చక్కెర కంటే బెల్లం ఆరోగ్యకరమని చాలామంది అంటూంటారు. జీర్ణప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు ఆహారం బాగా జీర్ణమయ్యేలా తోడ్పడుతుంది బెల్లం. అందుకే భుక్తాయాసం కలిగేలా తిన్న తర్వాత కాస్తంత బెల్లాన్ని తినిపిస్తారు పెద్దలు. ∙బెల్లం శ్వాసకోశవ్యవస్థనూ, జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. అందుకే దీన్ని మంచి క్లెన్సర్‌గా అభివర్ణిస్తారు ∙చక్కెరలో కంటే బెల్లంలో పీచు ఎక్కువ. అందుకే ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. క్లెన్సర్‌గా ఇది కాలేయాన్ని సైతం శుభ్ర పరుస్తుంది ∙బెల్లంలో ఖనిజ లవణాలు ముఖ్యంగా ఐరన్ ఎక్కువ. అందుకే రుతుసమస్యలతో బాధపడే మహిళలకు బెల్లంతో చేసిన పల్లీపట్టి వంటివి తినమని ఆహార నిపుణులు సిఫార్సు చేస్తుంటారు.
మహిళల్లో రుతు సమయంలో వచ్చే నొప్పి నుంచి బెల్లం మంచి ఉపశమనాన్ని ఇస్తుంది ∙బెల్లం, ఒంట్లోని ఫ్రీ రాడికల్స్‌ను హరిస్తుంది. ఫలితంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది ∙బెల్లంలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వల్ల ఇది తక్షణ శక్తిని సమకూరుస్తుంది. బెల్లం మంచి శక్తివనరు. ∙డయాబెటిస్ రోగులకు చక్కెర కంటే బెల్లం మంచిదని కొందరు చెప్పినప్పటికీ దీని కెలరిఫిక్ విలువ ఎక్కువే. కాబట్టి చక్కెర వ్యాధిగ్రస్తులు బెల్లాన్ని ఎక్కువగా వాడటం సరికాదు.
అనీమియాను తగ్గించే బెల్లం
Published Mon, Nov 20 2017 11:40 PM | Last Updated on Mon, Nov 20 2017 11:40 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment