మహిళా ఉద్యోగులకు శుభవార్త.. నెలసరి సెలవులపై కీలక ప్రకటన! | Odisha Announces One Day Menstrual Leave For State Govt, Private Employees | Sakshi
Sakshi News home page

మహిళా ఉద్యోగులకు శుభవార్త.. నెలసరి సెలవులపై కీలక ప్రకటన!

Published Thu, Aug 15 2024 1:40 PM | Last Updated on Thu, Aug 15 2024 2:29 PM

Odisha Announces One Day Menstrual Leave For State Govt, Private Employees

దేశంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగినులకు ఒకరోజు నెలసరి సెలవు ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కటక్‌లో జరిగిన జిల్లా స్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఒడిశా ఉప ముఖ్యమంత్రి ప్రవతి పరిదా ఈ ప్రకటన చేశారు.

మహిళల ఆరోగ్యం, శ్రేయస్సే లక్ష్యంగా నెలసరి సెలవుల్ని తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు ప్రవితా పరిదా తెలిపారు. ఈ విధానంలో మహిళా ఉద్యోగులు వారి నెలసరి సమయంలో మొదటి లేదా రెండవ రోజు సెలవు తీసుకోవచ్చని అన్నారు. 

 ఉద్యోగినులకు నెలసరి సెలవు ఇవ్వాలనే డిమాండ్‌  ఇటీవల ఎక్కువైంది. సుప్రీంకోర్టు ఈ విషయంలో  ఏ నిర్ణయమూ చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వాలతో, ఉపాధి సంస్థలతో చర్చించి కేంద్రం తీసుకోవాల్సిన పాలసీ నిర్ణయం అని తెలిపింది. అంతేకాదు, నెలసరివేళ ఇబ్బందిపడే ఉద్యోగినులకు రుతుస్రావ సెలవులపై మోడల్‌ పాలసీని రూపొందించాలని గత నెల 9న కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. ఈ విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన విధానానికి రూపకల్పన చేయాలని కూడా ఆదేశించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement