో ప్రత్యేకంగా వేతనంతో కూడిన సెలవు ప్రకాటించాల్సిన అవసరం లేదని స్పష్టం చేయడంతో పలువురు మహిళా నేతలు ఆమె వ్యాఖ్యలను తప్పు పట్టారు. ఇక ఈ విషయంలో ఆమె తీవ్ర విమర్శల పాలయ్యారు. ఇదే విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్మృతి ఇరానీ మాట్లాడారు. మహిళలకు సంబంధించిన సున్నితమైన నెలసరి విషయం ఉద్యోగం చేసే చోటు సదరు సంస్థల యాజమనులకు ఎందుకు తెలియాలి? అని అన్నారు. ఇది మహిళలకు కొంత అసౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం నెలసరి సమయంలో వేతనంతో కూడిన సెలవుపై ఒక తప్పనిసరి విధానం తీసుకురాలేదని వెల్లడించారు. ఒకవేళ ఒంటరి మహిళగా ఉన్న ఉద్యోగిని తాను ఆ సమయంలో సెలవు తీసుకోవడానికి ఆసక్తి చూపించకపోతే.. తాను వేధింపులను ఎదుర్కొవల్సి వస్తుందని తెలిపారు. అధికారికంగా పెయిడ్ లీవ్ మంజూరు చేస్తే.. ఈ విషయాన్ని సంస్థల్లో హెచ్ఆర్, అకౌంట్స్ వాళ్లకు తెలియజేయాల్సి ఉంటుందని అన్నారు. అలా పలు సంస్థల్లో పని చేసే చోట తెలియకుండానే మహిళలపై ఒక వివక్షను పెంచినవాళ్లము అవుతుమని తెలిపారు. అయితే తాను పార్లమెంట్లో ఇచ్చిన సమాధానం సంబంధించి ప్రశ్న మరోకటిని వెల్లడించారు. ఆ రోజు ఎంపీ మనోజ్ ఝా LGBTQIA+ కోసం ప్రభుత్వం వద్ద ఏదైనా పీరియడ్ సెలవు విధానం ఉందా? అని అడిగారని తెలిపారు. గార్భాశయం లేని ఏ స్వలింగ సంపర్కుడికి రుత చక్రం ఉంటుంది? అని తాను చెసిన వ్యాఖ్యలపై మరోవిధంగా వ్యాప్తి చెంది వివాదం రేగిందని చెప్పారు. మరోవైపు మహిళల బాధను కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ విస్మరించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించిన విషయం తెలిసిందే. వాస్తవిక సవాళ్ల పట్ల సానుభూతి చూపకపోవడం విస్తుగొల్పుతోందని స్మృతీ ఇరానీ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ కవిత తప్పుపట్టారు. చదవండి: ధన్‌ఖడ్‌పై ఖర్గే విమర్శలు.. నేను అలా అనుకోవాలా? -
దేశంలోనే ఏపీ అగ్రగామి.. చిట్టి తల్లులకు ‘స్వేచ్ఛ’
సాక్షి, అమరావతి: రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళా సాధికారతలో ఆంధ్రప్రదేశ్ మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. రేపటి పౌరులైన కిశోర బాలికల ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. సమర్థవంతంగా మెన్స్ట్రువల్ హైజీన్ (బహిష్టు సమయంలో పరిశుభ్రత) కార్యక్రమాల అమలులో కూడా మన రాష్ట్రం రెండో స్థానంలో ఉంటోంది. ఈ అంశాన్ని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నెలసరి సమయంలో స్కూళ్లు, కళాశాలల్లో చదివే విద్యార్థినులు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ‘స్వేచ్ఛ’ కార్యక్రమం ద్వారా శానిటరీ నాప్కిన్లను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఇలా 2021–22లో 1.48 కోట్ల శానిటరీ నాప్కిన్ల పంపిణీతో తమిళనాడు దేశంలో మొదటి స్థానంలో ఉండగా, 1.16 కోట్లతో ఏపీ రెండో స్థానంలో ఉంది. ప్రతీనెలా 10 లక్షల మంది బాలికలకు.. రుతుక్రమం ఇబ్బందులతో బాలికలు స్కూలుకు దూరమవుతున్న పరిస్థితులను సీఎం జగన్ ప్రభుత్వం గుర్తించింది. డ్రాపౌట్స్‌ను తగ్గించడంతో పాటు, బాలికలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా స్వేచ్ఛ కార్యక్రమాన్ని 2021లో ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఏడు నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న 10,01,860 మంది బాలికలకు ప్రతినెలా 10 నాణ్యమైన, బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్లను ఉచితంగా అందిస్తున్నారు. ఇందుకోసం ఏటా ప్రభుత్వం రూ.30 కోట్ల మేర ఖర్చుచేస్తోంది. అంతేకాక.. ఎదుగుతున్న సమయంలో శరీరంలో వచ్చే మార్పుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళా ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలు, ఫ్యామిలీ డాక్టర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేకంగా అడోలసెంట్ ఫ్రెండ్లీ క్లినిక్‌లు.. ఇక కౌమార దశలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యల నివృత్తికి,వైద్యసేవలు అందించేందుకు అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో అడోలసెంట్ ఫ్రెండ్లీ క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు. అపరిశుభ్ర పద్ధతులతో సమస్యలివే.. ♦ నెలసరిలో వస్త్రాన్ని వాడే విధానాన్ని అపరిశుభ్ర పద్ధతిగా వైద్యులు చెబుతారు. ఇలా వాడటంతో జననాంగం సంబంధిత ఇన్ఫెక్షన్లు వస్తాయి. ♦ జననాంగంలో రక్షణకు అవసరమైన హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను స్రవించే లాక్టోబాసిల్లై అనే మంచి బ్యాక్టీరియాతో పాటు కొద్దిమోతాదులో వేరే బ్యాక్టీరియా కూడా ఉంటుంది. వస్త్రం వంటి అపరిశుభ్ర పద్ధతులతో జననాంగం సంబంధిత ఇన్ఫెక్షన్ల ముప్పు ఏర్పడ్డాక సంతానలేమి, శృంగారంతో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే పెలి్వక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధులొస్తాయి. హానికరమైన బ్యాక్టీరియాతో యూరినరీ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. సంతానలేమి సమస్యలు తలెత్తుతాయి. చాలా మార్పు కనిపిస్తోంది ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థినుల్లో చాలామంది పేద కుటుంబాలకు చెందినవారే. వీరు నెలసరిలో పాఠశాలకు గైర్హాజరయ్యే వారు. ప్రస్తుతం ప్రభుత్వమే ఉచితంగా శానిటరీ నాప్కిన్లు ఇస్తోంది. పాఠశాలల్లో బాత్రూమ్లు, ఇతర వసతులు మెరుగుపడ్డాయి. దీంతో గతంతో పోలిస్తే గైర్హాజరు తక్కువగా ఉంటోంది. – కేవీ పద్మావతి, ఉపాధ్యాయురాలు, అడవివరం, జెడ్పీ ఉన్నత పాఠశాల, విశాఖపట్నం ప్రతి స్కూల్లో అంబాసిడర్లుగా ఇద్దరు టీచర్లు మెన్స్ట్రువల్ హైజీన్ కార్యక్రమాలను విద్యా సంస్థల్లో నిర్వహించడానికి ప్రతి విద్యాసంస్థలో ఇద్దరు టీచర్లను హెల్త్, వెల్నెస్ అంబాసిడర్లుగా గుర్తించారు. వీరితోపాటు మెడికల్ ఆఫీసర్లకు ఎయిమ్స్ వైద్యుల ద్వారా మెన్స్ట్రువల్ హైజీన్‌పై శిక్షణ ఇప్పించాం. వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బాలికలకు అవగాహన కల్పిస్తున్నారు. – డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్, అడిషనల్ డైరెక్టర్ వైద్య శాఖ -
సెలవుతో పాటు.. ఈడేరే వయసు అమ్మాయిల కోసం ‘ప్యూబర్టీ ల్యాబ్’! మార్పు మంచిదే
Kerala- Menstrual Holiday: కేరళలో యూనివర్సిటీ విద్యార్థినులకు అధికారికంగా బహిష్టు సెలవులు లభించాయి. ఆ వరుసలో దేశంలోనే మొదటిసారిగా కొట్టాయంలోని ఒక సిబిఎస్ఇ స్కూలు తన విద్యార్థినులకు బహిష్టు సెలవు ప్రకటించింది. అంతేకాదు తన స్కూలులో ఈడేరే వయసు అమ్మాయిల కోసం ‘ప్యూబర్టీ ల్యాబ్’ను ఏర్పాటు చేయనుంది. పుష్పవతులైన అమ్మాయిలకు ఈ ల్యాబ్‌లో సూచనలు సలహాలు ఇవ్వడమే కాదు ప్యాడ్స్ వాడకం కూడా తెలుపుతారు. విద్యార్థినుల అటెండెన్స్‌లో తప్పనిసరి శాతాన్ని సవరిస్తూ యూనివర్సిటీల్లో, హైస్కూళ్లలో ఇలాంటి సెలవు ఇవ్వడాన్ని ప్రతి రాష్ట్రం ఆలోచించాల్సి ఉంది. సమస్యలను గుర్తించి మనిషి నాగరికుడు కావడం అంటే తను నివసించే సమాజాన్ని స్నేహపూరితంగా, వేదనా రహితంగా, ఎవరికీ ఇబ్బంది కలగని రీతిలో నిర్మించుకోవడమే. ప్రతి సమూహపు ప్రజాస్వామికమైన డిమాండ్లను పరిష్కరించుకుంటూ వెళ్లడమే. సమస్యలను గుర్తించి వాటిని పరిగణిస్తూ పోవడమే. ఈ సమాజం మహిళా స్నేహితంగా ఉండాలని మహిళలు ఏనాటి నుంచో కోరుకుంటున్నారు. గొప్ప స్త్రీ పక్ష నిర్ణయం ముఖ్యంగా వారి దైహిక సమస్యలను, పరిమితులను గుర్తించి ఆ మేరకు అన్ని రంగాలు, విధానాలలో ఎరుక ప్రదర్శించమని అంటున్నారు. ఉద్యోగాల్లో స్త్రీలు మెటర్నిటీ లీవు పొందడానికి సుదీర్ఘ కాలం పట్టింది. ఆ తర్వాత ఎన్నో ఏళ్ల పోరాటానికి ఫలితంగా ఇటీవల అనేక సంస్థలు బహిష్టు సెలవులు స్త్రీలకు మంజూరు చేస్తున్నాయి. దానికి కొనసాగింపుగా తాజాగా కేరళ ప్రభుత్వం యూనివర్సిటీ విద్యార్థినులకు అధికారికంగా బహిష్టు సెలవులు మంజూరు చేసింది. ఇది చాలా గొప్ప స్త్రీ పక్ష నిర్ణయం. ఆమె లీడర్ అయ్యాక కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ మొన్నటి జనవరి 11న తన యూనివర్సిటీ విద్యార్థినులకు బహిష్టు సెలవలు ఇస్తున్నట్టుగా ప్రకటించింది. దానికి కారణం ఆ యూనివర్సిటీలో డిసెంబర్లో స్టూడెంట్ ఎలక్షన్లు జరిగి ఎస్.ఎఫ్.ఐ తరఫున నమితా జార్జ్ అనే విద్యార్థిని స్టూడెంట్ యూనియన్‌కు చైర్ పర్సన్‌గా ఎంపిక కావడం. పాలక్కడ్‌కు చెందిన 23 ఏళ్ల నమిత ఆ యూనివర్సిటీలో లా ఫైనల్ ఇయర్ చదువుతోంది. తనలాంటి విద్యార్థినుల ఇబ్బంది గమనిస్తూ రావడం వల్ల తాను లీడర్ అయిన వెంటనే విద్యార్థినులకు బహిష్టు సెలవులు ఎంత అవసరమో వివరిస్తూ ఆమోదం కోసం యూనివర్సిటీకి లేఖ రాసింది. యూనివర్సిటీ వెంటనే ఈ లేఖను పరిగణించి జనవరి 11న బహిష్టు సెలవులు ప్రకటించింది. అంతేకాదు తన యూనివర్సిటీలో 18 ఏళ్లు పైబడిన విద్యార్థినులకు 2 నెలల ప్రసూతి సెలవు వాడుకునే వెసులుబాటును ప్రకటించింది. విద్యార్థినుల తరఫున చేయదగ్గ కనీస నిర్ణయంగా యూనివర్సిటీ ఈ చర్యను వ్యాఖ్యానించింది. కదిలిన ప్రభుత్వం కొచ్చిన్ యూనివర్సిటీ విద్యార్థినులకు బహిష్టు సెలవులు ప్రకటించాక దానికి వచ్చిన స్పందన చూసి కేరళ ప్రభుత్వం స్పందించింది. కేరళలోని మొత్తం 14 యూనివర్సిటీల్లో విద్యార్థినులకు బహిష్టు సెలవు, ప్రసూతి సెలవు మంజూరు చేసింది. యూనివర్సిటీల్లో సెమిస్టర్లు రాయడానికి 75 శాతం హాజరు అవసరం. కాని విద్యార్థినులకు ఇక మీదట 73 శాతం హాజరు ఉంటే సరిపోతుంది. 2 శాతం బహిష్టు సెలవుల కింద పోతుంది. ఈ నిర్ణయం వెలువడటం వెనుక అక్కడి ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఒక మహిళ డాక్టర్ ఆర్.బిందు ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. స్కూళ్ల మాట ఏమిటి? ఈ నిర్ణయం వెలువడ్డాక జూనియర్ కాలేజీల్లో, స్కూళ్లలో విద్యార్థినుల బహిష్టు సెలవుల గురించి చర్చ వచ్చింది. వారిని పరిగణనలోకి తీసుకోవడానికి ప్రభుత్వం తగిన విధానం కోసం అధ్యయనం చేస్తోంది. ఈలోపు కొట్టాయంలోని ‘లేబర్ ఇండియా పబ్లిక్ స్కూల్’ అనే సిబిఎస్ఇ స్కూలు తన స్కూల్లోని విద్యార్థినులకు బహిష్టు సెలవులు తనకు తానుగా మంజూరు చేసింది. అంతేకాదు ‘ప్యూబర్టీ ల్యాబ్’ పేరుతో ఒక ల్యాబ్‌ను తెరిచి ఈడేరే పిల్లల కోసం బహిష్టు క్లినిక్, శుభ్రత శిక్షణ, ప్యాడ్ల తయారీ, లైంగిక ఆరోగ్యం గురించి అవగాహన అందుబాటులోకి తేనుంది. ‘తెలిసీ తెలియని వయసులో బహిష్టు సమయంలో ఆడపిల్లలకు ఎన్నో భయాలు, ఆందోళనలు, మానసిక, శారీరక సమస్యలు ఉంటాయి. వాటిని నివృత్తి చేసే వ్యవస్థ అవసరం’ అని ఆ స్కూలు యాజమాన్యం చెప్పింది. అతి ముఖ్యమైన సమస్య కేరళలోనే కాదు దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఆడపిల్లలు హైస్కూల్లో డ్రాపవుట్స్ కావడానికి బహిష్టు సమస్య, టాయిలెట్ల సమస్య ముఖ్య కారణాలని ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. శానిటరీ ప్యాడ్స్‌ను ఉచితంగా ఇచ్చే ప్రయత్నాలు ఇంకా పూర్తి స్థాయి జరగడం లేదు కాని కదలిక వచ్చింది. టాయిలెట్ల సమస్య కూడా కొన్ని రాష్ట్రాల్లో సమర్థంగా కొన్ని రాష్ట్రాల్లో అంతంత మాత్రంగా తీరుతోంది. విద్యార్థినులు బహిష్టు మూడు రోజులు తీవ్ర ఇబ్బందితో స్కూల్‌కు రాలేకపోతే హాజరుకు భయపడి అసలుకే ఎగనామం పెట్టవచ్చు. అదే బహిష్టు సెలవు ఉంటే ధైర్యంగా పెట్టుకునే వీలు ఉంటుంది. ఈ సెలవు అవసరమా అని కొట్టాయంలోని స్కూలు యాజమాన్యాన్ని అడిగితే ‘ఆరోగ్యం బాగలేకపోతే పిల్లలు ఎలా బడికి రారో బహిష్టు సమయంలో కూడా అలానే రారని అర్థం చేసుకుంటే సరిపోతుంది’ అన్నారు. నిజమే. జ్వరం వస్తే స్కూలుకు పోనట్టు పిరియడ్స్ సమయంలో ఇబ్బంది ఉంటే స్కూలుకు పోని వీలు విద్యార్థినులకు ఉండాలి. స్త్రీల గురించి ఆలోచించే కొద్ది ఎన్ని మార్పులు వ్యవస్థలో రావాలో మెల్లమెల్లగా అర్థమవుతోంది. విద్యార్థినులకు ఈ సౌకర్యం ఎంత అవసరమో ప్రతి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఆడపిల్లల చదువు మరింత సౌకర్యంగా కొనసాగుతుందనడంలో సందేహం లేదు. చదవండి: పిల్లల్లో రోజూ 80 – 100 వరకు తల వెంట్రుకలు రాలుతుంటే ఓసారి... -
Seher Mir: అమ్మలు మెచ్చిన కూతురు
‘నా కూతురు వయసు కూడా లేదు. ఈ అమ్మాయి నాకు ఏం చెబుతుంది’ అనుకుంది ఒక అమ్మ. అయితే ఆ అమ్మాయి చెప్పిన మంచిమాటలు విన్న తరువాత, ఆ అమ్మ తన దగ్గరకు వచ్చి ‘చల్లగా జీవించు తల్లీ’ అని ఆశీర్వదించింది. నలుగురికి ఉపయోగపడే పనిచేస్తే అపూర్వమైన ఆశీర్వాదబలం దొరుకుతుంది. అది మనల్ని నాలుగు అడుగులు ముందు నడిపిస్తుంది... పుల్వామా (జమ్ము–కశ్మీర్) జిల్లాలోని పంపోర్ ప్రాంతానికి చెందిన పదిహేడు సంవత్సరాల సెహెర్ మీర్ క్లాస్‌రూమ్‌లో పాఠాలు చదువుకోవడానికి మాత్రమే పరిమితం కావడం లేదు. సమాజాన్ని కూడా చదువుతోంది. ఈ క్రమంలోనే ఎన్నో సమస్యల గురించి తెలుసుకుంది. వాటి గురించి విచారించడం కంటే తన వంతుగా ఏదో ఒకటి చేయాలనుకుంది. తన ఆలోచనలో భాగంగా మిత్రులతో కలిసి ‘ఝూన్’ అనే స్వచ్ఛందసంస్థను ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలలు, గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశుభ్రత, శుభ్రమైన న్యాప్కిన్ల వాడకం, రుతుక్రమం, అపోహలు... ఇలా ఎన్నో విషయాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది మీర్. మొదట్లో ‘ఈ చిన్న అమ్మాయి మనకేం చెబుతుందిలే’ అన్నట్లుగా చూశారు చాలామంది. కొందరైతే సమావేశానికి పిలిచినా రాలేదు. ఆతరువాత మాత్రం ఒకరి ద్వారా ఒకరికి మీర్ గురించి తెలిసింది. ‘ఎన్ని మంచి విషయాలు చెబుతుందో’ అని మెచ్చుకున్నారు. నెలసరి విషయాలతో పాటు మానసిక ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ గురించి కూడా తన బృందంతో కలిసి ఊరూరు తిరుగుతూ అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది మీర్. కొద్దిమందితో మొదలైన ‘ఝూన్’లో ఇప్పుడు యాభై మందికి పైగా టీనేజర్స్ ఉన్నారు. ‘ఝూన్లో పనిచేయడం ద్వారా నాకు తెలిసిన నాలుగు మంచి విషయాలను పదిమందికి తెలియజేయడంతో పాటు, రకరకాల గ్రామాలకు వెళ్లడం ద్వారా సామాజిక పరిస్థితులను తెలుసుకోగలుగుతున్నాను’ అంటుంది నుహా మసూద్. ‘తెలిసో తెలియకో రకరకాల కారణాల వల్ల నెలసరి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్ల చాలామంది అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో మహిళలు శానిటరీ న్యాప్కిన్లను కొనకపోవడానికి కారణం డబ్బులు లేక కాదు, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనుకోవడం, ఇది చాలా రహస్య విషయం, ఎవరికీ తెలియకూడదు అనుకోవడం! ఈ పరిస్థితులలో మెల్లగా మార్పు తీసుకువచ్చినందుకు సంతోషంగా ఉంది’ అంటుంది మీర్. ‘ఝూన్’ ఎన్నో భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుంది. వాటిని అందుకోవడానికి చురుగ్గా అడుగులు వేస్తోంది. -
Health Tips: మెనుస్ట్రువల్ క్రాంప్స్.. ప్రోస్టాగ్లాండిన్ అనే హార్మోన్ వల్ల..
What Is Menstrual Cramps: యువతులకు నెలసరి ఎంతోకొంత ఇబ్బందికరమైనదే. ఒకవేళ దాంతోపాటు మెనుస్ట్రువల్ క్రాంప్స్ గనక తోడైతే మరెంతో బాధకారం. ఉన్న ఇబ్బందికి తోడు, బాధ, వీపు, పొత్తికడుపు భాగాల్లో కండరాలు బిగుసుకుపోయి తీవ్రమైన నొప్పితో చెప్పుకోలేని విధంగా వేదనకు గురవుతుంటారు. ఇటీవలే చైనాకు చెందిన ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ జెంగ్ క్విన్వెన్, న్యూజీలాండ్‌కు చెందిన గోల్ఫ్ ప్లేయర్ లైడియా కో వంటి క్రీడాకారిణులు ఈ సమస్యతో బాగా ఇబ్బంది పడ్డారు. జెంగ్ క్విన్వెన్ అయితే... ‘‘నేనో యువకుణ్ణయితే బాగుండేదేమో’’ అని కూడా వ్యాఖ్యానించింది. చాలామంది యువతులను బాధపెట్టే ఈ ‘మెనుస్ట్రువల్ క్రాంప్స్’పై అవగాహన కోసం ఈ కథనం. ఓ బాలిక యుక్తవయస్కురాలయ్యాక దాదాపు మొదటి ఏడాదీ, రెండేళ్లు లేదా ఒక్కోసారి మొదటిబిడ్డ పుట్టే వరకు ఈ సమస్య వేధిస్తూ ఉంటుంది. వైద్యపరిభాషలో డిస్మెనూరియా అని పిలిచే ఈ సమస్య వల్ల... నొప్పితో పాటు పొత్తికడుపు, వీపు కింది భాగం కండరాలు కదలనివ్వనంతగా బిగుసుకుపోయి ఇబ్బంది పెడతాయి. ఈ ఇబ్బంది ఎంతగా ఉంటుందంటే... ఆ రోజుల్లో వారి జీవననాణ్యత పూర్తిగా దెబ్బతినడంతో... ప్రతినెలా వారి అమూల్యమైన రోజుల్లో కొన్ని ఈ బాధల వల్లనే పూర్తిగా వృథా అవుతాయి. ఎందుకిలా జరుగుతుంది...? ఇలా ఎందుకు జరుగుతుందన్న విషయం తెలుసుకోవాలంటే... ముందుగా నెలసరి ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి. మహిళల్లో ప్రతినెలా ఒక అండం విడుదలవుతుంది. ఒకవేళ అది ఫలదీకరణ చెందితే... దాని ఎదుగుదలకు తోడ్పడేందుకు గర్భసంచిలో ఎండోమెట్రియమ్ అనే పొర మందంగా మారుతుంది. ఒకవేళ అండం ఫలదీకరణ చెంది పిండంగా మారితే... మందంగా మారిన ఈ ఎండోమెట్రియమ్ పొరలోనే అది ఎదుగుతుంది. ఫలదీకరణం జరగనప్పుడు... ఈ పొర రాలిపోతుంది. అలా ఇది ఊడి బయటకు వచ్చే సమయంలో రక్తస్రావం జరుగుతుంది. కొందరిలో ఈ పొర ఊడిపోయేందుకు వీలుగా బిగుసుకుపోయేందుకు ప్రోస్టాగ్లాండిన్ అనే హార్మోన్ లాంటి జీవరసాయనం కారణమవుతుంది. ఇదే యువతుల్లో తీవ్రమైన నొప్పి, బాధతో పాటు కొన్నిసార్లు ఇన్ఫ్లమేషన్ పుట్టేలా (ట్రిగర్) చేస్తుంది. ఫలితంగా చుట్టుపక్కల కండరాలూ బిగుసుకుపోయి తీవ్రమైన బాధకు గురిచేస్తాయి. అందుకే రుతుస్రావం సమయంలో ఈ బాధ, నొప్పి, కండరాల బిగుతు అన్నమాట. పై సమస్యతో మాత్రమే కాకుండా మెనుస్ట్రువల్ క్రాంప్స్‌కు మరికొన్ని కారణాలూ ఉన్నాయి. ఉదాహరణకు... ►ఎండోమెట్రియాసిస్ : ఎండోమెట్రియమ్ అనే పొరకు కలిగే ఇన్ఫ్లమేషన్ వల్ల. ►యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ : యుటెరస్‌లో పుట్టే కొన్ని క్యాన్సర్ రకానికి చెందని (నాన్క్యాన్సరస్) గడ్డల వంటి వాటి వల్ల. ►అడెనోమయోసిస్ : యుటెరస్ చుట్టూ న్న పొర పొరుగున ఉన్న ఇతర కండరాల్లోకి చొచ్చుకుపోవడం వల్ల. ►పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ : ఏవైనా కారణాల వల్ల మహిళల్లో పునరుత్పత్తికి చెందిన అవయవాలకు హానికరమైన బ్యాక్టీరియా సోకడం వల్ల వచ్చే జబ్బుల కారణంగా. ►సర్వైకల్ స్టెనోసిస్ : కొంతమంది మహిళల్లో వారి గర్భాశయ ముఖద్వారం ఎంత సన్నగా ఉంటుందంటే... అది రుతుస్రావాలను, రక్తస్రావాలను సాఫీగా పోనివ్వదు. దాంతో వ్యర్థాలు అక్కడ పేరుకుపోవడం వల్ల తీవ్రమైన నొప్పి రావచ్చు. ఎప్పుడు సాధారణం... ఎప్పుడెప్పుడు హానికరం... ►సాధారణంగా మెనుస్ట్రువల్ క్రాంప్స్ వల్ల ఆరోగ్యానికీ లేదా ఇతరత్రా ఎలాంటి హానీ, ముప్పూ ఉండవు. తీవ్రమైన బాధ మాత్రమే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో వీటిపై సీరియస్‌గా దృష్టిసారించాల్సి ఉంటుంది. అదెప్పుడంటే... ►30 ఏళ్లు పైబడ్డాకా ఈ సమస్య వస్తుంటే. ►పదకొండు లేదా అంతకంటే చిన్న వయసులోనే యుక్తవయస్కురాలైతే. ∙ïపీరియడ్స్ సమయంలో రక్తస్రావం చాలా ఎక్కువగా ఉంటే (మెనొరేజియా) ►రక్తస్రావం/రుతుస్రావం ఒక క్రమపద్ధతిలో కాకుండా ఎలా పడితే అలా అవుతుంటే (మెట్రోరేజియా) ∙కుటుంబంలో మెనుస్ట్రువల్ క్రాంప్స్ (డిస్మెనూరియా) ఆరోగ్య చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ) ఉంటే. ఏదైనా ప్రమాదమా : ఈ నొప్పి వల్ల ఎలాంటి పనులూ చేయలేకపోవడం, యుక్తవయసులోని పిల్లలు స్కూల్/కాలేజీకి వెళ్లలేకపోవడం, యువతులు ఆఫీసుకు వెళ్లడం కష్టమై... వారి పనులకు అంతరాయం కలగడం వంటి సాధారణ సమస్యలే తప్ప ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ►అయితే కొన్ని సందర్భాల్లో అంటే... అధికరక్తస్రావం లేదా సంతానలేమి వంటి సమస్యలతో పాటు ఈ కండిషన్ కూడా ఉన్నప్పుడు దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ►ఉదాహరణకు పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కారణంగా ఫెలోపియన్ ట్యూబ్స్ దెబ్బతినడం, ఫలదీకరణం చెందిన అండం గర్భసంచి (యుటెరస్)లో చక్కగా ఒదగలేకపోవడం వంటి సమస్యలు రావచ్చు. అవి మినహా మరే రకమైన ఇబ్బందీ ఉండదు. చాలా సందర్భాల్లో వయసు పెరగుతుండటంతోనూ, బిడ్డ పుట్టిన తర్వాతనో ఈ సమస్య దానంతట అదే తగ్గిపోతుంది. ఇవీ లక్షణాలు ►నెలసరి సమయంలో పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి, బాధ. ►పొత్తికడుపులో ఎంతో ఒత్తిడి ఉన్న ఫీలింగ్. ►వీపు వెనక, నడుము, తొడ భాగంలో తీవ్రమైన నొప్పి (పొత్తికడుపు నుంచి బయలుదేరే ఇదే నొప్పి రేడియేటింగ్ పెయిన్ రూపంలో ఈ భాగాలకు విస్తరిస్తుంటుంది. ►కడుపులో వికారంగా ఉండటం. ఒక్కోసారి వాంతులు కావడం. ►కొంతమందిలో నీళ్లవిరేచనాలు, తలనొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. చికిత్స : అయితే చికిత్సలోనూ నేరుగా మందులు వాడకుండా కొన్ని ప్రత్యామ్నాయ ప్రక్రియలు అవలంబిస్తారు. ఉదాహరణకు తొలుత... ►వ్యాయామం (ఎక్సర్సైజ్) హీట్ థెరపీ వార్మ్ బాత్ మసాజ్ కంటినిండా తగినంత నిద్ర ద్యానం, యోగా వంటి ప్రక్రియలతో చాలావరకు ఉపశమనం ఉంటుంది. వీటితోనూ తగినంత ఫలితం లేనప్పుడు కొన్ని నొప్పి నివారణ మందులు, హార్మోన్ ట్యాబ్లెట్లు, లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ వాడటం వంటివి. ►ఒకవేళ ఈ సమస్యతో పాటు ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియాసిస్, ఎడినోమయోసిస్ (గర్భసంచి పొర దాని తాలుకు కండరాల్లోకి లోపలికి పెరగడం) వంటి సమస్యలు ఉంటే నొప్పికి వాడే మందులతో పాటు అరుదుగా ఆపరేషన్ కూడా అవసరం పడవచ్చు. పరీక్షలు : సాధారణ నొప్పి నివారణ మందులు వాడాక కూడా నొప్పి, క్రాంప్స్ సమస్యకు ఉపశమనం దొరకకపోతే అప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్స్ పరీక్ష అవసరం కావచ్చు. ఈ సమస్యకు అరుదుగా లాపరోస్కోపీ అవసరం కావచ్చు. సూచన... నిర్దిష్టంగా నివారణ పూర్తిగా సాధ్యం కాకపోయినప్పటికీ... యువతులు రుతుస్రావం సమయంలో తాము కోల్పోయే ఐరన్ భర్తీ అయ్యేందుకు ఐరన్ పుష్కలంగా ఉండే ముదురాకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు, ఖర్జూరాలు, పల్టీపట్టి (చిక్కీ) వంటి తినే పదార్థాలు తింటూ, ఖనిజలవణాలు భర్తీ అయ్యేందుకు ఆరోగ్యకరమైన ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవడం చాలావరకు మేలు చేస్తుంది. -డాక్టర్ శిరీష ప్రమథ, సీనియర్ గైనకాలజిస్ట్, లాపరోస్కోపిక్ సర్జన్ అండ్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ -
శానిటరీ నాప్కిన్స్.. సగం మందికే తెలుసు
న్యూఢిల్లీ: ఆధునిక కాలంలోనూ దేశంలో చాలామంది మహిళలకు శానిటరీ నాప్కిన్స్/ప్యాడ్స్ గురించి తెలియదని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలింది. 15–24 ఏళ్ల మహిళల్లో 50 శాతం మంది ఇప్పటికీ నాప్కిన్స్ బదులు గుడ్డలు వాడుతున్నట్లు తేలింది. అవగాహన లేమి, రుతుస్రావంపై మూఢ నమ్మకాలే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. శుభ్రంగా లేని గుడ్డలు ఉపయోగిస్తుండడం వల్ల మహిళలు రకరకాల ఇన్ఫెక్షన్లకు గురవుతున్నట్లు గుర్తించారు. ఎన్ఎఫ్హెచ్ఎస్–5 సర్వే ఫలితాలను ఇటీవలే విడుదల చేశారు. 2019–21 వరకు దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 707 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించారు. 15–24 ఏళ్ల వయసున్న మహిళలను ప్రశ్నించారు. రుతుస్రావ సమయంలో మామూలు గుడ్డలే వాడుతున్నట్లు 50 శాతం మంది బదులిచ్చారు. స్థానికంగా తయారు చేసిన నాప్కిన్లు వాడుతున్నట్లు 15 శాతం మంది చెప్పారు. అపరిశుభ్ర పద్ధతులు మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని గురుగ్రామ్‌లో సీకే బిర్లా హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ ఆస్తా దయాల్ చెప్పారు. గర్భం దాల్చడంలో ఇబ్బందులు, గర్భిణుల్లోనూ అనారోగ్య సమస్యలు సృష్టించే అవకాశం ఉందన్నారు. బిహార్‌లో అత్యల్పం నగరాలు, పట్టణాల్లో 90 శాతం మంది మహిళలు శానిటరీ నాప్కిన్లు ఉపయోగిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో వీరి సంఖ్య 73 శాతంగా ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే అత్యల్పంగా బిహార్‌లో 59 శాతం మంది, మధ్యప్రదేశ్‌లో 61 శాతం, మేఘాలయాలో 65 శాతం మంది నాప్కిన్లు వాడుతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన(పీఎంబీజేపీ)ని ప్రారంభించింది. ఈ పథకం దేశవ్యాప్తంగా మహిళలకు కేవలం ఒక్క రూపాయికే శానిటరీ ప్యాడ్ అందిస్తున్నట్లు సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ డైరెక్టర్, సామాజిక ఉద్యమకారిణి రంజనా కుమారి తెలిపారు. శానిటరీ ప్యాడ్ వినియోగించే విషయంలో సిగ్గు పడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదన్నారు. -
ఇంకా రజస్వల కాలేదు... ఎలాంటి చికిత్స తీసుకోవాలి?
Gynecologist Venati Sobha Counselling Suggestions Irregular Periods: మా అమ్మాయి వయసు 17 సంవత్సరాలు. ఇంకా రజస్వల కాలేదు. పరీక్షలు జరిపిన డాక్టర్లు ‘టర్నర్ సిండ్రోమ్’ అని చెబుతున్నారు. దీనికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో దయచేసి వివరించగలరు. – సుగుణ, మధిర ఆడపిల్లల్లో 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి. అంటే 46 క్రోమోజోమ్స్. వీటిలో 22 జతల ఆటోసోమ్స్, ఒక జత ‘ఎక్స్ఎక్స్’ క్రోమోజోమ్స్ ఉంటాయి. దానిని 46 ఎక్స్ఎక్స్గా పరిగణించడం జరుగుతుంది. ఈ ‘ఎక్స్ఎక్స్’ క్రోమోజోమ్స్ జతలో ఒక ‘ఎక్స్’ తల్లి నుంచి, ఒక ‘ఎక్స్’ తండ్రి నుంచి పిండం ఏర్పడినప్పుడే బిడ్డకు సంక్రమించి, ఆడపిల్లగా పుట్టడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యల వల్ల ఒక ‘ఎక్స్’ క్రోమోజోమ్ మాత్రమే బిడ్డకు సంక్రమిస్తుంది. దీనినే ‘45ఎక్స్జీరో’ అంటారు. దీనినే ‘టర్నర్స్ సిండ్రోమ్’ అంటారు. ఇలా పుట్టిన పిల్లలు పొట్టిగా ఉండటం, వారిలో మానసిక ఎదుగుదల కొద్దిగా తక్కువగా ఉండటం, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, రజస్వల కాకపోవడం, రొమ్ములు సరిగా పెరగకపోవడం, అండాశయాలు చాలా చిన్నగా ఉండి, అవి పనిచేయకపోవడం వల్ల పీరియడ్స్ రాకపోవడం, ఎముకల సమస్యలు వంటి ఇతర సమస్యలు ఉంటాయి. కొందరిలో అండాశయాలు కొన్నిరోజులు హార్మోన్లు విడుదల చేసి, తర్వాత అవి చిన్నగా అయిపోయి అండాలు తగ్గిపోవడం వల్ల కొంతకాలం పీరియడ్స్ వచ్చి తొందరగా ఆగిపోతాయి. ఇది జన్యుపరంగా ఏర్పడింది కాబట్టి, మీరు చెయ్యగలిగింది ఏమీ లేదు. మీరు ఎండోక్రైనాలజిస్టును సంప్రదిస్తే, అవసరమైన పరీక్షలు చేయించి, స్కానింగ్‌లో గర్భాశయం, అండాశయాల పరిమాణం బట్టి, పీరియడ్స్ కోసం ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు కొంతకాలం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇతర సమస్యలను బట్టి చికిత్స సూచించడం జరుగుతుంది. నా వయసు 23 ఏళ్లు. ఎత్తు 5.4, బరువు 48 కిలోలు. రెండేళ్లుగా నాకు పీరియడ్స్ సక్రమంగా రావడం లేదు. ఒక్కోసారి పదిహేను రోజులకే అయిపోతే, ఒక్కోసారి నెల్లాళ్లు గడిచాక అవుతోంది. పీరియడ్స్ సమయంలో పొత్తికడుపు నొప్పితో పాటు విపరీతమైన తలనొప్పి ఉంటోంది. ఆ సమయంలో ఏ పనీ చేయలేకపోతున్నాను. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. – రమ్య, తగరపువలస మీ ఎత్తుకి మీరు కనీసం 54 కిలోల బరువు ఉండాలి. కాని, 48 కిలోలే ఉన్నారు. కొందరిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల, థైరాయిడ్, పీసీఓడీ వంటి అనేక సమస్యల వల్ల పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు. పీరియడ్స్ సమయంలో కొందరిలో ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్లు ఎక్కువగా విడుదలవడం వల్ల పొత్తికడుపులో నొప్పి, తలనొప్పి ఉండే అవకాశాలు ఉంటాయి. కొందరిలో రక్తహీనత వల్ల, మానసిక ఒత్తిడి వల్ల కూడా తలనొప్పి రావచ్చు. ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించి, సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి సీబీపీ, ఎస్ఆర్. టీఎస్‌హెచ్, అల్ట్రాసౌండ్ పెల్విస్ వంటి పరీక్షలు చేయించుకుని, కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవడం మంచిది. ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, పండ్లు, పాలు, పెరుగుతో కూడిన మితమైన పౌష్టికాహారం తీసుకుంటూ, నడక, యోగా, ధ్యానం వంటివి కూడా చెయ్యడం వల్ల చాలావరకు హార్మోన్ల అసమతుల్యత తగ్గే అవకాశాలు ఉంటాయి. సమస్య ఏమీ లేకున్నా, పీరియడ్స్ సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటే, డాక్టర్ సలహా మేరకు రెండురోజులు నొప్పి నివారణ మాత్రలు వాడుకోవచ్చు. ∙నా వయసు 46 ఏళ్లు. నాకు రుతుక్రమం రెండు మూడు నెలలకోసారి వస్తోంది. వచ్చినప్పుడు కూడా రుతుస్రావం రెండు రోజులే ఉంటోంది. ఇటీవల పరీక్షలు జరిపిస్తే, గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ పెరిగినట్లు రిపోర్టు వచ్చింది. ఈ పరిస్థితిలో గర్భసంచి తీసేస్తేనే మంచిదని డాక్టర్లు అంటున్నారు. నాకైతే ఆపరేషన్ అంటే భయంగా ఉంది. దీనికి ప్రత్యామ్నాయ చికిత్స ఏమైనా ఉందా? – లక్ష్మి, రేణిగుంట మీకు 46 ఏళ్లు. పీరియడ్స్ రెండు మూడు నెలలకోసారి వచ్చి, బ్లీడింగ్ రెండురోజులే ఉంటుంది. అంటే మీకు ఫైబ్రాయిడ్స్ కారణంగా ప్రస్తుతానికి పెద్దగా లక్షణాలేమీ లేనట్లే! సాధారణంగా ఫైబ్రాయిడ్స్ అనేవి గర్భాశయంలో పెరిగే కంతులు. ఇవి 99.9 శాతం క్యాన్సర్ గడ్డలు కావు. వాటి పరిమాణం, గర్భాశయంలో ఎక్కడ ఉన్నాయి అనేదాని బట్టి లక్షణాలు ఉంటాయి. ఫైబ్రాయిడ్స్ గర్భాశయం లోపలి పొరలో (సబ్ మ్యూకస్ ఫైబ్రాయిడ్స్) ఉంటే, బ్లీడింగ్ ఎక్కువ కావడం, మధ్య మధ్యలో స్పాటింగ్ కనిపించడం వంటివి ఉంటాయి. మయోమెట్రియమ్ పొరలో (ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్) ఉంటే, వాటి పరిమాణం బట్టి బ్లీడింగ్ ఎక్కువ కావడం, చిన్నగా ఉంటే కొందరిలో ఏ సమస్యా లేకపోవడం జరగవచ్చు. గర్భాశయం బయటి పొరలో (సబ్ సిరీస్ ఫైబ్రాయిడ్స్) ఉంటే పెద్దగా సమస్య ఉండకపోవచ్చు. మరీ పెద్దగా ఉంటే చుట్టు పక్కల అవయవాల మీద ఒత్తిడి పడటం వల్ల నడుంనొప్పి, మూత్ర సమస్యలు, జీర్ణ సమస్యలు ఉండవచ్చు. మీరు చెప్పినదాని బట్టి చూస్తే, ప్రస్తుతానికి ఫైబ్రాయిడ్స్ వల్ల మీకు ఎటువంటి లక్షణాలూ కనిపించడం లేదు. బ్లీడింగ్ కూడా రెండు మూడు నెలలకోసారి రెండురోజులే అవుతుంది కాబట్టి మీకు త్వరలోనే పీరియడ్స్ ఆగిపోయి మెనోపాజ్ దశ రావచ్చు. పీరియడ్స్ ఆగిపోతే ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం అంతగా ఉండదు కాబట్టి ఫైబ్రాయిడ్స్ ఇంకా పెరగకుండా ఉంటాయి. అంతేకాకుండా, వాటి పరిమాణం మెల్లగా తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు లక్షణాలు లేనంత వరకు ఫైబ్రాయిడ్స్ గురించి కంగారు పడకుండా కొంతకాలం ఆగి చూడవచ్చు. ఆరునెలలకోసారి స్కానింగ్ చేయించుకుంటూ, వాటి పరిమాణం పెరుగుతోందా లేదా తెలుసుకోవచ్చు. వాటి పరిమాణం మరీ పెద్దగా అవుతూ, మీకు లక్షణాలు కనిపిస్తున్నట్లయితే, అప్పుడు ఆపరేషన్ గురించి నిర్ణయం తీసుకోవచ్చు. ఆపరేషన్ బదులు ఫైబ్రాయిడ్స్ పరిమాణం తగ్గడానికి యుటెరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్, ఎంఆర్ఐ గైడెడ్ హైఫ్రీక్వెన్సీ అల్ట్రాసౌండ్ వేవ్స్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను పాటించవచ్చు. డా‘‘ వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్ -
పీరియడ్స్ టైంలో మహిళలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా?
సాక్షి,న్యూఢిల్లీ: రెండో దశలో కరోనామహమ్మారి విజృంభిస్తోంది. మరోవైపు కరోనా అంతానికి దేశవ్యాప్తంగా వివిధ దశల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ అమలవుతోంది. ఈ క్రమంలో మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి కోవిడ్-19 వ్యాక్సిన్ అందించనున్నారు. ఇప్పటికే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా సహా పలు రాష్ట్రాలు ఉచితంగా టీకాను అందిస్తామని ప్రకటించాయి. అయితే అనవసరమైన అపోహలు, భయాలు మధ్య చాలామంది వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. తాజాగా మహిళల వ్యాక్సినేషన్‌కు సంబంధించి మరో రూమర్ హల్చల్ చేస్తోంది. అదేమిటంటే.. పీరియడ్ (బహిష్టు)కు ముందు ఐదు రోజులు ఆ తరువాత ఐదు రోజులు కరోనా వ్యాక్సిన్ తీసుకోకూడదంటూ ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే ఇది ఎంత మాత్రం నిజంకాదని గాయని చిన్మయి శ్రీపాద్ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఆమె ఈ విషయంలో ప్రముఖ గైనకాలజిస్ట్, పద్మశ్రీ అవార్డు గ్రహీత మంజుల అనగాని ద్వారా ధృవీకరించుకున్నానని స్పష్టం చేశారు. దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేయొద్దంటూ వేడుకున్నారు. అటు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా ఈ వార్తలను ఫేక్ అని తేల్చి పారేసింది. ఈ పుకార్లను నమ్మొద్దని మహిళలకు విజ్ఞప్తి చేసింది. Please STOP sharing that the Covid Vaccine affects your period / cannot be taken during your period. NOT TRUE!!#Verified with a Padmasri Award Winning Gynaecologist Dr Manjula Anagani — Chinmayi Sripaada (@Chinmayi) April 23, 2021 I got both my doses when I had my periods. I got covid later on because I work in a hospital but recovered without side effects within a week all thanks to he vaccine. PLEASE GET VACCINATED, there will be very mild side effects BUT IT WILL SAVE YOUR LIFE. https://t.co/XqZCM0Ob0k — Wear your mask (@vakeel_saheba) April 24, 2021 #Fake post circulating on social media claims that women should not take #COVID19Vaccine 5 days before and after their menstrual cycle. Don't fall for rumours! All people above 18 should get vaccinated after May 1. Registration starts on April 28 on https://t.co/61Oox5pH7x pic.twitter.com/JMxoxnEFsy — PIB Fact Check (@PIBFactCheck) April 24, 2021 కరోనా వ్యాక్సిన్ రుతుచక్ర మార్పులకు కారణమవుతుంది అనేందుకు సాక్ష్యాలు లేవు. ఎలాంటి భయాలు లేకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని నిపుణులంటున్నారు. టీకా తీసుకున్నతరువాత తమకెలాంటి సమస్యలు లేవని పలువురు డాక్టర్లతోపాటు, మరి కొంతమంది తమ అనుభవాలను చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత పీరియడ్ సైకిల్లో తేడాలున్నాయనడానికి ఎటువంటి ఆధారాలు లేవనీ, అలాగే ఒకసారి పీరియడ్‌లో మార్పు వస్తే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. అటు గర్భవతిగా ఉన్నవారికి సురక్షితమని సీడీసీ పేర్కొంది. అయితే ఇన్పైడర్ కథనం ప్రకారం రుతు చక్రాలు, వ్యాక్సీన్లకు సంబంధించిన డేటా లేకపోవడంపై ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ జెన్ గుంటర్ అసహనం వ్యక్తం చేశారు. వివిధ రకాల వ్యాక్సిన్లు.. వంధ్యత్వం, పునరావృత గర్భస్రావాలకు సంబంధిత ప్రభావాల గురించి అధ్యయనాలు ఉన్నాయి కానీ, దీనిపై లేవన్నారు. అయితే వ్యాక్సిన్ తరువాత వచ్చే ఫీవర్ గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో పీరియడ్ సమస్యల గురించి కూడా తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమని ఆమె అన్నారు. అలాగే కోవిడ్-19 వ్యాక్సిన్‌కు పీరియడ్స్ సమస్యలకు సంబంధం లేదని కొంతమంది పరిశోధకులు తేల్చి చెప్పారు. క్లినికల్ పరీక్షల సందర్బంగా ఇలాంటి సమస్యలేవీ తమ దృష్టికి రాలేదని వెల్లడించారు. మరోవైపు టీకా తర్వాత మార్పులను అనుభవించిన ఇద్దరు మహిళా పరిశోధకులు కరోనా వ్యాక్సిన్లు- పీరియడ్లపై ఎలా ప్రభావితం చేస్తాయో పరిశీలిస్తున్నారు. ప్రభావితమైన వారి సంఖ్య గురించి సర్వే తమకేమీ చెప్పలేదని వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ స్కాలర్ కాథరిన్ లీ చెప్పారు. సాధారణంగా రుతుస్రావం అనేది ఒత్తిడికి సంబంధించినదై ఉంటుంది కాబట్టి. దీనికి ఒత్తిడి కారణం కావచ్చని, శాన్ డియాగోలోని ప్రముఖ స్త్రీవైద్య నిపుణురాలు డాక్టర్ కెల్లీ కల్వెల్ చెప్పారు. వ్యాక్సిన్ తరువాత యాంటీ బాడీస్ ఉత్పత్తి అయ్యేందుకు కొంత ఒత్తిడి ఏర్పడుతుందని బహుశా ఇదే సమస్యకు కారణం కావచ్చన్నారు. వ్యాక్సిన్ తరువాత శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందన, ఎండోమెట్రియం, రుతుస్రావం సమయంలో మందంగా ఉండే గర్భాశయం లైనింగ్‌పై ప్రభావంతో ఈ సమస్యలు ఏర్పడి ఉంటాయా అనే సందేహాన్నిఆమె వ్యక్తం చేశారు. ఈ సమస్యల ఇతర వ్యాక్సిన్లలో కూడా ఉండి ఉండవచ్చని, అయితే కరోనాకు సంబంధించి ఇప్పటివరకు మాస్ వ్యాక్సినేషన్ జరగలేదు. అందుకే సోషల్ మీడియాలో ఇపుడువస్తున్నంత విరివిగా ప్రశ్నలు ఉత్పన్నం కాలేదనీ, దీనిపై మరింత పరిశోధన జరగాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. A lot of patients messaging me asking if it’s safe/ effective to take the vaccine during their period. Some silly WhatsApp rumour has spooked everyone. Your period has no effect on the vaccine efficacy. Take it as soon as you can. Spread the word, please. — Dr. Munjaal V. Kapadia (@ScissorTongue) April 24, 2021 రుతుక్రమ సమస్యలను పూర్తిగా కొట్టిపారేసే అధికారిక పరిశోధనలు ఏవీ ప్రస్తుతానికి అందుబాటులో లేవని మరికొంతమంది వాదిస్తున్నారు. టీకా తీసుకున్న తరువాత 5 రోజుల ముందుగానే తనకు పీరియడ్ వచ్చిందని, బ్లీడింగ్ ఎక్కువగా ఉందని బోస్టన్‌లో 24 ఏళ్ల సామ్ (పేరు మార్చాం) ఫిర్యాదు చేశారు. అలాగే ఎనిమిదేళ్ల క్రితమే మెనోపాజ్ వచ్చిన తనకు వ్యాక్సిన్ తీసుకున్న మూడువారాల తరువాత తనకు మళ్లీ బ్లీడింగ్ అవుతోందని మరో ట్విటర్ యూజర్ తన అనుభవాన్ని షేర్ చేశారు. ఫైజర్ వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న మరో మహిళది కూడా దాదాపు ఇలాంటి అనుభవమే. వెన్నునొప్పి, దాదాపు పురిటి నొప్పుల్లాంటి ఫీలింగ్ కలిగిందని చెప్పారు. Has anyone noticed the vaccine doing funky things with their menstrual cycle? I was oddly spotting last week (got second dose a week ago) and now it’s fully late. 🥴 — Nneka M. Okona 🇳🇬 (@afrosypaella) April 14, 2021 -
నీ గుడి ముందే నిలిచాను స్వామీ... ఇయ్యరా దర్శనమూ!
దేవుడు వరమిచ్చినా..పూజారి లోపలికి రమ్మన్నా..దర్శన భాగ్యానికి అడ్డుగా నిలుస్తున్న ఆచారాల కారణంగా మహిళలు శబరిమల ఆలయం బయటే ఉండిపోవలసి వస్తుందా? నేడు అయ్యప్ప గుడి తలుపులు తెరుచుకుంటున్నాయి. శ ‘రణ’ ఘోషలో స్వామివారు ఈ భక్తురాళ్ల వేడుకోలును వింటాడా? దిక్కుతోచని స్థితి సాధారణంగా ప్రకృతి విలయాలప్పుడు ఉంటుంది. అప్పుడు దేవుడే దిక్కు అనుకుంటాడు మనిషి. ఇటీవలి వరదల తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళ.. ప్రస్తుతం మరో ‘విలయానికి’ సిద్ధంగా ఉంది. అది ‘దేవ విలయం’! దేవుడు సృష్టించిన విలయం అని కాదు. దేవుడి చుట్టూ మనుషులు సృష్టించుకుంటున్న విలయం! శబరిమల ఆలయంలోని అన్ని వయసుల మహిళల్ని అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక.. ఆ తీర్పుపై అయ్యప్ప భక్తులు ‘ఒకటిగా’ విడిపోయారు. దీనర్థం ఏమిటంటే.. స్త్రీ, పురుష భక్తులు కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సామాజిక కార్యకర్తలను, ప్రగతివాదులను విభేదించి ఒక పక్కకు వచ్చేయడం. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్నవారికి, సమర్థిస్తున్నవారికి మధ్య పోరు మొదలై.. మేఘాలకు పేరైన కేరళను ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.విలయంలో మనిషికి దేవుడే దిక్కయినట్లు.. ఇప్పుడీ యుద్ధస్థితిలోనూ దేవుడు మనిషికి మార్గం చూపించగలడా? చూపించినా మనిషి చూడగలడా? నేడు శబరిమల ఆలయ ద్వారాలు తెరుచుకుంటున్నాయి. ఇందులో విశేషం ఏమీ లేదు. ప్రతి నెలా పూజల కోసం ఐదు రోజులు గుడి తలుపుల్ని తెరిచినట్లే ఈసారీ తెరుస్తున్నారు. అయితే ఎప్పటిలా భక్తులకు నెమ్మదైన మనసుతో అయ్యప్పను దర్శించుకునే భాగ్యం ఉంటుందా అన్నది సందేహం. గర్భగుడిలోకి వెళ్లేందుకు భక్తులు మొదట ‘పంపా’ ప్రాంతానికి చేరుకోవాలి. శబరిమల శిఖరానికి బేస్క్యాప్ (ఎక్కే చోటు) అది. అక్కడి నుంచి కొండ ఎక్కుతూ ఆలయం ఉండే ‘నిలక్కల్’కు చేరుకోవాలి. అయితే ఈ రెండు చోట్లకు ఇప్పటికే భక్తుల కన్నా ఎక్కువ సంఖ్యలో దాదాపు 30 వరకు రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మిక సంస్థలకు చెందిన కార్యకర్తలు చేరుకున్నారు. వీళ్లందరి ధ్యేయం ఒక్కటే. ఆలయ దర్శనం కోసం వచ్చే 10–50 ఏళ్ల మధ్య వయసు గల స్త్రీలను నిరోధించడం. తిరిగి వెనక్కు పంపించడం! శబరిమలకు ఆత్మాహుతి దళం ఆలయంలోకి వెళ్లనివ్వకుండా మహిళల్ని అడ్డుకోవడం.. సుప్రీంకోర్టు ఇచ్చిన హక్కుకు భంగం కలిగించే చర్య. అయితే పై సంస్థల వాళ్లెవరూ తీర్పును నేరుగా వ్యతిరేకించడం లేదు. కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం తీర్పును సమర్థించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. వీళ్లలో ఎక్కువ శాతం శాంతియుతంగా తమ నిరసన తెలుపుతుండగా.. స్థానిక ‘శివసేన’ కార్యకర్తలు, ‘అయ్యప్ప ధర్మసేన’ సభ్యులు.. ఎలాంటి పరిస్థితుల్లోనూ రుతుక్రమ వయోపరిమితి మధ్య ఉన్న మహిళల్ని ఆలయంలోకి అనుమతించేది లేదని అంటున్నారు. శివసేన అయితే.. ఆలయ ఆచారాలను అతిక్రమించి లోపలికి ప్రవేశించాలని ప్రయత్నించే వారిని అడ్డుకునేందుకు ఏడుగురు సభ్యుల ఆత్మాహుతి దళాన్ని ఇప్పటికే శబరిమలకు పంపినట్లు ప్రకటించింది కూడా! ‘‘పంపాను దాటనివ్వం. ఒకవేళ ఆ స్త్రీలు దాటారంటే మా కార్యకర్తల మృతదేహాల మీదుగానే కొండపైకి ఎక్కాలి’’ అని సేన నాయకుడు పెరింగమల అజి అంటున్నారు. తృప్తి దేశాయ్ అయినా సరే.. ఆచారాన్ని ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని ఆయన స్పష్టంగా చెబుతున్నారు.సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా అయ్యప్ప భక్తులు (మహిళాభక్తులు సహా) ప్రదర్శనలు జరుపుతున్న నేపథ్యంలో జెండర్ కార్యకర్త తృప్తి దేశాయ్ తను శబరిమలను దర్శించి తీరుతానని, మహిళల ప్రాథమిక హక్కులను ఎవ్వరూ అడ్డుకోజాలరని ముంబైలోని ఒక మలయాళం టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడంతో ఆయన ఆమె పేరును ప్రస్తావించారు. అంతకుముందు తృప్తి దేశాయ్‌ని ఉద్దేశించే.. మలయాళ నటుడు కొల్లం తులసి (69).. శబరిమలను దర్శించే సాహసం చేసే ఏ మహిళనైనా రెండు ముక్కలుగా చీల్చేస్తాని అనడం తీవ్ర వివాదాస్పదం అయింది. కొండ కింద మానవ కంచె! శివసేనతో పాటు, అయ్యప్ప ధర్మసేన కూడా గట్టిగానే ఉంది. ధర్మసేనకు రాహుల్ ఈశ్వర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది మే నెలలో మరణించిన శబరిమల ఆలయ ప్రధాన పూజారి కందరరు మహేశ్వరరు మనవడే రాహుల్ ఈశ్వర్. ఆయన కూడా మíß ళల్ని అడ్డుకునేందుకు కొండ కింద ఒక మానవ కంచెను నిర్మిస్తున్నారు. ఈయనదీ శివసేన మాటే. కొండపై ఆలయానికి వెళ్లేందుకు నాలుగు ప్రధాన మార్గారంభాలు ఉన్నాయి. ‘‘ఆ నాలుగు చోట్లా మావాళ్లు ఉంటారు. వాళ్లకై వాళ్లు.. ఈ ఆచారాలను అతిక్రమించాలని చూసే మహిళల్ని భౌతికంగా ఏమీ అనరు. అయితే.. ఆ మహిళలు మా మృతదేహాలను దాటుకుంటూ వెళ్లాలి. మాది గాంధీ మార్గం’’ అంటున్నారు రాహుల్. నిలక్కల్‌లో సత్యాగ్రహం భారతీయ జనతా పార్టీ కూడా ఇదే దారిలో ఉంది. అయ్యప్పస్వామి జన్మస్థలంగా భావిస్తున్న పందరం నుంచి రాష్ట్ర సచివాలయానికి ఇటీవల యాత్ర జరిపిన బీజేపీ.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా శబరిమలకు కూడా నిరసన యాత్ర చేపట్టబోతోంది. పార్టీ మహిళా విభాగం ‘మహిళా మోర్చా.. ఈ నేడు (అక్టోబర్ 17) నిలక్కల్‌లో సత్యాగ్రహానికి కూర్చొంటోంది. బీజేపీ, అనుబంధ పార్టీల డిమాండ్ ఒక్కటే.. సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వెయ్యాలని. లేదా తీర్పును శూన్యీకరించేలా ఒక ఆర్డినెన్స్ తేవాలని. అయితే ముఖ్యమంత్రి పినరయి విజయ్ ఇందుకు సిద్ధంగా లేరు. శబరిమలలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశంపై ఆయన సుముఖంగా ఉన్నారు. శబరిమల ఆలయం ‘ట్రావంకూర్ దేవస్వమ్ బోర్టు’ పరిధిలోకి వస్తుంది. బోర్డు అధ్యక్షుడు ఎ.పద్మకుమార్ కూడా అన్నివర్గాల వారినీ ఆహ్వానించి, ఏకాభిప్రాయాన్ని సాధించడానికి తను చేయగలిగింది చేస్తున్నారు. మహిళా పోలీసుల సహాయం ఐదు రోజుల పూజల కోసం అక్టోబర్ 17న శబరిబల ఆలయ ద్వారాలు తెరుస్తున్న సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తవచ్చని ఇంటిలిజెన్స్ వర్గాలు కేరళ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు ఏం చెయ్యాలన్న దానిపై పోలీస్ యంత్రాంగం ఏ విధమైన కార్యాచరణను సిద్ధం చేసిందో బయటికి వెల్లడించడం లేదు. ఈ ఐదు రోజుల పూజ తర్వాత.. కొద్ది రోజుల్లోనే అయ్యప్పల సీజన్ మొదలవుతుంది. ప్రస్తుతానికైతే 500 మంది మహిళా పోలీసులతో ఈ మహిళా భక్తుల సమస్యను నివారించవచ్చా అని శబరిమల ఉన్న పట్టణంతిట్ట జిల్లా పోలీసు సూపరింటెండెంట్ టి.నారాయన్ యోచిస్తున్నారు. ఆహ్వానించిన ఆలయాల్లో అడుగుపెట్టాలి కానీ... ఆచారాలు, సంప్రదాయాలపట్ల, భగవంతుడిపట్ల భక్తి విశ్వాసాలు ఉన్నవారు వాటిని గౌరవించాలి కదా! మా గుడికి రావద్దు మొర్రో అని మొత్తుకుంటుంటే, ఆ గుడికి స్త్రీలు వెళ్లడం అవసరమా? స్త్రీలు కూడా చూడదగ్గ ఆలయాలు అనేకం ఉన్నాయి. వాటిని సందర్శించి రావచ్చు కదా! ఎక్కడైతే ఆడవారికి ఆదరణ, గౌరవం, అభిమానం ఉంటాయో ఆ ఆలయానికి వెళ్లడం మర్యాద అనిపించుకుంటుంది. అంతేకానీ, కొన్ని వందల ఏళ్లుగా స్త్రీలు అడుగుపెట్టడం నిషేధించిన ఆలయానికి వెళ్లడం అవసరమా? ఇరువైపుల వాదనలూ ఓపిగ్గా విని, ఎవరి సంప్రదాయానికీ భంగం వాటిల్లకుండా ఉండేలా తీర్పులు ఇవ్వడం సముచితం. ఆడవాళ్లని ఎవరినీ రావద్దని అనడం లేదు. రుతుధర్మం ఉన్న స్త్రీలు మాత్రం రాకూడదని అంటున్నారు. దానిని గౌరవించి, ఆ ఆచారానికి కట్టుబడి ఉండటం సముచితం అనిపించుకుంటుందని నా అభిప్రాయం. – డా. ఎన్.అనంతలక్ష్మి, ఆధ్యాత్మికవేత్త వారిని తక్కువ చేసినట్లు కాదు కదా! భారతదేశ సంప్రదాయంలో దేవాలయాలకు సంబంధించిన ఆగమశాస్త్రంలో ఎక్కడా స్త్రీలని కించపరచినట్టు కనిపించదు. స్వయంభూ లింగాలు, విగ్రహాలు ఉన్న ఆలయాలలో స్త్రీల విషయంలో స్పర్శదర్శనంతో సహా ఏ విధమైన అభ్యంతరమూ వ్యక్తం అయిన సందర్భాలు లేవు. తరతరాలుగా, యుగయుగాలుగా కూడా ఎక్కడా స్త్రీ పురుషులని వేరుగా చూడటం కానీ, స్త్రీలని తక్కువ చేసినట్లుగానీ లేవు.యజ్ఞోపవీతార్హత ఉన్నవారిలో కూడా.. పురుషులే యజ్ఞోపవీతం ధరిస్తారు కానీ స్త్రీలు యజ్ఞోపవీతం ధరించరు. ఏ ఆలయానికి సంబంధించిన ఆచారాలు, కట్టుబాట్లు ఆ ఆలయానికి ఉంటాయి.ప్రాంతీయాచారాలు ఉంటాయి. కొన్ని ఆలయాలు స్త్రీలకు నిషేధం ప్రకటించినట్లే, పురుషులకు ప్రవేశార్హతను నిషేధించిన ఆలయాలు కూడా ఉన్నాయి. మనకు దేనికైనా రుషుల మాట ప్రమాణం. కొన్ని యంత్ర తంత్ర సిద్ధులతో మంత్రబద్ధం చేసి ఉన్న శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో స్త్రీలు ప్రవేశించకూడదన్న ఆచారం ఏళ్ల తరబడి ఉన్నప్పుడు దానిని గౌరవించడం మంచిది కదా! ఆలయంలో ప్రవేశం లేదని చెప్పినంత మాత్రాన వారిని తక్కువ చేసినట్లు భావించడం సరికాదు కదా! – మాతా రమ్యానంద భారతి, అధ్యక్షురాలు, శక్తిపీఠం -
శబరిమల: ‘మైలాచారాన్ని’ మరచిన సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : మతాచారాలను పాటించడంలో స్త్రీ, పురుషులకు సమాన హక్కులు ఉంటాయని, పితృస్వామ్యం పెత్తనాన్ని అనుమతించలేమంటూ శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి వయస్సుతో నిమిత్తం లేకుండా మహళలందరికీ ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు చెప్పిన విషయం తెల్సిందే. ఇలా అనేక సందర్భాల్లో ముఖ్యంగా మతా విశ్వాసాల్లో స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసాన్ని ఎండగడుతూ సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చింది. దేశంలోని పలు పవిత్ర మందిరాల్లో మహిళల్ని ఎందుకు అనుమతించడం లేదంటూ మహిళల హక్కుల కార్యకర్తలు న్యాయపోరాటాలు జరిపి వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు. మహారాష్ట్రలోని శని షింగ్నాపూర్ ఆలయంలోని గర్భగుడిలోకి, త్రయంబకేశ్వర్ ఆలయాల్లోకి మహిళలను ఎందుకు అనుమతించరంటూ భూమాతా మహిళా బ్రిగేడ్‌కు చెందిన నాయకురాలు తృప్తీ దేశాయ్ 2016లో సుప్రీంకోర్టుకెక్కి విజయం సాధించారు. అదే సంవత్సరం ముంబైలోని హాజీ అలీ దర్గాలోకి మహిళలను అనుమతించకపోవడంపట్ల ముస్లిం మహిళా హక్కుల సంఘం కూడా సుప్రీంకోర్టులో విజయం సాధించింది. ఇదే వరుసలో శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్సుల ఆడవాళ్లను అనుమతించాలంటూ సుప్రీంతీర్పు చెప్పింది. రుతుస్రావం సందర్భంగా మహిళలు మైలబడతారన్న కారణంగా పదేళ్లపైన, 50 ఏళ్ల లోపు మహిళల ప్రవేశంపై ఆలయ పూజారులు ఆంక్షలు కొనసాగిస్తున్న విషయం తెల్సిందే. భారత రాజ్యాంగం ప్రకారం స్త్రీ, పురుషులకు సమాన హక్కులుంటాయన్న మూలసూత్రం కారణంగా దేశంలోని ప్రతి ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పులు చెబుతూ వస్తోంది. ఐదుగురు సభ్యులుగల సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తాజా తీర్పుతో జస్టిస్ హిందూ మల్హోత్రా ఒక్కరే విభేదించారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో మతానికి ఒక్కోరకమైన ఆచార వ్యవహారాలు ఉంటాయని, అవన్నీ స్థానిక ప్రజల నమ్మకాలనీ, వాటిల్లో జోక్యం చేసుకునే అధికారం కోర్టులకు లేవని ఆమె వాదించారు. పైగా అయ్యప్ప ఆలయంలోకి మహిళలను అనుమతించడం వల్ల దాని ప్రభావం దేశంలోని అన్ని ఆలయాల ఆచార వ్యవహారాలపై ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఆమె అభిప్రాయంలో అన్ని ఆలయాలపై ప్రభావం ఉంటుందనే పాయింట్ ఒక్కటే తర్కబద్ధంగా ఉంది. ఈ విషయాన్నైనా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకొని దేశంలోని అన్ని ప్రాంతాల్లోని అన్ని ఆలయాల్లో మహిళలకు ప్రవేశం ఉంటుందని ఒక్కసారే తీర్పు ఇచ్చి ఉంటే బాగుండేది. ఇక్కడే సుప్రీంకోర్టు మరో ముఖ్యమైన విషయాన్ని విస్మరించింది. రుతుస్రావం వల్ల మహిళలు మైలపడతారనే సాంఘిక దురాచారాన్ని పట్టించుకోకపోవడం. ఈ దురాచారం ఇక చెల్లదని ప్రకటించకపోవడం. మైల సందర్భంగా మహిళలను ఒక్క దేవాలయాలకే కాకుండా సాంఘిక, సామాజిక కార్యక్రమాలకు కూడా అనాదిగా దూరం ఉంచుతూ వస్తున్నారు. రుతుస్రావం సందర్భంగా షియా మసీదుల్లోకి మహిళలను అనుమతించరు. భారత్‌లోని సున్నీ మసీదుల్లోకి ఎల్లవేళల మహిళలను అనుమతించరు. పార్శీ అగ్ని దేవాలయాల్లోకి కూడా మహిళలను అనుమతించరు. ఇక ఇళ్లలో రుతుస్రావం సందర్భంగా పూజ గదుల్లోకి మహిళలు వెళ్లరాదు. పవిత్ర గ్రంధాలను తాకరాదు. దైవ స్త్రోత్రాలను చదవరాదు. వంటింట్లోకి వెళ్లరాదు. వంట చేయరాదు. పొరుగింట్లో శుభకార్యాలయాలకు హాజరుకారాదు. హిందూ కుటుంబాలతోపాటు జైన కుటుంబాల్లోనూ ఈ ఆచారం ఇప్పటికీ ఉంది. ఈ మైల అన్న కారణంగానే పండిట్లు, పూజారులు, కాజీలు, ఇమామ్‌ల పదవులు మహిళలకు ఇవ్వడం లేదు. మహిళల వివక్ష చూపే ఇలాంటి ఆచారాలు సోషల్ మీడియా విస్తరించిన నేటిరోజుల్లో కూడా కొనసాగడం అనాగరికం. ఈ ఏడాది దుర్గా పూజలో మహిళలందరూ పాల్గొనాలని, రుతుస్రావం వచ్చిన వాళ్లూ పాల్గొనవచ్చని శనివారం నాడు ఓ ఫేస్బుక్ రీడర్ పిలుపునివ్వగా, ఎంతోమంది నుంచి చంపేస్తామంటూ హెచ్చరికలు వచ్చి పడ్డాయి. మారే కాలం మరెప్పుడో! -
కడుపు నొప్పి తగ్గాలంటే...
రుతుక్రమ సమయంలో వచ్చే నొప్పి భరించ లేకుంటే చిన్న చిట్కాలు పాటించి ఉపశమనం పొందవచ్చు.ఈ సమయంలో నీళ్లు మామూలుకంటే ఎక్కువగా తాగాలి. హెర్బల్ టీ తాగినా కూడా ఫలితం ఉంటుంది. పుదీన, అల్లం వేసుకుని టీ తాగినా, మరే ఇతర వేడి పానీయం తాగినా ఈ నొప్పి నుండి తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది ∙వేడి నీటిలో చిన్న టవల్ ముంచి కింది పొట్ట మీద వేస్తే ఉపశమనం ఉంటుంది తేలికపాటి ఎక్సర్సైజ్లు, యోగసాధన చేస్తే రక్త ప్రసరణ క్రమబద్ధమవుతుంది, శారీరక వ్యాయామంతో ఎండార్ఫిన్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది కండరాల మీద ఒత్తిడిని తగ్గించి హాయినిస్తుంది ∙పెల్విక్ కండరాల మీద ఒత్తిడి కలిగి ఎక్సర్సైజ్ చేస్తే కండరాలు వదులై నొప్పి కలగదు ∙ఈ సమయంలో రోజూ పడుతున్న శ్రమ తగ్గించుకోవాలి. వీలయితే కొంత సేపు విశ్రాంతిగా పడుకుంటే మంచిది. ఉదయం కాని సాయంత్రం కాని అరగంట సేపు వాకింగ్ చేస్తే నొప్పికి దూరం కావచ్చు. -
అనీమియాను తగ్గించే బెల్లం
చక్కెర కంటే బెల్లం ఆరోగ్యకరమని చాలామంది అంటూంటారు. జీర్ణప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు ఆహారం బాగా జీర్ణమయ్యేలా తోడ్పడుతుంది బెల్లం. అందుకే భుక్తాయాసం కలిగేలా తిన్న తర్వాత కాస్తంత బెల్లాన్ని తినిపిస్తారు పెద్దలు. ∙బెల్లం శ్వాసకోశవ్యవస్థనూ, జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. అందుకే దీన్ని మంచి క్లెన్సర్‌గా అభివర్ణిస్తారు ∙చక్కెరలో కంటే బెల్లంలో పీచు ఎక్కువ. అందుకే ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. క్లెన్సర్‌గా ఇది కాలేయాన్ని సైతం శుభ్ర పరుస్తుంది ∙బెల్లంలో ఖనిజ లవణాలు ముఖ్యంగా ఐరన్ ఎక్కువ. అందుకే రుతుసమస్యలతో బాధపడే మహిళలకు బెల్లంతో చేసిన పల్లీపట్టి వంటివి తినమని ఆహార నిపుణులు సిఫార్సు చేస్తుంటారు. మహిళల్లో రుతు సమయంలో వచ్చే నొప్పి నుంచి బెల్లం మంచి ఉపశమనాన్ని ఇస్తుంది ∙బెల్లం, ఒంట్లోని ఫ్రీ రాడికల్స్‌ను హరిస్తుంది. ఫలితంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది ∙బెల్లంలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వల్ల ఇది తక్షణ శక్తిని సమకూరుస్తుంది. బెల్లం మంచి శక్తివనరు. ∙డయాబెటిస్ రోగులకు చక్కెర కంటే బెల్లం మంచిదని కొందరు చెప్పినప్పటికీ దీని కెలరిఫిక్ విలువ ఎక్కువే. కాబట్టి చక్కెర వ్యాధిగ్రస్తులు బెల్లాన్ని ఎక్కువగా వాడటం సరికాదు. -
ఆ సమయంలో వ్యాయామం మంచిది కాదా?
అవాస్తవం మహిళలకు రుతు సమయంలో రక్తం పోతుంది కాబట్టి ఆ టైమ్‌లో వ్యాయామం చేస్తే మరింత అలసట కలుగుతుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. అది కేవలం అపోహ. రుతుస్రావం అన్నది ఒక సాధారణమైన, అత్యంత సహజమైన ప్రక్రియ. రోజువారీ కార్యక్రమాలకు అది అడ్డంకి కానట్లే వ్యాయామానికీ అడ్డంకి కాదు. దీనికి క్రీడాకారులే ఉదాహరణ. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణు లంతా దీన్ని సహజంగానే తీసుకుంటారు. వాళ్లు ఆ సమయంలోనూ తమ శిక్షణ కార్య కలాపాలను మానుకోరు. ఆటల్లో పాల్గొని గెలుపొందుతారు కూడా. ఒలింపిక్స్‌లోనూ పాల్గొని మెడల్స్ గెలుచుకుంటూ ఉంటారు. కాబట్టి రుతు సమయంలో వ్యాయామం చేయకూడదన్నది అపోహ మాత్రమే. కాకపోతే ఆ టైమ్‌లో రక్తం కోల్పోవడం వల్ల ఐరన్ పాళ్లు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వుంచిది. అంటే... వేటవూంసం, చికెన్, చేపలు, వూంసాహారంతో లివర్, శాకాహారులైతే తాజా ఆకుకూరలు, ఎండు ఖర్జూరం, గసగసాలు (జింజెల్లీ సీడ్స్), అటుకులు వంటి పదార్థాలు పీరియడ్స్ సమయంలోనే గాకుండా మామూలుగానూ తీసుకుంటుంటే కోల్పోయిన ఐరన్ మళ్లీ భర్తీ అవుతుంది. అయితే... ఆ సవుయుంలో ఉప్పు, కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మందకొడిగా మారి వ్యాయామం చురుగ్గా చేయలేకపోవచ్చు. కేవలం రుతు సమయంలోనే గాక... మిగతా టైమ్‌లో కూడా అలాంటి ఆహారం వల్ల చురుగ్గా ఉండలేకపోవచ్చు. కాబట్టి ఉప్పు, కొవ్వులు తగ్గించాలి. ఆ సవుయుంలో నీళ్లు, పళ్లరసాల వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తాగాలి. వేళకు కంటినిండా నిద్రపోవాలి.